
సాక్షి, మంచిర్యాల: అర్ధరాత్రి ఇంట్లో మంటలు చెలరేగి కుటుంబం మొత్తం సజీవ దహనమైన విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని మందమర్రి మండలం గుడిపల్లి వెంకటాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పెంకుటిల్లు కావడం, మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడిన క్రమంలో నిద్రలోనే మాంసం ముద్దలుగా మారిపోయారు. ఈ ప్రమాదంలో కుటుంబంలోని ఆరుగురు మరణించగా.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతులు శివయ్య, ఆయన భార్య పద్మ, చిన్నారులు ప్రీతి(4), హిమబిందు(2) మరో వ్యక్తి కాంతయ్యగా గుర్తించారు. మృతదేహాలను గుర్తించిన తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. వీడియోలు వైరల్.. నవీన్‌రెడ్డి సోదరుడి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment