పైలట్ నిద్రపోయాడు.. ఫ్రీక్వెన్సీ మారింది! | London flight loses contact with ATC, Jet Airways de-rosters crew | Sakshi
Sakshi News home page

పైలట్ నిద్రపోయాడు.. ఫ్రీక్వెన్సీ మారింది!

Published Wed, Feb 22 2017 2:06 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

పైలట్ నిద్రపోయాడు.. ఫ్రీక్వెన్సీ మారింది!

పైలట్ నిద్రపోయాడు.. ఫ్రీక్వెన్సీ మారింది!

లండన్‌ విమానం ఏటీసీతో సంబంధాలు కోల్పోయిన ఘటన  

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 16న ముంబై నుంచి లండన్‌ హీత్రూకు వెళ్తున్న జెట్ ఎయిర్ వేస్ విమానం 33 నిమిషాలపాటు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ)తో సంబంధాలు కోల్పోవడానికి కారణం పౌనఃపున్యం (ఫ్రీక్వెన్సీ) స్వల్పంగా మారిపోవడమేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో విమానం కమాండర్‌ సీట్‌లో శిక్షణలో ఉన్న పైలట్‌ ఉన్నారని సమాచారం. మరో పైలట్ నిద్రపోయాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

9డబ్ల్యూ118 అనే విమానం ముంబై నుంచి 330 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బందితో లండన్‌ వెళ్తుండగా చెక్‌ రిపబ్లిక్‌ గగన తలంలో ఎగురుతున్నప్పుడు 33 నిమిషాలపాటు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. 132.890 మెగా హెర్ట్జ్ ఉండాల్సిన పౌనఃపున్యం 132.980 మెగా హెర్ట్జ్ గా మారిపోవడంతో సమస్య తలెత్తింది. అలాగే కోల్‌కతాలో ఇండిగో, సిల్క్‌ఎయిర్‌ విమానాలు డిసెంబర్‌ 11న గాలిలో ఢీకొనడం నుంచి తృటిలో తప్పించుకున్న ఘటనపై విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఏఏఐబీ) విచారణ ప్రారంభించింది.

గగనతలంలో తప్పిన పెను ప్రమాదం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement