Ranchi cbi court
-
Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్ల శిక్ష
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)కు జైలు శిక్ష ఖరారైంది. దొరండా దాణా స్కామ్ కేసులో లాలూ యాదవ్ ను దోషిగా నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు (CBI Special Court).. సోమవారం ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. సంచలనాత్మక దాణా కుంభకోణానికి(fodder scam) సంబంధించిన ఐదో కేసులోనూ ఆయన దోషిగా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దొరండా దాణా స్కామ్ కేసులో లాలూ యాదవ్ ను దోషిగా నిర్ధారిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు గత మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇవాళ జైలు శిక్షతో పాటు 60 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది సీబీఐ కోర్టు. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మొత్తం 950 కోట్ల రూ. దాణా స్కామ్‌కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు రాగా.. దొరండా ట్రెజరీ కేసులో 139.35 కోట్ల మేర స్కామ్ జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. మొత్తం 99 మందిలో 24 మందిని నిర్ధోషులుగా విడుదల చేయగా.. 46 మందికి గతవారం సీబీఐ ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష ఖారు చేసింది. 73 ఏళ్ల లాలూ.. దుమ్కా, దియోగర్, చాయ్‌బస ట్రెజరీల కేసులకు సంబంధించి.. 14 జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దొరండా ట్రెజరీ కేసు తీర్పు వెలువడేంత వరకు ఆయన బెయిల్‌పై బయటే ఉన్నారు.ఆపై అరోగ్య సమస్యలతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక ఆరో కేసు బంకా ట్రెజరీకి సంబంధించింది ఇంకా విచారణ దశలోనే ఉంది. చదవండి: ఆర్జేడీ చీఫ్‌గా చిన్నకొడుకు తేజస్వి యాదవ్? లాలూ తీవ్ర వ్యాఖ్యలు -
లాలూకు జైలు శిక్ష ఖరారు
-
లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష
రాంచీ : ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాంచీ సీబీఐ న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. దాణా స్కామ్‌కు సంబంధించి నాలుగో కేసులో ఈ మధ్యే లాలూను దోషిగా కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం లాలూకు 14 ఏళ్ల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. ఐపీసీ సెక్షన్ల కింద 7 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద 7 ఏళ్లు.. మొత్తం 14 ఏళ్ల జైలు శిక్షను ఒకదాని వెంటే మరొకటి విధిస్తున్నట్లు న్యాయమూర్తి శివ్‌పాల్ సింగ్ వెల్లడించారు. అయితే తీర్పు కాపీ అందితేనే ఈ విషయంలో ఓ స్పష్టత వస్తుందని లాలూ తరపు న్యాయమూర్తి అంటున్నారు. శిక్షలతోపాటు రూ. 60 లక్షల ఫైన్ విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, డుంక ఖజానా నుంచి డిసెంబర్ 1991- 1996 మధ్య సుమారు రూ. 