దరఖాస్తులను పరిశీలిస్తున్న జ్యూరీ సభ్యులు
హైదరాబాద్: ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డు విజేతల ఎంపిక బుధవారం ముగిసింది. సామాజిక సేవ, విద్య, ఆరోగ్యం, నృత్యం, సంగీతం, పారిశ్రామికం తదితర రంగాల్లో ఉత్తమ ప్రతిభావంతులైన వారిని ‘సాక్షి ఎక్సలెన్స్- 2014’ అవార్డుకు అర్హులుగా జ్యూరీ ఎంపిక చేసింది. వివిధ దశల్లో జరిగిన ఈ ఎంపిక ప్రక్రియ బుధవారం ఫైనల్‌కు చేరుకుంది. అవార్డుకు ఎంపికైన విజేతల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. అలాగే ఈ నెల 16న జరుగనున్న కార్యక్రమంలో విజేతలకు అవార్డులను అందజేస్తారు. ఎన్జీవో,ఎక్సలెన్స్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఉత్తమ రైతు, సామాజిక సేవ, నృత్యం, సంగీతం వంటి రంగాల్లో అద్భుతమైన ప్రతిభా పాట వాలు కలిగిన యువ విజేత, ఔత్సాహిక పారిశ్రామిక వేత్త, తెలుగు ఎన్‌ఆర్‌ఐ రంగాలలో ఎక్సలెన్స్ అవార్డులను అందజేసేం దుకు ‘సాక్షి’ వివిధ రంగాలకు చెందిన వారి నుంచి ఎంట్రీలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు ‘సాక్షి’కి అందిన ఎంట్రీలను వివిధ స్థాయిల్లో న్యాయనిర్ణేతలు వడపోశారు. చివరకు బుధవారం ఉత్తమ వ్యక్తులు, సంస్థల ఎంపిక పూర్తయ్యింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డి, సీనియర్ పత్రికా సంపాదకుడు ఏబీకే ప్రసాద్, ఎంవి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా, సన్‌షైన్ ఆసుపత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ గురువారెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త సుచిత్ర ఎల్లా, ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే, ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌లు, బ్యాడ్మింట్ క్రీడా కారుడు పుల్లెల గోపీచంద్, జ్యూరీ సభ్యులు గా వ్యవహరించారు. ఎంపిక ప్రక్రియ ఎంతో సంక్లిష్టంగా కొనసాగింది. తమకు అందిన ప్రతీ దరఖాస్తును న్యాయనిర్ణేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతిదీ ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నట్లుగా ఉందని జ్యూరీ సభ్యు లు అభిప్రాయపడ్డారు. ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డుల జ్యూరీ సభ్యులుగా వ్యవహరిం చడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జ్యూరీ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ఫైనాన్షియల్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి, కార్పొరేట్ కమ్యూనికేషన్ డెరైక్టర్ రాణిరెడ్డి పాల్గొన్నారు.