mancherial district
-
రాతి కోటల్లో.. గాంధారి ఖిల్లా!
తెలంగాణలోని రాతి కోటల్లో వరంగల్, భువనగిరి కోటల తర్వాత చెప్పుకోదగ్గది గాంధారి ఖిల్లా. అపారమైన బొగ్గు నిక్షేపాలతో విరాజిల్లుతున్న మంచిర్యాల జిల్లాలో.. వేల సంవత్సరాల క్రితమే మానవ జీవనం ఉన్నట్లు తెలియజేసే సజీవ సాక్ష్యం ఈ గాంధారి ఖిల్లా. మంచిర్యాల పట్టణానికి పన్నెండు కి.మీ. దూరంలో మందమర్రి మండలం, బొక్కలగుట్ట అడవుల్లో ఈ కోట ఉంది. గుట్టపైన నాగశేషుడి ఆలయం, శివుడు, ఏనుగు, విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, కాలభైరవుడి విగ్రహాలు, ద్వారాలు, దేవతా మూర్తుల ప్రతిమలు ఉన్నాయి. శత్రువుల రాకను పసిగట్టే నగారా గుండూ కనిపిస్తుంది. కొండను తొలిచి నిర్మించిన నాగశేషుడి ఆలయం, కాలభైరవ విగ్రహాలు ఆకర్షిస్తాయి. గుట్ట పైన ‘సవతుల బావులు’, కాలువలు ఉన్నాయి. కింద నీటి చెలమలో ఎండాకాలంలోనూ నీటి ఊట పైకి వస్తుంది.చారిత్రక వైభవం..అరుదైన గోండ్వానా రాతి గుట్టలపైన మానవ నిర్మిత నీటి గుండాలతో అద్భుతమైన చారిత్రక సంపద కనిపిస్తుంది. ఈ గుట్టలను ఎవరు తొలిచారనేదానికి స్పష్టతలేదు. పూర్వయుగపు పనిముట్లు, చిత్రలేఖనాలు చరిత్రకారులకు లభ్యమయ్యాయి. కొన్ని ఆధారాల ప్రకారం ఆరవ శతాబ్దంలో కందారపురం పేరుతో గాంధారి కోట రాజధానిగా సోమదేవరాజు రాజరికం చేశారని తెలుస్తోంది. ఆయన కొడుకు మాధవ వర్మ కాకతీయుల మూల పురుషుడనే ప్రస్తావన సిద్ధేశ్వర, ప్రతాప చరిత్రలో ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు. రాష్ట్రకూటుల సామంతుడైన మేడరాజు ఈ గాంధారి కోటను పటిష్ఠం చేశాడు. ఆయన పేరుతో ఉన్న మేడ చెరువు నేటికీ కనిపిస్తుంది. పద్మనాయక రాజులు రాచకొండ కేంద్రంగా పాలిస్తూ, వైష్ణవమతం వ్యాప్తికోసం పెద్దిరాజు అనంతరాజు, రఘు నాయకులు కోటలో హనుమంతుడి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. దీన్ని ధ్రువీకరించే 15వశతాబ్దపు తెలుగు శాసనం ఉంది. పెద్దిరాజును పాండవుల పెద్దనాన్న ధృతరాష్ట్రుడిలా, పెద్దమ్మను ధృతరాష్ట్రుడి భార్య గాంధారిలా భావించి, ఈ కోటను ‘గాంధారి కోట’గా పిలిచారని చరిత్రకారుల అభిప్రాయం. క్రీ.శ.1300లో కథాగేయంగా ‘గాంధారి కథ’ రచన చేసినట్లు చరిత్రకారులు గుర్తించారు. కాని కవి విషయంలో స్పష్టత లేదు. నిజాం కాలంలో పన్ను వసూళ్ల కోసం స్థానిక గోండు మొకాశీలను నియమించుకున్నట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. 1928లో తొలిసారి గాంధారి కథను ప్రచురించినట్లు ఆధారాలున్నాయి. ఇప్పటికీ గిరిజన కథా గేయాల్లో, జానపదాల్లో ఈ కథ వినిపిస్తుంది.అరుదైనది..గుట్టను తొలిచి కట్టిన కోటగా గాంధారి ఖిల్లాకు దక్షిణ భారతదేశంలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ లోహయుగం నాటి ఆనవాళ్లున్నాయి. కాకతీయ, రాష్ట్రకూటుల కాలం నాటి చారిత్రక సంపద ఉంది. ఇలాంటి అరుదైన కోటలను రక్షించుకుంటే చారిత్రక సంపదతోపాటు, పర్యాటక వనరులనూ కాపాడినట్లవుతుంది. – డా.ద్యావనపల్లి సత్యనారాయణ, తెలంగాణ చరిత్రకారుడు.పర్యాటక కేంద్రంగా..ఎంతో చరిత్ర కలిగిన గాంధారి ఖిల్లాను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధిపరచాలి. దానికి అవసరమైన ఏర్పాట్ల మీద ప్రభుత్వం దృష్టిపెట్టాలి. – మేసినేని రాజయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ నాయకపోడ్ సాంస్కృతిక కళాభివృద్ధి సంఘం. మాఘమాసం జాతర..అనాదిగా గాంధారి ఖిల్లా నాయక్‌పోడ్ తెగకు ఆరాధ్య ప్రాంతంగా కొనసాగుతోంది. తెలంగాణలో ఇదొక ప్రధాన గిరిజన తెగ. వీరిక్కడ ప్రతి మాఘమాసం (ఫిబ్రవరి) భక్తి, శ్రద్ధలతో జాతర జరుపుతారు. ఇది మూడురోజులు సాగుతుంది. మొదటిరోజు సాయంకాలం దేవతా మూర్తులను సదర్‌భీమన్న నుంచి గోదావరికి తీసుకొచ్చి, స్నానం చేయిస్తారు. ఆ రాత్రి ఆటపాటలతో గడిపి, మరుసటిరోజు మధ్యాహ్నం డప్పు చప్పుళ్లతో జాతర ప్రాంతానికి తీసుకెళ్తారు. చివరిరోజు ఖిల్లా పైభాగంలో ఉన్న మైసమ్మ తల్లి వద్ద పట్నాలు వేసి, నైవేద్యం పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. చరిత్రలో నాటి పాలకులు గాంధారి ఖిల్లాను అష్టదిగ్బంధనం చేసిన ఆనవాళ్లున్నాయి. దాని గుర్తుగా పాలకాయలు (కొబ్బరికాయలు), కోడిగుడ్లు, మేకలు, కోళ్లు (గతంలో దున్నపోతులను) బలి ఇచ్చే సంప్రదాయం నేటికీ ఈ జాతరలో కొనసాగుతోంది. దీనికి నాయక్పోడ్లే ప్రధాన పూజారులు. ముగింపులో జీడికోట వద్ద జరిగే దర్బార్(సభ)లో గిరిజనుల కష్టసుఖాలు, గాంధారి ఖిల్లా అభివృద్ధిపై చర్చిస్తారు. ఈ జాతరకు మహారాష్ట్ర నుంచి కూడా గిరిజనులు వస్తారు. జాతర తిరుగువారం మాత్రం నాయకపోడ్లే జరుపుకుంటారు.ప్రకృతి రమణీయతకు నెలవు..మంచిర్యాల వరకు రైల్లో వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఈ కోటను చేరుకోవచ్చు. గుట్టపైకి మాత్రం కాలినడకనే వెళ్లాలి. కోట పరిసర ప్రాంతంలో చెప్పులతో అనుమతించరు. చుట్టూ అడవి, కాలువలు, చెరువులతో రమణీయంగా ఉంటుందీ ప్రాంతం. వన్యప్రాణుల నిలయం. ట్రెక్కింగ్‌కి అనువైన చోటు. పర్యాటకుల సౌకర్యాల కోసం ప్రణాళికలు వేసినా, అవి ముందుకు సాగలేదు. ఎన్‌హెచ్ 363ని ఆనుకుని గాంధారి వనం పేరుతో అటవీ శాఖ ఓ పార్కును అభివృద్ధి చేసింది. ప్రస్తుతం సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్, వెడ్డింగ్ షూట్లు జరుగుతున్నాయి. ‘పరేషాన్’ అనే సినిమాలో టైటిల్ సాంగ్ ‘గాంధారి ఖిల్లా కత్తవా’ అంటూనే మొదలవుతుంది. – ఆకుల రాజు, సాక్షి ప్రతినిధి, మంచిర్యాలఇవి చదవండి: Health: అంతా మెదడులోనే ఉంది.. -
బిడ్డను చూడకుండానే కన్నుమూసిన తల్లి
మంచిర్యాలక్రైం: నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కళ్లనిండా చూసుకోకుండానే కాటికి చేరుకున్న ఘటన సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బెల్లంపల్లికి చెందిన బొల్లు వెంకటేశ్ భార్య రవళిక (26) సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నందిని ఆస్పత్రిలో ప్రసవం నిమిత్తం చేరింది. ఆస్పత్రి వైద్యురాలు సాధారణ డెలివరీ చేయడంతో బాబుకు జన్మనిచ్చింది. సదరు మహిళకు అధిక రక్తస్రావం కావడంతో వైద్యురాలు అర్జంటుగా రక్తం కావాలని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంకటేశ్ బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తం తీసుకు వచ్చే లోగానే వైద్యురాలు నందిని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మహిళను సమీపంలోని మెడిలైఫ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవళిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యురాలు నందిని, మెడిలైఫ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రవళిక మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న సీఐ బన్సీలాల్ సిబ్బందితో కలిసి ఆసుపత్రి వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. -
మంచిర్యాలలో పోలీసులు విస్తృత తనిఖీలు
-
మంచిర్యాలలోని వివేక్ ఇంటి దగ్గర కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
-
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉద్రిక్తత
-
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉద్రిక్తత
-
'అక్షర సేద్యం'.. వికీపీడియాలో 'కొలామి భాష'..!
మంచిర్యాల: ఆధునిక కాలంలో కాలానుగుణంగా తమ భాష, సంస్కృతి ఎక్కడ కనుమరుగవుతుందేమోనన్న తపనతో ఆదివాసీ కొలాం తెగ యువత ముందడుగు వేసింది. కొలామి భాష, తమ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఆలోచనతో వికీపీడియాను వేదికగా ఎంచుకున్నారు. భవిష్యత్ తరాలకు తమ భాష, సంస్కృతి, పదజాలం, జానపద పాటలు, నృత్య కళారూపాలు, చారిత్రాత్మక అస్తిత్వ పరిరక్షణకు తమ వంతు పాత్ర పోషిస్తూ తెలుగు లిపితో కొలాం భాషను వికీపీడియాలో పొందుపరుస్తూ.. పలువురు మన్ననలు పొందుతూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఇది వరకే ఉట్నూర్ కేబీ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఐటీడీఏ పీవో పాల్గొని కొలామి భాషను వికీపీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయడంపై ఐటీడీఏ పీవో చాహత్ బాజ్‌పాయి బోలిచేతో (భాష చైతన్యం) ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. ఆదివాసీల్లో అత్యంత వెనుకబడిన తెగ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 46,677 మంది కొలాం జనాభా ఉన్నారు. ఆదివాసీ తెగల్లో అత్యంత వెనుకబడిన తెగ ఆదివాసీ కొలాం. వారి సంస్కృతి, సంప్రదాయాలకు భిన్నంగా ఉంటాయి. కొలాం తెగకు చెందిన యువకులు, కళాకారులు తమ నైపుణ్యాన్ని వెలికితీసి భాషను నేరుగా వికీపీడియాలోకి మార్చి తమ ఔనత్యాన్ని చాటుతున్నారు. కొలామి భాషతో పాటు మహానీయులు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల చరిత్రను కొలామిలో పొందుపర్చేందుకు సిద్ధమవుతున్నారు. కొలాం సంస్కృతి.. గిరిజన తెగల్లో కొలాం సంస్కృతి, ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. కొలాం ఆదివాసీలు కొలిసే ఆరాధ్యదైవం భీమయ్యక్, నడిదమ్ము, ముత్తేలమ్మ, దండారీ, దూరడి, పొలకమ్మ దేవతులు ముఖ్యమైనవి. వివాహ వేడుకల్లో పాడే జానపదులు ప్రత్యేకంగా ఉంటాయి. కొలాం మహిళలు, పురుషులు ఉత్సవాల సందర్భంగా కొలామి మాతృభాషలో పాడే పాటలు, నృత్య కళారూపాలను కాలానుగుణంగా వివిధ ఉత్సవాలకు సంబంధించిన నృత్యాలు సేకరించి పొందుపర్చనున్నారు. కొలామి వికీపీడియా ప్రస్థానం.. కొలామి వికీపీడియాను జూన్ 28న నేతి సాయి కిరణ్ ప్రారంభించారు. ప్రపంచంలో లిపి లేని ఆదివాసీ భాషలు రోజురోజుకూ అంతరించిపోతున్నాయి. భాష పదజాలం కోసం సంస్కృతి పరిరక్షణకు బోలిచేతో ఫౌండేషన్ స్థాపించారు సాయికిరణ్. భాష కోసం, ఆదివాసీలు సంస్కృతిక పంటలైన చిరుధాన్యాల బాహ్య ప్రపంచానికి తెలియచేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతరిస్తున్న భాషలపై పరిశోధన.. యునెస్కో ప్రకారం ప్రపంచంలో 7వేలకు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ జాబితాలోని చాలా భాషలు అంతరిస్తున్నాయి. వైవిధ్యంగా ఉన్న భాషలు ప్రపంచ భాష వైవిధ్యతను కోల్పోయే దిశలో ఉన్నాయి. భాషను డిజిటల్ మాద్యమాల ద్వారా పునరుద్ధరణ చేయడమే నా లక్ష్యం. – నేతి సాయికిరణ్, తెలుగు వికీపీడియా, బోలిచేతో ఫౌండేషన్, వ్యవస్థాపకుడు, అస్సాం భవిష్యత్‌కు కొలామి వికీపీడియా అవసరం.. తెలుగు వికీపీడియాలోని తెలంగాణలోని జిల్లాలు, మండలాలు, గ్రామాలకు సంబంధించిన సమాచారాన్ని కొలామి భాషలో అనువాదం చేస్తున్నాం. సమకాలిన అంశాలపై రచనలు కొనసాగుతున్నాయి. వికీ బుక్స్‌లో నేను రచించిన కొలాం వీరుడు కుమురం సూరు, దండారీ కై తికాలు, దంతన్‌పల్లి భీమయ్యక్ మహాత్మ్యం, మోతీరాము శతకం పుస్తకాలు పొందుపర్చుతాను. – ఆత్రం మోతీరాం, కొలామి వికీపీడియా, కవి మా జీవన విధానాన్ని వికీలో భద్రపరుస్తాం.. మా కొలాం సంస్కృతికి సంబంధించిన