Birsa Munda Central Jail
-
Birsa Munda Jayanti: చిన్న వయసులో ఆదివాసీ యోధునిగా ఎదిగి..
నాడు బ్రిటీషర్ల అరాచకాలను ఎదిరించిన ఆదివాసీ యోధుడు బిర్సా ముండా జయంతి నేడు. తన పోరాట పటిమతో ఆంగ్లేయులకు చెమటలు పట్టించిన బిర్సా ముండా చిన్నవయసులోనే కన్నుమూసినా, పది కాలాల పాటు అందరూ గుర్తు పెట్టుకునేలా బ్రిటీషర్లతో పోరాటం సాగించాడు. ఆనాటి బ్రిటీష్ దాష్టీకాల్ని ఎండగట్టాడు. ఆదివాసీలను సమీకరించి, వారిని చైతన్యవంతులను చేశాడు. ఆదివాసీల సమూహాన్ని ఏర్పాటు చేసి, అడవి బిడ్డల ఆరాధ్య దైవంగా బిర్సా ముండా పేరొందాడు.అటవీ ప్రాంతంలోని గిరిజనుల భూముల హక్కులను పరిరక్షించే చట్టాలను ప్రవేశ పెట్టాలంటూ బిర్సా ముండా పోరాటం సాగించాడు. కేవలం 25 ఏళ్లు మాత్రమే జీవించిన ఈ ఆదివాసీ యోధుడు గిరిజన నాయకునిగా, స్వాతంత్ర సమర యోధునిగా గుర్తింపు పొందాడు. బీహార్, జార్ఖండ్ చుట్టు పక్కల నివసించిన ఈయన జాతీయ ఉద్యమంపై ఎనలేని ప్రభావం చూపాడు. బిర్సా ముండా పుట్టిన రోజున 2000లో ఆయనకు తగిన గౌరవాన్ని అందజేస్తూ కేంద్ర ప్రభుత్వం జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.1875, నవంబర్ 15న జన్మించిన బిర్సా ముండా 1900 జూన్ 9న ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పటికీ బిర్సాముండా 1886 నుండి 1890 వరకూ మిషనరీకి, ఆంగ్లేయుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. గిరిజనులకు తగిన శిక్షణ ఇచ్చి, వారిని బ్రిటీషర్లపై పోరాడే యోధులుగా తీర్చిదిద్దాడు. 1900, మార్చి 3న బిర్సా ముండా జామ్ కోపాయ్ అడవిలో నిద్రిస్తున్న సమయంలో బ్రిటీష్ సైనికులు అతనిని అరెస్ట్ చేశారు. బిర్సాముండాను జైలులో పెట్టిన కొద్ది రోజులకే కన్నుమూశాడు. ఇది కూడా చదవండి: మొసళ్ళతో మాట్లాడేవాడు.. -
జనజాతీయ గౌరవ్ దివస్‌గా బిర్సా ముండా జయంతి: మోదీ
-
రాంచీలో బిర్సా ముండా స్మారకాన్ని ప్రారంభించిన మోదీ
రాంచీ: ధార్తీ ఆబాగా ప్రసిద్ధి చెందిన గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జ్ఞాపకార్థం ప్రధాని నరేంద్ర మోదీ రాంచీలో మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "ధార్తీ ఆబా ఎక్కువ కాలం జీవించలేకపోయినప్పటికీ భవిష్యత్ తరాలకు దిశానిర్దేశం చేసేలా భారత చరిత్రలో లిఖించబడిని ఒక మహోన్నత వ్యక్తిగా అభివర్ణించారు. అంతేకాదు ముండాకు భారతదేశ గిరిజన సమాజ గుర్తింపును చెరిపివేయాలని కోరుకునే భావజాలానికి వ్యతిరేకంగా పోరాడిని గొప్ప వ్యక్తి బిర్సా . (చదవండి: జిమ్‌లో అసభ్య ప్రవర్తన... టిక్‌టాక్ షేర్ చేయడంతో పరార్!!) ఆధునికత పేరుతో వైవిధ్యంపై దాడి చేయడం, ప్రాచీన గుర్తింపును, ప్రకృతిని తారుమారు చేయడం సమాజ శ్రేయస్సుకు మార్గం కాదని భగవాన్ బిర్సాకు తెలుసు. ఆధునిక విద్యకు అనుకూల మార్పు కోసం వాదించాడు. అంతేకాదు తన గిరిజన సమాజంలోని లోటుపాట్లను గురించి మాట్లాడే ధైర్యం చూపించాడు." అని అన్నారు. ఈ మేరకు మోదీ బిర్సా ముండా మెమోరియల్ ఉద్యాన్ మ్యూజియంను జాతికి అంకితం చేశారు. జార్ఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ మ్యూజియం రాంచీలోని బిర్సా ముండా తుది శ్వాస విడిచిన ఓల్డ్ సెంట్రల్ జైలులో ఉంది. అంతేకాదు ఇక్కడ 25 అడుగుల ఎత్తు ఉన్న ముండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ మ్యూజియం ఆదివాసీలు తమ అడవులు, భూమి హక్కులు, సంస్కృతిని పరిరక్షించడానికి వారు ప్రదర్శించిన శౌర్యాన్ని, త్యాగాలను ప్రతిబింబిస్తుందని ఇది దేశ నిర్మాణానికి చాలా ముఖ్యమైనదని అని మోదీ అన్నారు. పైగా ముండాతో పాటు, బుధు భగత్, సిద్ధూ-కన్హు, నీలాంబర్-పీతాంబర్, దివా-కిసున్, తెలంగాణ ఖాదియా, గయా ముండా, జాత్రా భగత్, పోటో హెచ్ భగీరథ్ మాంఝీ గంగా నారాయణ్ సింగ్ వంటి గిరిజన స్వాతంత్య్ర సమరయోధులను కూడా ఈ మ్యూజియం హైలైట్ చేస్తుంది. (చదవండి: యూకే లివర్‌పూల్ నగరంలో కారు బ్లాస్ట్... ఒకరు మృతి) -
23న ‘ఆయుష్మాన్ భారత్’
రాంచీ/న్యూఢిల్లీ: ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ఈ నెల 23న ప్రధాని మోదీ జార్ఖండ్ నుంచి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని జార్ఖండ్ ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాన్ని జార్ఖండ్ నుంచి ప్రారంభించాలని ప్రధాని నిర్ణయించడం మాకు గర్వకారణం’ అని జార్ఖండ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలోని 3.25 కోట్ల మంది ప్రజలతో సహా భారతీయులంతా ఈ చారిత్రక సందర్భం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చైనా పర్యటనలో ఉన్న జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్ ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 23న ఈ కార్యక్రమం సందర్భంగా.. కోడర్మాలో మెడికల్ కాలేజీకి, చాయ్‌బాసాలో కేన్సర్ ఆసుపత్రికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. బిర్సాముండా జైలు పునరుద్ధరణ పనులనూ మోదీ ప్రారంభిస్తారు. ఆయుష్మాన్ భారత్ భేష్! కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించింది. 50 కోట్ల మంది పేదలకు (10కోట్ల కుటుంబాలకు) ఏడాదికి రూ.5లక్షల ఆరోగ్య బీమా అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చొరవ భేష్ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అభినందించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకమని.. ప్రధాని చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘సార్వత్రిక ఆరోగ్య బీమా కార్యక్రమమైన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప మార్పుకు సంకేతం. ప్రధానికి కృతజ్ఞతలు. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు కృతజ్ఞతలు’ అని టెడ్రోస్ గురువారం ీæ్వట్ చేశారు. డబ్ల్యూహెచ్‌వో డీజీకి కేంద్ర మంత్రి నడ్డా ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ అందరికీ అందాలనేదే మోదీ లక్ష్యమన్నారు. ‘డాక్టర్ టెడ్రోస్ మీతో సమావేశం ఫలప్రదంగా జరిగింది. అందరికీ ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాలని మోదీ సంకల్పించారు. 50 కోట్ల మందికి (అమెరికా, కేనడా, మెక్సికో దేశాల జనాభా కలిపితే) ఒక్కొక్కరికి రూ. 5లక్షల ఆరోగ్య బీమా అందుబాటులో ఉంటుంది’ అని నడ్డా ట్వీట్ చేశారు. -
దోమలు చంపుతున్నాయ్, వార్డు మార్చండి
రాంచీ/పట్నా: అపరిశుభ్రత, దోమల బెడద, కుక్కల అరుపులతో ఇబ్బందిగా ఉన్నందున వేరే వార్డుకి మార్చాలంటూ ఆర్జేడీ నేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీ రిమ్స్ అధికారులను కోరారు. వివిధ అవినీతి కేసుల్లో బిర్సాముండా జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ అనారోగ్యంతో రాంచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లాలూ వార్డు అపరిశుభ్రంగా ఉందని ఆర్జేడీ నేత భోలా యాదవ్ అన్నారు. దోమలు కుట్టడంతోపాటు ఆ పక్కనే మార్చురీ ఉండటంతో వీధికుక్కల సంచారం, అరుపులతో తమ నేత ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలను రిమ్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. పక్కనే కొత్తగా నిర్మించిన వార్డులోకి మారిస్తే అవసరమైన అద్దె చెల్లిస్తామని చెప్పామన్నారు. గతంలో లాలూ ఎయిమ్స్‌లో చికిత్స పొందినప్పుడు కూడా సౌకర్యవంతంగా ఉండే వార్డులోకి మార్చామని తెలిపారు. ఆస్పత్రిలో లాలూకు కలిగిన అసౌకర్యంపై అధికార జేడీయూ ఎద్దేవా చేసింది. ‘ప్రస్తుతం మీరు దోమలు, కుక్కలను చూసి భయపడుతున్నారు. గతంలో మీరు అధికారంలో ఉండగా మిమ్మల్ని చూసి బిహార్ ప్రజలు భయపడ్డారు’ అని జేడీయూ ప్రతినిధి నీరజ్ కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
లాలూ యాదవ్‌కు ఏమైంది?
రాంచీ: బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్(69) శనివారం తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆయన్ను ఇక్కడి రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) ఆస్పత్రిలో చేర్చారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలడంతో లాలూ డిసెంబర్ 23 నుంచి రాంచీలోని బిర్సాముండా జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాలూ ఆరోగ్యస్థితిని కార్డియాలజీ విభాగం వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య సమస్యపై వైద్యులు ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు దాణా కుంభకోణంలో దుమ్కా ట్రెజరీ నుంచి రూ.3.13 కోట్లను అక్రమంగా విత్‌డ్రా చేసిన కేసులో తీర్పును సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది. తండ్రి అనారోగ్యం గురించి తెలియగానే లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ హుటాహుటిన పట్నా నుంచి రాంచీకి వచ్చారు. రిమ్స్‌కు వెళ్లి తండ్రి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్, జార్ఖండ్ ఆర్జేడీ అధ్యక్షుడు అన్నపూర్ణ దేవి, వందలాది పార్టీ కార్యకర్తలు రిమ్స్‌కు తరలివచ్చారు. తమ నాయకుడిని చూసేందుకు అనుమతించడం లేదని అన్నపూర్ణ దేవి మీడియాతో చెప్పారు. లాలూ అనారోగ్యం గురించి తమకు సమాచారం ఇవ్వలేదని, మీడియా ద్వారా తెలుసుకుని ఇక్కడకు వచ్చినట్టు వెల్లడించారు. -
'జడ్జీగారు ప్లీజ్.. నన్ను ఆ జైలులో పెట్టొద్దు'
సాక్షి, రాంచీ : 'సర్, దయచేసి ఒకసారి ఓపెన్ జైలు నియమనిబంధనలు చూడండి.. 60 ఏళ్లు పైబడినవారు, ఐదేళ్లకు పైగా శిక్ష పడినవారు, మావోయిస్టులకు మాత్రమే ఓపెన్ జైలు. పైగా శిక్ష పడిన వ్యక్తి ఇష్టం లేకుండా మీరు ఆ జైలులో పెట్టడం సరికాదు' అంటూ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ న్యాయమూర్తి శివపాల్ సింగ్‌ను విజ్ఞప్తి చేశారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఓపెన్ జైలులో లాలూ శిక్షను పూర్తి చేయాలని తీర్పు సమయంలో న్యాయమూర్తి చెప్పారు. దీని ప్రకారం ఆయన హజరీబాగ్‌లోని ఓపెన్ జైలుకు వెళ్లాలి. అక్కడ ఓ వంద కాటేజీలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి అందులో ఉండొచ్చు. పైగా ఏదైనా పనిచేసుకుంటూ, ఏదేని ఓ కళకు సంబంధించిన శిక్షణను కూడా పొందొచ్చు. 2013లో ఈ జైలును ప్రారంభించారు. మావోయిస్టులు, నేర విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు, లొంగిపోయినవారు తదితరులను ఆ జైలులో పెడుతుంటారు. లాలూను కూడా అదే జైలులో ఉండాలని న్యాయమూర్తి చెప్పగానే ఆయన నిరాకరించారు. అది మావోయిస్టుల కోసం ఉన్న జైలు అన్నారు. తన ఇబ్బందులు తనకు ఉంటాయని తెలిపారు. అయితే, గతంలో బిర్సా ముండా జైలుకు వెళ్లినప్పుడు లాలూ నిబంధనలు అతిక్రమించి వ్యవహరించినట్లు స్పష్టమైంది. -
లాలూ రోజుకూలీ @ రూ. 93
పట్నా : దాణా కుంభకోణంలో శిక్ష ఖరారైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను అధికారులు బిర్సా ముండా జైలుకు తరలించారు. లాలూ వయసును దృష్టిలో పెట్టుకుని.. ఆయన చేయ గలిగిన పనులనే అప్పగిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం లాలూకు బిర్సా ముండా జైల్లో తోటపని అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ పని చేసినందుకు గానూ లాలూ రోజుకు.. 93 రూపాయల కూలీ లభిస్తుంది. ఇదిలావుండగా.. గడ్డి కుంభకోణంలో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే లాలూ ప్రసాద్ యాదవ్ హిందీలో ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. లౌకికతత్వం, సామాజిక న్యాయం, సమానత్వం, దళితులు, వెనుకబడిన వర్గాల కోసం ప్రాణాలైనా ఇస్తాగానీ.. కాషాయ పార్టీకి తలొగ్గేది లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లను మనువాదులుగా అభివర్ణించారు. -
జైలులో ఉన్నా.. ట్వీట్లు వస్తాయ్
పట్నా: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం రాంచిలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో ఉన్నారు. కారాగారంలో ఉన్నప్పటికీ ఆయన ట్విటర్ ఖాతా పనిచేస్తూనే ఉంది. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే లాలూ అధికారిక ట్విటర్ పేజీలో ట్వీట్ ప్రత్యక్షమైంది. దీంతో ఆయన అనుచరులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ట్వీట్ చదివిన తర్వాత విషయం అర్థమైంది. తాను జైలులో ఉన్నప్పటికీ ట్విటర్ ద్వారా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటానని తెలిపారు. ట్విటర్ ఖాతాను తన కార్యాలయం నిర్వహిస్తుందని వెల్లడించారు. తన కుటుంబ సభ్యులను సంప్రదించి ట్వీట్లు పోస్ట్ చేస్తుందన్నారు. రాజ్యాంగం, హక్కుల పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తానని ట్వీట్లో పేర్కొన్నారు. అయితే జైలులో ఉండగా తన అభిప్రాయాలను ఎలా వెల్లడిస్తారనే అనుమానాన్ని ఆయన నివృత్తి చేశారు. జైలులో తనను కలుసుకునేందుకు వచ్చే సందర్శకులకు తన మనసులోని మాటలు చెబుతానని, వీరు తన కుటుంబ సభ్యులకు ఈ విషయాలు చేరవేస్తారని ట్విటర్లో పేర్కొన్నారు. జైలులో ఉన్నప్పటికీ మద్దతుదారులతో టచ్‌లో ఉండాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాను లాలూ వేదికగా చేసుకున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. Dear friends! While in jail, My Twitter handle shall be operated by my office in consultation with family. I shall speak my mind through visitors. The fight to preserve the Constitution & protect the rights of vulnerable groups shall go on. — Lalu Prasad Yadav (@laluprasadrjd) December 25, 2017 -
ప్లీజ్...మమ్మల్ని చంపేయండి..
రాంచి: ఇరవై ఏళ్లుగా జైల్లో మగ్గుతున్నాం.. దయచేసి మమ్మల్ని విడుదల చేయండి...లేదా మెర్సీ కిల్లింగ్ చేయండి అంటూ 130 మంది ఖైదీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మొరపెట్టుకున్నారు. దీనికి సంబంధించి జార్ఖండ్ రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలు ఖైదీలు గత గురువారం రాష్ట్రపతికి ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. తమ కుటుంబం దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతోందని.. తమ పిల్లలు చదువు సంధ్యా లేకుండా అల్లాడిపోతున్నారని, వారి దుర్భర పరిస్థితి ..తమకు తీవ్ర మనస్తాపానికి గురి చేసి, మానసికంగా కృంగదీస్తుందని వారు...రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. శిక్షా కాలం పూర్తియినా ఇంకా తమను విడుదల చేయడం లేదని ఖైదీలు ఆరోపిస్తున్నారు. మావోయిస్టులకు పునరావాసం, ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం, తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా శిక్షాకాలం పూర్తయిన ఖైదీలందర్నీ తక్షణమే విడుదల చేయాలని, లేదంటే మెర్సీ కిల్లింగ్ చేయాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, జార్ఖండ్ గవర్నర్ , ముఖ్యమంత్రి తదితరులను విజ్ఞప్తి చేస్తూ ఈ లేఖ రాశారు. దాదాపు 130 మంది ఖైదీలు సంతకం చేసిన ఆ లేఖను జైలు అధికారులకు అందజేశారు. ఆ లేఖను జైలు సూపరిండెంట్ అశోక్ కుమార్ చౌదరీ సంబంధిత అధికారులకు పంపించారు. కాగా అయితే రాష్ట్ర ఖైదీల క్షమాభిక్ష సిపార్సు సంఘం మేరకు సత్ప్రర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం ప్రతీ సంవత్సరం విడుదల చేస్తుందని ఓ జైలు అధికారి తెలిపారు. అయితే గత జూన్ 20 తర్వాత నుండి ఇంతవరకు ఆ కమిటీ సమావేశం కాలేదని సమాచారం. -
నరేంద్ర మోడీని ఢీ కొడతా: లాలూ
రాంచీ: మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా లౌకిక పార్టీలను ఏకం చేయనున్నట్టు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. మతతత్వ పార్టీలను అధికారంలోకి రాకుండా చేయడానికి ఎటువంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. 'నరేంద్ర మోడీ లేదా మరో మోడీ అయినా ఎదుర్కొవడానికి నేను సిద్ధం' అన్నారు. లౌకిక పార్టీలను ఏకం చేసేందుకు దేశమంతా పర్యటిస్తానని చెప్పారు. లోక్‌పాల్ బిల్లును అడ్డుకునేందుకు అన్నా హజారే లాంటి వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకే పరిమితమైందని, ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేకపోతోందని ఎద్దేవా చేశారు. బిర్సాముండా జైలు నుంచి బెయిల్‌పై ఆయన సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. -
ప్రజల దృష్టిలో లాలూ ఓ హీరో: రబ్రీదేవి
'ప్రజల దృష్టిలో రాష్టీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ హీరో' అని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన సతీమణి రబ్రీ దేవి వ్యాఖ్యానించారు. లోకసభ సభ్యుడిగా అనర్హతతోపాటు, మరో పదకొండు ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా లాలూపై వేటు పడిన నేపథ్యంలో రబ్రీ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల, ప్రజల దృష్టిలో లాలూ ప్రసాద్ యాదవ్ ఓ హీరో అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాజకీయ కుట్రకు తన భర్త బలైపోయాడు అని అన్నారు. పశుగ్రాస కుంభకోణంలో లాలూకు ఐదేళ్ల పాటు, మరో ఎంపీ జగదీష్ శర్మలకు సీబీఐ ప్రత్యేక కోర్టు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాలూ, శర్మలు రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. -
రాంచీ జైలులో లాలూతో రాష్ట్రపతి కుమారుడి భేటి!
పశుగ్రాసం కుంభకోణంలో రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ అభిజిత్ ముఖర్జీ కలుసుకున్నారు. 1990లో తన ప్రభుత్వ హయాంలో బైబాసా ట్రెజరీ నుంచి 37.7 కోట్ల రూపాయలను అక్రమంగా విత్ డ్రా చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు సెప్టెంబర్ 30 తేదిన లాలూకి శిక్షను ఖారారు చేసింది. ప్రత్యేక సీబీఐ కోర్టు వెల్లడించిన తీర్పుపై లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ హై కోర్టులో అక్టోబర్ 17 తేదిన అప్పీల్ చేయనున్నారు. రాంచీలోని బిర్సా ముంబా జైలులో లాలూతో అభిజిత్ ముఖర్జీ భేటి కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. లాలూతో భేటి తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో అభిజిత్ సమావేశం కానున్నారు. -
జైల్లోనూ 'జడ్ ప్లస్' కావాలి: లాలూ
రాంచీ: జైల్లోనూ తనకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కొనసాగించాలని బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోరారు. అయితే లాలూ విజ్ఞప్తిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. జైల్లో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కొనసాగించేది లేదని కోర్టు స్పష్టం చేసింది. 'దాణా కుంభకోణంలో దోషిగా నిర్ధారణయిన తర్వాత.. జైల్లోనూ తనకు భద్రత కొనసాగించాలని కోర్టును లాలూ అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది' అని జిల్లా అడిషనల్ మేజిస్ట్రేట్(లా లండ్ ఆర్డర్), జైలు సూపరిండెంటెంట్ ధర్మేంద్ర పాండే తెలిపారు. గత కొన్నేళ్లుగా లాలూకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కొనసాగుతోంది. జైలుకు వెళ్లే వరకు ఆయనకు నేషనల్ సెక్యురిటీ గార్డ్ బ్లాక్ కమెండోస్ ఆయనకు భద్రత కల్పిస్తూ వచ్చారు. లాలూప్రసాద్ యాదవ్ ప్రస్తుతం రాంచీ శివార్లలోని బిర్సా ముండా కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఈ కేసులో లాలూ సహా మిగతా 37 మందికి అక్టోబర్ 3న శిక్షను ఖరారు చేయనున్నారు. రెండేళ్లకు పైబడి శిక్ష పడితే ఆయన లోక్‌సభ సభ్యత్వం తక్షణం రద్దవుతుంది. -
బిస్రాముండా సెంట్రల్ జైలుకు లాలూ ప్రసాద్
రాంచీ : పశుదాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాంచీలోని బిస్రాముండా సెంట్రల్ జైలుకు తరలించారు. సోమవారం రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించిన వెంటనే ఆయన్ను పోలీసులు జైలుకు తరలించారు. లాలూ సహా నిందితులందరినీ దోషులుగా పేర్కొన్న కోర్టు... వారికి శిక్షను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. లాలూకు 3 నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని న్యాయ నిపుణులు అంటున్నారు. 16 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం జార్ఖండ్ రాజధాని రాంఛీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న లాలూప్రసాద్ యాదవ్, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జగన్నాథ్ మిశ్రాలను కోర్టు దోషులుగా నిర్థారించింది. భారీ భద్రత, కిక్కిరిసిన జనం మధ్య తీర్పు వెలువరించిన సీబీఐ జడ్జి పీకే సింగ్.... మొత్తం 45 మందిని దోషులుగా పేర్కొన్నారు.