Atchutapuram
-
అచ్యుతాపురం ఘటన రోజే మరో ఘటన.. ముగ్గురు మృతి, స్పందించని ప్రభుత్వం
-
చంద్రబాబే ఒక విపత్తు
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
-
అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్టీటీ సీరియస్
-
TDP ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఇంకా అందని నష్టపరిహారం
-
క్షతగాత్రులకు అందని పరిహారం.. చంద్రబాబు సర్కార్ వైఫల్యం
సాక్షి, అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం ప్రమాద ఘటనలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నష్ట పరిహారం అందించడంలో చంద్రబాబు సర్కార్ వైఫల్యం చెందింది. ఇద్దరు క్షతగాత్రులకు నష్టపరిహారం అందలేదు. ప్రమాదంలో కెమిస్ట్ తేజేశ్వరరావు కంటి చూపు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రొడక్షన్ మేనేజర్ నరేష్ కూడా పరిహారం అందలేదు. ప్రస్తుతం ఆయన ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.మరో ఘటనలో పరవాడ సినర్జీస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇండస్ ఆసుపత్రిలో నలుగురు చికిత్స పొందుతుండగా.. జార్ఖండ్‌కు చెందిన రొయ్య అంగీర మరణించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీ్హెచ్ మార్చూరీకి తరలించారు.కాగా, ‘అచ్యుతాపురం–పరవాడ’ సెజ్‌లో వరుస ప్రమాదాలు కార్మికులు, వారి కుటుంబాలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలో జరిగిన ఏడు ప్రమాదాల్లో 22 మంది మృతిచెందారు. రెండు రోజుల కిందట అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో 17 మంది మరణించిన దుర్ఘటన మరువక ముందే... పరవాడ సెజ్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది.పరవాడ సమీపంలోని జేఎన్ ఫార్మాసిటీలో సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్–3 యూనిట్లో గురువారం అర్ధరాత్రి రియాక్టరు నుంచి రసాయనాలు వెలువడి పొగతో కూడిన మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు, విజయనగరం జిల్లాకు చెందిన ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన విశాఖపట్నంలోని ఇండస్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. -
అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్జీటీ సీరియస్
సాక్షి, ఢిల్లీ: అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్జీటీ సీరియస్ అయ్యింది. ప్రమాదాన్ని సుమోటోగా తీసుకున్న ఎన్జీటీ.. 17 మంది కార్మికుల మృతిచెందడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అనకాపల్లి కలెక్టర్, ఏపీ పొల్యూషన్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ పరిశ్రమల శాఖ,సీపీసీబీలతో పాటు కేంద్ర పర్యావరణ శాఖకు కూడా నోటీసులు ఇచ్చింది.అలాగే, రెండు రోజుల వ్యవధిలో ఏపీలో జరిగిన మూడు ఘోరమైన ప్రమాదాలను జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతిచెందడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.కాగా, చిత్తూరు సమీపంలోని మురకంబట్టు ప్రాంతంలోని అపొలో మెడికల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయ్యి 70 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్.. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాపట్నంలోని ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్ అయ్యి ముగ్గురు విద్యార్థులు మృతిచెందడం, 37మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంపై అసహనం వ్యక్తం చేసింది.ఈ 3 ఘటనలపై పత్రికలు, టీవీల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ఈ ఘటనల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందంటూ ఆరోపించింది. 2 వారాల్లో ఈ 3 ఘటనలపై సమగ్రమైన నివేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ శుక్రవారం చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది.అచ్యుతాపురం ఘటనలో ఎఫ్ఐఆర్ స్టేటస్ రిపోర్ట్, క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, నష్టపరిహారం వంటి విషయాలపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు ఏమైనా సాయం అందిందా లేదా అనే సమాచారాన్ని అందజేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను కూడా తమకు తెలపాలని పేర్కొంది. -
అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
-
అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం: బొత్స
సాక్షి, విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బాధితులను కలిసి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బాధ్యతతో మాట్లాడాలని బొత్స హితవు పలికారు. ప్రమాదం జరిగితే అధికారంలో ఉన్నవాళ్లు పట్టించుకోలేదన్నారు. కనీసం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పలేదని ఆయన దుయ్యబట్టారు. ‘‘విషాదం వేళ.. రాజకీయం ఎందుకు?. వెంటనే సేఫ్టీ ఆడిట్ జరపాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి’’ అని బొత్స పేర్కొన్నారు.‘‘ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నాము. తెల్లవారు జామున జరిగిన కూడా ఎక్కడ సహాయక చర్యలు ఆగలేదు. కరోనా సమయంలో కూడా సహాయక చర్యలు ఆగలేదు. స్థాయి మరిచి కొంతమంది నేతలు విమర్శలు చేస్తున్నారు. వాటిని ప్రజలు గమనిస్తున్నారు. గత ఐదేళ్లలో ఏమి జరగలేదని మాట్లాడుతున్నారు. బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు ఎందుకు రాలేదని మేము అడిగిన తర్వాత సీఎం కేజీహెచ్‌కు వచ్చారు. ఒక మంచి నీళ్లు బాటిల్ కూడా బాధితులకు ఇవ్వలేదు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంటనే మృతిచెందిన వారికి కోటి రూపాయల చెక్కు అందించాము. అప్పటికప్పుడు 30 కోట్లు సిద్ధం చేశాము.’’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు. -
అచుత్యపురం బాధితులను పరామర్శించిన వైఎస్ జగన్
-
BIG Queation: ప్రాణాలు పోయి ప్రజలు ఏడుస్తుంటే రాజకీయమా... నీచత్వమే నారా వారి నైజమా
-
తలోమాట.. అచ్యుతాపురంపై కూటమి నేతల తికమక
-
అచ్యుతాపురం ఘటనపై NHRC సీరియస్.. ఏపీ సర్కార్‌కు నోటీసులు
-
అంతా మా ఇష్టం..!
-
అచ్యుతాపురం ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్.. ఏపీ సర్కార్‌కు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: అచ్యుతాపురం సెజ్ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్హెచ్ఆర్సీ.. డీజీపీ, చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. యాజమాన్యం నిర్లక్ష్యం తదితర అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.కాగా, విశాఖలోని అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రియాక్టర్ పేలిపోయిన ఘటనలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అడుగడుగునా తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరిచింది. దుర్ఘటన తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాధితులను హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం తరలించకపోవడం... వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం... శాఖల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేయకపోవడం.. ఇలా ప్రతి విషయంలోనూ అలసత్వం ప్రదర్శించింది.ఏదైనా దుర్ఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకున్న సమయాల్లో బాధిత కుటుంబాలకు సమాచారం అందించి భరోసా కల్పించేందుకు హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చి సహాయక చర్యలు, ఇతర ముఖ్య సమాచారాన్ని అందిపుచ్చుకునే వ్యవస్థను తేవడం పరిపాటి. అయితే తాజా ఘటనలో అలాంటి చర్యలేవీ లేకపోగా కూటమి సర్కారు స్పందించిన తీరు విస్మయం కలిగిస్తోంది. -
ధైర్యంగా ఉండండి.. అచ్యుతాపురం బాధితులకు జగన్ పరామర్శ (ఫొటోలు)
-
అచ్యుతాపురం ఘటనపై బాధితులు వెల్లడించిన సంచలన నిజాలు..
-
KSR Live Show: అంబులెన్సులు లేవు.. బయటపడ్డ ప్రభుత్వ వైఫల్యం..
-
పరిహారంపై క్లారిటీ లేదు.. ఇది చంద్రబాబు ప్రభుత్వం తీరు
-
17 మంది చనిపోయినా చర్యలు తీసుకోని ప్రభుత్వం
-
Watch Live: అనకాపల్లిలో వైఎస్ జగన్ పర్యటన
-
అనకాపల్లి: సినర్జిన్ ప్రమాదంపై తలోమాట!
విశాఖపట్నం, సాక్షి: అచ్యుతాపురం సెజ్ ఘోర ప్రమాదం జరిగి 48 గంటలు గడవకముందే.. అనకాపల్లిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఓ కంపెనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అచ్యుతాపురం ఘటన తర్వాత.. పరిహార ప్రకటన, బాధిత కుటుంబాలతో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తాయి. ఇప్పుడు ఫార్మా సిటీ ప్రమాద ఘటనలో కూటమి ప్రభుత్వ నేతలు తలోమాట చెబుతూ గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఎంపీ సీఎం రమేష్ ఏమన్నారంటే.. సీనియర్ కెమిస్ట్ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగింది. సీనియర్ కెమిస్ట్ డ్రగ్ పౌడర్ మిక్స్ చేస్తున్న క్రమంలో పేలుడు సంభవించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది. హోం మంత్రి అనిత ఏమన్నారంటే.. ఇది మరో దురదృష్టకరమైన ఘటన. జార్ఖండ్ కు చెందిన ముగ్గురు కార్మికులతో పాటు మరో ఉద్యోగికి.. మొత్తం నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. యాజమాన్యాలు నిర్లక్ష్యం వలన పరిశ్రమల్లో ప్రమాదాలు జరగుతున్నాయి. పరిశ్రమల యాజమాన్యాలు భద్రత పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కార్మికులకు సేఫ్టీ సూట్లు ఇవ్వాలి. త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తాం. ఒక కమీటి వేసి,పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తాం. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.అధికారులు ఏమన్నారంటే.. మానవ తప్పిదంతోనే ప్రమాదం జరిగిందని దర్యాప్తు ఆధారంగా గుర్తించాం. వేపర్ క్లైండ్ బరస్ట్ కారణంగానే ప్రమాదం జరిగింది. కెమికల్ మిక్సింగ్టైంలో బయటకు ఆవిరి వచ్చి పేలింది. అసలేం జరిగింది?పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రేడియంట్స్ సంస్ధలో గత అర్ధరాత్రి 1 గంట సమయంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కార్మికులు, విజయనగరానికి చెందిన మరో ఉద్యోగి(సీనియర్ కెమిస్ట్) తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే విషయం బయటకు రాకుండా యాజమాన్యం జాగ్రత్త పడింది. హుటాహుటిన నలుగురు కార్మికులను ఆస్పత్రికి తరలించింది. ఘటనపై ఈ ఉదయం జిల్లా కలెక్టర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. హోంమంత్రి, ఇతర అధికారులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. దీంతో హోం మంత్రి అనిత క్షతగాత్రుల్ని పరామర్శించారు. సినర్జిన్ ప్రమాదంలో ఒకరికి 90 శాతం గాయాలు కాగా, మరో ముగ్గురికి 60 శాతం పైగా గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న ఈ నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ఘటనలో 17 మంది మృత్యువాత పడగా.. మరో ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఇంకో నలుగురు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. -
నేడు అనకాపల్లికి వైఎస్ జగన్..
-
Big Question: జనం ప్రాణాలు పోయినా అక్కరలేదు.. మా టార్గెట్ జగన్..
-
అప్పుడలా.. ఇప్పుడిలా.. రెండు నాల్కల ‘పవనం’
సాక్షి, అమరావతి: పవన్ కల్యాణ్ రెండు నాల్కల ధోరణి మరోసారి బయటపడింది. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అబద్దాలు, దుష్ప్రచారంతో హడావుడి చేసిన పవన్ కల్యాణ్ స్వరం నేడు మారిపోయింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ ఘటనపై శర వేగంగా స్పందించింది. ఆ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకుంది.. అయితే, టీడీపీ ప్యాకేజీని దండిగా అందుకున్న పవన్.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఇష్టానుసారం మాట్లాడారు.ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాను పవన్ కల్యాణ్ వెలగబెడుతున్నారు. అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదంలో 18 మంది చనిపోతే.. ప్రభుత్వంలో ఉన్న ఆయన.. ప్రాణాలు కంటే డబ్బులే ప్రధానం అన్నట్లుగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. కార్మికుల ప్రాణాల కంటే పరిశ్రమలే ముఖ్యం అనే విధంగా మాట్లాడటం పట్ల నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. ‘‘సేఫ్డీ ఆడిట్ జరగాలని మొదటి నుంచి అడుగుతున్నా.. సేఫ్టీ ఆడిట్ ద్వారా పరిశ్రమలు మూతపడతాయని అనుకుంటున్నా.. ప్రభుత్వానికి ఇబ్బంది ఉండకూడదనే అడుగు ముందుకు వేయలేకపోతున్నా’’ అంటూ పవన్ ప్లేటు తిప్పేశారు.