
రైల్వేస్టేషన్ వెలుపల బస్సుల కోసం ఎదురుచూపులు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దసరా సెలవులు ముగిశాయి. విశాఖకు వస్తున్న వారి.. విశాఖ వీడి వెళ్తున్న వారి ప్రయాణాలు మొదలయ్యాయి. ఇలా వస్తూ పోతున్న వారితో రైల్వేస్టేషన్ కిటకిటలాడింది. స్టేషన్‌లో ఆదివారం ఇసకేస్తే రాలని పరిస్థితి కనిపించింది. ఆదివారంతో సెలవులు ముగిసినందున ఉదయం నుంచి రైల్వే స్టేషన్ జనసమ్మర్దంగా కనిపించింది. విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వైపు వెళ్లే పలు రైళ్లు రద్దీగా బయల్దేరాయి. అలాగే అటునుండి వచ్చే ఎక్స్‌ప్రెస్‌లు, పాసింజర్ రైళ్లు కూడా రద్దీగానే వచ్చాయి.