
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ భార్య భగవతి బుధవారం కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనంతరం భగవతి మృతదేహాన్ని అహ్మదాబాద్‌లోని వారి నివాసానికి తరలించారు. భగవతి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం అహ్మదాబాద్‌లోని తల్తేజ్‌లో జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment