పట్నా : దాణా కుంభకోణంలో శిక్ష ఖరారైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను అధికారులు బిర్సా ముండా జైలుకు తరలించారు. లాలూ వయసును దృష్టిలో పెట్టుకుని.. ఆయన చేయ గలిగిన పనులనే అప్పగిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం లాలూకు బిర్సా ముండా జైల్లో తోటపని అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ పని చేసినందుకు గానూ లాలూ రోజుకు.. 93 రూపాయల కూలీ లభిస్తుంది.
ఇదిలావుండగా.. గడ్డి కుంభకోణంలో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే లాలూ ప్రసాద్ యాదవ్ హిందీలో ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. లౌకికతత్వం, సామాజిక న్యాయం, సమానత్వం, దళితులు, వెనుకబడిన వర్గాల కోసం ప్రాణాలైనా ఇస్తాగానీ.. కాషాయ పార్టీకి తలొగ్గేది లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను మనువాదులుగా అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment