ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా దామోదర్ దాస్ మల్చంద్ మోదీ, హీరాబెన్‌లకు జన్మించిన ఐదుగురు సంతానంలో ప్రహ్లాద్ మోదీ నాల్గవవాడు. ఈయనకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కిరాణ దుకాణం, టైర్ షోరూంలు ఉన్నాయి.
కాగా గతేడాది డిసెంబర్27న కర్ణాటక మైసూరు సమీపంలో ప్రహ్లాద్ మోదీ ప్రమాదానికి గురయ్యారు. కుటుంబంతో కలిసి బందీపూర్ నుంచి మైసూర్ వెళ్తుండగా.. ఆయన కారు ప్రమాదానికి గురైంది.
(చదవండి: సీబీఐ అరెస్ట్‌పై సుప్రీంకోర్టుకు సిసోడియా.. విచారించనున్న సీజేఐ చంద్రచూడ్)
Comments
Please login to add a commentAdd a comment