kandukur
-
చంద్రబాబుకు చిన్నారి షాక్
సాక్షి, నెల్లూరు జిల్లా: కందుకూరు సభలో చంద్రబాబుకు చిన్నారి షాక్ ఇచ్చింది. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సభలో దీప్తి అనే విద్యార్థిని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇవాళ కందుకూరు సీఎం వస్తున్నారు కాబట్టే చెత్త ఎత్తేశారంటూ దీప్తి వ్యాఖ్యానించింది. రోజూ ఇలాగే కందుకూరులో వీధులు శుభ్రం చేయాలని విద్యార్థిని దీప్తి కోరింది.సిబ్బంది, అధికారులు పనితీరు ఎలా ఉందో దీప్తి మాటలు బట్టి అర్థమవుతోంది. చిన్నారి మాటలు సభికులను నిర్ఘాంత పోయేలా చేశాయి. ప్రభుత్వ పనితీరును తన ముందే ఆ చిన్నారి బయటపెట్టడంతో షాక్‌కు గురైన చంద్రబాబు.. ఆమె మాట్లాడినంత సేపు మౌనంగా ఉండిపోయారు. అంతలోనే తేరుకుని.. టాపిక్‌ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. -
జగన్ ఓ నమ్మకం.. కందుకూరు సభకు పోటెత్తిన జనం (ఫొటోలు)
-
చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ: సీఎం జగన్
సాక్షి, నెల్లూరు జిల్లా: మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ముందుకొస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. కందుకూరు కేఎంసీ సర్కిల్లో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ ఎన్నికల్లో చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ. మనది ఇంటింటికీ మంచి చేసి అభివృద్ధి చేసిన పార్టీ. చంద్రబాబు పార్టీలతో జతకడితే మీ బిడ్డ అందరికీ మంచిచేసి ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నాడు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.‘‘తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి అన్నట్టుగా.. ఎన్నికలు వస్తుంటే మన రాష్ట్రానికి పొత్తుల నాయకులు వస్తున్నారు. చంద్రబాబు కానీ, దత్తపుత్రుడు కానీ, వదినమ్మ కానీ, ఈనాడు రామోజీరావు కానీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ, టీవీ5 నాయుడు కానీ ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారా?. ఎన్నికలు వచ్చాయి కాబట్టే చంద్రబాబు కూటమి ఆంధ్రరాష్ట్రానికి వచ్చారు. ఓడిన వెంటనే మళ్లీ హైదరాబాద్‌కి వెళ్లిపోతారు. చంద్రబాబు కూటమి అంటే నాన్ లోకల్ కిట్టీపార్టీ. నయా ఈస్టిండియా కంపెనీ చంద్రబాబు కూటమిలో ఏ ఒక్కరికీ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేసిన చరిత్రే లేదు’’ అని సీఎం జగన్ ధ్వజమెత్తారు.‘‘ప్రతి పేద ఇంటికి మనం చేసిన మంచి ఇది అని గర్వంగా చెప్పుకుంటున్నాం. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా, సైనికులుగా నిలవండి అని కోరుతున్నాను. సెల్‌ఫోన్ నేనే కనిపెట్టా అంటూ బాబులా నేను బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు ప్రజల ముందు పెట్టి మార్కులు వేయమని అడుగుతున్నా. మీరు అధికారం ఇవ్వడం వల్లే ప్రతి పల్లె, పట్టణంలో కనీసం 6 వ్యవస్థలు ఏర్పాటు చేసాం. సచివాలయాలు, వాలంటీర్లు, నాడునేడుతో మారిన బడి, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్, మహిళా పోలీస్, డిజిటల్ లైబ్రరీ, ఫైబర్ గ్రిడ్ ప్రతి ఊరిలో కనిపిస్తాయి. ఇక మీదట కూడా ఈ పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండండి.’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు.‘‘ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్, ఇంటి ముంగిటికే వచ్చే రేషన్... మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఈ సంప్రదాయం. పేదలకు మనం ఇస్తున్న ఈ మర్యాద కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డకు తోడుగా ఉండండి. చంద్రబాబు మార్కు రాజ్యం.. దోపిడీ సామ్రాజ్యం, గ్రామగ్రామాన లంచాలు, వివక్షలతో జన్మభూమి కమిటీలు. లంచాలు, వివక్ష లేకుండా, కులం, మతం, ప్రాంతం, వర్గం, ఎవరికి ఓటేసారు అనేది కూడా చూడకుండా అర్హులందరికీ ఇచ్చిన ఈ పథకాలన్నీ వచ్చే ఐదేళ్లు కూడా కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డకు తోడుగా ఉండండి. 130 బటన్లు నొక్కి రూ.2,70,000 కోట్లు డీబీటీగా అక్కచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా అందించాం’’ అని సీఎం జగన్ చెప్పారు ‘‘మళ్లీ వచ్చే ఐదేళ్లూ ఇది కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కండి అని కోరుతున్నాను. ప్రతి పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదన్నా.. మీ గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే అందిస్తున్న ఆరోగ్య సురక్ష సేవలు... విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా అందాలంటే మీ బిడ్డను ఆశీర్వదించండి’’ అని సీఎం జగన్ కోరారు. -
ఎల్లో మీడియాపై కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఫైర్
-
మర్రిగూడ తహసీల్దార్ ఇంట్లో రూ.2 కోట్ల నగదు
హస్తినాపురం/మర్రిగూడ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని అందిన సమాచారం మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు నల్లగొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డి ఇంటిపై దాడులు చేశారు. హస్తినాపురం షిరిడీ సాయినగర్ కాలనీలో ఉన్న ఆయన ఇంట్లో శనివారం ఉదయం 9 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఏసీబీ డీఎస్పీ మజీద్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మహేందర్‌రెడ్డి ఇంటితోపాటు బంధువుల ఇళ్లు, మర్రిగూడ మండల రెవెన్యూ కార్యాలయంలో కూడా సోదాలు చేశారు. కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ ఇంట్లోని ఒక ఇనుప పెట్టెలో రెండు కోట్ల ఏడు లక్షల నగదు, కిలో బంగారు నగలు, విలువైన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు పట్టుబడ్డాయి. మొత్తం వీటి విలువ రూ.నాలుగున్నర కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మహేందర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంప్నం మండలం వెలిమినేడుకు చెందిన మంచిరెడ్డి అంజిరెడ్డి కుమారుడు. అంజిరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో కారుణ్య నియామకం కింద మహేందర్‌రెడ్డి మహేశ్వరం మండల రెవెన్యూ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాడు. అనంతరం కందుకూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో డీటీవోగా పనిచేశాడు. తర్వాత ప్రమోషన్‌పై మహేశ్వరం తహసీల్దారుగా బదిలీపై వెళ్లారు. కందుకూరు తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న సమయంలో మహేందర్‌రెడ్డి ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివాదాల్లో అక్రమంగా డబ్బులు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. 45 రోజుల క్రితం మర్రిగూడ తహశీల్దారుగా బదిలీపై వెళ్లారు. చదవండి: ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గను: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు -
యువతిని ఆదుకున్న ‘దిశ’
కందుకూరు: దిశ యాప్ ఆపదలో ఉన్న మహిళల పట్ల ఆపద్బాంధవునిగా మారింది. సోమవారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా కందుకూరు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దూబగుంట గ్రామం వద్ద ఓ యువతి అనుమానాస్పదంగా తిరుగుతుందని బ్రహ్మయ్య అనే యువకుడు దిశ యాప్‌కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే రూరల్ పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి ఆ యువతిని ప్రశ్నించారు. తాను మదనపల్లి నుంచి విజయవాడ వెళ్తూ కందుకూరులో బస్సు దిగానని, ఎటువెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపింది. పోలీసులు.. ఆమెను ఒంగోలులోని సఖి సెంటర్‌కు తరలించి మదనపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
కందుకూరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు
సాక్షి, అమరావతి: గత నెల 28న నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రోడ్ షోలో ఎనిమిదిమంది మృతిచెందిన ఘటనపై జాతీయ మానవహక్కుల సంఘం (నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ – ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసింది. జనాలు ఎక్కువమంది వచ్చారని చూపించుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగా ఇరుకైన వీధుల్లో రోడ్‌షో ఏర్పాటు చేసి తొక్కిసలాటకు తావిచ్చారని, దీంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడకు చెందిన వైద్యుడు అంబటి నాగరాధాకృష్ణ యాదవ్ ఎన్హెచ్ఆర్సీకి గత నెల 29న ఫిర్యాదు చేశారు. ఇరుకైన వీధుల్లో జనాలు పోగైతే డ్రోన్ షాట్స్ బాగా వస్తాయని, వీటిని పార్టీ పబ్లిసిటీ కోసం వినియోగించుకోవచ్చని నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా రోడ్ షోకు ప్రణాళిక రచించారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ కోసం చేసిన చర్యల ఫలితంగా తొక్కిసలాట జరిగి 29 మంది మృతిచెందారని ఫిర్యాదుదారుడు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కందుకూరు ఘటనపై నిష్పక్షపాతంగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తన ఫిర్యాదుపై ఈ నెల 10వ తేదీన కమిషన్ కేసు నమోదు చేసిందని రాధాకృష్ణ ‘సాక్షి’ తో చెప్పారు. -
కందుకూరులో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన కొమ్మినేని
-
కందుకూరు తొక్కిసలాట ఘటన.. ఇంటూరి నాగేశ్వరరావు అరెస్ట్
సాక్షి, నెల్లూరు జిల్లా: చంద్రబాబు కందుకూరు సభ తొక్కిసలాట ఘటనలో కందుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. 8 మంది మృతికి కారణమైన నాగేశ్వరరావు, రాజేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 304 పార్ట్ 2 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కందుకూరులో ఇరుకు సందులో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండానే చంద్రబాబు సభ పెట్టడంతో తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అసలే 30 అడుగుల ఇరుకు రోడ్లు. దాన్లో కూడా అటూ ఇటూ ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి... 20 అడుగులకు కుదించేశారు. ఆ ఇరుకు రోడ్లో ఐదారు వేల మంది వచ్చినా... పై నుంచి డ్రోన్లతో షూటింగ్ చేస్తే చాలా భారీగా జనం తరలివచ్చినట్లు కనిపిస్తుంది. ఆ ఫొటోలను పత్రికల్లో, టీవీల్లో విస్తృతంగా ప్రచారం చేయటం ద్వారా ప్రతి సభకూ, రోడ్ షోకూ జనం పోటెత్తుతున్నారని చెప్పటం చంద్రబాబు నాయుడి ఉద్దేశం. చంద్రబాబు రోడ్ షోలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ఈ ఫార్ములా.. కందుకూరులో ఎనిమిది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చదవండి: Fact Check: ప్రాణాలు పోతున్నా ఆగని టీడీపీ ప్రచార యావ.. ఫేక్ వీడియోలతో.. -
పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా ఫైర్
-
పవన్ నోరు ఇప్పటం లేదు
-
డ్రోన్ కింద ప్రాణాలు..బాబు పిచ్చికి అమాయక జనం బలి
-
ఫొటో షూట్, డ్రామాలే చంద్రబాబు నైజం: సీఎం జగన్
సాక్షి, తూర్పు గోదావరి: కోర్టులో ఓ జడ్జిగారి ముందుకు వచ్చి.. ‘అయ్యా.. తల్లిదండ్రులు లేని వాడ్ని నన్ను శిక్షించకండి’ అని బోరున ఒకాయన ఏడ్చాడట. ఆ ఏడ్పు చూసి జడ్జిగారు చలించి పోయి, జాలిపడి.. ప్రాసిక్యూటర్‌ను అడిగాడట. ‘ఇంతకీ ఈ మనిషి చేసి తప్పేంటని?’ అడిగారా జడ్జి. ‘‘నిజమే సార్.. ఈ మనిషికి తల్లిదండ్రులు లేరు సార్. కారణం, ఆ తల్లిదండ్రులను చంపేసిన వ్యక్తే ఈ వ్యక్తి సార్’’ అని జడ్జికి బదులు ఇచ్చాడు ఆ ప్రాసిక్యూటర్. చంద్రబాబును చూస్తే ఇలాగే అనిపిస్తోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను అడ్డుపెట్టుకుని శవరాజకీయాలు చేసే నైజం ప్రతిపక్ష నేత చంద్రబాబుదని సీఎం జగన్ విమర్శించారు. రాజమండ్రి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీదారుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన టీడీపీ అధినేతపై విమర్శలు సంధించారు. ‘‘ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచింది ఈయనే. ఎన్నికలప్పుడు ఫొటోకి దండ వేసి మహానుభావుడంటూ ఓట్లు అడిగేది ఈయనే. చంపేది ఈయనే.. మళ్లీ మొసలి కన్నీరు కారుస్తాడని’ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఈ పెద్ద మనిషికి తెలిసింది వెన్నుపోటు పొడవడం, ఫొటోషూట్, డ్రామాలు చేయడం, మొసలి కన్నీరు కార్చడం.. ఇవి మాత్రమే తెలుసన్నారాయన. ఇదే ఫొటో షూట్ కోసం, డ్రోన్ షాట్ల కోసం ఇదే రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో ముఖ్యమంత్రిగా ఉండి 29 మందిని బలి తీసుకున్నాడు. నిలదీస్తే.. కుంభమేళాలో చనిపోలేదా? అంటూ మాట్లాడతాడు. కందుకూరు సభలో జనం తక్కువ వస్తే.. ఎక్కువ వచ్చారని చూపించేందుకు రోడ్డు మీద ఒక సందులో జనాలను నెట్టి ర్యాలీ నిర్వహించాడు. అక్కడ ఎనిమిది మందిని బలిగొన్నాడు. వెంటనే మౌనం పాటించాలంటాడు.. ఆస్పత్రికి వెళ్తాడు.. మళ్లీ షూటింగ్ కోసం వస్తాడు. చనిపోయిన వాళ్లకు చెక్కు పంపిణీలంటాడు. తాను వచ్చేదాకా చీరలు కూడా పంచొద్దంటూ. చంపేసి మానవతావాదిలా చంద్రబాబు డ్రామాలు ఆడతాడు. ఇవేకాదు.. కొత్త సంవత్సరం రోజున మరో ముగ్గురిని బలి తీసుకున్నాడు. ఇదంతా మనం చూస్తున్నాం. ఇదంతా గమనించాలి కూడా. ఇంత డ్రామాలను ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి రాయవు. దత్తపుత్రుడు ఏనాడూ నిలదీయడు. తానే పేదలను చంపేసి.. టీడీపీ కోసం ప్రాణత్యాగం చేశాడంటాడు చంద్రబాబు అని సీఎం జగన్ నిలదీశారు. అలాంటి పెద్ద మనిషిని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ఎల్లో మీడియా, దత్తపుత్రుడు ప్రయత్నిస్తున్నాయని సీఎం జగన్ తెలిపారు. అలాంటివేం తనకు లేకున్నా.. తనకు ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. మీ బిడ్డ నమ్ముకుంది అన్ని వర్గాలను, పేదలను. జాగ్రత్తగా ఆలోచన చేయండి.. పొరపాటు చేస్తే నాశనాన్ని కొని తెచ్చుకున్నట్లేనని తెలిపారు. దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని, ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారాయన. -
బాబు సభలకు బలి పశువులు!
సాక్షి, అమరావతి: తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవమని తరచూ చెప్పుకునే చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వేసిన ఎత్తుగడలు ప్రజల పాలిట శాపాలుగా మారాయి. ఆయన తీరు కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నా ఏమాత్రం పట్టనట్లు చేతులు దులుపుకొని వెళ్లిపోతుండడం సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. చంద్రబాబు సభలకు స్పందన లేదనే విషయం అర్థమవడంతో ఇరుకు ప్రాంతాలను ఎంపిక చేసుకుని ప్రజలు వచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని, అందువల్లే రెండుసార్లు తొక్కిసలాటలు జరిగాయని ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. కందుకూరు, గుంటూరు సభలే ఇందుకు నిదర్శనం. విశాలమైన రోడ్లు లేవా? టార్గెట్లు నిర్దేశించి తన సభకు ప్రజలను తేవాలని చంద్రబాబు ఆదేశిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఎంత ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోకపోవడంతో ఏదో ఒక ఆశ చూపి తరలిస్తున్నారు. ఇందుకోసం ఇరుకు సందులు, చిన్న రోడ్లను ఎంచుకుంటున్నారు. కందుకూరు సభను అనుమతి తీసుకున్న విశాలమైన రోడ్డులో కాకుండా పక్కనే ఉన్న ఇరుకు సందులోకి చంద్రబాబు మార్చారు. అక్కడ తొక్కిసలాట జరిగి 8 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. విశాలమైన రోడ్డు పక్కనే ఉండగా దాన్ని కాదని ఇరుకు రోడ్డులో సభ నిర్వహించడంలోనే చంద్రబాబు ఉద్దేశం స్పష్టంగా కనబడుతుతోందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. నిజంగా చంద్రబాబు చెబుతున్నట్లు జన ప్రభంజనమే ఉంటే విశాలమైన రోడ్లలో సభ ఎందుకు నిర్వహించడం లేదనే ప్రశ్నకు టీడీపీ ముఖ్య నేతల నుంచి సమాధానం లేదు. గుణపాఠం నేర్చుకోలేదు కందుకూరు సభలో జరిగిన ఘోరం నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మళ్లీ అదే తప్పులను చంద్రబాబు పునరావృతం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. గుంటూరులో తాజాగా చంద్రన్న కానుకల పంపిణీ సభకోసం 10–15 రోజుల నుంచే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిజంగా ప్రజాదరణ ఉంటే ఇంటింటికీ తిరిగి కానుకలు ఇస్తామని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుందా? జనం రారని గ్రహించే టోకెన్లు ఇచ్చిమరీ ప్రజలను, పేదలను మభ్యపెట్టారు. మొహం చెల్లకే.. గుంటూరు ఘటనపై చంద్రబాబు నోరు మెదపకపోవడాన్ని బట్టి ఆయనకు మొహం చెల్లడంలేదని అర్థమవుతోందనే వాదన వినిపిస్తోంది. ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకొన్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నానని, అక్కడ తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని పేర్కొంటూ అది టీడీపీ సభ కాదని అడ్డంగా అబద్ధం ఆడేశారు. అదే నిజమైతే సభకు అనుమతుల నుంచి నిర్వహణ దాకా పూర్తిగా టీడీపీ నేతలే దగ్గరుండి పర్యవేక్షించడం నిజం కాదా? -
ఇలా చెప్పడం ఆత్మవంచన కాదా చంద్రబాబు?
కందుకూరు విషాద ఘటన తర్వాత కూడా ప్రతిపక్ష తెలుగుదేశం విపరీత ధోరణిలో ఏ మాత్రం మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, తదితర మీడియా సంస్థలు కందుకూరులో టీడీపీ అదినేత చంద్రబాబు రోడ్ షో లో ఎనిమిది మంది మరణిస్తే దాని ప్రభావాన్ని తగ్గించి ప్రచారం చేయడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఇదే వైసీపీ వారి సభలో ఏదైనా చిన్న ఘటన జరిగినా చిలవలు,పలవలుగా రాసేవి. ఇలాంటివి ఏ సభలోను జరగకూడదు. ఇక్కడ జరిగింది మానవ తప్పిదమా? ప్రచార యావతో జరిగిన తప్పిదమా? లేక ఇంకేదైనా కారణమా ? అన్న విషయాలపై విశ్లేషణకు వెళ్లకుండా టీడీపీ మీడియా జాగ్రత్తపడుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దీనికి ఎలా కవరింగ్ ఇస్తున్నారో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.ఇలాంటి ఘటనలను కూడా దిక్కుమాలిన రాజకీయాలకు వాడుకుంటారా అన్న బాద కలుగుతుంది. బాధితులు తొక్కిసలాటకు గురై మరణిస్తే వారు రాష్ట్రం కోసం త్యాగం చేశారని అన్నారట. ఆయన ఉద్యమం రాష్ట్రం కోసం చేస్తున్నారట. ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం కాదన్నమాట. చనిపోయినవారు రాష్ట్రం కోసం సమిదలుగా మారారని ఆయన చెబుతున్నారు. ఇంత ఘోరంగా మాట్టాడవచ్చని చంద్రబాబు పదే, పదే రుజువు చేస్తున్నారు. కందుకూరులో డ్రోన్‌తో షూటింగ్ జరపడం కోసం, జనం బాగా వచ్చారని రాష్ట్ర ప్రజలను నమ్మించేందుకు గాను చిన్న బజారులో సభ పెట్టి, తొక్కిసలాటకు కారణమై, పలువురు మురికి గోతిలో పడిపోతే రాష్ట్రం కోసం చనిపోయినట్లా?మరి అలాగైతే గోదావరి పుష్కరాలలో తన సినిమా యావకోసం 29 మంది చనిపోతే వారు ఎందుకు మరణించారు?అప్పుడు ఆయన ఏమని చెప్పారో గుర్తుందా?కుంభ మేళాలలో మరణించడం లేదా? రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా అని ప్రశ్నించి అవమానించారు. మరి ఇప్పుడేమో రాష్ట్రం కోసం చనిపోయారని అంటున్నారు. నిజానికి ఈ ఘటన జరిగిన తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నిటిని వాయిదా వేసుకుని కందుకూరు బాధితులను పరామర్శించిన తర్వాత విజయవాడకో, హైదరాబాద్ కో వెళ్లిపోయి ఉంటే బాగుండేది. కాని అలాకాకుండా తన టూర్ షెడ్యూల్‌ను మాత్రం వాయిదా వేసుకోకుండా ఇదేం కర్మ రాష్ట్రానికి అంటూ యాత్ర కోసం పర్యటించడం పద్దతిగా కనిపించదు. ఘటన జరిగిన తర్వాత బాదితులను పరామర్శించి వస్తానని, అంతవరకు జనం రోడ్డు మీదే ఉండాలని ఆయన కోరారంటే ఆయన యావ ఎలాంటిదో ఊహించుకోవచ్చు. అయినా ఆయన ఇష్టం. రాజకీయమే ఊపిరిగా జీవించే ఆయనకు ఇలాంటివి చిన్నవిగానే ఉండవచ్చు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో ప్రభుత్వం కోటి రూపాయలు సాయం ప్రకటిస్తే అదేమి సరిపోతుంది అని ప్రశ్నించి రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన ఇప్పుడు పది లక్షలతో సరిపెట్టుకున్నారు. మరో పాతిక లక్షలు పార్టీ ఇతర నేతలు ఇస్తారట. అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు. టీడీపీ ఆర్దికంగా పటిష్టంగా ఉన్న పార్టీనే. అరవై లక్షల మంది సభ్యులు ఉన్నారని చెబుతారు. విరాళాలు కూడా కోట్లలోనే వస్తుంటాయి. అయినా పది లక్షలకే పరిమితం అయ్యారు. ఎదుటివాడికి చెప్పడం కాకుండా మరికొంత అదనంగా పార్టీ తరపున సాయం చేసి ఉండాల్సింది. చంద్రబాబు సభకు వెళితే మంచి కూలీ వస్తుందనుకున్నవారు ఈ తొక్కిసలాటలో మరణించారని వార్తలు వచ్చాయి. కూలి కోసం వచ్చినవారు రాష్ట్రం కోసం త్యాగం చేశారని చంద్రబాబు చెప్పడం ఆత్మవంచనే అవుతుంది.ఇక పోలీసులు భద్రత ఎక్కువగా ఉండాల్సిందని ఆయన చెబుతున్నారు.ఎక్కువ మందిని పెడితే ఒక ఆరోపణ. ఇలాంటివి జరిగితే మరో ఆరోపణ. అసలు ప్రజలంతా అంత ఎగబడి వస్తుంటే ఏదైనా పెద్ద మైదానంలో సభ పెట్టుకుని సవాల్ విసిరి ఉండవచ్చు కదా! దాని గురించి మాట్లాడారు. గతంలో ఎన్.టిఆర్ సర్కిల్ లో సభలు జరిగాయని అంటున్నారు. జరిగి ఉండవచ్చు.కాని ఏభై మీటర్ల దూరం వెళ్లి సభ ఎందుకు పెట్టినట్లు? పర్మిషన్ తీసుకున్నదెక్కడ? మీటింగ్ జరిగిందెక్కడ?వాటన్నిటిని పోలీసులు వివరిస్తున్నారు కదా? అయినా ఇక్కడా డబాయింపేనన్నమాట. తెలుగుదేశం, చంద్రబాబు చేసిన తప్పులను పోలీసులపై తోసి వేయడానికి ఈనాడు పత్రిక ముందుగానే వ్యూహం రచించింది. ముఖ్యమంత్రి సభకు వందల సంఖ్యలో పోలీసులు వస్తున్నారని, చంద్రబాబు సభకు అలా రావడం లేదని పేర్కొంది.ఇది ఎంత దారుణంగా ఉంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది పోలీసులు ఉండేవారు?ఆనాటి ప్రతిపక్ష నేత జగన్‌కు భద్రతగా ఎందరు ఉండేవారు? ఆ సంగతి తెలియదా? మరో సంగతి ఏమిటంటే మన తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబుకు ఉన్నంత మంది భద్రతా సిబ్బంది మరే నేతకు లేరు. కేంద్ర బలగాలు సైతం ఆయన వెన్నంటి ఉంటాయి. అయినా వారెవ్వరూ చాలలేదట. రోడ్ షో లో ఎవరినైనా పోలీసులు ఆపితే ఇదే ఈనాడు, టీడీపీ మీడియా ఎంతగా గగ్గోలు పెట్టేవి. సీఎం సభ నిమిత్తం రోడ్డుపై బారికేడ్లు పెట్టారని వీరే కదా విమర్శించింది. ఇలా ఎక్కడ ఏ అవకాశం వస్తే, ఆ విదంగా అడ్డగోలుగా కథనాలు రాయడం, వాటిని టీడీపీవారు ప్రచారం చేయడం మామూలు అయింది . మామూలుగా అయితే రెండు, మూడు రోజుల పాటు ఈ ఘటనపై పుంఖానుపుంఖాలుగా వార్తలు రాసే ఈనాడు, ఈ ఘటనకు వచ్చేసరికి పందా మార్చేసింది. చంద్రబాబు వారిని ఆదుకుంటానన్నారన్న విషయాలకే ప్రాదాన్యత ఇచ్చి ఇక్కడ కూడా సానుభూతి సంపాదించాలన్న నీచమైన ఆలోచన చేసినట్లు అనిపిస్తుంది. లేకుంటే రోడ్డు అంతా కొలతలు వేసి, ఎక్కడ సభ జరగాలి? ఎక్కడ జరిగింది?రోడ్డు పై ఏమి అడ్డం ఉన్నాయి.. డ్రోన్ ఎవరు పెట్టారు? ఎవరు సలహా ఇచ్చారు? ఇలా నానా పరిశోధనలతో వార్తలు ముంచెత్తే ఈనాడు తెలుగుదేశం విషయంలో మాత్రం పూర్తిగా నోరుమూసుకుని ఉండడం వారి ప్రమాణాల పతనానికి అద్దం పడుతుంది. కావలిలో జరిగిన సభలో చంద్రబాబు పోలీసులను మళ్లీ ఎలా బెదిరిస్తున్నారో చూడండి. మా పై కేసులు పెడతారా? పెట్టండి. అక్రమ కేసులు పెట్టిన ఏ అధికారిని వదలం. చట్టం ప్రకారం శిక్షిస్తాం. కావలిలో ఇరవై కేసులు పెట్టారు. మేము వచ్చాక 200 కాదు.. రెండువేల కేసులు పెడతాం అని ఆయన అంటున్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నోటి నుంచి వచ్చే మాటలు ఇలాగే ఉంటాయా? చంద్రబాబును ఎన్నుకుంటే వేల కేసులు పెడతామని ఆయన పోలీసులను కాదు హెచ్చరిస్తున్నది. ప్రజలందరిని అని అర్ధం చేసుకోవడం కష్టం కాదు. కేసులు కావాలంటే ఆయనను ఎన్నుకోవాలన్నమాట!ఇది కొత్త నినాదమే. దీని ఆధారంగానే తెలుగుదేశం ఎన్నికలకు వెళుతుందా! -
CM YS Jagan: పచ్చ ప్రకోపానికి ఇదే సరైన మందు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజు, రోజుకు తన ప్రసంగాలలో పదును తేలుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రతిరోజూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షూటింగ్ గ్యాప్‌లో ఆదివారం రోజు చేసే చేసే విమర్శలకు ఆయన వారానికి ఒక్కసారి తన కార్యక్రమంలో తిప్పికొడుతున్న తీరు ప్రభావవంతంగా ఉంటోందని చెప్పాలి. చంద్రబాబు.. రోజూ చేసే దూషణలన్నిటినీ జగన్ ఒక్క గంటలో ఘాటుగా జవాబిస్తున్నారు. అందులో చమత్కారం, ఎద్దేవ కలగలిసి ఉండి సభికులను ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి. కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. అయినా చంద్రబాబు తన పద్దతి మార్చుకోలేదు. సభలను ఆపకపోగా, ఇతర పట్టణాలలో కూడా అవే ఇరుకు రోడ్లలో సభలు పెడుతున్నారు. పైగా చచ్చిపోయినవారిలో బిసిలు ఎక్కువగా ఉన్నారంటూ, కనుక తన సభకు బిసిలు ఎక్కువమంది వస్తున్నారని లెక్కలేసుకునే దారుణ స్థితికి చంద్రబాబు రాజకీయం చేరింది. వచ్చినవారిలో పలువురు కూలీకి వచ్చామని ఓపెన్‌గానే చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సభకు బస్‌లలో తరలించారని, ఉపాధి హామీ కూలీలను తీసుకు వచ్చారని ప్రచారం చేసే తెలుగుదేశం పత్రిక ఈనాడు, మరి చంద్రబాబు సభకు ఎలా తీసుకు వచ్చింది ఎందుకు రాయడం లేదు? యధా ప్రకారం ఇరుకు రోడ్ల పోటోలను చూపి భారీగా తరలి వచ్చారని ఎందుకు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు సభలను గమనించినా, ఈనాడు, తదితర టిడిపి మీడియాలను గమనించినా కందుకూరులో ఎలాంటి ఘటన జరగలేదేమో, అంతా సజావుగానే ఉందేమో అన్న భ్రమ కలుగుతుంది. ఎందుకంటే టిడిపి సభలో ఎనిమిది మంది మరణించిన ఘటనను అంతా మర్చిపోవాలని వారి అభిలాష అన్నమాట. ఈ నేపథ్యంలో జగన్ నర్సీపట్నం సభను పరిశీలించండి. సభకు వచ్చిన జనాన్ని చూడండి. సభా ప్రాంగణం చాలక బయట కూడా కిక్కిరిసిపోయిన జనం కనిపిస్తారు. అయినా ఈనాడు మాత్రం వచ్చినవారు అలా వచ్చారు? ఇలా వెళ్లారు.. పులిహోరా వదలివేశారు.. అంటూ పులిహోర వార్తలు వేస్తోంది. చంద్రబాబు సభను రోడ్డు మధ్యలో పెడితే ప్రజలకు ఎవరికి అసౌకర్యం కలగలేదన్నమాట. ట్రాఫిక్ ఎక్కడా ఆగలేదన్నమాట. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సభలకే కాదు.. అమరావతిలో పిచ్చి మొక్కలు చూపించడానికి, పోలవరంలో అసంపూర్తి కట్టడాలు చూపించడానికి, జయము జయము చంద్రన్న అని పాడించడానికి జనాన్ని తరలించినప్పుడు ఈనాడు వారి కన్నులకు పండగగాను, చెవులకు శ్రావ్యంగానూ ఉన్నాయన్నమాట. ఈ పత్రిక దిగజారుడుతనం గురించి రోజూ చెప్పుకున్నా చాలడం లేదు. మరో వైపు జగన్ ప్రసంగానికి వస్తున్న స్పందన చూడండి. ఆయన విసిరిన వ్యంగ్యోక్తులు పేలుతున్నాయి. రాజకీయం అంటే డ్రోన్ షాట్లు, డైలాగులు చెప్పడం కాదు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం, నిరుపేదల కష్టాన్ని తీర్చి వారికి అండగా ఉండడం అని ఆయన తేల్చి చెప్పారు. కందుకూరులో చంద్రబాబు తన డ్రోన్ షాట్ల కోసం అంతమందిని బలితీసుకున్నారని ఆయన చెబుతూనే రాజకీయం ఎందుకోసమో వివరించారు. చంద్రబాబు సభలపై ఆయన వ్యాఖ్యానిస్తూ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని తిప్పికొట్టారు. గతంలో గోదావరి పుష్కరాలలో 29 మంది మరణించిన ఘట్టాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అసలు చంద్రబాబు సభలకు ఎందుకు జనం వస్తారు అంటూ పలు ప్రశ్నలు సంధించారు. లక్ష కోట్ల రుణాలను మాఫీ చేస్తానని ఎగ్గొట్టినందుకా? డ్వాక్రా మహిళలను మోసం చేసినందుకా? బిసిలను, ఎస్సిలను అవమానించినందుకా అంటూ అంటూ జగన్ పలు ప్రశ్నలు సంధించిన తీరు సున్నితంగా కనిపించినా, చంద్రబాబు నషాళానికి అంటే ఘాటు వంటిదే అని చెప్పాలి. కాకపోతే చంద్రబాబు వీటిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు కనుక ఆయనకు ఆ బాధ ఉండదు. అందుకే జగన్ విమర్శలకు ఆయన జవాబు ఇవ్వకుండా తన దూషణలను మాత్రం కొనసాగిస్తుంటారు. జగన్ చెప్పిన మాటలలో కొన్నిటికైనా చంద్రబాబు రిప్లై ఇచ్చే పరిస్థితి లేకపోవడం తెలుగుదేశం దయనీయ పరిస్థితికి దర్పణం అని చెప్పాలి. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ -
ఎనిమిది మంది ప్రాణాలు పోయినా.. చంద్రబాబు మారలా
సాక్షి, నెల్లూరు/కోవూరు: అసలే ఇరుకు సందులు.. వాటిలో పదడుగుల ఫ్లెక్సీలు.. గట్టిగా వెయ్యిమంది వస్తే రోడ్డు కిక్కిరిసినట్టు కనిపించేలా డ్రోన్‌షూట్.. చివరికి ఎనిమిదిమంది నిండు ప్రాణాలు కోల్పోవడం.. ఇదీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటనల సారాంశం. మూడురోజుల పర్యటనలో టీడీపీ నేతలు ఒకే ఫార్ములా అనుసరించారు. ఫలితంగా బుధవారం కందుకూరులో ఎనిమిదిమంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. అయినా మార్పురాలేదు. కందుకూరు ఘటనతోనైనా చంద్రబాబు సభలు విశాలమైన ప్రదేశాల్లో పెట్టకుంటారేమోనని అందరూ ఊహించారు. కానీ ఎక్కడా ప్రచారయావ తగ్గించుకునేది లేదన్నట్లుగా చంద్రబాబు వ్యవహారశైలి సాగింది. కావలిలో: కావలిలో గురువారం పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద కూడా ఇరుకురోడ్లను ఎంచుకుని ఇదే ఫార్ములాతో సభ నిర్వహించారు. అక్కడ కూడా రెండు వైపులా 30 అడుగుల రోడ్లు, డ్రైనేజీ కాలువ, పదడుగుల మేర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచార వాహనాన్ని సెంటర్లో ఉంచి ప్రసంగించారు. కోవూరులో: ఇరుకురోడ్ల ఫార్ములాను అమలు చేస్తున్న చంద్రబాబు అండ్ టీం శుక్రవారం కోవూరులో కూడా అదే తరహా పబ్లిసిటీ కోసం బజార్‌సెంటర్ లాంటి చిన్న జంక్షన్లో సభ నిర్వహించింది. కూడలి అయినప్పటికీ నాలుగు వైపులా రోడ్డు ఇరుగ్గా ఉంటుంది. వందమంది గుమిగూడితే ఇరుకైపోతుంది. అలాంటి ప్రదేశాన్ని టీడీపీ నేతలు ఎంచుకోవడం చూస్తే వారి పబ్లిసిటీ యావ ఎంతదూరం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. సభకు వస్తే ఒక్కొక్కరికి రూ.200 ఇస్తామంటూ నేతలు జనసమీకరణ చేపట్టినా.. కోవూరు బైపాస్ రోడ్డు సాయిబాబా మందిర కూడలి నుంచి బజారు సెంటరు దాకా చంద్రబాబు నిర్వహించిన రోడ్డుషోలో జనం పలుచగానే కనిపించారు. చదవండి: (జనాలు ఛీ కొడుతున్నా చంద్రబాబుకు పట్టింపుల్లేవు.. ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్) -
జనాలు ఛీ కొడుతున్నా చంద్రబాబుకు పట్టింపుల్లేవు.. ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
సాక్షి, అమరావతి: విషాదకర ఘటన నుంచి కూడా లబ్ధి పొందాలనే నీచ మనస్తత్వం ఉన్న రాజకీయ నేత ఒక్క చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. మరణంలోనూ కుల ప్రస్తావన చంద్రబాబుకే చెల్లిందని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. చంద్రబాబుకు ఫొటో షూట్, డ్రోన్ షాట్ పిచ్చి కారణంగానే కందుకూరులో 8 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. జనం బాగా రాకపోయినా, బాగా వచ్చారని చూపించడం కోసం, ఒక చిన్న ఇరుకు రోడ్డులోకి జనాన్ని నెట్టారని, బాబు తన వాహనాన్ని అటుగా తీసుకెళ్లి 8 మందిని చంపేశారన్నారు. ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా? ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అని చంద్రబాబుని ప్రజలు ఛీ కొడుతున్నా.. ఆయనకు పట్టింపులేదన్నారు. కందుకూరులో బాబు కారణంగా ఇంతమంది చనిపోయినా ఆయనలో పశ్చాత్తాపం లేదని, ముఖంలో ప్రాయశ్చిత్తం కనిపించడంలేదన్నారు. ఈ విషాదం నుంచి కూడా రాజకీయ ప్రయోజనం పొందడానికి శవాలపై పేలాలేరుకునే విధంగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆ మరుసటి రోజే నిస్సిగ్గుగా కావలిలో సభ పెట్టారని, చనిపోయినవారి కులాల ప్రస్థావన చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు మాటలకు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని పేర్కొన్నారు. చదవండి: (బాగా చదువుకోమని యువతకు నేనే చెప్పా) -
కందుకూరు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందజేత
సాక్షి, నెల్లూరు: కందుకూరు చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాట దుర్ఘనటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరపున సాయం అందజేశారు మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి. శుక్రవారం కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో.. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్‌లను కాకాణి ఆ కుటుంబాలకు అందజేశారు. కందుకూరు ఘటన దురదృష్టకరమన్న మంత్రి కాకాణి.. ఘటనపై దర్యాప్తు వీలైనంత త్వరగతిన పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దురదృష్టవశాత్తూ జరిగిన ఘటన ఇదని, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నట్లు ప్రకటించారు. -
చంద్రబాబుపై కేఏ పాల్ ఫిర్యాదు
-
చంద్రబాబుపై కేఏ పాల్ ఫిర్యాదు.. దాడికి ప్రయత్నించిన టీడీపీ యువకులు
సాక్షి, కందుకూరు: రోడ్డు షోలో 8 మంది మృతికి కారణమైన చంద్రబాబుపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. పట్టణంలోని పామూరు బస్టాండ్ సెంటర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన ఘటన స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ డబ్బులు, మందు, బిర్యానీ పంచి ప్రజలను తీసుకొచ్చి రెండు వేల మంది పట్టే స్థలంలో సభ పెట్టి 8 మందిని బలితీసుకున్న చంద్రబాబుపై కేసు ఎందుకు నమోదు చేయరని ప్రశ్నించారు. వెంటనే 304 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు దీనికి బాధ్యత వహించి టీడీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన హయాంలో రాష్ట్రం ఏం అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసన్నారు. కేఏ పాల్‌పై దాడికి యత్నం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతుండగా టీడీపీ యువకులు ముగ్గురు ఆయనపై దాడికి యత్నించారు. పోలీసులు రంగప్రవేశం చేసి యువకుల బారి నుంచి పాల్‌ను రక్షించి ఆయనను అక్కడి నుంచి పంపించి వేశారు. -
ఇరుకురోడ్డులో సభ పెట్టారు.. ప్లాన్ బెడిసికొట్టింది: సజ్జల
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే ఇరుకురోడ్డులో రోడ్‌షో నిర్వహించారని, కందుకూరులో జన సంద్రం అని ప్రచారం చేసుకోవాలనుకున్న ప్లాన్ బెడిసి కొట్టిందన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కందుకూరు తొక్కిసలాట ఘటనపై గురువారం సాయంత్రం సజ్జల పాత్రికేయ సమావేశం ద్వారా స్పందించారు. కావాలనే ఇరుకు రోడ్డులో సభ నిర్వహించారని ఈ సందర్భంగా సజ్జల, చంద్రబాబుపై మండిపడ్డారు. జనం ఎక్కువ వచ్చారని పబ్లిసిటీ చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, ఆ పబ్లిసిటీకి ఎనిమిది మంది బలయ్యారని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పోలీసుల సూచనలు ఏవైనా పాటించారా?. అనుమతి తీసుకున్న ప్రాంతం కంటే ముందుకెళ్లి సభ నిర్వహించారు. పైగా పోలీసులపైనే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారా?’’ అని చంద్రబాబును నిలదీశారు సజ్జల. ఆ ఇరుకురోడ్డులో రోడ్‌షో నిర్వహణ ద్వారా.. డ్రోన్ షాట్లతో జనాలు బాగా వచ్చారని చూపించుకునే ప్రయత్నం చేశారు. కందుకూరు తొక్కిసలాట ఘటనకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలన్నారు సజ్జల. ప్రెస్మీట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడారంటే.. చంద్రబాబు నరబలి కందుకూరు ఘటనపై చంద్రబాబు మొహంలో పశ్చాత్తాపమే కనిపించడం లేదన్నారు సజ్జల. ఆయనలో లెక్కలేనితనం, అహంకారమే కనిపిస్తోంది. ఈ దుర్ఘటనను కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్ష నేత యత్నించడం సిగ్గు చేటన్నారు సజ్జల. ఏది జరిగినా సెన్సేషన్ చేసుకోవాలన్నదే చంద్రబాబు ఆరాటమని, ఆయన వికృత విన్యాసంలో ఈ నరబలి జరిగిందని భావిస్తున్నామని సజ్జల అభిప్రాయపడ్డారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాల్లో అమాయకులను బలి తీసుకున్నారు. అప్పుడు ఆ ఘటనపైనా అహంకారంతో చంద్రబాబు మాట్లాడారని సజ్జల గుర్తు చేశారు. చంద్రబాబుకు ప్రాణాలంటే లెక్కలేదని, సంస్కారవంతమైన ఆలోచనలున్న వ్యక్తిగా కూడా చంద్రబాబు లేరని సజ్జల విమర్శించారు. బాబు రాజకీయ జీవితమే అది నిన్నటి ఘటన ముమ్మాటికి ప్రమాదం కాదు. ఒక వ్యూహం ప్రకారం అమలు చేసిన యాక్షన్ ప్లాన్. చంద్రబాబు వికృత విన్యాసానికి దారుణ నరబలిగా చూడాల్సిందే. ఎందుకంటే, ఆయన రాజకీయ జీవితం అలాంటిది. 1994లో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎన్టీఆర్‌ను ఏడాది కాలంలోనే ఏ విధంగా పదవి నుంచి దించాడో.. ఏ రకంగా ఆయనను ఇబ్బందులు పెట్టి మానసికంగా కుంగిపోయేలా చేసి, చివరకు మరణానికి కారకుడుగా మిగిలాడనేది అందరికీ తెలిసిందే. అదే విధంగా తాను అధికారంలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ పిచ్చితో 29 మంది అమాయక భక్తుల్ని బలి తీసుకున్నారు. అంత నీచమైన చరిత్ర చంద్రబాబుది. కోల్డ్ బ్లడెడ్ యాక్షన్ ప్లాన్ వంద అడుగుల రోడ్డును ఇరుకుగా మార్చి.. తన బహిరంగ సభల్లో జనం విపరీతంగా కనిపించాలని.. డ్రోన్షాట్ కెమెరాలతో టైట్ షాట్స్ పెట్టుకుని మీడియాలో కనిపించాలనే కక్కుర్తితో జరిగిన కోల్డ్ బ్లడెడ్ యాక్షన్ ప్లాన్‌గా కందుకూరు ఘోర ఘటనను చూడాలి. అక్కడ 100 అడుగుల విశాలమైన రోడ్డును ఫ్లెక్సీలు పెట్టి ఇరుకైన సందుగా మార్చారు. రెండు వైపులా భారీ ఫ్లెక్సీలు పెట్టి, రోడ్డును 30 అడుగులు చేశారు. ఒక టన్నెల్లాగా కెమెరాల్లో జనాలను సంద్రంగా చూపెట్టాలనుకున్నాడు. అందు కోసం పోలీసుల సూచనల్ని సైతం లెక్క చేయకుండా కాన్వాయ్‌ను ముందుకు తీసుకొచ్చి, ఇరుకైన రోడ్లో ఆపి జనాన్ని ఒక చోటికి చేర్చాలని తాపత్రయ పడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది. నిజానికి కాలువలో పడిన వాళ్లు భద్రంగా బయటకొచ్చారు. కేవలం తొక్కిసలాట వల్లనే అంత మంది చనిపోయారు. నేరంగా పరిగణించాలి నైతికంగా చూస్తే లెక్కలేనితనంతో చేసే ఇలాంటి కార్యక్రమాలను కూడా నేరాలుగానే పరిగణించాలి. ఉన్నదాన్ని సౌకర్యవంతంగా చూసుకుని జనాలకు ఇబ్బందులు లేకుండా సభలు జరుపుకోవడంలో తప్పేమీ లేదు. కానీ నిన్న జరిగిన సంఘటనను బట్టి భవిష్యత్తు కార్యక్రమాల పట్ల అధికార యంత్రాంగం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. టైమ్, లొకేషన్, సభ జరిపిన పద్ధతి, బారికేడ్లు.. ఇవన్నీ నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తాయి. కాబట్టి దీనిపై పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖలు రూల్స్ ప్రకారం వ్యవహరిస్తాయి. అందుకే వారిపై చట్టపరంగా చర్య తీసుకోవాలి. అలాగే ఇక నుంచి విశాలమైన స్థలాల్లోనే సభలకు అనుమతి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయినా పశ్చాత్తాపం లేదు అయితే ఇంత జరిగినా చంద్రబాబులో ఎక్కడా పశ్చాత్తాపం లేదు. ఆయన ముఖంలో ప్రాయశ్చిత్తం కనిపించడం లేదు. పైగా దుర్ఘటన నుంచి రాజకీయ ప్రయోజనం పొందడం కోసం, శవాలపై పేలాలేరుకునే విధంగా పిచ్చి విమర్శలు చేస్తున్నాడు. ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల అంత మంది ఆవేశంతో వచ్చారని, మరణించిన వారంతా త్యాగం చేశారని, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో వారంతా సమిథలయ్యారని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా నీచత్వం ఉంటుందా?: సభకు, సమావేశానికి వచ్చే వారెవరైనా ప్రాణత్యాగం చేయాలని వస్తారా? ఎవరు, ఏ కారణంతో వచ్చినా, ఇంటికి తిరిగి జాగ్రత్తగా వెళ్లాలనే అనుకుంటారు తప్ప, చనిపోవడం కోసం రారు కదా? కానీ చంద్రబాబు మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆయన కోసం తొక్కిసలాటలో చనిపోయి, ఆయన పొగడ్తలకు ప్రాప్తులు కావడం వల్ల వారి జన్మలు ధన్యమవుతాయన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా నీచత్వం, దివాలాకోరుతనం ఏమైనా ఉంటుందా?. ఘోరం నుంచి లాభం–బాబు నైజం చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి గోదావరి పుష్కరాల్లో 29 మంది అమాయకులు బలయ్యారు. అయినా దాన్ని సమర్థించుకుంటూ, జనం విపరీతంగా రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందని, గతంలో కుంభమేళాల్లో కూడా అలాంటి ఘటనలు జరిగాయంటూ చంద్రబాబు అహంకారంగా మాట్లాడారు. ఎక్కడైనా ఘోరం జరిగితే, చివరకు దాన్నించి కూడా లాభం పొందాలని చూడడం చంద్రబాబు నైజం. ఈ మాటలు స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు చెప్పారు. ఏదైనా ఉద్యమం అంటే కనీసం ఒక బస్సు అయినా పగలాలి. ఎక్కడైనా విధ్వసం జరగాలి. ఏదైనా తగులబడాలి. చావైనా జరగాలి. ఈ ఘటనపై సమీక్ష కూడా జరగాలి. తాను ఏదనుకుంటే అది జరగాలి. అదే చంద్రబాబు నైజం అని దగ్గుపాటి చెప్పారు. జనం ఛీ కొడుతున్నారు ఏదో రకంగా నాటకాలతో పబ్బం గడుపుకుని ప్రజలు తనను నెత్తిన పెట్టుకోవాలని చేసిన ప్రయత్నానికి పరాకాష్ట నిన్నటి ఘటన. దీన్ని చూసిన రాష్ట్ర ప్రజలు చంద్రబాబును ఛీ కొడుతున్నారు. దీంతో ఆయన ఒక పార్టీ అధ్యక్షుడనేది పక్కన బెట్టి.. సభ్యసమాజంలో అందరితో కలిసిపోయే ఒక సంస్కారవంతమైన వ్యక్తిగా కూడా చంద్రబాబు లేడనేది తేటతెల్లమైంది. కచ్చితంగా చంద్రబాబు బాధ్యుడు 100 అడుగుల రోడ్డును 30 అడుగులుగా చేసినందుకు వాళ్లను ఏం చేయాలి?. అది క్రిమినల్ ఆలోచన కాదా?. తొక్కిసలాటకు అవకాశం ఉండే విధంగా ఫ్లైక్సీలతో రోడ్డును ఇరుకుగా చేశారు. వెనుకనున్న జనాన్ని ముందుకు తోసుకునేలా కుట్రపూరిత ఆలోచన చేశారు. అంత మంది అమాయకుల మరణానికి కారణమయ్యారు. అందుకే చంద్రబాబుకు, ఆ పార్టీ వారికి నిన్నటి ఘటనపై మాట్లాడే నైతిక హక్కు లేదు. అంతే కాదు నిన్నటి ఘటనకు చంద్రబాబే పూర్తిగా బాధ్యుడు. ఆయన కుట్రపూరిత నేరానికి వ్యక్తిగతంగా కచ్చితంగా బాధ్యుడు. -
అనుమతి ఇచ్చిన ప్రాంతంలో సభ నిర్వహించలేదు: ఎస్పీ
నెల్లూరు: జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్‌షోలో చోటు చేసుకున్న విషాద సంఘటనపై జిల్లా ఎస్పీ విజయరావు విచారం వ్యక్తం చేశారు. సాక్షి టీవీతో ఎస్పీ మాట్లాడుతూ.. ‘కందుకూరు సంఘటన దురదృష్టకరం. ఎన్టీఆర్ సర్కిల్లో చంద్రబాబు సభ ఏర్పాటు చేసేందుకు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో అయితే తొక్కిసలాటకు ఆస్కారం ఉండదు. అనుమతి ఇచ్చిన ప్రాంతాన్ని దాటి ఇరుకుగా ఉన్న రోడ్లోకి చంద్రబాబు వెళ్లారు. 46 మీటర్లు ముందుకు వెళ్లిపోయారు. ఒకే చోటికి జనం ఒక్కసారిగా చేరటంతో తొక్కిసలాట జరిగింది. గాయపడ్డ పిచ్చయ్య ఇచ్చిన ఫిర్మాదుతో కేసు నమోదు చేశాం. పూర్తి స్థాయిలో విచారణ జరిపి సెక్షన్లు నమోదు చేస్తాం’ అని తెలిపారు. -
కందుకూరు ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
-
కందుకూరు దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
సాక్షి, నెల్లూరు: కందుకూరు దుర్ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇదిలా ఉంటే, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా కందుకూరులో బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్ షో పెను విషాదాన్ని మిగిల్చింది. రోడ్ షో జరిగిన ఎన్టీఆర్ సర్కిల్లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. చదవండి: (నెల్లూరు: కందుకూరు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు) -
నెల్లూరు: కందుకూరు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు
సాక్షి, కందుకూరు: నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబాబు సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కేసు నమోదయింది. సెక్షన్ 174 కింద కందుకూరు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ఈ ఘటనలో 8 మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు విచారణ అనంతరం నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చనున్నారు. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి ప్రచార యావ చాలా ఎక్కువ. ఈ విషయం ఇప్పటికే అనేక సందర్భాల్లో రుజువైంది. నాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకునే తాపత్రయంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన పట్టించుకోడు. ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తాడు. ఈ వ్యవహారశైలే మరోసారి ప్రజల ప్రాణాలపైకి తెచ్చింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి యాత్ర సందర్భంగా కందుకూరులో నిర్వహించిన బహిరంగసభ అనేక మంది కుటుంబాల్లో పెను విషాదన్ని మిగిల్చింది. చదవండి: (‘షో’క సంద్రం.. చంద్రబాబు రోడ్ షోలో 8 మంది దుర్మరణం) -
ప్రకాశం: చంద్రబాబు కందుకూరు సభలో విషాదం
సాక్షి, ప్రకాశం: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కందుకూరులో జరిగిన సభలో విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో మురుగు కాలువలో పడి మరణించిన వాళ్ల సంఖ్య ఏడుగురికి చేరినట్లు తెలుస్తోంది. పామూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. ఆ టైంలో ఆయన ప్రసంగిస్తుండగా.. తొక్కిసలాట జరిగిందని, ఈ క్రమంలోనే వాళ్లు కాలువలో పడడంతో వాళ్లు మరణించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మృతుల్ని గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం చినకొండయ్య, కందుకూరు పట్టణం గుర్రంవారి పాలెంకు చెందిన కాకుమాని రాజాగా గుర్తించారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట అనంతరం ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మారుమోగిపోయింది. -
నెల క్రితమే తల్లి మృతి: బాధను దిగమింగుకుని డ్యూటీకి వెళ్తుండగా..
సాక్షి, కందుకూరు: రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్ చక్రాల కిందపడి ఓ యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని రాచులూరుకు చెందిన తిరుగమళ్ల శ్రీనాథ్(23) బేగకరికంచె సమీపంలోని అమెజాన్ కంపెనీ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం గ్రామం నుంచి విధులకు హాజరుకావడానికి మధ్యాహ్నం సమయంలో బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో రాచులూరు–కటికపల్లి మార్గంలో కటికపల్లి నుంచి మట్టిలోడ్‌తో వస్తున్న టిప్పర్, బైక్‌ను ఢీకొనడంతో టిప్పర్ చక్రాల కిందపడి దుర్మరణం చెందాడు. మృతుడికి తండ్రి, చెల్లెలు ఉన్నారు. నెలరోజుల క్రితమే మృతుడి తల్లి ఆండాలు చనిపోవడం, ఇప్పుడు కుమారుడిని కోల్పోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లుతుంది. గ్రామస్తులు,బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. అందరితో కలుపుగోలుగా ఉండే శ్రీనాథ్ చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. సీఐ కృష్ణంరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: సూర్యాపేటలో సమాజం తలదించుకునే ఘటన తీవ్ర విషాదం: వాగులో కొట్టుకుపోయిన కారు.. నవ వధువు మృతి -
అంతటా నాగుల పంచమి.. కానీ అక్కడ మాత్రం తేళ్ల పంచమి
శుక్రవారం అందరూ నాగుల పంచమి వేడుకలు చేసుకుంటే.. నారాయణపేట జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా కందుకూరులో భక్తులు తేళ్ల పంచమి నిర్వహించారు. గ్రామ సమీపంలోని కొండపై కొండమవ్వను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కొండపై ఏ చిన్నరాయిని తొలగించినా తేళ్లు కనిపించడంతో పట్టుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపారు. పంచమి నాడు వాటిని చేతితో తాకినా, పట్టుకున్నా, శరీరంపై పాకించినా కుట్టవని భక్తుల నమ్మకం. తేళ్లను తమ ముఖం, చేతులు, మెడపై వేసుకుంటూ వారు ఆనందపడ్డారు. ఏటా నాగులపంచమి రోజే తేళ్ల పంచమి నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. కాగా తేళ్లను తాకితే మంచి జరుగుతుందని భక్తులు అంటుండగా.. వాతావరణ పరిస్థితులు, వనమూలికల కారణంగా ఆ తేళ్లు కుట్టవని కొందరు విద్యావేత్తలు చెబుతుంటారు. – నారాయణపేట ప్రాణముందని.. ప్రేమను పంచి మహబూబ్‌నగర్ పట్టణం బండ్లగేరిచౌరస్తాలో.. ఎద్దులు బండిని లాగుతుండగా దాని మీద రైతు నిల్చున్నట్లుగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే, శుక్రవారం అటుగా వెళ్తున్న ఓ ఆవు.. బొమ్మ ఎద్దులు నిజమైనవి అనుకొని ఇలా వాటి వద్దకు వెళ్లి మూగ ప్రేమను పంచడం చూపరులను ఆకట్టుకుంది. – ‘సాక్షి’ సీనియర్ ఫొటోగ్రాఫర్, మహబూబ్‌నగర్ జనసంద్రమైన నాగోబా ఆలయం.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం శుక్రవారం జనసంద్రంగా మారింది. నాగులపంచమి కావడంతో భారీసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తులకు జొన్నగట్కాతో అన్నదానం చేశారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, సర్పంచ్ మెస్రం రేణుక పూజల్లో పాల్గొన్నారు. – ఇంద్రవెల్లి(ఖానాపూర్) -
కూతురు కళ్లెదుటే తండ్రి ఘాతుకం
కందుకూరు/రంగారెడ్డి: పచ్చని కుటుంబంలో మద్యం మహమ్మారి నిప్పులు పోసింది. తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి తన భార్యను కూతురు కళ్లెదుటే గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. కందుకూరు మండలం దాసర్లపల్లికి చెందిన ఎర్గమోని మహేందర్(35) అదే మండలంలోని మీర్ఖాన్పేటకు చెందిన సారమ్మ అలియాస్ స్వరూప(33)ను 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు జస్వంత్(13), కూతురు తేజ(10) ఉన్నారు. మహేందర్ ట్రాక్టర్ డ్రైవర్‌గా, సారమ్మ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మహేందర్ తరచూ భార్యను కొడుతుండేవాడు. దీంతో రెండు నెలల క్రితం సారమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా మహేందర్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. శనివారం రాత్రి 11.40 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న అతడు.. నిద్రిస్తున్న భార్యపై గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. నిద్ర నుంచి మేల్కొన్న తేజ కళ్లెదుటే ఈ దారుణం జరగడంతో వణికిపోయి తన అన్నను నిద్ర లేపింది. తండ్రి వారిని బెదిరించి బయట గడియపెట్టి పరారయ్యాడు. పిల్లలు ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించింది. చదవండి: భార్యభర్తల గొడవ ఎంత పనిచేసింది.. -
హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి రైతు హల్చల్
మహేశ్వరం: కబ్జా నుంచి తన వ్యవసాయ భూమిని విడిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ రైతు హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి హల్చల్ చేసిన సంఘటన కందుకూరు మండల పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. దెబ్బడగూడ గ్రామానికి చెందిన వరికుప్పల రాజు గ్రామంలోని సర్వే నంబర్ 30, 31, 33లో తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఈ భూమిని అదే గ్రామానికి చెందిన రాములునాయక్ కబ్జా చేసి కడీలు పాతి, ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడని, దీనిపై అధికారులు, పోలీసుల వద్దకు వెళ్లినా న్యాయం చేయలేదని, కబ్జా నుంచి భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తూ గురువారం పొలం పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. తనకు ఆ భూమి తప్ప వేరే జీవనాధారం లేదని, న్యాయం చేయకపోతే దూకి చనిపోతానని బెదిరింపులకు దిగాడు. సుమారు 2 గంటల పాటు స్తంభం పైనే ఉండి ఆ ప్రాంతమంతా హల్చల్ సృష్టించాడు. వెంటనే సమాచారం అందుకున్న కందుకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సంబంధిత భూమి పత్రాలు పరిశీలించి న్యాయం చేస్తామని సర్దిచెప్పడంతో రాజు స్తంభం పైనుంచి దిగాడు. దీంతో పోలీసులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ( చదవండి: భువనగిరిలో ‘రియల్ దందా’.. 700 కోట్ల అక్రమాలు! ) -
లోగ్రేడ్.. లో రేట్
కందుకూరు: అసలే ప్రకృతి వైపరీత్యాలతో పొగాకు నాణ్యత తగ్గింది. దానికి తోడు కరోనా వైరస్ పుణ్యమా అంటూ 50 రోజులకు పైగా వేలం నిలిచిపోయింది. అంతంత మాత్రంగా ఉన్న నాణ్యత కాస్త వేలం విరామంతో మరికాస్త దిగజారింది. రంగు మారి బ్రైట్‌గ్రేడ్ రకం కూడా లోగ్రేడ్ రకంలోకి మారిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఈ ఏడాది రైతుల వద్ద లోగ్రేడ్ ఉత్పత్తులే అధికంగా ఉన్నాయి. కానీ వీటిని అమ్ముకోవాలంటే రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వేలం కేంద్రాలకు తీసుకొచ్చిన లోగ్రేడ్ పొగాకు బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేయరు. ఒకవేళ కొనుగోలు చేసినా ధర రాదు. ఇదీ ప్రస్తుతం పొగాకు రైతులు ఎదుర్కొంటున్న దుస్థితి. జిల్లాలో ఈ ఏడాది మొత్తం 91.78 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయింది. దాంట్లో ఇప్పటి వరకు 31.5 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేశారు. లోగ్రేడ్ రకం కొనుగోలు చేయని వ్యాపారులు: ఈ ఏడాది వేలం ప్రారంభంలోనే పొగాకు నాణ్యతపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. బ్రైట్‌గ్రేడ్ కేవలం 40 శాతం మాత్రమే వచ్చిందనేది బోర్డు అధికారుల అంచనా. డిసెంబర్, జనవరి నెలల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పొగాకు నాణ్యత దెబ్బతిని క్యూరింగ్‌లో మీడియం, లోగ్రేడ్ రకం ఉత్పత్తులు అధికంగా వచ్చాయి. దాదాపు 50 శాతం వరకు లోగ్రేడ్ ఉత్పత్తులు వచ్చాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వేలంలో లోగ్రేడ్ రకం ఉత్పత్తులకు సరైన ధర దక్కితేనే రైతులు నష్టాల నుంచి బయటపడగలరు. కానీ పొగాకు వేలంలో పరిస్థితి పూర్తి భిన్నంగా నడుస్తోంది. బ్రైట్‌గ్రేడ్ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు మొగ్గు చూపుతున్నారే తప్పా లోగ్రేడ్ రకం పొగాకును కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. వేలానికి తీసుకొచ్చిన బేళ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తిరిగి ఇంటికి తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి వేలం కేంద్రంలో రోజూ వందల సంఖ్యలో లోగ్రేడ్ బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ఉదాహరణకు కందుకూరు ఒకటో వేలం కేంద్రంలో శనివారం 784 బేళ్లను వేలానికి ఉంచితే 634 కొనుగోలు చేయగా 150 బేళ్లను తిరస్కరించారు. అలాగే రెండవ వేలం కేంద్రంలో 719 బేళ్లను గాను 609 కొనుగోలు చేయగా 110 బేళ్లను తిరస్కరించారు. ప్రతి రోజు ఇదే తీరుగా వందల సంఖ్యలో బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. దీని వల్ల రైతులకు అదనపు భారంగా మారుతోంది. వేలానికి తీసుకొచ్చిన బేళ్లను తిరిగి ఇంటికి తీసుకెళ్లడం ఒకెత్తు అయితే తిరిగి తమ క్లస్టర్ వంతు వచ్చే వరకు వేచిచూడాల్సిన వస్తోంది. ఒక క్లస్టర్ వంతు తిరిగి వేలానికి రావాలంటే కనీసం నెల రోజులకుపైగానే పడుతోంది. ఇలా బేళ్లను ఇంటిలోనే ఉంచుకోవడం వల్ల ఆ ఉత్పత్తుల నాణ్యత మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ధర విషయం మరీ దారుణంగా ఉంది. లోగ్రేడ్ ఉత్పత్తుల విషయంలో సిండికేట్‌గా మారి న వ్యాపారులు గిరిగీసినట్లు ఒక రేటును దాటడం లేదు. కేవలం రూ.80 మాత్రమే చెల్లిస్తున్నారు. గత నెల రోజుల వేలం ప్రక్రియలో లోగ్రేడ్ రకం పొగాకుకు ఇదే ధర లభిస్తోంది. ఒక్క రూపాయి పెరగడం లేదు, తగ్గడం లేదు. అదీ లేకపోతే వేలంలో కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. దీంతో ఈ ఏడాది అధికంగా ఉన్న లోగ్రేడ్ ఉత్పత్తులను అమ్ముకోవడం రైతులకు గగనంగా మారుతోంది. అమ్ముకున్నా వ్యాపారులు చెప్పిన రేటుకు ఇచ్చేయాల్సిందే. వేలం ఆలస్యంతో మరింత నష్టం: కరోనా వైరస్ లేకుంటే ఇప్పటికే వేలం ప్రక్రియ చివరి దశలో ఉండేది. కానీ ఈ ఏడాది ఇంకా మరో రెండు నెలలకు వేలం ముగిసినా ముగిసినట్టే. ప్రస్తుతం కొనుగోలు చేసిన ఉత్పత్తులు ఇంకా మిగిలిన ఉత్పత్తులే ఇందుకు నిదర్శనం. కందుకూరు ఒకటో వేలం కేంద్రంలో 8.4 మిలియన్లు, రెండవ వేలం కేంద్రంలో 7.2 మిలియన్ల వరకు అధికారిక కొనుగోళ్లు జరగాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు దాదాపు 3 మిలియన్ల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేశారు. ఇవిపోను అనధికారిక ఉత్పత్తులు కూడా ఉంటాయి. అంటే ఇంకెంత సమయం పడుతుందో ఊహించవచ్చు. దీని వల్ల ఉత్పత్తుల రంగు మారి అంతిమంగా రైతులకు నష్టం చేకూరుతుంది. అసలే లోగ్రేడ్ కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఇష్టపడడం లేదు. ఈ పరిణామం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం బ్రైట్ గ్రేడ్ రూ.200లకు కొనుగోలు చేస్తున్నా, లోగ్రేడ్ రూ.80లు దాటడం లేదు. దీంతో సరాసరి రేట్లు కూడా రూ.140లు మించి రావడం లేదు. ప్రత్యక్ష వేలంలోకి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా పొగాకు వేలంలో మార్క్‌ఫెడ్ ద్వారా ప్రత్యక్షంగా పాల్గొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జులై 1వ తేదీ నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. ప్రధానంగా వ్యాపారులు కూటమిగా మారి ధరలు పెంచకపోవడం, లోగ్రేడ్ ఉత్పత్తులను తిరస్కరిస్తుండడంతో ప్రభుత్వం వేలంలోకి అడుగు పెడుతోంది. రేట్లు రాని ఉత్పత్తులను రైతులకు మద్దతు ధర వచ్చేలా వేలంలో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తుంది. అంటే లోగ్రేడ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల వ్యాపారులు కూడా కచ్చితంగా లోగ్రేడ్ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే బోర్డు పరిధిలో రిజిస్టర్ అయి వేలంలో పాల్గొనని వ్యాపారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో వేలంలో పాల్గొనే వ్యాపారుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇలా మొత్తం మీద ప్రభుత్వమే స్వయంగా పొగాకు వేలంలోకి రావడం వల్ల ధరలు పెరుతాయనే ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ వ్యాపారులు ధరలు పెంచేందుకు ముందుకు రాకపోయినా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. దీని వల్ల ఇక రైతులు నష్టపోయే అవకాశం లేకుండా ఉంటుంది. అన్ని రకాల ఉత్పత్తులను మద్దతు ధరలకు వేలం కేంద్రాల్లోనే నేరుగా అమ్ముకునే అవకాశం వస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పొగాకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బాలింత ప్రాణం తీసిన ఇడ్లీ
సాక్షి, కందుకూరు: వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ బాలింత మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం (పీహెచ్సీ)లో చోటుచేసుకుంది. కందుకూరు మండలం ముచ్చర్లకు చెందిన షాబాద్ పరమేశ్‌కు ధన్నారం గ్రామానికి చెందిన శివాని (28)తో ఆరేళ్ల కిందట వివాహమైంది. శివాని రెండోసారి గర్భం దాల్చిన క్రమంలో ప్రతి నెలా పీహెచ్సీలో పరీక్షలు చేయించుకుంటుంది. నెలలు నిండటంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు శివానిని పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న నర్సు వెంకటమ్మ ఆదివారం తెల్లవారుజామున శివానికి పురుడు పోయగా..బాబు జన్మించాడు. గంట అనంతరం ఇడ్లీ తినిపించా లని నర్సు చెప్పడంతో కుటుంబీకులు ఇడ్లీ తెప్పించారు. అయితే ఆ ఇడ్లీలను శివానికి కూర్చోబెట్టకుండా మంచంపై పడుకున్న బాలింతకు అలాగే తినిపించింది. దీంతో ఇడ్లీ శివాని ఊపిరితిత్తులు, గొంతు, ముక్కులో ఇరుక్కుపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను 108 అంబులెన్స్‌లో హైదరాబాద్ కోఠిలోని ప్రసూతి ఆస్పత్రికి తరలించగా ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. పీహెచ్సీ ఎదుట ఆందోళన.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శివాని మృతి చెందిందంటూ మృతురాలి కుటుంబసభ్యులు మృతదేహాన్ని కందుకూరు పీహెచ్‌సీకి తరలించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని వైద్యాధికారులకు సమాచారం అం దించగా వారు అక్కడకు చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇడ్లీ ఇరుక్కోవడంతోనే మృతిచెందినట్లు అంగీకరించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఫిర్యాదు చేయకుండానే మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. -
స్వగ్రామంలో కిషన్‌రెడ్డి పర్యటన
సాక్షి, కందుకూరు: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి తన స్వగ్రామమైన కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో శుక్రవారం పర్యటించారు. గ్రామంలో తాను నిర్మించిన రామాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. అనంతరం తన తల్లిదండ్రుల సమాధుల వద్దకు చేరుకుని నివాళులర్పించారు. ఆయన రాకతో గ్రామస్తులు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం పార్టీ నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములుయాదవ్, రాష్ట్ర నాయకుడు ఎల్మటి దేవేందర్‌రెడ్డి, నాయకులు మాదారం రమేష్‌గౌడ్, కొంతం జంగారెడ్డి, అశోక్‌గౌడ్, విష్ణు, ఎల్లారెడ్డి, నిమ్మ అంజిరెడ్డి, రాజేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, బాల్‌రాజ్, శ్రీనివాస్‌గౌడ్, మల్లేష్, నిరంజన్, వైస్ ఎంపీపీ శమంత ప్రభాకర్‌రెడ్డి తదితరులు కిషన్‌రెడ్డిని కలిశారు. -
మద్యానికి బానిసై మగువ కోసం..
సాక్షి, కందుకూరు (ప్రకాశం): వారంతా నిండా పాతికేళ్లు కూడా నిండని యువకులు. ప్రస్తుతం కాలేజీల్లో ఇంటర్, బీటెక్, ఎంబీఏ వంటివి చదువుతున్నారు. కానీ ఏం లాభం మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. ఇంకేముంది.. చదువులను పక్కన పెట్టి తిరగడం మొదలుపెట్టారు. జులాయిగా తిరగడానికి అవసరమైన డబ్బుల కోసం చోరీల బాటపట్టారు. ఎవరో తెలియని వారి ఇంట్లో దొంగతనం చేయడం కంటే సొంత బంధువులు ఇళ్లయితే సులువని భావించారు. బంధువుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలు, డబ్బులు కాజేసి జల్సాలు చేశారు. అయితే ఇక్కడ దొంగతనం బాధితులంతా మేనమామలు, పెద్దనాన్న కావడం, దొంగతనం చేసిన వారు వారి మేనళ్లులే కావడం విచిత్రంగా మారింది. కందుకూరు ప్రాంతంలో జరిగిన కేసులను పోలీసులు చేధించగా ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటి వివరాలను కందుకూరు డీఎస్పీ రవిచంద్ర బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కందుకూరు పట్టణంలోని సాయినగర్ 7వ లైన్లో చిప్స్ వ్యాపారి మాలెం లక్ష్మీనారాయణ నివాసం ఉంటున్నాడు. లక్ష్మీనారాయణ ఇంట్లో గత నెలలో దొంగతనం జరిగింది. ఇంట్లోని 14 సవర్ల బంగారం చోరీకి గురైంది. దీంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ దొంగతనం చేసింది అతని మేనల్లుడు ప్రణీత్రెడ్డిగా నిర్ధారించాడు. ప్రణీత్‌రెడ్డి ప్రస్తుతం విజయవాడలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వ్యసనాలకు అలవాటు పడ్డ ప్రణీత్‌రెడ్డి మేనమామ ఇంట్లోనే దొంగతనం చేసి డబ్బులు కాజేయాలని పన్నాగం పన్నాడు. ముందుగానే ఆ ఇంటి డూప్లికేట్ తాళం చేయించి ఉంటాడు. గత నెల 22న మేనమాన ఇంట్లో ఎవ్వరూ లేరని తెలుసుకున్న ప్రణీత్‌రెడ్డి తన వద్ద ఉన్న డూప్లికేట్ తాళం సహాయంతో ఇంట్లోకి వెళ్లాడు. తరువాత బీరువా పగలగొట్టి అందులోని 14 సవర్ల బంగారం తీసుకున్నాడు. అయితే లాకర్లలో మరికొంత బంగారం ఉన్న విషయం తెలియక వదిలేశాడు. తరువాత పోలీసులకు వేలిముద్రలు దొరకకూడదనే ఉద్దేశంతో బీరువాలోని విలువైన వస్తువులన్నీ తగలబెట్టాడు. వీటిలో వేల రూపాయల విలువ చేసే చీరలు కూడా ఉన్నాయి. తరువాత పక్క ఇంట్లో ఉన్న బైక్ తీసుకుని పారిపోయాడు. చోరీ చేసిన బంగారంలో ఓ చైన్‌ను రూ. 10వేలకు విక్రయించి జల్సా చేశాడు. మిగిలిన బంగారం కూడా అమ్మే ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు చుట్టుపక్కల వారిని విచారించడంతో ఓ యువకుడు బైక్ తీసుకెళ్లినట్లు సమాచారం ఇచ్చారు. దీని ఆధారంగా పోలీసులు ప్రణీత్‌రెడ్డిని అరెస్టు చేసి, ఆ యువకుడి వద్ద ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురితో కలిసి.. ఉలవపాడులోని రిజర్వు కాలనీవాసి రసూల్ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని ఇంట్లో దొంగతనం జరిగి 4 సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసులోనూ 9వ తరగతి చదువుతున్న రసూల్ మేనల్లుడే ప్రధాన నిందితుడు. నిందితుడు బీటెక్ చదివే అబ్దుల్ మజీద్, బంగారు పనిచేసే సర్వేపల్లి నాగరాజు, కంచర్ల తేజ అనే యువకులతో కలిసి చోరీకి పాల్పడ్డాడు. అంతా కలిసి నాలుగు సవర్ల బంగారం కాజేసి జల్సాల కోసం ఖర్చు చేశారు. పెదనాన్న ఇంట్లోనే చోరీ.. ఉలవపాడు మండలం మన్నేటికోటలో జరిగిన మరో దొంగతనం కేసు ఆసక్తికరంగా ఉంది. గ్రామానికి బీఎస్ఎన్ఎల్ లైన్మెన్ తాటికొండ శ్రీనివాసరావు ఇంట్లో దొంగతనం జరిగి 10 సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. పోలీసుల విచారణలో శ్రీనివాసుల తమ్ముడి కొడుకే దొంగ అని తేలింది. అతను ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. చెన్నైలో ఎంబీఏ చదువుతున్న పొదిలి అవినాష్ అనే యువకుడితో కలిసి చోరీకి పాల్పడ్డాడు. కాజేసిన బంగారాన్ని అమ్ముకుని జల్సాలు చేశారు. అయితే పోలీసులు చోరీ అయిన బంగారం మొత్తాన్ని రికవరీ చేశారు. సిబ్బందికి ప్రత్యేక అభినందనలు ఈ సందర్భంగా మూడు కేసులను చేధించిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ రవిచంద్ర ప్రత్యేక అభినందనలు తెలిపారు. దొంగతనాలకు నిందితులను అరెస్టు చేయడంతో పాటు, సొత్తు రికవరీ చేశామన్నారు. కృషి చేసిన ఎస్సైలు, కానిస్టేబుల్స్, ఐడీ పార్టీ సిబ్బందిని అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ విజయ్‌కుమార్, పట్టణ, ఉలవపాడు ఎస్సైలు కేకే తిరుపతిరావు, శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మద్యానికి.. మగువకి ఖర్చు.. మూడు కేసుల్లో మొత్తం ఏడుగురు యువకులను అరెస్టు చేశారు. మిగిలిన ఐదుగురు విద్యార్థులే కావడం గమనార్హం. 9,10వ తరగతి చదివే స్కూల్ పిల్లలు ఉండడంతో పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి దొంగతనం చేసి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం ఈ వయసులో వారికి ఏమొచ్చిందని పోలీసులు ఆరా తీస్తే వారు చెప్పిన మాటలు విని నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి. చోరీ చేసిన బంగారాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవడం మద్యం తాగడానికి, వ్యభిచార గృహాలకు ఖర్చు చేసినట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న విచారణలో తేలింది. మగువ కోసమే ఒక్కొక్కరు రూ 5వేల వరకు ఖర్చు చేశారనే విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. నిండా 25 ఏళ్లు కూడా నిండని విద్యార్థులు ఈ వ్యసనాలకు బానిసలు కావడంపై పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
పేదల బియ్యం బ్లాక్ మార్కెట్లో..
సాక్షి, కందుకూరు: అక్రమ బియ్యం వ్యాపారానికి కందుకూరు ప్రాంతం కేంద్రంగా మారుతుంది. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ఈ బ్లాక్ మార్కెట్ దందా విచ్చలవిడిగా సాగుతున్నా అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. దీంతో అక్రమ బియ్యం వ్యాపారులు యథేచ్ఛగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. బియ్యం వ్యాపారులకు అధికారుల అండదండలు ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పేదల బియ్యం ప్రతి నెలా టన్నుల కొద్దీ బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోంది. ఈ వ్యవహారంలో రేషన్ డీలర్ల దగ్గర నుంచి అధికారుల వరకు అందరూ భాగస్వాములునే అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ రహస్యమే... కందుకూరు ప్రాంతంలో బియ్యం వ్యాపారం ఎవరు చేస్తున్నారు, ఎక్కడికి బియ్యం వెళ్తున్నాయనేది బహిరంగ రహస్యమే. ఏ డీలర్ ఎవరికి బియ్యం అమ్ముతాడు, ఆ బియ్యం ఏ రైస్ మిల్లులో రీసైక్లింగ్ అవుతాయనేది జరగమెరిగిన నగ్న సత్యం. కానీ ఈ కందుకూరు ప్రాంతంలో జరుగుతున్న బియ్యం అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట మాత్రం పడదు. దాడుల్లో పట్టుబడ్డ ఒక్క వ్యాపారిపై కూడా చర్యలు తీసుకోరు. నాలుగైదు సంవత్సరాలుగా ఇదంతా మామూలు విషయంగానే మారిపోయింది. కందుకూరు కేంద్రం ప్రతి నెలా టన్నుల కొద్ది బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలుతుంది. ఇవి రేషన్ డీలర్ల నుంచి కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తుండగా, మరికొందరైతే ఏకంగా సివిల్ సప్లై గూడెం నుంచే బ్లాక్ మార్కెట్‌కు తరలించిన సంఘటనలున్నాయి. కందుకూరు చట్టుపక్కల ఉన్న రైస్ మిల్లులో రీస్లైకింగ్ చేసి విక్రయిస్తున్నారు. కందుకూరు పరిసర ప్రాంతంలోని ఓగూరు, లింగసముద్రం మండలం వీఆర్‌కోట, పెదపవని గ్రామాల్లోనే రైస్ మిల్లులు ఈ రీసైక్లింగ్‌కు కేంద్రాలుగా ఉన్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో దాదాపు దాదాపు 500 బస్తాల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో వీఆర్‌కోట గ్రామంలోని నరశింహారావు అనే బియ్యం వ్యాపారికి చెదిన రైస్ మిల్లులో 380 బస్తాలను అధికారులు గుర్తించారు. వీటిలో 140 బస్తాల బియ్యం ఏకంగా సివిల్ సప్లై కార్పొరేషన్ లోగోతో సహా పట్టుబడ్డాయి. అలాగే ఓగూరు మిల్లు వద్ద ఉన్న మిల్లును సాంబయ్య అనే వ్యాపారి నిర్వహిస్తున్నాడు. ఈ మిల్లులో 109 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. గత రెండు సంవత్సరాల వ్యవధిలో ఇదే మిల్లులపై మూడుసార్లు అధికారులు దాడులు చేసి స్వయంగా రేషన్ బియ్యాన్ని టన్నుల కొద్ది స్వాధీనం చేసుకున్నారు. కానీ మిల్లు మాత్రం మూతపడదు. తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేయడం పరిపాటిగా మారిపోయింది. దీంతో ఎన్నిసార్లు దాడుల్లో పట్టుబడినా తమకేమీ కాదనే ధైర్యంతో వీరు అక్రమ బియ్యం వ్యాపారాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. ఇలా ఈ ప్రాంతంలోని రైస్ మిల్లులు ఈ అక్రమ బియ్యం వ్యాపారానికి కేంద్రంగా మారుతున్నాయి. ఇక్కడే రీ సైక్లింగ్ చేసి మార్కెట్లో విక్రయించడం లేదా, అదే బియ్యాన్ని సీఎంఎస్ పేరుతో తిరిగి సివిల్ సప్లై కార్పొరేషన్‌కే అంటగడుతున్నారు. విచ్చలవిడిగా వ్యాపారం... ఇటీవల కాలంలో ఈ బియ్యం అక్రమ వ్యాపారం మరీ విచ్చలవిడిగా మారిపోయింది. ఒక్క కందుకూరు ప్రాంతం నుంచే కాక పామూరు, కనిగిరి తదితర ప్రాంతాల నుంచి ఇటువైపు నుంచి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇక్కడ మిల్లుల యజమానులు స్థానికంగా కొనుగోలు చేసి అదే బియ్యాన్ని రీస్లైకింగ్ చేసి జిల్లా సరిహద్దులు దాటిస్తారు. లేదంటే కొందరు వ్యాపారులు నేరుగా నెల్లూరు జిల్లాలోని పలువురు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఒక్కొక్క వ్యాపారిని డీలర్లను కూడగట్టుకుని షాపులకు వచ్చే బియ్యాన్ని నేరుగా తీసుకెళ్తుంటారు. డీలర్‌కు కేజీకి రూ.12 నుంచి రూ.15ల వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇలా ప్రతి నెలా టన్నుల కొద్ది బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. తూతూ మంత్రంగా తనిఖీలు ఇంత భారీ స్థాయిలో అక్రమ బియ్యం వ్యాపారం సాగుతున్నా, దాడుల్లో పలుమార్లు పట్టుబడ్డా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా బియ్యం వ్యాపారులు టీడీపీ సానుభూతి పరులు కావడం, గత ప్రభుత్వం ఒత్తిడితో వారి వ్యాపారానికి అడ్డేలేకుండా పోయింది. రేషన్‌షాపుల్లో తనిఖీలు చేసి అక్రమాలను నిరోధించాల్సిన సివిల్ సప్లైశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు అసలు పట్టించుకోరు. ఏ రేషన్‌షాపు నుంచి ఏ మిల్లుకు బియ్యం వెళ్తాయనేది తెలిసినా, దాడుల్లో సమాచారం దొరికినా ఒక్క డీలర్‌పై కూడా చర్యలు లేవు. మిల్లులు యధేచ్చగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తుంటాయి. దీనంతటికీ ఏ శాఖకు అందాల్సిన మామూళ్లు ప్రతినెలా వ్యాపారులు ముట్టచెప్తున్నారనే విమర్శలు జోరుగా వ్యక్తమవుతున్నాయి. -
కందుకూరు ప్రచార సభలో వైఎస్ విజయమ్మ
-
కందుకూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా మహిధర్‌రెడ్డి నామినేషన్
-
కులాల మధ్య బాబు చిచ్చు: మానుగుంట
కందుకూరు : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత మానుగుంట మహిధర్ రెడ్డి మండిపడ్డారు. కందుకూరులో మహిధర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బాబు తన అనుకూల పత్రికల ద్వారా కుహానా రాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే కాపులను బీసీలలో చేరుస్తానని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా నేటికీ మోసపూరిత తీర్మానాలు చేస్తూ కాపులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి అని కొనియాడారు. జగ్గంపేట సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి కాపులను జగన్‌కు దూరం చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రూ.5 వేల కోట్లు కాపు కార్పొరేషన్‌కు ఇస్తామని చెప్పి నాలుగున్నర ఏళ్లలో రూ.1300 కోట్లు మాత్రమే ఇచ్చి మోసం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. కాపులకు రూ.10 వేల కోట్లు ప్రకటించడం హర్షణీయం అన్నారు. చంద్రబాబు మాయమాటలు కాపు సోదరులు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
పేదల భూములతో ‘రియల్’ వ్యాపారం
కందుకూరు: పేదల భూములను గుంజుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం రియల్ వ్యాపారం చేస్తుందని రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితారెడ్డి విమర్శించారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని ఆకుమైలారంలో మాజీ సర్పంచ్ నందీశ్వర్, మాజీ ఉప సర్పంచ్ రాజు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి, గ్రామంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు భూములను పంచితే.. నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల నుంచి కారు చౌకగా ఎకరా రూ. 8 లక్షలకు గుంజుకుని రూ.కోటికి అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. ఫార్మాతో ఈ ప్రాంతం కాలుష్యమయమై జీవనం దెబ్బతింటుందన్నారు. భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల ఏర్పాటును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సోనియా గాంధీ పుణ్యాన తెలంగాణ సాధించుకుంటే, బంగారు తెలంగాణ చేస్తామంటూ మాటల గారడీతో సీఎం కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఎందుకు భర్తీ చేయడంలేదని ప్రశ్నించారు. సమగ్ర సర్వే చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించకుండానే పన్నుల పేరుతో జలగల్లా రక్తం తాగుతున్నారన్నారు. కులాల వారీగా ప్రజలను విడగొట్టి పబ్బం గడుపుకోవడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదు... జిల్లాలోని ఎమ్మెల్యేలు టీడీపీలో గెలిచి టీఆర్ఎస్ పంచన చేరినా ఈ ప్రాంతంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడంలేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ విమర్శించారు. ఫార్మాసిటీతో ఈ ప్రాంతానికి నష్టం ఉన్నా సొంత లాభం కోసం మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు నోరు మెదపడంలేదన్నారు. సీఎం నియంతృత్వ పాలనకు ప్రజలు చరమ గీతం పాడతారన్నారు. జెడ్పీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి మాట్లాడుతూ... రుణ మాఫీ పూర్తిగా చేపట్టలేదని, అర్హులకు పింఛన్లు అందడంలేదన్నారు. ఫార్మా భూములకు తక్కువ పరిహారం ఇస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన నిలబడి ఫార్మాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఏ–బ్లాక్ అధ్యక్షుడు ఎస్.సురేందర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ప్రసూన రేవంత్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు శ్రీధర్, మాజీ ఎంపీపీ మహేష్‌గౌడ్, మహేశ్వరం మండల అధ్యక్షుడు శివమూర్తి, అంబయ్యయాదవ్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి దర్శన్‌రెడ్డి, రఘుమారెడ్డి, రైతు సంఘం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి, కాకి రాములు, జి.సామయ్య, రూప్లానాయక్, ఎంపీటీసీలు ఉన్ని వెంకటయ్య, సత్తయ్య, మాజీ ఎంపీటీసీ రజిత, సీనియర్ నాయకులు రాంరెడ్డి, ఎస్.జగన్, శ్రీకాంత్‌రెడ్డి, పరంజ్యోతి, దేవేందర్, సురేష్, శ్రీశైలం, రేవంత్‌రెడ్డి, సాయిలు, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
నూనె ప్యాకెట్లో ఎలుక
కందుకూరు: నూనె ప్యాకెట్లో మృతి చెందిన ఓ ఎలుక పిల్ల బయటపడింది. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన గౌరీశంకర్.. కందుకూరు చౌరస్తాలోని ఓ కిరాణా షాపు నుంచి పామ్డిలైట్ పేరుతో ఉన్న పామోలిన్ నూనె ప్యాకెట్‌ను ఇటీవల కొనుగోలు చేసి ఇంటికి తెచ్చాడు. ఆదివారం ఇంట్లో వంట చేయడానికి నూనె ప్యాకెట్‌ను కొద్దిగా కత్తిరించి గిన్నెలోకి వంపుతుండగా తేడా కన్పించడంతో ప్యాకెట్‌ను మొత్తం కత్తిరించి చూశాడు. అందులో మృతిచెందిన ఓ ఎలుక పిల్ల కనిపించింది. దీంతో ఆయన ఆశ్చర్యానికి గురై విషయాన్ని మీడియాకు తెలిపాడు. -
వివాహిత దారుణ హత్య
- మృతదేహాన్ని కాలువలో పడేసిన హంతకులు - పోలీసుల అదుపులో అనుమానితులు కందుకూరు: వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన పట్టణంలో శనివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పొన్నలూరు మండలం వెల్లటూరుకు చెందిన ఇత్తడి మరియమ్మ(27)కు జరుగుమల్లి మండలం నందనవనం గ్రామానికి చెందిన రవితో పదకొండు ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి పదేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా ఆమె ఒంటరిగా నివాసం ఉంటోంది. పట్టణంలోని జనార్దన కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుంది. వివాహాలు, ఫంక్షన్లకు భోజనాలు తయారుచేసే పనులకు వెళ్తూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటికి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో మరియమ్మ మృతదేహమై కనిపించింది. మృతదేహం పడి ఉన్న తీరు, ఒంటిపై దుస్తులు చెరిగిపోవడంతో హంతకులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. స్థానికులు కూడా హత్యేగానే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ నరసింహారావు పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీస్ జాగిలాన్ని రప్పించారు. జాగిలం సంఘటన స్థలంలో కొద్దిసేపు తిరిగిన అనంతరం అక్కడి నుంచి నేరుగా సమ్మర్ స్టోరేజీ ట్యాంకు వరకు వెళ్లింది. పోలీసుల అదుపులో అనుమానితులు మహిళ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీ సులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధానంగా పట్టణంలో మెకానిక్‌గా పనిచేసే బాజీ అనే యువకుడితో మరియమ్మకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి హత్య జరిగి ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పలువురు వంట మేస్త్రిలను కూడా పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణ అనంతరం మరియమ్మ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అకాశం ఉంది. -
కుంటలో పడి నలుగురు చిన్నారుల మృతి
కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక మహ్మద్‌నగర్ పక్కన ఉన్న కుంటలో ప్రమాదవశాత్తూ పడి నలుగురు పిల్లలు మృతి చెందారు. కుంటలో నుంచి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. వీరంతా మహ్మద్‌నగర్‌కు చెందిన శిల్ప(14), శివ(13), సుజన్(13), బన్నీ(10)లుగా గుర్తించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. సంఘటనాస్థలంలో రోదనలు మిన్నంటుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బస్టాండ్‌లోకి దూసుకెళ్లిన ఇన్నోవా
కందుకూరు: వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వారి పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడే. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు బస్టాండ్ సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇన్నోవా వాహనం అదుపుతప్పి బస్టాండ్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కందుకూరు పశువైద్యాధికారి ప్రసాదరావు(50) మరణించగా, మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
ప్రహరీ గోడ కూలి ముగ్గురికి తీవ్రగాయాలు
కందుకూరు (రంగారెడ్డి జిల్లా) : నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ కూలి ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలైన సంఘటన కందుకూరు పట్టణంలో మంగళవారం జరిగింది. కందుకూరు ఎమ్మార్వో ఆఫీసు ఎదురుగా ఓ ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆ గోడ కూలింది. ముగ్గురు కార్మికులు కూలిన గోడ కింద ఇరుక్కుపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు కాపాడి.. చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
మరో పెళ్లి వ్యాను బోల్తా..15 మందికి గాయాలు
కందుకూరు: రంగారెడ్డి జిల్లాలో మరో పెళ్లి వ్యాను బోల్తా పడింది. బుధవారం ఉదయం జిల్లాలోని పరిగి సమీపంలో పెళ్లి వాహనం ప్రమాదానికి గురై నలుగురు మృతి చెందగా, 20 మందికి గాయాలైన విషయం తెలిసిందే. తాజా ఈ రోజు మద్యాహ్నం మరో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న డీసీఎం బోల్తా కొట్టిన ఘటనలో సుమారు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కందుకూరు మండలం గుమ్మడవెల్లి సమీపంలో చోటుచేసుకుంది. కొలనుగూడ గ్రామానికి చెందిన 30 మంది డీసీఎంలో మహశ్వరంలో జరుగుతున్న పెళ్లికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
ట్యాంకర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడి-మహేశ్వరం రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారు జామున ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. మహేశ్వరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. పొగ మంచు కారణంగా ముందు వెళ్తున్న వాహనం కనిపించక పోవడంతో ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపాడు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని హైదరాబాద్ తరలించారు. మిగతా ఇద్దరికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
కందుకూరు (రంగారెడ్డి) : అప్పుల పాలైన ఓ రైతు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బాచుపల్లి గ్రామంలో శనివారం జరిగింది. అనేగౌని కృష్ణయ్యగౌడ్(52) తనకున్న పది ఎకరాలతో పాటు మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. సిండికేట్ బ్యాంక్‌లో రూ.1.90 లక్షల అప్పు ఉంది. కాగా, పంటలు సక్రమంగా పండకపోవడంతో పాటు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం పొలానికి వెళ్లి అక్కడ ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
కందుకూర్ : రంగారెడ్డి జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో మందా గీత(28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలతోనే గీత ఆత్మహత్య చేసుకుందని తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు. -
వడదెబ్బతో ఆరుగురి మృతి
పెదనాన్న మృతితో ఆగిన కుమారుడి పెళ్లి కందుకూరు: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం వడదెబ్బకు గురై ఆరుగురు మృతిచెందారు. మహేశ్వరం మండల పరిధిలో.. మంఖాల్‌కు చెందిన బైరాములు(60) తన తమ్ముడి కుమారుడి వివాహానికి పందిరి వేసే నిమిత్తం బుధవారం గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాల్లోకి వెళ్లి మర్రికొమ్మల కోసం వెళ్లాడు. సాయంత్రం ఆయన ఇంటికి చేరుకున్నాడు. వడదెబ్బకు గురైన బైరాములు తీవ్ర అస్వస్థతకు గురై రాత్రి 10 గంటలకు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఓ కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఘటనపై వీఆర్వో రాములు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. బైరాములు మృతితో గురువారం జరగాల్సిన అతడి తమ్ముడి కుమారుడి వివాహ ం ఆగిపోయిందని గ్రామస్తులు తెలిపారు. చేవెళ్లలో యాచకుడు.. అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్న స్థానిక యువకులు చేవెళ్ల రూరల్: మండల కేంద్రంలో మతిస్థిమితంలేని ఓ యాచకుడు వడదెబ్బతో మృతిచెం దాడు. స్థానిక యు వకులు అతడి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కొన్నేళ్ల క్రితం చేవెళ్లకు వచ్చిన యాదగిరి అలియాస్ యాది(50) యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మండల కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయం, అయ్యప్ప దేవాలయం వద్ద ఉంటుండేవాడు. కొంతకాలం క్రితం యాదగిరికి మతిస్థిమితం కోల్పోయింది. ఇటీవల మండుతున్న ఎండలకు అతడు వడదెబ్బకు గురయ్యాడు. ఈక్రమంలో గురువారం ఆయన గురువారం అయ్యప్ప ఆలయం సమీపంలో కుప్పకూలిపడిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే అతడు మృతి చెందాడు. స్థానిక యువజన సంఘం సభ్యులు ఎం. యాదగిరి, బి. నర్సింలు, చింటు, జంగయ్య, శ్రీను, బాలాజి, అంజయ్య, రవి, సత్తయ్య తదితరులు యాచకుడి అంత్యక్రియలు నిర్వహించేందుకు మానవత్వంతో ముందుకు వచ్చారు. ఆస్పత్రి నుంచి యాదగిరి డప్పులతో ఆటోలో శవయాత్ర నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించారు. షాబాద్‌లో యువకుడు.. షాబాద్: వడదెబ్బతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన షాబాద్ మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. షాబాద్ గ్రామానికి చెందిన లింగాల రవికుమార్(25) ఉదయం ఇంటి వద్ద ఉండగా ఎండదెబ్బకు గురై కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికే అతడు మృతిచెందాడు. కాగా, మండలంలో వడదెబ్బకు గురై ఇటీవల ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. యువకుడి మృతితో కుటుంబీకులు కన్నీటిపర్యం తమయ్యారు. అధికారులు రవికుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరారు. సెంట్రింగ్ కార్మికుడు.. మేడ్చల్: మండల పరిధిలోని ఘనాపూర్‌లో వడదెబ్బకు గురై ఓ సెంట్రింగ్ కార్మికుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఏర్పుల వెంకటేష్ (39) స్థానికంగా సెంట్రింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల ఎండల్లో పని చేయడంతో ఆయన రెండు రోజులుగా ఆస్వస్థతకు గురయ్యాడు. ఈనేపథ్యంలో బుధవారం రాత్రి ఆయన తన ఇంట్లో మృతిచెందాడు. మరో ఘటనలో.. కుల్కచర్ల: కుల్కచర్ల మండలకేం ద్రానికి చెందిన మేకుల లక్ష్మయ్య(49) కొంతకాలంగా తన భార్యతో కలిసి చేవెళ్ల సమీపం లో కూలీపనులు చేస్తున్నాడు. ఈనేపథ్యంలో ఆయన బుధవారం సాయంత్రం వడదెబ్బకు గురై అస్వస్థకు గురయ్యాడు. దీంతో ఆయన అక్కడే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. అదేరోజు రాత్రి లక్ష్మయ్య స్వగ్రామానికి చేరుకున్నారు. అర్ధరాత్రి నిద్రలేచిన ఆయన నీళ్లు తాగి తిరిగి పడుకున్నాడు. గురువారం ఉదయం కుటుంబీకులు చూడగా లక్ష్మయ్య మృతిచెందాడు. బాకారంలో.. మొయినాబాద్: మండల పరిధిలోని బాకారం గ్రామానికి చెందిన కొండలకల్ల పెద్ద యాదయ్య(55) మాజీ వార్డు సభ్యుడు. బుధవారం ఆయన బంధువుల పెళ్లికి వెళ్లాడు. వడదెబ్బకు గురైన ఆయన రాత్రి ఇంటికి వచ్చి నీళ్లుతాగి నిద్రకు ఉపక్రమించాడు. గురువారం ఉదయం కుటుంబీకులు చూడ గా అప్పటికే మృతిచెందాడు. పెద్ద యాదయ్యకు భార్య నీలమ్మ, ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరారు. -
ఆక్రమణలపై ఆరా
కందుకూరు : తీగ లాగితే డొంక కదిలింది. పట్టణంలోని అంకమ్మ దేవాలయం ఇరువైపులా ఉన్న స్థలాల ఆక్రమణపై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఆక్రమణలపై ‘సాక్షి’ కథనాలు, స్థానిక ఎమ్మెల్యే పోతుల రామారావు ఆగ్రహం, స్థానికుల నుంచి వ్యతిరేకత వెరసి అక్రమార్కుల గుట్టురట్టయింది. శుక్రవారం ‘సాక్షి’లో ‘దేవుని పేరుతో దౌర్జన్యం’ శీర్షికతో జిల్లా టాబ్లాయిడ్ ఏడో పేజీలో ప్రచురించిన కథనానికి అధికారుల్లో చలనం వచ్చింది. అదే రోజు రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి దేవాలయానికి ఇరువైపులా ఉన్న స్థలాలను సబ్ కలెక్టర్ మల్లికార్జున పరిశీలించారు. ప్రధాన రోడ్డును ఆనుకుని ఉన్న దుకాణాల్లోని వ్యాపారుల వద్దకు వెళ్లి విచారించారు. నెలనెలా అద్దెలు ఎవరికి ఇస్తున్నారని సబ్ కలెక్టర్ ప్రశ్నించగా వారు దివి లింగయ్యనాయుడికి ఇస్తున్నామని చెప్పారు. ఆ వివరాలన్నీ సబ్ కలెక్టర్ నమోదు చేసుకున్నారు. ఆర్టీసీ డిపో ప్రవేశ ద్వారం నుంచి అంకమ్మ దేవాలయం ముఖ ద్వారం వరకు ఉన్న వ్యాపారుల నుంచి అధికారులు స్టేట్మెంట్లు రికార్డు చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ అంకమ్మ దేవాలయానికి ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలం మొత్తం మున్సిపాలిటీదేనని అక్కడి వ్యాపారులతో చెప్పారు. ఈ స్థలాలపై వచ్చే ఆదాయం కూడా దానికే చెందాలన్నారు. ఈ స్థలాలపై సమగ్ర విచారణ కోసం ఓ ట్రైనీ కలెక్టర్‌ని నియమిస్తామని ఆయన స్పష్టం చేశారు. పది రోజుల లోపు విచారణ చేసి స్థలాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అదే విధంగా ప్రతి దుకాణానికి మున్సిపాలిటీ తరఫున రసీదులు ఇచ్చి పన్నులు వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ రమణకుమారిని ఆదేశించారు. టీడీపీ నేత తిట్ల పురాణం సబ్‌కలెక్టర్ విచారణకు వచ్చి వెళ్లిన త ర్వాత టీడీపీ పట్టణ అధ్యక్షుడు రంగంలోకి దిగారు. ఆక్రమణలపై అధికారులు స్పందించారని తె లుసుకుని ఊగిపోయారు. స్థానిక ఎమ్మెల్యేపై అనవసరంగా నోరుపారేసుకున్నారు. అధికారులను సైతం ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. స్థలాలన్నీ దేవాలయానికి సంబంధించినవేనని అడ్డగోలుగా మాట్లాడారు. ఐఏఎస్ స్థాయి అధికారి వచ్చి స్థలాలన్నీ మున్సిపాలిటీవేనని చెప్పిన తర్వాత కూడా సదరు నేత వ్యవహరించిన తీరుపై స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. -
డ్వాక్రా పేరుతో టోకరా
కందుకూరు: డ్వాక్రా సంఘాల పేరుతో ఇసుక రవాణా డొల్లతనం బయటపడిన సంఘటన ఇది. మంగళవారం రేషన్‌షాపు తనిఖీకి వెళ్లిన ఆర్ఐ సంబంధిత డీలర్ రాకపోవడంతో వేచి చూస్తున్నారు. అదే సమయంలో ఓ నిర్మాణానికి ఇసుక తోలేందుకు లోడుతో ఓ ట్రాక్టర్ అక్కడికి వచ్చింది. ఈ ట్రాక్టర్ని ఆపిన ఆర్ఐ కృష్ణప్రసాద్ తనిఖీ చేశారు. డ్వాక్రా సంఘాల నుంచి జారీ చేసినట్లు ఉన్న స్లిప్‌ని పరిశీలించగా అందులో వివరాలు ఏమీ లేకుండా కేవలం తేదీ, ట్రాక్టర్ నంబరు మాత్రమే వేసి పంపారు. స్లిప్‌లో ఉండాల్సిన బిల్‌బుక్ నంబర్‌గాని, సీరియల్ నంబర్‌గాని లేకపోవడం గమనార్హం. అదే స్లిప్ పట్టుకుని అప్పటికే ఆ ట్రాక్టర్ యజమాని నాలుగు ట్రిప్పులు ఇసుకను తోలి వెళ్లాడు. అంటే దాదాపు ట్రిప్పుకు రూ.3వేల చొప్పున రూ.12వేల ఇసుకను అప్పటికే తరలించారు. కానీ ఒక ట్రిప్పుకి మాత్రమే స్లిప్ తీసుకున్నారు. అంటే మిగిలిన మూడు ట్రిప్పుల డబ్బులు నాయకుల జేబుల్లోకి చేరాయి. కందుకూరు మండలంలోని పాలూరు గ్రామంలో డ్వాక్రా సంఘానికి కేటాయించిన ఇసుక రీచ్‌లో జరిగిన తంతు. విషయం బయటపడడంతో రంగంలోకి దిగిన నాయకులు ఫోన్ల ద్వారా ఆర్ఐపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. ఇక చేసేదేమీ లేక ఆర్.ఐ.తీసుకున్న స్లిప్ సంబంధిత డ్రైవర్ చేతికి ఇచ్చి పంపించేశాడు. ఇదీ ఇసుక రవాణాలో జరుగుతున్న అవినీతి తంతు. -
మీరు మారకుంటే.. నేనే రిజైన్ చేసి వెళ్తా!
కందుకూరు : కందుకూరు రెవెన్యూ డివిజన్లోని 24 మండలాల తహశీల్దార్లు, రేషన్ డీలర్లతో సోమవారం స్థానిక తన కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ మల్లికార్జున వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదల బియ్యం విషయంలో ఎందుకు ఇంత గలీజుగా వ్యవహరిస్తున్నారని తహశీల్దార్లు, డీలర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు రెవెన్యూ డివిజన్లోని అవినీతి రాష్ట్రంలో మరెక్కడా ఉండదేమోనని సందేహం వ్యక్తం చేశారు. రేషన్ షాపుల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సబ్ కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. ప్రధానంగా ఏ షాపు ఎవరి పేరుపై ఉంది, ఎక్కడ నిర్వహిస్తున్నారు, లెసైన్స్ ఉందా లేదా అనే వివరాలు ఉండాలన్నారు. తప్పనిసరిగా ప్రతి నెలా 5 నుంచి 15వ తేదీ వరకు నిర్దేశించిన సమయాల్లో సరుకులు పంపిణీ చేయాలన్నారు. డీలర్ నిబంధనలు పాటిస్తున్నాడో లేదోనని తహశీల్దార్ ప్రతినెలా ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయాలని చెప్పారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుంటే ఎట్టి పరిస్థితులోనూ నిత్యావసరాలు కేటాయించవద్దని తహశీల్దార్లతో పేర్కొన్నారు. కందుకూరులోని 8వ నంబర్ షాపునకు ఇప్పటికీ సరులకు పంపిణీ కాలేదంటూ సంబంధిత తహశీల్దార్‌పై మండిపడ్డారు. రాజీకీయ ఒత్తిళ్తు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పినా వినిపించుకోరా.. అంటూ సబ్ కలెక్టర్ మండిపడ్డారు. సరుకులు మాయమైతే ఎలా.. సరుకులు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి షాపులకు చేరే వరకూ వాహనం వెంటే రూట్ ఆఫీసర్ ఉండాలని, కందుకూరు ప్రాంతంలో రూట్ ఆఫీసర్లే ఉండడం లేదని సబ్ కలెక్టర్ అన్నారు. డీలర్లు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి మధ్యలోనే రూట్ ఆఫీసర్లు వెళ్లిపోతున్నారని ఆవేదనగా మాట్లాడారు. ఇంత కక్కుర్తి పడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. డీలర్లు ఎవ్వరికీ మామూళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, తమ అధికారులు ఎవరైనా మామూళ్ల కోసం ఒత్తిడి చేస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సొంత ఆలోచనలు, సొంత వ్యవహారాలు ఉంటే ఇప్పటికైనా మానుకోవాలని తహశీల్దార్లకు సబ్ కలెక్టర్ క్లాస్ పీకారు. -
ఇసుకే మేత
కందుకూరు రూరల్: ఇసుక రీచ్‌లు అధికార పార్టీ నాయకులకు కల్పతరువుగా మారాయి. ఇసుక రీచ్‌ల నిర్వహణంతా పేరుకే గ్రామైక్య సంఘాలది..పెత్తనం మాత్రం అధికార పార్టీ నాయకులది. ఒక ట్రక్కు నగదు చెల్లించి..పది ట్రక్కు ఇసుక తరిస్తున్నారు. అక్రమంగా వెళ్లే ఇసుక సొమ్ముంతా అధికార పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ట్రాక్టర్ యజమానులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారికంగా ప్రభుత్వం ఇసుక రీచ్‌లు ప్రారంభించి అధికార పార్టీ నాయకులకు అప్పగించినట్లుంది. డ్వాక్రా సంఘాల ముసుగులో... ఇసుక రీచ్‌లను డ్వాక్రా మహిళలకు అప్పగిస్తూ ఇటీవల కలెక్టర్ మండలంలోని పాలేరు, మన్నేరుల్లో ఇసుక రీచ్‌లను ప్రారంభించారు. సమీపంలోని గ్రామాల డ్వాక్రా మహిళలకు ఇసుక అమ్మకాల బాధ్యత అప్పగించారు. పేరుకు గ్రామైక్య సంఘాలే కానీ..పరోక్షంగా అధికార పార్టీ నాయకులకు అప్పగించినట్లుంది. కలెక్టర్ రీచ్‌లను ప్రారంభించారే తప్ప విక్రయాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించిన దాఖలాలు లేవు. నిబంధనలిలా.. మండలంలోని పాలేరు, మన్నేరుల్లో ఇసుర రీచ్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు గుర్తించారు. గ్రామైక్య సంఘ అధ్యక్షురాలి పర్యవేక్షణలో ఇసుకను విక్రయించాల్సి ఉంది. ఆయా గ్రామాల వద్ద స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి ముందుగా ఇసుకను అక్కడ నిల్వ చేస్తారు. స్టాక్ పాయింట్ నుంచి ఇసుక కొనుగోలు చేసుకొని వెళ్లాలి. క్యూబిక్ మీటరు 600 చొప్పున ఒక ట్రాక్టర్‌కు మూడు క్యూబిక్ మీటర్లు పడుతుంది. ఒక ట్రాక్టర్ ట్రక్కుకు 1800 మీ సేవలో గానీ బ్యాంక్‌లో కానీ చెల్లించి సంబంధిత రసీదును గ్రామైక్య సంఘం బాధ్యులకు చూపిస్తే ఇసుక విక్రయిస్తారు. అంతే కాకుండా గ్రామైక్య సంఘం వారు ఐదు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుంటారు. నేరుగా గ్రామైక్య సంఘాల వారు ఇసుకను తరలించాలంటే రెండు కిలోమీటర్లు లోపు 250, పది కిలోమీటర్లలోపు 500 చెల్లించాలి. ఆ తర్వాత కిలోమీటరుకు 25 చొప్పున చెల్లిస్తే ఇసుక తీసుకెళ్లవచ్చు. ఇసుక నదిలో ఒకరు, స్టాక్‌పాయింట్ వద్ద ఒకరిని నియమించాల్సి ఉంది. నదిలో ఎన్ని ట్రక్కుల ఇసుక ఎత్తారు... స్టాక్‌పాయింట్ వద్ద ఎన్ని ట్రక్కులు పోశారు, ఎన్ని ట్రక్కులు విక్రయించారో రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంది. ఇందు కోసం ఒక కంప్యూటర్ను కూడా ఏర్పాటు చేయాలి. తర్వాత జీపీఆర్ఎస్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇసుక వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్ని 25 శాతం గ్రామైక్య సంఘాలకు, 75 శాతం రైతు సాధికార సంస్థకు వెళ్తుందని వ్యాపారాన్ని ప్రారంభించారు. కానీ ఇవేమీ అక్కడ జరగడం లేదు. జరుగుతోందిలా..: కందుకూరు మండల పరిధిలోని పాలూరు, మాచవరం గ్రామం వద్ద మన్నేరులో, విక్కిరాలపేట వద్ద పాలేరులో ఇసుక రీచ్‌లను ప్రారంభించారు. రీచ్‌లను పేరుకే గ్రామైక్య సంఘాలకు అప్పగించారు. పెత్తనం అంతా ఆయా గ్రామాల నాయకులదే. ఒక ట్రాక్టర్ ట్రక్కుకు నగదు బ్యాంక్‌లోగానీ, మీ సేవాలో గానీ చెల్లించి రసీదు తీసుకొస్తున్నారు. ఆ రసీదుపై ఒక ట్రక్కు ఇసుక మాత్రమే ఇవ్వాల్సి ఉంది. కానీ నాయకులకు ఎంతో కొంత ముట్టజెప్పి అనేక ట్రక్కులు తీసుకెళ్తున్నారు. నిబంధనల మేరకైతే 1800లు చెల్లించాలి. కానీ నాయకులకు 1000ల నుంచి 1500లు చెల్లిస్తే చాలు ట్రక్కులు ఇసుకతో నింపి పంపిస్తున్నారు. ఇలా అడ్డదారిలో ఇసుక విక్రయిస్తూ నాయకులు జేబులు నింపుకుంటున్నారు. మధ్యలో ఎవరైనా ట్రాక్టర్లను తనిఖీ చేస్తే ఒక ట్రక్కుకు తీసుకున్న రసీదును చూపిస్తూ ట్రాక్టర్ యజమానులు తప్పించుకుంటున్నారు. పాలూరు వద్ద మన్నేరులో ఇప్పటి వరకు 19 వేల ఇసుక వ్యాపారం జరిగింది. దీని ప్రకారం నదిలో 31 క్యూబిక్ మీటర్లు మాత్రమే తవ్వకాలు జరిగి ఉండాలి. కానీ నదిలో చూస్తే భారీగా క్వారీలు ఏర్పడి ఉన్నాయి. దీనిని చూస్తే ఇసుక అక్రమంగా ఎంత తరలి వెళ్తోందో అర్థం చేసుకోవచ్చు. స్టాక్‌పాయింట్ వద్ద నుంచి విక్రయాలు నిర్వహించాల్సి ఉండగా నేరుగా మన్నేరులో నుంచే ఇసుక విక్రయిస్తున్నారు. స్టాక్ పాయింట్ వద్ద కొన్ని ఇసుక ట్రక్కులు తోలినప్పటికీ ఇక ట్రక్కు కూడా విక్రయించలేదు. మాచవరం, విక్కిరాలపేట వద్ద కూడా ఇదే పరిస్థితి. ఇసుక తరిలించే నదుల వద్ద ఒక్కరు కూడా గ్రామైక్య సంఘం మహిళ కనిపించడం లేదు. అంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో నడిచిపోతోంది. పట్టించుకోని అధికారులు.. ఇసుక రీచ్‌ల వద్ద వ్యాపారం ఎలా జరుగుతుందో పరిశీలించాల్సిన అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుక రీచ్‌ల వద్ద శిక్షణ పొందిన వారిని నియమించాల్సి ఉన్నా ఇంత వరకు దాని ఊసులేదు. రీచ్‌ల వద్ద పర్యవేక్షణకు నియమించిన వారు శిక్షణలో ఉన్నారని ఐకేపీ అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు ఇసుక విక్రయాలు నిలిపేయాలని కొందరు గ్రామస్తులు ప్రశ్నించినా అధికారులు పెడచెవిన పెడుతున్నారు. -
సమస్యలకు చెక్
కందుకూరు:మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు ఇకపై కూలిడబ్బుల పంపిణీ విషయంలో జాప్యాన్ని నివారించడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడానికి సమాయత్తమైంది. మధ్యలో ఏజెన్సీలు, సీఎస్పీల పంపిణీ గొడవ లేకుండా బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా కూలిడబ్బులను జమ చేసేలా ప్రయోగాత్మకంగా జిల్లాలోని కందుకూరు మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి పనులు ప్రారంభించింది. ఈ విషయాన్ని ఇటీవల డ్వా మా అధికారులు ప్రకటించారు. దీంతో కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలో పరిష్కారం లభించనుంది. సమస్యలను అధిగమించేందుకు.. ఇప్పటి వరకు కూలీలు చేసిన పనులకు సంబంధించిన నగదును మండల పరిషత్ కార్యాలయం నుంచి ఎంత మందికి ఎంత కూలిడబ్బులు ఇవ్వాలో సీఆర్డీకి నివేదిస్తే, అక్కడి నుంచి నగదు బదిలీ ఆదేశాల ద్వారా యాక్సిస్ బ్యాంక్‌కు చేరేది. ఆ బ్యాంక్ ఆధ్వర్యంలో మణిపాల్, ఫినో వంటి ఏజెన్సీల ద్వారా కూలీలకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. దీంతో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. సీఎస్పీలు సమయానికి రాకపోవడం, బినామీలు వంటి పలు సమస్యలను అధికారులు గుర్తించారు. దీంతో అన్ని సమస్యలను అధిగమిస్తూ క్షేత్ర స్థాయిలో పారదర్శకంగా పని చేసేలా చేయడానికి ప్రయోగాత్మకంగా కందుకూరు మండలాన్ని ఎంపిక చేసి పనులు ప్రారంభించారు. కూలీలకు నేరుగా ఆయా బ్యాంక్ ఖాతాల్లో కూలీ డబ్బు జమ అవుతుంది. దీంతో పాటు వారి సెల్ నంబర్‌కు జమ చేసిన వివరాలతో కూడిన మెసేజ్ చేరుతుంది. అవసరమైతే ఆ సెల్ నంబర్‌కు ఉన్నతాధికారులు ఫోన్ చేసి కూలీలతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో అవకతవకలను నివారించే అవకాశం ఉంది. పథకం పటిష్టంగా అమలైతే కూలీ డబ్బులు అందలేదని ఆందోళన చెందాల్సిన అవసరం ఇకపై తప్పనుంది. పనులు ప్రారంభం.. మండలంలో 15,453 జాబ్ కార్డులు ఉన్నాయి. 653 శ్రమశక్తి సంఘాల్లో 13,465 మంది కూలీలు పని చేస్తున్నారు. ప్రస్తుతం కూలీల నుంచి బ్యాంక్ ఖాతాల వివరాలతో పాటు సెల్ ఫోన్ నంబర్లను సిబ్బంది సేకరించే ప్రయత్నంలో నిమగ్నమైంది. ఇక్కడ ప్రయోగాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుతో మంచి ఫలితాలు వస్తే తెలంగాణ రాష్ర్టమంతటా అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
మళ్లీ వానదెబ్బ..
కందుకూరు, న్యూస్‌లైన్: మండల పరిధిలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి అపార నష్టం వాటిల్లింది. ఆకులమైలారంలో పిడుగు పాటుకు రైతు మృతి చెందగా, నేదునూరు సమీపంలోని పొలంలో రంగని బాల్‌రాజ్‌కు చెందిన ఓ ఎద్దుపై పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందింది. మహ్మద్‌నగర్‌లో ఈదురుగాలులకు ఇంటి రేకులు లేచిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న తల్లోజి బ్రహ్మచారి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ముచ్చర్లలో వడగళ్లు పడి వరి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో గుమ్మడవెళ్లి, కందుకూరు, మీర్కాన్‌పేట, దెబ్బడగూడ, నేదునూరు, జైత్వారం, కొత్తగూడ, గూడూరు, కొత్తూర్, తదితర గ్రామాల్లో కోతకొచ్చిన వరి పంట నేలవాలగా, మామిడి కాయలు నేలరాలి నష్టం వాటిల్లింది. గుమ్మడవెళ్లి, మహ్మద్‌నగర్ గ్రామాల పరిధిలో విద్యుత్ స్థంభాలు కూలిపోగా, కొన్ని చోట్ల తీగలు తెగిపడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. షాబాద్‌లో.. షాబాద్: షాబాద్ మండలంలో సోమవారం భారీ వర్షం కురిసింది. మండలంలోని నాగరకుంట. షాబాద్, కుమ్మరిగూడ. హైతాబాద్, మద్దూర్, సోలీపేట్ తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఇళ్లు. పశువుల పాకలు దెబ్బతిన్నాయి. ఇళ్లు దెబ్బతిన్న బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గండేడ్‌లో.. గండేడ్: కొనుగోలు కేంద్రంలో నిర్వాహకుల దైన్యానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. గండేడ్‌లోని కొనుగోలు కేంద్రంలో వెయ్యి బస్తాల వరి ధాన్యం సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం కొనుగోలు చేసి తడిసి ముద్దయ్యేలా నిర్లక్ష్యంగా వ్యహరించిన అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. కనీసం తాడ్పాలీన్ (తాడుపత్రీలు) కూడా ధాన్యంపై కప్పే దిక్కులేకుండా పోయింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రమలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంవల్లే రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకునేందుకే మొగ్గుచూపుతున్నారన్నారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రం ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
5 కోట్లు అన్నారు.. ఉన్నవి జత బట్టలే!!
వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్తుంటే చాలు.. ఆ వాహనాల్లోను, సూట్కేసుల్లోను కట్టలకొద్దీ డబ్బులు ఉన్నాయంటూ గోల చేయడం టీడీపీ నాయకులకు బాగా అలవాటైపోయింది. ప్రకాశం జిల్లా కందుకూరులో ఇలాగే 5 కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నారంటూ నానా హడావుడి చేసి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొట్టి తీరా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి చూస్తే అందులో కేవలం ఒక జత బట్టలు, ఒక దుప్పటి మాత్రమే కనిపించడంతో టీడీపీ నాయకులు కంగుతిన్నారు. వివరాలిలా ఉన్నాయి... ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న పోతుల రామారావు బంధువు ఒకరు కారులో వస్తుండగా, ఆ కారులో 5 కోట్ల రూపాయలు ఉన్నాయని, వాటిని పంచడానికి తీసుకెళ్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. అంతేకాదు, కందుకూరు టీడీపీ అభ్యర్థి దివి శివరాం తన కారును తీసుకొచ్చి, ఆ కారుకు అడ్డంగా పెట్టి నానా గందరగోళం మొదలుపెట్టారు. దాదాపు 200-300 మంది టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని, ఆ ప్రాంతంలోనే ఉన్న ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహనరెడ్డి పీఏ పరంధామిరెడ్డిని కొట్టి, ఆయన చొక్కా కూడా చించేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని సమాచారం అందుకున్న పోతుల రామారావు కూడా అక్కడకు చేరుకున్నారు. తీరా కారును పోలీసు స్టేషన్ వద్దకు తీసుకెళ్లి మొత్తం తనిఖీ చేయగా, అందులో ఉన్న సూట్‌కేసులో కేవలం ఒక జత దుస్తులు, ఒక దుప్పటి మాత్రమే ఉన్నాయి. టీడీపీ నాయకులు చెప్పినట్లుగా 5 కోట్లు కాదు కదా.. 5 వేల రూపాయలు కూడా దొరకలేదు. దీంతో తమపై దౌర్జన్యం చేసి, కారు అడ్డుపెట్టి, తమవాళ్లను కొట్టిన టీడీపీ అభ్యర్థి దివి శివరాం, ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని రామారావు కోరారు. ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న అరాచకాలను అడ్డుకోవాలని చెప్పారు. -
కేసీఆర్.. తేల్చుకుందాం రా!
- తెలంగాణ అభివృద్ధి ఎవరు చేశారో! - బోధన్, జగిత్యాల, కందుకూరు సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు బోధన్, కందుకూరు, న్యూస్‌లైన్/సాక్షి, కరీంనగర్: తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకుందాం రమ్మని టీడీపీ అధినేత చంద్రబాబు కేసీఆర్‌కు సవాల్ విసిరారు. బోధన్ వేదికగా ఇందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా బోధన్, కరీంనగర్ జిల్లా జగిత్యాల, రంగారెడ్డి జిల్లా కందుకూరులో జరిగిన బహిరంగ సభలలో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేతపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి, మోసకారి, అబద్ధాలకోరు, తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం పాటు పడని ఆయనకు ఓట్లడిగే హక్కు లేదని విమర్శించారు. అబద్ధాలు మాట్లాడటం, పెద్ద, చిన్న తేడాలేకుండా, బండ మాటలు మాట్లాడటం ఆయనకు అలవాటై పోయిందన్నారు. టీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ అని, ఎప్పటికైనా అమ్ముడుపోయే సరుకని ధ్వజమెత్తారు. ఆపార్టీలో మంచోళ్లు ఉండరని, 420లే ఉంటారని పేర్కొన్నారు. దొంగ కేసీఆర్‌తో బతుకులు ఆగమవుతాయని, సమాజహితం కోసం మేం ఆలోచిస్తుంటే, కేసీఆర్ మాత్రం తన కుటుంబం కోసం ఆలోచిస్తున్నాడని విమర్శించారు. నన్నే జైలుకు పంపుతానంటావా? ‘‘నిజాం షుగర్స్ ప్రయివేటీకరణపై నన్నే జైలుకు పంపుతానంటావా... నా స్థాయి ఏమిటో తెలియకుండా అంటావా’’ అంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపినా తనను ఏమీ చేయలేక పోయిందన్నారు. ‘‘ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది. నీవు దోచుకున్న ఆస్తులపై విచారణ జరిపి, నిన్ను నీ కుటుంబ సభ్యులందరినీ శాశ్వతంగా జైలులో పెడతా’’ అని హెచ్చరించారు. తన జోలికి వస్తే ఊరుకోబోనని, సైకిల్ జోరు పెంచి చక్రాల కింద తొక్కిస్తానన్నారు. ‘కేసీఆర్ తన ఫాం హౌజ్‌లో కూర్చొని అవినీతి పంట పండిస్తాడు.. ఎకరానికి రూ.కోటి చొప్పున పండిస్తాడు.. మాట్లాడితే ఎదురుదాడికి దిగుతాడు’ అని మండిపడ్డారు. ‘2004 ఎన్నికల్లో కరీంనగర్, 2009లో మహబూబ్‌నగర్, ఇప్పుడేమో మెదక్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నావ్. నువ్వో వలస పక్షివి’ అంటూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. సభలు ఆలస్యం...ప్రజల అసహనం ఉదయం 10.45గంటలకు బోధన్ రావలసిన చంద్రబాబు నాలుగు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 1.45కు వచ్చారు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్జిగ పంపిణీలో గందరగోళం ఏర్పడటంతో పోలీసులు జనాన్ని చెదరగొట్టారు. సభ అనంతరం నిర్వాహకులు మహిళలకు డబ్బులు పంపిణీ చేయడం కనిపించింది. -
'సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు'
కందుకూరు: ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో చేపట్టిన ‘ వైఎస్సార్ జనభేరి’లో మేకపాటి ప్రసంగించారు. సీమాంధ్రలోని అన్నిస్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ తమ పార్టీ సత్తా చాటుతుందని చెప్పారు. మహబుబాబాద్, ఖమ్మం, మల్కాజ్ గిరి ఎంపీ స్థానాలను వైఎస్ఆర్ సీపీ గెల్చుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోనూ వైఎస్ జగన్ ముఖ్య భూమిక పోషించబోతున్నారని మేకపాటి అన్నారు. -
నోటుకు ఓటు అమ్ముకోవద్దు
కందుకూరు, న్యూస్‌లైన్:: ఎన్నికల్లో విచ్చలవిడిగా ధనం ఖర్చు చేయడం.. డబ్బున్న వాళ్లకే రాజకీయాల్లో ప్రాధాన్యం పెరగడం. ఆదర్శాలు, ఆశయాలు కేవలం మాటలకే పరిమితం కావడం.. ప్రజల్ని నాయకులు తప్పుదోవ పట్టించి తమ పబ్బం గడుపుకొంటున్నారని.. ఓటర్లు సైతం నోటుకు ఓటు అమ్ముకుంటున్నారనే విషయమై ఆయన ఎంతగా ఆవేదనకు గురయ్యారో ఈ చిత్రమే నిదర్శనంగా నిలుస్తోంది. మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కందుకూరు జెడ్పీటీసీ అభ్యర్థి పూలగాజుల జంగయ్య వినూత్న రీతిలో నిరసన వ్యక్తంచేశారు. నోటుకు ఓటు అమ్ముకునే సంప్రదాయాన్ని పారదోలాలంటూ మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ.. అంబేద్కర్, మహాత్మా జ్యోతీరావు పూలే, బాబూ జగ్జీవన్‌రామ్ సిద్ధాంతాల సాధన కోసమే తాను జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. ఎన్నికల్లో ఓటు హక్కును డబ్బుకు అమ్ముకుంటే తమను తాము మోసం చేసుకున్నట్లేనన్నారు. జనరల్ కోటాలో ప్రతి ఒక్కరూ పోటీ చేయవచ్చన్నారు. బలహీనవర్గాల అభ్యున్నతి కోసం తాను జెడ్పీటీసీ అభ్యర్థిగా రంగంలో ఉన్నానని.. అల్మరా గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన వేడుకున్నారు. జంగయ్యకు మద్దతుగా నాయకులు ఢిల్లీ రాములు ముదిరాజ్, గండు ఈశ్వర్ మాదిగ, సత్తయ్య పాల్గొన్నారు. -
చిన్నారిపై అత్యాచారయత్నం
కందుకూరు, న్యూస్‌లైన్: అభంశుభం తెలియని చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఆకులమైలారం గ్రామానికి చెందిన అచ్చన భిక్షపతి(31) స్థానికంగా మేస్త్రీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి ఇంటి సమీపంలో ఉంటున్న ఓ బాలిక(8) తల్లి చనిపోవడంతో నాయనమ్మ దగ్గర ఉంటూ స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. బుధవారం మధ్యాహ్నం సమయంలో పాఠశాల నుంచి వచ్చిన బాలికను భిక్షపతి తినుబండారాల కోసం దుకాణానికి పంపించాడు. వాటిని తీసుకుని చిన్నారి ఇంట్లోకి రాగానే అతడు తలుపులు వేసి అత్యాచారానికి యత్నించాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక కేకలు వేస్తూ బయటికి పరుగెత్తి స్థానికులకు విషయం తెలిపింది. గ్రామస్తులు భిక్షపతిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని కందుకూరు పోలీసులకు అప్పగించారు. సీఐ జానకీరెడ్డి ఆధ్వర్యంలో నిందితుడిపై ‘నిర్భయ’ చట్టం కింద కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు. -
నీరుగారిన లక్ష్యం
ప్రజల దాహార్తి తీర్చని ఆత్మకూరు-ఆనందపురం మంచినీటి పథకం కందుకూరు మండలంలో 8 గ్రామాలు, ఉలవపాడులో 6 గ్రామాలకు అందని నీరు * 10 కోట్లు ఖర్చు చేసినా నెరవేరని పాలకుల లక్ష్యం మెయింటెనెన్స్ ఖర్చు నెలకు * 90 వేలకుపైనే అధికారులు, కాంట్రాక్టర్‌పై దుమ్మెత్తి పోస్తున్న ఆయా గ్రామాల ప్రజలు కందుకూరు రూరల్, న్యూస్‌లైన్ : వేసవి ముంచుకొస్తోంది. మంచినీటి పథకాలు మరమ్మతులకు గురై ప్రజలు అల్లాడుతున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన పథకాలు అలంకార ప్రాయంగా మారాయి. మూలకు చేరిన మోటార్లు, పైపులైన్ల పునరుద్ధరణకు కాంట్రాక్టర్ల చర్యలు శూన్యం. పథకాల మెయింటినెన్స్ ఖర్చుల పేర నిధులు మాత్రం కొంద రి జేబుల్లోకి వెళ్తున్నాయి. ప్రజల దాహార్తి తీర్చడంతో అటు అధికారులు, ఇటు పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. భారీ మంచినీటి ప్రాజెక్టు రాకతో పంచాయతీల్లోని మంచినీటి పథకాలు మూలనపడ్డాయి. కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు, కందుకూరు మండలాల ప్రజల దాహార్తి తీర్చేందుకు * 10 కోట్లతో నిర్మించిన ఆత్మకూరు-ఆనందపురం మంచినీటి పథకం నిరుపయోగంగా మారుతోంది. మోటార్లను సకాలంలో మరమ్మతులు చేయించడంలో అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదీ.. పథకం లక్ష్యం ఉలవపాడు, కందుకూరు మండలాల్లోని 42 గ్రామాలకు మంచినీరు సరఫరా చేసేందుకు ఉలవపాడు మండలం ఆత్మకూరు పంచాయతీలోని చినిగేవారిపాలెం సమీపంలో మన్నేరు వద్ద మంచినీటి పథకాన్ని నిర్మించారు. ఉలవపాడు మండలంలో 34, కందుకూరు మండలంలో 8 గ్రామాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించారు. 2011లో పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ప్రారంభం నుంచి మంచినీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆయా గ్రామాల ప్రజలు చెప్తున్నారు. కాంట్రాక్టర్ అవినీతికి పాల్పడి పైపులైన్లు సక్రమంగా నిర్మించకపోవడంతో కరేడు పంచాయతీలోని కొన్ని గ్రామాలకు నీటి సరఫరా తొలి నుంచే నిలిచిపోయింది. ఇలా ఉలవపాడు మండలంలో సుమారు 6 గ్రామాలకు ఇప్పటి వరకూ నీరు సరఫరా కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ట్యాంకులు నిర్మించినా నీరు సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. పైపుల నిర్మాణం సమయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ తన ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు చేపట్టి చేతులు దులుపేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అలంకారప్రాయంగా ట్యాంక్‌లు కందుకూరు మండలంలో ఆనందపురం, శ్యామీరపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన మంచినీటి పథకం ఓవర్‌హెడ్ ట్యాంకులు అలంకార ప్రాయంగానే మిగిలాయి. 2011లో ట్యాంకు నిర్మిస్తే ఇప్పటి వరకూ చుక్క నీరు ట్యాంక్‌కు ఎక్కలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారురు. వాస్తవానికి అన్ని బజార్లలో పైపులు వేయాల్సి ఉండగా అరకొర వేసి మమ అనిపించారు. ఆనందపురం, చుట్టుగుంట, గళ్లవారిపాలెం, దివివారిపాలెం, గనిగుంటలలో నిర్మించిన ట్యాంక్‌ల పరిస్థితీ అంతే. దివివారిపాలేనికి అరకొర నీరు వస్తున్నా సరఫరా సక్రమంగా లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక గనిగుంటలోని ఓవర్‌హెడ్ ట్యాంకుకు పైపుల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. నెలనెలా ఖర్చు తడిసి మోపెడు: పథకం మెయింటినెన్స్‌కు నెలకు * 90 వేలకుపైగానే ఖర్చు చేస్తున్నారు. ఈ నిధులను పథకం ఆపరేటర్, ఆయా గ్రామాల్లోని ఓవర్‌హెడ్ ట్యాంక్‌ల వద్ద వారికి జీతాలు, పైపులైన్ల మరమ్మతులకు ఖర్చు చేస్తున్నారు. కందుకూరు మండలంలోని ఎనిమిది గ్రామాలకు పైపు లైన్లు సక్రమంగా లేవు. లీకులతో నీరు వృథా అవుతోంది. 20 రోజుల నుంచి నిలిచిన నీటి సరఫరా మన్నేరులో నిర్మించిన పథకానికి సంబంధించిన మోటార్ల మరమ్మతులకు గురయ్యాయి. 20 రోజులు గడుస్తున్నా అధికారులు, కాంట్రాక్టర్ పట్టించుకోలేదు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం గమనార్హం. దీంతో ఆయా గ్రామాల ప్రజలు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. కొందరు పట్టణ ప్రాంతాలకు వెళ్లి నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఉప్పునీటినే తాగే పరిస్థితి ఏర్పడింది. మరమ్మతులు చేయిస్తున్నాం: రాజశేఖర్, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్, ఉలవపాడు పథకానికి సంబంధించిన మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. వాటిని ఎప్పటికప్పుడు బాగు చేయిస్తున్నాం. రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తవుతాయి. పథకం పరిధిలోని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయిస్తున్నాం. -
ఊరించి..ఉసూరుమనిపించారు
కందుకూరు, న్యూస్‌లైన్: లక్ష వరకు రుణం ఇస్తామన్నారు..ఇంత మందికి రుణాలిస్తున్నామంటూ ఘనంగా సమావేశాలు పెట్టి లబ్ధిదారుల జాబితాను ప్రకటించి చివరికి చేతులెత్తేశారు. జాబితాలో పేరు చూసుకున్న లబ్ధిదారుడు మాత్రం రుణం కోసం రెండు నెలల నుంచి కార్యాలయాలు, బ్యాంక్‌లు చుట్టూ తిరుగుతున్నా సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఇండిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ కింద వ్యక్తిగత రుణాలు మంజూరైన లబ్ధిదారుల పరిస్థితి ఇది. ఇలా మంజూరు చేస్తారు.. ఈ యాక్షన్ ప్లాన్ కింద ఎంపికైన నిరుద్యోగులకు స్వయం ఉపాధి పొందేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. ఒక లబ్ధిదారుడికి లక్ష వరకు రుణం ఇస్తారు. దీనికి గాను ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం, బీసీలకు 50 శాతం, మైనార్టీలకు 50 శాతం సబ్సిడీని మంజూరు చేస్తుంది. దీంతో బ్యాంకులో రుణం పొందిన లబ్ధిదారుడు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని మాత్రమే బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంది. అంటే లక్ష రూపాయల రుణం పొందితే ఎస్సీ, ఎస్టీలు సబ్సిడీపోను * 40 వేలు, బీసీలు * 50 వేలు, మైనార్టీలు *60 వేలు బ్యాంక్‌లకు చెల్లించాలి. ఈ ప్రక్రియ మొత్తం మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపాలిటీలో కమిషనర్ పర్యవేక్షణలో జరగాలి. లబ్ధిదారుల ఎంపిక దగ్గర నుంచి రుణం మంజూరు వరకు అధికారులు సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంది. అయితే అధికారులు ఎంపిక చేసిన జాబితా మొత్తం ప్రస్తుతం తప్పుల తడకగా తయారైంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఇష్టారీతిన లబ్ధిదారులను ఎంపిక చేయడంతో కొంత మంది పేర్లపై రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకు అధికారులు నిరాకరిస్తున్నారు. అలాగే ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడంతో కొంతమంది పేర్లు తిర స్కరణకు గురవుతున్నాయి. రెండు నెలల నుంచి ఎదురుచూపులు నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బ్యాంక్‌ల నుంచి రుణాలు మంజూరు చేసి ప్రోత్సహిస్తారు. ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ కింద వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారుల జాబితాను రెండు నెలల క్రితమే అధికారులు ప్రకటించారు. దీనిలో భాగంగా రెండు నెలల క్రితమే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. వీటిలో కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో 637 మందిని, లింగసముద్రం మండలంలో 220, గుడ్లూరు మండలంలో 318, ఉలవపాడు మండలంలో 200, వలేటివారిపాలెం మండలంలో 210, కందుకూరు మండలంలో 200ల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ నేటికీ ఒక్క లబ్ధిదారుడికి కూడా రుణం మంజూరు కాలేదు. ఎంపికైన లబ్ధిదారులు కార్యాలయాలు, బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ జీఓలతో ఔట్.. లబ్ధిదారుల ఎంపిక సమయంలో ఏ నిబంధనలు విధించని ప్రభుత్వం... ఆ తరువాత ఇచ్చిన జీఓలతో జాబితా నుంచి కొన్ని పేర్లు తిరస్కరిస్తున్నారు. వీటిలో ప్రధానంగా ఇటీవల వచ్చిన జీఓ నంబర్ 101 ద్వారా రుణం పొందేందుకు వయో పరిమితి విధించారు. దీని ప్రకారం బీసీలకు 40 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 45 ఏళ్ల గరిష్ట వయోపరిమితి విధించారు. అలాగే కుటుంబ ఆదాయం * 60 వేల లోపు ఉండాలి. వీరు మాత్రమే అర్హులంటూ నిబంధనలు విధించారు. దీంతో అధికారులు తయారు చేసిన జాబితా నుంచి అనేక మంది పేర్లు గల్లంతవుతున్నాయి. ఒక్క గుడ్లూరు మండలంలోని దాదాపు 80 మంది లబ్ధిదారులను అనర్హులుగా తిరస్కరించారు. అలాగే కందుకూరు మండలంలో 55 మంది అనర్హులయ్యారు. ఈ విధంగా ప్రతి మండలంలో ముందు రుణం పొందేందుకు అర్హులంటూ ఆశ కల్పించి ప్రస్తుతం రాలేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం జాబితా నుంచి అనర్హులైన వారి స్థానంలో అధికారులు కొత్తవారిని ఎంపిక చేసి పంపుతున్నారు. సబ్సిడీ రాక నిలిచిన రుణాలు: మరోపక్క అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. రుణాలకు అర్హుల జాబితాలు కార్పొరేషన్లకు చేరినా సబ్సిడీ మాత్రం మంజూరు కావడం లేదు. లబ్ధిదారుడి అకౌంట్లో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ జమైతేనే రుణాలిస్తామంటూ బ్యాంక్ మేనేజర్లు పెండింగ్ పెడుతున్నారు. దీంతో అర్హులైన లబ్ధిదారులకు సైతం రుణాలు మంజూరు కాని పరిస్థితి నెలకొంది. ఈ విధంగా ప్రతి మండలం నుంచి అర్హులైన జాబితాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు చేరినా సబ్సిడీ రాలేదనే కారణంతోనే రుణాలు నిలిచిపోతున్నాయి. ఉదాహరణకు కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో 262 మంది అర్హులైన జాబితాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు పంపారు. అలాగే లింగసముద్రం నుంచి 70 మంది, కందుకూరు మండల పరిధిలో 92 మంది బ్యాంక్‌ల నుంచి విల్లింగ్ లెటర్ తీసుకుని సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ రాకపోవడంతో రుణం పొందలేకపోతున్నారు. ప్రతి మండలంలో ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే బ్యాంకుల అధికారులు లబ్ధిదారులను నానా తిప్పలు పెడుతున్నారు. అధికారులు ఎంపిక చేసి జాబితాను పంపినా.. బ్యాంక్‌లు రుణాలిచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఎంపికైన లబ్ధిదారులకు నెల రోజుల్లోపే రుణం ఇస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పినా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మరో రెండు, మూడు నెలలు పట్టినా ఆశ్చర్యం లేదని, ప్రభుత్వం సబ్సిడీ ఎప్పుడు విడుదల చేస్తుందో తమకు తెలియదని అధికారులే చెప్తున్నారు. -
గూటికి చేరేదెప్పుడో?
కందుకూరు, న్యూస్‌లైన్ : కందుకూరు హౌసింగ్ డివిజన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన ఇళ్లలో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్ల పరిస్థితి అయోమయంలో ఉంది. రెండు నెలల పాటు ప్రభుత్వ అధికారులు సమ్మెలోకి వెళ్లడంతో ఆ సమయంలో నిర్మాణం మొదలుపెట్టిన ఇళ్లకు సంబంధించిన బిల్లులు ఇంతవరకు రాలేదు. దీంతో కొన్ని మధ్యలో ఆగిపోయాయి. ఇళ్లు మంజూరైనా ఇనుము, సిమెంటు, ఇటుక ధరల పెరుగుదలతో ప్రభుత్వం ఇచ్చే బిల్లు సరిపోదని కొందరు నిర్మాణం చేపట్టలేకపోతున్నారు. మరికొందరు ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్నారు. అయితే బేస్మెంట్ పనులు చేస్తేనే మొదటి విడత బిల్లులు మంజూరవుతాయి. అయితే సగం నిర్మాణం పూర్తయి వారి ఇళ్లకు బిల్లులు ఆలస్యం అవుతున్నాయి. తమకు బిల్లులు ఎప్పుడు వస్తాయో అని కొందరు పునాది వేయడానికి జంకుతున్నారు. దీంతో పేదవాడి ఇందిరమ్మ గూడు కలగానే మిగులుతోంది. ఇదీ డివిజన్లో పరిస్థితి కందుకూరు హౌసింగ్ డివిజన్ పరిధిలో కందుకూరు, కనిగిరి, కొండపి, దర్శి నియోజకవర్గాలున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 8,891 మంది పేదలకు ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో కేవలం 50 శాతం నిర్మాణాలను మాత్రమే పూర్తయ్యాయి. దీనిపైనే ఇటీవల నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ హౌసింగ్ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా నిర్ధేశించిన లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేక పోయారని కలెక్టర్ ప్రశ్నించారు. ఈ నెల 15వ తేదీలోగా పెండింగ్ నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలు ఇప్పట్లో పూర్తయ్యే దాఖలాలు కనిపించడం లేదు. డివిజన్ పరిధిలో నిర్మించాల్సిన ఇళ్ల సంఖ్య భారీగా ఉండడమే దీనికి కారణం. డివిజన్ పరిధిలో గత ఏడాదికి 8,891 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 4,558 మాత్రమే అధికారులు పూర్తిచేశారు. ప్రస్తుతానికి కందుకూరులో 987, దర్శిలో 1104, కొండెపిలో 864, కనిగిరిలో 1503 ఇళ్లను మాత్రమే పూర్తిచేశారు. వీటిలో కందుకూరు నియోజకవర్గంలో 1887, దర్శిలో 2128, కొండెపిలో 1698, కనిగిరిలో 3280 ఇళ్లను కట్టాలి. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల వివరాలు రూఫ్ లెవల్లో 2,333 లింటల్ లెవల్లో 551 బేస్మెంట్ లెవల్ కంటే పైగా 367 బేస్మెంట్ లెవ్లో 3,667 బేస్మెంట్ కంటే తక్కువ స్థాయిలో 602 ఇదిలా ఉండగా ఇటీవల నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో అర్జీలు ఇచ్చిన వారికి జీవో 23 కింద డివిజన్లో 11,175 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు ఒక్కటి కూడా మొదలు పెట్టిన దాఖాలాలు లేవు. నిర్మాణం మొదలుపెడితేనే మొదటి విడత బిల్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొత్త నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే రుణాలను పెంచింది. అయినా గృహ నిర్మాణ ముడిసరుకు ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఇళ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు ఇష్టపడడం లేదు. -
స్త్రీనిధి రుణాలకు గ్రేడింగ్ కొర్రీ
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: కందుకూరు మండలంలోని ఓ గ్రామైక్య సంఘం పనితీరు ఆధారంగా స్త్రీ నిధిలో గ్రేడ్-ఎ పరిధిలోకి రావడంతో రూ. 20 లక్షల రుణం పొందేందుకు అర్హత సాధించింది. అదే జరుగుమల్లి మండలంలోని కొన్ని గ్రూపుల పనితీరు బాగున్నా ఆ మండలానికి గ్రేడింగ్ తక్కువగా ఉండటంతో రుణాలు పొందేందుకు అర్హత కోల్పోతున్నాయి. పనితీరు ఒకేలా ఉన్నా..గ్రామైక్య సంఘం ఉన్న మండలానికి గ్రేడింగ్ తక్కువగా ఉండటంతో దాని పరిధిలో ఉన్న గ్రూపులకు రుణాలు అందడం లేదు. ఈ ఏడాది దాదాపు వంద సంఘాల వారు గ్రేడింగ్‌ల కారణంగా రుణం పొందలేకపోయారు. ఫలితంగా జిల్లాలో దాదాపు 1500 మందికిపైగా సభ్యులు రుణానికి దూరం కానున్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు సక్రమంగా రుణాలివ్వడం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం స్త్రీనిధి బ్యాంకును ఏర్పాటు చేసింది. ఎలాంటి పూచీకత్తు లేకుండానే స్త్రీనిధి బ్యాంకు ద్వారా గ్రూపులకు రుణాలందిస్తారు. 2011 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ పథకం అమలు కోసం గ్రూపులకు కొన్ని నియమ నిబంధనలు విధించారు. గ్రామైక్య సంఘాల గ్రేడింగ్: పనితీరు ఆధారంగా గ్రామైక్య సంఘాలకు గ్రేడ్లను కేటాయిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల రుణాలు సక్రమంగా చెల్లించడం, సమావేశాలు నిర్వహిస్తున్నారా లేదా..ఆడిట్‌ను నిర్వహించారా లేదా..దస్త్రాల నిర్వహణ, ఆర్థికంగా గ్రేడింగ్ కొర్రీ అభివృద్ధి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్రేడింగ్ ఇస్తారు. ఆ గ్రేడింగ్ ఆధారంగానే రుణాలందిస్తారు. ఈ ఏడాది జిల్లాలోని అన్ని మండలాలు గ్రేడింగ్ పరిధిలోకి వచ్చాయి. గ్రేడ్-ఎ మండలానికి రూ. 3.50 కోట్లు, గ్రేడ్-బి మండలానికి రూ. 1.5 నుంచి రూ. 2 కోట్లు, గ్రేడ్-సి మండలానికి కోటి రూపాయల నుంచి రూ. 50 లక్షలు, గ్రేడ్-డి మండలానికి రూ. 60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలిస్తారు. గ్రేడ్-ఎ గ్రామైక్య సంఘానికి రూ. 20 లక్షలు, గ్రేడ్-బి సంఘానికి రూ. 12 నుంచి రూ. 15 లక్షలు, గ్రేడ్-సి సంఘానికి రూ. 10 లక్షలు, గ్రేడ్-డి సంఘానికి రూ. 7 లక్షల రుణం ఇస్తారు. అక్కడ నుంచి స్వయం సహాయక సంఘాలకు రుణాలందిస్తారు. గతంలో 14 శాతం వడ్డీతో రుణాలు తీసుకుని తిరిగి సక్రమంగా చెల్లించిన వారికి పావలా వడ్డీని వర్తింపజేస్తారు. తాజాగా ఇందులో కూడా వడ్డీలేని రుణాన్ని ఇస్తున్నారు. వాయిదా పద్ధతుల సమయంలో నెలా ఏడు రోజుల వరకు కేవలం అసలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అనంతరం చెల్లిస్తే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. మండలానికి గ్రేడింగ్ నిర్ణయించే సమయంలో సదరు మండలంలోని గ్రామైక్య సంఘాలన్నింటి పనితీరు ఆధారంగా గ్రేడ్లను నిర్ణయిస్తారు. అందులో కొన్నింటి పనితీరు సక్రమంగా ఉండి, మరికొన్నింటి పనితీరు సరిగా లేకపోతే అది మండల గ్రేడింగ్‌పై ప్రభావం చూపుతుంది. ఇలా..పలు గ్రామైక్య సంఘాల పనితీరు సక్రమంగా ఉన్నా..మండలానికి గ్రేడింగ్ తక్కువగా ఉండటంతో ఆయా సంఘాలకు నిధులు రావడం లేదు. జిల్లాలో తాజాగా నిర్ణయించిన గ్రేడింగ్ విధానంలో జరుగుమల్లి మండలం సీ-గ్రేడ్, హనుమంతునిపాడు మండలం డీ- గ్రేడ్ కిందకు వచ్చాయి. దీంతో ఈ మండలాల్లోని అన్ని గ్రామైక్య సంఘాలకు, అనంతరం గ్రూపులకు ఈ ఏడాది రుణాలు రాని పరిస్థితి. దీంతో పనితీరు బాగున్న సంఘాల వారు తామేం తప్పు చేశామని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాలు ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రేడింగ్ పరిధిలోకి వచ్చాయి. సెర్ప్ ఫార్మేట్ ప్రకారమే... గ్రేడింగ్ సరిగా లేని మండలాల్లో పనితీరు బాగున్న గ్రామైక్య సంఘాలు కూడా ఉన్నా యి. సెర్ప్ ఫార్మేట్ ప్రకారం గ్రామాన్ని, మండల సమాఖ్యను యూనిట్‌గా తీసుకుని గ్రేడింగ్ నిర్ణయిస్తున్నాం. - ధర్మేంద్ర, స్త్రీనిధి ఏజీఎం -
ఉద్యమానికి పునాది ఇక్కడే...
కందుకూరు, న్యూస్‌లైన్: ప్రత్యేక రాష్ర్ట సాధనలో అగ్రభాగాన నిలిచిన కేసీఆర్‌కు కందుకూరు మండలంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన చేపట్టిన ఉద్యమానికి పునాది పడింది ఇక్కడే అని చెప్పొచ్చు. 1996లో టీడీపీ హయాంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాసర్లపల్లి సమీపంలో 30 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అందులో ఫాంహౌస్ నిర్మించడంతో పాటు ఉసిరి, మామిడి, కొబ్బరి తోటలను సాగు చేశారు. కొంతకాలం హరీష్‌రావు సైతం ఫాం హౌస్ నిర్వహణ బాధ్యతలు చేపట్టినట్లు గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. 2001లో టీడీపీకి రాజీనామా చేసిన తదనంతరం కేసీఆర్ అత్యధికంగా ఈ ఫాంహౌస్‌లోనే విడిది చేశారని, పార్టీ స్థాపించే వరకూ మేధావులు, నాయకులతో కలిసి చర్చలు జరిపారని స్థానికులు పేర్కొంటున్నారు. దాసర్లపల్లికి బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు దేవేందర్‌గౌడ్‌తో కలిసి ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేసుకుంటున్నారు. పార్టీ స్థాపించిన తర్వాత ఫాంహౌస్‌ను విక్రయించారని పేర్కొంటున్నారు. ఉద్యమానికి పునాది పడింది ఇక్కడి నుంచే కావడం గర్వంగా ఉందంటున్నారు. -
ఏమైనా చేస్తాం..
కందుకూరు రూరల్, న్యూస్‌లైన్: అధికారం చేతుల్లో ఉంది కదా అని అధికార పార్టీ నాయకులు పేట్రేగిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ తమ నేతల కనుసన్నల్లో నడుస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. ఓట్ల మార్పులు.. చేర్పుల ప్రక్రియలో అర్హులకు అన్యాయం చేస్తూ.. అనర్హులను మాత్రం అందలం ఎక్కిస్తున్నారు. మండల పరిధిలోని శ్రీరంగరాజపురంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడికి బీఎల్ఓతో పాటు రెవెన్యూ అధికారుల అండదండలు సమృద్ధిగా లభించాయి. ఇంకేముందీ అర్హుల ఓట్లను తొలగించి.. పెద్ద ఎత్తున అనర్హుల పేర్లు ఓటరు లిస్టులో వచ్చేలా చేశాడు. 61 బోగస్ ఓట్లు.. గ్రామంలో ఉన్నట్లు ఎలాంటి గుర్తింపులేని వారి పేర్లు భారీగా జాబితాలో చేరాయంటే అతని ప్రభావం ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. జరుగుమల్లి వద్ద జయవరానికి చెందిన క్రాంతికుమార్, సుభాషిణి, లేళ్లపల్లి క్రాంతికుమార్ పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు చేశారు. అలాగే కరేడుకు చెందిన గోపిరెడ్డి శింగారెడ్డి, పిచ్చిరెడ్డి, శేషమ్మ.. కొన్నేళ్లుగా శ్రీశైలంలో ఉంటున్న శివరాత్రి శ్రీనివాసులు, రాజ్యలక్ష్మి, కందుకూరులో నివాసం ఉంటున్న మల్లెల రుక్మిణమ్మ, పోలమ్మ, టి.వజ్రమ్మ, పొన్నలూరు మండలం శింగరబొట్లపాలెంలో ఉంటున్న దన్యాసి త్రివేణిలు.. ఇంకా ఉలవపాడు, చాకిచర్ల, చినపవని, సింగరాయకొండల్లో స్థిర నివాసం ఉంటున్న వారి పేర్లు కలుపుకొని మొత్తం 61 బోగస్ ఓట్లు జాబితాలో చేర్చారు. వీరంతా అధికార పార్టీకి చెందినవారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నచ్చకపోతే అంతే.. వాస్తవానికి గ్రామానికి చెందిన యువతులకు పెళ్లి అయితే వారి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. కానీ బీఎల్ఓ దాని గురించి పట్టించుకోలేదు. అలాగే మరణించిన వారు, ఇంతకు ముందు ఓటరు జాబితాలో బోగస్ ఓట్లుగా ఉన్న వారి పేర్లను కూడా తొలగించాల్సి ఉన్నా.. బీఎల్ఓ ఎలాంటి విచారణ చేపట్టలేదు. అయితే అధికార పార్టీ నాయకులు పెద్దమొత్తంలో దరఖాస్తు చేసుకంటే వాటిని పరిశీలించకుండానే ఓటర్ల జాబితాలో చేర్చారు. ఓట్లు తొలగించాలని ఫారం-7 ద్వారా దరఖాస్తు చేస్తేనే పరిశీలించి తొలగించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం గత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏజెంట్లుగా నిలబడిన వారిపేర్లు, నాయకత్వం వహించిన వారి కుటుంబాల్లోని పేర్లు, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసిన వారి పేర్లను తొలగించారు. ఇలా మొత్తం 46 మంది అర్హులకు జాబితాలో చోటు లేకుండా చేశారు. అదే సమయంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న 50 మంది పేర్లను బుట్టదాఖలు చేశారు. మొత్తం మీద బీఎల్ఓ వ్యవహార శైలిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. -
వేలానికి రంగం సిద్ధం
కందుకూరు, న్యూస్‌లైన్: ఈ ఏడాది పొగాకు వేలానికి రేపటితో తెరలేవనుంది. మొదటి విడతగా జిల్లాలో 8 వేలం కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పొగాకు రైతులు మద్దతు ధరపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది పొగాకు నాణ్యతతో పాటు, మార్కెట్ కొంత ఆశాజనకంగా ఉండడం రైతులకు కొంత ఊరటనిచ్చే అంశం. అయితే ఏటా పెరుగుతున్న సాగు ఖర్చులనేపథ్యంలో గత ఏడాది కంటే మరికొంత ధరలు పెంచాల్సిన అవసరం ఉందని రైతులతో పాటు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రారంభం కానున్న వేలం కేంద్రాలివీ.. జిల్లాలో పొగాకు బోర్డు పరిధిలో ఒంగోలు, గుంటూరు రీజియన్లు ఉన్నాయి. వీటిలో ఒంగోలు రీజియన్ పరిధిలో ఒంగోలు-1,2 , టంగుటూరు-1,2, కందుకూరు-1,2, కొండపి, నె ల్లూరు జిల్లాలోని కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాలున్నాయి. ఇక గుంటూరు రీజియన్ పరిధిలో పొదిలి-1,2, వెల్లంపల్లి-1,2 వేలం కేంద్రాలున్నాయి. వీటిలో సోమవారం నుంచి ఒంగోలు-1, కందుకూరు-1,2, పొదిలి-1,2, కొండపి, కలిగిరి, డీసీ పల్లి వేలం కేంద్రాలను ప్రారంభించేందుకు బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. మిగిలిన వేలం కేంద్రాలను వచ్చే నెలలో ప్రారంభిస్తామని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ సీజన్ మద్దతు ధరపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. మరోపక్క ఈ ఏడాది వాతావరణం అనుకూలించి ఎన్నడూ లేనంతగా మంచి దిగుబడి వచ్చింది. భారీగా పెరిగిన సాగు విస్తీర్ణం... గత సీజన్లో వచ్చిన ఆశాజనకమైన ధరలతో రైతులు ఈ ఏడాది పొగాకు పంటను భారీగా సాగు చేస్తారని అధికారులు వేసిన అంచనాలే నిజమయ్యాయి. సాగు విస్తీర్ణం పెరగడంతో అనుమతించిన దానికంటే అధిక మొత్తం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఒంగోలు రీజియన్ పరిధిలో 71 మిలియన్ కేజీల పొగాకును పండించేందుకు బోర్డు అనుమతిచ్చింది. కానీ 82.6 మిలియన్ కేజీలను రైతులు పండించారు. అదే ఈ ఏడాది 73 మిలియన్ కేజీలు పండించుకునేందుకు అనుమతిస్తే ఉత్పత్తి 91 మిలియన్ కేజీల వరకు ఉండవచ్చనని అంచనా వేస్తున్నారు. దాదాపు 62 వేల హెక్టార్లకు పైగా పొగాకు సాగైంది. ఈ నేపథ్యంలో ధరలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. అధికారులు మాత్రం మార్కెట్ ఆశాజనకంగానే ఉన్నందున మద్దతు ధరకు ఏ ఇబ్బందీ ఉండకపోవచ్చని చెప్తున్నారు. సరాసరి ధర పెంచాలి... ఏడాదికేడాది పెరుగుతున్న సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని మద్దతు ధరను కూడా వ్యాపారులు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తి రావడంతో సరైన ధరలు చెల్లించాలని కోరుతున్నారు. గత ఏడాది రీజియన్ పరిధిలో కేజీకి 99ల సరాసరి ధ ర వచ్చింది. అయితే ప్రస్తుతం సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో 125ల సరాసరి ధరను కేజీకి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విధంగా ఇవ్వకపోతే రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు. అలాగే కేజీ అత్యధిక ధరపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. గత ఏడాది ఒంగోలు వేలం కేంద్రాల పరిధిలో కేజీ 160లకు పైగానే వచ్చింది. మిగిలిన వేలం కేంద్రాల్లో 120 నుంచి 125ల అత్యధిక ధర వచ్చింది. గత ఏడాది రైతులు సగం వరకు అమ్ముకున్న తరువాత ఒంగోలు కేంద్రాల పరిధిలో అత్యధిక ధరలు రావడంతో రైతులకు నిరాశే ఎదురైంది. అలాగే పొదిలి వేలం కేంద్రాల రైతులు మద్దతు ధర కోసం గత ఏడాది మొత్తం పోరాటాలు చేయాల్సి వచ్చింది. జిల్లా మొత్తం రైతులకు అనుకూల ధరలు వస్తే ఒక్క పొదిలిలో రైతులకు ఏమాత్రం గిట్టుబాటు ధరలు రాలేదు. వేలం చివరి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఉత్పత్తిలో నాణ్యత తగ్గడంతో కొనుగోలు చేయలేమని వ్యాపారులు చెప్పుకొచ్చారు. అయితే ఈ ఏడాది అంచనాలకు మించి నాణ్యమైన ఉత్పత్తులు రావడంతో ధరలు కూడా అదేవిధంగా ఉంటాయని రైతులు ఆశిస్తున్నారు. మొత్తం హై గ్రేడే... అనుకున్న విధంగానే ఈ ఏడాది రైతులకు అన్నీ అనుకూలించినా మరో అంశం కలవర పరుస్తోంది. సాధారణంగా ఉత్పత్తిలో నాణ్యత తగ్గితే బాధపడాలి. ఈ ఏడాది అనుకున్న దానికి కంటే నాణ్యమైన ఉత్పత్తి రావడమే రైతులను, అధికారులను కలవరపరిచే అంశం. జిల్లా వ్యాప్తంగా దాదాపు 90 శాతం పంట హై గ్రేడ్ ఉత్పత్తే వచ్చింది. దీంతో లోగ్రేడ్, మీడియం గ్రేడ్ అనేవి లేకుండా పోయాయి. మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని నేపథ్యంలో మార్కెట్లో లో గ్రేడ్‌కు డిమాండ్ ఉంటే ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని బోర్డు అధికారులు లెక్కలు వేస్తున్నారు. దీనికి ప్రధానంగా ఒక్క మన జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హై గ్రేడ్ పొగాకు ఉత్పత్తి వచ్చిందని చెప్తున్నారు. దీంతో వ్యాపారులు కోరిన ఉత్పత్తులు లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ-వేలం ద్వారానే కొనుగోలు గత ఏడాది నుంచి పొగాకు వేలంలో ప్రవేశపెట్టిన ఈ-వేలం విధానాన్నే ఈ ఏడాది కూడా అమలు చేయనున్నారు. వేలంలో అవకతవకలను పూర్తిగా నిరోధించడంతో పాటు, త్వరగా ముగించేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది. సోమవారం వేలం ప్రారంభం కానున్న మొత్తం 8 కేంద్రాల్లో ఈ-వేలాన్ని అమలు చేయనున్నారు. -
‘పట్టాలు’ తప్పిన ప్లాన్
కందుకూరు, న్యూస్‌లైన్ : పట్టణ ప్రజలను ఎంతో కాలంగా ఊరిస్తూ వచ్చిన నివేశన స్థలాల పంపిణీ వ్యవహారం మంత్రి మహీధర్‌రెడ్డికి తలనొప్పిగా మారింది. ఎన్నికలకు ముందు పట్టాలు ఇచ్చి ప్రజల ఓట్లు గుంజాలనుకున్న ఆయన ప్లాన్.. రివర్సైంది. ఓట్లు తెచ్చిపెట్టడం సంగతి అంటుంచి సొంత పార్టీ నాయకులు ఆయనకు దూరమయ్యారు. దీంతో కొందరు నాయకులను మంత్రి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇదీ.. జరిగింది గత మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వేదికగా మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. పట్టణంలోని దాదాపు 1219 మందికి కలెక్టర్‌తో కలిసి పట్టాలిచ్చారు. అధికారులు తయారు చేసిన జాబితాలో అనర్హులు పెద్ద సంఖ్యలో ఉన్నారని పంపిణీకి ముందే విమర్శలు వెల్లువెత్తాయి. ఇవేమీ పట్టించుకోని మంత్రి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హాడావుడిగా పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. జాబితాలో దాదాపు 40శాతం మందికి ఇళ్లు ఉన్నా మళ్లీ పట్టాలు ఇవ్వడం బహిరంగ రహస్యం. ఈ వ్యవహారంపై నిజమైన లబ్ధిదారులు గుర్రుగా ఉన్నారు. వీరి సంగతి అటుంచితే.. కనీసం తమ సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోకుండా అర్హుల జాబితా ఎలా తయారు చేస్తారని కాంగ్రెస్ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆగ్రహం మంత్రికి తెలియాలని పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఒక్కరు కూడా హాజరు కాలేదు. పార్టీకి చెందిన వివిధ విభాగాల అధ్యక్షులు, ముఖ్యనాయకులు సైతం మంత్రికి ముఖం చాటేశారు. అవమానించడం ఆయనకు అలవాటే మంత్రి ప్రధాన అనుచరునిగా చెలామణీ అవుతున్న ఓ నేతను కనీసం వేదికపైకి కూడా ఆహ్వానించలేదు. అంతేకాకుండా తనతోటి మండల నాయకుడైన ఏఎంసీ చైర్మన్ తోకల కొండయ్యని వేదికపైకి ఆహ్వానించి, తనను కావాలనే అవమానపరిచే విధంగా మంత్రి వ్యవహరించారని సదరు నాయకుడు సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నాడు. గతంలో కూడా ఇలానే వ్యవహరించారని, ఆయనకు ఇది అలవాటేనని సదరు నేత మంత్రిపై కినుకు వహించాడట! దీంతో విషయం మంత్రిగారి దృష్టికి వెళ్లడంతో ఆయనే స్వయంగా సదరు నాయకునికి ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మంత్రి ఫోన్ తీసేందుకు కూడా ఇష్టపడని ఆ నాయకుడు.. ఇంత అవమానం జరిగిన తరువాత ఫోన్ చేసి ఏం లాభమని సన్నిహితుల వద్ద వాపోయాడు. మిగిలిన నాయకులదీ ఇదే పరిస్థితి. ఏన్నో ఏళ్లుగా పార్టీ కంటే మహీధర్‌రెడ్డినే నమ్ముకుని పనిచేస్తున్నామని, ఆయన తమను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి పట్టాలు ఇచ్చారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాము వార్డుల్లో తిరిగే పరిస్థితి కూడా లేకుండా పోయిందంటున్నారు. ఇప్పటి వరకూ తిట్టినా.. అవమానించినా సహించామని, మంత్రి వ్యవహారశైలి మారకపోతే పార్టీలో కొనసాగడం కష్టమేనని నాయకులంతా తేల్చి చెప్తున్నారు. పట్టాల పంపిణీ పార్టీకి ఏమాత్రం లాభం చేకూర్చేలా లేదని మరో వాదన వినిపిస్తున్నారు. అందరూ అర్హులని అధికారులు చెప్పిన మాటలు నమ్మి పెద్ద ఎత్తున అనర్హులకు పట్టాలు ఇచ్చారని నాయకులు ఆరోపిస్తున్నారు. ఇళ్లు లేని పేదలు పట్టణంలో భారీ సంఖ్యలో ఉంటే విచారించి న్యాయం చేయాల్సిన మంత్రి.. అధికారుల మాటలు నమ్మి అనర్హులకు పట్టాలు ఇచ్చారని సదరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
రైతులకు మొండి చెయ్యి
కందుకూరు, న్యూస్‌లైన్: సహకార బ్యాంకులు రైతులకు మొండి చేయి చూపుతున్నాయి. రుణాల పేరిట రైతుల నుంచి డిపాజిట్లు కట్టించి బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నాయి. దీంతో ప్రాథమిక సహకార సంఘాల్లోని సభ్యులు రుణాల కోసం రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 173 ప్రాథమిక సహకార పర పతి సంఘాలున్నాయి. వీటిలో ప్రస్తుతం 168 సంఘాలు ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. మిగిలిన ఐదు సంఘాల నుంచి రుణాల చెల్లింపు సక్రమంగా లేదని కార్యకలాపాలను నిలిపేశారు. ఈ సంఘాల సభ్యులుగా ఉండే రైతులకు ప్రతి ఏడాది వ్యవసాయ రుణాలు సహకార బ్యాంకులు మంజూరు చేస్తాయి. అయితే రెండేళ్లుగా ప్రాథమిక సహకార సంఘాల రైతులకు రుణాలు మంజూరు కావడం లేదు. వీటిలో కందుకూరు కో ఆపరేటివ్ డివిజన్లో అధిక శాతం మంది రైతులున్నారు. డివిజన్లో కందుకూరు, కొండపి, కనిగిరి, దర్శి సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 24 మండలాలుండగా 54 ప్రాథమిక పరపతి సహకార సంఘాలున్నాయి. వీటిలో సభ్యులకు రెండేళ్ల నుంచి ఒక్కపైసా రుణం మంజూరు కావడం లేదు.జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు కందుకూరు డివిజన్లోని లింగసముద్రం మండలంలో నాలుగు సహకార సంఘాలున్నాయి. వీటిలో మొగిలిచర్ల సొసైటీ తర ఫున దాదాపు 120 మంది, యర్రారెడ్డిపాలెం 90 మంది, తూనుగుంట 110 మంది, చినపవని 100 మంది వరకు రైతులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఉన్న 168 సంఘాల నుంచి వేల సంఖ్యలో రైతులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ రెండేళ్ల నుంచి ఒక్కపైసా రుణం కూడా వీరికి దక్కలేదు. ప్రధానంగా 2011-12, 2012-13 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రుణాలు మంజూరు కాలేదని రైతులు వాపోతున్నారు. అయితే ఇప్పటికే వీరి నుంచి డిపాజిట్ల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.1200ల నుంచి రూ.2 వేల వరకు సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు వసూలు చేశారు. 2011-12 సీజన్ లో దరఖాస్తు చేసుకున్న కొందరికి రుణాలు మంజూరైనట్లు సమాచారం వచ్చింది. కానీ ఆ తరువాత సహకార సంఘాల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంఘాలకు రుణాల పంపిణీని నిలిపేశారు. దీంతో ఎన్నికలు పూర్తై తరువాత ఇస్తామని చెప్పుకుంటూ వచ్చారు. ఎన్నికలు ముగిసిన తరువాత చైర్మన్ ఎన్నిక పెండింగ్‌లో ఉందని, అది పూర్తయిన తరువాత ఇస్తామని మరికొంత కాలం కాలయాపన చేశారు. ప్రస్తుతం చైర్మన్ ఎన్నిక జరిగి ఏడెనిమిది నెలలు గడిచినా ఒక్కపైసా రుణం కూడా రైతులకు దక్కలేదు. దీనిపై కందుకూరు కో ఆపరేటివ్ బ్యాంకు అధికారులు మాత్రం తమ వద్ద రైతులకు సంబంధించి ఎటువంటి దరఖాస్తులు పెండింగ్ లేవని చెప్తున్నారు. మరోపక్క రబీ సీజన్‌కు సంబంధించి ఒంగోలు కేంద్ర సహకార బ్యాంక్ నుంచి తమకు ఒక్కపైసా కేటాయించలేదంటున్నారు. కేంద్ర బ్యాంకు నుంచి నిధులు కేటాయించకపోవడం వల్లే రైతులకు వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. దీనిబట్టే రైతులకు రుణాలు దక్కడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో రెండేళ్ల నుంచి డిపాజిట్ కట్టి రుణాల కోసం ఎదురు చూస్తున్న రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరికొందరికి మాత్రం ఎల్టీ లోన్స్ (పశువులు, గొర్రెల వంటి రుణాలు) ఇచ్చి సరిపెట్టారు. కేవలం కేంద్ర బ్యాంకు చైర్మన్ నిర్లక్ష్యం కారణంగానే రుణాలు రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రుణాల పేరిట వసూళ్లు సాధారణంగా పొలం విస్తీర్ణం బట్టి లక్ష నుంచి రెండు, మూడు లక్షలు ఆపైన రుణాలు రైతులకు ఇస్తారు. రైతుల అసహాయతను ఆసరాగా చేసుకుంటున్న కొందరు సంఘాల కార్యదర్శులు, బ్యాంకుల సిబ్బంది రుణాలు ఇప్పిస్తామని చెప్పి రైతుల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. జిల్లాలో రబీ సీజన్లో అధికంగా పంటలు సాగు చేస్తుండడంతో రుణాల కోసం ఎక్కువగా ఈ సీజన్లో రైతులు బ్యాంకులను ఆశ్రయిస్తారు. ప్రస్తుతం పొగాకు, వరి వంటి పంటలు సాగు చేసిన రైతులు ఖర్చుల కోసం రుణాలకు దరఖాస్తు చేసుకున్నా రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో డబ్బులు వసూలు చేసిన వారి నుంచి సమాధానం కరువవుతోంది. ఈ వ్యవహారంలో కొందరు రైతులు ఫిర్యాదు చేయడంతో గతంలో కందుకూరు సహకార బ్యాంకులో కాకి రాజారత్నం అనే స్పెషల్ క్యాటగిరీ అసిస్టెంట్‌ని సస్పెండ్ చేశారు. అయినా ఈ వసూళ్ల వ్యవహారం జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారంలో మరికొందరు బ్యాంకు సిబ్బంది పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకు అధికారులు మాత్రం తమకు నిధుల కేటాయింపు లేకపోవడం వల్లే రుణాలు ఇవ్వడం లేదని చెప్తున్నారు. బయటవారు డబ్బులు వసూలు చేస్తే మాకు సంబంధం లేదంటున్నారు. కక్షతో కొందరికి రుణాల నిలుపుదల సహకార సంఘాల రుణాల కేటాయింపులో రాజకీయాలు కూడా జోరుగా నడుస్తున్నాయి. అర్హుైలైన రైతులకు రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా అధికార పార్టీకి చెందిన సంఘం కార్యదర్శులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి రుణాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఎన్నికల్లో సహకరించని, ఇతర పార్టీల వైపు ఉన్న రైతుల రుణాలను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మరికొందరు రైతులు ఆవేదన చెందుతున్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బ్యాంకు సిబ్బంది కూడా నాయకులకే వత్తాసు పలుకుతూ నానా అవస్థలు పెడుతున్నారని చెప్పారు. నాకేమీ తెలియదు -జమీల్బాష, మేనేజర్, కో ఆపరేటివ్ బ్యాంక్ నేను ఈ మధ్యేబ్యాంకు మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్నాను. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు ఏమీ నాకు తెలియదు. రైతుల దరఖాస్తులు మా వద్ద పెండింగ్‌లో లేవు. బయట వారు ఎవరైనా డబ్బులు వసూలు చేసి ఉంటే నాకేం సంబంధం. -
టవరెక్కిన యువకులు
కందుకూరు, న్యూస్‌లైన్: గ్రామంలో సారా విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని తిమ్మాపూర్‌కు చెందిన ఆరుగురు యువకులు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. అధికారుల హామీతో వారు శాంతించారు. స్థానికుల కథనం ప్రకారం.. కొంతకాలంగా గ్రామంలో సారా విక్రయాలతో కుటుంబాలు వీధినపడుతున్నాయి. దీంతో యువకులు ఎక్సైజ్ పోలీసులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. అయినా సారా అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. విక్రయదారులు స్థానికంగా కొందరికి సారా తాగించి యువకులపైకి ఉసిగొల్పుతున్నారు. ఎక్సైజ్ అధికారుల అండతోనే విక్రయదారులు చెలరేగిపోతున్నారని యువకులు తెలిపారు. గ్రామానికి చెందిన యువకులు మంద పాండు, బట్టీల నర్సింహ, ఉండేల శ్రీనివాస్, వట్నాల మహేందర్, వట్నాల గణేష్, పిట్టల శ్రీకాంత్‌లు ఎలాగైనా సారా మహమ్మారిని తరిమి కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో వారు సోమవారం ఉదయం 7 గంటల సమయంలో గ్రామంలో ఉన్న ఓ సెల్ టవర్ ఎక్కారు. గ్రామంలో సారా విక్రయాలు అరికట్టకుంటే దూకేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ నాగార్జున, ఎక్సైజ్ ఎస్ఐ చంద్రశేఖర్, వీఆర్వో శ్రీరాములు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని కిందికి దిగి రావాలని యువకుల్ని బతిమాలినా ఫలితం లేకుం డా పోయింది. ఉన్నతాధికారులు వచ్చి సారా విక్రయాలు అరికడతామని హామీ ఇస్తేనే దిగుతామని, లేదంటే దూకుతామని స్పష్టం చేశారు. 11.45 గంటల సమయంలో తహసీల్దార్ సరిత, ఎక్సైజ్ సీఐ జావిద్‌ఆలీ అక్కడికి చేరుకున్నారు. రెండు రోజుల్లో గ్రామ పంచాయతీ తీర్మానం చేయించి సారా విక్రయాలను పూర్తిగా అరికడతామని హామీ ఇచ్చారు. దీంతో యువకులు ఆందోళన విరమించి కిందికి దిగివచ్చారు. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. అనంతరం అధికారులు గ్రామం లో పర్యటించి సారా విక్రదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇకపై సారా అమ్మితే విక్రయదారులకు రేషన్ సరుకులతో పాటు సంక్షేమ పథకాలు నిలిపి వేస్తామని తహసీల్దార్ హెచ్చరించారు.