
శ్రీవారి సేవలో మోదీ సోదరుడు
తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద మోదీ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు.