kidney
-
అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు
-
మధుమేహం లేకపోయినా కిడ్నీ వ్యాధి వస్తుందా..?
కిడ్నీ.. మానవ శరీరంలో అతిముఖ్యమైన అవయవం. తినేతిండి, తాగే నీటిని వడకట్టి వడబోసి.. శరీరానికి అవసరమైన శక్తిని రక్తంలోకి, మలినాలను, వ్యర్థాలను మలమూత్రవిసర్జన ద్వారా బయటికి పంపించే ప్రక్రియను కిడ్నీ నిర్వహిస్తుంది. ఇటీవలకాలంలో తెలంగాణ కరీంనగర్ జిల్లాలో కిడ్నీవ్యాధి బాధితులు పెరుగుతున్నారు. పిల్లలు, యువతను సైతం సమస్య వెంటాడుతోంది. అనేక మందికి ముందస్తు లక్షణాలు లేకపోవడం, మధుమేహం లేకపోయినా మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోవడం కనిపిస్తోంది. దశాబ్దకాలంలో వేలాదిమంది మరణాలకు కారణమైన వ్యాధికి ప్రధాన కారణాలు మధుమేహం, అధిక రక్తపోటు కాగా పెయిన్ కిల్లర్స్ అధిక వినియోగం, డీహైడ్రేషన్ మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కథనం.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన పబ్బతి విజయేందర్‌రెడ్డి(55) వ్యవసాయం చేస్తుంటాడు. ఒకరోజు అనూహ్యంగా వాంతులయ్యాయి. కాళ్లు వాపులు వచ్చాయి. వెంటనే కరీంనగర్ వెళ్లగా రక్త పరీక్షలు చేసిన డాక్టర్లు కిడ్నీలు ఫెయిలయ్యాయని నిర్ధారించారు. విజయేందర్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, వారానికి రెండుసార్లు డయాలసిస్ చేశారు. ప్రతిసారీ రూ.5000 చొప్పున నెలకు రూ.40వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అయ్యాయి. విజ యేందర్‌రెడ్డిని ఆస్పత్రిలో అచేతన స్థితిలో చూసిన తమ్ముడు జితేందర్‌రెడ్డి(51) తన రెండు కిడ్నీల్లోని ఒక్కటి ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది. విజయేందర్‌రెడ్డికి జితేందర్‌రెడ్డి కిడ్నీ మ్యాచ్ అయింది. అదిపని చేయడం ప్రారంభించింది. మృత్యుముంగిట అసహాయంగా చేతులు కట్టుకుని నిల్చున్న సోదరుడికి ఆత్మీయ రక్తబంధం పునర్జన్మనిచ్చింది.కిడ్నీలు ప్రతిరోజు దేహంలో 200 లీటర్ల రక్తాన్ని శుభ్రం చేస్తూ, యూరియా, క్రియాటినిన్ లాంటి జీవరసాయనాలను వడపోస్తాయి. కిడ్నీల పనితీరు దాదాపు 70 నుండి 80 శాతానికి పడిపోయే వరకు బాధితులకు ఆ విషయమే తెలియదు. ఒకసారి కిడ్నీలు గనక చెడిపోతే, జీవక్రియల్లో వెలువడే ఎన్నో విషరసాయనాలు దేహంలోనే పేరుకుపోవడం మొదలవుతుంది. దీంతో ప్రాణాలకే ముప్పు తెచ్చి పెడుతుంది. అవగాహన లేమి, నిర్లక్ష్యం, విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్ మందులు వాడకంతో ఉమ్మడి జిల్లాలో జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. మూత్రపిండాలు ఒకసారి దెబ్బతింటే తిరిగి బాగు చేయటం సాధ్యం కాదు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే పాడవకుండా చూసుకోవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గురువారం ‘ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం’ సందర్భంగా కథనం.ఇదీ నేపథ్యం2006లో తొలిసారిగా మార్చి 14న ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఏటా ప్రత్యేక థీమ్‌ని ప్రకటించి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల ఆరోగ్యం, డయాలసిస్ అవగాహన కోసం ఏటా మార్చి రెండవ గురువారం “ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.థీమ్: “మీ మూత్రపిండాలు బాగున్నాయా? ముందుగానే గుర్తించండి.., మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడండి..’' అనేది ఈ ఏడాది నినాదం. కిడ్నీ వ్యాధికి సంబంధించిన ప్రమాద కారకాలు మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ) కుటుంబంలో మూత్రపిండాల వ్యాధి చరిత్ర ఉండడమని వైద్యులు పేర్కొంటున్నారు.కిడ్నీల పనితీరు కీలకంమూత్రపిండాలు మూత్రం తయారీతోపాటు రక్తం వడపోతలో కీలకంగా పనిచేస్తాయి. కణాలు ఉత్పత్తి చేసే ఆమ్లాలను (యాసిడ్)ను బయటకు పంపిస్తాయి. రక్తంలో నీరు, లవణాలు, సోడియం, కాల్షియం, భాస్వరం, పోటాషియం వంటివి సమతుల్యంగా ఉండేలా చేస్తాయి. కిడ్నీలు దెబ్బతింటే ప్రాణాలు కోల్పేయే ప్రమాదం ఉంది. సీరం క్రియాటిన్ పరీక్ష ద్వారా కిడ్నీ పనితీరును తెలుసుకునే వీలుంది. ఏడాదికోసారైనా ఈ పరీక్ష చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలుమూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రక్తపోటు, మధుమేహం, అధిక బరువు వంటివి తలెత్తకుండా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం మానుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి, వ్యాయామం చేయాలి. ఉప్పు తక్కువ తీసుకోవాలి. అధికంగా మాంసం తీసుకోవద్దు. ఆహారంలో సగభాగం పీచు పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి. నొప్పి గోళీలు, అనవసరంగా స్టెరాయిడ్స్ వాడకూడదు.ఉమ్మడి జిల్లాలో మూత్రపిండ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యరంగంలో కిడ్నీ బాధితులకు నామమాత్రపు వైద్య సేవలు అందుతున్నాయి. స్థానికంగా ప్రైవేటు రంగంలో నెఫ్రాలజిస్టులు ఉన్నప్పటికీ సదుపాయాల కొరతతో రోగులు పెద్ద నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ వైద్యశాలల్లో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలు లేవు. చికిత్స మాత్రమే అందిస్తున్నారు.గోదావరిఖని జీజీహెచ్‌తోపాటు పెద్దపల్లి జిల్లా ఆస్పత్రి, మంథని ప్రభుత్వాస్పత్రుల్లో ఐదు మిషన్లు చొప్పున మూడు డయాలసిస్ కేంద్రాలున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద జీజీహెచ్‌లో రోజుకు 16 మందికి నాలుగు షిప్టుల ద్వారా నెలలో 40మందికి, పెద్దపల్లిలో రోజుకు 15 మందికి మూడు షిఫ్టుల చొప్పున నెలకు 33 మంది పేషెంట్లకు, మంథనిలో రోజుకు తొమ్మిది మందికి ఒక షిఫ్టులో నెలలో 9మంది పేషెంట్లకు డయాలసిస్ చేస్తున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా 95మంది కిడ్నీలు (మూత్రపిండాలు) ఫెయిల్ అయి డయాలసిస్‌పై జీవిస్తున్నారు. వందలాది మంది సకాలంలో వైద్యం అందక, కిడ్నీ అందించే రక్తసంబంధీకులు ఎవరూ ముందుకు రాక.. ప్రాణాలు కోల్పోయారు.కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. జిల్లా ఆస్పత్రితో పాటు నగర శివా రులో ఉన్న రెండు వైద్యకళాశాలల్లో సైతం డయాలసిస్ సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నారు.పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దుఈ మధ్య చాలా మంది పేయిన్ కిల్లర్స్, ఇతర హానికరమైన మందులను విచ్ఛలవిడిగా మింగుతున్నారు. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులను వాడకూడదు. నాటు వైద్యం జోలికి వెళ్ల కూడదు. జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్య రుగ్మతలు కిడ్నీ వ్యాధులకు కారణం. సంపూర్ణ ఆరోగ్యం కోసం మన జీవనశైలిని మార్చుకోవాలి. – కుందరాపు గోపికాంత్, యూరాలజిస్టు, గోదావరిఖనిలక్షణాలు తెలియడం లేదుచాలా మంది వ్యాధి ముదిరే వరకు లక్షణాలు తెలియపోవడం వల్ల పరిస్థితి విషమించిన తర్వాత వైద్యం కోసం వస్తున్నారు. తగ్గని జ్వరం, కాళ్లు, ముఖం వాపులు, యూరిన్‌లో ప్రొటీన్లు పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అశ్రద్ధ చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు.– రాంచందర్ తొర్రెం, నెఫ్రాలజిస్టు (చదవండి: డీహైడ్రేషన్‌కు రీహైడ్రేషన్‌తో చెక్..! ఎండాకాలం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..) -
లూపస్ వ్యాధి గురించి తెలుసా? చికిత్స లేకపోతే ఎలా?!
దీర్ఘకాలికమైన, సంక్లిష్టమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి ఒకటి ఉంది దాని పేరే లూపస్. ఇది శరీరంలోని ఏ భాగాన్ని అయినా ప్రభావితం చేస్తుంది. కళ్ళు, చర్మం, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు,రక్త నాళాలు సాధారణంగా ప్రభావితమయ్యే భాగాలు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో అత్యంత సాధారణమైన రకాన్ని సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్(SLE) అని పిలుస్తారు. చర్మంపై దద్దుర్లు, కండరాలు బలహీనత, కీళ్ల వాపు ఇలా శరీరంలోని ఏదో ఒక సమస్యకు గురి చేస్తుంది. అసలు లూపస్ లక్షణాలు ఏంటి? ఎవర్ని ఎక్కుగా బాధించే అవకాశం ఉంది? తెలుసుకుందాం.ఎవరికి లూపస్ వచ్చే అవకాశం ఎక్కువ?ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1000 మందిలో ఒకరు ల్యూపస్ వ్యాధితో బాధపడుతన్నట్టు తెలుస్తోంది. మనదేశంలో ప్రతి లక్ష మందిలో 3.2 మంది ల్యూపస్ బారిన పడ్డారని అంచనా. ఎవరికైనా లూపస్ రావచ్చు, కానీ ఈ వ్యాధి ఎక్కువగా మహిళలను ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి, ఈ వ్యాధి ఉన్న 10 మంది పెద్దలలో 9 మంది మహిళలు ఉన్నారు. ఇది శ్వేతజాతి మహిళలకంటే ఆఫ్రికన్ అమెరికన్, హిస్పానిక్, ఆసియన్ , స్థానిక అమెరికన్ సంతతికి చెందిన మహిళల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చర్మసంబంధమైన లూపస్: చర్మంపై దద్దుర్లు లేదా పుండ్లు వస్తాయి. సాధారణంగా బాగా ఎండధాటికి గురైనపుడు వస్తుంది. అయితే కొన్ని మందులకు రియాక్షన్ వల్ల కూడా ఇది రావచ్చు. సంబంధిత ఔషధం ఆపివేసిన తర్వాత లక్షణాలు తగ్గిపోతాయి.నియోనాటల్ లూపస్ : ఇది శిశువు తన తల్లి నుండి ఆటోఆంటిబాడీలను పొందినప్పుడు సంభవిస్తుంది (ఆటో యాంటిబాడీలు అనేవి రోగనిరోధక ప్రోటీన్లు, ఇవి పొరపాటున ఒక వ్యక్తి సొంత కణజాలాలను లేదా అవయవాలను లక్ష్యంగా చేసుకుని ప్రతిస్పందిస్తాయి). చర్మం, కాలేయం లూపస్ వ్యాధికి సరైన చికిత్స తీసుకుంటే ఆరు నెలల్లోనే నయమయ్యే అవకాశాలున్నాయి. ల్యూపస్ - లక్షణాలు ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ఒకటి ల్యూపస్. మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడినపుడు ఇది దాడి చేస్తుంది.మన ముందే చెప్పుకున్నట్టు ఇమ్యూనిటీ పవర్ తగ్గిన సందర్బంలో ఏ అవయవాన్నైనా ల్యూపస్ వ్యాధి సోకుతుంది. సాధారణంగా చర్మం, జుట్టు, కీళ్లు, కండరాలు, ఎముకలు దీనివల్ల ప్రభావితమవుతాయి. అందుకే చర్మంపై దద్దుర్లు, జుట్టు రాలిపోవడం, కీళ్లలో వాపులు, ఎముకల నొప్పులు, కండరాల పటుత్వం తగ్గిపోతుంది. ఒక్కోసారి జ్వరం కూడా రావచ్చు. లూపస్ ఉన్నవారిలో దాదాపు 50–90శాతం మందిలో తీవ్రమైన అలసట ఉంటుంది. ముఖంమీద బటర్ ఫ్లై ఆకారంలో ర్యాషెస్, నోట్లో పుండ్లు రావచ్చు. జుట్టు ఊడిపోతుంది. ఛాతీలో చొప్పి, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాచి. నాడీ వ్యవస్థ కూడా ప్రభావితమైతే ఆటో ఇమ్యూన్ కణాలు మెదడు పొరలపై దాడిచేస్తాయి. దీంతో వాపు లేదా ఇన్ ఫ్లమేషన్ లక్షణాలు కనిపిస్తాయి. ల్యూపస్ వ్యాధి సోకిన మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలొస్తాయి. అప్పటికే గర్భవతులుగా ఉంటే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. కిడ్నీలు ప్రభావితమైతే కిడ్నీ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది.నిర్ధారణ ఎలా?క్లినికల్ పరీక్షలు, రక్త పరీక్షలతో సహా పూర్తి వైద్య చరిత్ర ,శారీరక పరీక్షను నిర్వహించాలి.. రోగ నిర్ధారణ చేయడానికి వైద్యుడు చర్మం మరియు మూత్రపిండాల బయాప్సీలు (యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ (ఎఎన్ఎ) అనే పరీక్ష ద్వారా లూపస్ వ్యాధిని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. రోగి లక్షణాలు, ఏ అవయవానికి సోకింది అనేదానిపై ఆధారణపడి బయాప్సీ, కిడ్నీ ఫంక్షనింగ్ టెస్టు, బ్రెయిన్ సిటి స్కాన్ లాంటి పరీక్షల ద్వారా వైద్యులు నిర్దారిస్తారు. చికిత్స ఏంటి?నిజం చెప్పాలంటే ల్యూపస్ వ్యాధికి శాశ్వత చికిత్స అంటూ ఏమీ లేదు. ఉపశమన చికిత్స మాత్రమే. సోకిన అవయవం,లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స ఉంటుంది ఏయే అవయవాలపై వ్యాధి ప్రభావం ఉందనే దాన్ని బట్టి రుమటాలజిస్ట్ , నెఫ్రాలజిస్ట్ (మూత్రపిండ వ్యాధి), హెమటాలజిస్ట్ (రక్త రుగ్మతలు), చర్మవ్యాధి నిపుణుడు (చర్మ వ్యాధులు), న్యూరాలజిస్ట్ (నాడీ వ్యవస్థ), కార్డియాలజిస్ట్ (గుండె, రక్తనాళ సమస్యలు) ఎండోక్రినాలజిస్ట్ (గ్రంధులు మరియు హార్మోన్లు)ను సంప్రదించాల్సి ఉంటుంది. నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు తీసుకోవాలి. ఇమ్యూనిటీని పెంచుకునే ఆహారాన్ని విరివిగా తీసుకోవాలి. దీంతో పాటు, సమతులం ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం,సరియైన నిద్ర చాలా అసవరం. -
కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీఅమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..
‘ఇదిగో ఏవండి. మిమ్మల్ని. నా మాట వినండి. మనకున్నది ఒక్కతే కూతురు. కూతూర్ని బాగా చదవించాలి. దాని పెళ్లి చేయాలి. ఇవన్ని చేయాలంటే డబ్బులు బాగా అవసరం. అందుకే మీరో ఈ త్యాగం చేయండి. మీ కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మేయ్యండి. డబ్బులు వస్తాయి. వచ్చిన డబ్బును బ్యాంక్‌లో వేద్దాం. ఆ డబ్బే భవిష్యత్తులో కూతురు చదువు, పెళ్లికి ఉపయోగపడతాయి’ అంటూ ఓ మహిళ భర్త కిడ్నీని అమ్మేందుకు ఒప్పించింది. చివరికి ఏం చేసిందంటే? పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ తన భర్త కిడ్నీని విక్రయించమని బలవంతం చేసింది. భార్య పోరు తట్టుకోలేక భర్త తన కిడ్నీని అమ్మాడు. ఆ డబ్బుతో తన ప్రేమికుడితో కలిసి భార్య పారిపోయింది. నివ్వెరపోయే ఉదంతం హౌరా జిల్లాలోని సంక్రైల్‌లో జరిగింది. సంక్రైల్‌కు చెందిన ఓ మహిళ తన కుమార్తె చదువు, పెళ్లి కోసం డబ్బును పొదుపు చేస్తాననే నెపంతో అతని కిడ్నీని రూ. 10 లక్షలకు అమ్మాలని తన భర్తపై ఒత్తిడి తెచ్చింది.భార్య తెస్తున్న ఒత్తిడికి తట్టుకోలేక భర్త కిడ్నీని విక్రయించేందుకు అంగీకరించాడు. అదే సమయంలో తన అవయవ దానం చేయగా వచ్చిన డబ్బు భవిష్యత్తులో కుమార్తె చదువు, వివాహం చేయడం సులభం అవుతుందని ఆశించాడు. భార్య దురుద్దేశాన్ని పట్టించుకోలేదు. దీంతో నిందితురాలు, తన ప్రియుడితో కలిసి భర్త కిడ్నీని అమ్మేందుకు సిద్ధమైంది. భర్త కిడ్నీని అమ్మేందుకు సుమారు ఏడాది పాటు ప్రయత్నించింది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం కిడ్నీ అవసమరయ్యే వ్యక్తి దొరికాడు. కిడ్నీని అమ్మగా రూ.10లక్షలు వచ్చాయి. ఫేస్బుక్ ప్రేమికుడితోబాధిత భర్త పేదరికం నుంచి కుటుంబాన్ని గట్టెక్కించేందుకు ప్రాణ త్యాగానికి సిద్ధమైతే, భార్య ఫేస్బుక్లో యాక్టీవ్ ఉండే బరాక్‌పూర్‌కు చెందిన పెయింటర్ ప్రేమలో మునిగి తేలింది. భర్త కిడ్నీ అమ్మగా వచ్చిన రూ.10లక్షలు తీసుకుని ప్రియుడితో పరారైంది. ఓ వైపు అనారోగ్య సమస్యలు, కుమార్తె భవిష్యత్తు.. మరోవైపు రోజులు గడుస్తున్నా అడ్రస్ లేని భార్య జాడ. దీంతో ఏం చేయాలో పాలుపోక భర్త పోలిసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో భార్య ఆచూకీ లభ్యమైంది. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్నట్లు తేలింది.అనంతరం, భర్త తన పదేళ్ల కుమార్తె తన కుటుంబ సభ్యుల్ని వెంటబెట్టుకుని భార్య నివాసం ఉండే ఇంటికి వెళ్లారు. పదేళ్ల కూతుర్ని చూసైనా ఆ తల్లి గుండె కరుగుతుందేమోనని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. ప్రియుడి మోజులో పడ్డ బాధితురాలు భర్తను బెదిరించింది. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. నీకు విడాకులు ఇస్తా. నేను ఈ గడప దాటి బయటకు రాను అంటూ ప్రియుడి ఇంట్లోనే ఉండిపోయింది. భార్య చేసిన నిర్వాకంతో మనోవేధనకు గురయ్యాడు. కుమార్తెకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ధృడ సంకల్పంతూ వడివడిగా అడుగులేసుకుండూ ఇంటికి పయనమయ్యాడు బాధిత భర్త. -
అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ దందాపై ప్రభుత్వం సీరియస్
-
ఈ మోతాదులో ఉప్పు తీసుకుంటే గుండె, కిడ్నీ వ్యాధులను నివారించొచ్చు..!
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసిన మోతాదులో ఉప్పు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని మోడలింగ్ అధ్యయనం పేర్కొంది. ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన మోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల పదేళ్లలో గుండె, మూత్రపిండాలకు సంబంధించిన దీర్ఘకాలికి వ్యాధుల కారణంగా సంభవించే..దాదాపు మూడు లక్షల మరణాలను నివారించొచ్చని పేర్కొంది. అధిక స్థాయి సోడియం అనేది ప్రధాన ఆహార ప్రమాదాల్లో ఒకటి. అధిక ఆదాయ దేశాల్లో సోడియంకి సంబంధించిన ప్యాక్ చేసిన ఆహారాలు ప్రధాన వనరు. ఇక తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో వీటి వినియోగం మరింత ఎక్కువగా ఉండటం బాధకరం. ముఖ్యంగా భారతదేశంలో ఉప్పు తగ్గించి తీసుకునేలా సరైన జాతీయ వ్యూహం లేదని హైదరాబాద్‌లోని ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఉప్పు ఒక టీ స్పూన్ లేదా ఐదు గ్రాముల కంటే తక్కువగా ఉంటుందని మోడలింగ్ అధ్యయనం పేర్కొంది. ఈ మోతాదులోనే ప్రతి రోజూ వినియోగించినట్లయైతే దాదాపు 17 లక్షల కార్డియోవాస్కులర్ సంఘటనలు, గుండెపోటులు, స్ట్రోక్‌లతో సహా క్రానిక్ కిడ్న వ్యాధులను నివారించడమే గాక గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందగలమని పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా భారతదేశంలో పూర్తిస్థాయిలో ఇది అమలవ్వాలని పేర్కొంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా ప్యాక్ చేసిన ఆహారాలను ఉపయోగిస్తున్నట్లు పరిశోధన వెల్లడించింది. ఈవిషయమై ఆహార తయారీదారులకు అవగాహన కల్పించడం, పాటించేలా చేయడం అత్యంత ముఖ్యమని తెలిపింది. కాగా, అధిక స్థాయిలో సోడియం తీసుకోవడం తగ్గించేలా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా 2018 నుంచి అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం మాత్రం ఈట్ రైట్ ఇండియా అనే జాతీయ కార్యక్రమం ద్వారా సోడియంను తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని పరిశోధకులు తెలిపారు.(చదవండి: వాట్ ఏ రికార్డ్!..గుమ్మడికాయ పడవతో 26 గంటలు..) -
కిడ్నీలను కిడ్స్‌లా కాపాడుకుందాం..!
కిడ్నీలు ప్రతిరోజూ దేహంలో 200 లీటర్ల రక్తాన్ని శుభ్రం చేస్తూ... రక్తంలోని మాలిన్యాలనూ, వ్యర్థాలనూ ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటాయి. అవి దేహానికి హాని చేసే యూరియా, క్రియాటినిన్ లాంటి జీవరసాయనాలను వడపోసి మూత్రం ద్వారా ఎప్పటికప్పుడు బయటకు పంపేస్తాయి. అయితే కిడ్నీల పనితీరు దాదాపు 70 – 80 శాతానికి పడిపోయేవరకు బాధితులకు ఆ విషయమే తెలియదు. ఒకసారి కిడ్నీలు గనక చెడిపోతే జీవక్రియల్లో వెలువడే ఎన్నో విషరసాయనాలు దేహంలోనే పేరుకుపోవడం మొదలవుతుంది. అది ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. అయితే ఈ ముప్పు రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది తాత్కాలికమైనది. రెండోది శాశ్వతమైనది. కిడ్నీ ఫెయిల్యూర్‌ను తెలుసుకోవడం ఎలా? బాధితుల దేహంలో కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు ‘క్రియాటినిన్’ అనే వ్యర్థ రసాయనం రక్తంలో పేరుకు΄ోతుంది. సీరమ్ క్రియాటినిన్ అనే ఓ చిన్న రక్తపరీక్ష ద్వారా కిడ్నీలు బాగున్నాయా లేదా అన్నది తేలిగ్గా తెలుసుకోవచ్చు. కిడ్నీ జబ్బులను అత్యంత తొలిదశల్లో గుర్తించడానికి ఉపయోగపడే పరీక్ష స్పాట్ యూరిన్ అల్బుమిన్ క్రియాటినిన్ రేషియో పరీక్ష. ఇదొక సరళమైన మూత్రపరీక్ష. మరీ ముఖ్యంగా షుగర్ ఉన్నవారిలో చాలా త్వరగా ఇది రాబోయే కిడ్నీ జబ్బులను పసిగడుతుంది.కిడ్నీ సమస్య తాత్కాలికమా, శాశ్వతమా అన్నది తెలుసుకోవడం ‘అల్ట్రాసౌండ్ స్కానింగ్’తో సాధ్యమవుతుంది. కిడ్నీల సైజు మామూలుగానే ఉండి, క్రియాటినిన్ పెరుగుతూ΄ోతే అది తాత్కాలిక సమస్య. మందులతో, జీవనశైలి పద్ధతులతో దాన్ని చక్కదిద్దవచ్చు. ఒకవేళ వాటి సైజు బాగా చిన్నగా మారితే అప్పుడది శాశ్వత సమస్య అయ్యే అవకాశాలు ఎక్కువ. తాత్కాలిక కిడ్నీ సమస్యను ‘అక్యూట్ కిడ్నీ ఇంజరీ’ అనీ, కిడ్నీ పనితీరు వేగంగా తగ్గుతూపోతుంటే దాన్ని ‘ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్’ (ఆర్పీఆర్ఎఫ్) అనీ, అదే పూర్తిగా శాశ్వతంగా దెబ్బతింటే దాన్ని ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’ (సీకేడీ) అని అంటారు. శాశ్వత డయాలసిస్ నివారణ కోసం ఇవీ జాగ్రత్తలు... డయాబెటిస్ పూర్తి అదుపు అవసరం : జీవితంలో డయాలసిస్ వద్దు అనుకునేవారు డయాబెటిస్‌ను పూర్తి అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ, తగినంత వ్యాయామం చేయాలి. బీపీ నియంత్రణ తప్పనిసరి: రక్తపోటు క్రమంగా శాశ్వతంగా కిడ్నీలు దెబ్బతినే క్రానిక్ కిడ్నీ డిసీజ్ వైపునకు తీసుకెళ్లే ప్రమాదముంది. అందుకే హైబీపీ ఉన్నవారు తమ రక్త΄ోటును అదుపులో ఉంచుకోవాలి.అనవసరంగా పెయిన్కిల్లర్లు / యాంటిబయాటిక్స్ వద్దుచాలామంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు యాంటీ బయాటిక్స్ వాడుతుంటారు. చిన్న΄ాటి నొప్పి కూడా తట్టుకోలేక నెలల తరబడి పెయిన్‌కిల్లర్స్ తీసుకుంటారు. డాక్టర్ల సూచన లేకుండా పెయిన్కిల్లర్లూ, యాంటీబయాటిక్స్ వంటి ‘ఓవర్ ద కౌంటర్’ మందులు ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు. చిన్నా చితకా నొప్పులకు పారాసెటమాల్ మాత్ర వాడితే సరిపోతుంది. ఎట్టిపరిస్థితుల్లో నాటు మందులు వద్దు... కొందరు శాస్త్రీయత లేని వైద్యప్రక్రియలకు / నాటుమందులకు వెళ్తుంటారు. నాటుమందుల్లోని విషాలను వడపోసే క్రమంలో కిడ్నీలు మరింతగా పాడైపోయి, బాధితులను డయాలసిస్ వైపునకు తీసుకెళ్తాయి. కిడ్నీల ఆరోగ్యం బాగుండాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ నాటు మందులు వాడకూడదు. ఈ జాగ్రత్తలతో శాశ్వత డయాలసిస్‌కు వెళ్లకుండా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. (చదవండి: స్మోకింగ్స్ .. ఆ గర్భ శత్రువులే..! ) -
కిడ్నీ మొత్తం ఆవరించిన దుప్పికొమ్ము రాయి!
విశాఖపట్నం, సాధారణంగా కిడ్నీలలో రాళ్లంటే చిన్నచిన్నవి ఉంటాయి. కానీ, దాదాపు కిడ్నీ మొత్తం ఆవరించి, బయట కటివలయంలోకి కూడా వచ్చిన దుప్పికొమ్ము ఆకారంలోని రాయి ఉండడం చాలా తీవ్రమైన సమస్య. దాదాపు 80 మి.మీ. కంటే పొడవున్న ఈ రాయి ఇంచుమించు కిడ్నీ ఆకారంలోనే పెరగడంతో మూత్రనాళానికి అడ్డం పడదు, దాంతో నొప్పి తెలియదు, వాపు కూడా అంతగా ఉండదు. అందువల్ల రోగులకు ఇది ఉందనే విషయమే తెలియదు. ఇలాంటి తీవ్రమైన సమస్యను అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో తొలగించారు విశాఖపట్నంలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ అమిత్ సాప్లే తెలిపారు.“62 ఏళ్ల వ్యక్తి నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారు. ఆయనకు స్కాన్ చేస్తే.. కిడ్నీలో స్టాగ్ హార్న్ స్టోన్ (దుప్పి కొమ్ము తరహా రాయి) ఉన్నట్లు తేలింది. దాని వల్ల ఆయన కిడ్నీ పనితీరు కేవలం 18% మాత్రమే ఉంది. ఇది మామూలు రాళ్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. పరిమాణం పెద్దది ఉన్నా, మూత్రపిండం ఆకారంలోనే పెరగడం వల్ల ఇది మూత్రనాళానికి అడ్డం పడదు. అందువల్ల వాపు, నొప్పి లాంటివి మరీ ఎక్కువగా ఉండవు. అలాగే మూత్రంలో రక్తచారికలు కూడా అంతగా కనిపించవు.కానీ దీనివల్ల సమస్య ఎక్కువగానే ఉంటుంది. ఈ కేసులో ఇది కిడ్నీని దాటి కటివలయంలోకి కూడా వచ్చింది. మామూలు రాళ్లయితే సంప్రదాయ పద్ధతుల్లో వాటిని లోపల పగలగొట్టి బయటకు తీస్తారు. కానీ, ఇది పెద్దది కావడంతో కిడ్నీ వైపు నుంచి కాకుండా ముందు పొట్ట వైపు నుంచి తీసేందుకు పైలోలిథోటమీ అనే పద్ధతిని అవలంబించాం. ఇది కూడా లాపరోస్కొపిక్ పద్ధతిలో పెద్ద కోత లేకుండా చేశాం. ఇంతకుముందు ఇదే చికిత్సను ఓపెన్ సర్జరీ విధానంలో చేసేవారు. కానీ ఇప్పుడు సాంకేతిక నైపుణ్యాలు పెరగడంతో దీన్ని లాపరోస్కొపిక్ పద్ధతిలో చేయగలుగుతున్నాం. ఈ విధానంలోనే మొత్తం రాయిని పగలగొట్టకుండా, దాని కొమ్ములతో సహా బయటకు తీసేశాము. ఒక స్టెంట్ వేసి, శస్త్రచికిత్స ముగించాము. నెల రోజుల తర్వాత ఆ స్టెంట్ తీసేస్తాము. శస్త్రచికిత్స అనంతరం ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో పేషెంటును రెండోరోజే డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ అమిత్ సాప్లే వివరించారు.ఈ శస్త్రచికిత్సలో విశాఖ ఏఐఎన్‌యూ ఆస్పత్రికి చెందిన యూరాలజిస్టులు డాక్టర్ రవీంద్ర వర్మ, డాక్టర్ శ్రీధర్, ఎనెస్థటిస్టు డాక్టర్ శ్యాం కూడా కీలకపాత్ర పోషించారు. ఇలాంటి అత్యంత అరుదైన, సమస్యాత్మకమైన కేసులకు చికిత్స చేయడంలో అత్యున్నత సాంకేతిక నైపుణ్యాలను వారు ప్రదర్శించారు. -
బొప్పాయి ఆకులతో గుండె,కాలేయం,కిడ్నీలు పదిలం! అదెలాగంటే..
బొప్పాయి పండు అంటే చాలా మందికి ఇష్టం.బొప్పాయి పండు జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. అలాగే కడుపు సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.బొప్పాయి పండులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వలన అది మలబద్దకం సమస్యను నివారిస్తుంది. కేవలం బొప్పాయి పండు మాత్రమే కాకుండా బొప్పాయి ఆకులతో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు చెప్తున్నారుప్రస్తుతం మారుతున్న జీవనశైలి,ఆహారపు అలవాట్ల కారణంగా మనిషి కొంగొత్త అనారోగ్య సమస్యలను ఎదురుకోవలసి వస్తుంది. కొన్ని ఆరోగ్య సమస్యలకు చికిత్స కూడా ఉండటం లేదు. ఈ క్రమం లోనే చాలా మంది జనాలు ఆయుర్వేదం,పురాతన వైద్యం చిట్కాలను ఆశ్రయిస్తున్నారు. మనిషి శరీరంలో ప్రధానమైన అవయవాలలో గుండె,కాలేయం,కిడ్నీ ఉన్నాయి. ఒక మొక్క ఈ మూడు అవయవాలను 70 ఏళ్ళ పాటు ఆరోగ్యంగా ఫిట్ గా ఉంచుతుంది అని చాలా మందికి తెలియదు. ఈ అవయవాలకు ఆ మొక్క సంజీవినిలాగ పని చేస్తుంది. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం..బొప్పాయి ఆకులో యాంటీ ట్యూమర్ గుణాలు ఉన్నాయి.అవి కాన్సర్ ను నివారించటం లో చాలా సహాయపడతాయి.బొప్పాయిలో ఉండే ఈ యాంటీ ట్యూమర్ గుణాలు కణితులను నివారించి కాన్సర్ బారిన పడకుండా చేస్తాయి. బొప్పాయి ఆకుల రసంలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.బొప్పాయి ఆకుల రసం వివిధ వ్యాధులను నివారించటం లో సహాయం చేస్తుంది కాబట్టి ఈ రసాన్ని సర్వ రోగ నివారిణి అంటారు.బొప్పాయి ఆకులతో చేసిన రసం గుండె,కాలేయం,కిడ్నీ వంటి అవయవాలకు చాలా మేలు చేస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. బొప్పాయి ఆకులతో చేసిన రసం మలేరియా,డెంగ్యూ వంటి వ్యాధుల చికిత్స లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది.బొప్పాయి ఆకులతో చేసిన రసాన్ని తాగితే ప్లేట్ లెట్ కౌంట్ వేగంగా పెరుగుతుంది.అలాగే ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.ఈ రసం రక్త ప్రసరణను వేగంగా మెరుగుపరుస్తుంది. గర్భాశయ, ప్రోస్టేట్,రొమ్ము, ఊపిరితిత్తుల కాన్సర్ నివారణలో బొప్పాయి ఆకుల రసం చాలా బాగా ఉపయోగపడుతుంది.మలబద్దకం సమస్య ఉన్న వారికి ఈ రసం ఔషధంలా పని చేస్తుంది.ఈ రసాన్ని బేది మందు అని కూడా అంటారు. బొప్పాయి ఆకులతో చేసిన రసం శరీరం లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన అవి ఒత్తిడిని తగ్గించడంలో చాలా సహాయ పడతాయి. గుండె,కాలేయం,కిడ్నీ లను మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఈ బొప్పాయి ఆకుల రసం చాలా సహాయపడుతుంది. అందుకే బొప్పాయి ఆకుల రసం గుండె,కాలేయం,కిడ్నీఅవయవాలకు సంజీవనిలాగ పని చేస్తుంది అని నిపుణులు నమ్మకంగా చెబుతున్నారు. (చదవండి: నేహా ధూపియా వెయిట్ లాస్ జర్నీ!..ఇంట్లోనే ఈజీగా బరువు తగ్గే స్ట్రాటజీ ఇదే..!) -
కిడ్నీ రాకెట్ ముఠా కోసం పోలీసుల వేట
-
కిడ్నీ రాకెట్‌పై డీఎస్పీ మహేష్ కామెంట్స్
-
కిడ్నీ రాకెట్ లో సంచలన నిజాలు
-
కిడ్నీ రాకెట్.. దారుణమైన మోసం
-
రోగికి పంది కిడ్నీ మార్పిడి.. అంతలోనే విషాదం
అమెరికా మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. మసాచుసెట్స్ పంది కిడ్నీని ట్రాన్స్‌ప్లాంట్ చేసిన రిచర్డ్ స్లేమాన్ (62) మరణించారు.ఇంగ్లాండ్ వేమౌత్ నగరానికి చెందిన రిచర్డ్ స్లేమాన్ (62) కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే 2018లో వైద్యులు అతనికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. కొంత కాలం బాగున్నా.. ఆ తర్వాత కిడ్నీ సమస్య మొదటికి రావడంతో డయాలసిస్ చేయాల్సి వచ్చింది. దీంతో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఫలితం లేకపోవడంతో వైద్యులు స్లేమాన్‌కు పంది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సలహా ఇచ్చారు.మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి వైద్యులుఈ ఏడాది మార్చి 16న అమెరికా మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి వైద్యులు నాలుగు గంటల శ్రమించి స్లేమాన్‌కు పంది కిడ్నీని అమర్చారు. ఆపరేషన్ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ తరుణంలో ఏప్రిల్ 11న (నిన్న) స్లేమాన్ మరణించినట్లు కుటుంబసభ్యులు, మసాచుసెట్స్ వైద్యులు తెలిపారు.ఆధారాలు లేవుఈ సందర్భంగా పందికిడ్నీని అమర్చడం వల్లే స్లేమాన్ మరణించినట్లు ఆధారాలు లేవని వైద్యులు వెల్లడించారు. కుటుంబసభ్యులు తమకు స్లేమాన్తో మరికొంత కాలం పాటు తమతో గడిపేందుకు కృషి చేసిన వైద్యులకు కృతజ్ఞతలు చెప్పారు.గతంలో గతంలో బ్రెయిన్ డెడ్ అయి కృత్రిమ లైఫ్ సపోర్ట్‌పై కోలుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చారు. న్యూయార్క్ యూనివర్సిటీ లాన్‌గోన్ హెల్త్ మెడికల్ సెంటర్లో వైద్యులు ఈ ఆపరేషన్ చేశారు. రెండు నెలల వ్యవధిలోనే బాధితుడు మరణించాడు. స్లేమాన్ మాత్రం తాను రెండేళ్లు జీవిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు పంది కిడ్నీని అమర్చాలని కోరడంతో మసాచుసెట్స్ వైద్యుల్ని బాధితునికి పంది కిడ్నీని అమర్చారు. కానీ స్వల్ప వ్యవధిలో స్లేమాన్ మరణించడం వైద్య చరిత్రలో విషాదం నెలకొంది. -
కిడ్నీ సమస్యలు ఈ కారణాలతో కూడా రావచ్చు.. జాగ్రత్త!
'ఇది వేసవి. డీ–హైడ్రేషన్‌కు గురయ్యే కాలం. సాధారణంగా మూత్రపిండాల్లో (కిడ్నీల్లో) రాళ్లు వేసవిలో తరచూ బయటపడుతుంటాయి కాబట్టి ఈ సమస్యకు వేసవిని ఓ సీజన్‌గా పరిగణిస్తుంటారు. పైగా ఈనెల 14వ తేదీ ‘వరల్డ్ కిడ్నీ డే’ సందర్భంగా మూత్రపిండాల్లో రాళ్లలాంటి సాధారణ సమస్యలు మొదలుకొని, సీకేడీ వంటి మూత్రపిండాలకు సంబంధించిన అనేక సమస్యలూ, వాటి పరిష్కారాలపై అవగాహన కోసమే ఈ కథనాలు'. కిడ్నీలో రాళ్లు ఎంత సాధారణ సమస్య అంటే ఒకరి 70 ఏళ్ల జీవితకాలంలో 20% మంది పురుషుల్లో, 10% మంది మహిళల్లో ఏదో ఒక దశలో అవి కనిపిస్తాయి. అయితే రాళ్లు రావడమన్నది పురుషుల్లో ఎక్కువ. వాటి వల్ల కిడ్నీ దెబ్బతిని, కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసి, జీవితాంతం డయాలసిస్ మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వాటి గురించి తెలుసుకుని, కిడ్నీలో రాళ్లు ఏర్పడేందుకు అవకాశమున్నవారు జాగ్రత్త వహించాల్సిన అవసరముంది. రాళ్లూ.. రకాలు.. మన ఆహారంలో, తాగే పానీయాల్లో క్యాల్షియమ్ వంటి అనేక ఖనిజాలూ, లవణాలు ఉంటాయి. జీవక్రియలు జరిగే సమయంలో ఆగ్జలేట్స్, యూరిక్ యాసిడ్, సిస్టయిన్ వంటి స్ఫటికాలు ఏర్పడవచ్చు. అలాగే ఇంకొందరిలో రాళ్లు రూపొందే ప్రక్రియను అరికట్టే సిట్రేట్లు తక్కువగా ఉండవచ్చు. అలాంటివారితో పాటు... నీళ్లు తక్కువగా తాగేవారిలో లవణాలన్నీ ఒకేచోట కేంద్రీకృతమై క్రమంగా గట్టిబడి రాయిలా మారేందుకు అవకాశాలు ఎక్కువ. దేహంలోని వడపోత ప్రక్రియ అంతా కిడ్నీలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ రాళ్లు ఏర్పడే అవకాశాలెక్కువ. కిడ్నీరాళ్లలో ప్రధానమైనవి కాల్షియమ్ ఆగ్జలేట్స్ (70 – 80%). మిగతావి క్యాల్షియమ్ ఫాస్ఫేట్, యూరిక్ యాసిడ్, సిస్టైయిన్స్ వంటివి. ఇక ట్రిపుల్ ఫాస్ఫేట్‌గా పేరున్న మెగ్నీషియమ్, అమోనియమ్ ఫాస్ఫేట్లతో తయారయ్యే స్ట్రువైట్ అనే రాళ్లు చాలా అరుదుగా, పెద్దగా ఏర్పడతాయి. దాంతో స్ట్రువైట్ రాళ్లతో కిడ్నీ ఫెయిల్యూర్‌కు అవకాశాలు ఎక్కువ. అంతేకాదు.. కొన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ బాధితుల్లో 'ప్రోటియస్ వల్గారిస్’ అనే బ్యాక్టీరియా కారణంగా కూడా స్ట్రువైట్ రాళ్లు ఏర్పడి, మరింత సంక్లిష్టతలకూ, ప్రమాదాలకూ దారితీసే అవకాశముంది. ఎవరిలో ఎక్కువ..? నీళ్లు చాలా తక్కువగా తాగేవాళ్లలో ఉప్పు ఎక్కువగా తీసుకునేవారిలో మాంసాహారాలూ, చక్కెరలు ఎక్కువగా తినేవారిలో ఉబకాయం ఉన్నవారిలో డయాబెటిస్, పేగు వ్యాధులు లాంటి సమస్యలు ఉన్నవారిలో క్రోన్స్ డిసీజ్, ఇన్ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్, యూరిక్ యాసిడ్ మోతాదులు ఎక్కువగా పెరిగే గౌట్, పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్, రీనల్ ట్యుబ్యులార్ అసిడోసిస్, హైపర్పారాథైరాయిడిజమ్ వంటి సమస్యలున్న వారిలో సిప్రోఫ్లాక్సిన్ వంటి కొన్ని యాంటీబయాటిక్స్, సల్ఫా డ్రగ్స్, హెచ్ఐవీ మందులు వాడేవాళ్లతో పాటు, బరువు తగ్గడానికి బేరియాట్రిక్ సర్జరీ (అందులోనూ రూక్స్–ఎన్–వై గ్యాస్ట్రిక్ బైపాస్) చేయించుకున్నవారిలో. లక్షణాలు... నడుము లేదా వీపువైపు ఉరఃపంజరం కిందిభాగంలో భరించలేనంత తీవ్రమైన నొప్పి. ఒక్కోసారి ఈ నొప్పి పక్కలకూ, కిందివైపునకూ, పొట్ట వైపునకూ, కొందరు పురుషుల్లో వృషణాల సంచివైపునకూ పాకుతుంది. ఇది అలలు అలలుగా వస్తూపోతూ ఉంటుంది. నొప్పితో పాటు.. వికారం లేదా వాంతులు జ్వరం మూత్రంలో రక్తం కనిపించడం మూత్రవిసర్జనలో మంట కొందరిలో రాయి కారణంగా మూత్రం వస్తున్న ఫీలింగ్ ఉన్నప్పటికీ, రాయి అడ్డుపడుతుండటం వల్ల మూత్ర విసర్జన జరగకపోవచ్చు. ఇలాంటి వాళ్లలో మూత్రం ఆగి, ఆగి చుక్కలు చుక్కలుగా పడుతుండవచ్చు. అరుదుగా కొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కానీ మరేదో సమస్యతో డాక్టర్ దగ్గరికి వచ్చి, పరీక్షలు చేయించినప్పుడు చాలా పెద్దరాయి కారణంగా అప్పటికే కిడ్నీ చాలావరకు చెడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. నిర్ధారణ.. మూత్రపిండాలు, యురేటర్, బ్లాడర్ల సీటీ స్కాన్, ఎక్స్–రే, అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలతో కిడ్నీలో రాళ్లను కనుగొంటారు. కొన్నిసార్లు మూత్రపరీక్ష, కిడ్నీ ఫంక్షన్ పరీక్ష అవసరం కావచ్చు. చికిత్స.. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగమని బాధితులకు సూచిస్తుంటారు. దాంతో రాయి రూపొందడానికి వీల్లేకుండా లవణాలు ఎప్పటికప్పుడు మూత్రంలో కొట్టుకుపోవడంతో పాటు... కొన్నిసార్లు రాయి దానంతట అదే బయటపడేందుకు అవకాశముంటుంది. ఉప్పు, మాంసాహారం తగ్గించమని సూచిస్తుంటారు. అలాగే కొందరిలో రాయి ఏర్పడటానికి దోహదం చేసే పాలకూర, టమాటాకు దూరంగా ఉండమని సూచిస్తారు. ఇది కేవలం కిడ్నీలో రాయి ఏర్పడేందుకు అవకాశమున్నవారికి మాత్రమే. మిగతా ఆరోగ్యవంతులు వీటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇక శస్త్రచికిత్సల విషయానికి వస్తే.. యురేటరోస్కోపిక్ రిమూవల్ : ఎండోస్కోప్ సహాయంతో బ్లాడర్లోకీ, కిడ్నీ నుంచి బ్లాడర్ వరకు ఉండే నాళాలైన యురేటర్లలోంచి ఈ ప్రక్రియ ద్వారా రాళ్లు తొలగిస్తారు. ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ : రాళ్లు పెద్దవిగా ఉంటే ఈ షాక్ వేవ్స్ సహాయంతో వాటిని చిన్న చిన్న ముక్కలుగా /΄ûడర్‌గా పొడిపొడి చేస్తారు. దాంతో రాళ్ల ΄ûడర్ మూత్రంలో వెళ్లిపోతుంది. పర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటమీ (పీసీఎన్ఎల్) : ఈ ప్రక్రియలో నడుం పక్క భాగం నుంచి కిడ్నీలోకి ఒక పైప్‌ను రాయి ఉన్నచోటికి పంపి, ఆ పైప్ ద్వారా రాయిని బయటకు తీసుకొస్తారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ – సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)కి మొదటి కారణం మధుమేహం, రెండోది దీర్ఘకాలిక రక్తపోటు. మూడో కారణం గ్లోమరులార్ డిసీజ్. ఈ సమస్య ఉన్నవారిలో మూత్రంలో ప్రోటీన్ ఎక్కువగా పోతుంటుంది. ఫలితంగా కాళ్లవాపు, ముఖం వాచినట్లుగా ఉండటం, మూత్రం నురగలా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో కారణాలేమీ లేకుండానే కిడ్నీలు దెబ్బతినవచ్చు. కిడ్నీలోని మూత్రనాళాలను దెబ్బతీసే ఇంటస్టిషియల్ వ్యాధులు, కొన్ని జన్యుపరమైన జబ్బులు, ఇన్ఫెక్షన్లు, కొన్నిసార్లు కిడ్నీలో రాళ్లు కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)కి కారణం. అయితే ఈ కారణాలన్నింటిలోనూ డయాబెటిస్, హైబీపీ వల్లనే 70– 80 శాతం కిడ్నీవ్యాధికి దారితీస్తాయి. ఎవరెవరిలో... ఎందువల్ల? చిన్నపిల్లల్లో సీకేడీ ఉందంటే అది జన్యుపరమైన జబ్బుల వల్ల వచ్చిందేమోనని చూడాలి. మధ్యవయసు వారిలోనైతే... ఇందుకు అదుపులో లేని డయాబెటిస్, అధిక రక్తపోటు కారణమని అనుమానించాలి. లక్షణాలు.. వికారం ఆగకుండా వాంతులు ఎప్పుడూ నీరసంగా ఉండటం కాళ్లవాపులు ముఖం వాపు ఆకలి తగ్గడం ఊపిరి అందకపోవడం ఆయాసం రాత్రివేళ మూత్రం కోసం ఎక్కువగా నిద్రలేవాల్సి రావడం, మూత్రం చుక్కలు చుక్కలుగా తక్కువగా రావడం, మూత్రంలో రక్తస్రావం... వంటి లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కిడ్నీలు 50 శాతం దెబ్బతిన్న తర్వాతే బయటపడవచ్చు. చికిత్స.. క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోగలిగినప్పుడు కిడ్నీ బాధితులు ఓ సాధారణ వ్యక్తి జీవించినంత కాలం జీవించవచ్చు. డయాలసిస్‌లో రెండు రకాలు. మొదటిది హీమో డయాలసిస్; రెండోది పెరిటోనియల్ డయాలసిస్. హీమో డయాలసిస్ : ఇది యంత్రం ద్వారా రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ. వారానికి మూడు సార్లు రోజు విడిచి రోజు డయాలసిస్ కేంద్రానికి వెళ్లి చేయించుకోవాలి. ఈ ప్రక్రియకు నాలుగు గంటలు పడుతుంది. పెరిటోనియల్ డయాలసిస్: ఇది ఇంట్లోనే చేసుకునే డయాలసిస్. దీన్నే ‘కంటిన్యువస్ అంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్’ (సీఏపీడీ) అని కూడా అంటారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స.. కిడ్నీ తొంభై శాతం పాడైనప్పుడు మాత్రమే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను చివరి ఆప్షన్‌గా డాక్టర్లు సూచిస్తారు. కిడ్నీలను పదిలంగా కాపాడుకోవాలంటే.. డయాబెటిస్, హైబీపీ ఉన్నవారు కచ్చితంగా వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహం ఉన్నవారు మూడు నెలలకోసారి హెచ్‌బీఏ1సీ పరీక్షను చేయిస్తూ... రీడింగ్స్ 6.5 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. హైబీపీ ఉన్నవారు తమ బీపీని 130/80 ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో కొవ్వులు, కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసాహారం తక్కువగా తీసుకుంటూ... శాకాహారం, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. మన ఆహారంలో ఉప్పును చాలా తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎక్కువ మోతాదులో ఉండే బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, నిల్వ ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆగ్జలేట్స్ ఎక్కువగా ఉండే గింజధాన్యాలు, సోయాబీన్స్, చాక్లెట్ల వంటి వాటిని తగ్గించాలి. క్యాల్షియం సప్లిమెంట్లను కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అలాగే క్యాల్షియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది. నిమ్మజాతి పండ్లు, ఆరెంజ్ జ్యూస్ వంటివాటివి డాక్టర్ల సూచనల మేరకు తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకోవాలి. పొగతాగడం పూర్తిగా మానేయాలి. ఆల్కహాల్ వల్ల ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దాంతో దేహంలో నీళ్లు తగ్గి డీహైడ్రేషన్‌కు గురవుతాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశమిస్తుంది. కాబట్టి ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. కూల్‌డ్రింక్స్‌కూ దూరంగా ఉండటం మంచిది. ఏవైనా మందులు లేదా విషపదార్థాలు ఒంట్లోకి రాగానే వాటిని విరిచేసి, వడపోసి బయటకు పంపే బాధ్యతలు కాలేయం, కిడ్నీలవే. నొప్పి నివారణ మందుల వంటి కొన్ని ఔషధాలు దీర్ఘకాలంలో కిడ్నీలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున డాక్టర్ సలహాలు, సూచనలు లేకుండా ఏ రకమైన ‘ఆన్ కౌంటర్ డ్రగ్స్’ వాడకూడదు. మూత్రం ఇన్ఫెక్షన్స్ని సరైన పద్ధతిలో, సరైన మందులతో, సరైన సమయంలో వైద్యం చేయించుకుని, పూర్తిగా తగ్గేలా చూసుకోవాలి. — డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. ఇవి చదవండి: Siraj collection and Vlogs: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు... -
ఉద్దానం కిడ్నీ రోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం: మంత్రి
-
తల్లి త్యాగం వృథా..
భద్రాద్రి: నవమాసాలు మోసి కనిపెంచిన కుమార్తెకు వచ్చిన కష్టాన్ని చూసి కిడ్నీని దానం చేసిన ఆ తల్లి త్యాగం వృథాగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సుజాతనగర్‌కు చెందిన బోడా హరినాయక్, భద్రమ్మ దంపతులకు చెందిన పెద్ద కుమార్తె స్నేహిత (13) గత ఏడాది అనారోగ్యానికి గురైంది. ఈ క్రమంలో చిన్నారి రెండు కిడ్నీలు చెడిపోయాయి. ఆ సమయంలో కుమార్తెకు వచ్చిన కష్టాన్ని చూసి తల్లి హృదయం తల్లడిల్లింది. రెండు కిడ్నీలు ఫెయిలై మరణపు అంచుల వద్ద ఉన్న తన కూతురికి తన కిడ్నీనే దానంగా ఇచ్చి పునర్జన్మ ప్రసాదించింది. కిడ్నీ దానంతో చిన్నారి కోలుకోగా తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషించారు. కానీ, ఆ సంబురం వారికి కొంతకాలం పాటే నిలిచింది. కిడ్నీ దానం అనంతరం అప్పుడప్పుడు చిన్నారి మళ్లీ అనారోగ్యానికి గురికాగా వైద్యం చేయిస్తూ వస్తున్నారు. పరిస్థితి విషమించిన చిన్నారి వారి ఆశలను అడియాసలను చేస్తూ సోమవారం మృతి చెందింది. కూతురు బతుకుతుందనుకున్న వారి కోరిక తీరకపోవడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. -
లోక్‌సభ ఎన్నికల బరిలో లాలూ చిన్న కుమార్తె?
దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల్లో ఉత్సాహం కూడా పెరుగుతోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేందుకు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు ఇప్పటికే తమ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇంతలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)కు చెందిన ఒక ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ రెండవ కుమార్తె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ రెండో కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రోహిణి ఇటీవల తన అత్తా మామల ఇంటికి బీహార్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె కారాకాట్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు డిమాండ్ చేశారు. ఆమె ఎంపీగా ఎన్నికైతే తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని వారంటున్నారు. తొలుత ఆమె ఈ వినతిని తిరస్కరించినా తాను తల్లిదండ్రులు మాటకు కట్టుబడి ఉంటానని మీడియాకు తెలియజేశారు. కారాకాట్ ప్రజలు తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకంటే తనకు అభ్యంతరం చెప్పలేనని అమె అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ సంతానమైన తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్, మిసా భారతి ఇప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఇప్పుడు లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారంటూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రోహిణి ఆచార్య.. సోషల్ మీడియాలో బీహార్ రాజకీయాలు, ఈ ప్రాంతానికి సంబంధించిన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. రోహిణి తన కిడ్నీలో ఒకదానిని తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు దానం చేయడంతో అందరి దృష్టిలో పడ్డారు. ఆమె ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే ఇంజనీర్ సమేష్‌ని వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె భర్త, కుటుంబంతో కలిసి సింగపూర్‌లో ఉంటున్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీని కబళించిన చలి పులి.. పొగమంచుతో తగ్గిన విజిబులిటీ! -
కిడ్నీ దానంతో భర్త ప్రాణాలు కాపాడిన భార్య!
వివాహమైన తరువాత ఒకరికి ఒకరు అనే విధంగా, ప్రాణంలో ప్రాణంగా కలిసిమెలసి జీవించేవారే నిజమైన భార్యాభర్తలు. ఇలాంటివారిలో ఒకరికి ఏదైనా కష్టం వస్తే మరొకరు తల్లడిల్లిపోతారు. అలాంటి పరిస్థితిలో అవతలి వ్యక్తి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం అవుతారు. ఛత్తీస్‌గఢ్‌లోని బతౌలీలో భర్త కోసం భార్య చేసిన త్యాగం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే బతౌలీలోని భారత్ మాతా చౌక్ నివాసి, హార్డ్‌వేర్ దుకాణం నిర్వాహకుడు ఆయుష్ అగర్వాల్ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో అతని భార్య తన కిడ్నీని దానం చేసి భర్త ప్రాణాలను నిలబెట్టింది. ఈ కిడ్నీ మార్పిడి చికిత్స తర్వాత ఆయుష్ అగర్వాల్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఆయుష్ అగర్వాల్ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ప్రతి 15 రోజులకోసారి డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చేది. వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని ఆయుష్కు సూచించారు. అయితే నిబంధనల ప్రకారం రక్త సంబంధీకుల నుంచి మాత్రమే కిడ్నీ తీసుకోవలసి ఉంటుంది. అతని భార్య నిషా అగర్వాల్ తన కిడ్నీని భర్తకు దానం చేసేందుకు ముందుకు వచ్చింది. ఆయుష్ అగర్వాల్ ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్నారు. మొరుగైన వైద్యం కోసం వైద్యుల పర్యవేక్షణలో నాలుగు నెలల ఉన్నారు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో భార్యాభర్తలిద్దరూ ముంబై నుంచి తిరిగి బతౌలీ చేరుకున్నారు. త్వరలోనే తిరిగి తన వ్యాపారాన్ని ప్రారంభించనున్నానని ఆయుష్ తెలిపారు. తన భార్య తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిందని ఆనందంగా తెలిపారు. భర్తకు కిడ్నీని దానం చేసిన నిషా అగర్వాల్ అభినందనీయురాలని వైద్యులు కొనియాడారు. ఇది కూడా చదవండి: మంచుకురిసే వేళలో.. వాతావరణశాఖ హెచ్చరికలు! -
అత్యున్నత వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
Updates అత్యున్నత వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్ పలాసలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పేదల బతుకులు మార్చాలి అనే తపన మీ బిడ్డకు మాత్రమే ఉంది. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి కూడా నీరు అందించలేదు. తన సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబు ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటుందా? ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తుల మీద చంద్రబాబు ఆధారపడతారు. తాను ఒక మంచి పని చేశాడని చెప్పుకోవడానికి చంద్రబాబు ఒక్క స్కీమ్ అయినా తెచ్చాడా? చంద్రబాబుకు నాన్‌లోకల్ ప్యాకేజీ స్టార్ ఇంకో పార్ట్నర్. ప్యాకేజీ స్టార్ ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగ్‌లు కొడతాడు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు. ఈ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ దత్తపుత్రుడు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు. విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు. నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు. ఉద్దానం అంటే ఉద్యానవనం అని అర్థం ఉద్దానం ప్రజల బాధను పాదయాత్రలో చూశాను. ఇచ్చిన మాట ప్రకారం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తీసుకువచ్చాం ఉద్దానం ప్రజలకు ఇచ్చిన మాట ఇప్పటికీ గుర్తుంది. ఉద్దానం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చాం. దాదాపు రూ.85కోట్లతో నిర్మాణాలు చేపట్టాం. సురక్షిత మంచి నీటి కోసం రూ.700కోట్లు ఖర్చు చేస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్యసేవలు కిడ్నీ రీసెర్చ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా సేవలు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తాం. దేశ, విదేశాల నుంచి నిపుణులైన వైద్యుల పర్యవేక్షలో రీసెర్చ్. కిడ్నీ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు జిల్లాలోని ఏడు మండలాల్లో స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందిస్తున్నాం. విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు అండగా ఉన్నాం. నాన్ డయాలసిస్ రోగులకు కూడా రూ.5వేలు ఇస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు మానవతా ధృక్పదంతో అడుగులు వేస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ రూ.10వేలకు పెంచాం. దేవుడి దయతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆసుపత్రిని ప్రారంభించుకున్నాం. మన ప్రభుత్వంలో 13వేల మందికిపైగా డయాలసిస్ రోగులకు పెన్షన్ ప్రతీ నెల పెన్షన్ల కోసం 12కోట్ల 54లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు మూల కారణం తెలుసుకునేందుకు సమగ్రంగా అధ్యయనం మొదలుపెట్టాం. మార్కాపురంలోనూ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా వారిని ఆదుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. పలాస బహిరంగ సభ: డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అందరికీ నమస్కారం, చాలా సంతోషం, ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న గొప్ప కల సాకారమవుతోంది. ఏదైనా మనం ఒక పని మొదలుపెట్టేటప్పుడు ముందు దేవుణ్ని మొక్కి మొదలుపెడతాం.పని పూర్తయిన తర్వాత అదే దేవుణ్ని మొక్కి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఈ ప్రాంతంలో వేలాదిమంది ఎందుకు చనిపోతున్నారో తెలియని పరిస్ధితులు చూశాం నేను ఈ ప్రాంత వైద్యుడిగా ప్రత్యక్షంగా చూశాను, ఈ ప్రాంత ప్రజలకు ఆ దేవుడు పంపిన స్వరూపమే మన సీఎం కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయి, వందల మంది ఉద్యమాల బాట పట్టారు, మా కష్టాలు, కన్నీళ్ళు ఎవరైనా తుడవకపోతారా ఎదురుచూసిన ప్రాంతం ఇది వారికి సంజీవనిలా మీరు వచ్చారు, ఇది అతిపెద్ద భగీరథ ప్రయత్నం మీరు చేశారు అనేక అడ్డంకులు దాటి పూర్తిచేసిన మీ సంకల్పానికి సలాం పలాస అంటే ప్రపంచానికి తెలిసేది ఒకటి జీడిపప్పు, రెండు కొబ్బరి పంట ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి మార్గమైన అదనపు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు సైతం శంకుస్ధాపన చేసిన మీకు కృతజ్ఞతలు ఈ రోజు ప్రతిపక్షం మాటలు, కొన్ని పత్రికలు చూపుతున్న వక్రబాష్యాలు చూస్తున్నాం వారందరికీ నేను ఒకటే చెబుతున్నా.. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ గ్రామమైనా తీసుకోండి ఆ గ్రామంలో సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లీనిక్స్, ఆర్బీకేలు అభివృద్దిలో భాగం కాదా, విద్యావ్యవస్ధలో నాడు నేడు గొప్ప కార్యక్రమం, ఇవి అభివృద్ది కాదా, ఇక్కడ ప్రజలు వలసలు పోతున్నారంటున్నారు, కానీ ఇక్కడ మూలపేట పోర్టు పూర్తయితే ఈ జిల్లాకే వలసలు మొదలవుతాయి, భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖను రాజధాని చేయాలని, ఉత్తరాంధ్ర అభివృద్దికి మీరు చేస్తున్న సంస్కరణలు చిరస్మరణీయం రాబోయే దశాబ్ధానికి ఈ రాష్ట్రానికి సీఎంగా జగన్ గారే రావాలి, కావాలి, మీరు సీఎంగా కొనసాగడం ప్రతి పేదవాడికి అవసరం మీరు వెనక్కి తగ్గద్దు, గెలిచేవారికే టికెట్లివ్వండి, మా నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఇదే సంకల్పం తీసుకోవాలి మన జగనన్న సీఎం కావడం కోసం మనమంతా నడుం బిగించాలి. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ది కోసం ప్రత్యేకంగా రూ. 5 కోట్లు మంజూరు చేయాలని కోరుతున్నాను ఈ నియోజకవర్గంలో ఉన్న నౌపాడ, వెంకటాపురం రోడ్డును విస్తరించేందుకు ప్రతిపాదనలు అందజేశాం, మంజూరు చేయాలని కోరుతున్నాను. మాది వంశధార శివారు ప్రాంతం కాబట్టి హిరమండలం ఎల్ఐ స్కీమ్ ఇచ్చారు, దీనికి లింక్‌గా రూ. 8 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చాం, మంజూరు చేయగలరు వజ్రపుకొత్తూరు మండలంలోని శివారు ప్రాంతాలకు చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను మంజూరు చేయాలని కోరుతున్నాం. అనేక పనులు పూర్తిచేయమని మీరు నిధులు ఇచ్చారు, మా పలాస ప్రజల తరపున మీకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు ►పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్ ►మకరాంపురం నుంచి పలాస బయల్దేరిన సీఎం జగన్ ►కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్ ►అనంతరం రైల్వే గ్రౌండ్ భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్.. ►వైఎస్సార్ సుజలధార డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్ ►రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టు జాతికి అంకితం ►శ్రీకాకుళం: కంచిలి మండలం మకరాంపురం చేరుకున్న సీఎం జగన్ ►ఉద్దానం మంచినీటి పథకం, పలాస కిడ్నీ రిసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్న సీఎం ►విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ►అక్కడ నుండి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్లనున్న సీఎం ►పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్ తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ►గన్నవరం నుండి విశాఖపట్నం బయల్దేరిన సీఎం ►అక్కడ నుండి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్లనున్న సీఎం ►పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు కంచిలి మండలం మకరాంపురం గ్రామానికి హెలికాప్టర్లో వస్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.10 గంటలకు వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు పంప్‌హౌస్ స్విచ్ నొక్కి దాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పలాస వెళ్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.40 గంటలకు కిడ్నీ పరిశోధన కేంద్రానికి చేరుకుంటారు. ►అక్కడ ఆస్పత్రిని ప్రారంభించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇండ్రస్టియల్ కారిడార్‌కు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన వసతి గృహ భవనాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత పాత జాతీయ రహదారి మీదుగా పలాస రైల్వే క్రీడా మైదానానికి చేరుకుంటారు. సభా ప్రాంగణంలో స్టాల్స్‌ను పరిశీలించి బహిరంగ సభలో మాట్లాడతారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరిగి హెలికాప్టర్లో విశాఖకు బయలుదేరతారు. ►ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది. దీంతో వారి కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ – 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ►అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి కూడా సాహసించలేదు. ఇలాంటి పరిస్థితిలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.785 కోట్లు భారీ వ్యయం చేసి మరీ.. ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది. వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్– 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. ►ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు.. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్‌తో ప్రత్యేక వార్డులు. ►సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్ రే (డిజిటల్), థూలియం లేజర్ యూరో డైనమిక్ మెషీన్ తదితర పరికరాలతో పాటు ఐసీయూ సౌకర్యాలు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, 60 స్టాఫ్ నర్సు పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ. వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్.. ►ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు (క్రానిక్ కిడ్నీ డిసీజెస్) ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు ‘వైఎస్సార్ సుజలధార‘ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన రక్షిత తాగునీరు. హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా. ►ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మాణం. ఇప్పటికే 613 గ్రామాలకు నీటి సరఫరా.. ఈ నెలాఖరుకు మిగిలిన గ్రామాలకు. ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు.. ♦ గత ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు కేవలం రూ.2,500 చొప్పున పింఛన్ ఇస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ప్రతి నెలా 1న ఠంఛన్‌గా లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే వలంటీర్లతో అందజేస్తోంది. ♦ ఇప్పటికే టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 74 మెషీన్లతో డయాలసిస్ సేవలు. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020– 21లో 46,162 సెషన్లు, 2021–22లో 54,520 సెషన్లు, 2022–23లో 55,520 సెషన్లు, 2023–24లో (అక్టోబర్ నాటికి) 38,513 సెషన్ల చొప్పున కిడ్నీ బాధితులకు ప్రభుత్వం డయాలసిస్ సేవలు అందించింది. ఇప్పుడు దీనికి అదనంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్–సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ♦వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 6 సీహెచ్‌సీల్లో సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్ ఏర్పాటు. గత టీడీపీ ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే.. అది కూడా అరకొరగా అందజేశారు. ప్రస్తుతం ఇక్కడ ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కొత్త కేసుల గుర్తింపునకు నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగుతోంది. స్క్రీనింగ్ అనంతరం అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సీరమ్ క్రియాటినిన్ పరీక్షల కోసం సమీపంలోని పీహెచ్‌సీలకు తరలిస్తున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో పనిచేసే సీహెచ్‌వోలకు ప్రత్యేక యాప్. ఉద్దానం సమస్యలకు సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా.. జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్ -
Uddanam Hospital: పలాసలోని ఉద్దానం ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ (ఫొటోలు)
-
ఆపరేషన్ లేకుండా కిడ్నీలో రాళ్ల తొలగింపు
కర్నూలు(హాస్పిటల్): కిడ్నీలో రాళ్లను ఆపరేషన్ లేకుండా తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక యంత్రాన్ని సమకూర్చింది. గత సంవత్సరం రూ.1.5కోట్ల ఖర్చుతో ఈఎస్‌డబ్ల్యుఎల్ మిషన్‌ను ఆసుపత్రిలోని యురాలజి విభాగానికి అందజేసింది. ఇప్పటి వరకు 200 మంది రోగులకు కిడ్నీలో రాళ్లను ఆపరేషన్, ఎలాంటి అనెస్తీషియా లేకుండానే వైద్యులు తొలగించారు. దీంతో పాటు రోగిని అదేరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే వెసలుబాటు సైతం ఈ మిషన్ వల్ల కలుగుతోంది. ఈ మిషన్ ద్వారా నిర్వహించిన కేసుల వివరాలను ఇటీవల దుబాయిలో నిర్వహించిన అంతర్జాతీయ యురాలజి కాన్ఫరెన్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సేపూరి బాలరవితేజ వివరించారు. ఇందుకు ఆయన ప్రశంసలను సైతం అందుకున్నారు. -
చేపలు తింటున్నారా? దానిలోని ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల..
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది అధిక బీపీతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా వస్తుండటం విచారకరం. ‘అధిక రక్తపోటు’ శరీరంలో గుండె సమస్యలను పెంచుతుంది. అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యని నియంత్రించవచ్చు. అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే ఎక్కువ ఉప్పు, తీపి, కొవ్వు పదార్థాలను తినకూడదు. ఇలాంటివి తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఆహారంలో కొన్ని పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చేర్చినట్లయితే రక్తపోటును నియంత్రించవచ్చు. అవేంటో తెలుసుకుందాం. ►గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఫ్యాటీ ఫిష్ తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చేపలలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన హృదయాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ► ఆధునిక కాలంలో మారిన జీవన పరిస్థితుల వల్ల చాలామందిలో కిడ్నీలలో రాళ్లు ఏర్పడుతున్నాయి. దీనికి కారణాలు అనేకం. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. ఇందుకోసం కొన్ని చిట్కాలు ► తులసి ఆకుల రసాన్ని తీసి దానికి ఒక చెంచా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ► కిడ్నీలో రాళ్లను తొలగించడంలో టొమాటో రసం బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిస్థితిలో రెండు టమోటాలు బాగా కడిగి వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ జ్యూస్‌లో ఉప్పు, మిరియాల పొడి కలుపుకుని తాగాలి. కావాలంటే ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కిడ్నీలోని స్టోన్స్‌ను తొలగించడంలో చక్కగా పనిచేస్తుంది. ► పెరుగును ఒక గిన్నెలో తీసుకుని అందులో చెంచా నిమ్మరసం వేసి రుచికి తగినట్లుగా ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. -
మనిషికి పంది కిడ్నీ మార్పిడితో సత్ఫలితాలు
విశాఖపట్నం: పంది కిడ్నీ మనిషికి మార్పిడితో సత్ఫలితాలను ఇస్తుందని న్యూయార్క్‌లో గల లాంగోన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇన్స్టిట్యూట్కు చెందిన డాక్టర్ వశిష్ట తాతపూడి అన్నారు. బీచ్‌రోడ్డు రాడిసన్ బ్లూలో ఏపీ సొసైటీ ఫర్ నెఫ్రాలజీ రాష్ట్ర సదస్సులో భాగంగా రెండో రోజు ఆదివారం అమెరికా నుంచి వర్చువల్‌గా ఆయన మాట్లాడారు. పిగ్ టు హ్యూమన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై మాట్లాడుతూ జన్యుపరంగా మార్పు చెందిన పంది కిడ్నీని మనిషికి మార్పిడి చేశామన్నారు. రెండు నెలల వరకు కిడ్నీ బాగా పనిచేసిందన్నారు. ప్రస్తుతం ఉన్న అవయవాల కొరత భవిష్యత్తులో మరింత పెరగవచ్చని, అందువల్ల ఇటువంటి ప్రయోగాలు మరిన్ని చేయాల్సి ఉందని వివరించారు. అనంతరం శ్యామ్ బన్సల్, వివేక్ కూటే మాట్లాడుతూ కిడ్నీ మ్యాచింగ్ టెక్నిక్, జత చేసిన అవయవ మార్పిడిపై ప్రసంగించారు. డాక్టర్లు నికేష్ కామత్, గోపికా మీనన్, ఆశీష్కు ఉత్తమ సైంటిఫిక్ పేపర్ అవార్డులు అందజేశారు. సదస్సులో ఏపీ నలుమూలల నుంచి 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. -
అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ
లబ్బీపేట(విజయవాడతూర్పు) : ఎన్టీఆర్ జిల్లా వెల్వడం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ బ్రెయిన్ డెడ్‌కు గురికాగా.. ఆమె కుటుంబ సభ్యులు అవయవదానం చేసి ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్టు అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ వైద్యులు తెలిపారు. ఈ నెల 11న అవయవదానం చేయగా.. మూడేళ్లు, నాలుగేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరికి, దాత నుంచి సేకరించిన కిడ్నీలను ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు డాక్టర్ విట్టల్, డాక్టర్ స్వప్న తెలి పారు. ఆస్పత్రి ప్రాంగణంలో గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ ఒకే రోజు ఏకకాలంలో రెండు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయడం అరుదైన ఘటనగా చెప్పారు. యూరాలజిస్టులు డాక్టర్ ప్రశాంత్‌కుమార్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
భారత సంతతి చిన్నారికి అత్యంత అరుదైన కిడ్నీ మార్పిడి..!
సాధారణంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారికి కిడ్నీ ఇచ్చే దాత దొరకడం అరుదు. ఒకవేళ దొరికినా ఆపరేషన్ చేశాక జీవితాంత మందులు వాడుతుండాల్సిందే. ఎందుకంటే దాత ఇచ్చిన అవయవాన్ని అతడి శరీరం అంగీకరించదు తత్ఫలితంగా లేనిపోని సమస్యలు ఉత్ఫన్నమవుతుంటాయి వాటిని తట్టుకునేలా నిత్యం రోగ నిరోధక శక్తి కోసం మందులు వాడక తప్పదు. అయితే ఇలాంటి సమస్యలన్నింటికి చెక్‌పెట్టేలా యూకేలోని ఓ ఆస్పత్రి భారత సంతతి చిన్నారికి సరికొత్త కిడ్నీ మార్పిడి చికిత్స చేసింది. విజయవంతమవ్వడమే కాదు ఇప్పుడూ ఆ చిన్నారి చాలా చలాకీగా అందరిలా అన్ని పనులు చేస్తోంది. అసలేం జరిగిందంటే..భారత సంతతికి చెందిన 8 ఏళ్ల చిన్నారి అదితి శంకర్ అరుదైన జన్నుపరమైన పరిస్థితి కారణంగా కోలుకోలేని మూత్రపిండ వైఫల్యంతో పోరాడుతుంది. గత మూడేళ్లుగా డయాలసిస్‌పైనే జీవనం సాగిస్తోంది. ఆమెకు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంది. ఈనేపథ్యంలో లండన్‌లోని గ్రేట్ ఓర్మాండ్ స్ట్రీట్ ఆస్పత్రి(ఘోష్) ఒక సరికొత్త కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్‌కి తెరతీసింది. ఇది ఎంతోమంది కిడ్నీ వ్యాధిగ్రస్తుల పాలిట వరంలా మారింది. చిన్నారి అదితికి కిడ్నీ మార్పిడి చేయడానికి దాతగా ఆమె తల్లే కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఐతే ఈ మార్పిడి చికిత్సకు ముందే అదితికి ఆమె తల్లి ఎముక మజ్జ సాయంతో అధితికి స్టెమ్‌సెల్ మార్పిడి చేశారు. అధితి శరీరం తిరస్కరించకుండా ఉండేలా దాత రోగ నిరోధక వ్యవస్థలా రీప్రోగామ్ చేశారు. దీంతో ఆమెకు మార్పిడి చికిత్స చేసిన తర్వాత కొత్త కిడ్నీ శరీరంపై దాడి చేయదు. ఆమె శక్తి స్థాయిలో మార్పులను వైద్యులు గమనించారు. ఆమె జీవితాంత రోగనిరోధక స్థాయిలకు సంబంధించే మందులతో పనిలేకుండా హాయిగా కొత్త కిడ్నీతో జీవించేలా చేశారు. ఎలాంటి దుష్ఫరిణామాలు ఉండకుండా ఆమె భవిష్యత్తు మొత్తం హాయిగా సాగిపోతుందని నమ్మకంగా చెప్పారు. ఇప్పుడామె స్విమ్మింగ్ వంటివి హుషారుగా నేర్చుకుంటోంది కూడా. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గం లేని రోగులకు ఈ విధానం ఉపయోగపడుతుందని వైద్యులు తెలిపారు. ఈ చికిత్స విధానం వల్ల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చయించుకున్న రోగులు ఎలాంటి సమస్యలు ఎదుర్కోరు. పైగా జీవితాంత మందులు వాడాల్సిన బాధ తప్పుతుంది. “Aditi's always dancing and singing. We’re so happy that she can be the amazing version of herself that she is, thanks to her dual transplant.” Uday, Aditi’s dad. ✨ 8-year-old Aditi is the first child in the UK to receive an improved kidney transplant.https://t.co/xnskoDQ9vA pic.twitter.com/53WMhd3ncv — Great Ormond Street Hospital (@GreatOrmondSt) September 22, 2023 (చదవండి: ఆత్మహత్య ధోరణి జన్యుపరంగా సంక్రమిస్తుందా? అలానే విజయ్ ఆంటోని కూతురు..) -
మానవుడికి పంది కిడ్నీ..ప్రయోగం విజయవంతం
అవయవ దానం అనేది ఓ సమస్యాత్మకంగా మారింది. దాతలు దొరకక, బ్రెయిన్ డెడ్ వ్యక్తుల నుంచి అవయవాల సేకరణ పరిమితంగానే ఉండటం తదితర కారణాల దృష్ణ్యా ప్రస్తుతం అవయవాల మార్పిడి ఓ అర్థంకానీ ప్రశ్నలా ఉంది. ఆ ప్రశ్నకు సమాధానమే కాదు ఎన్నాళ్లుగా చిక్కుముడి వీడని ప్రశ్నలా వేధిస్తున్న సమస్యకు సమాధానం దొరికిందనే కొత్త ఆశని ఇచ్చింది. ఇంతవరకు పంది కిడ్నీని మనిషికి అమర్చి చేసిన ప్రయోగాల్లో చాలా వరకు ఒకటి రెండు రోజుల వరకే పనిచేస్తే ..ఈసారి మాత్రం ఏకంగా రెండు నెలలు విజయవంతంగా పనిచేసి రికార్డు సృష్టించింది. అదికూడా బ్రెయిన్‌డెడ్ మనిషిలో విజయవంతమవ్వడం పరిశోధకులకు సరికొత్త ఆశలను రేకెత్తించింది. ఈ పరిశోధన యూఎస్‌లో విజయవంతం అయ్యింది. మానవునిలో జన్యుపరంగా మార్పు చెందిన పంది కిడ్నీ సుదీర్ఘకాలం పనిచేయడం ఇదే తొలిసారి. ఈ మేరకు డాక్టర్ మోంట్‌గోమెరీ వైద్య బృందం మాట్లాడుతూ..ఈ ప్రయోగం అవయకొరత సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుందని ఆనందంగా చెప్పారు. తాము మారిస్ మిల్లర్ అనే బ్రెయిన్ డెడ్ వ్యక్తి మృతదేహాన్ని వెంటిలేటర్‌పై ఉంచి ఈ ప్రయోగాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రెండు నెలలపాటు అతడిని వెంటిలేటర్‌పై ఉంచి మరీ ఆ పంది కిడ్నీ ఎలా పనిచేస్తుందో పరీక్షించినట్లు తెలిపారు. ఒక నెలపాటు విజయవంతంగా పనిచేసిందని ఆ తదుపరి నెమ్మదిగా మార్పులు కనిపించడం మొదలైంది. రోగనిరోధక వంటి మందుల చికిత్సతో కిడ్నీ పనితీరుని పొడిగించేలా చేశామని తెలిపారు. భవిష్యత్తులో ఇలా జంతువుల అవయవాల ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతమవుతుందనే ఆశను ధృవీకరించింది. దీనిపై మరింతగా ప్రయోగాలు చేసి కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి తెలిపిందని పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి సదరు వ్యక్తి మిల్లర్ ఆకస్మికంగా కుప్పకూలి బ్రెయిన్‌డెడ్ అయ్యారు. అయితే క్యాన్సర్ కారణంగా అతడి అవయవాలను దానం చేయడం వీలుపడలేదు. అతని సోదరి మేరి మిల్లర్ డఫీ, పిగ్ కిడ్నీ ప్రయోగం కోసం అతడి మృతదేహాన్ని దానం చేయాలనే నిర్ణయాన్ని చాలా భారంగా తీసుకుంది. జూలై 14న మిల్లర్ 58వ పుట్టిన రోజుకు కొద్దిరోజుల ముందు పంది కిడ్నీని మిల్లర్‌కి మార్పిడి చేసి పరీక్షించడం ప్రారంభించారు. జంతువులోని థైమస్ గ్రంథికి రోగనిరోధక కణాలతో పనిచేయగలిగేలా పరిశోధకులు శిక్షణ ఇచ్చారు. దీంతో మొదటి నెలంతా చాలా విజయవంతంగా ఆ కిడ్నీ పనిచేసింది. ఇక రెండో నెల నుంచి మూత్రంలో తగుదల వంటి మార్పులు ప్రారంభమయ్యాయి. వైద్యులు అందుకు అనుగుణంగా చికిత్స అందించి అది పనిచేసేలా చికిత్స అందించారు. ఈ ప్రయోగం జన్యుపరంగా మార్పు చెందని పందుల నుంచి అవయవాలను ట్రాన్స్‌ప్లాంట్ చేయగలమనే నమ్మకాన్ని అందించింది. వైద్యలు గత మూడు నెలలుగా చేసిన ఈ ప్రయోగం విజయవంతంగా ముగిసింది. ఇక మిల్లర్ మృతదేహం నుంచి పంది కిడ్నీని తొలగించి దహనసంస్కారాల నిమిత్తం అతడి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. అయితే ఇలా జంతువుల అవయవాల మార్పిడి కారణంగా శోషరస కణుపులు, జీర్ణవ్యవస్థలో ఏవైనా సమస్యలు వస్తాయా? అనేదాని గురించి మరింతగా పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. అందుకోసం జీర్ణవ్యవస్థలోని సుమారు 180 వేర్వేరు కణజాల నమూనాలను పరిశీలించాల్సి ఉందని కూడా అన్నారు. చావు అంచుల మధ్య కొట్టుమిట్లాడుతున్న వారికి అవయవదానం ..కొత్త ఊపిరి పోసి జీవితంలో రెండో అవకాశం లభించేలా చేయడమే లక్ష్యంగా ఈప్రయోగాలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. (చదవండి: చిన్నారుల్లో బ్రాంకియోలైటిస్ వస్తే...? ముఖ్యంగా అలాంటి పిల్లలు..) -
అలా జరిగితే.. మూత్రపిండాలు దెబ్బతిన్నట్లా?
ఇటీవల కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న సమస్యే మూత్రపిండాల వ్యాధి. ఇది ఒక్కటి పాడవ్వతే మొత్తం జీవన గమనమే మారిపోతుంది. దీని విషయంలో ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చు. అయితే మూత్రపిండాలు దెబ్బతింటున్నాయని మన శరీరం ముందుగానే కొన్ని సంకేతాలిస్తుందని ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి చెబుతున్నారు. దీన్ని గమనించినట్లయితే సత్వరమే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చని అంటున్నారు. ఏవిధమైన సంకేతాలిస్తుంది. ఆ తదుపరి కిడ్నీలు మెరుగుపడేలా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది తదితర విషయాలు ఆయన మాటట్లోనే చూద్దాం. రక్తంలో ప్రోటీన్ కోల్పోవడాన్ని ప్రొటీనురియా అంటారు. ఈ స్థితిలో ప్రోటీన్, గణనీయమైన మొత్తంలో మూత్రం ద్వారా బయటకు పోవడం ప్రారంభమవుతుంది. ప్రోటీన్ నష్టం మూత్రపిండ దెబ్బతింటున్నాయని చెప్పేందుకు తొలి సంకేతం. మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభించినప్పుడు రోగులు చూసే మొదటి లక్షణం ప్రోటీన్యూరియా. ప్రోటీన్యూరియా కారణాలు: డీహైడ్రేషన్ మీ శరీరం శరీరం నుంచి చాలా ద్రవాన్ని కోల్పోయినప్పుడు, అది నిర్జలీకరణానికి కారణమవుతుంది. మనందరికీ తెలిసినట్లుగా, ప్రోటీన్లు, అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు వంటి పోషకాలను మూత్రపిండాలకు అందించడానికి నీరు సహాయపడుతుంది, కానీ తగినంత నీరు లేకుండా, ఇది రక్తం యొక్క సంక్లిష్ట పనితీరును కలిగి ఉంటుంది. క్రమంగా, మూత్రపిండాలు సరిగ్గా ప్రోటీన్లను తిరిగి పొందలేవు. బదులుగా ప్రోటీన్ మూత్రంలో చేరుతుంది . అధిక రక్తపోటు: అధిక రక్తపోటు ప్రోటీన్ నష్టానికి ప్రధాన కారణం, ఎందుకంటే పెరిగిన రక్తపోటు కారణంగా మూత్రపిండాలపై పొర ఒత్తిడిని తట్టుకోలేకపోతుంది. ఫలితంగా అధిక మొత్తంలో ప్రోటీన్ మూత్రం ద్వారా వెళ్లిపోవడం ప్రారంభమవుతుంది. డయాబెటిస్ మెల్లిటస్: మధుమేహం మూత్రపిండ కణం పొరను దెబ్బతీస్తుంది. మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం వల్ల ఇది మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. మూత్రం ద్వారా విపరీతమైన ప్రోటీన్ బయటకు వస్తుంది. నెఫ్రోపతీ ఐజీఐ నెఫ్రోపతిలో, ఇమ్యునోగ్లోబులిన్ శరీరంలో పేరుకుపోతుంది, మూత్రపిండాల కణజాలంలో వాపును కలిగిస్తుంది. ఇది కిడ్నీ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అధిక మొత్తంలో ప్రోటీన్ ఫిల్టర్ అయ్యి బయటకు వస్తుంది. పాలిసిస్టిక్ వ్యాధులు పాలిసిస్టిక్ వ్యాధిలో, మూత్రపిండము ఉపరితలంపై తిత్తుల సర్వర్ పెరుగుదల అభివృద్ధి చెందుతుంది. ఇది మూత్రపిండాల కణాల పొరను ప్రభావితం చేస్తుంది. పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధిలో తిత్తులు ఏర్పడటం వల్ల ప్రొటీనురియా ఏర్పడుతుంది. లక్షణాలు: బలహీనంగా మారడం ప్రొటీన్లను కోల్పోవడం రోగులను రోజురోజుకు బలహీనపరుస్తుంది. రోగులకు, వారిని ఆరోగ్యంగా చురుకుగా ఉంచడానికి ప్రోటీన్ కీలకం. నురుగు మూత్రం నురుగు లేదా ముదురు రంగు మూత్రం మూత్రపిండ వైఫల్యం కారణంగా పెద్ద మొత్తంలో ప్రోటీన్ బయటకు వస్తుందని చూపిస్తుంది. మీ మూత్రంలోని ప్రోటీన్ గాలితో చర్య జరిపి నురుగును సృష్టిస్తుంది. మూత్రవిసర్జనలో ఫ్రీక్వెన్సీ ప్రతి 24 గంటలకు 6 నుంచి 8 సార్లు మూత్ర విసర్జన చేయడం సాధారణం. దాని కంటే ఎక్కువగా ఉంటుంది. అదికూడా రాత్రిపూట ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం (ఒకసారి కంటే ఎక్కువ) లేదా తరచుగా మూత్రవిసర్జన. ఇది రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసి చాలా అసౌకర్యంగా ఉంటుంది. వికారం వాంతులు అవయవాలు సరిగా పనిచేయకపోవడం వల్ల వాంతులు మరియు వికారం ఏర్పడవచ్చు. ఆకలి లేకపోవడం: శరీరంలో తగినంత ప్రోటీన్ లేకపోవడం వల్ల రోగులు ఆకలి లేకపోవడం అనుభూతి చెందుతారు. కళ్ల చుట్టూ ఉబ్బడం: కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న రోగులు ముఖ్యంగా ఉదయాన్నే కళ్ల చుట్టూ ఉబ్బినట్లు కనిపిస్తారు. వ్యర్థ పదార్థాల సేకరణ ఈ ప్రాంతాల్లో మంటను కలిగించవచ్చు. నివారణ: ప్రోటీన్ రహిత ఆహారం కిడ్నీ రోగికి ప్రొటీనురియా ఉంటే వారి ఆహారంలో 15 నుంచి 20% ప్రోటీన్ ఉండాలి. అధిక క్రియాటినిన్ స్థాయిలు ఉన్న రోగులు ప్రోటీన్ తీసుకోవడం పరిమితం చేయాలని సూచించారు. మూత్రపిండ రోగులకు సిఫార్సు చేయబడిన ఏకైక ప్రోటీన్ మూంగ్ కి దాల్. ఒక కప్పు పండు ఆహారంలో ఒక కప్పు పండు (ఏదైనా) కిడ్నీకి తగినంత మొత్తం. మీ సీరం బైకార్బోనేట్ స్థాయి సగటు ఉంటే, మీరు ఏదైనా పండు తీసుకోవచ్చు. కాకపోతే, వైద్యులు తమ రోగులకు ప్రతి ఆమ్ల పండును నివారించాలని సూచిస్తున్నారు. అధిక రక్తపోటును నియంత్రించండి మూత్రపిండ వైఫల్యంతో బాధపడుతున్న రోగులు వారి అధిక రక్తపోటును ఎలాగైనా నియంత్రించాలి. ఎందుకంటే పైన చెప్పాన సాధారణ కారణాలు మీ మూత్రపిండాలను దెబ్బతీస్తే, చెప్పిన వాటిని మెరుగుపరచడం ద్వారా మీ మూత్రపిండాలను మెరుగుపరుచుకోవచ్చు. ఆయుర్వేద కిడ్నీ చికిత్సలో మొదట కారణానికి చికిత్స చేస్తారు, ఆపై వ్యాధిని దశలవారీగా నయం చేస్తారు. మధుమేహాన్ని నియంత్రించండి మనకు ఇప్పటికే తెలిసినట్లుగా, అధిక చక్కెర స్థాయి మూత్రపిండాలకు హాని కలిగించే మూత్రపిండాల కణాల పొరను ప్రభావితం చేస్తుంది. రెగ్యులర్ యోగ రెగ్యులర్ యోగా శ్వాస వ్యాయామాలు మీ అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి ఎందుకంటే అధిక రక్తపోటు కణాల పొరను దెబ్బతీస్తుంది. మూత్రపిండాల బలహీనమైన కణాలు ఖచ్చితంగా పని చేయలేవు. బరువు తగ్గడం మూత్రం నుంచి అధిక మొత్తంలో ప్రోటీన్ విడుదల కారణంగా, రోగి బలహీనంగా మారి బరువు తగ్గుతారు. తగినంత నీరు త్రాగాలి ప్రతి వైద్యుడికి, రోగి ఎంత నీరు త్రాగాలి అని లెక్కించడం అసాధ్యం. రోగికి రోగికి అవసరమైన నీటి పరిమాణం మారుతూ ఉంటుంది. మనకు ఇప్పుడు నీరు అవసరమా అని తనిఖీ చేయడానికి దేవుడు మనకు నాలుక, నోటిని సెన్సార్‌గా ఇచ్చాడు. కాబట్టి మీ నోరు పొడిబారినట్లు అనిపించినప్పుడు, ఒక సిప్ నీరు తీసుకోండి ఒకేసారి చాలా నీరు తాగొద్దు. యూరిక్ యాసిడ్ పూర్తిగా తగ్గేవరకు తీసుకోవాల్సినజాగ్రత్తలు: 1. కొన్ని వారాల పాటు అన్ని రకాల నాన్ వెజ్ ఆహారాలు (చికెన్, మటన్, లివర్, చేప, రొయ్యలు మొదలైనవి) పూర్తిగా ఆపివెయ్యండి. రోజుకు 1 లేదా 2 గుడ్లు వరకు పరవాలేదు. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని కచ్చితంగా త్రాగండి. తరచుగా నిమ్మకాయలు తీసుకోండి. పీచు పదార్థం అధికంగా ఉండే బీరకాయ, సొరకాయ, బెండ, బ్రోకలీ, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. కాలీఫ్లవర్, పాలకూర, పన్నీర్, పుట్టగొడుగులు వంటి కూరగాయలను కొన్నాళ్లు నివారించాలి. ---నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు (చదవండి: సంతానోత్పత్తి తగ్గుముఖం..! తొలిస్థానంలో భారత్..!!) -
‘నిమ్స్ ది గ్రేట్’ : మంత్రి హరీష్‌రావు ప్రశంసలు..!
హైదరాబాద్: అవయవ మార్పిడి ఆపరేషన్లలో నిజాం వైద్య విజ్ఞాన సంస్ధ(నిమ్స్) తన ప్రత్యేకతను మరోసారి చాటి చెప్పింది. గతంలో ఎన్నో విజయాలను పదిలపర్చుకున్న నిమ్స్ తాజాగా మారో అరుదైన రికార్డు సృష్టించి వైద్య రంగాలలోనే సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఎనిమిది నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా చేసి అరుదైన రికార్డును వైద్యులు సొంతం చేసుకున్నారు. ఇందులో 61 లైవ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయగా, 39 దాతల ద్వారా సేకరించినవి.. గ్రహీతల్లో 11, 12 ఏళ్ల వయసువారు కూడా ఉండడం చెప్పుకోదగ్గ అంశం. శుక్రవారం వందో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్య బృందంలో యూరాలజీ వైద్యనిపుణులు ప్రొఫెసర్ రామ్‌రెడ్డి, విద్యాసాగర్, రామచంద్రయ్య, తదితరులు ఉన్నారు. వీరంతా యూరాలజీ హెచ్ఓడీ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స మార్పిడిలు చేస్తున్నారు. గత నెలలో రూ.32 కోట్లతో సమకూర్చుకున్న అడ్వాన్స్డ్ పరిజ్ఞానం ఉన్న రోబోటిక్స్ సాయంతో యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాల్లో అత్యంత సంక్లిష్టమైన నెల రోజుల వ్యవధిలోనే 30 అపరేషన్లను చేశారు. గాల్‌బ్లాడర్, హెర్నియా, ఆచలాసియా కార్డియా సర్జరీలను చిన్న రంధ్రంతో సులువుగా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తున్నారు. సాధారణ పద్దతుల్లో చేసే సర్జరీలతో పోల్చితే రోబోటిక్ సర్జరీలు కూడా చాలా కచ్చితంగా జరుగుతున్నాయి. ఆపరేషన్ జరిగిన మూడు రోజుల్లోనే రోగి డిశ్చార్జి కావడం విశేషం. హరీష్‌రావు మంత్రి ప్రశంసలు.. అత్యధిక మార్పిడి ఆపరేషన్లు చేసి నిమ్స్ వైద్యులు చెప్పుకోదగ్గ రికార్డును నెలకొల్పారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ప్రశంసించారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ల్లో రికార్డు బ్రేక్ చేసి యూరాలజీ వైద్యులను మంత్రి ఎక్స్(ట్విట్టర్)లో అభినందించారు. ఈ అసాధారణ అవయవ మార్పిడి ద్వారా ప్రాణాలను కాపాడాలనే తమ అచంచలమైన నిబద్ధతను హైలైట్ చేస్తోందన్నారు. ఎంత పెద్ద శస్త్రచికిత్స అయినా.. ఎంత పెద్ద శస్త్రచికిత్సనైనా సులువుగా చేయవచ్చు. రోబోటిక్ సర్జరీలను ప్రారంభించిన అనతికాలంలోనే పెద్ద సంఖ్యలో విజయవంతంగా ఆపరేషన్లు చేయడం నిమ్స్ వైద్యుల ప్రతిభకు తార్కాణం. ఇప్పడు ఆస్పత్రిలో నొప్పి తక్కువతో.. ఇన్ఫెక్షన్లకు తావులేకుండా చేస్తున్నాం. – ప్రొఫెసర్ నగరి బీరప్ప, సంచాలకులు, నిమ్స్ -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. తీవ్రమైన వ్యాధితో నటి మృతి!
సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అర్జెంటీనాకు చెందిన ప్రముఖ నటి, మాజీ మోడల్ సిల్వినా లూనా కన్నుమూసింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. 79 రోజుల పాటు పోరాడి తుదిశ్వాస విడిచింది. ప్రస్తుతం ఆమె వయస్సు 43 ఏళ్లు కాగా.. గతంలో ఆమె కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే అది వికటించి తీవ్ర అనారోగ్యానికి దారి తీసినట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!) సర్జరీ వల్ల మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆమె జూన్‌లో ఆస్పత్రిలో చేరింది. వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. ఆగస్టు 31నే ఆమె చనిపోగా ఈ విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. కాగా.. సిల్వినా లూనా అర్జెంటీనా టీవీ పరిశ్రమలో నటిగా, యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానలు షాక్‌కు గురయ్యారు. సిల్వినా మృతి పట్ల పలువురు అర్జంటీనా నటీనటులు సంతాపం తెలిపారు. (ఇది చదవండి: దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది?.. రిలీజ్ ఎప్పుడంటే? ) -
రక్షాబంధన్ సాక్షిగా.. తమ్ముడి కోసం అక్క కిడ్నీ దానం..
రాయ్‌పూర్: అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేస్తుంది రాఖీ పౌర్ణమి. సంతోషంగా జీవతాంతం కలిసి ఉండాలని కోరుకుంటూ అన్నదమ్ముల్లకు ఆడపిల్లలు రాఖీ కడుతారు. వారి రక్షణ ఎప్పుడూ తనకు ఉండాలని కోరుకుంటారు. పండగపూట సోదరి కళ్లలో ఆనందం చూడటానికి ఓ మంచి గిఫ్ట్‌తో అన్నాదమ్ముళ్లు సర్ప్రైజ్ చేస్తుంటారు. అయితే.. చత్తీస్‌గఢ్‌లో మాత్రం ఓ సోదరి తమ్ముడి మీద ప్రేమతో ఓ కిడ్నీనే దానంగా ఇస్తోంది. ఓం ప్రకాశ్(48), ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌వాసి. గత ఏడాది మే నెల నుంచే అతను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఓ కిడ్నీ 80 శాతం, మరో కిడ్నీ 90 శాతం వ్యాధి బారినపడ్డాయి. డయాలసిస్‌తో కాలం వెల్లదీస్తున్నాడు. అనేక ఆస్పత్రులకు తిరిగిన అనంతరం కిడ్నీ మార్పిడికి కుటుంబ సభ్యులు సిద్ధపడ్డారు. దీంతో కిడ్నీదాత కావాలని డాక్టర్లు చెప్పారు. దీంతో తమ్ముడి కోసం ఓం ప్రకాశ్ పెద్ద అక్క శీలాభాయ్ పాల్ ముందుకు వచ్చింది. రాయ్‌పూర్‌లోని టిక్రపారలో ఉంటున్న ఆమె తమ్ముడి సమస్య తెలిసి వెంటనే కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడింది. పరీక్షల అనంతరం ఆమె కిడ్నీ ఓం ప్రకాశ్‌కు సెట్ అవుతుందని డాక్టర్లు తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీన ఆపరేషన్ జరనుంది. తమ్ముడంటే ప్రేమ అని తెలిపిన శీలాభాయ్.. అతనితో కలిసి జీవితాంతం బతకాలని కోరుకుంటున్నానని చెప్పారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు ఇంకా మూడు రోజులు ఉండగా.. నేడు శీలాభాయ్ తన తమ్ముడు ఓం ప్రకాశ్‌కి రాఖీ కట్టింది. తన తమ్ముడు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించింది. ఇదీ చదవండి: Raksha Bandhan 2023 Special: ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు? ఆ టైంలోనే రాఖీ కట్టాలా! -
అవయవ మార్పిడికి దేశంలో 56 వేల మంది వెయిటింగ్
సాక్షి, అమరావతి: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అవయవాల మార్పిడి కోసం గత ఏడాది వరకు 56,852 మంది వెయిటింగ్లో ఉన్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం పార్లమెంట్లో వెల్లడించింది. అలాగే గతేడాది 16,041 మందికి అవయవాల మార్పిడి చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా అవయవాల వారీగా రోగులను జాతీయ రిజిస్ట్రీలో నమోదు చేస్తున్నట్లు తెలిపింది. మరణించిన దాతల నుంచి అవయవాలు స్వీకరించేందుకు రోగుల నమోదు రుసుము వసూలును నిలుపుదల చేసినట్లు చెప్పింది. గతంలో 65 సంవత్సరాల్లోపు వ్యక్తుల నుంచి మాత్రమే అవయవ దానాలకు అనుమతి ఉండేదని, ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా మరణించిన ఏ వయసు వ్యక్తి అయినా అవయవదానం చేయడానికి అనుమతించామని తెలిపింది. ఈ విధానపరమైన నిర్ణయాలను అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలకు సమాచారం పంపించినట్లు వెల్లడించింది. అవయవ మార్పిడిని ప్రోత్సహించడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమావేశం నిర్వహించామని, ఒక దేశం ఒకే విధానం అమలు చేయాల్సిందిగా సూచించినట్లు పేర్కొంది. వెయిటింగ్లో ప్రాధాన్యతను నిర్ణయించడం కోసం ప్రారంభ నమోదును పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, దేశ వ్యాప్తంగా అవయవ దానం, మార్పిడిని ప్రోత్సహించడానికి మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశామని వెల్లడించింది. ఐదు ప్రాంతీయ అవయవాల మార్పిడి సంస్థలను, అలాగే ఆంధ్రప్రదేశ్‌తో సహా 20 రాష్ట్రాల్లో అవయవ మార్పిడి సంస్థలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. అత్యధికంగా కిడ్నీల కోసం, తరువాత కాలేయాల కోసం రోగులు ఎదురు చూస్తున్నట్లు వివరించింది. -
ఆగమేఘాలపై కిడ్నీ తరలింపు
కాకినాడ : కాకినాడ అపోలో ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన 50 ఏళ్ల మహిళ కుటుంబం ఆదర్శంగా నిలిచింది. ఆమె మూత్రపిండాలను కుటుంబ సభ్యులు దానం చేసి మరో ఇద్దరి ప్రాణాలు నిలిపారు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ అపోలో ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ బాధితురాలి నుంచి గురువారం రెండు కిడ్నీలు సేకరించారు. ఓ కిడ్నీని అదే ఆస్పత్రిలో రోగికి అమర్చగా, మరో కిడ్నీని విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడికి అమర్చే నిమిత్తం తీసుకెళ్లారు. కాకినాడ అపోలో యాజమాన్యం జిల్లా ఎస్పీ సతీ‹Ùకుమార్‌ను ఆశ్రయించగా.. ఆయన గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కిడ్నీని అంబులెన్స్‌లో విశాఖ తరలించారు. కనీసం నాలుగు గంటల సమయం పట్టే ప్రయాణం కేవలం రెండు గంటల్లోనే పూర్తయి కిడ్నీ భద్రంగా చేరింది. -
అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్..
రూ.9 వేల కోట్ల నెట్‌వర్త్‌తో దేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరు కోచౌసెఫ్ చిట్టిలపిల్లి. రూ. 1 లక్షతో చిన్న కంపెనీని ప్రారంభించిన ఆయన రూ. 11వేల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్‌తో వి-గార్డ్ ఇండస్ట్రీస్, దాదాపు రూ. 2,500 కోట్లతో వండర్లా హాలిడేస్ వంటి కంపెనీలను స్థాపించి అభివృద్ధి చేశారు. వ్యాపారపరంగా ఇంత ఎత్తుకు ఎదిగిన కోచౌసెఫ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది దశాబ్దం ఆయన క్రితం చేసిన నిస్వార్థ చర్య. కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన కోచౌసెఫ్ 61 ఏళ్ల వయసులో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది తన కిడ్నీని దానం చేయడం. అది కూడా అపరిచితుడైన ఒక పేద ట్రక్కు డ్రైవర్‌కు. ఇందుకు కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. వైద్యులు వారించినా లెక్క చేయలేదు. తాను ఇలా చేసింది.. శరీరం ఫిట్‌గా ఉంటే కిడ్నీలో ఒకదానిని దానం చేసినా ఫర్వాలేదని చాటి చెప్పడానికేనని తర్వాత ఓ ప్రముఖ దినపత్రికతో తెలిపారు. ఎవరీ కోచౌస్ఫ్ కోచౌసెఫ్ చిట్టిలపిల్లి? కేరళలోని త్రిస్సూర్ శివారులో 1950లో జన్మించారు కోచౌసెఫ్ చిట్టిలపిల్లి. స్థానిక చర్చి పాఠశాలలో చదువుకున్నారు. తరువాత త్రిసూర్‌లోని సెయింట్ థామస్ కళాశాల నుంచి భౌతికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1973లో తిరువనంతపురంలోని ఎలక్ట్రానిక్స్ కంపెనీలో వోల్టేజ్ స్టెబిలైజర్లు, ఎమర్జెన్సీ ల్యాంప్‌లను తయారు చేయడం ప్రారంభించారు. మూడేళ్లపాటు అక్కడ సూపర్వైజర్గా పనిచేసిన కోచౌసెఫ్ ఉద్యోగం వదిలేసి రూ. 1 లక్ష మూలధనంతో 1977లో వి-గార్డ్ ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. కేవలం ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమైన వి-గార్డ్ నేడు దేశంలోనే అతిపెద్ద స్టెబిలైజర్ బ్రాండ్. తన వ్యాపారాన్ని విస్తృతం చేస్తూ కోచౌసెఫ్ 2000 సంవత్సరంలో కేరళలో మొట్టమొదటి వాటర్ థీమ్ పార్క్‌ను ప్రారంభించారు. అలాగే బెంగళూరులో వండర్లా పార్కును ఏర్పాటు చేసింది కూడా ఈయనే. ఇక సేవా కార్యక్రమాల విషయానికి వస్తే.. కె. చిట్టిలపిల్లి ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వెయ్యి నిరుపేద కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇచ్చారు. స్ట్రే డాగ్ ఫ్రీ ఉద్యమానికి అధ్యక్షత వహించారు. అత్యధిక పన్ను చెల్లింపుదారులలో ఒకరిగా భారత ప్రభుత్వం నుంచి రాష్ట్రీయ సమ్మాన్ అవార్డుతో సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. ప్రాక్టికల్ విజ్డమ్ సిరీస్, తన ఆత్మకథ ‘ఒర్‌మక్కిలివాథిల్’తో సహా పలు పుస్తకాలను రచించారు. కోచౌసెఫ్ సతీమణి పేరు షీలా. వీరికి అరుణ్, మిథున్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు వి-గార్డ్, వండర్లా వ్యాపారాలను చూసుకుంటున్నారు. -
ఏడాదిలో కిడ్నీ మార్పిడులు 11,423
సాక్షి, హైదరాబాద్: దేశంలో కిడ్నీ మార్పిడి చికిత్సలు గణనీయంగా పెరిగాయి. ఒక్క 2022 ఏడాదిలోనే ఏకంగా 11,423 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగినట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తాజాగా వెల్లడించింది. పదేళ్లలో ఈ చికిత్సలు దాదాపు మూడింతలు పెరిగినట్టు తెలిపింది. 2013లో 4,037 కిడ్నీ మార్పిడి చికిత్సలు జరిగాయి. ఆ తర్వాత ఏటా పెరుగుతూ 2019లో 9,751కు చేరాయి. కరోనా కారణంగా 2020లో 5,488, 2021లో 9,105 శస్త్రచికిత్సలు జరిగాయి. కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతోపాటు అవయవ దానానికి ముందుకొస్తున్నవారిలో పెరుగుదల కూడా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పెరగడానికి కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కిడ్నీ బాధితులు దాతల కోసం ఎదురుచూస్తున్నారని అంటున్నారు. కిడ్నీ చికిత్సలే అధికం సాధారణంగా కిడ్నీ, పాంక్రియాస్, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారికి ఆయా అవయవాలను మార్పిడి చేస్తారు. దేశవ్యాప్తంగా అన్ని రకాల అవయవ మార్పిడి చికిత్సలు కలిపి 2013లో 4,990 జరగ్గా.. 2022 నాటికి 15,561కి పెరిగాయి. ఇందులో అధికంగా 11,423 కిడ్నీ మార్పిడి చికిత్సలే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. ఇక కాలేయ మార్పిడి చికిత్సలు 3,718, గుండె మార్పిడులు 250, ఊపిరితిత్తుల మార్పిడులు 138, పాంక్రియాస్ 24, కిడ్నీ–పాంక్రియాస్ 22 చికిత్సలు జరిగాయి. ‘బ్రెయిన్‌డెడ్’ దాతల నుంచి.. 2022లో దేశవ్యాప్తంగా బ్రెయిన్‌డెడ్ అయినవారి నుంచి సేకరించిన అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఇలా 655 శస్త్రచికిత్సలు జరగగా.. తమిళనాడులో 553, కర్ణాటక 435, గుజరాత్ 399, మహారాష్ట్రలో 305 అవయవ మార్పిడులు జరిగినట్టు తెలిపింది. ఇక బతికున్నవారి దాతల (లివింగ్ డోనర్) నుంచి తీసుకున్న అవయవ మార్పిడిలో ఢిల్లీ టాప్‌లో ఉంది. ఆ రాష్ట్రంలో అత్యధికంగా 3,623 లివింగ్ డోనర్ అవయవ మార్పిడులు జరిగాయి. తర్వాత తమిళనాడు 1,691, మహారాష్ట్ర 1,211, కేరళ 979, పశ్చిమబెంగాల్ 928 అవయవ మార్పిడి చికిత్సలు జరిగాయి. పెద్ద సంఖ్యలో బాధితులు సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా, శస్త్రచికిత్సలు చేసే సదుపాయాలు అంతటా అందుబాటులోకి వచ్చినా.. అవయవాలు దొరక్క చాలా మంది బాధితులు ఇబ్బందిపడుతున్నారు. దాతల కోసం ఎదురుచూస్తూనే.. పరిస్థితి విషమించి మరణిస్తున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2019 నాటి లెక్కల ప్రకారం.. అంతకుముందు ఆరేళ్లలో తెలంగాణలో 4,728 మందికి అవయవ మార్పిడి అవసరమైతే, 2,402 అవయవాలు మాత్రమే అందించగలిగారు. జీవన్‌దాన్ నెట్‌వర్క్‌తో.. ప్రమాదాల్లో మరణించిన, బ్రెయిన్‌డెడ్ అయినవారి నుంచి అవయవాలను సేకరించి.. అవసరమైన వారికి అందించేందుకు జీవన్‌దాన్ నెట్‌వర్క్‌తో కీలకంగా పనిచేస్తోంది. ఈ నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ఆస్పత్రుల్లోని రోగులకు రొటేషన్ పద్ధతిలో అవయవాలు అందేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఆస్పత్రులు 27 ఉన్నాయి. అవయవాలు కావాల్సిన రోగులు ప్రభుత్వ జీవన్‌దాన్ వెబ్సైట్లో పేరు, వివరాలు నమోదు చేయించుకోవాలి. వారికి సీరియల్ నంబర్ ఇస్తారు. అవయవ దాతలు దొరికినప్పుడు సీరియల్ నంబర్ ప్రకారం రోగులకు చికిత్సలు చేస్తారు. మృతుల కుటుంబ సభ్యులకు అవయవ మార్పిడిపై అవగాహన కల్పించి, ఒప్పించేదిశగా జీవన్‌దాన్ కృషి చేస్తోంది. మన రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులతోపాటు నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలు చేస్తున్నాయి. -
ఆరేళ్లుగా కాపురం.. ఇద్దరు పిల్లలు.. భార్య తన చెల్లి అని తెలిసి భర్త షాక్..!
ఆరేళ్లుగా కాపురం చేస్తూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత భార్య తనకు సొంత చెల్లి అని తెలిసి కంగుతిన్నాడు ఓ భర్త. ఇందుకు సంబంధించిన కథనాన్ని రెడ్డిట్‌లో పోస్టు చేయగా అది వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ పోస్టును ఈ డిలీట్ చేశారు. సదరు వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. పుట్టినప్పుడే తల్లిదండ్రులు అతడ్ని వేరేవాళ్లకు దత్తత ఇచ్చారు. దీంతో అసలైన పేరెంట్స్ ఎవరో తనకు తెలియదు. 6 ఏళ్ల క్రితం ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు సంతోషంగా జీవిస్తున్నారు. ఇటీవలే ఇతని భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పండంటి కుమారుడు పుట్టాడు. ఆ వెంటనే ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో ఆమెకు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు భర్తకు సూచించారు. వెంటనే కిడ్నీ దాతల కోసం ఆమె కుటుంబసభ్యులతో పాటు తన కుటుంబసభ్యులు ఎవరనే విషయం కునుగొనేందుకు భర్త ప్రయత్నించాడు. భార్య తరఫు కుటుంబసభ్యుల్లో ఎవరి కిడ్నీ ఆమెతో మ్యాచ్ కాలేదు. ఈ క్రమంలోనే చివరకు తన కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో చూడమని టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చాడు. పరీక్షల అనంతరం వైద్యులకు షాకింగ్ విషయం తెలిసింది. భార్య, భర్తల కిడ్నీ మ్యాచ్ అయింది. వైద్యులు ఈ విషయాన్ని అతనికి ఫోన్ చేసి చెప్పగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత మరిన్ని టెస్టులు నిర్వహించగా.. అనూహ్యంగా అతని కిడ్నీ భార్య కిడ్నీతో అసాధారణ రీతిలో మ్యాచ్ అయింది. అప్పుడే వీళ్లిద్దరు అన్నాచెల్లి అని వైద్యులు నిర్ధరించారు. ఈ విషయం తెలిశాక భర్త షాక్ అయ్యాడు. ఇన్నాళ్లుగా కాపురం చేస్తూ.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది సొంత సోదరితోనా అనుకుని వాపోయాడు. రెడ్డిట్‌లో ఈ వ్యక్తి షేర్ చేసిన స్టోరీపై నెటిజన్లు స్పందించారు. 'మీరు ఇంతకుముందు ఎలా సంతోషంగా ఉన్నారో.. మున్ముందు కూడా అలాగే ఉండండి. మీ సిస్టర్-వైఫ్‌కు కిడ్నీ దానం చేయండి. మీ పిల్లలకు గొప్ప తల్లిదండ్రులుగా ఉండండి' అని సూచించారు. చదవండి: విజృంభిస్తున్న H5N1.. సోకితే 100 మందిలో 50 మంది ఖతం.. మరో మహమ్మారిగా మారుతుందా? -
ఉద్దానం కిడ్నీకి రక్షణ కవచం... కిడ్నీభూతంపై సర్కారు యుద్ధం
ఉద్దానం అంటే కొబ్బరి, జీడి తోటలే గుర్తుకొస్తాయి. పరిమళించే పచ్చదనం.. సేదదీర్చే ప్రశాంత వాతావరణమే గుర్తుకొస్తాయి. అయితే ఆ ప్రశాంతత వెనుక గూడు కట్టుకున్న విషాదం ఉంది. గుండెలు పిండేసే కిడ్నీ బాధలు ఉన్నాయి. దశాబ్దాలుగా కబళిస్తున్న కిడ్నీ మహమ్మారిని గత పాలకులు పట్టించుకోలేదు. బాధితులను గాలికి వదిలేశారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారింది. వ్యాధిగ్రస్తుల పాలిట ప్రభుత్వమే పెద్ద రక్షణ కవచంలా నిలిచింది. డయాలసిస్ కేంద్రాలు, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో పాటు బాధితులకు నిరంతర వైద్య సేవలు, నెలనెలా రూ.పది వేల భృతితో కొండంత అండగా నిలుస్తోంది. భవిష్యత్తుపై భరోసా ఇస్తోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉద్దానాన్ని కిడ్నీ వ్యాధి కబళిస్తోంది. కొన్నేళ్లుగా మరణ మృదంగం మోగుతోంది. ఏ ఊరు వెళ్లినా కిడ్నీ రోగులు కనిపిస్తూనే ఉంటారు. వ్యాధి నియంత్రణకు గత పాలకులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. 2019 వరకు కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు, పరిశీలనలకే పరిమితయ్యారు తప్ప వ్యాధి నియంత్రణకు సరైన చర్యలు తీసుకోలేదు. తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక నియంత్రణ చర్యలు చేపట్టారు. ఏకంగా కిడ్నీ వ్యాధిపై యుద్ధమే ప్రకటించారు. ఉద్దానానికి ఆరోగ్య భరోసా కల్పించేందుకు నడుంబిగించారు. ఖర్చుకు వెనకాడకుండా ఏం చేయాలో, ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పెరిగిన మందుల సరఫరా.. టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరమైతే ఇంకా మందులు కొనుగోలు చేసే వెసులుబాటును అక్కడి అధికారులకు ప్రభుత్వం కల్పించింది. కిడ్నీ రోగులకు వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29 ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు. పాతవి పాడైతే ఎప్పటికప్పుడు కొత్తవి కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం జీజీహెచ్‌లో నెఫ్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ప్రతీ శనివారం పలాస సీహెచ్‌సీలో సేవలుందిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. మూత్ర పిండాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంత ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యానికి అంత మంచిది. పెయిన్ కిల్లర్ వినియోగం తగ్గించాలి. మద్యం, సిగరెట్లు అధికంగా తాగడం వల్ల శరీరంలో టాక్సిన్లు పెరుగుతాయి. మూత్ర పిండాలకు రక్త ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగి, వాటి పనితీరు మందగిస్తుంది. అధిక బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో సుగర్ లెవెల్స్ అధికంగా ఉంటే కిడ్నీలకు వడపోత క్లిష్టంగా మారుతుంది. బీపీ కారణంగా శరీరంలో రక్తం ప్రవహించే వేగం పెరుగుతుంది. కిడ్నీలకు వేగంగా రక్తం రావడం వల్ల ఫిల్టర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. పింఛన్లతో ఆసరా.. టీడీపీ ప్రభుత్వంలో రూ.3,500 పింఛన్‌ను ఇచ్చేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దానిని రూ.10వేలకు పెంచారు. వ్యాధి తీవ్రత ఆధారంగా సీరం క్రియేటినైన్ 5కుపైబడి ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్ రోగులకు రూ.10వేల పింఛన్ ఇస్తున్నారు. ఈ లెక్కన 393 మందికి రూ.10వేలు చొప్పున, 367 మందికి రూ.5వేలు చొప్పున పింఛన్లు ఇస్తున్నారు. ఇచ్ఛాపురం మండలం సన్యాసిపుట్టుగకు చెందిన నీలాపు కేదారి పదేళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నాలుగేళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి వైద్య సహాయం అందకపోవడంతో బరంపురం, విశాఖపట్నంలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని లక్షల రూపాయల అప్పుల పాలయ్యారు. వైఎస్సార్సీపీ అధికారంలో వచ్చాక మందుల ఖర్చులకు నెలకు రూ.5వేలు ఇవ్వడంతో కొంత ఆర్థిక భారం తగ్గింది. ఏడాదిన్నర నుంచి సోంపేటలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు నెలకు రూ.10 వేలు పింఛన్‌తో పాటు ఉచితంగా మందులు అందిసున్నారు. వారానికి మూడు సార్లు 108 సిబ్బంది 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోంపేటకు తీసుకెళ్తున్నారు. బాధితులకు అండగా.. ఓ వైపు వ్యాధి మూలాలు కనుగొనేందుకు కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని నిర్మించడం, మరోవైపు వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యంతో పాటు డయాలసిస్, ఉచిత మందులను పూర్తిస్థాయిలో అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంకోవైపు వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణం తాగునీరై ఉండొచ్చన్న నిపుణుల సూచనల మేరకు రూ.700కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మిస్తోంది. పథకం అందుబాటులోకి వస్తే ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో 807 గ్రామాల్లో 7,82,707 మందికి ఇంటింటికీ కుళాయిల ద్వారా నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. దీనికోసం వంశధార నుంచి 1.12టీఎంసీల వినియోగించనున్నారు. 84 ఎంఎల్ ఫిల్టర్ సామర్ధ్యంతో 571 ట్యాంకుల ద్వారా ఊరూరు తాగునీరు అందించనున్నారు. 50 కిలోమీటర్ల పొడవునా మైగా పైపు లైను నిర్మించి, వాటి కింద మరో 134.818 కిలోమీటర్ల పైపులైన్ వేసి ఇంటింటికీ నీరందించే పనులు చివరి దశకు చేరుకున్నాయి. కిడ్నీ వ్యాధి మూలాలను తెలుసుకునేందుకు రీసెర్చ్ సెంటర్‌తో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా మంజూరు చేశారు. రూ.50కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. త్వరలోనే ప్రారంభించనున్నారు. పెంచిన డయాలసిస్ సేవలు.. ప్రస్తుతం టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. 63 మెషిన్లతో 68 పడకలపై డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. సోంపేట సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లలో గతంలో 13 పడకలుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 19కి పెంచారు. కవిటి సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లలో గతంలో 10 పడకలుండేవి. ఇప్పుడవి 15కి పెరిగాయి. హరిపురంలో కొత్తగా 10 పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెల గాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ఇవి కాకుండా ఇచ్ఛాపురం సీహెచ్‌సీలో 10 పడకలు, బారువ సీహెచ్‌సీలో 10 పడకలతో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రెండు కంటైన్డ్ బేస్డ్ సర్వీసెస్ డయాలసిస్ యూనిట్లను సైతం ఏర్పాటు చేశారు. ఒక్కొక్క యూనిట్లలో ఏడేసి పడకలు ఉన్నాయి. పింఛన్‌తో భరోసా కిడ్నీ సమస్య ఉందని, డయాలసిస్ చేసుకోవాలని ఏడాది క్రితం వైద్యులు సూచించారు. దీంతో పలాస ప్రభుత్వ అసుపత్రిలో డయాలసిస్ చేసుకుంటున్నాను. ఐదు నెలలుగా రూ.10 వేలు పింఛన్ వస్తుంది. మందులు, ఇతర ఖర్చులకు పింఛన్ కొంత వరకు సరిపోతుంది. – పి.కుసమయ్య, కిడ్నీ బాధితుడు, పెద్దబొడ్డపాడు, వజ్రపుకొత్తూరు సర్కారు అండతో.. కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న నేను రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను. జగనన్న పుణ్యమా అని నాకు రూ.5వేలు పింఛన్ గత నెల వరకు వచ్చేది. ప్రస్తుతం మరో రూ.5 వేలు పింఛన్ అదనంగా ఈ నెల నుంచి వస్తుంది. ఈ మొత్తంతో కొంత వరకు ఆర్థిక ఇబ్బందులు తీరుతున్నాయి. – సిర్ల కాంతమ్మ, పింఛన్ లబ్ధిదారు, వజ్రపుకొత్తూరు -
ఆస్పత్రిలో చేరిన ప్రధాని మోదీ సోదరుడు
ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా దామోదర్ దాస్ మల్చంద్ మోదీ, హీరాబెన్‌లకు జన్మించిన ఐదుగురు సంతానంలో ప్రహ్లాద్ మోదీ నాల్గవవాడు. ఈయనకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కిరాణ దుకాణం, టైర్ షోరూంలు ఉన్నాయి. కాగా గతేడాది డిసెంబర్27న కర్ణాటక మైసూరు సమీపంలో ప్రహ్లాద్ మోదీ ప్రమాదానికి గురయ్యారు. కుటుంబంతో కలిసి బందీపూర్ నుంచి మైసూర్ వెళ్తుండగా.. ఆయన కారు ప్రమాదానికి గురైంది. (చదవండి: సీబీఐ అరెస్ట్‌పై సుప్రీంకోర్టుకు సిసోడియా.. విచారించనున్న సీజేఐ చంద్రచూడ్) -
థాయ్ ప్రిన్స్‌కి తీవ్ర అస్వస్థత.. కోలుకోవాలని ప్రజలంతా...
థాయ్‌లాండ్ రాజు వజిరాలాంగ్కార్న్ పెద్ద కుమార్తె థాయ్ యువరాణి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె బ్యాంకాక్‌కి ఉత్తరాన ఉన్న నఖోన్ రాట్చాసిమాలో జరుగుతున్న మిలటరీ శునకాల శిక్షణ కార్యక్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను హుటాహుటినా బ్యాంకాక్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఇంటిన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు . ఆమె గుండె, ఊరితిత్తులు, కిడ్ని సరిగా పనిచేయడం లేదని థాయ ప్యాలెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఆయా భాగాలకి వైద్యపరికరాల అమర్చి చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. వాస్తవానికి థాయ్‌లాండ్ రాజ్యం వారసత్వ నియమాలు పురుషులకే అనుకూలంగా ఉంటాయి. పైగా రాజు తర్వాత వారసుడిగా పురుషులనే ప్రకటిస్తారు. కాగా, అస్వస్థతకు గురయ్యినా 44 ఏళ్ల ప్రిన్స్ బజ్రకితియాభా మహిడోల్ని థాయ్‌లాండ్‌లోని ప్రజలు ప్రిన్సెస్ భా అని పిలుస్తారు. ఆమె థాయ్ రాజు మొదటి భార్య ఏకైక సంతానం. ఆమె థాయ్ రాజ్యంలో చాలా కీలక పాత్ర పోషించి అందరీ మన్ననలను అందుకుంది. ఆమె ఒక చిన్న అభియోగానికి 15 ఏళ్లు వరకు జైలు శిక్ష విధించే పరువు నష్టం వంటి చట్టాలను విమర్శిస్తూ..ప్రజలను రక్షిస్తుందనే మంచి పేరు ఆమెకు ఉంది. ప్రజలంతా రాజకుటుంబంలోని సదరు యువరాణికే పెద్ద పీఠ వేస్తారు. ప్రస్తుతం రాజ్యంలోని ప్రజలంతా ఆమె త్వరగా కోలుకోవాని ప్రార్థనలు చేయడమేగాక ఆమె త్వరగా కోలుకోవాలంటూ పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ ప్రచురిస్తున్నారు. (చదవండి: 5 ఏళ్లైనా వీడని దంపతుల డెత్ మిస్టరీ..హంతకుడి తలపై ఏకంగా 300 కోట్లు) -
కిడ్నీకి రూ.7 కోట్లు ఇస్తామని చెప్పి..
సాక్షి, నగరంపాలెం (గుంటూరు వెస్ట్): గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలానికి చెందిన ఓ ఆసామి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని కుమార్తె హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతోంది. సోమవారం తన తండ్రితో కలిసి గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం నిర్వహించిన ‘స్పందన’లో ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్‌ను కలిసింది. కిడ్నీ విక్రయిస్తే రూ.7 కోట్లు ఇస్తామంటూ.. తన నుంచి రూ.16.40 లక్షల మేర వసూలు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు తనను మోసగించారంటూ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. తన తండ్రి ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులో రూ.20 లక్షలు దాచాడు. తండ్రికి తెలియకుండా ఆ ఖాతాలో ఉన్న సొమ్ములో రూ.2 లక్షలను ఫోన్‌పే ద్వారా సొంతానికి ఖర్చు చేసింది. యూట్యూబ్ వల వేసి.. కాగా, రూ.2 లక్షలు ఖర్చు చేసిన విషయం తండ్రికి తెలిస్తే మందలిస్తాడన్న భయంతో ఆ డబ్బుల్ని తానే సంపాదించి తండ్రికి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. డబ్బు సంపాదించే మార్గం కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 26న యూట్యూబ్‌లో వెదికింది. అందులో కిడ్నీ దానం చేస్తే రూ.7 కోట్లు చెల్లిస్తామనే ప్రకటన ఆమెను ఆకర్షించింది. అందులో ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి.. ఆన్లైన్, వాట్సాప్ ద్వారా ఎదుటి వ్యక్తులతో మాట్లాడింది. శస్త్రచికిత్సకు ముందు రూ.3.50 కోట్లు, శస్త్రచికిత్స తరువాత రూ.3.50 కోట్లు చెల్లిస్తామని మోసగాళ్లు ఆ యువతికి చెప్పారు. పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించాలంటే పన్నుల రూపేణా ముందుగా నగదు చెల్లించాల్సి వస్తుందన్నారు. తండ్రి పేరుతో చెన్నైలోని ఓ బ్యాంక్‌లో ఖాతా తెరిచి, రూ.3.50 కోట్లు జమ చేసినట్టు ఆమెను నమ్మించారు. ఆ యువతి నుంచి విడతల వారీగా రూ.16.40 లక్షలను ఆన్లైన్ ద్వారా పంపించింది. ఎంతకీ డబ్బు రాకపోవడంతో తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయాలని కోరింది. సదరు మోసగాళ్లు ఢిల్లీ రావాలని సూచించగా.. ఆ యువతి అక్టోబర్ 8న విమానంలో ఢిల్లీ వెళ్లింది. వారిచ్చిన చిరునామాలో సంబంధిత వ్యక్తులెవరూ లేకపోవడంతో వెనక్కి వచ్చేసింది. ఇంటికి వెళ్లకుండా మొహం చాటేయడంతో.. ఈ విషయం తండ్రికి తెలిస్తే తిడతాడనే భయంతో సదరు యువతి ఎన్టీఆర్ జిల్లాలోని స్నేహితుల వద్దకు వెళ్లి తలదాచుకుంటోంది. కుమార్తె అదృశ్యంపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమెను గుర్తించి తండ్రికి అప్పగించారు. డబ్బులు విషయమై కుమార్తెను అడగ్గా జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది. దీనిపై ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ వేగవంతం చేయాలని కోరుతూ స్పందనలో జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు వినతిపత్రం అందించారు. ఈ విషయమై ఎస్పీ హఫీజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ కోర్ విభాగం ద్వారా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. (చదవండి: సైబరాసురులు దోచేస్తున్నారు..కంపెనీల పేరులో వల) -
కిడ్నీకి రూ.4 కోట్లని.. అమాయకులకు ఆఫ్రికా ముఠా ఎర
బనశంకరి(కర్ణాటక): ప్రముఖ ఆసుపత్రుల పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి కిడ్నీ దానం చేసే వారికి రూ.4 కోట్లు ఇస్తామని ప్రకటనలు ఇచ్చి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు ఆఫ్రికా దేశీయులను సోమవారం బెంగళూరు ఆగ్నేయ విభాగం సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఘనా దేశానికి చెందిన మిని మిరాకల్, నైజీరియాకు చెందిన కోవా కూలింజ్, మ్యాథ్యూ ఇన్నోసెంట్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. సోమవారం అదనపు పోలీస్ కమిషనర్ సుబ్రమణ్యేశ్వరరావ్ ఈ వివరాలను తెలిపారు. పై ముగ్గురూ గతంలోనూ కిడ్నీల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసి అరెస్టయ్యారు. విడుదలై మళ్లీ దందా సాగించారు. నగరంలోని ప్రముఖ ఆస్పత్రుల పేర్లతో నకిలి వెబ్సైట్లు, వాట్సప్ ఖాతాలను రూపొందించి ఒక కిడ్నీ విరాళమిస్తే రూ. 4 కోట్లు ఇస్తామని ప్రచారం చేశారు.. ప్రముఖ ఆస్పత్రుల పేర్లతో ఉండడంతో నిజమేననుకుని పలువురు సంప్రదించగా వారి నుంచి వివిధ రుసుముల కింద డబ్బు వసూళ్లు చేశారు. మోసమని తెలిసి కొందరు బాధితులు ఫిర్యాదు చేస్తే తమకే ఇబ్బంది అని మిన్నకుండిపోయారు. ఆస్పత్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు అమృతహళ్లి అపార్టుమెంట్‌పై దాడి చేసి ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ ముఠా బాధితులు హెచ్ఎస్ఆర్ లేఔట్ సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ప్రేయసి కోసం కిడ్నీ దానం చేసిన ప్రియుడు.. ట్విస్ట్ ఏంటంటే
మెక్సికో సిటి: ప్రేమ అనేది ఒక అనిర్వచనీయ అనుభూతి. తమ ప్రేమ చరిత్రలో నిలిచిపోయేందుకు.. కొందరు చారిత్రక కట్టడాలు నిర్మిస్తే.. మరికొందరు అదే ప్రేమను పొందడానికి యుద్ధాలుసైతం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే, ప్రస్తుత సమాజంలో నిజమైన ప్రేమ దొరకడం అనేది ఒక మిథ్య మాదిరిగానే అనే ఉంటుంది. కొందరు యువతీ యువకులు పాశ్చాత్యధోరణులకు అలవాటుపడి.. తమకు బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ ఉండటం ఒక స్టెటస్ సింబల్‌గా భావిస్తున్నారు. మరికొందరు ఒక అడుగుముందుకు వేసి.. ఒకరికి తెలవకుండా మరి కొందరితో ప్రేమాయణాలు నడిపిస్తున్నారు. కొందరు పవిత్రమైన ప్రేమను తమ అవసరాలకోసం వాడుకుంటూ.. దిగజారీ ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రేమముసుగులో విచ్చలవిడిగా తిరిగి.. ఆ తర్వాత ఏవో కారణాలతో విడిపోయి.. ప్రేమకున్న పరువును బజారుకిడుస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు మనం వార్తల్లో చదువుతునే ఉన్నాం. ప్రేమను వాడుకోవడంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరూ అతీతులు కారు. కొన్నిచోట్ల అబ్బాయిలు.. అమ్మాయిలను మోసం చేస్తే.. మరికొన్ని చోట్ల అమ్మాయిలు.. అబ్బాయిలను మోసం చేస్తున్నారు. కొందరు నిజమైన ప్రేమికులు తమ ప్రేమ కోసం.. తాము ప్రేమించిన వారి కళ్లలో ఆనందం కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైన వెనుకాడటం లేదు. ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. బాజా కాలిఫోర్నియాకు చెందిన ఉజీల్ మార్టినేస్ అనే వ్యక్తి ఒక యువతిని ప్రేమించాడు. చాలా సంవత్సరాల పాటు వీరి ప్రేమ బాగానే కొనసాగింది. ఈ క్రమంలో ఉజీల్.. ప్రియురాలి తల్లి కిడ్నీసమస్యతో ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరిక్షీంచిన వైద్యులు వెంటనే కిడ్నీని మార్చాలన్నారు. ఆమె ప్రియురాలు ఎంతోగానో బాధపడింది. తన ప్రియురాలి బాధను చూడలేక.. ఉజీల్ తన కిడ్నిని దానం చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో ఉజీల్కు శస్త్రచికిత్స చేసి అతని కిడ్నీని ప్రియురాలి తల్లికి అమరుస్తారు. ఒకనెల రోజులు గడచిపోయింది. ఉజీల్, ప్రియురాలి తల్లి ఇద్దరు కూడా ఆరోగ్యంతో కొలుకున్నారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స తర్వాత ఉజీల్ ప్రియురాలు అతడినితో మాట్లాడటం మానేసింది. ఈ విధంగా ఒకనెల రోజులు గడిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాత.. తన ప్రియురాలికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైన విషయం ఉజీల్కు తెలుస్తుంది. దీంతో ఉజీల్ తీవ్ర మానసిక వేదనకు గురౌతాడు. తన ప్రియురాలి చేతిలో మోసపోయాయని తెలుసుకుని కుంగిపోయాడు. కాగా, తన మానసిక క్షోభను టిక్‌టాక్ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. ‘తన ప్రేయసి కళ్లలో ఆనందం కోసం ఇంతటి త్యాగం చేశాను.. ఇలా మోసం చేస్తుందని ఊహించలేకపోయాయని కన్నీటి పర్యంతమయ్యాడు.’ ప్రస్తుతం తాము.. మాట్లాడుకోవట్లేదని.. అలాగని తనను.. వ్యతిరేకించడం కానీ, ద్వేషించడంగానీ చేయట్లేదని చెప్పుకొచ్చాడు. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘నీలాంటి గొప్ప వ్యక్తితో ఉండే అర్హత ఆ అమ్మాయికి లేదు..’, ‘ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు..’, ‘నువ్వు ఏం బాధపడకంటూ’ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఎన్నికల ప్రచారంతో చీరల వ్యాపారానికి పెరిగిన డిమాండ్!! -
ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో సంచలనం
పరిశోధకులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ప్రయోగం ఫలించింది. ఒక రోగికి తాత్కాలికంగా పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు. ప్రపంచంలోనే తొలిసారిగా న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోన్‌లో ఆసుపత్రిలో ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహించారు. వైద్యులు ఈ కొత్త ప్రయోగం విశేషంగా నిలుస్తోంది. ఈ సక్సెస్‌తో పంది గుండెను మనిషికి అమర్చే తరుణం కూడా దగ్గరలోనే ఉందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. కోతినుంచి ఆవిర్భవించిన మనిషి మిగిలిన జంతువులతో కూడా చాలా దగ్గర పోలికలున్నట్టు కనిపిస్తోంది. తాజాగ ప్రపంచంలో తొలిసారిగా పంది మూత్రపిండాన్ని మనిషికి మార్పిడి చేశారు. అవయవాల కొరతతో ఇబ్బందులుపడుతున్న తరుణంలో ఇది పెద్ద ముందడుగని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన మహిళా రోగికి కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. కానీ ఆమెకు మూత్ర పిండాన్ని దానం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఆమోదంతో వైద్యులు ఒక కొత్త ప్రయోగాన్ని చేపట్టారు. గత కొన్ని దశాబ్దాల పరిశోధనల నేపథ్యంలో ఆమెకు పంది కిడ్నీని అమర్చేందుకు నిర్ణయించారు. మూడు రోజుల పాటు, కొత్త కిడ్నీని ఆమె రక్తనాళాలకు జతచేశారు. మార్పిడి చేసిన మూత్ర పిండాల పనితీరు, పరీక్షఫలితాలు చాలా మెరుగ్గా కనిపించాయని దీనికి నాయకత్వం వహించిన వైద్యుడు డాక్టర్ రాబర్ట్ మోంట్ గోమేరీ తెలిపారు. ఈ ప్రయోగ ఫలితంగా అవయవ మార్పిపై కొత్త ఆశలు చిగురించాయి. జెనోట్రాన్స్ప్లాంటేషన్ కల సాకారంలో ఇదొక కీలక అడుగు అని యునైటెడ్ థెరప్యూటిక్స్ సీఈవో మార్టిన్ రోత్‌బ్లాట్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాదు భవిష్యత్తులో ప్రతి ఏడాది వేలాదిమంది ప్రాణాలను కాపాడే సమయం ఎంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు. జన్యుపరంగా మార్పు చెందిన పందిని గాల్‌సేఫ్ అని పిలుస్తారు. దీనిని యునైటెడ్ థెరప్యూటిక్స్ కార్పొరేషన్‌కు చెందిన రివైవికర్ యూనిట్ అభివృద్ధి చేసింది. మాంసం అలెర్జీ ఉన్నవారికి ఆహారంగా, మానవ చికిత్సా సంభావ్య వనరుగా ఉపయోగించడం కోసం దీనిని డిసెంబర్ 2020లో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. మానవ రోగులకు గుండె కవాటాల నుండి చర్మ అంటుకట్టుట వరకు గాల్సేఫ్పందులు అన్నింటికి పరిష్కరంగా ఉంటాయని అందుకు పరిశోధకులు పరిశోధన చేస్తున్నారు. ఈ మూత్రపిండ మార్పిడి ప్రయోగం ఎండ్-స్టేజ్ కిడ్నీఫెయిల్యూర్ ఉన్న రోగులలో, వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో ట్రయల్స్‌కు మార్గం సుగమం చేయాలని, స్వయంగా గుండె మార్పిడి గ్రహీత అయిన మోంట్గోమేరీ అన్నారు. జంతువుల అవయవాలను మార్పిడి అవకాశంపై దశాబ్దాలుగా కృషి జరుగుతోంది. పంది గుండె ఆకారంలోనూ, నిర్మాణంలోనూ మనిషి గుండెను పోలి ఉంటుందని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. ఈ నేపథ్యంలోనే 2022 కల్లా వరాహం గుండెను మనిషికి అమర్చే ప్రయోగాలు సక్సెస్ అవుతాయని ప్రఖ్యాత వైద్యుడు సర్ టెరెన్స్ గతంలోనే ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పంది మూత్రపిండం మనిషికి మార్చే అవకాశంపై కూడా ఈయన చర్చించారు. ఒకవేళ మనిషికి పంది మూత్రపిండం మార్చడం సాధ్యపడితే గుండెను కూడా మార్చటం సాధ్యమేనని ఆయన స్పష్టం చేశారు. యూకేలో గుండె మార్పిడి చికిత్సలకు పేరుగాంచిన టెరెన్స్ 40 ఏళ్ల క్రితమే మొట్టమొదటి గుండె మార్పిడి చికిత్స చేయడం విశేషం. కాగా భారతదేశంలో మొట్టమొదటి మానవ మూత్రపిండ మార్పిడి 1965లో బొంబాయిలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో జరిగింది. అయితే విజయవంతమైన తొలి మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో జరిగిందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. 1971 ఫిబ్రవరి 2న షణ్ముగం అనే రోగికి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి వైద్యులు తొలి విజయాన్ని నమోదు చేశారు. అమెరికాలో దాదాపు 1,07,000 మంది ప్రస్తుతం అవయవ మార్పిడి కోసం వేచి చూస్తున్నారని ఒక నివేదిక తెలిపింది. ఇందులో 90వేలకు పైగా రోగులు కిడ్నీ కోసం ఎదురుచూస్తుండగా, రోజుకు 12 మంది చని పోతున్నారు. భారతదేశంలో కిడ్నీ సంబధిత వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా అవయవాల మార్పిడికి ఆర్గాన్స్ అందుబాటులో లేక దాదాపు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా 2 లక్షల మందికి పైగా రోగులు కిడ్నీ మార్పిడి చేయించు కుంటున్నారు. అలాగే లక్షా యాభై వేల మంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్‌కు ఎదురు చూస్తున్నారట. ముఖ్యంగా అవయవ దానంపై అవగాహన లేక పోవడం, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఈ ఆర్గాన్ డొనేషన్‌కి ముందుకు రాకపోవడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. -
చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న గాయత్రి
-
హైబ్రిడ్ మూత్రపిండంతో డయాలసిస్‌కు గుడ్‌బై?
కాలిఫోర్నియా: మూత్రపిండాల సమస్యలున్న వారు తరచూ కృత్రిమ పద్ధతులతో శరీరంలోని మలినాలను తొలగించుకుంటారనే సంగతి మనకు తెలిసిందే. డయాలసిస్‌కి త్వరలోనే గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది. కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కృత్రిమ కిడ్నీలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మరి. సిలికాన్ ఫిల్టర్‌తోపాటు సజీవమైన రీనల్ కణాలతో కూడిన ఈ హైబ్రిడ్ కిడ్నీ నమూనా ఇప్పటికే సిద్ధమైంది. తొలి ప్రయోగాలు విజయవంతమయ్యాయి కూడా. కిడ్నీ వ్యవస్థకు అనుసంధానించి.. శరీరంలోనే ఉంచేయగల తక్కువ సైజులో ఉంటుంది ఈ హైబ్రిడ్ కిడ్నీ. ఒకసారి అమర్చుకుంటే చాలు. బ్యాటరీల అవసరమూ లేకుండా మన రక్తం ప్రవహించే ఒత్తిడితోనే దాంట్లోని మలినాలను తొలగిస్తుంది. శరీరం ఈ మూత్రపిండాన్ని తిరస్కరించకుండా ఉంచేందుకు మందులేవీ వాడాల్సిన అవసరం లేదు. ద కిడ్నీ ప్రాజెక్ట్ పేరుతో కాలిఫోర్నియా వర్సిటీ వారు చేస్తున్న ఈ ప్రయత్నాల ఫలితంగా అరచేతిలో ఇమిడిపోయేంత చిన్న సైజు యంత్రం తయారైంది. కంప్యూటర్ చిప్‌ల తయారీలో ఉపయోగించే సిలికాన్ సాయంతో అతిసూక్ష్మమైన రంధ్రాలున్న ఫిల్టర్‌ను తయారు చేశారు. పలుచటి ఈ సిలికాన్ ఫిల్టర్ పొరలు ఒకవైపు.. రక్తంలో ఉండాల్సిన నీరు, ఇతర లవణాలను నియంత్రించే రీనల్ ట్యూబుల్ సెల్స్‌తో కూడిన బయో రియాక్టర్ ఇంకోవైపు ఉంటాయి ఈ హైబ్రిడ్ కిడ్నీలో. రోగి తాలూకూ రోగ నిరోధక వ్యవస్థ ఈ కణాలపై దాడి చేసే అవకాశం లేకుండా తగిన రక్షణ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. గతంలో ఈ రెండు భాగాలను విడివిడిగా పరీక్షించి సత్ఫలితాలు సాధించిన శాస్త్రవేత్తలు తాజాగా రెండింటినీ కలిపి పరిశోధనశాలలో పరీక్షించారు. శరీరంలోని రెండు ప్రధాన ధమనులకు ఈ హైబ్రిడ్ మూత్రపిండాన్ని అనుసంధానిస్తారు. శుద్ధి చేయాల్సిన రక్తం ఒక గొట్టం గుండా దీంట్లోకి ప్రవేశిస్తుంది. శుద్ధి చేసిన రక్తాన్ని మళ్లీ ఇంకో ధమని ద్వారా శరీరంలోకి చేరుతుంది. వ్యర్థాలన్నింటినీ మూత్రాశయానికి మళ్లిస్తుంది. కాలిఫోరి్నయా వర్సిటీ శాస్త్రవేత్తల ఈ ప్రయత్నాలను మరింత విస్తృత స్థాయిలో చేపట్టేందుకు, తద్వారా సమర్థమైన కృత్రిమ మూత్రపిండాన్ని తయారు చేసేందుకు ‘కిడ్నీ–ఎక్స్’ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే దాదాపు రూ.5 కోట్ల నిధులు కూడా అందాయి. -
పెళ్లైన 2 రోజులకే భర్త మాజీ భార్యకు కిడ్నీ దానం
వాషింగ్టన్/ఫ్లోరిడా: విడాకులు తీసుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళకు అతడి మాజీ భార్యపై ఎక్కడో ఓ చోట కాస్త అసహనం, కోపం, అనుమానం ఉంటాయి. తన భర్త మాజీ భార్యను మళ్లీ కలుస్తున్నాడేమో.. వారిద్దరు మాట్లాడుకుంటున్నారేమో అనే అనుమానం సహజం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే కథనం ఇందుకు పూర్తి విరుద్ధం. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఓ మహిళ వివాహం అయిన రెండు రోజులకే తన భర్త మాజీ భార్యకు కిడ్నీ దానం చేసి పెద్ద మనసు చాటుకుంది. ఇప్పుడు తామిద్దరం కిడ్నీ సిస్టర్స్ అయ్యాం అని చెప్తోంది. ఆ వివరాలు.. ఫ్లోరిడాకు చెందిన జిమ్, మైలాన్ మెర్తే దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడాకులు తీసుకున్నారు. అయినప్పటికి పిల్లలను కలిసి పెంచడంతో వారిద్దరు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇక భార్య నుంచి విడిపోయిన తర్వాత జిమ్‌కు డెబ్బీ నీల్-స్ట్రిక్ల్యాండ్తో పరిచయం ఏర్పడింది. గత పదేళ్లుగా వారు డేటింగ్ చేస్తున్నారు. గత ఏడాది నవంవర్ 22న జిమ్, డెబ్బీ వివాహం చేసుకున్నారు. ఇక జిమ్ మాజీ భార్య మైలాన్(59) గత కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది. ఈ క్రమంలో గతేడాది నవంబర్‌లో ఆమె కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. కేవలం 8 శాతం పని చేయడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. మైలాన్‌కు కిడ్నీ దానం చేయడానికి ఆమె సోదరుడు ముందుకు వచ్చాడు. కానీ మ్యాచ్ కాలేదు. అప్పటికి కేవలం రెండు రోజుల ముందే జిమ్, డెబ్బీల వివాహం జరిగింది. మైలాన్ పరిస్థితి తెలుసుకున్న డెబ్బీ ఆమెకు తన కిడ్నీ దానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. ఈ ఇద్దరు మహిళలకు కేవలం ముఖ పరిచయం మాత్రమే. వారి మధ్య పెద్దగా స్నేహం కూడా లేదు. ఇక మైలేన్ ఆస్పత్రిలో చేరే నాటికి ఆమె కుమార్తె గర్భవతి. ఇలాంటి సమయంలో మైలాన్ తన కుమార్తె దగ్గర లేదు అనే ఊహే డెబ్బీకి నచ్చలేదు. ఆ పరిస్థితిని మార్చాలని భావించింది. గతంలో తన సోదరుడు కూడా ఇలానే ఊపిరితిత్తుల మార్పిడి కోసం ఎదురు చూస్తూ.. డెబ్బీ కళ్లముందే ప్రాణాలు విడిచాడు. ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో డెబ్బీకి తెలుసు. అందుకే తన కిడ్నీ దానం చేయాలని భావించింది. ఇక డాక్టర్లు డెబ్బీకి రక్తం, కణజాల టెస్ట్ చేశారు. ఈ రెండు మ్యాచ్ అయ్యాక అత్యంత క్లిష్టమైన మరో టెస్ట్ చేశారు. ఈ పరీక్షలో భాగంగా పైప్ ద్వారా 24 గంటల పాటు డెబ్బీ మూత్రాన్ని కలెక్ట్ చేసి టెస్ట్ చేశారు. అన్ని మ్యాచ్ కావడంతో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్‌కు సిద్ధం చేశారు వైద్యులు. జిమ్, డెబ్బీల వివాహం జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే ఈ సర్జరీ చేశారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. స్పృహలోకి వచ్చాక మైలాన్, డెబ్బీ ఒకరి యోగ క్షేమాల గురించి ఒకరు ఆరా తీశారు. ఆ తర్వాత మైలాన్ తన కుమార్తె ఇంటికి.. డెబ్బీ జిమ్ ఇంటికి వచ్చారు. ఇకపైన జీవితాంతం తామిద్దరం కిడ్నీ సిస్టర్స్‌గా ఉంటామన్నారు. చదవండి: ప్రేమికుల రోజు: భార్యకు కిడ్నీ కానుక -
శాస్త్రవేత్తలను మరింత కలవరానికి గురిచేస్తున్న కరోనా
కోవిడ్ -19 శ్వాసకోశ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపడంతో రోజు రోజుకి మరణాల రేటు పెరుగుతూ పోతుంది. కోవిడ్ -19 రోగుల సంఖ్య పెరగడంతో ఇప్పుడు ఇతర అవయవ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుంది. కోవిడ్ -19 వెంటనే శ్వాసకోశ వ్యవస్థ చూపినప్పటికి, తర్వాత కాలంలో ఇది లాంగ్-కోవిడ్ అని పిలువబడే మరొక స్థితికి మారుతుంది. ఇప్పుడు ఈ లాంగ్-కోవిడ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులను, శాస్త్రవేత్తలను మరింత కలవరానికి గురిచేస్తుంది. కోవిడ్ -19 వచ్చిన రోగులలో కొందరు తర్వాత గుండె, మెదడు, మూత్రపిండాల వ్యాధులతో తిరిగి ఆసుపత్రులకు వస్తున్నట్లు కనుగొన్నారు. కోలుకున్న రొగులు గుండెకు సంబందించిన విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని వైద్యులు ఇప్పుడు సలహా ఇస్తున్నారు. లాంగ్-కోవిడ్ వ్యాది 2020లోనే మొదట నివేదించారు. కోవిడ్ -19 శరీరంపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను చూపిస్తున్నట్లు మరిన్ని ఆధారాలు లభిస్తున్నాయి. కోవిడ్ -19 వల్ల గుండె ప్రతికూల ప్రభావానికి గురైతున్నట్లు వివిధ అధ్యయనాలలో కనుగొనబడింది. లాన్సెట్ నివేదిక, జామా నివేదికలో ఇవి గమనించవచ్చు. కోవిడ్ -19 శరీరంలో తక్కువ ఆక్సిజన్ స్థాయి ఉన్నప్పుడు గుండెపై ఒత్తిడిని పెంచి గుండె కండరాలను బలహీనపరుస్తుంది. 8 నుంచి 12 శాతం గుండె పోటు కూడా వస్తుంది. గుండెపై ఒత్తిడి పెరగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇలా రక్త నాళాలపై పడే విపరీతమైన ఒత్తిడి కొరోనరీ ఆర్టరీ వ్యాధికి కారణమవుతుంది. కరోనా నుంచి కోలుకున్న రొగులు గుండెకు సంబందించి ఏమైన ఇబ్బంది కలిగితే వెంటనే గుండెకు సంబందించి పరీక్షలు చేయించుకోవడం మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు. క్రింద చెప్పిన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఛాతిలో అసౌకర్యంగా ఉండటం చేతుల్లో నొప్పి లేదా ఒత్తిడి కలగడం వివరించలేని విదంగా విపరీతమైన చెమట పట్టడం హృదయ స్పందన సక్రమంగా పనిచేయక పోవడం శారీరక శ్రమ లేకున్న అధిక అలసట లేదా అలసట కలగటం చదవండి: కుంభమేళా నుంచి వచ్చిన 99 శాతం మందికి కరోనా -
ప్రేమికుల రోజు: భార్యకు కిడ్నీ కానుక
ఆలూమగల మధ్య అన్యోన్యం తప్ప ప్రేమ ఉండదు అని అంటారు. ప్రేమ ఎందుకు ఉండదంటే ప్రేమకు కూడా చోటు ఇవ్వనంతగా వారు ఒకరికొకరు దగ్గరగా ఉంటారు. అన్యోన్యానికి మాత్రం ఎందుకు చోటువ్వాలి? అన్యోన్యం చోటు కాదు. ప్రేమకు గెస్ట్ హౌస్. అనుకోని అతిథిలా ప్రేమ ఎప్పుడైనా గడపలో ప్రత్యక్షమైతే భార్యాభర్తలు ఎదురెళ్లి స్వాగతం చెప్పి సేద తీరమని చూపించే అతిథి గృహం! నిన్న వాలెంటైన్స్ డే రోజు ఒక దాంపత్య ప్రేమకు అలాంటి ఆతిథ్యమే లభించింది! నేరుగా చెప్పాలంటే ఇది ఒక వాక్యంలో ముగిసిపోయే మహా ప్రేమ కావ్యం. ఆ కావ్యానికి పేరు పెట్టాలంటే ‘వినోద్’ అని పెట్టాలి. కానీ వినోద్ ఊరుకోడు. తన భార్య పేరు కూడా కలిపి పెట్టమంటాడు. ఆమె పేరు రీటా. రీటావినోద్ అని కానీ, వినోద్రీటా అని కానీ పెట్టొచ్చు. అప్పుడు ఆమె ‘నా పేరెందుకండీ.. వారి పేరు చాలు’ అనొచ్చు. చివరికి ఇద్దరికీ కలిపి పెట్టదగిన పేరు ఒక్కటే కనిపిస్తుంది.. ‘ప్రేమ’! నిన్న వాలెంటైన్స్ డే రోజు వినోద్ పటేల్ తన భార్యకు ఇచ్చిన ప్రేమ కానుక దేశంలోని ప్రేమికుల హృదయాలలో పూలజల్లు కురిపించే ఉంటుంది. ఆయన తన కిడ్నీని భార్య రీటా పటేల్‌కు కానుకగా ఇచ్చారు! ఇద్దరిలో ఎవరు అదృష్టవంతులు? భర్తలో సగభాగాన్నే కాక, అతడి ప్రేమలో పూర్తి మొత్తాన్ని పొందిన రీటానా! భార్య పై తన ప్రేమను తెలియజేసే భాగ్యం పొందిన వినోదా! ఇద్దరూ. ఇరవై రెండేళ్లయింది వాళ్ల పెళ్లయి. ఇరవై మూడో పెళ్లి రోజు కానుకగా తన కిడ్నీని భార్యతో పంచుకున్నారు వినోద్. అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఏర్పాట్లు జరిగాయి. ‘‘వాలెంటైన్స్ డే రోజు మేము తలపెట్టిన ఇలాంటి ఆపరేషన్ ఒకటి ఇదే మాకు మొదటిది’’ అని ఆసుపత్రి ప్రధాన వైద్యడు డాక్టర్ సిద్ధార్త్ మానవి అన్నారు. ‘‘వాలెంటైన్స్ డే కాబట్టి వీళ్లంతా నా భర్త నాకు ఇస్తున్న కిడ్నీని ప్రేమ కానుక అంటున్నారు. అయితే ఆయన తను మొత్తాన్నీ నాకు కానుకగా మా పెళ్లి తోనే ఇచ్చేసుకున్నారు’’ అని ఆపరేషన్ టేబుల్ మీదకు వెళ్లబోయే ముందు రీటా సంతృప్తిగా నవ్వుతూ అన్నారు. ఆమెలో భయం లేదు. ఆ కళ్లల్లో భర్తపై ఆరాధన తప్ప. వాలెంటైన్స్ డే రోజు ఆపరేషన్ జరగబోతుండటం గురించి వినోద్ కూడా తన భార్య ఏమన్నారో, ఆమే అదే అన్నారు. ‘‘ప్రేమికుల రోజు ఇస్తున్నారు. ఇది మీ ప్రేమ కానుకా..’ అని అంటే.. ‘‘కాదు, పెళ్లి రోజు కానుకే. ప్రేమతో ఇస్తున్న కానుక’’ అని నవ్వారు. నిజానికైతే ఆయన కానుకలా అనుకోవడం లేదు. భార్యతో అన్నీ షేర్ చేసుకున్నట్లే తన శరీరంలోని కొంత భాగాన్ని షేర్ చేసుకుంటున్నానని అన్నారు. విషయం మన వరకు వచ్చిందంటే ఇవేవీ ఆ భార్యాభర్తలు చెప్పుకున్నవి కావు. ఉత్సాహం కొద్దీ ఆ ఆసుపత్రి డాక్టర్లు మీడియాకు వెల్లడించినవి. ∙∙ మూడేళ్ల క్రితం తొలిసారి రీటాబెన్లో ‘ఆటోఇమ్యూన్ కిడ్నీ డిస్ఫంక్షన్’ ఉన్నట్లు బయటపడింది. మూడేళ్లుగా ఆమె మందులు వాడుతున్నారు. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి బయటి నుంచి వచ్చే శత్రువుతో పోరాడి సంహరిస్తుంది. అయితే కొన్నిసార్లు పొరపాటున దేహంలోని కణాలనే శత్రువులుగా భావించి వాటిని దెబ్బతీయడం మొదలుపెడుతుంది. అదే ఆటో ఇమ్యూన్ డిస్ఫంక్షన్. రీటాలో అది ఆమె కిడ్నీపై ప్రభావం చూపెట్టింది. మందుల శక్తి క్షీణించి క్రమంగా ఆమె పరిస్థితి ట్రాన్స్‌ప్లాంటేషన్ వరకు వచ్చింది. ఎవరిస్తారు కిడ్నీ? ఇవ్వాలని సొంతవాళ్లే ముందుకు వచ్చినా చాలామందికి కిడ్నీ ‘సెట్’ కాదు. కానీ వీళ్ల ప్రేమబలమేమో వినోద్ కిడ్నీని రీటా మార్చడానికి అడ్డంకులేమీ ఉండబోవని రిపోర్ట్ వచ్చింది. వినోద్ సంతోషించారు. రీటాలో మాత్రం ఆందోళన. ఆపరేషన్ తర్వాత ఆయన తిరిగా మామూలుగానే ఉండగలరా అనే ఆందోళన. తనకేం పర్వాలేదు అని డాక్టర్ల కంటే ఎక్కువగా భర్త ఆమెకు ధైర్యం చెప్పాడు. కిడ్నీ మార్పించుకోడానికి మానసికంగా భార్యను సిద్ధం చేశాడు. ‘‘అన్నీ బాగున్నప్పుడు సంతోషంగా కలిసి ఉంటాం. బాగోలేనప్పుడు కూడా ఆ సంతోషాన్ని నిలిపేది భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమ, గౌరవం మాత్రమే’’ అంటారు వినోద్. ‘‘ఈయన నా భార్తగా దొరకడం నేను చేసుకున్న అదృష్టం’’ అని రీటాబెన్. ‘‘కిడ్నీ సమస్య పెరిగిపోయి, ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయింది. ఆ సమయంలో తన కిడ్నీ ఇచ్చేందుకు నా భర్త ముందుకు వచ్చారు. ఇస్తున్నది తన కిడ్నీనే కావచ్చు. పోస్తున్నది మాత్రం ఊపిరే’’ అన్నారు రీటా కంటతడితో. ప్రేమను ఎంత ఉష్ణంలోనూ వాడిపోనివ్వని తడి అది. -
ఐ ఫోన్ కోసం కిడ్నీ అమ్మాడు, చివరికి..
ఆపిల్ ఫోన్ కొనాలన్నది మిడిల్ క్లాస్‌కు నెరవేరని కల. ఆపిల్ కొత్త మోడల్ రిలీజ్ అయినప్పుడల్లా కిడ్నీ అమ్మైనా సరే ఆ ఫోన్ కొనాలని చాలా మంది జనాలు సోషల్ మీడియాలో జోకులు పేలుస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం నిజంగానే కిడ్నీ అమ్మి ఐ ఫోన్ కొన్నాడు. ఫలితంగా ఇప్పుడు మంచాన పడి మూల్యం చెల్లించుకుంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 17 ఏళ్ల వాంగ్ షాంగ్కన్కు ఆపిల్ ఫోన్ కొనాలని పిచ్చి. కానీ తన దగ్గర అంత మొత్తంలో డబ్బు లేకపోవడంతో మూత్రపిండాన్ని అమ్మేయాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే బ్లాక్ మార్కెట్లో కుడివైపు కిడ్నీని అమ్మేశాడు. (చదవండి: 'ఆనందం' ఎక్కడ దొరుకుతుంది? ఇదిగో..) వచ్చిన సొమ్ముతో ఆపిల్ ఐపాడ్, ఐ ఫోన్ 4 కొన్నాడు. 2011లో జరిగిందీ ఘటన. కానీ కొంతకాలానికే అతని మరో కిడ్నీకి సమస్య ఏర్పడింది. ఇప్పుడది పెద్దదవడంతో అతడి స్థితి మరింత దీనంగా తయారైంది. అవయవాలు సక్రమంగా పని చేయకపోవడంతో ఆస్పత్రి పాలయ్యాడు. అతడికి తరచూ డయాలసిస్ చేస్తున్నారు. ఇక జీవితాంతం అతడు బెడ్‌కే పరిమితం కావాలని వైద్యులు చెప్పారు. కాగా బ్లాక్ మార్కెట్లో కిడ్నీ కొనుగోలు చేసిన విషయంలో ఐదుగురు సర్జన్లతో కలిపి తొమ్మిది మందిని పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. (చదవండి: వైరల్: కోతుల్ని తరిమి కొట్టండి: సీటు గెలవండి!) -
ఆపదలో ఆశల దీపం..
ఏడాదిన్నర వయసు.. ఆ పిల్ల మాట్లాడినా, అరిచినా, నవ్వినా, కాస్త నడిచినా ముచ్చటపడిపోవాల్సిందే. రోజంతా ఎంత కష్టపడినా ఆ బుజ్జాయి ముఖం చూస్తే చాలు తండ్రి ప్రాణానికి హాయి. దినమంతా ఎంత బాధగా గడిచినా ఆ చిన్నారి నవ్వు చూస్తే ఆ తల్లి మనసుకు స్వాంతన. అలాంటిది ఆ పాప ఇప్పుడు నవ్వలేకపోతోంది. నోరారా అమ్మా అని సరదాగా పిలవలేకపోతుంది. తోటి పిల్లలతో ఆడుకోలేకపోతోంది. అన్నింటికీ మించి ఆస్పత్రి మంచంపై చావుతో పోరాడలేకపోతోంది. కిడ్నీ ట్యూమర్‌తో బాధ పడుతున్న కుమార్తెను బతికించుకోవడానికి తల్లిదండ్రులు తోటివారి సాయం కోరుతున్నా రు. ఆర్థిక స్థోమత సరిపోవడం లేదని, ఆదుకోవాలని అర్థిస్తున్నారు. ఇచ్ఛాపురం రూరల్ (శ్రీకాకుళం జిల్లా): ఇచ్ఛాపురం మండలం కొళిగాం గ్రామానికి చెందిన యామన గోపాలకృష్ణ, చిట్టిపాప దంపతులు స్థానికంగా ఉపాధి లేకపోవడంతో కొన్నాళ్ల కింద ట బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని బతుకుతున్నారు. దు స్తులు కుట్టే పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నారు. ఈ దంపతులకు కోమలి, నోమశ్రీలు సంతానం. ఇద్దరు పిల్లలే లోకంగా ఆ దంపతులు ఉన్నంతలోనే సు ఖంగా రోజులు గడిపేస్తున్నారు. కానీ ఆ కాస్త ఆనందం కూడా వారిని నిలవలేదు. ఇరవై నెలల ముద్దుల చిన్నారి నోమశ్రీ అనారోగ్యం బారిన పడింది. విపరీతమైన జ్వరం, నీరసం రావడంతో రెండు నెలల పాటు ఆస్పత్రులన్నీ తిప్పారు. కొన్ని రోజులు జ్వరం తగ్గడం, మళ్లీ రావడంతో కేవలం ఆ వైద్యానికే రూ.లక్షల్లో ఖర్చయిపోయింది. చివరకు హైదరాబాద్‌లోనే ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చూపించగా పాప కిడ్నీ ట్యూమర్‌తో బాధపడుతోందని, వెంటనే వైద్యం చేయాలంటూ పిడుగులాంటి వార్త చెప్పడంతో తల్లిదండ్రులు హతాశుతులయ్యారు. అసలే వలస కుటుంబం, ఆపై సుమారు రూ.12లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వైద్యానికి ఖర్చువుతుందంటూ వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. స్థోమతకు మించిన సొమ్ము సర్దలేక సతమతమవు తున్నారు. విషయాన్ని తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండికి చెందిన ‘యువతరం సంస్థ’ అధ్యక్షుడు చింత మురళీ ముందుకు వచ్చి తమ సంస్థ ద్వారా కొంత ఆర్థిక సాయాన్ని అందించారని బాలిక తండ్రి గోపాలకృష్ణ తెలిపాడు. ప్రస్తుతం నెలన్నర రోజుల నుంచి ఆస్పత్రిలో పాపకు చికిత్స చేయిస్తున్నారు. ఏళ్ల తరబడి చికిత్స ఖర్చు తలకుమించిన భారం కావడంతో ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోరుతున్నారు. మ నసున్న వారు స్పందించి తమ పాపకు ప్రాణభిక్ష పెట్టాల ని వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే వారు సంప్రదించాల్సిన నంబర్లు గూగుల్ పే : 8985403107 ఫోన్ పే : 6303285103 ఆంధ్రాబ్యాంకు(తెలంగాణ): అకౌంట్ నంబర్ః 032710100178007 ఐఎఫ్ఎస్సీ కోడ్ః ఏఎన్080000327 -
డబ్బులు చెల్లిస్తేనే పేషెంట్‌ను చూడనిస్తాం
రాంగోపాల్‌పేట్: కిడ్నీ వ్యాధితో ఆస్పత్రికి వస్తే కరోనా సోకిందంటూ ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు 10 రోజుల నుంచి పేషెంట్‌ను చూపించడం లేదు. రూ. 5 లక్షల బిల్లు పెండింగ్ ఉందని, అది చెల్లిస్తేనే మీ వాడిని చూపిస్తామని ఆ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన బుధవారం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చోటు చేసికుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోరుట్లకు చెందిన రాజశేఖర్ (25) కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అతడిని కుటుంబసభ్యులు గత నెల 27న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. చికిత్స నిమిత్తం విడతల వారీగా రూ.3 లక్షలు చెల్లించారు. అప్పటి నుంచి రోగికి చికిత్స అందిస్తున్న చెబుతున్న ఆస్పత్రి వర్గాలు అతడిని తమకు చూపించడం లేదన్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అతడికి కరోనా సోకిందంటూ తమను ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం ఆస్పత్రి ఎదుట ఆందోళను దిగారు. ఆస్పత్రి యాజమాన్యం డబ్బుల కోసం లేని రోగాన్ని అంటగడుతుందని వారు వాపోయారు. నడుచుకుంటూ ఆస్పత్రి వచ్చిన అతడికి కరోనా లక్షణాలు లేకున్నా 10 రోజుల నుంచి తమకు చూపించడం లేదన్నారు. ఆస్పత్రి యాజమాన్యం అడిగిన రూ.5 లక్షలు చెల్లించనందునే తమ కుమారుడిని చూపించడం లేదని అతడి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. కిడ్నీ చెడిపోతే తన కిడ్నీ ఇస్తానని చెప్పానని, అప్పు చేసి రూ.3లక్షలు చెల్లించామని, తాము నిరు పేదలమని అంత డబ్బు ఎలా చెల్లించాలని ఆమె ప్రశ్నించింది. డబ్బు చెల్లిస్తేనే చూపిస్తామని కొందరు డాక్టర్లు చెప్పారని తన కుమారుడికి ఏమైనా జరిగితే ఆస్పత్రి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆస్పత్రి యాజమాన్యం తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నాలు చేసింది. బుధవారం అతడి కుటుంబ సభ్యులను లోపలికితీసుకెళ్లి చికిత్స పొందుతున్న రాజశేఖర్‌ను చూపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోగుల సహాయకులను ఆస్పత్రి లోపలికి పంపించడం లేదని ఆ విషయం తెలియక బంధువులు అలా ఆరోపిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు వివరణ ఇచ్చాయి. కరోనా రోగులు ఉండటంతోనే వార్డులోకి ఎవరినీ అనుమతించడం లేదన్నారు. అతనికి డయాలసిస్ నడుస్తుందని, చికిత్సకు ఖరీదైన మందులు వాడాల్సి ఉంటుందని వారు వివరించారు. వారు రూ.5లక్షల బిల్లు చెల్లించాల్సి ఉన్నా మానవతా దృక్పథంతో వారి ఇష్టం మేరకు డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
కరుణిస్తే.. అరుణోదయం
చిన్న కుటుంబం వారిది.. నిరుపేద కుటుంబమైనా తల్లిదండ్రులు, కుమారుడు ఎంతో సంతోషంగా ఉండేవారు.. తమ రెక్కల కష్టంతోఒక్కగానొక్క బిడ్డ అరుణ్‌కుమార్‌ను చదివిస్తున్నారు.. అతడు డిగ్రీలో చేరడంతో ఇక కష్టాలు తీరడానికి ఎంతో కాలం పట్టదని భావించారు.భవిష్యత్తు బాగుంటుందని, కుమారుడు ప్రయోజకుడవుతాడనే ధైర్యంతో శక్తికి మించి కష్టపడుతున్నారు. అయితే కష్టాలన్నీ కట్టకట్టుకొనిఒక్కసారిగా వచ్చినట్లు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. కుమారుడికి సంబంధించిన గుండె పగిలే విషయం ఒకటి తల్లిదండ్రులకు తెలిసింది.కుమారుడికి రెండు కిడ్నీలు చెడిపోయాయని తెలియడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ప్రొద్దుటూరు :జమ్మలమడుగులోని ఈడిగెపేటకు చెందిన లక్ష్మీనరసమ్మ, చక్రవర్తిల ఒక్కగానొక్క కుమారుడు అరుణ్‌కుమార్. అతను పట్టణంలోని శ్రీనివాస డిగ్రీ కాలేజీలో రెండో సంవత్సరం డిగ్రీ చదుతున్నాడు. డిగ్రీ పూర్తి అయితే ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకుంటాననే ధైర్యం అతనిలో ఉండేది. కుమారుడికి ఉద్యోగం వస్తే కష్టాలన్నీ గట్టెక్కుతాయని తల్లిదండ్రులు భావించారు. సంతోషం ఆవిరైన రోజు.. మరో రెండు, మూడు రోజుల్లో లాక్డౌన్ విధిస్తారు. అప్పుడే తెలిసింది అరుణ్‌కుమార్‌కు రెండు కిడ్నీలు చెడిపోయాయని. సంతోషంగా ఉన్న ఆ కుటంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. కడప పెద్దాసుపత్రికి తీసుకెళ్లగా కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని, వెంటనే ఆపరేషన్ నిర్వహించి డయాలసిస్ చేయాలని చెప్పారు. ఆపరేషన్‌కు సుమారు రూ. 4 లక్షలు దాకా ఖర్చు అవుతాయన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయిద్దామనుకుంటే.. ఆపరేషన్ చేయించేందుకు కావలసిన ఆధార్, రేషన్‌కార్డు చూసుకోగా రెండింట్లో పేర్లు వేర్వేరుగా ఉన్నాయి. తెలిసిన వాళ్లకు చూపిస్తే రెండింట్లోనూ పేర్లు ఒకేలా ఉండాలని, వేర్వేరుగా ఉంటే ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు. పేరు సరిచేసుకుందామని ప్రయత్నం చేయగా లాక్డౌన్ కారణంగా మీ సేవా కేంద్రాలన్నీ మూత పడ్డాయి. బిడ్డను బతికించుకునేందుకు బంధువులు, తెలిసిన వాళ్ల వద్ద అప్పు అడిగాడు. అరుణ్‌కుమార్ ధీనస్థితి చూసిన కొందరు డబ్బులిచ్చారు. అపరేషన్‌కు ఇంకొంత డబ్బు తక్కువ రావడంతో తన ఆటోను తాకట్టు పెట్టాడు. మార్చి 31 ఆపరేషన్ అయితే చేయించగలిగారు కానీ అంతటితో వారి కష్టాలు తీరలేదు. అరుణ్‌కుమార్‌కు ఆపరేషన్ చేసినా కిడ్నీలు పనికి రాలేదు. ఇక కిడ్నీలను మార్చడం ఒక్కటే మార్గమని వైద్యులు చెప్పారు. తల్లిదండ్రుల కిడ్నీలు సరిపోవని చెప్పారు తల్లిదండ్రుల్లో ఒకరి కిడ్నీ అమర్చితే అరుణ్‌కుమార్ మామూలు మనిషి అవుతాడని వైద్యులు చెప్పారు. తండ్రి చక్రవర్తికి గుండె జబ్బు, షుగర్ ఉండటం, తల్లి లక్ష్మినరసమ్మకు థైరాయిడ్ ఉండటంతో సరిపోవన్నారు. దీంతో వేరొకరి కిడ్నీపై ఆధార పడాల్సిన అగత్యం ఏర్పడింది. కిడ్నీ మార్పిడికి సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు కుమారుడికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించేందుకు చక్రవర్తి దంపతులు దేవుడిపైనే భారం వేశారు. దయార్ద్ర హృదయులు సాయం చేస్తే కుమారుడ్ని బతికించుకుంటామని వారు అంటున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న అరుణ్‌కుమార్ ఆపరేషన్‌కు ఆపన్న హస్తం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సాయం చేయాల్సిన వారు 7670859470, 9912944697 సెల్ నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. -
పాపం 'నందన్'
తోటి చిన్నారులతో ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసు ఆ బాలుడిది. చక్కగా స్కూల్‌కి వెళ్లి చదువుకోవాల్సిన సమయంలో కిడ్నీ సంబంధిత వ్యాధితో వైద్యశాలల చుట్టూ తిరుగుతున్నాడు. బాధ కలిగినప్పుడు ఏడవడం తప్ప.. తనకున్న జబ్బుఏంటో కూడా తెలియదు. నెల్లూరు, కలిగిరి: మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ కందులవారిపాళెం గ్రామానికి చెందిన మార్తుల సుధాకర్‌రెడ్డి, అనూష దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు హసిక్ నందన్ కుమార్‌రెడ్డి (9) ఉన్నాడు. వీరు వ్యవసాయ కూలీగా చేస్తుంటారు. నందన్ పుట్టుకతోనే దివ్యాంగుడు. ఒక కిడ్నీ పూర్తిగా పాడైపోయింది. మరో కిడ్నీలో రాళ్లు ఉండి ఇన్ఫెక్షన్ చేరింది. ప్రత్యేక పైపు ఏర్పాటు చేస్తేనే మూత్రం వస్తుంది. వెన్నునొప్పి ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. నందన్‌కు 6 నెలల వయసు నుంచే హైదరాబాద్, చెన్నై, తిరుపతి, గుంటూరుల్లోని పలు వైద్యశాలల్లో చికిత్స చేయించారు. ఇప్పటివరకు సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేశారు. అయితే పరిస్థితిలో మార్పురాలేదు. తల్లిదండ్రులతో నందన్ పింఛన్ ఇవ్వాలంటూ.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నందన్ పరిస్థితి చూసి ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి చలించిపోయారు. స్వయంగా కలెక్టర్ వద్దకు ఆ బాలుడిని, అతని తల్లిదండ్రులను తీసుకువెళ్లి కలిశారు. పేద కుటుంబానికి చెందిన నందన్‌కు డయాలసిస్ చేయించేందుకు పింఛన్ మంజూరు చేయించాలని సిఫార్సు చేశారు. ఎమ్మెల్యే సూచనల మేరకు కలెక్టర్ నందన్ వైద్యానికి కొంత నిధులు అందించారు. డయాలసిస్ పింఛన్ అందించడానికి సహకరిస్తామని తెలిపారు. ప్రస్తుతం నందన్‌కు దివ్యాంగుల పింఛన్ అందుతోంది. అప్పులు చేసి.. తలకు మించిన భారమైనా సుధాకర్‌రెడ్డి, అనూష అప్పులు చేసి కొడుక్కి వైద్యం చేయిస్తున్నారు. మూత్రం పోసుకోవడానికి ఇంటి వద్దే తల్లిదండ్రులు బ్యాగ్‌లు మారుస్తున్నారు. కిడ్నీ మార్చాలంటే ముందు మూత్ర సంబంధిత సమస్యను పరిష్కరించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వెన్నుపూస సమస్య ఉండటంతో ఎక్కువసేపు కూర్చున్నా, పడుకున్నా నొప్పులతో బాధపడుతున్నాడు. నందన్ వైద్యానికి సుమారు రూ.20 నుంచి రూ.25 లక్షల వరకు అవుతుందని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పారు. కూలి పనులు చేసుకునే నందన్ తల్లిదండ్రులు అంత ఖర్చుపెట్టి వైద్యం చేయించే స్తోమత లేక ఒక్కగానొక్క కుమారుడి పరిస్థితిని చూసి తల్లడిల్లిపోతున్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు తమ బిడ్డ వైద్యానికి సహకరించాలని కోరుతున్నారు. సాయం కోరుతాం జగనన్న పాదయాత్ర సమయంలోమా గ్రామానికి వచ్చినప్పుడు కలిసి మా పరిస్థితి వివరించాం. త్వరలో ఆయన్ని కలిసి ప్రస్తుత పరిస్థితిని వివరించి సాయం కోరుతాం. – మార్తుల అనూష,నందన్ తల్లి నందన్ తల్లి బ్యాంక్ అకౌంట్ వివరాలు పేరు: మార్తుల అనూష బ్యాంక్: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సిద్ధనకొండూరు అకౌంట్ నంబర్: 91073257658 ఐఎఫ్ఎస్ కోడ్: APGB0004016 సెల్ నంబర్: 94932 06631 -
తల్లిదండ్రుల కోసం కిడ్నీ అమ్మాలనుకుంది కానీ..
బెంగళూరు : తల్లిదండ్రుల కోసం కిడ్నీ అమ్ముదామనుకున్న ఓ మహిళను మోసం చేశాడో సైబర్ నేరగాడు. కోటి రూపాయలకు కిడ్నీ కొంటానంటూ లక్షలు దోచేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు మూదలపాళ్యాకు చెందిన ఓ మహిళ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. లాక్డౌన్ కారణంగా కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్లో ఓ యాడ్ చూసిందామె. కిడ్నీ దానం చేస్తే కోటి రూపాయలు ఇస్తామని ఆ యాడ్‌లో ఉంది. తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయపడదామని భావించిన ఆమె కిడ్నీ దానం చేయటానికి నిర్ణయించుకుంది. యాడ్‌లో ఉన్న నెంబర్‌కు మెసేజ్ చేసింది. అనంతరం వారితో ఫోన్లో మాట్లాడగా.. హదాఫాంగ్గా తనను తాను పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి, చట్టబద్ధంగా కిడ్నీ దానం చేయాలంటే కిడ్నీ డోనర్ కార్డు ఉండాలని చెప్పాడు. ( బెజవాడలో కత్తులతో విద్యార్థుల వీరంగం ) టాక్స్ ఐడెంటిఫికేషన్ ఫీజు, పోలీసు అనుమతులకోసం కొంత డబ్బు తన ఖాతాలో జమచేయాల్సిందిగా కోరాడు. సదరు మహిళ తన వద్ద ఉన్న నగలను కుదువ పెట్టి అతడు అడిగిన రూ.3 లక్షలు ఖాతాలో జమచేసింది. అయితే డబ్బు అతడి ఖాతాలో జమ అయిన తర్వాతి నుంచి స్పందించటం మానేశాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డబ్బులు అతడి ఖాతాలో డిపాజిట్ అయిన వెంటనే విత్ డ్రా చేసుకున్నట్లు గుర్తించారు. ( మరో మన్మథుడు.. మహిళలే టార్గెట్ ) -
ఆపత్కాలంలో దేవునిలా..
గోదావరిఖని(రామగుండం): ప్రాణాపాయ స్థితిలో కిడ్నీ మార్చుకున్న ఓ నిరుపేద మహిళకు హైదరాబాద్ నుంచి మందులు తెప్పించి దేవునిలా నిలిచారు గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు. మంగళవారం రామగుండం పోలీస్‌కమిషనర్ వి.సత్యనారాయణ చేతుల మీదుగా బాధితురాలికి అందజేశారు. గోదావరిఖని సప్తగిరికాలనీకి చెందిన కాళేశ్వరం రజిత కిడ్నీ మార్చుకుంది. ఇన్ఫెక్షన్ కాకుండా నిత్యం మందులు వాడటం తప్పనిగా మారింది. లాక్డౌన్ కారణంతో మందులు తెచ్చుకోలేక పోయింది. గతనెలాఖరుతో మందులు పూర్తిగా అయిపోయాయి. అయితే లాక్డౌన్ ఉండటంతో మందులు లేకుండానే రోజులు వెళ్లదీస్తూ వస్తోంది. దీంతో కడుపు వాపు రావడంతో మందుల కొనుగోలు తప్పనిసరైంది. అయితే మందులు లాక్డౌన్ కావడంతో హైదరాబాద్‌కు వెళ్లడం కూడా వారికి కష్టంగా మారింది. ఈక్రమంలో మహిళ మూడు రోజుల కిందట తాను హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతించాలని గోదావరిఖని వన్‌టౌన్ సీఐ పర్శ రమేష్‌ను కోరింది. ఎలా వెళ్తారని ప్రశ్నించడగా తమకు అనుమతి ఇస్తే ద్విచక్రవాహనంపై వెళ్లి తెచ్చుకుంటామని కన్నీళ్ల పర్యంతమైంది. తన భర్తకు పెద్దగా తెలియదని, ఇద్దరం కలిసి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. వీరి పరిస్థితి గమనించిన సీఐ పర్శ రమేష్ తాను టాబ్లెట్లు తెప్పిస్తానని చెప్పి మెడికల్ ఏజెన్సీద్వారా హైదరాబాద్ నుంచి మందులు తెప్పించారు. ఈమేరకు మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ చేతుల మీదుగా బాధిత మహిళకు అందజేయడంతో కన్నీటి పర్యంతమై సీఐ కాళ్లు మొక్కింది. మీరు ఆదుకోకుంటే జీవితం మరింత నరకంగా మారేదని తెలిపింది. కాగా మానవత్వంతో స్పందించి ఓకుటుంబానికి అండగా నిలిచిన వన్‌టౌన్ సీఐ రమేష్‌ను సీపీ సత్యనారాయణ, ఏసీపీ ఉమేందర్ అభినందించారు. -
ఇక ఇంట్లోనే డయాలసిస్!
కిడ్నీ వ్యాధి బాధితులకు డయాలసిస్ ఓ బాధాకర అనుభవం. ఈ దశకు చేరుకుంటే ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆపసోపాలు పడాల్సిందే. నగరాల్లోని ఆసుపత్రుల్లో డయాలిసిస్‌లు అందుబాటులో ఉన్నా..అది ఆర్థికంగా ఇబ్బందికరమే కాకుండా.. సహకరించని దేహానికి బాధామయ పరీక్షే.దీనికి ఇప్పుడు ‘పెరిటోనియల్ డయాలిసిస్’ పేరిట పరిష్కారం దొరికింది. అదీ ఇంటి వద్దనే చిన్న ఏర్పాట్లతో చేసుకోవచ్చు. అమెరికా,ధాయ్‌ల్యాండ్, హాంకాంగ్ వంటి పలుదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ విధానాన్ని మన దేశంలో కూడా అమలుకు సర్కార్ సంకల్పించింది. సాక్షి, హైదరాబాద్: డయాలసిస్ చేయించుకునే కిడ్నీ రోగులు నరకం అనుభవిస్తుంటారు. వారానికి రెండు మూడు రోజులు ఆస్పత్రులకు వెళ్లడం, నాలుగైదు గంటల పాటు డయాలసిస్ చేయించుకొని రావడం క్లిష్టమైన ప్రక్రియ. ఇకపై ఈ పద్ధతికి చరమగీతం పాడేందుకు ఇంట్లోనే డయాలసిస్ చేసుకునే పద్ధతికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ‘పెరిటోనియల్ డయాలసిస్’అనే ఈ పద్ధతితో కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లోనే డయాలసిస్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి.. రాష్ట్రాల్లోనూ అమలు చేసేలా కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. పెరిటోనియల్ డయాలసిస్ బ్యాగు కొనుక్కుని దాని ద్వారా ఇంట్లోనే డయాలసిస్ చేసుకోవచ్చని తెలిపింది. అమెరికా, థాయిలాండ్, హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో పెరిటోనియల్ పద్ధతినే పాటిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఆసుపత్రులకు వెళ్లకుండానే తక్కువ సమయంలో డయాలసిస్ చేసుకోవచ్చు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిధులను ఉపయోగించుకొని పెరిటోనియల్ డయాలసిస్‌ను అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఏటా లక్ష మంది బలి.. దేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధులు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. ఏటా లక్ష మంది ఈ వ్యాధులకు బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనంలో వెల్లడైంది. 2015లో ఏకంగా 1.36 లక్షల మంది కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏకంగా కోటికి చేరింది. ఏటా మరో లక్ష మంది వీరికి తోడవుతున్నారు. షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. 70 ఏళ్లలోపు చనిపోతున్నవారిలో 3 శాతం మంది కిడ్నీ వ్యాధికి లోనైన వారే. త్వరలో దేశంలో 10 లక్షల మందికి డయాలసిస్ చేయాల్సి వస్తుందని కేంద్రం అంచనా. తెలంగాణలో ప్రస్తుతం 3 లక్షల మంది వరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారిలో 15 వేల మందికి డయాలసిస్ జరుగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 43, ప్రైవేటు రంగంలో 30 యూనిట్లు డయాలసిస్ చేస్తున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేసినందుకు ఒక్కోసారి రూ.3 వేల వరకు వసూలు చేస్తుండగా, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. పెరిటోనియల్‌తో లాభాలివే.. ప్రస్తుతం హీమో–డయాలసిస్ పద్ధతి అవలంబిస్తున్నారు. ఇది ఆసుపత్రుల్లో మాత్రమే చేస్తారు. జిల్లా కేంద్రాలు, రాష్ట్ర రాజధానిలోనే ఇవి అందుబాటులో ఉన్నాయి. మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, సుదూర ప్రాంతాల నుంచి రోగులు డయాలసిస్ కోసం వారానికి రెండు మూడు సార్లు దూరం ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీంతో అనేక మంది అంత దూరం ప్రయాణించలేక, ఖర్చు భరించలేక చికిత్స తీసుకోవట్లేదు. దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కానీ పెరిటోనియల్‌తో అలాంటి పరిస్థితి ఉండదు. పిల్లలైతే పెద్దల సహకారంతో చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు అర గంటపాటు డయాలసిస్ చేసుకుంటే సరిపోతుంది. అవసరాన్ని బట్టి రోజుకు రెండు మూడు సార్లు చేసుకోవచ్చు. పెరిటోనియల్ డయాలసిస్‌కు ఇంట్లో వెలుతురు ఉన్న గది ఉంటే చాలు. దానికి అనుబంధంగా బాత్రూం ఉండాలి. గది శుభ్రంగా ఉంచుకోవాలి. నిరంతరం బెడ్షీట్లు మార్చుకోవాలి. డయాలసిస్ బ్యాగులు నిల్వ ఉంచుకోవడానికి సాధారణ వసతి సరిపోతుంది. హీమో డయాలసిస్ ద్వారా నెలకు రూ.30 వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తే.. పెరిటోనియల్ ద్వారా నెలకు రూ.25 వేల వరకు ఖర్చు అవుతుంది. మరింత ప్రయోజనం పెరిటోనియల్ డయాలసిస్‌తో రోగికి చాలా కష్టాలు తప్పుతాయి. ఇంట్లోనే డయాలసిస్ చేసుకునే వీలుంది. దీన్ని ఉచితంగా అమలు చేయాలని కేంద్రం సూచించింది. పెరిటోనియల్ డయాలసిస్ బ్యాగును సాధారణ పాల ప్యాకెట్లా తీసుకెళ్లొచ్చు. మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో ఈ బ్యాగులను అందుబాటులో ఉంచి సంబంధిత రోగులకు అందజేయాలి. ఈ పద్ధతి వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా రోగి ప్రయాణాలు చేయాల్సిన అవసరం పడదు. –డాక్టర్ శ్రీభూషణ్‌రాజు, కార్యదర్శి, పెరిటోనియల్ డయాలసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా. నోడల్ ఏజెన్సీలుగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు.. ప్రతి జిల్లాకు పెరిటోనియల్ డయాలసిస్‌ను పర్యవేక్షించే నోడల్ ఆఫీసర్ ఉంటారని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ) నోడల్ ఏజెన్సీలుగా ఉంటాయి. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు కిడ్నీ రోగులకు డయాలసిస్ విషయంలో సాయంగా ఉంటారు. డయాలసిస్ బ్యాగులను రోగులు సంబంధిత ఆసుపత్రుల నుంచే తెచ్చుకోవాల్సి ఉంటుంది. వాటిని ఉపయోగించిన తర్వాత తిరిగి మెడికల్ సిబ్బందికే అప్పగించాలి. రెండు నెలలకోసారి డయాలసిస్ రోగులు సంబంధిత సీహెచ్‌సీకి వెళ్లి తమ పరిస్థితిని చెప్పాలి. మూడు నెలలకోసారి ట్రైనింగ్ తీసుకోవాలి. రెండు మూడు నెలలకో సారి కిడ్నీ వైద్య నిపుణుడిని సంప్రదించాలి. -
హైబీపీ, డయాబెటిస్ ఉన్నాయా..? కిడ్నీ పరీక్షలు తప్పనిసరి
మన శరీరంలో మూత్రపిండాలను (కిడ్నీలను) చాలా సంక్లిష్టమైన అవయవాలుగా చెప్పుకోవచ్చు. అవి శరీరంలోని విషతుల్యమైన పదార్థాలను మూత్రం ద్వారా వడపోస్తాయి. హార్మోన్లను, ఎంజైములను కూడా విడుదల చేస్తుంటాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే మూత్రపిండాల్లో ఎడమవైపుది కొంచెం పెద్దగా కుడివైపు దానికంటే కొంచెం ఎగువగా ఉంటుంది. దాదాపు 150 గ్రాముల వరకు బరువుండే మూత్రపిండాలు 11–14 సెం.మీ పొడవు, 6 సెం.మీ వెడల్పు, 4 సెం.మీ మందంగా ఉంటాయి. రక్తంలోని వ్యర్థాలను తొలగించడంలో కిడ్నీలది ప్రధాన పాత్ర.అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం (డయాబెటిస్)తో బాధపడేవారికి మూత్రపిండాలు వైఫల్యం చెందే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఎప్పటికప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్టులు చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి.మూత్రపిండాలకు సంబంధించి నాలుగు రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 1 కిడ్నీ ఇన్ఫెక్షన్స్ 2 కిడ్నీ స్టోన్స్ 3 కిడ్నీ ఫెయిల్యూర్ 4 కిడ్నీ ట్యూమర్స్ అండ్ క్యాన్సర్స్ ♦ మహిళల్లో ఎక్కువగా కనిపించే బ్యాక్టీరియల్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కిడ్నీలకు వరకు పాకి ఇన్ఫెక్షన్లకు గురిచేస్తుంటాయి. యాంటీబయాటిక్ కోర్సులతో ఈ సమస్య తొలగిపోతుంది. ♦ పురుషుల్లో ఎక్కువగా కనిపించే మూత్రపిండాల్లో వచ్చే రాళ్లలో అనేక రకాలుండటంతో పాటు ఇసుకరేణువు పరిమాణం దగ్గర్నుంచి గోల్ఫ్‌బాల్ సైజు వరకూ ఉంటాయి. తీవ్రమైన నొప్పి, బాధను కలిగించే ఈ రాళ్లకు సైజును బట్టి అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ♦ అధిక బరువు, పొగతాగడం, మద్యం, రక్తపోటు, చక్కెరపాళ్లు అదుపులో లేకపోవడం వల్ల ఆ దుష్ప్రభావాలతో కిడ్నీలు విఫలమైనప్పుడే కిడ్నీ సమస్యల లక్షణాలు బయటపడుతుంటాయి. కాబట్టి దీన్ని ఒక సైలెంట్ డిసీజ్‌గా చెప్పుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్‌కు డయాలసిస్, కిడ్నీ మార్పిడి (ట్రాన్స్‌ప్లాంటేషన్) చికిత్స పద్ధతులు తప్పనిసరి. ♦ పుట్టుకతో వచ్చే కిడ్నీ సమస్యల్లో పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లేదా డాక్టర్ దగ్గరకు చెకప్స్ కోసం వెళ్లినప్పుడు కణుతులు బయటపడుతుంటాయి. కణితి పరిమాణాన్ని బట్టి మూత్రంలో రక్తం, కడుపునొప్పి, జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, అజీర్ణం, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నెఫ్రోబ్లాస్టోమా లేదా విల్మ్స్ ట్యూమర్స్‌గా చెప్పకునే మూత్రపిండాల్లో కణుతులు పిల్లల్లో 4, 5 ఏళ్ల వయసులో బయటపడుతుంటాయి. అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లో ఎక్కువగా కనిపించే ఈ కణుతులను పూర్తిగా నయం చేయడం సాధ్యమే. ప్రమాదకరమైన కణుతులు రీనల్‌సెల్ కార్సినోమా (ఆర్సీసీ) అనే ఒక రకం కణితి పెద్ద వయసులో కనిపిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులకు, ఇతర భాగాలకు వ్యాపించే గుణం ఈ క్యాన్సర్‌కు ఎక్కువ. ఒక్కొక్కసారి ఇలా వ్యాప్తిచెందిన (మెటాస్టాసిస్ అయిన) భాగాల ద్వారా కూడా ఈ క్యాన్సర్‌ను గుర్తించడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి రెండు మూత్రపిండాలలో కూడా ఈ కణుతులు ఉండవచ్చు. అనేక సబ్టైపులలో ఉండే ఈ క్యాన్సర్ ఇతర కిడ్నీ సంబంధిత పరీక్షలతో, ఆల్ట్రాసౌండ్ వంటి పరీక్షలతో కనుగొనడం జరుగుతుంది. వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్ పెరిగే అవకాశం ఎక్కువ. అయితే పొగతాగే అలవాటు ఉన్నవారిలో చాలా చిన్నవయసు వారిలోనే ఈ క్యాన్సర్ నమోదవుతున్నట్లు అనేక అధ్యయనాలు / సర్వేలు తెలుపుతున్నాయి. అందుకే ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పట్టణాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పొగతాగడం, మద్యం అలవాటు ఉండటం, అధిక బరువు వంటి వాటితో పాటు జన్యుపరివర్తనాలు (జీన్ మ్యుటేషన్స్) కూడా ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారకాలు అవుతాయి. పరీక్షలు లక్షణాలు కనిపించనప్పుడు శారీరక పరీక్షలు చేయడం (ఫిజికల్ ఎగ్జామ్స్), రక్తపరీక్షలు (బ్లడ్ టెస్ట్స్), మూత్రపరీక్షలు (యూరిన్ టెస్ట్స్), ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎమ్మారై, క్యాల్షియమ్ లెవెల్స్ తెలిపే పరీక్షలతో పాటు, ఒక్కోసారి ఈ క్యాన్సర్ బయటపడే సరికే ఊపిరితిత్తులకు, ఎముకలకు క్యాన్సర్ పాకి ఉండవచ్చు. కాబట్టి డాక్టర్లు ఛాతీ ఎక్స్‌రేతో పాటు బోన్స్కాన్స్ కూడా చేయిస్తూ ఉంటారు. చికిత్స కిడ్నీ మొత్తంగా తీసేయాల్సిన శస్త్రచికిత్సతో పాటు క్యాన్సర్ రకాన్ని బట్టి కీమో, రేడియో థెరపీలను ఇస్తారు. కిడ్నీలనిప్పుడు లాపరోస్కోపిక్ పద్ధతిలోనూ తొలగిస్తున్నారు. క్యాన్సర్ కాని కణుతులకు కూడా సైజుని బట్టి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ కణుతులు ఎక్కువగా ఉన్నా లేదా మూత్రపిండాలలో చాలా పెద్దగా ఉన్న సందర్భాల్లో కూడా కిడ్నీలను తొలగించాల్సి రావచ్చు. కిడ్నీ ట్యూమర్ స్టేజ్ మీద ఆధారపడి శస్త్రచికిత్సని మూడు రకాలుగా చేస్తూ ఉంటారు. రాడికల్ నెఫ్రోక్టమీ: ఎక్కువగా చేసే ఈ సర్జరీలో మూత్రపిండంతో పాటు అడ్రినల్ గ్లాండ్స్, లింఫ్ నాళాలలను, కణజాలాన్ని మొత్తంగా తీసివేయడం జరుగుతుంది. కణితి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సర్జరీని చేస్తారు. సింపుల్ నెఫ్రొక్టమీ: స్టేజ్ – 1 : కిడ్నీ క్యాన్సర్‌కు ఒక్క మూత్రపిండాన్ని మాత్రమే తీసివేయడం జరుగుతుంది. పార్షియల్ నెఫ్రోక్టమీ: పుట్టు్టకతో ఒకే ఒక మూత్రపిండం ఉండి, దానిలో కణితి కనిపించినప్పుడు, కణితి ఉన్నంత వరకు మాత్రమే తీసివేయడం జరుగుతుంది. ♦ ఒక్కోసారి రెండు మూత్రపిండాల్లోనూ కణుతులు ఏర్పడినప్పుడు కూడా ఇలా కణుతులు ఉన్నంత మేరకు మాత్రమే వాటిని తీసేయడం జరుగుతుంది. ♦ కణితిని తొలిదశలోనే గుర్తించి, ఒక్క మూత్రపిండాన్ని మాత్రమే తొలగించినప్పుడు, శస్త్రచికిత్స అయిన కొద్దిరోజుల్లోనే వారు సాధారణ జీవితాన్ని గడపగలుగుతారు. రెండు మూత్రపిండాలను తీసేసినా, ఒక్కటి ♦ తీసేశాక రెండోది సరిగా పనిచేయకపోయినా వారికి డయాలసిస్ చేస్తూ, వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించాల్సి ఉంటుంది. ♦ చికిత్స అయిపోయిన తర్వాత కూడా ఫాలో అప్ తప్పనిసరి. సీటీ స్కాన్, ఛాతీ ఎక్స్‌రే వంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. ♦ మూత్రంలో రక్తం కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా ఉండటంతో పాటు పొగతాగడం, మద్యం వంటి అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉంటుండటం వల్ల మూత్రపిండాలను కొంతవరకైనా కాపాడుకోగలిగిన వారమవుతాం. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
కిడ్నీ జబ్బును గుర్తించే ‘యాప్’
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్‌లో కిడ్నీ సమస్యలతో ఏటా ఏకంగా లక్షమంది మరణిస్తున్నారు. అక్కడ ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల్లో ప్రతి ఐదుగురుల్లో ఒకరు కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న వారేనని, సకాలంలో వారి సమస్యను గుర్తించక పోవడం వల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నారని లండన్‌లోని రాయల్ ఫ్రీ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణలు తెలియజేస్తున్నారు. సకాలంలో గుర్తించినట్లయితే డయాలసిస్ లేదా కిడ్నీ ఆపరేషన్ల వరకు వెళ్లకుండా రోగులను రక్షించే అవకాశం ఉంటుందని వారంటున్నారు. సకాలంలో వైద్యులు జబ్బును గుర్తిస్తే మరణిస్తున్న ప్రతి ముగ్గురు రోగుల్లో ఒక్కరిని రక్షించవచ్చని అంటున్నారు. వైద్యుల ఆకాంక్షను సాకారం చేస్తూ గూగుల్ కంపెనీ ‘అక్యూట్ కిడ్నీ ఇంజూరి’ని 14 నిమిషాల్లో గుర్తించే విధంగా ఓ మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. ‘స్ట్రీమ్స్’గా పిలిచే ఈ యాప్‌ను ‘గూగుల్స్ డీప్‌మైండ్’గాను అభివర్ణిస్తున్నారు. కిడ్నీ రోగిని గుర్తించడంలో ప్రతి రోగికి ఈ యాప్ ద్వారా రెండు లక్షల రూపాయల ఖర్చు కూడా తగ్గుతుందని ‘నేచర్ డిజిటల్ మెడిసిన్’ పత్రిక తాజా సంచిక వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక విజ్ఞాన పద్ధతుల ద్వారా రోగుల్లో 87.6 శాతం ఎమర్జెన్సీ కేసులను గుర్తించగలుగుతుంటే గూగుల్ యాప్ ద్వారా 96.7 ఎమర్జెన్సీ కేసులను గుర్తించ గలుగుతున్నారట. ఆస్పత్రుల్లో ఉంటే ఐటీ టెక్నాలజీని ఉపయోగించి ఓ రోగికి సంబంధించిన సమస్త డేటాను ఈ యాప్ సేకరిస్తుంది. గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు, రక్త పరీక్షల వివరాలు సేకరించి ఒక చోట నమోదు చేస్తుంది. రోగి రక్తంలో ‘క్రియాటినిన్’ ఎక్కువ మోతాదులో ఉన్నట్లయితే సదరు వైద్యుడికి వెంటనే సందేశం పంపిస్తుంది. ఈ ‘స్ట్రీమ్స్’ యాప్ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని రాయల్ ఫ్రీ ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ క్రిస్ స్ట్రీతర్ తెలియజేశారు. -
‘కిడ్నీకి హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది’
వాషింగ్టన్ : తలాతోక లేకుండా మాట్లాడటంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా మరోసారి ట్రంప్ అసందర్భ ప్రేలాపన చేసి నెటిజన్ల చేతిలో బుక్కయ్యాడు. ఆ వివరాలు.. కిడ్నీ వ్యాధుల చికిత్స నిమిత్తం తీసుకొచ్చిన కొత్త ఆదేశాలపై బుధవారం ట్రంప్ సంతకం చేశాడు. ఈ సందర్భంగా ట్రంప్ జనాలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘కొత్త ఆదేశాల వల్ల మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారికి, ముఖ్యంగా కిడ్నీలు ఫెయిలయ్యి ఇబ్బంది పడుతున్న వారికి ఎంతో మేలు జరగనుంది. ఇక మీదట వీరికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, డయాలసిస్ వంటి సేవలు చాలా సులభంగా అందుతాయ’ని తెలిపారు. అంతా బాగానే ఉంది అనుకుంటుండగా ప్రసంగం చివర్లో ట్రంప్ అసందర్భం ప్రేలాపనకు దిగారు. ‘కిడ్నీలు మానవ శరీరంలో చాలా ప్రత్యేకమైనవి. వీటికి హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది నమ్మశక్యం కానీ విషయం’ అంటూ తన పైత్యాన్ని ప్రదర్శించాడు. ఇంకేముంది ట్రంప్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. ‘చరిత్రలో ఇంతవరకూ ఎవరూ చెప్పని గొప్ప విషయాలను ట్రంప్ చెప్తున్నారు.. ఆయన జ్ఞానాన్ని అభినందించాలని’ ఒకరు.. ‘ట్రంప్‌కు హృదయం స్థానంలో కిడ్నీ ఉంది. అందుకే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారంటూ’ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. "The kidney has a very special place in the heart." Trump just signed an executive order to revamp care for kidney disease pic.twitter.com/H5l4IS8M7o — TicToc by Bloomberg (@tictoc) July 11, 2019 -
కిడ్నీ రోగులకు వైఎస్ జగన్ సర్కార్ వరం
-
ఉన్నది ఒకటే కిడ్నీ వదల్లేదు చదువుని
బళ్లారి, అర్బన్: ఆత్మ విశ్వాసంతో అనారోగ్యాన్ని సైతం అధిగమించి పదో తరగతిలో మెరుగైన ఫలితం సాధించిన అరుదైన విద్యార్థి సురేష్ అని అభినందనలు అందుకుంటున్నాడు. బళ్లారి నగరం కొళగల్లు రోడ్డులోని ఇందిరానగర్‌లో నివాసముంటున తాపీ మేస్త్రీ నాగరాజ్, నాగరత్నమ్మల ఏకైక కుమారుడు పుట్టుకతోనే అనారోగ్యంతో జన్మించాడని తల్లిదండ్రులు సాక్షితో తెలిపారు. గుగ్గరహట్టిలోని ఆదర్శ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న సురేష్ అక్టోబర్ నుంచి పూర్తిగా అనారోగ్యం బారిన పడడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. సురేష్‌కు పుట్టుక నుంచే ఒక మూత్రపిండం లేదని వైద్యులు తేల్చారు. దీంతో మరో కిడ్నీపై అధిక భారం పడటంతో అది కూడా పూర్తి దెబ్బతినిందని వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ నిత్యం ఔషధాలు తీసుకుంటూ విద్యాభ్యాసంపై ఎంతో ఆసక్తి చూపే తమ కుమారుడు మూడు నెలల పాటు స్కూల్‌కు పోయి మరో 6 నెలలు ఇంట్లోనే ఉండి పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకున్నట్లు తెలిపారు. పదో తరగతిలో 514 మార్కులతో 82.24 శాతం ఉత్తీర్ణత సాధించాడని సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమారునికి చికిత్స చేయించే స్తోమత తమకు లేదన్నారు. ఇప్పటికే గత అక్టోబర్ నుంచి ఇంతవరకు లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టామని తెలిపారు. సహాయ హస్తం కోసం వినతి తాను 600 మార్కులు సాధించాలనే లక్ష్యంతో పట్టుదలగా చదివానని సురేష్ అన్నాడు. ‘పాలిటెక్నిక్ చదివి ఇంజనీరింగ్ పూర్తి చేయాలన్నది లక్ష్యమన్నాడు. చదువుతో పాటు రైటింగ్, డ్రాయింగ్, మొబైల్ టెక్నాలజీలో చాకచక్యంగా ప్రతిభను చాటుకున్నాడని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆరోగ్యం బాగై అందరి పిల్లల మాదిరిగానే ఆడుకోవాలని భగవంతుని కోరుతున్నామన్నారు. తమ బిడ్డ వైద్యానికి దయగల దాతలు ఆర్థిక సాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరారు. వివరాలకు మేస్త్రీ నాగరాజ్–9901142959 నంబరులో సంప్రదించాలని తెలిపారు. -
రక్తపోటు, మధుమేహం ఉందా? కిడ్నీ పరీక్షలు తప్పనిసరి
మన శరీరంలో మూత్రపిండా(కిడ్నీ)లను చాలా సంక్లిష్టమైన, కీలకమైన అవయవాలుగా చెప్పుకోవచ్చు. అవి శరీరంలో విషతుల్యమైన పదార్థాలను మూత్రం ద్వారా వడపోసి బయటకు విసర్జిస్తాయి. అంతేకాదు... కీలకమైన హార్మోన్లు, ఎంజైములను కూడా విడుదల చేస్తుంటాయి. చిక్కుడుగింజ ఆకృతిలో ఉండే మూత్రపిండాల్లో ఎడమవైపుది కొంచెం పెద్దగా ఉండి, కుడివైపు దానికంటే కాస్త ఎగువన ఉంటుంది. దాదాపు 150 గ్రాముల వరకు బరువుండే మూత్రపిండాలు 11–14 సెంమీ. పొడవు, 6 సెం.మీ. వెడల్పు, 4 సెం.మీ. మందంగా ఉంటాయి. రక్తంలోని వ్యర్థాలను తొలగించడంతో పాటు రక్తపోటును నియంత్రించడంలోనూ కిడ్నీలది ప్రధాన పాత్ర. అందుకే బీపీ ఎక్కువగా ఉంటే కిడ్నీ పరీక్షలను కూడా పూర్తిగా చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు, మధుమేహం తో బాధపడేవారికి మూత్రపిండాలు వైఫల్యం చెందే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఎప్పటికప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్‌లు చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి. మూత్రపిండాలకు సంబంధించి నాలుగు రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 1. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ 2. కిడ్నీ స్టోన్స్ 3. కిడ్నీ ఫెయిల్యూర్ 4. కిడ్నీ ట్యూమర్స్ అండ్ క్యాన్సర్స్ మహిళల్లో ఎక్కువగా కనిపించే బ్యాక్టీరియల్ యూరినరీ ఇన్ఫెక్షన్లు మూత్రపిండాల వరకు పాకి అక్కడా ఇన్ఫెక్షన్లను కలగజేస్తుంటాయి. యాంటీబయాటిక్ కోర్సులతో ఈ సమస్య తొలగిపోతుంది. పురుషులలో ఎక్కువగా కనిపించే మూత్రపిండాలలోని రాళ్లలో ఇసుకరేణువు పరిమాణం మొదలుకొని గోల్ఫ్‌బాల్ సైజువరకూ ఉంటాయి. వీటిలో కొన్ని రకాలు అంత ప్రమాదకరం కాకపోయినా తీవ్రమైన నొప్పిని, బాధను కలిగిస్తాయి. సైజును బట్టి అనేకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అధిక బరువు, స్మోకింగ్, ఆల్కహాల్, రక్తపోటు, షుగర్‌లెవల్స్ అదుపులో లేకపోవడం వల్ల ఆ దుష్ప్రభావాలు మూత్రపిండాల మీద పడి అది కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యకు దారితీయవచ్చు. మూత్రపిండాలు ఫెయిల్ అయనప్పుడు మాత్రమే లక్షణాలు బయటపడుతుంటాయి. అందుకే దీన్ని ఒక సైలెంట్ డిసీజ్‌గా చెప్పుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్‌కు డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స పద్ధతులు అనుసరించడం తప్పనిసరి కావచ్చు.పుట్టుకతో వచ్చే మూత్రపిండాల్లో కణుతులు, పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లేదా డాక్టర్ దగ్గరికి చెకప్స్‌కు తీసుకెళ్లినప్పుడు బయటపడుతూ ఉంటాయి. కణితి పరిమాణం బట్టి మూత్రంలో రక్తం, కడుపునొప్పి, జ్వరం, ఆకలి–బరువు తగ్గడం, అజీర్ణం, అధికరక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నెఫ్రోబ్లాస్టోమా లేదా విల్మ్స్ ట్యూమర్‌గా చెప్పుకునే మూత్రపిండాల్లో కణుతులు పిల్లల్లో 4, 5 ఏళ్ల వయసులో బయటపడుతూ ఉంటాయి. వీటిని పూర్తిగా నయం చేయడం సాధ్యమే. రీనల్‌సెల్ కార్సినోమా (ఆర్సీసీ): ఈ రకం కణితి పెద్ద వయసు వారిలో కనిపిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులకు, ఇతర భాగాలకు వ్యాపించే గుణం ఈ క్యాన్సర్‌కు ఎక్కువ. ఒక్కొక్కసారి ఇలా ఇతర చోట్లకు పాకిన (మెటాస్టాసిస్ అయిన) భాగాల ద్వారా కూడా ఈ క్యాన్సర్‌ను గుర్తించడం జరుగుతూంటుంది. ఒక్కోసారి రెండు మూత్రపిండాలలో కూడా ఈ కణుతులు ఉండవచ్చు. అనేక సబ్–టైప్లలో ఉండే ఈ క్యాన్సర్... ఇతర కిడ్నీ సంబంధిత పరీక్షలలో, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలలో కనుగొనడం కూడా జరుగుతూ ఉంటుంది. వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్ పెరిగే అవకాశం ఎక్కువ. అయితే స్మోకింగ్ చేసేవారిలో చిన్నవయసు వారిలోనూ ఈ క్యాన్సర్ నమోదువుతున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. స్మోకింగ్, ఆల్కహాల్, అధికబరువు వంటి వాటితో పాటు జీన్మ్యుటేషన్స్ ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు. క్యాన్సర్ లక్షణాలు కనిపించినప్పుడు ఫిజికల్ ఎగ్జామ్, బ్లడ్ టెస్ట్‌లు, యూరినరీ టెస్టులు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ, ఎమ్మారై, క్యాల్షియమ్ లెవల్స్ తెలిపే పరీక్షలతో పాటు, ఒక్కోసారి ఈ క్యాన్సర్ బయటపడే సమయానికి అది ఊపిరితిత్తులకు, ఎముకలు పాకి ఉండవచ్చు. కాబట్టి చెస్ట్ ఎక్స్‌రే, బోన్ స్కాన్స్ కూడా చేయిస్తూ ఉండాలి. కిడ్నీని మొత్తంగా తీసివేసే సర్జరీతో పాటు క్యాన్సర్ రకాన్ని బట్టి కీమో, రేడియో థెరపీలను ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల కిడ్నీలను లాపరోస్కోపిక్ పద్ధతిలో కూడా తొలగించడం జరుగుతోంది. క్యాన్సర్ కాని కణుతుల్లో కూడా సైజును బట్టి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ కణుతులు ఎక్కువగా ఉన్నా, మూత్రపిండాలలో అవి చాలా పెద్దగా ఉన్న సందర్భాల్లో కూడా కిడ్నీని తొలగించడం జరుగుతుంది. సర్జరీ తర్వాత కిడ్నీ ట్యూమర్ స్టేజ్ మీద ఆధారపడి సర్జరీని 3 రకాలుగా చేస్తుంటారు. రాడికల్ నెఫ్రోక్టమీ: ఎక్కువగా చేసే ఈ సర్జరీలో మూత్రపిండంతో పాటు అడ్రినల్ గ్లాండ్స్, లింఫ్ నాళాలను, టిష్యూలను మొత్తంగా తీసివేయడం జరుగుతుంది. కణితి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సర్జరీ చేస్తారు. సింపుల్ నెఫ్రొక్టమీ స్టేజ్–1: కిడ్నీ క్యాన్సర్‌కు ఒక మూత్రపిండాన్ని మాత్రం తీసివేయడం జరుగుతుంటుంది. పార్షియల్ నెఫ్రోక్టమీ: పుట్టుకతో ఒకే ఒక మూత్రపిండం ఉండి, దానిలో కణితి కనిపించినప్పుడు, కణితి ఉన్నంత మేరకే దాన్ని తీసేవేయడం జరుగుతుంది. ఒక్కోసారి రెండు మూత్రపిండాలలోనూ కణుతులు ఏర్పడినప్పుడు కూడా మూత్రపిండాలను ఇలా కణితి ఉన్న మేరకు మాత్రమే తీసివేయడం జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి ఒక్క మూత్రపిండాన్ని మాత్రమే తీసివేసినప్పుడు సర్జరీ అయిన కొద్దిరోజుల్లోనే వారు సాధారణం జీవితాన్ని గడపగలుగుతారు. రెండు మూత్రపిండాలను తీసివేశాక, రెండోది సరిగా పనిచేయకపోతే... వారు క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ, వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడం అవసరం. చికిత్స ముగిశాక కూడా ఫాలో అప్ కేర్ తప్పనిసరి. సీటీస్కాన్, చెస్ట్ ఎక్స్‌రే వంటి టెస్ట్‌లు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. మూత్రంలో రక్తం కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా ఉండటంతో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి విషాలకు దూరంగా ఉంటే మూత్రపిండాలను కొంతవరకైనా కాపాడుకోగలం. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
గడ్డ తీస్తామని కిడ్నీ తీశారు
చాదర్‌ఘాట్: చికిత్స కోసం వస్తే గడ్డ తొలగిస్తామని చెప్పిన మలక్‌పేట యశోద ఆసుపత్రి వైద్యులు కిడ్నీ మాయం చేశారని ఆరోపిస్తూ రోగిం బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్, తారామతి పేటకు చెందిన శివ ప్రసాద్ వారం రోజుల క్రితం కడుపు నొప్పితో బాధపడుతూ చికిత్స నిమిత్తం మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులో గడ్డ ఉందని దానిని తొలగించేందుకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇందుకు గాను రూ. లక్ష అడ్వాన్స్‌గా కట్టించుకుని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అతడికి ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో గడ్డతోపాటు కిడ్నీని కూడా తొలగించారని ఆరోపిస్తూ అతని బంధువులు మంగళవారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు సమాచారం ఇవ్వకుండానే కిడ్నీని ఎలా తొలగిస్తారని ఆసుపత్రి వర్గాలను నిలదీశారు. కాగా శివప్రసాద్ కడుపులో ఉన్నది కేన్సర్ గడ్డ అయినందున వ్యాధి కిడ్నీకి కూడా సోకిందని వైద్యులు వారికి వివరించారు. చెప్పకుండా ఆపరేషన్ చేశారు:రోగి బంధువులు శివప్రసాద్ కిడ్నీని తొలగింపై తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని రోగి బంధువులు ఆరోపించారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముందుగానే తెలిపాం:యశోద ఆసుపత్రి వైద్యులు శివప్రసాద్‌కు కడుపులో గడ్డకు కేన్సర్ వ్యాధి సోకిందని, వ్యాధి రెండు కిడ్నీలకు వ్యాపించనందునే కిడ్నీ తొలగించాల్సి వచ్చిందని, దీనిపై రోగి బంధువులకు సమాచారం ఇచ్చిన తర్వాతే ఆపరేషన్ చేసినట్లు యశోద ఆసుపత్రి పీఆర్ఓ అశోక్ వర్మ తెలిపారు. పేషెంట్ బంధువుల ఉద్దేశపూర్వకంగానే ఆందోళన చేస్తున్నారన్నారు. -
ప్రాణభిక్ష పెట్టండి..
సంగెం: రెక్కాడితేనే డొక్కాని నిరుపేద కుటుంబం. నిత్యం కూలీనాలీ చేసుకుంటేనే ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లే దీనస్థితి. అలాంటి కుటుంబంలోని తల్లికి రెండు కిడ్నీలు పాడైపోయాయనే పిడుగులాంటి నిజం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తుండడంతో దిక్కుతోచని దయనీయస్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న అభాగ్యురాలి దీనగాధ. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తికి చెందిన సదిరం లలిత(45), మల్లయ్య దంపతులకు ఒక కుమారుడు రాజు, కూతరు కోమల ఉన్నారు. గుంట జాగలేని నిరుపేద కుటుంబం కావడంతో రెక్కల కష్టాన్ని నమ్ముకిని కూతురు కోమల, కుమారుడు రాజులకు వివాహం జరిపించారు. ఇక తమ కష్టాలు గట్టెక్కుతాయని అనుకుంటున్న సమయంలో లలిత ఆనారోగ్యం భారినపడింది. ఆసుపత్రుల చుట్టూ తిరిగి మందులు వాడుతున్న క్రమంలో లలితకు రెండు కిడ్నీలు పాడైపోయాయని డాక్టర్లు పిడుగులాంటి నిజం చెప్పారు. లలిత ఆరోగ్యం కుదుట పడాలంటే కిడ్నీ మార్పిడి తప్పనిసరి అని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. లలిత ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చికిత్స పొందుతున్నది. లలితకు కిడ్నీ ఇచ్చేందుకు భర్త మల్లయ్య, కుమారుడు రాజు సిద్ధంగా ఉన్నప్పటికీ వీరి కిడ్నీ లలి తకు సరిపోతుందో లేదోనని, పరీక్షలు నిర్వహిం చుకోవడానికి కూడా చేతిలో చిల్లిగవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. తమ కిడ్నీ సరిపోకుంటే జీవ న్ధాన్ కింద అవయవదానం చేసిన వారి కిడ్నీ అయినా అమర్చి లలితకు ప్రాణభిక్ష పెట్టా లని భర్త ,కుమారుడు వేడుకుంటున్నారు. కిడ్నీ మార్పిడికి దాతలు సహకరించాలని కోరుతున్నారు. అకౌంట్ నంబర్ 73065213615 సదిరం లలిత ఏపీజీవీబీ గవిచర్ల బ్రాంచ్, ఐఎఫ్‌సీ కోడ్ ఏపీజీవీ0005158 -
గ్యాస్ ట్రబుల్ మందులతో కిడ్నీకి చేటు..
కడుపు ఉబ్బరంగా ఉందనిపిస్తే చాలు.. చాలామంది ఒమీప్రొజోల్, మెటాప్రొలోల్ వంటి మందులు ఎడాపెడా వాడేస్తూంటారు. ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్లు అని పిలిచే ఈ మందుల వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సైంటిఫిక్ రిపోర్ట్స్ మ్యాగజైన్ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం.. పీపీఐ మందులతో పోలిస్తే హిస్టమైన్ –2 రకం మందులు తీసుకునే వారికి కిడ్నీ సమస్యలు తక్కువ. అమెరికాలో అందుబాటులో ఉన్న కోటి మంది రోగుల వివరాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు రూబెన్ అబగ్యాన్ అనే శాస్త్రవేత్త చెప్పారు. పీపీఐ మందులు మాత్రమే తీసుకున్న వారి వివరాలను పరిశీలిస్తే ఇతరులతో పోలిస్తే కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని చెప్పారు. కొంచెం స్పష్టంగా చెప్పాలంటే ఈ మందులు తీసుకునే ప్రతి ముగ్గురిలో ఒకరు తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడే అవకాశం ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. పీపీఐ మందులు అత్యవసరమైనప్పటికీ వాటితో ఈ సమస్యలున్నాయని స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని.. పైగా పీపీఐ పద్ధతిపై ఆధారపడని యాంటాసిడ్లు, హిస్టమైన్ –2 రకం మందులతో దుష్ఫలితాలు తక్కువన్న విషయాన్ని గుర్తించాలని వివరించారు. -
దాతలు ఆదుకోవాలని వినతి
తూర్పుగోదావరి, అముజూరు (కె.గంగవరం): అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ కుటంబం విషాదంలోకి వెళ్లింది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన పాము వీర వెంకట సత్యనారాయణ(40) హిందీ మాస్టారుగా రామచంద్రపురం పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో పనిచేస్తున్నారు. ఆయనకు వచ్చే జీతంతో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఇప్పటి వరకు కడిపారు. హిందీ మాస్టారుగా ఎంతో మంది విద్యార్థులను హిందీ భాషలో ప్రావీణ్యులను చేశారు. నెల రోజుల క్రితం సత్యనారాయణ అనార్యోగానికి గురైతే కుటుంబ సభ్యులు కాకినాడ ఆసుపత్రికి తరలించారు. వారు పరీక్షలు చేసి రెండు కిడ్నీలు పాడైపోయాయని చెప్పడంతో ఒక్కసారిగా వారి పరిస్థితి తల్లకిందులైంది. ఆయన చెల్లి కిడ్నీని దానం చేయడంతో కాకినాడలోని ట్రస్టు ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ ద్వారా రూ.ఐదు లక్షలతో ఆపరేషన్ ఇటీవల చేయించారు. ఆపరేషన్ అనంతరం చేయాల్సిన చికిత్స కొనసాగాలంటే మరో రూ.మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చవుతుందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. కూలిపనులు చేసుకునే తాము ఇంత డబ్బు తేలేక, ఆరోగ్య బాగుంటే చాలని వారు ఆవేదన చెందుతున్నారు. ఉన్నదంతా పోగేసి ఆపరేషన్ చేయించామని, మిగతా చికిత్స కోసం కావల్సిన సొమ్ములు ఎలా అని వారు సతమతమవుతున్నారు. దాతలు సాయం చేస్తే చికిత్స చేయడానికి వీలుగా ఉంటుందని దాతలు ఎవరైనా సాయం చేయాలని వారు కోరుతున్నారు. సాయం అందించాల్సిన దాతలు ఆంధ్రాబ్యాంకు అకౌంట్ నంబర్ 044010100135297, ఐఎఫ్‌సీ కోడ్ ఏఎన్‌డీబీ0000440 నంబర్‌కు సాయం అందించాలని వారు కోరుతున్నారు. నేరుగా సాయం అందించాలనే దాతలు సెల్: 98485 42811కు సంప్రదించాలని వారు కోరుతున్నారు. -
కిడ్నీలేదని పెళ్లికి నిరాకరించిన ప్రియుడు
చెన్నై, తిరువొత్తియూరు: ఇద్దరు ప్రేమించుకున్నారు. తీరా వివాహం చేసుకునే సమయానికి ఒక కిడ్నీ లేదని ప్రియుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఆలందూరు ప్రాంతానికి చెందిన నిత్య (32) గురువారం ఓ ఫిర్యాదు చేసింది. అందులో కుటుంబ సభ్యులతో కలిసి ఉండే తనకు రెండు సంవత్సరాల ముందు విక్కి అలియాస్ విఘ్నేష్ (29) స్నేహితురాలి ద్వారా పరిచయం అయ్యాడని తెలిపింది. తరువాత వాట్సాప్ చాటింగ్‌లో విఘ్నేష్ తనను ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని తెలుపగా తన కన్నా మూడేళ్లు చిన్నవాడు కావడంతో తిరస్కరించానని చెప్పింది. అయినా అతను ఒత్తిడి చేయడంతో ప్రేమించానని, తనకు పుట్టుకతోనే కిడ్నీ లేదనే విషయం నాలుగేళ్ల క్రితం తెలిసిందని అతనికి చెప్పానంది. అందుకు విఘ్నేష్ తాను దివ్యాంగుడని వివాహానికి అభ్యంతరం లేదని తెలిపాడు. తరువాత 2017, ఫిబ్రవరి 26న ఇద్దరి కుటుంబ సభ్యుల సమ్మతితో నిశ్చితార్థం జరిగింది. ఈ లోపు తన తండ్రి మృతి చెందడంతో వివాహం ఆలస్యమైందని తెలిపింది. ఈ క్రమంలో తను ఓ కిడ్నీ లేదని విఘ్నేష్ తనను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని పేర్కొంది. విఘ్నేష్ అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని, అతనితో వివాహం చేయించాలని ఫిర్యాదులో కోరింది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
నా బిడ్డను పవన్ కల్యాణ్ పట్టించుకోలేదు
సాక్షి, రాజమహేంద్రవరం: అభిమానులు నిర్వహించిన బైక్ ర్యాలీలో గాయపడి కిడ్నీని కోల్పోయిన తన కుమారుడిని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏ మాత్రం పట్టించుకోలేదని బాధితుడి తండ్రి మొళ్ల వీరబాబు వాపోయారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మాది పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం హుకుంపేట. గత నెల 9న దేవరపల్లిలో పవన్ అభిమానుల బైక్ ర్యాలీలో పాల్గొన్న నా కుమారుడు రాజ మనోహర్‌ను బైక్ ఢీ కొట్టింది. మరో బైక్ అతనిపై నుంచి వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన రాజ మనోహర్‌ను స్నేహితులు రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా కిడ్నీని తొలగించి ప్రాణాలు కాపాడగలిగారు. నా కుమారుడి స్నేహితులు కొవ్వూరు సభలో పవన్‌కు నా కుమారుడి ప్రమాద ఫొటోలు చూపించారు. అయితే ఆయన మనోహర్ ఎలా ఉన్నాడని కూడా అడగలేదు. దీంతో రూ.5 లక్షలు అప్పు చేసి బిడ్డను కాపాడుకున్నా. తాజాగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. గత పది రోజులుగా రాజమహేంద్రవరంలోని ఆస్పత్రిలోనే ఉంటున్నాం. నా బిడ్డను కాపాడుకోవడానికి దాతలు ఎవరైనా సహాయం చేస్తే వారికి రుణపడి ఉంటా. దాతలు.. ‘మొల్ల వీరబాబు, పశ్చిమ గోదావరి జిల్లా దొండపూడి, ఆంధ్రా బ్యాంక్ ఖాతా నంబర్ 078910100059571, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఏఎన్‌డీబీ0000789’ ద్వారా సహాయం చేయొచ్చు. -
శుద్ధి.. సులభంగా..
తూర్పుగోదావరి,అమలాపురం టౌన్: కిడ్నీ సంబంధిత రోగం వస్తే ఆ రోగికి వారానికి కనీసం రెండు సార్లు రక్త శుద్ధి జరగాలి. దీనినే డయాలసిస్ అంటారు. ప్రభుత్వ పరంగా జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం ఆస్పత్రుల్లోనే ఈ సెంటర్లు ఉన్నాయి. దీంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ రోగులు ముఖ్యంగా పేద రోగులు ఈ రక్తశుద్ధి కోసం కాకినాడ, రాజమహేంద్రవరం వెళ్లాల్సి వస్తోంది. చాలా మంది కిడ్నీ రోగులు రక్త శుద్ధి కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి ప్రతిసారి రూ.2,500 నుంచి రూ.ఐదు వేల వరకూ వెచ్చిస్తున్నారు. వారికి ఆర్థిక భారమైనా రక్త శుద్ధి విధిగా చేయించుకోవాలన్న అత్యవసరంతో నెలకు రూ.25 వేల వరకు ఖర్చుచేస్తున్నారు. రూ.మూడు కోట్ల వ్యయంతోమూడు కేంద్రాలు ప్రభుత్వం జిల్లాలోని అమలాపురం, రంపచోడవరం, తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల్లో కూడా ఈ రక్తశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ మూడు ఆస్పత్రుల్లో దాదాపు రూ.మూడు కోట్ల వ్యయంతో సుమారు 30 డయాలసిస్ యంత్రాలను సమకూర్చింది. ప్రభుత్వ ఆస్పత్రులను పర్యవేక్షించే వైద్య విధాన పరిషత్ ఈ కేంద్రాల నిర్వహణను అపోలో ఆస్పత్రి యాజమాన్యాకి అప్పగించింది. ఈ మూడు కేంద్రాలో కిడ్నీ రోగి బెడ్ వద్దే డయాలసిస్ మెషీన్ ఉంటుంది. ఒక్కో రోగికి రక్త శుద్ధి ప్రక్రియ మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది. అమలాపురం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్త శుద్ధి కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం ప్రారంభించనున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోకా ప్రసాదరావు ఆధ్వర్యంలో ఇప్పటికే ఆస్పత్రిలో ఈ రక్త శుద్ధి కేంద్రం కిడ్నీ బాధిత రోగులకు సేవలు అందిస్తోంది. అమలాపురంలో ఏర్పాటైన 12 డయాలసిస్ మెషీన్ల ద్వారా ఒకేసారి 12 మంది కిడ్నీ రోగులకు రక్తశుద్ధి చేసే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఉచిత డయాలసిస్ సెంటర్అత్యవసరం కోనసీమలో ఉన్న అనేక పేద కుటుంబాలకు చెందిన వారు కిడ్నీ రోగులుగా ఉన్నారు. వీరందరూ కాకినాడ లేదా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేదా ప్రైవేట్ ఆస్పత్రుల్లో రక్త శుద్ధి కోసం వెళుతున్నారు. ప్రత్యేకించి అమలాపురం ఏరియా ఆస్పత్రిలో కూడా ఈ ఉచిత రక్తశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోనసీమలోని పేద కిడ్నీ రోగులకు ఈ కేంద్రం సేవలు అత్యవసరం అవుతాయి. అంతేకాదు ఉచిత సేవలు కాబట్టి ఆర్థిక వ్యయప్రయాసలు ఉండవు. రోజుకు రెండు షిఫ్ట్‌లలో రోగులకు ఈ కేంద్రం సేవలు అందించనున్నాం. – డాక్టర్ మోకా ప్రసాదరావు, సూపరింటెండెంట్,ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, అమలాపురం -
ట్యూమర్ అనుకొని కిడ్నీ తొలగించిన వైద్యుడు!
ఫ్లోరిడా: ఏ దేశంలోనైనా వైద్యుణ్ని దేవుడితో సమానంగా చూస్తారు. అయితే ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు కొన్నిసార్లు నిర్లక్ష్యంతో వ్యవహరించి రోగి జీవితంతో ఆటలాడుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఆమె తన కిడ్నీని కోల్పోవాల్సివచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మౌరీన్ పచేకో(53) గతేడాది కారు ప్రమాదం జరిగినప్పటి నుంచి తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతోంది. ఇక తప్పేలా లేదనుకున్న ఆమె వైద్యుణ్ని సంప్రదించి శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుంది. స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెళ్లింది. శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో సదరు వైద్యుడు... పచేకో నడుము ప్రాంతంలో కేన్సర్ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించాడు. నిజానికి అది కిడ్నీ. సాధారణంగా ఉండాల్సిన చోట కాకుండా పచేకోకు అది వేరో చోట ఉంది. దీన్ని వైద్య పరిభాషలో ‘పెల్విక్ కిడ్నీ’ అంటారు. దీన్ని ట్యూమర్‌గా భావించిన డాక్టర్ అనాలోచితంగా కిడ్నీని తొలగించాడు. అనంతరం మత్తు నుంచి కోలుకున్న పీచేకో.. వైద్యుడు చేసిన తప్పిదాన్ని గుర్తించి న్యాయపోరాటం ద్వారా 5లక్షల డాలర్లు పరిహారం పొందింది. అయినా... ఏం లాభం? ఇక మీదట ఆమె జీవితాంతం ఒక కిడ్నీతో బతకాల్సిందే. -
ఊటగుండం..‘కిడ్నీ’ గండం!
సముద్రతీరానికి ఆనుకొని ఉన్న ఊటగుండం గ్రామాన్ని కిడ్నీ వ్యాధి సమస్య కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మూడు నెలల వ్యవధిలో గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఈ కిడ్నీ సమస్యతో బాధపడుతూ మృతిచెందడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ప్రస్తుతం గ్రామంలోని మరికొంతమంది కూడా ఈ సమస్యతో విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. తమకు అందించే తాగునీరు కలుషితమవ్వడం వల్లే కిడ్నీ వ్యాధి సమస్య తమ గ్రామానికి మహమ్మారిలా పట్టిందని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. కోడూరు (అవనిగడ్డ) : కోడూరు మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీకి చెందిన ఊటగుం డం గ్రామం సముద్రతీరానికి ఆనుకొని ఉంటుం ది. ఈ గ్రామంలో మొత్తం 200 కుటుంబాలకు చెందిన 700మంది జనాభా నివాసముంటున్నా రు. ఇక్కడ గ్రామస్తులు నిత్యం తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. వీరందరికి నాగాయలంక మండలం కమ్మనమోల పంపుహౌస్ నుంచి తాగునీటిని పైప్‌లైన్ ద్వారా సరఫరా చేస్తారు. అయితే ఈ గ్రామం చిట్టచివరన ఉండడంతో కుళాయిల వెంట తాగునీరులో చెత్తచెదారాలతో కూడిన మురుగు నీరు వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ఇంటి అవసరాలకు ఉపయోగించుకునే నీరు పూర్తిగా పసర్లు కమ్మి ఉంటాయని వాపోయారు. గ్రామంలోని కుళాయిల వద్ద కూడా మురుగు పెరుకుపోయి పారిశుద్ధ్యం లోపించిం దని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల్లో ఆరుగురు మృతి.. తాగునీరు కలుషితమవ్వడం వల్ల తమ వారికి కిడ్నీ వ్యాధి సోకిందని ఊటగుండం గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. ఈ నీరు తాగడం వల్లే మూడు నెలల వ్యవధిలో గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందారని వాపోతున్నారు. రెండు రోజుల క్రితం కురాకుల వెంకటేశ్వరరావు(52) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు గ్రామస్తులు చెప్పారు. అదే గ్రామానికి చెందిన దేవనబోయిన శ్రీనివాసరావు (47), ఆరేపు ఆంజ నేయులు (55), దేవనబోయిన వెంకటేశ్వరమ్మ(42), కూచిబోయిన వెంకాయమ్మ (62), కురాకుల కోటేశ్వరరావు (50) కూడా కిడ్నీ సమస్యతో నే మృతిచెందినట్లు వివరిస్తున్నారు. వీరందరు విజయవాడలోని పలు ప్రైవేటు ఆసుపత్రిల్లో చికి త్స పొందగా, వీరికి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు వైద్యులు రిపోర్టులు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. పెరుగుతున్న బాధితుల సంఖ్య.. ప్రసుత్తం మరికొంతమంది గ్రామస్తులు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు ఇక్కడవారు చెబుతున్నారు. కొంతమంది అయితే ఈ వ్యాధి తమకు కూడా సోకుతుందనే భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిని ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు. గ్రామం వైపు చూడని పాలకులు.. మూడు నెలల వ్యవధిలో ఆరుగురు గ్రామస్తులు కిడ్నీ సమస్యతో చనిపోయినా తమ గ్రామానికి సమస్య తెలుసుకునేందుకు వచ్చిన అధికారి గాని, ప్రజాప్రతినిధి గాని లేరని ఇక్కడ వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ఊటగుండం వాసులు కోరుతున్నారు. ఇద్దరు సోదరులను కోల్పోయాను మూడు నెలల వ్యవధిలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఇద్దరు సోదరులను కోల్పోయాను. వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావులు కలుషితమైన నీరు తాగడం వల్లే ఈ వ్యాధి సోకింది. వీరికి విజయవాడలో చికిత్స చేయిస్తే కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ సోకిందన్నారు. రూ.లక్షలాది ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. – కురాకుల రంగారావు, గ్రామస్తుడు -
గురుగ్రాం కాల్పుల కేసు : జడ్జి కుమారుడి అవయవదానం
సాక్షి, న్యూఢిల్లీ : సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పుల్లో గాయపడిన గురుగ్రాం జడ్జి కుమారుడు పదిరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించారు. మరణించిన అడిషనల్ సెషన్స్ జడ్జి కుమారుడి కీలక అవయవాలు గుండె, కాలేయం, మూత్రపిండాలను దానం చేసినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. గురుగ్రాం సెక్టార్ 49లో న్యాయమూర్తి అధికారిక సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పుల్లో జడ్జి భార్య ఘటనా స్ధలంలోనే మరణించగా, తీవ్ర గాయాలైన కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. కాల్పుల ఘటన చోటుచేసుకున్న వెంటనే మహిపాల్ సింగ్‌గా గుర్తించిన గన్‌మాన్‌ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అనారోగ్యంతో ఉన్న కుమార్తెను చూసేందుకు సెలవు కావాలని గార్డు కోరగా, అందుకు నిరాకరించిన జడ్జి తన కుటుంబం షాపింగ్ వెళ్లేందుకు తోడుగా వెళ్లాలని సూచించారు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి లోనైన సెక్యూరిటీ గార్డు గురుగ్రాం మార్కెట్లోని జనసమ్మర్ధం కలిగిన రోడ్డుపై పట్టపగలే తల్లీకొడుకులపై కాల్పులకు తెగబడ్డాడు. మరోవైపు హర్యానా పోలీసులు తమను వేధిస్తున్నారని నిందితుడి కుటుంబం ఆరోపించింది. అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తెను చూసేందుకు మహిపాల్ సింగ్ సెలవు కోరారని వారు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మందుల చీటీని సైతం వారు చూపుతున్నారు. మహిపాల్ సింగ్ వారి ఇంట్లో పనిచేయడం లేదని, తనను సెక్యూరిటీగా కుటుంబ సభ్యులతో పంపడం ఆయనకు ఇష్టంలేదని సింగ్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
అది క్యాన్సరేమోనని ఆందోళనగా ఉంది... సలహా చెప్పండి
క్యాన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. మలవిసర్జనకు వెళ్లినప్పుడు నాకు మలంలో రక్తం పడుతోంది. క్యాన్సర్ ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు. – ఎస్.కె. మౌలాలి, గుంటూరు మీరు ముందుగా డాక్టర్‌ను సంప్రదించి కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మీరు చెబుతున్న లక్షణాలు మూడు ప్రధాన సమస్యల వల్ల రావచ్చు. మొదటిది ఫిషర్ ఇన్ యానల్ కెనాల్ అనే సమస్య. ఈ సమస్యలో రక్తం పడటంతో పాటు నొప్పి కూడా ఉంటుంది. రెండోది హెమరాయిడ్స్ అనే సమస్య. దీన్నే పైల్స్ అని కూడా అంటారు. తెలుగులో ఈ సమస్యను మొలలు అని చెబుతుంటారు. ఈ సమస్యలో కూడా రక్తస్రావం కనిపిస్తుంది. ఇక మూడోది క్యాన్సర్. మీకు ఈ మూడింటిలో ఏ సమస్య ఉందో నిర్ధారణ కోసం కొని పరీక్షలు నిర్వహిస్తారు. ఉదాహరణకు పెద్దపేగును, మలద్వారం వంటి భాగాలను పరీక్షించేందుకు చేసే కొలనోస్కోపీ వంటివి. మీకు ఒకవేళ మొదటì లేదా రెండో సమస్య ఉంటే వాటిని సాధారణ శస్త్రచికిత్సల ద్వారా పరిష్కరించవచ్చు. కానీ ఒకవేళ క్యాన్సర్ ఉన్నట్లు తేలితే... అక్కడి గడ్డ నుంచి కొంత ముక్క సేకరించి, వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత మీకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో నిర్ణయిస్తారు. ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న చికిత్సలను అనుసరించి పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్లు చాలావరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. విసర్జన మార్గం వేరేచోట ఏర్పాటు చేస్తామంటున్నారు నా వయసు 38 ఏళ్లు. నేను మలవిసర్జన చేస్తుంటే రక్తం పడుతోంది. దాంతో డాక్టర్‌కు చూపిస్తే మలద్వారం వద్ద క్యాన్సర్ అని చెప్పారు. శస్త్రచికిత్స చేసి మలద్వారాన్ని మూసేసి, కడుపు దగ్గర మలవిసర్జనకు అనువుగా మరో ద్వారాన్ని ఏర్పాటు చేస్తామని డాక్టర్లు చెప్పారు. ఇది నాకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు. అలాంటి పరిస్థితే వస్తే నాకు మరణమే శరణ్యం అన్నంత నిస్పృహగా ఉంది. దయచేసి నాకు సలహా ఇవ్వండి. – ఎల్. లక్ష్మణ్, జగిత్యాల మీరు అంత నిస్పృహకు లోనవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ సమస్య పరిష్కారం కోసం కీమోథెరపీ లేదా రేడియోథెరపీ తీసుకోవచ్చు. ఒకసారి మీ క్యాన్సర్ గడ్డ కుంచించుకుపోయాక ‘యాంటీరియర్ రెసెక్షన్’, ‘అల్ట్రా లో యాంటీరియర్ రిసెక్షన్’ వంటి శస్త్రచికిత్సలు చేస్తారు. దీనివల్ల మీరు గతంలో లాగే మామూలుగా మలవిసర్జన చేయవచ్చు. అంతేగానీ కడుపు దగ్గర మలద్వారం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ నిరాశ, నిస్పృహలను వదలి తగిన చికిత్స చేయించుకోండి. పైగా మీ సమస్య పూర్తిగా నయమయ్యేందుకు అవకాశాలు కూడా ఎక్కువే. కాబట్టి ఆందోళన వదిలేయండి. సర్జరీ అంటే భయం... ప్రత్యామ్నాయం ఉందా? మా అమ్మగారికి 65 ఏళ్లు. ఆమెకు గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్ వచ్చింది. మొదటి దశ (స్టేజ్–1)లో ఉందని డాక్టర్ తెలిపారు. మాకు తెలిసిన డాక్టర్లను సంప్రదిస్తే రెండు మార్గాలు తెలిశాయి. మొదటిది... శస్త్రచికిత్స. రెండోది రేడియోథెరపీ. మేం కాస్త అయోమయంలో ఉన్నాం. శస్త్రచికిత్స అన్నా, రేడియో«థెరపీ అన్నా భయంగా కూడా ఉంది. దయచేసి తగిన మార్గాన్ని సూచించగలరు. – ఆర్. నరసింహారావు, విజయవాడ మొదటి దశ సర్విక్స్ క్యాన్సర్‌ను సర్జరీ లేదా రేడియోథెరపీ ద్వారా నయం చేయగలం. అయితే చాలా సందర్భాల్లో దీనికి మొదట శస్త్రచికిత్స చేసి, తర్వాత రేడియోథెరపీ ఇస్తారు. మీరు రేడియోథెరపీయే కోరుకుంటే అది కూడా సాధ్యమే. చాలా సందర్భాలలో సర్జరీ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. ఇటీవల రేడియేషన్ టెక్నాలజీలలో వచ్చిన పురోగతి వల్ల రేడియోథెరపీ వల్ల ఇతర దుష్ప్రభావాలు కూడా దాదాపు ఉండవు. కాబట్టి మీరు నిర్భయంగా రేడియోథెరపీ చేయించవచ్చు. క్యాన్సర్ ఇలా కూడా తిరగబెడుతుందా? నేను దాదాపు పదమూడేళ్ల కిందట కిడ్నీలో క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నాను. మళ్లీ ఇటీవలే నడుము నొప్పి వస్తుంటే వైద్య పరీక్షలు చేయించుకున్నాను. రిపోర్ట్‌లను పరిశీలించాక డాక్టర్ బోన్ క్యాన్సర్ అని చెప్పారు. అది కిడ్నీ నుంచి వెన్నుకు పాకిందంటున్నారు. ఇంతకాలం తర్వాత కూడా తగ్గిన క్యాన్సర్ మళ్లీ తిరగబెడుతుందా? అది నయమయ్యే అవకాశం ఉందా? – రత్నకుమార్, అమలాపురం కిడ్నీ క్యాన్సర్ లేదా మరికొన్ని క్యాన్సర్లు చికిత్స తీసుకున్నప్పటికీ తిరగబెట్టే అవకాశం ఉంది. అది ఐదేళ్లు, పదేళ్లు, పదిహేను లేదా ఇరవై ఏళ్ల తర్వాతైనా కావచ్చు. అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్యాన్సర్‌పై అదుపు సాధించేందుకు అనేక చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఇక మీ విషయానికి వస్తే మీరు వెన్నుకు రేడియేషన్ చికిత్స తీసుకోవచ్చు. ఎక్స్–నైఫ్ ఎస్ఆర్ఎస్తో క్యాన్సర్‌ను అదుపు చేయవచ్చు. ఈ చికిత్స ప్రక్రియ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) కూడా ఉండవు. నొప్పిని కూడా తక్షణం నివారించవచ్చు. డాక్టర్ పి. విజయానంద్ రెడ్డి డైరెక్టర్, అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ -
ఈ బంధం.. మానవత్వం
‘రక్తం నీటి కంటే చిక్కనైనది, అందుకే రక్త సంబంధం ముందు మరే బంధమూ నిలవలేదు’..ఇదీ ఇప్పటి వరకు మనం నమ్ముతున్న నిజం. ఇప్పుడు మరో నిజం ఈ నానుడిని తుడిచి పెట్టేసింది. కుటుంబ బంధం చేయలేని పనిని ఆఫీస్‌లో సహోద్యోగి చేసింది. కొలీగ్ మార్షనీల్ సిన్హా కోసం కిడ్నీ ఇచ్చేసింది దితీ లాహిరి! మార్షనీల్ సిన్హాది జార్ఖండ్‌లోని బొకారో. ఆమె బెంగళూరులో ఐటీసీ ఇన్ఫోటెక్లో ఉద్యోగి. ఆమె తరచూ అనారోగ్యం పాలవుతుంటే మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ కిడ్నీలు విఫలమయ్యాయని తెలిసినప్పుడు అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆమె అలాగే ఉద్యోగం చేస్తోంది. ఐదేళ్లు గడిచిపోయాయి. మార్షనీల్ మనోధైర్యానికి ఆశ్చర్యపోయారు. క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. ఆఫీస్‌లో పూర్తి సమయం సీట్లో కూర్చోవడం కూడా కష్టంగా మారింది. అప్పుడు ఆమెకు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచి ఆఫీస్ పని చేయడానికి)కు అనుమతించింది సంస్థ. సొంతూరు బొకారోకి వెళ్లి పోయి ఇంటి నుంచే ఉద్యోగం చేసింది మార్షనీల్. ఆమెకి అప్పగించిన ప్రాజెక్ట్ గురించి తరచూ ఫోన్లో కాంటాక్ట్‌లో ఉండేది దితీ లాహిరి. మార్షనీల్ డయాలసిస్ చేయించుకుంటూ కూడా ఆఫీస్ పని చేస్తోందని తెలిసినప్పుడు లాహిరి కదిలిపోయింది. అప్పుడడిగింది మార్షనీల్ని పూర్తి వివరాలు చెప్పమని. మార్షనీల్‌కి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలని చెప్పారట డాక్టర్లు! ఆమెకు కిడ్నీ ఇవ్వడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్లిద్దరికీ ఆరోగ్య సమస్యలున్నాయి. కాబట్టి కిడ్నీ ఇవ్వగలిగిన పరిస్థితి కాదు వారిది. ఇక మిగిలింది మార్షనీల్ అక్క. ఆమె కూడా సిద్ధంగానే ఉంది. అయితే అత్తగారింట్లో ససేమిరా అన్నారు. ఆ ఇంటికి కోడలయ్యాక ఇక ఆమె దేహం మీద అధికారాలు కూడా తమవే అన్నట్లుంది వాళ్ల ధోరణి. మార్షనీల్ సోషల్ మీడియాలోను, ప్రధాన మీడియాలోనూ కిడ్నీ దాతల కోసం అభ్యర్థించింది. ప్రయత్నాలైతే జరిగాయి కానీ కిడ్నీ ఇచ్చే దాత దొరకలేదు. అదీ ఆమె పరిస్థితి. అప్పుడు మార్షనీల్ మెడికల్ రిపోర్టులను తెప్పించుకుని తనకు తెలిసిన డాక్టర్‌ను సంప్రదించింది లాహిరి. ఆ డాక్టర్ కూడా కిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గమని చెప్పడంతో.. తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైంది! నిబంధనలు కఠినతరం మార్షనీల్ కోసం కిడ్నీ ఇచ్చే దాత దొరకడమే కష్టం అనుకున్నారు అప్పటి వరకు. ప్రభుత్వ నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నాయనేది లాహిరి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైన తర్వాత తెలిసింది. రక్తసంబంధీకులు కాకుండా మరెవరి నుంచయినా కిడ్నీ తీసుకోవాల్సి వస్తే లెక్కకు మించినన్ని నియమాలు. అంతకంటే ఎక్కువ దర్యాప్తులు. అవయవాల అక్రమ రవాణా చాపకింద నీరులా విస్తరించిన నేపథ్యంలో నిబంధనలు ఎక్కువయ్యాయి. తాను స్వచ్ఛందంగానే కిడ్నీ ఇవ్వదలచుకున్నట్లు పోలీసులకు అఫిడవిట్ దాఖలు చేసింది లాహిరి. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. కలెక్టర్‌కు తనకు సంబంధించిన పూర్తి వివరాల డాక్యుమెంట్లను సమర్పించింది. మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. ఇందుకోసం తొమ్మిది నెలలు పట్టింది. ఇవన్నీ పూర్తి చేసుకుని హాస్పిటల్‌కు వెళ్లిన తరవాత అక్కడ ‘తన కిడ్నీని మార్షనీల్ కోసం ఇవ్వదలుచుకున్నానని, డాక్టర్లు తన దేహం నుంచి కిడ్నీ తీసుకోవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదు’ అని సంతకం చేసింది. ఇదంతా పూర్తయి ఈ నెల మూడవ తేదీన కోల్‌కతాలోని ఫోర్టిస్ హాస్పిటల్ అండ్ కిడ్నీ ఇన్స్టిట్యూట్లో లాహిరికి, మార్షనీల్‌కి సర్జరీ జరిగింది. ఆపరేషన్ విజయవంతమైందని, ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నారని ప్రకటించారు డాక్టర్లు. అమ్మను చూస్తున్నాను మార్షనీల్ ఎంతో తెలివైన అమ్మాయి. చక్కటి వ్యక్తిత్తం ఆమెది. ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి అనారోగ్యం పాలవడం బాధనిపించింది. అలా దయనీయ స్థితిలో ప్రాణాలు పోతాయని తెలిసీ చూస్తూ ఊరుకోలేకపోయాను. నా నిర్ణయం విన్న వెంటనే అమ్మానాన్న విచిత్రంగా చూశారు. మా అమ్మ స్కూలు టీచరుగా పనిచేసి రిటైరైంది. ఆమె త్వరగానే అర్థం చేసుకుంది. మరో విషయం ఏమిటంటే... అమ్మ చాలా ఏళ్లుగా ఒక కిడ్నీతోనే జీవిస్తోంది. మా కంటే చురుగ్గా ఉంటుంది కూడా. అందుకే నాకు ఆరోగ్యం పట్ల భయం లేదు. – దితీ లాహిరి, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, ఇన్ఫోటెక్, బెంగళూరు – మంజీర -
కడుపునొప్పితో వెళ్తే .. కిడ్నీ స్వాహా
వంగూరు (కల్వకుర్తి) : అమాయకత్వం.. నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని కొందరు వైద్యులు ఏ కంగా చికిత్స కోసం వచ్చిన రోగి దగ్గర కిడ్నీ స్వా హా చేసిన సంఘటన ఇది. బాధితుడి కథనం ప్రకారం.. మండలంలోని ఉమ్మాపూర్‌కు చెందిన బుచ్చయ్య 2008లో తీవ్ర కడుపునొప్పి బాధకు గురయ్యాడు. అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాల్లో చికిత్స చేయించినా తగ్గకపోవడంతో స్థానిక ఆర్ఎంపీ జిలాని వద్దకు వెళ్లాడు. దీంతో ఆయన హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఉన్న వంశీ హాస్పిటల్స్‌కు తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, ఆపరేషన్ చేసి తీయాలని చెప్పడంతో బాధితుడు అంగీకరించాడు. దీంతో ఆపరేషన్ చేసిన వైద్యులు కిడ్నీలో ఉన్న రాయిని తీసి చూపించారు. నెలరోజుల నుంచి నొప్పితో.. పదేళ్లపాటు ఆరోగ్యంగా ఉన్న బుచ్చయ్యకు గత నెలరోజులనుంచి కడుపునొప్పి, కిడ్నీ భాగంలో లాగడం లాంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో కల్వకుర్తి, అచ్చంపేట, హైదరాబాద్‌లోని వివిధ ఆస్పత్రులకు వెళ్లి పరీక్ష చేయించగా.. ఒకే కిడ్నీ ఉందని మరో కిడ్నీని ఎప్పుడో తీశారని వైద్యులు పేర్కొన్నారు. దీంతో అవాక్కైన బుచ్చయ్య గ్రామపెద్దలతో కలిసి ఆర్ఎంపీ జిలానీని నిలదీశాడు. అయితే తనకేమీ తెలియదని అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. వారు వంగూరు పోలీసులను ఆశ్రయించాలని సూచించినట్లు తెలిసింది. మాట మాత్రమైనా చెప్పలేదు.. నా భర్త కడుపునొప్పితో బాధపడితే కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, వాటిని తొలగించేందుకు రూ.85 వే లు ఖర్చవుతుందని చెప్పి ఆర్ఎంపీ జిలాని హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. ఫీజు మొత్తం చెల్లించాం. ఆపరేషన్ అనంతరం కేవలం రాయి మాత్రమే చూపించారు. కిడ్నీ తీసినట్లు మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు నిలదీస్తే కిడ్నీ చెడిపోవడం వల్ల తొలగించారని, తనకేమీ తెలియదని బుకాయిస్తున్నాడని బాధితుడు బుచ్చయ్య భార్య పార్వతమ్మ వాపోయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు తమకు న్యాయం చేయాలని వేడుకుంది. అయితే ఈ ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు ఆర్ఎంపీ జిలానీతో మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ ఆయన ఆందుబాటులో లేకుండా పోయారు. ఫోన్ సైతం స్విచ్ఛాఫ్‌లో ఉంది. -
మహిళకు టెస్టులు చేసి డాక్టర్లు షాక్
బీజింగ్ : వెన్నునొప్పి వచ్చిందని హాస్పిటల్‌కు వెళ్లిన ఓ 56 ఏళ్ల మహిళకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం డాక్టర్లు షాకయ్యారు. ఆమె కిడ్నీలో వేల సంఖ్యలో రాళ్లు ఉన్నాయని చెప్పడంతో మహిళా పేషెంట్ సైతం కంగుతిన్నారు. ఈ ఘటన చైనాలోని జియాంగ్జు హాస్పిటల్లో జరిగింది. షాంగైకి చెందిన మహిళ ఝాంగ్(56)కు గత కొంతకాలం నుంచి వెన్నునొప్పి బాధిస్తోంది. జ్వరంతో పాటు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ కోసం చంగ్జౌలోని వుజిన్ హాస్పిటల్‌కు వెళ్లిన మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు షాకయ్యారు. కుడి మూత్రపిండంలో(రైట్ కిడ్నీ) వేల సంఖ్యలో రాళ్లున్నాయని గుర్తించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు దాదాపు 3000 రాళ్లను తొలగించేశారు. అయితే ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదిస్తే ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తవని వైద్యులు సూచించారు. అయితే కిడ్నీలో రాళ్లు వచ్చిన పేషెంట్లలో భారతీయుడిదే ఆల్ టైమ్ రికార్డ్ అన్న విషయం తెలిసిందే. గిన్నిస్ రికార్డుల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ధన్‌రాజ్ వాడిలే కిడ్నీ నుంచి రికార్డు స్థాయిలో 1,72,155 రాళ్లను శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. -
కిడ్నీ సమస్యలకు బీన్స్, తులసి, ద్రాక్ష
ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడాలేకుండా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. ఆహార అలవాట్లు, జీవన విధానంలో మార్పుతో ఈ సమస్య సాధారణంగా మారింది. ఈ సమస్య రాకుండా, అప్పటికే సమస్య ఉంటే అది పెద్దది కాకుండా చూసుకోవాలంటే అది మన చేతిలో పనే. కిడ్నీ బీన్స్(రాజ్మా): ఈ బీన్స్ మన నాలుకకు ఎంత రుచిని ఇస్తాయో, ఆరోగ్యానికి అంతకన్నా ఎక్కువ మేలు చేస్తాయి. నాలుగు లీటర్ల నీటిలో మధ్యకు చీల్చిన అరవై గ్రాముల బీన్స్ గింజలను వేయాలి. ఈ నీటిని నాలుగు గంటలపాటు సన్నటి మంట మీద ఉంచి మరగనివ్వాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని సుమారు 8 గంటల పాటు చల్లబరచాలి. చల్లారిన మిశ్రమాన్ని మళ్లీ వడకట్టుకోవాలి. రోజులో రెండు గంటలకోసారి ఈ డికాషన్‌ను గ్లాసు చొప్పున తీసుకోవాలి. ఇలా వారంలో కొన్నిసార్లు తీసుకోవాలి. డికాషన్ తయారయిన 24 గంటలలోపే అది ఔషధంగా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్‌లో సమస్యలు, ఏ ఇతర సమస్యలున్నా ఇది మంచి చిట్కా. తులసి ఆకులు: తులసి ఆకులకు ఒక టీస్పూన్ తేనె కలిపి జ్యూస్ తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్‌ని ఆరునెలల పాటు ప్రతి రోజు తీసుకోవాలి. ఇలా చేస్తే కిడ్నీలోని రాళ్ల పరిమాణం తగ్గి యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. ద్రాక్ష: ద్రాక్షలో అధిక శాతం నీరు, పొటాషియం, సాల్ట్ ఉంటాయి. ఇవి మూత్రపిండ సమస్యను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే పుచ్చకాయ తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్య తలెత్తదు. ఇది చాలా సురక్షితమైనది కూడా. -
అల్లుడికి కిడ్నీ దానం
కోసిగి: అల్లుడికి కిడ్నీ దానం చేసి ఓ మహిళ ఆదర్శంగా నిలిచింది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రం కోసిగికి చెందిన కౌతాళం చౌడయ్య, వెంకటలక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె అన్నపూర్ణను పదేళ్ల క్రితం మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన గిరీష్ కుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఏడాదిన్నర క్రితం గిరీష్ కుమార్‌కు రెండు కిడ్నీలూ ఫెయిలయ్యాయి. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉండేవాడు. షోలాపూర్‌లోనే పలువురు వైద్యులను సంప్రదించడంతో పాటు కిడ్నీ దాతల కోసం వెతికారు. ఎక్కడా లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ తరుణంలో తన కుమార్తె సంసారం బాగుండాలని భావించిన వెంకటలక్ష్మి(60) కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఆమె కిడ్నీ మ్యాచ్ కావడంతో ఇటీవల షోలాపూర్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో గిరీష్ కుమార్‌కు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. కిడ్నీ ఆపరేషన్ విజయవంతమై ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. కిడ్నీ దానం చేసి ఆదర్శంగా నిలిచిన వెంకటలక్ష్మీని పలువురు అభినందించారు. -
ఇంత చిన్న వయసులో అంత బరువా?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా అబ్బాయికి 14 ఏళ్లు. వాడి బరువు 60 కిలోలు. అయితే గత కొంతకాలంగా వాడి బరువు 60 కిలోల నుంచి క్రమంగా పెరుగుతూ 70 కిలోలకు చేరింది. ఇలా బరువు పెరిగిపోతూ ఉండటంతో మాకు ఆందోళనగా ఉంది. దయచేసి వాడి బరువు తగ్గించడానికి తగిన సూచనలు ఇవ్వండి. – విహారి, విశాఖపట్నం ఇటీవల పిల్లలు జంక్‌ఫుడ్ వంటి అనారోగ్యకరమైన జీవనశైలితో అనర్థాలు తెచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో టీనేజ్‌లో ఉన్న పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పకపోతే వారు ఈ రోజుల్లో వారు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. మీ అబ్బాయి ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయో ముందుగా చూడండి. అతడికి ముందుగా మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పాలి. ∙స్వీట్లు, సాఫ్ట్‌డ్రింక్స్, జామ్ వంటి వాటితో బరువు పెరిగేందుకు అవకాశం ఎక్కువ. అందుకే వాటిని క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. కూల్‌డ్రింక్స్‌లోని ఫాస్ఫారిక్ యాసిడ్ వల్ల పళ్లు, ఎముకలు దెబ్బతింటాయి. కలరింగ్ ఏజెంట్స్ వల్ల కిడ్నీలు, ప్రిజర్వేటివ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను మరింత దూరం ఉంచడం మంచిది. ∙వంటలో ఎక్కువగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి పిల్లల్లో మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు. ∙పిజ్జా, బర్గర్స్, కేక్స్ వంటి బేకరీ ఉత్పాదనల్లోని ఫ్యాట్ కంటెంట్స్ పిల్లల్లో బరువును మరింత పెంచుతాయి. ఈ ఆహారాల్లో పీచు లేకపోవడం ఆరోగ్యానికి అంతగా ఉపకరించే విషయం కాదు. ∙తల్లిదండ్రులు సాధ్యమైనంతవరకు తమ పిల్లలకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారం ఇవ్వడం మంచిది. ∙పిల్లలకు మంచి ఆహారంతో పాటు తోటపని, పెంపుడు జంతువుల ఆలనా పాలనా, క్రమం తప్పకుండా ఆటలు ఆడటం వంటి కార్యకలాపాల్లో ఉంచాలి. ఈ పనుల్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొంతసేపు పాలుపంచుకోవడం మంచిది. ∙పిల్లల్లో బరువు పెరగకుండా చూసేందుకు పై అలవాట్లతో పాటు ముందుగా థైరాయిడ్ వంటి మెడికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని కూడా పరీక్షలు చేయించి వాటిని రూల్ అవుట్ చేసుకోవడం అవసరం. పాపకు నోట్లో, గొంతులో పుండ్లు.. ఎందుకిలా? మా పాప వయసు ఆరేళ్లు. ఇటీవల తన గొంతులో నొప్పిగా ఉందని అంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాం. పాప నోటిలోన, నాలుక మీద, గొంతులోపలి భాగంలో రెండు మూడుసార్లు పుండ్లలాగా వచ్చాయి. గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చినమాదిరి ఎర్రబారినట్లుగా డాక్టర్ చెప్పారు. మందులిచ్చినా తగ్గలేదు ఏదైనా తినడానికి వీలుగాక విపరీతంగా ఏడుస్తోంది. పాప కొంచెం సన్నబడింది. ఎప్పుడూ చలాకీగా ఉండే అమ్మాయి ఇలా ఏడ్వటం మాకు వేదన కలిగిస్తోంది. మా పాప సమస్య తగ్గేదెలా? – నిహారిక, నరసరావుపేట మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయని తెలుస్తోంది. ఈ సమస్యను చాలా సాధారణంగా చూస్తుంటాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు... ∙ఉద్వేగాల పరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్), ∙బాగా నీరసంగా అయిపోవడం (ఫెటీగ్), ∙విటమిన్లు, పోషకాల లోపం... (ఇందులోనూ విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం) ∙వైరల్ ఇన్ఫెక్షన్లు (ముఖ్యంగా హెర్పిస్ వంటివి) ∙గాయాలు కావడం (బ్రషింగ్‌లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని ఆహారపదార్థాల వల్ల అయ్యే అనేక గాయాల కారణంగా) ∙పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం పడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తుంటాయి. మీరు లెటర్లో చెప్పిన కొద్ది పాటి వివరాలతో మీ పాప సమస్యకు నిర్దిష్టంగా ఇదే కారణం అని చెప్పలేకపోయినా... మీ పాపకు విటమిన్ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వన్చే ఇన్ఫెక్షన్స్తో ఈ సమస్య వస్తున్నట్లు విశ్లేషించవచ్చు. ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్‌లు, విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు పైన పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగాని సంప్రదించి వారి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
ముక్కు బిగదీసుకుపోతోంది.. అదేపనిగా తుమ్ములు...
నా వయసు 29 ఏళ్లు. నేను గత ఆర్నెల్లుగా తుమ్ములు, ముక్కుకారడం, ముక్కులు బిగదీసుకుపోతున్నాయి. వాసనలు తెలియడం లేదు. చాలామంది డాక్టర్లను కలిశాను. సమస్య తగ్గినట్టే తగ్గి, మళ్లీ వస్తోంది. హోమియోలో దీనికి పరిష్కారం చెప్పండి. – సంతోష్దేవ్, సంగారెడ్డి మీరు ‘అలర్జిక్ రైనైటిస్’ అనే సమస్యతో బాధపడుతున్నారు. మీకు సరిపడనివి తగిలినప్పుడు (దుమ్ము, ధూళి, పుప్పొడి, ఘాటువాసనలు) మీకు అలర్జీ మొదలవుతుంది. దాంతో ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లుగా అయి, ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కు బిగదీసుకుపోవడం వంటివి కనిపిస్తాయి. లక్షణాలు : ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కుకారడం వంటి లక్షణాలే గాక... వాటిని నిర్లక్ష్యం చేస్తే సైనస్లకు ఇన్ఫెక్షన్ సోకి తలబరువు, తలనొప్పి వంటివి కనిపించవచ్చు. ముక్కుపొరలు ఉబ్బడం వల్ల గాలి లోపలికి వెళ్లక వాసనలు కూడా తగ్గిపోతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు సైనసైటిస్, నేసల్ పాలిప్స్, వంటి పెద్ద పెద్ద సమస్యలూ వచ్చేందుకు అవకాశం ఉంది. నివారణ : ∙అలర్జీ కారకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం ∙సరైన పోషకాహారం తీసుకోవడం ముక్కుకు సంబంధించిన వ్యాయామాలు చేయడం ∙చల్లని వాతావరణానికి దూరంగా ఉండటం ∙పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం. చికిత్స : హోమియోలో వ్యక్తిగత లక్షణాలనూ, మానసిక స్వభావాన్ని బట్టి కాన్స్టిట్యూషన్ చికిత్స ఇవ్వవచ్చు. దీనివల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. క్రమక్రమంగా వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ పోయి, అలా సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ఉంటే అలర్జిక్ రైనైటిస్ పూర్తిగా తగ్గుతుంది. హోమియోలో ప్రక్రియ ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ ఆపరేషన్ తర్వాత కూడా కిడ్నీలో రాళ్లు... నా వయసు 32 ఏళ్లు. నాకు గతంలో కిడ్నీలో రాళ్లు వచ్చాయి. శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు. ఆ తర్వాత మళ్లీ కొంతకాలంగా నడునొప్పి రావడంతో డాక్టర్‌ను సంప్రదించాను. వారు స్కాన్ తీయించి, మళ్లీ కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయని చెప్పారు. నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? మళ్లీ మళ్లీ రాళ్లు ఏర్పడకుండా చేసేలా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వండి. – ఎల్. కృష్ణమూర్తి, మేదరమెట్ల మన శరీరంలో మూత్రపిండాలు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి రక్తాన్ని వడపోసి చెడు పదార్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించి, శరీరంలోని లవణాల సమతుల్యతను కాపాడతాయి. ఎప్పుడైతే మూత్రంలో అధికంగా ఉండే లవణాలు స్ఫటికరూపాన్ని దాల్చి ఘనస్థితికి చేరతాయో, అప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్రవ్యవస్థలో భాగమైన మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశం... ఇలా ఎక్కడైనా రాళ్లు ఏర్పడవచ్చు. కిడ్నీలో రాళ్లను శస్త్రచికిత్స ద్వారా తొలగించినప్పటికీ 50% మందిలో ఇవి మళ్లీ ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ కాన్స్టిట్యూషనల్ హోమియో చికిత్స ద్వారా వీటిని మళ్లీ ఏర్పడకుండా చేసే అవకాశం ఉంటుంది. కారణాలు : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మరికొన్ని ఇతర కారణాలతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కొందరిలో మూత్రకోశ ఇన్ఫెక్షన్స్, మూత్రమార్గంలో అడ్డంకులు ఏర్పడటం, ఒకేచోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, శరీరంలో విటమిన్–ఏ పాళ్లు తగ్గడం వంటి ఎన్నో అంశాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలుగా చెప్పవచ్చు. ఇవేకాకుండా కిడ్నీలో రాళ్లను ప్రేరేపించే అంశాలు... ఆహారంలో మాంసకృత్తులు, ఉప్పు ఎక్కువ మోతాదులో తీసుకోవడం; సాధారణం కంటే తక్కువగా (అంటే రోజుకు 1.5 లీటర్ల కంటే తక్కువగా) నీళ్లు తాగడం వంటి వాటితో కిడ్నీలో రాళ్లు రావచ్చు. ఇక కొన్ని ఇతర జబ్బుల వల్ల... ముఖ్యంగా హైపర్ కాల్సీమియా, రీనల్ ట్యూబులార్ అసిడోసిస్, జన్యుపరమైన కారణాలతో, ఆస్పిరిన్, యాంటాసిడ్స్, విటమిన్–సి ఉండే కొన్ని మందులు, క్యాల్షియమ్ సప్లిమెంట్లతోనూ కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. లక్షణాలు : విపరీతమైన నడుమునొప్పి, కడుపునొప్పి, వాంతులు, మూత్రంలో మంట వంటివి కిడ్నీలో రాళ్లు ఉన్నప్పటి ప్రధాన లక్షణాలు. కొందరిలో ఒకవైపు నడుమునొప్పి రావడం, నొప్పితో పాటు జ్వరం, మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో మూత్రనాళాల్లో రాళ్లు ఏర్పడటాయి. దీనివల్ల నడుము, ఉదరమధ్య భాగాల్లో నొప్పి, ఇక్కడి నుంచి నొప్పి పొత్తికడుపు, గజ్జలకు, కొన్నిసార్లు కాళ్లలోకి పాకడం జరుగుతుంది. మరికొందరిలో కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలూ, నొప్పి లేకుండానే కిడ్నీలో రాళ్లు ఉండవచ్చు. వీటిని సైలెంట్ స్టోన్స్ అంటారు. చికిత్స : హోమియోలో కిడ్నీలో రాళ్లను తగ్గించేందుకూ, మళ్లీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడకుండా, రాళ్లను నియంత్రించేందుకూ అవకాశం ఉంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కాళ్లు లాగుతున్నాయి నా వయసు 47 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై నరాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? – డి. కమలబాయి, నిజామాబాద్ మీకు ఉన్న సమస్య వేరికోస్ వెయిన్స్. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్ వెయిన్స్ అంటారు. అంటే శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేకదిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. శరీరంలోని ఇతర భాగాలలోనూ కనిపించినా 80 శాతం కేసుల్లో వేరికోస్ వెయిన్స్ కాళ్లపైనే కనిపిస్తాయి. కారణాలు : ∙ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ∙కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ∙ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు : ∙కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ∙కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం చర్మం దళసరిగా మారడం ∙చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం. చికిత్స : వేరికోస్ వెయిన్స్, వేరికోసిల్ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఆపరేషన్ అవసరం లేకుండానే మంచి మందులు సూచిస్తారు. హోమియోలో ఈ సమస్యకు పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
హై–బీపీ రాకుండా నివారించుకోవడం ఎలా?
హై–బీపీ కౌన్సెలింగ్ మా అన్నగారు చాలాకాలం నుంచి హై–బీపీతో బాధపడుతున్నారు. ఇటీవల నేను పరీక్ష చేయించుకుంటే నాకు కూడా కాస్త బీపీ ఎక్కువగా ఉన్నట్లు అర్థమైంది. పూర్తిగా మందులు ఇవ్వకపోయినా కాస్త జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పారు. దయచేసి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కాస్త వివరించండి. – సుధీర్‌కుమార్, నల్లగొండ హైబీపీ ఉందని చెప్పగానే అంతగా ఆందోళన పడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. మీరు హైపర్‌టెన్షన్ వల్ల వచ్చే సమస్యల గురించి అవగాహన పెంచుకోవాలి. అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియవూలు తప్పనిసరిగా పాటించాలి. హైబీపీకి ఇప్పుడు అవుల్లో ఉన్న ఆహార నియవూవళిని ‘డ్యాష్’ అంటారు. ‘డయటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’ అన్న ఇంగ్లిష్ పదాల సంక్షిప్త రూపమే ఈ డ్యాష్. ఈ నియమాలు బీపీని నివారించుకోవాలనుకుంటున్న వారు కూడా పాటించవచ్చు. ఎందుకంటే ఇవే నివారణకూ తోడ్పడతాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగమే. హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లు లేదా దాన్ని నివారించుకోవాలనుకున్నవారు తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పుష్కలంగా తీసుకోవాలి. ఉదాహరణకు అరటిపండు వంటి పండ్లలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ కాబట్టి అలాంటి పండ్లు తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. హైపర్‌టెన్షన్ నివారించుకోవాలనుకుంటున్నవారితో పాటు అది ఉన్న వారు ఆహారంలో ఉప్పు (సోడియం) పాళ్లను తగ్గించాలి. ఇందుకోసం ఉప్పు (సోడియమ్) పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారాలైన నిల్వ ఉంచిన ఆహారాలు (ప్రిజర్వ్డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. సాధారణంగా పచ్చళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి అవసరానికి మించి కాస్త ఎక్కువగానే ఉప్పు వేస్తుంటారు. లేకపోతే పచ్చడి చెడిపోతుందని అంటుండటం మనం వింటూనే ఉంటాం. అందుకే కాస్త పాత బడ్డ తర్వాత పచ్చళ్లు రుచి తగ్గి, ఉప్పుగా అనిపిస్తుంటాయి. అందుకే పాత ఆవకాయలనూ, పాత పచ్చళ్లను (నిల్వ పచ్చళ్లను) అస్సలు ఉపయోగించకూడదు. శరీర బరువు పెరుగుతున్న కొద్దీ లేదా వ్యక్తులు లావెక్కుతున్న కొద్దీ అన్ని కణాలకూ రక్తసరఫరా జరగడానికి రక్తం వేగంగా ప్రవహించాల్సి వస్తుంటుంది. దాంతో స్థూలకాయులకు హైబీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఎత్తును లేదా బీఎమ్‌ఐని చూసుకొని, ఎత్తుకు తగ్గ బరువుండేలాగా ఎప్పుడూ మన బరువును నియంత్రించుకుంటూ ఉండాలి. మంచి పోషకాలు ఉండే ఆహారం తినడం వల్ల అంటే పొట్టుతో ఉండే అన్ని రకాల తృణధాన్యాలు, ఆకుపచ్చని ఆకుకూరలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహారంతో బరువు తగ్గడంతో పాటు సాధారణ ఆరోగ్యమూ బాగుంటుంది. ఇది పరోక్షంగా బీపీని నివారిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు పెరగరు. బరువు పెరగడం, స్థూలకాయం రావడం వంటి అంశాలు హై–బీపీ వచ్చేందుకు రిస్క్ ఫ్యాక్టర్ అన్న విషయం తెలిసిందే. అందుకే వ్యాయామం మన శరీరంలో కొవ్వు పేరుకోకుండానూ, బరువు పెరగకుండానూ చేసి, పరోక్షంగా హై–బీపీని నివారిస్తుంది. ఆల్కహాల్ అలవాటును పూర్తిగా మానేయాలి. ఆల్కహాల్ తాగగానే రక్తప్రసరణ వేగంలో తక్షణం మార్పు వస్తుంది. కొంత వేగంగానే పెరుగుతుంది. అందుకే ఈ అలవాటును పూర్తిగా మానేయాలి. పొగతాగే అలవాటు వల్ల కూడా ఎన్నో అనర్థాలతో పాటు పొగలో ఉండే నికోటిన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. ఉత్ప్రేరకాలన్నీ రక్తప్రసరణ వేగాన్ని పెంచేవే. కాబట్టి బీపీ ఉన్నవారూ, దాన్ని నివారించుకోవాలనుకునేవారు ఈ దురలవాటు నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి. ఒత్తిడి రక్తపోటును చాలా ఎక్కువగా పెంచుతుంటుంది. అందుకే రక్తపోటును నివారించుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. ఇందుకోసం యోగా, ప్రాణాయామ వంటి ప్రక్రియలతో పాటు తమకు ఇష్టమైన అభిరుచులలో (హాబీలలో) కృషిచేస్తూ ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలి. మనం నివారణ కోసం (లేదా అప్పటికే బీపీ ఉన్నవారు నియంత్రణ కోసం) అనుసరించే ఈ మార్గాలన్నీ ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగమే. కాబట్టి మంచి జీవనశైలిని అనుసరిస్తే బీపీని అదుపులో ఉంచుకోవడం లేదా నివారించుకోవడం చాలా సులభం. బీపీ ఉంటే కిడ్నీ పరీక్ష కూడా ఎందుకు? నేను గత ఐదేళ్లుగా హైబీపీతో బాధపడుతున్నాను. ఇటీవల ఒకసారి బీపీ చెక్ చేయించుకోడానికి డాక్టర్గారిని కలిస్తే ఆయన కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. నాకు లక్షణాలేమీ లేకపోయినా ఎందుకిలా చేశారు. వివరించగలరు. – రవికాంత్, మధిర దీర్ఘకాలంగా హైబీపీతో బాధపడుతున్నవారిలో కొన్నిసార్లు రక్తపోటులో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా రక్తపోటు హెచ్చుతగ్గులు ఉన్నవారిలోనూ, దీర్ఘకాలంగా హైబీపీతో బాధపడుతున్నవారిలోనూ ఎండ్ ఆర్గాన్స్ అనే కీలకమైన శరీర అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మెదడు, కాలేయం, మూత్రపిండాల వంటి వాటిని ఎండ్ ఆర్గాన్స్‌గా పరిగణించవచ్చు. ఎందుకంటే రక్తం ఇక్కడివరకు చేరి మళ్లీ వెనక్కు తిరుగుతుంది. ఇలాంటి కీలకమైన అవయవాలు హైబీపీ దుష్ప్రభావాల వల్ల దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. పైగా కిడ్నీ, కాలేయం వంటి అవయవాలు చాలావరకు దెబ్బతిన్న తర్వాత గాని వాటికి సంబంధించిన లక్షణాలేవీ బయటపడవు. అందుకే వాటిని ముందే తెలుసుకోగలిగితే రాబోయే ముప్పును సమర్థంగా నివారించవచ్చు. ఈ కారణం వల్లనే హైబీపీ ఉన్నవారిలో తరచూ కీలక అవయవాలైన కాలేయం పనితీరు పరీక్షలనూ, కిడ్నీ పనితీరును తెలుసుకునేందుకు దోహదపడే గ్లోమెరులార్ ఫిల్టరేషన్ రేట్, క్రియాటినిన్ వంటి పరీక్షలు చేయిస్తుంటారు డాక్టర్లు. మీరు డాక్టర్ ఇచ్చిన సలహా పాటించండి. బీపీ ఉంటే కంటికీ ప్రమాదమా? నా వయసు 54 ఏళ్లు. చాలా రోజులుగా హైబీపీ సమస్యతో బాధపడుతున్నాను. ఇటీవల మా డాక్టర్‌గారు ఒకసారి కంటి పరీక్ష చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. ఎందుకా పరీక్ష చేయించమన్నారు. బీపీ వల్ల కంటికీ ప్రమాదమా? దయచేసి చెప్పండి. – ఎమ్. సుదర్శనరావు, నిజామాబాద్ నియంత్రణలో లేకుండా చాలా కాలం నుంచి బీపీ ఉన్నవారిలో కొందరికి కంట్లో ఉన్న రక్తనాళాలు మూసుకుపోవడం, దాంతో కాస్త చూపు తగ్గే అవకాశం ఉంది. ఈ కండిషన్‌ను ఇస్కిమిక్ రెటినోపతి అంటారు. అందుకే హైబీపీ ఉన్నవారిని కంటి పరీక్షలు తరచూ చేయించమని డాక్టర్లు సూచిస్తుంటారు. కాబట్టి మీరు మీ డాక్టర్ చెప్పినట్లుగా ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోండి. డాక్టర్ ఎమ్. గోవర్ధన్ సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు భరోసా
ఎంజీఎం : వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో పేద రోగులను సేవలను మెరుగు పర్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సర్జరీ విభాగంలో మరో 30 పడకల సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. అంతేకాకుండా నేషనల్ అకిడేషన్ బోర్డు ఫర్ సర్టిఫికేషన్ లక్ష్యంగా ముందుకెళ్తూ.. రూ.15 లక్షలతో కొనుగోలు చేసిన మెకానైజ్జ్ లాండ్రి పరికరాన్ని సైతం అందుబాటులోకి తెస్తున్నారు. ఈ 6న వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ దొడ్డ రమేశ్ తెలిపారు. గతంలో బీబ్రా కంపెనీతో కుదిరిన పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పద్ధతిన కొనసాగతున్న 14 డయాలసిస్ యూనిట్ ఒప్పందన ముగిసినా.. క్రమంలో మరో 14 యూనిట్ల డీ మేడ్ కంపెనీ పీపీపీ పద్ధతిన ఒప్పందం నూతన సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఎంజీఎం ఆస్పత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సేవలు మెరగపడనున్నట్లు ఆయన తెలిపారు. ‘ఆరోగ్యశ్రీ’ లేకున్నా సేవలు.. గతంలో ఎంజీఎంతో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే డయాలసిస్ సేవలు ఉచితంగా చేసేవారు. 6వ తేదీ నుంచి అందుబాటులోని రానున్న నూతన డయాలసిస్ యూనిట్లతో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా.. లేకున్నా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు సూపరిండెంట్ రమేశ్ పేర్కొన్నారు. గతంలో బీ బ్రాన్ యూనిట్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు ఆరోగ్యశ్రీ రోగులకు మాత్రమే డయాలసిస్ సేవలు అందేవి, అయితే ఆ కంపెనీతో గత ఏడాదిలోనే ఒప్పందం ముగిసిన నేపథ్యంలో డయాలసిస్‌ను ఎంజీఎం ఆస్పత్రి వైద్యాధికారులే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 14 యూనిట్ల డీ మేడ్ కంపెతో ఒప్పందం కుదుర్చుకోగా ఈ యూనిట్లలో ఆరోగ్యశ్రీ సేవలందిస్తూ, ఎంజీఎంలో కొనసాగతున్న డయాలసిస్ యూనిట్లతో పేద రోగులకు సేవలందించనున్నట్లు సూపరిండెంట్ తెలిపారు. ఎన్ఏబీహెచ్లో మొదటి అడుగు... ఎంజీఎం ఆస్పత్రికి నేషనల్ అకిడేషన్ బోర్డు సర్టిఫికేషన్ లక్ష్యంగా వైద్యాధికారులు కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. రూ.15 లక్షలతో కొనుగోలు చేసిన నూతన మెకానైజ్డ్ లాండ్రి పరికరాన్ని 6న ప్రారంభించనున్నారు. 60 కేజీల ఈ పరికరం 250 పడకల బెడ్ షీట్లను శుభ్రం చేసేందుకు ఉపయోగపడుతుంది. అతి త్వరలోనే మరో 60 కేజీల లాండ్రి పరికరాన్ని సైతం అందుబాటులోకి తేనున్నారు. సర్జరీలో విభాగంలో... ఎంజీఎం సర్జరీ విభాగంలో ఏడో యూనిట్ నూతన భవనం ద్వారా మరో 30 పడకల నూతన సేవలు అందుబాటులోకి రానున్నట్లు సూపరింటెండెంట్ రమేశ్ తెలిపారు. వైద్య నిబంధనల ప్రకారం ఈ భవనంలో అందుబాటులోకి రావడం పేద ప్రజలకు సేవలు మెరుగపడనున్నట్లు పేర్కొన్నారు. 6న ప్రారంభోత్సవం ఎంజీఎం ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్‌తో పాటు ఆస్పత్రిలోని నూతన భవనాలను 6న వైదారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేతుల మీదుగా ప్రారంభించనున్నాం. ఈ వేడుకలకు జిల్లాలోని వివిధ ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. – దొడ్డ రమేష్, ఎంజీఎం సూపరింటెండెంట్ -
మూత్రంలో ఎరుపు కనిపిస్తోంది... కిడ్నీలకు ప్రమాదమా?
నా వయసు 28 ఏళ్లు. అప్పుడుప్పుడూ మూత్రం ఎరుపు రంగులో వస్తోంది. ఏడాదిన్నరగా ఇలాగే అప్పుడప్పుడూ వచ్చిపోతోంది. వచ్చినప్పుడుల్లా రెండు నుంచి మూడు రోజుల పాటు వస్తోంది. ఆ తర్వాత తగ్గిపోతోంది. దీని వల్ల కిడ్నీలు ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా? – నరేంద్రప్రసాద్, కాకినాడ సాధారణంగా కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కొందరికి ఇలాంటి సమస్య రావచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్, యూరిన్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షలు చేయించాలి. దాంతో మీ సమస్యకు అసలు కారణం ఏమై ఉంటుందో తెలుస్తుంది. అందుకే మీరు ఒకసారి డాక్టర్‌ను కలవడం మంచిది. సమస్య నిర్ధారణ అయితే దానికి తగిన మందులు వాడవచ్చు. మీకు సాధారణ ఇన్ఫెక్షన్ ఉంటే అది మామూలు యాంటీబయాటిక్ మందులతోనే తగ్గిపోతుంది. మీరు ఒకసారి యూరిన్‌లో ప్రోటీన్లు పోతున్నాయా అనే విషయాన్ని తెలుసుకునే పరీక్షలూ చేయించాలి. కిడ్నీ రోగులు నీళ్లు తక్కువగా ఎందుకు తాగాలంటారు? నా వయసు 47 ఏళ్లు. ఇటీవలే నాకు కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని తెలిసింది. నేను నీళ్లు ఎక్కువగా తాగకూడదని మా డాక్టర్ చెప్పారు. మంచి ఆరోగ్యం కోసం అందరూ నీళ్లు ఎక్కువగా తాగమంటూ సలహాలిస్తారు కదా. మరి నా విషయంలో నీళ్లు తాగవద్దని ఎందుకు అంటున్నారు? దయచేసి చెప్పండి. – గోపాలరావు, కర్నూలు సాధారణంగా కిడ్నీ జబ్బులు ఉన్న వారిలోనూ నీరు తక్కువగా తాగాలంటూ ఆంక్షలు విధించరు. అయితే కిడ్నీ జబ్బుతో పాటు గుండెజబ్బు లేదా అలా నీరు తీసుకోవడం వల్ల హాని జరిగే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రం రోగులు ఎంత నీరు తీసుకోవాలన్నది డాక్టర్లు చెబుతారు. మన భారతదేశంలాంటి ఉష్ణ దేశాల్లో మామూలు వ్యక్తి రోజుకు 5–6 లీటర్ల నీటిని తీసుకుంటాడు. అయితే కొందరు వ్యాధిగ్రస్తుల్లో కిడ్నీలు కేవలం ఒక్క లీటరు నీటిని ప్రాసెస్ చేయడానికే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అందుకే వారికి ఉన్న జబ్బు ఆధారంగా, వారి కిడ్నీ పనిచేసే సామర్థ్యం ఎంతో తెలుసుకొని, దానికి అనుగుణంగా డాక్టర్లు వారు రోజూ తీసుకోవాల్సి నీటి మోతాదును నిర్ణయిస్తారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత జాగ్రత్తలేమిటి? నాకు 45 ఏళ్లు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్నాను. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – రామసుబ్బారెడ్డి, ఒంగోలు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ తర్వాత కూడా శరీరం దాన్ని నిరాకరించకుండా (రిజెక్ట్ చేయకుండా) ఉండటానికి కొన్ని మందులు జీవితాంతం వాడుతూ ఉండాలి. కొందరు రోగులు కిడ్నీ బాగానే పనిచేస్తుంది కదా అని మందులు మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కిడ్నీని శరీరం రిజెక్ట్ చేస్తుంది. ఆ ప్రమాదం రాకుండా చూసుకోవాలి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత రోగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. జలుబుగానీ, జ్వరం గానీ, ఇతరత్రా ఏ ఇబ్బంది తలెత్తినా తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ పర్యవేక్షణలో లేకుండా ఎలాంటి ఇతర మందులూ వాడకూడదు. అప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకున్న ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు. ఇంటి పరిసరాలను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నట్లయితే వాటిని నియంత్రించుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. - డాక్టర్ విక్రాంత్‌రెడ్డి, సీనియర్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
యాంటిబయో'కిల్స్'
వినుకొండ మండలం బొల్లాపల్లికి చెందిన నరసింహారావు కాలులో మేకు గుచ్చుకుంది. ఆర్ఎంపీ డాక్టర్‌ను ఆశ్రయిస్తే యమికాసిన్ అనే యాంటిబయోటిక్ ఇంజక్షన్ చేశారు. దీంతో ఒళ్లంతా వాపు రావడంతో గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు చేరాడు. అధిక మోతాదులో యాంటిబయోటిక్ వాడడం వల్ల కిడ్నీ పాడైనట్లుగా వైద్యులు గుర్తించారు. క్రోసూరు మండలానికి చెందిన సామ్రాజ్యం అనే మహిళ 20 రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ ఆర్ఎంపీ వద్దకు వెళ్లింది. ఆయన లివర్ ఫ్లాక్స్, డైక్లోఫినాక్ ఇంజక్షన్లు రెండు కలిపి ఇవ్వడంతో రెండు రోజులకే లివర్, కిడ్నీలు దెబ్బతిన్నాయి. దీంతో బంధువులు గుంటూరు ఆసుపత్రిలో చేర్పించారు. సాక్షి, గుంటూరు: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆర్ఎంపీలే వైద్యులే దిక్కవుతున్నారు. కొందరు ఆర్ఎంపీలకు కనీస అవగాహన లేకపోవడంతో ఇష్టానుసారంగా యాంటిబయోటిక్‌లు ఉపయోగిస్తున్నారు. చిన్న జబ్బుకు కూడా అధిక మోతాదులో యాంటిబయోటిక్స్ వాడుతూ లేనిపోని రోగాలు తీసుకొస్తున్నారు. జబ్బు రావడానికి కారణం ఏమిటి? వీరికి బీపీ, షుగర్ వంటి ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయా? అనే విషయాన్ని సైతం తెలుసుకోకుండా ఇష్టానుసారంగా యాంబయోటిక్లు వాడడంతో కిడ్నీ, లివర్లు దెబ్బతింటున్నాయి. ప్రాంతమైన వినుకొండ, మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వంటి నియోజకవర్గాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. వీరు చిన్న జ్వరం వచ్చినా, పొలం పనులు చేసి వచ్చి ఒళ్లు నొప్పులని చెప్పినా జంటామైసిన్, యమికాసిన్, డైక్లోఫినాల్, లివర్ ఫ్లాక్స్ వంటి యాంబయోటిక్స్ను వాడుతున్నారు. బీపీ, షుగర్ ఉన్నవారికి అధిక డోసులో యాంటిబయోటిక్‌లు వాడకూడదని తెలిసినప్పటికీ అవేమీ పట్టించుకోవడం లేదు. ప్రిస్కిప్షన్ లేకుండానే.. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో విచ్చలవిడిగా యాంటిబయోటిక్‌లు అమ్ముతున్నారు. పల్లెల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఔషధ నియంత్రణ శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వైద్యులు, మెడికల్ దుకాణదారుల ఇష్టారాజ్యమైపోయింది. జిల్లాలో వినియోగించే మందుల్లో సుమారుగా 50 శాతం యాంటిబయోటిక్లే ఉన్నట్లు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చెబుతున్నారు. వీటి వాడకం ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని వెల్లడిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరో 12 శాతం అధికంగా యాంటిబయోటిక్‌ల వియోగం ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో ఆర్ఎంపీ, పీఎంపీల అసోసియేషన్‌లో 3 వేల మంది ఆర్ఎంపీలు రిజిస్ట్రేషన్లు చేయించుకోగా, వీరిలో సుమారు 2 వేల మంది ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక శిక్షణను పొందారు. ఇదిలా ఉంటే అసోసియేషన్‌లో ఎటువంటి రిజిస్ట్రేషన్‌గానీ, శిక్షణగానీ పొందని వారు జిల్లా వ్యాప్తంగా 1500 మంది ఉన్నట్లు ఆర్ఎంపీ, పీఎంపీల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అచ్చిరెడ్డి తెలిపారు. ఇలాంటి వారు చేస్తున్న తప్పు వల్ల మిగిలిన వారికీ చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యాంటిబయోటిక్అమ్మకాలపై దృష్టి సారిస్తాం జిల్లాలో యాంటిబయోటిక్‌ల వినియోగం పెరిగిన మాట వాస్తవమే. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా యాంటిబయోటిక్‌ల అమ్మకాలు చేయకూడదని మెడికల్ షాపులకు స్పష్టమైన ఆదేశాలి అయినా కొందరు అమ్ముతూనే ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. యాంటిబయోటిక్‌ల అమ్మకాలపై ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటు చేయించాం. – విజయకుమార్, ఔషధ యంత్రణ, పరిపాలన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ -
కట్నం కోసం కిడ్నీ అమ్మేశాడు..
ఓ మొగుడు కట్నాసురుడి అవతారమెత్తాడు. పెళ్లి సమయంలో ఇస్తామన్న వరకట్నం ఇవ్వలేదని భార్యను హింసించడం మొదలుపెట్టాడు. ఎలాగైనా కట్నం డబ్బులు వసూలు చేయాలనుకున్న అతగాడు.. భార్యకు తెలియకుండా ఆమె కిడ్నీని అమ్మేశాడు. అదీ పెళ్లై 12 ఏళ్లు గడిచిన తర్వాత. కోల్‌కతాకు చెందిన బిశ్వజిత్‌కు 2005లో రీటాతో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో వరకట్నం కింద 2 లక్షలు ఇచ్చేందుకు రీటా తల్లిదండ్రులు అంగీకరించారు. కానీ అనుకోని కారణాల వల్ల డబ్బు ఇవ్వలేకపోయారు. కట్నం ఇవ్వాల్సిందేనని బిశ్వజిత్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. కానీ తన కుటుంబ పరిస్థితిని తలుచుకొని రీటా మౌనం వహించింది. రెండేళ్ల కిందట రీటాకు కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాడు బిశ్వజిత్. అపెండిక్స్ అని చెప్పి ఆపరేషన్ కూడా చేయించాడు. అదే నిజమనుకొని అప్పట్లో అందరూ నమ్మారు. ఇటీవల రీటాకి మళ్లీ కడుపులో నొప్పి రావడంతో బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్కాన్ చేసిన డాక్టర్లు కుడివైపు కిడ్నీ లేదని చెప్పారు. దీంతో ఖంగుతిన్న రీటా.. భర్తను నిలదీసింది. రెండేళ్ల క్రితం చేసిన ఆపరేషన్‌లో.. కిడ్నీని అమ్మేసినట్లు చెప్పాడు. అదీగాక కట్నం కింద ఆ డబ్బును లెక్కేసుకో అంటూ నిర్లక్ష్యంగా బదులిచ్చాడు. దీంతో బంధువులతో కలసి రీటా పోలీసు కేసు పెట్టింది. బిశ్వజిత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సర్జరీ చేసిన ఆస్పత్రిపై దాడులు చేశారు. దాని వెనుక అవయవాల స్మగ్లింగ్ గ్యాంగ్ హస్తం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
భార్యకు కడుపు నొప్పి .. కిడ్నీ కొట్టేసిన భర్త
కోల్‌కతా : అడిగినంత కట్నం ఇవ్వలేదని భార్య కిడ్నీనే దొంగిలించాడు కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి. రెండేళ్ల కిందట జరిగిన ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. రీటా సర్కార్ (28), బిస్వజిత్లకు 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. రీటా తల్లిదండ్రులు రూ. 2 లక్షల కట్నం డబ్బు ఇవ్వలేదని అత్తింటివారు తరచూ వేధించేవారు. రెండేళ్ల కిందట రీటాకు కడుపునొప్పి రావడంతో బిస్వజిత్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడే కడుపు నొప్పికి అపండిసైటిస్ ఆపరేషన్ అని చెప్పి కిడ్నీ అమ్ముకుని కట్నం డబ్బుల కింద జమ చేసుకున్నాడు. 'అపండిసైటిస్ ఆపరేషన్ తర్వాత నొప్పి తీవ్రత మరింత పెరిగింది. సర్జరీకి సంబంధించిన విషయాన్ని ఎవరితోనూ చెప్పొదని నా భర్త తరచూ హెచ్చరించేవాడు. నొప్పి భరించలేకపోతున్నానని మరోసారి ఆసుపత్రికి తీసుకెళ్లమని ఎంత ప్రాధేయపడినా ఒప్పుకునే వాడు కాదు' అని రీటా పేర్కొన్నారు. నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో రీటాని బంధువులు నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. కిడ్నీ ఒకటి మిస్సయిందని డాక్టర్లు చెప్పడంతో రీటా షాక్‌కు గురైంది. కట్టుకున్న భర్తే మోసం చేశాడని తెలియడంతో తట్టుకోలేకపోయింది. ఈ ఘటనపై ఫరక్కా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రీటా భర్త బిస్వజిత్తోపాటూ అతని సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రీటాకి సర్జరీ చేసిన ఆసుపత్రిపై కూడా పోలీసులు దాడులు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు కిడ్నీ అమ్మేసినట్టు బిస్వజిత్ నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ నేరం వెనక కిడ్నీలను స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ హస్తం ఉందనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది. బాధితురాలు రీటా సర్కార్ -
అలుపెరగని ‘కిడ్నీ’ యోధుడు
ఇతని పేరు వేన్ వింటర్స్.. ఈ ఫొటో చూశాక ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది.. ఇతని భార్యకు అత్యవసరంగా కిడ్నీ అవసరమైంది. అందుకే ఇలా బోర్డు వేసుకుని రోడ్డుపై పడ్డాడు. 74 ఏళ్ల వింటర్స్‌కి 26 ఏళ్ల క్రితం డీనె అనే మహిళతో వివాహమైంది. ఇప్పటివరకు అంతా భాగానే ఉంది.. కానీ రెండేళ్ల క్రితం డీనెకి రెండు మూత్రపిండాలు చెడిపోయాయని తెలిపాడు. మూత్రపిండాల మార్పిడి ఒక్కటే మార్గమని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. అయితే కిడ్నీ కొనేందుకు వింటర్స్ దగ్గర డబ్బు ఉన్నప్పటికీ దాత దొరకట్లేదు.. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం ప్రతి నెలా కిడ్నీ దాతల కోసం వేచి చూసే రోగుల సంఖ్య మూడు వేలకు చేరుతోంది. కిడ్నీ దాతల కోసం వేచిచూస్తూ ప్రతిరోజూ 13 మంది రోగులు చనిపోతున్నారు. అయితే తన భార్యకు ఆ పరిస్థితి రాకూడదని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఒక బోర్డుపై ‘నా భార్య కోసం ఏ నెగటివ్ రక్తం కలిగిన కిడ్నీ దాత కావాలి’ అని రాసి పెట్టి రోడ్డుపై పడ్డాడు. ప్రతిరోజూ ఆ బోర్డు వేసుకుని కొన్ని కిలోమీటర్లు నడిచేవాడు. ఆ బోర్డును చూసి రోజుకి 700 నుంచి 800 ఫోన్ కాల్స్ దాతల నుంచి వచ్చాయంట.. అలా ఒకానొక సుముహూర్తాన ఒక దాత నుంచి సేకరించిన కిడ్నీ సహాయంతో డీనెకి విజయవంతంగా డాక్టర్లు ఆపరేషన్ చేశారు. అనంతరం సంతోషంగా ఇంటికి చేరుకున్నారు. అయినా ఆ తర్వాత కూడా ఇప్పటికీ వింటర్స్ అదే బోర్డును వేసుకుని తిరిగి రోడ్డుపైకి వెళుతున్నాడు. తన భార్య పరిస్థితి ఎవరికీ రాకూడదని నిర్ణయించుకుని ఇతర రోగుల కోసం మూత్రపిండాల సేకరణలో పడ్డాడు. -
ఆశల బతుకులు..
మర్రిపాటి తులసీదాస్... కవిటి మండలంలోని పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన ఈయన మూడేళ్ల కిందటి వరకూ విశాఖ జిల్లా పరవాడలోని ఎన్టీపీసీ వద్ద ఓ హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ విధి మరోలా తలచింది. 2014లో అతనికి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఎనిమిది నెల ల నుంచి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇప్పుడు వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకోవడం తప్పనిసరి. ఇతనికి భార్య ఆదిలక్ష్మితో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అఖిల 7వ తరగతి, రేష్మ 4వ తరగతి, విన్ని రెండో తరగతి చదువుతున్నారు. కళియా లక్ష్మణరావు... కంచిలికి చెందిన ఈయనకు మూడు పదుల వయస్సులోనే కిడ్నీ పాడైపోయింది. అసలే పేద కుటుంబం. మందులు కొనుక్కోవడానికి కూడా ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. నెలకు రూ.10 వేలు ఖర్చు భరించలేక హోమియోపతి మందులను ఆశ్రయించారు. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: తులసీదాస్, లక్ష్మణరావు వంటి వారు ఉద్దానంలో వేలాది మంది ఉన్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశ పడుతున్న వారు, ఎలాగైనా జబ్బు తగ్గిపోవాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్న వారు దాదాపు ప్రతి వీధిలోనూ కనిపిస్తారు. కానీ వీరి ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదు. వీరి కన్నీరు సర్కారు పెద్దలకు కనిపించడం లేదు. కిడ్నీ రోగులకు రూ.2,500 పింఛను అందిస్తామని ముఖ్యమంత్రి, ఆరో గ్యశాఖ మంత్రి ఘనంగా ప్రకటించినా అదీ నామమాత్రమే అయ్యింది. ఎన్టీఆర్ ఆరోగ్యసేవ కింద ప్రతి నెల డయాలసిస్ చేయించుకుంటేనే ఆ డబ్బు అందుతుంది. అంటే డయాలసిస్ ఆపేస్తే పింఛను కూడా ఆగిపోతుం ది. ప్రభుత్వం స్పందించి తమకేదో శాశ్వత పరిష్కారం చూపిస్తుందని కోటి ఆశలతో ఉన్న ఉద్దానం వాసుల కడగండ్లు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కేవలం సమావేశాలు, హామీల ప్రకటనలకే పరిమితమవుతున్నారు. ఏదీ భరోసా? జిల్లాలో కిడ్నీ రోగులకు సరైన వైద్యం అందించి, అవసరమైతే కిడ్నీ మార్పిడి చేయించి దీర్ఘాయుష్షుకు భరోసా ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు ఉండట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రెండు మూడేళ్లకు మించి జీవితకాలాన్ని పెంచలేని డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంది. అభివృద్ధిలో వెనుకబడిన సిక్కోలు జిల్లా ప్రజల ఆరోగ్యానికి వరప్రదాయినిలా ఉండాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి స్థానిక నాయకుడు ధర్మాన ప్రసాదరావు చొరవతో శ్రీకాకుళంలో ఏర్పాటు చేయించిన రాజీవ్‌గాంధీ బోధనాసుపత్రి (రిమ్స్)ని సద్వినియోగం చేసుకొనే విషయాన్నే నేటి ప్రభుత్వం విస్మరిస్తుందనే భావన బాధితుల్లో కలుగుతోంది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి కారణాలను అన్వేషించేలా పరిశోధన విభాగంతో పాటు అవయవదాతల నుంచి సేకరించిన కిడ్నీలను రోగులకు అమర్చేలా ఒక ప్రత్యేక శస్త్రచికిత్స విభాగాన్నీ రిమ్స్‌లోనే ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అవయవ దానానికి పలువురు ముందుకొస్తున్న దృష్ట్యా రిమ్స్‌లో జీవన్‌దాన్ యూనిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదననూ ప్రభుత్వం పక్కనపెట్టేయడం గమనార్హం. కిడ్నీ మార్పిడి కనాకష్టం ఉద్దానంలోని కిడ్నీ బాధితుల్లో 90 శాతం మంది వారానికి రెండు రోజులు డయాలసిస్ కోసం విశాఖలోని కేజీహెచ్‌కు వెళ్తున్నారు. అక్కడ కిడ్నీ మార్పిడికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయి. కానీ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు 2015 సంవత్సరంలో ఐదు, గత ఏడాది రెండు మాత్రమే జరిగాయి. అదే విశాఖలోనే ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రం నెలకు పది నుంచి 20 వరకూ జరుగుతుండటం గమనార్హం. ఆయా ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకోవడానికే ఆర్థిక స్థోమత సరిపోని ఉద్దానం పేదలకు ఇక కిడ్నీ మార్పిడి అంటే తలకు మించిన భారమవుతోంది. ఈ శస్త్రచికిత్సకు ఆరోగ్య శ్రీ కింద రూ.1.90 లక్షల వరకే సహాయం అందుతోంది. తర్వాత ఆర్నెళ్లకు రూ.80 వేల చొప్పున ఏడాది కాలానికి మందులకు ఇస్తున్నారు. కానీ శస్త్రచికిత్స తర్వాత రూ.80 వేల నుంచి రూ.లక్ష ఖరీదు ఉండే ఇంజెక్షన్లు కనీసం రెండు తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత నెలకు రూ.2 వేలు మందులకు ఖర్చువుతోంది. అన్ని ఖర్చులు కలిపి రూ.5 లక్షల వరకూ చేతి నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి. నిబంధనలతో ఇబ్బందులు ఒకవేళ ఎవరైనా దాతలు కిడ్నీ దానానికి ముందుకొచ్చినా శస్త్రచికిత్స చేయించుకోలేని పరిస్థితి. ఇలా చేయించుకోవాలంటే ముందుగా బోధనాస్పత్రి సూపరింటెండెంట్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ అనుమతి పత్రం ఇవ్వాలి. ఇది కేజీహెచ్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీకాకుళంలో రిమ్స్ బోధనాసుపత్రి అయినప్పటికీ ఆ సౌకర్యం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా కేజీహెచ్ చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిందే. అంతేకాదు దాత, గ్రహీత ఇద్దరూ పోలీసు, రెవెన్యూ శాఖల నుంచి ధ్రువీకరణ పత్రాలను కూడా బోధనాస్పత్రి కమిటీకి సమర్పించాల్సి ఉంది. మళ్లీ ఆ పత్రాలను కమిటీ తిరిగి పోలీసు, రెవెన్యూ అధికారులకు పంపించి పునఃపరిశీలన చేయిస్తుంది. ఇందంతా జరిగేటప్పటికీ పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. ‘రిమ్స్’ను విస్మరిస్తున్నారే... జిల్లాలో కిడ్నీ వ్యాధుల తీవ్రత దృష్ట్యా కనీసం నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలను సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇవి సాకారమైతే రిమ్స్‌లో నెఫ్రాలజీ, యూరాలజీ సర్జన్లు, క్లినికల్ ల్యాబ్, ప్రత్యేక వార్డు, ప్రత్యేక శస్త్రచికిత్స విభాగం అందుబాటులోకి వస్తాయి. వీటన్నింటి కల్పనకు రూ.2 కోట్లకు మించి వ్యయం కాదని వైద్యనిపుణులే చెబుతున్నారు. శ్రీకాకుళం రిమ్స్ బోధనాసుపత్రి అయినప్పటికీ ఇప్పటివరకూ నెఫ్రాలజీ విభాగానికి నోచుకోలేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని సూపర్ స్పెషాలిటీ స్థాయికి తీసుకొస్తే తప్ప ఉద్దానం కిడ్నీ రోగులకు జిల్లాలో తగిన వైద్యం అందే పరిస్థితి ఉండదు. రిమ్స్‌లో ఆరు సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు వెళ్లినా బుట్టదాఖలే అయ్యాయి. అంతేకాదు రాష్ట్రంలో శ్రీకాకుళం రిమ్స్ తప్ప మిగతా జిల్లాల్లోని ప్రభుత్వ బోధనాస్పత్రులన్నింటిలోనూ జీవన్‌దాన్ యూనిట్ ఉంది. దీనిద్వారా కిడ్నీలు, ఇతర అవయవాల మార్పిడి ప్రక్రియ సులభమవుతోంది. శరీరం, అవయవ దానాలకు ముందుకొచ్చే దాతల పేర్లను నమోదు చేసుకొని, వారి మరణానంతరం ఆయా అవయవాలను సేకరించి అవసరమైన వారికి సమకూర్చడంలో ఈ యూనిట్ సహకరిస్తోంది. మరోవైపు రోడ్డు ప్రమాదాల్లో మృతులు లేదా బ్రెయిన్ డెడ్ అయినవారి నుంచి కిడ్నీలు సేకరించి రోగులకు మార్పిడి చేసే ప్రక్రియ జిల్లాలో అందుబాటులోకి వస్తుంది. కానీ ఇవన్నీ విస్మరించి ప్రభుత్వం కేవలం కంటితుడుపు చర్యలకే పరిమితమవుతోంది. కిడ్నీ మార్పిడికి అవకాశం ఉంటే... ఎన్టీఆర్ వైద్య సేవ కింద కిడ్నీ మార్పిడికి అవకాశం లేకపోవడం వల్లే నేను భర్తను కోల్పోయాను. పేదరికం వల్ల అతనికి కిడ్నీ మార్పిడి చేయించలేకపోయాం. ఆ ఒక్క అవకాశం ఉంటే నా కిడ్నీ ఇచ్చి బతికించుకునేదాన్ని. – లొట్టి తేజావతి, రాజపురం, కవిటి మండలం -
‘వడ్డీకి బదులు కిడ్నీ తీసుకుంటాం’
సేలం(తమిళనాడు): తమిళనాడులో వడ్డీ వ్యాపారులు మరింత బరితెగించారు. వడ్డీ చెల్లించనందుకు ఓ వ్యక్తి కిడ్నీ తీసుకునేందుకు ప్రయత్నించారు. అతని భార్య ఫిర్యాదుతో.. పోలీసులు ఆ ఘోరాన్ని అడ్డుకున్నారు. ఈరోడ్ జిల్లా కాశిపాళ్యంకు చెందిన రవి(45) చేనేత కార్మికుడు. వడ్డీ వ్యాపారులు తన భర్తను కిడ్నాప్ చేసి ఎర్నాకుళం(కేరళ)లోని ఓ ఆస్పత్రికి తరలించారని అతని భార్య సంపూర్ణం ఈరోడ్ కలెక్టర్‌కు ఫిర్యాదుచేసింది. వడ్డీకి బదులు తన భర్త నుంచి కిడ్నీ తీసుకునేందుకు బుధవారం ఆపరేషన్ చేయాలని నిర్ణయిం చారంటూ విలపించింది. స్పందించిన కలెక్టర్ ప్రభాకరన్, ఎస్పీ శివకుమార్ విషయాన్ని ఎర్నాకుళం కలెక్టర్, అక్కడి పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆపరేషన్‌ను అడ్డుకున్నారు. -
ప్రేమపెళ్లి.. కట్నం కోసం అమ్మకానికి కిడ్నీ!
న్యూఢిల్లీ: నచ్చిన వాడిని మనువాడేందుకు ఓ యువతి త్యాగానికి సిద్ధపడింది. అతడి కోసం తన కిడ్నీని అమ్మడానికి సైతం సిద్ధపడింది. బిహార్‌కు చెందిన ఓ యువతి (21)కి ఇదివరకే పెళ్లయింది. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ క్రమంలో యూపీలోని మొరాదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని ఆమె ప్రేమించింది. కానీ, కట్నం ఇస్తేగానీ తాళి కట్టేది లేదని ఆమె ప్రేమికుడు స్పష్టం చేశాడు. తల్లిదండ్రులు వ్యతిరేకించినప్పటికీ అతడినే పెళ్లి చేసుకోవాలని ఆమె పట్టుదలతో ఉంది. అతడు అడిగినంత కట్నం ఇవ్వబోమని తల్లిదండ్రులు తెగేసి చెప్పటంతో ఇటీవల ఢిల్లీ చేరుకుంది. అక్కడి ప్రభుత్వ ఆస్పత్రి అధికారులను కలిసి తన కిడ్నీని రూ.1.80లక్షలకు అమ్మేస్తానని చెప్పింది. ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో ఆమెను కలిసి మాట్లాడారు. కట్నం అడిగిన వరుడిపై కేసు పెట్టాలని వారు సూచించారు. అందుకు ఆమె తిరస్కరించటంతో పాటు అతని వివరాలు తమకు చెప్పాలని కోరినా వినిపించుకోకుండా తిరిగి సొంతూరుకు వెళ్లిపోయింది. ఈ మేరకు ఢిల్లీ అధికారులు బిహార్ మహిళా కమిషన్ అధికారులను అప్రమత్తం చేశారు. -
ప్రేమ.. ఖరీదు
సాక్షి, న్యూఢిల్లీ : ఇటువంటి వాళ్లని చూసినప్పుడు ప్రేమ గుడ్డిది.. అందులో సందేహం లేదనిపిస్తుంది. ప్రేమ పేరుతో వంచించిన యువకుడు.. మోసాన్ని కూడా నిజమని నమ్మి.. అతని కోసం కిడ్నీ అమ్ముకునేందుకు సిద్ధపడ్డ యువతి.. ఇది ఒక యధార్థ గాథ. బిహార్‌లో జరిగింది. ఆశ్చర్యం, బాధ తెప్పించే ఘటన వివరాలివి. 21 ఏళ్ల బిహార్ యువతి 2 లక్షల రూపాయలకు తన కిడ్నీ అమ్ముకునేందుకు ఢిల్లీలోని ఒక ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకుంది. అన్నీ మాట్లాడుకున్నాక.. సర్జరీ కోసం వైద్యులు ఢిల్లీకి రమ్మని చెప్పారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్‌ను పరిశీలిస్తున్న పోలీసులకు ఈ కాల్‌పై అనుమానం కలిగింది. కిడ్నీ అక్రమ రవాణా జరుగుతోందన్న అనుమానం పోలీసులకు వచ్చింది. వెంటనే అధికారులు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్యూ)కు సమాచారం అందించి.. కిడ్నీ అమ్మకాన్ని నిలిపాలని సూచించించారు. అక్కడకు వెళ్లిన డీసీడబ్యూ అధికారులకు యువతి చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రేమించి వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు రూ. 2 లక్షలు కావాలి.. అందుకోసం కిడ్నీ అమ్ముకునేందుకు సిద్ధమయినట్లు తెలిపింది. దాదాపు మూడేళ్లుగా ఒక వ్యక్తిని ప్రేమించానని.. అతను కూడా తనను ప్రేమించినట్లు యువతి తెలిపింది. ఇదిలా ఉండగా.. అతనికి ఈ మధ్యే ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఉద్యోగం వచ్చిందని తెలిపింది. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకొమ్మంటే.. రూ. 2 లక్షలు కావాలని డిమాండ్ చేసినట్లు ఆమె చెప్పింది. అతను కోరిన మొత్తం ఇచ్చేందుకే కిడ్నీ అమ్ముకుంటున్నానని తెలిపింది. యువతి చెప్పిన మాటలకు షాక్ తిన్న డీసీడబ్యూ అధికారులు ఆమె ప్రియుడిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
రాళ్లను కరిగించే జ్యూస్
హెల్త్ టిప్స్ కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పడే బాధ వర్ణనాతీతం. ఆపరేషన్ చేయించుకునేవరకు ఉపశమనం లభించదు. అయితే కొందరికి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా మళ్లీ మళ్లీ రాళ్లు ఏర్పడుతుంటాయి. అలాంటివారు రోజూ నారింజ పండ్ల రసం తీసుకుంటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చునంటున్నారు వైద్యపరిశోధకులు.నిద్రలేమి చాలా సమస్యలకు దారి తీస్తుంది. అలాగని నిద్రమాత్రలు వాడితే మరిన్ని సైడ్‌ఎఫెక్ట్‌లు వస్తాయి. అందుకోసం ఏం చేయాలంటే రోజూ ఒకటి రెండు కప్పుల దానిమ్మ జ్యూస్ తాగాలి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. పులిపిర్లు పెద్ద సమస్య. ఇవి ఏర్పడటానికి ప్రధాన కారణం వైరస్. కొందరు వీటిని గిల్లడం, లాగడం వల్ల కొత్తచోట్లలో కూడా పులిపిర్లు ఏర్పడతాయి. పులిపిర్ల నివారణకు ఇలా చేయడం ఉత్తమం.వెల్లుల్లిపాయలను వొలిచి పులిపిర్ల పైన రుద్దుతూ ఉండాలి. ఉల్లిపాయను సగానికి కోసి మధ్యభాగాన్ని తొలగించి అందులో ఉప్పు నింపాలి. దీనినుంచి వచ్చే రసంతో పులిపిర్లపైన సున్నితంగా రుద్దాలి. అలా దాదాపు నెలరోజులపాటు చేయాలి. బంగాళదుంపను మధ్యకు కోసి ఆ ముక్కలతో రుద్దుతూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా 15, 20 రోజులపాటు చేస్తే పులిపిర్లు ఎండి రాలిపోతాయి. ఆస్తమా ఉన్నవాళ్లు పది నల్లమిరియాలు, రెండు లవంగాలు, గుప్పెడు తులసి ఆకులను తీసుకుని వాటిని మరుగుతున్న నీటిలో వేయాలి. అనంతరం స్టవ్‌ను పావుగంటపాటు సిమ్‌లో ఉంచి నీటిని మళ్లీ మరిగించాలి. ఈ ద్రవాన్ని వడకట్టి ఒక జార్‌లోకి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేయాలి. ద్రవం చల్లారేదాకా ఉంచి దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఒకటి రెండు స్పూన్ల ద్రవాన్ని రెండు వారాలపాటు రోజూ సేవించాలి. -
పిల్లల చదువుకై కిడ్నీ ’అమ్మ’కానికి!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ తల్లి పిల్లల చదువు కోసం కిడ్నీ అమ్మకానికి సిద్దపడింది. యూపీలోని రోహత ప్రాంతానికి చెందిన ఆర్తీ అనే మహిళా తను కిడ్నీ అమ్మకానికి సిద్దమని బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయంపై విలేకరులు సంప్రదించగా ఆమె బాధను వెల్లడించింది. నలుగురు పిల్లల చదువు ఫీజులు కట్టలేకపోతున్నామని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆర్తీకి ముగ్గురు కూతురులు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు సీబీఎస్ఈ స్కూల్ లో చదువుతున్నారు. తన భర్తకు బట్టల షాప్ ఉండేదని, నోట్ల రద్దుతో వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని పేర్కొంది. పిల్లల చదువు విషయంపై లోకల్ ప్రజాపతినిధులు కలిస్తే సహాయం చేయకపోగా.. మీ స్టేటస్ తగ్గట్లు చదివించుకోవాలని సూచించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను కూడా కలిసానని, సీఎం సహాయం చేస్తానని మాట ఇచ్చాడని కానీ ఇంతవరకు ఎలాంటి సహాయం అందలేదని పేర్కొంది. దీంతో చేసేదేమి లేక తన ఒక కిడ్నీని అమ్మకానికి పెట్టినట్లు ఆర్తీ తన బాధను వెల్లడించింది. టాక్సీ డ్రైవర్‌గా నెలకు రూ.5000 కు మించి సంపాదించలేక పోతున్నానని ఆమె భర్త మనోజ్ శర్మ తెలిపాడు. -
కిడ్నీలో రాళ్లు రాకుండా నివారించవచ్చా?
హోమియో కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 47 ఏళ్లు. ఆయన చాలాకాలంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ సమస్య తరచూ ఉత్పన్నమవుతోంది. దీనికి చికిత్స ఉందా? తెలియజేయగలరు. – ఎన్. శ్యామ్, నకిరేకల్ వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల ఒంట్లో నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల రక్తంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీనికి తగినట్లుగా ఎక్కువ నీటిని తాగాలి. అలా తాగకపోవడం, కూల్‌డ్రింక్స్ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య వేసవిలో తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. హోమియో చికిత్సలో కిడ్నీలో రాళ్ల సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయవచ్చు. మూత్రపిండాలు రక్తాన్ని వడపోసి వ్యర్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించి శరీరంలోని లవణాల సమతౌల్యతను కాపాడతాయి. మూత్రంలో అదనంగా ఉండే లవణాలు స్ఫటికరూపంలోకి మారతాయి, వాటిని రాళ్లు అంటాం. అవి మూత్ర విసర్జక వ్యవస్థలోని ఏ భాగంలోనైనా (మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశం) ఏర్పడే అవకాశం ఉంది. లక్షణాలు : విపరీతమైన నడుమునొప్పి, కడుపునొప్పి, వాంతులు, మూత్రంలో మంట ప్రధానమైనవి. కొందరిలో ఏదో ఒకవైపు నడుమునొప్పి, జ్వరం రావచ్చు. ఇంకొందరిలో నడుము, ఉదరం మధ్య భాగాలలో నొప్పి వచ్చి పొత్తికడుపు, గజ్జలు, కాళ్లలోకి పాకుతుంది. కండరాలు బిగువుగా మారడం, కడుపు ఉబ్బరం ఉంటుంది. కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు, నొప్పి లేకుండానే కిడ్నీలో రాళ్లు ఉండవచ్చు. నివారణ / జాగ్రత్తలు : రోజుకు 2 – 3 లీటర్ల నీళ్లు తాగాలి. ఉప్పు మితంగా తీసుకోవాలి. విటమిన్ సి, క్యాల్షియమ్ సప్లిమెంట్ల వంటి మాత్రలను కేవలం వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. శీతల పానియాలను మానేయాలి. చికిత్స : రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా కిడ్నీ స్టోన్స్ కండిషన్‌కు చికిత్స చేయవచ్చు. కిడ్నీలోని లవణాల సమతౌల్యతను కాపాడి, వాటి పనితీరును మెరుగుపరచడం ద్వారా కిడ్నీలలో మళ్లీ మళ్లీ రాళ్లు రాకుండా చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
కిడ్నీలో అంత పెద్ద రాయి...
వల్సాద్(గుజరాత్): ఓ వ్యక్తి మూత్రాశయం నుంచి కిలోకు పైగా బరువున్న రాయిని వైద్యులు బయటకు తీశారు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం వల్సాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ధరంపూర్ తహశీల్ పరిధిలోని ఖర్వేల్ గ్రామానికి చెందిన మహేష్ పటేల్(45) గత కొంతకాలంగా మూత్ర సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. మూత్రం సరిగ్గా రాక తీవ్ర నొప్పితో బాధపడుతున్న మహేష్‌ను ధరంపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు పరీక్షించారు. డాక్టర్ ధీరూభాయ్ నేతృత్వంలోని వైద్యులు శుక్రవారం రాత్రి ఆయన మూత్రాశయానికి ఆపరేషన్ చేసింది. కొబ్బరికాయను పోలి ఉన్న 1 కిలో 400 గ్రాముల బరువు ఉన్న రాయిని బయటకు తీశారు. ఇంత పెద్ద రాయి ఉండటం దేశంలోనే ప్రథమమని, ప్రపంచంలో రెండోదని రికార్డులు పరిశీలించిన వైద్యులు తెలిపారు. గతంలో బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తి మూత్రాశయం నుంచి కిలో 900 గ్రాముల బరువైన రాయిని తీశారని తెలిపారు. తమ ఆస్పత్రిలో చేపట్టిన ఈ ఆపరేషన్‌పై లిమ్కాబుక్ రికార్డు నిర్వాహకులకు సమాచారం అందించామని డాక్టర్ ధీరూభాయ్ వెల్లడించారు. -
సేఫ్ కిడ్నీ
నేడు వరల్డ్ కిడ్నీ డే అర్థంచేసుకోకపోతే... కిడ్నీ ఒక పెద్ద పజిల్ అర్థం చేసుకుంటే... చాలా సేఫ్ ఇల్లూడ్చకపోతే ఆ ఇల్లెలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇల్లూడ్చే బాధ్యతలాగే... మన ఒళ్లూడ్చే పని చేస్తుంది కిడ్నీ. మన ఒంట్లోని ప్రతి రక్తబ్బొట్టునూ శుభ్రంగా కడుగుతుంది. అలా బుద్ధిగా రక్తం మొత్తాన్ని శుద్ధి చేస్తుంది. ఒంటి లోపల ఒళ్లూడ్చీ, కడిగే ఈ కీలకవయవాలు నడుములోపల ఇరువైపులా సగం వంచిన బాణచాపాల్లా ఉంటాయి. సురక్షాత్మక రక్షణ కవచాల్లా ఉంటాయి. బక్కెట్ల కొద్దీ మాలిన్యాలను వెలికి తీస్తుంటాయి. అలా అవి మన రక్షణ బాధ్యత తీసుకున్నప్పుడు వాటిని కాపాడుకునే బాధ్యత మనమూ తీసుకోవాలి కదా. అదెలాగో తెలుసుకునేందుకే ఈ ప్రత్యేక కథనం. మీ దేహానికి మీరే దేవదేవుడు. మీ ఒళ్లే మీ కొవెల. మీ దేహాలయపు గర్భగుడి లోపల ద్వారపాలకుల్లా మిమ్మల్ని నిరంతరం రక్షించేందుకు మీకు ఇరుపక్కలా ఉంటాయి రెండు కిడ్నీలు. మీ దేహక్రియలూ, మీ జీవక్రియల మాలిన్యాలతో వచ్చే అనేక గండాలను కడిగిపారేసే ఆ రక్షకులే మీ మూత్రపిండాలు. కేవలం రక్షించే పనేనా... కిడ్నీ అంటే కేవలం రక్తంలోని మలినాలను మాత్రం కడిగేసే హౌజ్‌కీపింగ్ పని మాత్రమే చేస్తాయని అనుకుంటున్నారా? కాదు... దేహానికి మాస్టర్‌కెమిస్ట్‌లు అవి. ఎర్ర రక్తకణాల ఉత్పాదనలోనూ వాటా తీసుకుంటాయి. ఒంట్లో నీటిసరఫరాను నియంత్రిస్తాయి. మీ దేహమే ఒక దేశమైతే అందులోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత అంతా కిడ్నీలదే. ఆ చీపురు పేరే నెఫ్రాన్... ఒంట్లోని ప్రతి రక్తపు బొట్టునూ కడిగేయడానికి పనిచేసే కిడ్నీలోని చీపురు లాంటి దాన్ని ‘నెఫ్రాన్’ అంటారు. అలాంటి పది లక్షల చీపుర్లు నిరంతరం, అనునిత్యం పనిచేస్తూ ఒంట్లోంచి కసవును ఊడ్చేస్తుంటాయి. జీవక్రియల వల్ల వెలువడ్డ అడుసును కడిగేస్తుంటాయి. ఈ కిడ్నీ నెఫ్రాన్ అనే చీపురులో సన్నటి తీగలుగా చుట్టుకునే ఉండే చీపురుపుల్ల పొడవెంతో తెలుసా? అక్షరాలా 105 కిలోమీటర్లు. మూత్రపిండాల్లోని నెఫ్రాన్లు తొండాలతో తోడినట్లుగా మలినాలను తోడేసి దేహ గండాలను తొలగిస్తాయి. అలాంటి నెఫ్రాన్లు పది లక్షలు విలక్షణంగా పనిచేస్తూ దేహాన్ని లక్షణంగా ఉంచుతాయి. అలా నిస్వార్థంగా వ్యర్థాలను బయటకు నెట్టే అర్ధవంతమైన పనిని అనునిత్యం చేస్తూ ఉంటాయవి. మనలో ఉండి... మల్టీ టాస్కింగ్ ఒంటిని శుభ్రం చేసే ఒక్క పనిని ప్రధానంగా పెట్టుకోకుండా, అనుబంధంగా కొనరు పనులెన్నో కోరి చేస్తుంటాయవి. ఉదాహరణకు ∙ఒంట్లో నీళ్ల పాళ్లను ఎప్పుడూ సమంగా ఉంచడం. ∙రక్తపోటును అదుపులో పెట్టడం ∙మూలుగ ఇండస్ట్రీలో ఉత్పత్తి అయ్యే ఎర్రరక్తకణాల తయారీకి అనుబంధ పరిశ్రమలాగా సహాయపడటం ∙చర్మం, ఎముకలు... ఇలా దేహం మొత్తంలో ‘డి‘ విటమిన్ ఉత్పత్తి జరిగేలా ప్రేరేపించడం. ∙అంతేకాదు... సోడియమ్, పోటాషియమ్ పీహెచ్ పాళ్లను సరిచూస్తాయి. ఇవి కిడ్నీ చేసే పనుల్లో కొన్ని మాత్రమే. మనలో ఇలా మల్టీ టాస్కింగ్ చేసే కిడ్నీ సేఫ్‌గా ఉంచడం మన కర్తవ్యం కదా. మరి వాటి రక్షణకు ప్రతికూలంగా పనిచేసే అంశాలనూ ముందుగా తెలుసుకుందాం. మన రక్షణ కోసం ఆ రెండూ... ఆ రెండింటి శత్రువులు మరిరెండూ... మన దేహాన్ని కాపాడటం కోసం రెండు మూత్రపిండాలు పనిచేస్తుంటాయి కదా. మరి ఆ ఇద్దరి వెనకా నిత్యం చెరో ఇద్దరు శత్రువులూ పొంచి ఉంటారు. మొదటిది డయాబెటిస్... ఆ రెండింటిలో మొదటిది డయాబెటిస్. రెండోది అధిక రక్తపోటు (హైబీపీ). నూరుమంది కిడ్నీ బాధితులను తీసుకుంటే అందులో 40 శాతం మంది డయాబెటిస్తో కిడ్నీలను చెడగొట్టుకున్నవారే. రెండోది హైబీపీ... మరో 30 శాతం మంది హైబీపీలను నియంత్రణలో ఉంచుకోకపోవడం వల్ల కిడ్నీలను దెబ్బతీసుకున్నవారే. అందుకే ఈ రెండు సమస్యలను నియంత్రణలో ఉంచుకోగలిగితే కిడ్నీలు దెబ్బతినకుండా చూసుకోవడం చాలా సులభం. చక్కెర చేటు... రక్తపోటు వేటు... ప్రపంచంలోనే చక్కెరవ్యాధిగ్రస్తుల విషయంలో మనదేశం అగ్రస్థానంలో ఉంది. ఐదుగురు సభ్యులున్న ప్రతి కుటుంబంలోనూ ఇద్దరు చక్కెర వ్యాధిగ్రస్తులున్నారని ఒక అంచనా.చిన్నతనంలోనే వచ్చే (టైప్–1) డయాబెటిస్ బాధితుల్లో 10–30 శాతం మంది, పెద్దయ్యాక వచ్చే (టైప్–2) డయాబెటిస్ బాధితుల్లో 40 శాతం మంది మూత్రపిండాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి డయాబెటిస్ ఉందంటే అటు గుండెజబ్బులు వచ్చే అవకాశాలతో పాటు, కిడ్నీలు పాడయ్యే అవకాశాలూ ఉన్నాయని గుర్తుంచుకోవాలి.ఇక ఆధునిక జీవనశైలిలోని ఆహారపు అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడితో కూడిన వృత్తులు వంటివి మన రక్తపోటు (హైబీపీ) సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. దాంతో హైబీపీ కారణంగా దెబ్బతినే ప్రధాన అవయవాల్లో కిడ్నీ ప్రధానమైనది. ఆ రెండింటి నుంచి కిడ్నీల రక్షణ ఎలాగంటే... కిడ్నీలు మన రక్తంలోని వ్యర్థాలను వడగడుతుంటాయి కదా. ఈ క్రమంలో వ్యర్థాలను సేకరించి శరీరానికి హాని చేసేవాటిని బయటకు పంపే కీలక బాధ్యతను నిర్వహిస్తుంటాయి. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి విఫలం కావడం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నార్మల్కు రావడం చాలా కష్టం. అదేగాని పూర్తిగా విఫలమైతే ఇక నిత్యం కృత్రిమంగానే రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రక్రియనే డయాలసిస్ అంటారు. ఆర్థికంగానూ కుంగదీసే అంశమది... డయాలసిస్ ప్రక్రియ కుటుంబాలపై ఎంతో ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఎంత కాదన్నా ప్రతి నెల ఐదారువేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాడైపోయిన మూత్రపిండానికి చికిత్స తీసుకుంటూ ఉన్నా అది పూర్తిగా సమర్థంగా మారదు. క్రమంగా గుండెజబ్బులు, అవయవాలు దెబ్బతినడం వంటివి మొదలవుతాయి. పోనీ... దెబ్బతిన్న మూత్రపిండాన్ని మార్పిడి చేయించుకోవాలన్నా కిడ్నీ దాతలు దొరకడం కష్టం. ఆపరేషనే పెద్ద ప్రయత్నం అనుకుంటే... ఇక ఆ తర్వాత జీవితాంతం వేసుకోవాల్సిన మందులకూ చాలా ఎక్కువగా ఖర్చవుతుంది. ఇలా మూత్రపిండాల వ్యాధి ఉన్నవారి కుటుంబానికి అటు డయాలసిస్ కోసం, ఇటు మందుల కోసం ఆర్థికంగా ఎంతో ఖర్చు అవుతుంటుంది. సరే... ఖర్చును ఎలాగోలా భరిద్దామనే అనుకున్నా మందులతో ఇతర సమస్యలు, దుష్ప్రభావాలు, ఇబ్బందులు కలుగుతాయి. ఈ అన్ని అంశాల సమగ్ర ఫలితాలతో మీ జీవనప్రమాణాలు, ఆయుర్దాయం తగ్గవచ్చు. అందుకే కిడ్నీలు దెబ్బతినకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైన మంచిది, అది అవసరం కూడా. కీలకమైన కిడ్నీలను కాపాడుకోవాలంటే... డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు కచ్చితంగా వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. చక్కెరవ్యాధిగ్రస్తులు ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా హెచ్‌బీఏ1సీ అనే పరీక్షను మూడు నెలలకు ఒకసారి చేయిస్తూ దాని ఫలితం 6.5 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఏమీ తినకముందు షుగర్ 100 ఎంజీ/డీఎల్ లోపల ఉండాలి. తిన్న తర్వాత 160 ఎంజీ/డీఎల్ ఉండేలా చూసుకోవాలి. రక్తపోటు ఉన్నవారు తమ బీపీని నిత్యం 130/80 ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ∙మన ఆహారంలో ఉప్పును పరిమితం చేసుకోవాలి. బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, నిల్వ ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. ∙మూత్ర విసర్జన సమయంలో మూత్రంలో సుద్దలా పోతున్నట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీల పరిరక్షణకు తేలికైన పరీక్షలు... చిన్నప్పుడే వచ్చిన (టైప్–1) డయాబెటిస్ బాధితులు, ఆ వ్యాధి బారిన పడిన ఐదేళ్ల నుంచి ప్రతి ఏటా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే పెద్దయ్యాక వచ్చిన (టైప్–2) డయాబెటిస్ బాధితులు దాన్ని గుర్తించిన తక్షణమే కిడ్నీ పనితీరును తెలుసుకునే పరీక్షను చేయించుకోవాలి. ఆ తర్వాతినుంచి ప్రతి ఏడాది ఒక్కసారైనా క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్ష చేయించుకుంటూనే ఉండాలి. దీనివల్ల కిడ్నీ సమస్యలేవైనా తలెత్తుతున్నాయా అన్న విషయాన్ని గుర్తించి దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవచ్చు. ఆ తేలికైన పరీక్షలివి... ►మూత్రంలో ఆల్బుమిన్ : ఇది ఒక రకం ప్రోటీన్. మూత్రంలో సుద్దలా పోతుందంటే కిడ్నీల వడపోత సామర్త్యం తగ్గినట్లే. అందుకే మధుమేహ బాధితులు ప్రతిఏటా మూత్రంలో ఆల్బుమిన్ పరీక్ష చేయించుకోవాల్సిందే. దీని ద్వారా కిడ్నీ సమస్యను గుర్తించవచ్చు. ►రక్తంలో సీరమ్ క్రియాటినిన్ : మన కిడ్నీల వడపోత సామర్థ్యం ఎలా ఉందో చెప్పేందుకు ఈ పరీక్ష కీలకం. దీని ఆధారంగానే కిడ్నీల వడపోత సామర్థ్యాన్ని (ఎస్టిమేటెడ్ గ్లోమెరూలార్ ఫిల్టరేషన్ రేట్ – ఈజీఎఫ్ఆర్)ను లెక్కించి, కిడ్నీ సమస్య తలెత్తే అవకాశం ఎంత ఉందని అంచనా వేస్తారు. సాధారణంగా ఇది 110 మి.లీ. ఉంటుంది. ఇది 60 మి.లీ. కంటే తక్కువగా ఉంటే మూత్రపిండాల సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. అలాగే కేవలం సీరమ్ క్రియాటినిన్ అనే పరీక్ష మాత్రమే సరిపోదు. ఎందుకంటే కిడ్నీలు 50 శాతం దెబ్బతినేవరకూ రక్తపరీక్షలో సీరమ్ క్రియాటినిన్ పెరిగినట్లుగా తెలిసే అవకాశం లేదు. కాబట్టి ‘ఈజీఎఫ్ఆర్’ను చూసుకోవడం ముఖ్యం. సీరమ్ క్రియాటినిన్‌ను పరీక్షించి, రోగి వయసు, బరువు, ఎత్తు వంటి కొన్ని ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని వాటి ఆధారంగా ‘ఈజీఆర్‌ఎఫ్’ను లెక్కిస్తారు. డాక్టర్ ఊర్మిళ ఆనంద్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
కొడుకు కోసం ఓ అమ్మ ఆర్తనాదం
-
వైఎస్ జగన్‌ను కలిసిన కిడ్నీ బాధితులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన కిడ్నీ బాధితులు
హైదరాబాద్ : ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కిడ్నీ బాధితులు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఆరోగ్య శ్రీ ఉన్నా ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయడం లేదని వైఎస్ జగన్ ముందు బాధితులు తమ గోడు వెళ్ల బోసుకున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కోసారి రూ. 4వేలు ఖర్చవుతోందని ఆవేదన చెందారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. ఈనెల 20 వ తేదీన కనిగిరి, పాలవరం, పీసీ మండల ప్రాంతాలలో తాను పర్యటించి, బాధితులతో మాట్లాడుతానని జగన్ వారికి హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనడానికి ఇదొక ఉదాహరణ అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లాలో 424మంది కిడ్నీ బాధితులు చనిపోయారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. -
ఎన్పీసీడీసీఎస్లోకి కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులు
దీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం కేన్సర్, డయాబెటిస్, బీపీల సరసన చేరుస్తూ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కేన్సర్, గుండె, షుగర్ వ్యాధుల జాతీయ నియంత్రణ, నిర్మూలన కార్యక్రమం (ఎన్‌పీసీడీసీఎస్)లో కిడ్నీ, శ్వాస కోశ సంబంధిత వ్యాధులనూ చేరుస్తూ తాజా గా కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులనూ ఇకపై దీర్ఘకాలిక లేదా జీవనశైలి వ్యాధులుగా గుర్తిస్తారు. కేన్సర్, గుండె, షుగర్ వ్యాధులు ఎంత సర్వసాధారణ మయ్యాయో.. కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులూ అదే స్థారుులో జనాన్ని పట్టి పీడిస్తున్నారుు. ఈ వ్యాధులన్నింటినీ వివిధ పరీక్షల ద్వారా ముందుగానే గుర్తించి నియంత్రించడమే ఎన్‌పీసీడీసీఎస్ ప్రధాన లక్ష్యం. రెండేళ్ల క్రితం 3 ప్రధాన వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కోసం ఎన్‌పీసీడీసీఎస్ ఏర్పడగా.. తాజాగా కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులను చేర్చారు. ఆరోగ్యశ్రీలో రెండో స్థానం కిడ్నీ వ్యాధులదే 2015-16లో ఆరోగ్యశ్రీ కింద తెలంగాణలో చేసిన చికిత్సల్లో అత్యధికంగా 24.04 శాతం కేన్సర్‌కు సంబంధించినవే ఉన్నారుు. రెండో స్థానం కిడ్నీ వ్యాధులకు సంబంధించిన చికిత్సలదే. కిడ్నీ చికిత్సలు 17.80 శాతం, గుండె చికిత్సలు 10.92 శాతం ఉన్నారుు. 2015-16లో మొత్తం అన్ని రకాల వ్యాధులకు 2,60,110 చికిత్సలు జరిగితే అందులో కేన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులకు చెందిన చికిత్సలు 1,37,286 జరిగారుు. మరోవైపు అన్ని వ్యాధుల చికిత్సలకు కలిపి ప్రభుత్వం రూ. 682.99 కోట్లు కేటారుుస్తే.. అందులో రూ. 326.91 కోట్లు ఈ మూడింటికే ఖర్చు చేశారు. శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి 1,553 శస్త్రచికిత్సలు జరిగారుు. ఎన్పీసీడీసీఎస్లో చేర్చితే ప్రయోజనమేంటి? దీర్ఘకాలిక వ్యాధులుగా కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులను గుర్తించి.. ఎన్పీసీడీసీఎస్లో చేర్చడం వల్ల ఆ వ్యాధుల నియంత్రణ, నిర్మూలనపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ముందస్తుగానే కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులను గుర్తించి మొదట్లోనే నయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రచించాలి. అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ యూనిట్లు పెంచడం, వైద్య నిపుణుల సంఖ్యను అధికం చేయడం.. ఊపిరితిత్తులకు సంబంధించి ప్రత్యేక వార్డులను జిల్లా, ఏరియా కేంద్రాల్లో ఏర్పాటు వంటి చర్యలకు ఉపక్రమించాలి. ఎన్‌పీసీడీసీఎస్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చుతాయి. -
పరామర్శించేందుకు తీరికలేదా?
మంత్రి కామినేనిపై ఎమ్మెల్యే ఈశ్వరి మండిపాటు కొయ్యూరు: కిడ్నీ మరణాలతో కొయ్యూరు మండలంలోని దూసరి కొత్తూరు గ్రామం వల్లకాడుగా మారుతున్నా ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుకు అక్కడి గిరిజనులను పరామర్శించేందుకు తీరుకలేదా అని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. నర్సీపట్నం వరకు వచ్చిన కామినేనికి దానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు వచ్చేందుకు తీరిక లేకపోవడం దారుణమన్నారు. గిరిజన మరణాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి ఇదే తార్కణమన్నారు. గ్రామంలో 12 మంది వరకు మరణించినా ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని మండిపడ్డారు. మంగళవారం ఆమె కొత్తూరులో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇంటి పెద్దలు కిడ్నీలు పాడై మరణించడంతో ఆ కుటుంబాలు వీధినపడ్డాయని.. ప్రతి కుటుంబానికి రూ.రెండు లక్షల పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కిడ్నీ సంబంధిత రోగులకు ఉచిత వైద్యసేవలు అందించాలని సూచించారు. గ్రామంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్న కంఠారం వైద్యురాలు సునీతతో ఎమ్మెల్యే మాట్లాడారు. వెరుు్య మందిలో ఒకరికి కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే వీలుందని..ఇక్కడ ఎక్కువ మందికి కిడ్నీలు పాడైపోతున్నాయని, పురుషులు ఎక్కువగా చనిపోతున్నారని, ఇష్టానుసారంగా పెరుున్ కిల్లర్స్ వాడడంతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని సునీత వివరించారు. అలాగే మహిళలు చనిపోవడంపై ఇటీవల ఆంధ్రా మెడికల్ కళాశాల నుంచి వచ్చిన వైద్య నిపుణుల బృందం అన్ని కోణాల్లో పరిశీలన చేపట్టిందన్నారు. గ్రామంలో బోరుకు మోటారు అమర్చి రివర్స్ ఆజ్మసిస్(ఆర్వో)ప్లాంట్‌ను ఏర్పాటు చేయడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. తాండవ నీటిని ఇక్కడకు మోటారు ద్వారా తరలించి ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. కలెక్టర్ దృష్టిలో ఉంచి గ్రామస్తులకు న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు. మండల అధ్యక్షులు టీఎస్ రాందాస్, ముఖ్యకార్యకర్తలు జి.సత్తిబాబు, మామిడి రమణ, సీహెచ్ శ్రీను, కె రాంబాబు, గోవర్దనగిరి, సోమాగాంధీ పాల్గొన్నారు. -
కిడ్నీని మింగిన బైక్ రేసింగ్!
- కింద పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకుడు - ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాటం హైదరాబాద్: భాగ్యనగరంలో మైనర్ల డ్రంకన్ డ్రైవ్‌కు, బైక్ రేసింగ్‌లకు చెక్ పడడం లేదు. రమ్య, సంజన ఉదంతాలు మరవక ముందే తాజాగా జరిగిన మరో ఘటనలో ఓ యువకుడు కిడ్నీ పోగొట్టుకొని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పుట్టిన రోజు పార్టీలో మద్యం తాగి, ఆ తర్వాత బైక్ రేసింగ్ చేస్తూ ఈ యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. వివరాలివీ.. ఆర్కే పురంలో నివసించే వంశీ(18) తన జన్మదినం సందర్భంగా ఈ నెల 10న అర్ధరాత్రి తన మిత్రులతో కలసి విందు చేసుకున్నాడు. కొత్తపేటకు చెందిన రేవంత్(16), నవాజ్ సహా మరో పది మంది మిత్రులతో నెక్లెస్ రోడ్లో కేక్ కట్ చేసి అనంతరం మద్యం సేవించారు. తర్వాత అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్దకు చేరుకున్నారు. వాహనాలపై వేగంగా దూసుకుపోతున్న క్రమంలో నవాజ్ వాహనం అదుపు తప్పి పడిపోయింది. దీంతో వెనుక సీట్లో కూర్చున్న రేవంత్ కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతడిని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తు తం రేవంత్ పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు అతడి కిడ్నీని తొలగించారు. మైనర్లకు మద్యం సరఫరా చేసిన షాపు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలం టూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన రేవంత్ తండ్రి సుభాష్ చంద్రబోస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనర్లు బైక్ రేసింగ్‌కు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నీ బాధితుడికి స్నేహితుల ఆర్థికసాయం
మునుగోడు: రెండు కిడ్నీలు చెడిపోయి మంచానికి పరిమితమైనా స్నేహితుడిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.. వెల్మకన్నె గ్రామానికి చెందిన పలువురు యువకులు. 2000–2001లో వెల్మకన్నె పాఠశాలలో పదవత తరగతి చదివిన యువకుల్లో చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన కురిమిళ్లా భిక్షానికి ఇటీవల రెండు కిడ్నీలు చెడిపోయాయి. అయితే అతడిని ఆదుకునేందుకు అదే ఏడాది ఈతడితో పాటు విద్యను అభ్యసించిన 10 మంది యువకులు ఒక్కోకరు రూ వెయ్యి నుంచి రూ 2 వేల చొప్పున పొగుచేసిన రూ 22 వేలను అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకుడు వనం రమేష్, దొంతరగొని గోపి, గంగనగొని శంకర్, మాలిగ నర్సింహ్మ, బద్దుల పరమేష్, ఏర్పుల అశోక్, దొటి శ్రీను, వరికుప్పల లింగయ్య, గణేష్ ఉన్నారు. -
‘కాన్పు కోసం వెళితే కిడ్నీ కాజేశారు’
బారీల్లి: రోగులకు తెలియకుండా మూత్రపిండాలు దొంగిలిస్తున్న ఉదంతాలు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని బారీల్లి నగరంలో వెలుగులోకి వచ్చింది. కాన్పు కోసం ఆస్పత్రికి వెళితే తన కిడ్నీ కాజేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నారాయణి అనే మహిళ ప్రసవం కోసం మార్చి నెలలో రోహిత్ అగ్నిహోత్రి ఆస్పత్రిలో చేరింది. తన కిడ్నీ తొలగించినట్టు డిశ్చార్జి అయిన గుర్తించానని పోలీసులకు తెలిపింది. అయితే ఈ ఆరోపణలను ఆస్పత్రి యజమాని డాక్టర్ సుష్మా అగ్నిహోత్రి తోసిపుచ్చారు. 30 నిమిషాలు ఆపరేషన్ లో కిడ్నీ తొలగించడం అసాధ్యమని అన్నారు. నారాయణి అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయించుకోలేదని, కాన్పుకు ముందు ఆమెకు రెండు కిడ్నీలు ఉన్నట్టు ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఇదంతా తమ ప్రత్యర్థుల కుట్రని సుష్మ ఆరోపించారు. పోలీసులు ఈ కేసును చీఫ్ మెడికల్ అధికారికి నివేదించారు. -
మూకుమ్మడిగా విషం సేవించి, తాడుతో..
ఒకరి తరువాత మరొకరికి ముగ్గురు కొడులకూ మాయదారి రోగం వచ్చింది. ఒకరికి మించి మరొకరికి రోగ తీవ్రత ఎక్కువగా ఉండడంతో దాన్ని వారు తట్టుకోలేకపోయారు. కళ్లెదుటే చెట్టంత ఎదిగిన బిడ్డలు రోగగ్రస్తులు కావడం ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కన్న బిడ్డలు అనారోగ్యంతో తన ముందే కళ్లు మూస్తే ఇక తాను బతికుండి ఏం ప్రయోజనం అనుకుందో ఏమో ముగ్గురు కొడుకులతో కలిసి ఆ తల్లి ఆత్మహత్యకు ఒడిగట్టింది. మృత్యువు దరి చేరేటప్పుడు విడిపోతే ఎలాగనుకున్నారో ఏమో నలుగురూ విడిపోకుండా తాడుతో కట్టుకొని, పురుగుల మందు సేవించి ఉప్పుటేరులో దూకి బుధవారం రాత్రి ఉసురు తీసుకున్నారు. గురువారం ఉదయం మత్స్యకారులు ఉప్పుటేరులో చేపలు పట్టేందుకు వల వేయగా మృతదేహాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. పిఠాపురం/ కొత్తపల్లి : కొత్తపల్లి మండలం అమరవిల్లికి చెందిన రాగాల రాము, భూలక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఆరేళ్ల క్రితం వివాహం చేశారు. ముగ్గురు కొడుకులు ప్రభు ప్రకాష్ (22), అనిల్ కుమార్ (20), ప్రేమసాగర్ (18). పెద్దవారిద్దరూ డిగ్రీ వరకు చదువుకొని తండ్రికి వ్యవసాయంలో సాయపడుతున్నారు. ప్రేమసాగర్ పదోతరగతి చదువుతుండగా ఆరోగ్యం బాగోలేక చదువు మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆఖరి వాడితో మొదలైంది నాలుగేళ్ల క్రితం చిన్న కుమారుడు ప్రేమసాగర్ అస్వస్థతకు గురికాగా కాకినాడలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. అతనికి కిడ్నీలు పాడయ్యాయని, ఆపరేషన్ చేయించాలని డాక్టర్లు చెప్పారు. కొంత కాలం వరకు డయాలసిస్ చేయించాలని వారు అనడంతో ఆమేరకు నాలుగేళ్లుగా వైద్యం చేయిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మిగిలిన ఇద్దరు కుమారులు ప్రభు ప్రకాష్, అనిల్ కుమార్ కూడా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని ఆస్పత్రిలో చూపించగా పరీక్షలు చేసిన వైద్యులు వారి కిడ్నీలు కూడా పాడయ్యాయని, ఆపరేషన్ చేయించక తప్పదని చెప్పారు. ఉన్న కిడ్నీ ఇచ్చైనా కాపాడుకోవాలనుకున్నా...! చిన్న కుమారుడికి కిడ్నీలు పాడయ్యాయని, రెండు కిడ్నీలు మార్చాలన్న వైద్యుల సూచనలతో తన కిడ్నీ ఇచ్చైనా వాడిని కాపాడాలని తండ్రి రాము వైద్యులను వేడుకున్నట్టు బంధువులు తెలిపారు. ఒకరికి తన కిడ్నీ ఇవ్వాలని అనుకుంటున్న తరుణంలో మరో ఇద్దరు కుమారులకు అదే పరిస్థితి ఎదురవ్వడంతో వారిని ఎలా కాపాడుకోవాలో ఆ తల్లిదండ్రులకు తోచలేదు. తల్లిదండ్రులిద్దరు చెరో కిడ్నీ ఇచ్చినప్పటికీ మరొకరికి కిడ్నీ ఇచ్చే వారు లేక పోవడంతో ఇక తమకు దిక్కెవరని రోదించే వారని స్థానికులు చెబుతున్నారు. శోకసంద్రంగా అమరవిల్లి తల్లి, ముగ్గురు కుమారులు మరణించడంతో అమరవిల్లి గ్రామం శోకసంద్రంగా మారింది. అందరితో కలిసిమెలిసి ఉండే ఆకుటుంబ సభ్యులు ఇప్పుడు లేరన్న చేదు నిజాన్ని ఆగ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. కన్న కొడుకులు, కట్టుకున్న భార్య లేకుండా నేనెందుకు బతకాలంటూ గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న రాముని ఆపడం ఎవరితరమూ కావడం లేదు. ఈ సంఘటనతో షాక్‌గురై రాము స్పృహ తప్పడంతో స్థానిక డాక్టర్ వైద్యసేవలందిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కొత్తపల్లి ఎస్సై చైతన్యకుమార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న కాకినాడ డీఎస్పీ ఎస్. వెంకటేశ్వరరావు, ఆర్డీఓ డేవిడ్ రాజు, పిఠాపురం సీఐ ఎండీ ఉమర్ అక్కడకు చేరుకున్నారు. సీఐ ఆధ్వర్యంలో ఎస్సై చైతన్యకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మృతదేహాలు స్వగ్రామానికి చేరుకున్నాయి. మాయదారి రోగమే ముంచిందా..? భూలక్ష్మి సోదరులు కిడ్నీసమస్యతోనే మృతి చెందారు. అదే రోగం తన ముగ్గురు కుమారులకు సోకడంతో ఇది వంశపారంపర్యంగా వచ్చి ఉండొచ్చని వైద్యులు చెప్పడంతో ఆమె తన కడుపున పుట్టడం వల్లే ముగ్గురు కొడుకులకు ఈరోగం వచ్చిందని భావించి ఇంత దారుణానికి ఒడిగట్టి ఉంటుందని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ ఆదుకోదని..! ఈ కిడ్నీ సమస్యకు ఆరోగ్యశ్రీ పథకంలో కొంత వరకే వైద్యం చేయగలమని, మిగిలిన ఖర్చులు మీరే పెట్టుకోవాలని ఆస్పత్రి వర్గాలు తేల్చి చెప్పాయి. ముగ్గురు కుమారులకు పెద్దమొత్తంలో ఖర్చు చేయడం తమ శక్తికి మించిందని ఆకుటుంబ సభ్యులు బాధపడేవారని మృతుల బంధువులు తెలిపారు. -
కాటేసిన కిడ్నీ
* ముగ్గురు కుమారులతో కలసి తల్లి ఆత్మహత్య * తల్లి ఒకరికి, తండ్రి మరొకరికి కిడ్నీలివ్వాలనుకున్నారు * మూడో కొడుకును ఏం చేయాలనే మనోవేదన * తనవల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తల్లడిల్లిన తల్లి * తూర్పుగోదావరి జిల్లా అమరవిల్లిలో హృదయవిదారక ఘటన పిఠాపురం (తూర్పుగోదావరి జిల్లా): ముగ్గురు కొడుకులకూ మూత్రపిండాలు పాడయ్యాయి. తండ్రి ఒకరికి, తల్లి మరొకరికి కిడ్నీలు ఇద్దామనుకున్నా.. మూడో కుమారుడికి ప్రాణాపాయం తప్పదు. ఎవరినీ వదులుకోలేని నిస్సహాయ పరిస్థితి. పిల్లల మేనమామలు గతంలో కిడ్నీల వ్యాధితోనే మరణించారు. ఈ సమస్య వంశపారంపర్యంగా కొనసాగే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. తనకు పుట్టినందునే పిల్లలు మహమ్మారి వ్యాధి బారినపడ్డారనే దోష భావన తల్లిని వెంటాడేది. బుధవారం రాత్రి కొడుకుల్ని బతికించుకోలేని నేనెందుకు బతకాలని కుమిలిపోయిన తండ్రిని భార్య, కుమారులు ఓదార్చారు. అందరూ భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి మెలకువ వచ్చిన తండ్రికి భార్య, ముగ్గురు పిల్లలు కన్పించలేదు. ఊరంతా గాలించాడు. ఫలితం లేదు.ఉదయాన్నే ఉప్పుటేరులో నాలుగు శవాలు తేలాయని తెలిసింది. అవి తన భార్య, పిల్లల శవాలేనని తెలిసిన తండ్రి గుండెలవిశేలా రోదిస్తూ కుప్పకూలిపోయాడు. ముగ్గురు కొడుకులతో పాటు తల్లి ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక సంఘటనతో ఊరు ఊరంతా విషాదంలో మునిగిపోయింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం అమరవిల్లి గ్రామానికి చెందిన రాగాల రాము, భూలక్ష్మి (45) దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె. ఆ కుటుంబానికి రెండెకరాల పొలం ఉంది. కుమార్తెకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. కొడుకులు ప్రభుప్రకాష్ (22), అనిల్ కుమార్ (20), ప్రేమసాగర్ (18) ముగ్గురూ కొంతవరకు చదువుకున్నారు. నాలుగేళ్ల క్రితం ప్రేమసాగర్ అస్వస్థతకు గురికావడంతో కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. అతనికి కిడ్నీలు పాడయ్యాయని, మార్పిడి చేయూలని వైద్యులు చెప్పారు. కొడుకుకు కిడ్నీ ఇవ్వడానికి రాము సిద్ధమయ్యూడు. కొన్నాళ్ల క్రితం ప్రభుప్రకాష్, అనిల్‌కుమార్‌లు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరీక్షలు చేసిన వైద్యులు వారికీ కిడ్నీలు పాడయ్యాయని, మార్పిడి చేయించక తప్పదని చెప్పారు. దాంతో ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఆరోగ్యశ్రీలో డయూలసిస్కు తప్ప కిడ్నీల మార్పిడికి అవకాశం లేదు. ఉన్న ఆస్తిని తెగనమ్మి తండ్రి ఒకరికి, తల్లి ఒకరికి కిడ్నీలిచ్చి మార్పిడి చేరుుంచాలనుకున్నా ఎవరికి మార్పిడి చేయిం చాలి, ఎవరిని వదిలేయాలో తెలీని దుస్థితి వారిని తీవ్ర మనోవ్యథకు గురిచేసింది. తండ్రిని ఓదార్చి తాము తనువు చాలించారు ముగ్గురికీ డయూలసిస్ చేయిస్తున్నా పరిస్థితి క్రమేణా క్షీణించసాగింది. బుధవారం రాత్రి ఆవేదనతో విలపిస్తున్న రామును ఓదార్చిన భార్య, కుమారులు.. తాము మాత్రం కఠిన నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయం ఉప్పుటేరులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు నాలుగు శవాలు కన్పించాయి. స్థానికులు అవి భూలక్ష్మి, ఆమె ముగ్గురు కొడుకులవిగా గుర్తించారు. సంఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బా దొరకడం, నలుగురి మృతదేహాలూ తాడుతో కట్టి ఉండడంతో తల్లీకొడుకులు తొలుత పురుగుల మందు తాగి, తర్వాత తాడుతో కట్టుకుని ఉప్పుటేరులో దూకి ఉంటారని భావిస్తున్నారు. కాకినాడ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, ఆర్డీఓ డేవిడ్‌రాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేను అడ్రినల్ గ్రంథిని!
నా ప్రతి గ్రాములోనూ ఒక డైనమైట్ అంతటి శక్తి ఉంది. నేను కావాలనుకుంటే నా యజమానిని పిచ్చాసుపత్రికి పంపించే శక్తి ఉంది. కానీ అలా పంపించకూడని వివేచన కూడా ఉంది. అసలు నేనున్నాననే ఉనికి కూడా తెలియకుండా పనిచేస్తుంటాను. నేను ఆనంద్ అడ్రినల్ గ్రంథిని. అతడి కుడి మూత్రపిండం మీద నేనూ, మరో కిడ్నీ మీద నా సహచరుడు ఇద్దరం నిశ్శబ్దంగా రాజ్యమేలుతుంటాం. నా సైజు వేలికొన కంటే తక్కువ. నా బరువు ఒక నాణెం కంటే తక్కువ. కానీ దాదాపు 50 కి పైగా హార్మోన్లు, హార్మోన్ల లాంటి స్రావాలను తయారు చేస్తుంటాను. 28 గ్రాములను వెయ్యి భాగాలు చేస్తే అందులో ఒక వంతు ఎంత ఉంటుందో నేను స్రవించే స్రావాలూ అంతే ఉంటాయి. నా స్రావాలు చాలా తక్కువ... కానీ ఆనంద్ రోజులో చేసే చాలా పనులకు అవసరమైన హార్మోన్లు నాలోంచి విడుదల అవుతుంటాయి. నిర్మాణపరంగా నేనొక అద్భుతాన్ని... ఎందుకంటే ప్రతి నిమిషానికీ... నా బరువుకంటే ఆరురెట్లుకు మించి నాలో రక్తం ప్రవహించేలా నా నిర్మాణం ఉంటుంది. అంత ఎక్కువగా నాలో రక్తప్రవాహం కొనసాగుతుంటుంది. అంత పెద్దమొత్తంలో రక్తం ప్రవహించేందుకు వీలుగా, అతి సంక్లిష్టంగా నాలో రక్తనాళాలు అల్లుకుపోయి ఉంటాయి. ఆనంద్ దేహం పనిచేయడానికి, అతడి అవసరాలు తీరడానికి నాలో పదోవంతు చాలు. కానీ ఎంతో రిజర్వ్ ఉండేలా ప్రకృతి నన్ను నిర్మించింది. అలాగని ఏ కారణం వల్లనో లేదా ఏ శస్త్రచికిత్స వల్లనో నేను పదోవంతుకు తగ్గిపోతే ఆనంద్ చనిపోతాడు. అంతర్భాగం నుంచి ఒకటీ... బయటిపొర నుంచి మరొకటి నాలో కొన్ని రకాల హార్మోన్లు విడుదల అవుతాయి. కొన్ని నాలోని అంతర్భాగం నుంచి. మరికొన్ని నాలోని బయటి పొర నుంచి. నాలోని అంతర్భాగం నుంచి స్రవించాల్సిన స్రావం కోసం మెదడు నుంచి నేరుగా సంకేతాలు అందుతాయి. ఆనంద్కి ఏదైనా ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు, తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే సమయంలో, క్లిష్టమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, కోపం; ఆవేశం వచ్చే సందర్భాల్లో ఇవి విడుదల అవుతాయి. అప్పుడు అతడు తీవ్రమైన ఉద్విగ్నతకు లోనవుతాడు. తీవ్రమైన భావోద్వేగానికీ, ఒత్తిడికీ గురవుతాడు. వీలైతే పోరాటానికి లేదా తప్పించుకోడానికి సిద్ధపడేలా ఉద్విగ్నుడవుతాడు. ఫైట్ లేదా ఫ్లైట్ ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసేంతగా అతడి శరీరం ఉద్రేకపూరితమవుతుంది. నా అంతర్భాగం నుంచి వచ్చే కార్టిసాల్స్, అడ్రినలీన్, నార్-అడ్రినలిన్ అనే హార్మోన్లు అతడి రక్తప్రవాహంలోకి స్రవించడమే ఇందుకు కారణం. ఈ చర్యకు ప్రతిస్పందనగా అతడి కాలేయం రెడీ అవుతుంది. పోరాటానికో లేదా తప్పించుకుపోవడానికో అవసరమైన శక్తి అందించడానికి కాలేయం నుంచి చక్కెర స్రవిస్తుంది. ఆలా స్రవించిన చక్కెర వల్ల శరీరంలో శక్తి వెల్లువెత్తుంది. క్రమంగా నార్మల్స్థితి కోసం... అయితే అదే ఉద్విగ్న పరిస్థితి అదేపనిగా కొనసాగదు. ఇదే జరిగితే ఆనంద్ తన మృత్యువు వైపునకు పరుగుపెడతాడు. నాలోని అడ్రినల్ స్రావాలను ప్రేరేపించిన అంశమే అతడి మెదడులోని హైపోథలామస్నూ ప్రేరేపిస్తుంది. దాని నుంచి పిట్యుటరీ గ్రంథికీ, అక్కడి నుంచి మళ్లీ నాకు ఒక సందేశం అందుతుంది. పరిస్థితిని తన నియంత్రణలోకి తెచ్చుకొని క్రమంగా పరిస్థితులు మామూలు స్థితికి వచ్చేలా చేస్తాయి కొన్ని హార్మోన్లు. సక్రమమైన పనికి సమతౌల్యమే ప్రధానం నాలోని స్రావాలన్నీ అత్యంత సమతౌల్యంతో జరగాల్సిన అవసరం ఉంది. అలా సమతౌల్యంతో జరగకపోతే అది చాలా ప్రమాదం. నా అంతర్భాగం గాయపడి, అక్కడ ఉద్భవించాల్సిన హార్మోన్లు ప్రవించకపోతే ఆనంద్‌కు దాదాపు డజన్ వ్యాధులు ఒకేసారి వచ్చేస్తాయి. అతడిలో చర్మం నల్లబడుతుంది. కండరాలు చచ్చుబడిపోతుంటాయి. ఆకలి మందగిస్తుంది. వికారంగా ఉంటుంది. వాంతులూ అవుతాయి. నీళ్ల విరేచనాలు వస్తాయి. క్రమంగా ఆనంద్ నీరసించిపోయి మృత్యువాతపడతాడు. అయితే అదృష్టవశాత్తు ప్రస్తుతం అతడి పరిస్థితికేమీ ఢోకా లేదు. అతడిలోని అంతర్భాగం నశించిపోయినప్పుడూ... ఆ టైమ్‌లో బయటి నుంచి కూడా అవసరమైన హార్లోన్లు అందనప్పుడు మాత్రమే ఈ పరిస్థితి వస్తుంది. నాలోంచి అవసరమైన స్రావాలు తగ్గినప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో... నాలోంచి పరిమితికి మించి హార్మోన్ స్రవించినా ఆనంద్‌కు అంతే హాని కలుగుతుంది. ఉదాహరణకు నాలోని అంతర్భాగం నుంచి స్రవించే కార్టిసాల్ అనే హార్మోన్ సూదిమొనంతటి పరిమాణంలో ఎక్కువైనా దేహంలో చక్కెర పాళ్లు ఎక్కువగా పెరిగిపోతాయి. ఆ పరిస్థితి ఆనంద్ కండరాలు చచ్చుబడిపోయేలా కూడా చేయవచ్చు. రక్తపోటు పెరుగుతుంది. శరీరంలోని కండరాలు నీరసించి పోతాయి. ఎముకల శక్తి సన్నగిల్లుతుంది. అదే అల్డోస్టెరాన్ అనే మరో హార్మోన్ ఎక్కువైతే ఒంట్లోంచి పొటాషియమ్ ఎక్కువగా బయటకు పోయి... సోడియమ్ (ఉప్పు) దేహంలో ఎక్కువగా మిగిలిపోతుంది. దాని వల్ల రక్తపోటు (బీపీ) పెరగడం జరుగుతుంది. ఎన్ని మందులు వాడినా ఆ రక్తపోటు తగ్గదు. అలాగే నార్-ఎడ్రినలీన్, ఎడ్రినల్ హార్మోన్లు ఎక్కువైతే తీవ్రమైన రక్తపోటు, తలనొప్పి, రక్తపోటు వల్ల మెదడులో, పొట్టలో రక్తస్రావం జరగవచ్చు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తపోటు తీవ్రంగా పెరుగుతుంది. అతడి చేతులు, వేళ్లు వణుకుతాయి. వేలిచివర్లు మొద్దుబారిపోతాయి. తలనొప్పి వదలకుండా వస్తుంది. సాధారణంగా దేహంలో ట్యూమర్లు పెరిగినప్పుడు కూడా ఈ స్థితి వస్తుంది. అలాంటి స్థితి రాకుండా ఆనంద్ చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఏ విషయానికీ ఎక్కువగా దుఃఖించకూడదు. ఎవరిపట్లా తీవ్రమైన ద్వేషం కూడదు. ఎవరినీ అసహ్యించుకోవడం సరికాదు. మరీ పట్టరానంత అంటేంత కోపం వద్దు. మరీ స్థితప్రజ్ఞతతో కాకపోయినా కాస్త స్థిమితంగా ఉండాలి. యాభై ఫ్యాక్టరీలకు సరిసమానం చాలా కాలం క్రితం వరకూ నేనొక రహస్యాన్ని. నా గురించి పెద్దగా లోకానికి తెలియదు. అప్పటికి వాళ్లకు తెలిసన విషయం ఒక్కటే. నేను చాలా కీలకమైన గ్రంథిని. నన్నూ, నా పార్ట్నర్ను తొలగిస్తే రోజుల వ్యవధిలోనే ఆనంద్ చనిపోతాడు. నేను ఉత్పత్తి చేసే హార్మోన్లను బయటి నుంచి ఇస్తుంటే కొంతకాలం మాత్రం బతుకుతాడేమో! అదీ చాలా నీరసంగా... నిస్సత్తువగా. ఆ తర్వాత మెల్లగా నా గుట్టు మట్లు తెలుసుకోవడం ప్రారంభించారు. నా సైజ్‌కు నేను ఉత్పత్తి చేసే దాదాపు 50కి పైగా హార్మోన్లు స్రవించాలంటే అన్నే సంఖ్యలో కెమికల్ ఫ్యాక్టరీలు పెట్టాలి. వాళ్లకు నా గురించి తెలిశాక వాళ్లు గ్రహించిన విషయం ఏమిటంటే... నేను ఉత్పత్తి చేసే కార్టికో స్టెరాయిడ్ లాంటి స్రావాన్నే దాదాపు 100 కు పైగా వ్యాధుల్లో మందుగా ఇస్తారు. గౌట్ నుంచి మొదలుకొని ఆస్తమా వరకు అనేక వ్యాధులకు అదే మందు. మరీ ముఖ్యమైన మూడు అంశాలు నా బయటి పొర నుంచి స్రవించే హార్మోన్లను మూడు విభాగాలుగా చేయవచ్చు. మొదటి విభాగానికి చెందిన హార్మోన్లు కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లకు సంబంధించిన జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయి. రెండోవి ఆనంద్ దేహంలోని నీటి పాళ్లు, మినరల్స్ సమతౌల్యంగా ఉండేందుకు దోహదపడతాయి. ఇక మూడో విభాగానికి చెందినవి కీలకమైన సెక్స్ సంబంధించిన కార్యకలాపాలు కొనసాగేలా చూస్తాయి. ఇవన్నీ నిల్వ ఉంచేందుకు వీలుగాని హార్మోన్లు. అలా నిరంతరం పనిచేస్తుంటాయి. అంటే రెండు గంటల క్రితం నాలోంచి వెలువడ్డ స్రావాలు తొలగిపోయి ఇప్పటికప్పుడు తాజా (ఫ్రెష్) స్రావాలు వచ్చి చేరుతుంటాయి. డాక్టర్ శ్రీదేవి కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్ -
నేను.. మీ పాంక్రియాస్‌ని!
నేను గ్రే అండ్ పింక్ కలర్లో ఉంటాను. అచ్చం నోటి నుంచి బయటకు చాపిన నాలుక ఆకృతిలో సుమారు 15 సెంటీమీటర్ల పొడవుంటాను. దాదాపు 85 గ్రాముల బరువుంటాను. నేను కడుపులో ఉంటాను. వెన్నెముకకు కాస్త లోపల కాలేయం, కిడ్నీలు, పెద్ద పేగుకు దగ్గర్లో ఉంటాను. ఆనంద్ తిన్న గుట్టల కొద్దీ ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో నేనూ పాలుపంచుకుంటూ ఉంటాను. నేను ఆనంద్ క్లోమ గ్రంథి (ప్యాక్రియాస్)ని. నేను చాలా బిజీగా పనిచేస్తుంటాను. నా నుంచి స్రవించే హార్మోన్లు లేకపోతే ఆనంద్ తిన్నది జీర్ణం కాదు. ఆనంద్ ఎప్పుడూ ఆహారం అందని వ్యక్తిలా ఎండిపోయినట్లుగా అవుతాడు. ఆనంద్ కనురెప్ప కొట్టినప్పుడల్లా, ఆనంద్ గుండె కొట్టుకున్నప్పుడల్లా... ఆ కణాల మాదిరిగానే అతడిలోని కణాలన్నింటికీ శక్తి కావాలి. ఆ శక్తిని సరఫరా చేయడంలో నేను తోడ్పడుతుంటాను. ఇదే కాదు, మరో కీలకమైన పని కూడా చేస్తుంటాను. నిజానికి నేను ఒకే ఒక గ్రంథిని కాదు. ఒకే ప్యాకింగ్‌లో లభ్యమయ్యే రెండు గ్రంథులం మేము. రెండు స్రావాలను ఆనంద్ రక్తంలోకి పంపుతూ ఉంటాం. నాలోని ఒక స్రావం ఆనంద్‌లోని ఆహారం నుంచి శక్తిని పుట్టించేందుకు దోహదం చేస్తుంటుంది. ఇక మరో స్రావం అయిన ఇన్సులిన్ శక్తి అందే పని పూర్తయ్యాక ఆ ప్రక్రియను అడ్డగిస్తుంది. ఇలా అనుక్షణం ఆనంద్ రక్తంలోని గ్లూకోజ్ పరిమాణాన్ని ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి నేను ప్రయత్నిస్తుంటాను. ఇదే జరగకపోతే ఇప్పుడు చాలామందిలో వచ్చే డయాబెటిస్ సమస్య ఆనంద్‌కు వస్తుంది. జీర్ణ ప్రక్రియ కోసం నా పని... ఆహారం జీర్ణం చేసే ప్రక్రియలో భాగంగా నేను దగ్గరదగ్గర రోజుకు ఒక లీటరుకు పైగా జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తుంటాను. విచిత్రం చూడండి... నా బరువు 85 గ్రాములే గానీ... నా నుంచి రోజూ లీటరుకు పైగానే స్రావాలు వస్తుంటాయన్నమాట. అన్నవాహిక లోంచి కిందికి పోయే క్రమంలో ఆహారం మెత్తగా దాదాపు ద్రవరూపంలో ఉండే ప్రవాహంలా ఉండి, అసిడిక్‌గా ఉంటుంది. మీరు ‘అసిడిటీ, అసిడిటీ’ అంటూ పొట్టలో ఊరే యాసిడ్‌ను నిందిస్తుంటారుగానీ... ఆహారం... అందునా ప్రత్యేకంగా ప్రొటీన్లు జీర్ణం కావాలంటే ఆ యాసిడ్ ఊరక తప్పదు. అదే యాసిడ్ ప్రవాహం పేగుల్లోకి వెళ్తే అది వాటిని కాల్చేస్తుంది. అందుకే ఇక్కడ తప్పకుండా దాన్ని తటస్థం (న్యూట్రలైజ్) చేసే క్షారం (ఆల్కలైన్) ఊరాల్సిందే. ఆనంద్ భోజనానికి కూర్చోగానీ అతడి నరాల నుంచి నాలోని (ప్యాంక్రియాస్‌లోని) చిన్న చిన్న సంచుల్లాంటి తిత్తులకు క్షారాన్ని ఉత్పత్తి చేయమంటూ సిగ్నల్స్ అందుతాయి. అలా సిగ్నల్స్ అందే గుచ్ఛాలంటి ఆ కణాలను ‘అసిని’ అంటారు. అప్పుడు నేను ఆ కణాల ద్వారా క్షారంతో కూడిన స్రావాలను పేగుల్లోకి పంపుతాను. అయితే ప్రవహించేంత మెత్తగా అయిన జీర్ణాహారం‘కైమ్’ వచ్చాక... కడుపులోంచి పేగుల ‘గేట్‌వే’ అయిన డియోడినమ్లోకి నేను నా స్రావాలను పంపకాన్ని వేగం చేస్తా. చిన్న పేగుల ప్రారంభంలో ఈ డియోడినమ్ 25 సెం.మీ. ఉంటుంది. ఈ డియోడినమ్‌లో ప్రవహించే ఒక రకం స్రావం రక్తంలో కలిసి మెదడుకు సిగ్నల్స్ పంపింపి, నాలోని ఆల్కలైనర్ (క్షారం) టాప్‌గేర్‌లో ప్రవహించేలా చేస్తుంది. నేనిలా కడుపులో యాసిడ్‌తో ముక్కలైన ఆహారంలోకి క్షారాన్ని ప్రవహింపజేసి, దాన్ని న్యూట్రలైజ్ చేయడం అన్నది పెద్ద ప్రధానమైన సంగతి కాదు. ఇంకా ఇంతకంటే అద్భుతాలు చేస్తా. మూడు అద్భుతమైన ఎంజైములను నేను ప్రవహించేలా చేస్తాను. అందులో ట్రిప్సిన్ అనేది ప్రోటీన్లను అమైనో యాసిడ్స్‌గా మార్చుతుంది. వీటినే రక్తప్రవాహం అందుకొని ఆనంద్ కండరాలు బాగా పెరిగేలా చేస్తుంది. అమలైజ్ అనే మరో ఎంజైమ్ సహాయంతో పిండి పదార్థాలను చక్కెరగా మారుస్తా. ఇక మూడోదైన లైపేజ్తో కొవ్వులను ఫ్యాటీ యాసిడ్స్‌గా మార్చేస్తా. ఈ మొత్తం ప్రక్రియలకు అవసరమైన మొత్తం స్రావాలను స్రవించడానికి నాలోని సగం ‘అసినీ’ కణాలు చాలు. ఒకవేళ నేను పూర్తిగా నాశనం అయిపోయినా... అతడి లాలాజలం, అతడి పేగులు మాత్రమే స్రవించే జీర్ణరసాలు చాలు... ఆనంద్ బతికి బట్టకట్టడానికి. అంత అద్భుతంగా ఆనంద్ మనగడ కోసం ఏర్పాటు చేసింది ప్రకృతి. ఐలెట్స్ అనే కణాలన్నీ అనునిత్యం మండే ఫర్నెస్‌లు నాలో చెదిరిపోయినట్లుగా కనిపించే కనీసం పదిలక్షలకు పైగా ఐలెట్స్ అనే ప్రధానమైన కణాలు ఉన్నాయి. ఆ ఒక్కొక్క కణం... ఒక్కో కెమికల్ ఫ్యాక్టరీ లాంటిది. మీకు వినడానికి 10 లక్షల కణాలు అనే సంఖ్య పెద్దగా అనిపిస్తున్నా... నా 85 గ్రాముల బరువులో వాటి వాటా కేవలం 15 శాతం మాత్రమే. అవన్నీ ఒక్కొక్కటీ ఒక్కో బట్టీలా (ఫర్నెస్లా) మండుతూ ఉంటాయి. ఆ బట్టీలో ఆనంద్‌లోని గ్లూకోజ్‌ను నిత్యం మండిస్తూ శక్తిని ఉత్పత్తి చేస్తుంటాయి. అవన్నీ అలా నిత్యం మండుతూ గ్లూకోజ్‌ను మండిస్తూ... ఆనంద్ రక్తప్రవాహంలోని గ్లూకోజ్ ఎప్పుడూ 4.4 గ్రాములకు మించి ఉండకుండా చూస్తుంటాయి. ఒకవేళ నాలోని ‘ఐలెట్’ కణాలు అకస్మాత్తుగా మెరుపుసమ్మె చేశాయనుకోండి. అప్పుడు ఆనంద్లోకి గ్లూకోజ్‌కు బదులు మిగతా కణాలు ఈ మంటలు కొనసాగేలా చూడటం కోసం వేరే ఇంధనాలను మండిస్తుంటాయి. దాంతో ఆనంద్‌లోని కొవ్వులు మండిపోతాయి. అతడిలోని ప్రోటీన్లు కండరాలకు అందకుండానే భస్మం అయిపోతాయి. దాంతో ఆనంద్ ఒక బతికి ఉన్న శవంలా మిగిలిపోతాడు. ఎప్పుడూ ఆకలీ... దాహం అంటూ అల్లాడతాడు. చక్కెర మండదు. దాంతో మూత్రంలో చక్కెర పోతుంటుంది. ఒక్కోసారి అలా బయటకు పోయే చక్కెర నాలుగు కిలోల వరకు ఉంటుంది. అలాంటి కండిషన్‌నే డయాబెటిస్ అంటారు. అది రాకుండా పాంక్రియాస్నైన నేను కాపాడుతుంటాను. కప్బోర్డ్ లాంటి కాలేయం నాలోని ఇన్సులిన్ అనేది ఆనంద్ కాలేయాన్ని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంటుంది. నిజానికి ఆనంద్ కాలేయం ఒక కప్బోర్డులాంటిది. ఆనంద్‌కు అవసరమైన శక్తి ఉత్పత్తి అయ్యాక మిగతా గ్లూకోజ్‌ను అతడు కాలేయం అనే కప్‌బోర్డులో దాచేస్తాడు. ఈ గ్లూకోజ్‌ను గ్లైకోజెన్ అనే పదార్థంగా మార్చి కాలేయం తనలో దాచేసుకుంటుంది. మళ్లీ ఆనంద్‌కు ఎప్పుడైనా శక్తి అవసరమైనప్పుడు ఆ గ్లైకోజెన్‌ను బయటకు తీసి మళ్లీ గ్లూకోజ్‌గా మార్చుకొని వాడుకుంటూ ఉంటాడు. ఈ ప్రక్రియ నా సహాయంతో జరుగుతుంది. ఇది సరిగా జరగకపోతే... అప్పుడు ఆనంద్‌కు డయాబెటిస్ వచ్చిందని చెప్పవచ్చు. నా వల్ల వచ్చే జబ్బు డయాబెటిసే అయినా దాన్ని కనుగొనడానికి ఫిజీషియన్లు కనుబొమలు ముడిపడేసేటంతగా ఇతర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఒకవేళ నన్ను సరిచేయడానికి సర్జన్ నన్ను చేరదామన్నా... అతడికి అందనంత లోతుగా ఉంటాన్నేను. ఇతర అవయవాలు కొన్నింటిని కోయకుండా సర్జన్ నన్ను చేరడం అసాధ్యం అన్నంత సంక్లిష్టమైన లోతుల్లో ఉంటాన్నేను. ఒకప్పుడు నన్ను తొలగించడం అంటే... అది మృత్యువుకు చేరువకావడమే. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఒకవేళ నేను సరిగా పనిచేయకపోతే ఇన్సులిన్ బయట నుంచి ఇచ్చి ఆనంద్ ప్రాణాలను పదిలంగా కాపాడవచ్చు. నాకు ఏదైనా సమస్య వస్తే కడుపు పైభాగంలో నొప్పి వస్తుంది. పొట్ట పైభాగంలో పుట్టిన ఇది వీపు వైపు వెళ్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. నా ఒక్క సమస్యలోనే కాదు... ఆనంద్‌కు అల్సర్, హార్ట్ ఎటాక్, గాల్‌బ్లాడర్ సమస్యలు, పేగుల్లో ఏదైనా అడ్డుపడటం (ఇంటస్టినల్ అబ్స్ట్రక్షన్)... ఇలా ఏం జరిగినా ఆనంద్ ఇవే లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఫిజీషియన్కు అది ఏ సమస్య అన్నది నిర్ధారణ చేయడానికి పైన చెప్పినట్లు కనుబొమలు ముడిపడతాయి. ఇక ఆ లక్షణాలతో పాటు నీళ్లవిరేచనాలు, బరువు తగ్గిపోవడం, అలసట, తీవ్రమైన నిస్సత్తువ, కామెర్లు వంటి లక్షణాలూ కనిపిస్తుంటాయి. మరికొన్ని సమస్యలివే... నాకు వచ్చే మరో సాధారణ సమస్య ‘అక్యూట్ పాంక్రియాటైటిస్’. పాంక్రియాస్‌కు వచ్చే ఇన్ఫెక్షన్ పేరే పాంక్రియాటైటిస్. నా పక్క అవయవానికి శస్త్రచికిత్స చేసే సమయంలో నాకు చిన్న దెబ్బతగిలినా, చీరుకుపోయినా లేదా నాకు ఎవైనా పుండ్లు పడినా, నాలో ఇన్ఫ్లమేషన్ వచ్చినా. ఆనంద్ అదేపనిగా ఆల్కహాల్ తాగుతూ ఉన్నా నాకు ‘అక్యూట్ పాంక్రియాటైటిస్’ రావచ్చు. అన్నట్టు కాలేయంతో పాటు గాల్ బ్లాడర్ నుంచీ, నా నుంచి స్రావాలు చిన్న పేగుల్లోని భాగమైన డియోడినమ్లోకి వెళ్లడానికి ఒకే గొట్టం ఉంటుంది. ఈ పైప్ సరిగా పనిచేయక ప్లంబింగ్ సమస్య వచ్చిందనుకోండి. గాల్‌బ్లాడర్ నుంచి ముందుకు వెళ్లాల్సిన స్రావాలు వెనక్కు తన్నాయనుకోండి . అలా జరిగితే ఆ స్రావాలు నన్ను దెబ్బతీస్తాయి. ఒక్కోసారి ఆ పరిస్థితి నన్ను పూర్తిగా నాశనం చేయవచ్చు. ఒక్కోసారి గాల్‌స్టోన్ ఏర్పడి నేను స్రవించిన స్రావాలకు అడ్డుపవచ్చు. అలా జరిగితే నేను స్రవించే జీర్ణస్రావాలు వెనకకు వచ్చి నన్నే జీర్ణం చేసేయవచ్చు. ఇదే జరిగితే అనంద్‌కు అది సాధారణంగా అందరూ ఊహించేదానికంటే పెద్ద మెడికల్ ఎమర్జెన్సీ అవుతుంది. క్యాన్సర్లలో అతి చెడ్డదైన రకాలలో ఒకటైన అడినోమా అనేది ఒక రకం క్యాన్సర్ ట్యూమర్. ఇది ఉంటే నాలోని ఇన్సులిన్ స్రావాలు ఎక్కువగా స్రవిస్తుండవచ్చు. ఇలా జరిగిందంటే ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. ఇప్పటివరకూ నేను ఎలాంటి ఇబ్బందీ తెచ్చిపెట్టకుండా ఆనంద్‌లో పనిచేశా. కాకపోతే ఇంతకుముందులా కాకుండా ఈమధ్య వయసుకు తగినట్లుగా ఆనంద్ కాస్త ఎక్కువ తింటే కడుపు ఉబ్బరం వంటివి వస్తున్నాయనుకోండి. అయితే ఇంతకు ముందులాగే ఆనంద్ అదేపనిగా ప్లేట్లు ప్లేట్లు లాగించడం, అదే పనిగా మద్యం గ్లాసులు గ్లాసులు తాగడం చేశాడనుకోండి. నేను ఇంతకు ముందులాగే చూసిచూడనట్టుగా పోయే రకాన్ని కాదు. గ్లూకోజ్‌ను గ్లైకోజెన్ అనే పదార్థంగా మార్చి కాలేయం తనలో దాచేసుకుంటుంది. ఎప్పుడైనా శక్తి అవసరమైనప్పుడు ఆ గ్లైకోజెన్‌ను బయటకు తీసి మళ్లీ గ్లూకోజ్‌గా మార్చుకొని శరీరం వాడుకుంటూ ఉంటుంది.. ఈ ప్రక్రియ ప్యాంక్రియాస్ సహాయంతో జరుగుతుంది. ఇది సరిగా జరగకపోతే... డయాబెటిస్ వచ్చిందని చెప్పవచ్చు. నేను సరిగా పనిచేయకపోతే డయాబెటిస్ తప్పదు... నేను జీర్ణప్రక్రియలో పనిచేయడం కంటే ఇన్సులిన్ స్రవించడం అన్నది నేను నిర్వహించే విధుల్లోకెల్లా ప్రత్యేకమైనది. ఒకవేళ నేను ఈ పనిని సక్రమంగా చేయలేకపోతే ఈ ప్రపంచంలోని అనేక మందిలా ఆనంద్ డయాబెటిస్ పాలవుతాడు. డా॥డి.నాగేశ్వర్‌రెడ్డి ఛైర్మన్ అండ్ చీఫ్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, హైదరాబాద్ -
ఫంగల్ బాల్ అంటే ఏమిటి?
పల్మునాలజీ కౌన్సెలింగ్ కొన్నేళ్ల క్రితం నాకు టీబీ వచ్చింది. అయితే కొద్దిరోజులుగా నేను తీవ్రంగా దగ్గుతున్నాను. దగ్గుతో పాటు రక్తం పడుతోంది. డాక్టర్‌కు చూపించుకుంటే కొన్ని పరీక్షలు చేసి నా ఊపిరితిత్తుల్లో ‘ఫంగల్ బాల్’ ఉందని చెప్పారు. ఆందోళనగా ఉంది. అంటే ఏమిటి? - సురేశ్, కాకినాడ ఫంగల్ బాల్ అనే సమస్య ఊపిరితిత్తులోనే గాక మెదడు, కిడ్నీ, ఇంకా ఇతర ఏదైనా అవయవంలో ఏర్పడవచ్చు. మీ విషయంలో ఊపిరితిత్తులలోని ఖాళీ ప్రదేశంలో (లంగ్ క్యావిటీలో) యాస్పర్జిల్లస్ అనే ఫంగస్ ఒక ఉండలా ఏర్పడటం వల్ల ఈ సమస్య వచ్చింది. సాధారణంగా యాస్పర్జిల్లస్ ఫ్యూమిగేటస్ అనే రకానికి చెందిన ఫంగస్ మానవుల్లో పెరుగుతుంది. మానవుల్లోని వ్యాధి నిరోధకత కేవలం కణజాలానికే పరిమితం. లంగ్‌లో ఉండే ఖాళీ ప్రదేశాలలోకి (క్యావిటీస్లోకి) చొచ్చుకుపోలేకపోవడం వల్ల ఆ ప్రదేశాల్లో పెరిగే ఫంగస్‌ను మన ఇమ్యూనిటీ నిరోధించలేదు. దాంతో అక్కడ ఆ ఫంగస్ ప్రత్యుత్పత్తి జరుపుతూ, విపరీతంగా పెరుగుతూ ఒక ఉండలాగా ఏర్పడుతుంది. ఫలితంగా అక్కడి పరిసరాల్లోని కణజాలం మృతిచెందుతుండటం, మ్యూకస్ విపరీతంగా స్రవిస్తూ ఉండటం, ఇతరత్రా అంశాలు కూడా తోడవడంతో ఈ ఉండ మరింతగా పెరుగుతుంటుంది. సాధారణంగా యాస్పర్జిల్లస్ అనే ఈ ఫంగస్ మొదట్లో ఆకులు, నిల్వ ఉంచిన ధాన్యం, పక్షి రెట్టలు, కుళ్లుతున్న చెట్ల భాగాలలో పెరుగుతుంటుంది. మనం పీల్చినప్పుడు శ్వాస ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి చేరుతుంటుంది. మిగతా ఆరోగ్యవంతులతో పోలిస్తే టీబీ, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఊపిరితిత్తుల్లో యాబ్సెస్, ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారిలో ఈ ఫంగల్ బాల్ మరింత తేలిగ్గా పెరుగుతుంది. లక్షణాలు: కొంతమంది రోగుల్లో ఈ ఫంగల్బాల్ ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు బయటకు కనాపించకపోవచ్చు. మరికొందరిలో మాత్రం ఛాతీనొప్పి, దగ్గు, దగ్గినప్పుడు రక్తం పడటం జరుగుతుంది. ఈ ఫంగస్ ఉండ రక్తనాళాలపై దాడి చేసినప్పుడు ఇలా రక్తం పడవచ్చు. కొందరిలో తీవ్రమైన నిస్సత్తువ, జ్వరం, బరువు తగ్గడం కనిపించవచ్చు. నిర్ధారణ పరీక్షలు: ఊపిరితిత్తుల నుంచి చిన్న ముక్క తీసి బయాప్సీ పరీక్షకు పంపడం, యాస్పిర్జిల్లస్ నిర్ధారణకు చేసే రక్తపరీక్ష, బ్రాంకోస్కోపీ, ఛాతీ ఎక్స్-రే, సీటీ స్కాన్, కళ్లె పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. చికిత్స: ఎలాంటి లక్షణాలు లేకపోతే చికిత్స అవసరం లేదు. కానీ దగ్గు, రక్తం పడటం జరిగినప్పుడు రక్తస్రావం జరుగుతున్న ప్రదేశాన్ని గుర్తించడానికి అవసరమైన యాంజియోగ్రఫీ పరీక్ష చేసి, ఎంబోలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా అక్కడ రక్తస్రావాన్ని నివారిస్తారు. రోగికి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటే మాత్రం ఇక శస్త్రచికిత్స జరిపి, రక్తస్రావాన్ని ఆపాల్సి ఉంటుంది. డా. రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఆయుర్వేద కౌన్సెలింగ్ గుండెకు సంబంధించిన సమస్యలకు స్టెంట్స్ వేయడం, గుండె రక్తనాళాలకు సంబంధించిన పెద్దాపరేషన్లు చేస్తుంటారు కదా. మరి ఆయుర్వేదంలో ఆ సమస్యలకు నివారణ మార్గాలు, చికిత్స, ఔషధాలు ఉన్నాయా? దయచేసి తెలియజేయండి. - వి. పట్టాభిరామ్, విజయనగరం గుండె ఒక రకమైన ప్రత్యేక కండరం. జీవితాంతం లయబద్ధంగా స్పందించే ప్రకృతి నిర్మిత యంత్రం. దీని సామర్థ్యం జీవితాంతం సాగిపోవాలంటే ఐదు అంశాలు అత్యంత ప్రధానమైనవి. 1. దీని నిర్మాణంలో పుట్టుకతో వచ్చే లోపాలు ఉండకూడదు. 2. దీనికి లభించే ప్రత్యేకమైన విద్యుత్ సరఫరాలో తేడాలు రాకూడదు. 3. ఈ కండరానికి ‘కొరనరీ ధమనుల’ ద్వారా రక్తప్రసరణ జరుగుతుంది. ఈ రక్తప్రసరణలో అవరోధాలు ఏర్పడకూడదు. 4. కొన్ని సూక్ష్మక్రిములు గుండె పొరలను, కవాటాలను పాడు చేస్తాయి. సాధారణ వైద్య పరిభాషలో వాటిని ఇన్ఫెక్షన్లు అంటారు. అవి సంభవించకుండా జాగ్రత్త తీసుకోవాలి. 5. మానసిక ఒత్తిడి లేకుండా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. హార్ట్ ఎటాక్‌లో గుండెకు జరిగే రక్తప్రసరణలో అంతరాయం కలుగుతుంది. క్రమబద్ధంగా గుండె స్పందనలు ప్రకృతిపరంగా నిరంతరం సాగే నిరంతర ప్రక్రియ. గుండె సంకోచించినప్పుడు ఆయా ధమనుల ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తం సరఫరా అవుతుంది. అలాగే గుండెకు కూడా కొరనరీ ధమనుల ద్వారా రక్తం అందుతుంది. తనలోనే ఉన్న రక్తాన్ని శోషణక్రియ ద్వారా గుండె పీల్చుకోలేదు. గుండెలాంటి క్రమశిక్షణే మనిషి కూడా పాటిస్తూ, తన ఆహార విహారాల మీద నియంత్రణ కొనసాగిస్తే హార్ట్ ఎటాక్‌లు నివారితమవుతాయి. నివారణ: ఇది చిన్న వయసునుంచీ సాధన చేయాల్సిన అంశం. అలా కాకపోయినా ఏ వయసునుంచి అయినా ప్రారంభించవచ్చు. ఆహారం: తాజా పండ్లు, శాకాహారం, అవసరమైన ప్రమాణంలోనే పాలు, పెరుగు, నెయ్యి, నూనెలు తీసుకోవడం, పీచుపదార్థాలు తీసుకోడానికి, తగినంత నీరు తాగడానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్త తీసుకోవడం, చక్కెరపదార్థాలు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని, జంక్‌ఫుడ్స్‌ను, శీతలపానీయాలను తీసుకోకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. విహారం: వయసును, వృత్తిని బట్టి ప్రతిరోజూ వ్యాయామం చేసి తీరాలి. (ఉదాహరణకు నడక, ఆటలు, యోగాసనాలు, ఇంట్లోనే అన్ని కీళ్లకూ కదలికలు కల్పించడం మొదలైనవి). ఖాళీ కడుపుతో రోజుకు రెండుపూటలా ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి. పొగతాగడం, మద్యం, గుట్కా వంటి వ్యసనాల జోలికిపోకూడదు. ఔషధాలు: అల్లం 5 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు 5, పసుపు ఐదు చిటికెలు, దాల్చిన చెక్క చూర్ణం 5 గ్రాములు కలిపి కషాయం కాచుకుని రోజూ 30 మి.గ్రా (ఆరు చెంచాలు) తాగాలి. పరగడుపున గానీ లేదా ఎప్పుడు తాగినా మంచిదే. ఎంతకాలం తాగినా పర్వాలేదు. దీనివల్ల అన్ని అవయవాలకూ రక్తప్రసరణ బాగా జరుగుతుంది. రక్తంలో కొవ్వులు ఎక్కువ కావు. మధుమేహానికీ, హైబీపీకి కూడా ఇది నివారణగా పనిచేస్తుంది. ఆహారం జీర్ణం కావడం కూడా బాగా జరుగుతుంది. మద్ది (అర్జున) చెట్టు ‘తెలుపు, నలుపు’ అని రెండు రకాలు. తెల్లమద్ది చెక్క చూర్ణం, గోధుమల చూర్ణం రెండేసి గ్రాములు కలిపి ఆవు నెయ్యి, బెల్లం కలిపి రెండుపూటలా సేవిస్తే గుండెకు మంచిది. ఆవు నెయ్యికి బదులు మేకపాలు కూడా వాడుకోవచ్చు నల్లమద్ది చెక్క కషాయాన్ని 5 చెంచాలు రోజుకొకసారి మూడు రోజులు తాగితే గుండెనొప్పి తగ్గుతుంది. బజారులో లభించే మందులు: ప్రభాకరవటి లేదా నాగార్జునాభ్రరస మాత్రలు ఉదయం 1, రాత్రి 1 వాడాలి త్రిఫలాచూర్ణం 5 గ్రాములు రోజూ రాత్రి పడుకోబోయేప్పుడు నీళ్లతో సేవించాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ ప్లాస్టిక్ సర్జరీ కౌన్సెలింగ్ నా వయసు 18 ఏళ్లు. నాకు తొమ్మిదేళ్ల వయసులో ముఖం కాలింది. అప్పట్లో మంచి చికిత్సతో గాయం మానిపోయినప్పటికీ దాని తాలూకు మచ్చ మాత్రం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ముఖంపై కాలిన గాయం మచ్చ వల్ల నేను మానసికంగా ఆవేదనకు గురవుతున్నాను. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - నవీన, వరంగల్ స్కిన్ డ్రాఫ్ట్ సర్జరీ ద్వారా మీ ముఖంపై ఏర్పడిన కాలిన గాయం మచ్చను సమూలంగా రూపుమాపవచ్చు. ఈ సర్జరీకి రెండు విధాల చికిత్సను అనుసరిస్తారు. ఒకటి - స్ల్పిట్ థిక్నెస్, రెండోది - ఫుల్ థిక్నెస్. మొదటి దానిలో మీ శరీరంలోని ఏదైనా భాగం నుంచి (ఎక్కువగా తొడ భాగాన్నే ఎంచుకుంటుంటారు) చర్మాన్ని తీసి, అవసరమైన చోట సర్జరీ ద్వారా అమర్చుతారు. దీనికి మూడు వారాల సమయం వరకు పడుతుంది. అలాగే చిన్నపాటి కుట్లు (స్టిచెస్) కూడా వేయాల్సి ఉంటుంది. ఇక రెండో విధానానికి వస్తే... ఈ ప్రక్రియలో కూడా మొదటి విధానాన్నే అనుసరిస్తారు. అయితే చర్మాన్ని రెండు విడతలుగా మచ్చపై అమర్చి కుట్లు (స్టిచెస్) లేకుండా సర్జరీ ముగిస్తారు. అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా సర్జరీ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మచ్చను పూర్తిగా కనబడకుండా చేయడానికి ఈ విధానంలో ఆరు వారాలకు పైగా పడుతుంది. సాధారణంగా ఈ విధానాన్ని బ్రెస్ట్, ముక్కు సర్జరీలకు వాడుతుంటారు. కాలిన గాయాలతో ఏర్పడిన మచ్చ తీవ్రతను బట్టి కూడా ఈ ప్రక్రియను వాడే అవకాశం ఉంది. మీ ముఖంపై ఉన్న మచ్చను బట్టి సర్జరీకి ఏ విధానం అవలంబిస్తారనేది సర్జన్ నిర్ణయిస్తారు. మీరు వెంటనే మంచి నిపుణులైన ప్లాస్టిక్ సర్జన్‌ను కలిసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందవచ్చు. డా.శశికాంత్ మద్దు సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ హైదరాబాద్ -
ఆటలో గెలిచాడు.. జీవితంలో ఓడిపోయాడు
► అనారోగ్యంతో దైన్యంలో ఓ ఖోఖో క్రీడాకారుడు ► కిడ్నీలు దెబ్బతిని సాయం కోసం ఎదురుచూపులు అతను ఆటల్లో సత్తా చాటాడు. అనేక బహుమతులు గెలిచాడు. ఇరవై నాలుగేళ్లకే అనారోగ్యం బారినపడి మంచానికి పరిమితమయ్యాడు. రెండు కిడ్నీలు చెడిపోయి తల్లి సంరక్షణలో రోజులు గడుపుతున్నాడు. ఆస్తి అంతా వైద్య ఖర్చులకు హారతి కర్పూలంగా కరిగిపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. గురజాల : పట్టణానికి చెందిన పాలడుగు సాగర్‌బాబు ఖోఖో క్రీడాకారుడు. మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు వివిధ పోటీల్లో మంచి ప్రతిభ చూపాడు. ఆల్ ఇండియా యూనివర్శిటీల ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో సైతం పాల్గొన్నాడు. అనేక పతకాలు సాధించాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యాడు. రెండు కిడ్నీలు పాడవడంతో నిలబడలేక, కూర్చోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. తల్లి ఎలిశమ్మ స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఓ బడ్డీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తూ భర్త లేకపోయినా కొడుకును జాగ్రత్తగా చూసుకుంటోంది. వెంటాడుతున్న అనారోగ్యం.. సాగర్‌బాబు 2014లో తలనొప్పి, వాంతులు, విరోచనాలతో ఇబ్బందిపడ్డాడు. వైద్యులను సంప్రదిస్తే రెండు కిడ్నీలు చెడిపోయాయని చెప్పారు. దీంతో వ్యాధి తీవ్రతను తగ్గించుకునేందుకు గుంటూరులో అతను తిరగని వైద్యశాల లేదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఉన్న భూములను అమ్ముకుని చికిత్సకు వ్యయం చేశారు. నెలకు రూ.20 వేలు ఖర్చు.. సాగర్‌బాబుకు నెలలో 12 సార్లు డయాలసిస్ చేయించాలి. ఇందుకు నెలకు రూ.20 వేలు ఖర్చవుతోంది. అయితే, రెండు కిడ్నీలు మార్చాలంటే సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. తన కిడ్నీలు దానం చేద్దామంటే.. రెండు కిడ్నీల్లోనూ రాళ్లు ఉండటంతో అవి పనికిరావని వైద్యులు చెప్పారు. పోనీ ఉన్న ఇంటిని అమ్మి వైద్యం చేయిద్దామంటే అంత డబ్బు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఏం చేయాలో తోచని ఎలిశమ్మ, సాగర్‌బాబు దాతల సాయం అర్ధిస్తున్నారు. దయగల మారాజులు సెల్ నంబర్ 84660 26065 లో సంప్రదించాలని, లేదా ఎస్బీఐ ఖాతా 31620425917 కు సాయం సొమ్ము జమ చేయాలని క్రీడాకారుడు సాగర్‌బాబు, అతని తల్లి ఎలిశమ్మ వేడుకుంటున్నారు. -
గ్రేటర్‌కు హైపర్ టెన్షన్
గ్రేటర్‌కు హైపర్‘టెన్షన్’భయం పట్టుకుంది. సెలైంట్‌గా సిటీ జనుల గుండెలను పట్టి పిండేస్తుంది. మూత్రపిండాల పని తీరును దెబ్బ తీస్తోంది. పక్షవాతంతో పాటు జ్ఞాపకశక్తి సన్నగిల్లుతోంది. మధుమేహం, క్యాన్సర్‌కు కారణం అవుతోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేడు వరల్డ్ హైపర్ టెన్షన్ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, సిటీబ్యూరో: ఉరుకులు పరుగుల జీవితం...అతిగా మద్యం సేవించడం..అధిక బరువు...పని ఒత్తిడి...కాలుష్యం...వెరసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా గ్రేటర్లో 36 శాతం మంది(పెద్దలు)హైపర్ టెన్షన్(హైబీపీ)తో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖ 2015-16లో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అయితే వీరిలో 90 శాతం మందికి తమకు బీపీ ఉన్నట్లు తెలీకపోగా, తెలిసిన వారిలో పది శాతానికి మించి వైద్యులను సంప్రదించడం లేదు. సాధారణంగా నాలుగు పదుల వయసు పైబడిన వారిలో కన్పించే హైపర్ టెన్షన్ లక్షణాలు ప్రస్తుతం పాతికేళ్లకే బయపడుతున్నాయి. బాధితుల్లో ఎక్కువ శాతం మార్కెటింగ్, ఐటీ అనుబంధ ఉద్యోగు లు కావడం గమనార్హం. సకాలంలో గుర్తించక పోవడం, చికిత్సను నిర్లక్ష్యం చేయడం వల్ల కార్డియో వాస్క్యూలర్(హార్ట్ఎటాక్), మూత్రపిండాల పని తీరు దెబ్బతినడంతో పాటు చిన్న వయసులోనే పక్షవాతంతో కాళ్లు, చేతులు పడిపోవడం, జ్ఞాపకశక్తి సన్నగిల్లి మతిమరుపు రావడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. మారిన జీవన శైలే కారణం.. ఇటీవల అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం మనిషిని కాలు కూడా కదపనీయడం లేదు. కూర్చొన్న చోటు నుంచి కనీ సం లేవకుండానే అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నాడు. సెల్‌ఫోన్ సంభాషణలు, ఇంటర్నెట్ చాటింగ్‌లు మనిషి జీవనశైలిని పూర్తిగా మార్చేశాయి. ఇంటి ఆహారానికి బదులు హోటళ్లలో రెడీమేడ్‌గా దొరికే బిర్యానీలు, ఫిజ్జాలు, బర్గర్లు, మద్యం కూడా అధిక బరువుకు కారణమవుతున్నాయి. గ్రేటర్లో రోజు రోజుకు పెరుగుతున్న స్థూలకాయానికి ఇదే కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మధ్య వయస్కులతో పోలిస్తే...యువకుల్లోనే ఈ సమస్య ఎక్కువ ఉంది. ఇదిలా ఉండగా హైపర్‌టెన్షన్ బాధితుల్లో 40 శాతం మంది గుండెనొప్పితో మృతి చెందుతుండగా, 25 శాతం మంది కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నారు. మరో 10 శాతం మంది పక్షవాతంతో జీవశ్చవంలా మారుతున్నారు. హైపర్‌టెన్షన్‌కు 140/90 రెడ్ సిగ్నల్ మధుమేహం, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, పక్షవాతానికి హైపర్టెన్షనే కారణం. ఈ చికిత్సల పేరుతో దేశంలో ఏటా 20 య ుూఎస్ మిలియన్ డాలర్లు ఖర్చు అవుతోంది. బ్లడ్ ప్రజర్ 140/90 ఉంటే హైపర్ టెన్షన్‌కు రెడ్ సిగ్నల్‌గా భావించాలి. బీపీ వల్ల తరచూ తలనొప్పి వస్తుంది, కళ్లు బైర్లు కమ్మినట్లు ఉంటాయి. ఛాతి గట్టిగా పట్టేసినట్లు ఉంటుంది. శరీరం ఎంతో అలసిపోయినట్లు అన్పిస్తుంది. చిన్నపనికే చికాకు, పట్టలేని కోపం వస్తుంది. ప్రతి ఒక్కరూ విధిగా బీపీ చెకప్ చేయించుకోవాలి. పని ఒత్తిడి, ఇతర చికాకులకు దూరంగా ఉండాలి. ఆహారంలో ఉప్పు, పచ్చళ్ల వాడకాన్ని తగ్గించాలి. పప్పు, కాయకూరలు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు 40 నిమిషాలు వ్యాయామం చేయాలి. - డాక్టర్ సి.వెంకట్ ఎస్ రామ్, బీపీ వైద్య నిపుణుడు, డబ్ల్యూహెచ్ఓ, సౌత్ ఏసియా రీజినల్ డైరెక్టర్ -
వేసవిలోనూ సైనసైటిస్ సమస్య..!
కిడ్నీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. నేను ఉద్యోగరీత్యా చాలా దూర ప్రయాణాలు చేస్తుంటాను. ఇప్పటివరకు నాకెలాంటి ఆరోగ్య సమస్యా రాలేదు. కానీ గత రెండు మూడు నెలల నుంచి దూరప్రయాణాలు చేసి వచ్చిన తర్వాత నా రెండు కాళ్లు వాస్తున్నాయి. అలాగే మూత్రం నురగగా వస్తోంది. అంతేకాకుండా రాత్రిళ్లు ఎక్కువగా మూత్రం వస్తోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది. ఇప్పటివరకు ఈ సమస్యపై ఏ డాక్టర్‌నూ కలవలేదు. దయచేసి నా అనుమానాలను నివృత్తి చేయండి. - గోపాల్, హైదరాబాద్ మూత్రపిండాల సమస్యలో ఐదు దశలు ఉంటాయి. మొదటి దశ, రెండో దశలో అసలు వ్యాధి లక్షణాలు కనిపించవు. మూడో దశలో ఆకలి మందగించడం, నీరసం, ముఖం వాచినట్లుగా ఉండటం, కాళ్లలో వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నాలుగో దశ, ఐదో దశలో కన్ను చుట్టూ వాపు రావడం, జబ్బు ఎక్కువవుతున్న కొద్దీ వాపు ఎక్కువవుతుండటం, మూత్రం తగ్గిపోవడం, ఫిట్స్ రావడం, కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఐదో దశ వచ్చేసరికి కిడ్నీ పనితీరు బాగా తగ్గిపోతుంది. దురదృష్టవశాత్తు చాలామందిలో వ్యాధి ఈ దశకు చేరుకున్న తర్వాతనే వైద్యులను సంప్రదిస్తున్నారు. వ్యాధి ఐదో దశకు చేరిన తర్వాత మళ్లీ దానిని సాధారణ స్థితికి తీసుకురాలేము. అందువల్ల క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ చికిత్స కొనసాగించడం ఒక్కటే మార్గం. అయితే మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చేస్తుంటే మీ కిడ్నీలో ఏవో అసాధారణ మార్పులు చోటుచేసుకుటున్నాయని చెప్పవచ్చు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిలో మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించండి. మీకు తగిన పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తారు. ఆలస్యం చేయకూడదు. గుండెజబ్బులాగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు కూడా సమయమే అత్యంత కీలకం. వ్యాధి మొదటి దశలో ఉంటే మీకు సులువుగా చికిత్స నిర్వహించే అవకాశం ఉంది. అలాగే మీ కిడ్నీ కూడా పదిలంగా ఉంటుంది. అలా కాకుండా పరీక్షలలో ఏదైనా సివియారిటీ కనిపిస్తే కూడా మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య ప్రక్రియలతో మీ కిడ్నీ సంబంధిత వ్యాధులను సమూలంగా పరిష్కరించే అవకాశం ఉంది. న్యూరో కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నేను గత మూడు నెలలుగా నడుము నొప్పితో బాధపడుతున్నాను. పదిరోజులుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాను. ఎటూ కదలలేకుండా అవుతోంది. నడుము నుంచి పాదాల వరకు తిమ్మిర్లు వస్తున్నాయి. మూడు రోజులుగా మూత్రం కూడా ఆగి, ఆగి వస్తోంది. ఎమ్మారై స్కానింగ్ చేయించాను. కొంతమంది సర్జరీ అవసరమని, మరి కొంతమంది వద్దంటున్నారు. సర్జరీ చేయించుకుంటే కాలు పడిపోవచ్చని మా కొలీగ్స్ భయపడుతున్నారు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - నరేంద్రనాథ్, రాజమండ్రి మీరు ఎల్5 /ఎస్ 1 ర్యాడికులోపతి అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే నొప్పి మాత్రమే ఉన్నవారిలో, నముడుకు బెల్ట్ వేసుకోవడం, మందులు తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడంతో ఈ సమస్య తీవ్రతను తగ్గించవచ్చు. దాదాపు 80 శాతం మందిలో ఇలా తగ్గించడం సాధ్యమవుతుంది. మిగతా వారిలో సర్జరీ అవసరం పడవచ్చు. కాళ్లకి సంబంధించిన నరాలు, మలవిసర్జన, మూత్ర విసర్జనకు అవసరమైన నరాలు అన్నీ నడుము నుంచే కిందికి వెళ్తాయి. అయితే నడుము ఎముకలు అరిగినప్పుడు డిస్క్‌లు జారి, నరాలు ఒత్తుకోవడం వల్ల నడుము నొప్పి, తిమ్మిర్లు, మూత్రంలో ఇబ్బంది రావచ్చు. ఒక్కోసారి కాళ్లలో బలం తగ్గిపోయినా, మూత్రవిసర్జనలో ఇబ్బంది ఎదురైనా వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవడం అవసరం. సమయం గడుస్తున్నకొద్దీ పరిస్థితి మరింత జటిలం అవుతుంది. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి న్యూరోసర్జన్ చేత మీరు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మైక్రోస్కోప్ ద్వారా కేవలం గంట కంటే తక్కువ సమయంలోనే సర్జరీ చేయించుకోవచ్చు. మూడు రోజులలో నడుచుకుంటూ ఇంటికి కూడా వెళ్లిపోవచ్చు. అయితే అన్ని వసతులు, వైద్య సౌకర్యాలు ఉన్న హాస్పిటల్లోనూ, నిపుణులు, అనుభవజ్ఞులైన న్యూరోసర్జన్ చేత మీరు ఆపరేషన్ చేయించుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తదు. హోమియో కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. ఎండ వేడికి తట్టుకోలేక ఇంట్లో కూలర్ వాడుతున్నాం. శీతల పానియాలూ ఎక్కువగానే తాగాను. దాంతో జలుబు వచ్చింది. తల అంతా భారంగా ఉంది. ఎంతకీ తగ్గడం లేదు. హోమియోలో చికిత్స ఉందా? - సురేశ్‌కుమార్, ఖమ్మం కొన్ని రకాల వ్యాధులు సాధారణంగా కొన్ని కాలాలలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాటిలో సైనసైటిస్ ఒకటి. గతంలో వానాకాలం, చలికాలంలో ఉద్ధృతమయ్యే ఈ సమస్య కొందరిలో వేసవిలోనూ కనిపిస్తోంది. ఇందుకు వాతావరణంతో పాటు జీవనశైలిలోని మార్పులూ కారణమవుతున్నాయి. మన తలలో ముక్కు పక్కన, నుదుటి దగ్గర ఉండే నాలుగు జతల గదులను ై‘సెనస్’లు అంటారు. ముఖంలోని గాలి గదుల్లో వచ్చే వాపునే వైద్యపరిభాషలో సైనసైటిస్ అంటారు. ఈ వాపే కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్లలో ‘అక్యూట్ సైనసైటిస్’, ‘క్రానిక్ సైనసైటిస్’ అనే రెండు రకాలు ఉంటాయి. రెండో రకంలో సమస్య దీర్ఘకాలంపాటు ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా జలుబు చేసినప్పుడు మందులు వాడి, దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు జలుబు మందులతో తగ్గిపోవచ్చు లేదా తగ్గినట్లే తగ్గి మళ్లీ తిరగబెట్టవచ్చు. ఇలా పదే పదే జలుబు వేధిస్తుంటే సైనసైటిస్ ఉన్నట్లుగా భావించవచ్చు. ప్రస్తుతం వేసవిలో కూడా సైనసైటిస్ ఎక్కువగానే బాధిస్తున్న కేసులు వస్తున్నాయి. కాలుష్యం, దుమ్ము, పొగ వంటి అంశాలతో ఇది వేసవి సీజన్లోనూ కనిపిస్తోంది. వేసవిలో సైనసైటిస్‌కు కారణాలు : అలర్జిక్ తత్వం ఉన్నవారు వేసవిలో కూల్‌డ్రింక్స్, చల్లటి ఫ్రిజ్ నీళ్లు తాగడం వల్ల అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ సైనసైటిస్‌కు గురయ్యే అవకాశం ఉంది. వేసవిలో వర్షాలు కురిసినప్పుడు ఉష్ణోగ్రతల్లో చోటు చేసుకునే విపరీతమైన మార్పుల వల్ల కూడా సైనస్‌లు ప్రభావితమవుతాయి వేసవి సీజన్లో ఈతకొలనులలో ఎక్కువసేపు గడపడం జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో (సినిమా థియేటర్లు, కళ్యాణమండపాలు) ఎక్కువగా గడపడం కూడా సైనసైటిస్ వ్యాప్తికి కారణమే వేసవిలో ఎయిర్‌కూలర్స్ వాడటం, వాటిలోని నీళ్లను మార్చకపోవడం, నిల్వ నీటినే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండటం వల్ల ఆ నీళ్లు కలుషితం కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. అలాగే కూలర్స్లోని మ్యాట్స్‌లో ఉండే ఫంగస్ చేరి ఫంగల్ సైనసైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లక్షణాలు : కనురెప్పల వాపు వాసనలు తెలియకపోవడం తరచూ వచ్చే జ్వరం తలనొప్పి ముక్కుదిబ్బడ చిక్కటి పసుపుపచ్చ / ఆకుపచ్చ రంగులో ముక్కుస్రావాలు నోటి దుర్వాసన వ్యాధి నిర్ధారణ : సైనస్ ఎండోస్కోపీ, నోటి పరీక్ష, ఊపిరితిత్తుల పరీక్ష, ఎక్స్-రే, సీటీ స్కాన్, సైనస్ కల్చర్ వంటి పరీక్షలు సమస్య నిర్ధారణకు తోడ్పడతాయి. చికిత్స : సైనసైటిస్‌కు హోమియోలో అద్భుతమైన చికిత్స అందుబాటులో ఉంది. మందుల ద్వారా నివారణ మాత్రమే గాక... వ్యాధి నిరోధక శక్తిని పెంచి మళ్లీ మళ్లీ రాకుండా చేయవచ్చు. సైనసైటిస్‌కు హోమియోలో కాలి సల్ఫ్, హెపార్ సల్ఫ్, మెర్క్‌సాల్, సాంగ్యునేరియా, లెమ్నా మైనర్, స్పైజీలియా వంటి మందులు మంచి ఫలితాలు ఇస్తాయి. అయితే వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. -
ఆకు కూరలతో రక్తహీనతకు చెక్!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 52 సంవత్సరాలు. ఇటీవల కొద్దికాలంగా మూత్రంలో మంట, చీము, రక్తం పడటం, నడుంనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్ని సంప్రదిస్తే కిడ్నీల ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఎన్నో మందులు వాడుతున్నాను కానీ, అంతగా ఫలితం కనిపించడం లేదు. నా సమస్యకు హోమియో చికిత్స ద్వారా అయినా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - రామారావు, పాలకొల్లు మన శరీరంలో మూత్రపిండాలది కీలకమైన పాత్ర. సాధారణంగా రక్తప్రవాహం ద్వారా కానీ, మూత్రకోశ ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. కారణాలు: 80 శాతం వరకు బ్యాక్టీరియా, 15 శాతం, వైరస్లు మరికొంత శాతం ఫంగల్, కొన్ని పరాన్నజీవులు. మూత్రం ఎక్కువ సమయం విసర్జించకుండా ఉన్న సమయంలో బ్యాక్టీరియా అధికంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మూత్ర వ్యవస్థలో రాళ్లు మూత్రవిసర్జనకు అడ్డుగా నిలిచి ఈ సమస్య ఉత్పన్నం అయేలా చేస్తాయి. మూత్రకోశం ఇన్ఫెక్షన్లను స్త్రీలలోనే ఎక్కువగా గమనించవచ్చు. ముఖ్యంగా రజస్వల అయ్యే సమయంలోనూ, డెలివరీ అప్పుడు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువ. వీటితోబాటు కృత్రిమ మూత్ర గొట్టాలు(క్యాథెటర్స్), స్టెంట్స్, థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్, హార్మోన్ల అసమతుల్యత మలబద్దకం వలన కూడా మూత్ర మార్గం ఇన్ఫెక్షన్లు క లుగుతాయి. లక్షణాలు: రోగికి తరచు జ్వరం, కడుపు నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు కడుపునొప్పి గజ్జలలోకి, అటుపైన తొడల వరకు కూడా పాకుతుంది. కొన్ని సందర్భాల్లో మూత్రంలో చీము, రక్తం కూడా పడుతుంటాయి. ఆకలి మందగించటం, ఒళ్ళు నొప్పులు, నీరసంతో పాటు మూత్రవిసర్జన సమయంలో విపరీతమైన మంట వంటి సమస్యలూ ఉంటాయి. జాగ్రత్తలు: వ్యక్తిగత శుభ్రత పాటించ డం, ఎక్కువ నీరు తాగటం, మూత్రాన్ని నియంత్రించకుండా ఉండటం, కృత్రిమ గర్భనిరోధక సాధనాలు వాడేటప్పుడు జాగ్రత్త వహించడం, మలబద్ధకం లేకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తల ద్వారా ఈ వ్యాధి కలగకుండా నియంత్రించుకోవచ్చు. హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా వ్యాధి లక్షణాలతో పాటు రోగి మానసిక, శరీర సమస్యలను పరిగణనలోకి తీసుకుని, రోగనిరోధక శక్తిని ప్రేరేపించడం వల్ల ఇన్ఫెక్షన్ తాలూకు సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించబడతాయి. మీరు వెంటనే మంచి హోమియో నిపుణుని సంప్రదించండి. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ న్యూరో కౌన్సెలింగ్ మా అమ్మకు 60 ఏళ్లు. తనకు కుడికాలు, చెయ్యి విపరీతంగా కొట్టుకుంటోంది. నిద్రపోయినప్పుడే అవి ఆగుతున్నాయి. మళ్లీ మెలకువ వచ్చినా ఆపలేనంతగా కొట్టుకుంటున్నాయి. పరిష్కారం చెప్పండి. - నవనీతమ్మ, గూడూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అమ్మగారు హెమీబాలిస్మస్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారిలో ఒక పక్క కాలు, చేయి ఆపలేనంతగా కొట్టుకుంటాయి. ఈ జబ్బు సాధారణంగా మెదడులో రక్తనాళం ముసుకుపోయి, నరాల కణాలు దెబ్బతినడం వల్ల వస్తుంది. మెదడులోని కణుతుల వల్ల కూడా రావచ్చు. మెదడులో రక్తస్రావం జరిగినా కూడా ఇది రావచ్చు. కొంతమంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో షుగర్ ఎక్కువగా కూడా ఇలా జరగవచ్చు. వీటిల్లో ఏ కారణం వల్ల మీ అమ్మగారికి ఇలా జరిగిందో రక్తపరీక్షల ద్వారానూ, బ్రెయిన్ స్కాన్ ద్వారానూ తెలుసుకోవచ్చు. కారణం తెలుసుకొని సరైన మందులు వాడటం ద్వారా మీ అమ్మగారి జబ్బును నయం చేయవచ్చు. నా వయసు 60 ఏళ్లు. నాకు పక్షవాతం వచ్చి నాలుగేళ్లు అయ్యింది. గత నెల రోజులుగా ఫిట్స్ వస్తున్నాయి. డాక్టర్ గారికి చూపిస్తే పెద్దాసుపత్రికి వెళ్లమని చెప్పారు. నాకు సరైన సలహా ఇవ్వగలరు. - అప్పారావు, విశాఖపట్నం మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ఇస్కిమిక్ సీజర్స్ అనే ఫిట్స్‌తో బాధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒకసారి పక్షవాతం వచ్చినవారిలో ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు సీటీస్కాన్, ఈఈజీ పరీక్షలు చేయించుకొని, కొన్ని కార్బమైజిపైన్ అనే మందు వాడటం ద్వారా ఫిట్స్‌ను తగ్గించవచ్చు. అయితే మీరు కనీసం మూడేళ్ల పాటు ఇది వాడాల్సి ఉంటుంది. కొంతమందికి జీవితాంతం కూడా వాడాల్సి రావచ్చు. డాక్టర్ మురళీధర్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్, బంజారా హిల్స్, హైదరాబాద్ అనీమియా కౌన్సెలింగ్ మా పాప వయసు పదకొండేళ్లు. గత మూడు నెలలుగా రక్తహీనతతో బాధపడుతోంది. దీనికి కారణాలు, లక్షణాలతో పాటు రక్తహీనత రాకుండా జాగ్రత్తలు తెలపండి. - సౌజన్య, ఒంగోలు మన శరీరంలో రక్తం ఎర్రగా ఉంటుంది. దీనికి కారణం అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం. ఒకవేళ హీమోగ్లోబిన్ తగ్గితే రక్తహీనతతో బాధపడుతున్నట్లు పరిగణించవచ్చు. రక్తహీనత (అనీమియా)కు గురైన వ్యక్తికి రక్తంలోని ఎర్రరక్తకణాల సంఖ్య (రెడ్ బ్లడ్ సెల్స్ లేదా ఆర్బీసీ లేదా ఎరిథ్రోసైట్స్) సంఖ్య తగ్గిపోతుంది. రక్తపరీక్ష ద్వారా రోగి రక్తంలో ఎర్ర రక్తకణాలు ఎన్ని ఉన్నాయన్న విషయం తెలుస్తుంది. రక్తహీనత ఉన్న వ్యక్తిలో అవసరమైన స్థాయిలో ఎర్రరక్తకణాలు ఉండవు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. దీనివల్ల రోగి అలసటగా ఫీల్ కావడం జరుగుతుంది. రక్తహీనత తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో శ్వాసతీసుకోవడం కూడా కష్టమవుతుంది. రక్తహీనత ముఖ్యంగా మూడు కారణాల వల్ల వస్తుంది. అవి... 1) పౌష్టికాహారలోపం - ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు (తోటకూర, గోంగూర) బెల్లం, మాంసాహారంలోనూ ఎక్కువగా ఉంటాయి. అవి తగినంతగా తీసుకోకపోవడం. 2) రక్తం నష్టపోతుండటం - స్త్రీలలో రుతుస్రావం వల్ల, పిల్లల కడుపుల్లో నులి పురుగుల వంటి క్రిములు ఉండటం వల్ల. 3) రక్తం తయారీలో అవరోధం - ఏవైనా జబ్బుల (ఉదాహరణకు మలేరియా) వల్ల రక్తంలోని ఎర్రరక్తకణాలు ధ్వంసం అయి మరల పెరగకపోవడం. దీంతో రక్తం తయారవ్వక రక్తహీనత కనపడుతుంది. లక్షణాలు : తీవ్రమైన నిస్సత్తువ, సాధారణ పనులకే ఆయాసం రావడం, నాలుక, కనురెప్పల లోపలి భాగాలు పాలిపోవడం, అలసట, చికాకు, ఆకలి లేకపోవడం, మైకం, కళ్లు తిరగడం, అరచేతుల్లో చెమట, చేతుల గోళ్లు వంగి గుంటలు పడటం, పాదాలలో నీరుచేరడం, చిన్నపిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి. అనీమియాను అధిగమించడం ఇలా : తాజా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం రక్తహీనత నివారణకు సులభమైన మార్గం. బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, మాంసం, కాలేయం వంటి పదార్థాలలో కూడా ఇనుము పుష్కలంగా ఉంటుంది. రోజూ తీసుకునే ఆహారంలో మొలకెత్తిన పప్పు ధాన్యాలు, విటమిన్-సి పాళ్లు ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ లాంటివి కలిపి తీసుకోవడం వల్ల కూడా రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు. డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీ సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్, సెంచరీ హాస్సిటల్స్, హైదరాబాద్ -
నేను మీ వెన్నుని
ఆనంద్ శరీరంలోని మిగిలిన అవయవాల కంటే నేనే తనను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాను. నేను ఆనంద్ వెన్నెముకను. దాదాపు ప్రతి ఏడాదీ తనకు నాతో ఇబ్బందులు తప్పవు. నేను పెట్టే బాధను తగ్గించుకోవడానికి తను కాపడం పెట్టడం, మర్దన చేయడం, మందులు తీసుకోవడం వంటివన్నీ చేస్తూ ఉంటాడు. నన్ను తను సరిగా చూసుకోకపోవడం వల్లనే నా ప్రతిస్పందనగా తనకు నొప్పులు కలిగిస్తుంటాను. నా నుంచి తలెత్తే సమస్యలను ఆనంద్ తనకు తానుగా పరిష్కరించుకోలేడు. ఇది నా లోపమే అనుకోండి. అయితే, ఆనంద్ పూర్వీకులు నిటారుగా నిలబడాలని నిర్ణయించుకున్నప్పుడే నా పనితీరులో సమస్యలు మొదలయ్యాయి. అప్పటి నుంచి నేను నేలకు సమాంతరంగా వంతెనలా ఉండే బదులు, నేలలో నిటారుగా నాటిన గడకర్రలా మారాను. అలాగని నేను మరీ పెళుసుగా ఏమీ ఉండను. వంగగలను, మెలితిరగగలను, నాపై ఉన్న తలను అటూ ఇటూ తిప్పగలను. మరీ ముఖ్యంగా చాలావరకు శరీరభారాన్ని మోయగలను. వెన్నుపాము నుంచే 31 జతల నరాలు ఆనంద్‌కు గల 45 సెంటీమీటర్ల వెన్నుపాముకు నేను రక్షణ కల్పిస్తుంటాను. పూసలదండలోని దారంలా నా మధ్యగా సాగిపోయే తెల్లని వెన్నుపాము సెంటీమీటరు మందంలో ఉంటుంది. సున్నితమైన వెన్నుపాముకు నేను మూడు పొరల రక్షణ కల్పిస్తుంటాను. నాలోని వెన్నుపాము నుంచే 31 జతల నరాలు శరీరమంతా పాకి ఉంటాయి. వీటిలో సగానికి సగం నరాలు మెదడుకు సమాచారం చేరవేస్తూ ఉంటాయి. మిగతావి మెదడు నుంచి వచ్చే ఆదేశాలను శరీరంలోని వివిధ కండరాలకు చేరవేస్తూ ఉంటాయి. అయితే, కొన్ని సందర్భాల్లో వెన్నుపాము స్వయంగా కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఆనంద్ పొరపాటున వేడి గిన్నె మీద చెయ్యి పెట్టాడనుకోండి... ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేసేంత సమయాన్ని కూడా వెన్నుపాము వృథా కానివ్వదు. వెంటనే అసంకల్పిత ప్రతీకార చర్యకు ఆదేశిస్తుంది. ఆనంద్ తన చేతిని చటుక్కున వెనక్కు తీసుకునేలా చేస్తుంది. అలా వంపులు తిరుగుతా ఆనంద్ పుట్టినప్పుడు నేను దాదాపు నిటారుగానే ఉంటాను. తను తల పెకైత్తడం మొదలుపెట్టినప్పుడు మెడ వద్ద ఉండే నాలోని భాగం కాస్త వంపు తిరుగుతుంది. ఆనంద్ పాకడం నేర్చుకునేటప్పుడు తన నడుము వద్ద ఉండే నాలోని భాగం కూడా వంపు తిరుగుతుంది. ఇప్పుడు నేను అస్పష్టంగా రాసిన ఇంగ్లీష్ అక్షరం ‘ఎస్’ ఆకారంలో ఉన్నాను. నిజానికి ఎలాంటి వంపులు లేని సరళరేఖ ఆకారం కంటే ఇదే నాకు అనువైన ఆకారం. నాలోని వంపులే నాకు షాక్ అబ్జార్బర్స్‌లా పనిచేస్తాయి. వంపులు మాత్రమే కాదు, నాలో మరికొన్ని షాక్ అబ్జార్బర్స్ కూడా ఉన్నాయి. అవే లేకుంటే, నాలోని పూసలు ఒకదానికొకటి తాకినప్పుడు రాపిడికి గురై, అరిగిపోయేవి. నాలోని పూసల మధ్య కుషన్లాంటిది ఉంటుంది. దానినే మృదులాస్థి (కార్టిలేజ్) అంటారు. అందులో ఉండే జెల్లీలాంటి పదార్థమే నన్ను కుదుపుల బారి నుంచి కాపాడుతూ ఉంటుంది. నొప్పులన్నిటికీ నేనే కారణం కాదు అయితే, ఆనంద్ వెన్నులో తలెత్తే అన్ని రకాల నొప్పులకూ నేనే కారణం కాదు. వెన్నులో చాలాసార్లు తలెత్తే నొప్పులకు ఇతరేతర కారణాలు కూడా ఉండొచ్చు. కిడ్నీల్లో సమస్యలు ఉన్నా, లివర్ లేదా ప్రొస్టేట్ సరిగా పనిచేయకపోయినా, ఆర్థరైటిస్, ఇన్ఫెక్షన్లు వంటివి ఉన్నా, ఒక్కోసారి తీవ్రమైన భావోద్వేగాలకు గురైనా వెన్నునొప్పి రావచ్చు. తీవ్రమైన భావోద్వేగాలకు గురైనప్పుడు నన్ను అంటిపెట్టుకుని ఉండే కండరాలు బిగుసుకుంటాయి. రోజుల తరబడి తీవ్ర భావోద్వేగాలు కొనసాగితే బిగుసుకున్న కండరాల వల్ల నాకు నొప్పులు తప్పవు. ఆనంద్ అలాంటి భావోద్వేగాల నుంచి తేరుకుంటే, నేను కూడా త్వరగా కోలుకుంటాను. కాస్త తీవ్రంగా నొప్పి కలిగితే, నా డిస్కులు జారిపోయాయనుకుంటాడు ఆనంద్. అదృష్టవశాత్తు అతడికి ఇంతవరకు అలాంటి ప్రమాదమేదీ కలగలేదు. రోడ్డు ప్రమాదం వంటి సంఘటనల్లో తీవ్ర గాయమేదైనా అయితే తప్ప నా డిస్కులు అంత తేలికగా దెబ్బతినవు. నా పూసల మీద భారీ దెబ్బ ఏదైనా తగిలితే వాటి మధ్య కుషన్‌లా ఉన్న కార్టిలేజ్ దెబ్బతింటుంది. అందులోని జెల్లీలాంటి పదార్థం బయటకు కారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో నన్ను అంటిపెట్టుకున్న కండరాల్లో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దెబ్బతినడం వల్ల నా పూసలు రాపిడికి గురై, వెన్నుపూస నుంచి వ్యాపించే సయాటికా నరంపై ఒత్తిడి కలిగిస్తాయి. ఈ నొప్పి అరిపాదాల వరకు వ్యాపిస్తుంది. ఒకరకంగా ఈ నొప్పి జాగ్రత్తకు సంకేతం. దెబ్బతిన్న వెన్నుపూసలు మరింత దెబ్బతినకుండా వాటి కదలికలను నివారించేందుకు దోహదపడుతుంది. శరీర భారంతో పెరిగే నొప్పులు చాలామంది నడి వయస్కుల్లాగే ఆనంద్‌కు కూడా నా భాగంలో నొప్పులు వస్తుంటాయి. ఈ నొప్పులన్నీ నన్ను అంటిపెట్టుకున్న కండరాలు బలహీనంగా మారడం వల్ల వచ్చినవే. ప్రతి వారం గోల్ఫ్ ఆడే ఆనంద్... ఆ మాత్రం వ్యాయామంతోనే నేను దృఢంగా ఉంటాననుకుంటాడు. కానీ, అది సరికాదు. నన్ను అంటిపెట్టుకుని ఉండే నాలుగువందల కండరాలు, వెయ్యి లిగమెంట్ల నిర్మాణాన్ని తెలుసుకుంటే ఆనంద్ ఆశ్చర్యపోతాడు. ఆనంద్ ఇటీవల నాలుగు కిలోల బరువు పెరిగాడు. అతడి పొట్టవద్ద పేరుకుపోయిన కొవ్వువల్ల ఏర్పడిన భారాన్ని నేనే మోయాలి. మెత్తని కుషన్ సోఫాల్లో, కుర్చీల్లో అడ్డదిడ్డంగా కూర్చుంటూ విశ్రాంతి తీసుకుంటున్నానని అనుకుంటాడు ఆనంద్. కానీ ఆ సమయంలో నాకు ఎలాంటి విశ్రాంతీ ఉండదు. పైగా నాపై అదనపు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అతడు నాపై ఎక్కువగా భారం మోపకుండా, కాళ్లకు, చేతులకు పని చెబితేనే నేను క్షేమంగా ఉంటాను. వెన్నుపూస నిర్మాణం తల వెనుక మెడను అంటిపెట్టుకుని ఉండే నా పైభాగంలో ఏడు ఎముకలు ఉంటాయి. వీటిని సెర్వికల్ వెర్టిబ్రే అంటారు. ఛాతీ వెనుక 12 ఎముకలు ఉంటాయి. వీటినే థొరాసిక్ వెర్టిబ్రే అంటారు. ఇవి పక్కటెముకలు వీటిని అతుక్కుని ఉంటాయి. నడుము భాగంలో ఐదు బరువైన ఎముకలను లంబార్ వెర్టిబ్రే అంటారు. శరీర బరువును చాలా వరకు భారాన్ని ఇవే మోస్తాయి. మన వీపు భాగంలో అందరికీ ఒక ఇంగ్లిష్ అక్షరం ‘ఎస్’ షేప్ ఆకృతి ఉంటుంది. వెన్నెముక ఉన్న జీవులన్నీ నడిచే సమయంలో పడే ఒత్తిడిని గణనీయంగా తగ్గించడానికి ఈ ఎస్ షేప్డ్ ఆకృతి ఉపకరిస్తుంది. హైహీల్స్ తొడగడం వల్ల నడుం భాగంలో ఉండే వీపు (లంబార్) ప్రాంతం తన వంపును కోల్పోయి నిటారుగా అవుతుంది. ఆపైన ఉండే ఛాతీ భాగంలోని వెనకభాగపు వీపు (థొరాసిక్ లేదా మిడ్ బ్యాక్), మెడ, తల... ఇవన్నీ సాధ్యమైనంత నిటారుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నంలో మనిషికి స్వాభావికంగా ఉండే ‘ఎస్’ ఆకృతి ఒంపు కాస్తా నిటారుగా మారుతుంది. దాంతో కండరాలపై ఉండాల్సినదాని కన్నా ఒత్తిడి అధికమవుతుంది. పైగా వాటిని సరైన అలైన్మెంట్లో లేకుండా అదేపనిగా ఉపయోగించడం వల్ల కండరాలు దెబ్బతిని నొప్పి వస్తుంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలతో వెన్ను క్షేమం... నిలబడే సమయంలో వెన్ను నిటారుగా ఉండేలా చూసుకోవడం. వెన్నును అంటిపెట్టుకున్న కండరాలు బలహీనం కాకుండా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయాలి. కంప్యూటర్ ముందు కూర్చునే వెన్ను వంగిపోకుండా జాగ్రత్త పడటం బరువులు ఎత్తే సమయం అకస్మాత్తుగా వంగకుండా, కూర్చొని మెల్లగా ఎత్తడం వంటి జాగ్రత్తలతో వెన్ను పదిలంగా ఉంటుంది. -
అమ్మ పొమ్మంది... ఊరు రమ్మంది
కడుపు తీపి అన్నమాట ఉంది కదా. అలాంటప్పుడు ‘కడుపుచేదు’ కూడా ఉండే ఉండవచ్చు. కానీ ఆ చేదు చాలా అరుదు. ఆ చేదుకు కారణాలూ ఉండవచ్చు. మాతృత్వపు మమకారం ఎలా చేదెక్కిందో తెలిపే కథే చిన్నారి రవళి వ్యథ. రవళి కథ చదవండి. మానవత్వం రవళిస్తే ఆమెను చదివించండి. రవళికి పన్నెండేళ్లు. చెంపకు చారెడేసి కళ్లు. నోరు విప్పిందంటే ఆరిందాలా కబుర్లు. ఆమె కథ వింటే మాత్రం ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. కన్నపేగే కాలనాగైన గాథ ఆమెది. కడుపున పడగానే కన్నతండ్రి విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆమె తల్లి మానసికంగా దెబ్బతింది. చివరకు కన్నకూతురినే కట్టేసి కొట్టేంతగా కరడుగట్టిపోయింది. అదే రవళికి శాపమైంది. కడుపులో పెట్టుకోవాల్సిన తల్లి కడుపు మాడ్చింది. కాళ్లూ చేతులు కట్టేసి, గొడ్డుకారం పెట్టి, గొడ్డును బాదినట్లు బాదింది. కన్నతల్లి చేతిలోనే కష్టాలు పడుతున్న ఆమెను ఊరు ఊరంతా ఏకమై ఆదుకుంది. కన్నీళ్లు పెట్టించే రవళి కథ ఆమె మాటల్లోనే... అమ్మ నుంచి కాపాడేవారు లేరు... నా పేరు సంగిశెట్టి రవళి. మాది నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం. నాన్న పేరు దేవదాసు. అమ్మ పుష్ప. నేను కడుపులో ఉన్నప్పుడే మా నాన్న మమ్మల్ని విడిచేసి వెళ్లాడు. అప్పట్నుంచి అమ్మకు మానసిక సమస్య. పిచ్చిపిచ్చిగా చేస్తుండేది. నన్ను బాగా కొట్టేది. దాంతో మా అమ్మమ్మే నన్ను బడికి పంపుతుండేది. మతి సరిగా లేక మా అమ్మమ్మనూ కొట్టేది మా అమ్మ. అయినా అమ్మమ్మ లెక్కచేయలేదు. మా అమ్మ చేతులకు తన చేతులు అడ్డువేసి నన్ను ఇంగ్లిష్ మీడియంలో చదివించింది. ఐదేళ్ల కిందట మా అమ్మమ్మ చనిపోయింది. కిడ్నీలు పాడైపోయి చనిపోయిందని ఊళ్లోవాళ్లు అనుకున్నారు. అప్పట్నుంచీ నా జీవితమే మారిపోయింది. పని చేసినా కొట్టడమే... చేయకున్నా కొట్టడమే... అమ్మమ్మ చనిపోయాక మా అమ్మ నన్ను బడికి పంపలేదు. పనికి పంపింది. ఐదేళ్ల నుంచీ పనికి పోతున్నా. మనసు బాగలేకపోవడం వల్లనో ఏమోగానీ... నన్ను ఇంట్లోకి తోలి, కాళ్లూచేతులూ కట్టేసి, కంట్లో కారం పెట్టి కొట్టేది మా అమ్మ. ఒకరోజు ఆమె కొడుతూ ఉంటే అమెను అడ్డుకోడానికి ప్రయత్నించా. ఆ టైమ్‌లో అమ్మ కాలు విరిగింది. నేను పనిలోకి వెళ్తే వచ్చే పైసలతోనే ఆమె కాలిని బాగుచేయించా. అమ్మ అంతగా కొడుతుంటే తట్టుకోలేకపోయేదాన్ని. పైసలు తీసుకోకపోయినా... మా మామలు మా పైసలు తీసుకున్నారని వాళ్లపై కేసులు పెట్టింది మా అమ్మ. వాళ్ల నుంచి నలభైవేలు తీసుకుంది. అవి పూర్త్తయ్యే వరకూ ఖర్చు పెట్టింది. నేను పత్తి ఏరడానికి పోయేదాన్ని. అల్లం తీసేందుకూ, పొలాలకు మందు పెట్టేందుకు వెళ్లేదాన్ని. పైసలు తేవడం తేవడమే. అమ్మ కొట్టడం కొట్టటమే. ఊర్లో వాళ్లనూ తిట్టేది... ఒకనాడు నన్ను గదిలో పెట్టి కొడుతుంటే పొరుగువాళ్లు చూడలేకపోయారు. వాళ్లు చెప్పడంతో మా అత్తమ్మ నన్ను వెంటబెట్టుకొని వెళ్లింది. దాంతో మా అమ్మ అత్తమ్మ మీద కిడ్నాప్ కేసు పెట్టింది. మా మామ మీద కూడా కేసులు పెట్టింది. నన్ను తీసుకెళ్లిన పొరుగువాళ్ల ఇండ్ల మీదకు వెళ్లి వాళ్ల మీద దుమ్మెత్తి పోసేది. దాంతో మాకెందుకులే అని వాళ్లు నన్ను వదిలేశారు. కొన్నాళ్లు గవండ్ల వీరమ్మ తన దగ్గర ఉంచుకుంది. కానీ, అక్కడ కూడా ఉండనీయలేదు. నా దోస్తులు కావ్య, పూజిత, సమతలు కూడా నన్ను తీసుకెళ్లి అన్నం పెట్టేవాళ్లు. ఎండాకాలం వాళ్ల ఇళ్లలోనే ఉండేదాన్ని. వాళ్ల అమ్మ వాళ్లు కూడా నన్ను ఏమీ అనకపోయేవాళ్లు. కానీ మా అమ్మకు భయపడి మళ్లీ మా ఇంటికి పంపించేవాళ్లు. అందుకే ఎవరూ దగ్గర ఉంచుకోవడం లేదని చచ్చిపోవాలనుకున్నా. బావిలో పడిపోయి ప్రాణాలు వదలదలచుకున్నా. ఆ సారు వచ్చి తీసుకొచ్చిండు అప్పుడు చాంద్‌పాషా సారు వచ్చి నన్ను తీసుకుపోయాడు. ఒకరోజు వాళ్లింట్లనే ఉంచుకున్నాడు. తెల్లారి ఈడకు (బాలసదన్‌కు) తీసుకొచ్చిండు. ఇప్పుడు ఇక్కడ బాగనే ఉన్నా. అయితే, మా అమ్మ ఎటన్నా వెళ్లిపోతే నేను మా ఊరికి వెళ్లి అక్కడ చదువుకుంట. వారానికోసారి పనికిపోయి పైసలు తెచ్చుకుంటా. అయితే నా అన్న వాళ్లు లేరు.. మా పాలివాళ్లు ఉన్నారు. వాళ్ల దగ్గర ఉంటా. కానీ మా అమ్మ దగ్గర నన్ను ఉంచొద్దు. మా అమ్మ అంటే నాకు కోపం. మా నాన్న కూడా ఓసారి నన్ను తీస్కపోతనని వచ్చిండు. కానీ అప్పుడు మా అమ్మ పంపలేదు. ఇప్పుడు మా నాన్న కూడా నాకు సంబంధం లేదంటున్నాడు. హైదరాబాద్‌లో ఉన్న మా పెద్దమ్మ తీసుకెళతనంటోంది. కానీ, మా అమ్మకు భయపడుతోంది. అందుకే నేను ఎక్కడికీ పోను. నా దోస్తులందరూ చదువుకుంటున్నారు. నేనూ చదువుకుంటా. మూడో తరగతి వరకు చదివా. ఇప్పుడు ఐదో తరగతిలో చేరతా. ఎందుకంటే 12 ఏళ్లకు మూడో తరగతి అంటే అందరూ ఎక్కిరిస్తారు. నా దోస్తులంతా ఎనిమిది చదువుతున్నరు. నేను మాత్రం ఐదు చదువుతా. మంచిగ చదువుకుంట. మంచి ఉద్యోగం తెచ్చుకుంట. - మేకల కల్యాణ్ చక్రవర్తి, సాక్షిప్రతినిధి, నల్లగొండ ఊర్లో వాళ్ల అనుమతితోనే తీసుకువచ్చాను మూడు రోజుల కిందట రవళి వాళ్ల అమ్మ నా దగ్గరకు వచ్చింది. మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పింది. మీ అమ్మాయి ఎక్కడికి పోదులే నేను పంపిస్తా అని చెప్పాను. అయితే రవళిని వాళ్ల అమ్మ కొట్టేదని ఆ తర్వాత తెలిసింది. ఒకనాడు ఊర్లో ఉన్న వాళ్లే నా దగ్గరకు తీసుకొచ్చి ఈ అమ్మాయిని ప్రభుత్వానికి అప్పగించాలని అడిగారు. ఆ అమ్మాయితో మాట్లాడుతుంటేనే బావి దగ్గరికి వెళ్లి చచ్చిపోవాలని ప్రయత్నించింది. అందరం కలిసి అడ్డుకున్నాం. ఏదో సర్దిజెప్పి పంపినం. కానీ తెల్లారి గ్రామంలోని మహిళలే మళ్లీ నా దగ్గరకు రవళిని తీసుకువచ్చి ఎప్పుడు తీసుకెళ్తున్నవని అడిగారు. అక్కడి నుంచి మా ఇంటికి తీసుకెళ్లా. తెల్లారి గ్రామ సర్పంచ్, పెద్ద మనుషుల అనుమతి తీసుకున్నా. అక్కడి నుంచి ఎమ్మార్వో ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి తీసుకువచ్చా. ఆయన శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. ఇప్పుడు బాలసదన్‌లో ఉంది. హిందూ పండుగలయినా, ముస్లిం పండుగలయినా ఈ అమ్మాయిని నేను మా ఇంటికి తీసుకెళ్తా. అమ్మాయి బాగా చదువుకుని స్థిరపడితే నా జన్మకు అది చాలు. - ఎస్కే. చాంద్‌పాషా, గ్రామ రెవెన్యూ అధికారి, దత్తప్పగూడెం. -
మెట్లు ఎక్కినా దిగినా ఛాతీ బరువెక్కుతుంటే..!
