prahlad modi
-
ఆస్పత్రిలో చేరిన ప్రధాని మోదీ సోదరుడు
ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా దామోదర్ దాస్ మల్చంద్ మోదీ, హీరాబెన్‌లకు జన్మించిన ఐదుగురు సంతానంలో ప్రహ్లాద్ మోదీ నాల్గవవాడు. ఈయనకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కిరాణ దుకాణం, టైర్ షోరూంలు ఉన్నాయి. కాగా గతేడాది డిసెంబర్27న కర్ణాటక మైసూరు సమీపంలో ప్రహ్లాద్ మోదీ ప్రమాదానికి గురయ్యారు. కుటుంబంతో కలిసి బందీపూర్ నుంచి మైసూర్ వెళ్తుండగా.. ఆయన కారు ప్రమాదానికి గురైంది. (చదవండి: సీబీఐ అరెస్ట్‌పై సుప్రీంకోర్టుకు సిసోడియా.. విచారించనున్న సీజేఐ చంద్రచూడ్) -
రోడ్డు ప్రమాదంలో ప్రధాని మోదీ సోదరుడి కుటుంబానికి గాయాలు
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కుటుంబ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని మైసూర్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో ప్రహ్లాద్ మోదీతో పాటు ఆయన భార్య, కుమారుడు, కోడలు, మనుమడు ఉన్నారు. ఈ ప్రమాదంలో మోదీ మనుమడి కాలుకి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. స్వల్ప గాయాలతో బయటపడిన మోదీ కుటుంబ సభ్యులను మైసూర్‌లోని జేఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రహ్లాద్ మోదీ తన కుటుంబంతో కలిసి మెర్సిడేస్ బెంజ్ కార్లో బందిపురాకు వెళ్తుండగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాదం జరిగింది. కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన కాన్వాయ్ సైతం ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ -
ప్రధాని మోదీకి సొంత తమ్ముడు షాక్
ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ షాకిచ్చారు. మోదీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వస్తు, సేవ పన్ను (జీఎస్టీ) చెల్లించవద్దని ప్రహ్లాద్ మోదీ వ్యాపారస్తులకు సూచించారు. ‘మోదీ కావొచ్చు.. మరొకరు కావొచ్చు. వారు మీ సమస్యలు వినాలి’ అని వ్యాపారస్తులకు చెప్పారు. ‘మనమేమీ బానిసలం కాదు’ అని తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యాపారులకు ‘జీఎస్టీ చెల్లించబోం’ అని మహారాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా లేఖ రాయాలని తెలిపారు. మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం వ్యాపారుల సదస్సు జరిగింది. ఉల్హాస్నగర్ వ్యాపారుల సంఘం పిలుపు మేరకు హాజరైన ప్రహ్లాద్ మోదీ మాట్లాడుతూ.. ‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనమేమీ బానిసలం కాదు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉల్హాస్నగర్ వ్యాపార కేంద్రంగా ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ప్రహ్లాద్ మోదీ విమర్శించారు. ‘గుజరాత్‌లోనైతే వ్యాపారానికి రసాయనాల వినియోగం అనుమతి ఉందని, రసాయన వ్యర్థాల నిర్వహణకు కూడా సరైన ప్రణాళిక ఉంది. గుజరాత్ అనుమతి ఇస్తున్నప్పుడు మహారాష్ట్ర ఎందుకు ఇవ్వదు’ అని నిలదీశారు. -
విమానాశ్రయంలో మోదీ సోదరుడి ధర్నా
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ లక్నో విమానాశ్రయంలో బుధవారం ధర్నాకు దిగారు. మద్దతుదారులను తానున్న స్థలం వద్దకు పోలీసులు అనుమతించలేదని, పోలీసులు వారిని అరెస్టు చేశారన్న ఆరోపణలతో ఆయన ఈ ధర్నా చేశారు. అయితే తామెవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. విమానాశ్రయ అదనపు జనరల్ మేనేజర్ కథనం ప్రకారం.. సాయంత్రం నాలుగు గంటల సమయంలో విమానం దిగిన ప్రహ్లాద్ మద్దతుదారులను తన వద్దకు అనుమతించలేదని ధర్నా చేశారు. అంతేగాక పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని, కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన వారు పోలీస్ స్టేషన్లో ఉన్నంతసేపు తాను ధర్నాను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ చర్య తీసుకోవాల్సిందిగా ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు చెప్పారని అన్నారు. అయితే ఆయా వాదనలను సరోజిని నగర్ పోలీస్ ఎస్హెచ్ఓ మహేంద్ర సింగ్ ఖండించారు. తన పరిధితో ప్రహ్లాద్‌కు సంబంధించిన వారెవరూ అరెస్టయినట్లు తనకు తెలియదని అన్నారు. అయితే ప్రధాని సోదరుడైన ప్రహ్లాద్ పేరును ఫోర్జరీ చేసి జితేంద్ర తివారి అనే ఓ వ్యక్తి సుల్తాన్‌పూర్‌లో అరెస్టయ్యాడని నగర ఎస్హెచ్ఓ భూపేంద్ర సింగ్ చెప్పారు. చదవండి: అంతర్జాతీయ మద్దతు: అమిత్ షా ఆగ్రహం రైతు ఉద్యమంపై ట్వీట్ వార్ -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని సోదరుడు
-
సీఎం జగన్‌కు మోదీ సోదరుడి కితాబు
సాక్షి, ద్వారకాతిరుమల: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కష్టాలు తెలిసిన మనిషని ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు, సామాజికవేత్త ప్రహ్లాద్ మోదీ వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి దేవతిలకుల, గాండ్ల, తెలకుల సంఘ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆయన స్థానిక దేవతిలకుల సత్రంలో ధనుర్మాస వేడుకల్లో పాల్గొని, విశేష పూజలు నిర్వహించారు. తరువాత సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో దేవతిలకులు, గాండ్ల, తెలకులు 14 లక్షలకు పైగా ఉన్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వీరు ఆర్థిక, రాజకీయ రంగాల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నారన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని ఈ సామాజిక వర్గీయులంతా ఏకతాటిపై నిలిచి అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ సామాజిక వర్గీయుల సమస్యలను త్వరలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. -
పోలీస్ స్టేషన్ ఎదుట మోదీ సోదరుడి ధర్నా
జైపూర్ : వ్యక్తిగత భద్రతాసిబ్బందికి ప్రత్యేక వాహనం కేటాయించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ మంగళవారం ఆందోళనకు దిగారు. జైపూర్ - అజ్మేర్ జాతీయ రహదారి మార్గంలోని బగ్రు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు.. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం ప్రహ్లాద్ మోదీకి ఇద్దరు పీఎస్వో(వ్యక్తిగత భద్రతా అధికారులు)లను కేటాయించింది. నిబంధనల ప్రకారం.. వ్యక్తిగత భద్రతా సిబ్బంది ప్రహ్లాద్‌తో పాటు ఒకే వాహనంలో వెళ్లాలి. అయితే ఇందుకు ఆయన అంగీకరించలేదు. భద్రతా సిబ్బందిని తన వాహనంలో తీసుకెళ్లడం కుదరదని.. వారికి ప్రత్యేక పోలీస్ వాహనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతటితో ఊరుకోక పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. దాదాపు గంట పాటు ప్రహ్లాద్ ఆందోళన సాగింది. అనంతరం పోలీసులు సర్దిచెప్పడంతో ప్రహ్లాద్ మోదీ భద్రతా సిబ్బందిని వెంట తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయం గురించి ప్రహ్లాద్ మోదీ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం నా భద్రత కోసం ఇద్దరు పీఎస్‌ఓలను కేటాయించింది. నేను ఎక్కడికి వెళ్లినా వారు నాతో పాటే వస్తారు. అయితే ఈ సారి నేను కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నాను. దాంతో నా కారులో చోటు లేదు. అందుకే వారికి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను కోరాను. కానీ వారు అంగీకరించలేద’ని ప్రహ్లాద్ మోదీ తెలిపారు. -
ప్రధాని మోదీ కుటుంబంలో విషాదం
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ భార్య భగవతి బుధవారం కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనంతరం భగవతి మృతదేహాన్ని అహ్మదాబాద్‌లోని వారి నివాసానికి తరలించారు. భగవతి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం అహ్మదాబాద్‌లోని తల్తేజ్‌లో జరగనున్నాయి. -
‘నా సోదరుడే ప్రధాని అవుతారు’
సాక్షి, బెంగళూరు : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా స్థానాల్లో గెలుపొందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆలయాల సందర్శానార్థం మంగళవారం ఆయన మంగళూరుకు వచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ...‘ 2014 ఎన్నికల్లో వచ్చిన ఫలితమే ఇప్పుడు కూడా వస్తుందనే నమ్మకం ఉంది. బీజేపీ 300కు పైగా సీట్లు సాధిస్తుంది. మరోసారి నా సోదరుడు నరేంద్ర మోదీ ప్రధాని అవుతారు’అని ధీమా వ్యక్తం చేశారు. ఎటువంటి మ్యాజిక్ జరుగబోదు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నాలుగన్నరేళ్లుగా ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ప్రహ్లాద్ మోదీ అన్నారు. విపక్షాల కూటమి విజయవంతం కాదని జోస్యం చెప్పారు. ఇక ప్రియాంక గాంధీ రాజకీయ అరంగేట్రం గురించి విలేకరులు ప్రశ్నించగా.. ఆమె రాకతో కాంగ్రెస్‌లో ఎటువంటి మ్యాజిక్ జరుగబోదని వ్యాఖ్యానించారు. -
‘టీఆర్ఎస్ పాలనలో వారికి రక్షణ కరువైంది’
సాక్షి, కరీంనగర్ : టీఆర్ఎస్ పాలనలో హిందువులకు రక్షణ కరువైందని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు, సామాజిక కార్యకర్త ప్రహ్లాద్ దామోదర్‌దాస్ మోదీ వ్యాఖ్యానించారు. వరంగల్‌లో అర్చకుడిపై జరిగిన దాడి టీఆర్ఎస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ప్రహ్లాద్ శనివారం మీడియాతో మాట్లాడారు. అర్చకుడి మృతికి కారణమైన హంతకున్ని శిక్షించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అర్చకుడి మృతి కేసులో నిందితున్ని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో మేకిన్ ఇండియా, సబ్కా సాత్.. సబ్కా వికాస్ అమలు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాక్షించారు. ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె చొప్పదండి నుంచి బీజేపీ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కొడిమ్యాల మండలం నల్లగొండ నరసింహస్వామికి పూజలు నిర్వహించిన అనంతరం శోభ ప్రచారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. -
అనంతగిరిలో ప్రధాని సోదరుడు
సాక్షి, అనంతగిరి: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు, సామాజిక కార్యకర్త, అలిండియా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు, ప్రహ్లాద్ దామోదర్‌దాస్ మోదీ శుక్రవారం వికారాబాద్ పట్టణానికి సమీపంలోని అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. ఉదయం 7.15 గంటలకు ఆయన ఆలయానికి చేరుకున్నారు. పార్టీ నాయకులు, అర్చకులు ఆలయం తరఫున ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు శేషగిరి శర్మ ఆలయ చరిత్ర, విశిష్టత, స్థల పురాణాన్ని, స్వామివారి మహత్యాన్ని తెలియజేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. పట్టణంలో ఆధ్మాత్మిక సేవా మండలి తరఫున రుద్రాభిషేకం నిర్వహిస్తున్నారని స్థానిక నాయకులు చెప్పడంతో ప్రహ్లాద్ మోదీ.. సాకేత్‌నగర్‌లోని టి.రాజు నివాసంలో జరుగుతున్న రుద్రాభిషేకం కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ భజనలు చేసి, ప్రత్యేక హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ప్రధాని సోదరుడు అనుకోకుండా తమ మధ్యకు రావడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆధ్యాత్మిక భావాలే రప్పించాయి... ఈ సందర్భంగా ఆయన ఆలయం వద్ద మోదీ మాట్లాడుతూ.. కార్తీక మాసంలో ఇంత పెద్ద సాలగ్రామ రూపంలో ఉన్న భగవంతున్ని దర్శించుకోవడం జీవితంలోనే మొదటిసారి అని.. ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. దైవ దర్శనం చేసుకునే భాగ్యం కల్పించినవారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆధ్యాత్మిక సేవా మండలి కార్యక్రమంలో పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. తాను అనంతగిరికి వచ్చానని, వికారాబాద్‌లో రుద్రాభిషేకం కొనసాగుతోందని తెలియడంతో ఇక్కడకు వచ్చానన్నారు. భక్తిభావన, ఆధ్మాత్మికతే తనను ఇక్కడికి రప్పించిందన్నారు. అనుకోకుండా భజన మధ్యలో వచ్చి మిమ్మల్ని కాస్తా ఇబ్బంది పెట్టానని అందుకు క్షమించాలని కోరారు. ప్రతిఒక్కరూ దైవచింతన, దేశభక్తి భావాలు కలిగి ఉండాలన్నారు. అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లాలోని ఆలయాలను సందర్శించడానికి బయలుదేరారు. ఆయన వెంట మిషన్ మోదీ అగేయిన్ పీఎం తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌ల రాష్ట్రాల ఇన్చార్జ్ ప్రవీణ్‌కుమార్, వికారాబాద్ బీజేపీ సీనియర్ నాయకులు మాధవరెడ్డి, సదానంద్‌రెడ్డి, శివరాజు, కేపీ రాజు, వివేకనంద్రెడ్డి, పోకల సతీష్, సాయికృష్ణ, నరోత్తంరెడ్డి, ప్యాట శంకర్, అనిల్, నిరంజన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ప్రహ్లాద్‌మోదీ కార్యదర్శినంటూ హైదరాబాదీ దందాలు
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కార్యదర్శినంటూ నగరవాసి దందా ప్రారంభించాడు. ఢిల్లీకి ఫోన్లు చేసి పలు అపాయింట్మెంట్లు, ఫైల్స్‌పై సంతకాలు చేయాలంటూ డిమాండ్ చేశాడు. కొన్ని పనులు కూడా చేయించుకుని ఆర్థికంగానూ లాభపడినట్లు ప్రచారం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన వెంకటప్రసాద్ యాడ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇతడి స్నేహితుడు తెలంగాణ రేషన్ డీలర్స్ అసోసియేషన్ సెక్రటరీగా పని చేస్తుండటంతో ఆలిండియా రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ప్రహ్లాద్ మోదీ గతంలో చంద్రాయణగుట్ట ప్రాంతానికి వచ్చారు. అప్పట్లో తన స్నేహితుడి ద్వారా ఆయనను కలిసిన వెంకట ప్రసాద్ ఆ తర్వాత ఒకటి రెండుసార్లు ప్రహ్లాద్మోదీతో ఫోన్లో మాట్లాడారు. దీన్ని క్యాష్ చేసుకుందామని పథకం వేసిన వెంకట ప్రసాద్ ఓ సెల్‌ఫోన్ నెంబర్ తీసుకుని ‘ట్రూ కాలర్’ యాప్‌లో ‘పీఎంఓ మోదీ సెక్రటరీ’ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. గత కొన్ని రోజులుగా పలు కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తూ దందాలు మొదలుపెట్టాడు. తాను ప్రహ్లాద్‌మోదీ వ్యక్తిగత కార్యదర్శినని, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి మాట్లాడుతున్నానంటూ చెబుతూ.. అనేక మందికి అపాయింట్మెంట్లు ఇవ్వాలని, కొన్ని ఫైల్స్‌పై త్వరగా సంతకాలు చేసి క్లియర్ చేయాలని డిమాండ్ చేయడంతో పాటు మరికొన్ని సిఫార్సులు చేయించుకుంటున్నాడు. దీనిపై ఢిల్లీకి చెందిన కొందరు ఉన్నతాధికారులు నగర పోలీసు విభాగానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. బీజేపీ లీగల్ సెల్ ఈ వ్యవహారంపై అబిడ్స్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం అబిడ్స్ పోలీసులకు వెంకటప్రసాద్ ను అప్పగించారు. -
శ్రీవారి సేవలో ప్రధాని సోదరుడు
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, ఆంధ్రప్రదేశ్ మంత్రి సుజయ కృష్ణ రంగారావు వీఐపీ దర్శన సమయంలో స్వామివారి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకులు మండపంలో పండితులు వారికి ఆశీర్వాదం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. -
దేశ ప్రయోజనాల కోసమే పెద్దనోట్ల రద్దు
ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ మొరుునాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ఏ కార్యక్రమం చేపట్టినా అది ప్రజల ప్రయోజనాల కోసమేనని ఆయన సోదరుడు, రేషన్ డీలర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు ప్రహ్లాద్ మోదీ అన్నారు. మొరుునాబాద్ మండల పరిధిలోని శ్రీరాంనగర్ సమీపంలో ఉన్న ఓ ఆశ్రమానికి వచ్చిన ఆదివారం గ్రామాన్ని సందర్శించి, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని లక్ష్యమని, నల్లధనాన్ని అరికట్టేందుకే పెద్ద నోట్లను రద్దు చేశారన్నారు. దీనిపై ప్రజలు సంతోషంగానే ఉన్నారని ఆయన చెప్పారు. -
హైదరాబాద్‌లో కరెన్సీ సమస్య లేదు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత కూడా హైదరాబాద్‌లో ఎక్కడా కరెన్సీ సమస్య ఉన్నట్లు లేదని అన్నారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇక్కడ ఎవరిని చూసినా చాలా సంతోషంగా కనపడుతున్నారని, దాన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ కరెన్సీ సమస్య ఏమీ ఉన్నట్లుగా లేదని ప్రహ్లాద్ మోదీ అన్నారు. ఇంతకు ముందు కూడా ఆయన కొన్ని విషయాల్లో చేసిన వ్యాఖ్యలు కొంత విచిత్రంగానే ఉన్నాయి. సుమారు వారం రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు అక్కడి 'తేలి' (నూనెతీసే వాళ్లు) కులం వాళ్లను.. పేర్ల తర్వాత మోదీ అని ఎందుకు పెట్టుకోవడం లేదని అడిగారు. నరేంద్రమోదీ దేశంతో పాటు తమ కులానికి కూడా గర్వకారణమని అక్కడివాళ్లు చెప్పడంతో.. ఆయన ఈ మాట అన్నారు. కర్మదేవి అనే దేవత తేలి కులానికి చెందినవారేనని, మనమంతా ఆమె బిడ్డలమేనని చెప్పారు. -
పేర్ల ముందు ‘మోదీ’ని చేర్చుకోండి..
భోపాల్: ‘తేలి’ కులస్తులంతా తమ పేర్లకు ముందు ‘మోదీ’ అని చేర్చుకోవాలని ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్ పిలుపునిచ్చారు. భోపాల్‌లో జరిగిన ‘సాహు’ కులస్తుల అఖిల భారత యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తేలి కులాన్ని నాయకులు వారి స్వార్థ రాజకీయాల కోసం సాహు, చౌహాన్, పర్మార్, రాథోడ్, జైస్వాల్ లాంటి ఉపకులాలుగా విభజించారన్నారు. కర్మాదేవి దేవత తేలి కులస్తురాలనీ, మనమంతా ఆమె పిల్లలమన్నారు. తేలి కులస్తులు మోదీని పేర్లలో చేర్చుకుని మళ్లీ ఐక్యం అయితే దేశంలో వారి జనాభా 14 కోట్లకు చేరుతుంది అని ఆయన అన్నారు. -
శ్రీవారి సేవలో మోదీ సోదరుడు
తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద మోదీ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. -
చౌదరిగూడలో ప్రధాని తమ్ముడు
మొక్కనాటి గ్రామస్తులతో ప్రహ్లాద్ మోదీ మాటామంతి ఘట్కేసర్: అఖిల భారత రేషన్ డీలర్ల సంఘం సీనియర్ ఉపాధ్యక్షుడు, ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ బుధవారం ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామాన్ని సందర్శించారు. హైదరాబాద్‌లో జరిగే రేషన్ డీలర్ల సంఘ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన యాదగిరిగుట్టలో లక్ష్మీనారసింహుడిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో డీలర్ల సంఘం రాష్ట్ర నాయకుడు బాలగోని శ్రీనివాస్ గౌడ్ ఆహ్వానం మేరకు చౌదరిగూడకి వచ్చారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలోమొక్క నాటి గ్రామపంచాయతీ పాలక వర్గంతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేషన్ డీలర్లకు కమీషన్ కాకుండా వేతనాలు ఇవ్వాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరనున్నట్లు చెప్పారు. దేశంలో పేదరికాన్ని పారదోలేందుకు ప్రధాని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయనకు డీలర్ల సంఘం నాయకులు, పంచాయతీ వార్డు సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీలర్ల సంఘ అధ్యక్షుడు జ్యోతిధర్సింగ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కిష్టప్ప, ఉపాధ్యక్షుడు కాశం కృష్ణమూర్తి, కోశాధికారి కిరణ్పాల్సింగ్, సర్పంచ్ నక్కవరలక్ష్మి, ఉపసర్పంచ్ బైరులక్ష్మణ్, వార్డు సభ్యులు బాలగోని శ్రీనివాస్‌గౌడ్, పాలడుగు సురేందర్‌రెడ్డి, శంకర్, పద్మావతి, పులికంటి రాజశేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, బండగూడెం నాగేష్, రాజు పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్రధాని సోదరుడు
భువనగిరి: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ దర్శించుకున్నారు. బుధవారం ఆయన స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా క్షేత్రన్ని అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. -
మోదీని కూడా వ్యతిరేకించా: ప్రహ్లాద్ మోదీ
కర్నూలు: ప్రజాసంక్షేమంలో భాగస్వాములైన రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నిలదీద్దామని చౌక డిపో దుకాణాల డీలర్ల సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, ప్రధాని సోదరుడు ప్రహ్లాద మోదీ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ చౌక ధరల దుకాణాదారుల సంఘాల సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వమే చౌక డిపో డీలర్లతో తప్పుడు పనులు చేయిస్తోందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో ప్రతి డీలర్‌కు రూ. 15 వేల వరకు కమిషన్ వస్తుందన్నారు. రేషన్ డీలర్లకు అనుకూలంగా గుజరాత్లో ముఖ్యమంత్రి నరేంద్రమోదీని కూడా వ్యతిరేకించానన్నారు. డీలర్లంతా కలసికట్టుగా పోరాడినప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఎల్పీజీ డీలర్లు కోట్లు సంపాదిస్తుంటే.. రేషన్ డీలర్లు రోడ్డు పడే పరిస్థితి రావడం శోచనీయమన్నారు. -
ట్విట్టర్ విజేత.. నరేంద్ర మోడీ..!
న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాల వెల్లడికి మరికొన్ని గంటల సమయం ఉన్నా.. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో మాత్రం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇప్పటికే విజేతగా నిలిచారు. ట్వీట్ల విషయంలో ఆయన ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఓ అమెరికా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్విట్టర్లో మోడీకి సంబంధించి కోటీ 11 లక్షల ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. ఇవి మొత్తం ట్వీట్లలోనే 20శాతం. దేశంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ట్విట్టర్లో ఇప్పటివరకూ 5 కోట్ల 60 లక్షల ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. వీటిలో 82 లక్షల (15%) ట్వీట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ, 60 లక్షల(11%) ట్వీట్లతో బీజేపీ రెండు, మూడో స్థానంలో నిలిచా యి. కేజ్రీవాల్ 50 లక్షల (9%) ట్వీట్లు, కాంగ్రెస్ 27 లక్షలు (5శాతం), రాహుల్‌గాంధీ 13 లక్షల (2%) ట్వీట్లతో టాప్ టెన్‌లో నిలిచారు. మా అన్నయ్యే కాబోయే పీఎం! అహ్మదాబాద్: ‘మా కుటుంబమంతా చాలా సంతోషంగా ఉంది. మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సామాన్యుడైన ఒక వ్యక్తి దేశ ప్రధాని కాబోతున్నాడు. నరేంద్రమోడీనే విజేత అంటూ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న విషయాలను పక్కనపెడితే.. మోడీకి ప్రజల నుంచి లభిస్తున్న అద్భుతమైన ఆదరణను నేను ప్రత్యక్షంగా చూశాను. అందుకే ఆయన విజయంపై మాకు అంత నమ్మకం ఉంది’ అంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తమ్ముడు ప్రహ్లాద్ మోడీ గురువారం హర్షాతిరేకాలతో వ్యాఖ్యానించారు. ఇకపై తమ కుటుంబానికి మోడీపై ఎలాంటి హక్కు ఉండబోదని తాము భావిస్తున్నామన్నారు. ‘మోడీ జీవితం దేశానికే అంకితం. భారతదేశ ప్రజలకే ఆయనపై హక్కు ఉంది’ అన్నారు.