Chopper
-
రాహుల్ హెలికాప్టర్ టేకాఫ్‌కు అనుమతి నిరాకరణ.. గంటపాటు ఆలస్యం
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి శుక్రవారం అనుకోని అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌కు ఏటీసీ నుంచి ఆనుమతి రాకపోవడంతో టేకాఫ్‌కు గంటకు పైగా ఆలస్యం అయ్యింది. దీంతో రాహుల్ చాలాసేపు హెలికాప్టర్లోనే ఉండాల్సి వచ్చింది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గొడ్డాలో ప్రచారానికి వెళ్లారు కాంగ్రెస్ నేత. అక్కడ బహిరంగ ర్యాలీలో ప్రసంగించడం ముగిసిన తర్వాత ఆయన ప్రచారం కోసం మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ టేకాఫ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాలేదు. భద్రతా కారణాల పేరుతో క్లియరెన్స్ ఆలస్యంగా లభించింది. ఈ సమస్యతో 75 నిమిషాలపాటు రాహుల్ హెలికాప్టర్లోనే ఉండాల్సి వచ్చింది. హెలికాప్టర్ టేకాఫ్‌కు ఆలస్యం అవడంతో రాహుల్ ప్రయాణ షెడ్యూల్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై రాజకీయ వివాదం చెలరేగింది.HUGE BREAKING 🚨⚡LoP Rahul Gandhi’s helicopter denied permission from flying in JharkhandIt’s been more than 2 hours but no permission granted yet 🚨Why is Modi & BJP so scared? pic.twitter.com/WJltLvaB5p— Ankit Mayank (@mr_mayank) November 15, 2024హెలికాప్టర్ టేకాఫ్‌కు అనుమతి ఆలస్యంపై కాంగ్రెస్ స్పందిస్తూ.. రాజకీయంగా ప్రేరేపితమైనదని మండిపడింది. ఇది బీజేపీ పన్నిన కుట్రేనని ఆరోపించింది. తమ ప్రచారాలను అణగదొక్కే ప్రయత్నమని పేర్కొంది. ‘రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమాలను ఆలస్యం చేయడానికి చేసిన ప్రయత్నమే.. అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి మాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నాయకులు తోసిపుచ్చారు.మరోవైపు ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), స్థానిక అధికారులు కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, అదనపు భద్రతా తనిఖీలు, ఎయిర్‌స్పేస్ మేనేజ్మెంట్ ఆందోళనలు హోల్డ్అప్కు కారణమై ఉండవచ్చని సమాచారం. -
హెలికాప్టర్ ప్రమాదం.. ఇరాన్ అధ్యక్షుడి చివరి వీడియో వైరల్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్( బెల్-212) ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. జోల్ఫా ప్రాంతం సమీపంలోని పర్వతప్రాంతాలను దాటుతుండగా ప్రతికూల వాతావరణం కారణంగా దట్టమైన అడవిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో రైసీతోపాటు విదేశాంగ మంత్రి, మరో ఎనిమిది అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడిచింది. అధ్యక్షుడి కాన్వాయ్‌లోని మరో రెండు హెలికాప్టర్లు గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకున్నాయని తెలిపింది. ఇరాన్- అజర్బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది.కాగా తాజాగా హెలికాప్టర్ ప్రమాదానికి ముందు రైసీకి చెందిన చివరి ఫోటో, వీడియోను ఇరాన్ మీడియా షేర్ చేసింది. ఇందులో రైసీ హెలికాప్టర్ కిటికీ నుంచి రైసీ బయటకు చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి, ఇతర ఉన్నత అధికారులు కూడా ఉన్నారు. చాపర్‌లో వెళ్లడానికి ముందు అధికారులతో అధ్యక్షుడు మీటింగ్ ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా ఆ క్లిప్‌లో ఉన్నాయి. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రైసీ బయల్దేరిన 30 నిమిషాలకే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. దాదాపు 16 గంటల తర్వాత కొండ ప్రాంతంలో హెలికాప్టర్ శిథిలాలు గుర్తించారు. ఈ ఘటనలో రైసీతో పాటు హెలికాప్టర్లో ఉన్నవారంతా దుర్మరణం చెందారు.#Iranian President #Ibrahim #Raisai's last trip, the video of the aerial tour of the dam before the helicopter Crashh!!#Iran pic.twitter.com/fUTlBqpKW7— Imran Pazir (@imranpazir1) May 20, 2024తరువాతి అధ్యక్షుడు ఆయనే..కాగా ఇబ్రహీం రైసీ మృతిచెందడంతో.. తదుపరి ఇరాన్ అధ్యక్షుడు ఎవరవుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మొఖ్బర్(69) తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే తొలుత వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని చేపడతారు. దీనికి దేశ సుప్రీం లీడర్ ఖమేనీ ఆమోదించాలి. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు మొఖ్బర్, పార్లమెంటరీ స్పీకర్, న్యాయ వ్యవస్థ చీఫ్ ఘోల్లమ్‌హోస్సేన్ మొహసేని ఎజీతో కూడిన కౌన్సిల్ 50 రోజుల్లోగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. -
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ డివిజన్లోని అటవీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అడవుల్లోని కార్చిచ్చును ఆర్పేందుకు స్థానిక యంత్రాంగం మొదలుకొని, సైన్యం కూడా అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఇంతవరకు మంటలు అదుపులోకి రాలేదు. హెలికాప్టర్ నుంచి బాంబీ బకెట్ ద్వారా అడవుల్లోని మంటలను అదుపు చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నిస్తోంది. ఇంతకీ బాంబీ బకెట్ అంటే ఏమిటి? అది అగ్ని కీలలను ఎలా నియంత్రిస్తుంది?అటవీ ప్రాంతంలో వ్యాపిస్తున్న మంటలను అదుపు చేసేందుకు నైనితాల్ పరిసర ప్రాంతాలలో భారత వైమానిక దళం ఎంఐ-17 వీ5 హెలికాప్టర్‌ను వినియోగిస్తోంది. దీనిసాయంతో బాంబీ బకెట్ల ద్వారా అడవుల్లో నీటిని వెదజల్లుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా బాంబీ బకెట్లను హెలికాప్టర్లుకు అనుసంధానం చేస్తూ, అడవుల్లో చెలరేగే మంటలను అదుపు చేస్తున్నారు.బాంబీ బకెట్ అనేది ఒక ప్రత్యేక వైమానిక అగ్నిమాపక సామగ్రి. దీనిని 1980 నుండి వినియోగిస్తున్నారు. ఇది హెలికాప్టర్ నుంచి తేలికగా తెరవగల కంటైనర్. దిగువన ఉన్న ప్రాంతాలకు దీని ద్వారా నీటిని విడుదల చేయవచ్చు. బాంబీ బకెట్ వివిధ పరిమాణాలు, నమూనాలలో అందుబాటులో ఉంది. దీని సామర్థ్యం 270 లీటర్ల నుండి 9,840 లీటర్లకు మించి ఉంటుంది.బాంబీ బకెట్‌ను 1982లో కెనడియన్ వ్యాపారవేత్త డాన్ ఆర్నీ కనుగొన్నారు. ఈ బకెట్లను ఫైబర్‌గ్లాస్, ప్లాస్టిక్ కాన్వాస్‌తో మెటల్ ఫ్రేమ్‌తో తయారు చేస్తారు. ఇది హెలికాప్టర్లో బాహ్య ట్యాంక్ మాదిరిగా కనిపిస్తుంది. దీనిలో నీటిని ఎక్కడి నుండైనా నింపవచ్చు. అడవుల్లో కార్చిచ్చు నియంత్రణకు బాంబీ బకెట్లు ఎంతగానో ఉపయక్తమవుతాయి. -
హెలికాప్టర్ వద్ద సెల్ఫీ తీసుకుంటుండంగా..అంతలోనే..
ఓ అధికారి హెలికాప్టర్ వద్ద సెల్ఫీ తీసుకునే యత్నంలో టెయిల్ రోటర్ బ్లేడ్ పరిధిలోకి వచ్చాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ బయట సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ ప్రభుత్వాధికారి మృత్యువాత పడ్డారు. బాధితుడిని జితేంద్ర కుమార్ సైనీగా గుర్తించారు అధికారులు. అతడు ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీకి ఫైనాన్షియల్ కంట్రోలర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం కేదార్నాథ్ ధామ్‌లోని హెలిప్యాడ్ వద్ద జరిగింది. సైనీ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తున్నసమయంలో అనుకోకుండా హెలికాప్టర్ టెయిల్ రోటర్ బ్లేడ్ పరిధిలోకి వచ్చాడు. దీంతో సైనీ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. అక్షయ తృతియ సందర్భంగా భక్తుల చార్ధామ్ యాత్ర కోసం అని గంగోత్రి, యమునోత్రి పోర్టల్‌లను ప్రారంభించిన ఒక రోజు తర్వాత ఈ అనూహ్య సంఘటన జరిగింది. కాగా తీర్థ యాత్ర కోసం ఇప్పటికే 16 లక్షల మంది యాత్రికులు నమోదు చేసుకున్నారు. ఐతే కేదార్నాథ్ దేవాలయాన్ని ఏప్రిల్ 25న బద్రీనాథ్‌ను ఏప్రిల్ 27న తెరవనున్నారు. (చదవండి: చార్ధామ్ యాత్ర ప్రారంభం) -
ప్రైవేటు ఛాపర్లో దిగిన శివకుమార్.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన ఈసీ..
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. కాగా, ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో, అభ్యర్థుల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బరిలోకి దిగారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీల నేతలు ప్రచారంలోకి వెళ్తున్నారు. ఈ సందర్బంగా నేతలపై ఎన్నికల సంఘం అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ప్రయాణించిన ఛాపర్లో ఈసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఛాపర్‌లోని ప్రథమ చికిత్స కిట్‌ను, బ్యాగులను ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రచారం కోసం దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థలికి చేరుకున్న తర్వాత.. హెలిప్యాడ్‌లోనే శివకుమార్ ప్రయాణించిన ఛాపర్‌ను అధికారులు చెక్ చేశారు. ఈ సందర్బంగా ఛాపర్లో శివకుమార్ భార్య, పిల్లలు ఉన్నారు. ఈ సందర్బంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ.. సోదాలు చేయడంలో తప్పులేదని, వాళ్లు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. మంజునాథ స్వామిపై నాకు అపారమైన నమ్మకం ఉంది. అందుకే నా కుటుంబంతో ఇక్కడికి వచ్చాను. ఆయన నన్ను, రాష్ట్రాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నా పర్యటన తర్వాత ధర్మస్థలంలో ప్రచారం చేస్తాను అని కామెంట్స్ చేశారు. Flying squad of #ECI and officials conducted a check of the #helicopter used by State #Congress president #DKShivakumar after it reached the helipad at #Dharmasthala in Dakshina Kannada. The party's state chief was travelling in the chopper. #BreakingNews pic.twitter.com/lKizduypGt — Headline Karnataka (@hknewsonline) April 22, 2023 -
శిక్షణ విన్యాసాల్లో అపశ్రుతి.... హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
కాబూల్: అప్గనిస్తాన్‌లో కాబూల్ శిక్షణా విన్యాసాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అమెరికా తయారు చేసిన బ్లాక్‌హాక్ ఛాపర్ కూలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఒక అనుభవం లేని తాలిబన్ పైలెట్ ఆ అమెరికా ఆర్మీ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన సంభవించింది. తాలిబన్ రక్షణ మంత్రిత్వ శాఖ సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగనట్లు ధృవీకరించింది. ఈ ఛాపర్‌ని శిక్షణా విమానంగా పేర్కొంది. అయితే మంత్రిత్వశాఖ అదనంగా ఐదుగురు చనిపోయారని పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి యునైటెడ్ స్టేట్స్ 2002 నుంచి 2017 మధ్య సుమారు రూ. 2 లక్షల కోట్లు విలువైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నైట్ విజన్ పరికరాలు, విమానాలు, నిఘా వ్యవస్థలతో సహా అఫ్గాన్ ప్రభుత్వానికి రక్షణాయుధాలను పంపింది. (చదవండి: ప్రపంచంలో అత్యంత వృద్ధ రైల్వే యూనియన్ నాయకుడిగా రికార్డు) -
చాపర్ చిన్న సైజులో..
పక్క ఫొటో చిన్నపాటి చాపర్‌ను తలపిస్తోంది కదా! వీటిని ‘పర్సనల్ ఏరియల్ వెహికల్’... క్లుప్తంగా పీఏవీలంటారు. హైదరాబాద్ ఐఐటీ పరిశోధక విద్యార్థి ప్రియబ్రత రౌటరే ఇలాంటి పీఏవీల స్కేల్ మోడళ్లు (చిన్నసైజు పీఏవీలు)బోలెడన్ని తయారు చేశారు. శుక్రవారం ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. స్కేల్ మోడళ్లే కదా అని తీసి పడేయెద్దు. ప్రాక్టీసింగ్ పీహెచ్‌డీలో భాగంగా డ్రోన్లను తలపించే ఈ పీఏవీలలో ఏమి ఉండాలి? ఎలా ఉండాలి? అన్న వివరాలను విస్తృత స్థాయిలో పరిశోధించి మరీ వీటిని తయారు చేశారు. – సాక్షి హైదరాబాద్ -
ఉక్రెయిన్ దాడి.. ఆకాశంలో రష్యా హెలికాప్టర్ రెండు ముక్కలు.. వీడియో వైరల్
ఉక్రెయిన్‌పై రష్యా మొదలెట్టిన యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి కనపడుతోంది. అయితే మొదట్లో రష్యా దాడిని అడ్డుకుంటూ వచ్చిన ఉక్రెయిన్ ఆర్మీ గత రెండు వారాలుగా ఎదురు దాడులు చేస్తోంది. పేరుకి చిన్న దేశం, ఆయుధ సంపత్తి, సైన్యం పరంగా రష్యాతో సమఉజ్జీ కాకపోయినా ధీటుగా నిలబడి ఉక్రెయిన్ పోరాడుతోంది. తాజాగా రష్యాకు చెందిన ఎంఐ-28 హెలికాప్టర్‌ను ఉక్రెయిన్ సైన్యం రెండు ముక్కలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దర్శనమిస్తోంది. ఉక్రెయిన్ సైనికులు స్టార్ స్ట్రీక్ అనే మిస్సైల్‌తో దాడి చేయగా రష్యా ఎంఐ28 హెలికాప్టర్‌కు చెందిన టెయిల్ పార్ట్ ధ్వంసం కావడంతో రెండుగా విడిపోయి కుప్పకూలింది. లుహన్స్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్టార్‌స్ట్రీక్ మిస్సైల్ యూకే అత్యంత అధునాతన మానవసహిత పోర్టబుల్ క్షిపణి వ్యవస్థ. ఇది తక్కువ ఎత్తు ఎగిరే శత్రు జెట్లను పడగొట్టడానికి, హెలికాప్టర్లపై దాడి చేయడానికి ఉపయోగిస్తారు. స్టార్ స్ట్రీక్‌కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఇది ధ్వని కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. దీని వేగం సహాయంతో గాల్లో ఎగిరే టార్గెట్లను సునాయాసంగా పేల్చేయవచ్చు. ఉక్రెయిన్‌కు 6,000 క్షిపణుల కొత్త ప్యాకేజీతో సహా మరింత రక్షణాత్మక మద్దతును అందిస్తుందని బ్రిటన ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తెలిపారు. ప్రస్తుతం రష్యా దళాలు తాజాగా తూర్పు ఉక్రెయిన్ వైపు దృష్టి సారించాయి. The Times is reporting that this shootdown of a Russian Mi-28 was by a British Starstreak SAM pic.twitter.com/zsQb1DkQ74 — OSINTtechnical (@Osinttechnical) April 2, 2022 చదవండి: Russia Ukraine War: రష్యా అకృత్యాలు.. మాటలు రావడం లేదు! ఈ ఒక్క ఫొటో చాలు -
ప్రాంతీయ విమాన సేవలకు ప్రత్యేక పాలసీ
న్యూఢిల్లీ: ప్రధాన కేంద్రాల నుంచి వివిధ ప్రాంతాలకు వైమానిక సర్వీసులకి మరింత ఊతమిచ్చే దిశగా ప్రాంతీయ ఎయిర్‌లైన్స్, హెలికాప్టర్ ఆపరేటర్లకు సంబంధించి ప్రత్యేక పాలసీ రూపొందించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. చిన్న పట్టణాల్లోని విమానాశ్రయలతో పాటు ప్రాంతీయంగా కనెక్టివిటీపైనా ప్రధానంగా దృష్టి పెడుతోంది. పరిశ్రమల సమాఖ్య అసోచాం సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయాలు వెల్లడించారు. ‘సాధారణంగా ఇలాంటి సర్వీసులకు ప్రత్యేక సమస్యలు ఉంటాయి. పరిమిత స్థాయిలో కార్యకలాపాల వల్ల అధిక లీజింగ్ వ్యయాలు, ధరలపరమైన సవాళ్లు ఉంటాయి. వీటిని అధిగమించడంపై దృష్టి పెడుతున్నాం. ప్రాంతీయ ఎయిర్‌లైన్స్, హెలికాప్టర్ల సేవలు మరింత అందుబాటులోకి వచ్చే విధంగా ప్రత్యేక పాలసీపై కసరత్తు చేస్తున్నాం‘ అని మంత్రి చెప్పారు. ఒడిషాలోని ఝర్సుగూడ, అసోంలోని రూప్సీ వంటి చిన్న నగరాల్లో కూడా ఇలాంటి సర్వీసులు వృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం భారత్‌లో హెలికాప్టర్ల వినియోగం నామమాత్రంగానే ఉందన్నారు. సంపన్న దేశాల్లో సివిల్ హెలికాప్టర్లు వేల సంఖ్యలో ఉంటుండగా.. భారత్‌లో 130-140 మాత్రమే ఉన్నాయని సింధియా చెప్పారు. విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించేందుకు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని సింధియా తెలిపారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు గణనీయంగా తగ్గించాయని వివరించారు. (చదవండి: టాటా గ్రూప్‌కి షాక్ ! ఊహించని మలుపు తీసుకున్న సీఈవో నియామకం) -
ముక్కలుగా.. ఆ తర్వాత పేస్ట్‌లా మార్చే మాన్యువల్ చాపర్
కూరగాయలను, పండ్లను అవసరాన్ని బట్టి, ఇట్టే ముక్కలుగా, పేస్ట్‌లా అందించే మాన్యువల్ చాపర్ ఇది. దీనికి పవర్‌తో పని లేదు. మల్టీ–బ్లేడ్ డిజైన్ కలిగిన ఈ డివైజ్‌లో పండ్లు లేదా కూరగాయలు ఈ బౌల్లో వేసుకుని.. మూత పెట్టి, ఆ మూత పైభాగంలో ఉన్న రెడ్ లేదా గ్రీన్ కలర్ హ్యాండిల్‌ని ఒక చేత్తో పట్టుకుని, మూతపైన మరో చేయి వేసి నొక్కి పెట్టి.. హ్యాండిల్‌ని ఫోర్స్‌గా మనవైపుకి లాగితే.. లోపల ఉన్న పదార్థాలు ముక్కలు ముక్కలుగా అవుతాయి. అలా అయిదుసార్ల కంటే ఎక్కువ లాగితే కూర తయారీకి సరిపడా ముక్కల్లా, ఎనిమిదిసార్ల కంటే ఎక్కువ లాగితే చట్నీలా, పన్నెండుసార్ల కంటే ఎక్కువ లాగితే జ్యూస్‌లా మారుతుంది. టొమాటో, ఆనియన్, కొత్తిమీర, నిమ్మరసం, మిరియాల పొడి వేసుకుని స్పైసీ సల్సా తయారు చేసుకోవచ్చు. తులసి, పైన్ నట్స్, వెల్లుల్లి, లవంగాలు, ఆలివ్ నూనె వేసుకుని పర్ఫెక్ట్ పెస్టో రెడీ చేసుకోవచ్చు. బనానా, స్ట్రాబెర్రీ, పైనాపిల్ ముక్కల్లో పెరుగు, తేనె వంటివి జోడించి టేస్టీ జ్యూస్ చేసుకోవచ్చు. భలే బాగుంది కదూ. -
‘హెలికాప్టర్ నిండా డబ్బుతో ఘనీ పారిపోయాడు’
మాస్కో: తాలిబన్ల అక్రమణతో అఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ ఆదివారం దేశం విడిచిపారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా ఘనీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ భారీగా నగదు నిండిన నాలుగు కార్లతో పలాయనం చిత్తగించాడని పేర్కొంది. అంతేకాదు హెలికాప్టర్ పట్టకపోవడంతో కొంత నగదును విడిచిపోవాల్సి వచ్చిందంటూ కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించడంతో ఘనీ నాలుగు కార్లు, హెలికాప్టర్ నిండా నగదుతో దేశం విడిచి పారిపోయాడని రష్యా వ్యాఖ్యానించింది. రక్తపాతాన్నినివారించాలని భావించినట్టు అతను పేర్కొన్నాడని తెలిపింది. రష్యన్ రాయబార కార్యాలయ ప్రతినిధి ఇస్చెంకో తన వ్యాఖ్యలను రాయిటర్స్‌తో ధృవీకరించారు. నాలుగుకార్లు డబ్బుతో నిండి ఉన్నాయి, డబ్బులో కొంత భాగాన్ని హెలికాప్టర్లో నింపడానికి ప్రయత్నించారు, కానీ సరిపోక పోవడంతో వదిలేశారన్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే కాబూల్‌లో దౌత్యపరమైన ఉనికిని నిలుపుకుంటామనీ, తాలిబన్లతో సంబంధాలు పెంచుకోవాలని భావిస్తున్నామని రష్యా ప్రకటించింది. వారిని దేశపాలకులుగా గుర్తించడం తొందరపాటు కాకపోయి నప్పటికీ, తాలిబన్ల ధోరణిని నిశితంగా గమనిస్తుందని ప్రకటించడం విశేషం. తాలిబన్లతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటామని చైనా ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. కాగా అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ తొలుత తజకిస్తాన్‌కు వెళ్లిపోయినట్లు రిపోర్టులు వచ్చాయి. అలాగే ఘనీ, ఆయన భార్య, చీఫ్ ఆఫ్ స్టాఫ్, దేశ భద్రతా సలహాదారు ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌కు పారిపోయారని అల్ జజీరా వార్తా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి ఘనీ ఎక్కడ తలదాచుకున్నదీ స్పష్టత లేదు. -
సొంత డబ్బుతో తిరుగుతున్నా.. అనుమతి ఎందుకివ్వరు!
సాక్షి, చెన్నై: సొంత డబ్బు ఖర్చు పెట్టి హెలికాప్టర్లో తిరుగుతున్నానని, ఇందుకు అనుమతి ఇవ్వకపోవడం ఎమిటో అని అధికారుల తీరుపై విశ్వనటుడు కమలహాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో గురువారం ఎన్నికల ప్రచారం రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి కమల్‌కు ఏర్పడింది. మక్కల్ నీది మయ్యం అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా కమల్ ఉన్నారు. కోవై దక్షిణం నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్న దృష్ట్యా, అక్కడి నుంచే సమీప జిల్లాల్లో ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రైవేటు హెలికాప్టర్ సిద్ధం చేసుకున్నారు. బుధవారం కోవై నుంచి ఈరోడ్‌కు హెలికాప్టర్లో వచ్చి మళ్లీ ప్రచారం చేసి వెళ్లారు. గురువారం కోయంబత్తూరు నుంచి నీలగిరి జిల్లా ఊటి, కున్నురూ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి కమల్ నిర్ణయించారు. ఉదయం కోయంబత్తూరు నుంచి బయలుదేరి కున్నూరు లేదా, దిట్టకల్ వద్ద హెలికాప్టర్ నుంచి దిగి, రోడ్డు మార్గంలో ప్రచారానికి నిర్ణయించారు. అయితే, ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎన్నికల ప్రచారం ఆయన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కష్టపడ్డ సొమ్ముతో.. ప్రచారం రద్దు కావడంతో కోయంత్తూరు ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి తంగవేల్ నామినేషన్ దాఖలు కార్యాక్రమానికి కమల్ హాజరయ్యారు. మీడియాతో కమల్ మాట్లాడుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రజల్ని కలుసుకునేందుకు, సమయం వృథా కాకుండా వినియోగించు కునేందుకు హెలికాప్టర్ పర్యటనను ఎంపిక చేసుకున్నట్టు తెలిపారు. కష్టపడ్డ సొమ్ముతో తిరుగుతున్నానని కమల్ పేర్కొన్నారు. 234 నియోజకవర్గాల్లోనూ ప్రజల్ని కలుస్తానని, లభిస్తున్న ఆదరణ చూసి అడ్డుకుంటున్నట్టుందని మండిపడ్డారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే! -
అక్రమ చొరబాటు.. హెలికాప్టర్ ధ్వంసం..!
-
అక్రమ చొరబాటు.. హెలికాప్టర్ ధ్వంసం..!
భోపాల్ : భోపాల్‌లోని రాజభోజ్ విమానాశ్రయంలో ఆదివారం కలకలం రేగింది. ఓ వ్యక్తి ఎయిర్‌పోర్టులోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా.. ప్రైవేటు హెలికాప్టర్‌ను ధ్వంసం చేశాడు. అనంతరం టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్ విమానం ముందు బైఠాయించాడు. వెంటనే స్పందించిన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) అతన్ని అదుపులోకి తీసుకుని.. స్థానిక పోలీసులకు అప్పగించింది. ఆగంతకుణ్ణి యోగేశ్ త్రిపాఠీ (20)గా గుర్తించారు. యోగేశ్ దాడి చేసిన హెలికాప్టర్ రాధాస్వామి సత్సంగ్ బియాస్‌కు చెందినది కావడం గమనార్హం. రాళ్లతో దాడి చేయడంతో హెలికాప్టర్ ముందు భాగం ధ్వంసమైంది. యోగేశ్ ఏ ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడ్డాడో తెలియాల్సి ఉంది. అయితే, గత కొన్ని రోజులుగా అతను మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని సమాచారం. ఇక ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఉద్రిక్తత నేపథ్యంలో.. ఉదయ్‌పూర్‌కు వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం గంట ఆలస్యంగా నడిచిందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. -
స్కిడ్ అయిన సీఎం హెలికాఫ్టర్
రాయ్‌గడ్ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండింగ్ సమయంలో స్కిడ్ అయింది. ఈ ఘటన రాయ్‌గడ్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. రాయ్‌గడ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఫడ్నవీస్ హెలికాఫ్టర్‌లో వచ్చారు. అయితే, హెలిప్యాడ్ వద్ద నేల తడిగా ఉండటంతో పైలట్ నియంత్రణ కోల్పోయాడు. వెంటనే తేరుకుని కొద్ది సెకన్లలోనే హెలికాఫ్టర్ క్షేమంగా ల్యాండ్ అయ్యేలా చేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హెలికాఫ్టర్‌లో సీఎం ఫడ్నవీస్‌తో పాటు ఆయన పర్సనల్ అసిస్టెంట్, ఒక ఇంజనీర్, పైలట్, కో-పైలట్లు ఉన్నారు. నేల తడిగా ఉండటంతోనే ఇలా జరిగిందని అధికారులు వెల్లడించారు. సీఎంతో పాటు మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నట్టు జిల్లా ఎస్పీ అనిల్ పరాస్కర్ తెలిపారు. కాగా, గతంలో ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లాథూర్‌లో క్రాష్ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి సీఎం క్షేమంగా బయటపడ్డారు. -
ఉద్యోగ విరమణ కాగానే.. చాపర్ ఎక్కాడు
ఫరిదాబాద్ : ఉద్యోగ విరమణ అనంతరం ఓ వ్యక్తి చేసిన పని గ్రామస్తులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ అతను చేసిందేమీటంటే.. చాపర్‌లో ప్రయాణించాలనే తన కోరికను నెరవేర్చుకున్నాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరిదాబాద్ సమీపంలోని సద్పురాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కురే రామ్ అనే వ్యక్తి నీమ్కా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో క్లాస్ 4 ఉద్యోగిగా పనిచేసేవాడు. అది అతని స్వగ్రామం సద్పురాకు 2 కి.మీల దూరంలో ఉంటుంది. సద్పురా నుంచే అతను పాఠశాలకు నిత్యం రాకపోకలు సాగించేవారు. అయితే 40 ఏళ్ల పాటు పాఠశాలలో పనిచేసిన రామ్ ఇటీవల ఉద్యోగ విరమణ పొందాడు. అయితే రామ్‌కు అతని కుటుంబ సభ్యులతో కలిసి చాపర్‌లో ప్రయాణించాలనే కోరిక ఉండేంది. ఈ విషయాన్ని తన రిటైర్మెంట్కు కొద్ది రోజుల మందు తన తమ్ముడు, సద్పురా సర్పంచ్ శివకుమార్‌కు తెలిపాడు. తన ఉద్యోగ విరమణను కొత్తగా జరుపుకోవాలని ఉన్నట్టు పేర్కొన్నాడు. దీంతో శివకుమార్ అన్న కోరిక తీర్చేందుకు సిద్దమయ్యాడు. అందుకోసం కుటుంబసభ్యులంతా కలిసి రూ. 3.30 లక్షలు జమ చేశారు. ఆ డబ్బుతో.. రామ్ పనిచేసిన పాఠశాల నుంచి సద్పురాకు 8 ట్రిప్పులు తిరిగేలా ఓ చాపర్‌ను బుక్ చేశారు. రామ్ ఉద్యోగ విరమణ కార్యక్రమం అనంతరం అతని కుటుంబ సభ్యులంతా నీమ్కా నుంచి సద్పురాకు చాపర్‌లో చేరుకున్నారు. సదుర్పాకు చాపర్‌లో వచ్చిన రామ్‌కు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. -
గాల్లో గిరగిరా తిరిగిన చాపర్..
-
గాల్లో గిరగిరా తిరిగిన ఎంపీ చాపర్
జైపూర్ : బీజేపీ ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టెకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పింది. వివరాల్లోకి వెళితే.. బాలక్‌నాథ్ ఆళ్వార్ నుంచి హెలికాఫ్టర్‌లో ప్రయాణమయ్యారు. అయితే చాపర్ టెకాఫ్ అవుతుండగా నియంత్రణ కోల్పోయింది. భూమికి కొద్ది ఎత్తులోనే గాల్లో గిరగిరా తిరిగింది. దీంతో అక్కడ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చాపర్ ఎక్కడ కూలిపోతుందనే భయంతో అరవడం ప్రారంభించారు. కానీ పైలట్ చాకచాక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత కొద్దిసేపటికే చాపర్ సరైన దిశలో ప్రయాణించిది. ఈ భయానక పరిస్థితి నుంచి బాలక్‌నాథ్ క్షేమంగా బయటపడటంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్వార్ నుంచి బాలక్‌నాథ్ ఎంపీగా విజయం సాధించారు. ఆయనకు మొత్తంగా 7.6 లక్షల ఓట్లు వచ్చాయి. -
మరోసారి అమిత్‌షాకు చుక్కెదురు
కోల్‌కతా : ఎన్నికల ప్రచారం కోసం పశ్చిమబెంగాల్ పర్యటనకు సిద్ధమైన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ర్యాలీకి బెంగాల్ ప్రభుత్వం చివరి నిమిషంలో అనుమతి నిరాకరించింది. దాంతో బెంగాల్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మే 19న ఎన్నికలు జరిగే జాధవ్‌పూర్‌లో అమిత్ షా సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆయన ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అంతేగాక.. షా చాపర్ ల్యాండింగ్‌కు ఇచ్చిన అనుమతిని కూడా వెనక్కితీసుకుంది. కాగా, దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. ‘తృణమూల్ కాంగ్రెస్ అప్రజాస్వామిక చర్యల పట్ల ఈసీ మౌనంగా ఉండటం దురదృష్టకరం. దీనిపై మేం ఆందోళన చేపడతాం’ అని బీజేపీ రాజ్యసభ ఎంపీ అనిల్ బాలుని తెలిపారు. బెంగాల్ ప్రభుత్వం నుంచి అమిత్ షాకు గతంలోనూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అమిత్ షా మాల్దాలో దిగేందుకు ఆయన హెలికాప్టర్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు బీజేపీ నేతల చాపర్ల ల్యాండింగ్‌కు కూడా దీదీ సర్కార్ అనుమతించకపోవడం గమనార్హం. -
మరి, ఆ ట్రంకు పెట్టె ఏమయింది?
సాక్షి, న్యూఢిల్లీ : ‘కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమార స్వామి వాహనాలను అనేక సార్లు తనిఖీ చేశారు. అలాగే ఒడిశా ముఖ్యమంత్రి వాహనాలను తనిఖీ చేశారు. మరి వారి వాహనాలను తనిఖీ చేసిన అధికారులపై ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు?’... ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్‌ను ఏప్రిల్ 16వ తేదీన తనిఖీ చేశారన్న కారణంగా మొహమ్మద్ మెహిసిన్ అనే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయడం పట్ల ‘సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (కాగ్)’కు చెందిన బెంగళూరు బెంచ్ గురువారం ఎన్నికల కమిషన్ వర్గాలను ఉద్దేశించిన వేసిన ప్రశ్న ఇది. ఎన్నికల సమయంలో ‘ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)’ భద్రత ఉన్న వారి సముచిత భద్రత గురించి ఆలోచించాల్సిందే. అంతమాత్రాన తమ ఇష్టానుసారం నడుచుకునే అధికారం వారికుందని భావించరాదు. ఐఏఎస్ అధికారుల బ్లూ బుక్ ప్రకారం ఎస్పీజీ పరిరక్షణలో ఉన్న వారి విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు ఉన్నాయో, వాటి జోలికి మేము పోదల్చుకోలేదు. చట్టం ఎవరికైనా వర్తించాల్సిందే’ అని వ్యాఖ్యానిస్తూ మెహిసిన్ సస్పెన్షన్‌పై స్టే విధించిన విషయం తెల్సిందే. మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆయన హెలికాప్టర్ నుంచి ఓ నల్ల ట్రంకు పెట్టెను కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో మెహిసిన్ ప్రధాని హెలికాప్టర్‌ను ఒడిశాలో తనిఖీ చేయాల్సి వచ్చిందంటూ మెహిసిన్ న్యాయవాది చేసిన వాదనను పరిగణలోకి తీసుకున్న ట్రిబ్యునల్, మరి ఆ ట్రంకు పెట్టె విషయంలో ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎన్నికల కమిషన్ వర్గాలను ప్రశ్నించింది. ఒడిశాలోని సంబాల్పూర్లో ‘జనరల్ అబ్జర్వర్’ విధులు నిర్వహిస్తున్న మొహిసిన్ ప్రధాని హెలికాప్టర్ వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. ఎస్పీజీ అనుమతితో దూరం నుంచి హెలికాప్టర్ వీడియో తీసుకోవాల్సిందిగా వీడియో గ్రాఫర్‌కు చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయారు. అనంతరం, ఎస్పీజీ రక్షణ ఉన్న ప్రధానికి ఇలాంటి తనిఖీల నుంచి మినహాయింపు ఉంటుందని, అది తెలియకుండా ఐఏఎస్ అధికారి తనీఖీ చేశారంటూ ఎస్పీజీ అధికారులు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా, సబార్డినేట్ రూల్స్‌ను అతిక్రమించారంటూ మెహిసిన్‌ను అదే రోజు సస్పెండ్ చేశారు. ఎన్నికల సమయంలో భద్రతరీత్యా ప్రధానికి ప్రభుత్వ వాహనాలను ఉపయోగించే అధికారం ఉందిగానీ, తనిఖీల నుంచి మినహాయింపు ఉన్నట్లు 2014, 2019 నాటి ఎన్నికల కోడ్లలో ఎక్కడా లేదు. 23వ తేదీన మూడవ విడత పోలింగ్ ముగిసేవరకు నిరీక్షించిన మొహిసిన్ తన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ ఎన్నికల కమిషన్ అధికారులకు ఈ మెయిళ్లు పంపించారు. వాటికి ఎలాంటి సమాధానం లేకపోవడంతో గురువారం ఉదయం ఆయన ట్రిబ్యునల్‌ను సంప్రతించారు. సాయంత్రం స్టే ఉత్తర్వులు జారీ చేసిన కాగ్ కేసు తదుపరి విచారణను జూన్ మూడవ తేదీకి వాయిదా వేసింది. -
ఒడిశా సీఎం హెలికాప్టర్ తనిఖీ
భువనేశ్వర్: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హెలికాప్టర్‌ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. మంగళవారం రూర్కెలాలో రోడ్ షో కోసం పట్నాయక్ వచ్చినప్పుడు అధికారులు అక్కడకు చేరుకుని హెలికాప్టర్‌ను, అందులోని ఇతర సామగ్రిని తనిఖీ చేయాల్సి ఉందని కోరారని పట్నాయక్ భద్రతాధికారి చెప్పారు. మోదీ హెలికాప్టర్‌లోనూ సోదాలు ఒడిశాలోని సంబాల్పూర్లో మంగళవారం ఎన్నికలర్యాలీ వేళ ప్రధాని మోదీ హెలికాప్టర్‌ను అధికారులు తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం ఎస్పీజీ రక్షణ కలిగిన వారి హెలికాప్టర్ సోదా చేయొద్దు. దీంతో సోదా చేసిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి మోహిన్సన్ను ఈసీ బుధవారం సస్పెండ్ చేసింది. -
చాపర్ బైక్ సూపర్!
యశవంతపుర: రద్దీ రోడ్లపై 13 అడుగుల బైకు నడపడం సాధ్యమా? అంత కష్టమేం కాదంటున్నాడు జాకీర్. బెంగళూరులోని నాగరబావికి చెందిన జాకీర్(29) ఇంటీరియర్ డిజైనర్. కొత్తగా ఏదైనా చేసేందుకు వాహనరంగాన్ని ఎంచుకున్నాడు. ఇంటి వద్దనే వర్క్‌షాప్ ఏర్పాటు చేసుకుని వేర్వేరు సంస్థల బైక్ విడిభాగాలు సమకూర్చుకున్నాడు. సుమారు నెలన్నరపాటు శ్రమించి రూ.7.5లక్షలు ఖర్చు చేసి 220 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్‌తో 450 కిలోల బరువు, 13 అడుగుల పొడవు, 5.5 అడుగుల వెడల్పుతో ఉన్న చాపర్ బైక్ తయారుచేశాడు. ఒక్కరు మాత్రమే కూర్చునేందుకు వీలుండే ఈ బైక్‌పై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చు. అన్ని ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ వెనుక వైపు ఉండగా దీనికి మాత్రం ముందు భాగంలో ఏర్పాటు చేశాడు. ముందు చక్రం చిన్నదిగా, వెనుక చక్రం పెద్దదిగా ఉంది. వెనుక చక్రం మినీ ట్రక్ టైర్లా ఉంటుంది. ఈ చాపర్ బైకును శని, ఆదివారాల్లో జేపీ నగరలోని శ్రీ దుర్గా పరమేశ్వరి బీడీఏ మైదానంలో అభిమానుల కోసం ప్రదర్శనకు ఉంచనున్నాడు. ప్రపంచంలోనే అతి పొడవైన బైక్‌గా ఇది రికార్డు సృష్టించనుందని జాకీర్ ధీమావ్యక్తంచేశారు. -
ఉలికిపాటు.. అంతలోనే ఆనందం!
సమయం గురువారం మిట్టమధ్యాహ్నం ఒంటిగంట.. జనమంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో పెద్ద శబ్దంతో హెలికాప్టరొకటి సోంపేట మండలం శారదాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో దిగిపోయింది. దీంతో జనమంతా ఉలికిపాటుకి గురయ్యారు. ఏం జరిగిందోనని తీవ్ర ఆందోళన చెందారు. ఎప్పుడూ ఆకాశ మార్గంలో వెళ్లేటపుడు మాత్రమే హెలికాప్టర్‌ను చూసే గ్రామీణులు తమ పరిసరాల్లో అకస్మాత్తుగా దిగిపోవడంతో ఏం జరిగి ఉంటుందోనని గందరగోళానికి గురయ్యారు. ఇంతలో సాంకేతిక లోపంతో హెలికాప్టర్ దిగినట్టు తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. పాడైన దాన్ని బాగు చేసేందుకు సాంకేతిక సిబ్బంది మరో హెలికాప్టర్లో రావడం..అది కూడా పొలంలోనే దిగడంతో.. ఒకేసారి రెండింటినీ చూసిన సోం³ట మండల వాసులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. సోంపేట: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బక్రాపూర్ నుంచి చెన్నై వెళ్తున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ గురుప్రీత్ సింగ్ గురువారం మధ్యాహ్నం 1:10 గంటల సమయంలో సోంపేట మండలం శారదాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హెలికాప్టర్లో పైలట్ సింగ్‌తో సహా సి బ్బంది ప్రశాంత్, కిరణ్టాకోన్ ఉన్నారు. హెలి కాప్టర్ పాడైన విషయాన్ని విశాఖలోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విభాగానికి సమాచారం అందజేశారు. దీంతో నావికాదళానికి చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో సాంకేతిక బృందం సుమా రు నాలుగు గంటల సమయంలో శారదాపురం చేరుకున్నారు. మరమ్మతులకు గురైన హెలికాప్టర్ పైలట్ సింగ్‌తో సిబ్బంది మాట్లాడారు. 30 నిమిషాల్లోనే సాంకేతిక సమస్యను పరిష్కరిం చారు. అనంతరం రెండు హెలికాప్టర్లు ఒడిశా రాష్ట్రంలోని గోపాల్‌పూర్‌కు సాయంత్రం 5:10 గంటల సమయంలో బయలుదేరి వెళ్లిపోయా యి. కాగా రక్షణ విభాగానికి చెందిన హెలికాప్టర్లు కావడంతో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. ఒడిశా రాష్ట్రం గోపాల్పూర్ క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న ఆర్మీ సిబ్బందిని శారదాపురానికి పంపించారు. ఆసక్తి చూపిన జనం.. ఒక హెలికాప్టర్ సాంకేతిక లోపంతో పొలాల్లో దిగిందని, దాన్ని బాగు చేసేందుకు మరకొటి వచ్చిందని తెలుసుకున్న శారదాపురంతోపాటు పరిసర గ్రామాల ప్రజలు వాటిని చూసేందుకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొంతమంది హెలికాప్టర్ల ఫొటోలను సెల్ఫోన్లలో బంధించారు. మరికొందరు సెల్ఫీలు తీసుకున్నారు. సోంపేట సీఐ సన్యాసినాయుడు, బారువ, సోంపేట ఎస్సైలు భాస్కరారవు, దుర్గా ప్రసాద్‌లు హెలికాప్టర్ల వద్దకు స్థానికులను వెళ్లనీయకుండా చర్యలు చేపట్టారు. -
యువీ గాల్లో తేలిపోతున్నాడు...
-
యువీ గాల్లో తేలిపోతున్నాడు...
గాల్లో తేలినట్టుందే...గుండె పేలినట్టుందే అని యువరాజ్ సింగ్ పాడుకుంటున్నాడేమో. చాపర్‌ను నడుపుతూ గాల్లో తేలిపోతున్నాడు. అతను బ్యాటింగ్‌తో బంతిని గాల్లో ఎగిరేలా చేయడం మనం ఎన్నోసార్లు చూశాం. కానీ ఇప్పుడు యువీనే గాల్లో ఎగురుతూ ఉంటే చూస్తున్నాం. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే యువీ, తాజాగా ఏవియేటర్ అవతారమెత్తి పైలట్ సీట్లో కూర్చొని చాపర్ నడుపుతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. లైక్స్, షేర్లతో ఆ వీడియో వైరల్‌గా మారింది.