బిస్రాముండా సెంట్రల్ జైలుకు లాలూ ప్రసాద్
రాంచీ : పశుదాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ను రాంచీలోని బిస్రాముండా సెంట్రల్ జైలుకు తరలించారు. సోమవారం రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించిన వెంటనే ఆయన్ను పోలీసులు జైలుకు తరలించారు. లాలూ సహా నిందితులందరినీ దోషులుగా పేర్కొన్న కోర్టు... వారికి శిక్షను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. లాలూకు 3 నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని న్యాయ నిపుణులు అంటున్నారు.
16 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం జార్ఖండ్ రాజధాని రాంఛీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న లాలూప్రసాద్ యాదవ్, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జగన్నాథ్ మిశ్రాలను కోర్టు దోషులుగా నిర్థారించింది. భారీ భద్రత, కిక్కిరిసిన జనం మధ్య తీర్పు వెలువరించిన సీబీఐ జడ్జి పీకే సింగ్.... మొత్తం 45 మందిని దోషులుగా పేర్కొన్నారు.