కిడ్నీ కౌన్సెలింగ్ నా వయస్సు 50 సంవత్సరాలు. ఇటీవల హెల్త్ ప్యాకేజిలో బాడీ చెకప్ చేయిస్తే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు చెప్పారు. నిజంగానే రాళ్లు ఉన్నట్టు నిర్ధారించే పరిక్షలు ఏవి? వాటిని నివారించడం ఎలా? - భూషణం, విశాఖపట్నం మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్ష, ఇంట్రావీనస్ యూరోగ్రఫీ (ఐవీయూ), ఎక్స్-రే, సీటీ స్కాన్ల వంటి పరీక్షలతో కిడ్నీ స్టోన్స్‌ను నిర్ధారణ చేస్తారు. కిడ్నీల్లోని రాళ్లను నివారించండిలా మూత్రపిండాల్లో వచ్చే రాళ్ల వల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఆ జాగ్రత్తలివి... నీటిని ఎక్కువగా తాగాలి. రోజుకు తప్పని సరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్‌ను విసర్జించాలి. కాబట్టి శరీర కణాల నిర్వహణకు, పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది ఆహారంలో ప్రొటీన్, నైట్రోజెన్, సోడియం ఉన్న పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. స్థూలంగా చెప్పాలంటే ఉప్పు పాళ్లు తక్కువగా ఉండాలి ఆగ్సలేట్ ఎక్కువగా ఉండే గింజలు, సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి క్యాల్షియం సప్లిమెంట్లను కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. పొటాషియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి వైద్యుల సూచనల మేరకు ఆహార నియమాలను పాటించడం మంచిది ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్, క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ ఆరెంజ్ జ్యూస్‌కు క్యాల్షియం ఆక్సలేట్‌ను రాయిగా మారకుండా నిరోధించే లక్షణం ఉంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ మంచిదే. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం కూడా కిడ్నీస్టోన్ సమస్యకు దారితీసే అవకాశం ఉంది. చికిత్స: ఎండోస్కోపీ ప్రక్రియతో మూత్రపిండం నుంచి రాయి తీయడం (పీసీఎన్ఎల్ - ఎండోస్కోపిక్ రిమూవల్ ఆఫ్ స్టోన్ ఫ్రమ్ ద కిడ్నీ) వంటి ప్రక్రియలతో రాయిని తొలగించవచ్చు. -డాక్టర్ ఎన్. ఉపేంద్రకుమార్ యూరాలజిస్ట్ అండ్ యాండ్రాలజిస్ట్, సికింద్రాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. నాకు గత మూడేళ్ల నుంచి షుగర్ వ్యాధి, హైబీపీ ఉన్నాయి. డాక్టర్ సలహా ప్రకారం క్రమం తప్పక మందులు వాడుతున్నాను. కానీ గత రెండు వారాల నుంచి మెట్లు ఎక్కినా, త్వరత్వరగా నడిచినా ఛాతీ బరువెక్కుతోంది. ఈ మధ్య భోజనం తర్వాత ఏమాత్రం నడిచినా ఆయాసంతో పాటు చెమటలు పడుతున్నాయి. అయితే నేను ఏ పనీ లేకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేదు. దీనికి కారణమేమిటి? వివరించండి. - ఎస్.ఆర్.జి., కొత్తగూడెం మీరు పేర్కొన్న వివరాల ప్రకారం మీకు ‘అన్స్టేబుల్ యాంజైనా’ అనే గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని తెలుస్తోంది. ఒక వ్యక్తికి ఏ చిన్న శారీరక శ్రమకు గురైనా (అంటే నడక, మెట్లు ఎక్కడం మొదలైనవి) గుండె స్పందనల వేగం పెరిగి, గుండెకు మరింత ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్, రక్తసరఫరా అవసరమవుతుంది. దాంతో రక్తనాళాల్లో రక్తం ప్రవహించే వేగం పెరుగుతుంది. అయితే నార్మల్ వ్యక్తుల్లో మాదిరిగా కాకుండా కొందరిలో రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నప్పుడు ఇలా నొప్పి, ఆయాసం వచ్చి, సేదదీరినప్పుడు గుండె వేగం తగ్గి, మళ్లీ అవి కూడా తగ్గిపోతాయి. అలాగే గుండెమీద అధికంగా భారం పడకుండా ఉండే పరిస్థితిలో (అంటే పడుకున్నా, కూర్చున్నా) ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరు మీ ‘అన్స్టేబుల్ యాంజైనా’ అనే కండిషన్‌ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, దగ్గర్లోని గుండెజబ్బుల నిపుణుడిని సంప్రదించండి. యాంజియోగ్రామ్ పరీక్ష చేయించు కొని, రక్తనాళాల్లో అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని తొలగింపజేసు కోవడం అవసరం. లేకపోతే గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. - డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, హైదరాబాద్ డయాబెటిక్ కౌన్సెలింగ్ మనం డయాబెటిస్‌ను మందులు లేకుండానే నియంత్రించలేమా? ఇన్సులిన్ ఇంజెక్షన్ల రూపంలో కాకుండా టాబ్లెట్ల రూపంలో దొరికే అవకాశం ఉందా? దయచేసి వివరించండి. - సురేఖ, మంచిర్యాల డయాబెటిస్ (టైప్-2) తొలిదశల్లో అంటే ప్రీ-డయాబెటిక్ స్టేజ్‌లో దీన్ని క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహార నియమాలు పాటించడం (అంటే కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు) తక్కువగా ఉండటంతో పాటు అందులో కొవ్వులు, ప్రోటీన్ల పాళ్లు ఎంత ఉండాలో అంతే ఉండేలా ఆహారం తీసుకోవడం) వంటి చర్యల ద్వారా డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఆలస్యం చేయవచ్చు. ఇలా క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి ఆహారనియమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలితోనూ రక్తంలోని చక్కెరపాళ్లు అదుపులోకి రాకపోతే మాత్రం తప్పనిసరిగా డయాబెటిస్‌కు మందులు వాడాల్సిందే. మందులు వాడటం మొదలుపెట్టాక కూడా వ్యాయామం, ఆహారనియమాలు పాటించాల్సిందే. ఇక మీ రెండో ప్రశ్నకు సమాధానం ఏమిటంటే... ప్రపంచంలో ఇప్పటివరకూ ఎక్కడా కూడా ఇన్సులిన్ టాబ్లెట్ల రూపంలో అందుబాటులో లేదు. అయితే ఇంజెక్షన్ల ద్వారా కాకుండా టాబ్లెట్ల ద్వారా ఇన్సులిన్ అందించడానికి పరిశోధనలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్నాయి. నా వయసు 27. జీటీటీ టెస్ట్‌లో షుగర్ ఉన్నట్లుగా వచ్చింది. కానీ హెచ్‌బీఏ1సీ పరీక్షలో మాత్రం నార్మల్ వచ్చింది. అయినా ప్రస్తుతం నేను గ్లైకోమెట్-500 మి.గ్రా. టాబ్లెట్లు రోజుకు రెండు వాడుతున్నాను. రోజూ ఫోలిక్ యాసిడ్ తీసుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - దివ్య, వరంగల్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీ చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకోవాలి. దీనికంటే ముందు మీరు మీ డయాబెటిక్ టాబ్లెట్లు ఆపేయండి. వీలైతే డయాబెటిస్‌ను నియంత్రించే ఆహారంతోనే మీ చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. మీ రీనల్ ఫంక్షన్ పరీక్షలు, హెచ్‌బీఏ1సీ పరీక్షలు ఎప్పుడూ నార్మల్‌గా ఉండాలి. ఒకసారి గర్భం ధరించాక అవసరమైన అన్ని పరీక్షలతో పాటు మంచి ఫాలోఅప్ జరుగుతుండాలి. ఒకవేళ గర్భధారణ సమయంలో ప్రత్యేకంగా చివరి మూడు నెలలలో చక్కెరపాళ్లు నియంత్రణలోకి రాకపోతే ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రావచ్చు. డాక్టర్ కె.డి. మోదీ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, హైదరాబాద్ -
లంకలో కిడ్నీ మార్పిడి పై నిషేధం
కొలంబో: శ్రీలంకలో విదేశీయులకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల పై నిషేధం విధించారు. భారతీయ దర్యాప్తు బృందాలు ఇక్కడి నుంచి కిడ్నీలు కొనుగోలు చేసి ఆపరేషన్లు చేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు లంక ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం 4 ఆస్పత్రుల్లో ఆరుగురు డాక్టర్లు ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. భారత్ హెచ్చరికలతో హుటాహుటిన కదిలిన లంక ఆరోగ్యశాఖ వెంటనే దర్యాప్తుకు ఆదేశించింది. -
లంకలో కిడ్నీ మార్పిడి పై నిషేధం
-
నేను మీ కాలేయం
ఆనంద్ ప్రతిరోజూ అద్దంలోకి ముఖం పెట్టి పళ్లు పరీక్షించుకుంటాడు. తల దువ్వుకుంటాడు. జుట్టు సర్దుకుంటాడు. కనిపించే వీటిని పక్కనబెట్టి అప్పుడప్పుడూ కనిపించని లోపలి అవయవాలైన గుండె, కిడ్నీల గురించి ఆలోచిస్తాడు. నేనైతే ఆనంద్ కుడిపైపు ఛాతీ పైభాగపు ఎముకల కింద గుట్టుగా ఉంటూ, పొట్టకు అవసరమైన పనులు ప్రధానంగా చేస్తుంటా. కాళ్లూ, చేతులు కదపాలన్నా, ఆట ఆడాలన్నా, గోలు కొట్టాలన్నా నేనే. కండరంతో పరుగుతీయాలన్నా, తిన్నది అరగదీయాలన్నా నేనే చేయాలి.కానీ నా ఉనికే తెలియదు. అతడిలో నేను ఉన్నాననే ఆలోచనే అతడికి రాదు. కానీ అతడి ఒంటిలోపలి భాగాల్లో అతి పెద్ద అవయవాన్ని నేనే. దాదాపు కిలోన్నర తూగుతాను. ఆ నేనే... కాలేయం. ఇంగ్లిష్‌లో లివర్. ఉనికిలో ఎంత సెలైంటో పనిలో అంత వైబ్రెంట్! జీవక్రియల్లో ఎక్స్పర్ట్. కాలం పరంగా కాన్స్టాంట్. పని అందుకోవడంలో ఇన్స్టాంట్! ఇంతెందుకు... ఒక్కమాటలో చెప్పాలంటే ఆనంద్ ఏ పని చేసినా అందులో నా వాటా ఉంటుంది. పని మానేస్తే పైకే...! శరీరంలో అత్యంత సంక్లిష్టమైన భాగాలు అని చెప్పుకునే పరిస్థితి వస్తే... నన్ను చూసి ఆనంద్ గుండె, ఊపిరితిత్తులు కాస్త సిగ్గుపడాల్సిందే. ఓ జాబితాగా రాయాల్సి వస్తే నేను చేసే పనులు దాదాపు ఐదొందలకు పైమాటే. నేను గానీ పని మానేస్తే ఆనంద్ పని అంతేసంగతులు. నాకు ఏడు సెం.మీ. చాలు నేను చేసే పనులన్నింటినీ బయట చెయ్యాలంటే ఎకరాల కొద్దీ స్థలం కావాలి. అందులో ఒక పే...ద్ధ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలి. నేను చేసే అత్యంత సరళమైన పనికోసమే ఇది కావాలి. ఇక సంక్లిష్టమైన పనులకు ఎంత కావాలో మీరే ఊహించుకోవచ్చు. అంతెందుకు... నేను చేసే అంత్యంత సంక్లిష్టమైన పనులు ఈ ప్రపంచంలోని ఏ కెమికల్ ఫ్యాక్టరీ కూడా చేయలేదు. నేను దాదాపు వెయ్యికి పైగా ఎంజైములను ఉత్పత్తి చేస్తాను. అవి దేహంలోని రసాయన చర్యలకు తోడ్పడతాయి. ఆ చర్యల ద్వారా ఒక రకం పదార్థం మరో రకంగా మారేందుకు దోహదపడుతుంది. ఉదాహరణకు ఆనంద్ వేలు పొరబాటున తెగిందనుకోండి. నేను రంగంలోకి దిగకపోతే వేలంతా రక్తసిక్తం. ఆనంద్‌కు మరణం తథ్యం. అప్పుడు నేను రక్తం గడ్డకట్టే ఫ్యాక్టర్స్ పుట్టిస్తా. రక్తాన్ని గడ్డకట్టిస్తా. ఆనంద్ ప్రాణాలకు నా యాంటీబాడీస్ అడ్డేస్తా. అలాంటి యాంటీబాడీస్‌ను మరెన్నో పుట్టించి ఎన్నోన్నో అనర్థాలు రాకుండా కాపాడుతుంటా. జీర్ణక్రియ... నా పనితీరుకు నిదర్శనక్రియ ఆనంద్‌కు మాంసాహారం అంటే ఇష్టం. అందులో ఉండేవన్నీ ప్రోటీన్స్. జీర్ణమయ్యే క్రమంలో అవి ముక్కలవుతూ అమైనోయాసిడ్స్‌గా రూపొందుతాయి. ఆ పదార్థం యధాతథంగా రక్తంలో కలిస్తే మాత్రం ఆనంద్ అంతే సంగతులు. ఎందుకంటే అది సైనైడ్ అంతటి విషపూరితం. శత్రువుల్లాంటి ఆ అమైనో యాసిడ్స్‌ను నేను మేని మిత్రులుగా మార్చేస్తా. వాటి నైజాన్ని హ్యూమనైజం చేసేస్తా. ఇక నేను చేసే మరోపని ఏమిటంటే... కాస్త ఆకుపచ్చగానూ, మరికాస్త పసుపపచ్చగానూ ఉండే, చాలా చేదైన బైల్‌ను ఉత్పత్తి చేస్తా. నాలో ఉత్పత్తి అయిన ఈ జీర్ణరసం మొదట గాల్‌బ్లాడర్‌లోకి వెళ్లి మరింత గాఢమవుతుంది. కడుపు, పేగులకు మధ్య ఉండే చిన్న సంచిలోకి చేరుకుంటుంది. అక్కడి నుంచి చిన్నపేగుల్లోని జారిపోతుంది. మనం తిన్న ఆహారపు ముద్దల్ని అక్కడ జీర్ణం చేస్తుందది. ఈలోపు ఆహారనాళంలోని కొవ్వులను కడిగేస్తుందీ బైల్‌జ్యూస్. ఇందులోనూ రెండు పదార్థాలు ఉంటాయి. ఒకటి బిలురుబిన్ (ఇది ఎరుపు రంగులోని బైల్). రెండోది బైలివెర్డిన్ (ఇదేమో ఆకుపచ్చ బైల్). అప్పుడప్పుడూ ఈ రంగు పదార్థాల్లో ఏవైనా రక్తంలో కలిస్తే కామెర్ల రూపంలో బయటకు కనిపిస్తుంటాయి. ఇలా కనిపించాయంటే... నా పనితీరులో ఏదో తప్పు జరుగుతుందని గుర్తించాలి. ఈ తప్పు మూడు రకాలుగా జరగవచ్చు. మొదటిది... మలేరియా సూక్ష్మజీవి ఒంట్లోకి ప్రవేశించడం లేదా ఎర్రరక్తకణాలు అతిగా నాశనమవుతూ రక్తహీనత వచ్చి ఉండవచ్చు. అప్పుడు... నేను తొలగించే వేగం కంటే నాశనమయ్యే ఎర్రరక్తకణాల వ్యర్థాలు ఎక్కువగా ఉంటే అవి రక్తంలోకి చేరుకుని కామెర్ల రూపంలో కనిపించవచ్చు. రెండోది... గాల్‌బ్లాడర్ నుంచి పేగులకు వచ్చే మార్గంలో ఏదైనా అడ్డుపడటం వల్ల బైల్ వెనక్కు ప్రవహించి, అది రక్తంలో కలిసి కామెర్లుగా ప్రయుక్తం కావచ్చు లేదా బైల్ ప్రవాహ మార్గాల్లో కొవ్వు అడ్డం పడటం వల్ల కూడా కామెర్లు కనిపించవచ్చు. ఇక మూడోది... నా కణాలకు.. అంటే కాలేయ కణాలకు హెపటైటిస్ లేదా ఏదైనా ఇతర వ్యాధులు సోకి వాటికి ఇన్ఫ్లమేషన్ రావచ్చు. అదే జరిగితే నాకూ ఇబ్బంది. ఆనంద్‌కూ ప్రమాదం. అతి ఉంటే మితి చేస్తా... అతడి శరీరంలో అతిగా ఉండకూడని పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని ఉండాల్సిన పరిమాణంలోకి మార్చేస్తా. అతి పరిమితులను తెలుసుకొని... అదనాలను వదిలిస్తా. ఒంట్లోని విషపదార్థాలను యూరియాగా మార్చేస్తా. మూత్రపిండాల్లోకి పంపేస్తా. ఆనంద్‌లోని అడ్రినల్ గ్రంథులు... శరీరంలో లవణాలను ఉండేలా చూస్తాయి. ఉండాల్సిన వాటికంటే అవి అదనంగా ఉంటే ఆనంద్ ఉబ్బిపోతాడు. అందుకే నేను వాటిని నాశనం చేస్తా. ఇల్లూడ్చినట్టే... నేను ఒళ్లూడుస్తుంటా... ఆనంద్ తన ఇల్లు ఊడ్చుకుని శుభ్రంగా ఉంచుకున్నట్టే... అతడిలోని వ్యర్థాలను ఊడ్చేస్తుంటాను నేను. ఎప్పటికప్పుడు కొత్తవి పుడుతుండటంతో ప్రతి సెకండ్‌కూ ఆనంద్ ఒంట్లో కోటి ఎర్రరక్తకణాలు చనిపోతూ ఉంటాయి. వాటిని భస్మం చేసే బాధ్యత నాదే. ఆ భస్మాన్ని తిరిగి ఉపయోగించి మళ్లీ కొత్త రక్తకణాలను పుట్టించే పనికూడా నాదే. పెరిగే కొవ్వును చూసుకోవాలి... ఆనంద్ వయసు పెరుగుతోంది. ఈ వయసులో కొవ్వు కూడా పెరుగుతుంటుంది. ఇది నాలోనూ జరుగుతుంటుంది. నాలో నార్మల్‌గా పనిచేసే కణాల స్థానంలో కొవ్వు పేరుకుంటూ ఉండవచ్చు. అలాంటప్పుడు అది కొన్నిసార్లు రక్తప్రవాహానికి అడ్డురావచ్చు. కొన్ని అంతర్గత అవయవాలను దెబ్బతీయవచ్చు. అప్పుడు నా ఆకృతి, నా స్వాభావికమైన రంగు దెబ్బతినవచ్చు. నేను జిగురుజిగురుగా, పచ్చరంగుకు మారవచ్చు. ఆ కండిషన్‌నే సిర్రోసిస్ అంటారు. ఇది కొన్నిసార్లు ఆర్సెనిక్ వంటి విష ప్రభావాల వల్ల లేదా కొన్ని వ్యాధుల వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల, తగినంత ఆహారం తీసుకోకుండా, మితిమీరిన ఆల్కహాల్ వల్ల (అంటే రోజుకు 350 ఎం.ఎల్. కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల) కూడా సిర్రోసిస్ రావచ్చు. సిర్రోసిస్ లక్షణాలివే... ఆనంద్ ఒంటిపై భాగంలో రక్తనాళాలు సాలీడు ఆకృతిలో బయటకు కనిపిస్తున్నా, ఆకలి లేకపోయినా, నీరసంగా ఉన్నా, బాగా నిస్సత్తువగా అనిపిస్తున్నా, పొట్టలో విపరీతంగా గ్యాస్ పేరుకుంటున్నా, కళ్లు పసుపురంగులో కనిపిస్తున్నా డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పుడు నా పనితీరును తెలుసుకోడానికి మంచి మంచి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు నాలోకి బ్రోమ్సల్ఫాలియేన్ అనే ఒక రంగు పదార్థాన్ని (డై)ని లోపలికి పంపిస్తారు. నా పనితీరు బాగుంటే 45 నిమిషాల్లో అంతా బయటకు పంపేస్తాను. ఇదిగాక బైలురుబిన్ వంటి పిగ్మెంట్ మోతాదులు రక్తంలో ఎంత ఉన్నాయో పరీక్ష చేసి, నాలోని అనారోగ్యాన్ని కనుగొంటారు. ఆనంద్ ఆ పరిస్థితికి రాలేదు. కానీ వచ్చినా ఇబ్బంది లేదు. ఎందుకంటే చాలావరకు ఆహార నియమాలు పాటిస్తూ, ప్రోటీన్లు తీసుకుంటూ, మామూలు మందులతోనే మళ్లీ నన్ను నార్మల్ చేయడానికి అవకాశం ఉందిప్పుడు. నన్ను కాపాడుకోవడం ఎలా? నన్ను కాపాడుకోవడం చాలా సులువు. ఆనంద్ బరువు పెరుగుతుంటే... నేనూ బరువు పెరుగుతున్నానన్నమాటే. ఆ పెరిగే బరువును అదుపు చేసుకోవాలి. ఆల్కహాల్‌కు పూర్తిగా దూరం కావాలి. తగినన్ని విటమిన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా ‘బి’ విటమిన్ తీసుకోవడం ప్రధానం. ఇన్పుట్స్: డా॥డి.నాగేశ్వర్‌రెడ్డి ఛైర్మన్ అండ్ చీఫ్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, హైదరాబాద్ ఫుడ్డును ఫ్యూయల్‌గా మార్చేది నేనే... ఆనంద్ గోల్ఫ్ ఆడాలన్నా, కాలిబంతి ఆటలో గోల్ కొట్టాలన్నా... ఆ కండరాలకు అవసరమైన శక్తిని ఇవ్వడానికి తోడ్పడేదీ నేనే. తిన్న పదార్థాలు గ్లూకోజ్‌గా మారతాయి. తగినంత శక్తి కోసం చక్కెరలు మండుతాయి. కండరం కదులుతుంది. ఆటకు అవసరమైన ఎనర్జీ అందుతుంది. ఈ ప్రక్రియలో కండరం అలసిపోతే లాక్టిక్ ఆసిడ్ ఉత్పత్తి అవుతుంది. అ లాక్టిక్ యాసిడ్ వృథాపోకుండా మళ్లీ దాన్ని గ్లైకోజెన్‌గా మార్చి నిల్వ ఉంచుతాను నేను. ఆనంద్ పనిచేస్తున్నప్పుడు మళ్లీ ఈ గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా మార్చి అతడికి అవసరమైన శక్తిని అందిస్తాను. నయాపైసా కూడా వృథాగా ఖర్చుకాకుండా ఆపే ఇల్లాలిలా ఒంటిలోని రేషన్‌ను చక్కగా నిత్యం అందేలా మేనేజ్ చేస్తుంటాను. శక్తి అపారం.. అదే శాపం-అదే వరం! నాలోని శక్తి అపారం. నాలోని దాదాపు 85 శాతం కణాలు పూర్తిగా నాశనమైనా నా పనితీరులో మార్పురాదు. నా అద్భుత శక్తే నాకు అభిశాపమవుతుంది. అంటే కేవలం నా సామర్థ్యం 15 శాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడు గానీ లక్షణాలు బయటకు కనిపించవు. దాంతో ఆనంద్‌కు నా హెచ్చరికలు వినిపించే వేళకు లేదా నా పని తగ్గడం వల్ల కలిగే లక్షణాలు కనిపించే వేళకు జరగాల్సిన నష్టం జరగవచ్చు. ఇక ఈ అంశమే కొన్ని సార్లు వరం కూడా. మిగతా ఏ అవయవానికీ లేని అద్భుత శక్తి నాకు మరొకటి ఉంది. నాలో 60 శాతం భాగాన్ని తొలగించినా నేను మళ్లీ మునుపటి పరిమాణానికి పెరుగుతాను. విషాల పాలిటి అడ్డుగోడ... . విషాల నీడ కూడా ఆనంద్ ఒంట్లో పడకుండా చూసే అడ్డుగోడను నేను. రోజూ సిగరెట్ తాగుతూ నికోటిన్ అనీ, కాఫీ తాగుతూ కెఫిన్నీ, తింటూ ఇంకొన్ని పాయిజన్లను ఒంట్లోకి యధేచ్ఛగా వదిలేస్తుంటాడు ఆనంద్. అవి గుండెకు చేరకుండా నేను గోడలా అడ్డు ఉంటా. ఆనంద్ మద్యం తాగుతుంటాడు. కాక్టెయిల్స్ తీసుకుంటూ కబుర్లాడుతుంటాడు. అతడు అలా పరమానందం పొందుతుంటే అందులోని ప్రమాద కారకాలపై అప్పటికప్పుడు పనిచేస్తూ ఎప్పటికప్పుడు పరిహరిస్తుంటాను. ఆల్కహాల్ ప్రవేశించగానే దాన్ని నీళ్లుగా చేసి, మూత్రంలా మార్చేస్తా. కార్బన్డైఆక్సైడ్లా మార్చి ఊపిరి తీసుకునే సమయంలో బయటకు పోయేలాచూస్తా. ఇలా అన్ని విషాలను విరిచేస్తా. అన్ని మోతాదులనూ సరిచేస్తా. గుండెకు సేఫ్టీ వాల్వ్ గుండెకు ఒక సేఫ్టీ వాల్వ్ లాగా పనిచేస్తా. నా పైనుంచే ఆనంద్ గుండెలోకి హెపాటిక్ వెయిన్ అనే రక్తనాళం వెళ్తుంటుంది. అలా గుండెలోకి రక్తం వెళ్లే సమయంలో అదొక బలమైన అలలా వెళుతూ ఉంటుంది. ఆ రక్త ప్రవాహం నాలోంచే జరుగుతుంటుంది. హెపాటిక్ వెయిన్ ద్వారా గుండెకు వెళ్లే రక్తం కనీసం ఆరు నుంచి పది సెకండ్ల వ్యవధి పాటు నాలోంచి వెళ్తుంది. ఆ టైమ్ నాకు చాలు. తక్షణమే తరంగవేగాన్ని తగ్గిస్తా. నెత్తురునంతా నేను మెత్తటి స్పాంజ్‌లా అద్దేస్తా. అలా నాలోకి ఇంకేలా చేస్తా. నా ఎగ్జిట్ వెసెల్స్ నుంచి కొంత కొంత రక్తాన్నే పంపిస్తా. అలా గుండె ఉక్కిరిబిక్కిరి కాకుండా చూస్తా. కాసేపు ఆ రక్తభారాన్ని నేనే మోస్తా. గుండెకు ఎంత వస్తే సౌకర్యమో అంతే రక్తాన్ని సరఫరా చేస్తా. -
జాబన్నారు.. కిడ్నీ కోట్టేశారు!!
-
యువకుడి కిడ్నీలో భారీ రాయి
మెదక్ టౌన్: ఓ యువకుడి కిడ్నీలో నుంచి 300 గ్రాముల రాయిని వైద్యులు బయటకు తీశారు. ఇంతపెద్ద రాయిని చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. ఈ ఘటన మెదక్‌లో గురువారం వెలుగులోకి వచ్చింది. కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన మోహన్(25) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూడు రోజులుగా మూత్రం ఆగిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆయన మెదక్‌లోని సాయిచంద్ర నర్సింగ్‌హోంకు వచ్చాడు. పరీక్షలు చేసిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ నిర్వహించగా కిడ్నీలో 300 గ్రాముల బరువుగల రాయి బయట పడింది. ఓ వ్యక్తి కిడ్నీలో ఇంత పెద్ద రాయి రావడం ఇదే మొదటిసారి అని వైద్యులు సురేశ్ పేర్కొన్నారు. -
కిడ్నీలో 300 గ్రాముల రాయి
ఓ యువకుడి కిడ్నీలో నుంచి 300 గ్రాముల రాయిని వైద్యులు బయటకు తీశారు. ఇంతపెద్ద రాయిని చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. ఈ అరుదైన సంఘటన మెదక్ పట్టణంలో గురువారం వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మోహన్(25) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూడు రోజులుగా మూత్రం ఆగిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ మోహన్ మెదక్ పట్టణంలోని సాయిచంద్ర నర్సింగ్‌హోంకు వచ్చాడు. పరీక్షలు చేసిన వైద్యులు సురేశ్ కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ నిర్వహించగా కిడ్నీలో 300 గ్రాముల బరువుగల రాయి బయట పడింది. కిడ్నీలో ఇంత పెద్ద రాయి రావడం ఇదే మొదటిసారి అని వైద్యులు సురేశ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇంతపెద్ద పరిమాణంలోని రాయిని చూడలేదన్నారు. నీళ్లు సక్రమంగా తాగకపోవడం, మాంసహారం అధికంగా తీసుకోవడం, వంశపారంపర్యంగా కిడ్నీల్లో రాళ్లు వస్తుంటాయన్నారు. ఎంత ఎక్కువగా నీళ్లు తాగితే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడని వైద్యులు తెలిపారు. -
నేను మీ కిడ్నీని
నేను ఆనంద్ కవల కిడ్నీని. నడుములోని వెన్నుపూసకు ఇరుపక్కలా ఇద్దరం ఉంటాం. నేను మూత్రం తయారీకి మాత్రమేనని ఆనంద్ అనుకుంటూ ఉంటాడు. నిజానికి ఆనంద్ శరీరమంతటికీ నేనే మాస్టర్ కెమిస్ట్‌ను. అంతేకాదు... శరీరంలోని ఎర్ర రక్తకణాల ఉత్పాదనలో నాకూ వాటా ఉంది. శరీర భాగాలన్నింటిలోనూ ఎక్కువ రక్తం అందేది మెదడుకు అని అందరూ అనుకుంటుంటారు. ఇది కొద్దిమేరకు మాత్రమే వాస్తవం. నిజానికి ఎక్కువ రక్తం నాలోంచే ప్రవహిస్తుంటుంది. శరీరంలోని నీటి సరఫరాను నేనే నియంత్రిస్తుంటాను. రక్తంలోని పొటాషియమ్, సోడియమ్ క్లోరైడ్ మోతాదులను సరిచూసేదీ నేనే. ఆకారం చిన్నది... పని పెద్దది నా బరువు కేవలం 140 గ్రాములే కానీ... నేను చేసే పనులను ఒక పట్టికలా రాసినా... ఒక పట్టాన అది పూర్తి కాదు. ఒకవైపు నేనూ, మరోవైపు నా హలోబ్రదర్... ఇద్దరం కలిసి వడపోత పనిని చేస్తుంటాం. నాలో కనీసం పది లక్షల వడపోత యూనిట్లు పనిచేస్తుంటాయి. ఒక్కో యూనిట్‌ను నెఫ్రాన్ అంటారు. ఇది సన్నటి తీగలుగా, చుట్టలు చుట్టినట్లుగా ఉంటుంది. తోకలాంటి ఈ సన్నటి పైపునకు ఒక తల కూడా ఉంటుంది. తీగలుగా చుట్టున ఒక పైపును సాగదీస్తే అది కనీసం 105 కిలోమీటర్ల పొడవుంటుంది. ఇంత పొడవుండే సన్నటి తీగల ద్వారా కొనసాగే ఈ వడపోత ఎంత నిరంతరాయం సాగుతుందో వివరించాలంటే తనకు తెలికుండా నేను ఆనంద్ ఒంట్లో చేసే ఒక అద్భుతం గురించి చెప్పాలి. అదేమిటంటే... ఆనంద్ ఒంట్లో ఆరు లీటర్ల రక్తం ఉందనుకుందాం. మేమిద్దరమూ కలిసి గంటకు 12 లీటర్ల రక్తాన్ని వడపోస్తాం. అంటే ఆనంద్ శరీరంలో ఉన్న మొత్తం రక్తానికి రెట్టింపు ఫిల్టర్ చేస్తాం. చక్కెర బయటకు పోదు... పొటాషియమ్ తగ్గద ఇంత జరుగుతున్నా శరీరంలోని అమైనో యాసిడ్స్, విటమిన్లు, చక్కెర లాంటి వాటిని బయటకు వెళ్లనివ్వం. ఇలా దేహంలో ఎన్నో వైపరిత్యాలు, అనర్థాలూ జరగకుండా మేం నిత్యం ఆపుతుంటాం. వడపోసిన పదార్థాల్లో మళ్లీ అవసరమైన వాటిని 99 శాతాన్ని తిరగి శరీరానికి అందిస్తుంటాం. కేవలం వ్యర్థాలను మాత్రమే మూత్రం రూపంలో బయటకు పోనిస్తాం. ఒకవేళ ఆనంద్ రెండు పెద్ద పెద్ద పేస్ట్రీలు తిని... తాను డయాబెటిస్ పేషెంట్ అని తన డాక్టర్‌ను నమ్మించడానికి ప్రయత్నిస్తే ఆనందే ఫూల్ అవుతాడు. ఎందుకంటే చక్కెరలను నేను అంత తేలిగ్గా బయటకు పోనివ్వను. కానీ తాను రుచి కోసం అధిక మోతాదులో తీసుకున్న ఉప్పు అంతా రక్తంలోనే ఉండిపోతుందని ఆనంద్ నమ్మితే... అతడు ఉప్పులో కాలేసినట్టే! చక్కెరలనంటే బయటకు పోనివ్వలేదుగానీ పిడుక్కీ, బియ్యానికీ లాగా... ఉప్పులకూ, చక్కెరకూ నేను ఒక్కటే మంత్రం పఠిస్తే ఆనంద్ చచ్చూరుకుంటాడు. ఆ ఉప్పు శరీరంలో ఉన్న నీటిని లాగేస్తుంది. ఫలితంగా రక్తం చిక్కబడుతుంది. ఆనంద్ రక్తాన్ని పంప్ చేయడానికి అతడి గుండె ఎంతో కష్టపడుతుంది. ఆనంద్ కడుపు నిండా తింటూ, పళ్లరసాలూ అవీ తాగుతూ తగినంత పొటాషియమ్ తీసుకుంటూ ఉంటే పర్లేదు. అతడి కండరాలు సక్రమంగా పనిచేయడానికి అది కావాలి. అతడు తన ఆహారం ద్వారా తగినంత పొటాషియమ్ తీసుకోవడం లేదనుకోండి. నేనో పిసినారిలా దాన్ని వాడుతుంటా. విపరీతమైన శ్రమ... నిరంతరమైన పని ఆనంద్ శరీరంలోంచి నేను బయటకు తోడివేసే ప్రధానమైన వ్యర్థం ‘యూరియా’. మనం తీసుకునే ప్రోటీన్లు జీర్ణమయ్యే ప్రక్రియలో మిగిలిపోయే పదార్థమిది. ఇది శరీరంలో ఉండిపోవడం అత్యంత ప్రమాదకరం. ఒకవేళ మిగిలిపోయిందా... ఇక అంతే సంగతులు. మొదట నీరసం. తర్వాత నిదానంగా కోమా. చివరికి మరణం. అందుకే యూరియా పేరుకోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడతాను. కిడ్నీలో రిజర్వాయర్ కనీసం రోజుకు ఒక లీటర్‌కు తగ్గకుండా మూత్రాన్ని తయారు చేస్తాం. నెఫ్రాన్ల నుంచి నిరంతర రక్తప్రవాహం కొనసాగి... అది చివర్లో ఒక అద్భుతమైన అత్యంత సూక్ష్మమైన రిజర్వాయన్లోకి తెరచుకుంటుంది. అది సరిగ్గా నా మధ్యలో (కిడ్నీ సెంటర్లో) ఉంటుంది. ఈ రిజర్వాయర్ నుంచి మూత్రసంచి (బ్లాడర్) కి మళ్లీ నీటి పారుదల దారులుంటాయి. వీటి ద్వారా ప్రతి 10-30 సెంకడ్లకు ఒకసారి వ్యర్థాలను బయటకు నెడుతుంటాను. పగటితో పోలిస్తే... రాత్రి కాస్త మందకొడిగా పనిచేస్తుంటా. లేకపోతే మూత్రశాలకు వెళ్లడానికంటూ ఆనంద్ ప్రతి గంటకూ ఒకసారి లేవాల్సి ఉంటుంది. పెరిగే వయసు... తగ్గే పనితీరు ఆనంద్‌కు 47 ఏళ్లు నిండాక... మెల్లగా నాలోనూ వయసు పెరగడం మొదలవుతుంది. నా చుట్టూ ఉండే కొవ్వు పడక మీద నేను శయనించి ఉంటాను. ఒకవేళ ఏదైనా సమస్యతో ఈ కొవ్వు పడక కరిగితే... అప్పుడు నేను పక్కకు జరుగుతాను. ఒక్కోసారి నాలో రాళ్లు కూడా పేరుకుపోతాయి. ఈ రాళ్లు క్యాల్షియమ్, యూరిక్ యాసిడ్‌తో తయారవుతాయి. రోడ్డు మీద కంకర ఉంటే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగినట్లుగా ఈ రాళ్ల వల్ల మూత్రప్రవాహానికి అడ్డుకలుగుతుంది. అది చిన్న రాయి అయితే చిదిమినట్లుగా అయిపోవడం, లేదా కిందికి జారిపోవడం జరుగుతుంది. కానీ కంకరరాయి ఎంత పెద్దదయితే అడ్డంకి అంతగా పెరుగుతున్నట్లుగానే... నాలోని రాయితోనూ అలాంటి ప్రమాదమే ఉంటుంది. అది బఠాణీ గింజ అంత కావచ్చు. లేదా ఒక్కోసారి ద్రాక్షపండు అంత పెరగవచ్చు. రోడ్డు మీద పెద్ద పెద్ద రాళ్లను పారతో పక్కకు తీసేసినట్టే, నాలో అంతగా పెరిగిన రాళ్లనూ సర్జరీతో తొలగించాలి. లేదంటే రాయి సైజు మరీ పెద్దదయితే రిజర్వాయర్‌లో ఇరుక్కుపోతుంది. రాయి నాలోని రిజర్వాయర్ లోంచి బ్లాడర్‌లోకి జారి మూత్రప్రవాహాన్ని అడ్డుకోవచ్చు. రిజర్వాయర్‌కు లేదా బ్లాడర్ గోడలకు గానీ గాయం కావచ్చు. అదే జరిగితే ఇన్ఫెక్షన్ విలన్లా పొంచి ఉంటుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ ఏర్పడితే అది తన సామ్రాజ్యాన్ని రిజర్వాయర్ నుంచి కిందకు విస్తరించవచ్చు. అందుకే రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే... ఆనంద్ ద్రవాహారం ఎక్కువగా కావాలి. నేను సరిగా పనిచేయడం లేదని ఎలా తెలియాలి ఒక్కోసారి రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే యాక్సిడెంట్లలోనూ నేను గాయపడవచ్చు. లేదా ఒక్కోసారి నాలోని రక్తనాళాలూ తెగవచ్చు. ఇవేమి జరిగినా నాకు కలిగే ప్రమాదం తాత్కాలికమే. ఎందుకంటే కోలుకునే శక్తి నాలో అపారం. అయితే ఒక్కటి... వయసు పెరుగుతున్న కొద్దీ నాలోకి ప్రవహించే రక్తనాళాలు గట్టిపడవచ్చు, సన్నబడవచ్చు. వాటి మృదుత్వం తగ్గవచ్చు. ఆనంద్ గుండె పంపింగ్ సామర్థ్యమూ తగ్గవచ్చు. అప్పుడు నాలోకి వచ్చే రక్తప్రవాహ వేగం తగ్గవచ్చు. నాలో వ్యర్థాలూ పోగుపడవచ్చు. అప్పుడు నేను రక్తంలోని లవణాల పాళ్లను సక్రమంగా నియంత్రించలేకపోవచ్చు. ఇది ఆనంద్‌లోని మొదలైంది. అదృష్టవశాత్తూ నాకు ఒక అన్నదమ్ముడున్నాడు. వాడు నాకు తోడు వస్తాడు. మేమిద్దరమూ కలిసి, ఆనంద్ శరీరానికి అవసరమైన పనిని చేయగలుగుతాం. ఇంతకు ముందు తగినన్ని మందులు లేవుగానీ... ఇప్పుడు మమ్మల్ని బాగు చేయగల మందులూ ఉన్నాయి. మాకు రాబోయే సమస్యను ముందే తెలుసుకోగల పరీక్షలూ ఉన్నాయి. మాకు చెరుపు చేసే ఎన్నో సమస్యల్ని నివారించే జాగ్రత్తలూ ఉన్నాయి. ఇంతెందుకు ఆనంద్ తన బరువును నియంత్రించుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ ఉండే చాలు. బాగా వ్యాయామం చేస్తే చాలు. నాకు రాబోయే ఎన్నో అనర్థాలు నివారితమవుతాయి. నేను ఉత్పత్తి చేసే మూత్రం రంగును గుర్తించినా, అతడి ముఖం ఉబ్బుగా ఉన్నా, కళ్లు మసకబారుతున్నా, ఒళ్లు బలహీనంగా అనిపించినా గమనిస్తే... నేను అరుస్తున్న అరుపు అతడికి వినిపించినట్టే. జరగబోయే చెరుపు దూరమైనట్టే. - ఇన్పుట్స్: డాక్టర్ పి. నాగేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ మూత్రపిండం మరికొన్ని వాస్తవాలు... కొన్ని సందర్భాల్లో కొందరు రోగుల్లో పాలకూర మాత్రమే కాదు... పాలు కూడా కిడ్నీలో రాళ్లుగా మారవచ్చు. మనిషి బతకడానికి కేవలం 75 శాతం పనితీరుతో ఒక కిడ్నీ ఉంటే చాలు. కిడ్నీలు రక్తపోటునూ అదుపులో ఉంచుతాయి. కిడ్నీ కంప్యూటర్ మౌస్ అంత ఉంటుంది. కానీ కంప్యూటర్లోని చిప్స్ కంటే సంక్లిష్టమైన నిర్మాణంతో ఉంటుంది. విటమిన్ ‘డి’ ఉత్పాదనను స్టిమ్యులేట్ చేసేది కిడ్నీయే. కిడ్నీ పనితీరు పూర్తిగా తగ్గిపోవడం వల్ల వచ్చే జబ్బును ‘ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్’ (ఈఎస్ఆర్డీ) అంటారు. కిడ్నీలు దెబ్బతినవడం వల్ల దీర్ఘకాలం పాటు బాధపడే జబ్బును క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. రక్తపోటు సరిగా ఉన్నప్పుడు రక్తాన్ని కృత్రిమంగా శుభ్రపరిచే ప్రక్రియను ‘డయాలసిస్’ అంటారు. అదే రక్తపోటు అస్థిమితంగా ఉన్నప్పుడు కూడా రక్తాన్ని శుభ్రపరిచే ప్రక్రియను ‘కంటిన్యువస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ’ అంటారు. మందుబాబులూ జాగ్రత్త! మద్యం తాగినప్పుడు కిడ్నీ ఎక్కువగా పనిచేసి మూత్రాన్ని ఎక్కువగా బయటకు పంపాల్సి వస్తుంది. దాంతో ఒంట్లోని నీరంతా బయటకు పోతుంది. అది చాలా ప్రమాదం కదా. అందుకే అప్పుడు పిట్యూటరీ గ్రంథి రంగంలోకి దిగుతుంది. ‘యాంటీ-డైయూరెటిక్’ హార్మోన్‌ను వెలువరిస్తుంది. దాంతో ఒంట్లోని నీరంతా బయటకు వెళ్లకుండా ఉంటుంది. కానీ ఎంత డైయూరెటిక్ హార్మోన్ ఉత్పత్తి అవుతున్నా... ఆల్కహాల్ ఎక్కువతే యాంటీ డైయూరెటిక్ హార్మోన్ తగ్గుతుంది. ఒక్క మద్యంతోనే ఈ ప్రమాదమని అనుకుంటున్నారా? కాఫీ తాగినా అంతే. సిగరెట్‌తోనూ సేమ్ యాక్షన్. -
ప్రేమికుడి కోసం యువతి కిడ్నీ దానం!
మాన్చెస్టర్: నిజమైన ప్రేమకు నిదర్శనం ఇదే కావొచ్చు. గత ఏడాది వేసవిలో గోల్ఫ్ కోర్సులో తొలిసారి కలుసుకున్నప్పుడు జాక్ సిమర్డ్ (49), మిషెల్లి లాబ్రాంషె తమ మధ్య ఇన్ని సారూప్యతలు ఉన్నాయని గుర్తించి ఉండరు. కానీ క్రమంగా ఒకరంటే ఒకరికీ అభిమానం ఏర్పడింది. ఇద్దరు ప్రేమలో పడిపోయారు. న్యూ హ్యాంప్‌షైర్ లోని స్టోన్ బ్రిడ్జ్ కంట్రీ క్లబ్లో ఇద్దరు కలిసి తరచూ గోల్ఫ్ ఆడేవారు. అయితే, మాంచెస్టర్‌కు చెందిన సిమర్డ్ రెండు మూత్రపిండాలు చెడిపోవడంతో గత కొంతకాలంగా ఆయన కిడ్నీ దాత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయం తెలియడంతో మిషెల్లి రహస్యంగా వెళ్లి తన కిడ్నీ ఆయనకు సరిపోతుందో లేదో పరీక్షలు చేయించుకుంది. ఆశ్చర్యకరంగా ఇద్దరి కిడ్నీలు మ్యాచ్ అయ్యాయి. వీరి ప్రేమకు చిహ్నంగా వాలంటైన్స్ డే (ఫిబ్రవరి 14) నాడు మిషెల్లి సిమర్డ్కు కిడ్నీ దానం చేయనుంది. సిమర్డ్ 19 ఏళ్ల కిందట తొలిసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు. అప్పట్లో అతని సోదరి కిడ్నీ దానం చేసింది. ఇప్పుడు తన ప్రియురాలు ఇందుకోసం ముందుకొచ్చింది. తన భవిష్యత్ జీవితమంతా సిమర్డ్యేనని, ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని మిషెల్లి తెలిపింది. -
అక్కకు ఉంటే చెల్లికీ వస్తుందనేది అపోహ!
బ్రెస్ట్ క్యాన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ఇటీవల మా అక్కకు రొమ్ము క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఆమెకు వచ్చిన రొమ్ముక్యాన్సర్ పూర్తిగా నయం అవుతుందా? తోబుట్టువులలో ఒకరికి ఈ సమస్య ఉంటే మిగతా వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుందని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. అది నిజమేనా? రొమ్ముక్యాన్సర్‌ను నివారించేందుకు ఏం చేయాలి? దయచేసి మా సమస్యకు పరిష్కారం చూపించగలరు. - జ్యోత్స్న, హైదరాబాద్ రొమ్ము క్యాన్సర్ పట్ల ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. మీ సోదరికి రొమ్ము క్యాన్సర్ ఉన్నంత మాత్రాన మీకు కచ్చితంగా ఆ వ్యాధి రావాలని ఏమీ లేదు. మీ సోదరి రెండు రొమ్ముల్లోనూ క్యాన్సర్ వస్తేనే అప్పుడు మరో సోదరికీ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు సరైన జాగ్రత్తలు పాటిస్తే రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశాలను చాలావరకు తగ్గించుకోవచ్చు. అధిక బరువు ఉన్నవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ ఎత్తుకు తగిన బరువును కలిగి ఉంటూ క్రమం తప్పకుండా ప్రతిరోజూ వాకింగ్ గానీ, స్విమ్మింగ్ గానీ, వ్యాయామంగానీ చేయండి. దాంతోపాటు తాజా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోండి. సాధ్యమైనంత వరకు జంక్ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్, నూనె పదార్థాలకు దూరంగా ఉండండి. మీ సోదరికి రొమ్ముక్యాన్సర్ నిర్ధారణ అయ్యిందని తెలిపారు. చికిత్స విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తపడండి. ఎందుకంటే రొమ్ముక్యాన్సర్ ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ఆ వ్యాధి పూర్తిగా నయమవుతుంది. దురదృష్టవశాత్తు రొమ్ముక్యాన్సర్‌పై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు వీడండి. రొమ్ముక్యాన్సర్ అంటువ్యాధి కాదు. వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలూ చాలా తక్కువ. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించుకొని జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల ఆ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. డాక్టర్ భారత్ వాస్వాని సీనియర్ హెమటో-ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 46 ఏళ్లు. మూడేళ్లుగా బీపీ ఉంది. సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే అందులో క్రియాటినిన్ 6 ఉంది. యూరియా 120 ఉంది. నాకు మూత్రపిండాల సమస్య ఉన్నట్లు డాక్టర్ చెబుతున్నారు. అయితే నాకు మూత్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాంటప్పుడు మూత్రపిండాల సమస్య ఉండవచ్చా? - సుధాకర్, అనకాపల్లి మీరు తెలిపిన వివరాలను బట్టి మీకు దీర్ఘకాలిక కిడ్నీ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. రిపోర్టులను బట్టి మీ కిడ్నీల పనితీరు 50 శాతం తగ్గినట్లుగా అనిపిస్తోంది. ఆ వివరాలు రక్త పరీక్షలో పూర్తిగా తెలియకపోవచ్చు. అలాగే వ్యాధి లక్షణాలూ కనిపించకపోవచ్చు. అయితే సాధారణంగా కిడ్నీల పనితీరులో 30 శాతం తగ్గితేనే వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. కొంతమందిలో కిడ్నీల పనితీరు చాలా ఎక్కువగా దెబ్బతిన్నా కూడా ఏ ఇబ్బందులూ కనిపించకపోవచ్చు. హైబీపీ, షుగర్, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, కుటుంబంలో ఎవరికైన కిడ్నీ వ్యాధులు ఉన్నట్లయితే క్రానిక్ కిడ్నీ డిస్ట్రెస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇలాంటి వాళ్లు ప్రతి ఏటా కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుందో తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంతగా మన కిడ్నీలను కాపాడుకునేందుకు అవకాశం ఉంది. నా వయసు 23 ఏళ్లు. గత రెండేళ్లుగా అప్పుడుప్పుడూ మూత్రం ఎరుపు రంగులో వస్తోంది ఇలా రెండు నుంచి మూడు రోజుల పాటు వస్తోంది. ఆ తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని ఇంతవరకూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇలా రావడం వల్ల కిడ్నీలు ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా? - సురేశ్, కేసముద్రం సాధారణంగా కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కొందరికి ఇలాంటి సమస్య రావచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్, యూరిన్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షలు చేయించాలి. దాంతో మీ సమస్యకు అసలు కారణం ఏమై ఉంటుందో తెలుస్తుంది. అందుకే మీరు ఒకసారి డాక్టర్‌ను కలవడం మంచిది. సమస్య నిర్ధారణ అయితే దానికి తగిన మందులు వాడవచ్చు. మీకు సాధారణ ఇన్ఫెక్షన్ ఉంటే అది మామూలు యాంటీబయాటిక్ మందులతోనే తగ్గిపోతుంది. మీరు ఒకసారి యూరిన్‌లో ప్రోటీన్లు పోతున్నాయా అనే విషయాన్ని తెలుసుకునే పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. జనరల్ హెల్త్ కౌన్సెలింగ్ నా వయసు 27 ఏళ్లు. తరచూ వెన్నునొప్పి వస్తోంది. నడుము దగ్గర మరీ ఎక్కువ. నోట్లో పెదవులపైనా, నాలుకపైనా తరచూ పొక్కులు వస్తున్నాయి. ఎప్పుడూ ఒళ్లు వేడిగా ఉంటోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం సూచించండి. - ఎ. కుమారస్వామి, కత్తిపూడి మీరు వివరించిన లక్షణాలను బట్టి మీ శరీరంలో కీళ్లనొప్పులు... ముఖ్యంగా వెన్నెముక, మెడ, తుంటి భాగాల్లో ఉండటం, పెదవులపైనా, దవడలపైనా పొక్కులు, జ్వరంగా ఉండటం వంటివి చూస్తుంటే... మీకు కీళ్లవాతం (సీరోనెగెటివ్ ఆర్థోపతి) వంటి వ్యాధులు ఉండవచ్చునేమో అనిపిస్తోంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మొదట మీరు దీనికి సంబంధించిన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పరీక్షల్లో మీకు కీళ్లవాతానికి సంబంధించిన వ్యాధులు ఉన్నట్లు తెలిస్తే దానికి తగిన మందులు కొంతకాలం పాటు వాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మానసికంగా ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మీరు చెబుతున్న లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి మీకు అలాంటి ఒత్తిళ్లు ఏవైనా ఉంటే వాటికి పరిష్కారాలు కనుగొని ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి జనరల్ ఫిజీషియన్‌ను కలిసి వారి సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. నా వయసు 42 ఏళ్లు. వీపు మీద నల్లటి మచ్చలతో కూడిన గడ్డలు వస్తున్నాయి. సాధారణ గడ్డలే కదా అని డాక్టర్‌కు చూపించ లేదు. కానీ ఇటీవల అవి పెరుగుతున్నాయి. గడ్డ గట్టిగా అవుతోంది. నా సమస్యకు తగిన సలహా ఇవ్వండి. - కె. ఆనందరావు, ఉరవకొండ మీరు చెప్పిన విషయాలను బట్టి మీకు సివియర్ యాక్నే (మొటిమలు) ఉండి ఉండవచ్చనిపిస్తోంది. ముఖం మీదే కాకుండా ఒక్కోసారి వీపు మీద, ఛాతీ మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వెంటనే డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ సలహాపై తగిన పూతమందులు, అవసరమైతే యాంటీబయాటిక్స్ వంటివి వాడితే మీ సమస్య తేలికగానే పరిష్కారమవుతుంది. డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కన్సల్టెంట్ - ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటిస్, సెంచరీ హాస్పిటల్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
పుట్టుకతోనే కిడ్నీ, గర్భాశయం లేదని..
బరేలి: పుట్టుకతోనే ఓ కిడ్నీ, గర్భాశయం లేదన్న విషయాన్ని 17 ఏళ్ల తర్వాత తెలుసుకున్న ఓ అమ్మాయి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ఈ దారుణం జరిగింది. బరేలికి చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని కొన్ని నెలల క్రితం అనారోగ్యంపాలైంది. ఆమె తల్లిదండ్రులు చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా, డాక్టర్ సలహా మేరకు అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించారు. నివేదికలో ఆమెకు ఓ కిడ్నీ, గర్భాశయం లేదని తేలింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి డిప్రెషన్‌కు లోనయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లిదండ్రులు ఆ అమ్మాయిని మరికొందరు డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. అయినా ఆ అమ్మాయి డిప్రెషన్ నుంచి కోలుకోలేదు. గత శుక్రవారం తండ్రి ఇంట్లోలేని సమయంలో ఆ అమ్మాయి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె కేకలు వేయడంతో తల్లి ఇరుగుపొరుగు వారి సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆస్పత్రిలో ఆమె మరణించినట్టు పోలీసులు తెలిపారు. -
మహారాష్ట్రలో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్?
ముంబై: మహారాష్ట్ర పోలీసులు అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ముఠా గుట్టును రట్టు చేశారా? స్థానిక రైతులను, కార్మికులను అప్పుల పేరుతో వేధించిందా? అప్పులు తీర్చకపోతే కిడ్నీలు అమ్ముకోమని బలవంతం చేసిందా.. తాజాగా అంకోలా పోలీసులు బృందం దర్యాప్తులో వెలుగు చూసిన విషయాలు దీన్నే బలపరుస్తున్నాయి. అటు జిల్పా ఎస్పీ సీకే మీనా కూడా ఇవే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. టూరిస్టు వీసాతో శ్రీలంక వెళుతున్న సంతోష్ గాలి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు విచారించారు. ఈ క్రమంలో అంతర్జాతీయ కిడ్నీ ముఠా గుట్టు రట్టయింది. విదర్భ, అంకోలా తదితర ఏరియాల్లోని పేద రైతులను, కార్మికులను వడ్డీ వ్యాపారులు దోచుకుంటున్నవైనం బైటపడింది. శ్రీలంక కేంద్రంగా అక్రమ కిడ్నీ దందా నడుస్తున్నట్టుగా పోలీసులు కనుగొన్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరు వడ్డీ వ్యాపారులను, ఏజెంట్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంకోలాకు చెందిన సంతోష్ గాలీ, శ్రీలంకకు చెందిన వడ్డీ వ్యాపారి ఆనంద్ జాదవ్ దగ్గర 20 వేల రూపాయల అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించాల్సిందిగా ఆనంద్ జాదవ్ ఒత్తిడి చేశాడు. అప్పు తీర్చలేకపోతే కిడ్నీ అమ్ముకోవాల్సిందిగా ప్రలోభ పెట్టాడు. అలా చేస్తే 20 వేల అప్పు మాఫీతో నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని నమ్మించాడు. దీంతోపాటు శ్రీలంకలోని ఆసుపత్రిలో కిడ్నీ ఇచ్చేటట్టుగా ఏర్పాట్లు చేశారు. కానీ పోలీసుల అప్రమత్తతతో అక్రమ దందాకు అడ్డుకట్ట పడింది. అటు అప్పు తీర్చకపోతే చంపేస్తామని బెదరించారని బాధితుడు గాలి పోలీసులకు తెలిపాడు. ఇక వేరే గత్యంతరం లేక కిడ్నీ అమ్ముకోవడానికి సిద్ధపడ్డట్టు వివరించాడు. నాలుగు లక్షలని చెప్పి రెండు లక్షలు మాత్రమే ఇచ్చారన్నాడు. బాధితుడు గాలి, వడ్డీ వ్యాపారి ఆనంద్ జాదవ్ సహా, గాలి శ్రీలంక వెళ్లేందుకు వీసా,పాస్‌పోర్టు ఏర్పాటు చేసిన దేవేంద్ర షిర్సత్ అనే ఏజెంటునూ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు బాధితుడు గాలికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన నాగ్‌పూర్ ఆసుపత్రి, శ్రీలంకలోని ఆసుపత్రి జోక్యంపై కూడా ఆరాతీస్తున్నామన్నారు. ఈపరిణామాలన్నింటి నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులును, పేద కార్మికులను అప్పుల పేరుతో లోబర్చుకుంటున్న ముఠా, అక్రమ కిడ్నీ వ్యాపారం నిర్వహిస్తోందనే అనుమానాన్ని ఎస్పీ సీకే మీనా వ్యక్తం చేశారు. వ్యవస్థీకృత కిడ్నీ సిండికెట్ అక్రమ కార్యకలాపాల వ్యవహారం తమ ప్రాథమిక విచారణలో తేలిందని పూర్తి విచారణ అనంతరం ,త్వరలోనే వివరాలు వెల్లడిచేస్తామన్నారు. -
నిద్రలేమితో కిడ్నీలకు ముప్పు
పరిపరి శోధన నిద్రలేమితో నానా మానసిక, శారీరక సమస్యలు వస్తాయనే సంగతి తెలిసిందే. నిద్ర తక్కువైతే ముఖ్యంగా ఏకాగ్రత లోపిస్తుంది. అలసటగా అనిపిస్తుంది. దీర్ఘకాలం పాటు నిద్ర తక్కువైతే గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నట్లుగా పలు పరిశోధనల్లో ఇప్పటికే తేలింది. అయితే, నిద్రలేమి వల్ల మరో ముప్పుకూడా పొంచి ఉందని అంటున్నారు అమెరికన్ నిపుణులు. రోజుకు ఐదు గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారిలో కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు 65 శాతం మేరకు ఎక్కువవుతాయని వారు హెచ్చరిస్తున్నారు. బ్రిగ్హామ్, బోస్టన్, మసాచుసెట్స్‌కు చెందిన వైద్య నిపుణులు నిద్రలేమితో బాధపడే నాలుగువేల మందిపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయాన్ని నిగ్గుతేల్చారు. -
ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్మబోయారు!
బీజింగ్: స్మార్ట్‌ఫోన్‌పై పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే. ఐఫోన్ కోసం ఇద్దరు చైనీయులు ఏకంగా తమ కిడ్నీలను అమ్ముకునేందుకు ప్రయత్నించారు. జి యాంగ్షూ రాష్ట్రానికి చెందిన వూ, హువాంగ్లు స్నేహితులు. యాపిల్ కంపెనీ లేటె స్ట్ సిరీస్ ‘ఐఫోన్ 6ఎస్’పై వూ మనసు పారేసుకున్నారు. కానీ దాన్ని కొనే స్తోమత లేకపోవడంతో హువాంగ్ ‘మనం చెరో కిడ్నీ అమ్మేసి ఫోన్ కొనేద్దాం’ అని చెప్పాడు. ఇంటర్నెట్ ద్వారా ఇద్దరూ ఓ కిడ్నీ అమ్మకాల ఏజెంట్‌ను దొరకబుచ్చుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి రావాలని ఆ ఏజెంట్ చెప్పా డు. ఈ ఐఫోన్ ప్రియులు ఆ ఆస్పత్రికి వెళ్లగా ఏజెంట్ కనిపించలేదు. దీంతో వారు కిడ్నీల అమ్మకంపై మళ్లీ ఆలోచించారు. కిడ్నీ అమ్మొద్దన్న వూ మాటల్ని హువాంగ్ వినలేదు. దీంతో వూ పోలీసులను పిలిపించాడు. హువాంగ్ పరారయ్యాడు. -
యాండ్రాలజీ కౌన్సెలింగ్
ఆ ఆపరేషన్ తర్వాత అన్నీ సమస్యలే! నా వయసు 31 ఏళ్లు. కిడ్నీలో రాయి ఉందని చెప్పి మూత్రనాళం ద్వారా దాన్ని తొలగించారు.ఆపరేషన్ చేసినప్పటి నుంచి మూత్రంలో మంట, సెక్స్ చేసేప్పుడు విపరీతమైన నొప్పి, అప్పుడప్పుడు మూత్రంలో కొంచెం రక్తం పడటం జరుగుతోంది. యూరిన్‌లో రక్తం కనపడుతుంటే చాలా ఆందోళనగా ఉంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - సీ.వి.ఆర్.ఆర్., తణుకు కిడ్నీలో రాళ్లను ఆపరేషన్ లేకుండా మూత్రనాళం ద్వారా తొలగించడం చాలా సాధారణమైన ప్రక్రియ. దీని తర్వాత చాలామందిలో ఎలాంటి సమస్యా ఉండదు. కాకపోతే కొద్దిమందిలో మాత్రం యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చి, తగిన యాంటీబయాటిక్స్ వాడకపోవడం వల్లగానీ లేదా కొన్ని రాళ్లు లోపలే మిగిలిపోవడం వల్లగానీ మీరు చెప్పిన లక్షణాలు కనిపించవచ్చు. మీరు యూరిన్ కల్చర్ పరీక్ష చేయించుకుని సరైన యాంటీబయాటిక్స్ వాడితే ఇది పూర్తిగా నయమవుతుంది. ఇక ముఖ్యమైన అంశం ఏమిటంటే... ఈ తరహా సర్జరీ (ఎండోస్కోపీ)లో కిడ్నీలో ఒక స్టెంట్ కూడా ఉంచుతారు. దాన్ని ఒక నెల తర్వాత తీయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మరచిపోయి అలా తీయించుకోకపోతే కూడా ఇన్ఫెక్షన్ సమస్యలు వస్తాయి. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్‌ను మరోమారు సంప్రదించండి. నా వయసు 21. స్నానం చేసే సమయంలో పురుషాంగంపై ఉన్న చర్మాన్ని వెనక్కి లాగి ప్రతిరోజూ శుభ్రపరచుకుంటాను. అరుుతే ఈవుధ్య అంగం మీది చర్మం బాగా పొడిగా అరుుపోరుు వుునుపటిలా వెనక్కురావడం లేదు. బలవంతంగా వెనక్కు నెడితే క్రాక్స్ ఏర్పడి రక్తం కూడా వస్తోంది. ఈ సవుస్యతో చాలా ఆందోళనగా కూడా ఉంది. నాకు ఎలాంటి చెడు అలవాట్లూ లేవు. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - జీ.ఆర్., ఖమ్మం పురుషాంగం మీది చర్మం ఫ్రీగా వెనక్కు వెళ్లకుండా ఉండే కండిషన్‌ను ఫైమోసిస్ అంటారు. ఒక్కోసారి ఫైమోసిస్ వల్ల చర్మం చివరి భాగంలో క్రాక్స్ వచ్చి ఇన్ఫెక్షన్కు దారితీసే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు సెక్స్ చేస్తే నొప్పి రావచ్చు. ఒక్కోసారి చర్మం వెనక్కి వెళ్లి వుళ్లీ వుుందుకు రాకపోతే వాపు కూడా రావచ్చు. యుుక్తవయుసులో ఇలా చర్మం ఫ్రీగా వుుందుకు, వెనక్కు రాకపోతే సున్తీ చేరుుంచుకోవడమే వుంచిది. దీనివల్ల వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కూడా సులువు. మున్ముందు సెక్స్‌కూ ఆటంకాలు ఉండవు. కాబట్టి మీకు దగ్గర్లోని డాక్టర్‌కు చూపించి వెంటనే తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
అమ్మ కాదంది.. అత్త ప్రాణదానం చేసింది
న్యూఢిల్లీ: అత్త అంటే కోడలికి గయ్యాళి. వేధించేకుతినే రకం. అందుకే అత్తాకోడళ్లకు సరిపడదు. చాలా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలను చూసుంటారు. అయితే తల్లీకూతుళ్ల మాదిరిగా ఉండే అత్తాకోడళ్లు కూడా ఉంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కూతురును కాపాడేందుకు తల్లి చివరి నిమిషంలో నిరాకరించగా.. అత్త అవయదానం చేసి కోడలికి పునర్జన్మ ప్రసాదించింది. ఇది సినిమా కథ కాదు. ఢిల్లీలో జరిగిన మానవీయ వాస్తవ సంఘటన. పశ్చిమఢిల్లీకి చెందిన కవిత (36) కిడ్నీలు పాడయ్యాయి. దీంతో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు సూచించారు. కవిత తల్లి తన కిడ్నీల్లో ఒకటి ఇచ్చేందుకు అంగీకరించారు. ఇందుకు ఆపరేషన్ ఏర్పాట్లు కూడా చేశారు. అయితే చివరి నిమిషంలో కిడ్నీ ఇచ్చేందుకు కవిత తల్లి నిరాకరించారు. దీంతో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. కవిత ప్రాణాలు దక్కాలంటే కిడ్నీ మార్చడం తప్పనిసరి. ఇలాంటి సమయంలో కవితకు కిడ్నీ ఇచ్చేందుకు ఆమె అత్త విమల ముందుకొచ్చారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. కవిత క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. అత్తాకోడళ్ల బంధం అందరికీ ఆదర్శనీయంగా నిలిచింది. -
రాయి పడుద్ది!
కిడ్నీలో స్టోన్స్ కిడ్నీలో రాళ్లు పడ్డ విషయం తెలియగానే మన గుండెల్లో రాయి పడుతుంది. అయితే గుండెల్లోని రాయి కనిపించదు కానీ కిడ్నీలో రాయి పరీక్షల్లో కనిపిస్తుంది. ఇలా కిడ్నీ రాయిపడటానికి చాలా కారణాలున్నాయి. మనలో జరిగే అనేక జీవకార్యకలాపాల తర్వాత వెలువడే వ్యర్థాలు, విషపదార్థాలను రక్తం నుంచి వేరు చేసి బయటకు పంపే కీలకమైన భూమికను మన మూత్రపిండాలు నిర్వహిస్తుంటాయి. ఆ టైమ్‌లో మన కిడ్నీలో కొన్ని పదార్థాలు క్రమంగా పేరుకుపోతూ స్ఫటికాకృతిని సంతరించుకుంటాయి. నీళ్లు తక్కువగా తీసుకునేవారిలోనూ, చాక్లెట్లు, కెఫిన్ వంటి వాటిని ఎక్కువగా తీసుకునే వారిలోనూ, ప్రత్యేకంగా వేసవికాలంలో ఏసీ రూమ్స్‌లో ఎక్కువగా ఉంటూ, తక్కువగా నీళ్లు తాగే సందర్భాల్లో కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ రాళ్ల నివారణ, చికిత్స ఎలాగో తెలుసుకుందాం. కిడ్నీ రాయితో పాటూ గుండెల్లో రాయినీ తొలగించుకుందాం. మనలో నడుముకు ఇరువైపులా చిక్కుడు గింజ ఆకృతిలో రెండు మూత్రపిండాలుంటాయి. వీటి నుంచి సంచిలా ఉండే బ్లాడర్‌కు కలిపే పైప్‌లను యురేటర్స్ అంటారు. బ్లాడర్ నుంచి ఒక మూత్రనాళం ద్వారా మూత్రం బయటకు వెళ్తుంది. రక్తంలోని అనేక అంశాలను మూత్రపిండాలు శుద్ధి చేసి, అవసరమైన వాటిని తీసుకొని, వ్యర్థాలను మూత్రంతో పాటు బయటకు పంపిస్తాయి. ఈ క్రమంలో క్యాల్షియమ్ ఆక్సలేట్, సిస్టిన్ వంటివి స్ఫటికాలుగా మారిపోతూ ఉంటాయి. సాధారణంగా చిన్న చిన్న రాళ్లుగా ఏర్పడ్డ తర్వాత కూడా అవి మూత్రంతో పాటు బయటకు వెళ్తుంటాయి. కానీ ఒక రాయి 5 మి.మీ. కంటే ఎక్కువ సైజ్‌కు పెరిగితే మూత్రంలో సాఫీగా కొట్టుకొనిపోలేక... మూత్రవిసర్జక వ్యవస్థలో ఎక్కడైనా ఇరుక్కుపోవచ్చు. ఇలా మూత్రవిసర్జక వ్యవస్థలో రాళ్లు ఎక్కడైనా ఇరుక్కుపోయినప్పుడు తీవ్రమైన కడుపునొప్పి మొదలుకొని మూత్రధారకు ఏదో అడ్డుపడ్డట్లుగా ఉండటం వరకు అనేక లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో ప్రధానమైనవి కొన్ని... కిడ్నీలో రాళ్ల నిర్థారణ : మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్ష, ఇంట్రావీనస్ యూరోగ్రఫీ (ఐవీయూ), ఎక్స్-రే, సీటీ స్కాన్ల వంటి పరీక్షలతో కిడ్నీ స్టోన్స్‌ను నిర్ధారణ చేస్తారు. కిడ్నీల్లోని రాళ్లను నివారించండిలా : మూత్రపిండాల్లో వచ్చే రాళ్ల వల్ల కూడా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండేందుకు అవసరమైన చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంతో పెద్ద ప్రమాదాన్నే నివారించే అవకాశం ఉంది. ఆ జాగ్రత్తలివి... నీటిని ఎక్కువగా తాగాలి. రోజుకు తప్పని సరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్‌ను విసర్జించాలి. కాబట్టి శరీర కణాల నిర్వహణకు, పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది ఆహారంలో ప్రొటీన్, నైట్రోజెన్, సోడియం ఉన్న పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. స్థూలంగా చెప్పాలంటే ఉప్పు పాళ్లు తక్కువగా ఉండాలి ఆగ్సలేట్ ఎక్కువగా ఉండే గింజలు, సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి క్యాల్షియం సప్లిమెంట్లను కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. పొటాషియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి వైద్యుల సూచనల మేరకు ఆహార నియమాలను పాటించడం మంచిది ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్, క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ ఆరెంజ్ జ్యూస్‌కు క్యాల్షియం ఆక్సలేట్‌ను రాయిగా మారకుండా నిరోధించే లక్షణం ఉంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ మంచిదే. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం కూడా కిడ్నీస్టోన్ సమస్యకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి పుల్లటి పండ్లతో చేసిన జ్యూస్‌లను ఎక్కువగా తీసుకోకూడదు కూల్‌డ్రింకులను అస్సలు తాగకూడదు. మూత్రపిండాల్లో రాళ్లకు చికిత్స... : కిడ్నీ స్టోన్స్ చాలావరకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా వాటంతట అవే ఎక్కువగా మూత్రంతో పాటు పడిపోతుంటాయి. రాయి సైజు, రాయి ఉన్న ప్రాంతం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చేయాల్సిన చికిత్స నిర్ణయిస్తారు. ఎండోస్కోపీ ద్వారా యురేటర్లో రాయిని తీయడం (యూఆర్ఎస్ఎల్ -ఎండోస్కోపిక్ రిమూవల్ ఆఫ్ స్టోన్ ఇన్ ద యురేటర్), ఎండోస్కోపీ ప్రక్రియతో మూత్రపిండం నుంచి రాయి తీయడం (పీసీఎన్ఎల్ - ఎండోస్కోపిక్ రిమూవల్ ఆఫ్ స్టోన్ ఫ్రమ్ ద కిడ్నీ) వంటి ప్రక్రియలతో రాయిని తొలగించవచ్చు. రోగి విపరీతమైన నొప్పితో బాధపడుతున్నప్పుడు, మూత్రపిండాల వ్యవస్థ విఫలమైనప్పుడు, కిడ్నీలు ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ ఇష్టపడని రోగులు ఒక నెల రోజులు ఆగి చూసి అప్పటికీ రాయి దానంతట అదే పడిపోకపోతే తప్పనిసరిగా ఆపరేషన్ చేయించాలి. లేకపోతే రాయి వల్ల ఇన్ఫెక్షన్ పాకి మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలుంటాయి. నాన్ ఇన్వేజివ్ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్వేవ్ లిథోట్రిప్సీ (ఇఎస్డబ్ల్యూఎల్) అనే చికిత్స ప్రక్రియలో లేజర్, అల్ట్రాసోనిక్ కిరణాల ద్వారాగానీ లేదా మెకానికల్‌గా గానీ రాయిని చిన్న చిన్న పలుకులు లేదా పొడి అయ్యేలా చేస్తారు. ఆ పలుకులు, పొడి మూత్రంతో పాటు వెళ్లిపోతాయి. ఇలా రాయిని పలుకులు, పొడిగా చేస్తే యురేటర్లో స్టెంట్ వేస్తారు. ఇందుకంటే మూత్రనాళాలు, బ్లాడర్ గోడలు ఈ రాతిపలుకుల వల్ల ఒరుసుకుపోకుండా ఉండటానికి ఈ ఏర్పాటు చేస్తారు. రోగినుంచి పలుకులు పూర్తిగా పడిపోయాక స్టెంట్‌ను తొలగిస్తారు.ఇలాంటి నాన్ఇన్వేజివ్ (కత్తి ఉపయోగించకుండానే చేసే) ప్రక్రియల ద్వారా చికిత్స సాధ్యం కానప్పుడు మాత్రమే ఓపెన్ సర్జరీ (శస్త్రచికిత్స) చేస్తారు. శబ్దతరంగాల ద్వారా : శబ్దతరంగాలను ఉపయోగించి రాయిని చిన్న పలుకులుగా పొడిలా చేయడం ద్వారా చేసే చికిత్సను ఎక్స్ట్రా కార్పోరల్ షాక్వేవ్ లిథోట్రిప్సీ అంటారు. చికిత్స కంటే నివారణ మేలు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని, రోజూ తగినన్ని మంచినీళ్లు తాగడం లాంటి విధానాలు అవలంబించడం ద్వారా కిడ్నీలో రాళ్లను నివారించుకుంటే మేలు. కిడ్నీస్టోన్స్ లక్షణాలు... కోలిక్ పెయిన్... భరించలేని నొప్పి ఉండటాన్ని ఇలా వ్యవహరిస్తారు హిమచ్యూరియా... మూత్రంలో రక్తం పడడాన్ని హిమచ్యురియా అంటారు పైయూరియా... మూత్రంలో చీము రావడాన్ని ఇలా అంటారు డిస్ యూరియా... విసర్జన సమయంలో మార్గం మంటగా అనిపించడం. చిన్న రాళ్లు మూత్రంతోపాటు వచ్చినప్పుడు లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంది ఆలిగ్యురియా... మూత్రం పరిమాణం తగ్గడం. యురెథ్రాలో కాని మూత్రాశయంలో కాని లేదా రెండింటిలో కాని రాళ్లు ఉన్నప్పుడు ఇలా జరగవచ్చు అబ్డామినల్ డిస్టెన్షస్లో... తల తిరగడం, వాంతులవడం ఉంటుంది. వీటితోపాటు చలి, జ్వరం కూడా ఉండవచ్చు పోస్ట్రిరీనల్ అజోటీమియా... కిడ్నీలో రాయి యురేటర్ని బ్లాక్ చేయడం, తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీయడం ఫ్రీక్వెన్సీ ఇన్ మిక్చ్యురిషన్... ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావడం. అలాగని ఒక రోజుకు రెండున్నర లీటర్లకంటే ఎక్కువ మూత్రవిసర్జన ఉండదు. తక్కువ మోతాదులో విసర్జిస్తూ ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడం జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం కావడం వల్ల ఆహారం తీసుకోవాలన్న ఆసక్తి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. డాక్టర్ ఎన్. ఉపేంద్రకుమార్ యూరాలజిస్ట్ అండ్ యాండ్రాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ -
అవయవ దానంతో ఆదర్శం
విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ బ్రెయిన్ డెడ్ రోగి కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఏప్రిల్ 25న శ్రీకాకుళంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన పట్నాన సత్యనారాయణ (53) తలకు తీవ్ర గాయం కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆయనను అదే రోజు సాయంత్రం విశాఖలోని సెవెన్‌హిల్స్ ఆసుపత్రికి అత్యవసర చికిత్స కోసం తరలించారు. ఆయన కోలుకోకపోవడంతో సోమవారం సాయంత్రం ఆస్పత్రి వైద్యులు సత్యనారాయణను బ్రెయిన్‌డెడ్ గా నిర్ధారించారు. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేసి అతని కుటుంబ సభ్యులను ఆసుపత్రి వైద్యులు అవయవ దానానికి ఒప్పించారు. దానికి వారు కూడా సంసిద్దత వ్యక్త పరిచినట్లు సెవెన్ హిల్స్ ఆసుపత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ దినకర్ తెలిపారు. ఇది కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు బ్రెయిన్‌డెడ్ రోగి పట్నాన సత్యనారాయణ శరీరం నుంచి అవయవ దానానికి అర్హత ఉన్న రెండు కిడ్నీలను, కాలేయాన్ని డాక్టర్లు సేకరించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జీవన్ దాన్ సంస్థకు సమాచారాన్ని అందించారు. జీవన్‌దాన్ సంస్థ ఆదేశం మేరకు రోగి శరీరం నుంచి పలు అవయవాలను సేకరించేందుకు మంగళవారం తెల్లవారు జామున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రోగి శరీరం నుంచి సేకరించిన రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీని సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిడ్నీ ఫెయిల్ అయిన రోగికి, రెండో కిడ్నీని కేర్ ఆసుపత్రిలో మరో రోగికి అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. కాలేయాన్ని హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో రోగికి అమర్చేందుకు మంగళవారం తెల్లవారుజామున విమానంలో పంపించనున్నారు. -
వడపోయని కిడ్నీలు..
పాతికేళ్లకే పాడవుతున్న వైనం నిమ్స్ వైద్యుల సర్వేలో వెల్లడి.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం నేడు వరల్డ్ కిడ్నీ డే.. సిటీబ్యూరో/గాంధీ ఆస్పత్రి: ఇనుప కండలు.. ఉక్కు నరాలతో రాళ్లను సైతం పిండి చేయగల యువత నేడు పాతికేళ్లకే కిడ్నీ జబ్బుల బారిన పడుతోంది. దేశవ్యా ప్తంగా ఏటా 2.5 లక్షల కేసులు నిర్థారణ అవుతుంటే.. రాష్ట్రంలో ప్రతి పదిమందిలో ఒకరు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఏటా 15 వేలకు పైగా కేసులు వెలుగు చూస్తుండటం గమనార్హం. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో 10-15 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. నగరంలోని ప్రస్తుతం 15 వేల మంది డయాలసిస్ చేయించుకుంటుండగా, ఏటా 150-200కు పైగా మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఒక్క నిమ్స్‌లోనే ఏటా 70-80 శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఆందోళన కలిగించే అంశం.. తమకు కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నట్టు వీరిలో చాలా మందికి తెలియదు. బాధితుల్లో ఎక్కువ శాతం 40 ఏళ్లలోపు వారే కావడం విశేషం. ఐసీఎంఆర్ సర్వే.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎంత మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు..? ఏ ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువ ఉంది..? ఏ వయసు వారు దీని బారిన పడుతున్నారు..? వంటి ప్రశ్నలకు నిపుణుల వద్ద ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లే దు. అయితే, ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాన్ని కనుగొనాలనే ఉద్దేశంతో ‘ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)’ నాలుగేళ్ల క్రితం ఢిల్లీ, ముంబయి, గౌహతి, భువనేశ్వర్, కోల్‌కత, చైన్నై, జైపూర్, హైదరాబాద్ పట్టణాల్లో సర్వే చేపట్టింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు నిమ్స్‌లోని సీనియర్ వైద్య నిపుణులు, పరిశోధక విద్యార్థులకు ఇందులో భాగస్వామ్యం కల్పించింది. సర్వే దాదాపు ముగింపు దశకు వచ్చింది. పేదల జీవితాల్లో వైఎస్సార్ వెలుగులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డయాలసిస్ సేవలను ఉచితంగా అందించి వేల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. రూ. వేలు ఖర్చుపెట్టి డయాలసిస్ చేయించుకోలేని వారికి ‘ఆరోగ్యశ్రీ’ ద్వారా డయాలసిస్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో గాంధీ ఆస్పత్రిలో 2009 నవంబర్ 6న ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణలో 20 యూనిట్లతో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ 92,210 మందికి ఉచిత డయాలసిస్ సేవలు అందించారు. రోగాలకు కారణాలివే.. మారిన ఆహారపు అలవాట్లు, మధుమేహం, అధిక రక్తపోటు, పెయిన్ కిల్లర్స్ అతిగా వినియోగించడం, యాంటిబయాటిక్స్ ఎక్కువ వాడటం, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు సోకడం, యాంజియోగ్రామ్ పరీక్షల్లో కాంట్రాస్ట్ మందు వాడటం, మరికొన్ని జన్యుపరమైన కారణాలతో పాటు శరీరానికి సరిపడినంత మంచి నీరు తాగకపోవడం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. - చాడ రమేష్, గాంధీ నెఫ్రాలజీ హెచ్‌వోడీ ఏటా స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి ఏడాది కోసారైనా ప్రతి ఒక్కరూ విధిగా కిడ్నీ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ఫిట్నెస్ కోసం రోజుకు కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయాలి. శరీరానికి సరిపడు (4 లీటర్లకు తగ్గకుండా) మంచినీరు తాగాలి. లేదంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడి, మూత్ర విసర్జన సమయంలో భరించలేని నొప్పి వచ్చి అది క్రమంగా గుండె పోటుకు దారి తీస్తుంది. - ప్రొ. శ్రీభూషణ్ రాజు, నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి గాంధీలో డయాలసిస్ రోగులు.. 2010 13,600 2011 16,300 2012 16,800 2013 20,400 2014 21,270 2015 ఫిబ్రవరి వరకు 3,840 -
ఆగమేఘాలపై చేరిన కిడ్నీ
ఓ వ్యక్తికి ప్రాణదానం విశాఖ మెడికల్ : కేవలం ఐదు గంటల వ్యవధిలో గుంటూరు నుంచి విశాఖకు కిడ్నీ తరలించి నగరవాసి ప్రాణాన్ని నిలిపారు పోలీసులు. మణిపాల్ ఆసుపత్రిలో ఈనెల 31న జరిగిన ఈ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలో పోలీసులు పోషించిన పాత్ర అమోఘమని ఆసుపత్రి యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. గుంటూరుకు చెందిన 54 సంవత్సరాల వ్యక్తి గత నెల 31న మరణించాడు. అవయవధానం చేసిన అతని నుంచి అదే రోజు కిడ్నీని సేకరించి అంబులెన్స్ ద్వారా గుంటూరు-విజయవాడ మీదుగా విశాఖ నగరానికి కేవలం ఐదు గంటల వ్యవధిలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేసి రప్పించారు. ఆ కిడ్నీని విశాఖకు చెందిన 51 సంవత్సరాల వ్యక్తికి మణిపాల్ ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా అమర్చి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇందుకు సహకరించిన పోలీసు విభాగానికి కిడ్నీ గ్రహీత కుటుంబ సభ్యులు, మణిపాల్ ఆసుపత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. -
కార్టూనిస్ట్ ఆర్.కె. లక్ష్మణ్ పరిస్థితి విషమం
పుణె: అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్.కె.లక్ష్మణ్(95) పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కిడ్నీ, హృదయ సంబంధ సమస్యలతో లక్ష్మణ్ శుక్రవారం పుణెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం ఆరోగ్యం విషమించింది. పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. దీంతో వెంటిలేటర్‌పై ఉంచారు. అనారోగ్యంతో కొన్నేళ్ల క్రితమే ఆయన కార్టూన్లకు దూరమయ్యారు. -
బతక లేక.. మెతుకు లేక..
కష్టాల కడలిలో ‘చెన్నమ్మ’ దెబ్బతిన్న కుమారుడి రెండు కిడ్నీలు ఓ కిడ్నీని దానం చేసిన తల్లి కాళ్లు విరిగిన భర్త దిక్కూమొక్కు లేక దీనావస్థలో పేద కుటుంబం మెరుగైన వైద్యం కోసం దాతల వైపు చూపు సాక్షి, సిటీబ్యూరో: ఆ నిరుపేద కుటుంబాన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. సమస్యల మీద సమస్యలు రావడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. అటు బతుకుదెరువు సాగక, ఇటు వైద్యం చేయించుకునే పరిస్థితి లేక ఆ కుటుంబం సతమతమవుతోంది. కొడుకు రెండు కిడ్నీలు పాడైతే తల్లే ఓ కిడ్నీ దానం చేసింది. అదే సమయంలో భర్త గాయపడి మంచాన పడ్డాడు. ఇన్ని సమస్యల మధ్య ఆమె ఒక్కతే పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భర్త, కుమారుడి వైద్యం కోసం దాతల వైపు దీనంగా ఎదురు చూస్తోంది చెన్నమ్మ. మాలపాటి బాల చెన్నయ్య(38), చెన్నమ్మ(36)లు దంపతులు. వీరికి బాలు(14) అనే కుమారుడున్నాడు. వీరిది గుంటూరు జిల్లా నరసారావుపేట వెంగళరెడ్డి నగర్. నిరుపేద దళిత వర్గానికి చెందిన వీరు కూలి పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరి ఏకైక కుమారుడు బాలు స్థానికంగా ఏడోతరగతి చదువుతున్నాడు. గత ఏడాది బాలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. నగరంలోని ఉస్మానియాలో వైద్యులు పరీక్షించి అతడి రెండు కిడ్నీలు చెడిపోయాయని తేల్చారు. బాలుకు ప్రాణం పోసేం దుకు తల్లి చెన్నమ్మ ముందుకు వచ్చింది. తన కిడ్నీని కుమారుడికి దానం చేసింది. నిమ్స్‌లో ఆపరేషన్‌కు ఆరోగ్యశ్రీ కింద వచ్చిన రూ.2 లక్షలతోపాటు ఇళ్లు అమ్మగా వచ్చిన రూ.9 లక్షలు కలిపి మొత్తం రూ.11 లక్షలు ఖర్చు చేశారు. నెలనెలా డయాలసిస్‌కు హైదరాబాద్‌కు రాలేక ఇక్కడే కూకట్పల్లి ప్రాంతంలోని ప్రగతినగర్‌లో భవన నిర్మాణ కూలీగా పనికి కుదిరా డు చెన్నయ్య. నాలుగు నెలల క్రితం చెన్నయ్య పనులు చేస్తూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడ్డాడు. రెండు కాళ్లు విరిగిపోయి నడవలేని స్థితిలో ఉన్నాడు. అటు కుమారుడి పరిస్థితి బాగాలేక ఇటు భర్త మంచాన పడడంతో చెన్నమ్మ తల్లడిల్లిపోయింది. ఆమె కిడ్నీ దానం చేసినందున నెలకు 30 రోజులు పని చేయలేని పరిస్థితి. అయినా ఎలాగోలా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. భర్త, కుమారుడి మందులకే నెలకు రూ.15 నుంచి 20 వేలు ఖర్చు అవుతోందని ఆమె చెబుతోంది. తనకు డబ్బులు చేతికివ్వాల్సిన అవసరం లేదని, కుమారుడుకి నెలనెలా డయాలసిస్, భర్త కోలుకునే వరకు మందులకు సహాయం చేస్తే చాలునని చెన్నమ్మ రెండు చేతులు జోడించి వేడుకొంటోంది. కరుణ చూపేవారెవరైనా 8106187906 నంబర్లో సంప్రదించాలని ఆమె కోరుతోంది. -
పంది మూత్రపిండం తయారీ సక్సెస్!
వాషింగ్టన్: కృత్రిమ మూత్రపిండాల ఉత్పత్తి దిశగా కీలక ముందడుగు పడింది. అమెరికా, నార్త్ కరోలినాలోని వేక్ ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో పంది మూత్రపిండాలను తయారు చేయడంలో విజయం సాధించారు. పంది మూత్రపిండాలు కూడా మనిషి కిడ్నీలంత సైజులోనే ఉంటాయి. వాటి పనితీరు కూడా దాదాపుగా ఒకేలా ఉంటుంది. అందుకే తొలుత పంది మూత్రపిండాల తయారీపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఇప్పటిదాకా ల్యాబ్‌లో సృష్టించిన మూత్రపిండాలన్నీ ఎలుకలకు ఉండే కిడ్నీల సైజులో మాత్రమే సాధ్యం అయ్యాయి. పైగా రెండు గంటలు పనిచేయగానే వాటిలోని రక్తనాళాలు మూసుకుపోయేవి. ఈ నేపథ్యంలో పరిశోధనలను ముమ్మరం చేసిన వేక్ ఫారెస్ట్ శాస్త్రవేత్తలు.. ఎట్టకేలకు రక్తనాళాలు మూసుకుపోకుండా నాలుగు గంటల పాటు పనిచేసే మూత్రపిండాలను తయారు చేశారు. దీంతో ఇదే పద్ధతిని అనుసరించి మూలకణాలతో మనుషులకు కూడా కిడ్నీలను తయారు చేసేందుకు మార్గం సుగమం అయింది. ఇది పూర్తిస్థాయిలో విజయవంతం అయితే గనక.. కిడ్నీలతో పాటు కాలేయం, క్లోమం వంటి క్లిష్టమైన అవయవాల ఉత్పత్తి కూడా సాధ్యం కానుంది. -
అప్పుడు 7,000 ఇప్పుడు 80,000
అదొక వడపోత యంత్రం. మంచిని గ్రహించి శరీరానికి అందజేసి, చెడును బయటికి పంపించే అవయవం. అదే కిడ్నీ! ఇప్పుడిది ఒత్తిడికి గురవుతోంది. నగరజీవి అనుభవిస్తున్న ఒత్తిడిలో ఎక్కువ షేర్ చేసుకుంటున్నది ఇదే. దీంతో నగరజీవి చితికిపోతున్నాడు. ఏ ఆస్పత్రిలో చూసినా డయాలసిస్ పేషెంట్లే. ముందు కేవలం 20 డయాలసిస్ సెంటర్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 80కి పెరిగాయి. గతంలో నెలకు 7వేల మందికి డయాలసిస్ జరిగేది. ఇప్పుడు 80 వేలకు పెరిగింది. కిడ్నీ మీద ప్రెజర్ పడటానికి కారణం నగరజీవి అనుభవిస్తున్న ప్రెజరే కారణమంటున్నారు ప్రముఖ మూత్రపిండ వ్యాధుల నిపుణులు. నివారణకు మార్గాలు... ►కిడ్నీ జబ్బులు రాకుండా కాపాడుకోవాలంటే సాధారణ వ్యక్తి రోజూ నాలుగైదు లీటర్ల నీరు తాగాలి. ఒత్తిడి ఉన్నవారు రోజూ 8 లీటర్లు తాగాలి. ►ఉప్పు బాగా తగ్గించాలి. ఉప్పు ఎక్కువైతే వడపోతలో ఇబ్బందులెదుర్కొని రక్తంలో ఉప్పు కలుస్తుంది. దీంతో రక్తపోటు వస్తుంది. ►సిగరెట్లు, బీడీలు తాగడం వల్ల కొన్ని రకాల ఉత్ప్రేరక ఎంజైములు విడుదలవుతాయి. ఇవి కిడ్నీలపై ఒత్తిడి పెంచుతాయి. ►ట్యాబ్లెట్స్ ఇష్టారాజ్యంగా వాడకూడదు. వీటిని శుద్ధిచేయాల్సింది కిడ్నీలే కాబట్టి చూసి వాడాలి. ►ఒత్తిడి కి గురయ్యేవారు తరచూ 3 నెల్ల్లకోసారి యూరిన్, క్రియాటినైన్ పరీక్షలు చేయించుకోవాలి. ►ఆహారంలో జాగ్రత్తలు, వ్యాయామమే దీనికి అత్యుత్తమ మార్గం. సమస్యలకు కారణాలు... ►పగలు చేయాల్సిన పని రాత్రివేళ, రాత్రి నిద్రను పగలుకు పోస్ట్పోన్చేయడంతో మెటబాలిక్సిండ్రోమ్ కిడ్నీ జబ్బులకు కారణమవుతోంది. ►ఒత్తిడికి గురవుతున్న వాళ్లు చిన్న సమస్య వచ్చినా పెయిన్‌కిల్లర్స్ వాడుతున్నారు. వీటివల్ల బాడీల్లో ప్రత్యేక ఆమ్లాలు విడుదలై కిడ్నీకి ముప్పు వాటిల్లుతోంది. ►బైక్, స్కూటర్స్‌పై ప్రయాణంతో కిడ్నీపై ఒత్తిడి పడుతోంది. ►{ఫైడ్ ఫుడ్ (వేపుళ్లతోకూడిన) ఫుడ్ తినడం వల్ల శుద్ధి యంత్రమైన కిడ్నీ దెబ్బ తింటుంది. ►స్థూలకాయం కూడా మూత్రపిండాల సమస్యకు ఓ కారణం. 40 పేషెంట్లలో సాఫ్ట్వేర్, బీపీఓ ఇండస్ట్రీలో ఉన్నవారు 40 శాతం మంది 70 ఆరోగ్యశ్రీ ద్వారా జరుగుతున్న డయాలసిస్ కేసుల్లో 70 శాతం 40 ఏళ్ల లోపువారే ప్రజెంటేషన్ : జి.రామచంద్రారెడ్డి -
హెల్ప్ ప్లీజ్!
డయాలసిస్ కోసం రోగుల వేడుకోలు ఆరోగ్యశ్రీ ఆస్పత్రులన్నీ ఫుల్ కొత్తవారి విషయంలో చేతులెత్తేస్తున్న వైనం విజయవాడ : ‘రెండు కిడ్నీలు పాడయ్యాయి.. మూత్రం రావడం లేదు.. కాళ్లకు నీరొచ్చి వాచిపోతున్నాయి.. శ్వాస కష్టంగా ఉంటోంది.. ప్లీజ్ ఒక్కసారైనా డయాలసిస్ చే సి ప్రాణం కాపాడండి..’ అంటూ కిడ్నీలు చెడిపోయిన రోగులు. వారి బంధువులు నగరంలోని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వారు ఎంత బతిమిలాడినా ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తమ వద్ద యూనిట్లన్నీ ఫుల్ అయ్యాయంటూ ఆస్పత్రి యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో దేవుడిపై భారం వేస్తున్నారు. గుణదలకు చెందిన పోతురాజుకు రెండు కిడ్నీలు పాడయ్యాయని నెల రోజుల కిందట వైద్యులు చెప్పారు. ఆయనకు వారంలో రెండుసార్లు డయాలసిస్ చేయాల్సి ఉంది. దీని కోసం బంధువులు ఆస్పత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడా ఎవరూ కరుణిం చని పరిస్థితి నెలకొంది. మూడు రోజుల కిందట ప్రభుత్వాస్పత్రిలో చేరగా.. ఒకసారి డయాలసిస్ చేసి, ఇక మేం చేయలేమంటూ డిశ్చార్జి చేసి పంపేశారు. కంకిపాడుకు చెందిన నాగేశ్వరరావుదీ అదే పరిస్థితి. ఇలా ప్రభుత్వాస్పత్రితోపాటు ప్రైవేటు ఆస్పత్రులకు నిత్యం ఎంతోమంది రోగులు డయాలసిస్ కోసం తిరుగుతూనే ఉన్నారు. సకాలంలో డయాలసిస్ అందక ఇటీవలి కాలంలో పలువురు రోగులు మృత్యువాత పడినట్లు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రులన్నీ ఫుల్ జిల్లాతోపాటు పరిసర జిల్లాల్లో కిడ్నీ బాధిత రోగులు పెరగడంతో డయాలసిస్‌కు డిమాండ్ ఏర్పడింది. డబ్బు చెల్లించి చికిత్స పొందే రోగులకు డయాలసిస్ విషయంలో ఇబ్బందులు లేనప్పటికీ, ఆరోగ్యశ్రీ రోగులు తిప్పలు తప్పడం లేదు. ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రుల్లో ప్రభుత్వాస్పత్రితోపాటు సెంటినీ, నాగార్జున, మణిపాల్, ఆయుష్ ఆస్పత్రుల్లో రోజుకు మూడు షిప్టుల్లో 120 నుంచి 140 మందికి డయాలసిస్ చేసే అవకాశం ఉంది. రోగి అవసరాన్ని బట్టి నెలలో నాలుగు నుంచి ఎనిమిదిసార్లు, కొందరికి రెండు, మూడు రోజులకోసారి డయాలసిస్ అవసరమవుతుంది. జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకంలో డయాలసిస్ చేయిం చుకునే వారు రెండు వేల మందికి పైగా ఉన్నారు. ఇప్పటికే రిఫరల్ ఆస్పత్రుల్లో పేర్లు నమోదైనవారికి స్లాట్లవారీగా చేస్తున్నారు. రోజుకు మూడు షిఫ్టుల చొప్పున అన్ని స్లాట్స్ ఫుల్ అయిపోవడంతో కొత్త రోగులను చేర్చుకునియాలసిస్ చేసే పరిస్థితి లేదు. డిమాండ్ వాస్తవమే ప్రభుత్వాస్పత్రిలో డయాలసిస్ యూని ట్లో ఇప్పటికే అన్ని స్లాట్స్‌లో రోగుల పేర్లు నమోదు కావడంతో కొత్తవారికి అవ కాశం కల్పిం చడం ఇబ్బందిగా మారుతోంది. యూనిట్లు పెంచేందుకు అవసరమైన స్థలం లేక ఉన్నవాటితోనే చేయాల్సివస్తోంది. దీంతో అక్కడకు వచ్చిన వారిని కార్పొరేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ అదే పరిస్థితి ఉంటే.. సర్దుబాటు చేసి అందరికీ చేయాలని చెబుతున్నాం. -డాక్టర్ జీవన్‌కుమార్, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ -
అవయవమార్పిడి అద్భుతం
సాక్షి, ముంబై: బ్రెయిన్‌డెడ్ వల్ల మరణించిన ముగ్గురు రోగుల బంధువులు సరైన సమయంలో అవయవదానం చేయడం వల్ల 38 గంటల్లో ఎనిమిది మంది ప్రాణాలను డాక్టర్లు నిలబెట్టగలిగారు. ముంబైలోని ప్రైవేట్ ఆస్పత్రులకు చెందిన దాదాపు 50 మంది వైద్యులు ఈ అవయాలను సేకరించారు. అవసరమైన రోగులకు అమర్చి వారి ప్రాణాలను నిలబెట్టారు. ఇందుకు గాను జోనల్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేషన్ కమిటీ (జెడ్టీసీసీ) కూడా తమ సహకారం అందజేసింది. మృతదేహాల నుంచి చట్టబద్ధంగా అవయవాలను సేకరించే వారికి ఈ సంస్థ తోడ్పాటునిస్తోంది. బ్రెయిడ్‌డెడ్ అయిన వారి దేహాల నుంచి అవయవాలను దానం చేస్తే చాలా ఉపయోగముంటుందన్న విషయంపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోందని సీనియర్ డాక్టర్ ఒకరు పేర్కొన్నారు. ఇదిలా వుండగా, గత ఏడాది నగరంలో 20 శవదానాలు నమోదయ్యాయి. అదేవిధంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 41 కిడ్నీ దానాలు, 20 కాలేయదానాలు (ఆర్గాన్ డొనేషన్) నమోదయ్యాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. 2013లో 36 కిడ్నీ దానాలు, 19 కాలేయదానాలు నమోదయ్యా యి. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 36,791 అవయవదానాలు నమోదయ్యాయని జెడ్టీసీసీ తెలిపింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి ముంబైలో శవదానాలు 20 నుంచి 23 వరకు నమోదయ్యాయి. కిడ్నీల కోసం 3,079 మంది వెయిటిం గ్ లిస్టులో ఉండగా, కాలేయం కోసం 212 మంది బాధితులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఖార్‌కు చెందిన ఓ 58 ఏళ్ల మహిళ ఇటీవల మరణించగా, ఆమె అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈ అవయవాలను ఈ మహిళ కూతురు పీడీ హిందుజా ఆస్పత్రికి అందజేశారు. అయితే తాను మరణించిన తర్వాత కళ్లను దానం చేయాల్సిందిగా తల్లి కోరినట్లు ఆమె పేర్కొంది. మిగతా వాళ్లు కూడా తమ అవయవాలను దానం చేయాలన్న డాక్టర్ల విజ్ఞప్తికి మృతురాలి కుటుంబ సభ్యులు అంగీకరించడం విశేషం. గుండె, ఊపిరితిత్తులు కూడా దానం చేసినట్లు ఆస్పత్రికి చెందిన అవయవ మార్పిడి సమన్వయాధికారి డాక్టర్ సుచేత దలాల్ తెలిపారు. ఇదిలా వుండగా సదరు మహిళ ఇంట్లో వంట చేస్తుండగా మెదడులో రక్తస్రావం కావడంతో స్మృహ తప్పి పడిపోయింది. అయితే ముంబైలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి (ట్రాన్స్‌ప్లాంటేషన్) సదుపాయం లేదు. దీంతో కేవలం కిడ్నీలు, కాలేయాన్ని మాత్రమే తీసుకున్నారు. సదరు మహిళ కిడ్నీని ఓ 53 ఏళ్ల వ్యక్తికి మార్పి డి చేశారు. ఇటీవలే ఇతని కాలేయం, కిడ్నీ పాడైపోవడంతో అతనికి మార్పిడి చేసినట్లు వైద్యురాలు పేర్కొంది. మరోకిడ్నీని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొకరికి దానం చేసినట్లు అక్కడి డాక్టర్లు తెలిపారు. -
హాం ఫట్
-
అపోలోలో తొలి ఎస్కేపీ సర్జరీ
ఏక కాలంలో కిడ్నీ,పాంక్రియస్ల మార్పిడి సర్జరీ విజయవంతమని అపోలో ప్రకటన అన్నానగర్, న్యూస్‌లైన్: దక్షిణాది వైద్య చరిత్రలోనే మొదటిదిగా చెప్పబడుతున్న సైమల్టేనియస్ కిడ్నీ - పాంక్రియాస్ సర్జరీ (ఎస్కేపీ)ను అపోలో వైద్యులు విజయవంతం చేశారని ఆ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. అపోలో ఎండీ ప్రీతారెడ్డి మాట్లాడుతూ త్వరలో అపోలో ఒక మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్‌ను ప్రారంభిస్తుందని తెలిపారు.నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ సర్జరీకు చెందిన విశేషాలను వివరించారు. పాండిచ్చేరికి చెందిన 52 ఏళ్ల పరమేశ్వరీ రాజశేఖర్ మధుమేహ వ్యాధితో చెడిపోయిన కిడ్నీతో తమ వద్దకు వైద్యం కోసం వచ్చారు. ఈ శస్త్ర చికిత్సకు సారథ్యం వహించిన డాక్టర్ ఆనంద్ కక్కర్ తెలిపారు. బాగా ఆలోచించిన మీదట ఆమెకు చెడిపోయిన కిడ్నీతో పాటు, చక్కెర స్థాయిని నియంత్రించే పాంక్రియాస్ గ్రంధిని కూడా పూర్తిగా తొలగించి వాటి స్థానంలో అవయవదాతల నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన కిడ్నీ - పాంక్రియాస్‌లను అమర్చడం వలన ఆమెను మధుమేహం నుంచి పూర్తిగా విముక్తిరాల్ని చేయవచ్చు. ఈ క్రమంలో తన సహవైద్యులైన డాక్టర్ మనీష్ వర్మ, డాక్టర్ ఆనంద్ రామమూర్తి, డాక్టర్ మహేష్‌లతో కల్సి ఈ సరికొత్త ఎస్కేపీ సర్జరీను పరమేశ్వరికి చేసి విజయం సాధించామన్నారు. టైప్టూ మధుమేహంతో బాధపడుతున్న పరమేశ్వరీ ఈ సర్జరీ అనంతరం పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఉన్నారని, ఆమె పాంక్రియాస్, కిడ్నీలు బాగా పని చేస్తున్నాయని కక్కర్ తెలిపారు. ఈ విధానం ఉత్తర భారతావనిలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉందన్నారు. రోగి పరమేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ ఈ సర్జరీ తర్వాత తాను అన్ని పదార్థాలనూ యథేచ్ఛగా తినగల్గుతున్నానని తెలిపారు. మరో ఆరు నెలల తర్వాత స్వీట్లను కూడా తాను తినవచ్చునని వైద్యులు తెలిపారన్నారు. తాను వ్యాధి సోకక ముందు ఎలా ఉన్నానో సర్జరీ తర్వాత కూడా అంతే ఉత్సాహం, ఆరోగ్యంతో ఉన్నానని ఆమె చెప్పారు. అపోలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ విభాగం వైద్యుడు డాక్టర్ భామ, అపోలో వైద్యులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు. -
ఆసుపత్రులకు సుస్తీ
{పజారోగ్యానికి సూది ‘పోటు’ కోమాలో ప్రభుత్వ ఆసుపత్రులు పెద్దాసుపత్రుల్లో కనీస వైద్యం కరువు సిబ్బంది కొరత.. పారిశుధ్య లేమి పనిచేయని పరికరాలు మృత్యువాత పడుతున్న రోగులు సాక్షి, సిటీబ్యూరో: ఆరోగ్య రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌లో అనారోగ్యం రాజ్యమేలుతోంది. ప్రజా ఆరోగ్యం ప్రమాదంలో పడింది. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కనీస సదుపాయాలకు నోచుకోవడం లేదు. వైద్యులు, వైద్య పరికరాలు, మందులు, మౌలిక వసతుల్లేక పుట్టెడు రోగాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకప్పుడు ప్రాణం పోసిన సర్కారు దవాఖానాలే ఇప్పుడు రోగుల ఉసురు తీస్తున్నాయి. పేద ప్రజలకు పెద్దదిక్కుగా ఉన్న ఉస్మానియా, గాంధీ బోధనాసుపత్రులతోపాటు, నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రి, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రుల్లో సైతం నిత్యం మరణ మృద ంగం వినిపిస్తోంది. ఊపిరి తీస్తున్న ఉస్మానియా... ఉస్మానియా ఆస్పత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. నిబంధనల ప్రకారం 186 రకాల మందులు సరఫరా చేయాల్సి ఉండగా.. 60 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. మిగిలిన మందులు రోగులే సమకూర్చుకోవాల్సి వస్తోంది. క్యాన్స ర్, కిడ్నీ, గుండె, కాలేయ సంబంధిత జబ్బులతో బాధపడుతున్న రోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. బై అండ్ సప్లయ్ కింద అవసరాన్ని బట్టి కొన్ని మందులు కొనుగోలు చేస్తున్నా.. అవి రోగుల అవసరాలు తీర్చలేక పోతున్నాయి. ఆస్పత్రిలో ప్రధాన సమస్య పారిశుధ్య లోపం. వైద్యం కోసం వెళ్లిన వారికి ఆస్పత్రిలోని ఇన్ఫెక్షన్ సోకి కొత్త రోగాలు వస్తున్నాయి. ఆస్పత్రిలో ఏ మూల చూసిన చెత్తకుప్పలే దర్శనమిస్తాయి. వార్డుల్లో మురుగు నీరు నిల్వ ఉంటుంది. ఏ విభాగంలోకి తొంగి చూసినా చెడు వాసనే. గతంలో 800కి పైగా వీల్చైర్లు, స్ట్రెచర్లు ఉండగా.. ప్రస్తుతం 200కి మించి లేవు. సెలైన్ స్టాండ్స్ లేక పోవడంతో రోగి బంధువుల బాటిళ్లను చేతిలో పట్టుకుని నిలబడాల్సి వస్తోంది. ఆర్థోపెడిక్ విభాగంలో పడకల కొరత తీవ్రంగా ఉంది. పడకేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాలు నగరంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సుస్తీ చేసింది. చికిత్స చేయాల్సిన ప్రభుత్వం మచ్చుకైనా పట్టించుకోవడం లేదు. వైద్యులపై అజమాయిషీ లేక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఆస్పత్రికి చేరుకోవాల్సిన ప్రభుత్వ వైద్యులు 11 గంటలు దాటినా పత్తా ఉండటం లేదు. జ్వరం, దగ్గు, కడుపునొప్పికి సంబంధించిన సిరఫ్‌లు దొరకడం లేదు. అంబర్పేట్, శ్రీరాంనగర్, జంగ మ్మెట్, లాలాపేట్, పానిపుర, పాన్‌బజార్, పురానాపూల్, బోరబండ పట్టణ ఆరోగ్య కే ంద్రాలను సర్వీసు ఆస్పత్రులుగా తీర్చిదిద్దారు. పురిటి నొప్పులతో బాధపడుతూ అర్ధరాత్రి ఆస్పత్రికి వెళ్తే... తీరా అక్కడ ఒకరిద్దరు న ర్సింగ్ సిబ్బంది మినహా వైద్యులు అసలే ఉండటం లేదు. ఏరియా ఆస్పత్రుల్లో కుక్క కాటుకు యాంటీ రేబిస్ మందు దొరకడం లేదు. ఇక పాము కరిస్తే అంతే.. ఉస్మానియాకు పరుగులు తీయాల్సిందే. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో పిల్లల వైద్యనిపుణులు లేక ఇప్పటికే అనేకమంది మృత్యువాత పడ్డారు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో గర్భిణులు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మలక్‌పేట్, కింగ్‌కోఠి, గోల్కోండ ఏరియా ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. పాతబస్తీలో వ్యాక్సినేషన్ సరిగా జరగకపోవడంతో అనేక మంది డిఫ్తీరియా, మీజిల్స్, మమ్స్ బారిన పడుతున్నారు. 2013లో 1120 మంది డిఫ్తీరియా, 563 మంది మీజిల్స్, 479 మంది మమ్స్ బారిన పడ్డారు. ఆ సంఖ్య ఈ ఏడాది పెరగనుంది. 2014 ఫిబ్రవరి చివరి నాటికే 161 మంది డిప్తీరియా, 209 మంది మీజిల్స్, 104 మంది మమ్స్ బారిన పడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హే గాంధీ..! ‘గాంధీ’లోనూ సిబ్బంది కొరత ఉంది. ఆస్పత్రిలో వెంటిలేటర్లు 50 ఉండగా, వీటిలో 60 శాతం పరికరాలు పని చేయడం లేదు. సీటీ, ఎంఆర్ఐ, ఎక్స్‌రే యంత్రాలు తరచూ మెరాయిస్తున్నాయి. డయాలసిస్ విభాగంలో ఉన్న ఐదు యంత్రాలకే రెండే పనిచేస్తున్నాయి. పారిశుధ్యం ఇంకా మెరుగు పడాల్సి ఉంది. ఆస్పత్రిలో 18 లిఫ్ట్‌లు ఉండగా.. ఐదే పని చేస్తున్నాయి. కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ విభాగాల్లో పడకల కొరత తీవ్రంగా ఉంది. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేక ఒక్కో మంచంపై ఇద్దరు రోగులను ఉంచాల్సి వస్తోంది. మందుల కొరత వల్ల హీమోఫీలియా బాధితులు మృత్యువాత పడుతున్నారు. మార్చురీలో ఆరు ఫీజర్ బాక్కులు ఉండగా.. వీటిలో మూడు పని చేయడం లేదు. రోజుకు 12 మంది పిల్లల మృతి 700 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో నిత్యం 1200 మంది శిశువులు చికిత్స పొందుతుంటారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, వెంటిలేటర్లు, ఫొటో థెరపీ యూనిట్లు, వార్మర్లు లేకపోవడంతో ఒక్కో యంత్రంపై నలుగురు చిన్నారులను పడుకోబెడుతున్నారు. ఇక్కడ కేవలం వందమంది నర్సులే ఉన్నారు. శిశువులను చూసుకునేందుకు ఆయాలు, నర్సులు లేక రోగుల బంధువులే ఆ బాధ్యతలను చూసుకోవాల్సి వస్తోంది. చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోకుండా రోజుల తరబడి ఎన్ఐసీయూలో ఉండటం, అక్క డే భోజనం చేయడం వల్ల శిశువులకు ఇన్ఫెక్షన్ సోకుతోంది. దీంతోపాటు సకాలంలో వైద్యం అందక రోజూ సగటున 12 మంది శిశువులు మృత్యువాత పడుతున్నారు. ఆస్పత్రిలో కాన్పు సమయంలో అధిక రక్తస్రావ సమస్యలు తలెత్తుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వీరికి అవసరమైన రక్తం దొరకడం లేదు. క్రిటికల్‌కేర్ యూనిట్ కూడా లేక అధిక రక్తస్రావం వల్ల అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాలింతలను చివరకు ఉస్మానియా, గాంధీ బోధనాసుపత్రులకు తరలిస్తుండటంతో అప్పటికే పరిస్థితి విషమిస్తోంది. పనిచేయని వార్మర్లు, ఫొటో థెరపీ యూనిట్లలో శిశువులను ఉంచుతుండటంతో వారు చనిపోతున్నారు. ఎమర్జెన్సీ విభాగంలో గత మూడేళ్ల నుంచి లిఫ్ట్ పనిచేయడం లేదు. కార్డియాలజీ విభాగం ఉన్నా.. ఈసీజీ, టూడీ ఎకో పరీక్షల కోసం ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు. పేట్ల బురుజు... నిర్లక్ష్యపు బూజు సుమారు 642 పడకల సామర్థ్యం ఉన్న పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో రోజుకు సగటున 50 ప్రసవాలు జరుగుతుంటాయి. కాన్పు సమయంలో చాలామంది బాలింతలు అధిక రక్తస్రావంతో బాధ పడుతుంటారు. వీరికి చికిత్స అందించేందుకు ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ లేక ఉస్మానియాకు తరలించాల్సి వస్తోంది. ఇంతపెద్ద ఆస్పత్రిలో కేవలం 50 మంది వైద్యులే ఉన్నారు. రోగుల నిష్పత్తికి తగినంత మంది ఆయాలు, స్టాఫ్ నర్సులు లేరు. పడకల కొరత వల్ల ఒక్కో మంచంపై ఇద్దరు ముగ్గురు బాలింతలను ఉంచుతున్నారు. పారిశుద్ధ్య లోపం రోగుల పాలిట శాపంగా మారింది. ఆస్పత్రికి వచ్చిన నిరుపేద గర్భిణులను ఆల్ట్రాసౌండ్ పరీక్షల కోసం బయటికి పంపుతున్నారు. ఇందుకోసం రూ. వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఓపీ చీటీల కోసం ఉదయం 4 గంటల నుంచే క్యూలో నిలబడాల్సిన దుస్థితి. అదే విధంగా 150 పడకల సామర్థ్యం ఉన్న సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోనూ గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. బడ్జెట్ పెంచాలి ప్రభుత్వ ఆస్పత్రులకు బడ్జెట్ కేటాయింపులు దారుణంగా ఉంటున్నాయి. వైద్యసేవలు మెరుగుపడాలంటే ఆస్పత్రి వార్షిక బడ్జెట్‌ను మరింత పెంచాలి. రోగుల నిష్పత్తికి తగినంతమంది పారామెడికల్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్లతో పాటు శానిటేషన్ సిబ్బందిని నియమించాలి. రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన అన్నిరకాల వైద్య పరికరాలను సమకూర్చాలి. కేవలం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకే కాకుండా ఆస్పత్రికి వచ్చిన రోగులందరికీ నాణ్యమైన మందులను అందించాలి. రోగులకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు కొనుగోలు చేసే అధికారం ఆయా ఆస్పత్రుల సూపరింటిండెంట్లకు ఇవ్వాలి. - డాక్టర్ నాగేందర్, ఉస్మానియా మెడికల్ కళాశాల కు.ని. చేసి నేలపై పడుకోబెడతారు డీపీఎల్ క్యాంప్‌లో భాగంగా ఆపరేషన్ చేయించుకున్న మహిళలను నేలపై పడుకోబెడుతున్నారు. ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదు. ఆస్పత్రిలో మందులే కాదు మంచి నీళ్లు కూడా దొరకడం లేదు. - కాంతమ్మ, షాపూర్‌నగర్ ఆస్పత్రుల్లో సౌకర్యాలు నిల్ నా కూతురు రెండు నెల లుగా దగ్గుతో బాధపడుతుంది. ఇక్కడ వైద్యం కోసం వస్తే మరో ఆస్పత్రికి వెళ్లమంటారు. అక్కడ పరీక్షలు చేయించుకుని వస్తే మందులు లేవంటారు. మేము ఎక్కడని తిరగాలి. - రిహానా, గాజుల రామారం రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది తలకు గాయమైంది. స్థానిక వైద్యుల సూచన మేరకు వారం రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి వస్తే వైద్యపరీక్షలు నిర్వహించి పలు టెస్ట్‌లు, ఎక్స్‌రేలు రాశారు. వారం రోజులుగా ఆస్పత్రి చుట్టు తిరుగుతున్నా ప్రయోజనం లేదు. - కృష్ణయ్య, మహబూబ్‌నగర్ వైద్యుల చుట్టూ తిరగాలి మా అమ్మాయిని ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకొచ్చాను. వైద్యుల చుట్టూ పదిసార్లు తిరగాల్సి వస్తోంది. కింది స్థాయి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పేదలకు ఆసుపత్రుల్లో వైద్యం సక్రమంగా అందేలా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలి. - ఆఫ్రిన్ ఉన్నీసా, హసన్‌నగర్ చీదరించుకుంటున్నారు సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి అసుపత్రిలో వైద్యం కోసం వెళ్లిన రోగులను సిబ్బంది చీదరించుకుంటున్నారు. వైద్యుల పరిస్థితీ అలాగే ఉంది. పేద రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేందుకు జంకే పరిస్థితి లేకుండా చూడాలి. - కేశవ్, గోల్నాక పడకల సంఖ్య పెంచాలి సుల్తాన్‌బజార్ ఆసుపత్రికి వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఇక్కడ 160 పడకలున్నాయి. వీటి సంఖ్య పెంచాలి. అలాగే వైద్యులు, నర్సులు, సిబ్బంది సంఖ్యను పెంచి వచ్చే రోగులకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలి. - వనిత, నాంపల్లి దళారుల బెడద వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తే దళారుల బెడద ఎక్కువైంది. సమయానికి వైద్యులు కూడా అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రసవం కోసం నేను పేట్లబురుజు ఆసుపత్రికి వచ్చాను. ఇక్కడ సిబ్బంది సరిగా స్పందించడం లేదు. అంతేకాదు సరైన రీతిలో సదుపాయాలు లేవు. తీవ్ర ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తోంది. - భాగ్యలక్ష్మి, గర్భిణి నడుం నొప్పి తగ్గలేదు కొన్నేళ్లుగా నడుం నొప్పితో బాధపడుతున్నాను. జిల్లా ఆస్పత్రిలో చూపిస్తే గాంధీ ఆస్పత్రికి వెళ్లమన్నారు. రెండు రోజుల కిందట గాంధీ ఆస్పత్రికి వచ్చాను. అక్కడి డాక్టర్లు ఇచ్చిన గోళీలే ఇక్కడా ఇచ్చారు. నడుం నొప్పి తగ్గలేదు సరికదా బస్సు చార్జీలు, తిండికి రూ.500 వదిలింది. - లక్ష్మి, జనగాం, వరంగల్ -
హోమియోతో కిడ్నీలో రాళ్ళకు చెక్
కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటానికి కారణాలు అనేకం. అవి ఎక్కువ కాలం ఉండిపోతే, కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. సర్జరీతో ఒకసారి తొలగించినా అవి ఏర్పడటానికి అసలు కారణమైన శరీరతత్వాన్ని మార్చనంతవరకు అవి మళ్లీ మళ్ళీ వస్తాయి. శరీరతత్వాన్ని మార్చి కిడ్నీలో రాళ్లను శాశ్వతంగా తొలగించడం కేవలం హోమియో వైద్యానికే సాధ్యం అంటున్నారు ప్రముఖ హోమియోనిపుణులు డాక్టర్ వాణీ రవికిరణ్. మూత్రపిండం, పిత్తాశయంలో ఏర్పడిన రాళ్ల వల్ల తీవ్రనొప్పి వస్తుంటుంది. సాధారణంగా చిన్న రాళ్ళు అయితే వాటంతట అవే బయటకు వస్తుంటాయి. కాని పరిమాణంలో పెద్దగా అంటే కనీసం 2 - 3 మీల్లిమీటర్ల కంటే పెద్దగా ఉన్న రాళ్ళు కిడ్నీలోని వివిధ భాగాల్లో చిక్కుకుపోయి తీవ్ర నొప్పి మొదలవుతుంది. రోగికి వాంతులు కావటం, వికారంగా ఉంటుంది. కారణాలు: 40 ఏళ్లు దాటిన మహిళలు కాల్షియం, విటమిన్ డి 3 టాబ్లెట్లు ఎక్కువగా వాడుతుంటారు. కాబట్టి వారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. మాత్రలకు బదులు ప్రకృతి పరంగా లభించే కాల్షియం తీసుకున్నట్లయితే ఎముకలకు మంచిదీ, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. మంచినీరు తక్కువగా తాగటం మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడానికి కారణమవుతుంది. లక్షణాలు: మూత్రపిండంలో రాళ్ల వల్ల భరించలేని నొప్పి ఉంటుంది. ఇది ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ఉంటుంది. ఈ నొప్పి వీపు వెనుక భాగంలో నుంచి బయలుదేరి పొత్తికడుపులోకి వస్తుంది. తెంపరలుగా వచ్చే ఈ నొప్పి జననాంగాలలోకి పాకుతుంది. 20 నుంచి 90 నిమిషాల వరకు ఈ నొప్పి ఉంటుంది. తల తిరగటం, వికారం, వాంతులు కావటం, మూత్రంలో మంట రక్తం చీము రావచ్చు. చెమట, జ్వరం, కంగారుగా, కోపంగా ఉండవచ్చు. ఎటువైపు కదలినా, వంగినా నొప్పి నుంచి ఉపశమనం ఉండదు. కొన్నిసార్లు కాళ్లలో వాపు ఏర్పడవచ్చు. పిత్తాశయంలో రాళ్లు పిత్తాశయం అనేది కాలేయం నుంచి వచ్చే పైత్యరసాలను ఒడిసిపట్టే సంచి లాంటిది. ఇందులో ఉండే పైత్యరసాలు మనం తీసుకునే మాంసకృత్తులు, నూనె పదార్థాలను అరిగింపచేయడానికి ఉపయోగపడతాయి. పైత్యరసం గాఢత పెరిగినప్పుడు రాళ్ళు ఏర్పడతాయి. లక్షణాలు: పిత్తాశయంలో ఏర్పడిన రాళ్ళు కొన్నేళ్ల పాటు లక్షణాలను చూపవు. ఎప్పుడైతే పెద్దవిగా మారుతాయో అప్పుడు లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల పొట్ట నొప్పి ఉంటుంది. కుడివైపు పొట్టలో నొప్పి మొదలై వీపు వెనుకభాగంలోకి చేరుతుంది. దీని వల్ల వికారం, వాంతులు, జ్వరం కనిపిస్తాయి. కారణాలు: పిత్తాశయంలో రాళ్లకు అధిక మాంసాహారం, పీచుపదార్థాలు తగ్గడం, బరువు పెరగడం, వంశపారంపర్యం, బరువు పెరుగతున్నామనే భావనతో ఆహారం తగ్గించడం, అనీమియా, ఆల్కహాల్, ధూమపానం, వేపుడు పదార్థాలు, కాల్షియం, విటమిన్ సి తగ్గడం వంటివి కారణాలు. హోమియో చికిత్స: కిడ్నీ, పిత్తాశయాల్లో రాళ్లను పూర్తిగా నయం చేయాడనికి హోమియోలో అత్యుత్తమ చికిత్స విధానాలు ఉన్నాయి. ఈ మందుల వల్ల రాళ్లు తొలగిపోవడమే కాకుండా భవిష్యత్‌లో మళ్లీ ఏర్పడకుండా చేయవచ్చు. డాక్టర్ వాణి రవికిరణ్, ప్రముఖ హోమియో వైద్యనిపుణులు, మాస్టర్స్ హోమియోపతి, అమీర్‌పేట్, కూకట్పల్లి, హైదరాబాద్, విజయవాడ. ఫోన్: 7842 106 106 / 9032 106 106 -
అబ్బే.. అంతా బాగే
సాక్షి ప్రతినిధి, ఏలూరు :కిడ్నీ రోగుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వాసుపత్రిలోని బిబ్రాన్ ఆరోగ్యశ్రీ డయాలసిస్ యూనిట్‌కు అధికారులు క్లీన్చిట్ ఇచ్చేశారు. తూతూమంత్రంగా తనిఖీలు చేసి అంతా బాగానే ఉందని, ఇకపై పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసి మరీ వెళ్లారు. జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని ఆరోగ్యశ్రీ డయూలసిస్ యూనిట్ నిర్వాహకులు ప్రైవేటు ల్యాబ్‌తో కుమ్మక్కై రక్త పరీక్షలు చేయకుండానే చేసినట్లు రిపోర్టులు ఇస్తున్న వైనాన్ని ‘అవినీతి జబ్బు’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. దీంతో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ జిల్లా కో-ఆర్డినేటర్ ప్రభాకరరావు, వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల జిల్లా కో-ఆర్డినేటర్ శంకర్రావు మంగళవారం ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో బిబ్రాన్ కంపెనీ నిర్వహిస్తున్న డయాలసిస్ యూనిట్లో తనిఖీ నిర్వహిం చారు. రోగులను పరీక్షించి, వారి రక్తపరీక్షల రిపోర్టులను పరిశీలించారు. పరీక్షలు చేయకుండానే రిపోర్టులు తెప్పిస్తున్నారని బయటపడితే మళ్లీ అవే రిపోర్టులను పరిశీ లించి క్లీన్చిట్ ఇవ్వడం విశేషం. రక్త పరీక్షలు నిర్వహించేందుకు డయాలసిస్ యూనిట్‌తో ఒప్పందం చేసుకున్న జెడ్ ల్యాబ్ యాజమాన్యాన్ని పిలిపించి వారి రికార్డులను కూడా పరి శీలించారు. యూనిట్లో ఉన్న రిపోర్టులు, ల్యాబ్‌లో ఉన్న రికార్డులను సరిపోల్చి అంతా బాగానే ఉందని కితాబిచ్చారు. ఆ రిపోర్టులకు సంబంధించి పరీక్షలే జరగడం లేదనే విషయాన్ని అధికారులు మరచిపోవడం గమనార్హం. అదికాకుండా బిబ్రాన్ కంపెనీ, జెడ్ ల్యాబ్‌తో లోపాయకారిగా ఎటువంటి సంప్రదింపులు జరపలేదని తేల్చేశారు. జెడ్ ల్యాబ్ కంటే ముందు వేరే ల్యాబ్‌తో ఉన్న ఒప్పం దాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారనే విషయంపైనా సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ఆ ల్యాబ్ పరీక్షలు సరిగా చేయకపోవడం వల్లనే వారితో ఒప్పందం రద్దు చేసుకున్నారని ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ సమర్థిస్తుండటం గమనార్హం. కేస్ షీట్లతో జత చేయలేదేం హెచ్‌సీవీ, హెచ్ఐవీ రక్త పరీక్షలు జరిపి.. సంబంధిత కిట్లను రోగి కేస్షీట్కు జత చేయాల్సి వుంది. కిట్లను జతచేసి ఉంటే వాటి రిపోర్టులు, మళ్లీ అదే రోగికి రక్త పరీక్షలు జరిపితే వచ్చే రిపోర్టులను పోల్చి చూస్తే కొంతైనా వాస్తవం తెలిసే అవకాశం ఉండేది. కానీ చాలా కేస్ షీట్లు, రిపోర్టులకు ఆ కిట్లు జతచేసి ఉంచడం లేదు. దీంతో అసలు పరీక్షలు చేశారనే గ్యారంటీయే లేకుండాపోతోంది. అలాంటప్పుడు ఆ రిపోర్టులను పరిశీలించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హెచ్‌సీవీ పాజిటివ్ ఎందుకొస్తోంది అధికారులు తనిఖీ చేసే సమయంలో డయాలసిస్ యూనిట్లో ఆరుగురు రోగులుండగా, అందులో నలుగురికి హెచ్‌సీవీ పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. నిజానికి హెపటైటిస్ సీ వైరస్ ఆస్పత్రిలో వాడే పరికరాలు సరిగా లేకపోవడం వల్లే రోగులకు వస్తుంది. యూనిట్లో అంతా సవ్యంగా చేస్తే రెగ్యులర్‌గా డయాలసిస్ చేసే రోగులకు ఈ వైరస్ సోకే అవకాశం ఉండదు. కానీ ఈ యూనిట్లో డయాలసిస్ చేయించుకున్న రోగుల్లో 60 శాతం మందికి ఈ వైరస్ సోకుతోంది. లివర్‌కు సంబంధించి ఈ వైరస్ సోకిందని తెలియగానే వారు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి.. ఆస్తులను అమ్ముకుని లక్షలు పెట్టి చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. ఈ వైరస్ కేసులు డయాలసిస్ యూనిట్లో ఎక్కువగా ఉండటాన్ని బట్టే అక్కడ ఏదో తేడా జరుగుతుందనే విషయాన్ని అధికారులు గుర్తించాల్సివుంది. అప్పటికప్పుడు ప్రత్యక్షమైన వైద్యులు అధికారులు యూనిట్లో తనిఖీలు చేస్తున్నప్పుడు ఎప్పడూ అక్కడకు రాని వైద్యులు అప్పటికప్పుడు వచ్చి వాలిపోవడం గమనార్హం. ఈ డయాలసిస్ యూనిట్లో నిరంతరం ఒక డ్యూటీ వైద్యుడు, ఒక నెఫ్రాలజీ వైద్యుడు ఉండాలి. యూనిట్ నిర్వాహకులు విజయవాడకు చెందిన నెఫ్రాలజీ వైద్యుడు సత్యవంశీని నియమించారు. ఆయన వారానికి ఒకటి, రెండుసార్లు మాత్రమే అది కూడా ఉదయం పదిగంటల లోపు వచ్చి వెళ్లిపోతున్నట్లు సమాచారం. డ్యూటీ డాక్టర్ అని పేరేగానీ ఎప్పుడూ డ్యూటీలో డాక్టర్ ఉండరని చెబుతున్నారు. టెక్నీషియన్లే అంతా తామై తంతు నడిపించేస్తున్నారు. దీనివల్ల వల్ల కూడా రోగులు ఇబ్బందుల పాలవుతున్నారు. సీరియస్ కేసులు వచ్చినప్పుడు కూడా నెఫ్రాలజీ వైద్యు డు, డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది. అయితే విచారణాధికారులు అంతా సవ్యంగా ఉందని కితాబివ్వడం అనుమానాలకు తావిస్తోంది. -
చిన్నపిల్లల్లోనూ మూత్రపిండాలలో రాళ్లు..?
మీరు చెప్పిన లక్షణాలను, సమాచారాన్ని బట్టి మీ అబ్బాయికి కిడ్నీలో రాళ్లు (నెఫ్రోలిథియాసిస్) ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్దవాళ్లతో పోలిస్తే ఈ కండిషన్ చిన్నపిల్లల్లో అంత సాధారణం కానప్పటికీ, ఇది అరుదైన విషయం మాత్రం కాదు. పిల్లల కిడ్నీల్లో రాళ్లు తయారుకావడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా కొన్ని జన్యుపరమైన అంశాలు ఇందుకు దోహదపడుతుంటాయి. పిల్లలు తీసుకునే ఆహారం, వాతావరణం, ఆర్థిక-సామాజిక పరిస్థితులు, ఎండోక్రైనల్ సమస్యల వంటివి కూడా ఇందుకు కారణాలే. ఇక పదహారేళ్లలోపు పిల్లల్లో 5 నుంచి 6 శాతం మందిలో కిడ్నీలో రాళ్లు కనిపిస్తుంటాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక పిల్లల్లో తరచూ మూత్రసంబంధ (యూరినరీ ట్రాక్ట్) ఇన్ఫెక్షన్స్ వస్తున్న సందర్భాల్లో... మూత్రపిండాల్లో రాళ్లకు అది ఒక ప్రధాన కారణమవుతుంది. పిల్లల కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు కడుపునొప్పి, మూత్రంలో రక్తం, కొన్నిసార్లు జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. ఈ రాళ్లలోనూ క్యాల్షియం కార్బొనేట్, ఆక్సలేట్స్, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్, స్ట్రువైట్ స్టోన్, సిస్టీన్ వంటి అనేక రకాలుంటాయి. పిల్లల కిడ్నీలో రాళ్లు కనిపించినప్పుడు వారిలో ఏవైనా జీవక్రియలకు సంబంధించిన లోపాల (మెటబాలిక్ డిజార్డర్స్) వంటివి ఉన్నాయా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ కండిషన్‌ను నిర్ధారణ చేయడానికి రొటీన్ మూత్రపరీక్షలు, రీనల్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ స్కాన్‌తో పాటు కొన్ని మెటబాలిక్ పరీక్షలు చేయించడం అవసరం. రీనల్ స్కాన్, మెటబాలిక్ పరీక్షల ద్వారా రాయి తాలూకు రసాయన స్వభావం తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే దానిపైనే ఆ తదుపరి చికిత్స ఆధారపడి ఉంటుంది. చాలామంది పిల్లల్లో ఈ రాయి పరిమాణం చిన్నదిగా ఉంటే దానంతట అదే మూత్రంతో పాటు పడిపోతుంది. ఇలాంటి పిల్లలు నీళ్లు ఎక్కువగా తాగడం, పొటాషియం పాళ్లు ఎక్కువగా ఉండే ద్రవాహారాలు తీసుకోవడం, కొవ్వులు ఎక్కువగా, పిండిపదార్థాలు తక్కువగా ఉంటే కీటోజెనిక్ ఆహారానికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వారిలో మూత్రసంబంధమైన (యూరినరీ ట్రాక్ట్) ఇన్ఫెక్షన్స్ ఉంటే వెంటనే చికిత్స చేయించడం, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని పరిమితం గా తీసుకోవడం, ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించడం వంటి జాగ్రత్తలను పాటించాలి. ఇక ఉప్పు తక్కువగా తీసుకోవడం అవసరం. అలాగే ఉప్పు పాళ్లు ఎక్కువగా ఉండే చిప్స్, పచ్చళ్లు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే పాల ఉత్పాదనలు, మాంసాహారం, చీజ్ వంటి ఆహారాలను బాగా తగ్గించాలి. మీ అబ్బాయి విషయానికి వస్తే... అది ఎలాంటి రాయి అన్నది మనకు తెలియదు కాబట్టి దాని రసాయన స్వభావాన్ని తెలుసుకోవడం కోసం అవసరమైన పరీక్ష చేయించాలి. అలాగే ఎవరిలోనైనా రాయి పరిమాణం పెద్దదిగా ఉండి, అది దేనికైనా అడ్డుపడటం వల్ల కనిపించే లక్షణాలను కనబరుస్తుంటే దాన్ని శస్త్రచికిత్స లేదా షార్ట్వేవ్ లిథోట్రిప్సీ ప్రక్రియ ద్వారా తొలగింపజేసుకోవాలి. మీరు పైన పేర్కొన్న వివరాలను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. మూత్రపిండాల్లో రాళ్లు మళ్లీ మళ్లీ కనిపిస్తుంటే మాత్రం తప్పనిసరిగా దాని రసాయన స్వభావాన్ని అధ్యయనం చేయించి, అలాంటి రాయి పెరుగుదలను ప్రేరేపించే ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందుగా పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ నెఫ్రాలజిస్ట్‌ను గాని యూరాలజిస్ట్‌ను గాని సంప్రదించండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఏమైందో.. ఏమో?!
అనుమాన భూతం =గజి‘బిజీ’ నగర జీవితం =ఆరోగ్యంపై తరచూ అపోహలు =చీటికీ మాటికీ వైద్యుల వద్దకు పరుగు =తుమ్మొచ్చినా.. దగ్గొచ్చినా సందేహమే! =లేని రోగాలు ఉన్నట్టు భావన =రెండోసారి పరీక్షలకు క్యూ కడుతున్న వైనం =‘మున్‌చౌసన్ సిండ్రోమ్’ అంటున్న వైద్యులు సాక్షి, సిటీబ్యూరో: ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి వరకు ఉరుకుల పరుగుల జీవితం. అలుపొచ్చినా.. కాస్తంత నలతగా ఉన్నా.. ఏదో అనారోగ్య సమస్య తలెత్తిందేమోనని అనుమానం.. దీనికి తోడు ప్రసార మాధ్యమాల్లో వచ్చే ఆరోగ్య కథనాలు, కార్యక్రమాలు చదువుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు అవే లక్షణాలు మనకీ ఉన్నాయేమోనని అపోహపడటం.. వాటిని ఊహించుకుని అనుమానంతో ఆందోళనకు గురికావడం.. తమ పరిచయస్తులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే అటువంటి రోగ లక్షణాలు మనకూ ఉన్నాయేమోనని భావించుకోవడం... ఇటువంటి మానసిక ప్రవృత్తి క్రమంగా రుగ్మతగా మారుతోందని వైద్యులు అంటున్నారు. ఫలితంగా ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేకున్నా పదేపదే వైద్య పరీక్షలు చేయించుకోవడం పరిపాటైంది. తరచూ పరీక్షలు చేయించుకోవడం ఆరోగ్యస్పృహగా భావించినా.. పలువురు వైద్యులను సంప్రదిస్తూ, పలు పరీక్షలు చేయించుకోవడం మాత్రం మానసిక సమస్యగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తమ వద్దకు అనుమానం జబ్బుతో పరుగెత్తుకుని వస్తున్న వారి నుంచి ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వాహకులు ఇదే అదనుగా దోచుకుంటున్నారు. అసలు అనుమానాలకు తోడు మరికొన్ని అపోహలు కలిగిస్తూ ఎందుకైనా మంచిదనే ‘సలహా..సూచన’లతో రకరకాల ప్యాకేజీలను అంటగడుతున్నారు. చిన్నచిన్న అనారోగ్య లక్షణాలకు కూడా సీటీ స్కాన్ తీస్తూ.. రకరకాల పరీక్షలు చేసి భారీగా ఫీజులు గుంజుతున్నారు. లేని రోగాలను ఊహించుకుని, అనుమానంతో బెంబేలెత్తిపోతూ ఇలా తరచూ పరీక్షలు చేయించుకోవడాన్ని వైద్య పరిభాషలో ‘మున్‌చౌసన్ సిండ్రోమ్’గా నిపుణులు వ్యవహరిస్తున్నారు. నగరంలో ప్రతి వంద మందిలో 20 శాతం మంది రెండోసారి పరీక్షలు చేయించుకుంటున్నట్టు ఓ అంచనా. రిపోర్టులపై నమ్మకం కుదిరే వరకు.. తనకేదో జబ్బు ఉందని భావించినవారు వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే, అక్కడితో ఆగక వైద్యుడు చెప్పినట్లు తనలో ఆ సమస్య ఉందో లేదోనని సెకండ్ ఒపీనియన్ కోసం నిమ్స్ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఒక్క హృద్రోగ విభాగానికే రోజుకు 20కి పైగా కేసులు వస్తుండడం గమనార్హం. ఇక మూత్రపిండాల విభాగానికి ఇలాంటి కేసులకు లెక్కే లేదు. ఓపీకి వస్తున్న ఆరోగ్యశ్రీ బాధితుల్లో సగంమంది వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకే వస్తున్నారు. ఒకసారి వచ్చిన రిపోర్టులపై నమ్మకం లేక మరోసారి పరీక్షించాలని డయాగ్నొస్టిక్స్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. తనకు వ్యాధి ఉందని ఖచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాతే సర్జరీలకు అంగీకరిస్తున్నామని నిమ్స్ మూత్రపిండాల విభాగాధిపతి డాక్టర్ శ్రీ భూషణ్‌రాజు చెప్పారు. కొంత మంది వారికి ఎలాంటి జబ్బు లేకపోయినా తమకేదో అయిపోతుందనే అపోహతో వైద్యులు సూచించకపోయినా నేరుగా డయాగ్నోస్టిక్ సెంటర్లలో మాస్టర్ హెల్త్ చెకప్‌లు చేయించుకుంటున్నారు. అనుమానంతో పరీక్షలు.. అన్ని రంగాల ఉద్యోగుల్లోనూ మానసిక ఒత్తిడి పెరుగుతోంది. సాధారణ ఛాతి నొప్పికి కూడా టీఎంటీ, యాంజియోగ్రామ్ వంటి ఖరీదైన టెస్టులు సిఫార్సు చేస్తుండటం కూడా వారిలో అనుమానాలకు తావిస్తోంది. ఉన్నత చదువులు చదివి ఆరోగ్య స్పృహ ఉన్నవారిలోనే ఈ అనుమానం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ అపోహలతో భవిష్యత్తులో రావాల్సిన జబ్బులు ముందే వచ్చేస్తున్నాయి. - డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, మానసిక నిపుణుడు, స్టార్ హాస్పిటల్ మళ్లీ మళ్లీ వస్తున్నారు.. ఒకసారి పరీక్షించి జబ్బు లేదని నిర్ధారించిన తర్వాత అదే రోగి వారం తిరక్కుండానే ఓపీకి వచ్చి మళ్లీ టెస్టులు రాయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. ఐటీ అనుబంధ రంగంతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులూ ఇలాగే ఉంటున్నారు. టెస్టులకు నిరాకరిస్తే మరో వైద్యుడిని ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమే కానీ, అదే అనుమానపు జబ్బు ముదిరితే దానికి ఏ మందులు పనిచేయవు. - ప్రొఫెసర్ శ్రీభూషణ్‌రాజు, మూత్రపిండాల విభాగాధిపతి, నిమ్స్ ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమే కానీ.. గతంతో పోలిస్తే నగరవాసుల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. అయితే, ఆరోగ్యంపై పెరుగుతున్న అనుమానం, మితిమీరిన జాగ్రత్తలు కొత్త అనర్థాలకు దారి తీస్తున్నాయి. తుమ్మినా, దగ్గినా వెంటనే వైద్యుడి వ ద్దకు వెళ్లిపోతున్నారు. తనకు ఏదో జరిగిపోతుందనే ఆందోళనతో అవసరం లేకున్నా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది కాదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమే కానీ అనుమానంతో వైద్యుల చుట్టూ తిరిగితే మాన సిక రుగ్మతగా మారే ప్రమాదం ఉంది. - ప్రొఫెసర్ నాగేందర్, ఉస్మానియా ఆస్పత్రి -
పేదలపాలిట సంజీవని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి
న్యూఢిల్లీ: పేద, ధనిక అన్న తేడాలేమీ లేకుండా అనారోగ్య సమస్యలు అందరినీ వేధిస్తూనే ఉన్నాయి. కలుషితమైన వాతావరణం, రసాయనాలతో పండించిన పంటలు మానవుడి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. ఆర్థికంగా ఫరవాలేదనుకున్నవారు అవసరమైన వైద్యం చేయించుకొని ప్రాణాలను కాపాడుకుంటున్నారు. పూటగడవడమే కష్టంగా ఉన్నవారు మృత్యువు ఒడిలోకి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందుతున్నా ఏవో చిన్నాచితకా రోగాలకు మాత్రమే. కిడ్నీ మార్పిడి వంటి పెద్ద సమస్యే ఎదురైతే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిందే. ఈ భారాన్ని మోయలేనివారు తనువు చాలించాల్సిందే. ఇలాంటి రోగులపట్ల సంజీవనిగా నిలుస్తోంది నగరంలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్. లక్షల రూపాయలు ఖర్చయ్యే కిడ్నీ మార్పిడిని కూడా ఉచితంగా చేస్తూ, రోగి కోలుకునే వరకు అవసరమైన మందులను కూడా ఉచితంగానే అందజే స్తోంది. ఇప్పటిదాకా ఇటువంటి సౌకర్యం ఈ ఆస్పత్రిలో ఉండేది కాదని, అక్టోబర్ 8న బీహార్‌కు చెందిన రామ్ ప్రవేశ్‌కు తొలిసారిగా కిడ్నీ మార్పిడి చేశామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఆపరేషన్ తర్వాత తమలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగిందని, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న రోగుల్లో కొందరిని ఎంపిక చేసి త్వరలో మరిన్ని కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తామని చెబుతున్నారు. ఈ విషయమై అవయవ మార్పిడి విభాగం ఇన్చార్జి డాక్టర్ విమల్ భండారీ మాట్లాడుతూ.. ‘బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన రామ్ ప్రవేశ్ కిడ్నీ పనిచేయకపోవడంతో ఆస్పత్రికి వచ్చాడు. అప్పటికే అతని సమస్య ఐదో స్టేజీలో ఉంది. ఇటువంటి సమయంలో కిడ్నీని మార్చడం మినహా మ రో మార్గంలేదు. పవేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతోపాటు ఆయన భార్య కిడ్నీని దానం చేసేం దుకు సిద్ధంగా ఉండడంతో కిడ్నీని మార్చాలని నిర్ణయించాం. అయితే అటువంటి ఆపరేషన్‌ను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో గతంలో ఎప్పుడూ చేయలేదు. దీంతో అనుభవజ్ఞుల పర్యవేక్షణలో కిడ్నీని మార్చాలని నిర్ణయించాం. యూరాలజీ, నెఫ్రాలజీ, అనస్థీషియా విభాగాలకు చెందిన ఆరుగురు డాక్టర్లు, ఎయిమ్స్, బీఎల్కే ఆస్పత్రులకు చెందిన వైద్యుల పర్యవేక్షణలో ఈ నెల 8న ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశాం. గతంలో కిడ్నీ మార్పిడి ప్రక్రియను దాదాపు ఆరు సంవత్సరాలపాటు చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం దక్కింది. మిగతా వారికి కూడా మూడేళ్లకుపైగానే అనుభవముంది. అయితే ఈ ఆపరేషన్ చేసేందుకు ఇద్దరు నెఫ్రాలజిస్టుల అవసరముందని గుర్తించి అనుభవజ్ఞుల సాయం తీసుకున్నామ’ని చెప్పారు. యూరాలజీ విభాగం ఇన్చార్జి డాక్టర్ అనుప్ కుమార్ మాట్లాడుతూ... ‘ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి అవసరమైన రోగులు దాదాపు 50 మంది వరకు ఉన్నారు. వారిలో అత్యవసర వైద్యం అవసరమైన ఐదుగురిని గుర్తించి రానున్న రోజుల్లో వారికి ఆపరేషన్ చేస్తామ’ని చెప్పారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీడీ అథానీ మాట్లాడుతూ... ‘కేవలం ఆపరేషన్ చేసి వదిలించుకోవడం కాకుం డా రోగి పూర్తిగా కోలుకునేవరకు అవసరమైన మందులను కూడా ఉచితంగానే అందజేస్తున్నాం. ప్రవేశ్‌కు దాదాపు నెలరోజులకు సరిపడా మందులను అందజేశాం. ఆర్థికంగా ఇది వారికి ఎంతో ఊరటను ఇచ్చే విషయమే. అయితే ఈ ఆపరేషన్‌కు అవసరమైన పూర్తి సదుపాయాలు మా ఆస్పత్రిలో లేనందున కొన్ని పరీక్షల కోసం ఎయిమ్స్, ప్రైవేటు ఆస్పత్రులపై ఆధారపడాల్సి వస్తోంది. భవిష్యత్తులో సఫ్దర్జంగ్లోనే అన్ని సదుపాయాలను సమకూర్చుకుంటామ’ని చెప్పారు. -
కిడ్నీలో ఈ నీటిబుడగలేమిటి..?
నాకు 45 ఏళ్లు. ఈమధ్యకాలంలో బీపీ ఎక్కువగా ఉందని చెప్పారు. దాంతో హెల్త్ చెక్ అప్స్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్‌లో కిడ్నీలో నీటి బుడగలు ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. ‘కిడ్నీ పనితీరు కొంచెమే మారింది, పెద్దగా ప్రమాదమేమీ లేద’న్నారు. అసలీ నీటి బుడగల జబ్బేమిటి? నాకు భయమేస్తుంది. మా నాన్నగారు కూడా ఏదో కిడ్నీ సమస్యతోనే చనిపోయారు. ఈ జబ్బు విషయంలో నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అసలు కిడ్నీ చెడిపోకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నా ఈ జబ్బుకు ఏదైనా ఆపరేషన్ అవసరం ఉంటుందా? - సుదర్శన్, వరంగల్ మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకు పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉండవచ్చునని అనిపిస్తోంది. ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే జబ్బు . ఈ జబ్బు ఉన్నవారిలో 30 ఏళ్ల వయసప్పటి నుంచి 50 ఏళ్ల మధ్యన మూత్రపిండాల్లో నీటిబుడగలు తయారవ్వడం మొదలవుతుంది. ఈ నీటిబుడగల సంఖ్య, పరిమాణం పెరిగేకొద్దీ కిడ్నీ సైజ్ పెరుగుతుంది. అలా పెరగడం వల్ల కిడ్నీ కండ తగ్గడానికి అవకాశం ఉంటుంది. క్రమేపీ నీటిబుడగల సంఖ్య పెరగడం వల్ల కిడ్నీ పనితీరు కూడా నెమ్మదిగా మందగిస్తూ పోతుంది. ఈ జబ్బుకు నిర్దిష్టంగా ఏ మందులూ లేకపోయినా, బీపీని నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు తక్కువ మాంసకృత్తులను తీసుకోవడం వల్ల కిడ్నీ పనితీరును కాపాడుకోవచ్చు. ఈ జబ్బు ఉన్నవారు క్రమం తప్పకుండా అల్ట్రాసౌండ్ స్కాన్, బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకుంటూ, మూత్రపిండాల వ్యాధి నిపుణులను సంప్రదిస్తూ ఉండటం అవసరం. ఈ జబ్బు ఉన్నవారు దీన్ని నిర్లక్ష్యం చేసినా కిడ్నీ పూర్తిగా దెబ్బతిని, కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దీర్ఘకాలం పాటు సాధారణజీవితాన్ని గడపవచ్చు. కాబట్టి ఆందోళన చెందకండి. నాకు 56 ఏళ్లు. పదేళ్లుగా షుగర్ జబ్బుతో బాధపడుతున్నాను. ఇటీవల పురుషాంగం మీద చర్మం పగిలినట్లుగా ఉండి, మంటగా ఉంటోంది. చర్మం కూడా ఫ్రీగా వెనక్కి రావడం లేదు. షుగర్ అప్పుడప్పుడూ 200 పైన కూడా ఉంటోంది. దీనివల్ల సెక్స్‌లో కూడా ఇబ్బంది కలుగుతోంది. దయచేసి ఎలాంటి చికిత్స తీసుకోవాలో చెప్పండి. - డి.ఆర్.ఎస్., నందిగామ షుగర్ ఉన్నవారిలో పురుషాంగం చివరన ఉన్న చర్మానికి ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావడం చాలా సాధారణంగా జరిగేదే. ఇలా జరిగినప్పుడు ఒకటి రెండుసార్లు యాంటీఫంగల్, యాంటీబయాటిక్ మందులు వాడినప్పటికీ ఇలాగే జరుగుతుంటే సున్తీ ఆపరేషన్ చేయించుకుంటే దీర్ఘకాలికంగా ఉపయోగం ఉంటుంది. పురుషాంగం చర్మం వెనక్కి రానివారిలో లోపల మూత్రనాళం (యురెథ్రా) కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరగా సున్తీ ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా సలహా ఇస్తాం. మీరు మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నాకు పెళ్లయి ఏడాది అయ్యింది. పెళ్లయిన మొదటి రెండు రోజులు జంకుతో నేను సెక్స్‌లో పాల్గొనలేకపోయాను. తర్వాత కూడా సెక్స్ చేయబోతే అంగస్తంభన సరిగా కాలేదు. మొదట్లో ఏమీ అనకపోయినా ఇటీవల నా భార్య నా పట్ల చాలా అసంతృప్తిగా ఉంటోంది. నాకేమో కొద్దిగా అంగస్తంభన అయి మళ్లీ చాలా త్వరగా వీర్యస్ఖలనం అయిపోతోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - డి.ఎన్.పి., సత్తుపల్లి సాధారణంగా పెళ్లయిన కొత్తలో కాస్త బెరుకుగా ఉన్నా, దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరిగాక అంగస్తంభన మామూలుగానే జరిగిపోవాలి. కానీ చాలా సందర్భాలలో మానసిక కారణాల వల్లగాని, ఒకరిపై మరొకరికి పూర్తిగా ఇష్టం కలగకపోవడం వల్లగాని, పార్ట్నర్స్ మధ్య మనస్పర్థల వల్లగాని ఇలా మీకు జరిగినట్లుగా అంగస్తంభన పూర్తిగా జరగకపోవడం, వీర్యం త్వరగా పడిపోవడం వంటివి జరగవచ్చు. అందువల్ల మీరు సెక్స్ కౌన్సెలింగ్ చేయించుకుని, సెక్స్‌లో పాల్గొనండి. అప్పటికీ ప్రయోజనం లేకపోతే సెక్స్‌ను ప్రేరేపించే మందులు వాడటం వల్ల తప్పకుండా ఉపయోగం ఉంటుంది. మీరు యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 36 ఏళ్లు. గత రెండేళ్లుగా మూత్రంలో విపరీతమైన వుంట. నాకు మూత్రధార సరిగా రావడం లేదు. సెక్స్ చేసినప్పుడు వీర్యం సరిగా రావడం లేదు. పై సమస్యలతో తీవ్రమైన బాధ అనుభవిస్తున్నాను. సెక్స్ చేసినా, మూత్రం పోసినా పొత్తికడుపులో బిగదీసుకుపోయినట్లుగా ఉంటోంది. దాంతో సెక్స్ అంటేనే భయుమేస్తోంది. పెళ్లికి ముందు కండోమ్ లేకుండా చాలాసార్లు చాలావుంది అమ్మాయిలతో సెక్స్‌లో పాల్గొన్నాను. అప్పుడు అలా చేయడం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉంటాయేమోనని యూంటిబయూటిక్స్ ఎక్కువగా మింగుతున్నాను. నాకు వుంచి సలహా ఇవ్వండి. - ఆర్.కె.ఆర్., విజయవాడ మీరు ముందుగా ఇరట్రోగ్రేడ్ యురెథ్రోగ్రామ్ (ఆర్జీయూ) అనే పరీక్ష చేయించుకోవాలి. దీనిల్ల మూత్రనాళంలో ఏదైనా అడ్డంకి(బ్లాక్) ఉందేమో తెలుస్తుంది. అలా ఉంటే ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా మూత్రనాళాన్ని వెడల్పు చేయించుకుంటే మూత్రం, వీర్యం రెండూ ఫ్రీగా రావడానికి అవకాశం ఉంటుంది. మీరు వెంటనే యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్