వేడుకలో పాల్గొన్న కలెక్టర్ దివ్యదేవరాజన్
గుడిహత్నూర్(బోథ్): ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ అటెండర్ పెళ్లికి హాజరై ఆదివాసీ మహిళల కలిసితో డ్యాన్స్ చేశారు. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా మహిళలతో కలిసి ఆమె థింసా నృత్యం చేయడం పెళ్లికి వచ్చిన వారిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
తన క్యాంపు కార్యాలయంలో తోటమాలిగా పని చేస్తున్న ఆదివాసీ యువకుడు నైతం సుధాకర్ వివాహ వేడుక మండలంలోని గోపాల్‌పూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది. ఈ వేడుకకు కలెక్టర్ దివ్యదేవరాజన్ హాజరుకావడం ప్రత్యేకతను సంచరించుకుంది. ఆదివాసీ తోటి తెగ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక జరుగుతుండగా కలెక్టర్ ఆదివాసీ మహిళలతో కలిసి నేలపై కూర్చుని ఆ తంతును తిలకించారు. ఆదివాసీ సంప్రదాయల గురించి మహిళలను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో కలిసి థింసా నృత్యాలు చేశారు. జిల్లా కలెక్టర్ వివాహ వేడుకకు హాజరుకావడంతో పెళ్లింటి వారు, బంధుమిత్రులు, గ్రామస్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment