మంచిర్యాలక్రైం: వారిద్దరు క్లాస్‌మెట్స్. కులాలు వేరైనా ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. విషయం కుటుంబ సభ్యులకు తెలపకుండా కొంతకాలం కలిసి జీవించారు. పెళ్లి విషయం పెద్దలకు చెప్పేందుకు మందమర్రి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం యువతి కుటుంబ సభ్యులతో వెళ్లిపోయింది. ఇప్పుడు ఆమె నాలుగు నెలల గర్భవతి. అయితే భార్యను కాపురానికి పంపించాలని ఆ యువకుడు ఆరు నెలలుగా న్యాయ పోరాటం చేస్తున్నాడు.
మందమర్రి పట్టణం ఊరురామకృష్ణాపూర్‌కు చెందిన బీమ కిశోర్‌కు మందమర్రికి చెందిన వనితతో 2017 ఆగస్టు 16న హన్మకొండ నర్సింహస్వామి ఆలయంలో పెళ్లిచేసుకున్నాడు. కొన్నాళ్లు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. వనిత గర్భం దాల్చినట్టు 2017 సెప్టెంబర్ 16న వైద్య పరీక్షల ద్వారా వెలుగులోకి వచ్చింది. అప్పటికే నాలుగు నెలల గర్భవతి. ఎలాగైనా ఈ విషయాన్ని పెద్దలకు చెప్పాలని కిశోర్ తన భార్యతో కలిసి మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో 2017 సెప్టెంబర్ 18న ఫిర్యాదు చేశారు. ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి అప్పటి ఎస్సై వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. కాగా యువతి మాటమార్చడంతో కథ అడ్డం తిరిగింది. ఈ విషయంలో తనను పోలీసులు బెదిరించారని కిశోర్ తెలిపాడు. ఈ నెల 16న టవరెక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా నా భార్యను కాపురానికి పంపించేలా చర్యలు తీసుకోవాలని, నాలుగు నెలల గర్భాన్ని తొలగించి బ్రూణ హత్యకు పాల్పడిన వారిని శిక్షించాలని బెల్లంపల్లి ఏసీపీకి ఫిర్యాదు చేశానని కిశోర్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment