రాంచి : లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ జీవితానికి.. బిహార్ రాజకీయాలకు పెను మచ్చగా మిగిలిపోయిన పశువుల దాణా కుంభకోణంలోని ఓ కేసుకు సంబంధించి రాంచీ కోర్టు ఈ మధ్యాహ్నం తుది తీర్పు వెలువరించనుంది. ఈ తరుణంలో ఆయన కుటుంబానికి మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసులో లాలూ కూతురు మిసా భారతి పేరును చేరుస్తూ ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. మిసాతోపాటు ఆమె భర్త, మరికొందరి పేర్లను చేర్చి ఆ ఛార్జ్ షీట్‌ను ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టుకు ఈడీ సమర్పించింది.
దాణా కుంభకోణం టైమ్ లైన్...
- లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చోటుచేసుకున్న పశువుల దాణా కుంభకోణం 1996లో వెలుగులోకి వచ్చింది. సమగ్ర దర్యాప్తు చేసిన సీబీఐ.. మొత్తం ఐదు కేసులను నమోదుచేసింది.
- ప్రస్తుత కేసు 84.5 లక్షల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగానికి సంబంధించింది. 1994-1996 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం ఈ సొమ్మును అక్రమంగా డ్రా చేసినట్లు లాలూ సహా 34 మందిపై సీబీఐ 1997, అక్టోబర్ 27న చార్జిషీట్ దాఖలుచేసింది. లాలూతోపాటు, మరో కీలక నేత జగన్నాథ మిశ్రా పేర్లు ఉన్నాయి.
- కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు.
- చియబస ట్రెజరీ నుంచి రూ.37.5 కోట్లు నగదు అక్రమంగా ఉపసంహరించిన కేసులోనూ లాలాకు సీబీఐ కోర్టు అయిదేళ్ల జైలు, రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పుతో కొన్నాళ్లు జైళ్లో గడిపిన లాలూ 2013లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు.
- ఇక కేసుపై జార్ఖండ్ హైకోర్టు 2014లో స్టే విధించింది. ఒక కేసులో అప్పటికే శిక్ష విధించబడిన వ్యక్తిపై అవే ఆధారాలు.. అవే సాక్ష్యులతో విచారించటం సరికాదని కోర్టు తెలిపింది.
- అయితే సుప్రీంకోర్టు హైకోర్టు స్టే పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాణా కుంభకోణంలో వివిధ అభియోగాలు దాఖలు కావడంతో వాటన్నింటిలో లాలూ వివరణ ఇవ్వాల్సిందేనని, లేని పక్షంలో విచారణకు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని సీబీఐ వాదించగా.. సుప్రీంకోర్టు ఆ వాదనతో ఏకీభవించింది.
- లాలూను ఇతర కేసుల్లో విచారించాలని 2017 మేలో ఆదేశించింది. దీంతో సీబీఐ న్యాయస్థానం ప్రస్తుత కేసు విచారణ ముమ్మరం చేసి, వాదనలు పూర్తిచేసింది. నేడు రాంచీ కోర్టు తుది తీర్పు వెలువరించింది.
25 ఏళ్లుగా నన్ను వేధిస్తున్నారు...
కోర్టుకి వెళ్లే ముందు బీజేపీ నాపై కుట్ర చేసింది. 25 ఏళ్లుగా వేధిస్తూనే ఉన్నారు. న్యాయం దక్కుతుందని ఆశిస్తున్నా. తీర్పు ఏదైనా బిహార్ ప్రజలు, ఆర్జేడీ కార్యకర్తలు సమన్వయం పాటించాలి అని లాలూ కోర్టుకి వెళ్లే ముందు వ్యాఖ్యానించారు.
లాలూ ఓ మాస్ హీరో : శతృఘ‍్నసిన్హా
లాలూ ప్రసాద్ యాదవ్ తీర్పు నేపథ్యంలో అనూహ్య స్పందన ఒకటి వచ్చింది. నటుడు, బీజేపీ నేత శతృఘ్న సిన్హా లాలూకి మద్దతుగా ట్వీట్ చేశారు. ‘‘లాలూ ఓ మాస్ హీరో. జాతి మొత్తానికి మిత్రుడు. అలాంటి వ్యక్తికి న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నా. సత్యమేవ జయతే.. అని సిన్హా ట్వీట్ చేశారు.
Hope wish & pray that the friend of the nation, hero of masses & favorite of downtrodden, one & only one Lalu Yadav gets the most desired & deserving justice. Satyamev Jayate??!!. God Bless!
— Shatrughan Sinha (@ShatruganSinha) December 23, 2017
Comments
Please login to add a commentAdd a comment