House Fire
-
లండన్‌లో ప్రవాసభారతీయుని ఇంట్లో మంటలు..
లండన్: లండన్‌లోని భారత సంతతి వ్యక్తికి చెందిన ఇంట్లో ఆదివారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఆదివారం రాత్రి దీపావళి వేడుకలు జరుపుకున్న కాసేపటికే ఈ విషాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలారి్పన అనంతరం ఫస్ట్ ఫ్లోర్లో ఐదు మృతదేహాలు పడి ఉండగా గుర్తించినట్లు చెప్పారు. కాగా, మాంచెస్టర్‌కు చెందిన దిలీప్ సింగ్(54) మాట్లాడుతూ..అది తన బావమరిది ఇల్లు కాగా, అందులో భార్య, ముగ్గురు పిల్లలతో ఆయన ఉంటున్నారన్నారు. మరో ఇద్దరు అతిథులు కూడా ఘటన సమయంలో ఉన్నట్లు తెలిపారు. ఆ కుటుంబం ఇటీవల బెల్జియం నుంచి లండన్‌లోని కొత్త ఇంటికి మకాం మార్చినట్లు చెబుతున్నారు. -
తల్లి, ఐదుగురు చిన్నారులు సజీవదహనం
కుషినగర్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాలో బుధవారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటికి నిప్పంటుకుని ఇంట్లో నిద్రిస్తున్న తల్లి, అయిదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులంతా 1–10 ఏళ్లలోపు వారే. ఉర్ధా గ్రామానికి చెందిన సంగీత, ఆమె అయిదుగురు పిల్లలు ఇంట్లో పడుకోగా, ఆమె భర్త, అతడి తల్లిదండ్రులు ఆరు బయట నిద్రించారు. గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. మంటలు అంటుకోవడంతో ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలింది. సంగీత భర్త వారిని కాపాడేందుకు ప్రయత్నించినా మంటల తీవ్రత కారణంగా వీలు కాలేదు.సంగీతతోపాటు ఏడాది నుంచి 10 ఏళ్ల వరకు వయస్సున్న చిన్నారులు మంటలకు ఆహుతయ్యారు. ఫైరింజన్ వచ్చే సరికే ఈ ఘోరం జరిగిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. -
అర్ధరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలు.. ఆరుగురు సజీవ దహనం
సాక్షి, మంచిర్యాల: అర్ధరాత్రి ఇంట్లో మంటలు చెలరేగి కుటుంబం మొత్తం సజీవ దహనమైన విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని మందమర్రి మండలం గుడిపల్లి వెంకటాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పెంకుటిల్లు కావడం, మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడిన క్రమంలో నిద్రలోనే మాంసం ముద్దలుగా మారిపోయారు. ఈ ప్రమాదంలో కుటుంబంలోని ఆరుగురు మరణించగా.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతులు శివయ్య, ఆయన భార్య పద్మ, చిన్నారులు ప్రీతి(4), హిమబిందు(2) మరో వ్యక్తి కాంతయ్యగా గుర్తించారు. మృతదేహాలను గుర్తించిన తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. వీడియోలు వైరల్.. నవీన్‌రెడ్డి సోదరుడి అరెస్ట్ -
మాజీ ప్రియురాలు పెళ్లి చేసుకుంటుందన్న కోపంతో...ఆమె కాబోయే భర్తకి..
తన మాజీ ప్రియురాలు మరోకర్నీ పెళ్లి చేసుకుంటుందన్న కోపంతో ఆమె కాబోయే భర్త ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...సింగపూర్‌లోని భారత సంతతికి చెందిన వ్యక్తి సురెంధిరన్ సుగుమారన్ తన మాజీ ప్రియురాలు వేరొకరిని పెళ్లి చేసుకోబోతుందని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుసుకున్నాడు. దీంతో అసూయతో, కోపంతో రగిలిపోయి.. ఆమె కాబోయే భర్త ఇంటికి వెళ్లి నిప్పంటించాడు. మరుసటి రోజు పెళ్లి ఉందనంగా ఈ ఘటనకు పాల్పడ్డాడు సుగుమారన్. ఐతే అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఇదంతా రికార్డు అయ్యింది. ఈ ఘటనకు పాల్పడినప్పుడూ...తనను గుర్తుపట్టకుండా ఉండేలా నల్లటి ముసుగు ధరించాడు. అలాగే ఫ్లాట్ నుంచి బయటకు రాకుండా ఉండేలా గేటుకి తాళం వేశాడు. ఆ తర్వాత ఫ్లాట్ కాలిపోయింది అని నిర్ధారించుకున్నాక పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించాడు.ఐతే పోలీసులు వెంటనే కేసును చేధించి నిందితుడు సుగుమారన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించడమే కాకుండా కేసు నుంచి తప్పించుకునేందుకే మెట్లమార్గం గుండా వెళ్లినట్లు చెప్పాడు. ఈ మేరకు పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపర్చగా...జిల్లా జడ్జీ యూజీన్ టీయో..ఇలాంటి ఘటనలు పక్క ఫ్లాట్‌లో ఉండే వారికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఈ నేరాన్ని ఏ పరిస్థితుల్లో చేసినప్పటికీ, ఇతరులకు ప్రమాదం అని తెలిసి కూడా ఆస్తులను ధ్వంసం చేయడమనేది తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఆస్తులకు నష్టం కలుగుతుంది అని తెలిసి కూడా ఈ ఘటనలకు పాల్పడిన వారికి సుమారు ఏడేళ్లు జైలు శిక్ష, జరిమాన విధించబడుతుందని పేర్కొన్నారు. (చదవండి: చమురు విషయంలో పాక్‌కి గట్టి షాక్ ఇచ్చిన రష్యా) -
Viral Video: దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి
-
దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి
వాషింగ్టన్: మంటల్లో తగలబడుతున్న ఇంట్లోకి దూకి అందులోని వారిని హీరో రక్షించే సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. అలాంటి సంఘటనే అమెరికాలోని అయోవా ప్రాతంలో జరిగింది. మంటల్లో దగ్ధమవుతున్న ఇంట్లోని నలుగురు తోబుట్టువులను రక్షించాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఈనెల 23న జరిగింది. ఇంట్లోని డోర్‌బెల్ కెమెరాలో నమోదైన భయానక దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇంట్లోంచి ప్రాణాలతో బయటపడిన వారిలో 8,14,17,22 ఏళ్ల వయసు వారిగా పోలీసులు తెలిపారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు ఇంటి యజమాని, నలుగురు పిల్లల తల్లి టెండర్ లెమన్. మన జీవితాలు శాశ్వతంగా మారిన రోజు! కానీ, బూడిద నుంచే కదా?? అంటూ రాసుకొచ్చారు. వీడియో ప్రకారం.. మంటల్లోంచి ముగ్గురు పరుగెడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత అగ్ని జ్వాలలు మరింత అలుముకున్నాయి. కొద్ది సేపటికి ముందు నుంచి 22 ఏళ్ల యువకుడు సైతం అందులోంచి బయటకు వచ్చాడు. బ్రెండన్ బ్రిట్ అనే వ్యక్తి తన కారులో వెళ్తూ దారి తెలియక మరో మార్గంలో వెళ్లాడు. ఆ మార్గంలో ఓ ఇల్లు మంటల్లో కాలిపోతుండటాన్ని చూశాడు. వెంటనే అక్కడికి వెళ్లి కిటికీలను పగలగొట్టి లోపల ఎవరైనా ఉన్నారేమో పరీక్షించినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అర్ధరాత్రి సమయం కాబట్టి ఇంట్లో ఎవరైనా ఉండి ఉంటారని భావించానని, వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు బ్రిట్ చెప్పారు. మంటలు తీవ్రమవుతున్న క్రమంలో లోపలి ఉన్న వారిని అలర్ట్ చేసి ఇంటి గుమ్మం గుండా బయటకు పంపించినట్లు తెలిపారు. మరోవైపు.. స్మోక్ అలారం మోగకపోవటంతో తాము గాఢ నిద్రలో ఉన్నామని, బయట నుంచి అరుపులు విని లేచినట్లు బాధితులు తెలిపారు. ఆ సమయంలో వారి తల్లిదండ్రులు వేరే ప్రాంతానికి వెళ్లారని చెప్పారు. ఈ సందర్భంగా బ్రిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు ఇంటి యజమాని లెమన్. ఈ మంటల్లో ఇల్లు పూర్తిగా దగ్ధమైందని, ఐదు పెంపుడు శునకాలు మృతి చెందాయని, మరో రెండు గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. అయితే, ఇంట్లో మంటలు చెలరేగాడానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపట్టినట్లు రెడ్ ఓక్ ఫైర్ విభాగం తెలిపింది. ఇదీ చదవండి: బోల్సోనారో ఓటమి.. బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్వా -
పశ్చిమ గోదావరిలో దారుణం.. ఇంటికి నిప్పుపెట్టిన దుండగులు
సాక్షి, పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న జగనన్న కాలనీలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంటికి నిప్పుపెట్టారు. నిప్పుపెట్టిన సమయంలో ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు సకాలంలో మంటలార్పటంతో నలుగురికి ప్రాణహాని తప్పింది. సమామచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. -
భార్య డబ్బులు ఇవ్వలేదని అత్తింటికి నిప్పు
సాక్షి, నల్లగొండ: భార్య కాపురానికి రావడం లేదని అత్తింటిని, రెండు బైక్‌లను ఓ అల్లుడు కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటన నల్లగొండ పట్టణ శివారులోని మర్రిగూడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్ ఎస్ఐ రాజ శేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన వంగూరి సైదులుకు, మర్రిగూడ గ్రామానికి చెందిన సుమలతతో 15 ఏళ్ల కిందట వివాహమైంది. సైదులు తాగుడుకు బానిస కావడంతో భార్య సుమలత ముగ్గురు పిల్లలతో కలిసి మూడేళ్ల నుంచి మర్రిగూడలోని తల్లిదండ్రులకు చెందిన మరో ఇంట్లో ఉంటోంది. ఇకపై తాగనని, సరిగ్గా ఉంటానని చెప్పిన సైదులు నెల రోజుల కిందట భార్య వద్దకు వచ్చి ఉంటున్నాడు. కానీ, ఆ తర్వాత కూడా డబ్బులివ్వాలని, లేదంటే బిడ్డను చంపుతానంటూ బెదిరించేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భార్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తలుపులకు గడియ పెట్టి, బయట ఉన్న రెండు బైక్‌లపై, ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు. బైక్‌ల పెట్రోల్ ట్యాంకులు భారీ శబ్దంతో పేలడంతో ఇంట్లో ఉన్న సుమలత, పిల్లలను తీసుకుని వెనుక తలుపు నుంచి తప్పించుకుంది. ఈ ఘటనలో వాహనాలు పూర్తిగా కాలిపోగా, పూరి గుడిసె ముందుభాగంలో కొంత కాలిపోయింది. -
పెళ్లికి నిరాకరణ, రెచ్చిపోయిన ప్రేమోన్మాది
సాక్షి, తూర్పు గోదావరి : తనతో పెళ్లికి నిరాకరించిందని ఒక ప్రేమోన్మాది తన ప్రియురాలి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన బుధవారం తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదేళ్ల చిన్నారి, మరొక వ్యక్తి సజీవ దహనమాయ్యరు. వివరాల్లోకి వెళితే.. మాదాల శ్రీనివాస్ దుళ్లలో ఉంటున్న తన మేనత్త సత్యవతి కుమార్తెను ప్రేమ పేరుతో నిత్యం యువతిని వేధించేవాడు. పెళ్లి చేసుకుంటానని నాలుగు నెలలుగా వెంటపడడంతో యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఇరు కుటుంబల మధ్య అప్పటినుంచి కలహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సత్యవతి తన కూతురును మరో యువకుడికి ఇచ్చి వాహం జరిపించారు. దీంతో తనతో పెళ్లి జరిపించకపోవడంతో శ్రీనివాస్ యువతి కుటుంబంపై కక్ష పెంచుకొని హతమార్చాలని భావించాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ మంగళవారం అర్థరాత్రి 1.30 గంటకు దుళ్ల గ్రామ శివారులో ఉన్నపెట్రోల్ బంకులోకి బాటిల్లో పెట్రోల్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. కాగా నాలుగు రోజుల క్రితం దుళ్లకు వచ్చిన శ్రీనివాస్ తన మేనత్త సత్యవతిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కడియం పోలీసులకు శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగానే శ్రీనివాస్ తన అత్త సత్యవతి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అప్పటికే గాడ నిద్రలో ఉండడంతో ఐదేళ్ల చిన్నారి విజయలక్ష్మితో పాటు చిన్నారి మేనమామ కోటాను రాము సజీవ దహనం కాగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను, గాయపడిన వారిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. కాగా దుండగుడు శ్రీనివాస్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు -
అమెరికాలో తీవ్ర విషాదం..
కొలిర్‌విల్లి: అమెరికాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ముగ్గురు నల్గొండవాసులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కొలిర్‌విల్‌లో మంగళవారం క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్న వేళ ఇంట్లో మంటలు చేలరేగి ఈ దారుణం జరిగింది. ప్రమాద సమయంలో ఇంట్లో మొత్తం ఆరుగురున్నారు. వీరిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా.. మిగిలిన నలుగురు సజీవ దహనమయ్యారు. చనిపోయిన ముగ్గురు నల్గొండవాసులైన సాత్విక నాయక్, జయసుచిత్ నాయక్, సుహాస్ నాయక్‌గా గుర్తించారు. వీరు నల్గొండ జిల్లా నేరేడుకొమ్మ మండలం గుర్రపు తండా వాసులు. పైచదువుల కోసం ముగ్గురు అన్నాచెల్లెళ్లూ అమెరికాలోని కొలిర్‌విల్లిలో ఉంటున్నారు. నాయక్ కుటుంబం నల్గొండలో మిషనరీస్ తరపున పనిచేస్తోంది. ఉన్నత చదువుల కోసం అగ్ర రాజ్యానికి వెళ్లిన తమ పిల్లలు అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని తెలియడంతో గుర్రపు తండాలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. పండుగ వేడుకల్లో.. అనుకోని విషాదం! క్రిస్మస్ పండుగ సందర్భంగా స్థానిక చర్చి పెద్ద డేనీ ఇంట్లో జరిగిన వేడుకల్లో సాత్విక్ నాయక్, సుహాస్ నాయక్, జయసుచిత్ పాల్గొన్నారు. డేనీ కుటుంబసభ్యులతో కలిసి మొత్తం ఆరుగురు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే, అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్కూట్‌థో ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. అగ్నికీలలు ఒక్కసారిగా ఇంటిని చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో సాత్విక, జయసుచిత్, సుహాస్‌తోపాటు డేనీ భార్య మంటల్లో సజీవ దహనమయ్యారు. డేనీ, అతని కొడుకు మాత్రం అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. -
భారీ అగ్నిప్రమాదం..22 మంది మృతి
బీజింగ్: చైనాలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జిన్హువా పట్టణంలోని ఓ ఇంట్లో ఉదయం 4.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అందరూ గాడ నిద్రలో ఉండటంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. ఈ ఇంట్లో 25 మందికి పైగా అద్దెకు ఉంటున్నట్లు లోకల్ మీడియా పేర్కొంది. -
అయ్యో! దొంగ ఎంత పనిచేశాడు..
సికింద్రాబాద్: నగరంలోని మారేడ్‌పల్లిలో మంగళవారం తెల్లవారుజామున దారుణం వెలుగుచూసింది. ఓ ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగ అక్కడ ఏమి దొరకకపోవడంతో.. ఆగ్రహానికి గురై ఆ ఇంటికే నిప్పు పెట్టాడు. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగతనానికి వచ్చి..ఇంటికి నిప్పు?
హైదరాబాద్‌సిటీ: టోలిచౌకి పరిధిలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో మంటలు ఎగసిపడటంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. దొంగతనానికి వచ్చిన దుండగులు చోరీ అనంతరం నిప్పుపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఇంటి యాజమాని సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంట్లో పేలుడు: 10 మంది సజీవ దహనం
కాబుల్: ఆప్ఘనిస్తాన్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10మంది సజీవ దహనమయ్యారు. హెరాత్ నగరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కాబుల్ స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో మంటలు వ్యాపించటంతో ఇల్లంతా పూర్తిగా కాలిపోయింది. -
ఏడుగురు చిన్నారుల సజీవదహనం
న్యూయార్క్: న్యూయార్క్‌లో బ్రూక్లిన్ కాలేజీ సమీపంలోని ఒక ఇంట్లో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన చిన్నారుల వయసు 5 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. విశ్రాంతిరోజు ఆహారపదార్థాలను వేడిగా ఉంచడానికి అనేక యూదు కుటుంబాలు స్టవ్‌లో ఒకబర్నర్ను వెలిగించి ఉంచుతారు. దీనివల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇంటి రెండు అంతస్తులలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో తల్లితో పాటు 15 ఏళ్ల కుమార్తె కిటికీలోంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. తీవ్రంగా కాలిన గాయాలైన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వందకు పైగా అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. 'నాపిల్లలు ప్రమాదంలో ఉన్నారు రక్షించండి' అంటూ తల్లి కేకలేయడం తాను విన్నాని పొరుగునున్న నాట్ వెబర్ అనే వ్యక్తి విలేకర్లకు తెలిపారు. గత ఏడు సంవత్సరాల కాలంలో నగరంలో జరిగిన అతి పెద్ద విషాద అగ్నిప్రమాద సంఘటన ఇదని ఆయన అన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పిల్లల తండ్రి ఇంట్లో లేరని అగ్నిమాపక అధికారులు తెలిపారు.