
సాక్షి, ద్వారకాతిరుమల: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కష్టాలు తెలిసిన మనిషని ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు, సామాజికవేత్త ప్రహ్లాద్ మోదీ వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి దేవతిలకుల, గాండ్ల, తెలకుల సంఘ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆయన స్థానిక దేవతిలకుల సత్రంలో ధనుర్మాస వేడుకల్లో పాల్గొని, విశేష పూజలు నిర్వహించారు.
తరువాత సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో దేవతిలకులు, గాండ్ల, తెలకులు 14 లక్షలకు పైగా ఉన్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వీరు ఆర్థిక, రాజకీయ రంగాల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నారన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని ఈ సామాజిక వర్గీయులంతా ఏకతాటిపై నిలిచి అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ సామాజిక వర్గీయుల సమస్యలను త్వరలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment