Dussehra Festival (Vijayadashami)
-
జూబ్లీహిల్స్ : భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్లో దసరా వేడుకలు (ఫొటోలు)
-
పండుగల ముందు 'ధర'.. దడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పండుగల ముందు నిత్యావసరాల ధరలు చుక్కలు తాకుతున్నాయి. రోజురోజుకూ నూనెలు, బియ్యం, కూరగాయల ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. రాష్ట్రమంతా ఘనంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ రెండు వారాల్లోనే మొదలవనుంది. తర్వాత పదిరోజుల్లోనే దసరా పండుగ ఉంది. ఈ సమయంలో ధరల పెరుగుదల సామాన్య జనంలో ఆందోళన రేపుతోంది. బియ్యం ధరలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంటే.. నూనెలు, కూరగాయల ధరలు గత వారంలోనే ఒక్కసారిగా 20–30 శాతం వరకు పెరగడం ఇబ్బందిగా మారుతోంది. ఇలా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలను, బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించడంపైగానీ.. సామాన్యులకు తక్కువ ధరలో సరుకులు అందించడంపైన గానీ ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదనే విమర్శలున్నాయి. బియ్యం మార్కెట్‌పై నియంత్రణ లేక.. రాష్ట్రంలో సన్నబియ్యం బంగారమైపోతోంది. పప్పులతో పోటీపడుతూ రేటు పెరుగుతోంది. జైశ్రీరాం, సోనామసూరి, హెచ్ఎంటీ రకాల బియ్యం రేటు కిలో రూ.70కిపైగా పలుకుతోంది. రైతుల నుంచి సన్నరకాల ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2,500 నుంచి రూ.3,000కే కొనుగోలు చేస్తున్న మిల్లర్లు.. సన్న బియ్యానికి డిమాండ్ ఉండటంతో అడ్డగోలు రేటుకు విక్రయిస్తున్నారు. బియ్యం మార్కెట్‌పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం కూడా దీనికి మరింత ఊతమిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం జైశ్రీరాం రకం రా రైస్ (ముడి బియ్యం) మార్కెట్లో 26 కిలోల బ్యాగ్ ధర రూ.1,800 వరకు ఉండగా.. స్టీమ్ రైస్ ధర రూ.1,500 వరకు ఉంది. సోనా మసూరి, హెచ్ఎంటీ రకాల ధరలు రూ.1,700కు చేరాయి. కేంద్రం ప్రకటనతో పెరిగిన వంట నూనెల ధర వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20శాతం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించటంతో వాటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్), సోయాబీన్, రిఫైన్డ్ పామాయిల్, వేరుశనగ నూనెలపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుంచి 32.5 శాతానికి పెంచుతున్నట్టు కేంద్రం ఈనెల 14న ఉదయం ప్రకటన చేయగా.. అదే రోజు సాయంత్రానికే నూనెల ధరలు రూ.20కుపైగా పెరిగాయి. ఇటీవలి వరకు లీటర్ రూ.105గా ఉన్న పొద్దుతిరుగుడు నూనె ధర ప్రస్తుతం రూ.130–140కి చేరింది. పామాయిల్ రేటు రూ.95 నుంచి రూ.120 దాటిపోయింది. వేరుశనగ నూనె రూ.170 దాటింది. నిజానికి కొత్తగా దిగుమతి అయ్యే నూనెలపైనే పన్ను పెరిగింది. కానీ ఇప్పటికే దిగుమతి అయి, నిల్వ ఉన్న స్టాక్‌పైనా అధిక రేటు వసూలు చేస్తుండటం గమనార్హం. అంతేకాదు.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘విజయ’ వంట నూనె ధరలనూ అమాంతం పెంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ‘విజయ’ వంట నూనెలను తక్కువ ధరకు అందించే అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలేవీ చేపట్టడం లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం విజ్ఞప్తిని పట్టించుకోని వ్యాపారులు సుంకం పెంపునకు ముందే దిగుమతి చేసుకున్న స్టాక్ అయిపోయే వరకు కంపెనీలు.. నూనెల ధరలను గరిష్ట రిటైల్ ధర కంటే తక్కువగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా సుంకం పెంపునకు ముందే దిగుమతి అయిన సుమారు 30 లక్షల టన్నుల వంట నూనెల స్టాక్ ఉందని.. అది 45–50 రోజుల వరకు సరిపోతుందని అంచనా. అయినా కూడా హోల్‌సేల్ నుంచి రిటైల్ వరకు అన్నిచోట్లా వంటనూనెల ధరలు పెంచేశారు. దసరా నాటికి ఇంకా ధరలు పెరుగుతాయనే ప్రచారంతో.. వినియోగదారులు కొనుగోలు చేసి పెట్టుకుంటుండటం గమనార్హం. అందుబాటులో లేని ఉల్లి, వెల్లుల్లి.. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఉల్లి, వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వెల్లుల్లి కిలో రూ.350 నుంచి రూ.400 వరకు ఉండగా.. ఉల్లి ధర కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. మన దేశంలో అవసరమైన వెల్లుల్లిలో అత్యధికంగా 40 శాతం వరకు మధ్యప్రదేశ్ నుంచే వస్తోంది. దీనితోపాటు వెల్లుల్లి పండించే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోనూ.. వాతావరణ పరిస్థితులు కలసి రాక దిగుబడి తగ్గిందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దీనితో వెల్లుల్లి రేటు మరింతగా పెరగొచ్చని అంటున్నాయి. ఉల్లి పంటకు కూడా వర్షాల ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే రూ.60 దాటింది. ఇది రూ.100కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పప్పులు, కూరగాయల మోత కూడా.. కందిపప్పు, పెసర, మినుములు, శనగ.. ఇలా పప్పుల ధరలన్నీ పెరిగాయి. కందిపప్పు ధర నాణ్యతను బట్టి కిలో రూ.150 నుంచి రూ.180 వరకు ఉండగా.. పెసర పప్పు రూ.130 నుంచి రూ.150 వరకు ఉంది. శనగపప్పు ధర గత పదిరోజుల్లోనే రూ.85 నుంచి రూ.105కు పెరిగింది. మినపపప్పు రూ.150పైనే పలుకుతోంది. మరోవైపు కూరగాయల ధరలు కూడా కొండెక్కుతున్నాయి. కిలోకు కాలీఫ్లవర్ రూ.150కిపైగా, పచ్చిమిర్చి రూ.120కిపైగా ఉంది. టమాటా ధర వారం క్రితం వరకు కిలో రూ.25–30 ఉంటే.. ఇప్పుడు రూ.60కి చేరింది. బీరకాయ, దోసకాయ, పొట్లకాయ, బెండకాయ, వంకాయ ఏది చూసినా కిలో రూ.50–60 దాటిపోయాయి. చిక్కుడు, బీన్స్ అయితే కిలో రూ.120కి తగ్గడం లేదు. సర్కారులో స్పందనేదీ? అడ్డగోలుగా ధరలు పెరిగిపోతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానరావడం లేదని, పెరుగుతున్న ధరలపై కనీస సమీక్ష కూడా లేకపోవడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కాస్త దృష్టిపెడితే.. ధరలను కాస్తయినా నియంత్రించవచ్చని నిపుణులు చెప్తున్నారు. మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల ద్వారా నిత్యావసరాలను తక్కువ ధరలతో వినియోగదారులకు అందించవచ్చని వివరిస్తున్నారు. గతంలోనూ ఇలా ధరలు పెరిగినప్పుడు రేషన్‌దుకాణాలు, రైతుబజార్ల ద్వారా తక్కువ ధరలో ఉల్లిగడ్డలు, ఉప్పు, పప్పులు విక్రయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సంచార మార్కెట్లతో కాలనీల్లో కూరగాయలు, ఇతర నిత్యావసరాలను విక్రయిస్తే కొంత మేర ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప పండుగల సమయంలో సామాన్యులు ఇబ్బందులపాలు కావాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. పండుగ ముందు ధరలు పెరిగాయి ఐదు లీటర్ల సన్‌ఫ్లవర్ ఆయిల్ 15 రోజుల కింద రూ.570 ఉంటే.. ఇప్పుడు రూ.639 తీసుకుంటున్నారు. 15 రోజుల్లోనే 70 రూపాయలు పెరిగింది. దసరా పండుగ ముందు ధరలు పెరిగాయి. ఇంకా పెరుగుతాయని అంటున్నారు. – నాయిని రవి, న్యూశాయంపేట, హనుమకొండ అన్నింటి ధరలు మండిపోతున్నాయి వంట నూనె ఒకటే కాదు..అన్ని నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. పప్పులు, కూరగాయలు కూడా కొనే పరిస్థితి లేదు. – యానం విద్య , కాకాజీ కాలనీ, హనుమకొండ కూరగాయల రేట్లు పెంచేశారు కూరగాయల రేట్లు బాగా పెరిగాయి. టమాటా మొన్నటివరకు 20 రూపాయలు ఉంటే ఇప్పుడు 50, 60 రూపాయలకు అమ్ముతున్నారు. కాకర 30 నుంచి 45కు పెంచారు. వారంలోనే అన్ని కూరగాయల రేట్లు పెరిగాయి. రోజువారీగా కూరగాయల ధరలను చూసి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. – సాంబయ్య, నల్లగొండ నూనెలు కొనే పరిస్థితి లేదు వంట నూనె ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సన్ ఫ్లవర్ మొన్నటిదాకా 105 వరకు ఉంటే.. ఇప్పుడు 125, 130 రూపాయలకు పెంచారు. పామాయిల్ 90 నుంచి 120కి పెంచి అమ్ముతున్నారు. శనగపప్పు మొన్నటిదాకా కిలో 85 రూపాయల దాకా ఉంటే.. ఇప్పుడు 110 రూపాయలు తీసుకుంటున్నారు. – దుర్గ, నల్లగొండ నూనెలు కొనే పరిస్థితి లేదువంట నూనె ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సన్ ఫ్లవర్ మొన్నటిదాకా 105 వరకు ఉంటే.. ఇప్పుడు 125, 130 రూపాయలకు పెంచారు. పామాయిల్ 90 నుంచి 120కి పెంచి అమ్ముతున్నారు. శనగపప్పు మొన్నటిదాకా కిలో 85 రూపాయల దాకా ఉంటే.. ఇప్పుడు 110 రూపాయలు తీసుకుంటున్నారు. – దుర్గ, నల్లగొండ -
Bhavani Devotess In Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల రద్దీ (ఫోటోలు)
-
ముగిసిన దసరా ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/కోడూరు/పెందుర్తి/శ్రీశైలం టెంపుల్: ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తోన్న దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం 9వ రోజున దుర్గమ్మ 2 అలంకారాల్లో అభయమిచ్చారు. ఉదయం మహిషాసురమర్దినిగా.. మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరిదేవిగా దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అమ్మవారి అలంకరణ మార్పు కారణంగా దర్శనాలను నిలిపివేశారు. 2 రోజుల్లో రికార్డు స్థాయిలో 4 లక్షలకుపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో మహా పూర్ణాహుతిని నిర్వహించారు. సోమవారం రాత్రి ఆది దంపతులకు కృష్ణా నదిలో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. దుర్గాఘాట్ వద్ద హంస వాహనంపై శ్రీగంగా పార్వతి (దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వారు తెప్పపై విహరించారు. 8.95 లక్షల మందికి దర్శనం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 15–23 వరకు నిర్వహించిన దసరా ఉత్సవాల్లో 8.95 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. 14.17 లక్షల లడ్డూలను విక్రయించినట్లు చెప్పారు. స్వర్ణం, వెండి, పట్టుతో నేసిన చీరలో నాంచారమ్మ కృష్ణా తీరంలో భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లిలోని అద్దంకి నాంచారమ్మ అమ్మవారికి బంగారం, వెండి, పట్టుతో నేసిన చీరను అలంకరించారు. పమిడిముక్కల మండలం మంటాడకు చెందిన పసుపులేటి మణికంఠ వృత్తి పరంగా విదేశాల్లో స్థిరపడ్డాడు. దసరా ఉత్సవాలకు నాంచారమ్మ అమ్మవారికి రూ.2 లక్షలతో బంగారం, వెండితో ప్రత్యేకంగా తయారు చేయించిన చీరను మణికంఠ కుటుంబసభ్యులు సోమవారం ఆలయాధికారులకు అందజేశారు. పట్టుతో పాటు చీర మొత్తం బంగారం, వెండి తీగలతో నేయించారు. ఈ చీరను మూలమూర్తికి అలంకరించారు. బంగారం, వెండి చీరలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మణికంఠ కుటుంబీకులను ఆలయ ఈవో పామర్తి సీతారామయ్య సన్మానించారు. విశాఖ శ్రీశారదాపీఠంలో.. విశాఖ శ్రీశారదాపీఠంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. మంగళవారం విజయదశమి సందర్భంగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిలు శమీ వృక్షం వద్ద అపరాజితాదేవిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. విజయదుర్గ అవతారంలో దర్శనమిచ్చిన శారదాస్వరూప రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్‌రెడ్డి శ్రీశారదాపీఠాన్ని మంగళవారం సందర్శించి స్వామీజీల ఆశీస్సులు తీసుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలంలో.. శ్రీశైలంలో ఆధ్యాత్మికభరితంగా సాగిన దసరా మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. అమ్మవారు నిజరూప అలంకారంలో భ్రమరాంబాదేవిగా దర్శనమిచ్చారు. నంది వాహన సేవలో ఆది దంపతులు విహరించారు. ప్రత్యేక అలంకృతులైన అమ్మవారికి, స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక వేదికలో ఆశీనులను చేయించి విశేష పూజలు నిర్వహించారు. విజయదశమి రోజున స్వామి అమ్మవార్లకు విశేష పూజలతో పాటు శమీ పూజ చేపట్టారు. అమ్మవారి యాగశాలలో, స్వామివారి యాగశాలలో శాస్త్రోక్తం గా పూర్ణాహుతి నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంతో శ్రీగిరిలో దసరా మహోత్సవాలు ముగిశాయి. కాగా, సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్లకు మంత్రి గుమ్మనూరు జయరాం దంపతులు పట్టువ్రస్తాలను సమర్పించారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దంపతులు, దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఈవో పెద్దిరాజు పాల్గొన్నారు. -
బతుకమ్మ పండుగ విశిష్టత..
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగ బతుకమ్మ. ఏ పండుగకు కలవకున్నా ఈ పండుగకు మాత్రం ఆడపడుచులంతా కలుసుకుంటారు. బతుకమ్మ పండుగ వస్తోందంటే ప్రకృతి అంతా పూలవనంగా మారిపోతుంది. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తాయి. తెలంగాణలో పండుగల్లో పాట నేర్పింది బతుకమ్మనే. పువ్వులతో బతుకమ్మను పేర్చి పువ్వులనడుమ పుప్పొడిని, పసుపుముద్దను అలంకరిస్తారు. ఈ పండుగ జరుగుతున్నన్ని రోజులూ పల్లెలు, పట్టణాలు పూలవనాలయిపోతాయి. ఆరాధనలో పూలకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. తెలంగాణలోనైతే, ఆ పూలనే పూజించడం ఒక విలక్షణ సంస్కృతిగా కనిపిస్తోంది. ప్రకృతిలో భాగమైన పూలు స్త్రీల ముత్తయిదు తనానికి ప్రతీక కావడం గొప్ప విశేషం. స్త్రీల ప్రాతినిధ్యమే ప్రధానమైనప్పటికీ సమాజంలో సమిష్టితత్వానికి దోహదపడే పండుగ ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వమానవాళికి భిన్నత్వంలోని అందాన్ని అందించి ఐక్యంగా ఉండాలనే అవసరాన్ని చాటి చెప్తుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే సమాజానికి మేలు కూర్చే విషయాలెన్నో బతుకమ్మ కూర్పులో, ఆటలో, పాటలో ఆత్మీయత పంచుకోవడంలో కనబడతాయి. తెలంగాణలో బతుకమ్మ పండుగ 9 రోజులు జరుపుకునే వేడుకగా ప్రసిద్ధి పొందింది. మొదటి రోజు భాద్రపద బహుళ అమావాస్యనాడు పారంభమవుతుంది. ఈ అమావాస్యను పితృ అమావాస్య అంటారు. ఆనాడు చేసే బతుకమ్మ పేర్పును ఎంగిలిపువ్వుల బతుకమ్మగా పిలుస్తారు. ఆనాడు గౌరమ్మకు సాధారణంగా తెలంగాణ ప్రజలు తినే ఆహారాన్ని, పిండివంటలను నైవేద్యంగా సమర్పించుకొంటారు. తొలిపూజ బతుకమ్మకు కాబట్టి పల్లె ప్రజలు ఎంగిలిపూల బతుకమ్మని అంటారు, స్త్రీలు భుజించిన తర్వాత చేసుకొంటారు కాబట్టి ఎంగిలి బతుకమ్మనే పేరొచ్చింది. బతుకమ్మను పూజించిన తర్వాత పుణ్య స్త్రీలు తమ మాంగల్యాలకు తాకించుకుంటారు. ఆ పూజనే మంగళగౌరి అని మాంగల్య గౌరి అని భావిస్తారు. బతుకమ్మ కథనాలు ఎట్లా ఉన్నా ముత్తయిదుతనమనేదే అంతర్లీనంగా కనిపిస్తోంది. సాంప్రదాయంగా పçసుపు గౌరమ్మను చేస్తుంటారు. తంగేడు పూలు పసుపుతనానికి ప్రతీకగా నిలుస్తాయి. ఈ గౌరమ్మను చేయడంలో గొప్ప ఆచారం కనబడుతుంది. అర్ధనారీశ్వరునికి సంకేతంగా బతుకమ్మను నిలుపుకొంటారు. శివపార్వతులు ప్రకృతి– పురుషులు. నిజంగా గౌరమ్మ అనగానే పూలతో ఒక గోపురంలా పేర్చడం ఒకటే కాదు, ఆ గోపురం నడుమ ఒక నొక్కు (గుమ్మడి) ని పెట్టి ఒక పసుపు ముద్దను రెండు గోపురాలుగా రూపొందేటట్లు పూలను పేరుస్తారు. అంటే గౌరమ్మే అర్ధనారీశ్వర స్వరూపం అన్నమాట. ఇందులో ప్రత్యేకంగా గౌరీ ఆరాధన కనిపిస్తుంది. కొందరు గౌరమ్మను తమలపాకుల్లో పెడతారు, మరికొందరు చిక్కుడు ఆకుల్లో పెట్టి పూజ చేస్తుంటారు. ‘చిక్కుడు ఆకుల్లో ఉయ్యాలా... సద్దులు కట్టి ఉయ్యాలో... అని పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు. అందుకే స్త్రీల మనోభావాలను అనుసరించే బతుకమ్మను పేర్చడం జరుగుతోంది. అందులో స్త్రీల కళాతృష్ణ ఎంత గొప్పదో విదితమవుతుంది.ఎన్ని పూలతో బతుకమ్మను పేర్చినా ప్రతి వరుసకు తంగేటిపూలు ఉండడాన్ని విస్మరించరు. తంగేడు ముతై ్తదుతనం ఇవ్వడమేగాదు, ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుందని నమ్మకం. అందుకే, ‘శ్రీలక్ష్మి నీమహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ’ అని జానపదం పాడుకుంటారు. సద్దుల బతుకమ్మనాడు ఆడపడుచులకు వొడిబియ్యం పోసి సాగనంపినట్లు బతుకమ్మను సాగనంపుతారు. బతుకమ్మను పేర్చడంలోని తీరొక్క పువ్వుకు తీరొక్క శాస్త్రీయత కనబడుతుంది. ప్రకృతిలోని పూలన్నింటికి ఔషధ గుణాలుంటాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. బతుకమ్మను చెరువులోగానీ కుంటలోగాని నిమజ్జనం చేసినప్పుడు రోగ నిరోధక శక్తితో నీరు ఔషధ గుణాలు పొందుతుంది. అలాగే గుమ్మడి పూలు, గునుగుపూలలో జలచరాల్లోని అనారోగ్యాన్ని దూరం చేసే గుణాలున్నాయి. పుప్పొడి, పసుపులో గాలిలోని కాలుష్యాన్ని కడిగేసే గుణాలున్నాయి. అన్నింటికీ మించి కులమతాల కతీతంగా, పేద, గొప్ప భేదం లేకుండా బతుకమ్మ ఆటల్లో పాల్గొనడంలో సామాజిక ప్రయోజనముంది. బృహత్ శివలింగానికీ బతుకమ్మకూ సంబంధం? తెలంగాణ సంస్కృతిలో ప్రధాన భాగమైన బతుకమ్మ పండుగను పరిశీలిస్తే, ఆ సంస్కృతి విశిష్టత, చారిత్రకత విశదమౌతుంది. విశ్వవిఖ్యాతి చెందిన తంజావూరులోని రాజరాజేశ్వర ఆలయంలోని మహా శివలింగం వేములవాడకు చెందిందనడానికి ఆధారాలున్నాయి. ఈ దేవాలయాన్ని నిర్మించిన చోళరాజైన రాజరాజు, కరీంనగర్‌లోని వేములవాడ నుంచి బృహత్ శివలింగాన్ని అంటే మహా శివలింగాన్ని తంజావూరు తరలించి, బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠింపజేశాడు. తెలంగాణ ప్రజలు దీనికి బాధపడినా, పార్వతీ అమ్మవారిని ఊరడించే ప్రయత్నంలో పూలతో మేరుపర్వతంలా పేర్చి, దానిపై పసుపుతో గౌరీదేవిని రూపొందించి, దసరా సందర్భంలో ఆటపాటలతో తిరిగి రమ్మని ప్రార్థిస్తున్నారని చారిత్రక పరిశోధకుల అభిప్రాయం. -
Dussehra 2023: విజయ దశమి విశిష్టత ఏంటంటే.?
ముక్తి కోసం సాధన చేసేందుకు ఉపకరించే దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. ఆసేతు హిమాచలం అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగలలో ఒకటైన ఈ దసరా గురించి... దసరా అంటే పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది. ఈ పది రోజుల పండుగని ‘నవరాత్ర వ్రతం‘ అనీ, ‘దేవీ నవరాత్రులు‘, ‘శరన్నవరాత్రులు‘ అని వ్యవహరిస్తాం. తొమ్మిది రోజులు నియమ నిష్ఠలతో జగన్మాతను పూజించే వ్రతం ఈ శరత్కాలంలో చేసే శరన్నవరాత్ర వ్రతం. తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. నవరాత్రులు ఆరాధించటమంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించటం. నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అని అర్థం. తొమ్మిది రోజుల దీక్ష వలన పదవరోజు విజయం లభిస్తుంది. అంటే తొమ్మిది రోజుల దీక్షకు ఫలం లభిస్తుంది. కనుక పదవ రోజును ‘విజయదశమి‘ పేరిట పండుగ జరుపుకుంటాము. జగన్మాత ఆదిపరాశక్తి గొప్పదనాన్ని, మహిమను గురించి, దేవీ భాగవతం, మార్కండేయ పురాణం మొదలైన అనేక పురాణాలు, ఉపనిషత్తులు వివరిస్తాయి, త్రిపురా రహస్యంలో విపులమైన వివరణ కనిపిస్తుంది. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలవబడుతున్న జగన్మాత దుర్గమ్మ అనంతమైన నామాలతో పూజలందుకుంటోంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గ, పార్వతి, హైమవతి, అపరాజిత, భవాని, లలిత, జయంతి, మంగళ, భద్రకాళి, కాపాలిని, క్షమా, శివదూతి, స్వాహా, స్వధా, చాముండి, విష్ణుపత్ని, ఈశ్వరి ఇటువంటి అనేకమైన నామాలతో ఆరాధనలందుకుంటోంది. మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృత పరిచే, దైవ అనుగ్రహంతో, మంత్ర శక్తితో, నియమబద్ధమైన జీవితంతో జాగృత పరిచే ఒక వ్రతం ఈ నవరాత్ర వ్రతం. అందుకే దసరా నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజులు ఈ జగన్మాతను బాలా త్రిపురసుందరిగా, గాయత్రీ మాతగా, అన్నపూర్ణాదేవిగా, శ్రీ మహాలక్ష్మి దేవిగా, శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా, సప్తమి రోజున శ్రీ మహా సరస్వతీ దేవిగా, అష్టమి నాడు దుర్గామాతగా, నవమి నాడు మహిషాసుర మర్దినిగా, దశమినాడు జయా విజయా సహిత అపరాజితా దేవిగా – రాజరాజేశ్వరీ దేవిగా ఆరాధిస్తాం. తొమ్మిది రోజులు కఠినమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన నియమాలను పాటిస్తూ, నామ మంత్ర జపం, నామ పారాయణ చేస్తూ, కీర్తనలతో, భజనలతో కొలుస్తూ, ఉపవాస నియమాలను, నక్త వ్రతముల వంటి వాటిని పాటిస్తూ దశమినాడు చక్కగా జగన్మాతను షోడశోపచారాలతో పూజించి, అనేక విధాలైన పిండివంటలు తయారు చేసి, నైవేద్యం పెట్టి అమ్మను ఆరాధిస్తాం. ఆ పిండి వంటలను ప్రసాదంగా బంధుమిత్రులందరికీ పెట్టి, ఆరగిస్తాం. ఆదిపరాశక్తిని లక్ష్మీ, గాయత్రీ, సరస్వతీ, రాధ, దుర్గా అనే ఐదు పరిపూర్ణ మూర్తులుగా ఆరాధిస్తారు. యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా ! నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః!! పరమేశ్వరుని సంకల్ప శక్తి జగన్మాత. ఆ సంకల్పం వల్లే సృష్టి స్థితి లయలన్నీ జరుగుతున్నాయి. ఆదిపరాశక్తి ప్రకృతి అయితే, పరమాత్మ పురుషుడు. ప్రకృతి పురుషుల కలయిక వల్లే సృష్టి యేర్పడుతుంది. అంటే శివపార్వతుల చిద్విలాసం యావద్విశ్వం. ఈశ్వరుడని కొలిచినా, విష్ణువు అని కొలిచినా, జగన్మాత అంబిక అని కొలిచినా ఉన్న శక్తి ఒక్కటే అని మనకి ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఒక్కటిగా ఉన్న ఆ శక్తిని, చిచ్ఛక్తినే మనం అమ్మవారిగా, జగన్మాతగా ఆరాధిస్తున్నాము. చండీ సప్తశతిలో జగన్మాత మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహా సరస్వతిగా దుష్ట రాక్షసులను దునుమాడిన వైనాన్ని కీర్తించారు. అమ్మవారు దేవతలకు – ఎప్పుడు దుష్ట రాక్షసుల నుంచి బాధలు కలిగినా, తాను అవతరించి, దుష్ట శిక్షణ చేస్తానని అభయమిచ్చారు. జగన్మాత, యోగ నిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును జాగృత పరిచి, మధు కైటభులనే రాక్షసులను సంహరింపజేసింది. మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించగా, దేవతలు బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువు, రుద్రుల దగ్గరికి వెళ్ళి మహిషాసురుని ఆగడాలను గురించి చెప్పారు. ఆ మాటలు వినగానే శివకేశవులకు ధర్మాగ్రహం కలిగింది. ఆ క్రోధం ఒక ఆకృతి దాల్చి, వెలుగు రూపంలో బయటకొచ్చింది. దేవతలందరి ముఖాల నుంచి తేజస్సు బయటికి వచ్చి, ఆ సమష్టి తేజస్సు ఒక మహాద్భుత రూపం దాల్చి, అష్టభుజాలతో మహాలక్ష్మీదేవిగా, ఆదిపరాశక్తి ్తగా భాసించింది. ఈ తల్లిని దేవతలు ‘అమ్మా! నీవే సర్వకారణభూతురాలివి, కార్య కారణ రూపిణివి, క్రియా రూపిణివి, నీవు లేనిదే ఏదీ లేదు, అంతా నీలోనే ఉంది తల్లి అంటూ కీర్తించారు. శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు. కనీసం స్పందించను కూడా లేడట. శక్తి లేకపోతే, చలనం, స్పందన ఉండదు అని జగద్గురువు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి గురించి ప్రస్తుతించారు. ఆమె మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి మహిషాసురమర్దినిగా కీర్తించబడింది. జగన్మాతే ధూమ్రాక్షుడిని, రక్తబీజుడిని, చండ, ముండులను, శుంభ, నిశుంభులనే రాక్షసులను సంహరించింది. ఈ రాక్షసులందరూ బ్రహ్మదేవుని గురించి, పరమేశ్వరుని గురించి తపస్సులు చేసి వరాలు పొందినటువంటి వారు. దేవతల నుంచి ఎటువంటి భయాలు లేకుండా వరాలు పొందారు. కానీ స్త్రీ అంటే చులకన. ఆడవారు మననేం చేస్తారులే! అనే చులకన భావన స్త్రీల మీద! కనుకనే అమ్మవారు ఈ రాక్షసులందరినీ తనలో నుంచి బ్రాహ్మీ , వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, ఐంద్రీ, వారాహి, నారసింహీ, చాముండా, శ్యామలా, కాళీ మొదలైన దేవతాగణాలను ఉద్భవింపజేసి, వారితో కలిసి రాక్షసులతో యుద్ధం చేసి, దానవులందరినీ సంహరించింది. ఈ దుష్ట రాక్షసులందరినీ జగన్మాత ఈ నవరాత్రులలో సంహరించినందున నవరాత్రులలో జగన్మాత వివిధ రూపాలను, అవతారాలను మనం కీర్తిస్తాం, ఆరాధిస్తాం. విజయదశమి నాడు, జగన్మాత దుష్ట రాక్షసులను సంహరించి విజయం సాధించిన రోజు కాబట్టి మనమంతా విజయదశమి పండుగను వేడుకగా జరుపుకుంటాం. విజయదశమి జరుపుకోవటంలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి భేదం ఉండవచ్చు కానీ హైందవులందరూ ఈ పండుగ జరుపుకుంటారు. విజయదశమి పండుగ దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపబడుతున్నది. మానవులలోనే దైవీ గుణాలుంటాయి, ఆసురీ గుణాలు ఉంటాయి. మనలోని ఆసురీ గుణాలను పోగొట్టుకుని, దైవీ గుణాలను వృద్ధి పరచుకోవాలి.ఈ విజయదశమి పండుగ జరుపుకోవడానికి మనకు అనేక కారణాలు కనిపిస్తాయి. కాలంలో వచ్చే మార్పులను బట్టి దైవ శక్తిని ఆరాధించటం ఒక భావన అయితే, మనలోని దైవ శక్తిని వృద్ధిపరచుకోవటం, సమాజం లో అందరితో అన్యోన్యంగా సహకరిస్తూ ఉండటం అన్నది మరొక అంశం. ఈ విజయదశమినాడే అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో కౌరవుల మీద విజయం సాధించి విజయుడు అయ్యాడు. శమీ వృక్షం మీద పెట్టిన తమ ఆయుధాలలో నుంచి తన గాండీవాన్ని తీసుకుని యుద్ధం చేసి విజయం సాధించాడు కనుక మనం ఈనాడు విజయదశమి పండుగ జరుపుకుంటున్నాం. ఈనాడు శమీవృక్షాన్ని పూజిస్తాం. ‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ! అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శిని’ అని చెప్తూ శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తాం. ఈ విజయదశమి పండగనాడు అందరూ కూడా ఈ శమీ పత్రాలను – శమీ వృక్షపు ఆకులను పెద్దలకు ఇచ్చి నమస్కరిస్తారు. పెద్దలు వాటిని తీసుకుని పిల్లలను ఆశీర్వదిస్తారు. ఈ విజయదశమి రోజునే శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించినందున, విజయదశమి రోజున ‘రామలీల‘ను ప్రదర్శిస్తారు. రావణ దహనం చేస్తారు. జగన్మాత ఆరాధన వలన, దుర్జనుల వలన సంఘానికి చేటు కలగకుండా, అధివ్యాధుల సమస్యలు లేకుండా దేశానికి భద్రత కలుగుతుంది. అందుకే సాక్షాత్తూ ఆ జగజ్జనని మనని పాలిస్తూ ఉన్నట్లుగా.. ఆమె పాలనలో మనందరం క్షేమంగా.. సుఖంగా ఉన్నట్లు భావించుకుందాం. పూజించుకుందాం. ‘‘అఖిలాండేశ్వరీ... చాముండేశ్వరీ.. పాలయమాం గౌరీ... పరిపాలయమాం గౌరీ...’’ అని ప్రార్థిస్తూ... మనల్ని పాలించమని అమ్మను వేడుకుందాం. మహిషం అంటే దున్నపోతు, జంతువు. మహిషాసురుడు అంటే జంతు తత్వం కలిగినటువంటి వాడు. రాజస తామస గుణాలకు ప్రతీకలు రాక్షసులు. మహిషాసురుడిని, చండ ముండులను, శుంభ, నిశుంభులను జగన్మాతసంహరించింది అంటే, మనలోనే ఉన్న కామ క్రోధాది అరిషడ్వర్గాలను, లోభ మోహాలను, అహంకారాన్ని నశింప చేసుకోవాలి అని గ్రహించాలి. చండ ముండాది రాక్షసులు దుర్మార్గమైన, ధర్మ విరుద్ధమైన బలదర్పాలకు ప్రతీకలు. కనుక అటువంటి బలహీనతలను జయించాలి. మనలోని రజోగుణాలను, తమో గుణాలను అరికట్టి, సత్వగుణాన్ని వృద్ధి పరచుకుని, శుద్ధ సత్వ గుణాన్ని పొందడానికి సాధన చేయాలి. అది ఈ జగన్మాతను నవరాత్రులలో ఆరాధించడం వలన సాధ్యపడుతుంది. శుద్ధ సత్వ గుణాన్ని వృద్ధి చేసుకుంటే దైవత్వాన్ని దర్శించగలుగుతాము, పొందగలుగుతాము. మథు, కైటభులు అనే రాక్షసులు అహంకార మమకారాలకు ప్రతీకలు. నేను, నాది అనే భావాలకు ప్రతీకలు. మధువు అంటే తేనె. అన్నింటి కంటే మనకు ఇష్టమైనది, తీయనైనది ఎవరికి వారే! ఒక్క నేను అనేది ఉంటే, అనేకమైన నావి, నా వారు, నా బంధువులు, నా అధికారం, నా పదవులు వంటి అనేకమైనవి బయలుదేరతాయి. ఒక్క తేనె చుక్క ఉంటే, అనేకమైన కీటకాలు చుట్టూ చేరినట్లుగా, ఒక్క నేనుకి, అనేకమైన – నావి అనేవి బయలుదేరతాయి. ఈ నేను, నాది అనే అహంకార, మమకార భావాలను సంహరించటమే మధుకైటభములను సంహరించటం. ధూమ్రాక్షుడు లేక ధూమ్రలోచనుడు అంటే పొగ బారిన, మసకబారిన కన్నులు కలవాడు, అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు అని అర్థం. కళ్ళు మసకబారినప్పుడు యదార్థం కనిపించదు. అలాగే అజ్ఞానం వలన జ్ఞానం బహిర్గతం కాదు. వివేక జ్ఞానం ఉదయించదు. కనుక మనలోని ఆ అజ్ఞానాన్ని సంహరించాలి. రక్తం అంటే రాగం, మోహం. రక్తబీజుడు అంటే ఎంత వద్దనుకున్నా మోహం ఆనే బీజం మొలకెత్తుతూనే ఉంటుంది. అందుకే కాళికాదేవి తన పెద్ద నాలుకను చాపి, ఆ రక్తబీజుని శరీరం నుంచి కారే రక్తబిందువులను మింగేసి, ఇంక మళ్ళీ రక్తబీజులు పుట్టే అవకాశం లేకుండా చేసింది. అప్పుడు జగన్మాత వాడిని సంహరించింది. అలాగే మనలోని రాగద్వేషాలను పూర్తిగా ఎప్పుడైతే మనం జయిస్తామో, అప్పుడు జగన్మాత దర్శనం మనకు ప్రాప్తిస్తుంది. విజయదశమి దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపుకుంటున్న పండగ. ఇప్పుడు రాక్షసులు లేకపోవచ్చు కానీ, మానవులలోనే దైవీ గుణాలుంటాయి, ఆసురీ గుణాలు ఉంటాయి. మనలోని ఆసురీ గుణాలను పోగొట్టుకుని, దైవీ గుణాలను వృద్ధి పరచుకోవాలి. – డా. తంగిరాల విశాలాక్షి, విశ్రాంత ఆచార్యులు -
‘బిగ్ దసరా సేల్’లో అదిరిపోయే ఆఫర్లు
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో భారీ సేల్కు సిద్ధమైంది. దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ‘బిగ్ దసరా సేల్’ పేరుతో ఈ నెల 22 నుంచి 29 వరకు ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో భాగంగా ఆయా బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లపై షాపింగ్ చేసిన కస్టమర్లకు పది శాతం డిస్కౌంట్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు పది శాతం ఈ నెల 21 నుంచి డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఇక,సూపర్ కాయిన్ల ద్వారా ఐదు శాతం అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చునని తెలిపింది. దసరా సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, హోం అప్లయెన్సెస్, దుస్తులపై ఆఫర్లు అందచేస్తున్న ఫ్లిప్ కార్ట్ .. పలు కంపెనీలకు చెందిన అన్నీ రకాల స్మార్ట్ఫోన్లపై ఆఫర్లను అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. ఐఫోన్ 14తోపాటు పలు స్మార్ట్ ఫోన్లపై త్వరలో ఆఫర్లు ప్రకటించనున్నది. కాగా, ఫ్లిప్‌కార్ట్ కొద్ది రోజుల క్రితం బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో కొనుగోలు దారులకు ఆఫర్లను అందించిన విషయం తెలిసిందే. -
రాష్ట్రంలో దసరా అమ్మకాల జోష్
సాక్షి, అమరావతి: దసరా పండుగ వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మరో ఇరవై రోజుల్లో దీపావళి పండుగ ఉంది. దీంతో రాష్ట్రమంతా పండగ వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనతో అన్ని రంగాలూ అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా పెరిగింది. ప్రజలు జోరుగా పండగ షాపింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా వ్రస్తాలు, బంగారం, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ దుకాణాలు, వాహనాల షోరూమ్‌లు కిటకిటలాడుతున్నాయి. పలు వ్యాపార సంస్థలు వివిధ రకాల ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ప్రజల్లో కొనుగోళ్ల శక్తి పెరిగిందనడానికి ఈ అమ్మకాలే నిదర్శనమని వ్యాపారులు చెబుతున్నారు. దసరాకు తోడు పెళ్లిళ్ల సీజన్ జత కావడంతో ఊహించిన దానికంటే అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని నెల్లూరుకు చెందిన రుక్మిణి సిల్‌్క్స ప్రతినిధి మురళి ‘సాక్షి’కి తెలిపారు. ‘బంగార’మైనా కొనాల్సిందే.. పండుగలకు తోడు పెళ్లిళ్లు కూడా ఉండటంతో బంగారం విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. పలు జ్యూవెలరీ సంస్థలు భారీ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో బంగారం ధరలు తగ్గిపోవడంతో ప్రజలు పండుగ, పెళ్లిళ్ల కొనుగోళ్లు ముందుగానే చేసినట్లు బంగారం వ్యాపారులు చెబుతున్నారు. సెప్టెంబర్ నెలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000 నుంచి రూ.53,000కు పడిపోయిందని, అందువల్ల అప్పుడు ఎక్కువగా నగలు కొన్నారని బంగారం వ్యాపారి మోహన్ రెడ్డి తెలిపారు. మళ్లీ ధర పెరగడంతో అమ్మకాలు కొంత తగ్గాయి. ప్రపంచ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు ఇప్పట్లో తగ్గవన్న సంకేతాలు వెలువడుతుండటంతో తిరిగి అమ్మకాలు పెరుగుతున్నాయని మోహన్ రెడ్డి చెప్పారు. రిటైల్ సంస్థల భారీ ఆఫర్లు రిటైల్ సంస్థలు వినియోగదారులను ఆకర్షించడానికి పలు ఆఫర్లను ప్రకటించడమే కాకుండా భారీగా ప్రచారం చేపట్టాయి. గతేడాదికంటే ఈ ఏడాది అమ్మకాలు బాగున్నాయని ఏసీలు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజరేటర్లు వంటి వస్తువులకు భారీగా డిమాండ్ ఉందని సోనోవిజన్ ప్రతినిధి తెలిపారు. సాధారణంగా ఈ సమయంలో ఏసీల అమ్మకాలు తక్కువగా ఉంటాయని, కానీ ఈ ఏడాది మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వీటికి డిమాండ్ ఉందని తెలిపారు. ఇదే సమయంలో అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్ వంటి ఆన్లైన్ రిటైల్ సంస్థలు కూడా భారీ ఆఫర్లు ప్రకటించడంతో ఆన్లైన్ అమ్మకాలు కూడా జోరుమీద కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరి్థక వ్యవస్థను పరుగులు పెట్టించే విధంగా తీసుకుంటున్న చర్యలకు తోడు ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగేలా పలు పథకాలను ప్రవేశపెట్టడంతో అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయని, దీనికి రాష్ట్ర జీఎస్టీలో నమోదవుతున్న రెండంకెల వృద్ధి రేటే నిదర్శనమని రాష్ట్ర పన్నుల ప్రధాన అధికారి గిరిజా శంకర్ చెప్పారు. దూసుకుపోతున్న ఆటోమొబైల్ మార్కెట్ దసరా–దీపావళి పండుగల సీజన్లో ఆటోమొబైల్ మార్కెట్ దూసుకుపోతోందని డీలర్లు చెబుతున్నారు. గతేడాది దసరా–దీపావళి సీజన్లో 73,240 ద్విచక్ర, 7,772 కార్ల అమ్మకాలు జరిగాయని, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ చూస్తుంటే ఈ సీజన్లో అమ్మకాలు భారీగా జరిగే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 33,094 బైక్‌లు, 4,212 కార్ల అమ్మకాలు జరిగాయని చెప్పారు. ఈ రెండు పండుగల సమయంలో బైక్‌ల అమ్మకాలు లక్షకు పైగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. కోవిడ్ తర్వాత దెబ్బతిన్న మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందంటున్నారు. -
దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దసరా సీజన్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సత్రగచ్చి–బెంగళూరు (06286) రైలు ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు సత్రగచ్చిలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు బెంగళూరు చేరుతుంది. చైన్నై సెంట్రల్–భువనేశ్వర్ (06073) రైలు ఈ నెల 23, 30, నవంబర్ 6 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్లో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06074) ఈ నెల 24, 31, నవంబర్ 7 తేదీల్లో రాత్రి 9 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుతుంది. చెన్నై సెంట్రల్–సత్రగచ్చి (06071) రైలు ఈ నెల 28, నవంబర్ 4 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్లో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు సత్రగచ్చి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06072) ఈ నెల 23, 30, నవంబర్ 6 తేదీల్లో ఉదయం 5 గంటలకు సత్రగచ్చిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. భువనేశ్వర్ న్యూ–బెంగళూరు (06288) రైలు ఈ నెల 22న ఉదయం 8.15 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. నాందేడ్–పానిపట్ (07635) రైలు ఈ నెల 26న ఉదయం 5.40 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.15 గంటలకు పానిపట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07636) ఈ నెల 27న మధ్యాహ్నం 3.15 గంటలకు పానిపట్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 7.30 గంటలకు నాందేడ్ చేరుతుంది. పునరుద్ధరించిన రైళ్లు ఇవే... నిర్వహణ పనుల కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 23–26 వరకు విజయవాడ–గుంటూరు (07783), గుంటూరు–మాచర్ల (07779), మాచర్ల–నడికుడి (07580), నడికుడి–మాచర్ల (07579), మాచర్ల–గుంటూరు (07780), గుంటూరు–విజయవాడ(07788) రైళ్లను పున రుద్ధరించినట్లు చెప్పారు. -
ఆర్టీసీకి ‘ఎన్నికల గిరాకీ’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ ఆర్టీసీకి మంచి బేరం దొరుకుతోంది. ఆర్టీసీ బస్సుల బుకింగ్ రాజకీయ పార్టీలకు మంచి వెసులుబాటుగా ఉంటుండగా, సంస్థకు సైతం లాభసాటిగా మారుతోంది. గత నెల రోజుల వ్యవధిలోనే రాజకీయ పార్టీలు తమ సభలకు దాదాపు 12 వేల వరకు బస్సులను బుక్ చేసుకున్నాయి. భలే మంచి ఆదాయ మార్గం.. ఆర్టీసీ బస్సులకు పండుగ రోజులు, శుభ ముహూర్తాలున్న రోజుల్లోనే ఆక్యుపెన్సీ రేషియో మెరుగ్గా ఉంటుంది. మిగతా రోజుల్లో సగటున 62 శాతం నుంచి 65 శాతం వరకు ఉంటుంది. అయితే, రాజకీయ సభలకు బస్సులను అద్దెకిస్తే మంచి ఆదాయం వస్తుంది. వారికి అద్దెకిచ్చిన సమయంలో బస్సుల్లో ఎంతమంది ఎక్కారన్న సంఖ్యతో నిమిత్తం లేకుండా.. 100 శాతం ఆక్యుపెన్సీ రేషియోను లెక్కగడ తారు. అంటే.. ప్రతి సీటుకు టికెట్ జారీ చేసినట్టన్న మాట. ఈ లెక్కన ఒక్కో బస్సుకు రూ.20 వేల నుంచి 24 వేల వరకు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం దసరా పండుగ రద్దీ అధికంగా ఉంది. మరమ్మతుల కోసం డిపోలకే పరిమితమైన బస్సులను కూడా సిద్ధం చేసి ప్రయాణికుల కోసం పంపుతుంటారు. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో తప్ప, సాధారణ రోజుల్లో వీలైనన్ని బస్సులను అధికారులు పార్టీలకు కేటాయిస్తున్నారు. పార్టీలకు అద్దెకివ్వటం ద్వారా ఆదాయం ఎక్కువగానే వస్తున్నా.. ఆర్టీసీ మాత్రం తొలి ప్రాధాన్యం ప్రయాణికుల సేవకే ఇస్తుండటం విశేషం. గత నెల కొల్లాపూర్‌లో ముఖ్యమంత్రి పర్యటించిన సందర్భంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. దానికి దాదాపు 2 వేల బస్సులను బుక్ చేశారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈనెల మొదటి వారంలో రెండు రోజుల తేడాతో రెండు పర్యాయాలు రాష్ట్రానికి వచ్చారు. ఆ సందర్భంలో మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో భారీ బహి రంగ సభలు నిర్వహించారు. వీటికి దాదాపు రెండు వేల బస్సులను బుక్ చేశారు. రాహుల్‌గాంధీ ఇటీ వల తెలంగాణ పర్యటనలో నిర్వహించిన సభలకు కూడా ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తు న్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల, జడ్చర్ల, భువనగిరి, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేశారు. వీటిల్లో కొన్నింటికి ప్రైవేటు వాహనాలను బుక్ చేస్తే, కొన్నింటికి ఆర్టీసీ బస్సు లను బుక్ చేశారు. ఇటీవల కేంద్రమంత్రులు రాజ్ నాథ్‌సింగ్, అమిత్‌షాలు బహిరంగ సభలు నిర్వ హించారు. గత నెల రోజుల్లో అన్ని పార్టీలు దాదాపు 12 వేలకుపైగా బస్సులను బుక్ చేసుకున్నట్టు సమాచారం. ఒక్కో బస్‌కు సగటున రూ.20 వేల చొప్పున చెల్లిస్తుండటంతో వీలైనన్ని బస్సులను అద్దెకివ్వటం ద్వారా ఆదాయాన్ని పొందే ప్రయ త్నంలో ఆర్టీసీ ఉంది. దసరా, దీపావళి, క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి లాంటి పండుగల వేళ ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ఆ సంస్థ 100 రోజుల ఫెస్టివల్ చాలెంజ్ పేరుతో సిబ్బందికి ప్రత్యేక టార్గెట్లను కేటాయించింది. ఇందులో ఎన్నికల అంశాన్ని కూడా చేర్చటం విశేషం. రాజకీయ పార్టీలకు బస్సులను అద్దెకివ్వటం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందాలన్న ఆదేశాలు మౌఖికంగా వెలువడ్డాయి. పార్టీలకు కూడా సౌలభ్యమే.. పెద్ద నేతలు పాల్గొన్న బహిరంగ సభలకు పార్టీ నేతలు భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. ఇందుకు వారికి వందల సంఖ్యలో వాహనాలు అవసరమవుతాయి. ప్రైవేటు వాహనాలను సమీకరించుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. అదే ఆర్టీసీ బస్సులయితే కావాల్సినన్ని సిద్ధంగా ఉంటాయి. దీంతో ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవటం వారికి వెసులు బాటుగా మారింది. పైగా వ్యాన్లు లాంటి ప్రైవేటు వాహనాల ఖర్చుతో పోలిస్తే, ఆర్టీసీ బస్సుల ఛార్జీనే తక్కువగా ఉంటుంది. -
ఎలాగైనా.. ఊరికి పోవాల్సిందే!
నగర దారులన్నీ పల్లె‘టూరు’ దారి పడుతున్నాయ్. బస్సూ, రైలూ, కారూ, బైకూ.. ఏదైనా సరే ఊరికి పోవడమే లక్ష్యం. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం దసరా పండగ కావడంతో శనివారం పట్నవాసులు పల్లెలకు పయనమయ్యారు. సొంతూరిని ఓసారి మనసారా చూసొద్దామని ఆశగా బయలుదేరారు. నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర బస్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. – సాక్షి, స్టాఫ్‌ఫొటోగ్రాఫర్ -
బస్సులు ఫుల్, చార్జీలు డబుల్
కర్ణాటక: రాష్ట్రంలో ఆర్టీసీ కోసం కొత్తగా 5,675 కొత్త బస్సులు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. శనివారం సీఎం నివాస కార్యాలయం కృష్ణాలో రవాణా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. బడ్జెట్లో కొత్త బస్సుల కొనుగోలుకు రూ.500 కోట్లు కేటాయించాం, కొనుగోలు ప్రక్రియనే త్వరలోనే పూర్తి చేయాలని సూచించారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం శక్తి వల్ల బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య 15 శాతం పెరిగింది, రద్దీని తట్టుకొనేలా బస్సులను అందుబాటులోకి తేవాలన్నారు. వాహన తనిఖీల ద్వారా రూ.83 కోట్లు జరిమానా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో రవాణా, దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి పాల్గొన్నారు. బనశంకరి: దసరా పండుగ నేపథ్యంలో ప్రజలు స్వంత ఊర్ల బాటపట్టగా ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు టికెట్ బుకింగ్ ధరలు గణనీయంగా పెరిగాయి. లగ్జరీ/ ఏసీ బస్ చార్జీలు రెట్టింపు అయ్యాయి. బెంగళూరు మెజస్టిక్, మైసూరు రోడ్డు, శాంతినగరలో గల కేఎస్ఆర్టీసీ బస్టాండులు ప్రయాణికులతో నిండిపోయాయి. ప్రైవేటు బస్సులు యజమానులు సైతం ఎక్కువ సంఖ్యలో సర్వీసులు నిర్వహించారు. సొంతూర్లకు నగరవాసులు దసరా వల్ల శనివారం నంచి మంగళవారం వరకూ వరుసగా సెలవులు రావడంతో ఐటీ, బీటీ, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సొంతూళ్ల బాటపట్టారు. లక్షలాది మంది బస్సులు, క్యాబ్‌లు, సొంత కార్లలో బయల్దేరడంతో నగరంలో ప్రధాన రోడ్లలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలామంది శుక్రవారం సాయంత్రమే కుటుంబసమేతంగా బయలుదేరి వెళ్లారు. అలాగే మైసూరు రోడ్డు, తుమకూరురోడ్డు, హోసూరు, అనేకల్ రోడ్లలో ట్రాఫిక్రద్దీ ఏర్పడింది. బెంగళూరులో మెజస్టిక్, మైసూరు రోడ్డు, శాటిలైట్ బస్టాండు, శాంతినగర, జయనగర బస్టాండ్లు కిటకిటలాడాయి. సాధారణ బస్సుల్లో సీట్ల కోసం తొక్కిసలాట ఏర్పడింది. రైళ్లు సైతం ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. అలాగే తిరిగి వచ్చేవారి కోసం అక్టోబరు 24 నుంచి 29 మధ్య ఇతర నగరాల నుంచి బెంగళూరుకు ప్రత్యేక బస్సులు వేశారు. టికెట్‌పై రూ. వెయ్యి వరకూ పెంపు శనివారం ఉదయం నుంచి పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు చైన్నె, కేరళ, హైదరాబాద్‌కు ఎక్కువ ప్రయాణాలు మొదలయ్యాయి. టికెట్ ధరను రూ.500 నుంచి 1000 పెంచారు. పండుగ సాకుతో బస్సుల యజమానులు దోచేస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. ప్రైవేటు బస్సుల్లో బెంగళూరు నుంచి కొచ్చికి టికెట్ చార్జి రూ.3,500 , హైదరాబాద్ –బెంగళూరు, ముంబై–బెంగళూరుకు రూ.3,500గా నిర్ణయించారు. పండుగలకు ఊళ్లకు వెళ్లనివారు కొడగు, చిక్కమగళూరు, ఊటి, మైసూరు, పుదుచ్చేరి తదితర టూర్లకు వెళ్తున్నారు. బెంగళూరు నుంచి ఒకరికి రూ.30 వేల నుంచి రూ.50 వేల మధ్య ప్యాకేజీలు ఉన్నట్లు ట్రావెల్‌ఏజెంట్లు తెలిపారు. -
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. ‘ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం.. నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారు చెడుపై.. మంచి, దుష్ట శక్తులపై.. దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలి. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ఉండాలి’ అని సీఎం జగన్ ఆకాంక్షించారు. -
శోభాయమానంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవీ శరన్నవరాత్రులు (ఫొటోలు)
-
పోటెత్తిన దసరా రద్దీ
హైదరాబాద్: దసరా రద్దీ పోటెత్తింది. రైల్వేస్టేషన్లు, బస్టేషన్లు, నగర శివారు కూడళ్లలో శుక్రవారం ప్రయాణికుల రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే రైళ్లు, బస్సులు కిక్కిరిశాయి. సొంత వాహనాలపైనా నగరవాసులు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం దసరా కావడంతో సొంతూరి బాట పట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో మహాత్మాగాంధీ, జూబ్లీబస్స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున రద్దీ కనిపించింది. ఉప్పల్, ఎల్బీనగర్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో జిల్లాలకు వెళ్లే బస్సులు కిక్కిరిసి బయలుదేరాయి. ఆర్టీసీ 5,250కి పైగా ప్రత్యేక బస్సులు.. దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ 5,250కి పైగా బస్సులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందించింది. రోజువారీ రాకపోకలు సాగించే సుమారు 3,500 బస్సులతో పాటు ఇప్పటి వరకు 1,700కు పైగా బస్సులను అదనంగా నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగనుంది. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే రైళ్లు కూడా కిటకిటలాడాయి. రెగ్యులర్ రైళ్లలో చాలా రోజుల క్రితమే రిజర్వేషన్లు బుక్ కావడంతో చాలామంది జనరల్ బోగీలను ఆశ్రయించారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే సాధారణ బోగీలు సైతం ప్రయాణికులతో నిండిపోయాయి. అదనంగా 600 రైళ్లు.. సాధారణంగా ప్రతి రోజు సుమారు 85 ఎక్స్‌ప్రెస్ రైళ్లు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. మరో వంద ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సంక్రాంతి వరకు సుమారు 600 సర్వీసులను అదనంగా నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలను గుర్తించి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, కర్నూలు, విశాఖ, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సుమారు 1.85 లక్షల మంది రైళ్లలో ప్రయాణం చేస్తారు. పండుగ సెలవుల దృష్ట్యా గత మూడు రోజులుగా ప్రతి రోజు సుమారు 25వేల మంది అదనంగా ప్రయాణం చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రైవేట్ బస్సుల దోపిడీ.. ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్ బస్సులు రంగంలోకి దిగాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు లభించని దూరప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల్లో వెళ్తున్నారు. దీంతో సాధారణ రోజుల్లో విధించే చార్జీలను రెట్టింపు చేసి వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి విశాఖకు రూ.980 వరకు చార్జీ ఉంటే రూ.1600కు పైగా వసూలు చేస్తున్నారు. విజయవాడకు రూ.450 నుంచి రూ.800కు పెంచారు. ఒక్కో ట్రావెల్ సంస్థ ఒక్కో విధమైన చార్జీ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రైవేట్ బస్సుల్లో చార్జీలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. సొంత వాహనాల్లోనూ.. బస్సులు, రైళ్లతో పాటు కార్లు, బైక్‌లు వంటి సొంత వాహనాల్లోనూ నగరవాసులు పల్లెబాట పట్టారు. టాటాఏస్, మ్యాక్సీ క్యాబ్‌లు భారీగా బయలుదేరాయి. దీంతో పలు టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి. గంటలతరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే రద్దీ కొనసాగనుంది. రహదారులపై వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు జాగ్రత్తగా నడపాలని ఆర్టీఏ అధికారులు సూచించారు. -
Vijayawada: దసరా శరన్నవరరాత్రులు ఇంద్రకీలాద్రిలో భక్తుల రద్దీ (ఫొటోలు)
-
దసరా పండగ.. ఒకప్పుడు అలా చేసుకునేవారు, కాలం మారిందిగా
దసరా అంటే సెలవులు. దసరా అంటే అయ్యవార్లతో పిల్లలు కలిసి వెళ్లి పాడే పాటలు. దసరా అంటే పగటి వేషాలు. దసరా అంటే బతుకమ్మలు.దసరా అంటే బొమ్మల కొలువులు. దసరా అంటే ఊళ్ల నుంచి విచ్చేసే బంధువులు.జేబు నుంచి తీసి ఇవ్వాల్సిన ఆత్మీయ మామూళ్లు. దసరా అంటే స్త్రీ, పురుషులకు ఉల్లాసం.పిల్లలకు ఆటవిడుపు. కాలం చాలా మారింది. నాటి దసరా ఎలా ఉంటుందో నేటి తరాలకు పదే పదే చెప్పాల్సిన అవసరం ఏర్పడింది.పెద్దలకు గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా. ‘ఏ దయా మీ దయా మా మీద లేదు ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు పావలా అర్ధయితే పట్టేది లేదు ముప్పావులా అయితే ముట్టేది లేదు హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు’... ఒకప్పుడు దసరా వస్తే పిల్ల దండును వెంట బెట్టుకుని అయ్యవార్లు బయలుదేరేవారు. ఇంటింటికి తిరిగేవారు. మామూళ్లు స్వీకరించేవారు. ఆ రోజుల్లో ఊళ్లలో బడి కొత్త. చదువు కొత్త. అయ్యవార్లకు జీతాలు అంతంత మాత్రం. సంవత్సరంలో నేర్పిన విద్య దసరా సెలవుల్లో పెద్దల ముందు అయ్యవార్లు పిల్లల చేత ప్రదర్శింపచేసేవారు. పిల్లల తెలివితేటలు చూసి పెద్దలు ముచ్చట పడేవారు. బడికి చందాలు, అయ్యవార్లకు మామూళ్లు ఇచ్చేవారు. ఆ సమయంలో ఇలా పైన రాసిన పాట పాడేవారు. ఇంతకీ వరహా అంటే మూడున్నర రూపాయి. దసరా కోసం పిల్లలు ఎదురు చూసేవారు. ఆ సమయంలో పిల్లల్ని బంధువుల వద్దకు పంపుతామనే హామీ ఉండేది. అవ్వా, తాతల దగ్గరికో, బాబాయి దగ్గరికో, మేనత్త ఊరికో నాలుగు జతలు పెట్టుకుని పిల్లలు ఉత్సాహంగా వెళ్లేవారు. దసరా సెలవులు హాయిగా గడిపేవారు. దసరా వేషాలు దసరాలో పిల్లలకు, పెద్దలకు ఆసక్తి దసరా వేషాలు. చాలామంది కళాకారులు పురాణ వేషాలు కట్టి ఇళ్ల ముందుకు వచ్చి కానుకలు స్వీకరించేవారు. పిల్లలకు ఈ వేషాలు చూడటం మహా సరదా. సీతారాములు, హనుమంతుడు, నారదుడు, శివుడు, అర్ధ నారీశ్వరుడు... ఇక పులి వేషాలు తప్పనిసరి. ఆ రోజుల్లో పులిని చూడటం అరుదు కాబట్టి (సినిమాల్లో తప్ప) మనిషే పులి రూపు కట్టి ఎదురు పడితే అబ్బురపడేవారు. తప్పెట్ల మోతకు వేషగాళ్లు లయబద్ధంగా ఆడుతుంటే నోరు తెరిచి చూసేవారు. నేలన పడేసిన రూపాయి కాసునో నిమ్మకాయనో పులి వేషగాడు నోట కరవడం ఒక ఘట్టం. దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతాయి కదా. అలా ఎవరైనా ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటే ‘దసరా బుల్లోడు’ అనడం ఆనవాయితీ. బొమ్మల కొలువులు ఇక బొమ్మల కొలువు పెట్టి ఆనందించడం ఆడపిల్లల వంతు. బొమ్మల కొలువును ఎప్పుడూ బేసి సంఖ్య మెట్ల మీద ఏర్పాటు చేస్తారు. ఇంటి ఆచారాన్ని బట్టి ఇంటి ఆడపిల్ల చేత పార్వతీ పరమేశ్వరులను గాని, సీతారాములను గాని, రాధాకృష్ణులను గాని, లక్ష్మీ సరస్వతులను గాని పెట్టిస్తారు, అమ్మాయి మొదటి దేవతామూర్తిని పెట్టాక, ఆ యేడు కొన్న కొత్త బొమ్మను తల్లి కూడా పట్టుకుని పెట్టిస్తుంది. ప్రతి ఏడు ఒక కొత్త బొమ్మ తప్పనిసరిగా కొనడం ఆచారం. ఈ క్రమంలోనే, కొండపల్లి బొమ్మలు, నక్కపల్లి బొమ్మలతో పాటు దేశదేశాల బొమ్మలు సేకరించి బొమ్మల కొలువులో పెట్టడం వ్యాప్తి లోకి వచ్చింది. అందంగా, కళాత్మకంగా అమర్చిన బొమ్మల కొలువు పేరంటానికి బంధు మిత్రులను పిలిచి తొమ్మిది రోజులూ పేరంటం చేస్తారు. పేరంటానికి పిల్లలూ పెద్దలూ కూడా వస్తారు. బొమ్మలకు హారతి ఇచ్చి ప్రసాదం పంచిపెడతారు. బతుకమ్మ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండగ బతుకమ్మ. బతుకమ్మ పండగ వస్తుందంటే తెలంగాణ పల్లెల్లో నూతన ఉత్సాహం వెల్లి విరుస్తుంది. అది ఒక పెద్ద సంబరంగా భావిస్తారు. ఇళ్ళు శుభ్రపరుస్తారు. చక్కగా అలంకరించు కుంటారు. ఆడపిల్లల్ని పుట్టింటికి తీసుకు వస్తారు. అత్తగారింట్లో వుండే ప్రతి ఆడపిల్లా పుట్టింటికి వెళ్లడం కోసం ఎదురు చూస్తుంటుంది. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ బతుకమ్మలను నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. -
మాదాపూర్ ఎన్ కన్వెన్షన్‌లో దాండియా ఆడుతున్న హామ్స్టిక్ విద్యార్థులు (ఫొటోలు)
-
Indrakeeladri : వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. నాందేడ్–కాకినాడ టౌన్ (07061) రైలు ఈ నెల 20న సాయంత్రం 4.30 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. హైదరాబాద్–కటక్ (07165) రైలు ఈ నెల 24న రాత్రి 8.10 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 5.45 గంటలకు కటక్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07166) ఈ నెల 25న రాత్రి 10.30 గంటలకు కటక్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. -
దసరా సెలవులు : ఊరు బాట పట్టిన నగరవాసులు (ఫొటోలు)
-
AP: 24న దసరా సెలవు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ఈ నెల 24న దసరా సెలవు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఏపీలోని పాఠశాలలకు అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తిరిగి అక్టోబరు 25న పాఠశాలలు తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 11 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సారి విజయదశమి(దసరా) 5,500 ప్రత్యేక సర్వీసులను ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నడుపుతోంది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 26వ దాకా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు.. సాధారణ ఛార్జీలతోనే ఈ సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ నడిపిస్తోంది. ఎప్పుడు.. ఎక్కడి నుంచంటే.. 13 నుంచి 22 దాకా.. దసరా ముందు రోజులలో 2,700 బస్సుల్ని, అలాగే.. పండుగ దినాలైన 23వ తేదీ నుంచి 26 దాకా(పండుగ ముగిశాక కూడా) 2,800 బస్సుల్ని నడిపించనుంది. హైదరాబాద్ నుండి 2,050 బస్సులు, బెంగుళూరు నుండి 440 బస్సులు,చెన్నై నుండి 153 బస్సులువివిధపట్టణాలకు నడపబడతాయి. విశాఖపట్నం నుండి 480 బస్సులు, రాజమండ్రి నుంచి 355 బస్సులు, విజయవాడ నుండి 885 బస్సులు, అదే విధంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి వివిధ ప్రాంతాలకు/ పల్లెలకు/ నగరాలకు 1,137 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. చదవండి: చంద్రబాబు ప్లాన్ రివర్స్.. టీడీపీ క్యాడర్‌కు కొత్త టెన్షన్! -
Dasara Navaratri Utsavalu : ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరరాత్రులు (ఫొటోలు)
-
అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, నిత్య పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శించుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించిన విశేష ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలలో భాగంగా దుర్గమ్మకు అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానం నుంచి పట్టువ్రస్తాలను సమర్పించారు. అన్నవరం దేవస్థాన ఈవో, దుర్గగుడి దసరా ఉత్సవాల ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ఎస్.చంద్రశేఖర్ ఆజాద్ అమ్మవారికి సమర్పింంచేందుకు పట్టువ్రస్తాలను తీసుకురాగా, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ ఈవో కేఎస్ రామారావు సాదరంగా స్వాగతం పలికారు. ఉత్సవాల ఏర్పాట్లను సీపీ టీకే రాణా పర్యవేక్షించగా, ఆలయ ప్రాంగణంలో డీసీపీ విశాల్‌గున్ని క్యూలైన్లను పర్యవేక్షించారు. సాయంత్రం ఆది దంపతుల నగరోత్సవం కన్నుల పండువగా సాగింది. నగరోత్సవంలో ఆలయ చైర్మన్ రాంబాబు, ఈవో కెఎస్ రామారావు పాల్గొన్నారు. -
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు (ఫొటోలు)
-
AP Dussehra Holidays: నేటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు
చిలకలపూడి(మచిలీపట్నం): ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించినట్లు డీఈవో తాహెరాసుల్తానా శుక్రవారం తెలిపారు. మిషనరీ పాఠశాలకు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సెలవులు ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాలోని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సెలవు దినాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్లకు చెందిన పాఠశాలలు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. -
గవర్నర్‌కు దుర్గగుడి, శ్రీశైలం దసరా ఉత్సవాల ఆహ్వానాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/శ్రీశైలం టెంపుల్: విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా మహోత్సవాల ఆహా్వన పత్రికలను బుధవారం వేర్వేరుగా అందజేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావు, శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో డి.పెద్దిరాజు కలిసి ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. అనంతరం ఆలయాల అర్చకులు వేద ఆశీర్వచనం పలకగా, ఈవో, చైర్మన్లు స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డికి విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఆహా్వన పత్రిక అందజేశారు. శ్రీశారదాపీఠాధిపతులకు శ్రీశైలం నవరాత్రుల ఆహ్వానం సింహాచలం: విజయదశమిని పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానంలో జరిగే భ్రమరాంబికాదేవి శరన్నవరాత్రి మహోత్సవాల ఆహా్వన పత్రికను విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతికి బుధవారం అందజేశారు. ఉత్సవాల్లో పాల్గొనాలని దేవస్థానం పండితులు, అధికారులు కోరారు. ఫిబ్రవరిలో చేపడుతున్న ఆలయ కుంభాభిషేకం గురించి వివరించారు. వైదిక, ఆగమ పద్ధతులను కచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా ఈవో పెద్దిరాజుకు స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు. -
విజయవాడ : సాంస్కృతిక సంబరం అంబరాన్నంటింది (ఫొటోలు)
-
ఏపీలో 14 నుంచి దసరా సెలవులు
సాక్షి, అమరావతి: ఈ నెల 14 నుంచి 24 వరకు ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు. ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతాయి. ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజు మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు పంపిస్తారు. పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు ప్రశ్నాపత్రాలు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం సమయంలో. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మద్యాహ్నం పరీక్షలు ఉంటాయి. ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్ధులకు అందిస్తారు. అలాగే ఆన్లైన్ పోర్టల్లోనూ మార్కులు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలని సూచించింది. -
విజయవాడ : గార్బా అండ్ దాండియా 2023 ప్రీ ఈవెంట్ (ఫోటోలు)
-
నాటుకోళ్ల కోసం వెళ్లి... ముగ్గురు యువకులు దుర్మరణం
రాయగడ/మక్కువ: దసరా పండగకు నాలుగు డబ్బులు సంపాందించాలని బయలుదేరిన ముగ్గురి యువకులను మృత్యువు కాటేసింది. లోయ రూపంలో అందని లోకాలకు తీసుకుపోయింది. కుటుంబ సభ్యులకు కన్నీరుమిగిల్చింది. కొరాపుట్ జిల్లా నారాయణపట్నం సమితి లంగడ్బేడ గ్రామ సమీపంలో బుధవారం జరిగిన దుర్ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మక్కువ మండలం దబ్బగెడ్డ పంచాయతీ అనసబద్ర గ్రామానికి చెందిన జన్ని బాలరాజు(21), మర్రి శివ(23), జయరాజు(22)లు బుధవారం ఉదయం కోళ్లు కొనుగోలు చేసేందుకు ఆంధ్రా సరిహద్దులోని ఒడిశా గ్రామాలకు వెళ్లారు. అక్కడ చౌకగా దొరికే కోళ్లు కొనుగోలుచేసి దసరా పండగకు స్థానికంగా విక్రయిస్తే నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చన్న ఆశతో స్కూటీపై ముగ్గురు యువకులు ఉత్సాహంగా వెళ్లారు. తిరిగి వస్తుండగా వీరి స్కూటీ నారాయణపట్నం సమితి లంగడ్బేడ వద్ద ఘాట్‌రోడ్డులో అదుపుతప్పింది. అంతే.. 120 అడుగుల లోతులో ఉన్న లోయలో పడి దుర్మరణం చెందారు. ఉదయాన్నే వెళ్లిన పిల్లలు ఇంకారాలేదన్న ఆతృతతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు మృతివార్త తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుల్లో బాలరాజు వలంటీర్‌గా పనిచేస్తుండగా, మిగిలిన ఇద్దరు యువకులు వ్యవసాయకూలీలు. శోకసంద్రంలో అనసబద్ర అనసబద్ర గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతితో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలరాజు తల్లిదండ్రులు నారాయణ, రత్నాలు వ్యవసాయకూలీలు. జయరాజు నాన్న సోమయ్య మృతిచెందగా, అమ్మ శైలజ ఉంది. ఇప్పుడు కొడుకు మృతివార్తను తట్టుకోలేదని ఆమెకు తెలియకుండా గ్రామస్తులు గోప్యంగా ఉంచారు. అన్నయ్య, అమ్మ నల్లమ్మతో కలిసి కుటుంబానికి చేదోడుగా ఉంటున్న శివ మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నారాయణపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం అక్కడి సీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ శుభవార్త
దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆయా తేదిల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయమున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది. “బతుక్మమ్మ, దసరా చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాలకు హైదరాబాద్ నుంచి ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కొరకు సంస్థ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ని సంప్రదించాలి.” టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సూచించారు. దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వాలని #TSRTC నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 21, 2023 -
విశాఖలోనూ సీఎం క్యాంపు కార్యాలయం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన ఎప్పుడు మొదలవుతుందనే అంశంపై కొంత కాలంగా సాగుతున్న చర్చకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెరదించారు. విశాఖపట్నంలోనూ సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి, దసరా నుంచి పరిపాలన ప్రారంభిద్దామని మంత్రులకు స్పష్టం చేశారు. సీఎం కార్యాలయం మొదలు వివిధ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలను గుర్తించేందుకు అధికారులతో ఒక కమిటీ వేస్తామని చెప్పారు. ఇక్కడి నుంచి విశాఖపట్నంకు కార్యాలయాల తరలింపునకు అధికారులతో మరో కమిటీ వేస్తామన్నారు. దసరాలోగా కార్యాలయాలను తరలించి.. పండుగ రోజునే విశాఖ కేంద్రంగా పరిపాలన మొదలు పెడతామని చెప్పారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో బుధవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. అజెండాలోని అంశాలపై చర్చ ముగిశాక సమావేశం నుంచి అధికారులు నిష్క్రమించారు. ఆ తర్వాత మంత్రులతో సీఎం వైఎస్ జగన్ సమకాలీన రాజకీయ పరిస్థితులపై చర్చించారు. దసరా పండుగను విశాఖపట్నంలోనే జరుపుకుందామని మంత్రులతో సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఆ రోజు నుంచి విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన మొదలు పెడతామనడంతో మంత్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమాలను సాక్ష్యాధారాలతో వివరిద్దాం స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. గురువారం నుంచి నిర్వహిస్తున్న శాసనసభ సమావేశాలను సీరియస్‌గా తీసుకోవాలని మంత్రులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. శాసనసభ వేదికగా అవసరమైతే టీడీపీ సర్కార్ హయాంలో చంద్రబాబు పాల్పడిన అక్రమాలపై.. స్కిల్ స్కామ్ నుంచి ఫైబర్ గ్రిడ్ కుంభకోణం వరకు అన్నింటిపై చర్చిద్దామన్నారు. టీడీపీ సభ్యులు శాసనసభ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వ అక్రమాలను సాక్ష్యాధారాలతోసహా ప్రజలకు వివరించడానికి సమావేశాలను ఉపయోగించుకుందామని ఉద్భోదించారు. కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా ప్రతిపాదిస్తున్న వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి మంత్రులు తీసుకెళ్లగా.. జమిలి ఎన్నికలపై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందామని పిలుపునిచ్చారు. ఎన్నికలకు మరో ఐదు నెలలు మాత్రమే సమయం ఉందనే అంశాన్ని మంత్రులకు సీఎం గుర్తు చేస్తూ.. ప్రజల్లో విస్తృతంగా తిరగాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ 52 నెలలుగా మనం చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని.. అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాల్పడిన అక్రమాలను కళ్లకు కట్టినట్లు వివరించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలన్నారు. సీఎం ఎక్కడి నుంచి పాలిస్తే అదే రాజధాని దసరా నుంచి విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు పెడదామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. సీఎం ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని. వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమన్నది మా విధానం. విశాఖపట్నంలో సీఎం కార్యాలయం నుంచి వివిధ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు తగిన భవనాలను గుర్తించేందుకు అధికారులతో కమిటీ వేస్తామని సీఎం చెప్పారు. దసరా నుంచి విశాఖే పరిపాలన రాజధాని. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి. -
దుర్గమ్మ దసరా ఆదాయం రూ.3.95 కోట్లు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన దసరా ఉత్సవాల్లో అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల లెక్కింపు ప్రారంభమైంది. మంగళవారం జరిగిన లెక్కింపులో రూ.3,95,06,500 నగదుతోపాటు 532 గ్రాముల బంగారం, 13.680 కిలోల వెండి లభించిందని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. 22 హుండీల ద్వారా ఈ ఆదాయం వచ్చిందన్నారు. మహా మండపం ఆరో అంతస్తులో నిర్వహించిన లెక్కింపులో సేవా సిబ్బందితోపాటు ఆలయానికి చెందిన వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. బుధ, గురువారాల్లోనూ కానుకల లెక్కింపు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. -
అంగరంగ వైభవంగా మైసూరు ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలు.. (ఫొటోలు)
-
రేవంత్‌రెడ్డి నివాసానికి కాంగ్రెస్ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: విజయదశమిని పురస్కరించుకొని బుధవారం జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసానికి పలువురు కాంగ్రెస్ ప్రముఖులు వచ్చారు. రేవంత్ ఇచ్చిన తేనేటి విందుకు ఏఐసీసీ నాయకులు దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేష్, కేవీపీ రాంచందర్‌రావు, మధుయాష్కీ, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ డాక్టర్ సి.రోహిణ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. చదవండి: (మునుగోడు బరిలో గద్దర్.. ఆ పార్టీ నుంచే పోటీ!) -
హాంగ్ కాంగ్లో వైభవంగా దసరా - సద్దుల బతుకమ్మ సంబరాలు
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు దసరా శరన్నవరాత్రులు ఎంతగానో ఇష్టంగా ఎదురుచూసే పండుగా అని చెప్పవొచ్చును . లలితా పారాయణం, బొమ్మల కొలువు, పేరంటాలు, గర్భాలు, దాండియా ఆటలతో పాటు బతుకమ్మ సంబరాలు కూడా విశిష్ట స్థానాన్ని పొందాయి. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు శరన్నవరాత్రులు - దసరా (విజయ దశమి) మరియు బతుకమ్మ పండుగలు జరుపుకుంటారు. శరన్నవరాత్రులు, తొమ్మిది రోజులలో, రోజు ఉదయం, సాయంత్రం, ఎవరింటీలో లలిత పారాయణం చేస్తారు అంటూ, ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు, ఏ రంగు అమ్మవారికి ఇష్టం.. ఎలాంటి నైవేజ్యం పెట్టాలి..ఇటువంటి వివరాలతో ఒక పట్టికను తయారు చేస్తారు, హాంగ్ కాంగ్ లాంటావ ద్వీపంలోని తుంగ చుంగ్ 'లలిత సహస్రనామం చాంటింగ్ గ్రూప్'. ఆ ప్రకారంగా వారు ప్రతి ఇంటా ఘనంగా అమ్మవారిని అందంగా అలంకరించి, మనసారా కొలిచి, అమ్మకు ప్రీతికరమైన నైవేద్యాలు పెడతారు. విచ్చేసిన ఆడపడుచులందరు పారాయణానికి వెళ్తూ, పూలు పండ్లు కాకుండా వారి శక్తికొలది ఒక డొనేషన్ బాక్స్ లో ధనాన్ని వేస్తారు. నవరాత్రులు పూర్తయ్యాక ఆ డబ్బులని మన దక్షిణ రాష్ట్రాలలోని ఏదైనా ఒకటి రెండు వృద్ధాశ్రమానికి లేదా అనాధ పిల్లల ఆశ్రమానికి విరాళంగా ఇస్తారు. ఈ గ్రూప్ ను ప్రారంభించిన శ్రీమతి సంధ్య గోపాల్ మాట్లాడుతూ ఇలా తామందరు కలసి మానవ సేవ - మాధవ సేవ చేసుకోగల్గుతున్నందుకు ఎంతో తృప్తిగా ఆనందంగా అనిపిస్తోందని అన్నారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. అంటే బెంగాలీ వారు దుర్గాష్టమి నాడు ఘనంగా వేడుక చేసుకున్నట్లు, తెలుగింటి ఆడపడుచులు సద్దులబతుకమ్మ వేడుకలు జరుపుకొంటారు. ఈ శుభకృత నామ సంవత్సరం, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆడపడుచులు, స్థానికంగా ఉన్న కఠినమైన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, ఎంతో వుత్సాహంగా సద్దుల బతుకమ్మను ఆరాధిస్తు బతుకమ్మ ఆడారు అని సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి తెలిపారు. తమ సమాఖ్య మహిళా విభాగం "సఖియా" సంయుక్త కార్యదర్శి శ్రీమతి కొండ నాగ మాధురి, శ్రీమతి జెఖ అశ్విని రెడ్డి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి రమాదేవి సారంగా, శ్రీమతి హర్షిణీ పచ్ఛంటి అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారని తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సద్దుల బతుకమ్మ పండుగ, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. హైద్రాబాద్ లో బతుకమ్మ సంబరాలు ఎంతో వైభావంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగడం తనకి మరింత ఉత్సాహాన్నిచ్చిందని, తన బంధు మిత్రులతో కలిసి ఆనందంగా బతుకమ్మ ఆడారని, అందమైన బొమ్మల కొలువులు చూశానని, లలిత దేవి పారాయణం - పేరంటాలకి వెళ్లానని చెప్పారు. చాలా కాలం తరువాత హైద్రాబాద్ లో ఈ పండుగ చేసుకోవడం ఒక మరపురాని మధుర జ్ఞాపకంగా ఉంటుందని ఆనందంగా తెలిపారు. త్వరలో తమ సమాఖ్య దీపావళి వేడుకలని ఘనంగా చేసే ఏర్పాట్లు చేస్తోందని సంతోషంగా ప్రకటించారు. -
దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు
-
జమ్మిబండ.. మన అండ!
ఖమ్మం గాంధీచౌక్ : శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ దసరా. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమిగా జరుపుకోవడం అనాదిగా ఆచారం. ప్రాంతాల వారీగా పండుగను వివిధ రూపాల్లో జరుపుకుంటుండగా... ఖమ్మంలో కూడా పండుగకు ప్రత్యేకత ఉంది. జిల్లాలోని కారేపల్లి మండలంలో కోట మైసమ్మ జాతర ఇదేరోజు ప్రారంభమవుతుంది. అలాగే, ఖమ్మం నగరంలో విజయదశమి రోజున జమ్మిబండపై ప్రత్యక్షమయ్యే శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని ప్రజలు దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దేవస్థానమే మూలంగా ఖమ్మం ఖమ్మంకు మూలం స్తంభాద్రి గుట్ట. శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధారంగానే ఖమ్మం ఆవిర్భవించిందని చరిత్ర చెబుతోంది. ప్రాచీన దివ్యక్షేత్రంగా శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వెలుగొందుతోంది. త్రేతాయుగంలో మౌద్గల్య మహాముని తన శిష్యులతో గుహలో తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమయ్యారని నమ్మిక. అప్పుడు స్వామిని ఈ కొండపై లక్ష్మీ సమేతుడవై కొలువై ఉండాలని ముని ప్రార్థించగా స్వామి దక్షిణ ముఖంగా గుహలో వెలిశాడు. స్తంభం నుంచి ఉద్భవించిన స్వామి కావడంతో ఈ క్షేత్రానికి స్తంభాద్రి అని పేరు స్థిరపడి, కాలక్రమంలో స్తంభాద్రిపురంగా, ఖమ్మం మెట్టుగా, ప్రస్తుతం ఖమ్మంగా వాడుకలో ఉంది. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ప్రతాపరుద్రుడి హయంలో ఆలయాన్ని లకుమారెడ్డి, వేమారెడ్డి సోదరులు నిర్మించినట్లు చరిత్ర పేర్కొంటోంది. ప్రతాప రుద్రుడి కాలం నుంచి.. ఖమ్మం నగరంలోని జమ్మిబండపై ఏటా విజయదశమి రోజున నిర్వహించే కార్యక్రమాలను ప్రభుత్వ లాంచనాలతోనే జరుపుతున్నారు. ప్రతాపరుద్రుడి కాలం మొదలు నిజాం నవాబు కాలంలో కూడా ఇది అమలవుతోంది. ప్రస్తుతం కూడా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ద్వారా విజయదశమి వేడుకలను నిర్వహిస్తుండగా, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం పాల్గొంటారు. ఆపద్బాంధవుడు నృసింహుడు ఆపదలో ఆదుకునే ఆపద్బాందవుడు లక్ష్మీనరసింహస్వామి. విజయదశమి రోజున స్వామి జమ్మిబండపై పారువేటకు ప్రత్యక్షమవుతారు. స్వామిని ఈ రోజు దర్శించుకుంటే శుభం జరుగుతుందని నమ్మిక. కాకతీయుల కాలం నుంచి ఇక్కడ విజయదశమి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. – నరహరి నర్సింహాచార్యులు, ప్రధాన అర్చకులు, శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రభుత్వ లాంఛనాలతో వేడుకలు ఖమ్మం జమ్మిబండపై విజయదశమి వేడుకలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తాం. స్తంభాద్రి గుట్టపై నుంచి పల్లకీలో స్వామిని బోయలు మోస్తూ జమ్మిబండపైకి తీసుకొస్తారు. పారువేట, శమీ పూజ, స్వామి వారి దర్శనం తర్వాత తిరిగి స్తంభాద్రి ఆలయానికి చేరుస్తాం. – కొత్తూరు జగన్మోహనరావు, ఈఓ, శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విజయ దశమి వేడుకలు బుధవారం జరుపుకోనున్నారు. ఖమ్మంలోని స్తంభాద్రి గుట్టపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఊరేగింపుగా బుధవారం సాయంత్రం 5:30 గంటలకు ప్రజల దర్శనార్థం తీసుకువస్తారు. స్వామి వారి వద్ద శమీ పూజలు నిర్వహించి, ప్రజల దర్శనం అనంతరం రాత్రి 9:30 గంటలకు తిరిగి స్తంభాద్రి ఆలయానికి గుట్టపైకి తీసుకుకెళ్తారు. నగరంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు జమ్మిబండపై స్వామి వారి దర్శనానికి బారులు తీరుతారు. ఇందుకోసం దేవాదాయ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాట్లుపూర్తిచేశారు. -
ఏపీ: రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సిరి సంపదలతో ఆనంద, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలన్నారు. ఈమేరకు సీఎం జగన్ తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జగన్మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సిరి సంపదలతో, ఆనంద, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2022 చదవండి: (సీఎం జగన్‌కు రుణపడి ఉంటా: విజయసాయిరెడ్డి) -
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు
-
విజయాలనిచ్చే విజయదశమి
-
ఏరులై పారనున్న మద్యం.. కల్తీ చేసేందుకు వేల జీతాలతో ప్రత్యేక సిబ్బంది
సాక్షి, వరంగల్: ఏడాదికోసారి వచ్చే పండుగ దసరా. ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు మాంసంతోపాటు మద్యంపై ఎనలేని మక్కువ చూపుతారు. ఏ పండుగకూ లేని విధంగా దసరాకు మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా గోదాంలలో ఎక్కువగా నిల్వ చేయడంతోపాటు మద్యం దుకాణాలకు కోటాకు మించి సరఫరా చేస్తుంది. కొందరు మద్యం ప్రియులు కూడా పండుగ అవసరాల కోసం ముందస్తుగానే భారీగా కొనుగోళ్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే పండుగ సందర్భంగా మద్యానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ వరంగల్‌తోపాటు జిల్లాలోని కొన్ని వైన్స్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు కల్తీకి పాల్ప డుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వేలకొద్దీ బాటిళ్ల మూతలు తీసి.. తక్కువ ధర ఉన్న మద్యం, నీళ్లు కలిపే తంతును కొనసాగిస్తున్నాయి. దసరా పండుగ సందర్భంగా రూ.లక్షల్లో లాభాలు ఆర్జించే దిశగా కొందరు వైన్స్ సిబ్బంది ప్రయత్నిస్తున్నా.. ఆబ్కారీ శాఖ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. మందును కల్తీ చేసేందుకు అనుభవజ్ఞులైన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని.. ఏరోజుకారోజు పని పూర్తి చేసేందుకు డబ్బులు ఇవ్వడంతోపాటు కొందరికి వచ్చే లాభాల్లో సగం వాటా ఇస్తామంటూ ఒప్పందాలు కుదుర్చుకొని పని కానిచ్చేస్తున్నారన్న టాక్ వస్తోంది. ఇటీవలి కాలంలో వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని ఓ వైన్స్‌లో కల్తీ జరుగుతుందంటూ ఎక్సైజ్ అధికారులు ఆ షాపును సీజ్ చేశారు. ఏడాదిలో తూతూమంత్రంగా ఏదో చేయాలన్నట్లుగా ఓ వైన్స్‌ను సీజ్ చేసిన అధికారులు నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్‌లోని అనేకచోట్ల కల్తీ జరుగుతున్నా పెద్దగా పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నారు. వారంతా ‘మామూలు’గా చూసుకుంటుండడంతోనే అలా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైన్స్‌లు కూడా సమయపాలన లేకుండా నడుపుతున్నా చర్యలు తీసుకోవడం లేదనే మాటలు ప్రజల నుంచి వస్తున్నాయి. అంతేకాక మద్యం కల్తీ కావడం వల్ల ఎంత తీసుకున్నా కిక్కు ఎక్కడం లేదని కొందరు మద్యంబాబులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. మూతలు తీసేటోళ్లకు పండుగే.. దసరా పండుగ వేళ మద్యం కిక్కు ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో కొన్ని వైన్స్‌లు సీల్‌కు ఇబ్బంది లేకుండా మూత తీసి కల్తీ చేసే గ్యాంగ్‌లను నియమించుకున్నాయి. ఈ దందా అంతా రాత్రివేళల్లో జరిగే అవకాశం ఉండటంతో ఒక్కో రోజుకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు చెల్లిస్తున్నారనే టాక్ వస్తోంది. గ్రేటర్ వరంగల్‌తోపాటు జిల్లాలో చాలాచోట్ల ఇలాంటి గ్యాంగ్‌లు ఉన్నాయి. బ్లండర్ స్పైడ్లో ఓసీ, రాయల్ స్టాగ్‌లో ఐబీలతోపాటు ఐబీ, ఓసీల్లో నీటిని కలిపి మద్యం ప్రియులకు విక్రయిస్తున్నాయి. రాయల్ స్టాగ్ విస్కీ బాటిళ్ల సీల్ పగలకుండా చాకచక్యంగా మూత తెరిచి దాదాపు సగం మద్యాన్ని ప్లాస్టిక్ మినరల్ వాటర్ బాటిల్లో పోస్తున్నారు. మరో బాటిల్లోని నీళ్లతో నింపి.. ఆపై విస్కీలో కలిపి బ్రాండెడ్ బాక్స్‌లో పెడుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. గతంలోనూ ఈ తరహా వారిని హైదరాబాద్‌లో ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసినా.. ఇక్కడ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా వరంగల్‌లోని కొత్తవాడ, హంటర్ రోడ్డు ఎక్సైజ్ అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదనే టాక్ ఉంది. ‘పెద్ద బ్రాండ్‌లోకి చిన్న బ్రాండ్ల మందును కలపొచ్చు. చిన్న బ్రాండ్‌ల్లోనూ నీళ్లు కలిపే అవకాశముంది. ఇలా లూజ్ సేల్ చేసే వైన్స్‌లపై నిఘా ఉంచాం. ఖానాపురంలో వైన్స్‌కు రూ.5,20,000 జరిమానా విధించాం. దసరా వేళ కల్తీకి అవకాశం ఉండడంతో మా సిబ్బంది క్షేత్రస్థాయిలో కన్నేసి ఉంచారు’ అని జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారి లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. -
చితిలో దూకి.. దేవతగా మారి..
జయపురం: దసరా ఉత్సవాల్లో జయపురం మా పెండ్రాని దేవికి ప్రముఖ స్థానం ఉంది. నవరంగపూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ ప్రాంతంలో పెండ్రాహండి ఓ కుగ్రామం. 400 ఏళ్ల క్రితం ఓ ఆదివాసీ కుటుంబంలో జన్మించిన పెండ్రానికి వివాహమైన తరువాత ఆమె తల్లిదండ్రుల ఆహ్వానం మేరకు భర్త పెండ్రా ఇల్లరికం వచ్చారు. ఇరువురినీ వారు ఎంతో ఆదరంగా చూసేవారు. అయితే పెండ్రాని నలుగురు అన్నదమ్ములకు ఈ విషయం గిట్టలేదు. దీంతో అతను పొలానికి వెళ్లిన సమయంలో పథకం ప్రకారం హతమార్చి, పాతి పెట్టారు. ఎంతటికీ భర్త ఇంటికి రాకపోవడంతో అనుమానించిన పెండ్రాని.. అతన్ని వెతుక్కుంటూ వెళ్లింది. తన సోదరులే భర్తను చంపి, పొలం వద్ద పాతి పెట్టారని గ్రహించి, సమీపంలోని చితిలో పడి మరణించింది. అనంతరం ఆమె ఆత్మ దేవతగా మారి గ్రామాల్లో సంచరిస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ప్రజలను కాపాడుతుంది. దీంతో తమను రక్షిస్తున్న దేవతగా విశ్వసించిన ఆదివాసీ ప్రజలు.. అక్కడే ఆమెకు గుడికట్టి, పూజించడం ప్రారంభించారు. చదవండి: (Padampur MLA: పద్మపూర్ ఎమ్మెల్యే మృతి) అమ్మవారి మహత్యం తెలుసుకున్ను జయపురం మహారాజులు.. దసరా ఉత్సవాలకు ఆమె లాఠీలను ఆహ్వానిస్తూ వచ్చారు. గత 4 దశాబ్దాలుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ నుంచి ఆదివారం రాత్రి పెండ్రాని దేవి లాఠీలు జయపురం చేరాయి. ఎంతో మహిమ గల అమ్మవారు తమ కోర్కెలు తీర్చుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యలో పెండ్రాని దేవికి కోళ్లు, మేకలు, గొర్రెలు బలులు సమర్పిస్తారు. చదవండి: (దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. స్టేజ్‌పైనే కుప్పకూలిన ప్రముఖ గాయకుడు) -
దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. స్టేజ్‌పైనే కుప్పకూలిన ప్రముఖ గాయకుడు
జయపురం: పట్టణంలో సంబరంగా జరుగుతున్న దసరా ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. శరన్నవరాత్రి సంబరాల్లో సందర్భంగా నిర్వహకులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి జయపురం రాజ్‌మహల్ కూడలి వద్ద విశాలమైన వేదికపై సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినీపతి, మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, సబ్ కలెక్టర్ దేవధర ప్రధాన్, మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి సిద్ధార్థ పట్నాయక్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు మురళీ మహాపాత్రొ తన బృందంతో కలిసి సుమధుర గీతాలతో శ్రోతలను అలరించారు. అనంతరం మిగతా గాయకులు పాడుతుండగా.. కుర్చీ నుంచి వారిని ప్రోత్సహిస్తున్న ఆయన హఠాత్తుగా గుండె నొప్పితో వేదికపై ఒరిగిపోయారు. నిర్వాహకులు, తోటి కళాకారులు వెంటనే జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మరణించినట్లు ప్రకటించారు. దీంతో అంతా షాక్‌కు గురయ్యారు. దసరా వేడుకల్లో ఇటువంటి అవాంఛనీయ ఘటన జరగడం దురదృష్టకరమని నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. చదవండి: (NIMS Director: అనారోగ్యంతో అపోలోకు.. ఆరోగ్యంగా నిమ్స్‌కు..!) -
ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్ సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు. లోక కంటకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు.. దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకొంటున్నామని సీఎం జగన్ అన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికీ విజయాలు కలిగేలా దుర్గామాత దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. -
తెలుగు రాష్ట్రాల్లో.. దసరా
-
శరన్నవరాత్రి ఉత్సవాలు :భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)
-
చదువుల తల్లి సరస్వతిగా జగన్మాత
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన ఆదివారం జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. త్రిశక్తి స్వరూపిణి నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేస్తూ శ్వేత దండ, కమండలం ధరించి అభయ ముద్రలో శ్రీ సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రానికి శరన్నవరాత్రుల్లో ఎంతో విశిష్టత ఉంది. అందుకే చదువుల తల్లిగా కొలువుదీరిన దుర్గమ్మను రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. శనివారం రాత్రికే క్యూలైన్లు నిండిపోయాయి. అమ్మవారి దర్శనం ఆదివారం తెల్లవారు జామున 1.10 గంటల నుంచే ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు 2.30 లక్షల మంది దర్శనం చేసుకున్నట్లు దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేక కుంకుమార్చనలు, పిల్లలకు అక్షరాభ్యాసాలు జరిగాయి. అమ్మవారి నగరోత్సవం కనుల పండువగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో కూచిపూడి కళాకారులు తమ నాట్య విన్యాసాలతో అలరించారు. నేడు దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం కాగా, సోమవారం దుర్గాదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోక కంటకుడైన దుర్గమాసురిడిని వధించిన అమ్మవారు దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై ఆవిర్భవించారు. ‘దుర్గే దుర్గతి నాశని’ అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగజేస్తుంది. శరన్నవరాత్రులందు దుర్గాదేవిని అర్చించడం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. అమ్మవారిని దర్శించుకున్న డీజీపీ వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో భాగంగా సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న బెజవాడ కనకదుర్గమ్మను డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న ఆయనకు ఆలయాధికారులు స్వాగతం పలికి అమ్మవారి సన్నిధికి తీసుకువెళ్లారు. అక్కడ అర్చకస్వాములు అమ్మవారికి పూజలు చేయించారు. ఆశీర్వాద మండపంలో వేద పండితులు డీజీపీకి ఆశీస్సులందించారు. -
దుర్గమ్మ సేవలో సీఎం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, అమరావతి: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. అత్యంత ప్రాశస్త్యమైన మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మ వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సంప్రదాయ పట్టు పంచె, తెల్ల చొక్కా ధరించి ఆలయ దర్శనానికి వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డికి వేద పండితులు, ఆలయ పూజార్లు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ స్థానాచార్యులు విష్ణు బట్ల శివప్రసాద్ శర్మ సీఎం తలకు పరివట్టం (పట్టువస్త్రంతో తలపాగా) చుట్టారు. దుర్గమ్మకు తెచ్చిన పట్టువస్త్రాలను ఆలయ ఈవో భ్రమరాంబకు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ అనంతరం అమ్మ వారికి సమర్పించే పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను వైఎస్ జగన్ తన తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలు, వేద మంత్రాల మధ్య ఆలయంలోకి ప్రవేశించారు. అమ్మవారి అంతరాలయంలోకి వెళ్లి శ్రీసరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో వేద పండితులు సీఎం జగన్‌కు వేద ఆశీర్వచనం.. ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈవో భ్రమరాంబలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, ఎంపీలు నందిగం సురేష్, వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్, కల్పలతారెడ్డి, ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, కె.అనిల్‌కుమార్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
టోల్ ప్లాజాలకు ‘దసరా’ వాహనాల తాకిడి.. కిలోమీటర్ల మేర..!
చౌటుప్పల్ రూరల్, బీబీనగర్: దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఇప్పటికే స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం, ఆదివారం సెలవు దినం కావడంతో, శనివారం ఉదయం నుంచే వాహనాల్లో బయలుదేరారు. దీంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై, హైదరాబాద్–వరంగల్ రహదారిపై రద్దీ పెరిగింది. పంతంగి, కొర్లపహాడ్, గూడూరు టోల్ ప్లాజాలకు వాహనాల తాకిడి విపరీతమైంది. సరాసరి రోజుకు 27వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగిస్తుండగా, శనివారం మరో 5వేల వాహనాలు అదనంగా వెళ్లాయి. పోలీసులు కూడా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: Hyderabad: సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు -
మన మైసూర్.. ఇల్లెందు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: దసరా ఉత్సవాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులకు గుర్తొచ్చేది ఇల్లెందు. కర్ణాటకలోని మైసూర్ తరహాలో ఇక్కడ భారీగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ముఖ్యంగా విజయదశమి రోజున జరిగే జమ్మిపూజ, దేవుడి శావ(ఊరేగింపు) చూసేందుకు ఇతర ప్రాంతాల వారు సైతం ఇల్లెందుకు వస్తుంటారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచీ జరుగుతున్న ఉత్సవాల తీరుతెన్నులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. గోవింద్ సెంటర్ చుట్టూ.. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా బొగ్గుతవ్వకాలు ఇల్లెందులో ప్రారంభమయ్యాయి. బొగ్గు గనుల్లో పని కోసం ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. బొగ్గు తవ్వకం, రవాణా ఇతర పనుల పర్యవేక్షణ కోసం బ్రిటిష్ సిబ్బంది, అధికారులు ఇల్లెందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక బొగ్గు గనులకు, బ్రిటీషర్లకు రక్షణగా నాటి సైన్యాన్ని, ఇతర సిబ్బందిని నిజాం రాజు నియమించాడు. అలా ఇల్లెందులపాడు చెరువు నుంచి ప్రస్తుత గోవింద్ సెంటర్ వరకు ఉన్న ప్రదేశంలో స్థానికులు, బ్రిటీషర్లు, నిజాం సేనలు నివసించేవారు. ఉల్లాసం కోసం భజన బృందాలు సాంకేతిక పరిజ్ఞానం అంతగాలేని ఆ రోజుల్లో చిన్న చిన్న బావులను తవ్వి బొగ్గు వెలికితీసేవారు. ఆ బావుల చుట్టే కార్మికులు ఇళ్లు నిర్మించుకుని ఉండేవారు. ప్రస్తుతం దో నంబర్ బస్తీగా పిలుస్తున్న ప్రాంతాన్ని అప్పుడు బండమీద బాయిగా పిలిచేవారు. అక్కడ రెండో నంబర్ పేరుతో గని ఏర్పాటు చేశారు. అందులో పనిచేసే కార్మికులు అక్కడే నివసించేవారు. పని ప్రదేశాన్ని మినహాయిస్తే చుట్టూ దట్టమైన అడవిగా ఉండేది. రాత్రివేళ అడవి జంతువుల భయంతో కార్మికులు వణికిపోయేవారు. అంతేకాదు.. దుర్భరమైన పరిస్థితుల మధ్య ప్రాణా లకు తెగించి బొగ్గు ఉత్పత్తి చేసేవారు. దీంతో వారికి మానసికోల్లాసం కోసం తొలిసారిగా నంబర్ 2 బస్తీ ఏరియాలోని కార్మికుల కుటుంబాలతో కలిసి శ్రీకృష్ణ భజన బృందం ఏర్పడింది. రాత్రివేళ కార్మికులు, వారి కుటుంబసభ్యులు ఒక చోట చేరి కృష్ణుడి భజన చేసేవారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇల్లెందులోని ఇతర కార్మిక వాడల్లోనూ భజన బృందాలు ఏర్పడ్డాయి. అలా ఇల్లెందులపాడులో హనుమాన్, శ్రీరామ భజన బృందాలు ఏర్పాటయ్యాయి. ఇల్లెందులో జరిగిన దసరా ఉత్సవాలకు హాజరైన ప్రజలు (ఫైల్) మిషన్ స్కూల్ వద్ద జమ్మిపూజ ప్రస్తుతం మిషన్ స్కూల్‌గా పిలుస్తున్న ప్రాంతంలో బ్రిటిష్ అధికారుల వసతిగృహం, మిషన్ హాస్పిటల్ ఉండేవి. ఈ బంగళాల సమీపంలోనే జమ్మిచెట్టు ఉండేది. దసరా రోజున ఈ జమ్మిచెట్టు చెంతన పూజలు నిర్వహించేవారు. దీంతో విజయదశమి నాడు నంబర్ 2 బస్తీకి చెందిన కృష్ణ భజన బృందం, ఇల్లెందుల పాడు నుంచి శ్రీరామ భజన బృందం సభ్యులు కృష్ణుడు, రాముడి ప్రతిమలను కావడి/పల్లకిలో మోసుకూంటూ ఈ జమ్మిచెట్టు మైదానానికి చేరుకునేవారు. అక్కడ సామూహిక భజనతో పాటు జమ్మిపూజలు ఘనంగా జరిగేవి. 1940వ దశకంలో మొదలు గోవింద్ సెంటర్ పరిసర ప్రాంతాల్లోనే అధికంగా నివసించే బ్రిటిష్ కుటుంబాలు, నిజాం ఉద్యోగుల కుటుంబాలు సైతం క్రమంగా ఈ వేడుకల్లో భాగస్వాములయ్యేవి. అలా 1940వ దశకం నుంచి ప్రభుత్వ, పాలకులంతా కలిసి ఘనంగా దసరా నిర్వహించడం మొదలైంది. దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. సందడే సందడి.. ఒకప్పుడు శ్రీరామ, శ్రీ కృష్ణ భజన బృందాలే ఇక్కడికి శావలు తీసుకొచ్చేవి. ఆ తర్వాత ఇతర కాలనీలు, అసోసియేషన్ల తరఫున కూడా శావలు తీసుకురావడం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి వరకు శావలు జమ్మిగ్రౌండ్‌కు చేరుకునేవి. జమ్మిపూజకు వచ్చిన భక్తులు చివరి శావ వచ్చేవరకూ ఎదురు చూసేలా ఉండడం కోసం 1993 నుంచి మ్యూజికల్ నైట్ సైతం ఈ వేడుకల్లో భాగమైంది. ఆ తర్వాత డ్యాన్స్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. 2013 నుంచి రావణవధ సైతం ఇక్కడ వేడుకగా నిర్వహిస్తున్నారు. వీఐపీల రాక.. రాష్ట్రంలో విజయదశమి వేడుకలు అంటే ఇల్లెందులోనే అనేంత ఘనంగా జరుగుతాయి. ప్రతీ దసరా కు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా ముఖ్య అతిథులుగా వస్తుంటా రు. క్రమంగా ఇల్లెందులో కార్మికుల సంఖ్య తగ్గినా ఉత్సవాల నిర్వహణలో మాత్రం ఏ మార్పూ రాలే దు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం దసరాకు ఇల్లెందు రావడానికి ఆసక్తి కనబరుస్తారు. జమ్మి వేడుకల అనంతరం సమీపంలోని కోటమైసమ్మ జాతరకు పోటెత్తుతారు. విజయదశమి రోజు న పట్టణంలోని అన్ని సినిమా థియేటర్లలో తెల్లవార్లూ ప్రదర్శనలు ఉంటాయి. దాదాపు 80 ఏళ్లుగా మిషన్ స్కూల్ మైదానంలో జరుగుతున్న ఉత్సవాలను ఈసారి జేకే స్కూల్ గ్రౌండ్‌కు మార్చారు. ఈ కొత్త వేదికలో జమ్మి వేడుకలు ఎలా జరుగుతాయో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. భక్తి భావాన్ని కొనసాగిస్తున్నాం.. మా పూర్వీకులు ప్రతిరోజూ సాయంత్రం శ్రీరామ భజన మందిరంలో స్వామివారిని స్మరిస్తూ భజన చేసేవారు. దసరా ఉత్సవాల సమయంలో రథాన్ని అందంగా అలంకరించి జమ్మి గ్రౌండ్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి పూజలు చేసేవారు. 80 ఏళ్ల క్రితం నాటి ఆనవాయితీని నేటికీ కొనసాగిస్తున్నాం. – శ్రీరామ భజన బృందం సభ్యులు, ఇల్లెందు భక్తులను ఉత్సాహ పర్చేందుకే ఇల్లెందులో దసరా, వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవాళ్లం. దసరా ఉత్సవాల్లో జమ్మిగ్రౌండ్‌కు వచ్చే భక్తులను ఉత్సాహపర్చేందుకు 1983 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 2013 నుంచి రావణ వధ కూడా చేస్తున్నాం. – మడత వెంకట్‌గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, ఇల్లెందు భక్తులు ఆశించిన విధంగా దసరా ఉత్సవాలు దశాబ్దాలుగా ఇల్లెందులో దసరా ఉత్సవాలు మైసూర్ తరహాలో కొనసాగుతున్నాయి. గతానికి ఏ మాత్రం తీసిపోకుండా ఈసారి కూడా ఘనంగా నిర్వహిస్తాం. ఇందుకోసం మున్సిపల్ పాలకవర్గం, స్థానిక ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అందరం కలిసి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. – దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్, ఇల్లెందు. -
బతుకమ్మ-దసరా పండగకి ఊరెళ్లిపోతా మామ...బస్టాండ్ లు,రైల్వేస్టేషన్లు కిటకిట (ఫొటోలు)
-
దసరాకు 1,072 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
బస్టాండ్( విజయవాడ పశ్చిమ): దసరా సెలవుల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ ఎన్టీఆర్ జిల్లా నుంచి వివిధ దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి ఏసుదానం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు, విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాలకు 1,072 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు చెప్పారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 10 వరకు ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని, సాధారణ చార్జీలే అమలవుతాయని తెలిపారు. అక్టోబర్ ఒకటి, రెండు తేదీల్లో 40 బస్సులను పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి రాయలసీమ ప్రాంతాలైన రాయదుర్గం, కదిరి, అనంతపురం, పులివెందుల, రాయచోటి, ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగు, కర్నూలు, నంద్యాల గుంతకల్ ప్రాంతాలకు, విజయవాడ నుంచి విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, భద్రాచలానికి ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్టు తెలిపారు. అలాగే హైదరాబాద్, చెన్త్నె, బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చే బస్సులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకూ ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్టు ఏసుదానం వెల్లడించారు. -
విజయవాడ మీదుగా దసరా ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా దసరా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్–తిరుపతి (02764) రైలు అక్టోబర్ 1న రాత్రి 8.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02763) అదే 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు జనగాం, ఖాజీపేట, వరంగల్లు, మహబూబ్‌నగర్, డోర్నకల్లు, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. సికింద్రాబాద్–యశ్వంతపూర్ (07233) రైలు ఈ నెల 29, అక్టోబర్ 6, 13, 20 తేదీల్లో రాత్రి 9.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07234) ఈ నెల 30, అక్టోబర్ 7, 14, 21 తేదీల్లో సాయంత్రం 3.50 గంటలకు యశ్వంతపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. నరసాపూర్ –సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు కేటాయింపు నరసాపూర్–సికింద్రాబాద్–నరసాపూర్ వయా గుంటూరు డివిజన్ మీదుగా ప్రత్యేక రైళ్లు కేటాయించినట్లు సీనియర్ డీసీఎం ఆంజనేయులు పేర్కొన్నారు. నరసాపూర్ – సికింద్రాబాద్ (07466) రైలు ఈ నెల 30న సాయంత్రం 6 గంటలకు నరసాపూర్‌లో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ –నరసాపూర్ (07467 ) రైలు అక్టోబరు 1న సికింద్రాబాద్‌లో రాత్రి 9.05 గంటలకు బయల్దేరి నరసాపూర్ స్టేషన్‌కు మరుసటిరోజు ఉదయం 8.35 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. -
ఇంద్రకీలాద్రిపై వైభవంగా..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున కనకదుర్గమ్మ.. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున మూడు గంటలకు వేద పండితులు, అర్చకుల సుప్రభాత సేవతో శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. శాస్త్రోక్తంగా బాలభోగ నివేదన చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. తొలి రోజే పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఇంద్రకీలాద్రి కోలాహలంగా మారింది. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తులతో నిర్వహించిన నగరోత్సవం భక్తులకు కనువిందుచేసింది. అమ్మవారి సేవలో గవర్నర్ దంపతులు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు సోమవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కల్టెకర్ ఢిల్లీరావు, సీపీ టీకే రాణా, ఆలయ ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. గవర్నర్ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయన్నారు. దుర్గమ్మను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు సీజే తెలిపారు. నేడు బాలాత్రిపురసుందరిగా.. బెజవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ(మంగళవారం) నాడు శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారమే శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి. -
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు సోమవారం ఉదయం యాగశాల ప్రవేశంతో ప్రారంభం కానున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాల్లో అమ్మవారికి నవదుర్గ అలంకారాలు, ప్రత్యేక నవావరణపూజలు, స్వామి అమ్మవార్లకు వాహనసేవలు, చండీయాగం, రుద్రయాగం నిర్వహించనున్నారు. దసరా మహోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీశైల భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజల అనంతరం అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు. -
శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. అమ్మవారి సన్నిధిలో సోమవారం నుంచి అక్టోబర్ ఐదో తేదీ వరకు శ్రీదేవీశరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలిరోజు దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. రోజూ తెల్లవారుజామున నాలుగు నుంచి రాత్రి పదిగంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అక్టోబర్ రెండో తేదీన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని రెండులక్షల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అదేరోజు అమ్మవారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా సీపీ టి.కె.రాణా ప్రత్యేక పూజలు చేసి దుర్గమ్మకు పట్టువ్రస్తాలు సమర్పించారు. -
రాష్ట్రపతిగారూ మైసూరు దసరాకు రారండి!
మైసూరు: ప్రపంచ ప్రసిద్ధ నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవాల ప్రారంభోత్సవానికి విచ్చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును దసరా మహోత్సవ సమితి ఆహ్వానం పలికింది. గురువారం ఇన్చార్జ్ మంత్రి ఎస్.టి.సోమశేఖర్, ఎంపీ ప్రతాపసింహ, మంత్రి శశికళ జొల్లె తదితరులు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ప్రథమ పౌరురాలిని ఆహ్వానించారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 9.45 గంటల నుంచి 10.05 గంటల మధ్య శుభ వృశ్చిక లగ్నంలో చాముండిబెట్ట పైన ఉన్న చాముండేశ్వరి దేవి అమ్మవారికి పూజలు చేయడం ద్వారా ఉత్సవాలకు నాంది పలుకుతారు. కాగా దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ప్రారంభించనుండడం ఇదే మొదటిసారి. సాధారణంగా రాష్ట్రంలోనే ఒక ప్రముఖ వ్యక్తి ద్వారా సంబరాలకు శ్రీకారం చుట్టేవారు. వారంపాటు సాంస్కృతిక ప్రదర్శనలు అంబా విలాస్ ప్యాలెస్ ఆవరణలో బృహత్ వేదికపై సెప్టెంబర్ 26వ తేది నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు వారంపాటు వైభవంగా సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. ఇందులో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి నృత్య, గాన తదితర రంగాల కళాకారులు పాల్గొని ఆహూతులను అలరిస్తారు. 26న సీఎం బొమ్మై ఈ ప్రదర్శనను ప్రారంభిస్తారు. ఫల పుష్ప ప్రదర్శన మైసూరు వర్సిటీ ఉద్యాన వన విభాగం ఆధ్వర్యంలో 26 నుంచి ఫల పుష్ప ప్రదర్శన కనువిందు చేయబోతోంది. నగరంలోని కుక్కరహళ్లి చెరువు వద్ద ఏర్పాటవుతుంది. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. దీనికి తోడు ప్యాలెస్ ఆవరణలోనూ ఫల పుష్ప అలంకరణ నిర్వహిస్తారు. త్వరలో 3 స్పెషల్ రైళ్లు మైసూరు దసరా ఉత్సవాలకు వచ్చే యాత్రికుల కోసం రైల్వే శాఖ మూడు ప్రత్యేక రైళ్లను నడపనుంది. సెపె్టంబరు 30వ తేదీన చామరాజనగరకు రాకపోకలు సాగించే రైలు సర్వీసు ఆరంభమవుతుంది. అలాగే అక్టోబరు 5వ తేదీన బెంగళూరుకు రెండు రైలు సర్వీసులను ఆరంభిస్తారు. కాగా, చాముండి కొండ పైన ఉన్న మహిష విగ్రహం వద్ద సెపె్టంబర్ 25వ తేదీన మహిష దసరాను నిర్వహిస్తామని మాజీ మేయర్ పురుషోత్తం తెలిపారు. గత మూడేళ్లుగా పోలీసులు అడ్డుకుంటున్నారని, ఈసారి ఎవరు అడ్డుకున్నా జరిపి తీరుతామని అన్నారు. (చదవండి: సహనం కోల్పోతున్నాం: హిజాబ్ వాదనపై సుప్రీం) -
AP: అదనపు చార్జీల్లేకుండానే దసరా స్పెషల్ బస్సులు
సాక్షి, అమరావతి: ప్రయాణికులపై అదనపు చార్జీల భారం లేకుండానే దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు చెప్పారు. దశాబ్దకాలం తరువాత ఇలా అదనపు చార్జీలు లేకుండా ఆర్టీసీ దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించడం ఇదే తొలిసారని తెలిపారు. విజయవాడలోని బస్‌భవన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది దసరా రద్దీ దృష్ట్యా 4,500 ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తామని చెప్పారు. దసరా ఉత్సవాల ముందు ఈ నెల 29 నుంచి అక్టోబరు 4 వరకు 2,100 బస్సులు, దసరా తరువాత అక్టోబరు 5 నుంచి 9 వరకు 2,400 బస్సులు నడుపుతామని తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతోపాటు రాష్ట్రంలోని 21 నగరాలు, ముఖ్య పట్టణాలకు ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పారు. అన్ని సర్వీసుల్లోను యూటీఎస్ విధానాన్ని అమలు చేస్తూ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్లు, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా టికెట్లు తీసుకోవచ్చని వివరించారు. అన్ని బస్సులను జీపీఎస్ ట్రాకింగ్ విధానంతో అనుసంధానించి కంట్రోల్ రూమ్ నుంచి 24/7 పర్యవేక్షిస్తామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపే ప్రైవేటు బస్సులను నిరోధించేందుకు పోలీసు, రవాణా శాఖలతో కలసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈ–బస్ సర్వీసులు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆర్టీసీ ఈ–బస్ సర్వీసులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 10 ఈ–బస్సులను నడుపుతామన్నారు. అనంతరం దశలవారీగా డిసెంబర్ నాటికి తిరుమల–తిరుపతి ఘాట్‌రోడ్డులో 100 ఈ–బస్ సర్వీసులను ప్రవేశపెడతామని చెప్పారు. తిరుమల ఘాట్రోడ్తోపాటు రాష్ట్రంలో దూరప్రాంత సర్వీసుల కోసం కొత్తగా 650 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. గత ఏడాది 1,285 బస్సులను ఫేస్‌లిఫ్ట్ విధానంలో నవీకరించామని ఈ ఏడాది రూ.25 కోట్లతో మరో 1,100 బస్సులను నవీకరిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తామన్నారు. ఇటీవల పదోన్నతులు పొందిన దాదాపు రెండువేల మందికి సాంకేతికపరమైన అంశాలను పూర్తిచేసి నవంబర్ 1 నుంచి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఈడీ (కమర్షియల్) కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Telangana: దసరా సెలవులు.. విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త
సాక్షి, వరంగల్: వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్న టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు చేరువయ్యేందుకు పరుగులు పెడుతోంది. బస్సుల వద్దకే ప్రయాణికులు రావడం కాదు.. ప్రయాణికుల వద్దకే బస్సును పంపే కార్యక్రమాన్ని చేపట్టింది. పాఠశాలలకు ఈ నెల 25 నుంచి బతుకమ్మ, దసరా పండుగ సెలవులు ఇస్తున్న క్రమంలో వారి వారి స్వగ్రామాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం హాస్టల్ వద్దకు ఆర్టీసీ బస్సులు పంపే ఏర్పాట్లు చేశారు. 30మందికి పైగా విద్యార్థులు ఒకే రూట్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం కల్పించడం ద్వారా విద్యార్థులు లగేజీ బరువుతో బస్టాండ్‌కు చేరుకునే ఇబ్బందులు తప్పుతాయి. ఆటో, ఇతర రవాణా ఖర్చులు తగ్గుతాయి. విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులు సమీపంలోని బస్ డిపోకు సమాచారం అందించాల్సి ఉంటుంది. సమాచారం ఇస్తే బస్సు పంపుతాం దసరా సెలవుల్లో స్వస్థలాలకు వెళ్ళే విద్యార్థుల సౌకర్యార్థం వారి వద్దకే బస్సులు పంపే ఏర్పాట్లు చేశాం. 30 మందికి పైగా విద్యార్థులుంటే సరిపోతుంది. బస్సు వారి ఆవాసం ఉంటున్న వసతి గృహం వద్దకు చేరుకుని విద్యార్థులను ఎక్కించుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతుంది. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, హాస్టల్ నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వంగాల మోహన్ రావు, వరంగల్–1 డిపో మేనేజర్ చదవండి: తక్కువ ధరకే ఐఫోన్ వస్తుందని.. ఫోన్ పే ద్వారా రూ. లక్ష పంపించాడు.. చివరికి -
దసరాకు 4,485 స్పెషల్ బస్సులు
సాక్షి, అమరావతి: దసరా ఉత్సవాల్లో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సదుపాయాల కోసం ఆర్టీసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో 4,485 దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. నవరాత్రుల సందర్భంగా దసరాకు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు 2,100 ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తోంది. దసరా అనంతరం తిరుగు ప్రయాణం కోసం 2,385 ప్రత్యేక బస్ సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అత్యధికంగా హైదరాబాద్‌కు 2,290 బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తోంది. -
విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు (ఫొటోలు)
-
శ్రీశైలం దసరా ఉత్సవాలు: సీఎం జగన్‌ను ఆహ్వానించిన కొట్టు సత్యనారాయణ
సాక్షి, అమరావతి: దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దసరా నవరాత్రుల ఉత్సవాల జరుగనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని డిప్యూటీ సీఎం, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం సీఎం జగన్‌ను మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ ఎం హరిజవహర్‌లాల్, శ్రీశైలం దేవస్ధానం ఈవో లవన్న, దేవస్ధానం ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు కలిశారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్‌కు వేద పండితులు వేద ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. అనంతరం.. సీఎం జగన్‌ను శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దసరా ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా దేవాదాయశాఖ మంత్రి, దేవాదాయశాఖ కమిషనర్, శ్రీశైలం దేవస్ధానం కార్యనిర్వహణాధికారి కోరారు. -
ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ టికెట్లు
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉన్న 11 ప్రధాన ఆలయాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి దర్శనం టికెట్లను పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆలయాల వద్ద గదుల కేటాయింపు వంటి వాటిని కూడా ఆన్లైన్ పరిధిలోకి తెస్తామన్నారు. మంత్రి మంగళవారం విజయవాడలో దేవదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ గుడి, పెనుగ్రంచిపోలు, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయం, వాడపల్లి, ఐనవల్లి ఆలయాల్లో ఆన్లైన్ టికెట్ విధానం తప్పనిసరి చేస్తున్నట్లు చెప్పారు. భక్తులు అడ్వాన్స్‌గా నిర్ణీత తేదీకి ఆన్లైన్ దర్శన టికెట్లు, గదులు బుకింగ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. రద్దీ అధికంగా ఉండే మరో 12 ఆలయాల్లోనూ ఆన్లైన్ విధానం అమలుపై చర్చిస్తున్నట్లు వివరించారు. వారం వారం సమీక్ష ఇకపై ప్రతి బుధవారం దేవదాయశాఖ సమీక్ష సమావేశం నిర్వహించి, ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉద్యోగుల పదోన్నతులకు అడ్డుగా ఉన్న కోర్టు కేసుల ఉపసంహరణకు ఉద్యోగ సంఘాల నేతలు ముందుకొచ్చారని, ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌లో సిబ్బంది నియామకాలను చేపట్టినట్లు వివరించారు. కొత్తగా ఏర్పాటైన ధార్మిక పరిషత్ తొలి సమావేశం అక్టోబరు 10న నిర్వహించనున్నట్లు చెప్పారు. దసరా ఉత్సవాల్లో వీఐపీలకూ టైం స్లాట్ దర్శనాలు దసరా ఉత్సవాల్లో విజయవాడ కనకదుర్గ గుడిలో వీఐపీలకు కూడా టైం స్లాట్ ప్రకారమే దర్శనాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. వీఐపీలు కూడా టికెట్ కొనాలని చెప్పారు. రోజుకు ఐదు ప్రత్యేక టైం స్లాట్లు ఉంటాయన్నారు. రెండేసి గంటలు ఉండే ఒక్కొక్క టైం స్లాట్‌లో రెండు వేల వీఐపీ టికెట్లను ఇస్తామన్నారు. అందులో 600 టికెట్లు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలు ఉన్నవారికి కేటాయించి, మిగిలినవి అందరికీ ఇస్తామన్నారు. ఒక లేఖకు ఆరు టికెట్లు ఇస్తామన్నారు. సిఫార్సు లేఖలు, ఇతర వీఐపీ టికెట్ల బుకింగ్‌కు విజయవాడ కలెక్టర్ ఆఫీసులో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు వంటి ప్రివిలేజ్డ్ వీఐపీలు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉదయం, సాయంత్రం వేళల్లో అర్ధ గంట చొప్పున ఉచిత దర్శనం ఉంటుందని తెలిపారు. సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. దుర్గ గుడి ఘాట్ రోడ్డును పూర్తిగా క్యూలైన్లకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఉచిత దర్శనానికి మూడు లైన్లు, రూ.300 టికెట్ వారికి ఒకటి, రూ.100 టికెట్ వారికి మరొక క్యూ ఉంటాయని చెప్పారు. వికలాంగులు, వృద్ధులకు రోజూ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఒకసారి, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య మరోసారి ప్రత్యేక దర్శనాలు ఉంటాయని వివరించారు. మంత్రులకూ అంతరాలయ దర్శనం ఉండదు దసరా ఉత్సవాల సమయంలో దుర్గగుడిలో అంతరాలయ దర్శనం గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి ప్రముఖులకు మాత్రమే ఉంటుందని తెలిపారు. మంత్రులకు సైతం బయట నుంచే దర్శనాలు కల్పించాలని ఆలోచన చేస్తున్నామని వివరించారు. దసరా ఉత్సవాల తర్వాత దుర్గగుడిలో అంతరాలయ దర్శనానికి రూ. 500 టికెట్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. -
అదిరిపోయే సేల్: భారీ తగ్గింపు ఆఫర్లు..ఏకంగా 80 శాతం డిస్కౌంట్!
