సాక్షి, అమరావతి: విశాఖలో ఏటీసీ టైర్ల తయారి పరిశ్రమ ద్వారా సంస్థ మొత్తం రూ.1750 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతేగాక ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 2వేల మందికి ఉపాధి కలుగనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో విశాఖలోని అచ్చుతాపురం సెజ్ ఏటీసీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుంది. ఎస్‌ఐపీబీ సూచన మేరకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరాకు 95.18 లక్షల రూపాయల చొప్పున 80.10 ఎకరాలను కేటాయించినట్లు తెలిపింది. 2వేల మంది ఉపాధి కల్పన అనంతరం 5 సంవత్సరాల పాటు ప్రతి యూనిట్ విద్యుత్‌పై రూపాయి సబ్సిడీని ఫిక్స్ చేసి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్‌లో 5 శాతం క్యాపిటల్ సబ్సిడీని ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment