వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రచయిత్రిని ఆయన లైంగికంగా వేధించాడని న్యూయార్క్ జ్యూరీ తేల్చింది. ఆమెకు పరిహారంగా 5 మిలియన్ డాలర్లు(రూ.41 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. దీంతో 2024 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలనుకుంటున్న ట్రంప్‌కు పెద్ద షాక్ తగిలినట్లయింది.
1996లో మాన్‍హటన్ అవెన్యూలోని లగ్జరీ బర్జ్‌డార్ఫ్ గుడ్‌మ్యాన్ స్టోర్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ప్రముఖ రచయిత్రి ఇ. జీన్ కారెల్ ఆరోపించారు. ఆపై తనను లైంగికంగా వేధించాడని తెలిపారు. 2019లో ఓసారి తన గురించి అసభ్యంగా మాట్లాడి ప్రతిష్ఠకు భంగం కలిగించారని పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. ట్రంప్‌పై భయంతోనే తాను 20 ఏళ్లకుపైగా ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడలేకపోయానని చెప్పారు.
ఈ ఆరోపణలపై విచారణ జరిపిన జ్యూరీ ట్రంప్‌ను దోషిగా తేల్చింది. అయితే ట్రంప్‌పై చేసిన అత్యాచారం ఆరోపణల్లో మాత్రం వాస్తవం లేదని చెప్పింది. కానీ జీన్ కారోల్ చేసిన ఇతర ఆరోపణలు నిజమేనని తేల్చింది. దీంతో ఆమెకు పరిహారంగా రూ.41 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.
ట్రంప్ తీవ్ర విమర్శలు..
కాగా.. ఈ తీర్పుపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ తీర్పు అవమానకరంగా ఉందని మండిపడ్డారు. ఇది తను ఎప్పటికీ వెంటాడుతుందని అన్నారు. లైంగిక ఆరోపణలు చేసిన రచయిత్రి అసలు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఈమేరకు తన 'ట్రూత్ సోషల్' ఖాతా వేదికగా తెలిపారు.
చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి
Comments
Please login to add a commentAdd a comment