దేశీయ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్‌ను ప్రకటించింది. దసర పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈసేల్‌లో స్మార్ట్ ఫోన్లపై తగ్గింపులతో పాటు, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లపై 80శాతం డిస్కౌంట్ పొందవచ్చు. గతేడాది అక్టోబర్ 3 నుంచి 10 వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించింది. అలాగే ఈ ఏడాది సైతం ఈ సేల్ అదే సమయంలో ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే పలు నివేదికల ప్రకారం..సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. దీనిపై ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టత ఇవ్వాల్సి ఉండగా.. ఈ సేల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బ్యాంక్ కార్డ్‌లపై ఆఫర్లు 8 రోజుల పాటు సుధీర్ఘంగా జరిగే ఈ ప్రత్యేక అమ్మకాల్లో ఈ కామర్స్ సంస్థ ఎప్పటి లాగే ఆఫర్లను అందించనుంది. ముఖ్యంగా ఐసిఐసిఐ, యాక్సిస్ క్రెడిట్ కార్డులపై 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇవ్వనుంది. కొనుగోళ్లను బట్టి డిస్కౌంట్ ఉంటుంది. దీంతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ,ఎక్ఛేంజ్ ఆఫర్,ప్రిపెయిడ్ ఆఫర్స్ ఉన్నాయి. ఐఫోన్ 14సైతం వచ్చే నెల చివరిలో ప్రారంభయ్యే ఈ సేల్ 24 గంటల ముందే ఫ్లిప్ కార్ట్ ప్లస్ వినియోగదారులు కొనుగోలు చేసే సౌకర్యం కల్పిస్తుంది. ఇందులో భాగంగా ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 13 అమ్మకాలు జరపనుంది. దీంతో పాటు మరో ఈ బుధవారం విడుదలయ్యే ఐఫోన్ 14సిరీస్ ఫోన్ సైతం అమ్మనుంది. వీటితో పాటు రియల్ మీ, పోకో, వివో,యాపిల్,శాంసంగ్ ఫోన్లను డిస్కౌంట్ ధరలకే సొంతం చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు ,టీవీలు, గృహోపరకరణలపై 80శాతం డిస్కౌంట్ పొందవచ్చు. సేల్ జరిగే 12ఏఎం, 8ఏఎం, 4పీఎం సమయంలో అదనపు డిస్కౌంట్లను సొంతం చేసుకోవచ్చు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం మరో రూ.3.19 కోట్లు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు రెండో రోజు కూడా కొనసాగింది. మంగళవారం జరిగిన లెక్కింపులో రూ.3.19 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ చెప్పారు. మహా మండపం ఆరో అంతస్తులో జరిగిన లెక్కింపులో రూ.3,19,39,430 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. నగదుతో పాటు 474 గ్రాముల బంగారం, 8.85 కిలోల వెండి లభించిందన్నారు. కాగా, సోమవారం జరిగిన లెక్కింపులో రూ.2,87,83,153 ఆదాయం సమకూరింది. రెండు రోజులలో మొత్తం రూ.6.07 కోట్ల మేర హుండీల ద్వారా దుర్గమ్మకు ఆదాయం వచ్చింది. కానుకల లెక్కింపు బుధవారం కూడా కొనసాగనుంది. -
దుర్గమ్మ దసరా హుండీ లెక్కింపు ప్రారంభం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ కనకదుర్గ అమ్మవారికి దసరా ఉత్సవాలలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల లెక్కింపును సోమవారం మహా మండపం ఆరో అంతస్తులో చేపట్టారు. తొలిదఫా లెక్కింపులో రూ.2,87,83,153 నగదుతో పాటు 546 గ్రాముల బంగారం, 9.553 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. మంగళవారం (నేడు) కూడా హుండీ కానుకల లెక్కింపు కొనసాగుతుందని ఆమె తెలిపారు. కానుకల లెక్కింపును దేవస్థానం చైర్మన్ పైలా సోమినాయుడు, పాలక మండలి సభ్యులు పర్యవేక్షించగా, ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు. -
హాంకాంగ్‌లో ఘనంగా దసరా ఉత్సవాలు
హాంగ్ కాంగ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు జయ పీసపాటి ఆధ్వర్యంలో హాంగ్ కాంగ్ లో దసరా శరన్నవరాత్రి అంబురాలు సంబరాన్నంటాయి. ముఖ్యంగా భారతీయులు దుర్గ పూజలు, అష్టమి నాడు కన్య పూజలు, విజయదశమి నాడు రావణ దహనం చేయడం స్థానికుల్ని విశేషంగా ఆకట్టుంది. దీంతో హాంగ్ కాంగ్ వీధులు దసరా వేడుకలతో శోభాయమానం సంతరించుకున్నాయి. స్థానికులు సైతం భారతీయుల సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు ఉత్సహం చూపించారు. ముఖ్యంగా దసరా సందర్భంగా 9రోజుల పాటు పూలనే దేవతలుగా ఆరాధించి 9రోజులు 9రూపాల్లో బతుకమ్మను తయారుచేసి, పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పండుగను వయోభేదం లేకుండా ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లగానే ఈ ఏడాది దసర ఉత్సవాల్ని జరిపారు. ప్రతిఏడాది దసరా అంటే స్థానికంగా ఉండే భక్తులు పారాయణనానికి వెళ్ళేటప్పుడు పండ్లు, పూలు, బహుమతులు తీసుకువెళ్ళే వారు. కానీ ఈ సంవత్సరం దసరా వేడుకల్లో భక్తులు కానుకల్ని అందించారు. భక్తులు చదివించిన ఆ కానుకల్ని స్వచ్చంద సంస్థలకు అందించడం సంతోషంగా ఉందంటూ ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు జయ పీసపాటీ ప్రశంసల వర్షం కురిపించారు. -
బీభత్సం, స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో సరికొత్త రికార్డులు
దేశంలో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా స్మార్ట్ ఫోన్ సేల్స్ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. సెమి కండక్టర్ల కొరతే అయినా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా మార్కెట్ రీసెర్చ్ కౌంటర్ పాయింట్ ప్రకారం..ఈ పండుగ సీజన్లో దేశంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రికార్డు స్థాయిలో 7.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 56,858 కోట్లు) చేరువలో ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు పండుగ సీజన్లో స్మార్ట్‌ఫోన్ రిటైల్ సగటు అమ్మకపు ధర 14 శాతం వృద్ధితో 230 డాలర్ల (దాదాపు రూ. 17,200)కు చేరింది. మిడ్,ప్రీమియం విభాగాలలోని స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారని తాజాగా విడుదలైన కౌంటర్ పాయింట్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా కౌంటర్‌పాయింట్ సీనియర్ విశ్లేషకుడు ప్రచిర్ సింగ్ మాట్లాడుతూ..దసరా,దీపావళి ఫెస్టివల్ సీజన్లో వినియోగదారుల డిమాండ్ అధికంగా ఉందని, అందుకే భారత్‌లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు భారీగా జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓవైపు ఆఫర్లు, ఈఎంఐ సదుపాయం ఉండడంతో $200 కంటే (ఇండియన్ కరెన్సీలో రూ.14,974.98) ఎక్కువ ధర ఉన్న ఫోన్ అమ్మకాలు పెరగడానికి కారణమైందన్నారు. ఈ సేల్స్ ఇలాగే కొనసాగితే పండుగ సీజన్లో దాదాపు 7.6 బిలియన్ డాలర్ల విలువైన, లేదంటే అంతకంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లు అమ్మకాలు జరుగుతాయనే అంచనా వేశారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ.. 2021 పండుగ సీజన్లో మార్కెట్ విలువలో 1శాతం పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ ..యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ప్రకారం సంవత్సరానికి 14 శాతం పెరిగిందని చెప్పారు. ఇక ఈ పండగ సీజన్లో వినియోగదారుల సెంటిమెంట్ సానుకూలంగా ఉందన్నారు. చాలా మంది వినియోగదారులు చేసిన సేవింగ్స్‌లో వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారని, ఈ ధోరణి పండుగ సీజన్లో కొత్త స్మార్ట్ఫోన్లకు అప్‌గ్రేడ్ అయ్యేందుకు వీలుపడిందని అన్నారు. చదవండి: అమెజాన్ సేల్, బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్ -
ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు.
నల్లరాజుపాలెం(అనంతసాగరం): ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యం లో దసరా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయని అధ్యక్షులు పార్లపల్లి రఘునాధ్ రెడ్డి గారు తెలియజేసారు. విదేశాల్లో ఉన్నప్పటికి మన సంస్కృతి సంప్రదాయాలకు విలువ నిచ్చి మన తెలుగు వాళ్లు అక్కడ ఎంతో ఆనందంగా ఈ పండుగలని జరుపుకున్నారని అన్నారు. దాదాపు రెండు వందల మందికి పైగా ఈ వేడుకలకు హాజరై వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. రెండు సంవత్సరాలు పాటు కరోనా మహమ్మారితో ఇబ్బంది పడిన జనాలకి ఈ కార్యక్రమం మంచి మానసిక ఉల్లాసాన్నిచ్చిందని అన్నారు. దసరా పాటలతో, నృత్యాలతో కూడిన ఈ కార్యక్రమం దాదాపు ఏడు గంటల పాటు కొనసాగిందని అన్నారు. కార్యక్రమం కొనసాగటానికి సంస్థ నిర్వాహకులు సింగపురం వినయ్ , అడబాల శ్రీవల్లి, రోజా రమణి మోలుపోజు, శృతి కొట్రిక్, స్పందన ఈచూరి తదితరులు కృషిచేశారని తెలిపారు. తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత సాధించినటువంటి బతుకమ్మ పండుగ సందర్బంగా వివిధ రకాల పూల అలంకరణతో బతుకమ్మని తయారు చేయించి, పిల్లలు, ఆడపడుచులందరు పాల్గొని బతుకమ్మ కోలాటం ఆడించేందుకు బజ్జురి లచ్చిరెడ్డి, దాసరి వాసు, వెన్నెల శివశంకర్, గంధం అభిషేక్ , పంగనామాల వంశి కృష్ణ, వారణాసి వెంకట రాకేష్ ఎంతో కృషి చేశారని తెలిపారు. కాగా, ఇక ముందు కూడా ఫిన్లాండ్లో మరిన్నికార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇక్కడున్న మన తెలుగు వాళ్లకి అండగా ఉంటామని తెలుగు సంఘం ఉపాధ్యాక్షులు ఓలేటి సుబ్రమణ్య మూర్తి గారు, జ్యోతిస్వరూప్ అనుమలశెట్టి గారు, సత్యనారాయణ గారు తెలియజేశారు. -
దసరా స్పెషల్ రూ.135 కోట్లు
సాక్షి, అమరావతి: దసరా సందర్భంగా ప్రత్యేక బస్సుల్ని నడపటం ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రూ.135 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నడిపిన దసరా ప్రత్యేక బస్సులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. అత్యధికంగా ఈ నెల 18న రూ.17.05 కోట్ల రాబడి సాధించింది. ప్రత్యేక బస్సుల ద్వారా మొత్తం 1.40 లక్షల మంది అదనపు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. దసరా స్పెషల్ కింద ఆర్టీసీ 907 బస్సు సర్వీసులు నడిపింది. వాటిలో హైదరాబాద్‌కు 303, విజయవాడకు 152, విశాఖపట్నానికి 122, బెంగళూరుకు 95, రాజమహేంద్రవరానికి 89, తిరుపతికి 41, చెన్నైకి 12, ఇతర ప్రాంతాలకు 93 ప్రత్యేక బస్సులను నడిపింది. కాగా, రోజువారీ సర్వీసుల కింద నడిపిన 3,332 బస్ సర్వీసుల్లో సాధారణ చార్జీలనే వసూలు చేశారు. కోవిడ్ నిబంధనల్ని అనుసరించి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 50 మంది అధికారులు, 250 మంది సూపర్వైజర్లను వివిధ ప్రాంతాల్లో వినియోగించి బస్ సర్వీసుల నిర్వహణను ఆర్టీసీ పర్యవేక్షించింది. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ఆ సంస్థ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. దసరా రద్దీ సమయంలో సమర్థంగా విధులు నిర్వర్తించిన ఆర్టీసీ ఉద్యోగులను అభినందించారు. -
దేవరగట్టులో చిందిన రక్తం
హొళగుంద/ఆలూరు రూరల్: దసరా సందర్భంగా బన్ని ఉత్సవంలో భాగంగా మాళ మల్లేశ్వరస్వామిని వశం చేసుకునేందుకు రక్తం చిందేలా జరిగే కర్రల సమరాన్ని ఆపాలని కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు చేస్తున్న యత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఈ సమరాన్ని ఆపాలని జిల్లా పోలీసు, అధికార యంత్రాంగం విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అధికారుల ఆంక్షలను కాదని.. సంప్రదాయానిదే పైచేయిగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామిని దక్కించుకునేందుకు పలు గ్రామాల ప్రజలు ఒకరితో ఒకరు పోటీపడుతూ కర్రల చివరన ఇనుప రింగులు తొడిగి .. బన్ని ఉత్సవం (కర్రల సమరం)లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా శుక్రవారం అర్ధరాత్రి బన్ని ఉత్సవం ప్రారంభం కాగా.. శనివారం ఉదయం 6.30 గంటలకు విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర ముగిసింది. కాగా, ఉత్సవాలు నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులతో పాటు దేవరగట్టు చుట్టు పక్కల గ్రామాలైన నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, లింగంపల్లితో పాటు దాదాపు 15 గ్రామాలకు చెందిన భక్తులు ఉత్సవంలో పాల్గొని మొగలాయి ఆడారు. కల్యాణోత్సవం అనంతరం నిర్వహించిన జైత్రయాత్రలో కర్రలు, దివిటీలు తగిలి భక్తుల తలలకు గాయాలయ్యాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించి కర్నూలు, ఆదోని, బళ్లారి ఆస్పత్రులకు రెఫర్ చేశారు. దాదాపు 60 మంది భక్తులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. -
రికార్డ్ సేల్స్: అపార్ట్మెంట్లా.. హాట్ కేకులా..!
కరోనా మహమ్మారి ఇళ్ల కొనుగోలు దారుల ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది. గతంలో అఫార్డబుల్ హౌస్‌లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడే వారు. కానీ ఇప్పుడు వారి ఆలోచన మారింది. లెక్క ఎక్కువైనా పర్లేదు..లగ్జరీ మాత్రం మిస్ అవ్వకూడదనేలా ఆలోచిస్తున్నారని సీఐఐ–అనరాక్ కన్జ్యూమర్ సర్వే తెలిపింది. ఈ క్రమంలో దసరా సందర్భంగా పలు బ్యాంకులు హోం లోన్లపై వడ్డిరేట్లతో పాటు స్టాంప్ డ్యూటీ రుసుము తగ్గించడంతో భారీ ఎత్తున ఇళ్ల కొనుగోళ్లు జరిగినట్లు తేలింది. ముఖ్యంగా లగ్జరీ, సెమీ లగ్జరీ సెగ్మెంట్లో వందల కోట్ల బిజినెస్ జరిగినట్లు మరో సర్వే సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి చిరకాల కోరిక. జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బులతో కలల పొదరిల్లును నిర్మించుకోవాలని అనుకుంటారు.అలాంటి పొదరిల్లును ముంబై మహా నగరంలో ఎంతమంది సొంతం చేసుకున్నారనే అంశంపై నైట్ ఫ్రాంక్ ఇండియా స్టడీ చేసింది. ఈ స్టడీలో దసరా నవరాత్రి సందర్భంగా ముంబైలో ప్రతి రోజు 400కి పైగా అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. బ్యాంకులు తక్కువ వడ్డీకే హోంలోన్లను ఆఫర్ చేయడంతో అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 15 మధ్యకాలంలో రియల్టీ ఎక్స్పర్ట్స్ అంచనాల్ని తల్లకిందులు చేస్తూ సుమారు 3,205 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తన స్టడీలో పేర్కొంది. ఇక ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ దసరా పండుగ మధ్య కాలంలో ప్రతి రోజు 219 నుంచి 260 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు స్పష్టం చేసింది. ఆగస్ట్ నెలకంటే అక్టోబర్ 13 వరకు ఇళ్ల సేల్స్ 17శాతం పెరిగాయి. అక్టోబర్ మొదటి రెండు వారాల్లో 4,052 యూనిట్ల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా స్టడీ నిర్ధారించింది. దివాళీ ఫెస్టివల్ లో సైతం సేల్స్ పెరగొచ్చు ఈ సందర్భంగా ది గార్డియన్స్ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ జాయింట్ డైరెక్టర్ రామ్ నాయక్ మాట్లాడుతూ..గత 8 రోజుల్లోనే రూ12,00కోట్ల విలువైన అపార్ట్మెంట్లను అమ్మినట్లు తెలిపారు. వాటిలో సుమారు రూ.750కోట్ల విలువైన లగ్జరీ, సెమీ లగ్జరీ సెగ్మెంట్ అపార్ట్ మెంట్లు ఉన్నట్లు చెప్పారు. దీపావళి సందర్భంగా ఇళ్ల సేల్స్ పెరిగే అవకాశం ఉంది. బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేయడం, దీపావళికి ఇళ్లు కొనుగోలు చేయాలనే సెంటిమెంట్‌తో పాటు ఇతర కారణాల వల్ల సేల్స్ పెరుగుతాయని రామ్ నాయక్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
దేశవ్యాప్తంగా ఘనంగా దసరా సంబరాలు
-
Dussehra: కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
సాక్షి, హైదరాబాద్: విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ప్రగతి భవన్‌లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్దంగా వాహన పూజ, అయధపూజ ఘనంగా నిర్వహించారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సంబరాల దసరా
దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉత్సవాల పరమార్థం. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమే విజయ దశమి. తమలోని దుర్గుణాలను తొలగించి సన్మార్గాన్ని ప్రసాదించ మని అమ్మవారిని కొలుచుకునే వేడుకే దసరా. ఈ శరన్నవరాత్రుల్లో తొమ్మిదిరోజులపాటు జగన్మాతను భక్తి శ్రద్దలతో పూజించి, 10వ రోజు పండగ జరుపుకోవడం ఆనవాయితీ. భారతదేశం సాంస్కృతిక వైవిధ్యం కారణంగా, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, వివిధ రూపాల్లో దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఇకనైనా కరోనా మహమ్మారినుంచి విముక్తి ప్రసాదించమని శరణు వేడుకుంటున్న ప్రత్యేక సందర్భంలో ఈ ఏడాది పండుగను నిర్వహించుకుంటున్నాం. ఆయురారోగ్యాలు, సకల శుభాలు వరించేలా ఆ దుర్గామాత దీవించాలని కోరుకుంటూ సాక్షి.కామ్ పాఠకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. -
దసరా పండుగ కళ వచ్చిందయ్యో
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా పండుగ కళ సంతరించుకుంది. పసుపు పచ్చని పూలు, పచ్చని మామిడాకుల తోరణాలతో సరదాల దసరా మహోత్సవాల సందడి నెలకొంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి నుంచి మమ్ములను కాపాడు తల్లీ అంటూ దేవీనవరాత్రి ఉత్సవాల్లో భక్తులు అమ్మవారిని వేడు కుంటున్నారు. అటు గత రెండేళ్లుగా స్తబ్ధుగా ఉన్నా ఈ ఏడాది బతుకమ్మb సంబురాలు కాస్త పుంజుకున్నాయి. పోయిరా బతుకమ్మా .. మళ్లీ రా బతుకమ్మా అంటూ తెలంగాణా ఆడబిడ్డలు బతుకమ్మ ఆటపాటలు, ఊరేగింపులతో సందడి సందడి చేశారు. జగన్మాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని కోరుకుంటూ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. -
దసరా సినిమా జోష్.. బోలెడన్ని అప్డేట్స్
కొత్త పోస్టర్లు, టీజర్ విడుదలలు.. ఇలా బోలెడన్ని అప్డేట్స్తో తెలుగు చిత్రసీమలో దసరా జోష్ కనిపించింది. సిద్ధమవుతున్న శంకర్... చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందనున్న ‘బోళా శంకర్’ సినిమా షూటింగ్ నవంబరులో ప్రారంభం కానుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. శుక్రవారం (అక్టోబరు 15) మహతి స్వరసాగర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి మహతి సంగీతదర్శకుడు అనే విషయాన్ని వెల్లడించారు. వాసు రెడీ... డిసెంబరులో థియేటర్స్‌కు వస్తున్నాడు వాసు. నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శక త్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో వాసు పాత్రలో కనిపిస్తారు నాని. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. బేబీ స్టార్ట్... ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొంద నున్న చిత్రం ‘బేబీ’. సాయిరాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్, దర్శకుడు మారుతి నిర్మిస్తున్నారు. సుకుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. మారుతి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ధీరజ్ మోగిలినేని. శ్రుతి ట్విస్టులు... ‘‘ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉన్నట్లే.. ప్రతి మహిళ సంఘర్షణ వెనక ఓ మగాడు ఉంటాడు’’ అంటున్నారు శ్రుతి. హన్సిక హీరోయిన్గా శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో బురుగు రమ్యప్రభాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’. ఈ చిత్రంలో శ్రుతి పాత్రలో నటిస్తున్నారు హన్సిక. ‘‘సర్ప్రైజ్లు, ట్విస్టులతో ఈ సినిమా కథనం సాగుతుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. గీత కథ... సునీల్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా వీవీ వినాయిక్ శిష్యుడు విశ్వా ఆర్. రావు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘గీత’. ఇందులో సాయికిరణ్ విలన్. ఆర్. రాచయ్య నిర్మించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. విభిన్నంగా... నోయల్, విశాఖ ధీమాన్, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో లక్ష్మీ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘14’. ఈ సినిమా టీజర్‌ను శ్రీ విష్ణు విడుదల చేశారు. ‘14’ డిఫరెంట్ చిత్రం’’ అన్నారు నోయల్. టీజర్ విడుదల కార్యక్రమంలో చిత్రదర్శకుడు లక్ష్మీ శ్రీనివాస్, నిర్మాతలు సుబ్బరావు రాయణ, శివకృష్ణ నిచ్చెనమెట్ల పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం దసరా శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా రాష్ట్రప్రజలకు గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దసరా పండుగను ప్రజలు జరుపుకుంటున్నారని గవర్నర్ పేర్కొన్నారు. మనమంతా కలసి వ్యాధులకు కారణమయ్యే వైరస్, పర్యావరణ విపత్తులు వంటి దుష్టశక్తులపై పోరాడాలని డా.తమిళిసై పిలుపునిచ్చారు. తెలంగాణకు దసరా ఓ ప్రత్యేక వేడుక అని సీఎం కేసీఆర్ అన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకూడదనే స్ఫూర్తితో, చెడు మీద మంచి విజయానికి సంకేతంగా విజయదశమిని జరుపుకుంటారని ఆయన తెలిపారు. ఆయురారోగ్యాలు సిరి సంపదలతో జీవించేలా తెలంగాణ ప్రజలను దీవించాలని దుర్గామాతను దసరా సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రార్థించారు -
ప్రాణదాత, విజయ ప్రదాత జమ్మి వృక్షం
శమీ శమయతే పాపమ్ శమీ శత్రు వినాశినీ! అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ!! తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి. ఈ వృక్షాన్ని ప్రపంచ అద్భుతంగా చెప్పుకోవచ్చు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో, దేశాలలో భక్తిపూర్వకంగా పూజించుకునే జమ్మి చెట్టు ఎంతో ప్రాధాన్యం గలది. తెలంగాణలో దసరా పండుగ నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. ఆ రోజు సాయంత్రం పక్షులను చూడటానికి ప్రజలు గుంపులు గుంపులుగా వెళతారు. ఇదే సందర్భంలో జమ్మి పూజ చేస్తారు. ‘‘శమీ శమయతే పాపమ్ శమీ శత్రు వినాశినీ! అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ!!’’ అని చదువుతూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు. ఆ తరువాత బంధు మిత్రులకు జమ్మి ఆకులు చేతిలో పెట్టి నమస్కరిస్తుంటారు. కొందరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు. ఒకరినొకరు పలుకరించుకోని వారు కూడా దసరానాడు ఈ పచ్చని ఆకులను చేతిలో పెట్టి నమస్కరించుకొని విభేదాలు మరిచి పోతారు. జమ్మి తెలంగాణ ప్రజల్లో వెల్లివిరిసే సౌహార్ద్రతకు ప్రతీక. రాముడు లంకపై యుద్ధానికి వెళ్ళే ముందు శమీ వృక్షాన్ని పూజించాడని చెబుతారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి పెడతారు. తమకు విజయం సిద్ధించాలని జమ్మి చెట్టును పూజించే సంప్రదాయం ఉన్నది. పలు రాష్ట్రాలలో జమ్మిని దసరానాడు పూజిస్తుంటారు. జమ్మిని పూజిస్తే శని పీడ విరగడవుతుందనే నమ్మకం కూడా ఉన్నది. నిప్పును పుట్టించడానికి శ్రేష్టమైనది కనుక దీనిని అగ్నిగర్భ అని కూడా అనేవారు. జమ్మి చెట్టు భారత ఉపఖండంలో, పశ్చిమాసియాలో పెరుగుతుంది. ఎంతటి కరువు కాలంలో అయినా తట్టుకొని నిలువడం ఈ చెట్టు ప్రత్యేకత. అందువల్ల ఈ చెట్లు ఉంటే కరువు కాలంలో కనీస హామీ ఉన్నట్టుగా భావిస్తారు. దుర్భిక్షంలో నెలకొన్నప్పుడు పశువులకే కాకుండా, మనుషులకూ ఆహారంగా ఉపయోగపడుతుంది. జమ్మి నుంచి వివిధ రకాల ఔషధాలు తయారు చేస్తారు. ఈ చెట్టు నీడన గిరిజన పెద్దలు సమావేశాలు జరుపుకునే అలవాటు కొన్ని ప్రాంతాలలో ఉన్నది. జమ్మి చెట్టు సగటు ఆయుర్దాయం 120 ఏండ్లు. వేర్లు ముప్ఫై మీటర్ల లోతు వరకు పోతాయి. ఏ మాత్రం తేమ లేని ఎడారి ప్రాంతాలలో కూడా ఈ చెట్టు తట్టుకుని నిలుస్తుంది. ఎడారుల్లో పెనుగాలులను నిలువరిస్తుంది. అరేబియా ఎడారిలో ఏ మాత్రం తేమ లేని నేలలో ఇది వేళ్ళూనుకొని పెరగడమే పెద్ద వింత. చుట్టూరా ఒక నీటి చుక్క ఉండదు, ఒక్క గడ్డి పరక కూడా మొలవదు. అయినా ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ చెట్టుకు నీరు ఎలా లభిస్తున్నదనేది శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని విషయం. జమ్మిచెట్టు విశిష్టతకు ఈ జీవ వృక్షమే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రపంచ పర్యావరణ ఉద్యమానికి నాంది పలికిన ఘనత జమ్మి చెట్టుకు ఉన్నది. 1730లో మార్వాడ (రాజ స్తాన్) రాజు తన రాజభవనం నిర్మాణంలో రాళ్ళ మధ్య బంక వాడటం కోసం చెట్లు కొట్టుకు రమ్మని ఆదేశించారు. ఎడారిలో దట్టంగా ఉన్న జమ్మి చెట్లు ఉన్న ఖేజాడ్లీ గ్రామం దగ్గరికి రాజభటులు వచ్చారు. ఇక్కడి బిష్ణోయి తెగ వారు చెట్లను నరకడాన్ని, జంతువులను చంపడాన్ని వ్యతిరేకిస్తారు. రాజభటులు చెట్లు నరుకుతున్నారని తెలిసిన అమృతాదేవి అనే మహిళ అక్కడకు వెళ్ళి అడ్డుకున్నది. జమ్మి చెట్టును కావలించుకొని ‘సర్ సాంటే రుఖ్ రహో తో భీ సస్తో జాణ్’ (చెట్టును కాపాడటానికి తలనైనా పణంగా పెట్టవచ్చు) అని నినదించింది. రాజభటుల గొడ్డలి దెబ్బకు ఆమె తల తెగిపడింది. ఆమె ముగ్గురు బిడ్డలు ఆసు, రత్ని, భాగుబాయి కూడా చెట్లను అలుముకున్నారు. వారి ముగ్గురి తలలు తెగిపడ్డాయి. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాలలోని బిష్ణోయి తెగవారంతా దండులా కదిలివచ్చారు. జమ్మి చెట్ల రక్షణకు పూనుకున్నారు. వృద్ధులు, మహిళలు, నవ దంపతులు, పిల్లలు అనే తేడా లేకుండా చెట్లను హత్తుకున్నారు. 363 తలలు తెగిపడ్డాయి. కర్కశ రాజభటుల హృదయం చలించింది. వారికి ఇక తలలు నరకడానికి చేతులాడలేదు. వెనుదిరిగిపోయి రాజుకు వివరించారు. వెంటనే రాజు చెట్లను నరకడాన్ని నిలిపివేయించాడు. పర్యావరణ పరిరక్షణ బిష్ణోయి సంప్రదాయం జంతువులను, మొక్కలను పరిరక్షించే బిష్ణోయి తెగ గురించి తరచు వార్తలలో చూస్తుంటాం. వైష్ణవ సంప్రదాయానికి చెందిన గురు జంభేశ్వర్ (1451– 1536) ఈ బోధనల మేరకు ఈ బిష్ణోయి శాఖ ఏర్పడింది. రాజస్తాన్‌లో 1485లో తీవ్ర కరువు ఏర్పడిన నేపథ్యంలో గురు జంభేశ్వర్ పర్యావరణ హితమైన జీవన విధానాన్ని నిర్దేశించారు. అతడు బోధించిన ఈ 29 సూత్రాలలో ఎనిమిది పర్యావరణ, జీవ వైవిధ్య పరిరక్షణకు తోడ్పడేవి కూడా ఉన్నాయి. ప్రకృతితో సహజీవనానికి వీలుగా వృక్ష జంతుజాలాన్ని కాపాడాలని ఆయన బోధించారు. బిష్ణోయి తెగవారు జమ్మిచెట్టును పవిత్రమైనదిగా పూజిస్తారు. చిప్కో అంటే హత్తుకోవడం. చెట్లను హత్తుకోవడమనే ఈ ఉద్యమం 1973లో ఉత్తరాఖండ్‌లో సాగింది. అడవుల నరికివేతకు వ్యతిరేకంగా సాగిన ఈ ఉద్యమంలో మహిళలే ప్రధాన పాత్ర వహించారు. ఈ ఉద్యమం ప్రపంచ పర్యావరణ ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమైంది. ఇప్పటికీ రాజ స్తాన్‌లో జమ్మి చెట్టుకు ప్రాధాన్యం ఉన్నది. జమ్మిని రాష్ట్ర వృక్షంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ జమ్మిని రాష్ట్ర వృక్షంగా ప్రకటించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలని కేసీఆర్ బోధిస్తున్నారు. ఈ మేరకు ఉద్యమ స్ఫూర్తితో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ.. హరిత తెలంగాణగా మారుతోంది. కేసీఆర్ పిలుపునందుకుని పర్యావరణ ఉద్యమంలో మనం భాగస్వాములం అవుదాం. మొక్కలను నాటుదాం. మన పిల్లలకు నివాసయోగ్యమైన భూగోళాన్ని వారసత్వంగా అందిద్దాం. జోగినపల్లి సంతోష్ కుమార్ వ్యాసకర్త ఎంపీ, రాజ్యసభ (దసరా పండుగ సందర్భంగా) -
శరన్నవరాత్రి ఉత్సవాలు: ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం
-
నవరాత్రులు ౼ నవోన్మేషాలు
ఆ ప్రాంతమంతా అంతవరకు నిశ్శబ్దంగా ఉంది. అక్కడకు ఎవరో రాబోతున్నారని అంతకుముందే సమాచారం వచ్చింది. దాంతో అక్కడకు. నేల ఈనినట్లుగా జనసందోహం చేరుకుంది. అందరూ ఒళ్ళంతా ఇంతింత కళ్లు చేసుకుని చూస్తున్నారు. చెవులను కూడా ఇంతింత చేసుకుని రాబోయే సవ్వడి కోసం నిరీక్షిస్తున్నారు. వారి మనసు ఆనందంతో పరవళ్లు తొక్కుతోంది. ఎప్పుడెప్పుడు ఆ సుమధుర సమయం ఆసన్నమవుతుందా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఆ శుభ ఘడియ సమీపించింది అనడానికి నిదర్శనంగా పారిజాత పరిమళాలతో కూడిన ఓ సువాసన నాసికా రంధ్రాల ద్వారా మనస్సులోకి ప్రవేశించి, కన్నులు అరమోడ్పులయాయి. దూరంగా మువ్వల సవ్వడులు సన్నగా వినిపిస్తూ, అంతలోనే గుండెలను తాకేంత దగ్గరకు చేరుకుంది ఆ శబ్దం. శబ్దంతో పాటు సువాసన గుబాళింపులు కూడా దగ్గరవుతున్నాయి. గాజుల గలగలలు, కంఠాభరణాల క్వణనిక్వణాలు, కర్ణాభరణాల చిరు సవ్వడులు, రకరకాల పూల పరిమళాలు.. నెమ్మదినెమ్మదిగా దగ్గర కాసాగాయి. అందరూ దూరం నుంచి భక్తితో గమనిస్తున్నారు. ఈ సవ్వడులతో పోటీ పడుతూ వారి చిరుమందహాసపు ధ్వనులు వీనుల విందు చేస్తున్నాయి. ఆ దృశ్యం చూసేసరికి అందరికీ ఏదో మైకం కలిగింది. ఒక్కసారిగా ఎదలు పులకించాయి. మాట మూగబోయింది. అప్రయత్నంగా రెండు చేతులు ఒక్కటయ్యాయి. కనులు రెప్ప వేయడం మరచిపోయాయి. మనసులో భక్తి పరుగులు తీసింది. అక్కడకు తొమ్మిదిమంది అమ్మవార్లు వారి వారి అలంకారాలలో విహారానికి వచ్చారు. ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. "ఏవమ్మా! బాలా! నీతోనేగా నవరాత్రులు ప్రారంభమవుతాయి" అంటున్నారు మిగిలిన ఎనమండుగురు.. బాల స్వచ్ఛమైన పసి మొగ్గలాంటి చిరునవ్వుతో... "నేను బాలనే.. ఎన్నటికీ బాలనే.. మీ అందరికీ చెల్లెలినే... " అంటూ ముద్దుముద్దుగా పలికింది. అందుకు రాజరాజేశ్వరి.. "నువ్వు ఆదిశక్తివి. అందుకే నిన్ను ఆదిశక్తిపరాయీ" అని స్తుతించారు. అంతేనా బాలేన్దు మౌళివి. అందులోనూ బాల పదంతోనే కీర్తించబడ్డావు చూడు" అని అంటుంటే, బాల పకపక నవ్వింది. "మీకు తెలియనిది కాదు.. మానవ జన్మ బాల్యంతోనే ప్రారంభమవుతుంది కదా. అప్పుడు వారు ఆదిశక్తిలాగే ఉంటారు కదా.." అంటూ లౌకికార్థం పలికింది బాల. అందరి దృష్టి గాయత్రీమాత వైపుగా మరలింది. "మన తొమ్మిది మందిలోనూ గాయత్రిని నిత్యం స్మరిస్తూ ఉంటారు కదా" అన్నారు. "అవును గాయత్రీమంత్రాన్ని కొందరు లక్షసార్లు లక్ష గాయత్రి పేరుతో చేస్తారు. మనందరికంటె గాయత్రీ మాతే గొప్పది.." అన్నారు. గాయత్రికి అరనవ్వు వచ్చింది. "ఎనిమిది సంవత్సరాలు నిండితే అందరూ విద్యాభ్యాసం చేస్తారు కదా. అలా 14 సంవత్సరాలు వాళ్లు చదువుకుంటారు కదా. మరి నిత్యం గాయత్రీ మంత్రాన్ని స్మరించటమంటే అదే కదా. మానవులకు చదువు ఎంత అవసరమో మనకు తెలియదా. విద్య లేని వాడు వింత పశువు అనే మాట వాడకంలో ఉండనే ఉంది కదా" మిగిలిన ఎనమండుగురు భక్తిగా గాయత్రీ మాతకు నమస్కరించారు. ఇప్పుడు అందరూ తమ కడుపులు చూసుకుంటూ అన్నపూర్ణ వైపుగా చూశారు. అప్పటికే అన్నపూర్ణ తన చేతిని గుండిగలోకి పంపింది. "మీరేమంటారో నాకు అర్థమయిందిలే. సాక్షాత్తు పరమశివుడు కూడా నన్ను భిక్ష అడిగాడనేగా. అందులో అంతరార్థం మీకు తెలియనిది కాదు. ఆకలి వేస్తే ఎవరైనా అమ్మనే కదా అడిగేది. భోజ్యేషు మాతా అని తెలియదా. అందుకే నేను పూర్ణాహారం అంటే సంపూర్ణంగా.. అదే కడుపునిండుగా సంతృప్తిగా వడ్డిస్తాను కదా. అందుకే నన్ను అన్నపూర్ణగా కొలుస్తున్నారు. మానవ మనుగడకు అన్నపూర్ణ అవసరం ఉంది కనకనే నేను అవతరించాను.." అంటూ అందరికీ తృప్తిగా వడ్డన చేసింది అన్నపూర్ణాదేవి. అవును అందుకే "నిన్ను నిత్యానందకరీ వరాభయకరీ... చంద్రార్కానల భాసమాన లహరీ.. భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ... " అంటూ ప్రస్తుతించారు.. అన్నారు ఎనమండుగురు తోబుట్టువులు. కడుపులు నిండగానే అందరూ లలితా త్రిపుర సుందరిని ప్రసన్న వదనాలతో తిలకించారు. "నీ పేరులోనే లలితం ఉంది. నువ్వు నిత్యం ప్రసన్నంగా ఉంటావు. ఇది ఎలా సాధ్యం" అన్నారు అష్టమాతలు. "ఇన్ని సంవత్సరాలు చదువుకుని, ఇంత ఆరోగ్యకరమైన ఆహారం భుజించాక ప్రసన్నత వచ్చితీరుతుంది. సాత్త్వికాహారం, సద్గురువుల దగ్గర విద్యాభ్యాసం.. ఇవే కదా మన మనసును ప్రభావితం చేసేది" అంటూ ప్రసన్నంగా పలికింది లలితాత్రిపుర సుందరి. "నిజమే! నిన్ను నిత్యం సహస్రనామాలతో కొలుస్తారు ఇందుకేనేమో. నీకు పెట్టే నైవేద్యాలు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి కదా. నిన్ను హరిద్రాన్నైక రసికా, ముద్గౌదనాచిత్తా, హరిద్రాన్నైక రసికా.. " అంటూ ఆనందంగా లలితాదేవిని సహస్రనామాలలోని మంత్రాలతో స్తుతించారు, ఎనమండుగురు తల్లులు. "మరోమాట కూడా చెప్పాలి నీ గురించి... నీ పూజ ప్రారంభించేసమయంలో గంధం పరికల్పయామి, ధూపం పరికల్పయామి... అంటూ ఈ సృష్టి పంచభూతాత్మకం, మానవ శరీరం కూడా పంచభూతాలతోనే నిర్మితమైనదని అంతర్లీనంగా ఎంతో చక్కగా తెలియచేశావు" అంటూ లలితాదేవిని ప్రశంసించారు. ఇప్పుడు అందరూ చెట్టాపట్టాలేసుకుంటూ మహాలక్ష్మి వైపు చూస్తూ..."ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలా మహాలక్ష్మి పుట్టింది అనేస్తుంటారు. ఇంతమందిమి ఉండగా నీకే ఆ ఘనత దక్కింది.." అన్నారు. మహాలక్ష్మి... సిరులచిరునవ్వులు కురిపిస్తూ..."ఒక్కసారి సావధానంగా ఆలోచించండి. బాలగా అవతరించి, గాయత్రిగా చదువుకుని, అన్నపూర్ణగా అందరి కడుపులు నింపి, లలితగా పూజలు అందుకున్న తరవాతేగా నేను అవతరించాను. అప్పుడు నన్ను అందరూ ఆ ఇంటి దైవంగా కొలవకుండా ఎలా ఉంటారు. ఇన్నిసత్కర్మలు తరవాతే కదా నేను మహాలక్ష్మిగా ప్రభవించాను.". అంటూ నిరాడంబరంగా పలికింది మహాలక్ష్మి. "నిజమేలే...అందుకేగా నిన్ను సర్వపాపహరే దేవీ, సర్వదుఃఖ హరే దేవీ అంటూ కొనియాడుతున్నారు "అన్నారు అంతా ముక్తకంఠంతో. పక్కనే ధవళ వర్ణ శోభితంగా ఉన్న సరస్వతి వీణ వాయిస్తోంది. "ఇప్పటిదాకా మా పక్కనే ఉన్నావు, అంతలోనే వీణ అందుకున్నావా.. అందుకేగా నిన్ను యా వీణా వర దండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా అంటూ పిలుస్తున్నారు. నిత్యం తెల్లటి వలువలతో, తెల్లని హంస మీద కూర్చుని దర్శనమిస్తావు. సరస్వతీ నమస్తుభ్యం ... విద్యారంభం కరిష్యామి.. అంటూ నీ ప్రశంసతోనే విద్యాభ్యాసం ప్రారంభిస్తారు కదా...నీ మెడలో స్పటిక మాల కాంతులు వర్ణించలేము" అంటూ పలికారు. తెల్లటి కాంతులు వెదజల్లే చిరునవ్వుతో సరస్వతీ దేవి.." ఇందాక మహాలక్ష్మి చెప్పినట్లుగా ఇంత మంచి చేసుకుంటూ రావటంతో పాటు, నాకు మరికాస్త జీవితానుభవం వచ్చినట్లే కదా. చదువు చెప్పేవారికి చదువుతో పాటు జీవితానుభవం, వయస్సు కూడా ఉండాలి. నాకు అవి వచ్చాయి కదా. బాలగా ప్రారంభమై... మహాలక్ష్మి దాకా ఎంతో మంచి జరిగిన తరువాత కదా నేను ప్రభవించాను. ఆ జీవితానుభవమే నన్ను చదువుల తల్లిగా నిలబెట్టింది. తెలుపు స్వచ్ఛతకు చిహ్నం. పారదర్శకంగా ఉండడానికి స్పటిక మాల" అంది వీణ మీద సరస్వతీ రాగాన్ని మీటుతూ ఆ శారదామాత. ఇప్పుడు అందరికీ దుర్గమ్మ వైపు చూడాలంటే భయంగా ఉంది. దుర్గమాసురుడిని సంహరించి దుర్గామాతగా అందరి పూజలు అందుకుంటూ.. దుర్గాష్టమిగా నవరాత్రులలో ఎనిమిదో రాత్రిని తన పేరు మీదుగా తెచ్చుకుంది. ఇంతవరకు వారితోనే కలసిమెలసి తిరిగిన దుర్గమ్మకు.. వారిలోని భయాన్ని చూస్తే నవ్వు వచ్చింది. "ఎందుకు మీరంతా భయపడతారు. స్త్రీ శక్తి స్వరూపిణి. దుష్ట సంహారం చేయగలదని కదా నేను నిరూపించినది. నాకు ఈ శక్తి ఎక్కడ నుంచి వచ్చిందో మళ్లీ నేను చెబితే చర్వితచర్వణమే అవుతుంది. బాలగా అవతరించి, ఇంత చక్కగా చదువుకుని, శక్తిమంతమైన ఆహారం తిని, అందరి స్తుతులు అందుకుని, సంపదలు పొంది, విద్యాధి దేవతను అయ్యాక... నాకు వచ్చే మనోబలం, బుద్ధిబలం, శరీర బలంతో దుష్ట సంహారం చేయటం పెద్ద కష్టమైన విషయం కాదు కదా.." అంటూ అదంతా తన గొప్పతనం కాదన్నట్లుగా పలికింది దుర్గమ్మ. అందరూ దుర్గమ్మను చేరి, గుండెలకు హత్తుకుని ముద్దాడారు. అక్కడితో భయం పోయిందా అనుకుంటే పోలేదు.. ఇప్పుడు భయం రెట్టింపయ్యింది.. తమలోనే ఉన్న మహిషాసురమర్దినిని చూస్తూ భీతిల్లిపోతున్నారు అందరూ దుర్గమ్మను చూసి. "నన్ను చూసి భయపడకండి. దుష్ట సంహారం చేసే శక్తి ఏ విధంగా వచ్చిందో ఇంతకుముందే దుర్గమ్మ విపులీకరించింది కదా. నేనూ అదే మాట చెప్తాను.." అంటూ అతి వినయంగా పలికింది, అంతటి మహిషుడిని సంహరించిన తల్లి. అందరూ తమ భయాన్ని విడిచిపెట్టి... "నిజమే.. నీ గొప్పదనాన్ని చూసే కదా ఆది శంకరాచార్యుడు నీ మీద అద్భుతమైన స్తోత్రం రచించాడు. అయిగిరి నందిని నందిత మేదిని... అంటూ... ఆ స్తోత్రం చదువుతుంటే చాలు అందరిలోనూ తన్మయత్వం కలుగుతుంది. ఆదిశంకరుడికి కలిగిన తన్మయమే ఈ స్తోత్ర రూపంలో అప్రయత్నంగా వెలువడి ఉంటుంది " అన్నారు అందరూ. ఇప్పుడు చివరగా అందరి చూపులు ఆ రాజరాజేశ్వరి మీదకు మళ్లాయి.. "ఇన్ని రోజులుగా మమ్మల్ని అందరూ ఒక్కోరోజు ఒక్కో రకంగా పూజించారు. చిట్టచివరగా అందరూ నిన్ను శ్రీరాజరాజేశ్వరిగా కొలుస్తారు. ఈ రోజును విజయదశమిగా కూడా పిలుస్తారు" అంటూ ప్రశ్నార్థకంగా అంటుంటే.." తొమ్మిది రోజుల పాటు నెమ్మదిగా శక్తి సమకూర్చుకుంటూ ఎదిగాక.. ఇక చివరగా విజయం లభించినట్లే కదా. ఈ విజయదశమి నా ఒక్కదానిదే కాదు కదా. తొమ్మిదిరోజుల పాటు విజయవంతంగా సకల శుభాలు సమకూర్చినందుకే ప్రతీకగానే కదా నేను రాజరాజేశ్వరిని అవుతున్నాను. విజయదశమి పండుగకు దేవతనవుతున్నాను.మనమందరం అరిషడ్వర్గాలకు అతీతంగా ఉన్నాం. ఐకమత్యంగా ఉన్నాం. విజయం సాధించాం. భిన్నత్వంలో ఏకత్వం అంటే మనమే కదా. అందుకే విజయదశమి అనే పేరు వచ్చింది కదా. మన మంచితనమే విజయానికి కారణం అని మానవులకు తెలియచేయడానికే కదా ఈ పండుగను వారికి ప్రసాదించాం... " అంది రాజరాజేశ్వరి. దూరం నుంచి ఈ తల్లుల అమర సంభాషణను గమనిస్తున్న వారి మనసులు భక్తితో నిండిపోయాయి. గుండెలు ఆర్ద్రమయ్యాయి. ఓహో ఇందుకేనా ఒక బిడ్డను నవమాసాలు గర్భంలో మోసి, ఆ తరవాత ప్రసవించేది అనుకున్నారు. ఈ నవరాత్రుల అంతరార్థం ఇదా అనుకున్నారు. అందులోనే ఒక పండితుడు మరో విషయం వివరించాడు.. "గ్రామ ప్రజలారా... ఒక్క విషయం అర్థం చేసుకోండి... ఈ సృష్టికి కారణం ప్రకృతి పురుషుడు అని అందరికీ తెలుసు. వారు తొమ్మిది మంది ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఆ ఆడపిల్లల పేరు మీదే వేల సంవత్సరాలుగా నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్నాం. మనం కూడా ఆడపిల్లను గౌరవంగా పెంచుదాం. వారికి మన గుండెల్లో గుడి కడదాం. ఆడపిల్లను చులకన చేయకూడదని మనకి తెలుస్తోంది కదా. బాలగా మన ఇంట అడుగుపెట్టిన ఆడపిల్ల, మనకు చేదోడు వాదోడుగా ఉంటూ తల్లిగా ఆదరిస్తూ, మరో ఇంటికి వెళ్లి అందరినీ కనిపెట్టుకొని ఉండి, తాను తల్లిగా మారి జనని అవుతోంది. ఈ తొమ్మిది మంది జగన్మాతలు వేరు వేరు రూపాలతో, వేరు వేరు నామాలతో మనని ఆదరిస్తున్నారు. ఏ పేరుతో పిలిచినా తల్లి తల్లే అని గ్రహించండి. అమ్మా...అని పిలిస్తే పలికే చల్లని తల్లి ఆ జగన్మాత. అమ్మని పూజిద్దాం, ఆడపిల్లను అమ్మగా ఆదరిద్దాం" అంటూ ఆవేశంగా తన మాటలు ముగిస్తూ అందరికీ నమస్కరించాడు. అందరూ ఆ పెద్దాయన మాటలలోని అంతరార్థాన్ని ఆలోచించటం ప్రారంభించారు. - వైజయంతి పురాణపండ(సృజన రచన) -
ప్రైవేట్ ట్రావెల్స్.. దసరా దందా..!
దసరా రద్దీని ప్రైవేట్ ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. టికెట్ ధరలు అమాంతం పెంచేశాయి. ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నాయి. సాధారణ ధరల కంటే అదనంగా ఒక్కో టికెట్‌పై రూ.400 వరకూ వసూలు చేస్తున్నాయి. దసరా సెలవులకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రవాణా శాఖ అధికారుల ఆదేశాలను సైతం ట్రావెల్స్ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా మాటలకే పరిమితమయ్యారు. ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. చీరాల: విజయదశమి పండుగ సెలవులకు సొంతూళ్లకు వెళ్లేవారికి దోపిడీ తప్పడం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ముక్కు పిండి అదనపు చార్జీలు వసూలు చేయడం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. దసరా సందర్భంగా ఆర్టీసీతో పాటు రైల్వేలో కూడా రద్దీ నెలకొంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు టికెట్ ధరలు అమాంతం పెంచేశారు. అడిగేవాళ్లు లేకపోవడంతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 600కుపైగా సర్వీసులు... జిల్లా కేంద్రమైన ఒంగోలుతో పాటు చీరాల, మార్కాపురం, కందుకూరు, అద్దంకి, కనిగిరి ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు నిత్యం 600కుపైగా రాకపోకలు సాగిస్తున్నాయి. పండుగ సీజన్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులు కూడా నడుపుతున్నాయి. అయితే, ప్రైవేటు ట్రావెల్స్‌లో చార్జీల మోత మోగుతుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పండుగ కాస్తా..దండగగా మారిందంటూ నిష్టూరుస్తున్నారు. దసరా ఉత్సవాలు, సెలవులతో పెరిగిన రద్దీ... కరోనా రెండు దశలను విజయవంతంగా ఎదుర్కొని ప్రజాజీవనం మరలా గాడిలో పడుతోంది. దూర ప్రాంతాల నుంచి రాకపోకలు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు జనం వెళ్లివస్తున్నారు. ఈ సమయంలో వచ్చిన దసరా పండుగకు ఉత్సవాలు జరుపుకునేందుకు ప్రభుత్వం కూడా అనుమతివ్వడంతో నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. బుధవారం దుర్గాష్టమి నుంచి కార్యాలయాలకు కూడా సెలవులు కావడంతో స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు ప్రయాణమయ్యారు. దీంతో ఒక్కసారిగా రద్దీ ఏర్పడింది. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు కాసులు కురిపిస్తోంది. చదవండి: (దర్శి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత) రెట్టింపు ధరలతో బెంబేలు... కరోనా ఉధృతి తగ్గిన అనంతరం వచ్చిన పెద్ద పండుగ కావడంతో వృత్తిరీత్యా దూరప్రాంతాల్లో ఉంటున్న వారంతా సొంతూళ్లకు బయలుదేరారు. జిల్లాకు చెందిన ఎక్కువ మంది ఉద్యోగ, వ్యాపారాల రీత్యా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. ఆర్టీసీ రెగ్యులర్ సర్వీసులను సాధారాణ చార్జీలతో నడుపుతుండగా, పండుగ అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు మాత్రం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక చార్జీలతో కొన్ని బస్సులు నడుపుతున్నారు. కానీ, ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారు. రోజువారీ సర్వీసుల టికెట్ ధరల కంటే రూ.300 నుంచి రూ.400 అదనంగా వసూలు చేస్తున్నారు. ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ చార్జీ రూ.440 ఉండగా, ప్రైవేటు బస్సుల్లో చార్జీలు ఏసీ రూ.1,300, నాన్ ఏసీ రూ.890 తీసుకుంటున్నారు. చీరాల నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సు చార్జీ రూ.425 ఉండగా, ప్రైవేటు బస్సు ఏసీ టికెట్ రూ.1,200, నాన్ ఏసీ బస్సు టికెట్‌కు రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. చీరాల నుంచి హైదరాబాద్‌కు 20కిపైగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి. నిబంధనలకు చెల్లుచీటీ... ప్రైవేటు బస్సుల్లో అధిక ధరలకు టికెట్లు విక్రయించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ.. పండుగ సీజన్లలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు తాపత్రయపడుతున్నాయి. కరోనా నియంత్రణ చర్యలు పాటిస్తున్నామని బహిరంగ ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. ఆ దాఖలాలు కనిపించడం లేదు. పండుగ సంగతి ఏలా ఉన్నా ట్రావెల్స్ బస్సుల టికెట్ ధరలతో ప్రయాణికుల జేబులకు మాత్రం చిల్లు తప్పేలా లేదు. 303 బస్సులను తనిఖీ చేశాం దసరా రద్దీ నేపథ్యంలో ప్రైవేటు బస్సులు అధిక చార్జీలు వసూలు చేయకుండా పర్యవేక్షిస్తున్నాం. గడిచిన నాలుగు రోజుల్లో జిల్లావ్యాప్తంగా 303 బస్సులను తనిఖీ చేశాం. టికెట్ ధరలు అధికంగా వసూలు చేస్తున్న దాఖలాలు లేవు. కానీ, ఇతర కారణాలతో 33 కేసులు నమోదు చేశాం. ట్రావెల్స్ బస్సుల నిర్వాహకులు అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తే టోల్ ఫ్రీ నంబర్ 91542 94502కు ప్రయాణికులు ఫిర్యాదు చేయాలి. అధిక ధరలు వసూలు చేసినట్లు నిర్ధారణ జరిగితే బస్సులు, యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. – భువనగిరి శ్రీకృష్ణవేణి, రవాణాశాఖ ఉప కమిషనర్, ఒంగోలు -
Telangana: విద్యార్థుల ‘వసతి’కి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ విద్యార్థులకు శుభవార్త. కోవిడ్–19 నేపథ్యంలో మూతబడ్డ సంక్షేమ వసతిగృహాలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. విద్యా సంస్థలను ప్రారంభించినప్పటికీ వసతిగృహాలను తెరవకపోవడంతో విద్యార్థులకు బస ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో కొందరు ప్రైవేటు హాస్టళ్లలో డబ్బులు చెల్లించి వసతి పొందుతుండగా.. మరికొందరు రోజువారీ తరగతులకు హాజరు కాకుండా ఇంటివద్దనే ఉంటున్నారు. దీంతో విద్యార్థుల ఇబ్బందులను వివరిస్తూ విద్యార్థి సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో సంక్షేమ శాఖల పరిధిలోని ప్రీమెట్రిక్ హాస్టళ్లు, పోస్టుమెట్రిక్ హాస్టళ్లను ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతిగృహాలు తెరిచేందుకు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఒకట్రెండు రోజుల్లో ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు కూడా ఈ దిశలో ఆదేశాలు జారీ చేయనున్నాయి. దసరా సెలవుల తర్వాత హాస్టళ్లను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1,750 వసతి గృహాలు.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,750 వసతి గృహాలున్నాయి. ఇందులో 650 కళాశాల విద్యార్థి వసతిగృహాలు కాగా మిగతావి పాఠశాల విద్యార్థుల వసతిగృహాలు. ఈ వసతిగృహాల పరిధిలో 2.27 లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో ఈ వసతిగృహాలన్నీ మూతబడ్డాయి. గత ఏడాది మార్చి రెండో వారంలో ఈ హాస్టళ్లు మూతబడగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో నెలరోజుల పాటు తాత్కాలికంగా తెరిచారు. తిరిగి కోవిడ్ వ్యాప్తి తీవ్రం కావడంతో మూసివేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు దసరా సెలవుల తర్వాత తిరిగి హాస్టళ్లకు చేరుకోనున్నారు. -
80 శాతం ఆక్యుపెన్సీ సాధిస్తున్న దసరా ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్బీ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 80 శాతానికిపైగా ఆక్యుపెన్సీ సాధిస్తున్నాయని, అయితే సాధారణ సర్వీసుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. కేవలం 16 దసరా ప్రత్యేక బస్సుల్లో మాత్రమే 50శాతం అదనపు చార్జీ వసూలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న అవగాహన ఒప్పందం మేరకు రెండు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు బస్సులను నడుపుతున్నాయని వివరించారు. -
నేడు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు. సోమవారం ఉదయం దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని, సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ జె.నివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకుంటారని చెప్పారు. అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. అనంతరం వేదపండితులు ఆయన్ని ఆశీర్వదిస్తారని తెలిపారు. పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి ఎక్కువమంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆగ్మెంటెడ్ రియాల్టీ షోను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అమ్మవారి చరిత్రను తెలిపే ఆగ్మెంటెడ్ రియాల్టీ షోను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. దుర్గగుడి అధికారులు సరికొత్త టెక్నాలజీతో ఇంద్రకీలాద్రిపై ఘాట్‌రోడ్డు, చినరాజగోపురం, మల్లేశ్వరస్వామి దేవస్థానాల వద్ద చరిత్ర చెప్పే క్యూఆర్ కోడ్ ఉన్న బోర్డులు ఏర్పాటు చేశారు. ‘కనకదుర్గ ఏఆర్’ అనే యాప్ డౌన్లోడ్ చేసి బోర్డుపై కోడ్ స్కాన్ చేస్తే అమ్మవారి చరిత్ర, ఆడియా, వీడియో ద్వారా విని, చూసే అవకాశం ఉందని ఆలయ ఈఈ భాస్కర్ తెలిపారు. సినిమా మాదిరి బొమ్మలు, మ్యూజిక్ ప్రత్యేకంగా ఉంటాయన్నారు. ఇది చిన్న పిల్లలకు వినోదాత్మకంగా కూడా ఉంటుందని చెప్పారు. -
రేపు దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం దుర్గమ్మను దర్శించికుని.. మధ్యాహ్నం 3 గంటలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదివారం 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం మూలా నక్షత్రం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు పక్కాగా చేశాం. దీనికి భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్నారు. ఇంద్రకీలాద్రి: నేడు రెండు అవతారలలో దుర్గమ్మ దర్శనం.. ఇంద్రకీలాద్రిపై దసరామహోత్సవాల్లో నేడు ఐదవరోజు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇక నేడు రెండు అవతారాలలో దుర్గమ్మ దర్శనమిస్తుంది. పంచమి, షష్టి తిథులు ఏకమవ్వడంతో అమ్మవారికి రెండు అలంకారాలు చేస్తారు. ఉదయం అన్నపూర్ణా దేవిగా దర్శనమిస్తుండగా.. మధ్యాహ్నం 12 గంటల నుంచి మహాలక్ష్మీ దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం లభిస్తుంది. సోమవారం ఉదయం 4 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. (చదవండి: దుర్గమ్మ దర్శనానికి.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరి) తిరుమల: మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్స మండపంలో శ్రీమలయప్పస్వామివారు మోహినీ రూపంలో దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు.రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహన సేవ ఉంటుంది. చదవండి: టీటీడీ చరిత్రలో అరుదైన దృశ్యం.. -
TSRTC: ‘అదనం’ లేదు
ఆర్టీసీ బస్సులు గత 5 రోజుల్లో 1.30 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. ఆర్టీసీపై ప్రజల్లో అభిమానం ఉందనడానికి ఇదే నిదర్శనం. పండుగ వేళ మిగతా వాళ్లు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షితంగా ప్రయాణించి సంస్థకు అండగా నిలవాలి. ప్రయాణికులు తమ భద్రతకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్టవుతుంది. –ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సాక్షి, హైదరాబాద్: పండుగకు ఊరెళ్లాలంటే జేబులు గుల్లకావడం ఖాయం. ప్రైవేటు ట్రావెల్స్ రెండు మూడు రెట్లకుపైగా చార్జీలు వసూలు చేస్తే.. ఆర్టీసీ కూడా టికెట్ రేటుపై 50శాతం అదనంగా తీసుకునేది. దసరా సహా ప్రతి పండుగకూ మామూలు సర్వీసులను తగ్గించి పండుగ స్పెషల్ బస్సులు వేసేది. కానీ ఈసారి దసరాకు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. సాధారణ బస్సులతోపాటు స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ టికెట్ ధరలనే వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆదరణ పెంచుకునేందుకు కొన్నాళ్లుగా ఆర్టీసీ కునారిల్లుతూ వస్తోంది. సంస్థ నిర్వహణ లోపాల కారణంగా ప్రయాణికుల ఆదరణ తగ్గింది. పండుగల సమయంలోనే కాదు సాధారణ రోజుల్లోనూ.. ఆర్టీసీ కంటే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకే గిరాకీ ఎక్కువగా ఉండటం పెరిగింది. ఈ పరిస్థితిని మార్చడంపై సంస్థ కొత్త ఎండీ సజ్జనార్ దృష్టిపెట్టారు. ఇందుకు దసరా పండుగ సమయాన్ని అవకాశంగా మార్చుకోవాలని నిర్ణయించారు. సాధారణంగా పండుగల సమయంలో ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్‌తో నడిపే ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధర 50 శాతం అదనంగా ఉంటుంది. ఈసారి కూడా అదనపు రుసుముతో స్పెషల్ బస్సులు తిప్పాలని అధికారులు భావించినా.. సజ్జనార్ దీనిని వ్యతిరేకించారు. పండుగల సమయంలో లక్షల మంది బస్సుల్లో సొంతూర్లకు వెళతారని, ఇలాంటి సమయంలో అదనపు వసూలును వదిలేయడం వల్ల ప్రజల్లో ఆర్టీసీపై ఆదరణ పెరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు నిత్యం ఆర్టీసీ బస్సులు ఎక్కితే.. ఆక్యుపెన్సీ రేషియో, ఆదాయం ఆటోమేటిక్‌గా పెరుగుతాయని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు అదనపు చార్జీలేవీ లేకుండానే స్పెషల్ బస్సులు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదనపు రాబడి తక్కువ.. చెడ్డపేరు ఎక్కువ.. ఆర్టీసీకి రోజువారీ టికెట్ ఆదాయం గరిష్టంగా రూ.13 కోట్ల వరకు ఉంటుంది. కోవిడ్‌కు ముందు (సమ్మె కాలం కాకుండా) ఈస్థాయి ఆదాయం నమోదైంది. దసరా పండుగకు మూడు రోజుల ముందు, తర్వాత అదనపు బస్సుల వల్ల మరికొంత ఆదాయం పెరుగుతుంది. ఇందులో టికెట్ చార్జీలపై 50శాతం ఎక్కువ ధర తీసుకోవడం వల్ల.. ఆర్టీసీకి అదనంగా సమకూరేది రోజుకు రూ.40 లక్షలేనని అంచనా. ఈ మాత్రం ఆదాయం కోసం.. అదనపు చార్జీల బాదుడు అంటూ ప్రజల్లో చెడ్డపేరు వస్తోందని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. సజ్జనార్ ఈ అంశాలన్నింటినీ పరిశీలించి, అదనపు బాదుడు వద్దనే నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటున్నాయి. అలా ప్రయాణికులను తరలించొద్దు పండుగ వేళ డిమాండ్‌ను ఆసరాగా తీసుకుని కొందరు సాధారణ ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తున్నారని అధికారులు గుర్తించారు. తెలుపురంగు నంబర్ ప్లేట్ ఉన్న (నాన్ కమర్షియల్) వాహనాల్లో ప్రయాణికులను తరలించడం నేరమని.. అలాంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపడతామని ప్రకటించారు. ఇటీవల ఆర్టీసీ–రవాణా శాఖ అధికారుల సంయుక్త తనిఖీల్లో 20 వాహనాలను పట్టుకుని సీజ్ చేశారు. నాన్–కమర్షియల్ వాహనాల్లో ప్రయాణించేప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే బీమా కూడా రాదని అధికారులు పేర్కొంటున్నారు. -
దసరాకు ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవే..
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): రద్దీ మార్గాల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు ప్రత్యేక పూజా స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. విశాఖపట్నం–సికింద్రాబాద్(08579) వీక్లీ అక్టోబర్ 13, 20, 27 తేదీల్లో విశాఖపట్నంలో రాత్రి 7కు బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 7గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08580) సికింద్రాబాద్‌లో అక్టోబర్ 14, 21, 28 తేదీల్లో రాత్రి 7.40కు బయలుదేరి.. మరుసటిరోజు ఉదయం 6.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. (చదవండి: Chedi Talimkhana: గంతలు కట్టినా.. గురి తప్పదు..) విశాఖపట్నం–తిరుపతి(08583) వీక్లీ విశాఖపట్నంలో అక్టోబర్ 18, 25, నవంబర్ ఒకటి తేదీల్లో రాత్రి 7.15 బయలుదేరి.. మరుసటి రోజు ఉద యం 7.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08584) తిరుపతిలో అక్టోబర్ 19, 26, నవంబర్ 2 తేదీల్లో రాత్రి 9.55 బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 10.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం–సికింద్రాబాద్(08585) స్పెషల్ విశాఖపట్నంలో అక్టోబర్ 19, 26, నవంబర్ 2 తేదీల్లో సాయంత్రం 5.35 బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో(08586) సికింద్రాబాద్‌లో అక్టోబర్ 20, 27, నవంబరు 3 తేదీల్లో రాత్రి 9.05 గంటలకు బయలుదేరుతుంది. చదవండి: ఇళ్ల మధ్యే సమాధులు.. మంచమే వాడని వింత ప్రపంచం -
రాముడు మా ఊరొచ్చాడు.. 14 ఏళ్ల వనవాసం ఇక్కడే
ప్రకృతి పచ్చదనం మధ్య అచ్చంగా అడవి బిడ్డల ఆనందడోలికలలో సాగే వేడుక ఇది. చత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్‌లో దసరా రెండున్నర నెలల పండగ. విజయదశమికి 75 ముందే మొదలవుతుంది. ఈ దండకారణ్య వేడుకలో ఆదివాసీలు ఆనందంగా పాల్గొంటారు. ఈ పండగకు దంతేశ్వరీ దేవిని పూజిస్తారు. ఆదివాసీలు రాముడిని తమ అతిథిగా భావిస్తారు. పద్నాలుగేళ్ల వనవాసం చేసింది తమ దగ్గరే అని చెబుతారు. జాతికులమతాల పరిధులేవీ లేని వేడుకలివి. రథయాత్ర కోసం ఏటా అడవిలో కలపను సేకరించి ఎనిమిది చక్రాల కొత్త రథాన్ని తయారు చేస్తారు. రథం కోసం కలప సేకరణ ఈ వేడుకలో తొలి ఘట్టం. ఆ వేడుకను పత్ జాతర అంటారు. చదవండి: Beauty of Nature: ఈ చెట్లు ఒయ్యారంగా సాల్సా డాన్స్ చేస్తాయట.. ఆశ్యర్యం!! పదవ రోజు మురియా దర్బార్తో వేడుకలు ముగుస్తాయి. బస్తర్ ప్రజలు దర్బారులో తమ సమస్యలను రాజుకు విన్నవించుకునే ఘట్టం అది. బస్తర్ దసరా వేడుకల్లో ఘోతుల్ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది యువతీయువకులకు తమ భాగస్వామిని ఎంచుకునే అవకాశం కల్పించే వేడుక. గుజరాత్ నవరాత్రి వేడుకలో గర్భా నాట్యంలాగ అన్నమాట. దసరా వేడుకల సమయంలో బస్తర్ యాత్రకు వెళ్తే ఆదివాసీ సంగీతవాద్యాలు, నాట్యరీతులు, వస్త్రధారణను చూడవచ్చు. ఆదివాసీ మహిళలు ఎర్రటి సంప్రదాయ దుస్తులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రభుత్వం నిర్వహించే వేడుకలో రాజకుటుంబ వారసులు కూడా పాల్గొంటారు. చదవండి: Chowmahalla Palace: ప్యాలెస్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?! -
దసరా సెలవులు : ఊరు బాట పట్టిన నగరవాసులు.. ( ఫోటోలు)
-
దసరాకు 4 వేల ఆర్టీసీ బస్సులు
సాక్షి, అమరావతి: దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల కోసం రేపటి (శుక్రవారం) నుంచి ఈనెల 18వ తేదీ వరకు 4 వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు తెలిపారు. 14వ తేదీ వరకు 1,800 బస్సులు, 15 నుంచి 18వ తేదీ వరకు 2,200 బస్సులు తిప్పుతామని చెప్పారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దసరా సందర్భంగా ప్రయాణికులు తమ స్వస్థలాలకు సౌకర్యవంతంగా వచ్చి, పండుగ తరువాత మళ్లీ వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందన్నారు. హైదరాబాద్ నుంచి 1,383 బస్సులు, బెంగళూరు నుంచి 277 బస్సులు, చెన్నై నుంచి 97 బస్సులు, ఇతర ప్రాంతాల నుంచి 2,243 బస్సులను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నడుపుతామని వివరించారు. దసరా ప్రత్యేక బస్సులను ఓ వైపు ఖాళీగా అంటే సున్నా రాబడితో నడపాల్సి ఉంటుందన్నారు. డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. అందువల్ల అనివార్య పరిస్థితులతో దసరా ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రయాణికులు సహృదయంతో అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. రెగ్యులర్ బస్ సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవని చెప్పారు. కారుణ్య నియామకాలకు ఆమోదం గత సంవత్సరం జనవరి 1 తరువాత మృతిచెందిన ఆర్టీసీ ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. దీనిపై త్వరలోనే విధివిధానాలను విడుదల చేస్తామన్నారు. 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే కారుణ్య నియామకాలకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. అంతకుముందు అంటే ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నకాలంలో చనిపోయిన సంస్థ ఉద్యోగుల పిల్లలకు కూడా కారుణ్య నియామకాలపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 2020–21కి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఇస్తున్నామన్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. పల్లెవెలుగు బస్ డిజైన్ మారుస్తామన్నారు. అన్ని బస్సులకు లైవ్ ట్రాకింగ్ సౌలభ్యం కల్పిస్తామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై చర్యలు తీసుకునేందుకు రవాణా, పోలీసు అధికారులతో కలిపి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
పుడమిపై పూల పండుగ.. మొదలైన బతుకమ్మ సంబరాలు
-
దసరాలోపు టీచర్ల పదోన్నతులు
సాక్షి, అమరావతి: దసరా పండుగలోపు విద్యా శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చేందుకు విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆర్సీ నంబర్ 13021 విడుదల చేశారు. విద్యాశాఖలో గతంలో టీచర్లకు నెలవారీ పదోన్నతులు అమలు చేసేవారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా కొంత కాలంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిని పునరుద్ధరించాలంటూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, విద్యాశాఖ డైరెక్టర్లను ఉపాధ్యాయ సంఘాలు కోరుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను తయారు చేసి ఎస్జీటీ క్యాడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ తత్సమాన కేడర్ నుంచి హైస్కూల్ హెచ్ఎం వరకూ ప్రమోషన్లు అమలు చేసేందుకు సంబంధిత ఆర్జేడీ, డీఈవోలు తగిన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ప్రమోషన్ల ప్రక్రియను దసరాలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్తర్వుల పట్ల ఆయా టీచర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సామల సింహాచలం కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: సుంకర పావని టీడీపీని భ్రష్టు పట్టించారు: కార్పొరేటర్లు) -
దుర్గమ్మ దర్శనానికి.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరి
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 7 నుంచి ప్రారంభమయ్యే దసరా మహోత్సవాలను కోవిడ్ నిబంధనల మేరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఇందుకు సంబంధించి గురువారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ జే నివాస్ మాట్లాడుతూ.. దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా సర్టిఫికెట్‌ను వెంట తెచ్చుకోవాలని సూచించారు. అలాగే, భవానీలు తమతమ స్వస్థలాల్లోనే దీక్ష విరమణ చేయాలన్నారు. కొండపైకి వాహనాలను అనుమతించబోమని, వీఐపీ భక్తులకోసం 15 వాహనాలను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక మూలా నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల వీఐపీ, ప్రొటోకాల్, బ్రేక్ దర్శనాలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. తెల్లవారుజాము నుంచే దర్శనాలు మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.. తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్లో టికెట్లు పొందిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉచిత దర్శనం ద్వారా 4 వేలు, రూ.300 టికెట్‌పై 3 వేలు, రూ.100 టికెట్‌పై మరో 3 వేల మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర వేడుకగా దేవస్థానం దసరా ఉత్సవాలను నిర్వహిస్తోందని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ చెప్పారు. తొలుత వీరంతా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఉత్సవ పనులను ఆలయ ఈవో భ్రమరాంబ వివరించారు. సమావేశంలో దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాస్, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్,, జేసీ మాధవీలత, వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రి: 4 గంటల నుంచే అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శన వేళలను ఆలయ వైదిక కమిటీ ఖరారు చేసింది. ఉత్సవాలలో ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. ► తొలి రోజైన 7వ తేదీన అమ్మవారికి స్నపనాభిషేకం స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకారం నేపథ్యంలో ఉదయం 9 గంటలకు దర్శనం ప్రారంభం అవుతుందని వైదిక కమిటీ పేర్కొంది. ► ఇక 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటలకే దర్శనం ప్రారంభం అవుతుంది. ► 11వ తేదీ సోమవారం అమ్మవారిని అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మీగా అలంకరిస్తారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు దర్శనం నిలిపివేస్తారు. రెండు గంటలకు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించిన అనంతరం దర్శనాలు ప్రారంభమవుతాయి. ► ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రోజుకు ఎంత మంది భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించాలనే దానిపై సృష్టత లేదని తెలుస్తుంది. త్వరలోనే జరగబోయే జిల్లా అధికారుల రివ్యూ మీటింగ్‌లో దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ► 12వ తేదీ మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించనున్నారని పేర్కొన్నారు. చదవండి: వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లో ఏపీ మరో రికార్డు -
దసరాకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి
-
ఆటో కంపెనీలకు దసరా పండగ..
న్యూఢిల్లీ: దసరా పండగ సందర్భంగా అక్టోబర్‌లో వాహనాల విక్రయాలు జోరుగా సాగాయి. కొత్త వస్తువుల కొనుగోళ్లకు శుభకరంగా పరిగణించే నవరాత్రుల్లో అమ్మకాలు భారీగా నమోదయ్యాయని ఆటోమొబైల్ వర్గాలు వెల్లడించాయి. దిగ్గజ సంస్థలు మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ రెండంకెల స్థాయిలో వృద్ధి సాధించాయి. మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) విక్రయాలు సుమారు 20 శాతం వృద్ధితో 1,72,862 యూనిట్లుగా నమోదయ్యాయి. మినీ కార్ల అమ్మకాలు తగ్గినప్పటికీ స్విఫ్ట్, సెలీరియో వంటి కాంపాక్ట్ కార్లు, ఎస్–క్రాస్ వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు పెరిగాయి. అటు హ్యుందాయ్ మోటార్ ఇండియా నెలవారీగా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. అక్టోబర్‌లో విక్రయాలు 13 శాతం పెరిగి 56,605 యూనిట్లకు చేరాయి. చివరిసారిగా 2018 అక్టోబర్‌లో హ్యుందాయ్ అత్యధికంగా 52,001 యూనిట్లు విక్రయించింది. ‘అక్టోబర్ గణాంకాలు వ్యాపార పరిస్థితులపరంగా సానుకూల ధోరణులకు శ్రీకారం చుట్టాయి. మరింత మెరుగైన పనితీరు కనపర్చగలమని ధీమాగా ఉన్నాం‘ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ తరుణ్ గర్గ్ తెలిపారు. ఇక హోండా కార్స్ ఇండియా అమ్మకాలు 8 శాతం పెరిగి 10,836 యూనిట్లకు చేరాయి. మార్కెట్ సెంటిమెంట్‌కి తగ్గట్టుగా, తమ అంచనాలకు అనుగుణంగా అక్టోబర్‌లో సానుకూల ఫలితాలు సాధించగలిగామని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయల్ చెప్పారు. నవరాత్రుల్లో అమ్మకాలు.. అక్టోబర్ మధ్యలో నవరాత్రులు మొదలైనప్పట్నుంచి వాహనాల విక్రయాలు పుంజుకున్నాయి. నవరాత్రుల్లో మారుతీ సుజుకీ అమ్మకాలు 27 శాతం పెరిగి 96,700 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే వ్యవధిలో మారుతీ సుమారు 76,000 వాహనాలు విక్రయించింది. ఇక హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు కూడా 28 శాతం పెరిగి 26,068 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా మోటార్స్ విక్రయాలు ఏకంగా 90 శాతం వృద్ధితో 5,725 యూనిట్ల నుంచి 10,887 యూనిట్లకు పెరిగాయి. సమీప భవిష్యత్తుపై పరిశ్రమ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. -
నేడు అంతర్రాష్ట్ర ఒప్పందం కొలిక్కి!
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం గురువారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దసరాకు ముందే అంతర్రాష్ట్ర ఒప్పందం ఖరారు కావాల్సి ఉండగా, టీఎస్ఆర్టీసీ అధికారులు అందుబాటులో లేనందున వాయిదా పడింది. దీంతో తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టుల వరకు ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ సరిహద్దు వరకు టీఎస్ఆర్టీసీ బస్సుల్ని నడిపింది. సరిహద్దుల్లో ‘దసరా’ ట్రిప్పులిలా.. ► టీఎస్ఆర్టీసీ.. కర్నూలు సరిహద్దు పంచలింగాల వరకు ఎక్కువగా బస్సుల్ని తిప్పింది. ఏపీఎస్ ఆర్టీసీ కేవలం 15 బస్సుల్ని మాత్రమే తిప్పగా, టీఎస్ఆర్టీసీ 211 బస్సుల్ని నడిపింది. ► గరికపాడు, వాడపల్లి, ఓహ్లాన్, కల్లుగూడెం, జీలుగుమిల్లి, పంచలింగాల, ఎంఎస్వీ పాలెం, పలకలగూడెం చెక్‌పోస్టుల వద్ద నుంచి ఏపీఎస్ఆర్టీసీ 11,255 మందిని, టీఎస్ఆర్టీసీ 6,828 మందిని వారి స్వస్థలాలకు చేర్చింది. -
4 రోజులు.. రూ.812 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈసారి దసరా పండుగకు మందు బాబులు దుమ్ము లేపారు. కరోనా ప్రభావం అసలుందా.. అనే స్థాయిలో ఫుల్లుగా తాగేశారు. ఈ నెల 22 నుంచి 25 వరకు రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి బయటకు వెళ్లిన లిక్కర్, బీర్ కేసుల విలువ రూ.812 కోట్ల పైమాటే. అంటే రోజుకు సగటున రూ.203 కోట్ల విలువైన మద్యం అమ్ముడయిందన్న మాట. అదే నెల సగటు చూస్తే రోజువారీ అమ్మకాలు రూ.82 కోట్లు మాత్రమే జరగడం గమనార్హం. ఈ నెల మద్యం విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే లిక్కర్, బీర్లు కలిపి దాదాపు 50 లక్షల కేసుల వరకు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.2,112 కోట్లుగా ఉంది. ఈ నెల 27 నాటికి 27,08,292 కేసుల లిక్కర్, 22,65,397 కేసుల బీర్లు డిపోల నుంచి రాష్ట్రంలోని వైన్ షాపులకు చేరాయి. ఇందులో మూడో వంతు దసరా నాలుగు రోజుల్లోనే అమ్ముడయ్యాయి. ఈ నాలుగు రోజుల్లో 9,41,900 కేసుల లిక్కర్, 9,29,694 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
యదువీర్ రాజా విజయయాత్ర.. తిలకించిన భార్య త్రిషికా
సాక్షి, మైసూరు: మైసూరు దసరా ఉత్సవాలలో భాగంగా అంబావిలాస్ ప్యాలెస్‌లో రాజవంశీకుడు యదువీర్ ఒడెయార్ చివరిరోజు ఆదివారం ఘనంగా ప్రైవేటు దర్బార్ నిర్వహించారు. 9 రోజులుగా బంగారు సింహాసనంపై ఆసీనులై రాజాస్థానాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం ఆరు గంటలకు పట్టపుటేనుగు, గుర్రం, ఒంటె, ఆవులకు ప్యాలెస్ వాకిలి వద్ద పుజలు నిర్వహించి ఉదయం 6.15 గంటలకు చండిహోమం నిర్వహించారు. 9.15 గంటలకు యదువీర్ వచ్చి పూర్ణాహుతి నిర్వహించారు. వెండి పల్లకీకి బదులు కారులో ఉత్సవాల ముగింపు రోజైన సోమవారం యదువీర్ రాచరిక సంప్రదాయాల ప్రకారం విజయ యాత్రను నిర్వహించారు. అయితే వెండి పల్లకీలో వెళ్లడానికి బదులు తన కారులోనే యాత్రను పూర్తిచేశారు. యుద్ధానికి బయల్దేరిన రీతిలో ఆయుధాలతో ఊరేగింపుగా అంబావిలాస్ ప్యాలెస్ ఆవరణ నుంచి అక్కడే ఉన్న భువనేశ్వరి అమ్మవారి దేవాలయానికి వచ్చి పూజలు చేశారు. జమ్మిచెట్టునూ పూజించారు. రాజమాత ప్రమోదాదేవి ఒడెయార్, యదువీర్ భార్య త్రిషికా, కుమారునితో కలిసి ప్యాలెస్ నుంచి విజయయాత్రను తిలకించారు. -
సినిమా ప్రేమికులకు డబుల్ పండగ
ఆదివారం దశమి. అందరికీ పండగ. సినిమా ప్రేమికులకు డబుల్ పండగలా మారింది. కొన్ని నెలలుగా కొత్త సినిమా కబుర్లు లేక డల్‌గా ఉన్నారంతా. అయితే పండగ రోజు వాళ్లలో జోష్ నింపాయి సినిమా విశేషాలు. కొత్త సినిమాల ముహూర్తాలు, టీజర్లు, లుక్స్ రిలీజులు, విడుదల తేదీ ప్రకటనలు.. అబ్బో సందడే సందడి. పండగే పండగ. ఆ విశేషాలన్నీ మీ కోసం. రెండో సినిమా షురూ ‘మత్తువదలరా’తో హీరోగా పరిచయమైన సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి రెండో చిత్రం ఆరంభమైంది. మనికాంత్ దర్శకత్వంలో సాయి కొర్రపాటితో కలిసి రజినీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రా శుక్ల, మిషా నారంగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రచయిత పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి క్లాప్ ఇచ్చారు. యం.యం. కీరవాణి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, కెమెరా: సురేష్ రగుతు. నాగచైతన్య థాంక్యూ అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్సియర్ సత్య రంగయ్య క్లాప్ కొట్టారు. ‘‘ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చెబుతాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్ , కెమెరా: పీసీ శ్రీరామ్. జోహార్లు శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా తిరుపతిలో ప్రారంభం అయ్యింది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కెమెరా స్విచాన్ చెయ్యగా, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్లాప్‌నిచ్చారు. అనగాని సత్యప్రసాద్, 14 రీల్స్ నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట స్క్రిప్ట్‌ను అందించారు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఎస్.ఎల్.వి.సి పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ సారంగ్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. డిఫరెంట్ సింగరాయ్ నాని హీరోగా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించనున్న ఈ సినిమా డిసెంబరులో సెట్స్‌పైకి వెళ్లనుంది. సాయిపల్లవి, క్రితి శెట్టి కథానాయికలు. ‘‘ఈ సినిమాలో నాని కొత్తగా కనిపించబోతున్నాడు. నాని లుక్, డ్రెస్సింగ్ వైవిధ్యంగా ఉండబోతున్నాయి. డిసెంబర్ నుండి నాని ఈ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: సాను జాన్ వర్గీస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). మళ్లీ పోలీస్ ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన పవన్ కల్యాణ్ మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో నటించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందనున్న ఈచిత్రానికి సంగీత దర్శకుడు: తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. పవర్ఫుల్ ఆద్య ‘బద్రి, జానీ’ వంటి చిత్రాలతో హీరోయిన్గా ఆకట్టుకున్న రేణూ దేశాయ్ తాజాగా ఒక పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ ప్యాన్ ఇండియా వెబ్ సిరీస్ ‘ఆద్య’తో తన సెకండ్ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టారు. ఎం.ఆర్. కృష్ణ మామిడాల దర్శకత్వంలో యు అండ్ ఐ పద్మనాభరెడ్డి సమర్పణలో డి.ఎస్.కె.స్క్రీన్–సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై డి.ఎస్.రావు– రజనీకాంత్. ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ స్క్రిప్ట్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త చింతిరెడ్డి అనంత్ రెడ్డి దర్శకుడు కృష్ణకు అందించారు. రేణూ దేశాయ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు నీలకంఠ కెమెరా స్విచ్చాన్ చేయగా, డి.ఎస్.రావు క్లాప్ ఇచ్చారు. ‘‘దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యే గొప్ప కథ ఇది’’ అన్నారు రేణూ దేశాయ్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ చైతన్యరెడ్డి .ఎస్. పేరు జోకర్ ‘మేరా నామ్ జోకర్’ పేరుతో ఓ సినిమా ప్రారంభం అయింది. 4ఏయం మూవీ మేకర్స్ బ్యానర్‌పై సూర్యగోపాల్ను దర్శకునిగా పరిచయం చేస్తూ శివ ఎన్, ఎస్.జి. కృష్ణ, నవీన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవుడి పటాలపై చిత్రీకరించిన తొలి షాట్‌కు దర్శకుడు క్లాప్ ఇచ్చి, స్క్రిప్ట్‌ను దర్శకుడు గోపాల్‌కి అందించారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్‌లో ఆరంభం కానుంది. కోతికొమ్మచ్చి మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్నలు హీరోలుగా ‘కోతికొమ్మచ్చి’ సినిమా ప్రారంభం అయ్యింది. వేగేశ్న సతీశ్ దర్శకత్వంలో లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎల్.వి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ‘దిల్’ రాజు క్లాప్‌నివ్వగా, ‘అల్లరి’ నరేశ్ కెమెరా స్విచాన్ చేశారు. ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను నవంబర్ 3న అమలాపురంలో ప్రారంభిస్తాం’’ అన్నారు దర్శకుడు వేగేశ్న సతీశ్. అమ్మ సెంటిమెంట్‌తో... హాస్యనటుడు గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా ఆయుషి హీరోయిన్గా నూతన చిత్రం ప్రారంభమయింది. డి.ఎస్. రాథోడ్ దర్శకత్వంలో డీఎస్ఆర్ ఫిలిం ప్రొడక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ల భరణి క్లాప్‌నివ్వగా, కె.యస్. రవికుమార్ కెమెరా స్విచాన్ చేశారు. ‘‘అమ్మ సెంటిమెంట్‌తో వస్తున్న డిఫరెంట్ చిత్రం ఇది. తాండూర్‌లో నవంబర్ 8న షూటింగ్ మొదలు పెడతాం. రెండో షెడ్యూల్‌ను నవంబర్ చివరివారంలో హైదరాబాద్‌లో జరిపి, తర్వాత బ్యాంకాక్ వెళతాం’’ అన్నారు దర్శకుడు. సంక్రాంతికి వస్తున్నాం కరోనా వల్ల ఈ ఏడాది కొత్త సినిమాల విడుదల సందడంతా మిస్సయింది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి సందడి రెండింతలు ఉండేలా ఉంది. సంక్రాంతి బరిలో దిగడానికి చాలా సినిమాలు సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తోంది. దసరా పండగ సందర్భంగా సంక్రాంతికి సీట్‌ను పలు సినిమాలు బుక్ చేసుకున్నాయి. ఆ విశేషాలు. ‘డాన్ శీను, బలుపు’ తర్వాత రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘క్రాక్’. శ్రుతీహాసన్ హీరోయిన్. పవర్ఫుల్ పోలీస్ కథగా ఈ సినిమా ఉంటుంది. ‘సంక్రాంతికి థియేటర్స్‌లో క్రాక్ పెట్టిద్దాం’ అన్నారు రవితేజ. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. పూజా హెగ్డే కథానాయిక. దసరా సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేసి, సంక్రాంతికి వస్తున్నట్టు ప్రకటించారు. అలాగే కొన్ని రోజుల కిత్రమే రానా కూడా సంక్రాంతికి రాబోతున్నట్టు ప్రకటించారు. ఆయన నటించిన ‘అరణ్య’ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. మరి.. సంక్రాంతి రేసులో మరికొన్ని సినిమాలు జాయిన్ అవుతాయా? చూడాలి. ప్రేమ.. పెళ్లిళ్లు ‘‘1992’ టైటిల్‌తో పాటు నేను విడుదల చేసిన పాట ఆసక్తికరంగా ఉంది. కొత్తవారు చేస్తున్న ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. శివ పాలమూరి దర్శకత్వంలో మహి రాథోడ్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘1992’. ఈ సినిమాలోని లిరికల్ వీడియోస్‌ని వీవీ వినాయక్, నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ‘‘నేటి సమాజంలో ప్రేమ, పెళ్లిళ్లు ఎలా ఉన్నాయనే కథాంశంతో ఈ సినిమా రూపొందించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు హీరో, నిర్మాత మహి రాథోడ్. అద్దెకు బాయ్ ఫ్రెండ్ విశ్వంత్ దుద్దుంపూడి, మాళవిక సతీషన్ జంటగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హయర్’. స్వస్తిక సినిమా మరియు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై వేణుమాధవ్ పెద్ది, కె. నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలోని విశ్వంత్, మాళవిక ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశ్రిన్ రెడ్డి, సంగీతం: గోపి సుందర్, కెమెరా: బాల సరస్వతి. ∙బీవీఎస్ రవి, విక్రమ్ కె.కుమార్, శిరీష్, పీసీ శ్రీరామ్, ‘దిల్’రాజు నాగచైతన్య రవితేజ, శ్రుతీహాసన్ -
రావణ దహనం : ఘనంగా దసరా వేడుకలు
-
ప్రతి మహిళ శక్తి స్వరూపిణి: ఎమ్మెల్యే రోజా
సాక్షి, చిత్తూరు : చెడుపై పోరులో ప్రతి మహిళ దుర్గాదేవిగా మారాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆకాంక్షించారు. ప్రతి మహిళా ఓ శక్తి స్వరూపిణి అని ఆమె అన్నారు. దసరా పండుగను ఎమ్మెల్యే రోజా తన నివాసంలో జరుపుకున్నారు. దుర్గాదేవి పూజలో పాల్గొన్న ఆమె రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. రాజకీయంగా, సామాజికంగా మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఆయన పరిపాలనలో మహిళలు అందరూ నిజమైన విజయదశమి జరుపుకుంటున్నారన్నారు. సీఎం జగన్ పాలనలో మహిళలకు పూర్తి రక్షణ ఉందన్నారు. ఆయన నేతృత్వంలో పని చేయడానికి తాను నిజంగా గర్వపడుతున్నానని అన్నారు. చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడానికి మాత్రమే ఉంటారని ఎద్దేవా చేశారు. (అంతిమ విజయం మంచినే వరిస్తుంది.. ) -
ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని దశమి శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని రాష్ట్రపతి పేర్కొనగా, విజయదశమి ప్రజలకు స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నామని ప్రధాని ఆకాంక్షించారు. అలాగే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయులందరితో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగే విజయదశమి అని, అయితే ఈ ఏడాది కొవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో దేశ ప్రజలంతా దసరా పండుగను కోవిడ్ నియమ నిబంధనలకు అనుగుణంగా, ప్రభుత్వ సూచనలను పాటిస్తూ కుటుంబసభ్యులతో కలిసి ఇంటివద్దనే జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పండుగ ద్వారా ప్రజలందరి జీవితాల్లో శాంతి, సామరస్యం వెల్లివిరిసి, శ్రేయస్సును కలుగజేయాలని ఆకాంక్షిస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు. (రాయని డైరీ: నరేంద్ర మోదీ (ప్రధాని)) కరోనాతో ఏర్పడిన సంక్షోభాన్ని జయిస్తామని ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో అన్నారు. స్థానిక ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని, పండుగ సందర్భాల్లో స్థానిక వస్తువులనే కొనుగోలు చేయమని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే జవాన్లను గుర్తు చేసుకుంటూ వారి కోసం దీపం వెలిగించాలని కోరారు. -
చైనా సరిహద్దుల్లో రాజ్‌నాథ్ ఆయుధ పూజ
సాక్షి, న్యూఢిల్లీ: విజయదశమి సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఉదయం ఆయుధ పూజ నిర్వహించారు. వాస్తవాధీన రేఖకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో సిక్కిం షెరాథాంగ్ వద్ద ఆయన సైనికులతో ‘శాస్త్ర పూజ’ చేశారు. ఆయుధాలు, పరికరాలు, సాయుధ వాహనాలను పూజించారు. అనంతరం సైనికులతో రాజ్‌నాథ్ ముచ్చటించారు. దసరా సందర్భంగా వారికి తన శుభాకాంక్షలు తెలిపారు. దేశ సరిహద్దుల రక్షణలో సేవలు చేస్తున్న వారి అంకితభావాన్ని ప్రశంసించారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందని ప్రశంసలు కురిపించారు. ఇక చైనాతో నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ సైనికులతో గడపటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ... చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న వివాదం త్వరగా ముగిసిపోవాలని భారత్ కోరుకుంటోందని ఆకాంక్షించారు. శాంతి నెలకొల్పడమే తమ ఉద్ధేశ్యమని, ఈ విషయంలో తమకు పూర్తి నమ్మకం ఉందని ఆయన ఆకాంక్షించారు. భారత జవాన్లు దేశంలోని ఒక్క ఇంచు భూమిని కూడా ఇతరుల చేతుల్లోకి పోనివ్వరని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. అంతకు ముందు తన పర్యటనలో భాగంగా డార్జిలింగ్‌లోని సుక్నా యుద్ధ స్మారకాన్ని ఆయన, ఆర్మీ ఛీప్ ఎంఎం నరవాణేతో కలిసి సందర్శించారు. యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. కాగా ఇవాళ ఉదయం రక్షణమంత్రి ట్విటర్లో దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘విజయదశమి పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా ఈ రోజు సిక్కింలోని నాథులా ప్రాంతాన్ని సందర్శించి భారత సైన్యం సైనికులను కలుస్తా. ఆయుధ ఆరాధన కార్యక్రమంలో కూడా పాల్గొంటా’ అని ట్వీట్ చేశారు. గత ఏడాది ఫ్రాన్స్ ఓడరేవు నగరం బోర్డాలో రక్షణ మంత్రి రాఫేల్ యుద్ధ విమానాలకు శాస్త్ర పూజ నిర్వహించారు. -
దసరా నవరాత్రులు.. సర్వం శక్తిమయం
దసరా నవరాత్రులు ఏటా శరదృతువులో ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు జరుగుతాయి. అందుకే వీటిని శరన్నవరాత్రులని అంటారు. దుర్గాదేవిని ఈ తొమ్మిది రోజులూ ఆరాధిస్తారు గనుక దేవీ నవరాత్రులని అంటారు. హరిహరబ్రహ్మేంద్రాది దేవతల చేత పూజలందుకునే దుర్గాదేవి మహిషాసుర సంహారం కోసం అవతరించింది. మహిషాసురునితో తొమ్మిది రోజుల హోరాహోరీ యుద్ధం తర్వాత మహిషాసురుడిని సంహరించింది. లోకానికి మహిషాసురుని పీడ విరగడైనందుకు ఆశ్వీయుజ శుద్ధ దశమిని విజయదశమిగా పాటించడం ఆనవాయితీగా వస్తోందని పురాణాలు చెబుతున్నాయి. దుర్గాదేవిని ఆదిశక్తి స్వరూపంగా భక్తులు కొలుస్తారు. సమస్త చరాచర జగత్తుకు ఆధారభూతమైనది శక్తి మాత్రమేనని నమ్ముతారు. ‘యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః’ నవరాత్రులలో అమ్మవారిని శక్తిస్వరూపంగా తలచి స్తోత్రపాఠాలతో వేడుకగా పూజలు జరుపుతారు. పురాణగాథల ప్రకారం మహిషాసుర సంహార ఘట్టం సంక్షిప్తంగా... మహిషాసురుడు అసురులలో మహా బలసంపన్నుడు. ఎంతటి బలసంపన్నుడికైనా ఎప్పుడో ఒకప్పుడు మరణం తప్పదు. మహిషాసురుడు తనకు మరణం ఉండరాదనుకున్నాడు. తన కోరిక నెరవేర్చుకోవడానికి మేరుపర్వత శిఖరానికి చేరుకుని, అక్కడ కూర్చుని బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకొమ్మన్నాడు. మరణం లేకుండా వరమివ్వమన్నాడు మహిషాసురుడు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదని, మరణం లేకుండా ఉండే వరం ప్రకృతి విరుద్ధమని, అలాంటి వరాన్ని ఇవ్వజాలనని అన్నాడు బ్రహ్మదేవుడు. అయినా, మహిషాసురుడు పట్టువదల్లేదు. ‘నీ మృత్యువుకు ఏదైనా ఒక మార్గం విడిచిపెట్టి వరం కోరుకో’ అన్నాడు బ్రహ్మదేవుడు. ‘నా దృష్టిలో ఆడది అంటే అబల. అబల వల్ల నాకెలాంటి ప్రమాదమూ లేదు. అందువల్ల పురుషుల చేతిలో నాకు మరణం లేకుండా వరం ఇవ్వు’ అన్నాడు మహిషాసురుడు. ‘సరే’ అన్నాడు బ్రహ్మదేవుడు. వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలపై యుద్ధాన్ని ప్రకటించాడు. స్వర్గంపై దండెత్తి, దేవతలందరినీ ఓడించాడు. ఇంద్రపదవిని కైవసం చేసుకుని ముల్లోకాలనూ ముప్పుతిప్పలు పెట్టసాగాడు. దుర్గాదేవి అవతరణ పదవీభ్రష్టుడైన ఇంద్రుడు త్రిమూర్తుల వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, వారిలో రగిలిన క్రోధాగ్ని ఒక దివ్యతేజస్సుగా మారింది. త్రిమూర్తుల దివ్యతేజస్సు కేంద్రీకృతమై ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది. శివుని తేజస్సు ముఖంగా, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదాలుగా కలిగి అవతరించిన ఆమె పద్దెనిమిది భుజాలు కలిగి ఉంది. శివుడు త్రిశూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని ఆమెకు ఆయుధాలుగా ఇచ్చారు. బ్రహ్మ అక్షమాలను, కమండలాన్ని ఇచ్చాడు. ఆమెకు వాహనంగా సింహాన్ని హిమవంతుడు ఇచ్చాడు. దేవతలందరూ ఇచ్చిన ఆయుధాలను ధరించిన ఆమె మహిషాసురుడిపై యుద్ధానికి వెళ్లింది. మహిషాసురుడి సేనతో భీకరమైన యుద్ధం చేసింది. మహిషాసురుడి సైన్యంలో ప్రముఖులైన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు వంటి వారిని తుదముట్టించిన తర్వాత నేరుగా మహిషాసురుడితో తలపడింది. తొమ్మిదిరోజుల యుద్ధం తర్వాత దశమి నాడు మహిషాసురుడు దేవి చేతిలో హతమయ్యాడు. మహిషాసురుడి పీడ విరగడ కావడంతో ప్రజలు ఆనాడు వేడుకలు జరుపుకున్నారు. మహిషాసురుడిపై విజయం సాధించిన రోజు గనుక విజయదశమిగా, దసరాగా ఈ పండుగను దేశ విదేశాల్లోని వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో జరుపుకుంటారు. వైవిధ్యభరితంగా వేడుకలు దసరా నవరాత్రి వేడుకలను దేశం నలుమూలలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో జరుపుకొంటారు. దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో దసరా వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. పశ్చిమబెంగాల్, ఒడిశా, అసోం రాష్ట్రాల్లో ఊరూరా దేదీప్యమానమైన అలంకరణలతో దేవీ మండపాలు పెద్దసంఖ్యలో కనిపిస్తాయి. సప్తమి, అష్టమి, నవమి తిథులలో బెంగాలీలు దుర్గామాతకు విశేష పూజలు చేస్తారు. దశమినాడు కాళీమాతను పూజిస్తారు. కోల్‌కతాలో కొలువుతీర్చిన దేవీవిగ్రహాలను నవరాత్రుల చివరిరోజున హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. అదేరోజున కుమారీపూజ చేస్తారు. ఒడిశాలో ఊరూరా వాడవాడలా దుర్గా మండపాలను ఏర్పాటు చేసి, తొమ్మిదిరోజులూ పూజలు నిర్వహిస్తారు. విజయదశమి రోజున విజయదుర్గను ఆరాధిస్తే అపజయాలు ఉండవని ఒడిశా ప్రజల విశ్వాసం. ఒడియా మహిళలు నవరాత్రుల సందర్భంగా మానికలో వడ్లు నింపి, ఆ మానికను లక్ష్మీదేవిలా భావించి పూజిస్తారు. విజయదశమి రోజునే శ్రీరాముడు రావణుడిని వధించాడని విశ్వసిస్తారు. రావణవధకు ప్రతీకగా విశాలమైన కూడళ్లలో, మైదానాల్లో భారీ పరిమాణంలోని రావణుడి దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసి, బాణసంచాతో కాలుస్తారు. చాలాసేపు కాలుతూ ఉండే రావణకాష్టాన్ని తిలకించడానికి కూడళ్లలో, మైదానాల్లో జనాలు పెద్దసంఖ్యలో గుమిగూడతారు. విజయదశమి తర్వాత వచ్చే పున్నమి వరకు ఒడిశాలో మహిళలు ‘జొహ్ని ఉసా’ వేడుకలను జరుపుకొంటారు. గౌరీదేవిని ఆరాధిస్తూ జరిపే ఈ వేడుకలో తెలంగాణలోని ‘బతుకమ్మ పండుగ’ వేడుకలను పోలి ఉంటాయి. గుజరాత్లో దసరా వేడుకల సందర్భంగా ప్రధానంగా పార్వతీదేవిని ఆరాధిస్తారు. ఇంటింటా శక్తిపూజ చేయడం గుజరాతీల ఆచారం. ఇంటి గోడలపై శ్రీచక్రం, త్రిశూలం, శక్తి ఆయుధం చిత్రాలను పసుపుతో చిత్రించి, అలంకరిస్తారు. సమీపంలోని పొలం నుంచి తీసుకు వచ్చిన మట్టితో వేదిక ఏర్పాటు చేసి, దానిపై గోధుమలు, బార్లీ గింజలను చల్లి, దానిపై నీటితో నింపిన మట్టి కుండను పెట్టి, అందులో పోకచెక్క లేదా రాగి లేదా వెండి నాణేన్ని వేస్తారు. ఆ మట్టికుండనే దేవీ ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. అష్టమి రోజున హోమం చేసి, దశమి రోజున నిమజ్జనం చేస్తారు. దశమి తర్వాత వచ్చే పున్నమి వరకు జరిగే ‘గర్భా’ వేడుకల్లో మహిళలు నృత్యగానాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాల్లో దసరా వైవిధ్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల్లో దసరా వేడుకలు వైవిధ్యభరితంగా సాగుతాయి. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం గ్రామంలో దసరా సందర్భంగా ఏనుగు సంబరాలను నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల మొదటి రోజున ఏనుగు గుడిలో వయసైన బ్రహ్మచారిని భేతాళుడిగా నిలబెడతారు. తొమ్మిదిరోజులూ భేతాళుడే అమ్మవారి పూజాదికాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వెదురుకర్రలు, గడ్డి, కొబ్బరిపీచుతో తయారు చేసిన ఏనుగు బొమ్మను వివిధ అలంకరణలతో రూపొందించిన అంబారీతో అలంకరిస్తారు. ఇదేరీతిలో మరో చిన్న ఏనుగు బొమ్మను తయారు చేసి, చివరి రోజున బోయీలతో ఊరేగింపుగా తీసుకువెళతారు. దసరా రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం ఆరుగంటల వరకు జరిగే ఈ వేడుకలు తూపుచెరువు కట్ట వద్దకు చేరుకోవడంతో ముగుస్తాయి. విజయనగరంలో దసరా సందర్భంగా గజపతుల ఆడపడుచైన పైడితల్లికి పూజలు చేస్తారు. దసరా తర్వాతి మొదటి మంగళవారం రోజున పైడితల్లికి జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో పూజారిని సిరిమాను ఎక్కించి, మూడు లాంతర్ల కూడలి నుంచి రాజుగారి కోట వరకు మూడుసార్లు ఊరేగిస్తారు. ఈ వేడుకలను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మూడు రోజుల ముందుగానే విజయనగరం చేరుకుని, వీధుల్లోనే గుడారాలు వేసుకుని మకాం వేసి, ఈ ఉత్సవాలను చూసి ఆనందిస్తారు. కృష్ణాజిల్లా రేవుపట్టణం బందరులో దసరా సందర్భంగా శక్తిపటాల ఊరేగింపు నిర్వహిస్తారు. బ్రిటిష్‌కాలంలో బుందేల్‌ఖండ్ నుంచి ఇక్కడకు వచ్చిన సైనికుడు ఒకరు అప్పట్లో బందరులోని ఈడేపల్లిలో కాళీమాతను ప్రతిష్ఠించాడు. దసరా నవరాత్రుల్లో ఇక్కడి నుంచి శక్తిపటాన్ని ఊరేగింపుగా వీధుల్లోకి తీసుకు రావడం ఆచారంగా వస్తోంది. వీధుల్లోకి వచ్చినప్పుడు జనం తమ తమ మొక్కుబళ్లను చెల్లించుకుంటారు. దసరా రోజున వీరనృత్యం చేస్తూ రాక్షసవధను అభినయిస్తారు. తర్వాత కోనేరు సెంటరు వద్ద జమ్మి కొట్టడంతో వేడుకలు ముగుస్తాయి. ఒంగోలులో దసరా వేడుకల సందర్భంగా కళారాలను ఊరేగిస్తారు. భారీ ముఖాకృతులనే ‘కళారా’లని అంటారు. కాళికాదేవి, మహిషాసురమర్దిని, నరసింహస్వామి వంటి దేవతా ఆకారాలతో కళారాలను ముందుగానే సిద్ధం చేస్తారు. వీటిని బండి మీదకు ఎక్కించి, ఇటూ అటూ ఊపేందుకు వీలుగా కొయ్యలకు కడతారు. కళారాల వెనుక కళాకారులు ఉంటారు. డప్పుల మోతకు అనుగుణంగా కళాకారులు ఉగ్రంగా కళారాలను ఊపుతూ వీరనృత్యం చేస్తారు. కళారాలను ఊరి నడిబొడ్డుకు తీసకువచ్చాక, అక్కడ రాక్షస సంహారాన్ని అభినయిస్తారు. ఈ ఏడాది ‘కరోనా’ మహమ్మారి కారణంగా పండుగలన్నీ కళ తప్పాయి. ఏటా ఆనవాయితీగా జరిగే స్థాయిలో ఈసారి దసరా నవరాత్రులు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. బహిరంగ వేడుకల అట్టహాసం, వీధుల్లో సంబరాలు జరుపుకోవడం వంటివేవీ లేకపోయినా, దేశవ్యాప్తంగా గల శక్తిపీఠాలు, దేవీ ఆలయాల్లో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తున్నారు. నవదుర్గల ఆరాధన శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ప్రధానమైనవిగా భావిస్తారు. మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లోని గౌడ సారస్వత బ్రాహ్మణులు నవదుర్గలను కులదేవతలుగా ఆరాధిస్తారు. వరాహ పురాణంలో నవదుర్గల ప్రస్తావన కనిపిస్తుంది. నవరాత్రులలో నవదుర్గలను వరాహపురాణ శ్లోకంలో చెప్పిన వరుస క్రమంలో ఆరాధిస్తారు. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీ చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా వరాహ పురాణంలోని ఈ శ్లోకం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనేవి నవదుర్గల పేర్లు. నవరాత్రులలో దుర్గాదేవిని ఈ రూపాలలో అలంకరణలు చేసి, నిష్టగా పూజలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తారు. దేవీసప్తశతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గ, భ్రామరి అనే నామాలను, వారి గాథలను ప్రస్తావించినా, ఈ అవతరాలను ప్రత్యేకంగా నవదుర్గలుగా వ్యవహరించలేదు. అయితే, దసరా నవరాత్రుల్లో కొన్ని ఆలయాల్లో అమ్మవారిని దేవీసప్తశతిలో పేర్కొన్న రూపాలలో అలంకరించి, పూజలు జరపడం ఆనవాయితీగా కొనసాగుతోంది. శాక్తేయ సంప్రదాయంలో నవదుర్గలనే కాకుండా, దశ మహావిద్యల రూపాల్లో కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. దసరా నవరాత్రులలో దశ మహావిద్యల రూపాలైన కాళి, తార, త్రిపురసుందరి, భువనేశ్వరి, భైరవి, ఛిన్నమస్తా, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక రూపాలలో అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. అలాగే సప్తమాతృకలైన బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వరాహి, ఇంద్రాణి, చాముండి రూపాలలో కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తొమ్మిదిరోజులూ అమ్మవారికి వివిధ రకాల అలంకరణలు చేస్తారు. విజయదశమి రోజున అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. కనకదుర్గ అమ్మవారు కృష్ణానదిలో మూడుసార్లు తెప్పపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి తెప్పోత్సవాన్ని తిలకించడానికి రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడకు తరలి వస్తారు. దసరా రోజున ప్రభల ఊరేగింపు, ప్రభల ఊరేగింపులో జరిగే భేతాళ నృత్యం విజయవాడ దసరా వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తెలంగాణలో దసరా నవరాత్రులలో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకొంటారు. తంగేడు, గునుగు వంటి రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది మహిళలంతా ఉత్సాహంగా ఆటపాటలతో ఆనందిస్తారు. చివరి రోజున నిమజ్జనం చేసిన తర్వాత పండుగ జరుపుకుంటారు. ఆడపడుచులు ఈ వేడుకలను కన్నవారిళ్లలో జరుపుకోవడం ఆనవాయితీ. -
విజయవాడలో బీజేపీ నూతన కార్యాలయం
సాక్షి, విజయవాడ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ఉదయం విజయవాడలో బీజేపీ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. దసరా పర్వదినం సందర్భంగా సంప్రదాయ పద్దతిలో పూజా కార్యక్రమాలు అనంతరం కార్యాలయాన్ని ఆయన ఆరంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కృష్ణానది తీరాన, కనకదుర్గమ్మ పాదాల చెంతన...దసరా రోజున పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభించుకున్నాం. ప్రజలందరికీ మంచి జరగాలి. అందరికి విజయదశమి శుభాకాంక్షలు. ఇవాళ దుర్గమ్మను దర్శించుకుని, కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని కోరుకున్నా. చదవండి: స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు ఏపీకి సంబంధించి పార్టీ కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తాం. ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారధ్యంలో రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతుంది. కేంద్రంలో అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలి. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ. దేశంలో అత్యధిక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్న పార్టీ కూడా మాదే. పదవుల్లో ఉన్నా, లేకున్నా బీజేపీ నేతలు కుటుంబంలా కలిసి పనిచేసి పార్టీని ముందుకు తీసుకు వెళ్లాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం మోదీ సారధ్యంలో పని చేస్తాం. సోము వీర్రాజు తొలి నుంచి పార్టీలో ఉంటూ నేడు అధ్యక్షులుగా పని చేస్తున్నారు. ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షా తరపున ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్ ధియోధర్, సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు, సుజనా చౌదరి, పార్టీ నేతలు మధుకర్ జీ, కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి, రావెల కిషోర్ బాబు, ఆదినారాయణరెడ్డి, గోకరాజు తదితరులు పాల్గొన్నారు. -
కట్టె పొంగల్, ఆవ పులిహోర
శరన్నవరాత్రోత్సవం ముగిసింది. దుష్టరాక్షసులపై దుర్గమ్మ సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే విజయ దశమి వచ్చేసింది. కనీసం ఇవ్వాళ అయినా రోజూ తినే రకాలకు కాస్తంత భిన్నంగా ఆలోచించి, కొత్తరకం వంటలను మీరే మరింత రుచిగా శుచిగా వండి అమ్మకు తినిపించండి. అన్నట్లు ఇవేమీ కొత్త వంటలు కాదు... తయారీ మాత్రమే కొత్త. అదీ మీరు తయారు చేయడం ఇంకా కొత్త. మీకు చేతకాకపోతే అమ్మకు సాయం చేయండి చాలు... ఆనందంగా ఆరగిస్తుంది. మీరే అమ్మ స్థానంలో ఉన్నారా... మరీ మంచిది. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ అయిన ఆ ఆదిపరాశక్తి... జగజ్జననికి ఘాటైన ఆవ పులిహోర, మిరియాలతో చేసిన నేతి దద్ధ్యోదనం, ఘుమ ఘుమలాడే కట్టె పొంగలి, కరకరలాడే జిలేబీ, కమ్మగా కరిగిపోయే పేణీలడ్డు, గొంతులోకి గుమ్ముగా జారిపోయే పేణీ పాయసం వండి ఆరగింపు పెట్టండి. మీరు పెట్టిన నైవేద్యాలన్నీ ఆనందంగా ఆరగించి విజయోస్తు అని దీవిస్తుంది. దద్ధ్యోదనం కావలసినవి: బియ్యం – రెండు కప్పులు; అల్లం – చిన్న ముక్క; పచ్చి మిర్చి – 10; ఎండు మిర్చి – 5; సెనగ పప్పు – టీ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – చిన్న కట్ట; దానిమ్మ గింజలు – టేబుల్ స్పూను; చిన్న ద్రాక్ష లేదా కిస్మిస్ ద్రాక్ష – కప్పు; చెర్రీ ముక్కలు – టీ స్పూను; టూటీ ఫ్రూటీ ముక్కలు – టీ స్పూను; జీడి పప్పులు – 10; నెయ్యి – టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: ∙ముందుగా బియ్యం కడిగి నీళ్లు ఒంపేసి, ఐదు కప్పుల నీరు జత చేసి ఉడికించాలి∙ అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా దంచి పక్కన ఉంచాలి∙ బాణలిలో నెయ్యి వేసి కాగాక పచ్చి సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి∙ ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి, అందులో వేయించిన పోపు సామాను వేసి బాగా కలపాలి∙ తగినంత ఉప్పు జత చేసి మరోమారు కలపాలి∙ చివరగా దానిమ్మ గింజలు, దానిమ్మ గింజలు చిన్న ద్రాక్ష లేదా కిస్మిస్ ద్రాక్ష, చెర్రీ ముక్కలు, టూటీ ఫ్రూటీ ముక్కలు, జీడి పప్పులు వేసి బాగా కలపాలి∙ పుల్లగా ఉండే నిమ్మకాయ ఊరగాయతో అందిస్తే ప్రసాదాన్ని కూడా అన్నంలా తినేస్తారు. కట్టె పొంగల్ కావలసినవి: బియ్యం – ముప్పావు కప్పు; పెసరపప్పు – పావు కప్పు; మిరియాల పొడి – టీ స్పూను; అల్లం తురుము – టీ స్పూను; పచ్చిమిర్చి – 4; జీలకర్ర – టీస్పూను; జీడిపప్పు – 10; కరివేపాకు – 2 రెమ్మలు; నెయ్యి – 5 టీ స్పూన్లు; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత. తయారీ: ∙బియ్యం, పెసర పప్పులను శుభ్రంగా కడిగి, మూడు కప్పుల నీళ్లు జత చేసి ఉడికించి దించేయాలి∙ పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేయాలి∙ బాణలిలో నెయ్యి వేసి కాగాక, జీలకర్ర, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్ది సేపు వేయించాలి∙ జీడిపప్పు పలుకులు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి∙ కరివేపాకు, మిరియాల పొడి, ఇంగువ వేసి కొద్దిసేపు వేయించి దించేయాలి∙ అన్నం పెసరపప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి, ఉప్పు జత చేసి కలియబెట్టాలి∙ చట్నీ, సాంబారుతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. ఆవ పులిహోర కావలసినవి: బియ్యం – కప్పు; చింతపండు – పెద్ద నిమ్మకాయంత; బెల్లం తురుము – 2 టీ స్పూన్లు; ఆవాలు – టీ స్పూను; ఉప్పు – తగినంత; నువ్వుల నూనె – టేబుల్ స్పూను; ఆవాలు – టీ స్పూను; పల్లీలు – గుప్పెడు; పచ్చి సెనగపప్పు – టేబుల్ స్పూను; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; నువ్వు పప్పు – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 5; పచ్చి మిర్చి – 5; పసుపు – అర టీ స్పూను; కరివేపాకు – 4 రెమ్మలు; ఇంగువ – చిటికెడు; నూనె – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి రెండు కప్పుల నీళ్లు జత చేసి ఉడికించి, వెంటనే పెద్ద పాత్రలోకి తిరగబోసి, టేబుల్ స్పూను నువ్వుల నూనె వేసి కలపాలి∙ చింతపండును నీళ్లలో నానబెట్టి గుజ్జు తీసి పక్కన ఉంచాలి∙ బాణలిలో ఆవాలు వేసి చిటపటలాడే వరకు వేయించి, తీసి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి∙ బాణలిలో పల్లీలు వేసి వేయించి పక్కన ఉంచాలి∙ బాణలిలో నూనె వేసి కాగాక, సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి వరసగా వేసి వేయించాలి. కరివేపాకు జత చేసి బాగా కలిపాక, నువ్వు పప్పు, ఇంగువ, పసుపు వేసి కొద్దిగా వేయించాలి∙ చింతపండు గుజ్జు (టేబుల్ స్పూను గుజ్జు పక్కన ఉంచి, మిగతా భాగం మాత్రమే ఉపయోగించాలి), బెల్లం తురుము వేసి బాగా కలిపి ఉడికించి దించేయాలి∙ పాత్రలో ఉన్న అన్నం మీద చింతపండు గుజ్జు, ఆవ పొడి వేసి కలపాలి. ఉడికించిన చింతపండు + పోపు మిశ్రమం, ఉప్పు వేసి కలియబెట్టాలి. సుమారు గంటసేపు బాగా ఊరిన తర్వాత వడ్డించాలి. పేణీ లడ్డు కావలసినవి: సెనగపిండి – కప్పు; పేణీ – కప్పు; పంచదార – ముప్పావు కప్పు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; డ్రై ఫ్రూట్ పొడి – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి, సన్నని మంట మీద వేడి చేసి,సెనగపిండి వేసి పచ్చి వాసన పోయి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి దింపి చల్లారనివ్వాలి∙ మిక్సీలో పంచదార, పేణీలు వేసి రవ్వలా చే సి, ఈ మిశ్రమాన్ని సెనగపిండి ఉన్న పాత్రలో వేయాలి∙ డ్రైఫ్రూట్ పొడి జత చేయాలి∙ కరిగించిన నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ లడ్డూ కట్టాలి. జిలేబీ కావలసినవి: మైదా పిండి – కప్పు; బేకింగ్ పౌడర్ – అర టీ స్పూను; పెరుగు – కప్పు; నూనె – వేయించడానికి తగినంత; పంచదార – కప్పు; కుంకుమ పువ్వు – చిటికెడు; ఏలకుల పొడి – పావు టీస్పూను; మిఠాయి రంగు – రెండు చుక్కలు; రోజ్ వాటర్ – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, పెరుగు వేసి బాగా కలిపి ఒక రోజంతా నాననివ్వాలి∙ ఈ మిశ్రమాన్ని మూతకు రంధ్రం ఉన్న మ్యాగీ సీసాలో పోయాలి∙ ఒక పాత్రలో పంచదార, నీళ్లు, రోజ్ వాటర్ వేసి స్టౌ మీద ఉంచి పంచదార తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపేసి, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలపాలి∙ బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి. మంట మధ్యస్థంగా ఉంచాలి∙ పిండి ఉన్న సీసాను తీసుకుని జిలే బీ ఆకారం వచ్చేలా నూనెలో తిప్పాలి∙ బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి వెంటనే పంచదార పాకంలో వేసి ఐదు నిమిషాలు ఉంచి తీసేయాలి∙ వేడివేడిగా అందించాలి. కదంబం కావలసినవి: కందిపప్పు – పావు కప్పు; బెల్లం – 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర – చిన్న కట్ట; చింతపండు గుజ్జు – 3 టేబుల్ స్పూన్లు; సాంబారు పొడి – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; చిలగడదుంప ముక్కలు – అర కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 6 (పొడవుగా మధ్యకు చీల్చాలి); మునగకాడ ముక్కలు – కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; దొండకాయ ముక్కలు – పావు కప్పు; అరటికాయ ముక్కలు – పావు కప్పు; తీపి గుమ్మడికాయ ముక్కలు – కప్పు; సొరకాయ ముక్కలు – అర కప్పు; సెనగపిండి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; కారం – 2 టీ స్పూన్లు. పోపు కోసం: ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; ఎండు మిర్చి – 10; సెనగపప్పు – టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా. తయారీ: ∙పప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చాక దించి, చల్లారాక మెత్తగా మెదిపి పక్కన ఉంచాలి∙ ఒక గిన్నెలో తరిగి ఉంచుకున్న కూర ముక్కలు, పచ్చి మిర్చి, చింతపండు గుజ్జు, నీళ్లు, ఉప్పు, పసుపు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాలి∙ మెత్తగా మెదిపిన పప్పు వేసి బాగా కలిపి, బెల్లం తురుము జత చేయాలి∙ సాంబారు పొడి, కారం వేసి కాసేపు ఉడికించాలి∙ కొద్దిగా నీళ్లలో సెనగ పిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న దప్పళంలో వేసి కలపాలి∙ ఈలోగా పక్కన చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, సెనగపప్పు, మెంతులు, ఇంగువ వేసి వేయించి, మరుగుతున్న దప్పళంలో వేసి బాగా కలిపి కొత్తిమీర, కరివేపాకు వేసి దించేయాలి. పేణీ పాయసం కావలసినవి: పేణీలు – పావు కేజీ; పాలు – అర లీటరు; బెల్లం పొడి – పావు కేజీ; డ్రై ఫ్రూట్స్ పొడి – అర కప్పు; తేనె – ఒక టేబుల్ స్పూను. తయారీ: ∙పాలు ఒక గిన్నెలో పోసి, స్టౌ మీద ఉంచి మరిగించాలి∙ బెల్లం పొడి జత చేసి ఐదు నిమిషాలు పాటు ఉడకవ్వాలి∙ డ్రై ఫ్రూట్ పొడి వేసి కలపాలి∙ ఒక పాత్రలో పేణీ వేసి అందులో పాలు బెల్లం మిశ్రమం వేయాలి∙ డ్రై ఫ్రూట్ పొడి వేసి, తేనె వేసి బాగా కలిపి అందించాలి. -
గ్రేటర్లో తీరొక్క దసరా
సాక్షి, హైదరాబాద్: విజయ దశమి... చెడుపై విజయం సాధించినందుకు చిహ్నంగా జరుపుకుంటాం. ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుంచి దశమి వరకు తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. రోజుకొక ప్రత్యేక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. సృష్టి, స్థితి, లయ అనే మూడు ధర్మాలు ప్రారంభమైన కాలంగా నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటారని ప్రతీతి. తొమ్మిదికి చాలా ప్రాధాన్యత ఉంది. మానవ దేహంలో రంధ్రాలు తొమ్మిది... సప్తశతిలో అమ్మవారు సంహరించిన రాక్షసుల సంఖ్య తొమ్మిది... నవధాన్యాలు తొమ్మిది...అలా నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారని శాస్త్రం చెబుతోంది. అయితే నవరాత్రి ఉత్సవాలను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన సంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు. సకల సంస్కృతుల సమ్మేళనంగా నిలుస్తోన్న భాగ్యనగరంలో ఆయా ప్రాంతవాసుల పండుగ శైలి విభిన్న శైలిలో కనిపిస్తోంది. ఆ సంస్కృతుల సమాహారం మీ కోసం. గుజరాత్: ప్రత్యేక పూజలు.. దాండియా... దేవీ శరన్నవరాత్రి రోజుల్లో ప్రతి మూడు రోజులకు గుజరాతీలు దేవీ రూపాన్ని ఆరాధిస్తాం. మహిషాసురుడిని వధించినందుకు మొదటి మూడు రోజులూ దుర్గాదేవి రూపంలో, ఐశ్వర్యానికి ప్రతీకగా లక్ష్మిదేవిని మరో మూడు రోజులు, తదుపరి మూడు రోజులు విద్యామాత అయిన సరస్వతీదేవిని పూజిస్తాం. గుజరాతీలు అంబికాదేవిగా అమ్మవారిని పిలుస్తారు. ’దాండియా నృత్యం దసరా వేడుకలకు సరికొత్త ఆకర్షణ. దసరా తొమ్మిది రోజుల్లో మా రాష్ట్రంలోని ప్రతి పల్లె ఈ దాండియా నృత్యాలతో సందడిగా ఉంటుంది. హైదరాబాద్‌లో ఉండే గుజరాతీయులు కూడా అసోసియషన్లుగా ఏర్పడి దాండియా నృత్యాలు చేసి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాన్స్ ఫెస్టివల్ దాండియా నవరాత్రి ఉత్సవాల సమయంలోనే జరుగుతుంది. మా రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు ‘రస’ అనే ప్రత్యేక నృత్యం చేస్తారు. శ్రీకృష్ణుని జీవిత ఘట్టాల ఆధారంగా ఈ నృత్యం సాగుతోంది. దసరా రోజుల్లో శక్తి పీఠాలైన అంబాజీ, పవాగడ్, బహుచర్రాజీ క్షేత్రాలతో పాటు కుచ్‌లో ఉన్న ఆషాపురమాత, భావ్‌నగర్‌లో గల కొడియార్ మందిర్, చోటిలాలో ఉన్న చాముండి మాత మందిరాలు భక్తులతో కళకళలాడతాయి. – సురేష్‌భాయ్ తన్నా, సికింద్రాబాద్ కేరళ: పంచవాద్యం ప్రత్యేకం దేవీ శరన్నవరాత్రులుఅందరికీ శుభం చేకూర్చే రోజులుగా దేవీ నవరాత్రులను కేరళలో భావిస్తాం. అందుకే విద్యార్థులకు చదువు బాగా రావాలని పుస్తకాలను, కులవృత్తులు చేసేవారు తమ యంత్రాలను దశమి రోజుకు మూడు రోజుల ముందు నుంచే పూజలో ఉంచుతాం. ప్రతి దసరా సమయంలో బొమ్మల కొలువు ఉంటుంది. కేరళలో కొలువుదీరిన దేవతామూర్తులు, ఆలయాల నిర్మాణశైలితో కూడిన బొమ్మలను కొలుస్తారు. దసరా ఉత్సవాల్లో పంచవాద్యం హైలెట్‌గా ఉంటుంది. ముఖ్యమైన ఆలయాల్లో అంబారీతో పంచావాద్యం, సింగేరి మేళా నడుమ నవరాత్రుల పాటు ప్రతిరోజూ లక్ష్మీదేవికి పూజలు చేస్తాం. – అరుణ్గురుస్వామి, అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం ప్రధాన కార్యదర్శి, సనత్‌నగర్ పంజాబ్: తొమ్మిది రకాల పండ్లతో పూజలు దేవీ శరన్నవరాత్రి సమయంలో సిక్కులు బుట్టలో ఎర్రమట్టి (పుట్టమన్ను) వేస్తారు. 12 గంటల ముందు నానబెట్టిన గోధుమలను మట్టిలో వేస్తారు. అనంతరం తొమ్మిది రకాల పండ్లు, పూలతో పూజిస్తాం. చండీకాపాన్ను తొమ్మిది రోజుల పాటు పఠిస్తారు. విజయదశమి రోజున నగర కీర్తన జరుగుతుంది. ప్రతియేటా గౌలిగూడలోని గురుద్వారా నుంచి అత్తాపూర్ గురుద్వారా వరకు నగర కీర్తన్ కొనసాగుతోంది. తిరిగి మళ్లీ కాలిడనక గౌలిగూడకు చేరుకుంటుంది. నగర కీర్తన్ కొనసాగుతున్నంతవరకు కత్తి విన్యాసాలు చేసి అబ్బురపరుస్తారు. ఈ తంతు పూర్తయిన తరువాత గౌలిగూడ గురుద్వారా లంగర్ (అన్నదానం) నిర్వహిస్తారు. తాత ముత్తాతలు నుంచి ఉపయోగించిన కత్తులను తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు. దసరా రోజు గురుద్వారాకు తీసుకుని ప్రత్యేక పూజలు జరుపుతారు. – మంజోత్కౌర్, అమీర్‌పేట అస్సాం: మాతా పూజ ప్రత్యేకం.. మాకు దుర్గా మాత పూజ ఎంతో ప్రత్యేకం. మిఠాయిలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి వాటినే ప్రసాదంగా పంచుకుంటాం. ఉదయం 8 గంటలకే పూజను పూర్తి చేస్తాం. ఆ సాయంత్రం గ్రామ కూడలిలో గానా బజానాతో వేడుక చేసుకోవడం ఆనవాయితీ. వేడుకల్లో కుటుంబసభ్యులమంతా పాల్గొంటాం. – సీమ్కథర్, ఖైరతాబాద్. రాజస్థాన్: రోజుకోసారే నీళ్లు దేవీశరన్నవరాత్రి రోజులను అత్యంత నిష్టగా పాటిస్తాం. తొమ్మిది రోజుల పాటు రోజుకొకసారి మంచినీళ్లు తాగి అఖండ ఉపవాస దీక్షలు కొనసాగిస్తాం. ప్రతిరోజూ అమ్మవారికి పూజలు చేస్తాం. తొమ్మిది రోజుల పాటు పాదరక్షలు కూడా ధరించం. దశమి రోజున రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వేషాధారణలు వేయించి బాణంతో రావణసురుడి వధ (దహనం) కార్యక్రమంతో నవరాత్రి ఉత్సవాలను ముగిస్తాం. ఇక్కడ బతుకమ్మ వేడుకలు ఎలాగో మేము గర్బా నృత్యం చేస్తుంటాం. – గులాబ్‌సింగ్ రాజ్‌పురోహిత్,రాజస్థానీ మండల్ ప్రతినిధి, అమీర్‌పేట వాహనాలకు పూజలు చేస్తాం అబిడ్స్: దసరా వేడుకల్లో త్రిజోడీలు, వాహనాలకు పూజలు చేస్తాం. డబ్బు నిల్వ ఉంచే త్రిజోడీలకు ముందుగా పూజలు నిర్వహిస్తాం. వాహనాలు, ట్యాక్సీలకు పూజలు నిర్వహిస్తాం. ఇంట్లో ప్రత్యేకంగా మిఠాయిలు తయారు చేసి పంచిపెడతాం. కాచిగూడలోని షామందీర్ ఆలయానికి వెళ్లి జమ్మిపూజలు నిర్వహిస్తాం. – గోవింద్‌రాఠి,మార్వాడి సమాజ్ నాయకుడు కర్ణాటక: ఆటలు.. పాటలు.. దసరా వచ్చిందంటే కర్ణాటకలో ఇళ్లు శోభయామానంగా వెలుగొందుతాయి. అక్కడి ప్రభుత్వం పది రోజులు సంగీత, నృత్య ప్రదర్శనలు, బొమ్మల కొలువులతో పాటు మల్లయుద్ధం, ఇతర ఆటల పోటీలు నిర్వహిస్తుంది. దసరా పండుగను పురస్కరించకుని ఫుడ్, ఫిల్మ్ ఫెస్టివల్స్ జరుగుతాయి.మైసూర్‌లోని వివిధ దేవాలయాలలో పూజలు జరుగుతాయి. చాముండిహిల్స్పై నిర్మించిన చాముంండేశ్వరి ఆలయంలో దసరా సమయంలో కిక్కిరిస్తోంది. – దుల్లప మిత్రే, రెజిమెంటల్ బజార్ ఒక్కో సంవత్సరం ఒక్కో గ్రామంలో పూజలు చేస్తాం కంటోన్మెంట్: తమిళనాడులో దసరాకు ఒకరోజు ముందునుంచే ఉత్సవాలు ఆరంభమవుతాయి. నగరంలో మూడు లక్షల మంది తమిళులు ఉండగా, కేవలం కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లోనే లక్ష మంది వరకు ఉంటారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కలిసి ఒక్కో సంవత్సరం ఒక్కో గ్రామంలో ఉత్సవం చేస్తాం. దసరాకు ఒక్కరోజు ముందే ఆ గ్రామంలోని గ్రామదేవత ఆలయంలో పూజలు నిర్వహించి రథాల ఊరేగింపు చేపడతాం. రథాల ఊరేగింపు అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన జమ్మిచెట్టుకు పూజ చేసి ఆ ఆకును ఇళ్లకు తీసుకెళతాం. ఈ ఆకును బంగారులా భావించి తోటివారితో పంచుకుంటాం. నవరాత్రుల సందర్భంగా పూజలు, బొమ్మల కొలువు చేస్తాం. గత ఏడాది అమ్ముగూడలో ఉత్సవాలు చేశామం. పండుగ రోజున రామాలయంతో పాటు కరమరి, తులకాంతమ్మ, మథర్వీరన్ ఆలయాల్లో పూజలు చేస్తాం. – మహదేవన్,ఆలిండియా అరవమాల సంఘం అధ్యక్షుడు. ప్రత్యేక మట్టితో అమ్మవారి విగ్రహాన్ని తయారుచేస్తాం ఒడిస్సాలో దసరా ఉత్సవాల కోసం ప్రత్యేకంగా మట్టిని తీసుకొచ్చి దుర్గామాత విగ్రహాన్ని తయారు చేస్తాం. మండపాలను రూ. కోటి అయినా వెచ్చించి అత్యంత ఆకర్షణీయంగా అలంకరిస్తాం. అమ్మవారికి చావల్, సబ్జీ,దాల్ ప్రసాదంగా వండి పెడతాం. రోజూ వేదిక వద్ద డ్యాన్స్‌లు, దాండియా, ఆటాపాటా జాతరలా ఉంటుంది. – గధాధర్దాల్, ఒడిస్సా ప్రాంతాలు వేరైనా కలిసికట్టుగా... చార్మినార్: ప్రాంతాలు వేరైనా.. ఉత్సవాలను మాత్రం కలసి కట్టుగా నిర్వహించుకోవడం నిజాం కాలం నుంచి వస్తోంది. నగరంలో దసరా వేడుకలు విభిన్నంగా జరుగుతాయి. నగరంలో స్థిరపడిన రాజస్థాన్, గుజరాత్, హర్యాన, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన ఉత్తర భారతీయులైన అగర్వాల్ కుటుంబీకులు, మరాఠిలు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన కన్నడీగులు,పశ్చిమబెంగాళ్‌కు చెందిన బెంగాలీలు తమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహరాలకు అనుగుణంగా దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. నగరంలోని జియాగూడ, అత్తాపూర్,సికింద్రాబాద్, గుల్జార్‌హౌజ్, మామాజుమ్లాపాటక్, చార్‌కమాన్, కోకర్‌వాడీ, చెలాపురా, ఘాన్సీబజార్, జూలా,కూకట్పల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల కన్నడిగులు దసరా వేడుకల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. నగరంలో స్థిరపడ్డ పశ్చిమబెంగాళ్‌కు చెందిన బెంగాలీలు దసరా ఉత్సవాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. బెంగాలీలకు దసరా పెద్ద పండుగ. దుర్గామాతను ప్రతిష్టించిన నాటి నుంచి నాలుగు రోజుల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బెంగాలీలు ఆదివారం విజయ దశమి రోజు నిమజ్జనం చేయనున్నారు. వాస్తవానికి కలకత్తాలో దుర్గామాత విగ్రహాం వద్ద మేకలను బలిస్తామని... ఇక్కడ మాత్రం తొమ్మిది రకాల వేర్వేరు ఫలాలను దుర్గామాత వద్ద బలిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఉత్తర భారతీయులైన అగర్వాల్ కుటుంబీకులు దసరా ఉత్సవాలను రోజంతా ఉపవాసంతో నిర్వహిస్తారు. నిరాడంబరంగా దసరా వేడుకలు... ఈసారి దసరా వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటున్నాం. వర్షం, వరదలు, కరోనా...ఇలా తమను దసరా వేడుకలకు కొద్దిగా దూరం చేసాయి. అయినప్పటికీ... తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉన్న తామంతా ఆదివారం విజయ దశమి పండుగ నిర్వహించడానికి సిద్దమయ్యాం. – నాగ్నాథ్ మాశెట్టి, కోకర్‌వాడి -
మన యుద్ధం మనమే చేయాలి..
‘‘ఆడవాళ్లందర్లోనూ అన్యాయాన్ని ఎదిరించగల దుర్గాదేవి అవతారముంది. అది తెలుసుకుని, ఆ శక్తిని బయటకు తీస్తేనే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎదుర్కోగలం’’ అంటున్నారు రాశీ ఖన్నా, లావణ్యా త్రిపాఠి, అదా శర్మా, మెహరీన్, నభా నటేశ్. సమాజంలో స్త్రీ నెగ్గుకురావాలంటే దుర్గాదేవిలా మారాల్సి ఉంటుందా? ఆడవాళ్లకు పలు సమస్యలు ఉంటాయి. అవకాశం వస్తే మీరు పూర్తిగా నిర్మూలించాలనుకునే సమస్య ఏంటి? చెడును ఎదుర్కోవడానికి మీరు దుర్గాదేవిలా మారిన సందర్భాలేమైనా? దసరా పండగ సెలబ్రేషన్ గురించి? వంటి ప్రశ్నలకు రాశీ, అదా, లావణ్య, మెహరీన్, నభా చెప్పిన అభిప్రాయాలు దసరా ప్రత్యేకం. హద్దు దాటితే సహించను – మెహరీన్ ► తన క్యారెక్టర్ని తక్కువ చేసినా, తన ఆత్మస్థైర్యాన్ని తగ్గించేలా ఉన్నా, అనవసరమైన నిందలకు గురైనా తప్పకుండా దుర్గాదేవిలా మారాల్సిందే. ఏం జరిగినా సరే ఒకరి క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. ఆడవాళ్లను అగౌరవపర్చకూడదు. ► అసమానతను నిర్మూలించాలనుకుంటున్నాను. ఆడవాళ్లను బలహీనమైనవాళ్లలా చూస్తారెందుకో అర్థం కాదు. శారీరకంగా మగవాళ్ల అంత బలంగా ఆడవాళ్లు ఉండకపోవచ్చు. కానీ మానసికంగా ఆడవాళ్లు ఎంత బలవంతులో అందరికీ తెలుసు. శారీరకంగానూ మాకు వీలైనంతగా చేస్తూనే ఉంటాం. ఎంతో సమర్థవంతంగా ఇంటి పనిని, ప్రొఫెషనల్ పనిని బ్యాలెన్స్ చేయగలం. మల్టీటాస్క్ చేయగలం. స్త్రీ, పురుషులందరూ సమానమే అనే భావన పెంపొందించాలి అందరిలో. ► నేను చాలా సైలెంట్‌గా ఉంటాను. ఓపిక ఎక్కువ. నా పనేదో నేను చూసుకునే మనస్తత్వం. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఆ లిమిట్ వరకూ నేను కామ్‌గా ఉంటాను. అన్యాయంగా ప్రవర్తించినా, అగౌరవపరిచినా అస్సలు సహించలేను. ఆ పరిస్థితిని చక్కబెట్టేందుకు నిలబడతాను. ► పండగ వస్తుందంటే నాకు భలే సంతోషమేస్తుంది. స్నేహితులు, బంధువులను కలవచ్చు. ప్రస్తుతం అందరం ఎప్పుడూ చూడని పరిస్థితుల్లో ఉన్నాం. ఎక్కువమందితో కలిసి పండగలు జరుపుకునే పరిస్థితిలో లేము. ఇలాంటి సమయాల్లో ఒకరికోసం ఒకరు నిలబడదాం. మన కళ్లు కూడా ఆయుధమే – అదా శర్మ ► ప్రతీ ఒక్కరిలోనూ దుర్గాదేవి ఉంటుంది. కానీ కొందరు తెలుసుకోగలుగుతారు. కొందరికి తెలియదు.. అంతే. మన లోపల శక్తి దాగి ఉంటుంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు అదే బయటకు వస్తుంది. రావాలి కూడా. ► ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు కావడం చూస్తుంటాం. ఒకరిని ఒకరు తక్కువ చేయడం తీసేయాలనుకుంటున్నాను. ఒక స్త్రీ మరో స్త్రీ కోసం నిలబడాలి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ కలసి పైకి ఎదగాలి. ► చాలాసార్లు మారాను. కర్రను కూడా ఆయుధంగా చేసుకున్న సందర్భాలున్నాయి. కొన్నిసార్లు కళ్లను కూడా ఆయుధాలుగా మార్చుకోవచ్చు. ► దసరా పండగకి ఇంట్లోనే ఉంటున్నాను. ఇంటి ముందు రంగోలీ వేస్తాను. ఇంటిని పూలతో అలంకరిస్తాను. ఇష్టమైన వంటకాలు చేసుకుని తింటాము. అందుకే తొమ్మిది అవతారాలు – నభా నటేశ్ ► ప్రతి ఒక్కరికి తనలో ఉన్న ప్లస్, మైనస్ కచ్చితంగా తెలియాలి. వాళ్ల బలమేంటో తెలుసుకుని బలహీనతలను తొలగించుకోవటం కోసం ఫైట్ చెయ్యాలి. దుర్గాదేవి ప్రపంచంలోని అందరికీ సమానమే, అందరికీ అమ్మే. దుర్గాదేవి అంటే ప్రపంచానికే శక్తి. ఆమె తెచ్చిన విజయంతోనే ప్రపంచానికి వెలుగొచ్చింది. అందుకే ప్రతి ఒక్కరూ.. ముఖ్యంగా ఆడవాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో, ఏం సాధించాలనుకుంటున్నారో తెలుసుకుని దానికోసం జీవితంలో కష్టపడాలి. దుర్గాదేవి చేసింది అదే. నాకు కావాల్సిందేంటో నాకు కచ్చితంగా తెలుసు, దానికోసం నేను అమ్మవారిలా ఫైట్ చేస్తాను. అదే నా బలం ఆనుకుంటాను. ► అమ్మవారు ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాల్లో తను సాధించాలనుకున్నది సాధించింది. అందుకే ఈ తొమ్మిది రోజులూ అమ్మవారిని తొమ్మిది రకాలుగా తయారుచేసి ఎంతో భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో ఉంచి పూజ చేస్తారు. నేను పుట్టి పెరిగింది శృంగేరిలో. దేశంలోని శారదా శక్తి పీఠాల్లో అది కూడా ఒకటి. నవరాత్రి సమయంలో గుళ్లో అమ్మవారిని రోజుకో రూపంలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. నేను ప్రతిరోజూ గుడికి వెళ్లి ఆ అలంకారాలను చూసి భక్తితో మొక్కుతాను. ఆ అమ్మవారి అలంకారాలు ఎంత అందంగా ఉంటాయో మాటల్లో చెప్పలేను. చిన్నప్పుడు అలా గుడికి వెళ్లి ఆడుకుంటూ సెలబ్రేషన్స్‌లో పిల్లలందరం పాల్గొనేవాళ్లం. ఇప్పుడు అవన్నీ గుర్తుకు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పటికీ పండగలంటే నాకు చాలా శ్రద్ధ. వీలు కుదిరినంతవరకూ పూజలు చేస్తుంటాను. మన యుద్ధం మనమే చేయాలి – రాశీ ఖన్నా ► మనందరిలోనూ దుర్గాదేవి అవతారం ఉంటుంది. ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితుల్ని చూస్తుంటే ఒక్కోసారి ఆ అవతారాన్ని బయటకు తీస్తేనే బతకగలం అనిపిస్తుంది. ఎప్పుడూ అమాయకంగా కూర్చోలేం కదా. కలియుగంలో మన యుద్ధం మనమే చేయాలి. ► మానభంగం, లింగ వివక్ష అనేది సమాజంలో లేకుండా చేయాలన్నది నా కోరిక. మన ఇష్టమొచ్చినప్పుడు, ఇష్టమొచ్చిన బట్టలు వేసుకొని బయటకు వెళ్లడానికి ఎందుకు భయపడాలి? అబ్బాయిలకు చిన్నప్పటి నుంచే అమ్మాయిల్ని ఎలా గౌరవించాలో నేర్పుదాం. రేప్ కేసుల్లో దోషుల మీద ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటికీ సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నాం. లింగ బేధాలు లేకుండా సమాన అవకాశాలు ఇవ్వగలగాలి? ► నా కోసం నేను నిలబడాల్సిన పరిస్థితులు కొన్ని వచ్చాయి. నిలబడ్డాను. మా ఇంట్లో నాకు చిన్నప్పటినుంచీ ‘నీకు కావాల్సిన దానికోసం నువ్వు ఫైట్ చేయ్’ అని చెబుతూ వచ్చారు. ఏదైనా ఇష్యూ వస్తే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడటానికే ఇష్టపడతాను. ముసుగులో మాట్లాడటానికి ఇష్టపడను. నాకోసం నేను నిలబడాల్సి వస్తే కచ్చితంగా ధైర్యంగా నిలబడతాను. ► చిన్నప్పటి నుంచి ఫ్యామిలీతోనే జరుపుకునేదాన్ని. కానీ సినిమాల్లోకి వచ్చాక పండగలకు ఇంట్లో ఉండటం తక్కువైంది. షూటింగ్స్ హడావిడిలో ఉంటాం. చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలసి రామ్‌లీలా చూడటానికి మా ఇంటి (ఢిల్లీ) దగ్గర ఉన్న గ్రౌండ్‌కి వెళ్లేదాన్ని. మాది చాలా పెద్ద కుటుంబం. పండగ వస్తే చాలు అందరం కలిసే వాళ్లం. పని వల్ల హైదరబాద్‌లోనే ఉండిపోతే ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అదే నా సూపర్ పవర్ – లావణ్యా త్రిపాఠి ► ఈ భూమ్మీద పుట్టిన ప్రతి స్త్రీలో దుర్గా మాత ఉంటుంది. అందుకే ప్రతి స్త్రీలో శక్తి దాగుందని నేను నమ్ముతాను. మగపిల్లలు సూపర్‌హీరోస్ అయినట్లే అమ్మాయిలు అవసరమొచ్చినప్పుడు ధైర్యంగా ఉండగలరు. అలాగే తమ గొంతును ప్రపంచానికి గట్టిగా వినిపించగలరు. తన అనుకున్నవారి కోసం నిలబడి ఫైట్ చేయగలరు. మనం చేయాల్సిందల్లా ఆడపిల్లలపై నమ్మకాన్ని ఉంచటం అంతే. నేను వ్యక్తిగతంగా దుర్గామాతను నమ్ముతాను, నన్ను నేను దుర్గగా అనుకుంటాను. దుర్గ అంటే కోపం, భయం, ప్రేమ మాత్రమే కాదు ఆలోచనాపరమైన శక్తిని ఇస్తుంది. ప్రతి ఒక్కరి గురించి ఆమె ఆలోచిస్తుందని నాకు అనిపిస్తుంది. ► మనకొచ్చే ప్రతి సమస్యకు కోపం పరిష్కారం కాదు. స్త్రీ అనే కాదు ప్రతి ఒక్కరూ యాంగర్ మేనేజ్మెంట్ చేయాలి. నేను చాలా కామ్‌గా, కూల్‌గా ఉంటాను. ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా నెమ్మదిగా ఉంటాను. పరిష్కరించుకుంటాను కూడా. అదే నా సూపర్‌పవర్. నా కోపాన్ని ఎప్పుడూ నేను కంట్రోల్లో పెట్టుకుంటాను. ► మా ఇంట్లో చిన్నపిల్లలకు పండగ విశేషాలు చెప్పడం నా అలవాటు. నేను నా మేనకోడలికి కొంచెం క్రియేటివ్‌గా స్కెచ్‌తో బొమ్మలేసి, రాక్షస సంహారం ఎందుకు జరిగింది? దసరా పండగ ఎందుకు చేసుకుంటాం? అనే విషయాలు చెప్పాను. రాక్షసునిపై సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి చేసుకుంటాం అని చెప్పాను. అలా చెప్తేనే కదా మన సంస్కృతి సంప్రదాయాలు వృద్ధి చెందుతాయి. -
దసరా తర్వాతే బస్సులు..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవకుండా తొలిసారి దసరా జరుగుతోంది. లాక్‌డౌన్‌తో 7 నెలల క్రితం నిలిచిపోయిన బస్సులు.. అంతర్రాష్ట్ర ఒప్పందం లేదన్న కారణంతో ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. దీనిపై 2 నెలలుగా అభిప్రాయ భేదాలు నెలకొన్నా.. దసరా ముంగిట అవి సమసిపోయాయి. తెలంగాణ ఆర్టీసీ ప్రతిపాదించిన మేరకు బస్సు సర్వీసులు, తెలంగాణ పరిధిలో తమ బస్సులు తిరిగే కి.మీ. సంఖ్య తగ్గించుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సమ్మతించింది. అయితే, ఒప్పందానికి సంబంధించిన భేటీ నిర్వహించలేదు. దీంతో తొలిసారి దసరా వేళ ఆర్టీసీ బస్సులు సరిహద్దులు దాటలేదు. గతేడాది దసరా సమయంలో తెలంగాణ ఆర్టీసీలో సమ్మె ప్రారంభం కావటంతో పండక్కి టీఎస్ఆర్టీసీ బస్సులు పెద్దగా నడవలేదు. అదే సమయంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ముమ్మరంగా నడవడంతో పాటు అదనంగానూ తిరిగాయి. ఇక, ఈ దసరాకు రెండువైపులా బస్సులు సరిహద్దులు దాటలేదు. దీంతో తెలంగాణ పరిధిలో ఉండే ఏపీ ప్రయాణికులు, ఆంధ్రా ప్రాంతంలో ఉండే తెలంగాణవాసులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక, రైళ్లు కూడా పరిమిత సంఖ్యలోనే నడుస్తుండటంతో ఎక్కువ మంది ప్రైవేటు బస్సులు, సొంత వాహనాల్లో ఊళ్లకు పయనమయ్యారు. పండుగ తర్వాతే.. తెలంగాణ ఆర్టీసీ ప్రతిపాదన మేరకు.. తెలంగాణ భూభాగంలో ఏపీ బస్సులు తిరిగే పరిధిని 1.04 లక్షల కి.మీ.మేర తగ్గించుకోవటంతోపాటు, 322 బస్సులు తగ్గించుకునేందుకు ఏపీ సమ్మతించింది. అత్యంత లాభదాయకమైన హైదరాబాద్–విజయవాడ మధ్య దాదాపు 51 వేల కి.మీ. మేర తిరిగే నిడివి తగ్గించుకునేందుకూ ఏపీ సిద్ధమైనట్టు తెలిసింది. దీనిపై పండగ తర్వాత మంగళ, బుధవారాల్లో తుది భేటీ జరిగే అవకాశం ఉంది. ఇందులో అవగాహన కుదిరితే రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులకు మార్గం సుగమమవుతుంది. -
ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు
-
పండగ వేళ నగరం ఊరెళ్తోంది..
-
దసరదా లేదు
సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి వంటివి ఇండస్ట్రీకు చాలా ఇష్టమైన సీజన్లు. ఈ సమయంలో థియేటర్స్ నిండుగా ఉంటాయి. సినిమా ఆడితే లాభాలు మెండుగా ఉంటాయి. పండగలే ఫ్యామిలీలను థియేటర్స్‌కు కదిలిస్తాయి. అయితే ఈ ఏడాది కోవిడ్ వల్ల సమ్మర్ పోయింది. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే థియేటర్స్ తెరిచారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు థియేటర్స్‌లో లేరు. దసరాకి కూడా థియేటర్స్ బిజినెస్‌కు సందడి లేనట్టే. కొత్త సినిమాలేవి? థియేటర్స్‌కి ప్రేక్షకులు రావాలంటే కొత్త సినిమా ఉండాలి. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నట్టు అనిపిస్తేనే కొత్త సినిమా విడుదల చేయగలం అన్నట్లుంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి. పాత సినిమాలను ప్రదర్శిస్తూ థియేటర్స్‌ను నడిపిస్తున్నారు. అయితే వస్తున్న ప్రేక్షకుల సంఖ్య వేళ్ల మీద లెక్కెట్టొచ్చు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈజీగా మూడు కొత్త రిలీజ్లు ఉండే సీజన్ దసరా. ఈసారి ఒక్కటీ లేదు. కొత్త సినిమాలు ఎప్పుడు విడుదలకు సిద్ధం అవుతాయో అర్థం కాని పరిస్థితి. సినిమాలన్నీ సంక్రాంతికి సిద్ధం చేసే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. డిజిటల్ దసరా థియేటర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న నేపథ్యంలో ఓటీటీకి బాగా డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. థియేటర్స్ ప్రారంభించినప్పటికీ ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్‌లు, షోలు విరివిగా విడుదలవుతున్నాయి. బాలకృష్ణ దర్శకత్వంలో ‘నర్తనశాల’ అనే చిత్రం అప్పట్లో ప్రారంభం అయింది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పూర్తికాలేదు. సౌందర్య, శ్రీహరి ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే చిత్రీకరించిన కొంత భాగాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిశ్చయించుకున్నారు. సుహాస్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘కలర్ ఫోటో’ ఆహాలో విడుదలయింది. సూపర్‌హిట్ సిరీస్ ‘మిర్జాపూర్’కి సీక్వెల్‌గా ‘మిర్జాపూర్ 2’ తాజాగా అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. టబు, ఇషాన్ కట్టర్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘ఎ సూటబుల్ బాయ్’ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇలా సినిమాలు, సిరీస్‌లతో డిజిటల్లో దసరా సందడి కనబడుతోంది. సందడి మళ్లీ సంక్రాంతికేనా? దీపావళి, క్రిస్మస్ సీజన్లోనూ కొత్త సినిమాలు విడుదలవుతున్నట్టు అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఆల్రెడీ రానా నటించిన ‘అరణ్య’ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. అలాగే అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తదితర చిత్రాలు కూడా పండగకి రానున్నాయి. మరి.. కొత్త సినిమాలతో సంక్రాంతికైనా థియేటర్లు కళకళాలాడతాయా? చూడాలి. -
శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మ
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడవరోజు దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయడం ఒక అద్బుత ఘట్టం మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీమహాలక్ష్మీ అమితరమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోకస్ధితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీగా వరాలను ప్రసాదించే అష్టలక్ష్మీ సమిష్టిరూపమైన అమృత స్వరూపాణిగా శ్రీ దుర్గమ్మను మహాలక్ష్మిగా దర్శించవచ్చు. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులందరికీ ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తుంది. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. (చదవండి: నవరాత్రులు.. నవ వర్ణాలు) దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మహాలక్ష్మి రూపంలో కనక దుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రీ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే! శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే!! -
శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ
సాక్షి, విజయవాడ: దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలలో ఆరో రోజు దుర్గదేవి అమ్మవారు శ్రీ లలితాత్రిపురసుందరిదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారు శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదాశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసి తన భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. శ్రీలక్ష్మీదేవి, శ్రీసరస్వతిదేవీ ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరు మందహాసంతో, వాత్సల్య జితోష్ణలను చిందిస్తూ, చెరుకుగడను చేతపట్టుకుని శివుని వక్షస్ధలంపై కూర్చుని శ్రీ లలితాత్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా, అమ్మవారు త్రిపురసుందరీదేవిగా భక్తుల చేత పూజలందుకుంటారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. చదవండి: దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ ఇంద్రకీలాద్రి: ప్రాతస్స్మరామి లలితా వదనారవిందం బింబాధరంపృథుల మౌక్తిక శోభినాసమ్ ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్!! -
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ వారికి దసరా ఉత్సవాల సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వ్రస్తాలు సమరి్పంచారు. సంప్రదాయ పంచకట్టు వస్త్ర ధారణలో ఆలయానికి చేరుకున్న సీఎం జగన్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని గాలిగోపురం వద్ద సీఎం తలకు స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ పరివట్టం చుట్టారు. పట్టు వ్రస్తాలున్న పళ్లెంను తలపై పెట్టుకుని అమ్మవారి సన్నిధికి చేరుకున్న సీఎం.. వాటిని సమర్పించి, ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి, ప్రసాదాలు అందజేశారు. పాలక మండలి, అధికారులు దేవస్థానం తరఫున అమ్మవారి చిత్రపటం అందజేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం 2021 నూతన సంవత్సర క్యాలండర్‌ను సీఎం ఆవిష్కరించారు. అంతకు ముందు ఘాట్ రోడ్డు మార్గంలో ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు దేవదాయ శాఖ కార్యదర్శి ఎం.గిరిజాశంకర్, ప్రత్యేక కమిషనర్ పి.అర్జునరావు, పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, రాజ్యసభ సభ్యులు మోపిదేవి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వల్లభనేని వంశీ, జోగి రమేష్, కొలుసు పార్థసారథి, వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. కాగా, అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రంలో భాగంగా సరస్వతీదేవిగా అలంకరింపబడిన దుర్గమ్మను సీఎం వైఎస్ జగన్ దర్శించుకున్నారు. ఆ నిధులతో మెరుగైన సౌకర్యాల కల్పన ► విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయటానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారని ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు చెప్పారు. బుధవారం సీఎం జగన్ అమ్మవారి దర్శనానంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు. ► ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులకు సంబంధించి మాస్టర్ ప్లాన్‌లో రూపొందించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆమోదం తెలిపారన్నారు. ► కొండ చరియలను పటిష్ట పరచడం, నిత్యాన్నదానం వంటశాల, ప్రసాదాల తయారీ భవనం, కేశఖండనశాల భవనం, సోలార్ విద్యుత్ ఏర్పాటు తదితర నిర్మాణాలకు ఈ నిధులను వెచ్చిస్తామని తెలిపారు. ► ఆలయ అభివృద్ధికి, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి తక్షణం స్పందించి ఆమోదం తెలపడం పట్ల దేవస్థానం పాలకవర్గం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. నిధుల కేటాయింపునకు సంబంధించిన ఆదేశాలు అధికారికంగా వెలువడనున్నాయని చెప్పారు. ఇదే తొలిసారి ► రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ దుర్గ గుడి అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరు చేయడం పట్ల దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలియజేశారు. దేవాలయాల అభివృద్ధి పట్ల సీఎం జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ► దుర్గగుడి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. గత ప్రభుత్వాలు భక్తులు సమరి్పంచిన కానుకలతోనే ఆలయ అభివృద్ధి పనులు చేయించేవి. అమ్మవారి ఆలయ ఫిక్స్డ్ డిపాజిట్లు డ్రా చేసి నిర్మాణాలు చేశారే తప్ప ఇప్పటి వరకు ప్రభుత్వ నిధులు వెచ్చించలేదు. సీఎం నిర్ణయం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రేపు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫోన్లో సమీక్షించారు. రేపు(బధవారం) ఇంద్రకీలాద్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్న సందర్భంగా మంగళవారం మంత్రి ఏర్పాట్లను సమీక్షించారు. దసరా ప్రారంభమై గత మూడు రోజులుగా చేసిన ఏర్పాట్లను భక్తుల విషయంలో తీసుకున్న జాగ్రత్తల గురించి అధికారులను అడిగి తెలుసుకుని, పలు సూచనలు చేశారు. మంత్రితోపాటు ఈవో సురేష్ బాబు ఇతర అధికారులు ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు: రేపు(బుధవారం) మూల నక్షత్రం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అమ్మవారికి పట్టు వస్త్తాలు సమర్పించనున్నారు. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్ రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరన్నారు. మధ్యాహ్నం 3:40 గంటలకు దుర్గగుడికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం 4 గంటలకు తిరిగి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. -
ఇంద్రకీలాద్రి : గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం
-
అమ్మవారిని ప్రార్థిస్తూ నైవేద్యాలు
దసరా సరదాల పండుగ కడుపు నిండా పిండి వంటలు ఆరగించే పండుగ ఈ సంవత్సరం మాత్రం కరోనా కనికరించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ నైవేద్యాలు అర్పించే పండుగ జాగ్రత్తలు పాటిస్తూ అందరూ కలిసి దసరాను సరదాగా... దసరదాల పండుగగా జరుపుకుందాం. ► సాబుదాన (సగ్గుబియ్యం) వడలు కావలసినవి: సాబుదానా (సగ్గుబియ్యం): ఒక కప్పు; బంగాళ దుంప – 1(ఉడికించి పొట్టు తీయాలి); పచ్చిమిర్చి – 8; ఉప్పు – తగినంత; నూనె – తగినంత. తయారీ: ముందుగా సగ్గుబియ్యంలో నీళ్లు పోసి బాగా కగిగాక, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు మూడు గంటలు నాననివ్వాలి ఒక పాత్రలో... నానిన సగ్గుబియ్యం, ఉడికించిన బంగాళ దుంప, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి సగ్గుబియ్యం మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా చేతితో వత్తు కోవాలి సన్నని మంట మీద నూనెను ఉంచి, వీటిని అందులో వేసి, నెమ్మదిగా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి ప్లేటులో పేపర్ నాప్కిన్ వేసి దానిపై వేయించిన వడలు వేసుకోవాలి (సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి) ► నేతి గారెలు కావలసినవి: మినపపప్పు – 4 కప్పులు; పచ్చి మిర్చి – 10; పచ్చికొబ్బరి తురుము – ఒక టీ స్పూను; అల్లం ముద్ద – 5 టీ స్పూన్లు; నెయ్యి – తగినంత; దాల్చిన చెక్క – రెండు; లవంగాలు – 2; ఉప్పు – తగినంత; నల్ల మిరియాలు – ఒక టీ స్పూను; జీలకర్ర: ఒక టేబుల్ స్పూను. తయారీ: ముందుగా మినప్పప్పును మూడు గంటల పాటు నీళ్ళలో నానపెట్టాక, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి మిక్సీలో నూనె మినహా మిగతా పదార్థాలన్నీ జత చేసి మెత్తగా చేసి, రుబ్బుకున్న మినప్పిండిలో వేసి బాగా కలపాలి స్టౌ వెలిగించి పాన్ పెట్టి తగినంత నెయ్యి వేసి కాచాలి గారెలు వేసే ముందు ఉప్పు జత చేయాలి పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ, ప్లాస్టిక్ పేపర్‌పై గారెలుగా ఒత్తి, కాగిన నేతిలో వేసి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. (అల్లం చట్నీతో తింటే రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిది) ► పనీర్ పాయసం కావలసినవి: తరిగిన పనీర్ – అర కప్పు; బెల్లం తరుగు – 2 కప్పులు; చిక్కటి పాలు – ముప్పావు కప్పు; పాలు – అర లీటరు; డ్రై ఫ్రూట్లు – అలంకరిచంటానికి తగినన్ని; ఏలకుల పొడి – ఒక టీ స్పూను. తయారీ: ∙స్టౌ మీద మందపాటి బాణలి ఉంచి వేడయ్యాక, తరిగిన పనీర్, పాలను ఒకదాని తరవాత ఒకటి వెంటవెంటనే వేయాలి ∙సుమారు పది నిమిషాల వరకు ఉండలు కట్టకుండా కలుపుతుండాలి ∙చిక్కటి పాలను జత చేసి మరో నాలుగు నిమిషాల పాటు కలుపుతుండాలి ∙బెల్లం తరుగు, ఏలకుల పొడి జత చేసి, బెల్లం కరిగేవరకు బాగా కలియబెట్టాలి ∙డ్రై ఫ్రూట్లను జత చేసి, బాగా కలిపి, గిన్నెలోకి తీసుకోవాలి ∙తరిగిన బాదం, కిస్మిస్ లతో పైన అలంకరించి, బాగా చల్లారాక అందించాలి. ► కొబ్బరి పులిహోర కావలసినవి: బియ్యం – 2 కప్పులు; ఎండు కొబ్బరి తురుము – ఒక కప్పు; చింత పండు – 50 గ్రా.; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మిన\ప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 6; పచ్చి మిర్చి – 4; కరివేపాకు – మూడు రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; ఇంగువ – పావు టీ స్పూను; నూనె – 2 టేబుల్ స్పూన్లు; వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూను; జీడి పప్పులు – 10. తయారీ: బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి అన్నం వేడిగా ఉండగానే ఒక ప్లేటులోకి తీసుకుని, గరిటెతో పొడిపొడిలాడేలా కదపాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు, ఇంగువ ఒకదాని తరవాత ఒకటి వేసి బాగా వేయించాలి చింతపండు పులుసు, ఉప్పు, పసుపు జత చేసి బాగా కలిపి, కొద్దిసేపు ఉడకనివ్వాలి దింపే ముందు ఎండు కొబ్బరి తురుము జత చేసి కలిపి దింపేసి, అన్నం మీద వేసి బాగా కలియబెట్టాలి పల్లీలు, జీడిపప్పులు జత చేసి మరోమారు కలిపి, గంట సేపటి తరవాత అందిస్తే రుచిగా ఉంటుంది. (ఇదే పద్ధతిలో పెసర పిండి పులిహోర, ఆవ పులిహోర, దానిమ్మ రసం పులిహోర, నువ్వుల పొడి పులిహోర కూడా తయారుచేసుకోవచ్చు) ► తారాట్టి పాల్ కావలసినవి: పాలు – అర లీటరు; బెల్లం తరుగు – ఒక కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను. తయారీ: ముందుగా వెడల్పాటి గిన్నెను స్టౌ మీద ఉంచి, అందులో పాలు పోసి సన్నని మంట మీద బాగా మరగనివ్వాలి పాలు సగం అయ్యే వరకు వాటిని కలుపుతూ మరిగించాలి పాలు బాగా చిక్కగా అయిన తరవాత బెల్లం తరుగు వేసుకోవాలి నెయ్యి జత చేసి గిన్నె అంచులకు అంటుకోకుండా కలుపుతూ వుండాలి ఏలకుల పొడి కూడా వేసి, నెమ్మదిగా కలుపుకుంటూ సన్నని మంట మీద బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి నెయ్యి పాల నుండి బయటికి వస్తున్నప్పుడు మరో అయిదు నిమిషాలు ఉడికించి దింపేయాలి. ► రవ్వ బొబ్బట్లు కావలసినవి: రవ్వ – ఒక కప్పు; మైదా – 2 కప్పులు; గోధుమ పిండి – అర కప్పు; పంచదార – 2 కప్పులు; వంట సోడా – చిటికెడు; నెయ్యి 2 టీ స్పూన్లు; నూనె అర కప్పు. తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, గోధుమపిండి వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు, వంట సోడా జత చేసి పూరీ పిండిలా కలిపి మూతపెట్టి ఉంచాలి స్టౌ మీద పాన్‌లో నెయ్యి వేసి కరిగాక, రవ్వ వేసి దోరగా వేయించి పక్కన ఉంచాలి అడుగు మందంగా ఉన్న గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి నీళ్లు బాగా మరుగుతుండగా వేయించిన రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి రవ్వ ఉడికిందనుకున్న తరవాత పంచదార, ఏలకులపొడి వేసి కలపాలి ఇది పూర్ణం చేయడానికి సరిపడా చిక్కబడిన తరువాత పక్కకు దింపుకొని నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకోవాలి ఇప్పుడు మైదా పిండిని చిన్న సైజు పూరీలా ఒత్తి మధ్యలో రవ్వ పూర్ణాన్ని పెట్టి చుట్టూరా పూరీతో మూసేసి మళ్లీ దాన్ని కర్రతో లేదా చేత్తో బొబ్బట్టులా ఒత్తి పెనం మీద నూనె లేదా నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి. ► పెసర పప్పు పొంగలి కావలసినవి: బియ్యం ఒక కప్పు; పెసరపప్పు – ఒక కప్పు; బెల్లం 2 కప్పులు; నీళ్ళు: నాలుగున్నర కప్పులు; జీడిపప్పులు – 10; కిస్మిస్ –10; ఎండుకొబ్బరి ముక్కలు: అర కప్పు; ఏలకుల పొడి: అర కప్పు; నెయ్యి అర కప్పు. తయారీ: ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి దానిలో నెయ్యి వేసి కరిగాక, ఎండుకొబ్బరి ముక్కలు వేసి కొంచెం ఎర్రగా వేగి, సువాసన వచ్చే వరకు వేయించాక, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి నాలుగున్నర కప్పుల నీరు పోసి స్టౌ మీద పెట్టుకోవాలి అన్నం వండినట్లుగానే ఉడికించుకుంటూ (అన్నం మొత్తం పలుకు లేకుండా ఉడకాలి. అన్నం మొత్తం ఉడికిన తరువాత ఎసరు లేకపోతే కొంచెం నీరు పోసుకోవచ్చు) కొంచెం నీరు ఉన్నప్పుడే దానిలో బెల్లం తురుము వేసి కరిగేదాకా మధ్యమధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా చూసుకోవాలి బెల్లం మొత్తం కరిగిన తరువాత, ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్లతో పాటుగా నెయ్యి కూడా వేసి బాగా కలిపాలి అంతే.. ఎంతో రుచికరమైన తియ్యటి పెసర పప్పు పొంగలి సిద్ధమైనట్లే. నవరాత్రి సందర్భంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఈ వంటకాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ► బాదం పాయసం కావలసినవి: బాదం పప్పులు: ఒక కప్పు; పాలు – 6 కప్పులు; పంచదార – ఒక కప్పు; కుంకుమ పువ్వు – కొద్దిగా; నీళ్లు – ఒక గ్లాసుడు. తయారీ: ముందుగా బాదం పప్పులను వేడి నీటిలో వేసి గంట సేపు నానిన తరవాత, నీళ్లు ఒంపేసి, బాదం పప్పులపై వుండే పొట్టును తీసేయాలి తరువాత నీటిని వంచి బాదం గింజలపై వుండే పొట్టును తీసేసి, బాదం పప్పులను మిక్సీలో వేసి, మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి (అవసరం అయితే పాలు వేసుకోవాలి) బాదం పేస్టును పాన్‌లో వేసి 5– 10 నిమిషాలు వేడి చేయాలి చక్కెర జత చేసి మరి కాసేపు ఉంచి, బాగా చిక్కగా అయిన తరువాత పాలు మొత్తం పోసి ఉడికించాలి కుంకుమపువ్వుతో అలంకరించితే, రుచికరమైన బాదం పాయసం రెడీ. ► పూర్ణం బూరెలు కావలసినవి: మినపప్పు – ఒక కప్పు; బియ్యం 2 కప్పులు; పచ్చి సెనగ పప్పు – 2 కప్పలు; బెల్లం తరుగు – 2 కప్పులు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నూనె – తగినంత; నెయ్యి – అర కప్పు. తయారీ: ముందుగా మినపప్పు, బియ్యాన్ని కడిగి, సరిపడా నీళ్ళు పోసి సుమారు నాలుగైదు గంటల పాటు నానబెట్టాలి మెత్తగా రుబ్బి పక్కకు పెట్టుకోవాలి పచ్చి సెనగపప్పును కుకరలో వేసి తగినన్నినీళ్ళు జత చేసి ఉడికించి దింపేయాలి బాగా చల్లారాక బెల్లం తరుగు జత చేసి, తడి పోయేవరకు మరోమారు ఉడికించాలి (లేదంటే వేయించేటప్పుడు విడిపోయి నూనెలో కలిసిపోతుంది) చివరగా ఏలకుల పొడి, నెయ్యి జత చేసి మరోమారు కలిపి దింపేయాలి ఈ మిశ్రమం చల్లారిన తరువాత నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసుకోవాలి స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి, కాగిన తరవాత ఉండలను మినపప్పు–బియ్యం మిశ్రమంలో పూర్తిగా ముంచి నూనెలో వేయాలి బంగారు వర్ణం వచ్చేంతవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి పూర్ణం మధ్యలో రంధ్రం చేసి, కాగిన నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటాయి. నిర్వహణ: వైజయంతి పురాణపండ కర్టెసీ: శ్రీదేవి లేళ్లపల్లి, చెన్నై -
నవరాత్రులు.. నవ వర్ణాలు
(వెబ్ స్పెషల్): తెలుగు లోగిళ్లలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి అమ్మవారి శరన్నవరాత్రులు మొదలయ్యాయి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని 9రూపాలలో కొలుస్తారు. తొమ్మిది రకాల నైవేద్యాలు.. స్త్రోత్రాలు అలానే 9 రోజులకు నవ వర్ణాలు ప్రత్యేకం. మరి ఆ రంగలు.. వాటి ప్రత్యేకత ఏంటో చూడండి.. మొదటి రోజు.. పసుపుపచ్చ రంగు శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రిగా కొలుస్తారు. శివుడి భార్యగా పూజిస్తారు. ఈ రోజున అమ్మవారు కుడి చేతిలో త్రిశూలం.. ఎడమ చేతిలో తామర పువ్వుతో నంది మీద దర్శనమిస్తారు. ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. రెండవ రోజు.. ఆకుపచ్చ రంగు రెండవ రోజున అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో కొలుస్తాం. ఈ రూపం విముక్తి, మొక్షం, శాంతి, శ్రేయస్సుకు ప్రతీక. చేతిలో జపమాల, కమండలం.. ఉత్త కాళ్లతో దర్శనమిచ్చే అమ్మవారు ఆనందం, ప్రశాంతతను ఇస్తుంది. నేడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. (చదవండి: కోవిడ్ నియమాలతో దసరా ఉత్సవాలు..) మూడవ రోజు.. బూడిద రంగు శివుడిని వివాహం చేసుకున్న తరువాత, పార్వతి తన నుదిటిన అర్ధచంద్రాన్ని అలంకరించింది. ఆమె అందం, ధైర్యానికి ప్రతీక. నేడు బూడిద రంగు దుస్తులు ధరిస్తే మేలు. నాల్గవ రోజు.. నారింజ రంగు నాల్గవ రోజు అమ్మవారిని కూష్మాండ రూపంలో కొలుస్తారు. ఇది విశ్వంలోని సృజనాత్మక శక్తికి ప్రతీక. కూష్మాండం భూమిపై ఉన్న వృక్ష సంపదతో సంబంధం కలిగి ఉంటుంది. నేడు నారింజ వర్ణం దుస్తులు ధరిస్తే మంచింది. (చదవండి: పండుగ ప్రోత్సాహకాలు ఇవ్వలేం) ఐదవరోజు.. తెలుపు రంగు స్కంద మాతగా పూజలందుకుంటుంది తల్లి. బిడ్డకు ఆపద వాటిల్లితే ఆ తల్లి శక్తిగా ఎలా పరివర్తన చెందుతుందో తెలుపుతుంది. ఈ రోజు ధవళ వర్ణం దుస్తులు ధరిస్తే మేలు. ఆరవ రోజు.. ఎరుపు రంగు ఆరవ రోజు అమ్మవారిని కాత్యాయనిగా కొలుస్తారు. యోధురాలికి ప్రతీక. కనుక ఆరవ రోజు ఎరుపు వర్ణం దుస్తులు ధరిస్తారు. ఏడవ రోజు.. నీలం రంగు అమ్మవారిని అత్యంత భయంకరమైన రూపమైన కాళరాత్రిగా పూజిస్తారు. ఆ రోజు అమ్మవారు సుంభ, నిసుంభ రాక్షసులను చంపడానికి తన అందమైన చర్మాన్ని విడిచిపెట్టిందని ప్రతీక. అమ్మవారు ఆపదల నుంచి కాపాడుతుందని నమ్మకం. ఏడవ రోజు నీలం రంగు దుస్తులు ధరిస్తే మంచిది. (చదవండి: శుభ గడియలు షురూ) ఎనిమిదవ రోజు.. గులాబి రంగు మహాగౌరి తెలివితేటలు మరియు శాంతికి ప్రతీక. ఈ రోజు గులాబి రంగు దుస్తులు ధరిస్తే మేలు. ఇది ఆశావాదాన్ని సూచిస్తుంది. తొమ్మిదవ రోజు.. ఊదా రంగు చివరి రోజున సిద్ధి ధాత్రి అవతారంలో అమ్మవారు ఊదారంగు చీర కట్టుకుని పూజలందుకుంటారు. భక్తులు కూడా ఊదారంగు దుస్తులే వేసుకుంటే సర్వవిధాలా శ్రేష్టం. -
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
-
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
-
శుభ గడియలు షురూ
సాక్షి, కర్నూలు: అధిక ఆశ్వయుజ మాసం శుక్రవారం ముగిసింది. నేటి (శనివారం) నుంచి నిజ ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతోంది. దసరా నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలకు శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్–19తో ఇన్నాళ్లూ కళ తప్పిన కల్యాణ వేదికల్లో మళ్లీ సందడి కన్పించనుంది. ఈ నెల 18వ తేదీ, 21 నుంచి 31వ తేదీ వరకు, నవంబర్ 4, 6, 7, 11వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇవి వివాహాలు చేసుకోవడానికి అనుకూలం. నవంబర్ 16న కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం వివాహాలకు తప్పా మిగతా శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. అలాగే నవంబర్ 20 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల సమయాన జిల్లాలో శుభకార్యాలు చేయరు. కాగా..ఈసారి కోవిడ్–19 నిబంధనలు అనుసరించి శుభకార్యాలు, వేడుకలు చేసుకోవాల్సి ఉంది. పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న వారు, గృహాలు నిర్మించుకున్న వారు ఈ శుభ ముహూర్తాలను వినియోగించుకోవాలని పండితుడు పి.చంద్రశేఖర్ శర్మ సూచించారు. ఇవి తప్పితే వచ్చే ఏడాది మార్చి వరకు మంచి రోజుల కోసం ఎదురు చూడాల్సిందేనని అన్నారు. -
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
-
నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
సాక్షి అమరావతి/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో తొలిరోజున అమ్మవారు స్వర్ణకవచాన్ని ధరించి దుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి దర్శనానికి రోజుకు పదివేలమందిని అనుమతిస్తారు. శనివారం తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ అనంతరం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆర్జిత సేవలను పరోక్షంగా నిర్వహిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో దుర్గగుడి వద్ద కృష్ణానదిలో పుణ్యస్నానాలపై దేవదాయశాఖ ఆంక్షలు విధించింది. కోవిడ్ నేపథ్యంలో ఇవీ మార్గదర్శకాలు.. ► మాస్క్ ధరించి, ఆన్లైన్ టికెట్, ఐడీ కార్డు ఉంటేనే క్యూలైన్లోకి అనుమతిస్తారు. పదేళ్లలోపు చిన్నారులను, 60 ఏళ్లు దాటిన వారిని దర్శనానికి అనుమతించరు. ► దగ్గు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండే వారిని జర్వంతో బాధపడుతున్నదీ లేనిదీ పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే క్యూలైన్లోకి అనుమతిస్తారు. క్యూలైన్లో ఇతరులు తాకిన వస్తువులు తాకవద్దంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. ► భక్తులు మంచినీటి బాటిల్స్ తెచ్చుకోవాలి. అత్యవసరాల కోసం క్యూలైన్లో మంచినీటి క్యాన్లు ఉంచారు. దుర్గాఘాట్, ఇతర ఘాట్లలో పుణ్యస్నానాలు, తలనీలాల సమర్పణ నిషేధించారు. ► భక్తులు తమ గ్రామాల్లోనే దీక్షల ఇరుముడులు సమర్పించాలి. పెద్ద శేషవాహనంపై మలయప్ప తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్రవారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శ్రీవారి ఆలయంలో పెద్ద శేష వాహన సేవ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి అలంకారంలో అనుగ్రహించారు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా, శ్రీమన్నారాయణుడికి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. స్వామి వారికి పానుపుగా, దిండుగా, పాదుకలుగా, ఛత్రంగా, వాహనంగా శేషుడు సేవ చేస్తుంటాడు. శేషుడిని దర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. ఉదయం బంగారు తిరుచ్చిపై శ్రీ మలయప్పస్వామి వారిని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు చేపట్టారు. -
పండుగ ప్రోత్సాహకాలు ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోని ఉద్యోగులకు ఈ ఏడాది దసరా పండుగ ప్రోత్సాహకాలు ఇవ్వలేమని జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎంఏ వజీర్, ప్రాంతీయ అధ్యక్షుడు తఖీ, ఉపాధ్యక్షుడు వి.దానయ్య శుక్రవారం విద్యుత్ సౌధలో ప్రభాకర్‌రావును కలిసి పండుగ ప్రోత్సాహకాలు అందజేయాలని వినతిపత్రం సమర్పించారు. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో సంస్థకు భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని, ఈ ఏడాది పండుగ ప్రోత్సాహకాలు అందజేయలేమని ప్రభాకర్‌రావు వారికి వివరించారు. ప్రతి ఏటా దసరా సందర్భంగా జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు మూలవేతనంపై 7–15 శాతం వరకు ప్రోత్సాహకాలు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. సంస్థ ఆర్థిక పరిస్థితిరీత్యా గతేడాది నుంచి ప్రోత్సాహకాలను నిలిపివేశారు. -
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు సర్వం సిద్ధం
-
దసరాకు 1,850 ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: దసరా పండగను పురస్కరించుకుని ఏపీఆర్టీసీ 1,850 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకు ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రత్యేక బస్సులు ఆయా రూట్లలో తిరగనున్నాయి. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు, కర్ణాటకకు కలిపి 5,950 రెగ్యులర్ సర్వీసులను తిప్పుతోంది. వీటికి అదనంగా 1,850 ప్రత్యేక బస్సులను నడపనుంది. సాధారణంగా ఏటా దసరా పండుగకు 2,500కు పైగా ప్రత్యేక బస్సుల్ని ఆర్టీసీ నడిపేది. తెలంగాణతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరకపోవడంతో ఈ దఫా ప్రత్యేక బస్సుల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ 1.61 లక్షల కిలోమీటర్లకు పరిమితమై 322 బస్సుల్ని తగ్గించుకునేందుకు సిద్ధపడినా టీఎస్ఆర్టీసీ ప్రస్తుతం కొత్త మెలికలు పెడుతోంది. ఏపీఎస్‌ఆరీ్టసీ నడిపే బస్సుల టైం కూడా తామే నిర్దేశిస్తామని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా పండుగ నేపథ్యంలో బెంగళూరుకు 562 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు తిప్పనున్నారు. అయితే కరోనాను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ఇంకా అనుమతించకపోవడంతో ఏపీఎస్‌ఆరీ్టసీ ఆ రాష్ట్ర సరిహద్దుల వరకే బస్సులను నడపనుంది. ప్రైవేటు ఆపరేటర్ల జోరు.. తెలంగాణ వైఖరితో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరని పరిస్థితుల్లో ప్రైవేటు ఆపరేటర్లు జోరు పెంచారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్ని తిప్పేందుకు సిద్ధమయ్యారు. ప్రతిరోజూ ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి 750 ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. మరోవైపు దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆరీ్టసీకి అధిక ఆదరణ ఉన్న విజయవాడ–హైదరాబాద్, తిరుపతి–హైదరాబాద్, విశాఖ–హైదరాబాద్ రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లు ఇప్పటికే ఆన్లైన్ రిజర్వేషన్లు ప్రారంభించారు. టికెట్ల ధరలను పెంచి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీనిపై రవాణా శాఖ కమిషనర్ స్పందిస్తూ.. ప్రైవేటు ట్రావెల్స్ వారు అధిక రేట్లు వసూలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆర్టీసీ జిల్లాలవారీగా నడిపే ప్రత్యేక బస్సులివీ.. శ్రీకాకుళం, విజయనగరం–66, విశాఖపట్నం–128, తూర్పుగోదావరి–342, పశి్చమగోదావరి–40, కృష్ణా–176, గుంటూరు–50, ప్రకాశం–68, నెల్లూరు–156, చిత్తూరు–252, కర్నూలు–254, కడప–90, అనంతపురం–228 -
వరదలు: లంక ప్రజలు మరింత అప్రమత్తం
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ఉధృతికి ప్రకాశం బ్యారెజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు విపత్తు శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. బుధవాంర ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో, వుట్ ఫ్లో 7,20,701 లక్షల క్యుసెక్కులుగా నమోదైనట్లు చెప్పారు. అలాగే వంశధార నదికి కూడా వరద ఉధృతి పెరుగుతోందని, దీంతో గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం బ్యారెజ్ ఇన్ ఫ్లో 42,980 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 42,916 క్యూసెక్కులు నమోదైందని తెలిపారు. ఇక ముంపు ప్రాంతాల్లోకి వరద ప్రవాహాం చేరుతున్నప్పుడు ముందస్తు పునరావాస కేంద్రాలను వెళ్లాలని, లోతట్టు ప్రాంత, లంక గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు విజ్ఞప్తి చేశారు. దుర్గగుడి అధికారుల అత్యవసర భేటీ: దుర్గగుడి ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడడంపై గుడి అధికారులు ఈవో సురేష్ బాబు, చైర్మన్ పైలా సోమినాయుడు, దుర్గగుడి ఈడీ భాస్కర్ బుధవారం అత్యవసర సమావేశమయ్యారు. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండటంతో సమావేశమైనట్లు తెలిపారు. ఈ నెల 17నుంచి జరిగే దసరా ఉత్సవాలకు ఘాట్ రోడ్డులో భక్తులను అనుమతించాలా లేదా అనే దానిపై అధికారులు ప్రధానంగా చర్చించారు. ఇలాగే వర్షాలు కొనసాగితే ఘాట్ రోడ్డు మీదుగా భక్తులకు అనుమతి ఇవ్వకూడదని అధికారులు నిర్ణయించామని, దీనిపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌తో సమావేశం నిర్వహించిన తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తమని అధికారులు తెలిపారు. -
21న దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: దసరా పండుగ సందర్భంగా ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు దేవదాయ శాఖ ఉత్త్తర్వులిచ్చింది. ఈనెల 17 నుంచి 25 వరకు ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. -
‘దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. 9 రోజులే’
సాక్షి, విజయవాడ : అక్టోబర్ 17 నుంచి 25 వరకు విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన ఆన్లైన్ టికెట్లను ఛైర్మన్, ఈవో విడుదల చేశారు. 9 రోజులకు సంబంధించి ఉచిత, 100, 300 రూపాయల టికెట్స్ విడుదల చేయగా.. ఈ సంవత్సరం అన్ని సేవ టికెట్స్ ఆన్లైన్లో ఉంచినట్లు తెలిపారు. ఆన్లైన్లో ఏ దేశంలో ఉండి అయిన సేవా టికెట్ బుక్ చేసుకోవొచ్చన్నారు. సేవ టికెట్ బుక్ చేసుకున్న వారికి అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, అమ్మవారి దస్త్రం వారి ఇంటికి పంపిస్తామని వెల్లడించారు. (తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ) జిల్లా కలెక్టర్ అధ్యక్షతన దసరా ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించినట్లు పైలా సోమినాయుడు పేర్కొన్నారు. దసరా సమయంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను రోజుకి 10 వేల మందిని మాత్రమే అనుమతించనున్నట్లు, ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు మాత్రమే అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. ములనక్షత్రం రోజు మాత్రం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దర్శనం ఉంటుందన్నారు.ఈ నవరాత్రి దర్శనాలకి సంబంధించిన దర్శన టికెట్స్ అన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని, భక్తులు ఎవరైనా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంటే కచ్చితంగా టికెట్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. (కనకదుర్గ అమ్మవారి దర్శన వేళల్లో మార్పులు) ‘టికెట్ లేకపోతే ఎవరిని కొండ పైకి అనుమతించం. కరోనా నేపథ్యంలో కేశకండనశాల ఉండదు. ప్రతి సంవత్సరం లాగే అమ్మవారి దర్శనానికి నాయకుడి గుడి దగ్గర నుంచే క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు సాయంత్రం నుంచి కృష్ణ నది ఒడ్డున నదీ హారతులు మళ్ళీ ప్రారంభిస్తున్నామం. ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు నది హారతులు ఉంటాయి. ఆన్లైన్లో టికెట్ తీసుకుని దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలకు అనుగుణంగా కొండపైకి రావాలి. వీఐపీలు దసరా నవరాత్రులలో అందరికి టైం స్లాట్స్ పెడుతున్నాం. అందరూ ఆ స్లాట్స్లోనే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి.’ అని తెలిపారు. (‘ఆలయాలపై దాడులకు పాల్పడే వారిని వదలం’) కోవిడ్ కారణంగా ఈ సారి దసరాకి కొన్ని ఆంక్షలు కొనసాగుతాయయని దుర్గ గుడి సురేష్ బాబు తెలిపారు. ‘ఈ సారి 9 రోజులు మాత్రమే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. 9 రోజుల్లో అమ్మవారికి 10 అలంకారాలు చేస్తాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గంటకి 1000 మంది భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తాం. దసరా 9 రోజులు ఎవరికి అంతరాలయం దర్శనం ఉండదు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎవరికి కొండపైకి ఎలాంటి బస్ సౌకర్యం ఉండదు. అందరూ నడిచి రావాల్సిందే. దసరా నవరాత్రులకు సంబంధించి ఎటువంటి కరెంట్ బుకింగ్ ఉండదు. ఈ నెల 19న దేవాదాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా 60 సంవత్సరాల లోపు వారిని, 10 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారిని దర్శనానికి అనుమతించము.’ అని వెల్లడించారు. -
ఆగి..చూసి..కొందాం..
సాక్షి, సిటీబ్యూరో: దసరా, దీపావళి పండగలొచ్చాయంటే చాలు... ఏ ఇంట్లో చూసినా కొత్తదనం ఉట్టిపడుతుంది. చాలామంది పండగల సందర్భంగా ఏదో ఒక వస్తువు కొనుగోలు చేయాలని భావిస్తారు. నచ్చిన బైక్ కొనుక్కొని రయ్‌మంటూ దూసుకెళ్లాలని కుర్రకారు.. బడ్జెట్‌కు అనుగుణంగా పాత వాహనాల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేయాలని మధ్యతరగతి వర్గాలు... సొంత కారు కొనుక్కోవాలని ఉద్యోగ వర్గాల వారు ఆలోచిస్తుంటారు. వీరంతా పండగ రోజుల్లోనే తమ కలలను సాకారం చేసుకుంటారు. కానీ ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్రేటర్లో వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దసరా వెళ్లిపోయింది.. దీపావళి వస్తోంది. కానీ అమ్మకాలు మాత్రం మందగమనంలోనే ఉన్నాయి. కొత్త వాహనాల కొనుగోలుపై నగరవాసులు అనాసక్తిగా ఉన్నారు. నచ్చిన కార్లు, బైక్‌లు కొనుక్కోవాలని ఉన్నప్పటికీ వాయిదాలు వేస్తున్నారు. ఏ నెలకానెల ఇలా వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు ప్రతి ఏటా దసరా, దీపావళి పర్వదినాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలతో సందడిగా ఉండే షోరూమ్‌లు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. గతేడాది అక్టోబర్‌తో పోల్చుకుంటే ఈసారి అక్టోబర్‌లో అమ్మకాలు 30 శాతానికి పడిపోయినట్లు రవాణా అధికారులు తెలిపారు. ప్రతిఏటా ఇబ్బడిముబ్బడిగా రోడ్డెక్కే వ్యక్తిగత వాహనాలు ఈ ఏడాది కొంతమేర తగ్గడం గమనార్హం. బీఎస్–6 కోసం వెయిటింగ్... త్వరలో అందుబాటులోకి రానున్న భారత్ స్టేజ్–6 టెక్నాలజీ వాహనాల కోసం సిటీజనులు ఎదురు చూస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన బీఎస్–6 వాహనాలు వచ్చే జనవరి నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రస్తుతమున్న బీఎస్–4 వాహనాల కొనుగోలుపై నగరవాసులు విముఖత చూపుతున్నారు. కార్లు, బైక్‌లలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. పాత వాటి స్థానంలో కొత్త వాహనాలకు నగరవాసులు అప్డేట్ అవుతున్నారు. దీంతో రెండు నెలలుగా వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దసరా, దీపావళి రోజుల్లో కళకళలాడాల్సిన షోరూమ్‌లు వెలవెలబోతున్నాయి. నగరంలో సుమారు 150 ఆటోమొబైల్ షోరూమ్‌లు ఉండగా... వీటికి అనుబంధంగా మరో 100 వరకు సబ్‌డీలర్స్ షోరూమ్‌లు ఉన్నాయి. వీటిలో ప్రతినెలా సుమారు 35వేలకు పైగా బైక్‌లు, మరో 10 వేలకు పైగా కార్ల విక్రయాలు జరుగుతాయి. వీటిలో 10 శాతం వరకు స్పోర్ట్స్ బైక్‌లు, హైఎండ్ వాహనాలు ఉంటాయి. చెన్నై, బెంగళూర్, ఢిల్లీ వంటి మెట్రో నగరాలతో పోటీ పడి హైదరాబాద్‌లో ఆటోమొబైల్ రంగం పరుగులు తీస్తోంది. గ్రేటర్ జనాభా కోటికి పైగా ఉంటే వాహనాల సంఖ్య అరకోటి దాటింది. కానీ ఈ ఏడాది అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామాలు అన్ని నగరాల్లో ఆటోమొబైల్ రంగంపై ప్రభావం చూపుతున్నట్లుగానే నగరంలోనూ జరుగుతోంది. ఆర్థికమాంద్యంతో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా కొత్త టెక్నాలజీ వాహనాలు మార్కెట్లోకి రానున్న నేపథ్యంలో దసరా, దీపావళి సీజన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ‘ప్రతిఏటా దసరా నుంచి దీపావళి వరకు కనీసం 1,000 బైక్‌లు విక్రయించేవాళ్లం. కానీ ఈసారి 700 కంటే ఎక్కువగా అమ్మలేకపోయాం. బీఎస్–6 వస్తే తప్ప విక్రయాలు పెరిగే అవకాశం లేదు. అందుకోసం మరో రెండు నెలలు వేచి చూడాల్సిందే’అని నగరానికి చెందిన ఒక ప్రముఖ ఆటోమొబైల్ షోరూమ్ డీలర్ తెలిపారు. ‘బైక్‌లు విక్రయాలు కొంచెం ఫర్వాలేదు. కానీ కార్ల అమ్మకాలే చాలా అధ్వానంగా ఉన్నాయి. గతేడాది కంటే ఈసారి అమ్మకాలు పెరుగుతాయని ఆశించాం. కానీ అందుకు భిన్నంగా ఉంది’ అని మరో డీలర్ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం... ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రతిరోజు సుమారు 180–200 వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. కానీ వీటి సంఖ్య ప్రస్తుతం 150కి పడిపోయింది. అందులో బైక్‌లే ఎక్కువగా ఉన్నాయి. ఒక్క ఖైరతాబాద్‌లోనే కాదు.. గ్రేటర్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి. ఉప్పల్, ఇబ్రహీంపట్నం, అత్తాపూర్, కొండాపూర్, మలక్‌పేట్, మెహదీపట్నం, మేడ్చల్, సికింద్రాబాద్, బండ్లగూడ తదితర ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతిరోజు 1850–2000 వాహనాలు కొత్తగా నమోదవుతాయి. వీటిలో 1700 వరకు బైక్‌లు ఉంటే మరో 300 వరకు కార్లు ఉంటాయి. కానీ ఈ సంఖ్య కొద్ది రోజులుగా గణనీయంగా పడిపోయింది. రోజుకు 1500 వరకు మాత్రమే కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. వాటిలో బైక్‌లే ఎక్కువగా ఉన్నాయి. గతేడాది అక్టోబర్‌లో సుమారు 48,000 వాహనాలు నమోదు కాగా... ఈ నెలలో ఇప్పటి వరకు ఆ సంఖ్య 33,600 వరకు ఉంది. ‘మరికొద్ది రోజుల్లో అక్టోబర్ ముగియనుంది. కానీ అమ్మకాలు పెరుగుతాయనే అంచనాలు మాత్రం లేవు’ అని ఒక డీలర్ విస్మయం వ్యక్తం చేశారు. నిజానికి గ్రేటర్లో వాహనాల సంఖ్య ఏటేటా పెరుగుతుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 55.52 లక్షలకు చేరుకుంది. కోటికి పైగా జనాభా ఉన్న నగరంలో అరకోటికి పైగా వాహనాలు ఉన్నాయి. రూ.లక్షల ఖరీదైన స్పోర్ట్స్ బైక్‌లు, హైఎండ్ కార్లు సైతం పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. కానీ ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకొని పొదుపు పాటిస్తున్న మధ్యతరగతి వేతనజీవులు త్వరలో రానున్న బీఎస్–6 వాహనాల కోసం ఎదురు చూస్తున్నారు. -
ఆర్టీసీ సమ్మె : బడికి బస్సెట్ల!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం పొడిగించిన దసరా సెలవులు ఆదివారంతో ముగిశాయి. సోమవారం నుంచి పాఠశాలలు, కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఓవైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండడం, మరోవైపు తరగతుల మూడో రోజు నుంచే పరీక్షలు ప్రారంభమవుతుండడంతో బస్సు సేవలపై ఆధారపడిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు అరకొరనే తిరుగుతుండడంతో శివారు ప్రాంతాల్లోని కళాశాలలకు వెళ్లేది ఎలా? అని స్టూడెంట్స్ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 10వేల వరకు ఉన్నాయి. వీటిలో ఒకటి నుంచి పదో తరగతి వరకు సుమారు 15 లక్షల మంది చదువుకుంటున్నారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం... సమ్మె నేపథ్యంలో సెలవులను 19 వరకుపొడిగించిన విషయం విదితమే. సోమవారం విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతుండగా... 23 నుంచి 30 వరకు సమ్మెటీవ్–1 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖప్రకటించింది. ఈ నేపథ్యంలో సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంతోపాఠశాలలకు ఎలా చేరుకోవాలని విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. పాసులు 3.50 లక్షలు గ్రేటర్లో 890 ఇంటర్మీడియెట్ కాలేజీలుఉండగా... వీటిలో నాలుగున్నర లక్షల మంది చదువుకుంటున్నారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఇతర కాలేజీలు మరో 900 వరకు ఉండగా... వాటిలో 6లక్షల మంది విద్యార్థులున్నారు. సాంకేతిక వృత్తివిద్యా కోర్సులకు సంబంధించిన కాలేజీల్లో చాలా వరకు దేశ్‌ముఖ్, ఇబ్రహీంపట్నం, చెంగిచర్ల, నారపల్లి, ఘట్కేసర్, భువనగిరి, సూరారం, బాచుపల్లి, లింగంపల్లి, గచ్చిబౌలి, మెహిదీపట్నం,మొయినాబాద్, షాద్‌నగర్, శంషాబాద్ పరిసరాల్లోనే ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో 4.50 లక్షల బస్సు పాసులు ఉండగా... వీటిలో 3.50 లక్షల పాసులు విద్యార్థులవే. ఆయా కాలేజీల విద్యార్థుల రవాణాకు ఆర్టీసీ బస్సులే కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో లక్షలాది మంది విద్యార్థులకు ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు.శివార్లలోని నల్లగొండ, భువనగిరి, మేడల్చ్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, చేవేళ్ల జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల్లో చాలా మంది నగరంలోనే ఉంటున్నారు. వీరంతా రోజూ ఆయా ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తుంటారు. వీరూ సోమవారం నుంచి ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. -
ఆటా ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
బోస్టన్ : అమెరికాలోని బోస్టన్ నగరంలో విజయదశమి సందర్బంగా అక్టోబర్ 12న అమెరికన్ తెలుగు అసోసియేషన్( ఆటా) ఆధ్వర్యంలో దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకను షమీ పూజతో ప్రారంభించి కార్యక్రమం ఆసాంతం ఆట పాటలతో వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటా అధ్యక్షులు పరమేష్ భీంరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి సాంప్రదాయలు భావితరాలకు తెలియ చేసే విధంగా మన పండుగలు జరుపుకోవాలని తెలిపారు. రాబోయే సంవత్సరం లాస్ ఏంజిల్స్ లో జరగబోయే ఆటా మహాసభలకు ఈ వేడుకలో పాల్గొన్న వారందరిని ఆహ్వనిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి దసరా వంటకాలతో పసందైన విందు భోజనాలు ఏర్పాటు చేశారు. తెలుగు సంస్కృతికి , సామజిక సేవ సహాయ సహకారం అందించినవారందరిని ఘనంగా సన్మానించారు. ఆటా కార్యవర్గ సభ్యులు రమేష్ నల్లవోలు, కృష్ణ ధ్యాప , రీజినల్ డైరెక్టర్ సోమశేఖర్ నల్లా, రీజినల్ కోఆర్డినేటర్ మల్లారెడ్డి యానాల, బోస్టన్ స్థానిక కోఆర్డినేటర్స్ శశికాంత్ పసునూరి, దామోదర్ పాదూరి, రవి కుమార్, అనిత యాగ్నిక్, మధు యానాల, సునీత నల్లా, శిల్ప శ్రీపురం, సాహితి రొండ్ల, పార్వతి సూసర్ల, అపర్ణ పాదూరి, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. -
సెలవులకు టాటా..స్టేషన్ కిటకిట
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దసరా సెలవులు ముగిశాయి. విశాఖకు వస్తున్న వారి.. విశాఖ వీడి వెళ్తున్న వారి ప్రయాణాలు మొదలయ్యాయి. ఇలా వస్తూ పోతున్న వారితో రైల్వేస్టేషన్ కిటకిటలాడింది. స్టేషన్లో ఆదివారం ఇసకేస్తే రాలని పరిస్థితి కనిపించింది. ఆదివారంతో సెలవులు ముగిసినందున ఉదయం నుంచి రైల్వే స్టేషన్ జనసమ్మర్దంగా కనిపించింది. విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వైపు వెళ్లే పలు రైళ్లు రద్దీగా బయల్దేరాయి. అలాగే అటునుండి వచ్చే ఎక్స్‌ప్రెస్‌లు, పాసింజర్ రైళ్లు కూడా రద్దీగానే వచ్చాయి. -
బురదలో పెరుగు కుండ
మనిషి జీవన శైలిలో ఆధునికత పెనవేసుకునేకొద్దీ నగరవాసాన్ని ఇష్టపడుతున్నారు. సొంతూరిని, అక్కడి బంధుమిత్రులను మరచిపోతున్నారు. పెళ్లిళ్లు, చావులు వంటి ఎంత ముఖ్యమైన పని ఉన్నా తప్పించుకోవడమే పనిగా పెట్టుకున్న నేటి రోజుల్లో వారికి సొంతూరిపై ఉన్న మమకారం చూస్తే ముచ్చట వేస్తుంది. బురద మట్టిలో తాడులాగే పోటీలో వనితలు సాక్షి, బిరిబిదనూరు: గౌరిబిదనూరు తాలూకాలో సు మారు 200కు పైబడి కుటుంబాలున్న చిన్న గ్రామం బిసలహళ్ళి. ఇక్కడి యువకులు చదువులు, ఉద్యోగాల కోసం బెంగళూరులోనే ఎక్కువగా ఉంటారు. యువత దాదాపు ఉద్యాననగరిలో స్థిరపడిపోయింది. అయినా తమకు జన్మనిచ్చిన గ్రామాన్ని మరచిపోకుండా ఉండడానికి సుమారు 40 మంది యువకులు ఒక సంఘం ఏర్పాటు చేసుకుని పండుగలకు పబ్బాలకు కలుస్తూ పల్లె సౌందర్యాన్ని ఆస్వాదిస్తుంటారు. ‘ప్రేరణ సామాజిక, సాంస్కృతిక ట్రస్ట్’ పేరిట ఈ సంఘం ఏ ర్పాటు చేసుకొన్నారు. ప్రతి ఏటా దసరా ఉత్సవాలలో నవమి, దశమి రోజులలో గ్రామానికి వచ్చి గ్రామ ప్రజలకు వివిధ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. 2011 నుండి ప్రారంభమైన వీరి గ్రామ సేవ ఈ ఏడాది సైతం కొనసాగింది. ఈసారి మూడు రోజుల పండుగ గ్రామ పెద్దల సహాయ సహకారాలతో రెండురోజు లు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి కుటుంబంలోనూ బంధుమిత్రుల సరదా పలకరింపులు, విందు భోజనాలు సరేసరి. ఈ దసరాకు కార్యక్రమాలను మూడు రోజుల పాటు నిర్వహించారు. మొదటిరోజు బురద మట్టిలో పరుగు పోటీలు, బురద మట్టిలో తాడు లాగడం, బురద మట్టిలో పెరుగు కుండను పగులకొట్టడం, గ్రామీణ క్రీడాపోటీలను నిర్వహించారు. రెండవరోజు మహిళలకు రంగవల్లులు వేయడం, మంటలేకుండా వంట చేయడం, వరిధాన్యాన్ని రోకలితో దంచడం, విసురురాళ్ళతో రాగులు విసరడం తదితర పోటీలను నిర్వహించారు. వీటిలో ఎక్కువభాగం మహిళలకు సంబంధించినవే అయినా ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరగా గురువారం సాయంకాలం గ్రామ దేవుడు లక్ష్మీ నరసింహస్వామికి పల్లకీ ఉత్సవాలు ఘనంగా చేశారు. పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. యువతలో ఐక్యత వుండి జన్మస్థలంపై మమకారం వుంటే ఏమైనా సాధించ డానికి వీలుంటుందని ప్రేరణ ట్రస్టు అధ్యక్షుడు బి.ఎస్.నంజుండగౌడ తెలిపారు. వడ్లు దంచే పోటీ విసుర్రాయి పోటీ -
దసరా వేడుకల్లో రగడ
మేడ్చల్: పండగ రోజున పూడూర్ గ్రామంలో రగడ నెలకొంది. దసరా సందర్భంగా గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరించడం ఆనవాయితీ. 1950కి ముందు ముస్లింలు జెండా ఎగురవేయగా అనంతరం పోలీస్ పటేళ్లు ఎగురవేస్తున్నారు. దానికయ్యే ఖర్చు, పనులను గ్రామ పంచాయతీ చూసుకునేది. కాగా పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దయినా వారు ఎగరవేయం ఎంటని.. గ్రామ సర్పంచ్ జెండా ఎగురవేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీనికి గ్రామంలోని పటేల్ వర్గం ఒప్పుకోలేదు. పోలీస్ పటేల్ కుటుంబికులే జెండా ఎగురవేస్తారని ఆ వర్గం భీష్మించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ పటేల్‌గా పిలువబడే వారే జెండా ఎగురవేయడం సంప్రదాయమని ఓ వర్గం, పటేల్, పట్వారీ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసినా గ్రామంలో ఇంకా వారి పెత్తనమేంటని మరో వర్గం నినదించడంతో ఇరువర్గాల మధ్యా గొడవకు దారితీసింది. విషయం తెలుసుకున్న మేడ్చల్ సీఐ గంగాథర్ తన సిబ్బందితో సంఘటన స్థలికి చేరుకుని పెద్ద మనుషులను పిలిచి గ్రామంలోని సంప్రదాయం తెలుసుకుని వారి వివరణ తీసుకున్నారు. గతంలో పోలీస్ పటేల్‌లే జెండా ఎగురవేసే వారని కొందరు తెలుపగా సర్పంచ్ పదవిలో ఎవరు ఉంటే వారు ఎగురవేస్తే మంచిదని కొందరు సీఐకి విన్నవించారు. ఇప్పటికిప్పుడు సంప్రదాయాలను మార్చలేమని ఈ సారి పండగను సంప్రదాయలను గౌరవిస్తూ జరుపుకోవాలని సీఐ సూచించగా అందుకు గ్రామస్తులు ససేమిరా అన్నారు. జెండాను సర్పంచ్ ఎగురవేస్తే తమకు అభ్యంతరం లేదని, లేకుంటే ఎగురవేసే పద్ధతిని తొలగించాలని పట్టుబట్టారు. ఈ సారి పాత పద్దతిలోనే పండుగ జరుపుకోని తర్వాత గ్రామ పెద్దలు మాట్లాడుకోవాలని సీఐ ఆదేశించి ఎవరైనా అడ్డుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో పోలీస్ పటేల్ కుటుంబికులు పోలీస్ పహారాలో గ్రంథాలయం సమీపంలో జెండా ఎగురవేయగా గ్రామ సర్పంచ్ బాబుయాదవ్ గ్రామస్తులతో కలిసి గాంధీ విగ్రహం వద్ద మరో జెండా ఆవిష్కరించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఇరువర్గాల ఆందోళనలు సాయంత్రం 5 గంటల వర కు సాగాయి. భారీగా పోలీసులు మొహరించి ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఆ గ్రామంలోనే ఎందుకు? పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దయి దశాబ్ధాలు గడుస్తున్నా పూడూర్ గ్రామంలో ఇంకా ఈ సంప్రదాయం ఎందుకని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. మిగతా గ్రామాల్లో సర్పంచ్‌లు జెండా ఎగురవేస్తుండగా ఇక్కడ మాత్రం పటేళ్లు మాత్రమే ఎగురవేడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల పక్షాన నిలవాల్సిన సీఐ ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా పటేళ్లకు వత్తాసు పలికారని సర్పంచ్, గ్రామస్తులు ఆరోపించారు. జెండా ఆవిష్కరణ వివాదంలో గ్రామం లో పండగ రోజు ఉద్రికత్త నెలకొంది. నాకు పక్షపాతం లేదు: సీఐ పూడూర్ ఘటనలో తాను ఎవరి పట్ల పక్షపాతంగా వ్యవహరించలేదని సీఐ గంగాధర్ పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ సంప్రదాయాన్ని గౌరవించకుండా ప్రజల మధ్య వర్గాల భేదాలు తీసుకవచ్చి గ్రామంలో పరిస్థితిలను ఉద్రిక్తం చేసే యత్నం చేశారన్నారు. తాము సంప్రదాయాన్ని గౌరవించి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్నిపాటించాలని సూచించామని, సర్పంచ్ జాతీయ జెండా ఎగురవేయాలనుకుంటే పండగకు పదిరోజుల ముందు గ్రామ సభ నిర్వహించి గ్రామ సభలో ప్రజలు సూచించిన విధంగా నడుచుకోవాలన్నారు. కానీ సర్పంచ్ వైషమ్యాలకు పండగ రోజు తెరతీశాడని తాము జోక్యం చేసుకుని గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకోనకుండా చూశామన్నారు. సీనీయర్ సిటిజన్స్ సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం అడగ్గా వారు పాత పద్ధతినే అనుసరించాలని సూచించారని తెలిపారు. గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు చడానికి యత్నించిన సర్పంచ్‌తో పాటు మరికొందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
సీఎం కేసీఆర్ నివాసంలో దసరా మహోత్సవాలు
-
ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు
-
శారద పీఠంలో ముగింపు దశకు చేరుకున్న శరన్నవరాత్రి ఉత్సవాలు
-
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘనంగా దసరా వేడుకలు
-
ఎలూరులో మహిషాసురమర్ధని ఆలయంలో ఘనంగా దసరా వేడుకలు
-
వరంగల్‌లో ఘనంగా దసరా వేడుకలు
-
నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ దసరా ఉత్సవాలు
-
మైసూరులో ఘనంగా దసరా వేడుకలు
-
దసరా నవరాత్రుల్లో సినీ స్టార్ సందడి
-
పండగ వేళ