Jury
-
రెక్కల పురుగు కథ ఏమిటో అడుగు
రెక్కల పురుగులన్నీ సీతాకోక చిలుకలు కావు.కాని సీతాకోకచిలుకలన్నీ రెక్కల పురుగులే.హిమాలయప్రాంతాలకు చెందిన మాత్ (రెక్కల పురుగు)లపై తీసిన ‘నాక్టర్న్స్’ డాక్యుమెంటరీ అమెరికాలో జరిగిన ‘సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ పొందింది. ఇండియా నుంచి అవార్డ్ గెలిచిన డాక్యుమెంటరీ ఇదొక్కటే. డైరెక్టర్ అనుపమ శ్రీనివాసన్ పరిచయం. అమెరికాలో ప్రతి ఏటా జరిగే సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నామినేషన్ పొందడమే పెద్ద గుర్తింపుగా భావిస్తారు. అవార్డు రావడం ఇంకా పెద్ద గౌరవం. ఈ సంవత్సరం ఉటాలో జనవరి 18–28 తేదీల మధ్య జరిగిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మన దేశం నుంచి ‘వరల్డ్ డాక్యుమెంటరీ కాంపిటీషన్’లో ‘నాక్టర్న్స్’లో చోటు సంపాదించడమే కాకుండా ‘స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ క్రాఫ్ట్’ అవార్డు పొందింది. అనిర్ బన్‌దత్తాతో కలిసి అనుపమా శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ రెక్కల పురుగుల లోకంలో ప్రేక్షకులను విహరింపచేస్తుంది. ఢిల్లీ కృత్రిమత్వం నుంచి ‘నేను, అనిర్ బన్ దత్త ఢిల్లీలో జీవిస్తుంటాము. రోజూ ఒకే రకమైన ట్రాఫిక్, ΄÷ల్యూషన్. ప్రకృతితో మాకు ఏమీ సంబంధం లేదనిపించేది. ఆ సమయంలో మాకు మాన్సీ అనే పర్యావరణ శాస్త్రవేత్త పరిచయం అయ్యింది. హిమాలయాలలో ‘మాత్స్’ (రెక్కల పురుగులు) మీద పరిశోధన చేస్తున్నానని చెప్పింది. వాతావరణ మార్పుల వల్ల వీటికి కలుగుతున్న నష్టం ఏమిటో ఆమె తెలుసుకుంటోంది. ఇది డాక్యుమెంటరీ చేయాల్సిన విషయం అనుకున్నాం. గత కొన్నేళ్లుగా నేను, అనిర్బన్ డాక్యుమెంటరీలు తీస్తున్నాం. మెయిన్‌స్ట్రీమ్ పట్టించుకోని విషయాలను మేం పట్టించుకుంటాం. దీనికి ముందు మేము ఇండో–మయన్మార్ సరిహద్దులోని తోరా అనే పల్లెకు (మణిపూర్‌లో ఉంది) కరెంటు రావడం గురించి డాక్యుమెంటరీ తీశాం. దాని పేరు ‘ఫ్లికరింగ్ లైట్స్’. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా కరెంటు లేని పల్లె ఉండటం, దానికి కరెంటు కోసం కొందరు ఎదురు చూడటం, దేశంలోనే ఉన్నా పరాయీకరణ భావన ఎదుర్కొనడం దీనిలో చూపించాం. ఈ డాక్యుమెంటరీకి ఆమ్స్టర్ డ్యామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు దక్కింది. ఇప్పుడు మాత్స్ గురించి తీసిన ‘నాక్టర్న్స్’కు కూడా సండాన్స్ ఫెస్టివల్లో అవార్డ్ వచ్చింది. ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపింది అనుపమా శ్రీనివాసన్. కష్టనష్టాలకు ఓర్చి ‘నాక్టర్న్స్ డాక్యుమెంటరీలో రెండే పాత్రలుంటాయి. ఒకటి పర్యావరణ శాస్త్రవేత్త మాన్సీ, రెండు హిమాలయాల స్థానిక బగున్ తెగకు చెందిన బికి అనే గిరిజనుడు. అతని సాయంతో ఆమె రెక్కల పురుగులను అన్వేషణ చేస్తుంటే మేం రికార్డు చేస్తూ వెళ్లాం. సాయంత్రం అయ్యాక మాన్సీ పలచటి తెర కట్టి దాని వెనుక నీలం రంగు బల్బు వెలిగించేది. ఆ తర్వాత కాసేపటికే వేలాది రెక్కల పురుగులు వచ్చి ఆ స్క్రీన్ మీద వాలేవి. వాటి రంగులు, రూపాలు, ఆకారాలు అన్నీ అద్భుతం. అవి తాము మనిషితో కలిసి జీవిస్తున్నామన్నట్టు ఉన్నాయి. మనమే వాటితో కలిసి జీవిస్తున్నాం అన్న ఎరుకలో లేము’ అంటుంది అనుపమా శ్రీనివాసన్. ‘హిమాలయాల్లో షూటింగ్... అదీ అడవుల్లో అంటే చాలా శ్రమ. అక్కడంతా తేమగా ఉంటుంది. ఏ క్షణమైనా వాన పడొచ్చు. అంతేగాక రాత్రి వేళల్లో విపరీతమైన చలి. జలగలు పట్టి పీక్కుతినాలని చూసేవి. కాని ఇన్ని సమస్యల మధ్య ఆ రెక్కల పురుగుల జీవనం, వాటి కదలికలు ఎంతో ఆసక్తి కలిగించేవి. మా డాక్యుమెంటరీకి అవార్డు రావడానికి కారణం మేము ప్రకృతి ధ్వనులను పరిపూర్ణంగా రికార్డు చేశాం. ఆ ధ్వనుల వల్ల అడవిలో ఉంటూ మాత్స్‌ను చూస్తున్న అనుభూతి కలుగుతుంది’ అంది అనుపమా శ్రీనివాసన్. -
డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. లైంగిక వేధింపుల కేసులో రూ.41 కోట్ల జరిమానా
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రచయిత్రిని ఆయన లైంగికంగా వేధించాడని న్యూయార్క్ జ్యూరీ తేల్చింది. ఆమెకు పరిహారంగా 5 మిలియన్ డాలర్లు(రూ.41 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. దీంతో 2024 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలనుకుంటున్న ట్రంప్‌కు పెద్ద షాక్ తగిలినట్లయింది. 1996లో మాన్హటన్ అవెన్యూలోని లగ్జరీ బర్జ్డార్ఫ్ గుడ్‌మ్యాన్ స్టోర్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ప్రముఖ రచయిత్రి ఇ. జీన్ కారెల్ ఆరోపించారు. ఆపై తనను లైంగికంగా వేధించాడని తెలిపారు. 2019లో ఓసారి తన గురించి అసభ్యంగా మాట్లాడి ప్రతిష్ఠకు భంగం కలిగించారని పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. ట్రంప్‌పై భయంతోనే తాను 20 ఏళ్లకుపైగా ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడలేకపోయానని చెప్పారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన జ్యూరీ ట్రంప్‌ను దోషిగా తేల్చింది. అయితే ట్రంప్‌పై చేసిన అత్యాచారం ఆరోపణల్లో మాత్రం వాస్తవం లేదని చెప్పింది. కానీ జీన్ కారోల్ చేసిన ఇతర ఆరోపణలు నిజమేనని తేల్చింది. దీంతో ఆమెకు పరిహారంగా రూ.41 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ట్రంప్ తీవ్ర విమర్శలు.. కాగా.. ఈ తీర్పుపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ తీర్పు అవమానకరంగా ఉందని మండిపడ్డారు. ఇది తను ఎప్పటికీ వెంటాడుతుందని అన్నారు. లైంగిక ఆరోపణలు చేసిన రచయిత్రి అసలు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఈమేరకు తన 'ట్రూత్ సోషల్' ఖాతా వేదికగా తెలిపారు. చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి -
కశ్మీర్ ఫైల్స్‌పై... మాటలు.. మంటలు
ముంబై: విడుదలైనప్పుడే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇఫీ ఉదంతం పుణ్యమా అని మరోసారి దేశవ్యాప్తంగా మంటలు రేపుతోంది. అదో చెత్త సినిమా అంటూ సోమవారం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ముగింపు వేడుకల్లో ఇజ్రాయెల్‌కు చెందిన జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యలపై ఇంటా బయటా విమర్శలు రేగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇది పెద్ద చర్చకు తెర తీసింది. నదవ్ వ్యాఖ్యలను భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలాన్ తీవ్రంగా ఖండించారు. ‘‘అతిథిని దైవంగా భావించే దేశానికి వచ్చి అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలి. ఇఫీ జడ్జీల ప్యానల్‌కు సారథ్య స్థానంలో కూచోబెట్టిన ఆతిథ్య దేశాన్ని నదవ్ తన వ్యాఖ్యలతో దారుణంగా అవమానించారు’’ అంటూ మంగళవారం బహిరంగ లేఖలో దుయ్యబట్టారు. ‘‘హిట్లర్ సారథ్యంలోని నాజీల చేతుల్లో లక్షలాది మంది యూదులు హోలోకాస్ట్ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో నిస్సహాయంగా ఊచకోతకు గురయ్యారు. అదృష్టం కొద్దీ ఆ మారణహోమం నుంచి తప్పించుకున్న వారి వారసున్ని నేను. నీ వ్యాఖ్యలనే గీటురాయిగా తీసుకునే పక్షంలో హోలోకాస్ట్ దారుణాలపై హాలీవుడ్ దర్శక దిగ్గజం స్పీల్బర్గ్ తీసిన షిండ్లర్స్ లిస్ట్ కూడా చెత్త సినిమాయేనా అని భారతీయులు ప్రశ్నిస్తుంటే నా మనసెంతో గాయపడుతోంది. కశ్మీర్ ఫైల్స్‌పై నీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. వాటిని నువ్వు ఏ విధంగానూ సమర్థించుకోలేవు’’ అంటూ తూర్పారబట్టారు. నదవ్ తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కశ్మీరీ పండిట్ల మండిపాటు బీజేపీతో పాటు కశ్మీర్ ఫైల్స్ సినిమా రచయిత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, అందులో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు కూడా నదవ్ విమర్శలను తీవ్రంగా ఖండించారు. ‘‘భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ఉగ్రవాదుల వాదనకు మద్దతిచ్చేందుకు వాడుకున్న తీరు ఆశ్చర్యకరం. కశ్మీర్ ఫైల్స్ ప్రచారం కోసం తీసిందని, అందులో ఒక్క సీన్ గానీ, డైలాగ్ గానీ అవాస్తవమని నిరూపించినా ఇకపై సినిమాలే తీయను. నదవ్తో పాటు ప్రపంచ మేధావులకు, అర్బన్ నక్సల్స్‌కు ఇది నా సవాలు’’ అని అగ్నిహోత్రి అన్నారు. నవద్ను తక్షణం భారత్ నుంచి పంపించేయాలని కశ్మీరీ పండిట్లు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ కాన్సులర్ జనరల్ కొబ్బీ షొషానీ కూడా నదవ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. -
కాన్స్ చిత్రోత్సవంలో మన తారలు
ప్రతిష్టాత్మక కాన్స్ చలన చిత్రోత్సవానికి రంగం సిద్ధమైంది. 75వ కాన్స్ చలన చిత్రోత్సవం ఈ నెల 17 నుంచి 28 వరకు జరగనుంది. ఈ వేడుకల తొలి రోజు భారతదేశం తరఫున అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, పూజా హెగ్డే రెడ్ కార్పెట్‌పై సందడి చేయనున్నారు. వీరితో పాటు శేఖర్ కపూర్, తమన్నా, నయన తార, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) చైర్మన్ ప్రసూన్ జోషి, సీబీఎఫ్సీ బోర్డు సభ్యురాలు వాణీ త్రిపాఠి తదితరులు కనిపిస్తారు. ఈ టీమ్‌కు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సారథ్యం వహిస్తారు. ఇక దీపికా పదుకోన్ ఈసారి కాన్స్ ఉత్సవాల్లో జ్యూరీ సభ్యురాలిగా పాల్గొననుండటం విశేషం. ఈ వేడుకల్లో ‘క్లాసిక్ సినిమా’ విభాగంలో సత్యజిత్ రే తీసిన ‘ప్రతిధ్వని’ స్క్రీనింగ్ అవుతుంది. అలాగే నటుడు మాధవన్ దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మే 19న ప్రదర్శితం కానుంది. భారత ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో నంబి నారాయణన్ పాత్రను మాధవన్ పోషించారు. అలాగే ఢిల్లీకి చెందిన షౌనక్ సేన్ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ప్రదర్శితం కానుంది. కమల్‌హాసన్ నటించిన ‘విక్రమ్’ ట్రైలర్ కూడా విడుదల కానుంది. -
భారత ఐటీ పరిశ్రమకు శుభవార్త
కాలిఫోర్నియా: దేశీయ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు అమెరికా కోర్టులో ఊరట లభించింది. జాతి వివక్ష ఆరోపణల కేసులో అమెరికా కోర్టులో భారీ విజయాన్ని సాధించింది. తద్వారా భారతీయ ఐటి పరిశ్రమకు తీపి కబురందించింది. జాతీయతతో సంబంధం లేకుండా తామ పెట్టుబడులను కొనసాగిస్తామన్ టీసీఎస్ వాదనను సమర్ధించిన కోర్టు టీసీఎస్‌కు అనుగుణంగా తీర్పు చెప్పింది. అమెరికాలో టీసీఎస్ శాఖ దక్షిణాసియాయేతర ఉద్యోగుల్ని జాతి వివక్షతో తొలగించిందని మాజీ ఉద్యోగులు కాలిఫోర్నియా కోర్టులో దావా వేశారు. అయితే టీసీఎస్‌పై వచ్చిన ఈ ఆరోపణలను కాలిఫోర్నియా జ్యూరీ ఏకగ్రీవంగా తోసిపుచ్చింది. జ్యూరీలోని తొమ్మిదిమంది సభ్యులూ ఏకగ్రీవంగా టీసీఎస్‌కు సానుకూలంగా తీర్పునివ్వడం విశేషం. విచారణ అనంతరం ఉద్దేశపూర్వకంగా కంపెనీ జాతివివక్ష చూపలేదని తీర్పునిచ్చింది. కోర్టు టీసీఎస్‌పై ఆరోపణలను తోసిపుచ్చడం భారత ఐటీ ఔట్సోర్సింగ్ రంగానికి లభించిన గొప్ప విజయంగా నిపుణులు అభివర్ణించారు. ఇది ఒక్క టీసీఎస్కే కాదు మొత్తం ఐటీ సేవల రంగానికి సంబంధించి చాలా ముఖ్యమైన తీర్పు అని గ్రేహౌండ్ రీసెర్చ్ సీఈవో సచిత్ గోగియా వ్యాఖ్యానించారు. కంపెనీ తమకు తక్కువ అవకాశాలు ఇచ్చిందని, జాతీయత, మతం కారణంగా తమను ఉద్యోగాలనుంచి తొలగించిందని ఆరోపిస్తూ టీసీఎస్ మాజీ ఉద్యోగులు క్రిస్టోఫర్ స్లైట్, సయీద్ అమర్ మసౌది, నోబెల్ మాండిలి ఈ దావా వేశారు. ఈ కేసుపై నవంబరు 5న విచారణ చేపట్టగా ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పు వెలువరించింది. కాగా ఈ కేసులో ఫిర్యాదుదారుల ఆరోపణలు నిరాధారమైనవని తాము విశ్వసిస్తున్నామనీ, ఈ విషయాన్ని జ్యూరీ కూడా అంగీకరించి నందుకు చాలా సంతోషిస్తున్నామని టిసిఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. మెరిట్ ఆధారంగానే తాము నియామకాలు చేబడుతున్నామని స్పష్టం చేసింది. చట్ట విరుద్ధంగా తాము ఏమీ చేయలేదని, పనితీరు ప్రామాణికంగానే ఉద్యోగులను తొలగించామని తెలిపింది. ఉద్యోగుల నియామకంలో జాతీయత, నేపథ్యంతో సంబంధం లేదని, వారి సామర్థ్యాన్నిబట్టే నియమించుకుంటామని టీసీఎస్ స్పష్టం చేసింది. -
‘ఆమెను శ్రీదేవితో పోల్చకండి’
ముంబై : బాలీవుడ్ దర్శకురాలు, కొరియెగ్రాఫర్ ఫరాఖాన్ రీల్ మూవీ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా మీడియాతో ముచ్చటించారు. ఈ అవార్డ్స్ కమిటీకి జ్యూరి మెంబర్‌గా వ్యవహరిస్తున్న ఆమె ఈ ఏడాది కొత్త కథాంశాలతో సినిమాలు వచ్చాయని, ‘లిప్‌స్టిక్ అండర్ బుర్ఖా’ సందేశంతో పాటు వినోదం కూడా పంచిందన్నారు. న్యూటన్, హిందీ మీడియమ్ సినిమాలు కూడా కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కాయని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన బాలీవుడ్ అందాల నటి శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు. లెజండరీ హీరోయిన్ శ్రీదేవి అంటే తనకెంతో ఇష్టమని, కెరీర్ తొలినాళ్లలో ఆమె తననెంతో ప్రోత్సహించారన్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న ‘దడక్’ సినిమాకు కొరియోగ్రఫీ చేస్తున్న ఫరా, జాన్వీ కూడా మంచి డాన్సర్ అని ప్రశంసలు కురిపించారు. అయితే ఇంకా జాన్వీ నేర్చుకునే దశలోనే ఉందదని.. ఇప్పుడే ఆమెను శ్రీదేవితో పోల్చడం సరైంది కాదన్నారు. మై హూనా సినిమాతో డైరెక్టర్‌గా మారిన ఫరాఖాన్.. కొంత కాలంగా దర్శకత్వ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. ఈ మీడియా సమావేశంలో తన భవిష్యత్ ప్రణాళిక గురించి మాట్లాడుతూ రొటీన్ సినిమాలతో విసిగెత్తిపోయాను. స్టైల్ మార్చి ఈసారి బిగ్ బడ్జెట్ యాక్షన్ మూవీ చేయాలనుకుంటున్నాను తన మనసులో మాట బయటపెట్టారు. -
‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డు విజేతల ఎంపిక పూర్తి
హైదరాబాద్: ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డు విజేతల ఎంపిక బుధవారం ముగిసింది. సామాజిక సేవ, విద్య, ఆరోగ్యం, నృత్యం, సంగీతం, పారిశ్రామికం తదితర రంగాల్లో ఉత్తమ ప్రతిభావంతులైన వారిని ‘సాక్షి ఎక్సలెన్స్- 2014’ అవార్డుకు అర్హులుగా జ్యూరీ ఎంపిక చేసింది. వివిధ దశల్లో జరిగిన ఈ ఎంపిక ప్రక్రియ బుధవారం ఫైనల్‌కు చేరుకుంది. అవార్డుకు ఎంపికైన విజేతల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. అలాగే ఈ నెల 16న జరుగనున్న కార్యక్రమంలో విజేతలకు అవార్డులను అందజేస్తారు. ఎన్జీవో,ఎక్సలెన్స్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఉత్తమ రైతు, సామాజిక సేవ, నృత్యం, సంగీతం వంటి రంగాల్లో అద్భుతమైన ప్రతిభా పాట వాలు కలిగిన యువ విజేత, ఔత్సాహిక పారిశ్రామిక వేత్త, తెలుగు ఎన్ఆర్ఐ రంగాలలో ఎక్సలెన్స్ అవార్డులను అందజేసేం దుకు ‘సాక్షి’ వివిధ రంగాలకు చెందిన వారి నుంచి ఎంట్రీలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ‘సాక్షి’కి అందిన ఎంట్రీలను వివిధ స్థాయిల్లో న్యాయనిర్ణేతలు వడపోశారు. చివరకు బుధవారం ఉత్తమ వ్యక్తులు, సంస్థల ఎంపిక పూర్తయ్యింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డి, సీనియర్ పత్రికా సంపాదకుడు ఏబీకే ప్రసాద్, ఎంవి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా, సన్‌షైన్ ఆసుపత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ గురువారెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త సుచిత్ర ఎల్లా, ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే, ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌లు, బ్యాడ్మింట్ క్రీడా కారుడు పుల్లెల గోపీచంద్, జ్యూరీ సభ్యులు గా వ్యవహరించారు. ఎంపిక ప్రక్రియ ఎంతో సంక్లిష్టంగా కొనసాగింది. తమకు అందిన ప్రతీ దరఖాస్తును న్యాయనిర్ణేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతిదీ ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నట్లుగా ఉందని జ్యూరీ సభ్యు లు అభిప్రాయపడ్డారు. ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డుల జ్యూరీ సభ్యులుగా వ్యవహరిం చడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జ్యూరీ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ఫైనాన్షియల్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి, కార్పొరేట్ కమ్యూనికేషన్ డెరైక్టర్ రాణిరెడ్డి పాల్గొన్నారు.