ATC
-
రాహుల్ హెలికాప్టర్ టేకాఫ్‌కు అనుమతి నిరాకరణ.. గంటపాటు ఆలస్యం
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి శుక్రవారం అనుకోని అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌కు ఏటీసీ నుంచి ఆనుమతి రాకపోవడంతో టేకాఫ్‌కు గంటకు పైగా ఆలస్యం అయ్యింది. దీంతో రాహుల్ చాలాసేపు హెలికాప్టర్లోనే ఉండాల్సి వచ్చింది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గొడ్డాలో ప్రచారానికి వెళ్లారు కాంగ్రెస్ నేత. అక్కడ బహిరంగ ర్యాలీలో ప్రసంగించడం ముగిసిన తర్వాత ఆయన ప్రచారం కోసం మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ టేకాఫ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాలేదు. భద్రతా కారణాల పేరుతో క్లియరెన్స్ ఆలస్యంగా లభించింది. ఈ సమస్యతో 75 నిమిషాలపాటు రాహుల్ హెలికాప్టర్లోనే ఉండాల్సి వచ్చింది. హెలికాప్టర్ టేకాఫ్‌కు ఆలస్యం అవడంతో రాహుల్ ప్రయాణ షెడ్యూల్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై రాజకీయ వివాదం చెలరేగింది.HUGE BREAKING 🚨⚡LoP Rahul Gandhi’s helicopter denied permission from flying in JharkhandIt’s been more than 2 hours but no permission granted yet 🚨Why is Modi & BJP so scared? pic.twitter.com/WJltLvaB5p— Ankit Mayank (@mr_mayank) November 15, 2024హెలికాప్టర్ టేకాఫ్‌కు అనుమతి ఆలస్యంపై కాంగ్రెస్ స్పందిస్తూ.. రాజకీయంగా ప్రేరేపితమైనదని మండిపడింది. ఇది బీజేపీ పన్నిన కుట్రేనని ఆరోపించింది. తమ ప్రచారాలను అణగదొక్కే ప్రయత్నమని పేర్కొంది. ‘రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమాలను ఆలస్యం చేయడానికి చేసిన ప్రయత్నమే.. అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి మాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నాయకులు తోసిపుచ్చారు.మరోవైపు ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), స్థానిక అధికారులు కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, అదనపు భద్రతా తనిఖీలు, ఎయిర్‌స్పేస్ మేనేజ్మెంట్ ఆందోళనలు హోల్డ్అప్కు కారణమై ఉండవచ్చని సమాచారం. -
ఏటీసీల్లో కొలువుల భర్తీకి కసరత్తు
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లుగా అప్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో వాటిలో ఉద్యోగ ఖాళీల భర్తీపై కార్మిక ఉపాధి కల్పన విభాగం దృష్టి సారించింది. దాదాపు పదేళ్లుగా ఐటీఐల్లో ఉద్యోగ నియామకాలు జరగకపోవడంతో దాదాపు 40 శాతం కొలువులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి గతవారం కార్మిక, ఉపాధి కల్పన శాఖపై సమీక్షలో ఆదేశించారు. దీంతో ఏటీసీలవారీగా ఖాళీలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వచ్చే నెల రెండో వారంలోగా కార్మి క శాఖకు నివేదికలు సమరి్పంచనున్నారు. ప్రతి ఏటీసీకి పూర్తిస్థాయి ప్రిన్సిపాల్... రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఏటీసీల్లో వివిధ కేటగిరీల్లో 2,033 ఉద్యోగాలు మంజూరయ్యాయి. అందులో మూడింట రెండో వంతు శిక్షణ ఇచ్చే శిక్షకుల పోస్టులు ఉన్నాయి. దాదాపు 1,500 శిక్షకుల పోస్టుల్లో 740 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏటీసీలవారీగా ఏయే కేటగిరీలో ఎన్ని ఖాళీలున్నాయనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీలలో కొత్త ట్రేడ్లను పరిచయం చేయనుంది. పాత ట్రేడ్లు రద్దు చేస్తూనే వాటి స్థానంలో కొత్త ట్రేడ్లను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో కొత్త ట్రేడ్లపై శిక్షణ ఇచ్చే శిక్షకులకు అర్హతలను ఖరారు చేస్తూ ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. సగానికిపైగా ఏటీసీల్లో పూర్తిస్థాయి ప్రిన్సిపాల్ లేకపోవడంతో ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు.ప్రతి ఏటీసీకి తప్పకుండా ప్రిన్సిపాల్ ఉండాలని సీఎం స్పష్టం చేయడంతో ప్రిన్సిపాల్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలా లేక నూతన నియామకాల్లో భాగంగా చేపట్టాలా అనే అంశంపై కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది. మరోవైపు నూతన ఏటీసీల ఏర్పాటుపైనా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. -
ఆ ఐటీఐలు ఇక నుంచి ఏటీసీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్(ఏటీసీ)లుగా అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, ఆ దిశగా రాష్ట్ర కార్మిక శిక్షణ, ఉపాధి కల్పన విభాగం కార్యాచరణ వేగవంతం చేసింది. గతవారం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఏటీసీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చగా, మాసబ్టాంక్లో నాలుగు ఏటీసీల భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలు ఉన్నాయి. వీటన్నింటినీ ఏటీసీలుగా అప్‌గేడ్ర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, తొలివిడతలో 25 ఐటీఐలను మాత్రమే అప్‌గ్రేడ్ చేస్తారు. ఇవన్నీ 2024–25 నుంచే సేవలు ప్రారంభిస్తాయి.తొలివిడతలోకి వచ్చే ఐటీఐలతో కూడిన ప్రతిపాదిత జాబితా ను సిద్ధం చేసేందుకు శిక్షణ, ఉపాధికల్పన శాఖ కసరత్తు చేస్తోంది. తొలివిడత ప్రాజెక్టులో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోనే ఐదు ఐటీఐలు ఏటీసీలుగా మారనున్నాయి. మిగతా వాటిని కూడా ఎంపిక చేసి జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచేందుకు ఆ శాఖ చర్యలు చేపట్టింది. ఇండస్ట్రీస్ 4.0.... అప్‌గ్రేడ్ చేసే క్రమంలో ప్రస్తుతమున్న శిక్షణ కార్యక్రమాలు సైతం కొత్తరూపు సంతరించుకోనున్నాయి. రెండుమూడు దశాబ్దాల క్రితం ఉన్న శిక్షణ కార్యక్రమాలనే ఐటీఐల్లో కొనసాగిస్తున్నారు. ఇకపై ఏటీసీల్లో సరికొత్త కోర్సులు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కోర్సుల ఎంపికపైనా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆరు రకాల ట్రేడ్లు ఎంపిక చేసి వాటిని ఈ ఏడాది నుంచే ప్రవేశపెట్టేలా చర్యలు వేగవంతం చేసింది. ఇవన్నీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(ఎన్సీవీటీ) నిబంధనలకు అనుగుణంగా మార్పు చేసి అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, ఐఓటీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్, ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, మోడ్రన్ ఆటోమేటివ్ మెయింటెనెన్స్, ఆర్ట్ వెల్డింగ్, ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వెల్డింగ్, పెయింటింగ్ తదితర కొత్త ట్రేడ్లు ఏటీసీల ద్వారా అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఇండస్ట్రీస్ 4.0 పేరిట లాంగ్‌టర్మ్, షార్ట్ టర్మ్ కోర్సులను, పారిశ్రామిక అవసరాలకు అనుగుణమైన ట్రేడ్లను ఏటీసీల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. చాలా ఐటీఐల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ సమస్య, స్థలాభావం కారణంగా భవనాల సమస్య ఉండడంతో యుద్ధప్రాతిపదికన ఏటీసీలుగా మార్పు చేయడం కత్తిమీద సాములా పరిణమించిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
రయ్.. రయ్..
సాక్షి, అమరావతి: ఎటువంటి ప్రచార ఆర్భాటం, ఒప్పందాలు, శంకుస్థాపనలు వంటి భారీ కార్యక్రమాలు లేకుండా కోవిడ్ సమయంలో నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభించిన జపాన్‌కు చెందిన ఒక భారీ మల్టీ నేషనల్ కంపెనీ విస్తరణ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూపు.. అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ) పేరుతో రూ.3,079 కోట్ల భారీ పెట్టుబడితో టైర్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో రూ.1,750 కోట్ల వ్యయంతో హాఫ్ హైవే టైర్లు (భారీ యంత్ర పరికరాలకు వినియోగించే టైర్లు) తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం 2019 నవంబర్‌లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) 2020 నవంబర్‌లో ఆమోదం తెలిపారు. వెనువెంటనే అనకాపల్లి పరిధిలోని అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసీ భూమి కేటాయించడంతో నిర్మాణ పనులు ప్రారంభించింది. 2021 ఫిబ్రవరిలో పనులు ప్రారంభించిన వెంటనే కరోనా సంక్షోభం తలెత్తినా, రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడంతో తొలి దశ పనులను రికార్డు సమయంలో పూర్తి చేసింది. 2022 జూలైలో తొలి టైరును ఉత్పత్తి చేసింది. ఈ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 ఆగస్టు 16న వాణిజ్యపరంగా ప్రారంభించారు. రోజుకు 132 టన్నుల రబ్బరును వినియోగించడం ద్వారా ఉత్పత్తి చేసిన టైర్లను 120కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఫ్లాంట్‌లో చిన్న టైర్లు (ఏఎఫ్సీ సెగ్మెంట్), పెద్ద బయాస్ టైర్లు (అగ్రి మరియు కాన్స్), రేడియల్ టైర్లు (అగ్రి), రేడియల్ (ఓటీఆర్), బయాస్ టైర్, ఓటీఆర్ టైర్లు, ఫారెస్ట్రీ టైర్లు, సాలిడ్ టైర్లు వంటివి తయారవుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో విస్తరణ ప్రభుత్వ ప్రోత్సాహం బాగుండటంతో యకహోమా గ్రూపు ప్యాసింజర్ వాహనాల టైర్లను తయారు చేసే యూనిట్ నిర్మాణ పనులను ప్రారంభించింది. సుమారు రూ.680 కోట్ల పెట్టుబడితో ప్యాసింజర్ కారు టైర్ల తయారీ లైన్‌ను ఏర్పాటు చేస్తోంది. దేశీయ ప్యాసింజర్ కార్లకు డిమాండ్ భారీగా పెరగడంతో దానికి తగ్గట్టుగా ఏటా 17 లక్షల టైర్ల తయారీ సామర్థ్యంతో విస్తరణ పనులు మొదలు పెట్టింది. ఈ యూనిట్‌ను 2024 చివరి త్రైమాసికానికి అందుబాటులోకి తీసుకు రావాలని యకహోమా గ్రూపు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం 28 లక్షల టైర్లుగా ఉన్న ఏటీసీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా 45 లక్షల టైర్లకు చేరుకోనుంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న యూనిట్లో 22 అంగుళాల వరకు ఉండే టైర్లను ఉత్పత్తి చేస్తారు. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోందని, 2022లో జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించిందని, ఇదే రకమైన వృద్ధి భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని యకహోమా అంచనా వేస్తోంది. 2007లో 7 లక్షల టైర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇండియాలో అడుగుపెట్టిన ఈ గ్రూపు వేగంగా విస్తరిస్తోంది. ఇండియాలో ఇప్పటికే రెండు యూనిట్లు.. తిరువన్వేలి, దహేజ్ల్లో ఉండగా, మూడవ యూనిట్‌ను అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ పూర్తి స్థాయి సామర్థ్యం అందుబాటులోకి వస్తే 2,300 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో 75 శాతం మంది స్థానికులకే ఉపాధి కల్పించనున్నారు. ఇందుకోసం స్థానిక ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసుకొని శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే 1000 మందికిపైగా పని చేస్తుండగా, విస్తరణకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ మద్దతు ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు అందించింది. ఏపీఐఐసీ, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు పూర్తిగా సహకరించారు. నిర్దేశించుకున్న గడువులోగానే ప్రాజెక్టును పూర్తి చేయగలిగాం. – ప్రహ్లాదరెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఏటీసీ టైర్స్ యకహోమా ఉద్యోగి కావడం ఆనందంగా ఉంది జపాన్‌కు చెందిన యకహోమా ఆఫ్ హైవే టైర్ల తయారీ యూనిట్లో ఉద్యోగిగా ఉండటం పట్ల చాలా ఆనందంగా ఉంది. క్యాంపస్ సెలక్షన్లో నేను ఏటీసీ టైర్స్‌లో ఉద్యోగం పొందాను. యకహోమా కుటుంబ సభ్యుడిగా సొంత రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తాను. – లాబాల పవన్ కళ్యాణ్, టైర్ బిల్డింగ్–ప్రొడక్షన్, ఏటీసీ టైర్స్ -
వొడాఫోన్ ఓసీడీల జారీకి చెక్, ముగిసిన గడువు
న్యూఢిల్లీ: భారీ రుణ భారాన్ని మోస్తున్న వొడాఫోన్ ఐడియా ప్రతిపాదిత ఐచ్చిక మార్పిడిగల డిబెంచర్ల(ఓసీడీలు) జారీకి తాజాగా చెక్ పడింది. మొబైల్ టవర్ల సంస్థ ఏటీసీ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ. 1,600 కోట్ల విలువైన ఓసీడీల జారీకి కంపెనీ గతంలో ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించక పోవడంతో ఇందుకు గడువు తిరిపోయినట్లు మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా తాజాగా వెల్లడించింది. వడ్డీబకాయిలను ఈక్విటీగా మార్పు చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లభించలేదని పేర్కొంది. ఏటీసీ టెలికంకు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో రూ. 1,600 కోట్ల విలువైన ఓసీడీలను జారీ చేసేందుకు గత నెలలో వొడాఫోన్ ఐడియా వాటాదారులు అనుమతించారు. అయితే వీటిని 15 రోజుల్లోగా జారీ చేయవలసి ఉన్నట్లు వొడాఫోన్ ఐడియా తెలియజేసింది. అంతకంటే ముందు ప్రభుత్వానికి 16వేల రూపాయల కోట్ల వడ్డీ(స్పెక్ట్రమ్, ఏజీఆర్) బకాయిలకుగాను ఈక్వీటీని జారీ చేయవలసి ఉన్నట్లు వివరించింది. దీంతో ఈ ఒప్పందాన్ని పొడిగించేందుకు ఏటీసీతో చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అవసరానుగుణంగా వాటాదారుల నుంచి మరోసారి అనుమతి తీసుకోనున్నట్లు పేర్కొంది. చెక్ -
గోవాలో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు.. హైదరాబాద్ నుంచి 180మందితో..
సాక్షి, హైదరాబాద్: గోవాలో ఇండిగో విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. 180 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి గోవా ఇండిగో ఫ్లైట్ వెళ్లింది. అక్కడ ల్యాండింగ్ సమయంలో రన్‌వే పైకి మరో విమానం దూసుకొచ్చింది. దీంతో ఇండిగో విమానం ల్యాండ్ అయిన 15 సెకన్లలోనే మళ్లీ టేకాఫ్ అయింది. గాల్లోనే 20 నిమిషాలపాటు చక్కర్లు కొట్టింది. చివరకు ఏటీసీ నుంచి క్లియరెన్స్ రావడంతో సేఫ్‌గా ల్యాండ్ అయింది. చదవండి: (జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు) -
3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే: సీఎం జగన్
సాక్షి, అచ్యుతాపురం(అనకాపల్లి జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లిజిల్లా అచ్యుతాపురంలో ఏపీ ఎస్ఈజెడ్లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ఫేజ్‌ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం మరో 8 కంపెనీలకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 15 నెలల కాలంలోనే ఫ్యాక్టరీలో ఉత్పత్తి.. ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దేవుడి దయతో ఒక పరిశ్రమను ప్రారంభోత్సవం చేసుకోవడంతోపాటు, రెండో దశ ప్లాంట్ విస్తరణ పనులకూ శంకుస్ధాపన చేశాం. యోకహోమా జపనీస్ టైర్ల తయారీ పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ.. కంపెనీ గురించి చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమంగా మొదటి 5–6 స్ధానాల్లో తమ కంపెనీ ఉందని, రాబోయే రోజుల్లో టాప్ 3లోకి పోబోతున్నామని చెప్పారు. అలాంటి కంపెనీ మన రాష్ట్రానికి రావడం సంతోషకరం. 2020 సెప్టెంబరులో మన దగ్గరకు వచ్చారు. అక్కడనుంచి చకచకా అన్ని రకాలుగా మద్ధతు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఫిబ్రవరి 2021లో పనులు ప్రారంభించి కేవలం 15 నెలల కాలంలోనే ఫ్యాక్టరీ ఉత్పత్తిలోకి వచ్చింది. మనమిచ్చే ప్రోత్సాహంతో రెండో దశకూ శ్రీకారం.. మనమిచ్చే ప్రోత్సాహం, మద్దతు వారిని ఆకట్టుకుంది. అందుకే రెండోదశకు కూడా నాందిపలుకుతున్నారు. ఒకవైపు తొలిదశ ప్రాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంటే.. మరోవైపు సెకెండ్ ఫేజ్‌కు శంకుస్ధాపన కార్యక్రమం జరుగుతుంది. ఈ రెండో దశ కూడా సరిగ్గా 12 నెలల్లోనే ఆగష్టు 2023లోగా పూర్తి చేస్తామని చెప్తున్నారు. తొలిదశలో రూ.1250 కోట్ల రూపాయలతో దాదాపు 1200 మందికి ఉద్యోగాలు ఇక్కడే కల్పించారు. ఇవాళ మొదలయ్యే రెండోదశలో మరో రూ.850 కోట్లతో పనులు చేపట్టడంతో పాటు మరో 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొత్తంగా 2000 మందికి ఉపాధి ఇక్కడే.. మన పిల్లలకే అందుబాటులోకి వస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెపుతున్నానంటే.. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, బాగుపడాలన్నా ఆ ప్రాంతంలో మన పిల్లలకు మెరుగైన ఉద్యోగాలు అందడం చాలా అవసరం. అలా ఆ ప్రాంతంలో చదువుకున్న మన పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇక్కడే మనం ఇప్పించగలిగితే.. పేదరికం నుంచి మన పిల్లలు బయటపడే పరిస్థితులు ఇంకా మెరుగవుతాయి. దీనికోసం ప్రభుత్వం పరంగా మనం చేయాల్సినవి అన్నీ కూడా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. చదవండి: (ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇంటికి సీఎం జగన్) ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్– ఏపీ.. ఇవాళ రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక రంగంలో అడుగులు పడుతున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మనం ఈరోజు గత మూడు సంవత్సరాలుగా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మనమే అవార్డు తీసుకుంటున్నాం. మొట్టమొదటి సారిగా ఈ సారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్టిఫికేషన్ చేసేముందు దాని తీరును కూడా మార్చారు. మొట్టమొదటిసారిగా ఆ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వ్యక్తులతో వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వాటికి అనుకూలంగానే ఈజ్ఆఫ్ డూయింగ్‌బిజినెస్ ర్యాంకింగ్ ఇస్తున్నారు. అలా రూల్స్ మార్చిన నేపథ్యంలో వరుసగా మూడేళ్లుగా ఏపీ నంబర్ 1 ర్యాంకు సాధిస్తోంది. ఇవాళ ప్రతి అడుగులో కూడా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. గతంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చేవారు కాదు. ఏళ్ల తరబడి పరిశ్రమల ప్రోత్సాహాకాలు పేరుకుపోయాయి. ఆ నేపథ్యంలో చిన్నా చితకా పరిశ్రమలు నడవలేక మూతబడుతున్న పరిస్థితులు. దాదాపు లక్షకుపైగా ఎంఎస్ఎంఈలు రాష్ట్రంలో ఉన్నాయి. పదిలక్షల మందికి పైగా ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకంగా.. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సహం ఇచ్చే కార్యక్రమం గత ప్రభుత్వాలు ఎప్పుడో మర్చిపోయిన సందర్భంలో... మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా గుర్తు పెట్టుకుని పాత బకాయిలను క్లియర్ చేస్తూనే, మరోవైపు ఎలాంటి బకాయిలు లేకుండా ప్రతి సంవత్సరం వారికి రావాల్సిన ఇన్సెంటివ్‌లు అందిస్తున్నాం. వాళ్లను చేయిపట్టుకుని నడిపిస్తూ ప్రోత్సహిస్తూ ఈ మూడు సంవత్సరాల కాలంలో రూ.1463 కోట్లు ఎంఎస్ఎంఈలకు ఇచ్చాం. ఈ రకంగా ప్రభుత్వం ప్రతి దశలోనే ప్రోత్సహిస్తూ.. అడుగులు ముందుకు వేస్తుంది కాబట్టే ఈ రోజు.. 2021–22 చూస్తే ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ గ్రోత్‌రేట్ 11.43 శాతం సాధించాం. దేశంలో చూస్తే అది కేవలం 8.9శాతమే. దేశంతో పోలిస్తే.. రాష్ట్రం వేగంగా అడుగులు ముందుకేస్తోంది. ఎగుమతుల్లోనూ.. ఎగుమతుల్లో చూస్తే.. ఇప్పటికే మన రాష్ట్రంలో ఆరు పోర్టులుంటే.. ఈ 3 ఏళ్లకాలంలో వేగంగా మరో 4 పోర్టులు కట్టేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నాం. ఒకవైపు పోర్టులు కొత్తవి నిర్మించడంతో పాటు 9 ఫిషింగ్ హార్బర్లుకూడా నిర్మిస్తున్నాం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్ కాని, ఒక పోర్టునుకాని అందుబాటులోకి తెస్తున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు ఆంధ్రరాష్ట్రంలో 2021–22 ఆర్ధిక సంవత్సరంలో ఎక్స్‌పోర్టెడ్ గూడ్స్ 19.3 బిలియన్ డాలర్లు అంటే ఇది మొత్తం దేశం ఎగుమతుల్లో 4.58 శాతం. ఈ పోర్టులు పూర్తయిన తర్వాత ఏపీ నుంచే 10శాతం ఎగుమతులు తీసుకొచ్చే విధంగా అడుగులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇండస్ట్రియల్ కారిడార్లు.. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏపీలో మాత్రమే ఉన్నాయి. విశాఖ – చెన్నై, చెన్నై – బెంగుళూరు, హైదరాబాద్ – బెంగుళూరు కారిడర్లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే. గతంలో మన రాష్ట్రంవైపు చూడని వారు కూడా ఇప్పుడు మన వైపు చూస్తున్నారు. మన రాష్ట్రంలోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో సెంచరీ ప్లై వుడ్ భజంకాలు పేరు విన్నారా ? ఈ రోజు భజాంకాలు వైయస్సార్ జిల్లా బద్వేలులో సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. గతంలో బంగర్‌ల పేర్లు ఎప్పుడైనా విన్నారా ? గతంలో ఎప్పడూ రాష్ట్రంవైపు చూడని వాళ్లు శ్రీ సిమెంట్స్.. ఇవాళ ఆంధ్రరాష్ట్రంలో ఫ్యాక్టరీ పెడుతున్నారు. గతంలో ఆదిత్యా బిర్లా ఏపీకి వచ్చి, సీఎంతో కలిసి వారి ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న విషయం మీరు చూశారా ? ఈ రోజు ఆదిత్య బిర్లా కూడా ఆంధ్రరాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రితో సహా వెళ్లి వాళ్ల ప్లాంట్ ప్రారంభిస్తున్నారు. గతంలో అదానీ, అదానీ అని పేరుకు మాత్రమే అనేవారు. కానీ ఆదానీ అనే సంస్ధ గతంలో ఏపీలో ఎప్పుడూ అడుగులు ముందుకు వేయలేదు. కేవలం జగన్ సీఎం అయిన తర్వాతనే అదానీలు ముందడుగు వేశారు. ప్రతి పెద్ద పరిశ్రమకు చెందిన వారందరూ కూడా ఏపీ వైపు చూసేట్టుగా అడుగులు పడుతున్నాయి. పారిశ్రామిక వేత్తలకు తోడుగా.. పారిశ్రామిక వేత్తలందరికీ ఒకటే మాట చెప్తున్నాం. మీరు పరిశ్రమ పెట్టండి.. అన్నిరకాలుగా సహాయ, సహకారాలిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది. అదానీ డేటా సెంటర్‌కు కూడా బహుశా వచ్చే నెలలో విశాఖలో శ్రీకారం చుడుతున్నాం. ఇక్కడ మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. ఒకవైపు వాళ్లను ప్రోత్సహిస్తూ.. అడుగులు ముందుకు వేయిస్తూ తీసుకొస్తున్నాం. మీ తరపున కూడా సహాయ, సహకారాలు.. మరోవైపున మీ తరఫు నుంచి కూడా అంతే సహాయ సహకారాలు అందాలి. ఏకంగా 75శాతం కచ్చితంగా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టంచేశాం. మన మీద కూడా బాధ్యత ఉందనే విషయం మరిచిపోకూడదు. ఎవరైనా ఏపీకి రావడానికి సంతోషపడాలి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తే.. ఎలా పరిష్కరించుకోవాలి, ఏరకంగా గొడవ పడకుండా పరిష్కరించాలనుకోవాలన్నదానిపైన మనం అడుగులు వేయాలి. అప్పుడే ఆ పారిశ్రామిక వేత్తలకూ నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు వాళ్లు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు. అప్పుడు మన పిల్లలకు పుష్కలంగా ఉద్యోగాలు వస్తాయి. మన వాళ్లు చాలా మంచి వాళ్లు, బాగా కష్టపడి పనిచేసేవాళ్లు, ఎటువంటి సమస్యలు సృష్టించరు అని వాళ్లు ఎప్పుడు అనుకుంటారో... అప్పుడు మన రాష్ట్రంలోకి ఇంకా పెట్టుబడులు వస్తాయి. ఆ బాధ్యత మన భుజాల మీద ఉందని... సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలువురు ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
విశాఖ నుంచి 120 దేశాలకు అలయన్స్ టైర్లు
(అచ్యుతాపురం సెజ్ నుంచి సాక్షి ప్రతినిధి చంద్రశేఖర్ మైలవరపు): రాష్ట్రంలో మరో భారీ విదేశీ పెట్టుబడి వాస్తవ రూపంలోకి వచ్చింది. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూపునకు చెందిన అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ) విశాఖ సమీపంలోని అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేసిన భారీ హాఫ్ హైవే టైర్ల తయారీ పరిశ్రమ వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైంది. వ్యవసాయం, మైనింగ్, అటవీ, పోర్టు, నిర్మాణ రంగానికి చెందిన భారీ యంత్ర పరికరాలకు వినియోగించే పెద్ద పెద్ద టైర్లు ఇక్కడ తయారవుతాయి. పూర్తిగా ఎగుమతుల కోసం ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో ఉత్పత్తి అయ్యే టైర్లను 6 ఖండాలకు చెందిన 120కి పైగా దేశాలకు అందిస్తారు. అత్యధికంగా అమెరికా, యూరోప్ దేశాలకు ఎగుమతి కానున్నాయి. రికార్డు సమయంలో పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తికి సిద్ధమైన ఈ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే లాంఛనంగా ప్రారంభించనున్నారు. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూపునకు అమెరికా, జపాన్, ఇండియాల్లో ఏడు యూనిట్లు ఉన్నాయి. ఇండియాలో ఇప్పటికే తిరువన్వేలి, దహేజ్‌లలో రెండు యూనిట్లు ఉన్నాయి. మూడవ యూనిట్‌ను విశాఖ వద్దఏర్పాటు చేసింది. రూ.2,352 కోట్ల పెట్టుబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.2,352 కోట్ల (294 మిలియన్ డాలర్లు) పెట్టుబడితో విశాఖలో యూనిట్ ఏర్పాటుకు యకహోమా గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 2019 నవంబర్ లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసింది. కంపెనీ ప్రతిపాదినకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏర్పాటైన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 2020 నవంబర్‌లో ఆమోదం తెలిపింది. వెంటనే ఏపీఐఐసీ భూమి కేటాయించడం, నిర్మాణం ప్రారంభం చకచకా జరిగిపోయాయి. 2021 ఫిబ్రవరిలో పనులు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. కరోనా సంక్షోభం సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడంతో రికార్డు సమయంలో తొలి దశ పనులు పూర్తి చేసినట్లు ఏటీసీ ప్రతినిధులు తెలిపారు. జూలై నెలలో ఏటీసీ తన తొలి టైరును ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం ఉత్పత్తి పరిశీలన దశలో ఉంది. త్వరలో వాణిజ్యపరంగా ఉత్పత్తికి సిద్ధమవుతోంది. తొలి దశ కింద ఇప్పటివరకు రూ.1,320 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం ఈ యూనిట్ పూర్తిస్థాయి సామర్థ్యం రోజుకు 132 టన్నుల రబ్బరు వినియోగం కాగా, తొలి దశలో రోజుకు 69 టన్నుల రబ్బరును వినియోగించనున్నారు. స్థానికులకే పెద్ద పీట తక్కువ మానవ వనరులతో అధిక శాతం రోబోటిక్ విధానంలో నడిచేలా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ముడి సరుకు వచ్చినప్పటి నుంచి టైరు తయారయ్యి నేరుగా గొడౌన్‌లోకి వెళ్లే విధంగా లైన్స్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ పూర్తిస్థాయి సామర్థ్యం అందుబాటులోకి వస్తే 2,000 మందికి ఉపాధి లభిస్తుంది ఇందులో 75 శాతం స్థానికులే ఉంటారు. ఇందుకోసం స్థానిక ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే 400 మందికిపైగా పనిచేస్తుండగా, విస్తరణకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను పెంచుతారు. ప్రభుత్వ మద్దతుతో.. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు పూర్తిస్థాయిలో సహకారం అందించాయి. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్, ఏపీఐఐసీ, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధుల వరకు పూర్తిగా సహకరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం వారు చూపించిన తపనతో నిర్దేశించుకున్న లక్ష్యంలోనే ప్రాజెక్టును పూర్తి చేయగలిగాం. – అనిల్ గుప్తా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఏటీసీ టైర్స్ యకహోమా ఉద్యోగి కావడం ఆనందంగా ఉంది జపాన్‌కు చెందిన యకహోమా టైర్ల తయారీ యూనిట్లో ఉద్యోగిగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం పొందాను. యకహోమా కుటుంబ సభ్యుడిగా సొంత రాష్ట్రాభివృద్ధికి కృసి చేస్తాను. లాబాల పవన్ కళ్యాణ్, టైర్ బిల్డింగ్–ప్రొడక్షన్, ఏటీసీ టైర్స్ సొంతూరులో ఉద్యోగం వచ్చింది నాది అచ్యుతాపురం. యకహామాకు చెందిన ఏటీసీ టైర్స్‌లో ఉద్యోగం వచ్చింది. సొంతూరిలోనే ఉద్యోగం లభించడం చాలా ఆనందంగా ఉంది. ఇదే పట్టుదలతో మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటాను. ఇక్కడ పని వాతావరణం చాలా బాగుంది. పర్యావరణ పరిరక్షణ, భద్రతకు పెద్ద పీట వేస్తున్నారు. రజనా శ్యామల, టైర్ బిల్డింగ్–ప్రొడక్షన్, ఏటీసీ టైర్స్ -
CM Jagan: సీఎం వైఎస్ జగన్‌తో 'ఏటీసీ టైర్స్' ప్రతినిధుల భేటీ
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏటీసీ టైర్స్ డైరెక్టర్ తోషియో ఫుజివారా, కంపెనీలు ప్రతినిధులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ ప్లాంట్ ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. విశాఖపట్నం అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసీ కేటాయించిన భూమిలో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ నూతన ప్లాంట్‌ను ఏర్పాటుచేసింది. ఆగస్టులో ఈ ప్లాంట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏటీసీ టైర్స్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సీఎం వైఎస్ జగన్‌ను కంపెనీ డైరెక్టర్, ప్రతినిధులు ఆహ్వానించారు. ప్లాంట్ నిర్మాణం, ఉత్పత్తులు, ఉద్యోగాలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ఏటీసీ – ది యోకోహామా రబ్బర్ కో. లిమిటెడ్, జపాన్‌కు పూర్తిగా అనుబంధ సంస్థ. ఏటీసీ, ఏటీసీ అనుబంధ కంపెనీలు సంయుక్తంగా అలయెన్స్ టైర్ గ్రూప్ (ఏటీజీ)గా ఏర్పడ్డాయి. ఆఫ్ హైవే టైర్ల (ఓహెచ్‌టీ) వ్యాపారంలో ప్రపంచంలో ఏటీజీ ప్రముఖంగా పేరొందింది. 6 ఖండాల్లోని 120 దేశాలలో ఏటీజీ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఏటీసీ భారతదేశంలో రెండు తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. ఇందులో ఒకటి తిరునెల్వేలి (తమిళనాడు), మరొకటి దహేజ్ (గుజరాత్). అచ్యుతాపురం వద్ద రూ. 1,750 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు, ప్రారంభంలో రోజుకు 135 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ, 2 వేల మందికి ఉద్యోగావకాశాలు. pic.twitter.com/RfxfRdFJPw — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 24, 2022 చదవండి: (ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం) విశాఖపట్నం అచ్యుతాపురం వద్ద రూ. 1,750 కోట్లతో ఈ సంస్థ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ప్రారంభంలో రోజుకు 135 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ, 2 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అచ్యుతాపురం ప్లాంట్‌లో చిన్న టైర్లు (ఏఎఫ్సీ సెగ్మెంట్), పెద్ద బయాస్ టైర్లు (అగ్రి మరియు కాన్స్), రేడియల్ టైర్లు (అగ్రి), రేడియల్ (ఓటీఆర్), బయాస్ టైర్, ఓటీఆర్ టైర్లు, ఫారెస్ట్రీ టైర్లు, సాలిడ్ టైర్లు వంటి ఉత్పత్తులు జరుగనున్నాయి. ఈ సమావేశంలో పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యశాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ ప్రహ్లాద్ రెడ్డి, అంబరీష్ ఆర్ షిండే, పీఆర్ హెడ్ వైవీ. కృష్ణంరాజు, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. చదవండి: (ఎల్లో మీడియా ఏడుపుపై మంత్రి బుగ్గన కౌంటర్) -
ఏటీసీ టైర్ల పరిశ్రమతో రూ.1750 కోట్లు పెట్టుబడులు
సాక్షి, అమరావతి: విశాఖలో ఏటీసీ టైర్ల తయారి పరిశ్రమ ద్వారా సంస్థ మొత్తం రూ.1750 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతేగాక ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 2వేల మందికి ఉపాధి కలుగనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో విశాఖలోని అచ్చుతాపురం సెజ్ ఏటీసీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుంది. ఎస్ఐపీబీ సూచన మేరకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరాకు 95.18 లక్షల రూపాయల చొప్పున 80.10 ఎకరాలను కేటాయించినట్లు తెలిపింది. 2వేల మంది ఉపాధి కల్పన అనంతరం 5 సంవత్సరాల పాటు ప్రతి యూనిట్ విద్యుత్‌పై రూపాయి సబ్సిడీని ఫిక్స్ చేసి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 5 శాతం క్యాపిటల్ సబ్సిడీని ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. -
సయీద్‌కు 11 ఏళ్ల జైలు
లాహోర్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌కు పాక్‌లో జైలు శిక్ష పడింది. ఉగ్రవాదానికి నిధులు అందించారన్న కేసులో విచారణ జరిపిన పాకిస్తాన్‌లోని ఉగ్రవ్యతిరేక (ఏటీసీ) పదకొండేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. సయీద్‌తోపాటు అతడి సన్నిహిత సహచరుడు జఫర్ ఇక్బాల్‌కూ 11 ఏళ్ల శిక్ష విధిస్తూ ఏటీసీ జడ్జి అర్షద్ హుస్సేన్ భుట్టా ఆదేశాలు జారీ చేశారు. సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి గతంలోనే ప్రకటించింది. అతడి తలకు అమెరికా గతంలో కోటి డాలర్ల వెలకట్టింది. గత ఏడాది జూలై 17న అరెస్ట్ అయిన సయీద్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైల్లో ఉన్నారు. లాహోర్, గుజ్రన్‌వాలాల్లో దాఖలైన రెండు కేసుల్లో సయీద్‌కు శిక్ష విధించారని, ఒక్కో కేసులో ఐదున్నర ఏళ్లు జైలు శిక్ష, మొత్తం 15 వేలరూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని, రెండు శిక్షలు ఒకేసారి అమలవుతాయని కోర్టు అధికారి ఒకరు తెలిపారు. ఏటీసీ కోర్టు గత ఏడాది డిసెంబర్ 11న సయీద్, అతడి సన్నిహిత సహచరులను దోషులుగా ప్రకటించగా..శిక్ష ఖరారును ఫిబ్రవరి 11వ తేదీ వరకూ వాయిదా వేయడం తెల్సిందే. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందిస్తున్న వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పాకిస్తాన్ హామీని నెరవేర్చాలని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఒకటి ఇచ్చిన పిలుపుతో పాక్ ప్రభుత్వం సయీద్, అతడి అనుచరులపై విచారణ ప్రారంభించింది. -
విమానంలో భర్త.. ఏటీసీలో భార్య!
న్యూఢిల్లీ/ఇటానగర్: 12 మందితో ప్రయాణిస్తున్న ఆ విమానానికి భర్త పైలెట్ కాగా, భార్య ఏటీసీలో విధి నిర్వహణలో ఉన్నారు. ఆ విమానం(ఏఎన్–32) ఆచూకీ తెలియకుండా పోయిన విషయం మొదటగా తెలుసుకుంది ఆమెనే. వివాహమైన ఏడాదికే భర్త అనుకోని ప్రమాదంలో చిక్కుకోవడం..అందుకు భార్య ప్రత్యక్ష సాక్షి కావడం విధి ఆడిన వింత నాటకం! సోమవారం భారత్, చైనా సరిహద్దుల్లో ఆచూకీ తెలియకుండా పోయిన ఏఎన్–32 విమానం పైలెట్ ఆశిష్ తన్వర్(29)కాగా ఆయన భార్య సంధ్యా తన్వర్ ఆరోజు ఏటీసీ విధుల్లో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 12.27 గంటలకు అరుణాచల్ ప్రదేశ్‌లోని మెచుకాలోని వైమానిక స్థావరం నుంచి ఏఎన్–32 రకం విమానం 12 మందితో బయలుదేరింది. ఒంటి గంట సమయంలో కంట్రోల్ రూంతో ప్రత్యక్ష సంబంధాలు తెగిపోయాయి. భర్త నడుపుతున్న విమానం కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయిన విషయాన్ని అందరికంటే ముందుగా జోర్హాట్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) అధికారిగా ఉన్న సంధ్య గ్రహించారు. మిగతా వారిని అప్రమత్తం చేశారు. ఆశిష్ తన్వర్, సంధ్య వివాహం 2018లో కాగా, ఇద్దరూ ఫ్లైట్ లెఫ్టినెంట్ హోదా అధికారులే. పెళ్లయిన ఏడాదికే ఇలాంటి అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుందని సంధ్యా కలలోనైనా ఊహించి ఉండకపోవచ్చు. విమానంతోపాటు ఆశిష్, తదితరుల జాడ తెలియక పోవడంతో వారి కుటుంబసభ్యుల వేదన వర్ణనాతీతంగా మారింది. హరియాణా రాష్ట్రంలోని పల్వాల్‌లోని దీఘోట్ గ్రామానికి చెందిన ఆశిష్ బీటెక్ పూర్తిచేశారు. ఆ తర్వాత ఆశిష్ 2013లో భారత వాయుసేనలో చేరారు. దట్టమైన పొగ చూశాం: గ్రామస్తులు సోమవారం మధ్యాహ్నం వైమానిక దళం విమానం కూలిన సమయంలో తమ సమీపంలోని పర్వత ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించడం గమనించినట్లు గ్రామీణులు చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సియాంగ్, పశ్చిమ సియాంగ్ జిల్లాల్లోని ఎత్తైన పర్వత శ్రేణుల్లో అన్వేషణ ముమ్మరం చేశారు. సియాంగ్ జిల్లా తుంబిన్ గ్రామస్తులు చెప్పిన దానిని బట్టి ఆ ప్రాంతంలో గాలింపు వేగవంతం చేయాలని ఆదేశించినట్లు సీఎం పెమా ఖండు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం షి–యోమి, సియాంగ్ జిల్లాల పరిధిలో విమానం జాడ కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. -
గగనంలో ఉత్కంఠ
ముంబై: ఢిల్లీ గగనతల సమాచార ప్రాంతంలో(ఎఫ్ఐఆర్)లో ఘోర ప్రమాదం తప్పింది. సమీపంగా వచ్చిన మూడు విమానాలు ఢీకొనకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ), ఇతర ఆటోమేటిక్ హెచ్చరికలు నిలువరించాయి. ఆ సమయంలో 3 విమానాల్లో కలపి వందలాది ప్రయాణికులు ఉన్నారు. డిసెంబర్ 23న జరిగిన ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) విచారణ ప్రారంభించింది. డచ్ విమానం కేఎల్ఎమ్, తైవాన్‌కు చెందిన ఇవా ఎయిర్, అమెరికా విమానం నేషనల్ ఎయిర్‌లైన్స్ ఎన్సీఆర్ 840 దాదాపు ఢీకొనేంత దగ్గరికొచ్చాయి. తొలుత ఎన్సీఆర్ 31 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుండగా.. ఇవా విమానం ఎన్సీఆర్కు చేరువగా వచ్చింది. రెండు విమానాల్లో అంతర్గత హెచ్చరికలు జారీచేయడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో కేఎల్ఎమ్ 33 వేల అడుగుల ఎత్తులో ఉంది. హెచ్చరికల నేపథ్యంలో ఎన్సీఆర్ 35 వేల అడుగుల ఎత్తుకు ఎగిరి చక్కర్లు కొట్టింది. తర్వాత ఎడమ వైపు తిరగాలని ఏటీసీ ఆదేశించింది. ఈ మధ్యలో ఇవా.. కేఎల్ఎం ఎగురుతున్న 33 వేల అడుగుల ఎత్తుకు చేరడంతో మరో హెచ్చరిక జారీ అయింది. దీంతో ఇవాను పైలట్లు కేఎల్ఎం నుంచి దూరంగా నడిపారు. అదే సమయంలో ఎన్సీఆర్ 33 వేల అడుగుల స్థాయికి దిగిరావడంతో ఇవాకు సమీపంగా వచ్చింది. దీంతో మరోసారి హెచ్చరిక పంపి ప్రమాదాన్ని తప్పించారు. -
అమెరికా తెలుగు ప్రజల గుండెల్లో చెరిగిపోని జ్ఞాపకాలు
డల్లాస్ (ఇర్వింగ్) : అమెరికా తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం(టాటా) సంయుక్తంగా నిర్వహించిన అమెరికన్ తెలుగు కన్వెన్షన్ వేడుకలు ఘనంగా ముగిశాయి. మే 31 నుంచి జూన్ 2 వరకు డల్లాస్‌లోని ఇర్వింగ్‌లో జరిగిన ఈ సంబరాలకు అతిరథ మహారథులు హాజరై వేడుకను దిగ్విజయం చేశారు. రెండు తెలుగు సంఘాలు ఏకమై మరో కొత్త చరిత్రకు నాంది పలికాయి. అమెరికా తెలుగు ప్రజల గుండెల్లో చెరిగిపోని జ్ఞాపకాలను ఆటా, టాటాలు అందించాయి. సంఘాలుగా వేరైనా తెలుగు వారిగా ఒక్కటన్న స్ఫూర్తితో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు ఆటా స్థాపకులు హన్మంత్ రెడ్డి, టాటా స్థాపకులు పైళ్ల మల్లారెడ్డి. ఇది వరకు జరిగిన తెలుగు వేడుకల్లాగా కాకుండా కొత్తగా రెండు సంఘాల వారి అభిప్రాయాలను స్వీకరించి, వాటిని గౌరవిస్తూ ఆచరణలోకి తీసుకొచ్చారు. మొదటి రోజు వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం విశేష కృషి చేసిన డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. మొదటి రోజు వేడుకలకు ప్రత్యేక అతిథిగా నటి శ్రియా శరణ్ హాజరయ్యారు. ఈ వేడుకలకు 2వేలకు పైగా అమెరికా తెలుగు ప్రజలు హాజరయ్యారు. రెండవ రోజు వేడుకలు పూర్ణకుంభం ఊరేగింపుతో.. అలరించే అందమైన ప్రారంభ నృత్యంతో మొదలైంది. ప్రారంభ వేడుకల్లో పాడిన పాటను ప్రముఖ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వర రావు రాశారు. ఆ పాటకు వందేమాతరం శ్రీనివాస్ స్వరాలు అందించగా సుధా కల్వగుంట్ల ఆలపించారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా అందంగా ప్రారంభ నృత్యం సాగింది. మిగిలిన రెండు రోజుల వేడుకలు సాహిత్య అకాడమీ వారి కార్యక్రమాలు కొనసాగాయి. రెండో రోజు వేడుకల్లోనూ శ్రియా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు సుమ కనకాల తన దైన శైలిలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కేంద్రీయ హిందీ సమితీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, టీడీపీ నేత పెద్దిరెడ్డి ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. గౌరవ అతిథిగా పద్మావతి రెడ్డి హాజరయ్యారు. మూడో రోజు వేడుకలు శ్రీనివాస కళ్యాణంతో మొదలయ్యాయి. ఉదయం జరిగిన వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణానికి దాదాపు 1000 మంది భక్తులు హాజరయ్యారు. మూడవ రోజు సాయంత్రం జరిగిన వేడుకల్లో నటి త్రిష నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మూడు రోజుల వేడుకలకు మంచి స్పందన రావడంతో ప్రేమ్‌సాగర్ రెడ్డి (నాటా), హన్మంత్ రెడ్డి(ఆటా), పైళ్ల మల్లారెడ్డి(టాటా)లు మూడు సంఘాల ఆధ్వర్యంలో మరో వేడుక జరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ మాట వినగానే అక్కడున్న ప్రేక్షకులు కరతాల ధ్వనులతో సంఘీభావం తెలిపారు. ఈ వేడుకలు ఇంత ఘన విజయం సాధించటానికి కారణమైన కరుణాకర్ అసిరెడ్డి, హరనాథ రెడ్డి, అజయ్ రెడ్డి, విక్రమ్ జనగాం, రఘువీర్ బండారు, అరవింద్ ముప్పిడి, భరత్ మదాది, సతీష్ రెడ్డి, జ్యోతి రెడ్డి, పాశం కిరణ్ రెడ్డి, మహేశ్ అదిభట్ల, మోహన్ పాట్లోల, ధీరజ్ ఆకుల, శ్రీనివాస్ అనుగులతో పాటు వారికి సహకరించిన 36 కమిటీలను 400 మంది వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు. జాయింట్ అడ్వైజరీ కౌన్సిల్‌కు నాయకత్వం వహించిన హన్మంత్ రెడ్డి, పైళ్ల మల్లారెడ్డి, విజయ్‌పాల్ రెడ్డి, హరనాధ్ రెడ్డి, సంధ్యా గవ్వా, పిన్నపు రెడ్డి శ్రీనివాస్ కార్యక్రమం విజయవంతం కావటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వేళలా సహకరించిన మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. -
సుష్మా విమానం సేఫ్
న్యూఢిల్లీ: విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రయాణిస్తున్న విమానం ఆదివారం కాసేపు ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో సంబంధాలు కోల్పోవడంతో ఆందోళన నెలకొంది. 14 నిమిషాల తర్వాత మళ్లీ విమానం జాడ దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దక్షిణాఫ్రికాలో జరగనున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా), ఐబీఎస్ఏ (ఇండియా, బ్రెజిల్, సౌతాఫ్రికా) సదస్సుల్లో పాల్గొనేందుకు సుష్మ శనివారం ఢిల్లీ నుంచి వాయుసేనకు చెందిన ఐఎఫ్‌సీ 31 ఎంబ్రాయర్ (మేఘదూత్) విమానంలో బయల్దేరి దక్షిణాఫ్రికా వెళ్లారు. ఏకధాటిగా దక్షిణాఫ్రికా వరకు ప్రయాణించడానికి సరిపోయేంత ఇంధనాన్ని నింపుకునే సదుపాయం మేఘదూత్‌కు లేదు. దీంతో తిరువనంతపురం, మారిషస్‌లో విమానం ఆగి ఇంధనాన్ని నింపుకోవాల్సి ఉంది. తిరువనంతపురం నుంచి మధ్యాహ్నం 2.08 గంటలకు బయల్దేరి మాల్దీవుల గగనతలంలో ప్రయాణిస్తున్నంత వరకు కూడా అంతా సవ్యంగా ఉంది. అయితే మేఘదూత్ మారిషస్ గగనతలంలోకి ప్రవేశించగానే అక్కడి ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. సాధారణంగా ఏటీసీతో విమానాలకు సంబంధాల విషయంలో తొలి 10, 20, 30 నిమిషాల్లోపు వివిధ దశల్లో హెచ్చరికలు జారీచేస్తారు. 30 నిమిషాల తర్వాత కూడా ఏటీసీతో సంబంధాలు పునరుద్ధరణ కాకపోతే విమానం జాడ తెలియడం లేదని ప్రకటిస్తారు. 4.44 గంటలకు సుష్మ ప్రయాణిస్తున్న విమానం జాడ మిస్సయింది. దీంతో 12 నిమిషాల తర్వాత కూడా జాడ దొరకకపోవడంతో తొలి హెచ్చరిక జారీ అయింది. దీంతో ఆందోళన మొదలైంది. అయితే 4.58 గంటలకు విమానం రాడార్ పరిధిలోకి వచ్చినట్లు తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాడార్లలో సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తి ఉండొచ్చని భారత వినాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) అధికారి ఒకరు తెలిపారు. మారిషస్ ప్రధానితో భేటీ మారిషస్‌లో ఇంధనం నింపుకోవడానికి ఆగినసమయంలో ఆ దేశ ప్రధాని ప్రవీంద్ జగన్నాథంతో సుష్మ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరిపిన అనంతరం ఆమె దక్షిణాఫ్రికా వెళ్లారు. -
ఆటా, టాటా వేడుకల్లో మహానేత వైఎస్సార్‌కు ఘననివాళి
డల్లాస్ : ఏటీసీ తెలుగు మహాసభ ఉత్సవాలు మూడు రోజులు పాటు(మే31-జూన్2) డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల చివరి రోజైన శనివారం నాడు దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఏటీసీ ప్రతినిధులు ఘననివాళి ఆర్పించారు. ఆయన జ్ఞాపకార్థం ‘సెలబ్రేటింగ్ డాక్టర్ వైఎస్సార్ లైఫ్ అండ్ లెగసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు వైఎస్సార్‌తో వారి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ చిరకాల మిత్రుడు ప్రేమసాగర రెడ్డి మాట్లాడుతూ.. కాలేజీ రోజుల్లో వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని ఆహుతులతో పంచుకున్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయే పనులు చేశారని కొనియాడారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. ప్రతి సందర్భంలో ఆయన లేకపోవటం కనిపిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్(టాటా) అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ జీవితాంతం గుర్తుపెట్టుకునే మహామనిషి అన్నారు. సాయం కోసం వైఎస్సార్ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని.. ఆయన మనస్సున్న మహారాజని గుర్తుచేశారు. పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. వైఎస్సార్ తనను హిందీ అకాడమీకి చైర్మన్‌గా నియమించటమే కాకుండా, అఖరి వరకు తనకు చేదోడువాదోడుగా నిలిచారని వైఎస్సార్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. అమెరికన్ తెలుగు అసోషియేషన్(ఆటా) అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ హనుమంతరెడ్డి మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలిసిన నిజమైన నాయకుడు వైఎస్సార్ అని అన్నారు. ఆయన స్నేహనికి ప్రాణమిచ్చే అరుదైన వ్యక్తి అని కొనియాడారు. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ లక్కిరెడ్డి హనిమిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ కుటుంబంతో తనకున్న సుదీర్ఘ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. వైఎస్ కుటుంబానికి మైలవరంతో ఉన్న అనుబంధాన్ని ఆయన ఆహుతులకు తెలియజేశారు. ఇతర వక్తలు మాట్లాడుతూ.. వైఎస్సార్ మరణం ఇప్పటికి ఓ పీడకలలా వెంటాడుతుందన్నారు. ఆయన మరణం తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిత్యం ప్రజల కోసం పోరాడుతూ తన తండ్రిని గుర్తుకు తెస్తున్నారని.. వైఎస్ జగన్ తండ్రిని మించిన తనయుడు అవ్వాలని ఆకాంక్షించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన మంచి మంచి పథకాలను పూర్తి చేయగల సత్తా కేవలం వైఎస్ జగన్‌కే ఉందన్నారు. ప్రజలు వైఎస్ జగన్‌కి అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎంఎస్ రెడ్డి, రవి సన్నారెడ్డి, వైఎస్సార్ చిరకాల మిత్రులు రాఘవ రెడ్డి, డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి, నిజామాబాద్ మాజీ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి, పరమేష్ భీంరెడ్డి, డా. మోహన్ మల్లం, డా.హరినాథ్ పొలిచర్ల, రాజేశ్వరరెడ్డి గంగసాని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమెరికా కన్వీనర్లు డా.శ్రీధర్ కొర్సపాటి, డా. వాసుదేవతో పాటు అమెరికా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించటానికి సహకరించిన హరిప్రసాద్ లింగాలకి కార్యక్రమ నిర్వహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. -
డల్లాస్‌లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
డల్లాస్( ఇర్వింగ్) : అమెరికా తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం(టాటా) సంయుక్తంగా నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు కన్వెన్షన్ డల్లాస్‌లోని ఇర్వింగ్‌లో ఘనంగా జరుగుతున్నాయి. శ్రీనివాస స్వామి కళ్యాణంతో మూడో రోజు ఈ వేడుకు మొదలైంది. జీయార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సహాయంతో శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహించారు. -
డల్లాస్‌లో ఘనంగా అమెరికన్ తెలుగు కన్వెన్షన్
డల్లాస్ (ఇర్వింగ్) : అమెరికా తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం(టాటా) సంయుక్తంగా నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు కన్వెన్షన్ డల్లాస్‌లోని ఇర్వింగ్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, టీడీపీ నేత పెద్ది రెడ్డి, కేంద్రీయ హిందీ సమితీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సినీ నటి శ్రియ తదితరులు ముఖ్య అతిథులుగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమెరికా వ్యాప్తంగా దాదాపు రెండువేలకుపైగా ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రవాసులకు ఆటా- టాటాలు పురస్కారాలను ప్రదానం చేశారు. ఆటా పాటలతో కళాకారులు అతిథులను అలరించారు. ఆటా-టాటాలు సంయుక్తంగా ఇంతటి భారీ స్థాయిలో మూడు రోజుల వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆటా అధ్యుక్షులు ఆసిరెడ్డి కరుణాకర్ అన్నారు. చిన్న చిన్న గొడవలకే కొత్త కొత్త తెలుగు సంఘాలు పుట్టుకొస్తున్న తరుణంలో రెండు అతి పెద్ద తెలుగు సంఘాలు కలిసి నడవడం శుభపరిణామమని పేర్కొన్నారు. అమెరికాలో ఈ సభల ద్వారా ప్రవాసాంధ్రుల మధ్య స్నేహ, సోదరభావాలు మరింతగా పెంపొందుతాయని టాటా అధ్యక్షుడు డా. పొలిచెర్ల హరనాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆధ్యాత్మిక, వ్యాపార, రాజకీయ రంగాలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించి, సాయంత్రం యార్లగడ్డకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించనున్నారు. -
హెలికాప్టర్ గల్లంతు ; విషాదాంతం
సాక్షి, ముంబై: ముంబై తీరంలో పవన్‌హన్స్ సంస్థకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరు గల్లంతయ్యారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్జీసీకి చెందిన ఐదుగురు అధికారులు, ఇద్దరు పైలట్లు సహా ఏడుగురితో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. జుహూలోని పవన్ హన్స్ విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం 10.20 గంటలకు ఓఎన్జీసీకి చెందిన డీజీఎం స్థాయి అధికారులు సహా ఐదుగురు సిబ్బంది, ఇద్దరు పైలట్లతో హెలికాప్టర్ టేకాఫ్ అయ్యింది. 10.30 గంటల సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే ఓఎన్జీసీ, కోస్ట్‌గార్ట్, నేవీ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గాలింపు చర్యల అనంతరం డహాణు సమీపంలో హెలికాప్టర్ అవశేషాలను గుర్తించారు. ఐదు మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, ఓఎన్జీసీకి ముంబై తీరంలో కీలకమైన చమురు నిక్షేపాలు ఉన్నాయి. -
గస్తీ నౌక ఆయుష్ ప్రారంభం
జాతీయం దక్షిణాసియాలో తొలి ఏకీకృత హెలీపోర్ట్ సమీప ప్రాంతాలకు హెలికాఫ్టర్ల ద్వారా రాకపోకలు సాగించేందుకు వీలుగా న్యూఢిల్లీలో నిర్మించిన అధునాతన ఏకీకృత హెలీపోర్ట్‌ను కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఫిబ్రవరి 28న ప్రారంభించారు. ఇది దక్షిణాసియాలోనే తొలి ఏకీకృత హెలీపోర్ట్ అని అధికారులు తెలిపారు. ఇందులో హెలికాఫ్టర్ల ల్యాండింగ్, టేకాఫ్‌లతోపాటు ప్రత్యేకంగా గగనతల రద్దీ నియంత్రణ (ఏటీసీ), ఇంధన సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో తగ్గిన శిశు మరణాల రేటు గత పదేళ్లలో శిశు మరణాల రేటు (ఐఎంఆర్) దేశ వ్యాప్తంగా గణనీయంగా తగ్గిందని ఫిబ్రవరి 28న విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–4) తెలిపింది. 2005–06లో ప్రతి 1000 మంది శిశువులకు 57 మంది చనిపోగా 2015–16 నాటికి ఆ సంఖ్య 41కి పడిపోయిందని పేర్కొంది. త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో ఐఎంఆర్ సుమారు 20 శాతానికి తగ్గింది. తాజా సర్వే ప్రకారం జనన సమయంలో లింగ నిష్పత్తి జాతీయ స్థాయిలో 914 నుంచి 919కి పెరిగింది. పాతనోట్లపై జరిమానాకి రాష్ట్రపతి ఆమోదం పది కంటే ఎక్కువ సంఖ్యలో రద్దయిన పాతనోట్లు ఉంటే వాళ్లకు కనీసం రూ.10,000 వరకు జరిమానా విధించేలా తీసుకొచ్చిన చట్టంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫిబ్రవరి 27న సంతకం చేశారు. 70 శాతం సింహాలు భారత్‌లోనే ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 3న న్యూఢిల్లీలో ప్రపంచ వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న కేంద్ర పర్యావరణశాఖ మంత్రి అనిల్ దవే మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న మొత్తం సింహాల్లో 70 శాతం మేర భారత్‌లోనే ఉన్నాయని వెల్లడించారు. సుమారు దేశంలో 2400 సింహాలు ఉన్నాయని తెలిపారు. స్త్రీ–పురుష సమానత్వంపై ఐరాస సంస్థతో ఒప్పందం క్షేత్ర స్థాయి నుంచి స్త్రీ–పురుష సమానత్వం సాధించేందుకు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం మార్చి 6న ఆమోదం తెలిపింది. ఐరాస స్త్రీ, పురుష సమానత్వ, మహిళా సాధికార సంస్థ (యూఎన్– ఉమెన్), పంచాయతీరాజ్ శాఖల మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయం అమెరికా కాంగ్రెస్‌లో కాల్ సెంటర్ బిల్లు కాల్ సెంటర్లను విదేశాలకు తరలించే అమెరికా కంపెనీలకు ప్రభుత్వ గ్రాంట్లు, పూచీకత్తు రుణాలు దక్కకుండా చేసే బిల్లును అమెరికా కాంగ్రెస్‌లో మార్చి 2న తిరిగి ప్రవేశపెట్టారు. ‘ది యూఎస్ కాల్ సెంటర్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్’ అనే ఈ బిల్లును డెమోక్రటిక్ పార్టీకి చెందిన జీన్ గ్రీన్, రిపబ్లిక్ పార్టీకి చెందిన డేవిడ్ మెక్ కిన్లేలు ప్రవేశపెట్టారు. ముగ్గురు శాస్త్రవేత్తలకు బ్రెయిన్ ప్రైజ్ కోరికలు, నిర్ణయాలు తీసుకోవడం, మనోవైకల్యం వంటి అన్ని అంశాల వెనుక మెదడులోని నాడీ నిర్మాణాల పాత్ర (మెదడు రివార్డు వ్యవస్థ)ను విశ్లేషించిన శాస్త్రవేత్తలు పీటర్ డయాన్, రాయ్‌డోలన్, వోల్‌ఫ్రమ్ షల్జ్‌లు సంయుక్తంగా మార్చి 6న ప్రతిష్టాత్మక బ్రెయిన్ ప్రైజ్ అందుకున్నారు. ఈ ముగ్గురు 30 ఏళ్లుగా మెదడు పనితీరుపై పరిశోధనలు జరుపుతున్నారు. డెన్మార్క్‌లోని లండ్‌బెక్ ఫౌండేషన్ నాడీ కణశాస్త్రంలో అద్భుత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు ఏటా ఈ అవార్డును అందిస్తోంది. వార్తల్లో వ్యక్తులు జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నంద్ కుమార్ సాయి షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ చైర్మన్‌గా పార్లమెంట్ మాజీ సభ్యుడు, ఛత్తీస్‌గఢ్ గిరిజన నేత నంద్ కుమార్ సాయి ఫిబ్రవరి 28న బాధ్యతలు చేపట్టారు. ఐఓసీ చైర్మన్‌గా సంజీవ్ సింగ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చైర్మన్‌గా సంజీవ్ సింగ్ ఫిబ్రవరి 28న నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ ఆమోదించింది. సంజీవ్ ఐదేళ్లపాటు ఐఓసీ చైర్మన్‌గా కొనసాగనున్నారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా లే బర్మన్ సర్దార్ వల్లబాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా డీఆర్ డోలే బర్మన్ మార్చి 1న బాధ్యతలు స్వీకరించారు. ∙సీవీ ఆనంద్‌కు ఇన్నోవేటివ్ లీడర్షిప్ అవార్డ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మంచి ఫలితాలు రాబట్టినందుకు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్‌కు వినూత్న నాయకత్వ (ఇన్నోవేటివ్ లీడర్షిప్) అవార్డును రాజస్థాన్ ప్రభుత్వం మార్చి 3న అందజేసింది. ఆర్థికం ∙ఎస్బీఐ ఖాతాలో కనీస నగదు తప్పనిసరి ఎస్బీఐ ఖాతాలో కనీస మొత్తంలో నగదు లేకపోతే ఖాతాదారులకు జరిమానా విధించనున్నారు. ఇది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ మార్చి 3న వెల్లడించింది. మహానగరాల్లోని బ్యాంక్ శాఖల ఖాతాల్లో కనీస నగదు నిల్వ రూ.5,000, నగరాలు, పట్టణాల్లో రూ. 2,000, గ్రామీణ ప్రాంతాల్లోని శాఖల్లో రూ.1000 ఉండాలని నిబంధన విధించారు. నెలలో మూడు కంటే ఎక్కువ లావాదేవీలు జరిపితే రూ.50 ఛార్జ్‌గా విధిస్తారు. ఏటీఎంల నుంచి నెలకు పదిసార్లు ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ∙2016–17లో 7.1 శాతంగా వృద్ధిరేటు పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2016–17) సంబంధించి రెండో సత్వర అంచనాలను కేంద్ర గణాంకాధికార కార్యాలయం ఫిబ్రవరి 28న విడుదల చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2017–18) వృద్ధిరేటు 7.3 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ∙కేంద్ర, సమగ్ర జీఎస్టీ బిల్లుల ముసాయిదాకు ఆమోదం కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ), సమగ్ర జీఎస్టీ (ఐజీఎస్టీ) బిల్లుల తుది ముసాయిదాలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ మండలి 11వ సమావేశం మార్చి 4న ఆమోదం తెలిపింది. ఇందులో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రాల జీఎస్టీ (ఎస్జీఎస్టీ), కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీల ముసాయిదాల బిల్లులపై మార్చి 16న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. క్రీడలు ముర్రేకు దుబాయ్ ఓపెన్ టైటిల్ దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఆండీ ముర్రే (బ్రిటన్) గెలుచుకున్నాడు. దుబాయ్‌లో మార్చి 4న జరిగిన ఫైనల్లో ఫెర్నాండో వెర్దాస్కో (స్పెయిన్)పై విజయం సాధించాడు. ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్‌కు 5వ స్థానం న్యూఢిల్లీలో మార్చి 2న ముగిసిన ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. తొలిసారి దేశంలో జరిగిన పోటీల్లో భారత్ ఒక స్వర్ణం, రెండు రజత, రెండు కాంస్య పతకాలను సాధించింది. పతకాల పట్టికలో చైనా, ఇటలీలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. అవార్డులు నంది పురస్కారాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2012, 2013 సంవత్సరాలకు నంది పురస్కారాలను మార్చి 1న ప్రకటించింది. 2012 సంవత్సరానికిగానూ ‘ఈగ’, 2013 సంవత్సరానికిగానూ ‘మిర్చి’ ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. 2012 సంవత్సరానికి ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి (ఈగ), ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటిగా సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు) నిలిచారు. 2013 సంవత్సరానికి ఉత్తమ దర్శకుడిగా దయా కొడవగంటి (అలియాస్ జానకి), ఉత్తమ నటుడిగా ప్రభాస్ (మిర్చి), ఉత్తమ నటిగా అంజలి పాటిల్ (నా బంగారు తల్లి)లకు అవార్డులు లభించాయి. 2012కుగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణి–ఇళయరాజాల ద్వయం, ఉత్తమ గాయకుడిగా శంకర్ మహదేవన్, ఉత్తమ గాయనిగా గీతామాధురి ఎంపికయ్యారు. 2013 సంవత్సరానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీప్రసాద్, ఉత్తమ గాయకుడిగా కైలాష్‌ఖేర్, ఉత్తమ గాయనిగా కల్పనలు అవార్డులు దక్కించుకున్నారు. రాష్ట్రీయం ∙ఏపీ నూతన అసెంబ్లీ భవనం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ భవన సముదాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు వెలగపూడిలో మార్చి 2న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, పలుపురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సేవల్లో ఆర్జీఐఏకు మొదటి స్థానం ప్రయాణీకులకు అందించే విమానాశ్రయ సేవల విషయంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రపంచంలోనే మొదటి స్థానం దక్కింది. 2016 సంవత్సరానికి సంబంధించి 50 లక్షలు–కోటిన్నర ప్రయాణికుల విభాగంలో ఈ ర్యాంక్‌ను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్స్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) అందించినట్లు జీఎంఆర్ మార్చి 6న ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లో జెడ్ఎఫ్ టెక్నాలజీస్ సెంటర్ ప్రారంభం ఆటోమోటివ్ టెక్నాలజీ దిగ్గజం.. జెడ్ఎఫ్ టెక్నాలజీస్ భారత్‌లో తన తొలి అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో మార్చి 2న ప్రారంభించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ సేవల నుంచి యుద్ధనౌక విరాట్ విరమణ భారత నౌకాదళానికి 30 ఏళ్లపాటు సేవలందించిన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విరాట్‌ను మార్చి 6న విధుల నుంచి విరమింపచేశారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో నౌకాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విరాట్ మొత్తం 11 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇది మొత్తం గ్లోబును 27 సార్లు చుట్టొచ్చిన దానికి సమానం. ∙విజయవంతమైన సూపర్సోనిక్ క్షిపణి పరీక్ష దేశీయంగా రూపొందించిన సూపర్సోనిక్ ఇంటర్‌సెప్టర్ క్షిపణిని భారత్ మార్చి 1న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్)లోని మూడో క్షిపణి ప్రయోగ వేదిక నుంచి పృథ్వి క్షిపణిని ప్రయోగించారు. ఇది తక్కువ ఎత్తులో దేశంపైకి వచ్చే ఎలాంటి బాలిస్టిక్ శత్రు క్షిపణినైనా నాశనం చేయగలదు. భారత్‌కు వివిధ స్థాయిల్లో క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. ∙గస్తీ నౌక ఆయుష్ ప్రారంభం తీర ప్రాంత రక్షణ బలోపేతానికి తోడ్పడే గస్తీ నౌక ఆయుష్ మార్చి 6న కోస్ట్‌గార్డ్‌లో చేరింది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం ఓడరేవులో కోస్ట్‌గార్డ్ డీఐజీ అనిల్ కుమార్ హర్‌బోల ప్రారంభించారు. ∙కల్వరి జలాంతర్గామి క్షిపణి పరీక్ష విజయవంతం నౌకా నిరోధక క్షిపణిని భారత నావికాదళం మార్చి 2న విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షను దేశీయంగా రూపొందించిన కల్వరి జలాంతర్గామి నుంచి నిర్వహించారు. అరేబియా సముద్రంలో క్షిపణిని పరీక్షించగా విజయవంతంగా లక్ష్యాన్ని చేధించింది. ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు, ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
పైలట్ నిద్రపోయాడు.. ఫ్రీక్వెన్సీ మారింది!
లండన్ విమానం ఏటీసీతో సంబంధాలు కోల్పోయిన ఘటన న్యూఢిల్లీ: ఫిబ్రవరి 16న ముంబై నుంచి లండన్ హీత్రూకు వెళ్తున్న జెట్ ఎయిర్ వేస్ విమానం 33 నిమిషాలపాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు కోల్పోవడానికి కారణం పౌనఃపున్యం (ఫ్రీక్వెన్సీ) స్వల్పంగా మారిపోవడమేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో విమానం కమాండర్ సీట్లో శిక్షణలో ఉన్న పైలట్ ఉన్నారని సమాచారం. మరో పైలట్ నిద్రపోయాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 9డబ్ల్యూ118 అనే విమానం ముంబై నుంచి 330 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బందితో లండన్ వెళ్తుండగా చెక్ రిపబ్లిక్ గగన తలంలో ఎగురుతున్నప్పుడు 33 నిమిషాలపాటు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. 132.890 మెగా హెర్ట్జ్ ఉండాల్సిన పౌనఃపున్యం 132.980 మెగా హెర్ట్జ్ గా మారిపోవడంతో సమస్య తలెత్తింది. అలాగే కోల్‌కతాలో ఇండిగో, సిల్క్‌ఎయిర్ విమానాలు డిసెంబర్ 11న గాలిలో ఢీకొనడం నుంచి తృటిలో తప్పించుకున్న ఘటనపై విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఏఏఐబీ) విచారణ ప్రారంభించింది. గగనతలంలో తప్పిన పెను ప్రమాదం -
ఏటీసీ చేతికి వయోమ్
కొనుగోలు ప్రక్రియ పూర్తి డీల్ విలువ రూ. 7,635 ముంబై: నియంత్రణ సంస్థల నుంచి అన్ని అనుమతులు రావడంతో టెలికం టవర్ల నిర్వహణ సంస్థ వయోమ్ నెట్వర్క్స్ కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అమెరికన్ టవర్ కార్పొరేషన్ (ఏటీసీ) గురువారం వెల్లడించింది. దాదాపు రూ. 7,635 కోట్లకు వ్యోమ్‌లో 51 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు గతేడాది అక్టోబర్ 21న ఏటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం వ్యోమ్ విలువ సుమారు రూ. 22,000 కోట్లు. ఏటీసీకి ప్రపంచవ్యాప్తంగా 1,42,000 పైచిలుకు టెలికం టవర్లు ఉన్నాయి. వ్యోమ్‌కు 2011-12 నాటికి 40,000 పైచిలుకు టవర్లు ఉన్నాయి. 50 టవర్లతో 2005లో క్విపో టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా మొదలైన సంస్థ, టాటా టెలీసర్వీసెస్‌లో విలీనంతో వయోమ్గా రూపాంతరం చెందింది. దేశీయంగా అతి పెద్ద స్వతంత్ర టెలికం టవర్ కంపెనీగా ఎదిగింది. వయోమ్ డీల్‌తో ఏటీసీకి భారత్‌లో మొత్తం 57,000 పైగా టవర్లు ఉంటాయి. కోల్‌కతాకు చెందిన శ్రేయి గ్రూప్‌తో పాటు ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ తదితర ఇన్వెస్టర్ల నుంచి వాటాల కొనుగోలు ద్వారా వయోమ్ను ఏటీసీ దక్కించుకుంది. వయోమ్కు రూ. 5,100 కోట్ల రుణ భారం ఉంది. -
విమానానికి తప్పిన పెద్ద ప్రమాదం
న్యూఢిల్లీ: స్పైస్ జెట్ విమానానికి మంగళవారం సాయంత్రం పెద్ద ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి 211 మందితో బయలుదేరిన విమానం కోల్ కతా విమానాశ్రయంలో దిగగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టేకాఫ్ అయిన తర్వాత విమానం టైరు ఊడిపోయినట్టు గుర్తించిన రన్ వే సిబ్బంది వెంటనే ఏసీటీకీ సమాచారం అందించారు. రన్ వేపై లభ్యమైన టైరు శకలాలు స్పైస్ జెట్ విమానానికి చెందినవేనని నిర్ధారించుకున్న తర్వాత పైలట్ కు ఏసీటీ సమాచారం అందించింది. దీంతో విమానం భద్రతపై ఆందోళన మొదలైంది. ముందు జాగ్రత్తగా విమానాన్ని కోల్ కతా ఎయిర్ పోర్టులో దించేశారు. విమానాన్ని పైలట్ సురక్షితంగా కిందకు దించడంతో ఉత్కంఠకు తెరపడింది. ల్యాండ్ అయిన వెంటనే విమానంలోని వారందరినీ కిందకు దించేశారు. విమానంలోని వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. టైరు ఊడిపోయిందా, పేలిందా అన్నది విచారణలో తేలనుంది. దీనిపై పౌరవిమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ అధిపతి ఎం సాధి విచారణకు ఆదేశించారు.