అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ దుర్ఘటన అప్‌డేట్స్
పరిహార ప్రకటన చేసిన చంద్రబాబు
- ఎట్టకేలకు దిగొచ్చిన చంద్రబాబు సర్కార్
- బాధిత కుటుంబాల ఆందోళన, వైఎస్సార్‌సీపీ డిమాండ్‌కు తలొగ్గిన వైనం
- అనకాపల్లి అచ్యుతాపురం సెజ్.. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- విశాఖపట్నం జిల్లా మెడికవర్ ఆస్పత్రిలో బాధితుల్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు
- అనంతరం మీడియాతో పరిహార ప్రకటన
- మృతుల కుటుంబాలకు కోటి రూపాయిలు పరిహారం
- అవయవాలు కోల్పోయిన వారికి 50 లక్షలు,
- గాయాలు అయిన వారికి 25 లక్షలు పరిహారం ప్రకటించిన చంద్రబాబు
- చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టీకరణ
- పరిహారం ఎప్పటిలోగా అందిస్తామనేదానిపై ఇవ్వని స్పష్టత
- గత ప్రభుత్వాలు వ్యవస్థలను నిర్వీర్యం చేశాయంటూ అసందర్భోచిత వ్యాఖ్యలు
- ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్
- కోటి రూపాయల పరిహారం ఇవ్వాల్సిందేనని, పరిహారంపై స్పష్టం చేయాలని జగన్ డిమాండ్
ప్రభుత్వ స్పందన సరిగా లేదు: బొత్స ఫైర్
- అచ్యుతాపురం ఘటన బాధాకరం
- ప్రభుత్వం స్పందించిన తీరు సరికాదు
- బాధిత కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
- మంత్రులు, ఎమ్మెల్యేలు బాధితుల్ని పరామర్శించలేదు
- చంద్రబాబు కేజీహెచ్‌కు ఎందుకు రాలేదు?
- బాధితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి
- గతంలో మా ప్రభుత్వం ఈ తరహా ప్రమాదాలు జరిగితే సత్వరమే స్పందించింది
- మా ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చింది
- సెజ్ ప్రమాద బాధితులకు కూడా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి
- రేపు బాధితుల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు
పరిహార ప్రకటనపై బాబు సర్కార్ డ్రామాలు
- అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం.. పరిహారం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నాటకాలు
- గత ప్రభుత్వం మాదిరే పరిహారం ఇవ్వాలని కోరుతున్న బాధిత కుటుంబాలు
- అటు విశాఖ, ఇటు అనకాపల్లి మార్చురీల వద్ద ఆందోళన
- పరిహారంపై స్పష్టమైన ప్రకటన తర్వాతే పోస్ట్‌మార్టానికి సహకరిస్తామని బైఠాయింపు
- పోలీసులు, రెవెన్యూ అధికారుల బుజ్జగింపులతో తలొగ్గని కుటుంబ సభ్యులు
- ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇస్తుందని ప్రకటించిన కలెక్టర్ హరీందర్ ప్రసాద్
- తక్షణం సాయం అందించాలని బాధిత బంధువుల డిమాండ్
- కాసేపటికే జాయింట్ కలెక్టర్ జాహ్నవి విరుద్ధమైన ప్రకటన
- పరిహారం ఇవ్వాలంటే ముందు బాధితుల బంధువుల్ని గుర్తించాలంటూ మెలిక
- మూడు రోజుల సమయం పడుతుందని వ్యాఖ్య
- పరిహారం చంద్రబాబే ప్రకటిస్తారంటూ తెలిపిన జాహ్నవి
- జేసీ ప్రకటన తర్వాత.. ఆందోళన ఉధృతానికి సిద్ధమైన బాధిత కుటుంబాలు, బంధువులు
మెడికవర్ ఆస్పత్రికి చంద్రబాబు
- విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో ఏపీ సీఎం చంద్రబాబు
- ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు పరామర్శ
- చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
- వైద్యం అందుతున్న తీరును వైద్యుల్ని అడిగి తెలుసుకున్న చంద్రబాబు
కేజీహెచ్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు
- విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు
- బాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ బొత్స, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరుల పరామర్శ
- అధికార యంత్రాగం, ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని వాపోయిన బాధితులు
- ఏ ఒక్కరూ పట్టించుకోలేదని కంటతడి పెట్టిన మహిళలు
- చలించిపోయి.. బాధితుల్ని ఓదార్చిన బొత్స
‘సీఎం రమేష్‌కు సిగ్గుందా?’
- అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
- మార్చురీ గేటు ముందు నిరసనకు దిగిన మృతుల కుటుంబ సభ్యులు
- ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలి అంటూ నినాదాలు
- మృతుల కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్.
- అచ్యుతాపురం ప్రమాద ఘటనపై కేంద్రం రూ. రెండు లక్షలు నష్టపరిహారం ప్రకటించడం దుర్మార్గం
- సీఎం రమేష్ కు సిగ్గుందా?
- బాధిత కుటుంబాలు రోదిస్తుంటే ఒక్క ప్రజాప్రతినిధి కూడా వచ్చి పరామర్శించలేదు..
:::ఘంటా శ్రీరామ్, వామపక్ష నేత
అచ్యుతాపురం ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్
- అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరం
- ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది
- పరిశ్రమల కాలుష్య నియంత్రణ నా శాఖ పరిధిలో ఉంది కానీ, భద్రత వేరే శాఖ కిందికి వస్తుంది
- పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలా సార్లు చెప్పాను
- అలా చేస్తే పరిశ్రమలు మూతపడతాయని నిర్వాహకులు భయపడుతున్నారు
- కానీ, ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాల్సిందే
- ఇలాంటి ఘటనలప్పుడు సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదు
- ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరం
- సెప్టెంబర్‌లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం
- రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తాం
ఖర్గే దిగ్భ్రాంతి
- అనకాపల్లి ఫార్మా కంపెనీ ప్రమాదంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిగ్భ్రాంతి
- ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలి
- బాధితులకు న్యాయం చేసి, తగిన నష్టపరిహారం ఇవ్వాలి
- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
పరిహారాన్ని సీఎం ప్రకటిస్తారు: విశాఖ జేసీ
- విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను కలిసిన అనకాపల్లి జాయింట్ కలెక్టర్ మేడిద జాహ్నవి.
- మృతుల వారసుల్ని విచారణ చేసి గుర్తిస్తాం: జేసీ జాహ్నవి
- పరిహారం చెల్లించటానికి వారసుల గుర్తింపు కార్యక్రమానికే మూడు రోజుల టైం పడుతుంది: : జేసీ జాహ్నవి
- పరిహారం ఎంత అనేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిస్తారు : జేసీ జాహ్నవి
- ప్రమాదానికి గల కారణాలు ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక వెల్లడిస్తాం : జేసీ జాహ్నవి
- జేసీ ప్రకటన నేపథ్యంలో.. మీడియా ముందుకు బాధిత కుటుంబాలు
- పరిహారం ప్రకటించేదాకా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనీయమని స్పష్టీకరణ
పరిహారంపై ప్రకటనేది?
- ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదం.. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత
- ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మృతుల బంధువుల వాగ్వాదం
- నష్ట పరిహారంపై స్పష్టత వచ్చే వరకూ మృతదేహలను తీసుకెళ్ళేది లేదని తేల్చేసిన బంధువులు
- మృతుల బంధువులను బుజ్జగిస్తున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది
- విశాఖ కేజీహెచ్ వద్ద ఇదే తరహా ఆందోళన
అందుకే ప్రమాదం!: అధికారుల వెర్షన్
- అనకాపల్లి ఎసెన్షియా కంపెనీ ప్రమాదంపై అంచనాకి వచ్చిన అధికారులు
- రియాక్టర్ పేలడం వలన ప్రమాదం జరగలేదు అని క్లారిటీ తెచ్చుకున్న అధికారులు!
- ఒక రియాక్టర్ నుంచి మరొక రియాక్టర్ సాల్వెంట్ లో MTBE లిక్విడ్ లీక్ అవ్వడంతోనే ప్రమాదం?
- లీక్ అవుతున్న సాల్వెంట్ మీద ఎలక్ట్రికల్ స్పార్క్ పడటంతో పేలుడు సంభవించిందని అంచనా
- పేలుడు దాటికి కుప్పకూలిన బ్రిక్ వాల్
మరో నలుగురి పరిస్థితి విషమం
- ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడ్డ మరో నలుగురి పరిస్థితి విషమం
- మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు అధికారుల సూచన
- 18కి చేరిన మృతుల సంఖ్య
కొనసాగుతున్న ఉద్రిక్తత
- విశాఖ కేజీహెచ్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత
- పరిహారం విషయంలో ప్రభుత్వ ప్రకటనపై మృతుల బంధువుల ఆందోళన
- విశాఖ కలెక్టర్ హామీ తర్వాత కూడా వెనక్కి తగ్గని మృతుల కుటుంబ సభ్యులు
- ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరును తప్పుబట్టిన కుటుంబ సభ్యులు
- అధికార ప్రజాప్రతినిధులెవరూ రాలేదని మండిపాటు
- అధికార యంత్రాంగం కూడా ఆలస్యంగా స్పందించిందంటున్న బాధితులు
- కోటి పరిహారం తక్షణమే అందించాలని డిమాండ్
- ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తేనే పోస్టుమార్టంకు సహకరిస్తామని స్పష్టీకరణ
- గత ప్రభుత్వం ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సత్వరమే ఆదుకుంది కదా అని గుర్తు చేస్తున్న మృతుల బంధువులు
అచ్యుతాపురం ప్రమాద బాధితులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు
- ఉదయం 11 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎం
- నగరంలోని మెడికవర్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్న చంద్రబాబు
- తర్వాత నేరుగా రాంబిల్లి మండలం ఫార్మాసిటీలో ఉన్న ఎసెన్షియా పరిశ్రమకు వెళ్లనున్న సీఎం
- ఘటనా స్థలాన్ని సందర్శించనున్న చంద్రబాబు
ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- ఆస్పత్రిలో ఏడు మృతదేహాలు.. ఆరింటి గుర్తింపు
- మార్చురీ వద్ద ఉన్న మృతుల బంధువులపై ఆంక్షలు
- విశాఖ కేజీహెచ్ వద్ద పరిహారంపై స్పష్టమైన హామీ కోరుతూ బంధువుల ఆందోళన
- ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద అలాంటి పరిస్థితి ఎదురుకావొచ్చని ముందు జాగ్రత్త
- మృతదేహన్ని చూస్తామని చెప్పినా లోపలకు పంపించని పోలీసులు
- పోలీసులతో బంధువుల వాగ్వాదం.. పరిస్థితి ఉద్రిక్తత
సాక్షి చేతిలో ప్రమాదంపై ఫిర్యాదు కాపీ
- రాంబిల్లీ పోలీసులకి ఫిర్యాదు చేసిన రాంబిల్లి తహశీల్దార్ భాగ్యవతి
- మధ్యాహ్నాం 2:15 కి పేలుడు జరుగున్నట్టు రిపోర్ట్ లో పేర్కొన్న తహశీల్దార్
- సాల్వెంట్ కెమికల్ పేలి ప్రమాదం జరిగినట్టు రిపోర్ట్ లో పేర్కొన్న తహశీల్దార్
- యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని రిపోర్ట్
ఒకట్రెండు రోజుల్లో పరిహార ప్రకటన: విశాఖ కలెక్టర్
- కేజీహెచ్ వద్ద విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్‌ను ముట్టడించిన మృతుల బంధువులు.
- ప్రమాదం జరిగిన తరువాత యాజమాన్యం ఎందుకు స్పందించలేదని నిలదీసిన మృతుల బంధువులు.
- ప్రభుత్వం నుండి పరిహారం ప్రకటన స్పష్టం గా వచ్చేవరకు మార్చురీ వద్ద ఆందోళన చేస్తామంటున్న బాధిత కుటుంబాలు.
- ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం పరిహారం ప్రకటిస్తుంది అని చెప్పిన కలెక్టర్
- కలెక్టర్ ప్రకటనపై బాధితుల కుటుంబాల అసంతృప్తి.. కొనసాగుతున్న ఆందోళన
తగిన న్యాయం చేయాల్సిందే: బాధిత కుటుంబాల ఆందోళన
- కేజీహెచ్ మార్చురీ వద్ద ఆందోళన
- కేజీహెచ్ మార్చురీకి వచ్చిన జిల్లా కలెక్టర్.
- కలెక్టర్‌ను చుట్టుముట్టిన బాధితులు
- తమకు న్యాయం చేయాలని డిమాండ్
- జరిగిన ప్రమాదంపై ఇప్పుడు వరకు ప్రభుత్వ స్పందించలేదు: బాధిత కుటుంబాలు
- స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఇప్పటివరకు కనీసం నోరు మెదపలేదు: బాధిత కుటుంబాలు
- కంపెనీ ప్రతినిధులు ఎవరూ రాలేదు: బాధిత కుటుంబాలు
- గతంలో జగన్ ప్రభుత్వం సత్వరమే ఆదుకుంది : బాధిత కుటుంబాలు
- అదే తరహాలో ఇప్పుడు ఆదుకోవాలి: బాధిత కుటుంబాలు
- పరిహారంగా కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి: బాధిత కుటుంబాలు
కేజీహెచ్ వద్ద ఉద్రిక్తత
- విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి వద్ద ఫార్మా కంపెనీ మృతుల బంధువుల ఆందోళన
- నష్టపరిహారంపై స్పష్టమైన ప్రభుత్వం హామీ ఇవ్వాలని బంధువుల డిమాండ్
- కేజీహెచ్‌లో 12 మృతదేహాలు
- బంధువులతో రెవెన్యూ అధికారుల చర్చలు
అచ్యుతాపురం సెజ్ వద్ద ఉద్రిక్తత
- నష్టపరిహారం పై స్పష్టమైన హామీ వచ్చేవరకు పంచనామాకు సహకరించేది లేదంటున్న మృతుల బంధువులు..
- మృతుల బంధువులను బుజ్జగిస్తున్న రెవెన్యూ అధికారులు
- పంచనామాకు సహకరించాలని మిగతా వివరాలు ఆపై మాట్లాడదామంటున్న రెవెన్యూ సిబ్బంది
- ఎన్టీఆర్ ఆసుపత్రికి చేరుకున్న జాయింట్ కలెక్టర్
- మృతుల బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న జాయింట్ కలెక్టర్
- నష్టపరిహారంపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రాని స్పష్టత
ఇదీ చదవండి: ప్రాణాలు తీసిన పాతకాలం రియాక్టర్!
ఎసెన్షియా ఫార్మా ప్రమాదంపై కేసు నమోదు
- బీఎన్‌ఎస్ సెక్షన్లు 106(1), 125(b),125(a) కింద కేసులు నమోదు
- ఎసెన్షియా ఫార్మా ప్రయివేటు లిమిటెడ్ యాజమాన్యం పై కేసు
- నిర్లక్ష్యంతొ మరణానికి కారణం , ప్రాణాలకు, వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లడం సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన రాంబిల్లి పోలీసులు
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన
అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఘటనపై విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు చెప్పారు.
మృతుల సంఖ్య 18!
- అచ్యుతాపురం సెట్ దుర్ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య
- కేజీహెచ్ మార్చురీకి 12 మృతదేహాలు
- కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
- 17 మృతదేహాల గుర్తింపు.. మరొకటి గుర్తించాల్సి ఉంది!
విశాఖ కేజీహెచ్ మార్చురీలో ఉన్న మృతుల వివరాలు
1)నీలపు రామిరెడ్డి అస్సోసియేట్ జెనరల్ మేనేజర్
2)మహంతి నారాయణారావు అసిస్టెంట్ మనేజర్
3)మొండి నాగబాబు అసిస్టెంట్ మేనేజర్
4)చల్లపల్లి హారిక ట్రైనీ ఇంజినీర్
5)మారిశెట్టి సతీష్ అసిస్టెంట్ మేనేజర్
6)యళ్లబిల్లి చిన్నారావు పెయింటర్
7)పైడి రాజశేఖర్ ట్రైనీ ప్రాసెస్ ఇంజినీర్ తండ్రి ధర్మారావు శ్రీకాకులం జిల్లా వంజంగి కులం కాలింగ
8) కొప్పర్తి గణేస్ కుమార్ M దుర్గా భవాని
9) ప్రశాంత్ హంస మేల్ W/o జ్యోతి
10) వేగి సన్యాసి నాయుడు
11)పూడి మోహన్ దుర్గా ప్రసాద్
12)జవ్వాది చిరంజీవి
అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 5 మృతదేహాలు
- ఈ ఐదు మృతదేహలకు పంచనామా నిర్వహించనున్న అధికారులు
- ఎన్టీఆర్ ఆసుపత్రికి వస్తున్న మృతుల బంధువులు
- ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఉన్న మృతుల వివరాలు..
- జావేది పార్థసారిది, పార్వతీపురం మన్యం
- పూసల వెంకట సాయి, చిన గంట్యాడ
- మారేణి సురేంద్ర, గాజువాక
- భి. ఆనందరావు, విజయనగరం
- బిఎన్. రామచంద్రరావు
ఎసెన్షియా (scientia) కంపెనీ ఎదుట రోదిస్తున్న బాధితుల బంధువులు
- అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో బుధవారం పేలిన రియాక్టర్
- తమ వారి ఆచూకీ ఇంకా తెలియదు అంటూ రోదిస్తున్న బాధితులు
- ఇంకా శిథిలాల కిందే చిక్కుకున్న కొంతమంది కార్మికులు?
- సహాయక చర్యల్లో జాప్యం చేస్తున్నారనే విమర్శ
- ఎవ్వరూ పట్టించుకోక పోవడంతో.. కంపెనీ ఎదుట బైఠాయించిన బాధితులు
అధికార యంత్రాంగం తూతు మంత్రంగా వ్యవహరిస్తోంది
- అనకాపల్లి ఫార్మా కంపెనీ ప్రమాద బాధితుల్ని అన్నివిధాలా ఆదుకోవాలి
- బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి
- మృతుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి
- అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి.
- గత కొంతకాలంగా విశాఖ సమీపంలోని కంపెనీలలో వరుస ప్రమాదాలు
- నిరంతరం ఫ్యాక్టరీల్లో భద్రత, నిబంధనలను పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా వ్యవహరిస్తోంది
:::సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment