కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి శుక్రవారం అనుకోని అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌కు ఏటీసీ నుంచి ఆనుమతి రాకపోవడంతో టేకాఫ్‌కు గంటకు పైగా ఆలస్యం అయ్యింది. దీంతో రాహుల్ చాలాసేపు హెలికాప్టర్‌లోనే ఉండాల్సి వచ్చింది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గొడ్డాలో ప్రచారానికి వెళ్లారు కాంగ్రెస్ నేత. అక్కడ బహిరంగ ర్యాలీలో ప్రసంగించడం ముగిసిన తర్వాత ఆయన ప్రచారం కోసం మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ టేకాఫ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాలేదు. భద్రతా కారణాల పేరుతో క్లియరెన్స్ ఆలస్యంగా లభించింది. ఈ సమస్యతో 75 నిమిషాలపాటు రాహుల్ హెలికాప్టర్‌లోనే ఉండాల్సి వచ్చింది. హెలికాప్టర్ టేకాఫ్‌కు ఆలస్యం అవడంతో రాహుల్ ప్రయాణ షెడ్యూల్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై రాజకీయ వివాదం చెలరేగింది.
HUGE BREAKING 🚨⚡
LoP Rahul Gandhi’s helicopter denied permission from flying in Jharkhand
It’s been more than 2 hours but no permission granted yet 🚨
Why is Modi & BJP so scared? pic.twitter.com/WJltLvaB5p— Ankit Mayank (@mr_mayank) November 15, 2024
హెలికాప్టర్ టేకాఫ్‌కు అనుమతి ఆలస్యంపై కాంగ్రెస్ స్పందిస్తూ.. రాజకీయంగా ప్రేరేపితమైనదని మండిపడింది. ఇది బీజేపీ పన్నిన కుట్రేనని ఆరోపించింది. తమ ప్రచారాలను అణగదొక్కే ప్రయత్నమని పేర్కొంది. ‘రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమాలను ఆలస్యం చేయడానికి చేసిన ప్రయత్నమే.. అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి మాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నాయకులు తోసిపుచ్చారు.
మరోవైపు ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), స్థానిక అధికారులు కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, అదనపు భద్రతా తనిఖీలు, ఎయిర్‌స్పేస్ మేనేజ్‌మెంట్ ఆందోళనలు హోల్డ్‌అప్‌కు కారణమై ఉండవచ్చని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment