శేషాచలకొండపై ప్రమాదం | ACCIDENT ON SESHACHALA HILL | Sakshi
Sakshi News home page

శేషాచలకొండపై ప్రమాదం

Published Fri, Sep 22 2017 2:14 AM | Last Updated on Mon, Sep 25 2017 6:46 AM

ACCIDENT ON SESHACHALA HILL

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శే షాచలకొండపై ట్రా వెల్స్‌ బస్సు గురువారం వేకువజా ము న అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. డ్రైవర్‌ లేని సమయంలో క్లీనర్‌ వాహనాన్ని నడుపుతుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అటుగా ఏ వాహనాలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. రోజుమాదిరిగా హైదరాబాద్‌ నుంచి ద్వారకాతిరుమలకు వచ్చిన నాని ట్రావెల్స్‌ బస్సును డ్రైవర్‌ కొండపైన నిలిపి, క్లీనర్‌కు అప్పగించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత క్లీనర్‌ బస్సును నడిపే క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. వెనుక టైర్లు పగిలిపోవడంతో వాహనం అక్కడికక్కడే నిలిచిపోయింది. ఈ సమయంలో భక్తులు, వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇది లా ఉంటే ట్యాంకులోని డీజిల్‌ను దొంగిలించేందుకు క్లీనర్‌ కొండ కిం దికి వెళ్లే క్రమంలో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగిందని బ స్సు యజమాని స్థానిక పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement