
సాక్షి, ప్రకాశం: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కందుకూరులో జరిగిన సభలో విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో మురుగు కాలువలో పడి మరణించిన వాళ్ల సంఖ్య ఏడుగురికి చేరినట్లు తెలుస్తోంది.
పామూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. ఆ టైంలో ఆయన ప్రసంగిస్తుండగా.. తొక్కిసలాట జరిగిందని, ఈ క్రమంలోనే వాళ్లు కాలువలో పడడంతో వాళ్లు మరణించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
మృతుల్ని గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం చినకొండయ్య, కందుకూరు పట్టణం గుర్రంవారి పాలెంకు చెందిన కాకుమాని రాజాగా గుర్తించారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట అనంతరం ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మారుమోగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment