పక్షి ఢీకొట్టడంతో ధ్వసమైన పర్యాటక హెలికాప్టర్
మైసూరు: ప్రపంచ ఖ్యాతి పొందిన మైసూరు రాచనగరి దసరా వేడుకల్లో తృటిలో పెనుప్రమాదం తప్పింది. హెలిరైడ్‌లో భాగంగా ఆదివారం పర్యాటకులతో విహంగ వీక్షణానికి బయలుదేరగా మార్గమధ్యలో హెలికాప్టర్‌ను పక్షి వేగంగా ఢీకొట్టింది. దీంతో హెలికాప్టర్ ముందు అద్దం పాక్షికంగా పగిలిపోగా, పైలెట్‌కు చిన్నపాటి గాయాలయ్యాయి. అప్రమత్తమైన పైలెట్ చాకచక్యంగా హెలికాప్టర్‌ను క్షేమంగా వెనక్కు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
దసరా ఉత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 2 వరకు కర్ణాటక పర్యాటక శాఖ హెలిరైడ్‌ను నిర్వహింస్తోంది. దీనికి పర్యాటకుల నుంచి మంచి స్పందన లభించింది. కాగా, ఆదివారం నాటి ఘటన ఆందోళన రేకెత్తించింది. గాయపడిన పైలట్‌ను ఆస్పత్రికి తరలించామని, పర్యాటకులెవరూ గాయపడలేదని అధికారులు ప్రకటించారు.