మెక్సికో సిటి: ప్రేమ అనేది ఒక అనిర్వచనీయ అనుభూతి. తమ ప్రేమ చరిత్రలో నిలిచిపోయేందుకు.. కొందరు చారిత్రక కట్టడాలు నిర్మిస్తే.. మరికొందరు అదే ప్రేమను పొందడానికి యుద్ధాలుసైతం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే, ప్రస్తుత సమాజంలో నిజమైన ప్రేమ దొరకడం అనేది ఒక మిథ్య మాదిరిగానే అనే ఉంటుంది.
కొందరు యువతీ యువకులు పాశ్చాత్యధోరణులకు అలవాటుపడి.. తమకు బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ ఉండటం ఒక స్టెటస్ సింబల్‌గా భావిస్తున్నారు. మరికొందరు ఒక అడుగుముందుకు వేసి.. ఒకరికి తెలవకుండా మరి కొందరితో ప్రేమాయణాలు నడిపిస్తున్నారు. కొందరు పవిత్రమైన ప్రేమను తమ అవసరాలకోసం వాడుకుంటూ.. దిగజారీ ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రేమముసుగులో విచ్చలవిడిగా తిరిగి.. ఆ తర్వాత ఏవో కారణాలతో విడిపోయి.. ప్రేమకున్న పరువును బజారుకిడుస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు మనం వార్తల్లో చదువుతునే ఉన్నాం.
ప్రేమను వాడుకోవడంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరూ అతీతులు కారు. కొన్నిచోట్ల అబ్బాయిలు.. అమ్మాయిలను మోసం చేస్తే.. మరికొన్ని చోట్ల అమ్మాయిలు.. అబ్బాయిలను మోసం చేస్తున్నారు. కొందరు నిజమైన ప్రేమికులు తమ ప్రేమ కోసం.. తాము ప్రేమించిన వారి కళ్లలో ఆనందం కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైన వెనుకాడటం లేదు. ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
బాజా కాలిఫోర్నియాకు చెందిన ఉజీల్ మార్టినేస్ అనే వ్యక్తి ఒక యువతిని ప్రేమించాడు. చాలా సంవత్సరాల పాటు వీరి ప్రేమ బాగానే కొనసాగింది. ఈ క్రమంలో ఉజీల్.. ప్రియురాలి తల్లి కిడ్నీసమస్యతో ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరిక్షీంచిన వైద్యులు వెంటనే కిడ్నీని మార్చాలన్నారు. ఆమె ప్రియురాలు ఎంతోగానో బాధపడింది. తన ప్రియురాలి బాధను చూడలేక.. ఉజీల్ తన కిడ్నిని దానం చేయడానికి సిద్ధపడ్డాడు.
ఈ క్రమంలో ఉజీల్కు శస్త్రచికిత్స చేసి అతని కిడ్నీని ప్రియురాలి తల్లికి అమరుస్తారు. ఒకనెల రోజులు గడచిపోయింది. ఉజీల్, ప్రియురాలి తల్లి ఇద్దరు కూడా ఆరోగ్యంతో కొలుకున్నారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స తర్వాత ఉజీల్ ప్రియురాలు అతడినితో మాట్లాడటం మానేసింది. ఈ విధంగా ఒకనెల రోజులు గడిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాత.. తన ప్రియురాలికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైన విషయం ఉజీల్కు తెలుస్తుంది.
దీంతో ఉజీల్ తీవ్ర మానసిక వేదనకు గురౌతాడు. తన ప్రియురాలి చేతిలో మోసపోయాయని తెలుసుకుని కుంగిపోయాడు. కాగా, తన మానసిక క్షోభను టిక్‌టాక్ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. ‘తన ప్రేయసి కళ్లలో ఆనందం కోసం ఇంతటి త్యాగం చేశాను.. ఇలా మోసం చేస్తుందని ఊహించలేకపోయాయని కన్నీటి పర్యంతమయ్యాడు.’ ప్రస్తుతం తాము.. మాట్లాడుకోవట్లేదని.. అలాగని తనను.. వ్యతిరేకించడం కానీ, ద్వేషించడంగానీ చేయట్లేదని చెప్పుకొచ్చాడు. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘నీలాంటి గొప్ప వ్యక్తితో ఉండే అర్హత ఆ అమ్మాయికి లేదు..’, ‘ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు..’, ‘నువ్వు ఏం బాధపడకంటూ’ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ఎన్నికల ప్రచారంతో చీరల వ్యాపారానికి పెరిగిన డిమాండ్!!
Comments
Please login to add a commentAdd a comment