వ్యవహారాలు, దేవుళ్లు, జానపద నృత్యాలు, పాటలు, మా చరిత్రాత్మక స్థానాలు, మా జీవన విధానం, పల్లెలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సేకరించి వికీ కామన్స్‌లో భద్రపరుస్తాను. – ఆత్రం రాజ్‌కుమార్, కొలామి వికీపీడియా ఇష్టంతో అనువాదం.. తెలుగు వికీపీడియాలోని సమాచారాన్ని కొలామి భాషలో అనువాదం చేయడం నాకెంతో ఇష్టం. జాతీయ నాయకులకు సంబంధించిన సమాచారాన్ని కొలామి భాషలో తెలుగు లిపితో అనువాదం చేస్తున్నాం. మా మాతృభాష కొలామి భాషకు సేవా చేయడం నాకెంతో గర్వకారణం. – మడావి జంగు, కొలామి వికీపీడియా వికీపీడియాలోకి.. తెలుగు లిపిని అలంబన చేస్తూ కొలామి భాషకు జీవం పోసి వందలాది వ్యాసాలతో ముందుకు సాగుతూ అంతర్జాతీయ వేదికగా నిర్మితమవుతున్న కొలామి వికీపీడియా అక్షర సేద్యంగా నిలువనుంది. కొలాం తెగ ప్రజలు రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్రలో యావత్మల్ జిల్లాలో నివసిస్తున్నారు. వీరిది ద్రావిడ భాష అయినా కొలామి భాషను మాట్లాడతారు. ప్రభుత్వ రికార్డుల్లో కొలామ్స్ అని నమోదు చేసింది. -
మంచిర్యాల జిల్లాలో పొంగి పొర్లుతోన్న వాగులు, వంకలు
-
భారీ వరదతో కనిపించకుండాపోయిన స్మశానవాటిక
-
చెన్నూరు (ఎస్సీ) రాజకీయ చరిత్ర.. ఎవరెవరు.. ఎప్పుడు.. ఎలా గెలిచారంటే..?
చెన్నూరు రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేత బల్క సుమన్ విజయం సాదించారు. 2014లో ఆయన పెద్దపల్లి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన 2018లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.ఆయన తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ ఐ కు చెందిన బొర్లకుంట వెంకటేష్ నేతపై 28126 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నల్లాల ఓదేలు కు టిఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదు. అది కొంత గొడవ అయినా, ఆ తర్వాత సర్దుకుని బల్క సుమన్ గెలుపొందారు. నల్లాల ఓదేలు మూడోసారి.. ఆ తర్వాత రోజులలో వెంకటేష్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్లో చేరి పెద్దపల్లి నుంచి లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. ఇక్కడ మూడోస్థానం ఆర్పిఐ కి చెందిన సంజీవ్ కు వచ్చింది. ఆయనకు 5274 ఓట్లు వచ్చాయి. 2014లో టిఆర్ఎస్ నేత నల్లాల ఓదేలు మూడోసారి గెలిచారు. 2014 ఎన్నికలలో ఆయన తన సమీప కాంగ్రెస్ఐ ప్రత్యర్ది మాజీ మంత్రి వినోద్‌ను ఓడిరచారు. పెద్దపల్లి ఎమ్.పి వివేక్ సోదరుడు అయిన ఈయన కొంతకాలం క్రితం వరకు టిఆర్ఎస్ లోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్‌ఐలో చేరారు. ఆ తర్వాత వినోద్ బిఎస్పి తరపున బెల్లంపల్లిలో 2018లో పోటీచేసి ఓడిపోతే, వివేక్ బిజెపి పక్షాన పెద్దపల్లి నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమి చెందారు. ఓదేలు రెండువేల తొమ్మిదిలో గెలుపొంది, తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో గెలుపొందారు. తెలంగాణ ఏర్పాటు అయిన నేపద్యంలో తిరిగి 26164 ఓట్ల తేడాతో మూడోసారి ఘన విజయం సాధించారు. 2018లో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. 1962లో నుంచి ఏర్పడిన చెన్నూరు అప్పటి నుంచి ఇప్పటి వరకు రిజర్వుడు నియోజకవర్గంగానే కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఐదుసార్లు గెలుపొందితే, తెలుగుదేశం పార్టీ ఐదుసార్లు గెలవగా మూడుసార్లు టిఆర్ఎస్ విజయం సాధించింది. 1983 తరువాత ఒక్కసారే కాంగ్రెస్ ఐ గెలవగలిగింది. సాధారణ ఎన్నికలలో ఒంటరిగా విజయం.. : మహాకూటమిలో భాగంగా టిఆర్ఎస్ 2009లో పోటీచేసి గెలవగా, ఆ తర్వాత సాధారణ ఎన్నికలలో ఒంటరిగా విజయం సాదించింది. ప్రముఖ కాంగ్రెస్ నేత కోదాటి రాజమల్లు ఇక్కడ మూడుసార్లు గెలిస్తే, అంతకుముందు సిర్పూరులో ఒకసారి, లక్సెట్టిపేటలో మరోసారి గెలిచారు. టిడిపి నేత బోడ జనార్దన్ నాలుగుసార్లు విజయం సాధించగా, ప్రముఖ కార్మికనేత ఏడుసార్లు ఎమ్‌పిగా నెగ్గిన జి. వెంకటస్వామి కుమారుడు వినోద్ 2004లో ఇక్కడ గెలిచి, రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడు కాగలిగారు. కోదాటి రాజమల్లు జలగం క్యాబినెట్లో ఉండగా, జనార్థన్ 1989లో ఎన్టిఆర్ క్యాబినెట్లో ఉన్నారు. చెన్నూరు(ఎస్సీ)లో ఎవరెవరు.. ఎప్పుడు.. ఎలా గెలిచారంటే.. : -
భార్య మరణాన్ని తట్టుకోలేక.. లారీ కిందకు దూకి భర్త సూసైడ్
సాక్షి, మంచిర్యాల జిల్లా: లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక భర్త లారీ కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం పక్కింటి వాళ్లతో గొడవ పడిన భార్య శరణ్య.. పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఆమె చికిత్స పొందుతూ కరీంనగర్ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది. భార్య శవాన్ని ఇంటికి తీసుకువస్తుండగా మధ్య మార్గంలో లక్షిట్ పెట్ ఉత్కూర్ చౌరస్తాలో భర్త మల్లికార్జున్ మనస్తాపంతో లారీ కిందకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. భార్య, భర్తలు ప్రాణాలు కోల్పోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పొవడంతో వారు తీవ్రంగా విలపిస్తున్నారు. చదవండి: సంచలనం... నాగేంద్రబాబు హత్యకు వివాహేతర సంబంధమే కారణం... -
మంచిర్యాల జిల్లాలో నవజాత శిశువు అమ్మకం
-
విద్యుత్ షాక్ తో భార్య భర్తల మృతి
-
పక్షుల వయ్యారంవీక్షకుల విహారం..
జన్నారం: మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని కవ్వాల్ అభయారణ్యంలో రెండురోజులు నిర్వహించిన బర్డ్ వాక్ ఆదివారం ముగిసింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పక్షిప్రేమికులకు అటవీ అధికారులు శనివారం రాత్రి కామన్పల్లి వాచ్‌టవర్, ఘనిశెట్టికుంటల్లో బస ఏర్పాటు చేశారు. ఢిల్లీ, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, జిల్లాలతోపాటు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్, ఫైనార్ట్స్ వర్సిటీ, హైదరాబాద్ ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, కామారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు బర్డ్‌వాక్ లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకు పక్షి ప్రేమికులు కల్పకుంట ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అరుదైన పక్షులను వారు తమ కెమెరాల్లో బంధించారు. ఆసియా, ఐరోపా ఖండాలలో సంచరించే పక్షులు ఇక్కడ కనిపించడం అదృష్టమని హైదరాబాద్‌కు చెందిన ఇర్షాద్, కిశోర్, ఢిల్లీకి చెందిన ఆనందిత తెలిపారు. వివిధ రకాల అరుదైన పక్షులను కవ్వాల్ అటవీ ప్రాంతంలో గుర్తించినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి మైసమ్మ కుంట, ఘనిశెట్టి కుంట ప్రాంతాలలో పర్యటించి అరుదైన పక్షుల ఫొటోలు తీసుకున్నారు. బర్డ్ వాచర్లకు ఎఫ్‌డీవో మాధవరావు, రేంజ్ అధికారులు హఫీజొద్దీన్, రత్నాకర్‌రావు ఏర్పాట్లు చేశారు. అనంతరం గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బర్డ్ వాచర్ల అనుభవాలను తెలుసుకున్నారు. -
భోజనం తినాలంటే భయమేస్తోంది
నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు బుధవారం ఆందోళనకు దిగారు. ప్రతిరోజూ భోజనంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని, ఆ తిండి తినలేక అర్ధాకలితో అలమటిస్తున్నామంటూ ఉదయం అల్పాహారాన్ని బహిష్కరించి విద్యాలయం ఆవరణలో ధర్నా చేపట్టారు. విద్యార్థినులు రోడ్డుపైకి వెళ్లి బైఠాయించేందుకు ప్రయత్నించగా స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఓ) అమూల్య వారిని అడ్డుకుని గేటుకు తాళం వేశారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, డీఈవో వెంకటేశ్వర్లు, ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ రమాదేవి, ఎస్సై రాజశేఖర్ పాఠశాలకు చేరుకుని మూసిఉన్న మెయిన్ గేట్‌ను తెరిపించి లోపలికి వెళ్లారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించకుండా నిత్యం కిచిడీ, టమాటా, నీళ్ల పప్పు, చాలీచాలని అన్నం పెడుతున్నారని విద్యార్థినులు రోదించారు. టిఫిన్ బాగుండడం లేదని ఎస్ఓకు చెబితే ‘ఇంటివద్ద టిఫిన్ తింటారా’ అంటూ తీవ్ర పదజాలంతో దూషిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ టీచర్ పద్మ నుంచి సెల్‌ఫోన్ లాక్కొని తామందరినీ గదిలో నిర్బంధించారని సిబ్బంది పేర్కొన్నారు. దీంతో ఎస్ఓ అమూల్యపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లిలో ఇలానే ప్రవర్తించడంతో సస్పెన్షన్ వేటు పడిందని, మానవతా దృక్పథంతో నెన్నెలకు పంపిస్తే ఇక్కడా అదే పద్ధతి అయితే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఓను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ, కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. -
కక్ష భార్యది.. పథకం అతడిది
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తన భర్త వేరొకరితో సహజీవనం చేస్తూ తమను పట్టించుకోవడం లేదని కక్షగట్టిన భార్య.. తన భర్తతో పాటు మరో ఐదుగురు మంటల్లో బూడిద అయ్యేలా చేసింది. ఈ నెల 17న మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ ఎమ్మెల్యే కాలనీలో ఓ ఇంటికి నిప్పు పెట్టడంతో ఆరుగురు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలు, కాల్‌డేటాలు సేకరిస్తున్నారు. రెండు క్యాన్లలో పెట్రోల్ కొని.. నిందితులు పెట్రోల్ కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 16న రాత్రి 9.53 గంటలకు నస్పూర్‌లోని షీర్కేకు వెళ్లే దారిలో ఉన్న ఓ బంకు నుంచి పెట్రోల్ తీసుకెళ్లారు. ఆటోలో రెండు క్యాన్లలో పెట్రోల్, తర్వాత ఆటోలోనూ డిజిల్ పోయించుకుని వెళ్లారు. ఆ సమయంలో డ్రైవర్‌తో పాటు లోపల మరొకరు కూర్చున్నారు. అతనే బంకు సిబ్బందికి రూ.5 వేల వరకు ఇచ్చాడు. రెండు క్యాన్లలో 40 లీటర్ల వరకు కొనుగోలు చేశారు. పక్కా పథకం ప్రకారమే పెట్రోల్ తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. లక్షల మొత్తం ఆశ చూపి..: మృతుడు శాంతయ్య భార్య సృజనకు దగ్గరి వ్యక్తిగా ఉన్న లక్సెట్టిపేట వాసి, కాంగ్రెస్ కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓటమిపాలైన రియల్ వ్యాపారి అన్నీ తానై వ్యవహరించాడు. ఇతనికి పట్టణంలోనే డ్రైవర్‌గా పని చేసే ఓ యువకుడు, గతేడాది జూన్ 2న లక్సెట్టిపేటలో ఓ మహిళ తన భర్తను చంపించిన కేసులో నిందితుడొకరు, వెంకటాపూర్ పరిధిలోని గుడిపెల్లి వ్యక్తి వీరికి సహకరించారు. సృజన సోదరుడైన గోదావరిఖనికి చెందిన కానిస్టేబుల్ పాత్రపైనా విచారణ జరుగుతోంది. ఈ దారుణం చేసేందుకు నిందితులకు లక్షల్లో డబ్బు ఆశ చూపారు. ఆ ఖర్చు సృజన భరించింది. ఆరోజు ఏం జరిగింది.. ఘటన జరిగిన రోజు 9గంటల ప్రాంతంలో సీసీసీలో ఉండే ఆటోడ్రైవర్‌కు ఫోన్ చేసి కిరాయి ఉంది రావాలని, రూ.వెయ్యి ఇస్తామని అడిగారు. అందుకు తాను అన్నం తిని వస్తానని చెప్పాడు. ఆలస్యమవుతోందనడంతో తన ఇంటి పక్కనే ఉన్న మరో ఆటో డ్రైవర్‌ను పంపాడు. బంకుకు వెళ్లి పెట్రోల్ తీసుకుని ఇద్దరు చెప్పినట్లుగా వెంకటాపూర్ వైపు తీసుకెళ్లాడు. ఘటన స్థలానికి కొద్ది దూరంలోనే ఆటో నిలిపి..‘మాకు గొడవలు జరుగుతున్నాయి. ఇంకొకరు రావాల్సి ఉంది. నీవు వెళ్లు..’ అని అతడిని పంపించారు. తర్వాత అక్కడ గుడిపెల్లికి చెందిన మరొకరి సాయంతో శివయ్య ఇంటివైపు వెళ్లారు. స్థానికుడి సాయంతో పెట్రోల్‌ను ఇంటిపైన, చుట్టూ చల్లి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. మరిన్ని ఆధారాల కోసం.. ఆదివారం రాత్రి వరకు ఏడుగురిని కాసిపేట పోలీసుస్టేషన్లో ఉంచారు. శాంతయ్య భార్య, కూతురు, ఆటోడ్రైవర్, రియల్ వ్యాపారి, మరో ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నా రు. నిందితులు చెబుతున్న ప్రకారం పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసేందుకు సిద్ఢమవుతున్నారు. వివరాలు బయటకు వెల్లడించడం లేదు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. మొదట అనుమానాస్పద మృతి కేసు న మోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ, ఫోన్ కాల్‌డేటా, నిందితుల చెప్పిన వివరాలు, ఘటన స్థలంలో లభ్యమైన ఆధారాలతో హత్యానేరంగా సెక్షన్లు చేర్చి ముందుకు సాగుతున్నారు. కేసు విచారణ వేగంగా కొనసాగుతోందని, అన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. భార్యాభర్తల మధ్య డబ్బు గొడవలు! లక్సెట్టిపేట మండలం ఊత్కూరులో శాంతయ్య తండ్రికి వారసత్వంగా వచ్చిన 1.15ఎకరాల భూమి వివాదం ఉంది. ఈ భూమిని కొందరు వెంచరు వేయగా ఇరువర్గాల్లో భూ హక్కులపై తగాదా ఉంది. ఇటీవల ఈ కేసులో రాజీ కుదరడంతో రూ.90 లక్షలు వచ్చాయి. ఇందులో ఐదు వాటాలు వేస్తే శాంతయ్య వాటాగా రూ.12 లక్షలు వచ్చాయి. అప్పటినుంచి శాంతయ్య, సృజన మధ్య గొడవలు తారస్థాయికి చేరాయని, ఈ కక్షలే చంపేవరకు తీసుకెళ్లాయని తెలుస్తోంది. శాంతయ్యకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. ఆర్కే5లో మైనింగ్ సర్దార్‌గా పని చేస్తున్న ఆయనకు మరో ఏడేళ్ల సర్వీసు ఉంది. ఈలోపే దారుణం జరిగింది. -
సజీవ దహనం కేసులో షాకింగ్ నిజాలు.. వివాహేతర సంబంధమే కారణం?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా వెంకటాపూర్‌లో ఆరుగురి సజీవదహనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు వెనుక వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ఘటనలో మృతి చెందిన శాంతయ్య భార్య, బంధువులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే శాంతయ్య భార్యతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆస్తి, సింగరేణి వారసత్వ ఉద్యోగం కోసం ప్రియుడితో కలిసి భర్త శాంతయ్యను భార్య హత్య చేయించినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. నస్పూర్, వెంకటాపూర్‌లో స్థానికులు చెప్తున్న వివరాల మేరకు.. వెంకటాపూర్‌కు చెందిన మాసు శివయ్య ఆ గ్రామ వీఆర్ఏ, అతడి భార్య రాజ్యలక్ష్మి (పద్మ) గృహిణి. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కుమారుడు సందీప్ నస్పూర్‌లో ఉంటున్నాడు. ఇక లక్సెట్టిపేట మండలం ఊత్కూరుకు చెందిన సింగరేణి కార్మికుడు శనిగరపు శాంతయ్య నస్పూర్‌లో నివాసం ఉంటూ ఆర్కే5 బొగ్గు గనిలో పనిచేస్తున్నాడు. వెంకటాపూర్‌కు సమీపంలోనే బొగ్గుగని ఉండగా.. కూలిపనులకు వెళ్లే క్రమంలో రాజ్యలక్ష్మి దంపతులకు శాంతయ్యతో పరిచయం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యం పెరిగి శాంతయ్య వారి ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాడు. రాజ్యలక్ష్మితో శాంతయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని అతడి భార్య సృజన పంచాయితీ పెట్టింది. శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆ కుటుంబాలకు పలుమార్లు కౌన్సెలింగ్ కూడా జరిగింది. డబ్బు రేపిన చిచ్చుతో.. శాంతయ్య–సృజన దంపతులకు ఒక కుమార్తు, ఇద్దరు కుమారులు ఉన్నారు. శాంతయ్య సింగరేణి ఉద్యోగి కావడంతోపాటు సొంతూరులో భూములు ఉన్నాయి. ఇటీవల కొంత భూమి విషయంలో వాటాగా రూ.12 లక్షలు వచ్చాయి. అందులో కుమార్తె పేరిట రూ. 5లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి, మిగతా సొమ్ము తన వద్దే పెట్టుకున్నాడు. తనకు, కుమారులకు డబ్బులు ఇవ్వకుండా.. రాజ్యలక్ష్మితో ఉంటూ వారికి డబ్బులు ఇస్తున్నాడని సృజన గొడవపడింది. దీనికితోడు నాలుగు నెలలుగా శాంతయ్య వెంకటాపూర్‌లోనే ఉండిపోవడం, డ్యూటీకి సరిగా వెళ్లకపోవడంతో కక్షపెంచుకున్నట్టు తెలిసింది. ఇదీ చదవండి: మంచిర్యాల ప్రమాదంపై షాకింగ్ నిజాలు.. కారణం అదేనా? -
వెంకటాపూర్ సజీవదహనం కేసును ఛేదించిన పోలీసులు
-
వెంకటాపూర్ సజీవదహనం కేసు కీలక మలుపు
-
అర్ధరాత్రి అగ్నిప్రమాదం తో ఉలిక్కిపడ్డ మంచిర్యాల జిల్లా
-
మంచిర్యాల ప్రమాదంపై షాకింగ్ నిజాలు.. కారణం అదేనా?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: శుక్రవారం అర్ధరాత్రి.. అంతా గాఢనిద్రలో ఉన్నారు.. ఇంట్లో ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి.. కొద్దిసేపట్లోనే ఇల్లంతా వ్యాపించాయి. పొగ, ఊపిరాడని పరిస్థితి.. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు సజీవదహనం అయ్యారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామక్రిష్ణాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ ఎమ్మెల్యే కాలనీలో ఈ ఘటన జరిగింది. పెంకుటింట్లో నిద్రిస్తున్న మాసు శివయ్య (47), ఆయన భార్య రాజ్యలక్ష్మి అలియాస్ పద్మ (42), సింగరేణి కారి్మకుడు శనిగరపు శాంతయ్య అలియాస్ సత్తయ్య (54), నెమలికొండ మౌనిక (30), ఆమె కుమార్తెలు ప్రశాంతి (3), హిమబిందు (13నెలలు) మంటల్లో కాలిపోయారు. వీరంతా దళితులు కావడం, ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టినట్టుగా ఆధారాలు ఉండటంతో కలకలం రేగింది. వివాహేతర/సహజీవన సంబంధం నేపథ్యంలోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అర్ధరాత్రి నిద్ర లేపిన పొగ శుక్రవారం అర్ధరాత్రి దట్టమైన పొగ, కాలిన వాసన రావడంతో మాసు శివయ్య ఇంటి పక్కనే ఉన్న పొన్నాల ముకుందం లేచి బయటికి వచ్చాడు. అప్పటికే శివయ్య ఇల్లు కాలిపోతోంది. వెంటనే తన భార్యాపిల్లలను నిద్రలేపి బయటికి తీసుకెళ్లాడు. వాళ్లు బిగ్గరగా కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని నిద్రలేపారు. వెంటనే అంతా కలిసి బిందెలు, బకెట్లతో నీటిని చల్లుతూ.. బాధిత కుటుంబీకులు, బంధువులు, పోలీసు, అగి్నమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రాత్రి 1.26 గంటలకు బెల్లంపల్లి అగి్నమాపక కేంద్రానికి సమాచారం చేరింది. రాత్రి 2 గంటల సమయంలో ఫైరింజన్ ఘటనా స్థలానికి చేరుకుంది. సుమారు గంటపాటు శ్రమించి మంటలను ఆర్పారు. సిమెంటు ఇటుకలతో నిర్మించిన గోడలతో పైన కలప దుంగల ఆధారంగా కట్టిన పెంకుటిల్లు అది. మంటలకు దుంగలు కాలిపోయి.. పైకప్పు కూలిపోయింది. ఇంట్లో మొత్తం మూడు గదులు ఉండగా.. ఒక గదిలో ముగ్గురి, మధ్యలో గదిలో ఒకరి, మూడో గదిలో మరో ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. ఇంట్లో ఉన్న ఇనుప బీరువా, గ్యాస్ సిలిండర్, వంట సామగ్రి, వ్రస్తాలు అన్నీ పూర్తిగా దహనమైపోయాయి. పెట్రోల్ క్యాన్లు.. కారంపొడి దళిత కుటుంబం సజీవ దహనం విషయం తెలియడంతో.. డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ తిరుపతిరెడ్డి, మందమర్రి, బెల్లంపల్లి టౌన్ సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి వచ్చారు. ఫోరెన్సిక్, క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేయగా.. ఇంటి వెనుకాల ఉన్న రోడ్డు నుంచి జైపూర్ మండలం రసూల్‌పల్లి వైపు పరుగెత్తింది. అయితే ఆటోలో కారంపోడి, ఇంటి వెనకాల చెట్టు కింద రెండు పెట్రోల్ క్యాన్లు కనిపించడంతో.. ఎవరో ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. శివయ్య కుమారుడు సందీప్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. మృతదేహాలకు ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం పూర్తిచేశారు. ఐదుగురి మృతదేహాలను బంధువులకు అప్పగించగా.. శుక్రవారం సాయంత్రం గ్రామశివార్లలోనే అంత్యక్రియలు నిర్వహించారు. శాంతయ్య మృతదేహం కోసం కుటుంబ సభ్యులెవరూ రాకపోవడంతో ప్రభుత్వ మార్చురీకి తరలించారు. కాగా.. బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పరామర్శించి ఓదార్చారు. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చుట్టపు చూపుగా వచ్చి ప్రాణాలు పోయి.. మాసు శివయ్య, రాజ్యలక్ష్మి భార్యాభర్తలుకాగా.. శాంతయ్య సింగరేణి ఆర్కే5 గనిలో కారి్మకుడు. అతను కొంతకాలం నుంచి శివయ్య కుటుంబంతోనే నివసిస్తున్నట్టు బంధువులు చెప్తున్నారు. ఇక రాజ్యలక్ష్మి అక్క కుమార్తె మౌనిక, ఆమె ఇద్దరు పిల్లలు చుట్టపు చూపుగా మూడు రోజుల క్రితం వచ్చారు. మౌనిక భర్త రెండేళ్ల కిందే చనిపోయాడు. కోటపల్లి మండలం కొండంపేటలోని తల్లిగారింట్లో ఉంటూ కూలిపనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. ఈ ఘటనలో ఆమె, పిల్లలు కూడా బలయ్యారు. అయితే శుక్రవారం సాయంత్రం రాజ్యలక్ష్మి తల్లిదండ్రులు బత్తుల లింగయ్య, కమల కూడా వెంకటాపూర్‌లోని ఇంటికి వచ్చారు. అయితే లింగయ్యకు మద్యం, పొగాకు అలవాటు ఉండటంతో.. ఆ వాసన పడదని, తెలిసినవారి ఇంట్లో నిద్రపోవాలని రాజ్యలక్ష్మి చెప్పింది. వారు వేరేవాళ్ల ఇంట్లో నిద్రపోవడంతో దుర్ఘటన నుంచి బయటపడ్డారు. వచ్చే సరికే దారుణం జరిగిపోయింది ఇల్లు ఎలా కాలిపోయిందో తెలియడం లేదని.. నస్పూర్‌లో ఉండే తనకు రాత్రి ఒంటి గంటకు ఫోన్ చేస్తే వెంకటాపూర్‌కు వచ్చానని శివయ్య కుమారుడు సందీప్ కన్నీళ్లు పెట్టాడు. ‘‘మాకు రాత్రి ఒంటి గంట సమయంలో ఇల్లు కాలిపోతోందని తెలిసింది. వెంటనే పరిగెత్తుకు వచ్చాం. నీళ్లు పోస్తూ మంటలు ఆర్పాం. కానీ అందరినీ కోల్పోయాం.’’ అని శివయ్య పెద్ద కుమార్తె భర్త నారమల్ల శ్రీనివాస్ వాపోయాడు. మేం వచ్చే సరికి ఇల్లు కూలిపోయింది ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడం మొదలుపెట్టాం. కానీ అప్పటికే మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఇంటి పైకప్పు కూలిపోయి ఉంది. – కె.రవీందర్, బెల్లంపల్లి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ (17ఎంసీఎల్321) లేచి చూసే సరికే భారీగా మంటలు మా ఇంట్లోకి పొగలు, వాసన రావడంతో నిద్రలేచి చూశాను. అప్పటికే శివయ్య ఇల్లు మంటల్లో కాలిపోతోంది. చుట్టుపక్కల వారిని నిద్రలేపి.. అంతా కలిసి నీళ్లు చల్లడం మొదలుపెట్టాం. కానీ అప్పటికే లోపల ఉన్నవారు కాలిపోయి ఉంటారు. – పొన్నాల ముకుందం, ప్రత్యక్ష సాక్షి (17ఎంసీఎల్322) అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం ఇల్లు దహనమై ఆరుగురు మృతిచెందడంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. సాంకేతిక, వైద్య, ఫోరెన్సిక్‌తో ఆధారాలు సేకరిస్తున్నాం. ప్రమాదమా? కుట్ర కోణమేమైనా ఉందా? అనేది విచారణ చేస్తున్నాం. – అఖిల్ మహాజన్, డీసీపీ, మంచిర్యాల (17ఎంసీఎల్324). వివాహేతర సంబంధమే కారణమా? సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా వెంకటాపూర్‌లో ఆరుగురి సజీవదహనం వెనుక వివాహేతర సంబంధమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనలో మృతి చెందిన శాంతయ్య భార్య, బంధువులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. నస్పూర్, వెంకటాపూర్‌లో స్థానికులు చెప్తున్న వివరాల మేరకు.. వెంకటాపూర్‌కు చెందిన మాసు శివయ్య ఆ గ్రామ వీఆర్ఏ, అతడి భార్య రాజ్యలక్ష్మి (పద్మ) గృహిణి. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కుమారుడు సందీప్ నస్పూర్‌లో ఉంటున్నాడు. ఇక లక్సెట్టిపేట మండలం ఊత్కూరుకు చెందిన సింగరేణి కార్మికుడు శనిగరపు శాంతయ్య నస్పూర్‌లో నివాసం ఉంటూ ఆర్కే5 బొగ్గు గనిలో పనిచేస్తున్నాడు. వెంకటాపూర్‌కు సమీపంలోనే బొగ్గుగని ఉండగా.. కూలిపనులకు వెళ్లే క్రమంలో రాజ్యలక్ష్మి దంపతులకు శాంతయ్యతో పరిచయం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యం పెరిగి శాంతయ్య వారి ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాడు. రాజ్యలక్ష్మితో శాంతయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని అతడి భార్య సృజన పంచాయితీ పెట్టింది. శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆ కుటుంబాలకు పలుమార్లు కౌన్సెలింగ్ కూడా జరిగింది. డబ్బు రేపిన చిచ్చుతో.. శాంతయ్య–సృజన దంపతులకు ఒక కుమార్తు, ఇద్దరు కుమారులు ఉన్నారు. శాంతయ్య సింగరేణి ఉద్యోగి కావడంతోపాటు సొంతూరులో భూములు ఉన్నాయి. ఇటీవల కొంత భూమి విషయంలో వాటాగా రూ.12 లక్షలు వచ్చాయి. అందులో కుమార్తె పేరిట రూ. 5లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి, మిగతా సొమ్ము తన వద్దే పెట్టుకున్నాడు. తనకు, కుమారులకు డబ్బులు ఇవ్వకుండా.. రాజ్యలక్షి్మతో ఉంటూ వారికి డబ్బులు ఇస్తున్నాడని సృజన గొడవపడింది. దీనికితోడు నాలుగు నెలలుగా శాంతయ్య వెంకటాపూర్‌లోనే ఉండిపోవడం, డ్యూటీకి సరిగా వెళ్లకపోవడంతో కక్షపెంచుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే శాంతయ్యను, శివయ్య కుటుంబాన్ని అంతం చేయాలని కొందరు బంధువులతో కలిసి ప్లాన్ చేసినట్టు సమాచారం. శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ఓ బంకు నుంచి పెట్రోల్ తీసుకొచ్చి ఇంటిపై చల్లి నిప్పుపెట్టారని.. ఈ మేరకు పెట్రోల్ తీసుకొస్తున్నవారి సీసీ కెమెరా పుటేజీ దొరికిందని తెలిసింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. అయితే పోలీసులు అధికారికంగా ఈ వివరాలను ధ్రువీకరించలేదు. ఆధారాలు సేకరించాక వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. -
అర్ధరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలు.. ఆరుగురు సజీవ దహనం
సాక్షి, మంచిర్యాల: అర్ధరాత్రి ఇంట్లో మంటలు చెలరేగి కుటుంబం మొత్తం సజీవ దహనమైన విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని మందమర్రి మండలం గుడిపల్లి వెంకటాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పెంకుటిల్లు కావడం, మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడిన క్రమంలో నిద్రలోనే మాంసం ముద్దలుగా మారిపోయారు. ఈ ప్రమాదంలో కుటుంబంలోని ఆరుగురు మరణించగా.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతులు శివయ్య, ఆయన భార్య పద్మ, చిన్నారులు ప్రీతి(4), హిమబిందు(2) మరో వ్యక్తి కాంతయ్యగా గుర్తించారు. మృతదేహాలను గుర్తించిన తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. వీడియోలు వైరల్.. నవీన్‌రెడ్డి సోదరుడి అరెస్ట్ -
మంచిర్యాల జిల్లాలో అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం
-
మంచిర్యాల–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వేకు లైన్ క్లియర్.. రూట్ మ్యాప్ ఇలా..
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిర్మించతలపెట్టిన కొత్త యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు మార్గం సుగమమైంది. మంచిర్యాల–నుంచి విజయవాడ వరకు నాలుగు వరుసలతో నిర్మించే ఈ కొత్త జాతీయ రహదారికి అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. పర్యావరణ అభ్యంతరాలు, భూసేకరణపై నిరసనలతో ప్రజాభిప్రాయ సేకరణ సభలు పూర్తి రసాభాసగా జరగటంతో రోడ్డు నిర్మాణం చిక్కుల్లో పడింది. కానీ, పర్యావరణానికి నష్టం జరగని విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేసిన అధికారులు, భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలను తోసిపుచ్చారు. ఫలితంగా ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయినట్టుగా ప్రకటించి 3 డీ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ల జారీతో.. సాంకేతికంగా టెండర్ల ప్రక్రియకు ఉన్న అవాంతరాలు దూరం కావటంతో టెండర్లకు శ్రీకారం చుట్టారు. తాజాగా మంచిర్యాల–వరంగల్ మధ్య 112 కి.మీ. దూరానికి సంబంధించిన నిడివిని మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. వరంగల్–ఖమ్మం మధ్య 108 కి.మీ. దూరాన్ని రెండు లేదా మూడు ప్యాకేజీలుగా విభజించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ఆ టెండర్లు కూడా పిలవబోతున్నారు. ఆ వెంటనే ఖమ్మం–విజయవాడ మధ్య కూడా ప్యాకేజీలు నిర్ధారించి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి–మార్చి నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి వర్క్ఆర్డర్ ఇవ్వనున్నారు. వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహారాష్ట్ర–తెలంగాణ–ఏపీ ఈ కొత్త జాతీయ రహదారి మూడు రాష్ట్రాల మీదుగా సాగనుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మొదలై తెలంగాణలోని ఆసిఫాబాద్–మంచిర్యాల–వరంగల్–ఖమ్మంల మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వరకు కొనసాగుతుంది. నాగ్‌పూర్ నుంచి తెలంగాణలోని ఆసిఫాబాద్ మీదుగా మంచిర్యాల వరకు ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ భాగంలో ఇప్పటికే ఉన్న రహదారులను విస్తరిస్తున్నారు. మంచిర్యాల నుంచి పూర్తి కొత్త రోడ్డుగా రూపుదిద్దుకుంటుంది. నాలుగు వరుసలకే పరిమితం.. సాధారణంగా ఓ కొత్త రోడ్డును నిర్మించేప్పుడు, భవిష్యత్తులో దాన్ని మరింత విస్తరించేందుకు వీలు కలి్పంచేలా అదనంగా భూమిని సేకరిస్తారు. కానీ ఈ రోడ్డును మాత్రం నాలుగు వరుసలకే పరిమితం చేయాలని నిర్ణయించారు. దీంతో.. నాలుగు వరుసలకు సరిపడా 45 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేశారు. ఆరు వరుసలకు విస్తరించాలంటే మరో 15 మీటర్ల వెడల్పుతో భూమి అవసరమవుతుంది. కానీ అదనపు వరుసలకు ఎలాంటి భూమిని సేకరించటం లేదు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే నాగ్‌పూర్‌తో పాటు పూర్వపు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన వాహనాలు విజయవాడకు ఈ రోడ్డునే వినియోగిస్తాయి. ఫలితంగా ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉన్న జాతీయ రహదారిపై భారం బాగా తగ్గుతుంది. కొత్త జాతీయ రహదారి కోసం 1,550 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇందుకు రూ.1,500 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. రోడ్డు నిర్మాణానికి రూ.8,500 కోట్ల వ్యయం కానుందని తాజాగా అంచనా వేశారు. అనుసంధానమయ్యే ప్రధాన పట్టణాలు ఇవీ.. మంచిర్యాల–వరంగల్: నిడివి 112 కి.మీ. ప్రధాన పట్టణాలు: మంచిర్యాల, మంథని, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, వరంగల్, పరకాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర వరంగల్–ఖమ్మం: నిడివి 108 కి.మీ. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఊరుగొండ, గీసుగొండ, మచ్చాపూర్, సంగెం, నెక్కొండ, పర్వతగిరి, వెంకటయ్యపాలెం ఖమ్మం–విజయవాడ: నిడివి 91 కి.మీ. ఖమ్మం, కృష్ణా జిల్లా సిరిపురం, తునికిపాడు, ఆత్కూరు, రెమిడిచెర్ల, దుగ్గిరాలపాడు, జక్కంపూడి. -
నా భర్త పెద్ద సైకో!: లేఖ రాసి.. హెడ్ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
నస్పూర్(మంచిర్యాల): భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రవికుమార్, మృతురాలు రాసిన సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న వివరాల ప్రకా రం పట్టణ పరిధిలోని నాగార్జున కాలనీలో నివాసం ఉండే ఆకుదారి కిష్టయ్య తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య వనిత (35) కూతుర్లు వర్షశ్రీ, చరితశ్రీ, కుమారుడు కృష్ణవంశీ ఉన్నారు. కిష్టయ్య భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతుండేవాడు. సోమవారం కిష్టయ్య పని నిమిత్తం బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసేసరికి వనిత ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతురాలి తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. వాగ్వాదానికి దిగిన స్థానికులు వనిత ఆత్మహత్యకు భర్త కిష్టయ్యనే కారణమని, అతడిని ఇక్కడికి తీసుకురావాలని స్థానికులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించకుండా అడ్డుకున్నారు. ఎస్సై రవి కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ వారికి సర్దిచెప్పారు.