మరో పెళ్లి వ్యాను బోల్తా..15 మందికి గాయాలు | 15 injured in van roll at rangareddy district | Sakshi
Sakshi News home page

మరో పెళ్లి వ్యాను బోల్తా..15 మందికి గాయాలు

Published Wed, Mar 30 2016 1:05 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

15 injured in van roll at rangareddy district

కందుకూరు: రంగారెడ్డి జిల్లాలో మరో పెళ్లి వ్యాను బోల్తా పడింది. బుధవారం ఉదయం జిల్లాలోని పరిగి సమీపంలో పెళ్లి వాహనం ప్రమాదానికి గురై నలుగురు మృతి చెందగా, 20 మందికి గాయాలైన విషయం తెలిసిందే. తాజా ఈ రోజు మద్యాహ్నం మరో పెళ్లి  బృందం ప్రయాణిస్తున్న డీసీఎం బోల్తా కొట్టిన ఘటనలో సుమారు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కందుకూరు మండలం గుమ్మడవెల్లి సమీపంలో చోటుచేసుకుంది. కొలనుగూడ గ్రామానికి చెందిన 30 మంది డీసీఎంలో మహశ్వరంలో జరుగుతున్న పెళ్లికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement