dwaraka tirumala
-
శ్రీవారి వాకిలి.. బంగారు లోగిలి
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి అంతరాలయం స్వర్ణ శోభితమైంది. స్వామివారి భక్తులకు కనువిందు చేస్తోంది. స్వర్ణ కాంతులతో ధగధగలాడుతున్న వాకిలి నుంచి చిన వెంకన్నను దర్శించుకుంటున్న భక్తులు మంత్ర ముగ్ధులవుతున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీవారి దివ్య క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తున్నారు. శని, ఆదివారాలు, భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్షేత్రంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దాతల సహకారంతో దేవస్థానం ఇప్పటికే స్వామివారి వాకిలిని దాదాపుగా స్వర్ణ మయం చేశారు.అందులో భాగంగా జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ 2021 లో రూ.98,31,693 వ్యయంతో, 264 గ్రాముల 647 మిల్లీ గ్రాముల బంగారం, 147 కేజీల 641 గ్రాముల 700 మిల్లీ గ్రాముల రాగి రేకులతో ఆలయ ప్రధాన ముఖద్వారానికి, తలుపులకు, అంతరాలయ ద్వారానికి బంగారు తాపడం (ఎలక్ట్రో గోల్డ్ ప్లేటింగ్) చేయించారు. వీటిని అదే సంవత్సరం జనవరి 10న అప్పటి రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు.కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం, బొమ్ములూరుకు చెందిన దీపక్ నెక్స్‌జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం, డైరెక్టర్లు రూ.1,64,19,411తో స్వామి అంతరాలయానికి బంగారు తాపడాన్ని చేయించారు. దీన్ని ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ఈ ఏడాది అక్టోబర్ 4న ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, దాతలు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. త్వరలో స్తంభాలకు బంగారు పూత అంతరాలయం ముందు పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు ఎదురుగా ఉన్న స్తంభాలకు ఇదే తరహాలో గోల్డ్ కోటెడ్ చేయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. త్వరలో ఒక దాత సహాయంతో పనులు ప్రారంభించనున్నారని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉంటే విమాన గోపుర స్వర్ణమయ పథకం ద్వారా భక్తుల నుంచి దేవస్థానం విరాళాలను సేకరిస్తోంది. విమాన గోపురాన్ని సైతం స్వర్ణమయం చేస్తే చినవెంకన్న ఆలయాన్ని చూడడానికి రెండు కనులు చాలవనే చెప్పొచ్చు. -
ద్వారకా తిరుమలలో టీడీపీ నేత సుబ్బారాయుడు మోసం
-
ద్వారకా తిరుమల ఆలయంలో డ్రోన్ కెమెరా కలకలం
సాక్షి, ఏలూరు జిల్లా: ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో శ్రీవారి క్షేత్ర డ్రోన్ విజువల్స్ హల్చల్ చేశాయి. ఆలయ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఒక యూట్యూబర్ పట్టపగలు క్షేత్రంపై డ్రోన్ ఎగురవేశారు. విజువల్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.నిషేధిత ప్రాంతంలో డ్రోన్ ఎగురవేస్తుంటే అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ ఆలయ భద్రతా వైఫల్యమేనని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్ పై, ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
ద్వారకాతిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం..
-
అమ్మో.. పులొచ్చింది!
ద్వారకాతిరుమల: పెద్ద పులి.. కొద్ది రోజులుగా తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయకంపితులను చేస్తోంది. తాజాగా మంగళవారం తెల్లవారుజామున ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామసింగవరం పంచాయతీ, కొత్తగూడెంలోకి వచ్చిన పెద్ద పులి ఒక దూడను చంపి తినేసింది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం గ్రామానికి చెందిన రైతు ముక్కవల్లి బాలసుందరం గేదెల నుంచి పాలు తీసేందుకు తెల్లవారుజామున తన తోటలోకి వెళ్లాడు. అక్కడ కట్టేసి ఉన్న గేదెలు, దూడలు బెదిరిపోయి అరుస్తుండడాన్ని గమనించాడు. వాటిలో ఒక గేదె దూడ లేకపోవడాన్ని గుర్తించాడు. దూడ కోసం వెతుకుతుండగా సమీప పొదల్లోంచి పులి గాండ్రింపులు వినబడడంతో వెంటనే అక్కడున్న జీడి మామిడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఏం చేయాలో పాలుపోక తన వద్ద ఉన్న సెల్ ఫోన్ ద్వారా స్థానిక రైతులకు, గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఆనోటా ఈనోటా చుట్టుపక్కల గ్రామాలకు సైతం ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా డీఎఫ్‌వో నాగరాజు, జంగారెడ్డిగూడెం సబ్ డీఎఫ్‌వో ఎ.వెంకట సుబ్బయ్య, ఏలూరు సబ్ డీఎఫ్‌వో ఆర్.శ్రీదేవి, ఏలూరు ఎఫ్ఆర్వో ఎస్వీకే కుమార్, నూజివీడు ఎఫ్ఆర్వో దావీదురాజు నాయుడు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ పులి జాడలు, దూడ రక్తం, ఎముకలు వారికి కనిపించాయి. పులి పరిసర ప్రాంతాల్లోనే ఉన్న ట్లు నిర్ధారించిన అధికారులు దాని కోసం గా లించారు. అవసరాన్ని బట్టి బోను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను అమర్చారు. గ్రామస్తులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కొత్తగూడెంలో టాంటాం వేయించారు. ఘటనపై రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటే‹Ùను ఆరా తీయగా, పులి రామసింగవరం అడవిలోకి వెళ్లిపోయిందని ఆయన తెలిపారు. -
పది రోజులపాటు పది అవతారాల్లో దుర్గాదేవి
-
తిరుమల: సర్వదర్శనానికి ఏడుగంటలు
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టికెట్లేని సర్వదర్శనం కోసం ఏడుగంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న 64, 214 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,777 మంది తలనీలాలు సమర్పించారు. రూ. 4.05 కోట్లు హుండీ ఆదాయంగా లెక్క తేలింది. ద్వారకా తిరుమలలో.. ఏలూరు: చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకా తిరుమలలో పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. నేడు పవిత్రాది వాసం, రేపు పవిత్రావరోహణ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. -
తిరుమల: సర్వదర్శనానికి 18 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు నేటితో ముగియనున్నాయి. దీంతో రేపటి నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరిస్తారు. ఇక నిన్న(సోమవారం, ఆగష్టు 28) 68,263 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లుగా తేలింది.తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 28, 355గా తేలింది. ద్వారకాతిరుమలలో పవిత్రోత్సవాలు ఏలూరు: నేటి నుంచి ద్వారకాతిరుమలలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. 30వ తేదీన పవిత్రాదివాసం, 31వ తేదీన పవిత్రావరోహణ నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తారు. -
ద్వారకా తిరుమలలో అంగరంగ వైభవంగా చినవెంకన్న తిరుకళ్యాణం
-
కల్యాణ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
-
వైభవంగా చినవెంకన్న కళ్యాణం
-
ఘనంగా వైశాఖమాస బ్రహ్మోత్సవాలు
-
ద్వారకాతిరుమలలో దారుణం.. కూతురుపై ప్రేమ ఎంతకు దారితీసింది
ద్వారకాతిరుమల: తన కుమార్తె మృతికి ప్రియుడే కారణమని భావించిన ఆమె తండ్రి ఆ యువకుడిని పథకం ప్రకారం హతమార్చాడు. తన కుమార్తె సమాధికి కూతవేటు దూరంలో ఆ యువకుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఈ దారుణ ఘటన ద్వారకాతిరుమల మండలం, గొడుగుపేట శివార్లలో సోమవారం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఐఎస్ రాఘవాపురం పంచాయతీ తూర్ల లక్ష్మీపురానికి చెందిన తానిగడప పవన్‌కల్యాణ్ (24), రామసింగవరం పంచాయతీ గొడుగుపేటకు చెందిన మరీదు శ్యామల (18) జంగారెడ్డిగూడెంలో చదువుకునే సమయంలో ప్రేమించుకున్నారు. వారు తమ ప్రేమ విషయాన్ని కొద్ది నెలల క్రితం ఇంట్లో చెప్పగా, కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించ లేదు. దాంతో మనస్థాపానికి గురైన శ్యామల ఈ ఏడాది జూన్ 5న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె మృతితో కలత చెందిన ఆమె తండ్రి నాగేశ్వరరావు.. పవన్ కల్యాణ్‌ను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 15న జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెంలోని ఓ కాలువ గట్టుపై తన స్నేహితుడు నాగరాజుతో కలిసి పవన్ కల్యాణ్ పార్టీ చేసుకున్నాడు. అప్పటి నుంచీ అతడు కనిపించడం లేదు. విచారణ చేపట్టిన పోలీసులు అదే రోజు రోజు రాత్రి పవన్ కల్యాణ్‌ను శ్యామల తండ్రి నాగేశ్వరరావు తీసుకెళ్లినట్టు గుర్తించారు. దీంతో, పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్టు నాగేశ్వరరావు అంగీకరించాడు. మృతదేహాన్ని శ్యామల సమాధికి సమీపంలో పూడ్చిపెట్టినట్టు తెలిపాడు. జంగారెడ్డిగూడెం సీఐ బాలసురేష్‌బాబు, లక్కవరం ఎస్సై దుర్గామహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు పవన్ కల్యాణ్ కుటుంబాన్ని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సోమవారం పరామర్శించారు. -
ప్రేమ పెళ్లి, విడాకులు.. అడ్డుగా ఉన్న బిడ్డను తొలగించుకునేందుకు, ప్లాన్!
ద్వారకాతిరుమల: వాళ్లిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పదిహేను నెలల్లోనే వారి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోవాలనుకున్నారు.ఇందుకు అడ్డుగా ఉన్న తమ నాలుగు నెలల వయసు గల మగబిడ్డను అమ్మేసి, వచ్చిన సొమ్మును పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బిడ్డ తల్లిదండ్రులు, తాత పోలీసులకు చిక్కారు. ఈ ఘటన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి కొండపై గురువారం జరిగింది. కాకినాడకు చెందిన కేశినేని వసంత (20)కు తల్లిదండ్రులు లేరు. ఆమె రాజమండ్రిలో బైక్ షోరూంలో పనిచేస్తోంది. ఆమెకు రాజమండ్రిలోనే ఒక ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న పి.రారాజు(25)తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో వివాహం చేసుకున్నారు. ఇటీవల భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవలు పడుతున్నారు. దీంతో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తమకు అడ్డుగా ఉన్న బిడ్డను అమ్మేసి, వచ్చిన డబ్బును పంచుకోవాలని భావించారు. ఈ మేరకు కుమారుడిని తీసుకుని రారాజు, వసంత, రారాజు తండ్రి ప్రసాద్ 25 రోజుల కిందట ద్వారకా తిరుమలకు చేరుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ ఒక వ్యక్తి ద్వారా భీమవరానికి చెందిన వృద్ధుడికి బాబును అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో పిల్లాడి కోసం కొండపైన శ్రీనివాసా నిలయం కాటేజీ ప్రాంతానికి చేరుకున్న వృద్ధుడిని రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రసాద్ డిమాండ్ చేశాడు. తాను డబ్బులు ఇవ్వబోనని, బాబును జాగ్రత్తగా పెంచుతానని ఆ వృద్ధుడు చెప్పుకొచ్చాడు. దానికి ప్రసాద్ ససేమిరా అనడంతో... కనీసం రూ.2లక్షలు ఇస్తే బాబును ఇస్తామని రారాజు చెప్పాడు. దీంతో రారాజు, అతని తండ్రికి మధ్య గొడవ జరిగింది. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న చుట్టుపక్కల భక్తులు అక్కడికి చేరుకుని వారిని నిలదీశారు. దీంతో బాలుడి కోసం వచ్చిన వృద్ధుడు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బిడ్డతోపాటు రారాజు, వసంత, ప్రసాద్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
ద్వారకాతిరుమలలో చినవెంకన్న బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల: ఆపదమొక్కులవాడు.. అనాథ రక్షకుడు.. ద్వారకాధీశుడి ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాలు ద్వారకాతిరుమలలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను వైఖానస ఆగమోక్తంగా రెండు సార్లు జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఆలయంలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలతో పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈనెల 5వ తేదీ నుంచి 12 వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో స్వామివారు ఉదయం, రాత్రి వేళల్లో వివిధ వాహనాలపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతారు. అలాగే ఆలయ ముఖ మండపంలో రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. క్షేత్ర చరిత్ర ద్వారకామహర్షి తపోఫలితంగా ఉద్భవించిన క్షేత్రం ద్వారకాతిరుమల. ఇక్కడ స్వయంభూ చినవెంకన్న పుట్టలో వెలిశారు. పాదపూజ కోసం పెద్దతిరుపతి నుంచి స్వామిని తెచ్చి స్వయం వ్యక్తుని వెనుక ప్రతిష్ఠించారు. దీంతో ఒకే అంతరాలయంలో స్వామివారు ద్విమూర్తులుగా కొలువై ఉండటంతో ఏటా వైశాఖ, ఆశ్వయుజ మాసాల్లో ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి శ్రీవారు ఇక్కడ ఉండటం వల్ల, అక్కడి మొక్కులు ఇక్కడ తీర్చుకునే సంప్రదాయం ఉంది. అభివృద్ధి ఘనం భక్తుల సౌకర్యార్థం కొండపై రూ.75 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన అధికారులు, మరికొన్ని నిర్మాణాలకు ఇటీవల శంకుస్థాపనలు చేశారు. కాటేజీల నిర్మాణం, డోనర్ స్కీమ్, నిత్యాన్నదాన ట్రస్టు, నిత్యకల్యాణం, గోసంరక్షణ, విమానగోపుర స్వర్ణమయ పథకం, ప్రాణదాన ట్రస్టులకు విరాళాలను సేక రిస్తూ క్షేత్రాభివృద్ధిలో భక్తులను సైతం భాగస్వాములను చేస్తున్నారు. కొండపైన సన్డైల్, గార్డెన్లు, క్షేత్రంలో 40 అడుగుల గరుత్మంతుడు, అభయాంజనేయుడు, అన్నమాచార్యుని విగ్రహాలు, శ్రీవారి ధర్మప్రచార రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బ్రహ్మోత్సవాలు ఇలా.. ► ఈనెల 5న ఉదయం స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా ముస్తాబు చేస్తారు. రాత్రి 7 గంటల నుంచి గజవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం. ► 6న రాత్రి 7 గంటల నుంచి అంకురార్పణ, రుత్విగ్వరణ అనంతరం ధ్వజారోహణ. రాత్రి 9 గంటల నుంచి హంసవాహనంపై గ్రామోత్సవం ► 7న ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవం. ► 8న ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 8.30 గంటల నుంచి వెండి శేషవాహనంపై గ్రామోత్సవం. ► 9న రాత్రి 8 గంటల నుంచి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం. అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం, అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై గ్రామోత్సవం. ► 10న రాత్రి 7 గంటల నుంచి రథోత్సవం. ► 11న ఉదయం 9 గంటల నుంచి చక్రవారి–అపభృధోత్సవం, రాత్రి 7 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ, రాత్రి 8 గంటల నుంచి అశ్వవాహనంపై గ్రామోత్సవం. ► 12న ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం–పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి . సేవలు రద్దు బ్రహోత్సవాలు జరిగే రోజుల్లో ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యమిస్తాం. పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరుతున్నాం. – వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ -
రైతుల ముసుగులో టీడీపీ దౌర్జన్యం
ద్వారకాతిరుమల: వన్‌వే రహదారిలో పాదయాత్ర చేసేందుకు అనుమతిలేదని అన్నందుకు పోలీసులతో అమరావతి రైతుల ముసుగులో ఉన్న కొందరు టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా దౌర్జన్యంగా పోలీసులను నెట్టుకుంటూ ముందుకెళ్లారు. ద్వారకా తిరుమలలోని అంబేడ్కర్ సెంటర్లో ఆదివారం ఉదయం ఏం జరిగిందంటే.. అమరావతి రైతుల పాదయాత్ర సెప్టెంబర్ 30న ద్వారకాతిరుమలకు చేరుకుంది. తిరిగి స్థానిక వైష్ణవి ఫంక్షన్ హాలు వద్ద ఆదివారం ఉదయం యాత్ర ప్రారంభమైంది. అయితే, రూట్ మ్యాప్ ప్రకారం వారు అంబేడ్కర్ సెంటర్ నుంచి ఉగాది మండపం, యాదవ కల్యాణ మండపం మీదుగా రాళ్లకుంట గ్రామానికి వెళ్లాల్సి ఉంది. అయితే, స్థానిక టీడీపీ నేతలు కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి, అంబేడ్కర్ సెంటర్ నుంచి వన్‌వే రహదారి (బైపాస్) మీదుగా, గుడిసెంటర్ వైపునకు పాదయాత్ర వెళ్లాలని పట్టుబట్టారు. అయితే, ఆదివారం కావడంతో క్షేత్ర రహదారులు అప్పటికే భక్తుల వాహనాలతో నిండిపోయాయి. దీంతో వన్‌వే మార్గం గుండా పాదయాత్రకు అనుమతిలేదని భీమడోలు సీఐ వి.వెంకటేశ్వరరావు, స్థానిక ఎస్సై టి.సుధీర్ వారికి సూచించారు. అయినా టీడీపీ శ్రేణులు వినకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో కొందరు టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి హైడ్రామాను సృష్టించారు. ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తింది. ఎంతచెప్పినా వినకుండా పోలీసులను తోసుకుంటూ వారు ముందుకు సాగారు. టీడీపీ శ్రేణుల తీరుపై అసహనం టీడీపీ నేతల తీరుతో అక్కడున్న భక్తులు, స్థానికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు. అమరావతి రైతుల పేరుతో చేస్తున్న పాదయాత్ర లగ్జరీ యాత్రగా ఉందని అభివర్ణించారు. యాత్ర వెంట వెళ్తున్న లగ్జరీ బస్సు, మొబైల్ టాయిలెట్లు, మంచాలు, పరుపులు వంటి వాటిని చూసి ఇది పాదయాత్రా? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. మరోవైపు.. ఈ పాదయాత్ర కోసం మండల టీడీపీ నేతలు దాదాపు రూ.16 లక్షలకు పైగా ఖర్చుచేసినట్లు సమాచారం. -
ద్వారకాతిరుమల కొండపై టోల్ మాయాజాలం!
ద్వారకాతిరుమల: చినవెంకన్న కొండపైకి వెళ్లే దేవస్థానం టోల్ గేట్ రుసుం కాంట్రాక్టర్ అవసరాలకు అనుగుణంగా మారిపోతోంది. దాంతో క్షేత్రానికి వివిధ వాహనాలపై వచ్చే భక్తులు అయోమయానికి గురవుతున్నారు. నిన్నమొన్నటి వరకు ఉన్న అధిక ధరలు.. ఇప్పుడు అకస్మాత్తుగా తగ్గిపోయాయి. ఈ మార్పు వెనుక అసలు నిజాలు తెలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ద్వారకాతిరుమల క్షేత్రంలో టోల్ రుసుం వసూల్లో అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. భక్తుల వాహనాల నుంచి టోల్ రుసుం వసూలు చేసుకునే హక్కుకు దేవస్థానం 2020 జనవరి 27న బహిరంగ వేలంపాట, సీల్డ్ టెండర్ నిర్వహించింది. బహిరంగ వేలంలో 9 మంది టెండర్‌దారులు పాల్గొనగా, సీల్డ్ టెండర్ ద్వారా వచ్చిన రూ. 1,30,56,777ల హెచ్చుపాటను అధికారులు ఆమోదించారు. అసలు షరతులు ఇవీ.. టెండర్ షరతుల ప్రకారం సంబంధిత కాంట్రాక్టర్ లారీ, బస్సు, ఇతర భారీ వాహనాలకు రూ.150, మినీ బస్సు, 407 వ్యాన్ స్వరాజ్, మజ్దూర్‌కు రూ.100, ట్రాక్టరు ట్రక్కుతో రూ. 50, ట్రక్కు ఆటో, తుఫాన్, టాటా ఏస్‌కు రూ.50, ట్రాక్టరు ఇంజనుకు రూ.50, కారు, జీపు, వ్యాన్‌కు రూ.30, స్కూటర్, మోటారు సైకిల్‌కు రూ.10, పాసింజర్ ఆటోకు రూ.10 వసూలు చేసుకోవాల్సి ఉంది. సదరు కాంట్రాక్టర్ కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో టోల్గేట్ నిర్వహణను వెంటనే చేపట్టలేదు. టోల్ వసూలు బాధ్యతను వెంటనే చేపట్టకపోవడంతో 2021 అక్టోబర్ 14 వరకు దేవస్థానమే సొంతంగా టోల్ వసూలు చేసింది. మధ్యలో 2021 ఆగస్టు 14న కారు, జీపు, వ్యాను ధరను రూ. 30 నుంచి రూ. 50, ఆటో ధరను రూ. 10 నుంచి రూ. 25కు పెంచుతూ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు. అయితే ఈ తీర్మానం దేవస్థానం వరకూ మాత్రమే వర్తిస్తుంది. మధ్యలో టోల్ రుసుం వసూలు బాధ్యతను 2021 అక్టోబర్ 15న మళ్లీ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అతను పాట సందర్భంగా ఇచ్చిన ధరలకే వసూలు చేయాలని అయితే ఈ ఏడాది కాలంగా పెంచిన ధరలను వసూలు చేస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టరుతో అప్పటి అధికారులు, కొందరు సిబ్బంది కుమ్మకై ధర్మకర్తల మండలి సమావేశంలో చేసిన తీర్మానాన్ని అనుకూలంగా మార్చుకుని, సొమ్ము చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అకస్మాత్తుగా తగ్గిన టోల్ ధరలు టోల్ వ్యవహారం ముదరడంతో దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు దానిపై దృష్టి సారించారు. దాంతో సంబంధిత కాంట్రాక్టర్ పెంచిన ధరలను తగ్గించి, టెండర్ షరతుల్లోని టోల్ ధరలనే వసూలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధాన టోల్ గేటు వద్ద ఉన్న ధరల పట్టికను మార్పు చేసిన సిబ్బంది, దొరసానిపాడు, శివాలయం రోడ్లలోని టోల్గేట్లు వద్ద ఉన్న ధరల పట్టికలను మాత్రం మార్చలేదు. అయితే సుమారు ఏడాది పాటు వసూలు చేసిన అధిక ధరల సంగతేంటి.? వాటిని కాంట్రాక్టరు నుంచి రికవరీ చేస్తారా.? అలాగే కాంట్రాక్టరుకు లబ్ది చేకూర్చేలా, శ్రీవారి ఆదాయానికి గండిపడేలా చేసిన సంబంధిత అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు చేపడతారా.? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంట్రాక్టరుకి నోటీసులిచ్చాం దీనిపై ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు వివరణ ఇస్తూ తీర్మానాన్ని అడ్డంపెట్టుకుని కాంట్రాక్టర్ ఇప్పటి వరకు భక్తుల నుంచి అధిక ధరలను వసూలు చేసినట్టు గుర్తించామన్నారు. ఇలా వసూలు చేసిన అదనపు సొమ్ము రూ. 27 లక్షలను తిరిగి దేవస్థానానికి చెల్లించాలని సంబంధిత కాంట్రాక్టరుకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు ఈఓ తెలిపారు. ఈ వ్యవహారంలో సంబంధిత ఉద్యోగులపై సైతం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కుమ్మక్కయ్యారు బహిరంగ వేలం పాట, సీల్ టెండర్ నిర్వహించిన సమయంలో టోల్ వసూల ధరలు తక్కువగా ఉన్నాయి. అందుకే ఎక్కువ ధరకు పాడలేకపోయాం. ఇలా ధరలను పెంచి ఇస్తామని ముందే చెబితే ఎక్కువ ధరకు పాడేవాళ్లం. స్వామివారికి ఆదాయం కూడా మరింత పెరిగేది. కాంట్రాక్టరుతో అధికారులు కుమ్మకై ఇష్టానుసారం ధరలు పెంచి, భక్తుల జేబులకు చిల్లు పెట్టారు. ఇది చాలా దారుణం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. – జంగా వెంకట కృష్ణారెడ్డి, వ్యాపారి ,ద్వారకాతిరుమల, -
గంజి నాగప్రసాద్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, ద్వారకాతిరుమల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ఏ ఒక్క నాయకుడిని, అతడి కుటుంబాన్ని ఆ పార్టీ విడిచిపెట్టదని చెప్పడానికి గంజి నాగప్రసాద్ కుటుంబానికి అందించిన చేయూతే ఒక ఉదాహరణ. ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో మూడునెలల కిందట వైఎస్సార్సీపీ నేత గంజి నాగప్రసాద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఏడాది జూలై 3వ తేదీన కొవ్వూరులో జరిగిన వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీలో నాగప్రసాద్ కుమారుడు ఉదయఫణికుమార్కు ఆయన రూ.15 లక్షల చెక్కు అందించారు. అలాగే మరో రూ.10 లక్షల చెక్కును మిథున్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 16న రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా నాగప్రసాద్ కుమారుడు ఉదయఫణికుమార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ భరత్‌రామ్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మిథున్‌రెడ్డి, రాజీవ్‌కృష్ణ, జీవీ, చెలికాని రాజబాబు, ప్రతాపనేని వాసు తదితరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న వైఎస్సార్సీపీకి తాము రుణపడి ఉంటామని చెప్పారు. (క్లిక్: ప్రభుత్వ పాఠశాలల్లో ‘స్పోకెన్ ఇంగ్లిష్’ క్లాసులు) -
యువకుడి సాహసం.. నిలిచిన బాలుడి ప్రాణం
ద్వారకాతిరుమల: ఒక యువకుడి సాహసం.. బోరుబావిలో పడ్డ బాలుడి ప్రాణాలను కాపాడింది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన తొమ్మిదేళ్ల బాలుడిని ప్రాణాలకు తెగించి మరీ రక్షించాడు ఆ యువకుడు. దీంతో బాలుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని గుండుగొలనుకుంటలో బుధవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మనెల్లి పూర్ణజశ్వంత్ (9) బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆడుకుంటూ ఇంటి సమీపంలోని కమ్యూనిటీ హాలు వద్ద ఉన్న బోరుబావిలో పడిపోయాడు. బాలుడు కనిపించకపోవడంతో అతడి తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, శ్యామల కంగారుపడుతూ వెదుకులాడటం మొదలుపెట్టారు. రాత్రి 10 గంటల సమయంలో కమ్యూనిటీ హాలు వద్ద వెదుకుతున్న వెంకటేశ్వరరావుకు బాలుడి అరుపులు వినిపించాయి. దీంతో బోరుబావి వద్దకు వెళ్లి టార్చ్‌లైట్ వేసి చూడగా బాలుడు కనిపించాడు. వెంటనే విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు. దీంతో గ్రామస్తులు, సమాచారాన్ని అందుకున్న భీమడోలు అగ్నిమాపక అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ బాలుడు పూర్ణ జశ్వంత్‌తో తల్లిదండ్రులు బాలుడిని ఎలా బయటకు తీయాలని అంతా తర్జనభర్జనలు పడుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన, బాలుడికి దగ్గరి బంధువైన కోడెల్లి సురేష్ రాత్రి 11 గంటల సమయంలో తన నడుముకు తాడు కట్టుకుని ధైర్యంగా బోరుబావిలోకి దిగాడు. 400 అడుగుల లోతుగల బోరుబావిలో 30 అడుగుల లోతున ఒక రాయి వద్ద చిక్కుకుని ఉన్న బాలుడిని పైకి తీసుకొచ్చాడు. ప్రాణాలతో సురక్షితంగా బయటపడిన బాలుడిని చూసి అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. సురేష్ సాహసాన్ని బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు మెచ్చుకున్నారు. ప్రమాదానికి కారణమైన బోరుబావిని గ్రామస్తులు గురువారం ఉదయం పూడ్చేశారు. ద్వారకాతిరుమల ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ బొండాడ మోహిని, వైఎస్సార్సీపీ నేత బొండాడ వెంకన్నబాబు, ఎస్ఐ టి.సుధీర్, గుండుగొలనుకుంట గ్రామ సర్పంచ్ బండారు ధనలక్ష్మి తదితరులు సురేష్‌ను ఘనంగా సత్కరించారు. -
ప్రియురాలి పెళ్లి చెడగొట్టాలని.. వరుడికి వాట్సాప్‌లో ఫొటోలు పంపిన ప్రియుడు, దాంతో
ద్వారకాతిరుమల: ప్రియురాలి వివాహాన్ని చెడగొట్టేందుకు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు, చాటింగ్, వాయిస్ మెసేజ్‌లను కాబోయే భర్తకు వాట్సాప్‌లో పంపాడు ఆమె ప్రియుడు. దీంతో మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జాజులకుంట గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకోగా బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. జాజులకుంటకు చెందిన బత్తుల అలేఖ్య (24) ఇంటి వద్ద ఉంటూ ప్రైవేట్‌గా చదువుతోంది. రెండేళ్ల క్రితం ఆమె డీఎడ్ చదువుతుండగా నల్లజర్లకు చెందిన కారు డ్రైవర్ బైపే రవితేజతో ప్రేమలో పడింది. ఇంట్లో విషయం తెలవడంతో ఈనెల 1న కొయ్యలగూడెం మండలం రాజవరానికి చెందిన ముంగమూరి బుచ్చిబాబుతో ఆమె పెళ్లి కుదిర్చారు. ఈనెల 4న నిశ్చితార్థ వేడుక జరగ్గా, (ఈనెల 8న) బుధవారం భోజనాలు, 9న గురువారం వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలిసిన ప్రియుడు రవితేజ ఆమె వివాహాన్ని చెడగొట్టాలని భావించి తనతో అలేఖ్య సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు, చాటింగ్, వాయిస్ మెసేజ్‌లను అతడి స్నేహితుడు మరై సునీల్ సెల్‌ఫోన్ నుంచి పెళ్లికొడుకు ఫోన్‌కు వాట్సాప్ ద్వారా ఈనెల 7న పంపాడు. దీంతో మనస్తాపం చెందిన అలేఖ్య ఇంట్లోని బెడ్రూమ్లోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. కొద్దిసేపటికి కుటుంబసభ్యులు గుర్తించి తలుపులు పగులకొట్టి లోనికి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు రవితేజ, సునీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ చెప్పారు. -
మహా ‘అన్న’ ప్రసాదం
ద్వారకా తిరుమల: అన్నం పరబ్రహ్మ స్వరూపం.. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న.. అందుకే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల చినవెంకన్న దేవస్థానం నిత్యాన్నదాన పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తున్నారు. శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో 30 నుంచి 40 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు ఎంతో రుచికరమైన స్వామివారి అన్నప్రసాదం ఆకలిని తీరుస్తోంది. సాధారణ రోజుల్లో నిత్యం ఐదు వేల మందికి, శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో 10 నుంచి 15 వేల మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాదాన్ని దేవస్థానం అందజేస్తోంది. క్షేత్రంలో రాత్రి వేళ బస చేసే యాత్రికులకు, అలాగే కాలినడకన విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రాత్రి వేళల్లో సైతం ఈ అన్నప్రసాద వితరణను జరుపుతున్నారు. శ్రీవారి దర్శనార్థం శని, ఆదివారాల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే భక్తులకు అల్పాహారాన్ని అందిస్తున్నారు. ఆకలితో వచ్చే వారికి లేదనకుండా అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. అందుకే ఈ నిత్యాన్నదాన పథకానికి భక్తులు విరివిగా విరాళాలను అందజేస్తున్నారు. ఇప్పటి వరకు బ్యాంకులో జమచేసిన ఫిక్స్›డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో పాటు, ఒకరోజు అన్నదానం కోసం భక్తులు నెలపాటు చెల్లించే విరాళాలతో ఈ అన్నప్రసాద వితరణను జరుపుతున్నారు. మెనూ ఇది.. దేవస్థానం అధికారులు శ్రీవారి భక్తులకు ఒక మెనూ ప్రకారం స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేస్తున్నారు. నిత్యం అన్నప్రసాద వితరణలో గూడాన్నం ప్రసాదాన్ని, అలాగే పప్పు, పచ్చడి, కూర, సాంబారు, మజ్జిగను అందిస్తున్నారు. గుర్తింపు ఇలా.. రూ.3,65,000 చెల్లించే భక్తులను మహాన్నదాతలుగా, రూ.1,00,000 నుంచి 3,65,000 లోపు చెల్లించే వారిని మహారాజ పోషకులుగా, రూ.50 వేల నుంచి రూ.1,00,000 లోపు చెల్లించే వారిని రాజపోషకులుగా గుర్తిస్తున్నారు. అలాగే 2019 అక్టోబర్ వరకు రూ.1,116గా ఉన్న శాశ్వత విరాళాన్ని రూ.2,116లకు పెంచారు. ఈ విరాళాన్ని చెల్లించే వారిని శాశ్వత అన్నదాతలుగా గుర్తిస్తారు. పథకం వివరాలివీ.. పథకం ప్రారంభం: 1994 డిసెంబర్ 8. ఇప్పటి వరకు బ్యాంకులో ఫిక్స్డ్ చేసిన డిపాజిట్ విరాళాలు:రూ. 62,80,68,338 వీటిపై వస్తున్న నెలసరి వడ్డీ: 28 లక్షలు. ఒకరోజు అన్నదానం నిమిత్తం భక్తులు రూ.216 చెల్లించడం ద్వారా నెలకు వస్తున్న విరాళాలు: రూ.15 లక్షల నుంచి 20లక్షలు ఇప్పటి వరకు మహాన్నదాతలుగా గుర్తింపు పొందినవారు: 65 మంది. మహారాజ పోషకులుగా గుర్తింపు పొందిన వారు: 1,203 మంది. రాజ పోషకులుగా గుర్తింపు పొందిన వారు: 985 మంది శాశ్వత అన్నదాతలుగా గుర్తింపు పొందిన వారు: 1,80,000 మంది అన్నదానం జరుగు వేళలు.. సోమవారం నుంచి శుక్రవారం వరకు: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టు దినదినాభివృద్ధి చెందుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. కోవిడ్ సమయంలో ప్యాకెట్ల ద్వారా భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాన్ని అందజేశాం. ట్రస్టు అభివృద్ధికి దాతలు విరివిగా విరాళాలను అందిస్తున్నారు. – వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ ఎంతో రుచిగా ఉంది స్వామివారి అన్నప్రసాదం ఎంతో రుచిగా ఉంది. ఏడాదిలో రెండు మూడు సార్లు శ్రీవారిని దర్శిస్తాను. క్షేత్రానికి వచ్చిన ప్రతిసారి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తాను. అన్నదాన భవనంలో శుభ్రత కూడా బాగుంది. – మెండ్యాల సరస్వతి, ఆగిరిపల్లి, భక్తురాలు సేవకు అవకాశం అన్నదాన భవనంలో అన్నప్రసాదాన్ని వడ్డించి, సేవ చేసుకునే భాగ్యాన్ని భక్తులకు కల్పించడం బాగుంది. ఆలయ కార్యాలయంలో పేరు నమోదు చేయించుకున్న తరువాత అధికారులు ఈ సేవకు అనుమతిచ్చారు. ఎంతో సంతోషంగా ఉంది. భోజనం కూడా బాగుంది. – బద్దెం కుమారస్వామి, విశాఖపట్నం, భక్తుడు -
జిల్లాల పునర్విభజన; ద్వారకాతిరుమలపైనే అందరి దృష్టి
ఏలూరు (మెట్రో): ‘మీది ఏ జిల్లా.. మీ జిల్లాకు ఏది ప్రాధాన్యం.. మా జిల్లా కేంద్రంగా మా పట్టణమే ఉంది..’ ఇవీ ప్రస్తుతం జిల్లాలో వినిపిస్తున్న మాటలు. జిల్లా కేంద్రాలు, వసతులపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన, మార్పులు అంశాలపై ఇటీవల అమరావతిలో జిల్లా అధికారులు చర్చించారు. జిల్లా ప్రజల వినతులపై సాధ్యాసాధ్యాలను రాష్ట్ర అధికారులకు వివరించారు. నాలుగు జిల్లాల అధికారులు అమరావతిలో జిల్లాల విభజన, వినతులపై కీలకంగా చర్చించారు. కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, నాలుగు జిల్లాల అధికారులతో పాటు రాష్ట్ర సర్వే రికార్డుల కమిషనర్ సిద్ధార్థ జైన్, రాష్ట్ర ప్రణాళికాశాఖ కమిషనర్ విజయకుమార్ పాల్గొన్నారు. జిల్లాల విభజనలపై వచ్చిన వినతులపై కూలంకషంగా చర్చించారు. చిన వెంకన్న క్షేత్రంపై సుదీర్ఘంగా.. జిల్లాలో వచ్చిన వినతుల్లో ప్రధానంగా ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో ఉంచాలనే ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చించారు. వాస్తవానికి భీమవరం జిల్లాకు మావుళ్లమ్మ ఆలయం, క్షీరారామలింగేశ్వర ఆలయం వంటి ప్రధాన దేవస్థానాలు ఉన్నాయనీ అయితే ఏలూరు జిల్లాకు మాత్రం ప్రధాన ఆలయం ఏమీ లేదని, చినవెంకన్న దేవస్థానం ఉండేలా ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపాలనే వాదన బలంగా ఉందని రాష్ట్ర కమిటీకి నివేదించారు. ఇప్పటివరకూ పశ్చిమగోదావరిలో ఉన్న ద్వారకాతిరుమల మండలాన్ని రాజమండ్రి కేంద్రంగా ఏర్పడే తూర్పుగోదావరి జిల్లాలో కలపడాన్ని జిల్లావాసులు వ్యతిరేకిస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఏలూరు కేంద్రానికి ద్వారకాతిరుమల 30 కిలోమీటర్ల దూరంలో ఉండటం, ఆర్థికంగా ఏలూరు జిల్లాకు వనరుగా ఉండటం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. నరసాపురం కేంద్రం కోసం.. నరసాపురం కేంద్రంగా జిల్లాను మార్పు చేయాలనే ప్రతిపాదనపైనా చర్చ జరిగింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. అలాగే పోలవరం జిల్లా ప్రతిపాదన సైతం చర్చల్లో ప్రధాన అంశంగా నిలిచింది. రంపచోడవరం, పోలవరం నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలను జిల్లాగా చేసే అంశాలను చర్చించారు. ఆయా ప్రాంతాల మధ్య దూరం, గిరిజనుల ఇబ్బందులు, వెసులుబాటు వంటి అంశాలపై రాష్ట్ర కమిటీకి జిల్లా అధికారులు నివేదించారు. వినతుల పెట్టె ఏలూరు కలెక్టరేట్లో జిల్లాల విభజనలపై వచ్చే వినతులు స్వీకరించేందుకు ప్రత్యేకించి ఒక బాక్సును ఏర్పాటుచేశారు. ఆయా వినతులను కలెక్టర్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ అంబేడ్కర్, పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో ప్రతిరోజూ పరిశీలించి ప్రత్యేక నోట్‌ను తయారు చేస్తున్నారు. ఈ నోట్లోని అంశాలను రాష్ట్ర కమిటీకి వివరిస్తున్నారు. తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెబుతున్నారు. -
ఇంటి వద్దే కారు.. అయినా టోల్ కట్
సాక్షి, ద్వారకాతిరుమల: ఇంట్లోనే కారు ఉన్నా ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూలు చేసినట్లు ఫోన్‌కు మెస్సేజ్ రావడంతో ద్వారకాతిరుమలకు చెందిన ఓ కారు యజమాని తెల్లబోయాడు. వివరాలిలా ఉన్నాయి. ద్వారకాతిరుమలకు చెందిన ఒబిలిశెట్టి గంగరాజుకుమార్ సెల్‌ఫోన్‌కు సోమవారం ఉదయం 11.23 గంటలకు ఒక మెసేజ్ వచ్చింది. దీనిని పరిశీలించగా, ఏపీ 37 సీఏ 4747 నంబర్ గల తన రెనాల్ట్ స్కాలా కారుకు ప్రకాశం జిల్లాలోని మేకలవారిపల్లి టోల్ ప్లాజా నుంచి ఫాస్టాగ్ ద్వారా రూ.40 లు టోల్ రుసుము కట్ అయ్యినట్లు అందులో ఉంది. అపార్ట్ మెంట్ లో తన ఇంటి వద్దే ఉన్న కారుకు అక్కడ టోల్ ఎలా కట్ చేశారో తెలియక అయోమయంలో పడ్డాడు. కనీసం కారు రోడ్డు మీదకు వెళ్లకుండా టోల్ రుసుము వసూలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. కారు యజమానికి ఫాస్టాగ్ ద్వారా డబ్బులు కట్ అయినట్లు వచ్చిన మెసేజ్, అపార్ట్మెంట్లో ఉన్న కారు -
‘మా’ ఎన్నికల వివాదం: ఆ ఒక్కటీ అడక్కు..!
