van roll
-
మరో పెళ్లి వ్యాను బోల్తా..15 మందికి గాయాలు
కందుకూరు: రంగారెడ్డి జిల్లాలో మరో పెళ్లి వ్యాను బోల్తా పడింది. బుధవారం ఉదయం జిల్లాలోని పరిగి సమీపంలో పెళ్లి వాహనం ప్రమాదానికి గురై నలుగురు మృతి చెందగా, 20 మందికి గాయాలైన విషయం తెలిసిందే. తాజా ఈ రోజు మద్యాహ్నం మరో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న డీసీఎం బోల్తా కొట్టిన ఘటనలో సుమారు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కందుకూరు మండలం గుమ్మడవెల్లి సమీపంలో చోటుచేసుకుంది. కొలనుగూడ గ్రామానికి చెందిన 30 మంది డీసీఎంలో మహశ్వరంలో జరుగుతున్న పెళ్లికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
మినీ వ్యాను బోల్తా : 18 మందికి గాయాలు
ద్వారకాతిరుమల: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం గోపాలపురం సమీపంలో మంగళవారం ఉదయం ఓ మినీ వ్యాను బోల్తా పడింది. ఘటనలో 18 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో 16 మందిని భీమడోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరంతా చిత్తూరు నుంచి రాజమండ్రి గోదావరి పుష్కరాలకు వెళు తున్నారు. గోపాలపురం సమీపంలో మినీ వ్యాను డ్రైవర్ ఆర్టీసీ బస్సును అధిగమించే ప్రయత్నం చేయగా అదుపుతప్పి బస్సు బోల్తా కొట్టింది. -
వ్యాన్ బోల్తా..ఒకరి మృతి
కర్నూలు : కర్నూలు జిల్లా వెల్దుర్తి జాతీయ రహదారిపై పెట్రోల్ బంకు వద్ద వ్యాన్ బోల్తా పడింది. వ్యాన్ వెనక, ముందు టైర్లు ఒకేసారి పంక్చర్ కావడం వల్లే బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ క్లీనర్ ఉపేంద్ర(40) అక్కడిక్కడే మరణించాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉపేంద్ర స్వగ్రామం నల్గొండ జిల్లా తిరుమలగిరి. క్షతగాత్రులను హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (వెల్దుర్తి) -
వ్యాను బోల్తా : 15 మందికి గాయాలు
తిర్యాణి: ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యాను బోల్తాపడిన ఘటనలో 9 మంది విద్యార్థులు సహా 15 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని తిర్యాణి మండలం, సంగిడి మాదర ఆశ్రమ పాఠశాలకు వెళ్లేందుకు 9 మంది విద్యార్థులు కేరేగూడ గ్రామంలో బొలేరో వ్యాను ఎక్కారు. ఈ వ్యాన్ కేరేగూడ గ్రామం నుంచి కందుల బస్తాలతో అసిఫాబాద్కు బయల్దేరగా... విద్యార్థులు ఆ బస్తాలపైకి ఎక్కి కూర్చున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ వ్యాను రాఘవాపూర్ గ్రామం సమీపంలోని ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 9 విద్యార్థులతో సహా డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి. ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రలను తిర్యాణిలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.