3 కోట్ల 50 లక్షల రూపాయలు అక్రమంగా విత్ డ్రా చేసిన సంఘటనకు సంబంధించిన కేసు ఇది. ఈ కేసులో మొత్తం 30 మంది నిందితులు విచారణ ఎదుర్కొగా.. చివరకు లాలూను దోషిగా తేల్చారు. ఐసీసీ సెక్షన్లు 120-బీ, 419, 420, 467, 468 సెక్షన్ల కింద ఆయనకు శిక్షకు ఖరారైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ‘మా నాన్నకు ప్రాణహని ఉంది’ కాగా, శిక్షలపై స్పందించిన లాలూ తనయుడు తేజస్వి యాదవ్.. తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ‘బీజేపీ-జేడీయూ రాజకీయ కుట్రంలో మా నాన్న బాధితుడు అయ్యాడు. ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది’ అని తేజస్వి తెలిపారు. ఇక మరోవైపు ఆర్జేడీ పార్టీ అత్యవసర భేటీకి పిలుపునిచ్చింది. -
లాలూకు మరో దెబ్బ
రాంచీ : బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో షాక్ తగిలింది. దాణా స్కామ్‌కు సంబంధించిన నాలుగో కేసులో కూడా లాలూను దోషిగా న్యాయస్థానం తేల్చింది. సోమవారం రాంచీ(జార్ఖండ్) సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న సీనియర్ నేత జగన్నాథ మిశ్రాను మాత్రం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కాగా, అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన లాలూ అటు నుంచే అటే ఉదయం కోర్టుకు వెళ్లారు. శిక్షలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. డుంక ఖజానా నుంచి డిసెంబర్ 1994-జనవరి 1996 మధ్య రూ. 3 కోట్ల 13 లక్షల రూపాయలు అక్రమంగా విత్ డ్రా చేసిన సంఘటనకు సంబంధించినదీకేసు. ఈ కేసులో మొత్తం 30 మంది నిందితులు విచారణ ఎదుర్కొన్నారు. దాణా స్కామ్ మొదటి కేసుకు సంబంధించి 2013లో లాలూకు ఐదేళ్ల శిక్ష ఖరారు. రెండో కేసు.. డిసెంబర్ 23, 2017 మూడున్నరేళ్ల శిక్ష ఖరారు. మూడో కేసు జనవరి 2018లో ఐదేళ్ల శిక్ష ఖరారు. ఇవిగాక మరో రెండు కేసులు(పట్నా, రాంచీలలో) ఆయనపై ఉన్నాయి. -
లాలూ కోసం బెదిరింపులు.. యోగి సీరియస్
లక్నో : దాణా స్కామ్ కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తికి బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయన్న వార్తల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ రంగంలోకి దిగారు. యూపీకి చెందిన ఇద్దరూ జడ్జిలే వీటి వెనుక ఉన్నట్లు ఆరోపణలు రావటంతో యోగి విచారణ కమిటీని నియమించారు. జలౌన్ జిల్లా(యూపీ) న్యాయమూర్తి, సబ్ డివిజినల్ న్యాయమూర్తి ఇద్దరూ తీర్పు వెలువడక ముందు రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శివపాల్ సింగ్ ను ఫోన్లో సంప్రదించారంట. లాలూ శిక్ష విషయంలో తాము చెప్పినట్లు చేయాలని.. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ ఇద్దరు.. శివపాల్‌ను బెదిరించారంట. ఇదే విషయాన్ని శివపాల్ మీడియా దృష్టికి తీసుకెళ్లటంతో వార్త ప్రముఖంగా ప్రచురితం అయ్యింది. దీంతో యూపీ సీఎం విచారణకు ఆదేశించారు. విచారణ కమిటీ వార్తను ఆదిత్యానాథ్ మీడియా సలహాదారు మృత్యుంజయ్ కుమార్ ధృవీకరించారు. వీలైనంత త్వరలో ఈ ఘటనపై నివేదికను అందజేస్తానని ఝాన్సీ కమిషనర్ అమిత్ గుప్తా వెల్లడించారు. మాకేం తెలీదు... ఆరోపణలపై ఇద్దరు న్యాయమూర్తులు స్పందించారు. శివపాల్ సింగ్ చెబుతున్నట్లు తాము బెదిరింపులకు పాల్పడలేదని వారంటున్నారు. జలౌన్‌లోని ఓ భూవివాదానికి సంబంధించి శివపాల్‌తో తాము చర్చించినట్లు సబ్ డివిజినల్ న్యాయమూర్తి చెబుతుండగా.. జిల్లా న్యాయమూర్తి మన్నన్ అక్తర్ మాత్రం అసలు ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. I never talked to him (Shivpal Singh) over phone. He must issue a statement, if it happened. On the date mentioned in reports, I was in my home town, on a leave.: Mannan Akhtar, Jalaun DM on reports of him calling Special Court Judge Shivpal Singh for Lalu Yadav on #FodderScam pic.twitter.com/X920OtaQJO — ANI UP (@ANINewsUP) January 11, 2018 -
లాలూప్రసాద్ యాదవ్ రాయని డైరీ
మాధవ్ శింగరాజు రాంచీలో చలి ఎక్కువగా ఉన్నట్లుంది. బిర్సా ముండా జైలు కూడా రాంచీలో భాగమే కనుక ఇక్కడున్నవన్నీ చలికి బిగదీసుకుపోతున్నాయి. ఈ బిగదీసుకుపోతున్న వాటిలో పద్నాలుగు రోజులుగా నేనూ ఒకడిని. ప్రార్థన, ఉదయపు నడక.. వీటితో నన్ను నేను వెచ్చబరుచుకుంటున్నాను. ఇంకా మూడేళ్ల చలికాలాలు నేనిక్కడ గడపాలి! బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇంటి నుంచి తెప్పించుకునే అవకాశం కల్పించారు. ఒక వంట మనిషిని పెట్టారు. కొన్ని పేపర్లు వస్తున్నాయి. టీవీ చూడనిస్తున్నారు. ఇవన్నీ నాకు అక్కరలేనివి. అందుకే సమకూర్చినట్లున్నారు! నాకు మనుషులు కావాలి. నేను మనుషులతో మాట్లాడాలి. అందుకు మాత్రం అనుమతించడం లేదు. అడిగినవి కాదనడం కన్నా, అక్కర్లేనివి అందివ్వడం పెద్ద శిక్ష మనిషికి! మునుపు ఇలా లేదు. గెస్ట్‌హౌస్‌నే నా కోసం జైలుగా మార్చారు. నన్ను కలవడానికి సీఎం కూడా వచ్చాడు. నేరుగా జైలుకే వచ్చాడు! హేమంత్ సొరేన్. కుర్రాడు. ‘‘లాలూజీ మీకు ఇక్కడ సౌకర్యంగానే ఉంది కదా’’ అని పక్కన కూర్చొని అడిగాడు. ‘‘లేకుంటే చెప్పండి ఏర్పాటు చేయిద్దాం’’ అన్నాడు. ‘‘నాకు మనుషులు కావాలి’’ అన్నాను. అర్థం చేసుకున్నాడు. మా పార్టీవాళ్లను పంపిస్తానన్నాడు. అవసరం అయితే తన పార్టీవాళ్లను కూడా పంపిస్తానన్నాడు. ‘‘మనవాళ్లు ఒడిశా, బెంగాల్‌లలో కూడా ఉన్నారు లాలూజీ, వాళ్లను కూడా రప్పిస్తాను’’ అన్నాడు. హేమంత్ సొరేన్ది జార్ఖండ్ ముక్తి మోర్చా. పేరుకు జార్ఖండ్ సీఎమ్మే కానీ, బిహార్ పిల్లాడిలా ఉండేవాడు. ‘‘మావాళ్లు చాలు హేమంత్’’ అన్నాను. ఇప్పుడు వారానికి ముగ్గురిని మాత్రమే బయటి నుంచి నన్ను కలవడానికి అనుమతిస్తున్నారు. వచ్చినవాళ్లు ‘‘ఎలా ఉన్నారు లాలూజీ’’ అని అడుగుతున్నారు. వచ్చినవాళ్లను ‘‘పార్టీ ఎలా ఉంది?’’ అని నేను అడుగుతున్నాను. అక్కడితో టైమ్ అయిపోతోంది. ఈ ఉదయం ఇంటి నుంచి అటుకులు, బెల్లం వచ్చాయి. కొన్ని పండ్లు, నువ్వులుండలు కూడా. నోటికి రుచిగా ఉన్నాయి. నా పక్క వాళ్లకు ఇచ్చాను. ‘‘బాగున్నాయి లాలూజీ’’ అన్నారు. వాళ్లెవరో నాకు తెలీదు. లోపలికి వచ్చాకే పరిచయం. ‘‘ఆ నితీశ్ కుమారే మిమ్మల్ని జైల్లో పెట్టించాడు లాలూజీ’’ అన్నాడు ఒక పరిచయస్తుడు. నవ్వాను. అతడు నా అభిమానిలా ఉన్నాడు. జైలుకు వచ్చినప్పటి నుంచీ అతను ఒకే మాట అంటున్నాడు. ‘‘మిమ్మల్ని కూడా మాతో కలిపేశారేంటి లాలూజీ’’ అని. జీవితంలో మనిషి దేనికో ఒకదానికి బందీ కావాలి. నేను పార్టీకి బందీని అయ్యాను. ఇష్టమైన దానికి బందీ అవడం కంటే స్వేచ్ఛ ఏముంది? జైల్లో ఉన్నా నేను స్వేచ్ఛాజీవినే. -
దాణా కుంభకోణంలో తుది తీర్పు వెల్లడి
రాంచీ : దాణా కుంభకోణం కేసులో సీబీఐ కోర్టు శనివారం తుది తీర్పు వెల్లడించింది. రాంచీ సీబీఐ కోర్టు... బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడున్నరేళ్లు జైలుశిక్ష, ఐదు లక్షల జరిమానా విధించింది. దియోగర్ ట్రెజరీ నుంచి రూ.89.27లక్షలు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురు దోషులకు మూడున్నరేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. బిర్సా ముండా జైలులో ఉంటున్న లాలూను.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం విచారణ చేసింది. అయితే అనారోగ్యం, వయోభారం దృష్టిలో ఉంచుకుని మానవీయ కోణంలో తనకు తక్కువ శిక్ష విధించాలని లాలూ నిన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. మరోవైపు లాలూకు జైలు శిక్షపై ఆయన తనయుడు తేజస్వి యాదవ్ స్పందించారు. చట్టం తన పని తాను చేసిందని, సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. -
లాలూ ఫ్యామిలీకి మరో షాక్.. పొగిడేసిన శతృఘ్న సిన్హా
రాంచి : లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ జీవితానికి.. బిహార్ రాజకీయాలకు పెను మచ్చగా మిగిలిపోయిన పశువుల దాణా కుంభకోణంలోని ఓ కేసుకు సంబంధించి రాంచీ కోర్టు ఈ మధ్యాహ్నం తుది తీర్పు వెలువరించనుంది. ఈ తరుణంలో ఆయన కుటుంబానికి మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసులో లాలూ కూతురు మిసా భారతి పేరును చేరుస్తూ ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. మిసాతోపాటు ఆమె భర్త, మరికొందరి పేర్లను చేర్చి ఆ ఛార్జ్ షీట్‌ను ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టుకు ఈడీ సమర్పించింది. దాణా కుంభకోణం టైమ్ లైన్... - లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చోటుచేసుకున్న పశువుల దాణా కుంభకోణం 1996లో వెలుగులోకి వచ్చింది. సమగ్ర దర్యాప్తు చేసిన సీబీఐ.. మొత్తం ఐదు కేసులను నమోదుచేసింది. - ప్రస్తుత కేసు 84.5 లక్షల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగానికి సంబంధించింది. 1994-1996 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం ఈ సొమ్మును అక్రమంగా డ్రా చేసినట్లు లాలూ సహా 34 మందిపై సీబీఐ 1997, అక్టోబర్ 27న చార్జిషీట్ దాఖలుచేసింది. లాలూతోపాటు, మరో కీలక నేత జగన్నాథ మిశ్రా పేర్లు ఉన్నాయి. - కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. - చియబస ట్రెజరీ నుంచి రూ.37.5 కోట్లు నగదు అక్రమంగా ఉపసంహరించిన కేసులోనూ లాలాకు సీబీఐ కోర్టు అయిదేళ్ల జైలు, రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పుతో కొన్నాళ్లు జైళ్లో గడిపిన లాలూ 2013లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. - ఇక కేసుపై జార్ఖండ్ హైకోర్టు 2014లో స్టే విధించింది. ఒక కేసులో అప్పటికే శిక్ష విధించబడిన వ్యక్తిపై అవే ఆధారాలు.. అవే సాక్ష్యులతో విచారించటం సరికాదని కోర్టు తెలిపింది. - అయితే సుప్రీంకోర్టు హైకోర్టు స్టే పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాణా కుంభకోణంలో వివిధ అభియోగాలు దాఖలు కావడంతో వాటన్నింటిలో లాలూ వివరణ ఇవ్వాల్సిందేనని, లేని పక్షంలో విచారణకు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని సీబీఐ వాదించగా.. సుప్రీంకోర్టు ఆ వాదనతో ఏకీభవించింది. - లాలూను ఇతర కేసుల్లో విచారించాలని 2017 మేలో ఆదేశించింది. దీంతో సీబీఐ న్యాయస్థానం ప్రస్తుత కేసు విచారణ ముమ్మరం చేసి, వాదనలు పూర్తిచేసింది. నేడు రాంచీ కోర్టు తుది తీర్పు వెలువరించింది. 25 ఏళ్లుగా నన్ను వేధిస్తున్నారు... కోర్టుకి వెళ్లే ముందు బీజేపీ నాపై కుట్ర చేసింది. 25 ఏళ్లుగా వేధిస్తూనే ఉన్నారు. న్యాయం దక్కుతుందని ఆశిస్తున్నా. తీర్పు ఏదైనా బిహార్ ప్రజలు, ఆర్జేడీ కార్యకర్తలు సమన్వయం పాటించాలి అని లాలూ కోర్టుకి వెళ్లే ముందు వ్యాఖ్యానించారు. లాలూ ఓ మాస్ హీరో : శతృఘ్నసిన్హా లాలూ ప్రసాద్ యాదవ్ తీర్పు నేపథ్యంలో అనూహ్య స్పందన ఒకటి వచ్చింది. నటుడు, బీజేపీ నేత శతృఘ్న సిన్హా లాలూకి మద్దతుగా ట్వీట్ చేశారు. ‘‘లాలూ ఓ మాస్ హీరో. జాతి మొత్తానికి మిత్రుడు. అలాంటి వ్యక్తికి న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నా. సత్యమేవ జయతే.. అని సిన్హా ట్వీట్ చేశారు. Hope wish & pray that the friend of the nation, hero of masses & favorite of downtrodden, one & only one Lalu Yadav gets the most desired & deserving justice. Satyamev Jayate??!!. God Bless! — Shatrughan Sinha (@ShatruganSinha) December 23, 2017 -
దాణా స్కాంలో నేడు లాలూకు శిక్ష ఖరారు
రాంచీ : దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడి అధినేత లాలూప్రసాద్కు నేడు శిక్ష ఖరారు కానుంది. రాంచీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా లాలూ సహా 34 మందికి శిక్షలను ప్రకటించనుంది. 1994-95 మధ్య కాలంలో చైల్‌బాసా ట్రెజరీనుంచి అక్రమంగా 37.70 కోట్ల రూపాయలు విత్ డ్రా చేసినందుకు లాలూ, మరో 44 మందిని సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి పికె సింగ్ దోషులుగా ప్రకటించడం తెలిసిందే. శిక్షను ప్రకటించిన తర్వాత లాలూ పార్లమెంటు సభ్యత్వాన్ని సైతం కోల్పోయే అవకాశం ఉంది. కాగా, కోర్టు గురువారం శిక్షలపై అన్ని పక్షాల వాదనలను వింటుందని లాలూ తరఫు సీనియర్ న్యాయవాది చిత్రంజన్ సిన్హా చెప్పారు. ఈ ప్రక్రియ ఉదయం జరుగుతుందని, మధ్యాహ్నం భోజన విరామం తర్వాత వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిందితులకు శిక్షలను కోర్టు తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. లాలూ తరఫున జబల్పూర్ హైకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాది సురేందర్ సింగ్ వాదనలు వినిపించనున్నారు. కాగా మాజీ కేంద్ర మంత్రిగా లాలూ హోదాను, ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ శిక్ష విధించాలని కోరుతామని లాలూ తరఫు న్యాయవాది తెలిపారు. -
అయ్యో.. పాపం లాలూ!
సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బీహార్‌లో లాలూ ఉంటారని చెప్పిన ఆర్జేడీ అధినేత.. కోర్టు తీర్పు పుణ్యమాని ఏడు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తోంది. సోమవారం నాడు రాంచీ కోర్టు వద్ద దృశ్యాలివి -
'గడ్డి' కరిచారు
మూగ జీవాల ఉసురు ఊరికే పోలేదు. పశువుల నోటి దగ్గర కూడు లాక్కున్న ఆ పాపం ఏళ్లు గడిచినా తరిమి తరిమి వెంటాడింది. చివరకు ఊచలు లెక్కించే వరకూ తీసుకెళ్లింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశుదాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. 16 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణలో లాలూ సహా 45 మందిని రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా పేర్కొంది. వీరికి న్యాయస్థానం శిక్షను అక్టోబర్ 3వ తేదీన ఖరారు చేయనుంది. రాజకీయంగా అత్యంత సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో తుది తీర్పు సోమవారం వెలువడింది. సుదీర్ఘ విచారణ అనంతరం జార్ఖండ్ రాజధాని రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న లాలూప్రసాద్ యాదవ్, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జగన్నాథ్ మిశ్రాలను కోర్టు దోషులుగా నిర్థారించింది. భారీ భద్రత, కిక్కిరిసిన జనం మధ్య తీర్పు వెలువరించిన సీబీఐ జడ్జి పీకే సింగ్.... మొత్తం 45 మందిని దోషులుగా పేర్కొన్నారు. లాలూకు మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం అన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. సీబీఐ కోర్టు తీర్పుతో లాలూ ప్రసాద్ రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. నేరచరిత ప్రజా ప్రతినిధులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన తీర్పు ప్రకారం లాలూ పార్లమెంట్ సభ్యత్వం కోల్పోనున్నారు. రెండు లేదా అంతకంటె ఎక్కువ ఏళ్లు జైలు శిక్ష పడితే అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం లాలూ ఎంపీ పదవిని కోల్పోవడం ఖాయం. అంతే కాకుండా అనర్హత వేటు కూడా పడనుంది. అంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి లాలూ అనర్హుడిగా మారే ప్రమాదం ఏర్పడనుంది. అదే జరిగితే రాజకీయాల్లో లాలూ ప్రస్థానం ముగిసినట్లే. బ్ తక్ సమోసామే ఆలూ రహేగా... తబ్ తక్ బీహార్‌మే లాలూ రహేగా అని గర్వంగా ప్రకటించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి తిన్న నేరానికి.... చివరకు నేరం నిరూపితమై... కటకటాల వెనక్కి వెళ్లారు. తీర్పు వెలువడిన వెంటనే ఆయన్ని పోలీసులు రాంచీలోని బిస్రాముండా సెంటర్ జైలుకు తరలించారు. 1996లో వెలుగు చూసిన దాణా కుంభకోణం 1996, మార్చి 11న పశుదాణా కుంభకోణంపై సీబీఐ విచారణకు పాట్నా హైకోర్టు ఆదేశం 1997లో సీబీఐ విచారణ ప్రారంభం 1997లో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న లాలూ 1998, ఆగస్టులో లాలూపై ఆదాయానికి మించి ఆస్తులకేసు నమోదు 2000, ఏప్రిల్ : లాలూ, రబ్రీదేవిలపై ఛార్జిషీటు దాఖలు కోర్టులో లొంగిపోయిన రబ్రీ, లాలూ రబ్రీకి బెయిల్, లాలూకు నో బెయిల్ 2000, మే 5న లాలూకు బెయిల్ మంజూరు చేసిన పాట్నా హైకోర్టు లాలూ, రబ్రీలపై అభియోగాల నమోదు -
బిస్రాముండా సెంట్రల్ జైలుకు లాలూ ప్రసాద్
రాంచీ : పశుదాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాంచీలోని బిస్రాముండా సెంట్రల్ జైలుకు తరలించారు. సోమవారం రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించిన వెంటనే ఆయన్ను పోలీసులు జైలుకు తరలించారు. లాలూ సహా నిందితులందరినీ దోషులుగా పేర్కొన్న కోర్టు... వారికి శిక్షను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. లాలూకు 3 నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని న్యాయ నిపుణులు అంటున్నారు. 16 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం జార్ఖండ్ రాజధాని రాంఛీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న లాలూప్రసాద్ యాదవ్, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జగన్నాథ్ మిశ్రాలను కోర్టు దోషులుగా నిర్థారించింది. భారీ భద్రత, కిక్కిరిసిన జనం మధ్య తీర్పు వెలువరించిన సీబీఐ జడ్జి పీకే సింగ్.... మొత్తం 45 మందిని దోషులుగా పేర్కొన్నారు. -
దాణా కేసులో అక్టోబర్ 3న శిక్షలు ఖరారు
-
దాణా కేసులో 3న శిక్షలు ఖరారు చేయనున్న సీబీఐ కోర్టు
రాంచీ : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్ తగిలింది. దాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూను దోషిగా నిర్దారించింది. లాలూతో సహా 45 మంది నిందితులను కోర్టు దోషులుగా పేర్కొంది. 16 ఏళ్ల పాటు సాగిన విచారణలో రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. అటు.. లాలూ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 900 కోట్ల రూపాయల విలువైన దాణా స్కాం వెలుగు చూసింది. శిక్షలను అక్టోబర్ 3న కోర్టు ఖరారు చేయనుంది. లాలూకు మూడు నుంచి ఏడేళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. పశుదాణా కేసులో మొత్తం 61 కేసులను సీబీఐ నమోదు చేసింది. ఇప్పటివరకూ 1200 మందిని దోషులుగా కోర్టు ప్రకటించింది .నాటి మంత్రి జగన్నాధ్ మిశ్రాను న్యాయస్థానం దోషిగా ప్రకటించింది. ఖజానా నుంచి 37.7 కోట్లు కాజేశారని నిర్థారించింది. అలాగే ఆరుగురు రాజకీయ నాయకులను, మరో నలుగురు ఐఏఎస్ అధికారులనూ దోషులుగా ప్రకటించింది. సీబీఐ లాలూ, నాటి మంత్రి జగన్నాధ్‌మిశ్రా, ఇద్దరు ఐఏఎస్ అధికారులు సహా పలువురు కోట్లు మింగారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చైబాస జిల్లా ట్రెజరీ నుంచి ఈ భారీ మొత్తాన్ని డ్రా చేశారని వాదనలు వినపించాయి. ఈ కుంభకోణంపై సీబీఐకేసు నమోదు చేయడంతో లాలూ 1997లో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. -
దాణా కేసులో లాలూను దోషిగా తేల్చిన కోర్టు
రాంచీ : పశువుల దాణా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను సీబీఐ కోర్టు సోమవారం దోషిగా తేల్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోట్లాది రూపాయల విలువైన పశుగ్రాసం కుంభకోణం (దాణా స్కామ్)లో రాంచీ సీబీఐ కోర్టు నేడు తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసు విచారణ సుమారు 16 ఏళ్ల పాటు కొనసాగింది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 17తో లాలూ లాయర్ తన వాదనలను ముగించిన నేపథ్యంలో సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి పికె సింగ్ నేడు తీర్పును వెల్లడించారు. శిక్షను న్యాయస్థానం మంగళవారం ఖరారు చేయనుంది. కోర్టు తీర్పుతో లాలూ ప్రసాద్ భవితవ్యం సందిగ్ధంలో పడింది.