
సాక్షి, చిత్తూరు : చెడుపై పోరులో ప్రతి మహిళ దుర్గాదేవిగా మారాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆకాంక్షించారు. ప్రతి మహిళా ఓ శక్తి స్వరూపిణి అని ఆమె అన్నారు. దసరా పండుగను ఎమ్మెల్యే రోజా తన నివాసంలో జరుపుకున్నారు. దుర్గాదేవి పూజలో పాల్గొన్న ఆమె రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. రాజకీయంగా, సామాజికంగా మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఆయన పరిపాలనలో మహిళలు అందరూ నిజమైన విజయదశమి జరుపుకుంటున్నారన్నారు. సీఎం జగన్ పాలనలో మహిళలకు పూర్తి రక్షణ ఉందన్నారు. ఆయన నేతృత్వంలో పని చేయడానికి తాను నిజంగా గర్వపడుతున్నానని అన్నారు. చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడానికి మాత్రమే ఉంటారని ఎద్దేవా చేశారు. (అంతిమ విజయం మంచినే వరిస్తుంది.. )
Comments
Please login to add a commentAdd a comment