పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం గోపాలపురం సమీపంలో మంగళవారం ఉదయం ఓ మినీ వ్యాను బోల్తా పడింది.
ద్వారకాతిరుమల: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం గోపాలపురం సమీపంలో మంగళవారం ఉదయం ఓ మినీ వ్యాను బోల్తా పడింది. ఘటనలో 18 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో 16 మందిని భీమడోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరంతా చిత్తూరు నుంచి రాజమండ్రి గోదావరి పుష్కరాలకు వెళు తున్నారు. గోపాలపురం సమీపంలో మినీ వ్యాను డ్రైవర్ ఆర్టీసీ బస్సును అధిగమించే ప్రయత్నం చేయగా అదుపుతప్పి బస్సు బోల్తా కొట్టింది.