దాణా కేసులో లాలూను దోషిగా తేల్చిన కోర్టు
రాంచీ : పశువుల దాణా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ను సీబీఐ కోర్టు సోమవారం దోషిగా తేల్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోట్లాది రూపాయల విలువైన పశుగ్రాసం కుంభకోణం (దాణా స్కామ్)లో రాంచీ సీబీఐ కోర్టు నేడు తుది తీర్పును వెల్లడించింది.
ఈ కేసు విచారణ సుమారు 16 ఏళ్ల పాటు కొనసాగింది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 17తో లాలూ లాయర్ తన వాదనలను ముగించిన నేపథ్యంలో సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి పికె సింగ్ నేడు తీర్పును వెల్లడించారు. శిక్షను న్యాయస్థానం మంగళవారం ఖరారు చేయనుంది. కోర్టు తీర్పుతో లాలూ ప్రసాద్ భవితవ్యం సందిగ్ధంలో పడింది.