ద్వారకాతిరుమల: ‘ఆ ఒక్కటీ అడక్కు..’ ఇటీవల జరిగిన మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల తీరుపై అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ సినీఫక్కీలో స్పందించిన తీరిది. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలోని చిన వెంకన్నను దర్శించుకునేందుకు శనివారం కుటుంబసమేతంగా విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా కొద్దిసేపు విలేకరులతో ముచ్చటించారు. తాను ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎంత హుందాగా ఉందో.. అలా ఉండాలని మనస్ఫూర్తిగా అందరికీ చెప్పానన్నారు. మంచి అజెండాతో గెలిచినవారు మంచే చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఈవో సుబ్బారెడ్డి స్వామివారి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. కాగా, విజయదశమి పండుగను పురస్కరించుకుని సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనంత ప్రభు శుక్రవారం చిన వెంకన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. -
పెళ్లి చేసుకుంటానని పిలిచి లాడ్జికి తీసుకెళ్లి..
సాక్షి,పశ్చిమగోదావరి: పెళ్లి చేసుకుంటానని పిలిచి బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ద్వారకాతిరుమల ఎస్సై టి.వెంకట సురేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పంగిడిగూడెంకు చెందిన 15 ఏళ్ల బాలికకు, నల్లజర్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన పెయింటర్ బుద్దాల అంజిబాబుతో ఏడాదిన్నర క్రితం పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నట్టు నమ్మించి, పెళ్లి చేసుకుంటానని ఈనెల 19న బాలికను ద్వారకాతిరుమలకు రప్పించాడు. అనంతరం ఒక లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తరువాత బస్టాండ్‌కు తీసుకెళ్లి విడిచిపెట్టాడు. తనకు పెళ్లైందని, ఇంటికి వెళ్లిపోమని చెప్పి అంజిబాబు అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో బాలిక ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి, స్థానిక పోలీస్టేషన్లో అదే రోజు రాత్రి ఫిర్యాదు చేసింది. ఫోక్సో చట్టం కింద కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. చదవండి: ప్రొఫైల్ పెడితే.. రూ.25 వేలు మాయం -
ద్వారక తిరుమలలో బోర్డు తిప్పేసిన గోల్డ్ వ్యాపారి
-
సబ్సిడీ ట్రాక్టర్ల పేరుతో రైతులకు కుచ్చుటోపీ
ద్వారకాతిరుమల: సబ్సిడీపై ట్రాక్టర్లు ఇప్పిస్తానని కొందరు రైతులను నమ్మించి, వారిపేరున ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసిన ట్రాక్టర్లను వేరే వ్యక్తులకు అమ్మి సొమ్ము చేసుకున్న కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు నోటీసులు అందడంతో బాధిత రైతులు పోలీసుల్ని ఆశ్రయించగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల ఎస్.ఐ. వెంకటసురేష్ రైతులను మోసగించిన ముగ్గురు వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు కేసు వివరాలను వెల్లడించారు. ద్వారకాతిరుమల మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన ఈదల శ్రీధర్.. సొంత గ్రామంలోని రైతులతో పాటు మండలంలోని ఎం.నాగులపల్లి, దొరసానిపాడు, ద్వారకాతిరుమల, దేవినేనివారిగూడేనికి చెందిన 34 మంది రైతులను రూ.6 లక్షల ట్రాక్టర్‌ను సబ్సిడీపై రూ.4 లక్షలకు ఇప్పిస్తానని చెప్పాడు. అది నమ్మిన రైతులు గతేడాది శ్రీధర్ చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టారు. తరువాత వారు రెండుమూడుసార్లు అడిగినా.. త్వరలో వస్తాయని చెప్పాడు. తరువాత ఏలూరులోని శ్రీ ప్రసన్నలక్ష్మీ మోటార్స్ స్వరాజ్ ట్రాక్టర్ షోరూమ్ యజమాని నెక్కలపు మనోజ్‌కుమార్, షోరూమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ దేవులపల్లి మోహన్‌కుమార్, హెచ్డీఎఫ్సీ ఫైనాన్స్ ఏజెంట్ సహాయంతో బాధిత రైతుల పేరున శ్రీధర్ 34 ట్రాక్టర్లకు ప్రైవేట్ బ్యాంకుల ద్వారా ఫైనాన్స్ చేయించాడు. డౌన్‌పేమెంట్ కట్టాడు. షోరూమ్ యజమాని సహాయంతో మోహన్‌కుమార్, శ్రీధర్ ట్రాక్టర్లను డెలివరీ తీసుకుని లబ్ధిదారులకు తెలియకుండానే చుట్టుపక్కల రైతులతో పాటు, తెలంగాణలోని పలువురికి విక్రయించారు. ఫైనాన్స్ తీరిపోయిందని, త్వరలో రికార్డులు ట్రాన్స్ఫర్ చేస్తామని నమ్మబలికి ఒక్కో ట్రాక్టర్‌ను రూ.4 లక్షలకు అమ్మి సొమ్ముచేసుకున్నారు. వచ్చిన సొమ్ములో కొంతభాగాన్ని.. బాధిత రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి, కొన్ని వాయిదాలకు వారి ఖాతాల్లో సొమ్ము ఉండేలా జాగ్రత్తపడ్డాడు. 5 ట్రాక్టర్ల స్వాధీనం ఇటీవల రైతుల ఖాతాల్లో డబ్బు లేక వాయిదాలు వసూలుకాకపోవడంతో పోవడంతో ఫైనాన్స్ కంపెనీల వారు రైతులకు నోటీసులిచ్చారు. అప్పుడు అసలు విషయం తెలిసిన బాధిత రైతులు ఈ నెల 7న ద్వారకాతిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన ఎస్.ఐ. వెంకటసురేష్.. ట్రాక్టర్లు తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్లాలని వాటిని కొనుగోలు చేసినవారికి చెప్పారు. దీంతో శ్రీధర్ వద్దకు చేరిన 5 ట్రాక్టర్లను ఎస్.ఐ. స్వాధీనం చేసుకుని.. శ్రీధర్, మనోజ్‌కుమార్, మోహన్‌కుమార్‌లను అరెస్టు చేశారు. -
'కోర్టు కేసులతో 6 నెలల నుంచి ఆపుతున్నారు'
సాక్షి, పశ్చిమగోదావరి: ద్వారకా తిరుమల వెంకన్నను శనివారం రోజున రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు దర్శించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితులు, వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం పలికి ప్రసాదాలను అందజేసారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'గుళ్లపై కూడా ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ వారితో కోర్టులో కేసులు వేసి 6 నెలల నుంచి ఆపుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఒక సెంటు భూమి కూడా పేదలకు పంచిన పాపాన పోలేదు. ఇప్పటికే రాష్ట్రంలో 15 లక్షలు ఇళ్లు శాంక్షన్ అయ్యాయి. కోర్టు నుంచి అనుమతి రాగానే మరో 15 లక్షల ఇళ్లు పంపిణీ చేస్తాం. సొంతంగా ఇల్లు నిర్మించుకోలేని పేదలకు ప్రభుత్వం నిర్మించి ఇస్తుంది' అని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. -
దేవుళ్ల రథాలపై మరింత నిఘా..
ద్వారకా తిరుమల: ప్రముఖ ఆలయాల్లోని దేవతామూర్తుల రథాలను సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆ కేసును సీబీఐకు అప్పగిస్తూ శుక్రవారం జీవోను జారీ చేసింది. దీంతోపాటు హిందూ ఆలయాల్లో ఉండే రథాలపై నిఘా మరింతగా పెంచాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే జిల్లాలోని ప్రధాన ఆలయాలకు సంబంధించిన రథాలను, అవి ఉండే ప్రాంతాలను పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటి సంరక్షణకు చేపడుతున్న చర్యలపై ఆలయ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న రథాన్ని, అలాగే క్షేత్ర ఉపాలయాలైన శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి రథాన్ని, లక్ష్మీపురంలోని జగన్నాథ స్వామివారి రథాన్ని, వాటి రథ శాలలను భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు, ద్వారకాతిరుమల ఇన్చార్జి ఎస్సై శ్రీహరిరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రథాల పరిరక్షణకు చేపడుతున్న చర్యలను శ్రీవారి దేవస్థానం ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణ వారికి వివరించారు. (చదవండి: అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు కుట్ర: విజయసాయిరెడ్డి) పరిరక్షిస్తుంది ఇలా.. శ్రీవారి పాత రథాన్ని భక్తుల సందర్శనార్థం ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ఉంచి, కొత్త రథాన్ని ఏడాదికి రెండుసార్లు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వినియోగిస్తున్నారు. ఈ రథ సంరక్షణార్థం దేవస్థానం కొన్నేళ్ల క్రితమే ఆర్సీసీ రూఫ్ కలిగిన రథశాలను నిర్మించింది. ఉత్సవం పూర్తయిన వెంటనే రథాన్ని అందులో ఉంచి, ఇనుప డోరును వేసి, తాళాలు వేస్తారు. ఇదే తరహాలో లక్ష్మీపురం ఆలయం వద్ద ఉన్న రథశాలల్లో కుంకుళ్లమ్మ, జగన్నాథుని రథాలను పరిరక్షిస్తున్నారు. ఈ రథ శాలలు పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పాట్లు కలిగి ఉన్నాయి. ఇదిలా ఉంటే అంతర్వేది ఘటన తరువాత జిల్లాలో భీమవరంలోని సోమేశ్వర జనార్దన స్వామి రథం, ఆచంటలోని ఆచంటేశ్వర స్వామి రథం, అలాగే అత్తిలి మండలం బల్లిపాడులోని మధన వేణుగోపాల స్వామి రథం, దువ్వ వేణుగోపాలస్వామి రథం, కామవరపుకోటలోని వీరభద్ర స్వామి రథం ఇలా పలు ప్రముఖ దేవాలయాల్లోని రథాలపై పోలీసులు నిఘా పెంచారు. వాటి రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు. (చదవండి: ‘అంతర్వేది’పై సీబీఐ..) శ్రీవారి దేవస్థానం రథాలకు ఇన్సూరెన్స్.. శ్రీవారి రథంతోపాటు, కుంకుళ్లమ్మ, జగన్నాథుని రథాలు ఉండే రథశాలల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ రథశాలల వద్ద ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో హోంగార్డులు, అలాగే సెక్యూరిటీ గార్డులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే చినవెంకన్న దేవస్థానం అధికారులు యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మూడు రథాలకు సుమారు రూ.40వేలకు పైగా వెచ్చించి ఇన్సూరెన్స్ చేయించారు. ఏం ఢోకా లేదు శ్రీవారి దేవస్థానం రథాలకు ఏ ఢోకా లేదు. మూడు రథాలనూ ప్రత్యేకంగా నిర్మించిన ఆర్సీసీ రూఫ్ కలిగిన రథ శాలల్లోనే భద్రపరుస్తున్నాం. రాత్రి వేళల్లో రథ శాలల వద్ద సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తున్నాం. అలాగే రథాలకు ఇన్సూరెన్స్ కూడా చేయించాం. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం రథాల పరిరక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. – రావిపాటి ప్రభాకరరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ -
బాటిల్లో చిక్కి.. తాచుపాము పిల్ల హల్చల్
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ తూర్పు ప్రాంతంలోని జంటగోపురాల వద్ద శుక్రవారం ఉదయం తాచుపాము పిల్ల కొద్దిసేపు హల్చల్ చేసింది. అక్కడ పడి ఉన్న ఒక వాటర్ బాటిల్లోకి దూరిన ఆ పాము పిల్ల బయటకొచ్చేందుకు అష్టకష్టాలు పడుతూ.. పడగ విప్పి చూడటం మొదలు పెట్టింది. అంత చిన్న పాము పిల్ల పడగ విప్పి చూస్తుండటాన్ని అక్కడున్న భక్తులంతా ఆసక్తిగా తిలకించారు. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఒక హోంగార్డు ధైర్యం చేసి ఆ బాటిల్‌కు మూతపెట్టి, పాము పిల్లను బందీ చేశాడు. అనంతరం కొండపైకి దూరంగా తీసుకెళ్లి పొదల్లో విడిచిపెట్టాడు. -
ఇవేం కష్టాలు.. భగవంతుడా..!
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రానికి మొక్కుబడులు తీర్చుకునేందుకు వచ్చే భక్తులకు కష్టాలు తప్పడం లేదు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేవస్థానం కేశఖండనశాలను మూసివేయడంతో, ప్రస్తుతం చుట్టుపక్కల క్షురకులు, దళారుల దందా ఎక్కువైంది. ఏదో ఒక మూల మొక్కులు సమర్పిస్తే సరిపోతుందని భావిస్తున్న భక్తులను వారు దోచుకుతింటున్నారు. అంతే కాకుండా స్వామివారికి చెందాల్సిన తలనీలాలను వ్యర్థాలపాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం పెద్ద ఎత్తున యాత్రికులకు సత్తెన్నగూడెం, వెంకటకృష్ణాపురానికి వెళ్లే మార్గాల్లోని తోటలు, ముళ్ల పొదల్లో క్షురకులు గుండ్లు గీశారు. అలాగే సుద్ద గనుల్లో సైతం గుండ్లు గీసి, ఒక్కో భక్తుడి నుంచి రూ.500 వసూలు చేశారు. ఇదిలా ఉంటే స్థానిక నాయీ బ్రాహ్మణులు గుండ్లు గీస్తున్న పలువురు క్షురకులను పట్టుకుని, తీవ్రంగా హెచ్చరించారు. ఈ సమయంలో సగం గీసిన గుండ్లతో భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. మిగిలిన సగం గుండ్లను వేరే క్షురకులతో గీయించుకుని, వారికి పెద్ద మొత్తంలో సొమ్ములు సమర్పించుకున్నారు. ఈ కష్టాలేమిట్రా భగవంతుడా.. అంటూ పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇళ్ల వద్దే యాత్రికులు తలనీలాలను తీయించుకుని, ముడుపులు కట్టి తమకు అందించాలని దేవస్థానం అధికారులు నిత్యం ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయినా భక్తులు వాటిని లెక్కచేయకుండా క్షేత్రానికి వచ్చి అష్టకష్టాలు పడుతున్నారు. -
ద్వారక తిరుమల ఆలయం మూసివేత
సాక్షి, పశ్చిమ గోదావరి : జూన్ 21న సూర్య గ్రహణం సందర్భంగా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం మూసివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 20వ తేదీన రాత్రి యధావిధిగా ఆలయం మూసివేసి 21వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు మళ్లీ ఆలయం తెరిచి సంప్రోక్షణ నిర్వహించి శుద్ది జరుపుతారని అధికారులు పేర్కొన్నారు. అనంతరం రాత్రి 7గంటలకు భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తారు. కాగా సూర్య గ్రహణం సందర్భంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో రావిపాటి ప్రభాకర్ రావు పేర్కొన్నారు. -
కరోనాతో వాయిదా లేదా ఇళ్ల వద్దే మమ!
ద్వారకాతిరుమల: కల్యాణం.. కమనీయం.. జీవితం. పెళ్లంటే నూరేళ్ల పంట.. ఆ నూరేళ్ల వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని వేలాది జంటలు ముచ్చటపడ్డాయి.. నింగి.. నేలా ఒక్కటయ్యేలా వివాహాలు జరుపుకోవాలని తహతహలాడాయి. ఇంతలో కరోనా మహ మ్మారి వారి ఆనందంపై నీళ్లు చిమ్మింది. లాక్డౌన్ కారణంగా జిల్లాలో దాదాపు 90 శాతం పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. దీంతో వైశాఖ మాసం ప్రారంభమైన ఏప్రిల్ 24 నుంచి మే 22 వరకు, జ్యేష్ఠమాసం ప్రారంభమైన మే 23 నుంచి ఇప్పటి వరకు పురోహితుల వేద మంత్రోచ్ఛ రణలు, డోలు, సన్నాయి వాయి ద్యాలు వినబడలేదు. ఆర్కెస్ట్రాలు, మైక్సెట్లు, డిజే సౌండ్లు మూగబోయాయి. కల్యాణ మండపాలు నిర్మానుష్యంగా మారాయి. వందలాది వివాహాలకు వేదిక కావాల్సిన ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం వెల వెలబోయింది. వివాహాలతో ముడిపడి ఉన్న వేలాది మంది వ్యాపారులు, కుల వృత్తిదారులు జీవనోపాధిని కోల్పోయారు. వెయ్యికి పైగా క్షేత్రంలోనే.. జిల్లావ్యాప్తంగా ఏటా వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో దాదాపు 2,250 వరకు వివాహాలు జరిగేవి. ఇందులో వెయ్యికి పైగా పెళ్లిళ్లు ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలోనే జరుగుతాయి. అయితే కోవిడ్–19 నివారణా చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది క్షేత్రంలో ఒక్క వివాహం కూడా జరగలేదు. బలమైన ముహూర్తం, సెంటిమెంట్ ఉన్న వారు మాత్రం అనుకున్న సమయానికి ఇళ్ల వద్దే తంతు జరిపించారు. అనంతరం క్షేత్రానికి వచ్చి ఆలయం బయట నుంచే స్వామివారికి దండం పెట్టుకుని వెళ్లిపోయారు. ఇలా ఈ ఏడాది జిల్లాలో ఎక్కడా వివాహ సందడి కానరాలేదు. పలువురు గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలను సైతం వాయిదా వేసుకున్నారు. ఇదిలా ఉండగా మే 30 నుంచి మూఢం మొదలైంది. ఉపాధిపై కరోనా కాటు వివాహాలు, ఇతర శుభకార్యాలతో ముడిపడి ఉన్న అనేక రంగాల వారిపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫంక్షన్ హాల్స్, సన్నాయి మేళాలు, డిజైన్లు, బ్యాండ్, వంటలు వండేవారు, క్యాటరింగ్, ఈవెంట్ మేనేజర్లు, మేకప్, పెళ్లి దుస్తులు కుట్టేవారు, పురోహితులు, వీడియో, ఫొటోగ్రాఫర్లు, బంగారం, దుస్తులు, పూలు, కూరగాయల రైతులు, చికెన్, మటన్ వ్యాపారులు, ట్రావెల్స్, టెంట్ హౌస్ వ్యాపారం చేసే వారు ఇలా చాలా మంది ఉపాధిపై కరోనా కోలుకోలేని దెబ్బకొట్టింది. వెయ్యి మందికి పైగా జనం పట్టే ఫంక్షన్ హాల్సు యజమానులు, ఈ రెండు నెలల సీజన్లో ఒక్కొక్కరు సుమారు రూ.25 లక్షల ఆదాయాన్ని కోల్పోయారు. వివాహాది శుభకార్యాల నిమిత్తం శ్రీవారి దేవస్థానంలో కల్యాణ మండపాలు, గదులు ముందుగా బుక్ చేసుకున్న వారికి ఆలయ అధికారులు తిరిగి రూ.18 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే లాక్డౌన్ తొలగించిన తరువాత వేరే తేదీలో శుభకార్యం జరుపుకునేందుకు ఇష్టపడితే రుసుం వెనక్కి చెల్లించమని అధికారులు తెలిపారు. ముహూర్తాలు ఇలా.. ♦ మే 30 నుంచి జూన్ 9 వరకు మూఢం కారణంగా శుభకార్యాలు జరగవు. ♦ జూన్ 10, 11 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. ♦ ఆషాఢం కారణంగా జూన్ 22 నుంచి జూలై 20 వరకు శుభకార్యాలు జరగవు. ♦ జూలై 23, 24, 25, ఆగస్టు 2, 7, 14 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ♦ ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 17 వరకు భాద్రపదం, శూన్యమాసం కారణంగా శుభకార్యాలు జరగవు. ♦ సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 10 వరకు ఆశ్వయుజ మాసంలో గట్టి ముహూర్తాలు లేవు. ♦ అక్టోబర్ 21, 28, 29, 30, నవంబర్ 6, 11 నుంచి డిసెంబర్ 6 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. కుటుంబ పోషణ భారమైంది చినవెంకన్న క్షేత్రంలో ఏటా వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో అధికంగా వివాహాలు జరిగేవి. అయితే లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది ఒక్క పెళ్లి కూడా జరగలేదు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. వివాహాది శుభకార్యాలపై ఆధారపడిన వ్యాపారులందరి పరిస్థితి ఇలానే ఉంది. కరోనా ప్రతిఒక్కరిని కోలుకోలేని దెబ్బకొట్టింది. –గోవిందవఝుల వెంకటరమణమూర్తిశర్మ,పురోహితులు, ద్వారకాతిరుమల -
విజయవాడ రెడ్‌జోన్ ప్రాంతాల్లో సీపీ పర్యటన
-
కరోనా అలర్డ్ : దేవాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత
సాక్షి, పశ్చిమ గోదావరి : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ద్వారకా తిరుమల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి 31 వరకు కేశఖండనశాల, అంతరాలయ దర్శనం, అన్ని ఆర్జిత సేవలు, సుప్రభాత సేవ, అష్టోత్తర పూజలు, ప్రచార రథం నిలుపుదల చేసినట్లు దేవస్థానం ప్రకటించింది. దీంతోపాటు ఆన్లైన్ ద్వారా టికెట్ల సేవను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. కాగా ఆన్లైన్ ద్వారా ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు పరిస్థితి మెరుగుపడ్డాక స్వామి వారి దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. విజయవాడ : కరోనా వైరస్ నేపథ్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి చేయించే ప్రత్యేక పూజలతో పాటు, అంతరాలయ దర్శనం, ఆర్జిత సేవలతో పాటు అన్ని రకాల సేవలను రద్దు చేస్తున్నట్లు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఇంద్రకీలాద్రికి బస్ సౌకర్యం నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 3 వరకు సౌరాష్ట్రక్షరి మహా మంత్ర హవనం, మహా మృత్యుంజయ మంత్ర హవనం, శీతల మహా మంత్ర హవనం, అరుణ పారాయణం, సౌర పారాయణం, సూర్యనామస్కరరాలు, చండీహోమం వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఘాట్ రోడ్డుతో పాటు మహామండపం వద్ద స్క్రీన్ లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
ప్రజలందరికి దేవుడి ఆశీస్సులు అందాలనే..
సాక్షి, పశ్చిమ గోదావరి : హిందూ సంప్రదాయాలను కాపాడుతూ ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలందరికి దేవుడి ఆశీస్సులు అందించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారకా తిరుమల నూతన పాలకమండలిని ఏర్పాటు చేశారని ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని తెలిపారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్థాన నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం జరిగింది. 16 మంది సభ్యులతో దేవస్థాన పాలక మండలి ఏర్పాటైంది. పాలకమండలి సభ్యులతో ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారమహోత్సవ కార్యక్రమంలో ఎంపీ మార్గాన్ని భరత్, ఎమ్మెల్యేలు పుప్పాలా వాసు, బాబు తలారి వెంకట్రావు, పాలక మండలి ఆలయ ఛైర్మన్ యస్.వి. సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్లనాని మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్.. ట్రస్ట్ బోర్డులో బడుగు, బలహీన వర్గాల వారితో పాటు మధ్యతరగతి వారికి చోటు కల్పించారని తెలిపారు. ట్రస్ట్ బోర్డులో మెంబర్‌గా ఉన్నవారు కొంత సమయం కేటాయించి దేవుడికి సేవ చేయడంతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ద్వారకా తిరుమల దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. -
రోడ్డు ప్రమాదం మిగిల్చిన విషాదం
సాక్షి, ద్వారకాతిరుమల: వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. కులాలు, మతాలు ఒక్కటే అయినా వారి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు మగ పిల్లలు సంతానం. ఈ మధ్యే పెద్దలు సైతం వారిని చేరదీశారు. జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. వివరాల ప్రకారం. ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన పెద్దింటి ప్రతాప్ కుమార్(27) అదే గ్రామానికి చెందిన గాయత్రిని ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాగవెంకట త్రినాథ్, హరీష్ నాయుడు సంతానం. ప్రతాప్ కుమార్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే సంక్రాంతి పండగ సందర్భంగా మృతుడు శనివారం ఏలూరుకు వెళ్లి తన ఇద్దరు పిల్లలకు దుస్తులు కొన్నాడు. అనంతరం తన స్నేహితుడు కందాడై లక్ష్మీకాంత్‌తో కలసి ద్విచక్ర వాహనంపై రాత్రి స్వగ్రామానికి బయల్దేరాడు. ఘటనా స్థలమైన దెందులూరు మండలం సింగవరంలోని తిరుమల డెయిరీ వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న బైక్, వీరి బైక్ వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రతాప్ కుమార్ తీవ్ర గాయాలుపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అందరితో కలుపుగోలుగా ఉండే ప్రతాప్ కుమార్ అకస్మాత్తుగా ప్రమాదానికి గురై మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
సీఎం జగన్‌కు మోదీ సోదరుడి కితాబు
సాక్షి, ద్వారకాతిరుమల: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కష్టాలు తెలిసిన మనిషని ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు, సామాజికవేత్త ప్రహ్లాద్ మోదీ వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి దేవతిలకుల, గాండ్ల, తెలకుల సంఘ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆయన స్థానిక దేవతిలకుల సత్రంలో ధనుర్మాస వేడుకల్లో పాల్గొని, విశేష పూజలు నిర్వహించారు. తరువాత సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో దేవతిలకులు, గాండ్ల, తెలకులు 14 లక్షలకు పైగా ఉన్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వీరు ఆర్థిక, రాజకీయ రంగాల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నారన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని ఈ సామాజిక వర్గీయులంతా ఏకతాటిపై నిలిచి అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ సామాజిక వర్గీయుల సమస్యలను త్వరలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. -
త్వరలోనే వైశ్య కార్పొరేషన్‌ను ప్రవేశ పెడతాం: మంత్రి
సాక్షి, పశ్చిమ గోదావరి: ద్వారకా తిరుమల ఆర్య వైశ్య కళ్యాణ మండపం ట్రస్ట్ వాసవి మాతకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ పవర్ జనరేషన్ ప్లాంటును మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లోనే వైశ్య కార్పొరేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టనున్నారని ఆయన వెల్లడించారు. రాజధానిని గొప్పగా నిర్మించామని చెప్పుకునే చంద్రబాబు.. అక్కడి సచివాలయం, హైకోర్టులలో వర్షాలు పడితే నీరు వచ్చే పరిస్థితి ఉందని మంత్రి విమర్శించారు. అలాగే రాష్ట్ర విభజన అనంతరం అయిదేళ్లుగా గత ప్రభుత్వం పోట్టి శ్రీరాములు జయంతిని నిర్విర్యం చేశారని మంత్రి ధ్వజమెత్తారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా క్రిష్టియానిటి వస్తుందంటూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని, తిరుపతి కొండపై శిలువ ఉందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇంటిలో పని చేసే పిల్లలను సైతం ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియానని సీఎం జగన్ ప్రవేశపెడుతున్నారని తెలిపారు. కులం, పార్టీ, మతాలకు అతీతంగా పాలన చేయాలంటూ సీఎం జగన్ ఎమ్మెల్యేలకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇక ఆర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు అమలు అవుతాయని మంత్రి పేర్కొన్నారు. -
వికలాంగుల కష్టాలు తీర్చే వైకుంఠం ‘విర్డ్’ ఆసుపత్రి
డాలస్: ఒక లక్షా 20వేలకు పైగా అంగవికలురకు విజయవంతంగా ఎముకల శస్త్రచికిత్సలు నిర్వహించిన ప్రముఖ వైద్యుడు డా.గుడారు జగదీష్ నేతృత్వంలో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర అంగవైకల్య శస్త్రచికిత్స పరిశోధనా పునరావాస ఆసుపత్రికి(Venkateswara Institute For Rehabilitation & Research of the Disabled-VIRRD) డాలస్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ప్రవాసులు రూ.60లక్షలను విరాళంగా ప్రకటించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్)లు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. కార్యక్రమాన్ని తానా ప్రాంతీయ ప్రతినిధి దొడ్డా సాంబ ప్రారంభించారు. తానా డైరక్టర్ల బోర్డు కార్యదర్శి వెన్నం మురళీ మాట్లాడుతూ నిస్వార్థంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న డా.గుడారు జగదీష్ వంటి వారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్న ఆసుపత్రికి డాలస్ ప్రవాసులు తోడ్పడం ఆనందంగా ఉందన్నారు. తానా మాజీ అధ్యక్షుడు డా.తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ 2013లో డాలస్‌లో జరిగిన తానా సభల్లో డా.గుడారుకి పురస్కారాన్ని అందించి గౌరవించుకున్నామని, 2017లో ఏలూరులో జరిగిన అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరో పురస్కారంతో ఆయన్ను రెండుసార్లు గౌరవించుకునే అవకాశం దక్కిందని అన్నారు. అకుంఠిత దీక్షతో, క్రమశిక్షణ, సాంత్వన కలిగిన మాటతీరుతో అంగవైకల్యం బాధపడే లక్షల మంది జీవితాల్లో ఆనందాన్ని నింపి వారి సొంత కాళ్లపై వారు నిలబడేలా చేసిన దేవుడు డా.గుడారు అని ఆయన కొనియాడారు. అనంతరం డా.జగదీష్‌ను తోటకూర సభకు పరిచయం చేశారు. డా.గుడారు జగదీష్ తన ప్రసంగాన్ని ప్రదర్శన రూపంలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ 1987లో ఎన్టీఆర్ తిరుపతిలో స్థాపించిన విర్డ్(BIRRD) ఆసుపత్రిలో నేను 1996 నుండి 1,20,000 మంది అంగవికలాంగులకు 95శాతం విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించాను. 2008లో వేగేశ్న ఫౌండేషన్, ద్వారకా తిరుమల ఆలయం సహకారంతో విర్డ్ను ఏర్పాటు చేసి ఇక్కడ కూడా ఎంతోమందికి ఎముకలకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలో 23వేల మంది అంగవికలాంగులకు శస్త్రచికిత్సలు, కృత్రిమ అవయవాల అవసరం ఉంది. దీనితో పాటు విర్డ్ ఆసుపత్రిలో అధునాతన శస్త్రచికిత్స గది, రోగులకు మంచాలు, గ్రంథాలయం, ఫిజియోథెరపీ ఉపకరణాలు వంటి వాటిని ఆధునీకరించాల్సిన ఆవశ్యకత ఉంది. జనవరి నుండి తొలివిడతలో ఏపీలో, తదనంతరం తెలంగాణా రాష్ట్రాల్లో వీఐఆర్ఆర్డీ ఉచిత నిర్ధారణ శిబిరాలను నిర్వహించి అర్హులైన వారికి స్థానిక వైద్యుల సహకారంతో స్థానికంగానే చికిత్స చేస్తాం లేదా విర్డ్కు తరలించి అక్కడే అవసరమైన మేర చికిత్స చేస్తాం. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా తమ ప్రాంతంలో ఈ శిబిరాలను నిర్వహించాలంటే విర్డ్ను సంప్రదించండి. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ పూర్తి ఉచితంగా ఎలాంటి శస్త్రచికిత్సను అయినా విర్డ్‌లో అందిస్తున్నాం. రోగి విర్డ్లోనే రెండు నుండి ఆరు వారాల పాటు ఉచితంగా భోజన సదుపాయంతో కూడిన నివాసంలో ఉండవచ్చు. తోడుగా ఒక కుటుంబ సభ్యుడు ఉండవచ్చు. రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల రోగులు సైతం మా విర్డ్కు వస్తున్నారు. ఏడాదికి 50వేల మంది రోగులకు మేము వైద్య సదుపాయాలను కల్పిస్తున్నాం. ఇంతమంది రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న విర్డ్ను మరింత మెరుగుపరిచేందుకు నిధులను సేకరిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రవాసులు తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని డా.జగదీష్ పేర్కొన్నారు. తానా మాజీ అధ్యక్షుడ్ కోమటి జయరాం రూ.35లక్షలు, మురళీ వెన్నం సమన్వయంలో డాలస్ మిత్రులు రూ.15లక్షలు, తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ రూ.10లక్షలు విర్డ్కు అందించేందుకు హామీ ఇచ్చారు. వీరందరికీ డా.గుడారు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టాంటెక్స్ అధ్యక్షుడు చినసత్యం వీర్నపు, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు సుబ్బరాయ చౌదరి, చిత్తూరు ప్రవాసుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల విజయమోహన్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో తానా క్రీడా విభాగ సమన్వయకర్త లోకేష్ నాయుడు, పోలవరపు శ్రీకాంత్, జొన్నలగడ్డ సుబ్రమణ్యం, మల్లవరపు అనంత్, డా.పుదూర్ జగదీశ్వరన్, యు.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘దివ్యంగా’ నడిపిస్తారు
సాక్షి, ద్వారకాతిరుమల: అసమాన వైద్య సేవలతో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రీహేబిలిటేషన్ ఫర్ ది డిజేబుల్డ్ (విర్డ్). చిన్న తిరుపతిగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల క్షేత్రంలో 2008లో ప్రారంభమైన ఈ ఆస్పత్రి అంతర్జాతీయ సౌకర్యాలను సమకూర్చుకుని దివ్యాంగులకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలందిస్తోంది. పోలియో బాధితులతోపాటు ప్రమాదాల్లో గాయపడి అవయవాలు కోల్పోయిన వారు.. వెన్నెముక సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారెందరో ఇక్కడ చికిత్స పొంది కోలుకున్నారు. వేగేశ్న ఆనందరాజు, అనంత కోటిరాజు ప్రధాన దాతృత్వంతో రూపుదిద్దుకున్న ఈ ఆస్పత్రి పలువురు దాతలు అందించిన రూ.16.05 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏటా వస్తున్న వడ్డీ రూ.1.20 కోట్లతో వైద్య సేవలను విస్తృతం చేస్తోంది. దీనికి ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం సహకారం అందిస్తోంది. ప్రత్యేకతలివీ.. పోలియో, సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న దివ్యాంగులకు çపూర్తి ఉచితంగా వైద్య సేవలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.లక్షలు ఖర్చయ్యే అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సలను అతి తక్కువ ధరకే అందిస్తారు లింబ్ రీ–కనస్ట్రక్షన్ సిస్టమ్ ద్వారా పొట్టిగా ఉన్న కాళ్లను పొడవుగా చేయడం ఎముకల మధ్య ఖాళీ ఏర్పడితే రీ–లింబ్ సిస్టమ్ ద్వారా సరిచేయడం మోకాలు లేదా భుజంలో దెబ్బతిన్న లిగ్మెంట్స్ను సరిచేయడానికి ఆర్థోస్కోపీ కీహోల్ సర్జరీ ప్రముఖ ఆస్పత్రుల్లో సైతం విఫలమైన శస్త్ర చికిత్సలను సైతం ఇక్కడ విజయవంతంగా చేస్తున్నారు. ఆధునిక పరికరాలతో లాభాపేక్ష లేకుండా తక్కువ ఖర్చుతో శస్త్ర చికిత్సలు ఆస్పత్రిలోనే ఫార్మసీని నెలకొల్పి ఎమ్మార్పీపై 25 శాతం తక్కువ ధరలకు మందుల విక్రయం. చెన్నైలో రూ.7 లక్షలైంది నాలుగేళ్ల క్రితం ఎడమ కాలిపై కణుతులొచ్చాయి. నొప్పి ఎక్కువై నడవలేని పరిస్థితి. గుంటూరు ఆస్పత్రికి వెళితే ఎముక మద్య ఖాళీ ఏర్పడిందని సిమెంట్‌తో పూడ్చారు. ఇన్ఫెక్షన్ రావడంతో చెన్నై వెళ్లాను. అక్కడి వైద్యులు రూ.7 లక్షలు తీసుకుని చికిత్స చేశారు. ఫలితం లేకపోగా కాలు తీసేసే పరిస్థితి వచ్చింది. విర్డ్‌లో లింబ్ రీ–కనస్ట్రక్షన్ ఆపరేషన్ చేస్తున్నారని చెబితే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు బాగానే ఉంది. – శీలం బాబు, విజయవాడ చౌకగా శస్త్రచికిత్స పదేళ్ల క్రితం మేడ పైనుంచి పడిపోవడంతో ఎడమ కాలి తుంటి కీలు విరిగిపోయింది. శస్త్రచికిత్స చేయించుకోగా కొన్నాళ్లు బాగానే ఉంది. ఏడాది నుంచి నడవలేకపోతున్నాను. ఏ ఆస్పత్రికెళ్లినా కాలు తీసేయాలన్నారు. కొందరు వైద్యులు రూ.5 లక్షలు ఇస్తే ఆపరేషన్ చేస్తామని, అది కూడా గ్యారంటీ లేదన్నారు. డాక్టర్ జగదీష్ నాకు ఉచితంగా ఆపరేషన్ చేశారు. పరికరాలకు రూ.1.20 లక్షలు ఖర్చయింది. – నాగసుబ్బమ్మ, కడప జీవితం ముగిసిందనుకున్నా.. చిన్నతనంలోనే పోలియో బారినపడ్డాను. 2003లో వెన్నెముక నుంచి నొప్పి మొదలైంది. ఏడాది క్రితం హైదరాబాద్, బెంగళూరు వైద్యులను సంప్రదించాను. ఆపరేషన్ చేయకపోతే శరీరంలోని అన్ని అవయవాలు చచ్చుబడతాయన్నారు. ఆపరేషన్‌కు రూ.15 లక్షలు అవుతుందని, అయినా గ్యారంటీ ఇవ్వలేమన్నారు. దీంతో నా జీవితం ముగిసిపోయిందనుకున్నా. విర్డ్ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేశారు.పరికారాలకు మాత్రం రూ.1.50 లక్షలు ఖర్చయింది. – బి.శ్రీదేవి, నంద్యాల పైసా తీసుకోకుండా.. రోడ్డు ప్రమాదంలో నా మోకాలిలోని ఏసీఎల్ తెగిపోయింది. విర్డ్ ఆసుపత్రిలో కీహోల్ సర్జరీ చేస్తున్నట్టు తెలిసి వచ్చాను. ఆరోగ్యశ్రీలో పైసా ఖర్చు లేకుండా ఇక్కడ కీహోల్ సర్జరీ చేశారు. – పి.భవానీ శంకర్, రామన్నపాలెం, మొగల్తూరు మండలం -
ద్వారాక తిరుమలకు అబ్బాయచౌదరి పాదయాత్ర
-
మెడపై కత్తిపెట్టి 15 కాసులు అపహరణ
సాక్షి, ద్వారకాతిరుమల: భార్యాభర్తలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు ఆగంతకులు లోనికి ప్రవేశించి వారిని కత్తితో బెదిరించి, దౌర్జన్యంగా 15 కాసుల బంగారాన్ని దోచుకుపోయారు. ఈ ఘటన ద్వారకాతిరుమల మండలం కోడిగూడెంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాదితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చెలికాని వేణుగోపాలరావు, మనోరమ దంపతులు గ్రామ శివారులో ఉన్న వారి తాటాకింట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ఇంటి వెనుక గెడలతో నిర్మించిన దడిని చీల్చిలోనికి ప్రవేశించారు. ఆ తరువాత మంచంపై నిద్రిస్తున్న వేణుగోపాలరావును కిందకు నెట్టి, ఆయన మెడపై మాంసం కొట్టే కత్తిని పెట్టారు. దీంతో ఆయన కేకలు వేయడంతో భార్య మనోరమ నిద్రలేచి, తన భర్తను చంపవద్దని ఆగంతకులను వేడుకుంది. అదే సమయంలో వారు ఆమె మెడలో ఉన్న బంగారు నానుతాడును, చేతికున్న ఆరు బంగారు గాజులను దౌర్జన్యంగా లాక్కున్నారు. అనంతరం బీరువా తలుపులు తెరవమని మనోరమను వారు ఒత్తిడి చేశారు. బీరువాలో ఏమీ లేవని, తన భర్తను విడిచిపెట్టాలని ఆమె బోరున విలపిస్తూ ప్రాధేయపడింది. దీంతో వారు ఆ వృద్ధ దంపతులను విడిచిపెట్టి అక్కడి నుంచి ఉడాయించారు. వేణుగోపాలరావు పక్షవాతంతో బాధపడుతున్నందున ఆగంతకులను ఎదురించలేకపోయారు. ఇదిలా ఉంటే జరిగిన విషయాన్ని వేణుగోపాలరావు తన బంధువుల ద్వారా ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏలూరు క్రైం డీఎస్పీ సుబ్రహ్మణ్యం, భీమడోలు సీఐ సీహెచ్.కొండలరావు, ద్వారకాతిరుమల ఎస్సై ఎన్.సూర్యభగవాన్, భీమడోలు ఎస్సై ఐ.వీర్రాజులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితుల నుంచి వివరాలు రాబట్టారు. క్లూస్ టీమ్ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలను సేకరించారు. ఈ సందర్భంగా బాధితురాలు మనోరమ మాట్లాడుతూ తమ ఇంట్లోకి చొరబడిన దొంగలు ముగ్గురు లుంగీలు ధరించి, ముఖాలకు కర్చీఫ్‌లు కట్టుకున్నట్టు పోలీసులకు తెలిపారు. వారు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చినట్లు చెప్పారు. ఇంట్లోని వంట గదిలోకి సైతం చొరబడి వారు సామాన్లను చిందరవందర చేశారని పేర్కొన్నారు. -
వెంకన్న ఆలయంలో భోగిపిడకల విక్రయం
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో భోగి పిడకల విక్రయాలను ఆదివారం ప్రారంభించారు. స్వామి గోసంరక్షణ శాలలోని గోవుల ద్వారా వచ్చే పేడతో ఈ పిడకలను తయారు చేస్తున్నారు. ధనుర్మాసం ప్రారంభం కావడంతో కొత్తగా వీటి విక్రయాలను దేవస్థానం ప్రారంభించింది. 25 భోగి పిడకల ధరను రూ.100గా నిర్ణయించి, స్థానిక అనివెట్టి మండపంలో ఆలయ సిబ్బంది అమ్ముతున్నారు. ఈ పిడకలను భోగి పండుగ నాడు వెలిగించే, భోగి మంటల్లో వేస్తే అంతా మంచి జరుగుతుందని ఆలయ ఈఓ దంతులూరి పెద్దిరాజు తెలిపారు. -
చినవెంకన్న ఆలయ వేళల్లో మార్పులు !
పశ్చిమగోదావరి ,ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ వేళలు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శని, ఆదివారాలు, పర్వదినాల్లో మార్పు చేసేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ ఈఓ దంతులూరి పెద్దిరాజు ఆలయ అర్చకులతో, అధికారులతో విస్తృత చర్చలు జరిపారు. శ్రీవారి క్షేత్రానికి శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటోంది. పాదయాత్రగా క్షేత్రానికి చేరుకునే భక్తులు శుక్రవారం రాత్రికేఆలయానికి స్వామివారి దర్శనార్థం చేరుకుంటున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాన్ని అందించే క్రమంలో శని, ఆదివారాలు, పర్వదినాల్లో అధికారులు శ్రీవారి దర్శన వేళల్లో మార్పు చేయనున్నారు. ప్రస్తుతం తెల్లవారుజామున4 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాలను తెరచి, అర్చనాది కార్యక్రమాలు సుప్రభాత సేవలను నిర్వహిస్తున్నారు. ఆ తరువాత స్వామివారికి అలంకారాలు జరిపి, ఉదయం 6 గంటల నుంచి భక్తులకు చినవెంకన్న దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. అయితే ఈ సమయానికే స్వామివారి దర్శనార్ధం భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరడంతో పాటు, క్యూలైన్లు నిండిపోతున్నాయి. దీన్నిగమనించిన ఆలయ అధికారులు తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయ ద్వారాలను తెరచి, భక్తులకు 5.30 గంటలకే దర్శనాన్ని కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా స్వామివారికి జరిగే నిత్యార్జిత కల్యాణం ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నారు. శని, ఆదివారాలు, పర్వదినాల్లో జరుగనున్న ఈ ఆలయ వేళల మార్పులపై, అలాగే నిత్యార్జిత కల్యాణ వేళలపై దేవస్థానం చైర్మన్ ఎస్వీ.సుధాకరరావు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
చిన్న వెంకన్న చెంత.. ఇదేమి చింత
ద్వారకాతిరుమల: రాష్ట్ర ప్రభుత్వం మద్యం విక్రయాలకు ఇష్టారాజ్యంగా లైసెన్సులు ఇవ్వడంతో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోను మద్యం ఏరులై పారుతోంది. దీంతో భక్తుల మనోభవాలు దెబ్బతింటున్నాయి. జిల్లాలోని ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో ఈ దుస్థితి మరింత ఎక్కువగా ఉంది. గతంలో చిన్నతిరుపతి క్షేత్రానికి వచ్చే భక్తులకు గరుడాళ్వార్ విగ్రహం స్వాగతం పలికేది. ఇప్పుడు మద్యం దుకాణాలు, వాటి బోర్డులే ఆహ్వానం పలుకుతున్నాయి. క్షేత్రంలోని దేవస్థానం ఆర్చిగేట్లు, స్వామివారి మండపాలు, దేవతామూర్తుల విగ్రహాలకు కూతవేటు దూరంలోనే మద్యం దుకాణాలు ఉండటంపై స్థానికులు, భక్తులు మండిపడుతున్నారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ చట్టంలోని నియమ నిబంధనలను పాలకులు, అధికారులు తుంగలోకి తొక్కి మరీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిబంధనలను అమలు చేస్తున్నారు. క్షేత్రంలో గుడికి, బడికి వంద మీటర్ల దూరంలోనే మద్యం దుకాణాలు ఉన్నాయంటున్న వ్యాపారులు విక్రయాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ చట్టం ప్రకారం ఇది తప్పని అడిగేవారు లేకపోవడంతో ప్రముఖ క్షేత్రాల్లో మద్యం దుకాణాలకు ప్రభుత్వం ఇష్టానుసారం లైసెన్సులను ఇస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లైసెన్సుల్ని రద్దు చేయాలి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ చట్టం సెక్షన్ 2 లోని సబ్ సెక్షన్ 27 ప్రకారం దేవతామూర్తుల కైంకర్యాలకు వినియోగించే తెప్పోత్సవ మండపాలు సైతం గుడిలో భాగమే. అంతేకాదు మతపరమైన ఆరాధనా స్థలాలు, మందిరాలు, పుణ్యక్షేత్రాలు, ఉప పుణ్యక్షేత్రాలు ఇలా అన్నింటి సమూహమే ఆలయమని చట్టం చెబుతోంది. దీని ప్రకారం శ్రీవారి క్షేత్రంలో శివ మండపం, విలాస మండపం, ఆర్చిగేట్లు, దేవతామూర్తుల విగ్రహాలకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదు. అవి క్షేత్రంలో అమలవడం లేదు. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే క్షేత్రాల్లో పవిత్రత దెబ్బతింటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తులే టార్గెట్ మద్యం వ్యాపారులు భక్తులనే లక్ష్యంగా చేసుకుని క్షేత్రాల్లో మద్యం విక్రయాల్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. వివాహాది శుభకార్యాలు జరిగే సమయాల్లో అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ద్వారకాతిరుమలలో మద్యం వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. క్వార్టర్ బాటిల్‌పై ఎమ్మార్పీ ధర కంటే అదనంగా రూ. 10లు వ్యాపారులు వసూలు చేస్తున్నారు. మందుబాబులు మాత్రం మద్యం దొరికితే చాలన్నట్లు కొనుగోలు చేస్తున్నారు. నిత్యం క్షేత్రంలో లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. ప్రముఖ క్షేత్రాల్లో అడ్డుకట్ట వేయాలి ఇప్పటికైనా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు స్పందించి, ప్రముఖ క్షేత్రాల్లో మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేసి, క్షేత్రాల పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. హిందూ మత పరిరక్షకులు క్షేత్రాల్లో మద్యం విక్రయాలను ఎందుకు అడ్డుకోవడం లేదని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. చినవెంకన్నను దర్శించేందుకు క్షేత్రానికి వచ్చి, తాగి పడిపోతున్న భక్తుల వల్ల, యాత్రికుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అంటున్నారు. చిన్న తిరుపతిలో మాడ వీధులు లేకపోవడం వల్ల స్వామివారి వాహనాలు క్షేత్ర పురవీధుల్లో తిరగాల్సి వస్తోంది. దీంతో క్షేత్రంలో ఉన్న మద్యం దుకాణాల మీదుగా శ్రీవారి వాహనాలు తిరుగుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రాష్ట్రంలోని ప్రధాన క్షేత్రాల్లో మద్యం విక్రయాలకు చెక్ పెట్టాలని భక్తులు కోరుతున్నారు. -
శ్రీవారి క్షేత్రంలో పెళ్లి సందడి
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో పెళ్లి సందడి నెలకొంది. పెళ్లి బాజాలు, పురోహితుల వేద మంత్రోచ్ఛరణలతో ఆదివారం రాత్రి శేషాచల కొండలు హోరెత్తాయి. వివాహాలకు అత్యంత బలమైన ముహూర్తాలు కావడంతో రాత్రి 7.21, 9.48 గంటల సమయాల్లో జోరుగా పెళ్లిళ్లు జరిగాయి. దీంతో ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని అనివెట్టి మండపం, అలాగే స్వామి కల్యాణ మండపాలు పూర్తిగా పెళ్లిజనాలతో నిండిపోయాయి. ఆలయ పరిసరాల్లో అడుగుతీసి అడుగేసేందుకు కూడా వీలులేనంతగా పరిస్థితులు నెలకొన్నాయి. క్షేత్రంలో దాదాపు 60కు పైగా వివాహాలు జరినట్లు పురోహితులు చెబుతున్నారు. పెళ్లిబృందాల వాహనాలతో క్షేత్ర రహదారులు కిక్కిరిశాయి. దేవస్థానం, ప్రైవేటు సత్రాలు, కల్యాణ మండపాలు, గదులు పెళ్లివారితో నిండిపోయాయి. వివాహానంతరం నూతన వ«ధూవరులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు చినవెంకన్నను, అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రావణమాసంలో ఆఖరి ముహూర్తాలు కావడంతో పాటు, మరో రెండు నెలల వరకు వివాహాలకు బ్రేక్ పడటంతో జిల్లా వ్యాప్తంగా వందలాదిగా పెళ్లిళ్లు జరిగాయి. -
విర్డ్‌లో ఆధునిక కీళ్ల చికిత్స
ఆధునిక కీళ్ల చికిత్సా విధానం లింబ్ ప్లిజర్‌వేషన్ సిస్టం ద్వారకాతిరుమల శివారు లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రిలోఅందుబాటులోకి వచ్చింది. అమెరికాకే పరిమితమైన ఈ విధానంపై ఆదివారం వైద్యులకు లైవ్ శస్త్రచికిత్స ద్వారా అవగాహన కల్పించారు. పశ్చిమగోదావరి ,ద్వారకాతిరుమల: ఇటలీలో పుట్టిన లింబ్ ప్లిజర్‌వేషన్ సిస్టమ్, ప్రస్తుతం అమెరికా వైద్యుల చేతులో ఉందని, ఆ వైద్యాన్ని తాము విర్డ్ ఆసుపత్రిలో చేస్తున్నట్టు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, తిరుమల తిరుపతి బర్డ్ ఆసుపత్రి ప్రధాన వైద్యులు జగదీష్ తెలిపారు. ద్వారకాతిరుమల శివారు లక్ష్మీపురంలోని విర్డ్ ఆసుపత్రిలో ఆదివారం లైవ్ శస్త్ర చికిత్సలను నిర్వహించారు. ఇందులో మన రాష్ట్రానికి చెందిన వైద్యులే కాకుండా, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వైద్యులు, అసిస్టెంట్ సర్జన్లు 106 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ ఆపరేషన్ చేసే విధానాన్ని ప్రొజెక్టర్ ద్వారా లైవ్‌లో వైద్యులకు వివరించారు. వైద్యులకు కలిగిన సందేహాలను ఆయన నివృత్తి చేశారు. విర్డ్ ఆసుపత్రిలో చేస్తున్న శస్త్రచికిత్సలకు వినియోగిస్తున్న అధునాతన, నాణ్యమైన పరికరాల గురించి ఆయన వైద్యులకు వివరించారు. అనంతరం డాక్టర్ జగదీష్, విర్డ్ ఆసుపత్రి ట్రస్ట్ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, వైస్ చైర్మన్, రాజు వేగేశ్న ఫౌండేషన్ అధినేత ఆనందరాజు, సభ్యులు చెలికాని రాజబాబు, గుప్తా, ఆడిటర్ సాయి, వెంపరాల నారాయణమూర్తి, సుధాకరరావులు గత శిబిరంలో శస్త్రచికిత్సలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి ఉచితంగా కాలిపర్స్‌లను అందజేశారు. డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ లింబ్ ఎముక ఏర్పడేందుకు ప్లిజర్‌వేషన్ సిస్టమ్ చికిత్సను ఏడాదిన్నర పాటు చేయాల్సి ఉంటుందన్నారు. అమెరికాలో మాత్రమే చేస్తున్న ఈ చికిత్సను విర్డ్ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎలాంటి శస్త్రచికిత్స అయినా సరే.. ఆర్థోపెడిక్ విభాగంలో ఎలాంటి శస్త్రచికిత్సనైనా విర్డ్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నట్టు జగదీష్ తెలిపారు. ఆసియా ఖండంలో అతిపెద్ద ఆర్థోపెడిక్ ఆసుపత్రి తిరుమల తిరుపతి బర్డ్ అయితే, అవే తరహా వసతులతో సేవలందిస్తున్న ఆసుపత్రి ఇక్కడి విర్డ్ అన్నారు. కీళ్ల మార్పిడి, వెన్నెముక, మోకాళ్ల శస్త్ర చికిత్సలతోపాటు, పొట్టిగా ఉన్న వారిని పొడవుగా చేసే చికిత్సలు కూడా చేస్తున్నట్టు చెప్పారు. చైర్మన్ సుధాకరరావు మాట్లాడుతూ ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే వంద పడకల ఆసుపత్రిగా విర్డ్ అభివృద్ధి చెందిందన్నారు. ఈ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 15 వేల మంది పోలియో వికలాంగులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి, అందులో అవసరమైన వారికి కాలిపర్స్‌లను అందించామన్నారు. రోజు రోజుకు విర్డ్ సేవలు విస్తరిస్తున్నాయని చైర్మన్ అన్నారు. కార్యక్రమంలో పెనుమత్స నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. -
దేవుళ్లకే శఠగోపం
ద్వారకాతిరుమల : రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా దేవుళ్ల సొమ్ముకే.. శఠగోపం పెడుతోంది. ప్రముఖ ఆలయాల్లో పారిశుధ్య ప్రక్షాళన పేరుతో దోపిడీకి తలుపులు తెరిచింది. టీడీపీ ప్రభుత్వం మూడేళ్లుగా ‘పద్మావతి హాస్పిటాలిటి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్’ అనే సంస్థకు కోట్లాది రూపాయల సొమ్మును ముట్టజెప్పింది. దీనికి కారణం సీఎం చంద్రబాబుకు ఆ సంస్థ కాంట్రాక్టరు భాస్కర్ నాయుడు బంధువు కావడమే. ఈకారణంతో ఇప్పటి వరకు ఆలయాల్లో పనిచేసే కార్మికులకు కనీస సౌకర్యాలు అందకపోయినా, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోయినా అధికారులెవరూ పట్టించుకోలేదు. ఈ నెలాఖరుతో కాంట్రాక్టు కాల పరిమితి ముగియనుంది. అయినా ఆలయ అధికారులు ఇప్పటి వరకు పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ఎటువంటి టెండర్లు పిలువక పోవడం అనుమానాలకు తావిస్తోంది. కాంట్రాక్టు పొడిగించాలని దరఖాస్తు ఈ నేపథ్యంలోనే మరో ఏడాది పాటు కాంట్రాక్టును పొడిగించాలంటూ భాస్కర్‌నాయుడు దేవదాయ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. టెండర్ ప్రక్రియ లేకుండానే కాంట్రాక్టును దక్కించుకునేందుకు బాబు ఆశీస్సులతో ఆయన పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆలయ అధికారుల నుంచి పనితీరు బాగుందనే సర్టిఫికెట్లను సైతం పొంది, పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతంఈ సంస్థ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం, విజయవాడ, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం ఆలయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణ, హౌస్ కీపింగ్ పనులను నిర్వహిస్తోంది. భారీగా చెల్లింపులు మూడేళ్ల క్రితం ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతభత్యాలకు నెలకు సుమారు రూ. 3 లక్షలు, అలాగే శానిటేషన్ సామగ్రి కొనుగోలుకు మరో రూ.4 లక్షలు వెరసి రూ. 7 లక్షలు ఖర్చు చేసేది. ఇప్పుడు అన్ని ఖర్చులు కాంట్రాక్టరు భరించేలా నెలకు దాదాపు రూ.16 లక్షలు పైగా చెల్లిస్తోంది. ప్రస్తుతం ఒక్కో కార్మికుడికి మెటీరియల్ ఖర్చుతో కలిపి దేవస్థానం రోజుకు కాంట్రాక్టరుకు రూ. 517 చెల్లిస్తోంది. గతంలో ఒక్కో కార్మికుని జీతం నెలకు రూ. 5,300 ఇచ్చేవారు. ఇప్పుడు రూ. 5,500, నుంచి రూ. 6,200 వరకు ఇస్తున్నారు. కాంట్రాక్టరుకు చెల్లించే సొమ్ము గతంకంటే భారీగా రెట్టింపు అయినా.. కార్మికుల వేతనాలు మాత్రం పెద్దగా పెరగలేదు. అన్ని ఆలయాల్లోను అదే పరిస్థితి కనిపిస్తోంది. అదే విధంగా పారిశుధ్య ఖర్చు బాగా పెరగడంతో ఆలయాల నిర్వహణ సైతం భారంగా మారింది. ఆందోళనలో కార్మికులు శ్రీవారి దేవస్థానం ఏజెన్సీ వారికి మొదటి ఏడాదిలో నెలకు రూ. 15.47 లక్షలు చెల్లించింది. అయితే ఒప్పందం ప్రకారం ఏటా 5 శాతం చొప్పున ఈ సొమ్మును పెంచుతూ ఇస్తోంది. ఈ సంస్థలో దాదాపు 110 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. పీఎఫ్, ఈఎస్ఐలు మినహాయించగా ఒక్కొక్కరికి నెలకు సుమారు రూ. 5,500 లను కాంట్రాక్టరు అందిస్తున్నారు. కార్మిక చట్టం, అలాగే కాంట్రాక్టరు ఒప్పందం ప్రకారం కార్మికుడితో రోజుకు 8 గంటలు మాత్రమే పని చేయించాలి. అలాగే నెలకు నాలుగు రోజులు సెలవు ఇవ్వాలి. అదే విధంగా ఈఎస్ఐ ద్వారా వైద్య సేవలు అందించాలి. పని గంటలు పెరిగితే కాంట్రాక్టరు వారికి ఓటీ ఇవ్వాలి. అలాగే ప్రతి నెలా కార్మికుని పేరున చెల్లించే పీఎఫ్ సమాచారాన్ని వారికి తెలియజేయాలి. కానీ అవేవీ సక్రమంగా అమలు కావడం లేదు. సిబ్బందితో 12 గంటలు పనిచేయిస్తూ, వారికి ఇవ్వాల్సిన సెలవు దినాల్లో కూడా వారి శ్రమను దోచుకుంటున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన కార్మికులు గతేడాది అక్టోబరు 11న శేషాచలకొండపై ఆందోళనకు దిగారు. అయితే ఎప్పటికప్పుడు కాంట్రాక్టరు అనుయాయులు కార్మికులను బుజ్జగిస్తున్నారు. ఇలాంటి సంస్థకు మళ్లీ కాలపరిమితి ఎలా పొడిగిస్తారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రశ్నించిన ప్రతిపక్షనేత తూర్పుగోదావరి జిల్లాలోని కత్తిపూడిలో ఈనెల 5న జరిగిన ప్రజాసంకల్పయాత్ర బహిరంగ సభలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆలయాల్లో పారిశుధ్యం పేరుతో జరుగుతున్న దోపిడీపై ఆయన మండిపడ్డారు. బంధువుల కోసం దేవుళ్ల సొమ్మును దోచిపెడతారా అని ప్రశ్నించారు. -
అంజన్న సన్నిధిలో..
జంగారెడ్డిగూడెం సమీపంలోనిగుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారిని శ్రీనివాస కల్యాణంచిత్ర బృందం బుధవారం దర్శించుకుంది. ఈ సందర్భంగా క్షేత్రంలో మొక్కనాటి నీరు పోస్తున్న హీరో నితిన్ ద్వారకాతిరుమల: సమాజంలో ప్రతిఒక్కరి జీవితంలో ఉండే భావోద్వేగ క్షణాలే శ్రీనివాస కల్యాణం సినిమా అని.. ఈ సినిమాను చూస్తుంటే మీ ఇంట్లో ఓ పెళ్లి జరుగుతున్న అనుభూతి కలుగుతుందని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్ అన్నారు. ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శ్రీనివాస కల్యాణం చిత్ర యూనిట్ బుధవారం సందర్శించింది. నిర్మాత దిల్ రాజ్, దర్శకుడు సతీష్ వేగేశ్న, హీరో నితిన్, హీరోయిన్లు రాశీ ఖన్నా, నందిత శ్వేత, నటులు రాజేంద్ర ప్రసాద్, అజయ్ స్వామి, అమ్మవార్లను దర్శించ ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజ్ శ్రీవారి విమానగోపుర స్వర్ణమయ పథకానికి రూ.1,26,000ను విరాళంగా ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావుకు అందించారు. కొద్దిసేపు వారు క్షేత్రంలో సందడి చేశారు. భక్తులు వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. విలువలు ఉన్న సినిమా శేషాచలకొండపైన అతిథి గృహంలో నిర్మాత దిల్ రాజ్ విలేకరులతో మాట్లాడుతూ ‘శ్రీనివాస కల్యాణం’ టైటిల్ పెట్టినప్పటి నుంచి తనలో ఏదో వైబ్రేషన్ కలిగిందని చెప్పారు. ఏడుకొండల స్వామి దర్శనం వద్ద ఈ చిత్ర కథ తయారైందన్నారు. మనందరి జీవితాల్లో ప్రధానమైన పుట్టుక, పెళ్లి, చావు వంటి సంఘటనలపై దర్శకుడు సతీష్ వేగేశ్నతో షేర్ చేసుకునే సమయంలో ఈ కథకు జీవం ఏర్పడిందన్నారు. బొమ్మరిల్లు, శతమానంభవతి వంటి చిత్రాలు తర్వాత ఎంతో విలువలు ఉన్న సినిమాగా దీనిని రూపుదిద్దామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు తప్పకుండా కొన్ని విషయాలనైనా ఈ సినిమా నుంచి స్వీకరిస్తారన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు వారి పెళ్లి ఇలా జరిగితే బాగుంటుందన్న ఆశ కలుగుతుందన్నారు. గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను అలరించనుందని చెప్పారు. చిత్ర విడుదలను పురస్కరించుకుని సెంటిమెంట్‌గా చిన వెంకన్నను దర్శించేందుకు ఇక్కడకు వచ్చామన్నారు. మద్దిని దర్శించడం సెంటిమెంట్ జంగారెడ్డిగూడెం రూరల్: సినిమా విడుదలకు ముందు మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకోవడం సెంటిమెంట్ అని, స్వామివారిని దర్శించుకున్న తర్వాత విడుదల చేసిన ప్రతి చిత్రం విజయవంతమయ్యాయని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని బుధవారం శ్రీనివాస కల్యాణం చిత్ర బృందం సందర్శించింది. హీరో నితిన్, హీరోయిన్లు రాశీఖన్నా, నందితా శ్వేత, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేగేశ్న సతీష్, నటులు రాజేంద్రప్రసాద్, అజయ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు వారికి స్వామి చిత్రపటాలను, ప్రసాదాలను అందజేశారు. అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ సుప్రీం, ఫిదా, జవాన్, రాజా ది గ్రేట్ వంటి చిత్రాల విడుదలకు ముందు మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్నట్టు చెప్పారు. దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ తాను పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వాడినన్నారు. చిత్ర పంపిణీదారులు ఎల్వీఆర్, జంగారెడ్డిగూడెం రాజేశ్వరి థియేటర్ యాజమాన్యం నవీన్, రాజాన పండు, ఎస్సై వి.జగదీశ్వరరావు పాల్గొన్నారు. క్షేత్రంలోని ఉపాలయం వేంకటేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో హీరో నితిన్, హీరోయిన్లు రాశీఖన్నా, నందితా శ్వేత, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేగేశ్న సతీష్, నటులు రాజేంద్రప్రసాద్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. -
కాస్త తీయం‘డబ్బా’..!
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల :ఎరక్కపోయి తలపెట్టి ఇరుక్కుపోయిందిఈ గేదె. ద్వారకాతిరుమల తూర్పువీధిలో సోమవారం కనిపించిన ఈ దృశ్యాలుస్థానికులను కాసేపు ఆందోళనకు గురిచేశాయి. కుడితి కోసం డబ్బాలో తలపెట్టినఈ గేదె.. ఇరుక్కుపోయింది. డబ్బా ఎంతసేపటికీ రాకపోవడంతో రోడ్డుపై హల్చల్ చేసింది. దీంతో స్థానికులు హడలెత్తిపోయారు. ఎవరూ డబ్బా తీసేందుకు సాహసించలేదు. ఆఖరికి ఇద్దరు యువకులు చాకచక్యంగాగేదె తల నుంచి డబ్బాను తీశారు. దీంతో బతుకు జీవుడా అంటూ గేదె పరుగులు పెట్టింది. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ద్వారకా తిరుమల గవర్నమెంట్ హాస్టల్లో అరాచకం
-
సెంటిమెంట్ స్వామి
సాక్షి, ద్వారకాతిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. ద్వారకాతిరుమల చినవెంకన్నను దర్శించడం భక్తులకు సెంటిమెంట్‌గా మారింది. చిన్నతిరుపతిగా పేరొంది, పురాణ ప్రాశస్త్యం గల ఈ మహిమాన్విత క్షేత్రం రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలకంటే శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. నిత్యం వేలాది మంది భక్తులతోపాటు, ప్రముఖులు క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. చినవెంకన్నను ఏదైనా కోరుకుంటే అది వెంటనే నెరవేరుతుందన్నది భక్తుల నమ్మకం. స్వామికి ప్రీతికరమైన శనివారం రోజు దాదాపు 25 వేల నుంచి 40 వేల మంది వరకు భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఆదివారం, ఇతర పర్వదినాల్లో సైతం భక్తుల రాక ఇదే విధంగా ఉంటోంది. క్షేత్ర పరిసరాలు ఆహ్లాదభరిత వాతావరణాన్ని కలిగి ఉండటంతో భక్తులు అధిక సమయం ఇక్కడే గడుపుతున్నారు. ఆలయ అభివృద్ధి ఏవిధంగా పరవళ్లు తొక్కుతుందో.. అదే విధంగా ఆదాయం కూడా పెరుగుతోంది. ప్రస్తుతం శ్రీవారి వార్షిక ఆదాయం రూ.100 కోట్లకు చేరింది. పలువురు దాతలు ఆలయ అభివృద్ధికి విరివిగా విరాళాలు అందిస్తున్నారు. ఎంతటి వారైనా.. చెంతకు రావాల్సిందే తరచూ క్షేత్రాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు, న్యా యమూర్తులు, రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, అలాగే విదేశీయులు, సినీ గాయకులు, పీఠాధిపతులు, స్వామీజీలు సందర్శిస్తున్నారు. కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టే అధికారులు ముందుగా శ్రీవారిని దర్శించడం పరిపాటిగా మారింది. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఘన విజయం సాధించాలని దర్శక, నిర్మాతలు, హీరో, హీరోయిన్లు, ఇతర నటులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు. ఇది వారికి ఒక సెంటిమెంట్‌గా మారింది. ఆ వెంకన్న దయవల్లే తన సినిమాలు వరుస విజయాలు సాధిస్తున్నాయని ఇక్కడకు వచ్చిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు చెప్పారు. సంప్రదాయం ఏదైనా.. వేలాది మంది భక్తులు వారివారి సంప్రదాయాలకు అనుగుణంగా క్షేత్ర పరిసరాల్లో వివాహాలు జరుపుకుంటున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకున్న వారు సైతం ముందుగా ఆ చినవెంకన్న దర్శనానికి వచ్చి మొక్కుబడులను చెల్లిం చుకుంటున్నారు. సంప్రదాయం మాటెలా ఉన్నా తమ ఇష్టదైవం చినవెంకన్నను దర్శించడమే ముఖ్యమంటున్నారు భక్తులు. ఆలయంలో పూజలు చేస్తున్న హీరో వరుణ్‌తేజ్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శేఖర్ కమ్ముల -
బాలుడి ఆచూకీ లభ్యం
ద్వారకాతిరుమల : ఇంటి నుంచి తప్పిపోయి ద్వారకాతిరుమలకు చేరిన బాలుడి ఆచూకీ లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులకు ఆ బాలుడిని పోలీసులు సోమవారం అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఒక బాలుడు తప్పిపోయి ఆర్టీసీ బస్సెక్కి ఆదివారం ద్వారకాతిరుమలకు చేరుకుని, అక్కడి నుంచి పోలీసుల సంరక్షణలోకి వెళ్లిన విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి సోమవారం పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారా ఆ బాలుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. బాలుడి పేరు ఏసు అని, చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడని అతడి పిన్ని బత్తుల బుజ్జి పోలీసులకు తెలిపింది. తన సంరక్షణలోనే పెరుగుతున్నాడని చెప్పింది. తమది కర్ణాటక రాష్ట్రంలోని గంగసముద్రమని, బతుకుదెరువు కోసం ఏలూరుకు వచ్చి స్థిరపడినట్టు వివరించింది. దెందులూరు మండలం చల్లచింతలపూడిలోని తమ బంధువుల ఇంటికి వెళ్లిన ఏసు ఆడుకుంటూ బస్సెక్కి ద్వారకాతిరుమలకు వెళ్లిపోయాడని, ఆ విషయం తెలియక తాము కంగారుగా చుట్టుపక్కల వెతికినట్టు తెలిపారు. ఈ సందర్భంగా స్టేషన్ రైటర్ రామకృష్ణ బాలుడు ఏసుని అతడి పిన్ని బుజ్జికి అప్పగించారు. -
ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో..!
ద్వారకాతిరుమల: ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ.. ఆర్టీసీ బస్సు ఎక్కి ఆదివారం సాయంత్రం ద్వారకాతిరుమలకు చేరాడు ఈ బాలుడు. తప్పిపోయి వచ్చాడేమోనన్న అనుమానంతో స్థానికులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో బాలుడిని ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజుకు అప్పగించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం ఏలూరు నుంచి ఒక ఆర్టీసీ బస్సు సాయంత్రం ద్వారకాతిరుమల కొత్త బస్టాండుకు వచ్చింది. బస్సు నుంచి బాలుడు దిగకపోవడంతో కండక్టర్‌కు అనుమానం వచ్చి ప్రశ్నించింది. తన పేరు ఏసు అని అక్షయ్ అని, తనది ఏలూరు పాత బస్టాండు అని, దెందులూరని, విజయవాడ అని, తన తండ్రే బస్సు ఎక్కించాడని బాలుడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో స్థానికులు బాలుడిని పోలీసులకు అప్పగించారు. బాలుడి వివరాలు తెలిసిన వారు 94407 96653, 08829 – 271433 నంబర్లలో సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. -
పోలీసులకు చిక్కిన మాయ లేడి
ద్వారకాతిరుమల : భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే క్షేత్ర పరిసరాల్లోనూ, ఆటోలు, బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల బ్యాగులను ఎంతో చాకచక్యంగా తెరచి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ మాయలేడిని అరెస్ట్ చేసినట్లు ఏలూరు డీఎస్పీ కె.ఈశ్వరరావు తెలిపారు. ఆమె వద్ద నుంచి రూ.5 లక్షల విలువైన 19 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో డీఎస్పీ గురువారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన జలతా లక్ష్మి ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో భక్తుల బంగారు వస్తువులను చోరీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే చేబ్రోలు మండలం కైకరం గ్రామంలో ఆటోలో ప్రయాణిస్తూ ఆమె పలు దొంగతనాలకు పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. వీటికి సంబంధించి ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో మూడు, చేబ్రోలు పోలీస్టేషన్లో ఒక కేసు నమోదైనట్టు తెలిపారు. లక్ష్మిని పాత నేరస్తురాలిగా గుర్తించామని పేర్కొన్నారు. ఆమెను గురువారం ఉదయం స్థానిక కుంకుళ్లమ్మను ఆలయం వద్ద భీమడోలు సీఐ బిఎన్.నాయక్ అరెస్ట్ చేసినట్టు వివరించారు. ఈ కేసులను ఛేదించిన సీఐ నాయక్‌ను, ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే దర్యాప్తుకు సహకరించిన ఐడీ పార్టీ సిబ్బంది హెడ్‌కానిస్టేబుల్ వసంతరావు, నాగేశ్వరరావు, రామచంద్రరావు, మురళీ తదితరులను ఆయన అభినందించారు. వీరికి రివార్డుల కోసం ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలి ఆలయాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్సీ ఈశ్వరరావు అన్నారు. ఆలయ పరిసరాల్లో మరికొన్ని సీసీ కెమేరాల ఏర్పాటుకు ఆలయ అధికారులతో చర్చించామన్నారు. త్వరలో వాటిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే దొంగతనాల నియంత్రణకు సంబంధించి భక్తులకు పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తామని వివరించారు. -
గురుకుల పాఠశాలలో విద్యార్థినుల ఆందోళన
-
శ్రీవారి ఆలయంలో ఇద్దరు వంట స్వాముల సస్పెన్షన్
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయంలో శ్రీవారి కైంకర్యాలకు వినియోగించే నేతి డబ్బాలను మాయం చేసిన ఘటనలో ఇద్దరు వంట స్వాములను సస్పెండ్ చేస్తూ గురువారం ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకొక్కటి 15 కేజీల బరువైన మూడు నేతి డబ్బాలు చోరీకి గురైనట్టు తెలుసుకున్న అధికారులు ఈనెల 5న ఆలయానికి సమీపంలో ఉన్న శేషాచార్యులు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మూడు నేతి డబ్బాలు అక్కడ దర్శనమిచ్చిన విషయం విదితమే. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఇద్దరు వంట స్వాములను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు. -
ఎవరికి అడ్డం వచ్చిందో.. పాపం!
ద్వారకాతిరుమల: ఎవరి బంధాలకు అడ్డొచ్చిందో ఏమో గానీ ఈ బాలికను క్షేత్రానికి తీసుకొచ్చి విడిచిపెట్టి వెళ్లిపోయాడు ఓ ప్రబుద్ధుడు. స్థానిక కల్యాణ మండపంలో అనాథలా దిక్కుతోచని స్థితిలో కూర్చుని ఉన్న ఈ బాలికను ఆలయంలో పనిచేసే స్వీపర్ అయినవల్లి దేవి అక్కున చేర్చుకుంది. బాలిక తెలిపిన వివరాల ప్రకారం. తాడేపల్లిగూడెం సమీపంలోని కుచ్చనపల్లికి చెందిన పదేళ్ల గోలి జ్ఞానేశ్వరిని మంగళవారం ఉదయం ఒక వ్యక్తి ద్వారకాతిరుమల తీసుకొచ్చి స్వామివారి కల్యాణ మండపంలో విడిచిపెట్టాడు. అతడు వెళుతూ నువ్వు ఇకపై ఇక్కడే ఉండాలి.. వెళ్లి బట్టలు తెస్తాను, అప్పుడప్పుడు వచ్చి చూస్తానని చెప్పి వెళ్లిపోయాడు. తన తండ్రి కొన్నాళ్ల క్రితం మృతిచెందాడని, తన తల్లి బుజ్జి తరచూ వేధిస్తోందని బాలిక చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తన పెదనాన్న ఇక్కడకు తీసుకొచ్చి వదిలివెళ్లారని చెప్పింది. తాను కుంచెనపల్లి ఎలిమెంట్రీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నట్టు బాలిక తెలిపింది. తన తల్లి కొట్టే దెబ్బలు భరించలేక పోతున్నానని, ఆమె వద్దకు తనను పంపవద్దని వేడుకుంది. -
ఆలయాల్లో కానరాని న్యూ ఇయర్ సందడి
ద్వారకాతిరుమల: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దేవాదాయశాఖ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రముఖ ఆలయాల్లో నూతన సంవత్సర శోభ కానరావడం లేదు. అయితే ఈ విషయంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉండటంతో కొత్త ఏడాది తొలిరోజు తమ ఇష్ట దైవాలను దర్శించేందుకు భారీగా భక్తులు తరలివస్తే పరిస్థితి ఏమిటన్నది సందిగ్ధంగా మారింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రముఖ ఆలయాల్లో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని విశేష సంఖ్యలో భక్తులు రావడం, అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయడం సాధారణం. ఆలయాన్ని సుందరీకరించడంతో పాటు, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు, షామియాన పందిళ్లు వంటివి ఏర్పాటు చేసేవారు. అయితే ఈ సారి ఆ ఏర్పాట్లేమీ ఏ ఆలయంలోను కానరావడం లేదు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో న్యూ ఇయర్ సందర్భంగా ఏటా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసేవారు. పచ్చని తోరణాలు, అరటి బోదెలు, పుష్పమాలికలతో ఆలయం శోభాయమానంగా కనిపించేది. భక్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు వంటివి ఏర్పాటు చేసేవారు. అయితే అటువంటివేమీ ఏర్పాటు చేయొద్దని, అనవసర ఖర్చులు చేయొద్దంటూ దేవాదాయశాఖ తాజాగా నిర్ణయం తీసుకోవడంతో శ్రీవారి ఆలయంలో న్యూ ఇయర్ సందడి కనుమరుగైంది. ప్రతి ఏడాది ముక్కోటికి చేసే ప్రత్యేక ఏర్పాట్లను ఆ తరువాత వచ్చే న్యూ ఇయర్ తొలిరోజు వరకు దేవస్థానం కొనసాగించేది. ఈ సారి ఉన్నతాధికారుల ఉత్తర్వులకు లోబడి ముక్కోటికి చేసిన ఏర్పాట్లను సైతం తొలగించారు. ఇదిలా ఉంటే జనవరి 1న శ్రీవారిని దర్శించాలన్న ఉద్దేశ్యంతో ఆదివారం సాయంత్రానికే క్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. -
అందరికీ నచ్చినట్టు సినిమా తీయలేం
ద్వారకాతిరుమల: ‘అందరికీ నచ్చిన అమ్మాయిని మనం పెళ్లి చేసుకోలేం.. అలాగే అందరికీ నచ్చినట్టుగా సినిమా తీయలేం.. కథలో దమ్ముంటే ఎలాంటి సినిమా అయినా హిట్ అవుతుంది’ అని సినీ హీరో జేడీ చక్రవర్తి పేర్కొన్నారు. ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో జేడీ శుక్రవారం సందడి చేశారు. ముందుగా ఆయన శ్రీవారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖమండపంలో అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆలయంలో పలువురు భక్తులు జేడీతో ఫొటోలు దిగేందుకు ఆసక్తిచూపారు. అనంతరం జేడీ విలేకర్లతో కాసేపు ముచ్చటించారు. తాను ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించానన్నది ఎప్పుడూ లెక్కించలేదని చెప్పారు. ప్రస్తుతం రామ్‌గోపాల్‌వర్మ నిర్మిస్తున్న ఇంకా పేరు పెట్టని ఒక థ్రిల్లర్ చిత్రానికి దర్శకుడిగా, హీరోగా చేస్తున్నట్టు వివరించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఉగ్రం చిత్రంలో హీరోగా నటిస్తున్నానని, ఈ చిత్రం థ్రిల్లర్‌తోపాటు హ్యూమరస్‌గా ఉంటుందని పేర్కొన్నారు. కన్నడంలో సూపర్ హీరోయిన్ పూజాక్రాంతి నిర్మిస్తున్న రావణి చిత్రంలో ఆమె సరసన హీరోగా నటిస్తున్నానని వివరించారు -
శేషాచలకొండపై ప్రమాదం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శే షాచలకొండపై ట్రా వెల్స్ బస్సు గురువారం వేకువజా ము న అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. డ్రైవర్ లేని సమయంలో క్లీనర్ వాహనాన్ని నడుపుతుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అటుగా ఏ వాహనాలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. రోజుమాదిరిగా హైదరాబాద్ నుంచి ద్వారకాతిరుమలకు వచ్చిన నాని ట్రావెల్స్ బస్సును డ్రైవర్ కొండపైన నిలిపి, క్లీనర్‌కు అప్పగించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత క్లీనర్ బస్సును నడిపే క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. వెనుక టైర్లు పగిలిపోవడంతో వాహనం అక్కడికక్కడే నిలిచిపోయింది. ఈ సమయంలో భక్తులు, వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇది లా ఉంటే ట్యాంకులోని డీజిల్‌ను దొంగిలించేందుకు క్లీనర్ కొండ కిం దికి వెళ్లే క్రమంలో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగిందని బ స్సు యజమాని స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
మళ్లీ పులి కలకలం
ద్వారకా తిరుమల: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలో మళ్లీ పులి కలకలం రేగుతోంది. ద్వారకా తిరుమల గ్రామ శివార్లలో పులి కాలి గుర్తులను స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. యాత్రాస్థలమైనందున నిత్యం వేలాదిమంది భక్తులతో రద్దీగా ఉంటుందని, పులి వల్ల హాని జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందజేశారు. కాగా, రెండు నెలల క్రితం తిరుమనపాలెం గ్రామ అటవీ ప్రాంతంలో ప్రజలు చిరుతను సంగతి విదితమే. పాద ముద్రల ఆధారంగా చిరుత సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. -
వడ్డికాసుల వాడి ఆదాయం రూ.1.60 కోట్లు
దేవరపల్లి (ద్వారకా తిరుమల) : ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. 20 రోజులకు నగదు రూపంలో రూ.1,59,80,346 ఆదాయం సమకూరింది. విదేశీ కరెన్సీ సైతం భారీగా రావడం విశేషం. కానుకల రూపంలో 627 గ్రాముల బంగారం, 7.728 కేజీల వెండిని భక్తులు సమర్పించుకున్నారు. నగదు రూపంలో రోజుకు సగటున 7.99 లక్షల ఆదాయం లభించినట్టు ఈవో వి.త్రినాథరావు చెప్పారు. హుండీల ఆదాయాన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ సోమవారం లెక్కించారు. -
జనసంద్రం
కిక్కిరిసిన ద్వారకాతిరుమల అన్ని దారులు వెంకన్న సన్నిధికే.. చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్ కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటిన ప్రజలు ’రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతోంది. అసమర్థ పాలన నడుస్తోంది. అసత్య పాలన సాగుతోంది. అప్రజాస్వామిక పాలన కొనసాగుతోంది. రాష్టాన్ని చతుర్ముఖ దుష్టపాలన ఏలుతోంది. మేధావులూ ఆలోచించండి. యువకులూ కదలండి. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం...’ అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ద్వారకాతిరుమల చినవెంకన్న సన్నిధిలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు సర్కారు తీరుపై వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. వెల్లువలా తరలివచ్చిన ప్రజలు మీ వెంటే మేమంటూ నినదించారు. సభా ప్రాంగణంలో కొవ్వొత్తులు వెలిగించి.. ప్రత్యేక హోదా ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ద్వారకాతిరుమల జనసంద్రంగా మారింది. జిల్లాలోని అన్ని దారులూ ద్వారకాతిరుమల వైపే మళ్లాయి. తమ అభిమాన నేతను చూసేందుకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. వైఎస్ జగన్మోహనరెడ్డి సభాస్థలికి చేరుకోకముందే సభా ప్రాంగణమంతా నిండిపోగా, వేలాది మంది బయట నిలబడిపోయారు. ఇంత జనసందోహాన్ని తాము ఎప్పుడూ చూడలేదని ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ద్వారకాతిరుమలలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కనిపించిన దృశ్యాలివి. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేయడానికి పూనుకున్న ప్రభుత్వం.. విశాఖలో శాంతియుతంగా నిర్వహించ తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీకి కూడా ప్రతిపక్ష నేతను అనుమతించకుండా విమానాశ్రయంలోనే అడ్డుకున్న తర్వాత జరిగిన సభ కావడంతో ఆ ఆగ్రహం ప్రజల్లో ఏ స్థాయిలో ఉందో ఈ సభకు వచ్చిన జనసందోహాన్ని చూస్తే అర్థమైంది. సభా ప్రాంగణంలో ప్రత్యేక హోదా నినాదం ప్రతిధ్వనించింది. జిల్లా రాజకీయాలను శాసించిన కోటగిరి విద్యాధరరావు తనయుడు శ్రీధర్ పార్టీలో చేరుతుండటంతో లో కొత్త ఊపునిచ్చింది. తొలుత హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్మోహనరెడ్డికి జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆయన తణుకు మండలం తేతలి సెంటర్లో ఆగారు. అక్కడ వైఎస్ జగన్ సమక్షంలో 25 మంది వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉంగుటూరు మండలం నారాయణపురం సెంటర్లో పుప్పాల వాసుబాబు నేతృత్వంలో వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు వైఎస్ జగన్‌కు పెద్దఎత్తున స్వాగతం పలికారు. భీమడోలు రైల్వేగేటు సెంటర్, భీమడోలు సెంటర్ వద్ద కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున రోడ్లపైకి చేరుకుని జగన్‌కు నీరాజనాలు పలికారు. పంగిడి గూడెం సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి, సూర్యచంద్రరావుపేటలో వైఎస్సార్ విగ్రహానికి జగన్ పూలమాల వేసి నివాళుల్పరించారు. తిమ్మాపురంలో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ప్రతిపక్ష నేత ఆవిష్కరించారు. అనంతరం ద్వారకాతిరుమలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ’దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే చంద్రబాబు పాలనలో ఏపీ అవినీతిలో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ విషయాన్ని ఎన్సీఏఈఎన్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇలాంటి అవినీతి పాలన నడుస్తోంది. ఎమ్మార్వోను నడిరోడ్డుపై జుట్టుపట్టుకుని ఈడ్చుకెళితే ఏమీ చేయలేని.. యువతుల హత్యల వెనుక టీడీపీ నేతలున్నా పట్టించుకోని అసమర్థ పాలన నడుస్తోంది.. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని.. ఇంటికో ఉద్యోగం.. నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామని నమ్మించి మోసగించే అసత్య పాలన నడుస్తోంది. ప్రత్యేక హోదా కోసం గాంధేయ పద్ధతిలో కొవ్వొత్తుల ప్రదర్శన చేయడానికి వెళితే అడ్డుకునే అప్రజాస్వామిక పాలన నడుస్తోంది. రాష్టాన్ని చతుర్ముఖ దుష్టపాలన ఏలుతోంది. మేధావులూ ఆలోచించండి. యువకులూ కదలండి. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం...’ అంటూ పిలుపునిచ్చారు. వెల్లువలా తరలివచ్చిన ప్రజలు మీ వెంటే మేమంటూ నినదించారు. సభా ప్రాంగణంలో కొవ్వొత్తులు వెలిగించి.. ప్రత్యేక హోదా ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు. సభానంతరం వైఎస్ జగన్ చిన్నవెంకన్నను దర్శించుకున్నారు. అక్కడ ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం లభించింది. ఏలూరులోనే ఉంటా.. వైఎస్సార్ సీపీలో చేరిన అనంతరం కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ తమ కుటుంబంలో ప్రతి శుభకార్యం ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధిలో జరిగిందని, అందుకే తానే చేరే కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాలని కోరామన్నారు. ఇక్కడికి వచ్చిన వైఎస్ జగన్‌కు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, కోటగిరి విద్యాధరరావు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. 12 ఏళ్లపాటు తన తండ్రితో పని చేశానని, ఏలూరులోనే నివాసం ఉంటానని, అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎంఆర్డీ బలరామ్ చేరిక కోటగిరి శ్రీధర్‌తోపాటు ఏలూరుకు చెందిన ఎంఆర్డీ బలరామ్ కూడావైఎస్సార్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మేకా శేషుబాబు, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు, పార్టీ జిల్లా అద్యక్షుడు ఆళ్ల నాని, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వంకా రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, కొట్టు సత్యనారాయణ, గ్రంధి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, తానేటి వనిత, పాతపాటి సర్రాజు, ఘంటా మురళీ రామకృష్ణ, నియోజకవర్గ సమన్వయకర్తలు తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు, కొఠారు రామచంద్రరావు, కవురు శ్రీనివాస్, దయాల నవీన్‌బాబు, దూలం నాగేశ్వరరావు, గుణ్ణం నాగబాబు, పార్టీ నేతలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, చీర్ల రాధయ్య, కృష్ణ శ్రీనివాస్, బొద్దాని శ్రీనివాస్, ఘంటా ప్రసాదరావు, సుధీర్‌బాబు, గుడిదేశి శ్రీనివాస్, వందనపు సాయిబాలపద్మ, చెలికాని రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో మాత్రం చేరవద్దు అన్నారు
-
నేడు వైఎస్ జగన్ రాక
ద్వారకా తిరుమలలో భారీ సభ ప్రధాన ప్రతిపక్ష నేతను కలవనున్న చింతలపూడి రైతులు, పోలవరం నిర్వాసితులు సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం జిల్లాకు రానున్నారు. ద్వారకా తిరుమలలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడతారు. ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఈ సభ ద్వారా జిల్లాలో హోదా హోరు వినిపించనుంది. మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్, అతని అనుచరులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీలో చేరుతున్న నేపథ్యంలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని నియోజకవర్గ సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను ఇప్పటికే సన్నద్ధం చేశారు. ద్వారకా తిరుమలలో సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆళ్ల నాని పిలుపునిచ్చారు. జిల్లాకు రానున్న జగన్మోహనరెడ్డిని చింతలపూడి ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు, పరిహారం విషయంలో నష్టపోయిన రైతులు కలవడానికి సన్నద్ధం అవుతున్నారు. పోలవరం మూలలంకలో డంపింగ్ యార్డు వివాదంతో రైతులు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. మరోవైపు పోలవరం నిర్వాసితులు సైతం సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం వల్ల మెట్ట ప్రాంత రైతులు భూములు కోల్పోతూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. 365 రోజులు ఏదో ఒక పంట వేసే పరిస్థితి ఉన్న ఈ భూములను కోల్పోతున్న రైతులకు మాత్రం న్యాయం జరగడం లేదు. కనీసం గ్రామసభలు కూడా జరపకుండా భూసేకరణ చేస్తుండటంపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీరంతా జగన్మోహనరెడ్డిని కలిసి తమ గోడు వినిపించడానికి సన్నద్ధం అవుతున్నారు. ఇదిలావుండగా, సభా ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, ఎమ్మెల్సీ పిల్లి సుబాష్‌చంద్రబోస్, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు శనివారం పరిశీలించారు. -
జగన్ సభను జయప్రదం చేయండి
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : ద్వారకాతిరుమలలో ఈ నెల 29న వైఎసార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహించతలపెట్టిన బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పిలుపునిచ్చారు. శుక్రవారం ఏలూరులోని తన నివాసంలో నాని విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఆది నుంచి వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఆయన వైపే ప్రజలూ చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా గళం బలంగా వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో జరగనున్న ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని నాని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సభలో జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు, దివంగత కోటగిరి విద్యాధరరావు కుమారుడు శ్రీధర్‌బాబు జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారని, పార్టీ శ్రేణులు ఆయనకు సాదర స్వాగతం పలకాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జగన్మోహన్రెడ్డి రాజమండ్రి చేరుకుంటారని, అక్కడి నుంచి 3.30 గంటలకు ద్వారకాతిరుమల చేరుకుని స్వామిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్రంలో జరిగిన పరిణామాలను చూసి ఐదు కోట్ల మంది ప్రజలు తీవ్ర మనోవేదనకు గురయ్యారని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం ఏ ఒక్క పార్టీకో చెందింది కాదని, రాష్ట్ర ప్రజలే ఈ ఉద్యమానికి సారథులని, తమ పార్టీ అధినేత వారికి అండగా నిలిచి మద్దతు తెలుపుతున్నారని, వారి గళాన్ని బలంగా వినిపిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాన్ని అణగదొక్కడమే లక్ష్యంగా చంద్రబాబు చేసిన నీచ రాజకీయాలపై ప్రజలందరూ మండిపడుతున్నారని వివరించారు. ఒక ప్రతిపక్ష నాయకుని గంటలపాటు ఎయిర్‌పోర్టులో నిర్భంధించడం అనాగరికమన్నారు. ఎన్ని త్యాగాలకోర్చి అయినా ప్రత్యేక హోదా సాధించి తీరతామన్నారు. టీడీపీ నాయకులు ఇటీవల అవాకులు, చవాకులు పేలడం పరిపాటిగా మారిందని, వారు తమ నోటిని అదుపులో పెట్టుకోవడం ఉత్తమమని నాని హితవు పలికారు. హోదా ఉద్యమంపై కేంద్రమంత్రి సుజనాచౌదరి వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు. ఇటీవల రాష్ట్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కూడా హోదాపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, గత ఎన్నికల సమయంలో తిరుపతి సభలో మోదీ రాష్ట్రానికి పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని ఎలా ప్రకటించారో తెలుసుకోవాలని హితవు పలికారు. కోటగిరి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాలనలో అనుభవం లేదని, కేవలం రాజకీయాలు చేయడంలోనే అనుభవం గడించారని ఎద్దేవా చేశారు. గాలివాటంగా గెలిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలంతా మద్దతుగా ఉన్నారని భ్రమ పడుతున్నారని, ఆ భ్రమలు త్వరలోనే తొలగిపోతాయన్నారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు తెల్లం బాలరాజు, కొఠారు రామచంద్రరావు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, దయాల నవీన్‌బాబు, మధ్యాహ్నపు బలరామ్ పాల్గొన్నారు. -
జగన్ సభను జయప్రదం చేయండి
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : ద్వారకాతిరుమలలో ఈ నెల 29న వైఎసార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహించతలపెట్టిన బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పిలుపునిచ్చారు. శుక్రవారం ఏలూరులోని తన నివాసంలో నాని విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఆది నుంచి వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఆయన వైపే ప్రజలూ చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా గళం బలంగా వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో జరగనున్న ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని నాని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సభలో జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు, దివంగత కోటగిరి విద్యాధరరావు కుమారుడు శ్రీధర్‌బాబు జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారని, పార్టీ శ్రేణులు ఆయనకు సాదర స్వాగతం పలకాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జగన్మోహన్రెడ్డి రాజమండ్రి చేరుకుంటారని, అక్కడి నుంచి 3.30 గంటలకు ద్వారకాతిరుమల చేరుకుని స్వామిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్రంలో జరిగిన పరిణామాలను చూసి ఐదు కోట్ల మంది ప్రజలు తీవ్ర మనోవేదనకు గురయ్యారని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం ఏ ఒక్క పార్టీకో చెందింది కాదని, రాష్ట్ర ప్రజలే ఈ ఉద్యమానికి సారథులని, తమ పార్టీ అధినేత వారికి అండగా నిలిచి మద్దతు తెలుపుతున్నారని, వారి గళాన్ని బలంగా వినిపిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాన్ని అణగదొక్కడమే లక్ష్యంగా చంద్రబాబు చేసిన నీచ రాజకీయాలపై ప్రజలందరూ మండిపడుతున్నారని వివరించారు. ఒక ప్రతిపక్ష నాయకుని గంటలపాటు ఎయిర్‌పోర్టులో నిర్భంధించడం అనాగరికమన్నారు. ఎన్ని త్యాగాలకోర్చి అయినా ప్రత్యేక హోదా సాధించి తీరతామన్నారు. టీడీపీ నాయకులు ఇటీవల అవాకులు, చవాకులు పేలడం పరిపాటిగా మారిందని, వారు తమ నోటిని అదుపులో పెట్టుకోవడం ఉత్తమమని నాని హితవు పలికారు. హోదా ఉద్యమంపై కేంద్రమంత్రి సుజనాచౌదరి వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు. ఇటీవల రాష్ట్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కూడా హోదాపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, గత ఎన్నికల సమయంలో తిరుపతి సభలో మోదీ రాష్ట్రానికి పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని ఎలా ప్రకటించారో తెలుసుకోవాలని హితవు పలికారు. కోటగిరి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాలనలో అనుభవం లేదని, కేవలం రాజకీయాలు చేయడంలోనే అనుభవం గడించారని ఎద్దేవా చేశారు. గాలివాటంగా గెలిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలంతా మద్దతుగా ఉన్నారని భ్రమ పడుతున్నారని, ఆ భ్రమలు త్వరలోనే తొలగిపోతాయన్నారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు తెల్లం బాలరాజు, కొఠారు రామచంద్రరావు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, దయాల నవీన్‌బాబు, మధ్యాహ్నపు బలరామ్ పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక కీర్తనలతో దురాలోచనలు దూరం
అన్నమాచార్య భావనావాహిని వ్యవస్థాపకురాలు శోభారాజ్ ద్వారకాతిరుమల : ఆధ్యాత్మిక కీర్తనలు వినడం వల్ల దురాలోచనలు దరిచేరవని అన్నమాచార్య భావనావాహిని(ఏబీవీ) వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ డాక్టర్ శోభారాజ్ అన్నారు. శ్రీవారి క్షేత్రంలో జరుగుతున్న అన్నమయ్య వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ఆమె భక్తులనుద్దేశించి మాట్లాడారు. తాను స్థాపించిన అన్నమాచార్య భావనావాహిని ముఖ్య ఉద్దేశం మానవుడిని దైవారాధన వైపు మళ్లించమేనని పేర్కొన్నారు. ఏబీవీ ద్వారా ఎంతో మందికి కీర్తనలతో పాటు యోగా, ధ్యానం, నేచ్యురోపతి, తత్వశాస్త్రం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చినట్టు వివరించారు. అనంతరం ఆమె ఆలయంలోని అన్నమాచార్యుని విగ్రహానికి ఆలయ చైర్మన్ ఎస్వీ.సుధాకరరావు, దాత పి.పి.రాజుతో కలసి పూలమాలలు వేశారు. అనంతరం కీర్తనలను ఆలపించారు. ఇవి భక్తులను పరవశింపజేశాయి. ఆకట్టుకున్న ’శృతి’ కీర్తనలు శ్రీనివాస కల్యాణాన్ని వివరిస్తూ న్యూస్ రీడర్, యాంకర్ శృతికీర్తి ఆలపించిన కీర్తనలు ఆద్యంతం భక్తులను ఆకట్టుకున్నాయి. అన్నమాచార్య వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆమె శ్రీవారి క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీహరి కళాతోరణ వేదికపై శ్రీనివాస కల్యాణాన్ని కీర్తనల రూపంలో ఆలపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, డాక్టర్ శోభారాజ్, పి.పి.రాజు తదితరులు పాల్గొన్నారు. -
కారులోంచి వెయ్యినోట్లు విసురుకుంటూ...
ద్వారకా తిరుమలలో గుర్తుతెలియని వ్యక్తి వింతచర్య తీసుకొనేందుకు పరుగులు పెట్టిన జనం ద్వారకాతిరుమల: పెద్దనోట్లను రద్దుచేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చి పోయే యాత్రికుల సందడి నడుమ కారులో వెళుతున్న ఓ వ్యక్తి వెయ్యి రూపాయల నోట్లను రోడ్డుపైకి విసిరేశాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో చోటుచేసుకుంది. ఆ సమయంలో అటుగా వెళుతున్న కొందరు వాటిని తీసుకోవడానికి పరుగులు తీశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలోని ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఒక మెకానిక్ షెడ్డు ప్రాంతంలో ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపు వెళుతున్న ఒక కారులోంచి గుర్తు తెలియని వ్యక్తి దాదాపు రూ.లక్షకు పైగా విలువైన వెయ్యి రూపాయల నోట్లను రోడ్డుపైకి విసిరేసి ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న కొందరు వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. వాటిని దక్కించుకున్న వారిలో కొందరు అవి నిజమైన నోట్లా.. కాదా అనే సందేహంతో పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీశారు. అక్కడ అవి చెల్లడంతో నిజమైన నోట్లేనని నిర్ధారించుకున్నారు. -
ద్వారకాతిరుమల ఘాట్‌రోడ్డులో ఆటో బోల్తా
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శేషాచలకొండపైన ఘాట్ రోడ్డులో భక్తులు ప్రయాణిస్తున్న ఆటో శనివారం బోల్తా కొట్టింది. డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా, ఇద్దరు భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రావులపాలెం సమీపంలోని కొత్తపేట మండలం పలివెలకు చెందిన ఓ భక్తుని కుటుంబం చిన వెంకన్నను దర్శించేందుకు ఆటోలో ద్వా రకాతిరుమల వచ్చారు. స్వామి దర్శనానంతరం అదే ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఘాట్ రోడ్డు దిగుతుండగా టోల్‌గేటు వద్దకు వచ్చేసరికి ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. సమీపం లో ఉన్న భక్తులను ఆటోను లేపి ముగ్గురు భక్తులు, ఆటో డ్రైవర్‌ను బయటకు తీశారు. డ్రైవర్ తీవ్రంగా గాయపడగా ఇద్దరు భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మరో భక్తుడికి ఏమీ కాలేదు. క్షతగాత్రులను దేవస్థానం సెక్యురిటీ సిబ్బంది స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. -
ఉరివేసుకుని రైతు ఆత్మహత్య
ద్వారకాతిరుమల: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం చెలికానివానిపోతేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆకుల సత్యనారాయణ(34) అనే రైతు గ్రామంలో పామాయిల్ తోటలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఉరేసుకున్న తీరు చూస్తే ఆత్మహత్య కాస్త అనుమానంగా ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
వరుడైన శ్రీనివాసుడు
ద్వారకాతిరువుల : సర్వాభరణ భూషితుడైన శ్రీవారు నుదుటున కల్యాణతిలకం, బుగ్గనచుక్కతో పెండ్లి కువూరునిగా శోబిల్లారు. అలాగే పద్మావతి, ఆండాళ్ అవ్మువార్లు పెండ్లికువూర్తెలుగ ముస్తాబయ్యారు. శ్రీవారిని, అవ్మువార్లను పెండ్లికువూరుడు, పెండ్లికువూర్తెను చేÄýæుు వేడుకను చూసిన భక్తజనులు పరవశించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరువులలో శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు మంగళవారం నేత్రపర్వంగా ప్రారంభ వుయ్యాయి. తొలిరోజున స్వామివారు, అవ్మువార్లు పెండ్లి కువూరునిగాను, పెండ్లికువూర్తెలుగాను అలంకార భూషితులయ్యారు. ఆలయ పండితులు, అర్చకులు ఈ తంతును అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. మేళతాళాలు, వుంగళ వాయిద్యాలు, వేద వుంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నావుస్మరణల నడువు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. తొలుత ఆలయ ప్రదక్షిణ వుండపంలో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటుచేసి సుగంధభరిత పుష్పవూలికలు, వూమిడితోరణలు, అరటి బోదెలుతో నయనానందకరంగా అలంకరించారు. అలాగే ఆలయ పరిసరాలను విశేష అలంకారాలతో తీర్చిదిద్దారు. వేదికపై ఏర్పాటుచేసిన రజిత సింహాసనంపై శ్రీవారు, అవ్మువార్ల ఉత్సవ వుూర్తులను వేంచేపుచేసి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం విశేష పూజాధికాలు జరిపారు. ఎంతో అట్టహాసంగా నిర్వహించిన ఈవేడుకను అధిక సంఖ్యలో భక్తులు వీక్షించి తరించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాధరావు దంపతులు, రాష్ట్ర దేవాదాయశాఖ ట్రిబ్యునల్ ఛైర్మన్ పీవీ.రమణరాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. . రాజాదిరాజ వాహనంపై ఊరేగిన శ్రీవారు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మెుదటిరోజున జరిగే రాజాదిరాజ వాహన సేవకు ఎంతో ప్రావుుఖ్యత ఉంది. ఈ వాహనంలో కొలువైన గరుత్మంతుడు స్వామి, అమ్మవార్లను మోస్తున్నట్లు ఉన్న అలంకరణ భక్తులకు నేత్రపర్వమైంది. శ్రీవారి వైభవాన్ని చాటే ఈ వాహనసేవను మంగళవారం రాత్రి క్షేత్రపురవీదుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గజసేవనడుమ అట్టహాసంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా పువీదులకు పయనమైన స్వామివారిని అడుగడుగునా భక్తులు దర్శించి, నీరాజనాలను సమర్పించారు. శ్రీ హరికళాతోరణంలో జరపిని సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆధ్యంతం ఆకట్టుకున్నాయి. ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
భక్తలోకానికి బ్రహ్మోత్సవం
ద్వారకాతిరుమల వేడుకలకు సిద్ధం ద్వారకా తిరుమల : భక్తలోకానికి మంగళవారం పర్వదినం. దివ్యమంగళ స్వరూపుడు, ద్వారకాతిరుమలలో వేంచేసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలకు సిద్ధమయ్యాడు. ఈ ఉత్సవాలు మంగళవారం నుంచి ఈనెల 18వరకూ అంగరంగవైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుద్దీపాలతో ఆలయం శోభాయమానంగా దర్శనమిస్తోంది. ఆలయ గోపురాలు విద్యుత్‌కాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవ సమయంలో ప్రతిరోజూ రాత్రి, పగటి వేళల్లో శ్రీవారికి తిరువీధుల్లో జరుగనున్న వివిధ వాహన సేవలు జరగనన్నాయి. దీనికోసం వాహనాలను సిబ్బంది ముస్తాబు చేస్తున్నారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణంలో సాంస్కతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. దీనికోసం వేదికను సుందరీకరించారు. మంగళవారం శ్రీవారు, అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెలుగా ముస్తాబు చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. స్వామివారు రోజుకో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు భజనలు ఉదయం 10 గంటల నుంచి శ్రీవారిని పెళ్లికొడుకుగానూ, అమ్మవార్లను పెళ్లికుమార్తెలుగానూ చేస్తారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు అన్నమాచార్య సంకీర్తనలు ఆలాపన. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సంగీత కచేరి సాయంత్రం 6 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శన రాత్రి 7 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శన , అన్నమాచార్య కీర్తనల ఆలాపన రాత్రి 7 గంటల నుంచి గజవాహనంపై శ్రీవారి తిరువీధిసేవ. -
నిత్య అన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న నిత్యాన్నదాన ట్రస్టుకు ఒక భక్తుడు సోమవారం రూ.1,00,116 లను విరాళంగా అందించాడు. తాడేపల్లిగూడెంకు చెందిన వడ్డి రఘురామ్, సుధ దంపతులు శ్రీవారిని, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యాలయంలో ఈ విరాళాన్ని జమ చేశారు. దాతలకు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు బాండ్‌ను అందజేశారు. -
ఖాతాదారుణ్ణి నమ్మించి డబ్బు అపహరణ
ద్వారకాతిరుమల : స్థానిక ఆంధ్రాబ్యాంకు బ్రాంచిలో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ ఖాతాదారుడిని ఇద్దరు ఘరానా మోసగాళ్లు మాటలతో నమ్మించి మోసం చేశారు. శుక్రవారం జరిగిన ఈ తతంగమంతా బ్యాంకు సీసీ కెమేరాలో రికార్డయింది. బాధితుడి కథనం ప్రకారం.. ద్వారకాతిరుమలకు చెందిన మారగాని హరిబాబు స్థానిక ఒక బ్రాందీ షాపులో సర్వర్. అతను శుక్రవారం మధ్యాహ్నం రూ. 23 వేలను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వచ్చాడు. ఎలా డిపాజిట్ చేయాలో తెలీక బ్యాంకు బయట వేచి ఉండగా, ఇద్దరు అక్కడకు వద్దకు వచ్చారు. దీంతో హరిబాబు తన వద్ద ఉన్న రూ. 23 వేలను వారికి ఇచ్చి బ్యాంకులో ఫారాలు పూర్తిచేసి, డిపాజిట్ చేయాలని కోరాడు. దీంతో వారిలో ఒక వ్యక్తి తాను బ్యాంకు ఉద్యోగినేనని చెప్పి బాధితుడిని నమ్మించాడు. ఫారాలు పూర్తిచేసి.. పాస్ బుక్ జిరాక్సు తీయించుకురావాలని హరిబాబును బయటకు పంపాడు. ఈ తర్వాత బ్యాంకు మేనేజర్ శేషగిరిరావు వద్దకు వెళ్లి తాను రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తానని మాటల్లోపెట్టి టేబుల్‌పై ఉన్న బ్యాంకు రబ్బరు స్టాంపును దొంగిలించాడు. ఆ తరువాత ఖాతాదారునికి ఇవ్వాల్సిన రసీదులపై స్టాంపుతో ముద్రలు వేసి సంతకం చేశాడు. ఇంతలో అక్కడకు వచ్చిన హరిబాబుకు ఆ రసీదులను ఇచ్చి, పని అయిపోయిందని చెప్పాడు. దీనిని నమ్మిన బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ వెంటనే ఆ మోసగాళ్లు అక్కడి నుంచి జారుకున్నారు. కొద్దిసేపటి తరువాత హరిబాబు మళ్లీ బ్యాంకుకు వచ్చి, పాస్‌బుక్‌లో పోస్టింగ్ వేయించుకున్నాడు. సొమ్ములు జమ కాలేదని సిబ్బంది చెప్పడంతో హరిబాబు లబోదిబోమంటూ బ్యాంకు మేనేజర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బ్యాంక్ మేనేజర్ శేషగిరిరావు సీసీ కెమేరాలను పరిశీలించగా, మోసం వ్యవహారమంతా అందులో రికార్డయింది. -
గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.50 లక్షల విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీవారి గోసంరక్షణ ట్రస్ట్‌కు ఓ భక్తుడు సోమవారం రూ. 1,50,000ను విరాళంగా అందజేశారు. తాళ్లపూడి మండలం పోచవరానికి చెందిన మన్యాల చిన్నగంగరాజు, మంగాయమ్మ విరాళం మొత్తాన్ని ఆలయ కార్యాలయంలో గోసంరక్షణ పథకానికి జమచేశారు. దాతను ఈవో వేండ్ర త్రినాథరావు అభినందించి విరాళం బాండ్ అందించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వైకుంఠరావు ఉన్నారు. -
నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమ శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విజయవాడకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు బుధవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. ముందుగా శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన సదనంలో ఈవో వేండ్ర త్రినాథరావుకు విరాళం మొత్తాన్ని అందజేశారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. 4.75 లక్షలు విరాళం
ద్వారకాతిరుమల : శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఇద్దరు భక్తులు సోమవారం వేరువేరుగా రూ. 4.75 లక్షలను విరాళంగా అందజేశారు. ఇందులో భాగంగా భీమవరంకు చెందిన దాసరి వెంకటేశ్వరరావు తన అన్న, వదినలు శ్రీరామ్మూర్తి, నాగమణిల పేరున రూ. 3,75,000 లను అన్నదాన ట్రస్టులో జమచేశారు. అలాగే విజయవాడకు చెందిన దుద్దుకూరి వెంకట శాంతకుమార్ తన తల్లిదండ్రులు, కుమారుడి పేరున రూ. 1,00,002 లను విరాళంగా అందజేశారు. దాతలు ముందుగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత ఈ విరాళాలను అన్నదాన ట్రస్టులో జమచేయగా దాతలకు ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు, ఏఈవో కర్రా శ్రీనివాసరావులు బాండ్ పత్రాలను అందజేసి, అభినందించారు.