
తీర్పు ముందు కోర్టులోకి వెళ్తున్న లాలూ
రాంచీ : బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో షాక్ తగిలింది. దాణా స్కామ్‌కు సంబంధించిన నాలుగో కేసులో కూడా లాలూను దోషిగా న్యాయస్థానం తేల్చింది. సోమవారం రాంచీ(జార్ఖండ్) సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది.
ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న సీనియర్ నేత జగన్నాథ మిశ్రాను మాత్రం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కాగా, అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన లాలూ అటు నుంచే అటే ఉదయం కోర్టుకు వెళ్లారు. శిక్షలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
డుంక ఖజానా నుంచి డిసెంబర్ 1994-జనవరి 1996 మధ్య రూ. 3 కోట్ల 13 లక్షల రూపాయలు అక్రమంగా విత్ డ్రా చేసిన సంఘటనకు సంబంధించినదీకేసు. ఈ కేసులో మొత్తం 30 మంది నిందితులు విచారణ ఎదుర్కొన్నారు.
దాణా స్కామ్ మొదటి కేసుకు సంబంధించి 2013లో లాలూకు ఐదేళ్ల శిక్ష ఖరారు.
రెండో కేసు.. డిసెంబర్ 23, 2017 మూడున్నరేళ్ల శిక్ష ఖరారు.
మూడో కేసు జనవరి 2018లో ఐదేళ్ల శిక్ష ఖరారు.
ఇవిగాక మరో రెండు కేసులు(పట్నా, రాంచీలలో) ఆయనపై ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment