Gardeners
-
ఎన్విడియా సీఈఓ నోట.. తోటమాలి నేర్పిన పాఠం
మనిషి జీవితంలో ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. తీక్షణంగా పరిశీలిస్తే.. ప్రకృతి కూడా మనకు ఎన్నెన్నో జీవిత సత్యాలను చెబుతుంది. నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించి.. జీవితంలో ఎంతోమందికి ఆదర్శమైన వారు కూడా తమకంటే ఉన్నతులు లేదా తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి దగ్గర నుంచి కొన్ని పాఠాలను నేర్చుకుని ఉంటారు. ఇటీవల ఎన్వీడియా సీఈఓ 'జెన్సన్ హువాంగ్' (Jensen Huang) ఓ తోటమాలి నుంచి తాను నేర్చుకున్న జీవిత పాఠాన్ని వెల్లడించారు.జెన్సన్ హువాంగ్ గత వారం కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై, అక్కడ ప్రసంగిస్తూ.. జపాన్‌లోని క్యోటోలో తాను సిల్వర్ టెంపుల్ సందర్శించడానికి వెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడ ఎక్కువ ఎండగా ఉంది, ఆ ఎండలో కూడా ఓ తోటమాలి అక్కడ పనిచేస్తూ కనిపించారు. ఆయన దగ్గరకు వెళ్లి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాను, ఆయన ఇక్కడ పిచ్చి మొక్కలు తొలగిస్తున్నాను. ఈ తోటకు 25 సంవత్సరాలుగా తోటమాలిగా పని చేస్తున్నాను అని ఆయన చెప్పినట్లు వెల్లడించారు.తోట పెద్దదిగా ఉంది పని చేయడానికి సాధ్యమవుతుందా అని నేను అడిగినప్పుడు.. ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పనులను సమయం కేటాయిస్తాను అని పేర్కొన్నట్లు జెన్సన్ చెప్పారు. ఆ తోటమాలి చెప్పిన మాటలు జీవితంలో విలువైన పాఠాలను నేర్పినట్లు చెప్పుకొచ్చారు.మనకు జీవితంలో ఎన్నెన్నో పనులు, వాటికి ఎన్నెన్నో ఆటంకాలు. అవన్నింటిని చూసి భయపడవకూడదు, అన్నీ చేయాల్సిన అవసరమూ లేదు. నీకు జీవితంలో ఏదైతే ముఖ్యమైందో, దేనికైతే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందో దానికి సమయాన్ని కేటాయించు. సమయం మిగిలి ఉంటే మిగిలిన పనులు చెయ్యి. తప్పకుండా సక్సెస్ సాధిస్తావన్నని ఆ తోటమాలి మాటలకు అర్థమని స్పష్టంగా తెలుస్తోంది. -
Nicolas Puech: సంరక్షకుడికి రూ. 91 వేల కోట్ల ఆస్తి
న్యూయార్క్: మలి వయసులో తన బాగోగులు చూసుకున్న వ్యక్తిని దత్తత తీసుకుని ఆస్తి మొత్తం కట్టబెట్టాలని స్విట్జర్లాండ్‌కు చెందిన కుబేరుడు నికోలస్ ప్యూచ్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ఆయన ఆస్తి అంతాఇంతా కాదు. ఏకంగా 1,100 కోట్ల డాలర్లు. అంటే దాదాపు రూ.91,700 కోట్లు. 80 ఏళ్ల ప్యూచ్ ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ ఉత్పత్తుల సంస్థ థియరీ హెర్మెస్ వారసుల్లో ఒకరు. 220 బిలియన్ డాలర్ల విలువైన ఈ సంస్థలో నికోలస్ ప్యూచ్కు 6 శాతం దాకా వాటాలున్నాయి. ప్యూచ్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడంతో వారసులెవరూ లేరు. దాంతో ఆయన తదనంతరం భారీ ఆస్తులు ఎవరికి చెందుతాయి? అన్న సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో, గతంలో తన బాగోగులు చూసుకున్న 51 ఏళ్ల నడి వయసు్కడిని దత్తత తీసుకుని వేల కోట్ల ఆస్తులన్నీ అప్పగించనున్నారాయన. ఇప్పటికే దేశ విదేశాల్లోని కోట్ల రూపాయల విలువచేసే కొన్ని భవంతులను అతని పేరిట రాసేశారట. దత్తత ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
సుజీ.. ఎంతపని చేసింది!!
బహదూర్‌పురా: జూలో తోడు లేక తల్లడిల్లుతున్న ఓ చింపాంజీ అక్కడ పనిచేసే హెడ్ మాలీపై దాడి చేసి గాయపరిచింది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌లో ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. మధ్యాహ్నం ఎన్‌క్లోజర్‌లో నుంచి బయటికి వచి్చన ఆడ చింపాంజీ సుజీ.. హెడ్ మాలీ యాదయ్యపై దాడి చేసి కాలిపై గాయపరిచింది. సోమవారం జూపార్కుకు సెలవు కావడంతో పెద్ద గండం తప్పింది. ప్రముఖ వ్యాపార సంస్థ సహారా చైర్మన్ సుబ్రతోరాయ్ 2011లో బహుమతిగా ఆడ చింపాంజీ సుజీని జూకు అందించారు. అప్పట్నుంచి సుజీ జూలో సందర్శకులను అలరిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే పెద్దదైన సుజీ ఒంటరితనం అనుభవిస్తోంది. ఇటు జూ సిబ్బంది ఇన్నాళ్లైనా దానికి ఓ తోడును తేవడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే సుజీ గతంలో ఆహారం కూడా మానేసి తీవ్ర అస్వస్థతకు గురై కోలుకుంది. ఎన్‌క్లోజర్‌లో నుంచి సుజీ బయటికి రావడం ఇది రెండోసారి. గతంలో యానిమల్ కీపర్‌ను ఎన్‌క్లోజర్‌లో ఉంచి బయటి నుంచి సుజీ గడియపెట్టింది. కాగా దాడి ఘటనపై సమాచారం అందుకున్న జూ వెటర్నరీ వైద్యులు, అధికారులు వెంటనే స్పందించి ఫుడ్కోర్ట్ వద్ద సుజీపై మత్తు మందు ప్రయోగించి పట్టుకున్నారు. గాయపడిన యాదయ్యను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జూ అధికారులు విచారణ చేపట్టారు. -
అనుకోకుండా ఆ మొక్కను తగిలాడు అంతే..
లండన్ : ఈ ప్రకృతి ఎంత అందమైనదో అంతే ప్రమాదకరమైనది కూడా! చూడటానికి అందంగా ఉండి ప్రాణాలు తీసే జీవులు, మొక్కలు అనేకం ఉన్నాయి ఈ సృష్టిలో. విషయమేంటంటే.. అనుకోకుండా ఓ మొక్కను తగిలిన కారణంగా ఓ యువకుడి పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లైంది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన ఆలివర్ ఫెంటన్ అనే యువకుడు తోటలో పనిచేసుకుంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడే ఉన్న ఓ మొక్కను అనుకోకుండా తగిలి, రాసుకుంటూ వెళ్లాడు. అలా జరిగిన కొద్ది గంటల వరకు అతడికి ఏమీ అవ్వలేదు. ఆ తర్వాత అతడి ఒళ్లంతా అగ్గి మంటలు మొదలయ్యాయి. శరీరం మొత్తం ఎర్రటి పొక్కులు రాసాగాయి. కంటిలో సైతం ఆ మొక్కకు సంబంధించిన ద్రవం పడటంతో విపరీతంగా నొప్పి మొదలైంది. దీంతో అతడు వెంటనే ఆసుపత్రికి బయలుదేరి వెళ్లాడు. ఆలివర్‌కు వైద్యం చేసిన డాక్టర్ మాట్లాడుతూ.. ఆలివర్ అదృష్టం కొద్ది కన్ను కోల్పోలేదని, లేకుంటే మొక్క స్రవించిన ద్రవం కారణంగా అతడి కంటిచూపుకు ప్రమాదం వాటిల్లేదని తెలిపారు. జెయింట్ హాగ్వీడ్ మొక్కలు చాలా ప్రమాదకరమైనవని, మానవ శరీరం దానికి తగిలినపుడు విషపూరితమైన ద్రవాలను మనిషి శరీరంలోకి జొప్పిస్తాయని తెలిపారు. -
ఆదివాసీ మహిళలతో ఆదిలాబాద్ కలెక్టర్ డ్యాన్స్
-
అటెండర్ పెళ్లిలో కలెక్టర్ డ్యాన్స్.. వీడియో వైరల్
గుడిహత్నూర్(బోథ్): ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ అటెండర్ పెళ్లికి హాజరై ఆదివాసీ మహిళల కలిసితో డ్యాన్స్ చేశారు. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా మహిళలతో కలిసి ఆమె థింసా నృత్యం చేయడం పెళ్లికి వచ్చిన వారిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తన క్యాంపు కార్యాలయంలో తోటమాలిగా పని చేస్తున్న ఆదివాసీ యువకుడు నైతం సుధాకర్ వివాహ వేడుక మండలంలోని గోపాల్పూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది. ఈ వేడుకకు కలెక్టర్ దివ్యదేవరాజన్ హాజరుకావడం ప్రత్యేకతను సంచరించుకుంది. ఆదివాసీ తోటి తెగ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక జరుగుతుండగా కలెక్టర్ ఆదివాసీ మహిళలతో కలిసి నేలపై కూర్చుని ఆ తంతును తిలకించారు. ఆదివాసీ సంప్రదాయల గురించి మహిళలను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో కలిసి థింసా నృత్యాలు చేశారు. జిల్లా కలెక్టర్ వివాహ వేడుకకు హాజరుకావడంతో పెళ్లింటి వారు, బంధుమిత్రులు, గ్రామస్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. -
లాలూ రోజుకూలీ @ రూ. 93
పట్నా : దాణా కుంభకోణంలో శిక్ష ఖరారైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను అధికారులు బిర్సా ముండా జైలుకు తరలించారు. లాలూ వయసును దృష్టిలో పెట్టుకుని.. ఆయన చేయ గలిగిన పనులనే అప్పగిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం లాలూకు బిర్సా ముండా జైల్లో తోటపని అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ పని చేసినందుకు గానూ లాలూ రోజుకు.. 93 రూపాయల కూలీ లభిస్తుంది. ఇదిలావుండగా.. గడ్డి కుంభకోణంలో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే లాలూ ప్రసాద్ యాదవ్ హిందీలో ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. లౌకికతత్వం, సామాజిక న్యాయం, సమానత్వం, దళితులు, వెనుకబడిన వర్గాల కోసం ప్రాణాలైనా ఇస్తాగానీ.. కాషాయ పార్టీకి తలొగ్గేది లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లను మనువాదులుగా అభివర్ణించారు. -
కొన్ని గంటల ముందు
ఒకరోజు, జ్వరం వచ్చిన తోటమాలిని పరామర్శించి తిరిగి వస్తూ, ‘మృత్యువంటే అతడు భయపడుతున్నాడు’ అని తన కార్యదర్శి రత్తూతో అన్నారు అంబేడ్కర్. కానీ మృత్యువు ఆయన చెంతే ఉన్నది. 1956 డిసెంబర్ 4న కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సమావేశానికి హాజరయ్యారు. సాయంత్రం మహారాష్ట్ర నాయకులు ఆచార్య ఆత్రే, ఎస్.ఎం.జోషీలను రిపబ్లికన్ పార్టీలో చేరవలసిందిగా ఉత్తరాలు డిక్టేట్ చేశారు. ఆ తెల్లారి జైన నాయకులు వస్తే వారితో మాట్లాడారు. అనంతరం, అలసటగా ఉండటంతో తలకు రత్తూ నూనెతో మాలిష్ చేస్తుండగా ఆ హాయిలో సోఫా మీద తాళం వేస్తూ మంద్ర స్వరంలో ‘బుద్ధం శరణం గచ్ఛామి’ పాడుకున్నారు. భోజనానికి పిలుపు రావడంతో లేచి, కొద్దిగా అన్నం తిని వస్తూ తన పర్సనల్ లైబ్రరీలోని కొన్ని పుస్తకాలను పడకగదిలో పెట్టించుకున్నారు. అలాగే, బుద్ధా అండ్ దమ్మ పీఠిక, బర్మా ప్రభుత్వానికి రాసిన ఉత్తరం కూడా తెమ్మన్నారు. కబీరు గీతం పాడుతూ పడకగదికి చేరుకున్నారు. డిసెంబర్ 6వ తేదీ ఉదయం 6:30కు చూసినప్పుడు అంబేడ్కర్ నిద్రిస్తున్నారనే అనుకున్నారు భార్య సవితాదేవి. కానీ ఆయన దేహం అప్పటికే భవసాగరాన్ని దాటేసింది. దళితులపై హిందూమతం చూపుతున్న వివక్షను ఏళ్లతరబడి సహిస్తూ వచ్చిన అంబేడ్కర్ అప్పటికి ఇరవై ఏళ్ల క్రితమే బౌద్ధం వైపు మళ్లారు. 1935లో యవ్లాలో జరిగిన ఒక సమావేశంలో ఆయన ఆవేశపూరితంగా మాట్లాడారు. ‘దురదృష్టవశాత్తు నేను హిందూ సమాజంలో అంటరానివాడిగా పుట్టాను. పుట్టుక నా చేతిలో లేదు కాబట్టి దానికి ఇప్పుడు నేనేమీ చేయలేను. అయితే హిందువుగా మాత్రం మరణించను’ అని అన్నారు. ఆయన నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా చాలామంది దళితులు సమర్థించారు. బాంబేలోని నయీగాంలో దళితులు సమావేశమై అంబేడ్కర్‌తో పాటు మతం మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. యవ్లా సమావేశం తర్వాత ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు అంబేడ్కర్‌కు ఆహ్వానాలు పంపారు. అయితే సిక్కు, బౌద్ధ మతాలే అంబేడ్కర్‌ను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. ఇటాలియన్ బౌద్ధ సన్యాసి రెవరెండ్ లోక్సుదా 1936 జూన్‌లో అంబేడ్కర్‌ను కలుసుకుని, బౌద్ధమత ప్రాశస్త్యాన్ని వివరించారు. తర్వాత కొద్ది కాలానికే అంబేడ్కర్ బౌద్ధం స్వీకరించారు. (రేపు అంబేడ్కర్ వర్ధంతి) -
మొక్కల కొను‘గోల్మాల్’పై పునర్విచారణ
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ఉద్యానవన విభాగంలో జరిగిన మొక్కల కొను‘గోల్మాల్’ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. పునర్విచారణలో భాగంగా శనివారం పార్కు ఉద్యోగుల్ని అదనపు కమిషనర్ జి.నాగరాజు విచారించారు. ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్క్ సూపర్వైజర్ రామారావు రిటైరయ్యారు కాబట్టి కాస్తంత ఆలోచించండి’ అంటూ అధికారి సూచించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ‘మీరు ఏం చెబితే అదే రాసిస్తాం సార్..’ అంటూ ఉద్యోగులు సమాధానమివ్వడంతో అధికారి కంగుతిన్నట్లు సమాచారం. గతంలో విచారణ సందర్భంగా ఏం స్టేట్మెంట్ ఇచ్చారో ఉద్యోగులు డిటో అదే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదీ అసలు కథ... గ్రేడ్-1 పార్క్ సూపర్వైజర్గా రామారావు గతంలో విధులు నిర్వర్తించారు. పార్కుల్లో పచ్చదనం కోసం 2011లో రూ.27 లక్షలతో మొక్కలు కొనుగోలు చేసినట్లు బిల్లులు పెట్టారు. ప్లాంట్ ప్యారడైజ్ విజయవాడ, వెంకట నర్సరీ కడియపులంక నుంచి రూ.6 లక్షల విలువైన మొక్కలు కొనుగోలు చేసినట్లు చూపారు. కార్పొరేషన్ పార్కుల్లో పెంచిన మొక్కలే నర్సరీల నుంచి కొనుగోలు చేసినట్లు చూపుతూ మాయ చేస్తున్నారని మునిసిపల్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ నాయకుడు ఆసుల రంగనాయకులు చేసిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త విచారణకు ఆదేశించింది. విచారణాధికారులుగా నియమితులైన అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ హార్టికల్చర్ చంద్రశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ జెడ్.శ్రీనివాసరావు నర్సరీ కాంట్రాక్టర్లను విచారించగా సూపర్వైజర్ కోరినమీదట తాము ఖాళీ బిల్లులు ఇచ్చామని, మొక్కల్ని సరఫరా చేయలేదని స్పష్టం చేశారు. పార్క్ ఉద్యోగులు సైతం మొక్కలను కొనుగోలు చేయలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా విచారణాధికారులు నివేదిక ఇచ్చారు. ఏడాదిన్నర క్రితం రామారావు రిటైరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఆయనకు రావాల్సిన ప్రయోజనాలను నిలుపుదల చేశారు. రామారావుపై ఏం చర్యలు తీసుకున్నారని తాజాగా లోకాయుక్త కార్పొరేషన్‌ను ప్రశ్నించడంతో పునర్విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ససేమిరా లోకాయుక్తలో కేసు ఫైల్ చేసిన ఆసుల రంగనాయకులుతో పాటు, కాంట్రాక్టర్ల స్టేట్ మెంట్ ఈ వ్యవహారంలో కీలకంగా మారింది. దీంతో వారిపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని ముమ్మరం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పునర్విచారణలో ఓ అధికారి సాయంతో బయటపడాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. పార్కు ఉద్యోగుల నుంచి ఫిర్యాదుదారుడి వరకు నిక్కచ్చిగా ఉండటంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. అధికారులు చివరకు ఏం చేస్తారో వేచి చూడాలి.