![Indian Origin Singaporean Sentenced Jail Fired Girl Friend Fiance House - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/10/Jail.jpg.webp?itok=wM-4OORi)
తన మాజీ ప్రియురాలు మరోకర్నీ పెళ్లి చేసుకుంటుందన్న కోపంతో ఆమె కాబోయే భర్త ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...సింగపూర్‌లోని భారత సంతతికి చెందిన వ్యక్తి సురెంధిరన్ సుగుమారన్ తన మాజీ ప్రియురాలు వేరొకరిని పెళ్లి చేసుకోబోతుందని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలుసుకున్నాడు. దీంతో అసూయతో, కోపంతో రగిలిపోయి.. ఆమె కాబోయే భర్త ఇంటికి వెళ్లి నిప్పంటించాడు. మరుసటి రోజు పెళ్లి ఉందనంగా ఈ ఘటనకు పాల్పడ్డాడు సుగుమారన్.
ఐతే అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఇదంతా రికార్డు అయ్యింది. ఈ ఘటనకు పాల్పడినప్పుడూ...తనను గుర్తుపట్టకుండా ఉండేలా నల్లటి ముసుగు ధరించాడు. అలాగే ఫ్లాట్ నుంచి బయటకు రాకుండా ఉండేలా గేటుకి తాళం వేశాడు. ఆ తర్వాత ఫ్లాట్ కాలిపోయింది అని నిర్ధారించుకున్నాక పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించాడు.ఐతే పోలీసులు వెంటనే కేసును చేధించి నిందితుడు సుగుమారన్‌ని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నేరాన్ని అంగీకరించడమే కాకుండా కేసు నుంచి తప్పించుకునేందుకే మెట్లమార్గం గుండా వెళ్లినట్లు చెప్పాడు. ఈ మేరకు పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపర్చగా...జిల్లా జడ్జీ యూజీన్ టీయో..ఇలాంటి ఘటనలు పక్క ఫ్లాట్‌లో ఉండే వారికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఈ నేరాన్ని ఏ పరిస్థితుల్లో చేసినప్పటికీ, ఇతరులకు ప్రమాదం అని తెలిసి కూడా ఆస్తులను ధ్వంసం చేయడమనేది తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఆస్తులకు నష్టం కలుగుతుంది అని తెలిసి కూడా ఈ ఘటనలకు పాల్పడిన వారికి సుమారు ఏడేళ్లు జైలు శిక్ష, జరిమాన విధించబడుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment