Railway Stations
-
అరే..ఇలా ఉన్నారేంట్రా.. పోతార్రా..! (ఫొటోలు)
-
ఇసుక వేస్తే రాలనంత జనంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
-
రైలు ప్రమాదాలకు చెక్.. ఏఐ కెమెరాలతో నిఘా
భద్రత విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిఘా కెమెరాలను ఏర్పాటు చేయనుంది. పట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను దూరం నుంచే గుర్తించి లోకో పైలెట్లను అప్రమత్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్లు పట్టాలు తప్పడాన్ని నివారించడంతోపాటు ఉగ్రవాద, అసాంఘిక శక్తుల కుట్రలను తిప్పికొట్టే లక్ష్యంతో రైల్వేశాఖ వీటిని ఏర్పాటుచేయనుంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమెరాల నిఘా కొనసాగుతుండగా.. నడుస్తున్న రైళ్లను మాత్రం ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షిస్తున్నారు.కానీ, నడిచే రైళ్లు ప్రమాదాలకు గురికాకుండా ముందుగానే అప్రమత్తంచేసే వ్యవస్థ ఇప్పటివరకు అందుబాటులో లేదు. –సాక్షి, అమరావతిమూడేళ్లలో 97 ప్రమాదాలు..ఇటీవలి కాలంలో దేశంలో రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న దుర్ఘటనలు గణనీయంగా పెరిగాయి. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ ప్రమాదాలు 97 సంభవించాయి. కొన్నిచోట్ల విద్రోహశక్తులు రైలుపట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను ఉంచి కుట్రలు పన్నిన ఉదంతాలూ ఉన్నాయి. దీంతో రైలు పట్టాలపై ఈ తరహా వస్తువులను ముందుగానే గుర్తించి ప్రమాదాలు నివారించేందుకు రైళ్లలో ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.రూ.15 వేల కోట్లతో 75,000 ఏఐ కెమెరాలు..ఈ నేపథ్యంలో.. రూ.15 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో 75 వేల ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 40 వేల బోగీలు, 14 వేల లోకోమోటివ్‌లు (ఇంజిన్లు), 6 వేల ఈఎంయూలలో ఈ కెమెరాలను ఏర్పాటుచేస్తారు. ప్రతి బోగీకి ఆరు కెమెరాలు, ప్రతి లోకోమోటివ్‌కు నాలుగు కెమెరాలను అమరుస్తారు. అక్టోబరు నుంచి ఏడాదిలోగా దశలవారీగా అన్ని రైళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పలు కంపెనీలకు టెండర్లు అప్పగిస్తోంది. -
సూసైడ్ స్పాట్స్‌గా మెట్రో రైల్వే స్టేషన్లు !
సాక్షి బెంగళూరు: నమ్మ మెట్రో రైల్వే స్టేషన్లు సూసైడ్ హాట్స్పాట్లుగా మారుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో మెట్రో రైల్వే స్టేషన్లలో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పదేపదే మెట్రో ట్రాక్‌లపైకి దిగే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. అయినప్పటికీ మెట్రో అధికారులు మాత్రం అవసరమైన భద్రత వ్యవస్థ కలి్పంచడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెజిస్టిక్ మెట్రో స్టేషన్లో మాత్రమే బీఎంఆర్సీఎల్ సెక్యురిటీలు అలర్ట్ అవుతున్నారు. మిగిలిన చోట్ల భద్రత సిబ్బంది నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా నిర్లక్ష్యం కారణంగా మెట్రో రైల్వే పట్టాలపై ఆత్మహత్య కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, చెన్నై మెట్రోలల్లో పీఎస్డీ (ప్లాట్ఫారం స్క్రీన్ డోర్లు) అమర్చడం వల్ల అక్కడ అలాంటి ఘటనలకు తావులేకుండా ఉంది. అయితే నమ్మ మెట్రోలో అలాంటి చర్యలు ఇంతవరకు చేపట్టకపోవడం దురదృష్టకరం. దీంతో ప్రమాదాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. ఐటీ సిటీ బెంగళూరులో నమ్మ మెట్రో సేవలు ప్రారంభమై సుమారు 13 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు పట్టాలపై ఎలాంటి రక్షణ లేకపోవడంతో ప్రయాణికుల రక్షణకు భద్రత కరువైంది. కొంతమంది ఉదాసీనంగా పట్టాలపై పడిపోతుండడం, మరికొంత మంది ఉద్ధేశపూర్వకంగా ఆత్మహత్య చేసుకునేందుకు నమ్మ మెట్రో పట్టాలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన ఆరు నెలల్లో ఆరుగురు మెట్రో రైల్వే స్టేషన్లలో పట్టాలపైకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. -
క్యూఆర్ కోడ్‌తో రైల్ టికెట్ బుకింగ్
సాక్షి, హైదరాబాద్: సాధారణ రైల్వే టికెట్లను క్యూఆర్ కోడ్ ద్వారా బుక్ చేసుకొనే సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. తొలిదశలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14 స్టేషన్లలో ఉన్న 31 కౌంటర్లలో ఈ సౌకర్యాన్ని ప్రవేశ పెట్టారు. జనరల్ బుకింగ్ కౌంటర్లలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. టికెట్ కొనుగోలు చేసే సమయంలో జనరల్ బుకింగ్ కౌంటర్ల టికెట్ విండో వద్ద ప్రయాణికులు బుక్ చేసుకునే టికెట్ వివరాలు, చార్జీలను అందుబాటులో ఉంచుతారు. అందుకనుగుణంగా చార్జీలు చెల్లించి క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు. ఈ డిస్ప్లే బోర్డులో రైలు బయల్దేరే స్టేషన్, చేరుకొనే స్టేషన్, ప్రయాణపు తరగతి, పెద్దలు, పిల్లల సంఖ్య, చార్జీలు వంటి వివరాలను ప్రదర్శిస్తారు. సికింద్రాబాద్ డివిజన్లోని సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, హైటెక్ సిటీ, బేగంపేట్, కాజీపేట, జేమ్స్‌స్ట్రీట్, ఫతేనగర్ బ్రిడ్జ్, వరంగల్, మంచిర్యాల, మహబూబాబాద్, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, వికారాబాద్ స్టేషన్లలోని 31 కౌంటర్ల ద్వారా నగదు రహిత లావాదేవీల సదుపాయాన్ని ప్రయాణికులు పొందవచ్చు. -
IRCTC: ట్రైన్ జర్నీలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ
స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌తో నచ్చిన ఆహారాన్ని.. ఉన్న చోటుకే తెప్పించుకుని తినేస్తున్నాం. ఈ డెలివరీ సర్వీసులు దాదాపు నగరాలకే పరిమితమయినప్పటికీ, స్విగ్గీ మాత్రం 'ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్' (IRCTC)తో ఒప్పందం కుదుర్చుకుని మరో అడుగు ముందు వేసింది. స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ అండ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ప్రకారం ఇకపైన రైళ్లలో ప్రీ-ఆర్డర్ చేసిన ఆహారాన్ని డెలివరీ చేయడానికి స్విగ్గీ సన్నద్ధమైంది. ఈ సర్వీస్ మార్చి 12 నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభంలో స్విగ్గీ ఈ సర్వీసును బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ రైల్వే స్టేషన్లకు మాత్రమే పరిమితం చేసింది. రానున్న రోజుల్లో 59 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లకు ఈ సర్వీసును విస్తరించనున్నట్లు సమాచారం. రైళ్లలో ప్రయాణించే సమయంలో నచ్చిన ఫుడ్‌ను ప్రీ-ఆర్డర్ చేయడానికి ముందుగా ఐఆర్సీటీసీ యాప్‌లో పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత తాము ఏ స్టేషన్లో అయితే ఆహారాన్ని రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారా.. ఆ రైల్వే స్టేషన్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆలా చేసుకున్న తరువాత మీకు మీరు ఎంచుకున్న ఫుడ్‌ను స్విగ్గీ డెలివరీ బాయ్స్ తీసుకొచ్చి డెలివర్ చేస్తారు. స్విగ్గీతో ఏర్పడ్డ ఈ భాగస్వామ్యం ప్రయాణీకులకు మరింత సౌలభ్యంగా ఉంటుందని, వారు కోరుకునే ఆహరం ఎంపిక చేసుకునే అవకాశం ఇందులో లభిస్తుందని, ఇది వారి ప్రయాణాన్ని మరింత సంతోషంగా మార్చడంలో ఉపయోగపడుతుందని IRCTC ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ అన్నారు. -
సంక్రాంతి వేళ.. ప్రయాణం కిటకిట (ఫొటోలు)
-
పండగ వేళ రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట
ఢిల్లీ: దీపావళి వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. కొన్ని మార్గాల్లో రైళ్లు కిక్కిరిసిపోయాయి. టికెట్ ముందే బుక్ చేసుకున్నప్పటికీ రైలులో కాలుపెట్టే పరిస్థితి లేదని కొందరు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే యాజమాన్యంపై విమర్శలు కురిపిస్తున్నారు. అధికారుల నిర్వహణ లోపం వల్ల తాము దీపావళికి ఇంటికి చేరుకోలేకపోయామని సోషల్ మీడియా వేదికగా వాపోయారు. "ఇండియన్ రైల్వే నిర్వహణలోపం నా దీపావళిని నాశనం చేసింది. ఏసీ టిక్కెట్‌ను కొన్నప్పటికీ రైలు ఎక్కే పరిస్థితి లేదు. పోలీసుల నుండి ఎటువంటి సహాయం లేదు. నాలాంటి చాలా మంది రైలు ఎక్కలేకపోయారు," అని ట్విట్టర్ వేదికగా ఓ వ్యక్తి పంచుకున్నాడు. PNR 8900276502 Indian Railways Worst management Thanks for ruining my Diwali. This is what you get even when you have a confirmed 3rd AC ticket. No help from Police. Many people like me were not able to board. @AshwiniVaishnaw I want a total refund of ₹1173.95 @DRMBRCWR pic.twitter.com/O3aWrRqDkq — Anshul Sharma (@whoisanshul) November 11, 2023 దేశ రాజధానిలోనూ దీపావళి వేడుకల సందర్భంగా ప్రయాణికులతో బస్సు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఢిల్లీలో ఆనంద్ విహారీ కౌశాంబి ప్రాంతంలో ఇంటర్ స్టేట్ బస్సు టర్మినల్లో నడవడానికి కూడా వీలులేని దుస్థితి ఏర్పడింది. పండగ సందర్భంగా జనం సొంత ఊళ్లకు వెళుతున్నారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు జనంతో నిండిపోయాయి. #WATCH | Huge rush of people at Anand Vihar- Kaushambi on Delhi-UP border near the Anand Vihar railway station and inter-state bus terminal pic.twitter.com/DkDXSgganz — ANI (@ANI) November 11, 2023 న్యూఢిల్లీలోని స్టేషన్లలో రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. శనివారం సూరత్‌లో బీహార్‌కు వెళ్లే ప్రత్యేక రైలు ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మరికొందరు స్పృహతప్పి పడిపోయారని పోలీసులు తెలిపారు. #WATCH | Gujarat | A stampede situation ensued at Surat railway station due to heavy crowd; one person died while three others were injured. The injured were shifted to the hospital: Sarojini Kumari Superintendent of Police Western Railway Vadodara Division (11.11) pic.twitter.com/uAEeG72ZMk — ANI (@ANI) November 11, 2023 ఇదీ చదవండి: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు -
ఎలాగైనా.. ఊరికి పోవాల్సిందే!
నగర దారులన్నీ పల్లె‘టూరు’ దారి పడుతున్నాయ్. బస్సూ, రైలూ, కారూ, బైకూ.. ఏదైనా సరే ఊరికి పోవడమే లక్ష్యం. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం దసరా పండగ కావడంతో శనివారం పట్నవాసులు పల్లెలకు పయనమయ్యారు. సొంతూరిని ఓసారి మనసారా చూసొద్దామని ఆశగా బయలుదేరారు. నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర బస్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. – సాక్షి, స్టాఫ్‌ఫొటోగ్రాఫర్ -
రైల్వే స్టేషన్లలో సరికొత్త సెక్యూరిటీ సిస్టమ్.. ఇక దొంగల ఆటకట్టు!
దేశంలోని రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రయాణికుల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు వార్తలు తరచూ వింటుంటాం. ఇలాంటి రైల్వే స్టేషన్లలో దొంగల ఆట కట్టించడానికి భారతీయ రైల్వే (Indian Railways) సరికొత్త భద్రతా వ్యవస్థను తీసుకొస్తోంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా వివిధ ప్రాంతాల్లో భద్రతను పెంచేందుకు సెంట్రల్ రైల్వే సర్వం సిద్ధం చేసింది. సెంట్రల్ రైల్వేస్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. త్వరలో 364 రైల్వే స్టేషన్లలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌తో కూడిన 3,652 కెమెరాలతో సహా మొత్తం 6,122 క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ (CCTV) కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రైల్‌టెల్‌తో రైల్వే బోర్డు అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. (iPhone 15: షాకింగ్.. బ్రేకింగ్! ఇదేం ఐఫోన్ భయ్యా.. వైరల్ వీడియో) "ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, వీడియో అనలిటిక్స్, వీడియో మేనేజ్మెంట్ సిస్టమ్‌తో కూడిన కెమెరాలు ప్రయాణికుల భద్రతను పెంపొందిస్తాయి. నేరాలను నియంత్రిస్తాయి. చట్టాన్ని దుర్వినియోగం చేసేవారిని అరికట్టగలవు. రైల్వే నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షిస్తాయి" అని ప్రకటనలో వివరించారు. కెమెరాలు ఇలా పనిచేస్తాయి.. రైల్వే స్టేషన్లోకి దొంగ ప్రవేశించగానే ఈ ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు గుర్తించి వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తాయి. ఇందుకోసం ఇదివరకే డేటాబేస్‌లో స్టోర్ అయిన దొంగల ఫేస్ సమాచారాన్ని ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు వినియోగించుకుంటాయి. ఈ కెమెరాలు కంటి రెటీనా లేదా నురురు వంటి ముఖ భాగాలను గుర్తించగలవు. ప్రతి హెచ్డీ కెమెరా సుమారు 750 జీబీ డేటాను వినియోగిస్తుంది. ఇక 4K కెమెరాలు నెలకు 3 టీబీ డేటాను వినియోగించుకుంటాయి. వీడియో ఫుటేజ్‌ను పోస్ట్ ఈవెంట్ అనాలిసిస్, ప్లేబ్యాక్, ఇన్వెస్టిగేషన్ ప్రయోజనాల కోసం 30 రోజుల పాటు నిల్వ చేయనున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. -
విమానాశ్రయాల్లో చేనేత అమ్మకాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత వస్త్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రధాన కాంప్లెక్స్‌లలో ఆప్కో స్టాల్స్ ఏర్పాటు చేసింది. తాజాగా విమానాశ్రయాల్లోనూ ప్రత్యేకంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో విజయవాడ (గన్నవరం), తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయంతోపాటు మెహిదీపట్నం ( హైదరాబాద్), మృగనాయని(భోపాల్), కర్నూలు జిల్లా లేపాక్షి, మంగళగిరిలోనూ ఆప్కో నూతన షోరూంలను ప్రారంభించారు. ప్రైవేటు వస్త్ర వ్యాపార సంస్థలకు దీటుగా అధునాతన వసతులతో ఆప్కో షోరూంలను ప్రారంభించడం విశేషం. చేనేతను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఒకవైపు దేశవ్యాప్తంగా ఆప్కో స్టాల్స్, షోరూంలను పెంచడంతోపాటు మరోవైపు స్థానికంగా డిస్కౌంట్ సేల్, చేనేత సంఘాల ఎగ్జిబిషన్లు, ఫ్యాషన్ షోలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆకట్టుకునే డిజైన్లతోను, వినూత్నమైన, నాణ్యమైన చేనేత వస్త్రాల తయారీని ప్రోత్సహిస్తున్నారు. ఉద్యోగులు, ప్రజలు వారానికి ఒక్కరోజైనా చేనేత వ్రస్తాలు ధరించేలా పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం జగన్ చర్యలు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్, ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. ‘నేతన్న నేస్తం’ తదితర కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. చేనేత వస్త్రాల విక్రయాలను ప్రోత్సహించి ఆ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన సుమారు 1.75లక్షల కుటుంబాలకు అండగా నిలిచేలా ఆప్కో ద్వారా పలు చర్యలు చేపట్టినట్టు వివరించారు. రాష్ట్రంలోని చేనేత సొసైటీల వద్ద ఉన్న వ్రస్తాల నిల్వలను క్లియర్ చేసి సొసైటీలను ఆదుకునేలా విక్రయాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆప్కో షోరూంల ద్వారా ఈ ఏడాది రూ.50కోట్ల విక్రయాలు జరపాలని నిర్ణయించినట్లు ఎంఎం నాయక్ తెలిపారు. -
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: తక్కువ ధరకే మందులు!
దేశంలో అతిపెద్ద ప్రజా ప్రయాణ వ్యవస్థ రైల్వేలు. దేశవ్యాప్తంగా రోజూ లక్షల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్నిసార్లు ప్రయాణికుల ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కొంత మంది ముందు జాగ్రత్తగా కొన్ని మందులు తమ వెంట తెచ్చుకున్నా చాలా మంది మందులు దొరక్క, ఒకవేళ దొరికినా అధిక ధరల కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి ఇబ్బందుల పరిష్కారానికి రైల్వే చర్యలు చేపట్టింది. ప్రయాణికుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ దేశంలోని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకు మందులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాల పేరుతో మెడికల్ స్టాల్స్ ప్రారంభించనుంది. ఇక్కడ ప్రయాణికులకు అవసరమైన వివిధ రకాల మందులు తక్కువ ధరకు విక్రయిస్తారు. ఈ అవుట్లెట్లు రైల్వేస్టేషన్లలోని రద్దీ ప్రదేశాలలో, కాన్కోర్స్‌లలో ఏర్పటు చేస్తారు. దీని వల్ల వచ్చీపోయే ప్రయాణికులందరికీ ప్రయోజనం కలుగుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. మొదట 50 స్టేషన్లలో.. పైలట్ ప్రాజెక్ట్ కింద మొదట ఎంపిక చేసిన 50 రైల్వే స్టేషన్లలో ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ జాబితాలో ఆనంద్ విహార్, దర్భంగా, శ్రీనగర్, మైసూర్, లక్నో తదితర ప్రధాన స్టేషన్లతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఇదీ చదవండి: Water Bottles in Trains: రైళ్లలో వాటర్ బాటిల్ కొంటున్నారా.. ఏ బ్రాండ్ అమ్మాలి.. రూల్స్ ఏంటి? రైల్వే డివిజన్ల ద్వారా గుర్తించిన ప్రదేశాలలో ఈ మందుల కేంద్రాలను లైసెన్సుల ద్వారా ఏర్పాటు చేసి నిర్వహిస్తారు. సంబంధిత రైల్వే డివిజన్ల ఆధ్వర్యంలో ఈ-వేలం ద్వారా ఈ స్టాల్స్ ను కేటాయిస్తారు. వీటిని ఎన్ఐడీ అహ్మదాబాద్ డిజైన్ చేస్తుంది. -
రైల్వే స్టేషన్లకు మంచిరోజులు
-
ఒకేసారి 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనుల ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 506 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పథకం పనులకు ప్రధాని మోదీ ఈ నెల 6న వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్రం రూ.24,470 కోట్లను వెచి్చంచనుంది. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లకు మెరుగులు దిద్దడం, కొత్త, మెరుగైన సూచికల ఏర్పాటు, ఆధునిక మౌలిక వసతుల కల్పన వంటి వాటికి ఈ మొత్తాన్ని వెచి్చస్తారని పీఎంవో తెలిపింది. మొత్తం 508 స్టేషన్లలో తెలంగాణలోని 21, ఆంధ్రప్రదేశ్‌లోని18 రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మొత్తం 1,309 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చే యాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందు లో భాగంగా తాజాగా ఒకేసారి 506 స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. -
ఏపీలో 11 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల పునరాభివృధ్ధి పనులకు ఈ నెల 6న ప్రధాని మోదీవర్చువల్ పద్ధతిన శంకుస్థాపన చేయనున్నారని. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డీఆర్ఎమ్ నరేంద్ర ఆనందరావు పాటిల్ చెప్పారు. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తొలిదశలో విజయవాడ డివిజన్లో రూ.270 కోట్లతో 11 రైల్వే స్టేషన్ల్లో పునరాభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. రెండో దశలో మరో 9 స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు వివరించారు. తొలి దశ పనుల్లో అనకాపల్లి, భీమవరం టౌన్, ఏలూరు, కాకినాడ టౌన్, నర్సాపూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని స్టేషన్ల్లో పలు సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఏబీఎస్ఎస్లో భాగంగా తెలంగాణలో తొలి దశలో 21 స్టేషన్లను పునరాభివృద్ధి చేయనున్నారు. -
72 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ
ఆంధ్రప్రదేశ్‌లోని 72 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఆధునికీకరణ, అప్‌గ్రేడేషన్ కోసం గుర్తించినట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2023–24లో జూన్ 2023 వరకు దక్షిణ మధ్య రైల్వేలో అభివృద్ధి నిమిత్తం రూ.83.64 కోట్లు వ్యయం చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ సంజీవ్‌కుమార్ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఐదేళ్లలో 79 ర్యాంకుల మెరుగు ప్రపంచబ్యాంకు డూయింగ్ బిజినెస్ రిపోర్టు (డీబీఆర్)–2020 ప్రకారం భారతదేశ ర్యాంకు 2014లో 142 ఉండగా 79 ర్యాంకులు మెరుగై 2019కి 63వ ర్యాంకుకు చేరుకుందని కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్.. వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌రామ్, ఎన్.రెడ్డెప్ప ప్రశ్నకు జవాబిచ్చారు. దక్షిణమధ్య రైల్వేలో ఖాళీలు దక్షిణమధ్య రైల్వేలో గ్రూప్ ఏ, సీల్లో పలు ఖాళీలున్నట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గ్రూపు ఏలో 110, గ్రూపు సీలో 10,338 ఖాళీలున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనూరాధ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఏపీ ప్రాంతాలు సికింద్రాబాద్ఆర్ఆర్బీ పరిధిలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాలు సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరిధిలోకి వస్తాయని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ సంజీవ్‌కుమార్ ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. దక్షిణమధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వేలు సికింద్రాబాద్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ల ప్రకారం దేశంలోని 21 బోర్డుల్లో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు చేయండి అనకాపల్లి జిల్లాలో కేంద్ర ప్రాంతీయ పాస్‌పోర్టు సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విదేశాంగమంత్రి జయశంకర్‌కు వైఎస్సార్సీపీ ఎంపీ బి.వి.సత్యవతి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో పాస్‌పోర్టు సేవాకేంద్రం ఏర్పాటుచేస్తే అల్లూరి, కాకినాడ, విజయనగరం, విశాఖ జిల్లాల వాసులకు కూడా ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. -
జనరల్ బోగీల వద్దే భోజనం ప్లేట్ మీల్స్ రూ.50
సాక్షి, హైదరాబాద్: జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికోసం జనాహార్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈ కేంద్రాలు ప్రధాన రైల్వేస్టేషన్లలో స్టాళ్లకే పరిమితమయ్యాయి. సాధారణ బోగీల్లో ప్రయాణించేవారి భోజన ఇబ్బందులు తొలగించేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. జనరల్ బోగీలు ఆగేచోటనే ఈ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే నాంపల్లి రైల్వేస్టేషన్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. విజయవాడ, గుంతకల్, రేణిగుంట స్టేషన్ల పరిధిలోనూ ఈ సేవలు అమలవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో ఈ తరహా సదుపాయం ప్రవేశపెట్టనున్నట్టు ఇటీవల రైల్వేశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మొదటివిడతగా దక్షిణమధ్య రైల్వేలో మొదట నాలుగుస్టేషన్లలో జనాహార్ విక్రయ కేంద్రాలను ప్రారంభించారు. జనరల్ బోగీ ప్రయాణికులు మాత్రం తమకు ఆహారం కావాలంటే ట్రైన్ దిగి స్టేషన్లో అందుబాటులో ఉన్న రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టుల నుంచి ఆహారం తెచ్చుకోవాలి. ఈ ఇబ్బందులను తొలగించేందుకే జనరల్ బోగీల వద్దకే జనాహార్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహారం అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో తయారు చేసిన శుభ్రమైన ఆహారపదార్థాలను ప్రయాణికులకు అందజేస్తారు. రూ.20కే ఏడు పూరీలు, కర్రీ ఇస్తారు. ఇది 250 గ్రాముల వరకు ఉంటుంది. దీనిని ఐఆర్సీటీసీ ఎకానమీ మీల్‌గా పేర్కొంది. కాంబో మీల్ రూ.50కే అందజేస్తారు. ఇందులో 350 గ్రాముల వరకు అన్నం, ఒక కర్రీతోపాటు పప్పు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రెండు రకాల ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. ప్రయాణికులు డిజిటల్ రూపంలో చెల్లించే సదుపాయం ఉంది. దశలవారీగా విస్తరణ దశలవారీగా సికింద్రాబాద్, తిరుపతి, గుంటూరు, కాకినాడ, వరంగల్, కాజీపేట్ తదితర స్టేషన్లలో కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశముంది. ప్రయాణికులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం తక్కువ ధరలోనే లభిస్తుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్ తెలిపారు. ప్లేట్ ఇడ్లీ రూ.1,200 గోల్డ్ ఇడ్లీని అమ్ముతున్న హైదరాబాద్ కేఫ్ బంజారాహిల్స్(హైదరాబాద్): గోల్డెన్ ఇడ్లీ.. నగరంలో అందుబాటులోకి వచ్చిన కొత్త డిష్ ఇది. ప్లేట్ ఇడ్లీ ధర రూ.1200..అందుకే ఆ ఇడ్లీ బంగారమే అనడంతో అతిశయోక్తి లేదు. తినడానికి కొందరు..చూడడానికి మరికొందరు ఇలా భారీ సంఖ్యలో ఆ హోటల్‌కు జనాలు బారులుతీరుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.3 నుంచి శ్రీనగర్‌కాలనీకి వెళ్లే రోడ్డులో కర్ణాటక బ్యాంక్ ఎదురుగా రాఘవేంద్ర రెసిడెన్సీలో ఏర్పాటుచేసిన కృష్ణ ఇడ్లీ కేఫ్‌నకు తెల్లవారుజామునుంచే ఫుడ్డీలు చేరుకుంటున్నారు. బంగారు పూత పూసిన ఇడ్లీని గులాబీ రేకులతో కనువిందు చేసే రీతిలో సర్వ్ చేస్తున్నారు. ఒక ప్లేట్‌కు రెండు ఇడ్లీలు మాత్రమే ఇస్తారు. ఇక్కడ గోల్డ్ ఇడ్లీలే కాకుండా బంగారు దోశ, గులాబిజామ్ బజ్జీ, మలాయి కోవా వంటి 100కిపైగా ఫుడ్ ఐటమ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దక్షిణాది వంటకాలే కాకుండా చైనీస్ వంటకాలకూ ఈ హోటల్ స్పెషల్. -
ఆ.. 9 రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు హాల్ట్
సాక్షి, అమరావతి: సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రాష్ట్రంలో మరో 9 రైల్వే స్టేషన్లలో ఆపాలని (హాల్ట్) రైల్వే శాఖ నిర్ణయించింది. దీర్ఘకాలికంగా ఉన్న ఈ డిమాండ్‌పై కేంద్ర రైల్వే శాఖ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బొబ్బిలి, దువ్వాడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నడికుడి, సూళ్లూరుపేట, డోర్నకల్, పీలేరు, కుప్పం రైల్వే స్టేషన్లలో పలు రైళ్లను ఆపాలని నిర్ణయించారు. ఆ వివరాలు ఇలా .. బొబ్బిలి: యశ్వంత్‌పూర్– హతియా ఎక్స్‌ప్రెస్ (12835), యశ్వంత్‌పూర్– టాటా నగర్(12889), హతియా– ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ (22837 – 22838) దువ్వాడ: శంకర్పల్లి– ముంబై ఎక్స్‌ప్రెస్ (18519 , 18520), విశాఖపట్నం– హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ (12803, 12804) పిడుగురాళ్ల: (1) ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (12603) (2) భువనేశ్వర్– సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17015), నాగర్సోల్–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్(17232), సికింద్రాబాద్–తిరుపతి ఎక్స్‌ప్రెస్ (12733) సత్తెనపల్లి: భువనేశ్వర్– సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17015), నాగర్సోల్–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ (17232), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (12603) నడికుడి: సికింద్రాబాద్– తిరుపతి ఎక్స్‌ప్రెస్ (12733), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (12603), భువనేశ్వర్– సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్(17015), నాగర్సోల్–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ (17232) సూళ్లూరుపేట: అళప్పుజా–ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ (13352) పీలేరు: నాగర్‌కోయిల్ – ముంబై ఎక్స్‌ప్రెస్ (16340, 16339) , కాచిగూడ–మధురై ఎక్స్‌ప్రెస్ (17615, 17616) కుప్పం: చెన్నై–శిరిడీ ఎక్స్‌ప్రెస్ (22601, 22602) డోర్న్కల్: లింగంపల్లి – కాకినాడ ఎక్స్‌ప్రెస్ (12737), 12738), మచిలీపట్నం– బీదర్ ఎక్స్‌ప్రెస్ (12749, 12750). -
రైల్వేస్టేషన్లలో లేడీ కిలాడీ గ్యాంగ్.. ఒక్కో స్టేషన్లో ఒక్కో పేరుతో ప్రత్యక్షం
తిరుపతి అర్బన్: రైల్వే స్టేషన్లను టార్గెట్ చేసుకుని.. ప్రయాణికుల జేబులను కొల్లగొట్టడమే వృత్తిగా జీవనం సాగిస్తున్న ముగ్గురు లేడీ కిలాడీలను తిరుపతి రైల్వే స్టేషన్లో శనివారం పోలీసులు అరెస్టు చేసి 3 సెల్ఫోన్లతోపాటు రూ.34,500 స్వాదీనం చేసుకున్నారు. తమిళనాడులోని తుతుకుడి జిల్లాకు చెందిన ఎం.మీనా (23), ఎస్.రాణి (29), ఏ అంజలి (25) రైల్వే స్టేషన్లను టార్గెట్ చేస్తూ ఒక్కో రైల్వే స్టేషన్లో తిష్ట వేసి చోరీలు చేస్తారు. తర్వాత మరో రైల్వే స్టేషన్‌కు వెళ్లి మారు పేర్లతో ఇదే తంతు కొనసాగిస్తారు. వారి భర్తలు వీరున్న సమీపంలోనే కూలి పనులు చేస్తుంటారు. ఇదే సమయంలో వీరు చోరీ లకు పాల్పడుతుంటారు. ముగ్గురిపై రైల్వే పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. చదవండి: వాళ్ళది వివాహేతర సంబంధం కాదు: మనోజ్ తండ్రి -
తెగని టికెట్లు.. ద.మ. రైల్వే కీలక నిర్ణయం.. 23 రైల్వేస్టేషన్ల మూసివేత
ఏలూరు (టూటౌన్): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలోని 23 రైల్వేస్టేషన్లను మూసివేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కృష్ణా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 23 స్టేషన్లు మూతపడ్డాయి. ఇప్పటికే ఈ స్టేషన్ల పరిధిలోని సిబ్బందిని చాలా వరకు ఇతర రైల్వే స్టేషన్లకు సర్దుబాటు చేశారు. రవాణా సాధనాలు పెరగడం, రోడ్డు మార్గాలు అందుబాటులోకి రావడంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగే స్టేషన్లు మినహా ప్యాసింజర్ రైళ్లు ఆగే వివిధ రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణికుల రాకపోకలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. మూసివేతకు కారణాలివీ.. కనీసం రోజుకు 25 మంది ప్రయాణికులు కూడా రాకపోకలు సాగించని రైల్వే స్టేషన్లను మూసివేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. రోజుకు ఒకటి, రెండు టికెట్లు మాత్రమే అమ్ముడవుతున్న చోట్ల బుకింగ్స్ నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చారు. మూసివేసిన స్టేషన్లు ఇవే.. మే 1వ తేదీ విజయవాడ డివిజన్ పరిధిలోని ఎన్ఎస్జీ–6 కేటగిరీలో ఉన్న 16 స్టేషన్ల మూసివేతకు తొలుత డ్రా‹ఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యంతరాలేవీ రాకపోవడంతో అల్లూరు రోడ్డు, బాదంపూడి, బయ్యవరం, చాగల్లు, దెందులూరు, హంసవరం, ముస్తాబాద, నవాబ్‌పాలెం, పెన్నాడ అగ్రహారం, పెద అవుటపల్లి, రావికంపాడు, తాడి, శ్రీ వెంకటేశ్వరపాలెం, తాలమంచి, తేలప్రోలు, వట్లూరు రైల్వే స్టేషన్లను మూసివేశారు. జూన్ 1 నుంచి 7 రైల్వేస్టేషన్లను మూసివేయగా.. ఆ జాబితాలో కొలనుకొండ, వీరవల్లి, ఉంగుటూరు, బ్రాహ్మణగూడెం, బలభద్రపురం, తిమ్మాపురం, చింతపర్రు స్టేషన్లు ఉన్నాయి. -
ప్రపంచంలోని టాప్ 10 ఆర్కిటెక్చర్ రైల్వే స్టేషన్లు
-
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కొత్త రైలు.. ఛార్జీలు ఎలా ఉన్నాయంటే?
భువనేశ్వర్: పూరీ – హౌరా మధ్య ప్రారంభమైన 22895/22896 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆహారం చార్జీలతో పాటు టికెటు ధర నిర్ణయించారు. రైలులో ఆహారం అవసరం లేకుంటే మినహాయింపు కల్పించి టికెటు చార్జీలు కుదిస్తారు. టికెటు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికుడు ప్రకటించిన నిర్ణయం మేరకు ఈ సౌకర్యం కల్పిస్తారు. నో ఫుడ్ ఆప్షన్ ఎంచుకుంటే, క్యాటరింగ్ ఛార్జీలు టికెటు ధర నుంచి నుంచి మినహాయిస్తారు. హౌరా నుంచి ఈ రైలు ఆగే పలు రైల్వేస్టేషన్ల వరకు ప్రయాణ చార్జీల వివరాలు ఇలా ఉన్నాయి. దీనిలో ఏసీ చైర్ కారు (సీసీ) కేటరింగ్ చార్జీ రూ.162లు, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు (ఈసీ) కేటరింగ్ చార్జీ రూ.195లుగా ఉంటాయి. -
AP: 72 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు: రైల్వే శాఖ మంత్రి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో అమృత్ భారత్ పథకం కింద 72 స్టేషన్లలో అభివృద్ధి పనులు జరిగాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఏపీలో వివిధ రైల్వే ప్రాజెక్టులపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. 2022 ఏప్రిల్ నెల వరకు రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి సంబంధించి 16 కొత్త లైన్లు, 15 డబ్లింగ్ లైన్లు మొత్తం 31 ప్రాజెక్టులు కేటాయించామన్నారు. వాటి దూరం 5,581 కిలోమీటర్లు కాగా, 70,594 కోట్లుతో చేపట్టామన్నారు. ఈ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని, మార్చి 2022 వరకు 636 కిలోమీటర్ల దూరాన్ని 19,414 కోట్లతో నిర్మించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే 2014-19 మధ్య 219 శాతానికి పైగా రైల్వే బడ్జెట్లో కేటాయింపులు పెంచడం జరిగిందని జీవీఎల్ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద 72 స్టేషన్ల అభివృద్ధి అమృత్ భారత్ స్టేషన్ స్కీం రైల్వే స్టేషన్ల అభివృద్ధికి దేశవ్యాప్తంగా 1275 రైల్వే స్టేషన్లను, వాటిలో 72 స్టేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించగా అందులో 53 స్టేషన్లలో ఇప్పటికే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. చదవండి: మా నమ్మకం నువ్వే.. ఏప్రిల్ 7 నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం -
భారతదేశంలోని టాప్ 10 అతిపెద్ద రైల్వే స్టేషన్లు (ఫోటోలు)
-
మన్యానికి రైలొస్తోంది! 173 కి.మీ. కొత్త రైల్వేలైనుకు రూ 2,800 కోట్ల అంచనా!
చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): త్వరలోనే మన్యంలో రైలుకూత వినపడనుంది. ఇప్పటివరకు బస్సులు, లాంచీలు మాత్రమే తిరిగిన మన్యం ఏరియాలో రైళ్లు కూడా రాకపోకలు సాగించనున్నాయి. ప్రస్తుతం మన్యం ప్రజలు రైలులో ప్రయాణించాలంటే రాజమహేంద్రవరం, ఖమ్మం, కొత్తగూడెం వెళ్లాల్సి ఉంది. నూతన లైను ఏర్పాటులో భాగంగా మన్యం ఏరియాలో నాలుగు రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రవాణాను సులభతరం చేసేందుకు ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం వరకు సుమారు 173 కిలో మీటర్ల మేర రైల్వేలైను మంజూరైంది. దీని నిర్మాణానికి రూ 2,800 కోట్లు అవసరమని అంచనా. ఈ లైన్‌ను మల్కన్‌గిరి నుంచి భద్రాచలం సమీపంలోని పాండురంగాపురం రైల్వేస్టేషన్ వరకు నిర్మిస్తారు. ఈ లైను ఏర్పాటులో భాగంగా పలుచోట్ల 213 వంతెనలు నిర్మించనున్నారు. వీటిలో 48 పెద్ద వంతెనలు, 165 చిన్న వంతెనలు ఉన్నాయి. విలీన మండలాల మీదుగా... మల్కన్‌గిరి నుంచి భద్రాచలం వరకు నిర్మించనున్న రైల్వేలైను విలీన మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల మీదుగా సాగనుంది. దీనిలో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి, కోవాసిగూడ, బదలి, రాజన్‌గూడ, మహరాజ్‌పల్లి, లూనిమన్‌గూడ, ఆంధ్రాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కన్నాపురం, కూనవరం మండలం కూటూరు గట్టు, పల్లూరు, ఎటపాక మండలం నందిగామలో స్టేషన్లు ఏర్పాటుచేస్తారు. నందిగామ నుంచి తెలంగాణలో గోదావరి మీదుగా భద్రాచలం, అక్కడి నుంచి పాండురంగాపురం వరకు ఈ రైల్వేలైను నిర్మించనున్నారు. -
‘అమృత్ భారత్ స్టేషన్స్’.. ఏపీలో 72 రైల్వే స్టేషన్లకు మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ సహా 72 రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అభివృద్ధి చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్లో ప్రవేశపెట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్స్’ పథకం కింద దేశంలో 1,275 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వాటిలో మన రాష్ట్రంలోని 72 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. ఈ పథకం కింద రైల్వే స్టేషన్లలో 53 రకాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. ప్రతి స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన స్టేషన్ల అభివృద్దికి త్వరలోనే మాస్టర్ ప్లాన్లు రూపొందించేందుకు నిపుణుల కమిటీలను నియమిస్తామని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. అనంతరం బడ్జెట్‌ను రూపొందించి దశలవారీగా పనులు చేపడతామన్నారు. స్టేషన్లలో కల్పించే ప్రధాన సౌకర్యాల్లో కొన్ని.. - ప్రతి స్టేషన్లో భవనాలు, ఫ్లోరింగ్ ఆధునిక శైలిలో నిర్మాణం - ప్రస్తుతం ప్లాట్‌ఫామ్‌లు 600 మీటర్ల పొడవుతో ఉన్నాయి. వాటి పొడవు 760 మీటర్ల నుంచి 840 మీటర్ల వరకు పెంపు - స్టేషన్ల వద్ద ట్రాక్‌ల శుభ్రత, సులభమైన నిర్వహణ కోసం ‘బ్యాలస్ట్ట్‌లెస్ ట్రాక్’ల ఏర్పాటు - ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే ఎన్ఎస్జీ 1 – 4, ఎస్జీ 1– 2 కేటగిరీ స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటు - దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చెయిర్లు, ప్రత్యేక ప్రవేశ మార్గాలు, ఇతర సదుపాయాలు - వెయిటింగ్ హాల్స్, వాటికి అనుబంధంగా కేఫెటేరియా - స్థానిక ఉత్పత్తుల విక్రయానికి కనీసం రెండు స్టాల్స్ ఏర్పాటు - ప్రతి స్టేషన్ మొదటి అంతస్తులో ప్రత్యేకంగా రూఫ్ ప్లాజా - సమావేశ మందిరాలు - స్టేషన్‌కు రెండు వైపులా అప్రోచ్ రోడ్లు, పార్కింగ్ ఏరియా, పాదచారులకు ప్రత్యేక దారి - ల్యాండ్ స్కేపింగ్, ఆధునిక లైటింగ్ - వేగవంతమైన వైఫై సేవలకు 5జీ టవర్లు రాష్ట్రంలో అభివృద్ధి చేయనున్న రైల్వే స్టేషన్లు ఇవే.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం, విజయనగరం, తెనాలి, గుంటూరు, ఆదోని, అనకాపల్లి, అనపర్తి, అరకు, బాపట్ల, భీమవరం టౌన్, బొబ్బిలి, చీపురుపల్లి, చీరాల, చిత్తూరు, కడప, కంభం, ధర్మవరం, డోన్, దొనకొండ, దువ్వాడ, యలమంచిలి, ఏలూరు, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గూడురు, గుణదల, హిందూపూర్, ఇచ్ఛాపురం, కదిరి, కాకినాడ టౌన్, కొత్తవలస, కుప్పం, కర్నూలు సిటీ, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లి రోడ్, మంగళగిరి, మార్కాపూరం రోడ్, మంత్రాలయం రోడ్, నడికుడి, నంద్యాల, నరసరావుపేట, నరసాపూర్, నౌపడ, నెల్లూరు, నిడదవోలు, ఒంగోలు, పాకాల, పలాస, పార్వతీపురం, పిడుగురాళ్ల, పీలేరు, రాజంపేట, రాజమహేంద్రవరం, రాయనపాడు, రేణిగుంట, రేపల్లె, సామర్లకోట, సత్తెనపల్లి, సింహాచలం, సింగరాయకొండ, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం రోడ్, సూళ్లూరుపేట, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తుని, వినుకొండ. -
త్వరలోనే కాచిగూడ– కృష్ణా రైలు..
కృష్ణా: మునీరాబాద్-మహబూబ్‌నగర్ రైల్వేలో భాగంగా దేవరకద్ర నుంచి కృష్ణా వరకు ఉన్న 66 కిలోమీటర్ల దక్షిణ మధ్య రైల్వేలైన్ పనులు పూర్తి కావడంతో ఇటు తెలంగాణ ప్రజలతో పాటు కర్నాటక, గోవా రాష్ట్రాల మధ్య రాకపోకలకు, వర్తక, వాణిజ్యపరంగా ఎంతో ఉపయోగకరంగా మారనుంది. మొట్టమొదట 2017లో దేవరకద్ర నుంచి జక్లేర్ గ్రామం వరకు 28.3 కిలోమీటర్లు రూ.943 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేశారు. తర్వాత జక్లేర్ నుంచి మక్తల్ వరకు 11.5 కిలోమీటర్ల రైల్వేలైన్ పనులను 2020లో, ఆ తర్వాత మక్తల్ నుంచి మాగనూర్ వరకు ఉన్న 13.3 కిలోమీటర్లను 2022 మార్చిలో, మాగనూర్ నుంచి కృష్ణా వరకు ఉన్న 12.7 కిలోమీటర్లను 2023లో పూర్తి చేశారు. ఈనెల 6న సికింద్రాబాద్, గుంతకల్ డీఆర్ఎంలతో పాటు కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి ప్రణవ్ సక్సేనా ఆధ్వర్యంలో ట్రయల్‌రన్ నిర్వహించారు. దేవరకద్ర నుంచి కృష్ణా వరకు ఉన్న 66 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ పూర్తి కావడంతో ఇక మీదట అన్నిరకాల రైళ్లు నడిపించేందుకు అవకాశం ఉంటుందని నిర్ధారించారు. గతంలో 6గంటలపాటు ప్రయాణించి హైదరాబాద్ చేరేవారు, ప్రస్తుతం 3గంటల్లోనే చేరుకునే అవకాశం ఏర్పడనుంది. త్వరలోనే కాచిగూడ– కృష్ణా రైలు.. కాచిగూడ నుంచి కృష్ణా వరకు రైలును త్వరలోనే ప్రారంభిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి కర్నాటకలోని రాయచూర్, బళ్లారి, గుంతకల్, హుబ్లి, గోవాకు త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది. వర్తక, వాణిజ్యపరంగా, ప్రజా రవాణాలకు ఈ దారి ఎంతో ఉపయోగంగా మారనుంది. నిత్యం వందల సంఖ్యలో రాయచూర్ నుంచి హైదరాబాద్ వరకు వాణిజ్య వాహనాలు, ప్రజా రవాణా వాహనాలు రోడ్డు ద్వారా రాకపోకలు సాగిస్తున్నాయి. మక్తల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందేందుకు రైల్వేలైన్ అందుబాటులోకి రావడం ఎంతో తోడ్పడనుంది. ఇక్కడి రైతులు పండించే ధాన్యం, కూరగాయలు, పండ్లు అటు హైదరాబాద్, ఇటు కర్నాటకలోని రాయచూర్‌కు తరలించేందుకు వీలు కలుగనుంది. అభివృద్ధికి తోడ్పాడు.. మునీరాబాద్ రైల్వే లైన్ పూర్తి కావడంతో మక్తల్ నియోజకవర్గం అన్ని రకాలుగా వేగంగా అభివృద్ధి చెందనుంది. ఈ ప్రాంతం నుంచి ఎటు వెళ్లాలన్నా తక్కువ సమయంలో గమ్యం చేరుకునేందుకు వీలు కలుగుతోంది. మా తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వానికి ప్రతిపాదించారు. నా హయాంలో పూర్తికావడం ఆనందంగా ఉంది. – చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే -
‘వన్ స్టేషన్.. వన్ ప్రొడక్ట్’: రైల్వేస్టేషన్లలో ‘స్థానిక’ స్టాల్స్
సాక్షి, అమరావతి: తిరుపతికి వచ్చిన భక్తులు తిరిగి వెళ్తూ శ్రీవారి లడ్డూలతో పాటు రైల్వే స్టేషన్లో శ్రీకాళహస్తి కలంకారీ చేనేతలూ కొని ఇంటికి పట్టుకెళ్లచ్చు.. విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు అక్కడే ముచ్చటైన కొండపల్లి బొమ్మలూ కొనచ్చు.. ఇలా.. రైల్వే స్టేషన్లు ప్రయాణానికే కాదు.. స్థానిక ఉత్పత్తుల మార్కెటింగ్‌కూ వేదికగా నిలవనున్నాయి. ‘వన్ స్టేషన్ – వన్ ప్రొడక్ట్’ విధానంతో స్థానిక ఉత్పత్తుల విక్రయాలకు ప్రోత్సాహం అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకోసం అహ్మదాబాద్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్’ సంస్థ స్టాల్స్‌ను రూపొందించింది. తక్కువ స్థలంలో ఉత్పత్తులను ప్రదర్శించేలా స్టాల్స్‌ను డిజైన్ చేసింది. ఉత్పత్తుల విక్రయాలకు స్థానిక డ్వాక్రా సంఘాలు, ఇతర హస్తకళా ఉత్పత్తుల తయారీదారులతో రైల్వే శాఖ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఏపీలో 91 రైల్వే స్టేషన్లలో స్టాల్స్ ‘వన్ స్టేషన్ – వన్ ప్రొడక్డ్’ విధానం కింద రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్ పరిధిలో 91 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. ప్రధానంగా చేనేత వస్త్రాలు, హస్తకళలు, గిరిజన ఉత్పత్తులు, స్థానిక ఆహార ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తోంది. దక్షిణ భారత దేశంలోనే పైలట్ ప్రాజెక్ట్‌గా రోజూ సగటున 30 వేల మంది వచ్చే తిరుపతి రైల్వే స్టేషన్లో శ్రీకాళహస్తి కలంకారీ చేనేతలను విక్రయిస్తోంది. ఈ స్టాల్‌కు విశేష స్పందన వస్తోంది. దాంతో మిగిలిన 90 స్టేషన్లలో కూడా దశలవారీగా స్టాల్స్ ఏర్పాటు చేస్తోంది. మొదటి దశలో సెప్టెంబరు 20 నాటికి 20 స్టేషన్లలో స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. వీటిలో 10 స్టేషన్లలో ఇప్పటికే స్టాల్స్ ఏర్పాటు పూర్తయింది. స్థానిక వెండార్లకు రైళ్లలో విక్రయాలకు అనుమతి ప్రయాణిస్తున్న రైళ్లలో ఆహార పదార్థాలు, ఇతర ఉత్పత్తులను విక్రయించే చిరు వ్యాపారుల కోసం రైల్వే శాఖ కొత్త నిబంధనను అమల్లోకి తెస్తోంది. ప్రస్తుతం ఐఆర్సీటీసీ అనుమతి ఉన్న వ్యాపారులను మాత్రమే రైళ్లలో అనుమతిస్తున్నారు. పలువురు చిరు వ్యాపారులు అనధికారికంగా రైళ్లలో ప్రవేశించి వారి ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. వారిని నిరోధించడం సమస్యగా మారింది. భద్రతాపరమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. దీనికి పరిష్కారంగా వారికి కూడా లైసెన్సు ఇవ్వాలని నిర్ణయించింది. రూ.1,500 ఫీజుతో 15 రోజులకు లైసెన్స్ జారీ చేస్తుంది. ఈ వెండార్లు వారికి నిర్దేశించిన స్టేషన్ల మధ్య రైళ్లలో ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. వీరి కోసం ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్’ సంస్థ ప్రత్యేకంగా బాడీవేర్ కిట్లను డిజైన్ చేసింది. తక్కువ స్థలంలోనే ఆహార పదార్థాలు, ఇతర ఉత్పత్తులను రెండు ర్యాకుల్లో భుజానికి తగిలించుకునే తేలికైన కిట్‌ను రూపొందించింది. లైసెన్సు పొందిన వెండార్లకు వాటిని అందిస్తారు. -
రెండేళ్లుగా అడ్డగోలు చెత్త బంధం..!!
సాక్షి, విశాఖపట్నం: దాసుడి తప్పు దండంతోనే సరి.. అన్నట్టుగా అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన అసలు సూత్రధారులను దర్జాగా వదిలేసి.. పాత్రధారులపై కొరడా ఝుళిపించారు జీవీఎంసీ ఉన్నతాధికారులు. నిబంధనలు మీరి రైల్వే స్టేషన్లలో చెత్త తరలింపునకు కార్పొరేషన్ వాహనాలు వినియోగించిన వైనం బట్టబయలైంది. అయితే దొరికేంత వరకూ దొరలే అన్నచందంగా.. కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే జరిగిందన్నట్లుగా.. అధికారుల కళ్లుగప్పేశారు. కానీ.. ఈ ‘చెత్త’ బంధం సుమారు రెండేళ్ల నుంచి సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీ ఖజానాకు కన్నం పెట్టి.. రైల్వే కాంట్రాక్టర్ కాసులకు కక్కుర్తిపడిన పెద్ద చేపల్ని వదిలేసి.. కేవలం ఒక డ్రైవర్ సస్పెన్షన్తోనే మమా అనిపించెయ్యడం గమనార్హం. మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో పరిధిలో పోగవుతున్న చెత్తను తీసేందుకు తీరిక లేని పారిశుధ్య కాంట్రాక్టర్లకు.. తమ పరిధి కాని ప్రాంతాల్లో మాత్రం శ్రద్ధగా పనులు కానిచ్చేస్తున్నారు. ఇటీవల రైల్వే స్టేషన్లో జరిగిన అక్రమ చెత్త నిర్వహణ అంశం బయటపడిన విషయం విదితమే. అసలేం జరిగిందంటే... రైల్వేస్టేషన్ పరిధిలో ఉన్న చెత్త నిర్వహణ బాధ్యతను రైల్వే శాఖ ప్రత్యేకంగా మూడేళ్ల కాలపరిమితితో కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఆ పరిధిలో జీవీఎంసీ పారిశుధ్య కార్మికులకు గానీ, వాహనాలకు గానీ పని లేదు. కేవలం రైల్వే స్టేషన్ మాత్రమే కాదు.. ఏ పబ్లిక్ సెక్టార్ పరిధిలోనైనా చెత్త నిర్వహణ బాధ్యత ఆయా సంస్థలు మాత్రమే నిర్వహించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో జీవీఎంసీ కమిషనర్‌కు లేఖ రాసి.. ఆయన అనుమతితోనే ఇక్కడ సిబ్బందిని చెత్త నిర్వహణ పనులకు వినియోగించుకుంటారు. కానీ రైల్వే స్టేషన్లో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా పారిశుధ్య పనులకు జీవీఎంసీ వాహనాలను వినియోగిస్తున్న విషయం బట్టబయలైంది. కొందరు స్థానికులు జీవీఎంసీ ఉన్నతాధికారులకు ఇక్కడ జరుగుతున్న తీరుపై ఫిర్యాదు చేయడంతో అధికారులు అవాక్కయ్యారు. రెండేళ్లుగా.. జీవీఎంసీ జోన్–4లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది, కాంట్రాక్టర్ తో కలిసి అక్రమార్జన కోసం రైల్వే కాంట్రాక్టర్‌తో అడ్డగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. జీవీఎంసీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పనులు చేస్తున్నట్లుగా చెప్పి ఒక టిప్పర్, బాబ్ కార్ట్ ని రైల్వే స్టేషన్ ఆవరణలో పారిశుధ్య నిర్వహణ పనులు గుట్టుగా కానిచ్చేస్తున్నారు. దీనికి అవసరమైన ఇంధనాన్ని కూడా జీవీఎంసీకి చెందినదే కావడం గమనార్హం. ఈ అక్రమ వ్యవహారం బట్టబయలవ్వడంతో.. ఆ ఒక్క రోజు మాత్రమే ఇలా జరిగిందంటూ అధికారులకు తప్పుడు సమాచారం అందించారు. ఇలా రైల్వే స్టేషన్లో చెత్త సేకరణకు సుమారు రెండేళ్ల కాలం నుంచి వాహనాల్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ చెత్త సేకరణ సమయం పూర్తయిన వెంటనే రైల్వే స్టేషన్‌కు వెళ్లి.. అక్కడి చెత్తని తాటిచెట్లపాలెంలోని మినీ సూయిజ్ ఫాం(ఎంఎస్ఎఫ్)కు తరలించినట్లు సమాచారం. రైల్వే కాంట్రాక్టర్‌తో జీవీఎంసీ జోన్–5 పరిధిలో ఉన్న ఒక కాంట్రాక్టర్, ముఖ్య అధికారి చేతులు కలిపి ఈ పనులకు వాహనాల్ని పంపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం జీవీఎంసీకి చెందిన రూ.లక్షలాది రూపాయిల ఇంధనాన్నే వినియోగించినట్లు తెలుస్తోంది. అసలువారిని వదిలేసి.. ఈ అక్రమ నిర్వహణ వ్యవహారం వెలుగులోకి రావడంతో జోన్–5 అధికారులు, సిబ్బంది, ఎంఎస్ఎఫ్ కాంట్రాక్టర్ ఉలిక్కిపడ్డారు. తప్పు తమవైపు రాకుండా ఉండేందుకు ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక అందించినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న సమయంలో ఎంఎస్‌ఎఫ్‌కు వస్తున్నప్పుడు అక్కడి రైల్వే కాంట్రాక్టర్ రూ.1000 ఇస్తే.. ఆ ఒక్క రోజు మాత్రమే చెత్తని తీసేందుకు వెళ్లారని అధికారులకు చెప్పారు. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ అధికారులను ఆదేశించగా.. జోన్–5 అధికారులు టిప్పర్ డ్రైవర్‌ను బలిపశువులా సస్పెండ్ చేశారు. కాంట్రాక్టర్ పరిధిలో ఉన్న బాబ్‌కార్డ్ అవుట్సోర్సింగ్ డ్రైవర్ని మరో చోటికి పంపించేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ జీవీఎంసీకి నష్టం తీసుకొచ్చిన కాంట్రాక్టర్‌పైనా, అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. అధికారుల ఒత్తిడి లేకుండా దిగువస్థాయి సాధారణ సిబ్బంది ఈ తరహా పనులకు వెళ్లే అవకాశం లేదు. దీనిపై కమిషనర్ లక్ష్మీశను వివరణ కోరగా.. సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. (చదవండి: ఏపీ సర్కార్‌ని చూస్తే అసూయగా ఉంది) -
AP: భద్రతా వలయంలో రైల్వేస్టేషన్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాటిచెట్టపాలెం(విశాఖ ఉత్తర)/కొత్తవలస రూరల్/ఆముదాలవలస: ‘అగ్నిపథ్’ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతా బలగాలు శనివారం పెద్దఎత్తున మోహరించాయి. రైల్వేస్టేషన్లతో పాటు పరిసర ప్రాంతాలను, రైలు పట్టాలను ఆక్టోపస్, ఆర్ఫీఎఫ్, జీఆర్పీ, సివిల్ పోలీసులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే రైల్వేస్టేషన్‌కు చేరుకునే మార్గాలను మూసివేశారు. శనివారం మధ్యాహ్నం వరకు రైల్వేస్టేషన్‌లోకి ఎవ్వరినీ అనుమతించలేదు. మధ్యాహ్నం నుంచి మాత్రం పలు రైళ్లు రాకపోకలు సాగించేందుకు రైల్వే వర్గాలు అనుమతించాయి. చదవండి: ప్రైవేటు అకాడమీల ‘డేంజర్ గేమ్’! కీలక అంశాలు వెలుగులోకి దీంతో హౌరా–యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, తిరుమల ఎక్స్‌ప్రెస్, గోదావరి తదితర రైళ్లు విశాఖ నుంచి బయల్దేరాయి. చెన్నై మెయిల్, హౌరా మెయిల్, బొకారో, వాస్కోడగామా, టాటా–యశ్వంత్‌పూర్, గుంటూరు–రాయగడ, తిరుచ్చి–హౌరా తదితర రైళ్లు మాత్రం విశాఖకు రాకుండా దువ్వాడ మీదుగా రాకపోకలు సాగించాయి. అంతకుముందు విజయవాడ మీదుగా విశాఖ రావాల్సిన పలు రైళ్లను అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో నిలిపివేశారు. గుంటూరు రైల్వేస్టేషన్ ముట్టడికి యత్నించిన ఆర్మీ అభ్యర్థులను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న దృశ్యం అలాగే హౌరా వైపు నుంచి విశాఖ రావాల్సిన మరికొన్ని రైళ్లను పెందుర్తి, కొత్తవలస స్టేషన్లలో నిలిపివేశారు. మరోవైపు 19వ తేదీన షాలిమార్‌లో బయల్దేరాల్సిన షాలిమార్–హైదరాబాద్(18045), గుంటూరు–విశాఖ(17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్, రాయగడ–విశాఖ(18527) ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే అధికారులు రద్దు చేశారు. శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేసేందుకు ప్రయతి్నంచగా.. డీఎస్పీ వాసుదేవరావు ఆధ్వర్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు ‘గుంటూరు రైల్వేస్టేషన్ ముట్టడి’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. గుంటూరులోని నెహ్రూనగర్ రైలు పట్టాల మీదుగా 20 మంది ఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్థులు నడుచుకుంటూ రావడాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే గుంటూరు రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఇద్దరు యువకులను తనిఖీ చేయగా.. వారి వద్ద ఉన్న ఫోన్లో ‘జస్టిస్ టూ ఆర్మీ’ అనే వాట్సాప్ గ్రూప్‌లో ఆందోళనలకు సంబంధించిన సమాచారం చేరవేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కడప, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వారిద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో మరో 40 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఆగిన ఊపిరి.. అగ్నిపథ్ ఆందోళనల వల్ల సమయానికి వైద్యమందక ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి మరణించారు. ఒడిశాలోని కలహండి జిల్లా నౌహుపాడకు చెందిన జోగేష్ బెహరా(70)కు గుండె సంబంధిత సమస్యలున్నాయి. విశాఖలో వైద్యం చేయించుకునేందుకు కోర్బా–విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరాడు. మరికొన్ని నిమిషాల్లో విశాఖ చేరుకుంటాడనగా.. అగ్నిపథ్ ఆందోళనల వల్ల రైలును శనివారం ఉదయం 10.45 గంటలకు విజయనగరం జిల్లా కొత్తవలసలో నిలిపివేశారు. ఆ తర్వాత కొంతసేపటికి జోగేష్ అస్వస్థతకు గురవ్వడంతో.. ఆయన్ని వెంటనే కొత్తవలస ఎస్ఐ హేమంత్ తన వాహనంలోనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
అగ్నిపథ్ ఆందోళనలు: ఏపీ ప్రభుత్వం అలర్ట్ (ఫొటోలు)
-
రైల్వే స్టేషన్ల వద్ద పటిష్ట భద్రత
సాక్షి, అమరావతి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఆందోళనలు, ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి రైల్వే స్టేషన్ల వద్ద అదనపు భద్రతా బలగాలను మోహరించారు. సైన్యంలో అగ్నిపథ్ కార్యక్రమం కింద నియామకాలను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌తో పాటు ఉత్తరాదిలో కొన్నిచోట్ల నిరసన కార్యక్రమాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. దీంతో రాష్ట్రంలో రైల్వే భద్రత దళం (ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) విభాగాలతో పాటు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద పోలీసు బందోబస్తును పటిష్టపరిచారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించిన డీజీపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి రైల్వే ఉన్నతాధికారులతోపాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ విభాగాల అధికారులతో శుక్రవారం సమీక్షించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధానంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం, అనకాపల్లి తదితర రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో ఆర్మీ ఉద్యోగాల పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలతో పోలీసు అధికారులు చర్చించారు. వారి వద్ద శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులెవరూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా అభ్యర్థులు తమ సమస్యలను ప్రభుత్వానికి శాంతియుతంగా విన్నవించుకోవాలన్నారు. అంతేగానీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాంటి వారు భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు కావడంతోపాటు కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. టికెట్లు చూపిస్తేనే స్టేషన్లోకి అనుమతి విజయవాడ రైల్వే స్టేషన్‌కు అదనంగా 200 మంది పోలీసులను తరలించారు. రైల్వే స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాలు, రైల్వే ట్రాక్‌ల వెంబడి పోలీసులను ఏర్పాటు చేశారు. టికెట్లు ఉన్నవారినే స్టేషన్లోకి అనుమతిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాతో పాటు పలువురు పోలీస్ అధికారులు రైల్వే స్టేషన్ వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. విజయవాడ డీఆర్ఎం శివేంద్రమోహన్ రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తిరుపతి, విశాఖపట్నం రైల్వే స్టేషన్ల వద్ద కూడా అదనంగా వందమంది చొప్పున రాష్ట్ర పోలీసులను మోహరించారు. వాల్తేర్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్లలో, రైల్వే కాలనీలు, కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ రైల్వే అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా రైల్వే, పోలీస్ యంత్రాంగాలు జాగ్రత్తలు తీసుకున్నాయి. సికింద్రాబాద్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో విజయవాడ మీదుగా ప్రయాణించాల్సిన 28 రైళ్లను పూర్తిగా, 19 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మరో 8 రైళ్లను దారి మళ్లించగా, రెండు రైళ్లను రీషెడ్యూల్ చేశారు. ప్రయాణికుల సమాచారం కోసం విజయవాడ రైల్వే స్టేషన్లో 0866–2767055 నంబర్‌తో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపులో ఉంది రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అభ్యర్థులు, యువకులు ఎవరూ దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని కోరుతున్నాం. పోలీసు ఆంక్షలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ -
ప్రభుత్వ ఆస్తుల జోలికి వెళ్తే కఠిన చర్యలు: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
సాక్షి, విజయవాడ: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. తాజాగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిఘా వర్గాల సమాచారం మేరకు.. ప్రధాన రైల్వేస్టేషన్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ, గుంటూరు, అనకాపల్లి, విశాఖపట్నం, తిరుపతిలో హైసెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరిస్థితులను సమీక్షించుకుంటూ రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుంటూ పలు చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. రైళ్లలో అనుమానితులను అదుపులోకి తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆస్తుల జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు కేసుల్లో ఇరుక్కుంటే అనంతరం ఏ ఉద్యోగమూ రాదంటూ వార్నింగ్ ఇచ్చారు. అబద్ధపు ప్రచారాలు, పుకార్లు పుట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది కూడా చదవండి: ఎక్కడికక్కడ ఆందోళనకారులు అరెస్ట్ -
రూ.600 కోట్లతో 3 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు రైల్వేస్టేషన్లను మల్టీమోడల్ రైల్వేస్టేషన్లుగా అభివృద్ధి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. విజయవాడ, నెల్లూరు, తిరుపతి రైల్వేస్టేషన్లను అందుకోసం ఎంపిక చేసింది. మొదట పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని రైల్వేశాఖ భావించింది. కానీ ప్రైవేటు సంస్థల నుంచి ఆశించినస్థాయిలో స్పందన లేకపోవడంతో సొంత నిధులతో వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రాథమిక నివేదికను ఇటీవల ఆమోదించింది. వీటి అభివృద్ధికి రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించింది. దీనిపై రైల్వే డెవలప్మెంట్ కార్పొరేషన్ తుది ఆమోదం తెలిపితే తదుపరి ప్రక్రియను చేపట్టాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు. వచ్చే మార్చి నాటికి అభివృద్ధి పనులు పూర్తిచేయాలని భావిస్తున్నామని రైల్వే వర్గాలు తెలిపాయి. ఆధునికీకరణ, వసతులకు ప్రాధాన్యం గతంలో పీపీపీ విధానంలో అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మల్టీప్లెక్స్‌లు, మాల్స్, రెస్టారెంట్లు, ఇండోర్ గేమ్స్ మొదలైన ప్రాజెక్టులు ఉండేవి. కానీ ప్రస్తుతం రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి ప్రణాళికను ఖరారు చేసింది. ప్రధానంగా రైల్వేస్టేషన్లకు కొత్తరూపు ఇవ్వడం, ప్రయాణికుల వసతులు మెరుగుపరచడం వంటి పనులతోపాటు భద్రతకు ప్రాధాన్యమివ్వనున్నారు. అందుకోసం ప్రయాణికులకు వసతులు, ఇంటర్‌మోడల్ కనెక్టివిటీ, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ, ఆహ్లాదకర అంశాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, రైల్వే సమాచార వ్వవస్థ అనే ఆరు కేటగిరీల కింద అభివృద్ధి చేయనున్నారు. రైల్వే స్టేషన్లలో కల్పించనున్న వసతులు ► ప్రాంత విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించేలా రైల్వేస్టేషన్‌కు కొత్తరూపు తీసుకొస్తారు. ► రైల్వేస్టేషన్ ప్రాంగణాన్ని ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టంతో అనుసంధానిస్తారు. సీసీ కెమెరాలు, లగేజీ స్కానింగ్ వ్యవస్థ, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటుతోపాటు రద్దీకి అనుగుణంగా భద్రతా సిబ్బందిని నియమిస్తారు. రైల్వేస్టేషన్ ప్రాంగణాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను వేర్వేరుగా ఏర్పాటు చేస్తారు. ► స్టేషన్లోనే ఇంటర్ఫేసెస్, స్వైపింగ్ టికెట్ మెషిన్లు, డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటు. ► అన్ని ప్లాట్‌ఫామ్‌లపై ఎస్కలేటర్లు, ప్రధాన ద్వారం వద్ద తగినన్ని ఎలివేటర్లను ఏర్పాటు చేస్తారు. బ్యాటరీ వాహనాలను అందుబాటులో ఉంచుతారు. ► ఇంటర్‌మోడల్ కనెక్టివిటీ కారిడార్ ఏర్పాటు చేస్తారు. రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే సిటీ బస్సులు, ట్యాక్సీలు, ఆటోరిక్షాల కోసం మల్టీమోడల్ ట్రాన్సిట్ హబ్‌ను నెలకొల్పుతారు. ప్రయాణికులు రైల్వేస్టేషన్ నుంచి ఆ ప్రత్యేక మార్గంలో బయటకు వచ్చి బస్‌స్టేషన్, విమానాశ్రయంతోపాటు ప్రధాన ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. విశాలమైన పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తారు. ► రైల్వేస్టేషన్లో ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు ఏర్పాటు చేస్తారు. ప్లాట్‌ఫాంలను విశాలంగా తీర్చిదిద్దుతారు. ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతారు. మందుల దుకాణాలు, రిటైల్ దుకాణాలు, ఏటీఎంలు మొదలైనవి ఏర్పాటు చేస్తారు. -
యుద్ధమేదైనా.. అదే దృశ్యం!
కురుస్తున్న అగ్నిగోళాలు, కూలిపోతున్న నివాస స్థలాలు, జూడో ఫైటర్ పుతిన్ భద్ర సమాజంపై విసరుతున్న పంచ్‌లు.. యుద్ధాన్ని ఆపలేని జెలెన్స్కీ విదూషక ప్రసంగాలు. ‘చమురు’ గొంతులో ఇరుక్కుని మాట్లాడలేని మౌన ప్రేక్షక దేశాలు.. ఇవి మాత్రమే యుద్ధ చిత్రాలు కాదు. .. కొన్ని తరాలైనా కోలుకోలేని జీవన విధ్వంసం అసలు యుద్ధ రూపం. పిల్లలను పొదువుకుని పరుగెత్తే తల్లులు, పొలిమేరల్లో లైంగికదాడుల్లో ఆడబిడ్డల ఆక్రందనలు. రహదారులపై అన్నదమ్ముల శవాలు. ఇదీ అసలు రూపం.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధమొక్కటే కాదు. ఏ యుద్ధమైనా అంతే. కురుక్షేత్రానికి ఆజ్యం పోసిన ‘శకుని’, ప్రపంచ యుద్ధాలకు కారణమయ్యే ‘హిట్లర్’ లాంటి వాళ్లు మానవ నాగరికతకు సమాధి లాంటి ‘బంకర్ల’లోనే ఆకలితో, అవమానంతో, ఆగ్రహంతో ఊపిరిపోసుకుంటారు. ఏ యుద్ధమైనా.. మరో యుద్ధానికి, మారణ హోమానికి నాంది అవుతుంది. యుద్ధమెక్కడైనా నష్టం అందరికీ.. యుద్ధమంటే ఓ దేశం మరో దేశంపై చేసే దాడి మాత్రమే కాదు. ఆ రెండు దేశాలే నష్టపోవు. ప్రపంచ దేశాలన్నీ వివిధ అవసరాల కోసం ఒకదానిపై ఒక టి ఆధారపడిన క్రమంలో.. చాలా దేశాల్లో, లక్షల మంది ప్రజలపై ప్రభావం పడుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా దాడి, రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షల ప్రభావం చాలా దేశాలపై పడింది. మన దేశాన్నే చూసుకుంటే.. పెట్రోలియం ఉత్పత్తులు, వంట నూనెలు సహా చాలా సరుకుల ధరలు పెరిగాయి. విద్య, ఉపాధి అవకాశాలపైనా ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, తిరుగుబాట్లతో ఒక్క 2021వ సంవత్సరంలోనే రూ. 1,09,32,98,40,00,00,000–పదికోట్ల 93 లక్షల 29 వేల 840 కోట్లు (14.4 ట్రిలియన్ డాలర్లు) ఆర్థిక నష్టం జరిగినట్టు ‘ఎకనమిక్ వ్యాల్యూ ఆఫ్ పీస్ రిపోర్ట్’ అంచనా. కోట్ల ప్రాణాలు గాలికి.. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అంతర్యుద్ధాలు, వాటి పర్యవసనాల ఫలితంగా కోట్లాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతో మంది అవయవాలు కోల్పోయి, ఆరోగ్యం దెబ్బతిని జీవచ్ఛవాలుగా మారారు. ఇప్పటికే ఇలాంటి పరిస్థితులతో ఏటా సగటున లక్ష మందికిపైనే చనిపోతు న్నట్టు ఐక్యరాజ్యసమితి పేర్కొనడం గమనార్హం. మొదటి ప్రపంచ యుద్ధంలో గాయాలు, రోగాల వల్ల రెండుకోట్ల మంది సైనికులు, కోటిన్నర మంది ప్రజలు మరణించినట్టు అంచనా. 1937–45 మధ్య జరిగిన చైనా–జపాన్ యుద్ధంలో రెండుకోట్ల మందికిపైగా చనిపోయారు. ఒక్క రెండో ప్రపంచ యుద్ధంలోనే 8.5 కోట్ల మంది చనిపోయినట్టు అంచనా. అందులో దాదాపు 80 శాతం అంటే ఆరున్నర కోట్ల మం దికిపైగా రష్యా, చైనా, జర్మనీ, పోలాండ్ దేశాలకు చెందినవారేనని నిపుణులు చెప్తున్నారు. ఇండియా సైనికులు, పౌరులు కలిపి 15 లక్షల మంది వరకు మరణించినట్టు అంచనా. 1950–53 మధ్య ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య జరిగిన యుద్ధంలో 45 లక్షల మంది చనిపోయారు. 1979–89 మధ్య సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధంలో 20 లక్షల మంది, 1998–2003 మధ్య జరిగిన రెండో కాంగో వార్‌లో 54 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నట్టు అంచనా. గత 20 ఏళ్లలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా అంతర్యుద్ధం వంటివాటిల్లోనూ లక్షల మంది చనిపోయారు. అంతా అతలాకుతలం.. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, అంతర్యుద్ధం చెలరేగినా.. అమాయక ప్రజలకే ముప్పు. అప్పటిదాకా హాయిగా బతుకుతున్న వారి జీవితాలు ఒక్కసారిగా తలకిందులైపోతాయి. ఐదేళ్ల కింద సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (సీఏఆర్)లో ఓ స్వచ్చంద సంస్థ బాధితుల అనుభవాలు, దుస్థితిని పట్టి చూపింది. ఊరిపెద్దగా ఉండి అడుక్కునే దశకు.. ఆయన పేరు ఆల్బర్ట్.. సీఏఆర్లోని ఔకా ప్రాంతంలో ఓ గ్రామ పెద్ద. కాఫీ పండిస్తూ.. కుటుంబంతో సంతోషంగా బతికేవాడు. కానీ 2014లో ఓ రోజు రాత్రి తిరుగుబాటు దళాలు చేసిన దాడిలో ఆ గ్రామం నాశనమైంది. ఆల్బర్ట్ కుడి చెయ్యి తెగిపోయింది. అతను సహా ఊరిలోని వాళ్లంతా కాంగోకు వలస వెళ్లారు. అప్పటిదాకా నలుగురికి సాయం చేసిన ఆల్బర్ట్.. ఏ పనీ చేసుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక.. చివరికి భిక్షమెత్తుకునే దుస్థితికి చేరాడు. పిల్లలకు పీడకలే.. యుద్ధాలు, అంతర్యుద్ధాలతో అన్నెంపున్నెం ఎరుగని చిన్నారుల బతుకు, భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నాయి దేశాలు, మిలీషియా దళాలు పిల్లలను బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటున్నాయి. విద్యాసంస్థలపై దాడులు, పిల్లల కిడ్నాప్‌లు, చంపడం, బాలికలపై అత్యాచారాలు వంటివీ పెరిగాయి. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కు చెందిన బిట్రీస్ అనే మహిళ భర్త మిలీషియా దాడుల్లో చనిపోయాడు. ఆరేళ్ల కింద కొడుకుతో కాంగోకు పారిపోయింది. శరణార్థుల క్యాంపులో దుర్భర పరిస్థితిలో బతుకుతోంది. ‘‘సరిగా తిండి లేదు. ఏ సౌకర్యాలూ లేవు. అంతా స్వార్థంతో బతుకుతున్నారు. ఈ వాతావరణంలో పెరుగుతున్న నా కొడు కు భవిష్యత్తు ఏమవుతుందో’’నని ఆమె వాపోయింది. యుద్ధ విమానాల దాడిలో ధ్వంసమైన డ్రెస్డెన్ నగరం మధ్య చిన్న గుట్టలా కుప్పపోసి ఉన్న మృతదేహాలివి. రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన దారుణ జన హననానికి ఈ ఫొటో చిహ్నంగా నిలిచింది. జర్మన్ నాజీలు యూదులను, ఇతర దేశస్తులను ఊచకోత కోస్తుంటే.. వారిని రక్షించేందుకని జర్మనీపై దాడికి దిగిన మిత్రదేశాల (బ్రిటన్, అమెరికా తదితర దేశాల) సైన్యాలు.. 1945 ఫిబ్రవరిలో జర్మనీలోని డ్రెస్డెన్ నగరంలో పౌరులు, జనావాసాలపై విచక్షణా రహితంగా బాంబులు వేశాయి. అమెరికన్ సైనికులు తన కళ్ల ముందే తల్లిదండ్రులను కాల్చి చంపేయడం, తనకూ తీవ్రగాయాలవడంతో.. బాధతో రక్తమోడుతూ రోదిస్తున్నతో ఐదేళ్ల ఇరాకీ బాలిక ఈమె. ఇరాక్‌లో తిష్టవేసిన అమెరికా సైన్యాలు ఏర్పాటు చేసిన ఓ చెక్ పాయింట్ వద్ద 2005లో ఈ దారుణ విషాదం జరిగింది. 1937.. చైనాలో బాంబు దాడులతో కూలిపోయిన రైల్వేస్టేషన్.. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు.. తల్లిని కోల్పోయి, తీవ్రంగా గాయపడి గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారి.. 1937లో జరిగిన చైనా–జపాన్ యుద్ధంనాటి దారుణ పరిస్థితిని కళ్లకు కట్టే చిత్రమిది. చైనాలోని షాంఘై సౌత్ రైల్వేస్టేషన్‌పై జపాన్ వి«ధ్వంసక దాడి ఫలితం. 2022.. ఉక్రెయిన్‌లో ఉక్రెయిన్‌లోని రైల్వేస్టేషన్‌పై మొన్నటి శుక్రవారం రష్యా చేసిన మిస్సైల్ దాడిలో తీవ్రంగా గాయపడి రొదిస్తున్న మహిళ ఈమె. రష్యా దాడులతో సృష్టిస్తున్న విధ్వంసం నుంచి తప్పించుకుని మరోచోటికి వెళ్లిపోదామనుకున్న 52 మంది ఈ దాడిలో ప్రాణాలు వదిలారు. మరెందరో క్షతగాత్రులుగా మిగిలారు. .. ఒకటా.. రెండా.. ఇలాంటివి మరెన్నో. అసలేం జరుగుతోంది? తప్పెవరిదో.. ఒప్పెవరిదో.. ఏ దేశమైతేనేం.. ఎవరిపై యుద్ధం చేస్తేనేం.. జరిగేదంతా వినాశనం, విధ్వంసం, జన హననమే. ఎప్పుడో 19వ శతాబ్దంలో దేశాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు, ప్రపంచ యుద్ధాల నుంచి నేడు ఉక్రెయిన్‌పై రష్యా దాడి దాకా.. యుద్ధోన్మాదం సృష్టిస్తున్న బీభత్సం ఇంతా అంతా కాదు. ఇంకా గుణపాఠాలు నేర్చేదెప్పుడు? – సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
రైల్వే ప్రయాణీకులకు అదిరిపోయే శుభవార్త..!
భారతీయ రైల్వే ప్రయాణీకులకు ఒక మంచి శుభవార్త తెలిపింది. ఇప్పటికే రైల్వే స్టేషన్లలో ఉచిత బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తున్న భారతీయ రైల్వే, ఇప్పుడు మరిన్ని సేవలను అందించేందుకు సిద్దం అయ్యింది. రైల్వే ప్రయాణీకులు రైల్వే స్టేషన్లలో పాన్, ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఒక కొత్త సేవను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రైల్ వైర్ సాథి కియోస్క్ పేరుతో ఈ కొత్త సేవలను అందించనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదట వారణాసి, ప్రయాగ్‌రాజ్ సిటీ రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్లను జనవరిలో రైల్వేశాఖ ప్రారంభించింది. ఇప్పుడు దేశం మెుత్తం ఈ సేవలను విస్తరించే ఆలోచనలో ఉంది. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు రైల్ వైర్ సాథి కియోస్క్ కేంద్రాల వద్ద ఆధార్ కార్డు, పాన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే టికెట్ బుకింగ్, ఓటరు కార్డు, మొబైల్ రీచార్జ్, రైలు, విమాన, బస్సు టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ కేంద్రాలలో ఆదాయపు పన్ను, బ్యాంకింగ్, బీమా సంబంధించి పనులకు ఇక్కడే పూర్తి చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ సదుపాయంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎక్కువ లాభం చేకూరనుంది. ఇంటర్నెట్ సదుపాయ లేని మారుమూల ప్రాంత ప్రజలు ఆధార్, పాన్ కార్డు సేవలను పొందడం మరింత సులభం కానుంది. దేశవ్యాప్తంగా 200 స్టేషన్లలో ఈ ప్రత్యేక సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొంది. (చదవండి: అదిరిపోయిన రెనాల్ట్ కొత్త హైబ్రిడ్ కారు.. మైలేజ్ కూడా చాలా ఎక్కువే..!) -
సొంత నిధులతోనే రైల్వే స్టేషన్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో రాష్ట్రంలో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలిచినా.. ఆశించిన స్పందన రాకపోవడంతో సొంత నిధులతోనే పనులు చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా దాదాపు 50కుపైగా రైల్వే స్టేషన్లను పీపీపీ విధానం కింద ప్రైవేటు సంస్థలకు 90 ఏళ్ల పాటు అప్పగించాలని సూత్రప్రాయంగా గతంలో నిర్ణయించారు. ఆ జాబితాలో ఏపీలోని విజయవాడ, నెల్లూరు, తిరుపతి రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. రైల్వే స్టేషన్లలో మల్టీప్లెక్స్‌లు, మాల్స్, రెస్టారెంట్లు, పలు రకాల ఇండోర్ గేమ్స్ అందుబాటులోకి తేవాలని ప్రతిపాదించారు. దీనిపై అప్పట్లోనే తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినప్పటికీ రైల్వే శాఖ పట్టించు కోలేదు. మొదటగా నెల్లూరు, తిరుపతి రైల్వే స్టేషన్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టింది. కానీ రైల్వే శాఖ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. మొదటి రెండు అంతస్తులు రైల్వే శాఖకు అప్పగించి మిగిలిన అంతస్తుల్లో వాణిజ్య సముదాయాల నిర్వహణ లాభసాటి కాదని ప్రైవేటు సంస్థలు భావించాయి. పైగా రైల్వే శాఖ కనీస బిడ్ ధర కూడా చాలా ఎక్కువుగా నిర్ణయించడంతోపాటు ఇతర షరతులు కూడా సానుకూలంగా లేవన్న అభిప్రాయం వ్యక్తమైంది. కొన్ని బడా కార్పొరేట్ సంస్థలతో రైల్వే శాఖ సంప్రదింపులు కూడా జరిపినా ఫలితం దక్కలేదు. నగరాల్లో ప్రధాన కూడళ్లలో కాకుండా కొంచెం దూరంగా ఉండే రైల్వే స్టేషన్ల ప్రాంగణంలో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌ల నిర్మాణం లాభసాటి కాదని కూడా ఆ ప్రైవేటు సంస్థలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దాంతో రైల్వే శాఖ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. రైల్వే స్టేషన్లను తమ నిధులతోనే అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అభివృద్ధి ప్రణాళికకు ఆమోదం రాష్ట్రంలోని నెల్లూరు, తిరుపతి రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ నిధులతోనే అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికను తాజాగా ఆమోదించారు. దాదాపు రూ. 300 కోట్లతో వీటిని అభివృద్ధి చేయనున్నారు. ప్రైవేటు సంస్థలతో పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు గతంలో రూపొందించిన ప్రణాళిక దీనికి వర్తించదని కూడా రైల్వే శాఖ స్పష్టం చేసింది. వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా కాకుండా ప్రయాణికులకు అధునాతన సౌకర్యాల కోణంలోనే రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించమని రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వేను ఆదేశించింది. డీపీఆర్ ఖరారైన తరువాత రైల్వే స్టేషన్ల అభివృద్ధి ప్రణాళిక ఓ కొలిక్కి వస్తుందని రైల్వే శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
చుక్..చుక్.. చిత్రాలెన్నో ! మారిన రైల్వేస్టేషన్ రూపు రేఖలు
సాక్క్షి, హైదరాబాద్(శేరిలింగంపల్లి): నగర శివారులోనే అతిపెద్దది అయిన లింగంపల్లి రైల్వేస్టేషన్ ఒకప్పుడు కళాహీనంగా ఉండేంది. నిత్యం ప్రయాణికులతో కళగా ఉండే ఈ స్టేషన్ ఇప్పుడు అభివృద్ధికి నోచుకుంది. స్టేషన్‌లోని గోడలకు వేసిన వివిధ చిత్రాలు వచ్చిపోయే ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. చిత్రం చెప్పే అర్థం.. జంతువులు..పక్షులు..పర్యావరణం..స్వచ్ఛభారత్..ఇలా ఎన్నెన్నో చిత్రాలు కొలువుదీరాయి. రైల్వేస్టేషన్‌లోని ప్రతి గోడకు రకరకాల జంతువులు, పక్షులతోపాటు రాజుల కాలం నాటి వైభవాన్ని ప్రతిబింబించేలా ఆకట్టుకుంటున్నాయి. పులి, ఏనుగు, నెమలి, ఇతర పక్షుల చిత్రాలు అలరిస్తున్నాయి. గ్రామీణ వాతావరణంతోపాటు జలపాతాలు, పడవలు, సూర్యుడు ఉదయించే దృశ్యాలు ఇలా ఎన్నో చిత్రాలు ప్రయాణికుల హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. శివారులోనే అతిపెద్దది నగర శివారులోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా లింగంపల్లి స్టేషన్‌కు గుర్తింపు ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు ఇక్కడి నుంచే సాగుతాయి. పలు కొత్త రైళ్లు కూడా ఇక్కడి నుంచే ఆరంభించాలనే ఆలోచన కూడా ఉంది. ఎంఎంటీఎస్ ఇక్కడి నుంచే... ఎంఎంటీఎస్ రైళ్లను నగరంలోని నాంపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాలకు ఇక్కడి నుంచే బయలుదేరతాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐటీ కారిడార్‌కు కేంద్రంగా ఈ ప్రాంతం మారడంతో రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. పలు ఐటీ సంస్థలు తమ సంస్థ ఉద్యోగుల కోసం లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు ప్రత్యేక బస్సులు, ఇతర వాహనాలు సైతం నడుపుతున్నాయి. నగర శివారులోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా లింగంపల్లి స్టేషన్ అభివృద్ధికి నోచుకుంది -
రైలు ప్రమాదాల నివారణకు ‘కవచ్’
సాక్షి, అమరావతి: రైళ్లు పరస్పరం ఢీకొనే ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు రైల్వే శాఖ ఆధునిక సాంకేతిక రక్షణాత్మక వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. రెండు రైళ్లు ఒకేసారి ట్రాక్ మీదకు వచ్చి ఢీకొనడం తీవ్ర ప్రమాదాలకు దారి తీస్తోంది. దీన్ని నివారించేందుకు ‘కవచ్’ పేరుతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రధానంగా సిగ్నలింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. దేశంలో 2 వేల కిలోమీటర్ల మేర రైలు మార్గాల్లో ‘కవచ్’ విధానాన్ని ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వెల్లడించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోఅభివృద్ధి చేసిన కవచ్ విధానంతో రైళ్లు పరస్పరం ఢీకొనడాన్ని పూర్తిగా నివారించవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపితమైంది. వేగం తగ్గించకుండానే.. ప్రస్తుతం రైళ్ల డ్రైవర్లు ఏదైనా రైల్వే స్టేషన్ రాగానే రైళ్ల వేగాన్ని తగ్గిస్తుంటారు. ఆ స్టేషన్లో రైలు నిలపాల్సిన అవసరం లేకపోయినా సరే రైళ్ల వేగాన్ని తగ్గిస్తున్నారు. పొరపాటున ఎదురుగా ఏదైనా రైలు వస్తుందేమోనని ముందు జాగ్రత్తగా వేగాన్ని తగ్గిస్తారు. మళ్లీ వేగం పుంజుకునేందుకు కొంత సమయం పడుతుంది. దాంతో రైళ్లు తగిన వేగంతో ప్రయాణించడం సాధ్యపడటం లేదు. కవచ్ పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టిన తరువాత ఆ విధంగా నిలపాల్సిన అవసరం లేని రైల్వే స్టేషన్లు సమీపించగానే రైళ్ల వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉండదు. దాంతో రైళ్లు గమ్యస్థానాలకు త్వరగా చేరేందుకు అవకాశం ఉంటుంది. విజయవంతంగా ప్రయోగం రైల్వే శాఖ కవచ్ వ్యవస్థను ఇప్పటికే విజయవంతంగా పరీక్షించింది. భారత దేశంలో రైళ్లు ఢీకొన్న ప్రమాదాలను విశ్లేషించగా 89 శాతం ప్రమాదాలు మానవ తప్పిదంతోనే సంభవించాయని వెల్లడైంది. దాంతో శాస్త్రీయంగా అధ్యయనం చేసి యాంటీ కొల్లీషన్ పరికరాలను రైల్వే శాఖ రూపొందించింది. ఈ పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా కొంకణ్ రైల్వే పరిధిలో పరీక్షించారు. అనంతరం ఈశాన్య రైల్వే పరిధిలోనూ ప్రవేశపెట్టారు. ఆ రెండుచోట్లా ఈ వ్యవస్థ పూర్తిగా విజయవంతమైంది. దాంతో ఈ వ్యవస్థకు ‘కవచ్’ అనే పేరుపెట్టి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. మొదటి దశలో దేశంలో 2వేల కిలోమీటర్ల మేర లైన్లలో కవచ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్రధానంగా మెట్రో నగరాలను కలుపుతూ ఉన్న లైన్లలో వీటిని ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. చెన్నై–కోల్‌కతా మార్గంలో కూడా వీటిని ప్రవేశపెట్టనున్నారని సమాచారం. కవచ్ వ్యవస్థ ఇలా.. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో కవచ్ వ్యవస్థను రైల్వే శాఖ సిద్ధం చేసింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందించిన ఈ వ్యవస్థకు ఎస్ఐఎల్–4 సర్టిఫికేషన్ కూడా రావడం విశేషం. ఈ పరిజ్ఞానాన్ని ఏర్పరచడంలో భాగంగా మైక్రో ప్రాసెసర్లు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్), యాంటీ కొల్లీషన్ పరికరాలను రైళ్లలో ఏర్పాటు చేస్తారు. రైల్వే ట్రాక్‌లను కూడా ఈ పరిజ్ఞానంతో అనుసంధానిస్తారు. ఇస్రో ఉపగ్రహాల నుంచి ఈ పరికరాలు సిగ్నల్స్‌ను స్వీకరిస్తాయి. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు ఒకేసారి పొరపాటున వస్తే మోడెమ్ సహాయంతో ఆటోమేటిగ్గా ఆ రెండు రైళ్లకు పరస్పరం సమాచారం చేరుతుంది. ఒక రైలు ప్రయాణిస్తున్న మార్గంలోనే మరో రైలు కూడా ఎదురుగా వస్తుంటే.. నిర్ణీత దూరంలో ఉండగానే ఈ పరికరాల ద్వారా వెంటనే గుర్తించడం సాధ్యపడుతుంది. దాంతో వెంటనే రైలులో ఆటోమేటిక్ బ్రేకులు పడి రైలు నిలిచిపోతుంది. ఈ పరికరాలు మానవ తప్పిదాలను కూడా గుర్తించి నివారించేందుకు దోహదపడతాయి. -
సికింద్రాబాద్ స్టేషన్‌కు.. ఎయిర్‌పోర్టు లుక్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో, విమానా శ్రయాల స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఎట్టకేలకు పట్టాలెక్కబోతోంది. కేంద్రం గతంలోనే ఈ ప్రతిపాదన చేసినా.. ఇండియన్ రైల్వేస్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్ఎస్ డీసీ)ని ఏర్పాటు చేసినా కార్యరూపంలోకి రాలేదు. ఐఆర్ఎస్డీసీని రద్దు చేసి ఈ బాధ్యతను రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ)కు అప్పగించినా అడుగు ముందుకు పడలేదు. చివరికి బాధ్య తను జోన్ల అధికారులకు కట్టబెట్టారు. తాజా బడ్జెట్లో దక్షిణ మధ్యరైల్వే పరిధిలో స్టేషన్ల అభివృ ద్ధికి రూ.325 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో రాష్ట్రంలోని సికింద్రాబాద్ స్టేషన్‌తోపాటు ఏపీలోని నెల్లూరు, తిరుపతి స్టేషన్లను తీర్చిదిద్దనున్నారు. త్వరలోనే టెండర్లు.. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి కోసం దక్షిణమధ్య రైల్వే త్వరలోనే ఈపీసీ టెండర్లు పిలవనుంది. స్టేషన్లో పార్కింగ్ మొదలు, రైలు ఎక్కేవరకు అడుగడుగునా అంతర్జాతీయ స్థాయి వసతులను ఏర్పాటు చేస్తారు. విమానాశ్రయంలో ఉన్న తరహాలో ఆధునిక ఏర్పాట్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు వంటివీ ఉంటాయి. ఈ మేరకు భవనాన్ని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుతారు. ఈ పనులకు నెల రోజుల్లో టెండర్లు పిలిచి, మూడు నెలల్లోపు వర్క్ ఆర్డర్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ వెంటనే పనులు మొదలుకానున్నాయి. -
రైల్వేస్టేషన్లలో అదనపు బాదుడుకు ప్లాన్! రైలెక్కినా దిగినా రూ.10 నుంచి 50?
న్యూఢిల్లీ: దేశంలోని పలు రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మార్చేసి అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని మనం మురిసిపోతున్నాం కానీ, ఆ మౌలిక సదుపాయాలకయ్యే ఖర్చుని ప్రయాణికులపై బాదడానికి రైల్వే శాఖ సన్నద్ధమైంది. ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లలో రైలు ఎక్కాలన్నా, దిగాలన్నా ప్రయాణికుల జేబుకి ఇక చిల్లు పడడం ఖాయం. ఈ స్టేషన్లలో లెవీ ఫీజు వసూలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా రైల్వే శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. ఆయా స్టేషన్లు వినియోగంలోకి వచ్చిన తర్వాత ఈ ఫీజులు వసూలు చేస్తామని చెప్పారు. మోదీ చిన్నతనంలో టీ అమ్మిన స్టేషన్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ఫీజుని వారు ప్రయాణించే తరగతులని బట్టి రూ.10 నుంచి రూ.50 వరకు నిర్ణయించే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని టికెట్ బుక్ చేసుకునే సమయంలో అదనంగా వసూలు చేస్తారు. ఈ లెవీ ఫీజు మూడు కేటగిరీల్లో ఉంటుంది. ఏసీ తరగతుల్లో ప్రయాణించే వారి నుంచి రూ.50, స్లీపర్ క్లాసు ప్రయాణికులకు రూ.25, జనరల్ బోగీలలో ప్రయాణించే వారి నుంచి రూ.10 వసూలు చేయనున్నట్టుగా రైల్వే బోర్డు జారీ చేసిన సర్క్యులర్ వెల్లడించింది. ఆయా స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ధరని కూడా మరో 10 రూపాయలు పెంచనున్నారు. సబర్బన్ రైల్వే ప్రయాణాలకు మాత్రం ఈ లెవీ ఫీజులు ఉండవు. -
ఇకపై రైల్వే స్టేషన్లలో బిల్లులు కట్టొచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 200 రైల్వే స్టేషన్లలో మొబైల్ ఫోన్ రీచార్జ్, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఆధార్ కార్డు సంబంధ సేవలు, పాన్ కార్డు దరఖాస్తు, ట్యాక్స్ చెల్లింపులు తదితర సేవలు అందుబాటులోకి రానున్నాయి. రైలు, బస్సు, విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్, బీమా ఇలా రోజువారీ అవసరాలకు సంబంధించిన పలు సేవలను ఇకపై రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ) కియోస్క్‌ల ద్వారా అందిస్తారు. వీటికి ‘రైల్‌వైర్ సాథీ కియోస్క్’గా రైల్టెక్ నామకరణం చేసింది. ఈ కియోస్క్‌లను తొలి దశలో పైలట్ ప్రాజెక్ట్ కింద వారణాసి సిటీ, ప్రయాగ్‌రాజ్ సిటీ రైల్వే స్టేషన్లలో ప్రారంభిస్తారు. దశలవారీగా గ్రామీణ ప్రాంతాల్లోని 200 రైల్వేస్టేషన్లకు ఈ కియోస్క్ సేవలను విస్తరిస్తారు. దక్షిణ మధ్య రైల్వే జోన్లో 44, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 13, నార్త్ ఫ్రంటియర్ రైల్వేలో 20, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 13, వెస్టర్న్ రైల్వేలో 15, నార్తర్న్ రైల్వేలో 25, వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 12, నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 56 కియోస్క్‌లను ఏర్పాటుచేయనున్నారు. కొత్త కియోస్క్‌లను సీఎస్సీ ఇ–గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహిస్తాయని రైల్టెక్ తెలిపింది. భారతీయ రైల్వే, రైల్వే మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం కలిసి రైల్‌టెక్‌ను ఏర్పాటుచేశాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే కియోస్క్‌లను తెస్తున్నట్లు రైల్టెక్ సీఎండీ పునీత్ చావ్లా చెప్పారు. -
మరో రైల్వే స్టేషన్ పేరు మార్చేసిన యోగి ప్రభుత్వం.. ఇక నుంచి
లక్నో: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలోని ఝాన్సీ రైల్వే స్టేషన్‌ను.. వీరాంగణ లక్ష్మీబాయ్ రైల్వేస్టేషన్‌గా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై మరికొద్ది రోజుల్లో అధికారికంగా ఉత్వర్వులు వెలువడనున్నాయని ఝాన్సీ పీఆర్వో మనోజ్ సింగ్ తెలిపారు. దీనిపై ఇప్పటికే కేంద్రం నుంచి ఆమోదం కూడా లభించిందని తెలిపారు. ఈ మేరకు యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం, నిన్న(బుధవారం) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రైల్వేస్టేషన్ పేరు మార్పు ప్రతిపాదనలను యోగి ప్రభుత్వం మూడు నెలల క్రితం.. కేంద్ర హోంమంత్రిత్వశాఖకు పంపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా చట్టపరమైన అనుమతులు పూర్తయ్యాక.. అధికారికంగా రైల్వేస్టేషన్ కోడ్ మారుస్తామని ఝాన్సీ డీఆర్ఎం పీఆర్వో మనోజ్ సింగ్ తెలిపారు. ఇప్పటికే యోగి ప్రభుత్వం.. అలహాబాద్‌ను ప్రయాగ్ రాజ్‌గా, మొఘల్సరై రైల్వే స్టేషన్‌ను పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌గా, ఫైజాబాద్ రైల్వేస్టేషన్‌ను అయోధ్యకాంట్‌గా పేరు మారుస్తు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. उत्तर प्रदेश का 'झाँसी रेलवे स्टेशन' अब 'वीरांगना लक्ष्मीबाई रेलवे स्टेशन' के नाम से जाना जाएगा। — Yogi Adityanath (@myogiadityanath) December 29, 2021 చదవండి: కరెంట్ షాక్‌తో నలుగురు కాలేజీ ఉద్యోగుల దుర్మరణం -
బిగ్‌బీ బంగ్లా, మూడు రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపు కాల్ కలకలం
సాక్షి, ముంబై: వాణిజ్య రాజధాని ముంబైలో బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. ముంబైలోని మూడు ప్రముఖ రైల్వే స్టేషన్లలతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం వద్ద బాంబులు అమర్చినట్టు అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేయడంతో అధికారులు అప్రమత్తయ్యారు. రైల్వే స్టేషన్లతో పాటు బిగ్‌బీ నివాసంవద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ముమ్మర తనిఖీల అనంతరం అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముంబై పోలీసులు అందించిన సమాచారం ప్రకారం శుక్రవారం రాత్రి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్లతో పాటు జుహులోని నటుడు అమితాబ్ బచ్చన్ బంగ్లా వద్ద బాంబులు అమర్చినట్టు చెప్పాడు. వెంటనే స్పందించిన అధికారులు ఇతర రక్షణ సిబ్బందిని అలర్ట్ చేశారు. స్థానిక పోలీసు సిబ్బందితో పాటు రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, బాంబు స్క్వాడ్, జాగిలాల సాయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా పేలుడు పదార్థాలు, అనుమానిత వస్తువుల జాడ ఏదీ తమకు లభించలేదని, అయినా ముందు జాగ్రత్త చర్యగా ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఫోన్‌కాల్ ఎక్కడనుంచి వచ్చింది, ఎవరు చేశారన్న విషయంపై ఆరా తీస్తున్నామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్‌బియ్యం స్వాధీనం
సాక్షి, చెన్నై(తమిళనాడు): చెన్నై, కాంచీపురం జిల్లాలో వేర్వేరు చోట్ల అక్రమంగా తరలిస్తున్న మూడు టన్నుల రేషన్ బియాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై ఎగ్మూర్ రైల్వేస్టేషన్లో రేషన్‌బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టి.. ఐదవ ప్లాట్‌ఫాంలో ఉంచిన 10 బస్తాల రేషన్‌బియాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని ఒడిశాకు తరలించేందుకు య త్నించిన పులియాంతోపు ప్రాంతానికి చెందిన బాలాజీ గూండా చట్టం కింద అరెస్టు చేశారు. కాంచీపురంలో.. స్థానిక అరక్కోణం రోడ్డులో పోలీసులు మంగళ వారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈసమయంలో కాంచీపురానికి చెందిన సుదర్శన్ (35) బైక్‌లో రేషన్‌బియ్యం తీసుకెళుతున్నట్లు గుర్తించారు. అతడిచ్చిన సమాచారంతో ఇదేవ్యాపారం చేస్తున్న అతడి స్నేహితులు పార్తీబన్ (47), రాజేష్ (38ను కూడా అరెస్టు చేశారు. వీరు ఇతర రాష్ట్రాలకు తరలించడానికి రెండు టన్నుల రేషన్ బియ్యాన్ని దాచి ఉంచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరులో.. 3.5 టన్నులు సీజ్ తిరువళ్లూరు: గుమ్మిడిపూండీ నుంచి ఆంధ్రాకు తరలిస్తున్న 3.5 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌కు ఉపయోగించిన మినీలారీనీ సీజ్ చేసిన పోలీసులు, ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రహస్య సమాచారం మేరకు.. పుడ్‌సెల్ ఇన్పెక్టర్ మురుగన్ ఆధ్వర్యంలో ఎలావూర్ వద్ద పోలీసులు మంగళ వారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న మినీలారీని తనీఖీ చేశారు. అందులోని మూడున్నర టన్నుల రేషన్ బియాన్ని సీజ్ చేశారు. అనంతరం స్మగ్లింగ్‌కు ఉపయోగించిన మినీ లారీని సీజ్ చేశారు. నిందితులు తమిళనాడుకు చెందిన వీరమణి(29), కుమార్(31)గా గుర్తించారు. చదవండి: వాట్సప్ చూస్తోందని చెల్లిని చంపిన అన్న -
కరోనా ఎఫెక్ట్: భారత రైల్వే కీలక నిర్ణయం
దేశంలో కొద్దీ రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ పోతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా వెలుగులోకి వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించకపోవడం వల్లనే అని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులు మాస్కు ధరించకపోయిన, రైళ్లలో, స్టేషన్ లలో ఉమ్మివేసిన రూ.500 జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. ఆరు నెలల పాటు ఈ నిబంధన కొనసాగుతాయని రైల్వేశాఖ వెల్లడించింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా నిబందనలు పాటించాలని పేర్కొంది. వలస కార్మికులు దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో.. మళ్లీ లాక్డౌన్ విధిస్తారని భయంతో కార్మికులంతా మళ్లీ ఇళ్లకు పయనమవుతున్నారు. దీంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రయాణికులు మరలా వారివారి రాష్ట్రాలకు వెళ్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ కరోనా కట్టడికి ఈ చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే తమ స్వంత రాష్ట్రాలకు వస్తున్న కార్మికులకు ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. చదవండి: రెండోసారి మాస్క్ లేకపోతే రూ.10 వేల జరిమానా -
లాక్డౌన్ : వలస కార్మికుల గుండెల్లో ‘రైళ్లు’
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రెండో దశలో విస్తరిస్తుండటంతో వలస కార్మికులు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. అందుకే బతుకుజీవుడా అంటూ మళ్లీ సొంత ఊరి బాటపడుతున్నారు. కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా కరోనా విస్తరణ తీవ్ర స్థాయిలో ఉన్న మహారాష్త్రలో మళ్లీ పూర్తి లాక్డౌన్ విధిస్తారన్న భయం వారిని వెన్నాడుతోంది. అందుకే సొంతూళ్లకు వెళ్లిపోవడమే మంచిదని భావిస్తున్నారు. అన్ని రవాణా మార్గాలు మూసుకుపోకముందే తిరిగి సొంత రాష్ట్రాలకు బయల్దేరాలని ఆతృతపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ముంబై రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా కుర్లాలోని లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) వద్దకు వలస కార్మికుల భారీగా చేరుకుంటున్నారు. (భారీ ఊరట: మూడో వ్యాక్సిన్ అందుబాటులోకి) పెరుగుతున్న కరోనావైరస్ కేసుల మధ్య దేశ రాజధాని డిల్లీలో కూడా ఇదే సరిస్థితి నెలకొంది. గత ఏడాది విధించిన లాక్డౌన్ వెతలను తలచుకుని బెంబేలెత్తుతున్న వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు పయన మవుతున్నారు. మళ్లీ లాక్డౌన్ విధిస్తే, అన్ని రవాణా మార్గాలు మూసివేయడంతోపాటు పని దొరక్క తిండి గడవటం కష్టమని భావిస్తున్న చాలామంది కార్మికులు కుటుంబాలతో సహా దొరకిన వాహనాల్లో ఇళ్లకు పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులు చూస్తోంటే.. లాక్డౌన్ తప్పదు..అందుకే ఊరికి పోతున్నానని, తనకిక వేరే మార్గం లేదని లక్నోకు చెందిన గౌరీ శంకర్ శర్మ వాపోయారు. ఉత్తర ప్రదేశ్ బరేలీకి చెందిన వలస కార్మికుడు సునీల్ గుప్తాకి కూడా ఇదే ఆవేదన. మరోవైపు దేశంలో రెండో దశలో కరోనా వైరస్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. రోజు వారీ కేసుల సంఖ్య లక్షకు ఎక్కడా తగ్గడంలేదు. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24గంటల్లో 1,61,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (క్యా కరోనా: ఒకరా ఇద్దరా.. అందరిదీ అదే పరిస్థితి!) Delhi: Amid rising cases of COVID-19, migrant workers start returning to their native places; visuals from ISBT, Anand Vihar. "The rate at which the cases are rising makes it obvious that lockdown would be imposed. That is why I am going home," a labourer said yesterday. pic.twitter.com/8D2kfxQcfN — ANI (@ANI) April 13, 2021 #WATCH | Mumbai: Huge crowd of migrant workers arrive at Lokmanya Tilak Terminus (LTT) in Kurla pic.twitter.com/6zkz8xt0eE — ANI (@ANI) April 13, 2021 -
దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ
దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తున్నట్లు హిందుస్తాన్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆ రైల్వే స్టేషన్లలో ఎయిర్‌పోర్టు తరహా భద్రతా, మౌలిక సదుపాయాలను అందించాలని భారతీయ రైల్వే ఆలోచన చేస్తోంది. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగిన భారతీయ రైల్వే, 2019లో ప్రైవేట్-కంపెనీలను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య(పిపిపి) కింద కొన్ని స్టేషన్లను నడుపుటకు అనుమతి ఇచ్చింది. ఇప్పడు మరికొన్ని రైల్వే స్టేషన్లలో మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు, భద్రతాపరమైన వసతులు కల్పించేందుకు చూస్తుంది. ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఐఆర్ఎస్ డిసి) ఆ రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ భాద్యతలను పర్యవేక్షిస్తుంది. ఈ 90 రైల్వే స్టేషన్లలో భద్రతా, మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలనే దానిపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పిఎఫ్), అన్ని రైల్వే జోన్ల ప్రధాన చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ల నుంచి అభిప్రాయాలను కోరుతూ రైల్వే బోర్డు లేఖ రాసింది. ప్రస్తుతం విమానాశ్రయాలలో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సిఐఎస్ఎఫ్) మాదిరిగానే ఈ స్టేషన్లలో అలాంటి భద్రతా బలగాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని రైల్వే బోర్డు తన అభిప్రాయాన్ని తెలిపింది. అలాగే, ప్రైవేట్ సంస్థలే సీఐఎస్ఎఫ్ బలగాలకు వేతనాలు చెల్లించాలి. ప్రస్తుతం విమానాశ్రయాలలో ఉన్న భద్రతాపరమైన వ్యవస్థను ప్రైవేట్ స్టేషన్లలో అమలు చేయాలనీ బోర్డు చూస్తుంది. ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను మార్చి 15లోగా తెలపాలంటూ రైల్వే బోర్డు కోరింది. 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం కోసం బ్లూప్రింట్ రూపొందించడానికి ఒక కమిటీని 2019 అక్టోబర్‌లో ఏర్పాటు చేసింది. నాగ్‌పూర్, గ్వాలియర్, అమృత్ సర్, సబర్మతి, నెల్లూరు, పుదుచ్చేరి, డెహ్రాడూన్, తిరుపతి రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం బిడ్డింగ్ అర్హత ప్రక్రియను సెప్టెంబర్‌లో ప్రారంభించినట్లు గతేడాది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే గాంధీనగర్, హబీబ్‌గంజ్ వంటి స్టేషన్లలో పునరాభివృద్ధిపై పనులు ప్రారంభమయ్యాయి. ఆనంద్ విహార్, బిజ్వాసన్, చండీగఢ్ వంటి రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధికి కాంట్రాక్టులు ఇచ్చారు. రైల్వే పునరాభివృద్ధి చేస్తున్న స్టేషన్లలో రైలు ఛార్జీలపై అదనపు రుసుము వసూలు చేయాలనీ చూస్తుంది. ఇంకోవైపు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదట 12 ప్రైవేట్ రైళ్లు, 2027 నాటికి 151 రైళ్లను ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తుంది. చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్ -
ఇది చేస్తే రైల్వే స్టేషన్లలో ఎంతైనా వైఫై వాడొచ్చు
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేకు చెందిన బ్రాండ్‌బ్యాండ్, వీపీఎన్ సర్వీసెస్ కంపెనీ రైల్‌టెల్ దేశంలోని 4 వేల రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్ వైఫై సేవలను ప్రారంభించింది. ఇప్పటికే 5,950కి పైగా స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. వన్ టైమ్‌పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత ధ్రువీకరణతో ఎవరైనా సరే ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. తాజాగా విడుదల చేసిన ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకారం ప్రయాణికులు రోజుకు 30 నిమిషాల ఉచిత వైఫైను 1 ఎంబీపీఎస్ వేగంతో ఉపయోగించుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ వేగవంతమైన లేదా 34 ఎంబీపీఎస్ వేగం వరకు ఇంటర్నెట్ కోసం వినియోగదారులు నామమాత్రపు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 5 జీబీ డేటా చార్జీ రూ.10, 10 జీబీకి రూ.15 చార్జీ, అలాగే ఐదు రోజుల వ్యాలిడిటీతో 10 జీబీ చార్జీ రూ.20, 20 జీబీ చార్జీ రూ.30గా ఉన్నాయి. 10 రోజుల వ్యాలిడిటీతో 20 జీబీ చార్జీ రూ.40, 30 జీబీకి రూ.50, అదేవిధంగా 30 రోజుల వ్యాలిడిటీ ఉండే 60 జీబీకి రూ.70 చార్జీలున్నాయి. వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణమైన ప్లాన్స్‌ను ఎంచుకునేలా రూపొందించామని రైల్‌టెల్ సీఎండీ పునీత్ చావ్లా తెలిపారు. -
దక్షిణ మధ్య రైల్వేలో 31 రైల్వే స్టేషన్లు మూత!
సాక్షి, హైదరాబాద్: ఆదాయం లేని కొన్ని రైల్వే స్టేషన్లను మూసేయాలని, రోజులో ఒకట్రెండు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగే స్టేషన్లపై వేటు వేయాలని రైల్వే నిర్ణయించింది. ఆదాయం కంటే నిర్వహణ ఖర్చే అధికంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 31 స్టేషన్లు మూతపడనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో 16, హైదరాబాద్ డివిజన్ పరిధిలో 7 స్టేషన్లు ఉన్నాయి. గుంతకల్ డివిజన్ పరిధిలో 3, గుంటూరు డివిజన్ పరిధిలో 4, నాందేడ్ డివిజన్ పరిధిలో ఒకటి ఉన్నాయి. ఇవీ కారణాలు.. పెద్ద స్టేషన్లతో పాటు కొన్ని చిన్న చిన్న గ్రామాల్లో కూడా రైల్వే శాఖ చిన్న స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. ఈ స్టేషన్లలో స్టేషన్ మాస్టర్ ఉండరు. సిగ్నలింగ్ వ్యవస్థ కూడా ఉండదు. ఒక చిన్న గది, చిన్న బుకింగ్ సెంటర్ మాత్రమే ఉంటుంది. టికెట్లను కూడా ప్రైవేటు సిబ్బందే జారీ చేస్తుంది. వారు కూడా రోజులో కొంత సమయమే ఉండి టికెట్లు జారీ చేసి వెళ్లిపోతారు. ఒకటి లేదా రెండు ప్యాసింజర్ రైళ్లు అర నిమిషం ఆగి వెళ్లిపోతాయి. ఇలాంటి స్టేషన్లలో కొన్నింటికి పెద్దగా ప్రయాణికుల నుంచి స్పందన ఉండట్లేదని తాజాగా రైల్వే గుర్తించింది. సాధారణంగా సంవత్సరానికి రూ.5 లక్షల ఆదాయం, లేదా లక్ష మంది ప్రయాణికులు ఉంటే స్టేషన్‌ను నిర్వహిస్తారు. అంతకంటే తక్కువ నమోదవుతుంటే వాటి నిర్వహణ అనవసరమని రైల్వే భావిస్తుంది. -
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో 31 రైల్వేస్టేషన్లు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సరైన ఆదాయం, జనం రద్దీ లేని కారణంగా ఫిబ్రవరి 1 నుంచి 29 రైల్వేస్టేషన్లు మూసివేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. కాగా ఏప్రిల్ 1 నుంచి మరో రెండు స్టేషన్లు మూసివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ పరిధిలో 16, గుంతకల్ పరిధిలో 3, నాందేడ్‌లో 1, గుంటూరులో 4, హైదరాబాద్‌లో 7 స్టేషన్లు మూతపడనున్నాయి. -
కూతపెట్టిన రైళ్లు
సాక్షి, అమరావతి: దాదాపు 71 రోజుల తర్వాత రైళ్లు ప్రారంభం కావడంతో రాష్ట్రంలో ప్రధాన రైల్వేస్టేషన్లు సందడిగా మారాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రైల్వేస్టేషన్లకు చేరుకున్నారు. రైలు బయలుదేరే సమయానికి 90 నుంచి 120 నిమిషాల ముందే స్టేషన్‌కు చేరుకోవాలన్న నిబంధన మేరకు ముందే తరలివచ్చారు. స్టేషన్లలో ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా నేలపై గుర్తులు వేశారు. ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షల అనంతరం ఎటువంటి లక్షణాలు లేకుంటేనే లోపలికి పంపించారు. ప్రయాణం పూర్తయ్యేవరకు ప్రయాణికులు మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, రాజమండ్రి, కడప, గుంతకల్ ఇలా ప్రధాన స్టేషన్లన్నీ కళకళలాడాయి. ఈ నెల 29 నుంచి తత్కాల్ టికెట్లను కూడా జారీ చేయనున్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్ల నుంచి సోమవారం వివిధ ప్రాంతాలకు 9 రైళ్లు బయలుదేరాయి. ► హైరిస్క్ ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక పరీక్షలు చేసి వారం పాటు క్వారంటైన్‌కు తరలించారు. అనంతరం మరో వారం హోం క్వారంటైన్లో ఉండాలని నిబంధనలు విధించారు. ► చెన్నై, ముంబై, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్‌లను హైరిస్క్ ఉన్నవిగా గుర్తించారు. ► ఏపీ హెల్త్ ప్రొటోకాల్‌ను ప్రకటించిన 18 స్టేషన్లలో దిగే ప్రయాణికుల్లో ప్రతి కంపార్ట్మెంట్లో 5 శాతం మందికి స్వాబ్ పరీక్షలు నిర్వహించనున్నారు. 60 ఏళ్లు పైన చిన్నారులు, పదేళ్ల లోపు ఉన్నవారు, గర్భిణులు, అస్వస్థతకు గురైన వారిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌కు అనుమతిస్తున్నారు. వీరికి రైల్వే స్టేషన్లలోనే స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తారు. ► విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మెడికల్ ప్రొఫెషనల్స్‌కు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే.. వారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గుర్తించిన ల్యాబ్ నుంచి కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. 18 రైల్వేస్టేషన్లలోనే హాల్ట్ సోమవారం దేశవ్యాప్తంగా ప్రారంభమైన 200 ప్రత్యేక రైళ్లలో ఏపీ మీదుగా 22 రైళ్లు వెళుతున్నాయి. వీటికి 71 హాల్ట్లను ఇవ్వడంతో వీటన్నింటిలో ప్రయాణికులకు పరీక్షలు చేయడం కష్టం కాబట్టి 18 రైల్వేస్టేషన్లకు మాత్రమే హాల్ట్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని.. రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ యాదవ్‌కు లేఖ రాశారు. ఇందుకు సానుకూల స్పందన వచ్చింది. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, మంగళగిరి, కడప, గుంతకల్, ఆదోని, మంత్రాలయం, అనంతపురం, ఒంగోలు, నెల్లూరు, కుప్పం, రేణిగుంటల్లో మాత్రమే హాల్ట్ ఉంటుంది. ఏపీ మీదుగా నడిచిన 11 జతల (22) రైళ్లు ఇవే.. ► రెండు వైపులా నడిచే హైదరాబాద్–విశాఖపట్నం (గోదావరి ఎక్స్‌ప్రెస్), ► గుంటూరు–సికింద్రాబాద్ (గోల్కొండ), ► తిరుపతి–నిజాముద్దీన్ (రాయలసీమ), ► విశాఖ–న్యూఢిల్లీ (ఏపీ ఎక్స్‌ప్రెస్), ► ముంబై–భువనేశ్వర్ (కోణార్క్), ► ముంబై–బెంగళూరు (ఉద్యాన్), ► దాణాపూర్–బెంగళూరు (సంఘమిత్ర), ► హౌరా–సికింద్రాబాద్ (ఫలక్‌నుమా), ► హౌరా–యశ్వంత్‌పూర్ (దురంతో), ► న్యూఢిల్లీ–బెంగళూరు, న్యూఢిల్లీ–చెన్నై. -
52 రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లు
సాక్షి, అమరావతి: వచ్చే నెల 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 200 రైలు సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. ఆన్లైన్లో టిక్కెట్ల రిజర్వేషన్ కోసం ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా రైల్వే స్టేషన్లలోనూ కౌంటర్లు ప్రారంభించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏపీకి సంబంధించి 52 రైల్వే స్టేషన్లలో టిక్కెట్ కౌంటర్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆన్లైన్ రిజర్వేషన్లో ఉంచిన టిక్కెట్లు శుక్రవారం గంటల వ్యవధిలోనే అమ్ముడైపోయాయి. దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే 200 రైళ్లలో ఏపీకి, ఏపీ మీదుగా ప్రధానంగా ఐదు రైళ్లు వెళ్లనున్నాయి. టిక్కెట్ కన్ఫర్మ్ అయితేనే రైల్వే స్టేషన్లోకి అనుమతిస్తారు. ఈ రైళ్లకు జనరల్ బోగీలు ఉండవు. మొత్తం రిజర్వ్డ్ బోగీలతోనే నడుస్తాయి. ► సికింద్రాబాద్–గుంటూరు, సికింద్రాబాద్–హౌరాకు ప్రతి రోజూ రైళ్లను నడపనున్నారు. వీటికి ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంది. ► తిరుపతి–నిజాముద్దీన్ రైలుకు కూడా డిమాండ్ ఎక్కువగానే ఉంది. ► విశాఖ–న్యూ ఢిల్లీ, హౌరా–యశ్వంత్‌పూర్‌కు ఫాస్ట్ రైళ్లను నడపనున్నారు. ► ప్రత్యేక రైళ్లు నడిచే ప్రధాన స్టేషన్లలో టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ► అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యాన్ని 30 రోజులకు పెంచింది. ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్లను కూడా జారీ చేయనున్నట్టు తెలిపింది. ► ఇప్పటి వరకు రైలు బయలుదేరడానికి అరగంట ముందు చార్ట్‌ను విడుదల చేసేవారు. అయితే ఇప్పుడు నాలుగు గంటల ముందు మొదటి చార్ట్, రెండు గంటల ముందు రెండో చార్ట్‌ను విడుదల చేయనుంది. ► టికెట్లను ఇప్పుడు రిజర్వేషన్ కౌంటర్లు, పోస్టాఫీసులు, ఐఆర్సీటీసీ అధీకృత ఏజెంట్ల నుంచి కూడా బుక్ చేసుకోవచ్చని రైల్వే తెలిపింది. -
రూ.660 కోట్లతో తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: రైల్వే స్టేషన్ల రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో తిరుపతి, నెల్లూరు స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. రూ.660 కోట్లను వెచ్చించి మల్టీ మోడల్ ట్రాన్సిట్ హబ్‌లుగా ఈ రెండు స్టేషన్లను తీర్చి దిద్దనున్నారు. ఇందుకోసం రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) టెండర్లు ఆహ్వానించింది. ముందుగా నిర్మాణ సంస్థలకు అవగాహన కల్పించేందుకు ఆన్లైన్లో ప్రీ బిడ్ సమావేశాలు నిర్వహించగా జీఎంఆర్, ఒబెరాయ్, ఆంబియెన్స్, అదానీ గ్రూప్, గోద్రేజ్ ప్రాపర్టీస్, రిలయన్స్ ఇన్ఫ్రా, శోభా, బ్రిగేడ్, ఎంబసీ గ్రూప్ తదితర నిర్మాణ సంస్థలు పాల్గొన్నాయి. జూన్ రెండో వారంలో టెండర్లను ఆర్ఎల్డీఏ ఖరారు చేయనుంది. టెండర్లు ఖరారైన తర్వాత మూడేళ్లలోపు రీ డెవలప్మెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అభివృద్ధి చేసి నిర్వహణకు 60 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో షాపింగ్, సినిమా హాళ్లు, హాస్పిటాలిటీ, ఫుడ్ కోర్టులు, క్లోక్ రూంలు, వసతి గృహాలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు వంటివి ప్రపంచ స్థాయిలో నిర్మాణం చేసి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకు వస్తారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ను రూ.530 కోట్లతో, నెల్లూరు స్టేషన్‌ను రూ.130 కోట్లతో రీ డెవలప్మెంట్ చేయనున్నారు. పీపీపీ విధానంలో అభివృద్ధి ► డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) విధానంలో పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద అభివృద్ధి చేస్తారు. ► కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసి 60 ఏళ్ల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ► తిరుపతి, నెల్లూరులలో ఉన్న రైల్వే భూములు వాణిజ్య అభివృద్ధికి, డెవలపర్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు ఉపయోగపడతాయి. ► ఈ సందర్భంగా ఆర్ఎల్డీఏ వైస్ చైర్మన్ వేద ప్రకాష్ దుడేజా మాట్లాడుతూ తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల రీ డెవలప్మెంట్ ఆ ప్రాంతాల వాణిజ్య అభివృద్ధికి, పర్యాటక సామర్థ్యం, ఉపాధి అవకాశాల పెంపునకు దోహదపడుతుంది అన్నారు. -
రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫైకి ఇక గుడ్‌బై..!
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సర్వీసుపై గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో అందిసున్న ఉచిత వైఫైను గూగుల్ ఎత్తివేస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ విషయంపై గూగుల్ ఉపాధ్యక్షుడు సీజర్ గుప్తా స్పందిస్తూ.. ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ సేవలు చాలా చవకగా మారిపోయాయి. అందువల్లనే భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, నైజీరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లోనూ ఉచిత వైఫై సేవలను ఎత్తివేయనున్నాం. ఐదేళ్ల క్రితం గూగుల్ స్టేషన్లు ప్రారంభించినప్పటితో పోలిస్తే ఇప్పుడు డేటా వాడకం సులభతరంగా, చవకగా మారింది. మొబైల్ డేటా ప్లాన్లు చాలా తక్కువ రేట్లకు అందుబాటులోకి వచ్చాయి. 2015లో భారతీయ రైల్వే, రైల్ టెల్ భాగస్వామ్యంతో గూగుల్ వేగవంతమైన, ఉచిత పబ్లిక్ వైఫై సేవలను ఆరంభించింది. 2020 నాటికి 400కు పైగా రైల్వే స్టేషన్లలో అమర్చాలని లక్ష్యంగా పెట్టుకోగా.. జూన్ 2018 నాటికే ఆ లక్ష్యాన్ని అధిగమించినట్టు సీజర్ చెప్పారు. మొబైల్ కనెక్టివిటీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు భారత్‌లో మొబైల్ డేటా లభ్యమవుతోంది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే మొబైల్ డేటా ధర 95 శాతం తగ్గింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం దేశంలోని వినియోగదారులు నెలకు సగటున 10 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే గూగుల్ రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సర్వీసు ఎత్తివేత నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. -
‘కొత్త’ రైల్వేస్టేషన్లలో యూజర్ చార్జీ!
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులపై విధించేలాంటి యూజర్ చార్జీలను కొత్తగా అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లలో విధించనున్నారు. దీంతో రైల్వే చార్జీల్లో కూడా పెంపు ఉంటుందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. యూజర్ డెవలప్మెంట్ ఫీ (యూడీఎఫ్) అనేది విమానాల్లో ప్రయాణికుడు చెల్లించే పన్నుల్లో భాగంగా ఉంటుంది. దీన్ని పలు ఎయిర్‌పోర్టుల్లో విధిస్తున్నారు. ఈవిధంగా వసూలు చేసే చార్జీ ఒక్కో స్టేషన్లో ఒక్కో రకంగా ఉంటుందని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ ఇక్కడి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎంత చార్జీ వసూలు చేస్తామనే విషయం మంత్రిత్వ శాఖ త్వరలో తెలియజేస్తుందని అన్నారు. అమృత్సర్, నాగ్‌పూర్, గ్వాలియర్, సబర్మతి రైల్వే స్టేషన్లను రూ.1,296 కోట్ల అంచనా వ్యయంతో పునరాభివృద్ధి చేయడంకోసం రైల్వే ప్రతిపాదనలు చేసిందన్నారు. ‘వసూలు చేసిన చార్జీ స్టేషన్ల ఆధునీకరణకు తోడ్పడుతుంది. చార్జీలు నామమాత్రంగానే ఉంటాయి’అని యాదవ్ పేర్కొన్నారు. -
చెత్త వేశారో... రైల్వే వాతే!
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): స్వచ్ఛ భారత్ మిషన్ అమలుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే సిద్ధమైంది. ఇందులో భాగంగా రైల్వేస్టేషన్ పరిసరాల్లో నిబంధనలు అతిక్రమించిన వారిపై విధించే జరిమానాలను అధికం చేసింది. ఈ నూతన జరిమానాలు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. రైల్వే స్టేషన్ పరిసరాలలో చెత్త వేయడం, ఉమ్మి వేయడం, మూత్ర విసర్జన, గోడలను పాడుచేయడం వంటి నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుని 2016లో జరిమానాలు అమలులోకి తీసుకొచ్చారు. వీటికి అదనంగా మరికొన్ని నిబంధనలు కూడా ఇక నుంచి అమలు చేయనున్నారు. వీటిని అతిక్రమించినా జరిమానాలు చెల్లించుకోవాల్సిందే. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల అమలుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ముందుకు సాగుతోందని, ప్రయాణికులు పూర్తిస్థాయిలో సహకరించి స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగస్వాములు కావాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. మరింత మందికి అధికారం ఇప్పటి వరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో గల మూడు డివిజన్లలో వేర్వేరు జరిమానాలు అమలయ్యేవి. ఇప్పటి నుంచి మూడు డివిజన్ల పరిధిలో గల అన్ని స్టేషన్లలో ఒకే రకమైన జరిమానాలు అమలు చేయనున్నారు. చెత్త వేస్తే రూ.200, వంట చేస్తే రూ.500, ఉమ్మి వేస్తే రూ.300, మూత్ర విసర్జన చేస్తే రూ.400, గోడలను పాడుచేస్తే రూ.500, జంతువులు, పక్షులకు మేత వేస్తే రూ.500, వాహనాలు కడిగినా, రిపేర్ చేసినా రూ.500, దుస్తులు ఉతికినా, పాత్రలు కడిగినా రూ.500, అనుమతి లేకుండా పత్రికలు అతికిస్తే రూ.2వేలు, అనుమతి పొందిన వెండర్స్, హాకర్స్ తడి, పొడి చెత్తకు సంబంధించిన ప్రత్యేక డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయకపోతే రూ.2వేలు, 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ వినియోగిస్తే రూ.500ల జరిమానా విధించనున్నారు. మరోవైపు నిబంధనలు అతిక్రమించే వారిపై జరిమానా విధించేందుకు మరింత మంది అధికారులకు అధికారం కల్పించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో గల ఖుర్దా రోడ్, సంబల్పూర్, వాల్తేర్ డివిజన్లలో గల స్టేషన్ మేనేజర్స్, స్టేషన్ సూపరింటెండెంట్స్, స్టేషన్ మాస్టర్స్, టికెట్ కలెక్టర్స్, స్పెషల్ స్వా్కడ్, కమర్షియల్ / ఆపరేటింగ్ విభాగంలో గల గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ కలిగిన అధికారులు, ఆర్పీఎఫ్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్సెక్టర్ ర్యాంకు కన్నా తక్కువ కాని అధికారులకు అధికారం కల్పించారు. -
పండగ ప్రయాణం
-
సొంతూళ్లకు రయ్ రయ్!
సాక్షి, అమరావతి బ్యూరో/కంచికచర్ల/హైదరాబాద్: సంక్రాంతి పండుగకు వారాంతపు సెలవులు కలిసిరావటంతో హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు శనివారం ఏపీలోని తమ సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లయితే ఇసుకేస్తే రాలనంతగా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు.. సొంత వాహనాల్లో బయల్దేరే వారితో జాతీయ రహదారుల్లోనూ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. దీంతో వివిధ టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ మేర బారులుతీరుతూ కనిపిస్తున్నాయి. ఇటీవల అమలులోకి తెచ్చిన ఫాస్టాగ్ వ్యవస్థవల్ల టోల్ ప్లాజాల్లో వాహనాల రద్దీ కొంతవరకు తగ్గినప్పటికీ ఇంకా అనేకచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా టోల్‌ప్లాజాల వద్ద పోలీసులను నియమించారు. కొన్నిచోట్ల అదనపు గేట్లను ఏర్పాటుచేశారు. ప్లాజాల నిర్వాహకులు కూడా అదనపు సిబ్బందిని రంగంలోకి దించారు. ఆది, సోమవారాల్లో వాహనాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ రెండు వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. గత ఏడాదికంటే రెట్టింపు బస్సులను సిద్ధంచేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 700 స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి, భీమవరం, విశాఖపట్నం వైపునకు 500 బస్సులను తిప్పుతున్నారు. ఇక పండుగ తర్వాత 16 నుంచి 21 వరకు తిరుగు ప్రయాణికుల కోసం మరో 800 బస్సులను నడపనున్నారు. బస్సులు లేవని ప్రయాణికులు ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలను ఆశ్రయించే అవకాశం లేకుండా చూస్తున్నామని కృష్ణా రీజియన్ ఆర్టీసీ ఆర్ఎం నాగేంద్రప్రసాద్ తెలిపారు. తొలిసారిగా ఆర్టీసీ 40 % రాయితీ మునుపెన్నడూ లేనివిధంగా ఆర్టీసీ తొలిసారిగా ప్రయాణికులకు 40శాతం రాయితీ ఇస్తోంది. సంక్రాంతి సీజన్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉన్నంత రద్దీ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే బస్సుల్లో ఉండదు. ఇది ఆర్టీసీకి నష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఇలా వెళ్లే స్పెషల్ బస్సుల్లో ప్రయాణికులకు సాధారణ చార్జీలో 40 శాతం రాయితీ ఇవ్వాలని సంకల్పించింది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి హైదరాబాద్–విజయవాడ మార్గంలో పండుగ సమయాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. టోల్ నిర్వాహకులు మాత్రం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. దీంతో వాహనదారులు అవస్థలు పడాల్సి వస్తోంది. –వంశీ, నెల్లూరు ఇబ్బంది పడ్డాం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నాం. మా వాహనానికి ఫాస్టాగ్ ఉంది. అయినా టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకున్నాం. ఫాస్టాగ్ ఉన్న వాహనాలు ఏమాత్రం ఫాస్ట్‌గా వెళ్లలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. –నర్సింహా, విజయవాడ ఈనెల 15 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి ప్రతి వాహనానికి జనవరి 15వ తేదీ నుంచి ఫాస్టాగ్ ఉండాల్సిందేనని కేంద్ర ఉపరితల, రవాణా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. 2019 డిసెంబరు 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత ఆ గడువును డిసెంబరు 15వ తేదీకి వాయిదా వేశారు. అనంతరం వాహనదారులకు మరోసారి గడువిచ్చారు. 2020 జనవరి 15వ తేదీ నుంచి ప్రతి వాహనానికి ఫాస్టాగ్ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులపై 65 శాతం వాహనదారులు ఫాస్టాగ్ వినియోగిస్తున్నట్లు అంచనా. రాష్ట్రంలో ఇప్పటివరకు ఫాస్టాగ్‌ల అమ్మకాలు 1.50 లక్షలు దాటాయి. ఈ నెల 14వ తేదీ వరకు హైబ్రీడ్ విధానం అమల్లో ఉంటుంది. జనవరి 15వ తేదీ నుంచి ప్రతి టోల్‌ప్లాజాలో క్యాష్ లైన్ కేవలం ఒకటి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక రాష్ట్ర రహదారులపైనా అమలు జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లోనే కాకుండా రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లోనూ ఫాస్టాగ్ అమలు చేయాలని ఎన్హెచ్ఏఐ గతంలోనే ఆదేశాలిచ్చింది. అయితే, రాష్ట్ర రహదారులపై ఇప్పటికీ ఈ విధానం అమలు కావడం లేదు. సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్ డెడికేటెడ్ లైన్లు ఏర్పాటు చేస్తామని రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ టోల్గేట్లలో ఆర్ఎఫ్ఐడీ యంత్రాలు పెట్టేందుకు అయ్యే వ్యయంలో 50 శాతాన్ని ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ భరించనుంది. హోటళ్లలోనూ ఫాస్టాగ్‌ల అమ్మకాలు రాష్ట్రంలో 22 బ్యాంకుల ద్వారా 5 లక్షల ఫాస్టాగ్‌లను విక్రయానికి అందుబాటులో ఉంచినట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో రాబోయే రెండు రోజుల్లో ఫాస్టాగ్‌ల అమ్మకాలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ చెప్పారు. జనవరి 15వ తేదీ తర్వాత టోల్‌ప్లాజాల్లో క్యాష్‌లైన్ ఒక్కటి మాత్రమే ఉంటుందని, తర్వాత అది కూడా తొలగించనున్నట్లు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టోల్‌ప్లాజాల వద్దే కాకుండా జాతీయ రహదారుల వెంట ఉన్న హోటళ్లలోనూ ఫాస్టాగ్‌లు విక్రయించేందుకు ఎన్హెచ్ఏఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. -
సెలవులకు టాటా..స్టేషన్ కిటకిట
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దసరా సెలవులు ముగిశాయి. విశాఖకు వస్తున్న వారి.. విశాఖ వీడి వెళ్తున్న వారి ప్రయాణాలు మొదలయ్యాయి. ఇలా వస్తూ పోతున్న వారితో రైల్వేస్టేషన్ కిటకిటలాడింది. స్టేషన్లో ఆదివారం ఇసకేస్తే రాలని పరిస్థితి కనిపించింది. ఆదివారంతో సెలవులు ముగిసినందున ఉదయం నుంచి రైల్వే స్టేషన్ జనసమ్మర్దంగా కనిపించింది. విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వైపు వెళ్లే పలు రైళ్లు రద్దీగా బయల్దేరాయి. అలాగే అటునుండి వచ్చే ఎక్స్‌ప్రెస్‌లు, పాసింజర్ రైళ్లు కూడా రద్దీగానే వచ్చాయి. -
మన స్టేషన్లు అంతంతే
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ రైల్వేస్టేషన్ల విషయంలో తెలంగాణ ఈసారి బాగా వెనకబడింది. గత రెండేళ్లుగా రాష్ట్రంలోని పలు రైల్వేస్టేషన్లు పరిశుభ్రమైన జాబితాలో మెరుగైన స్థానం దక్కించుకోగా ఈసారి మాత్రం బాగా వెనకబడిపోయాయి. ప్రస్తుత జాబితాలో హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ 17వ స్థానం, సికింద్రాబాద్ 42, వరంగల్ 51, రామగుండం 52, కాజీపేట 67, కాచిగూడ 69, ఖమ్మం 80 స్థానాలు దక్కించుకున్నాయి. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్ బుధవారం ర్యాంకుల జాబితాను విడుదల చేశారు. విజయవాడకు 7వ ర్యాంకు స్వచ్ఛత విషయంలో విజయవాడ రైల్వేస్టేషన్ దేశంలోనే టాప్–10 జాబితాలో స్థానం దక్కించుకుంది. జైపూర్, జోధ్‌పూర్, దుర్గాపుర స్టేషన్లు తొలి 3 ర్యాంకులు దక్కించుకోగా, ఏపీ నుంచి విజయవాడ రైల్వేస్టేషన్ 7, సామర్లకోట 45, తిరుపతి 70, నెల్లూరు 81, విశాఖ 84, పలాస 92, అనంతపురం 105, ఏలూరు 107వ ర్యాంకులను దక్కించుకున్నాయి. -
రూ.50 కే 15 రకాల వైద్య పరీక్షలు
సాక్షి, సిటీబ్యూరో: కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన హెల్త్‌కియోస్క్ లు ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరం గా ఉన్నాయి. కేవలం రూ.50 కే 15 రకాల ఆరోగ్య పరీక్షలు చేసుకొనే అవకాశం లభించ డంతో ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై వీటిని అందుబాటులో ఉంచారు. రక్తపోటు, షుగర్.బరువు, బోన్‌మారో, శరీరంలో కొలెస్ట్రాల్, ప్రొటీన్ స్థాయి తదితర 15 రకాల పరీక్షలపైన ఒక అవగాహన లభిస్తుంది. ముఖ్యంగా వేల కొద్దీ కిలోమీటర్లు ప్రయాణం చేసేవారు. నిద్రలేమి, అలసట తదితర సమస్యలతో బాధపడేవారు ప్రయాణ సమయంలో తమ ఆరోగ్యస్థితిని తెలుసుకొనేందుకు ఈ కియోస్క్‌లు దోహదం చేస్తాయి. ప్రతి రోజు సికింద్రాబాద్ నుంచి 1.95 లక్షల మంది, కాచిగూడ నుంచి లక్ష మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. రూ. వందల్లో ఖర్చయ్యే వైద్య పరీక్షలను కేవలం రూ.50 లకే అందజేస్తుండటంతో ప్రయాణికులు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే ఇది ప్రయాణికులకు తమ ఆరోగ్యం పట్ల ఒక ప్రాథమిక అవగాహనను కల్పిస్తుంది. -
‘సచివాలయ’ పరీక్షలకు ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం అన్ని బస్, రైల్వే స్టేషన్లలో హెల్ప్ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు పరీక్షల నిర్వహణ కన్వీనర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పరీక్ష కేంద్రం చిరునామా వంటి విషయాల్లో హెల్ప్‌డెస్క్ సిబ్బంది సహాయకారిగా ఉంటారన్నారు. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి సెపె్టంబర్ 1నుంచి 8వ తేదీ వరకు పోస్టుల వారీగా రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1,26,728 ఉద్యోగాలకు దాదాపు 21.69 లక్షల మంది పోటీ పడుతున్నందున పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్టు వివరించారు. తొలిరోజు ఉదయం 36,449 ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తుండగా.. 12,54,034 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం తర్వాత 11,158 పోస్టులకు పరీక్ష నిర్వహిస్తుండగా.. 2,95,907 మంది హాజరు కావాల్సి ఉందని చెప్పారు. తొలి రోజు పరీక్షలకు మూడింట రెండొంతుల మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. ఇందుకోసం మండల కేంద్రాలు, పట్టణాల్లో 4,478 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లకు జతపరిచి ఉన్న నియమ నిబంధనలను పరీక్ష కేంద్రానికి వచ్చే ముందే సరిచూసుకుని రావాలని కోరారు. వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ఒకరోజు ముందే చూసుకోవడం.. రాత పరీక్ష మొదలయ్యే సమయానికి గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవడం మంచిదని తెలిపారు. పరీక్షల నిర్వహణలో పోలీసు శాఖ సేవలను పెద్దఎత్తున ఉపయోగించుకుంటున్నట్టు చెప్పారు. హెల్ప్ డెస్క్‌లలో పెద్ద సంఖ్యలో వలంటీర్లను, 1,22,554 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని చెప్పారు. 1,835 వాహనాలను కూడా ఉపయోగించుకుంటున్నట్టు చెప్పారు. ప్రతి జిల్లాలో 500 బస్సులు ఒకే రోజు దాదాపు 15 లక్షల మంది రాత పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో.. ప్రతి జిల్లాలో 500 బస్సులను పరీక్షా కేంద్రాలకు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు అంగీకరించారని కన్వీనర్ తెలిపారు. మండలాల వారీగా ఏ కేంద్రంలో ఎంత మంది రాతపరీక్షకు హాజరవుతారన్న వివరాలను ఆర్టీసీకి అందజేశామన్నారు. ఆటోల ద్వారా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నా.. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పట్టణాల్లో ఆటో యూనియన్లకు ఆ పట్టణంలో పరీక్ష జరిగే కేంద్రాల వివరాలు కూడా ముందుగా తెలియజేసినట్టు చెప్పారు. దివ్యాంగులకు 1,588 మంది సహాయకులు పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులకు సహాయకులుగా 1,588 మందిని అనుమతించనున్నట్టు చెప్పారు. సహాయం కావాలని కోరిన దివ్యాంగులకు ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసిందని, ప్రభుత్వం ఎంపిక చేసిన ఇంటర్ విద్యార్థులను మాత్రమే సహాయకులుగా అనుమతిస్తారని వివరించారు. 8 రోజులు జరిగే పరీక్షలకు 32,839 మంది దివ్యాంగులు హాజరవుతారని పేర్కొన్నారు. పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణ అభ్యర్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అన్ని పట్టణాల్లో ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీని కోరినట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాలున్న ప్రాంతంలో ట్రాఫిక్‌ను మళ్లించడం.. అవసరం ఉన్నచోట ఊరి బయట వాహనాలు నిలుపుదల వంటి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రం చుట్టుపక్కల వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేస్తారని, ఆ ప్రాంతంలో ఉండే జిరాక్స్ సెంటర్లు మూసివేస్తారని చెప్పారు. రాతపరీక్ష పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాల్లో ప్రశ్నాపత్రాలతో పాటు పరీక్షా సామగ్రిని ఉంచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసినట్టు వివరించారు. - అభ్యర్థుల హాల్ టికెట్‌పై ఫొటో అస్పష్టంగా ఉన్నా.. కనిపించకుండా చిన్నదిగా ఉన్నా.. అసలు ఫొటోనే ముద్రించకున్నా.. ఫొటో ఉన్నప్పటికీ అభ్యర్థి సంతకం లేకపోయినా.. సదరు అభ్యర్థులు గుర్తింపు కార్డుతో పాటు అదనంగా మూడు పాస్‌పార్ట్ ఫొటోలను తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. ఆ ఫొటోలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి. లేదంటే పరీక్షకు అనుమతించరు. - పరీక్ష రాసే సమయంలో అభ్యర్థి ఏదైనా అవసరానికి ఓఎమ్మార్ షీట్‌పై వైట్నర్ లేదా ఏదైనా మార్కర్ వంటివి వాడితే ఏకంగా అనర్హులే అవుతారు. పరీక్ష హాల్లోకి బాల్ పాయింట్ పెన్ మినహా వైట్నర్, మార్కర్ వంటివి తీసుకొచ్చినట్టు గుర్తించినా వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. - అభ్యర్థులకు ఇచ్చే ఒరిజనల్ ఓఎమ్మార్ షీట్‌తో పాటు నకలు ఓఎమ్మార్ కూడా ఉంటుంది. వీటి మధ్యలో కార్బన్ పేపర్ ఉంటుంది. పరీక్ష ముగిసిన తరువాత అభ్యర్థులు ఒరిజనల్ షీట్ ఇన్విజిలేటర్‌కు ఇచ్చి.. నకలును ఇంటికి తీసుకెళ్లవచ్చు. - సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రాన్ని విడిచి వెళ్లడానికి అనుమతించరు. ఎవరైనా అభ్యర్థి నిర్ధేశిత సమయానికంటే ముందుగా పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళితే అనర్హులవుతారు. - జెల్ పెన్ లేదా ఏ ఇతర రాత వస్తువులతో ఓఎంఆర్ షీట్‌పై ఏదైనా రాసినా జవాబు పత్రం చెల్లదు. -
అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో మట్టికప్పుల్లోనే చాయ్!
న్యూఢిల్లీ: ఇకపై ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ డిపోల వద్ద ఉన్న స్టాళ్లు, ఎయిర్‌పోర్టులు, మాల్స్‌లో మట్టి కప్పుల్లో చాయ్‌ని ఆస్వాదించవచ్చు. ఈమేరకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ.. రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం వారణాసి, రాయ్‌బరేలీ రెండు రైల్వే స్టేషన్లలో మాత్రమే కేటరర్లు ఈ మట్టి కప్పుల్లో చాయ్‌ను అందిస్తున్నారు. ‘సుమారు 100 రైల్వే స్టేషన్లలో, ఎయిర్‌పోర్టులు, రాష్ట్రాల్లోని బస్ డిపోల వద్ద ఉన్న టీ స్టాళ్లలో మట్టి కప్పుల్లోనే చాయ్‌ను అందించడాన్ని తప్పనిసరి చేయాలని గోయల్‌కు లేఖ రాశాను. దీంతో స్థానిక తయారీదారులకు మార్కెట్ లభించడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించే పేపర్, ప్లాస్టిక్‌ల వాడకాన్ని నిషేధించినట్లవుతుందని వివరించారు. -
హైదరాబాద్ సిటీలో ఆకుపచ్చ ఫ్రిడ్జ్‌లు!
సాక్షి, హైదరాబాద్: ఆకలికి పేదా, గొప్పా, చిన్నా, పెద్దా అనే అంతరంలేదు. ఆకలిబాధ అందరికీ అనుభవమే.. ఈ నేపథ్యంలో ఆకలేస్తే అన్నంపెడతా.. అంటోంది ఫుడ్‌బ్యాంకు. హైదరాబాద్‌లో ఇలాంటి ఫుడ్‌బ్యాంకులు అన్నార్థులను అక్కున చేర్చుకుంటున్నాయి. ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు, ఇతర ముఖ్య కూడళ్లు.. ఇలా 35 ప్రదేశాల్లో ఆకుపచ్చ ఫుడ్ ఫ్రిడ్జ్ (అన్నంపెట్టె)ల రూపంలో ఫుడ్‌బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఆకలిగొన్నవారికి, ఆహారదాతలకు బ్రిడ్జ్‌లా ఈ ఫ్రిడ్జ్‌లు మారాయి. ఆహారం మిగిలిపోయిన చోటు నుంచి ఆకలిగా ఉన్నవారికి ఆహారాన్ని చేర్చడం, ఆహారం పాడు కాకుండా కూడా నిల్వ ఉంచడం ‘ఫీడ్ ద నీడ్’లక్ష్యం. స్పందన బాగుంది.. కిమ్స్. నిమ్స్, నిలోఫర్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్‌లలో ఎక్కువగా ఆహారం జమ అవుతోంది. ఇక్కడ రోజు కు 40 మంది చక్కటి ఆహారాన్ని పొందగలుగుతున్నారని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. ఎన్జీవోల సహకారం ఉన్నచోట మాత్రమే ఫ్రిడ్జ్‌ను ఏ ర్పాటు చేశారు. అవి ఒక దివ్యాంగ వ్యక్తిని ఆ ఫ్రిడ్జ్ పర్యవేక్షణ, శుభ్రత కోసం నియమించి భోజనంతోపాటు రూ.6 నుంచి 7 వేల జీతం ఇస్తున్నాయి. నీడి కాదు నీడ్ .. నగరంలో 150 అన్నపూర్ణ సెంటర్లున్నాయి. అవి మధ్యాహ్నం వేళ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఫీడ్ ద నీడ్ ఫ్రిడ్జ్ వద్దకు ఏ వేళలో అయినా ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఆఫీస్ నుంచి ఆలస్యంగా ఇంటికెళ్లేవారు... ఇలా ఎవరైనా సరే ఆకలితో వస్తే ఇక్కడ ఏదో ఒకటి తినడానికి దొరుకుతుంది. దాతల కోసం యాప్... ఫీడ్ ద నీడ్ యాప్‌ను వారం క్రితం జీహెచ్ఎంసీ ప్రారంభించింది. ఇప్పటికీ 800 మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే, ఇది ఆండ్రాయిడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఐఫోన్‌కి వారం రోజుల్లో అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఆహారం ఇవ్వాలనుకున్న దాతలు ఈ యాప్ ద్వారా తెలియ చేయవచ్చు. వెబ్సైట్లో ఫ్రిడ్జ్ లింక్‌లున్నాయి. ఫ్రిడ్జ్‌లు విరాళంగా అందించాలనుకునేవారు మున్సిపల్ కార్పొరేషన్‌ను సంప్రదించవచ్చు. ఎవరైనా ఈ ఫ్రిడ్జ్‌ల్లో నిల్వచేయవచ్చు యాపిల్ హోం అనాథాశ్రమం వారు మొదటి ఫుడ్‌బ్యాంక్(రిఫ్రిజిరేటర్)ని శిల్పారామంలో ఏర్పాటు చేశారు. సమీప హోటళ్లలో జరిగే ఫంక్షన్లలో మిగిలిపోయే ఆహారాన్ని ఈ సేవసంస్థలకు తెలిపి అవసరం ఉన్నవారికి అందేలా చెయ్యవచ్చు. తిండి పదార్థాలను ఇవ్వాలనుకునేవారు నేరుగా వచ్చి ఈ ఫ్రిడ్జ్‌లో పెట్టవచ్చు. రాబిన్‌హుడ్ ఆర్మీ వాలంటీర్లు దాతలిచ్చే ఆహారాన్ని తీసుకెళ్లి ఆకలిగా ఉన్నవారికి అందజేస్తారు. వ్యక్తులు, సంస్థలు ఎవరైనా ఈ ఫ్రిడ్జ్‌ల్లో ఆహారపదార్థాలను నిల్వచేయవచ్చు. 100 ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు చేస్తాం... ఫిబ్రవరిలో ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో నీడి అని కాకుండా నీడ్ అని వాడాం. ఎవరికి ఆకలి అయితే వారు ఆహారాన్ని తీసుకుని తినవచ్చు. నగరంలో 35 ఫుడ్‌బ్యాంకులు ఏర్పాటు చేశాం. ఇన్ని ఫ్రిడ్జ్‌లు పెట్టిన ఘనత మన నగరానిదే. దుబాయ్ లాంటి నగరాల్లో 10 లోపే ఉన్నాయి. గత నెలలోనే ఈ ఫుడ్‌బ్యాంక్‌ల దగ్గర ఫుడ్ తీసుకున్నవారి సంఖ్య లక్ష దాటింది. చాలామంది దాతలు ఫ్రిడ్జ్‌ల ఏర్పాటుకు సహాయం చేస్తామని ముందుకొస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా 100 ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు చెయ్యాలనే లక్ష్యంతో ఉన్నాం. – హరిచందన, జోనల్ కమిషనర్, జీహెచ్ఎంసీ -
ప్రేమ జంటలను ఉపేక్షించేది లేదు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: బహిరంగ నేరాలను పోలీసులు అడ్డుకుంటారు. మరి వివాహేతర సంబంధాల నేపథ్యంలో చాటుమాటు ఘాతుకాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల రికార్డుల ఆధారంగా గడిచిన పదేళ్లలో తమిళనాడులోని 1,459 హత్యలు వివాహేతర సంబంధాల వల్లనే జరిగినట్లు స్పష్టమైంది. సేలం జిల్లాకు చెందిన ఒక గృహిణి కనిపించకుండాపోయిన తన 19 ఏళ్ల తన కుమార్తెను కోర్టులో ప్రవేశపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ అడ్కొనర్వు పిటిషన్‌ను ఇటీవల దాఖలు చేసింది. పెళ్లయి, పిల్లలు కలిగిన తన మేనమామ లోకనాథన్తోనే ఆమె కుమార్తె వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే యువతిని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. సినీ నటీమణులు కనిపించకుండా పోతే నే గాలింపు చేస్తారా, సాధారణ యువతులను పట్టించుకోరా అని న్యాయమూర్తులు పోలీసులకు ప్రశ్నించారు. ఈ కేసు శుక్రవారం మరోసారి విచా రణకు వచ్చింది. కోర్టు ఆదేశాలతో చెన్నై లా అండ్ ఆర్డర్ ఐజీ ఒక పిటిషన్ దాఖలు చేశారు. గత పదేళ్లలో చెన్నైలో వివాహేతర సంబంధాల వల్ల 1,459 హత్యలు జరిగాయని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. పదేళ్లు అంటే 3,650 రోజులు. 3,650 రోజుల్లో 1,459 హత్యలు అంటే రెండురోజులకో హత్య జరిగిందన్నమాట. ఈ హత్యలన్నీ వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగిన వే కారణం గమనార్హం. యువత పెడదారి పట్టడానికి ఇంట ర్నెట్, సెల్ఫోన్లలో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న అశ్లీల వెబ్సైట్లే ప్రధాన కారణమని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు కృపాకరన్, అబ్దుల్ ఖుద్దూస్ అవేదన వ్యక్తం చేశారు. ఐజీ కోర్టుకు సమర్పించిన వివరాలను పరిశీలించి కంగుతిన్న న్యాయమూర్తులు.. సమాజంలో పె చ్చుమీరిపోయిన వివాహేతర సంబంధాల సం స్కృతికి మూలకారణం అరచేతిలో (సెల్ఫోన్లు) అశ్లీల వెబ్సైట్లు అందుబాటులోకి రావడమేనని వ్యాఖ్యానించారు. కొన్ని సినిమాలు సైతం యువతను పెడదారి పట్టిస్తున్నాయని ఆక్షేపించారు. రైల్వేస్టేష్టన్లలో ‘మూడో కన్ను’ ప్రేమ కబుర్లు చెప్పుకునేందుకే రైల్వేస్టేషన్లకు చేరుకునే జంటలను ఉపేక్షించేది లేదని పోలీస్‌శాఖ హెచ్చరించింది. 136 రైల్వేస్టేషన్లలో ‘మూడో కన్ను’ ఏర్పాటుతో ప్రేమజంటలపై నిఘా పెడుతున్నామని పేర్కొంది. చెన్నై నగరం, శివార్లలోని పలు ప్రాంతాలను కలుపుతూ పయనించే లోకల్ రైళ్లలో రోజుకు 8 లక్షల మందికి పైగా ప్రయాణిస్తుంటారు. చెన్నై నగరంలోని మాంబళం, తాంబరం తదితర పలులోకల్ స్టేషన్లలో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఆగుతాయి. ఎక్స్‌ప్రెస్ రైళ్ల కోసం వేరే రైల్వే ట్రాక్ కూడా ఉంది. రైలు ప్రయాణికుల వసతి కోసం అనేక కుర్చీలను ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ఈ కుర్చీల్లో ప్రయాణికుల కంటే ప్రేమ జంటలే ఆక్రమించుకుని ఉంటారు. గంటల తరబడి ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. ఇదే కోవలో చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో 2016లో స్వాతి అనే ఐటీ ఉద్యోగిని ఒక యువకుడు ముచ్చట్లాడుకుంటున్నారు. ఇంతలో ఆగ్రహం చెందిన యువకుడు వేటకొడవలితో స్వాతిపై దాడిచేసి దారుణహత్య చేశాడు. అలాగే ఈరోడ్‌కు చెందిన తేన్మొళి అనే ప్రభుత్వ ఉద్యోగినిపై చెన్నై చెట్పట్ రైల్వేస్టేష్టన్‌లో పదిరోజుల క్రితం హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసిన నిందితుడు ఈనెల 21వ తేదీన ప్రాణాలు విడిచాడు. చెన్నై లోకల్ రైల్వేస్టేషన్లలో ప్రేమజంటలు గంటల కొద్దీ బాతాఖాని కొట్టే దృశ్యాలను చూస్తున్న నగరవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ కబుర్లు చెప్పుకునేందుకే రైల్వేస్టేషన్‌కు వచ్చే జంటలపై చర్యలు చేపడతామని పోలీసు శాఖ హెచ్చరించింది. ప్రేమ జంటలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు పోలీసులు నిఘాపెట్టి ఎక్కువ సేపు కూర్చుని ఉంటే రైల్లో ఎక్కించడమో లేక స్టేషన్ నుంచి వెళ్లగొట్టడమో చేయాలని నిర్ణయించుకున్నారు. పోలీసుల ఆదేశాలను ధిక్కరించిన విద్యార్థులు, ఉద్యోగుల గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకుని కమిషనర్ కార్యాలయంలో అప్పగించాలని, సదరు విద్యాసంస్థలకు, కార్యాలయాలకు సమాచారం ఇవ్వాలని కింది స్థాయి పోలీసులకు ఆదేశాలందాయి. స్వాతి హత్య జరిగిన నుంగంబాక్కం రైల్వేస్టేషన్ సహా 82 స్టేషన్లలో సీసీ కెమెరాలు అమర్చారు. అలాగే చెన్నై చేట్‌పట్‌లో చోటుచేసుకున్న తాజా హత్యాయత్నం తరువాత ప్రేమజంటల కదలికలపై నిఘా పెట్టేందుకు మరో 136 రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయనున్నారు. -
బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు మరో సదుపాయాన్ని రైల్వే అందుబాటులోకి తెచ్చింది. బయలుదేరవలసిన స్టేషన్ (బోర్డింగ్ పాయింట్)ను ఇక నుంచి ఆన్లైన్లో మార్చుకోవచ్చు. ఇప్పటివరకు రైల్వేస్టేషన్‌ల్లో మాత్రమే బోర్డింగ్ పాయింట్ మార్చుకునేందుకు అవకాశం ఉండేది. ఇటీవల దీనిని ఆన్లైన్ పరిధిలోకి తెచ్చారు. దీంతో ప్రయాణికులు ట్రైన్ బయలుదేరే సమయానికి 24 గంటల ముందు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకోవచ్చు. అయితే ఇది నిర్ధారిత (కన్ఫర్మ్డ్) టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్లకు ఈ సదుపాయం ఉండదు. ఒకసారి బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకున్న తరువాత తిరిగి అదే బోర్డింగ్ పాయింట్ నుంచి ప్రయాణం చేసేందుకు అవకాశం కూడా ఇవ్వరు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు మొదట సికింద్రాబాద్‌ను బోర్డింగ్ పాయింట్‌గా ఎంపిక చేసుకొని తరువాత కాజీపేట్‌కు మార్చుకున్న వాళ్లు అక్కడే రైలు ఎక్కాల్సి ఉంటుంది. సికింద్రాబాద్‌లో ఎక్కేందుకు అవకాశం ఉండదు. బోర్డింగ్ పాయింట్ మార్పుతో సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ వరకు (అప్పటికే చార్జీలు చెల్లించి ఉన్నప్పటికీ) ప్రయాణం చేసేందుకు అనుమతించరు. ఆ రెండు స్టేషన్ల మధ్య వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు అవకాశాన్ని కల్పిస్తారు. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు బెర్తుల లభ్యతకు అనుగుణంగా బోర్డింగ్‌ను మార్చుకునేందుకు ఆన్లైన్ సదుపాయం ఒక వెసులుబాటు కల్పిస్తుందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దక్షిణమధ్య రైల్వే నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేప్రయాణికుల్లో సుమారు 10 శాతం నుంచి 12 శాతం వరకు ప్రతి రోజు బోర్డింగ్ పాయింట్ మార్పునకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ మార్పు సదుపాయం స్టేషన్లు, రిజర్వేషన్ కార్యాలయాల్లో మాత్రమే ఉండటంతో ప్రయాణికులకు ఇబ్బందిగానే ఉండేది. ఆన్లైన్ మార్పు వల్ల ఆ ఇబ్బంది తప్పినట్లైంది. వెయిటింగ్‌లిస్టు ప్రయాణికులకు అవకాశం... మరోవైపు నిర్ధారిత టికెట్లపైన బోర్డింగ్ పాయింట్ మార్చుకోవడంతో ఆ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణం కోసం వెయిటింగ్లో ఉన్న వాళ్లకు అవకాశం లభిస్తుంది. వికల్ప్ పథకం కింద టికెట్లు బుక్ చేసుకొని వెయిటింగ్లో ఉన్న వాళ్లకు తాము బుక్ చేసుకున్న ట్రైన్లో బెర్తులు లభించకపోయినా ఆ తరువాత వచ్చే రైళ్లలో ఇలాంటి బోర్డింగ్ మార్పుతో బెర్తులు లభించే అవకాశం ఉంది. ఇది ఇటు నిర్ధారిత టిక్కెట్ ప్రయాణికులకు, అటు వెయిటింగ్ లిస్టు వారికి ప్రయోజనకరం. ఇప్పటికే ఈ సదుపాయం ఉన్నప్పటికీ ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తేవడంతో ఎక్కువ మంది వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. -
మాయచేసి.. మాటల్లో దింపి..
సాక్షి, కరీంనగర్‌క్రైం: కరీంనగర్, వరంగల్, జనగామా జిల్లాల్లో అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి.. మోసం చేస్తున్న సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన కొవ్వూరి రాజేశ్వర్‌రావు(45) ఊరాఫ్ కిరణ్‌రెడ్డి, సురేష్, రాజును కరీంనగర్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చూపారు. ఏసీపీ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. కొవ్వూరి రాజేశ్వర్‌రావు హన్మకొండలోని అమరావతినగర్లో నివాసముంటున్నాడు. అమాయకులను మోసం చేయడమే వృత్తిగా ఎంచుకున్నాడు. ప్రధాన పట్టణాల్లోని ఆస్పత్రుల వద్ద మకాం వేసి అక్కడికి వచ్చే అమయకులకు, వృద్ధులకు సాయం చేస్తున్నట్లు నటించి వారివద్దనున్న బంగారం చోరీ చేస్తుంటాడు. రైల్వేస్టేషన్లు, ఆలయాల వద్ద మకాంవేసి తను దోషాల నివారణకు మార్గం చెప్తానని నమ్మిస్తాడు. తమవద్ద ఉన్న బంగారు ఆభరణాలు ఇమ్మని, వాటికి పూజలు చేస్తానని, ఈ లోపు కాళ్లుకడుక్కుని రమ్మని అక్కడినుంచి పరారవుతాడు. ఇంకా పలురకాల విద్యలు వచ్చని మోసం చేస్తున్నాడు. చోరీచేసిన బంగారు ఆభరణాలను ముణప్పురం, మూత్తుట్ వంటి ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టుపెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటాడు. ఇలా ఆరు నేరాలకు సంబంధించిన ఆభరణాలను హుజూరాబాద్‌లోని మణప్పురంలో, మూడు నేరాలకు సంబంధించిన ఆభరణాలను హన్మకొండ నయిమ్నగర్లో మణçప్పురంలో, మరోనేరానికి సంబంధించిన వాటిని నయిమ్‌నగర్ మూత్తుట్ మినీలో తాకట్టు పెట్టాడు. ఈ క్రమంలో పలువురు బాధితులు కరీంనగర్ సీపీ కమలాన్రెడ్డిని ఆశ్రయించారు. కేసును సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. సీఐ కిరణ్, సైబర్‌క్రైం ఇన్చార్జి మురళి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. పలు సీసీఫుటేసీలు పరిశీలించగా బాధితులు నిందితుడ్ని గుర్తించారు. సైబర్ ల్యాబ్ ద్వారా నిందితుడు రాజేశ్వర్రావుగా నిర్దారించుకున్నారు. గురువారం ఉదయం జమ్మికుంటలోని డాక్టర్స్ట్రీట్లో సంచరిస్తుండగా సీఐ కిరణ్, జమ్మికుంట సీఐ సృజన్‌కుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. అతడినుంచి రూ.4 లక్షల విలువైన 13 తులాల బంగారం, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీసీఎస్ సీఐ కిరణ్, జమ్మికుంట సీఐ సృజన్‌రెడ్డి, సైబర్ ల్యాబ్ ఇన్చార్జి మురళి, సీసీఎస్ ఎస్సై కనుకయ్య, సిబ్బందిని సీపీ కమలాసన్‌రెడ్డి అభినందించి రివార్డు అందించారు. -
పతనం
అది ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఒక మూలగా ఉన్న గూడ్స్షెడ్ల ఆవరణ. ఆ డిసెంబర్ చలిలో ఒకామె వొణుకుతూ నడుస్తున్నది. ఒకప్పుడు ఆమె పేరు సద్రాన్. ఇప్పుడామె ముసలి సద్రాన్. ఆమె కళ్లు కూడా తడిగా ఉన్నాయి. ముక్కు కారుతున్నది. మిగిలి ఉన్న కొద్ది పళ్లూ చలికి కొట్టుకుంటున్నాయి. కాళ్లూ చేతులూ స్పర్శ పోగొట్టుకున్నాయి. దారి కనపడటం కోసం కళ్ల మీది చెమ్మను అప్పుడప్పుడూ తుడుచుకుంటున్నది. ఆమె కాళ్లనూ చలి తొలిచేస్తున్నది. అరిగిపోయిన చెప్పులు మట్టితోనూ గోనెసంచుల పీచుతోనూ నిండిపోయి ఉన్నాయి. ఆ స్థితిలోనే కాళ్లీడ్చుకుంటూ పరుగులాంటి నడకతో ముందుకెళుతున్నది. చేతిలో చిన్న సంచీ చిన్న పార ఉన్నాయి.ఆ రైల్వే ప్రాంతంలో శ్మశాన ప్రశాంతత నెలకొని ఉంది. చలిగాలి హోరు ఎక్కువగా ఉంది. ఆవరణ అసాధారణంగా ఖాళీగానూ భీతిగొలుపుతూనూ ఉంది. వినియోగంలో లేని వ్యాగన్ల నీడలో ఆమె నడుస్తున్నది. ‘కాసేపట్లో సూర్యోదయం అవుతుంది. యార్డులో ఒక్క పిట్ట కూడా లేదు. సాధారణంగా జరిగే ఇంజన్ల షంటింగు కూడా లేదు. చలి మనుషులందర్నీ ఇళ్లలోనికి నెట్టేసినట్టుంది. ఎవరూ చలిని ఎదిరించే సాహసం చెయ్యలేరు. కాని డ్యూటీల్లో ఉన్నవారు ఎలాగో నెట్టుకొస్తారు. వారికి తప్పదు. కాపలాదార్లు మందమైన చలికోట్లు వేసుకొని వ్యాగన్లలో కునికిపాట్లు పడుతూ ఉంటారు. నిజానికి వారు మేల్కొని ఉండి రైల్వే ఆస్తులను కాపాడటానికే ప్రభుత్వం జీతాలు ఇస్తున్నది. అయితే ఇంత చలిలో ఎవరు మాత్రం బయట తిరిగి అపాయం కొని తెచ్చుకుంటారు? ఎవరి సుఖం వారిది. ఒక్క నాకే సుఖసంతోషాలు లేవు. శాంతి లేదు. పూట గడవటానికి కొట్లాడవలసి వస్తున్నది. ఈ జీవితం మీద ఆశా లేదు, ఆసక్తీ లేదు. ఈ రైల్వే ఆవరణలోని బొగ్గుని ఊడ్చి సేకరిస్తూ నా యవ్వనమంతా వ్యర్థమైంది. ఇప్పుడు ముసిలినై జీవిత చరమాంకంలో ఉన్నాను. అయినా తిండి కోసం పాట్లు తప్పడం లేదు. ఇన్నేళ్ల బతుకులో రేపనేది ఎప్పుడూ ప్రశ్నార్థకమే.’’ఇలా తన ఆలోచనల్లో మునిగి ముసలి సద్రాన్ రైల్వే లైన్లని దాటుకుంటూ తడబడుతూ నడుస్తున్నది. కళ్లు మిరుమిట్లుగొలిపే విద్యుద్దీపాల కాంతిలో రైల్వే లైన్లు మెలికలు తిరిగిన పాముల్లా కనపడుతున్నాయి. ఆ పాములు నోర్లు తెరిచి ఆమెనే మింగడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాయి. సద్రాన్ ఇక్కడ బొగ్గును దొంగిలించి బయట అమ్ముతూ జీవిక సాగిస్తుంది. బొగ్గుని సేకరించడం కోసం అనేక సంవత్సరాలుగా ఈ రైల్వే ఆవరణని ఊడుస్తున్నది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ప్రతి అంగుళం ఆమెకు చిరపరిచితమే. పద్మవ్యూహంలా ఉండే ఈ లైన్లు ఎక్కడ కలుసుకుంటాయో, ఎక్కడ విడిపోతాయో, ఎక్కడ వొంపు తిరుగుతాయో ఆమెకు తెలుసు. స్విచ్చులు, కూపాలు, వ్యర్థాలు చేరే గోతులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆమెకు తెలుసు. బొగ్గుని పోగు చేస్తుండగా కాపలాదారు కంటపడితే దాక్కోవడం, తనతో పాటు బొగ్గుని దాచడం ఆమెకు తెలుసు. ఒకవేళ పట్టుబడిపోతే అతన్ని ఎలా మెప్పించి ఒప్పించాలో కూడా ఆమెకు తెలుసు. పై అధికారితో కూడా కబుర్లు చెప్పి మాయ చేయడం ఆమెకు తెలుసు. క్లీనర్లనీ, ఫిట్టర్లనీ ఎలా ప్రలోభపెట్టి తప్పించుకోవాలో ఆమెకు తెలుసు. బొగ్గు కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టిన రోజులు ఉన్నాయి. షంటింగ్ ఇంజన్ ముందు నుంచి మెలకువగా జారుకునేటప్పుడు ఇంజన్ కదిలిపోతే అంతే సంగతి. అయినా ఆమె ఆ వృత్తినే చేసింది. చేస్తున్నది. మరోపని చెయ్యడం ఆమెకు చేతకాదు.ముసలి సాద్రాన్ ఇలా తలపోస్తున్నది. ‘‘డబ్బుకు లొంగే జనంతో ఇబ్బంది లేదు. కాకపోగా వారికి సంతోషమే. ఒకటి రెండు అణాలు ముట్టజెప్పి బుట్ట నిండా బొగ్గుని మోసుకుపోవచ్చు. కొంతమందైతే ఆ బొగ్గు తామే మోసుకొచ్చి తనకు కావలసిన చోట వేసి వెళతారు. అలా డబ్బు తీసుకున్న వారే ఉత్తములు. వాళ్లెవరూ నన్ను ఇబ్బంది పెట్టరు. కాని నిజాయతీపరులతోనే చిక్కంతా. వారు నేను పోగు చేసిన బొగ్గంతా తీసుకుంటారు. లేకపోతే వారితో ఖాళీ కోచ్‌లోనికి రమ్మంటారు. కుక్కలు! తుచ్ఛులు! వారు తల్లుల్నీ, అక్కచెల్లెళ్లనీ, కూతుళ్లనీ వొదిలిపెట్టరేమో! నీచులు! వారికి వయసుతో పనిలేదు. అందంతో పనిలేదు. ఆడది అయితే చాలు. వారికి కావలసిందల్లా... ముసలి ఎముకలు పగిలిపోయినా వారికి పట్టదు. ముసలి స్త్రీలకు నరకం కనిపించినా వారికి సంబంధం లేదు. కేవలం నగదు తీసుకోకుండా శీలాన్ని హరించినవాడు నిజాయతీపరుడు! వీళ్లనే రైల్వే మెచ్చుకుని మెడల్స్ వేస్తుంది. ఏమైనా ఈ స్థితిలో నన్నెవరూ కన్నెత్తి చూడరు. కాకపోతే మోటాగానూ, అసభ్యంగానూ మాట్లాడతారు. బయటికి గెంటివేస్తారు..’’ముసలి సాద్రాన్ తన ఆలోచనల్లో మునిగిపోయి కళ్లను తుడుచుకున్నది. ముఖం మీది ముడుతలు మంచుతో గడ్డకట్టుకుపోయినట్టు అనిపించింది. ఆమె మళ్లీ పరధ్యానంలో పడిపోయింది. ‘ఒకప్పుడు నా యవ్వనాన్ని దాచుకునేదాన్ని. అప్పుడు ముసలితనం తొందరగా రావాలని కోరుకునేదాన్ని. యవ్వనం సుఖశాంతుల్ని ఇవ్వలేదు. కాని వృద్ధాప్యం ఇంకా బాధాకరమైనది. ఇప్పుడు అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు. ముసలితనం ఒక శాపం. ధనం, యవ్వనం రెండూ సిగ్గుపడవలసినవి కావు. కాని ఇప్పుడు ఆ రెండూ నా వద్ద లేవు..’ సాద్రాన్ తన సంపాదనంతా తన కొడుకు బరాదాన్ అనారోగ్యం కోసం ఖర్చుపెట్టింది. భర్త చనిపోయిన తర్వాత వాడిని పెంచడానికి ఎన్నో ఇబ్బందులు పడింది. వాడికి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించడానికి తన శరీరాన్ని అమ్ముకున్నది. చివరికి వాడి పెళ్లి చేసింది. వాడికొక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడే ఇప్పుడు తన సర్వస్వం. కాని బరాదాన్ పెళ్లి అనర్థదాయకమే అయింది. తెలియని వ్యాధితో మంచం పట్టాడు. ముసలి సాద్రాన్‌కు తన పెళ్లినాటి జ్ఞాపకాలు వెంటాడాయి. బరాదాన్ తండ్రి ఈమెని తన ఇంటికి తీసుకెళ్లాడు. ‘‘సాద్రాన్ సాద్రాన్’’ అన్న పిలుపు అతడి పెదవుల మీద ఉండేది. అదేపనిగా ఆమె వెంట తిరిగేవాడు. ఆమెని ఇంటి వద్ద వొదిలి డ్యూటీకి వెళ్లడానికీ ఇష్టపడేవాడు కాదు. ఏదో వంక పెట్టి ఇంటి వద్దనే ఉండిపోయేవాడు. ‘‘సాద్రాన్! మనిద్దరికీ నా జీతం సరిపోతుంది. మనం పోషించవలసిన వారెవరూ లేరు’’ అనేవాడు.‘‘మన ఇరుగుపొరుగు నవ్వుతున్నారు. అత్తమామలు లేరట. నేనే ఇంటికి రాణినట. నిన్ను ఇంట్లో కట్టి పడేస్తున్నానట’’ అనేది తను. ‘‘సాద్రాన్! ఎవరేమనుకున్నా నాకు లెక్కలేదు. నీ సంతోషమే నాక్కావాలి.ఎవరైనా సంతృప్తిగా జీవిస్తే వారు చూడలేరు’’ అనేవాడు. అలాంటి భర్త.. కొడుకు బరాదాన్ని ఇచ్చి చనిపోయాడు. అప్పటి నుంచీ తనకు కష్టాలు మొదలయ్యాయి.సాద్రాన్ నిట్టూర్చింది. ఒక్కసారిగా ఒక గాలి కెరటం రైల్వేయార్డులో ప్రవేశించింది. ఆమె ఆలోచనలకు భంగం కలిగించింది. విద్యుద్దీపాల కాంతి తీవ్రతలో ఆమె కళ్లు తెరిచి ఉంచలేకపోతున్నది. లైన్ స్విచ్చులకుఅడ్డంగా యాంత్రికంగా నడవసాగింది. చేతిని నుదుటిపై ఉంచి కళ్లకు చాటు పెట్టుకున్నది. ఒక దొంగలా చుట్టూ జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు అడుగులేస్తున్నది. ఒక్కోసారి ఒక వ్యాగన్ నీడలోకి చేరిపోయి ఎవరూ తనను గమనించడం లేదని నిర్ధారించుకుంటున్నది. ఇప్పుడు ముసలి సాద్రాన్ బొగ్గు ముక్కల పోగుల్ని చేరుకున్నది. అవి ఆమెకు బంగారు బిస్కట్ల దొంతర్లలా కనపడుతున్నాయి. రెండు పోగుల బొగ్గు ముక్కలు తీసుకెళ్తే సరి. బరాదాన్ కోసం మందులు కొనగలదు. మనవడి కోసం బియ్యం కొనగలదు. తనకీ కోడలికీ చాలినంత జొన్నపిండి కొనగలదు.చలి కొరికేస్తున్నప్పటికీ ఒకటి మాత్రమే కాదు, రెండు బొగ్గు పోగుల్ని తీసుకెళ్లడానికి ఇదే అదనుగా భావించింది. రెండు పోగుల్ని కొట్టేస్తే చాలు చలికాలం గడిచిపోతుంది. ఆ తర్వాత పగటిపూట చిన్న బొగ్గుముక్కలు ఎప్పుడైనా ఏరుకోవచ్చు. బూడిద కుప్పల నుంచి బొగ్గు ముక్కల్ని ఏరుకుంటే ఎవరూ ఏమీ అనరు. అభ్యంతరపెట్టరు. ఆ బూడిద పోగుల నుంచి ముందుగా కొడుకు బరాదాన్, ఆపైన మనవడూ పైకి లేస్తున్నట్టు ఆమె ఊహించుకుంది.ఇల్లు గడవటం కష్టంగా ఉంది. బరాదాన్కు మందులు కావాలి. కొడలూ మనవడూ తనూ తినాలి. తనొక్కతే సంపాదించాలి. కోడల్ని ఇదే వ్యాపారం, ఇదే రొంపిలోకి దింపడం ఆమెకు ఇష్టం లేదు. ఈ నికృష్టమైన వృత్తి తనతోనే అంతం కావాలనుకున్నది.రెండు విడతల బొగ్గు తీసుకెళ్లడానికి రెండుసార్లు తిరగాలి. ఇదే సరైన సమయం. ఇటువంటి చలిలో చీకటిలో ఏ ఉద్యోగీ బయటకు రాడు. కాబట్టి రెండుసార్లు సులువుగా తిరగ్గలదు. ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నవి. ‘‘హిందుస్తాన్, పాకిస్తాన్, దేశం ఏదైతేనేం? పేదలకు బాధలు తప్పవు. ఒకప్పుడు హిందువులూ ముస్లిములూ ఎంతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చుకొనేవారు. ఇప్పుడు దేశం ముక్కలైన తర్వాత ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నారు. కుర్బాన్ అలీషా విద్వేషాలకి బలి అయిపోయాడు. అతడే ఈరోజు బతికి ఉన్నట్లయితే నాకీ కష్టాలు ఉండేవి కావు. నాకోసం తన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడు. అతడు ఉన్నంత కాలమూ నాకు డబ్బుకొరత ఉండేది కాదు. డ్రైవర్ నాథ్‌సింగ్ కూడా ఉండేవాడు. కానీ అతడు కుర్బాన్ అలీ ఉండగా తనని తాకడానికి సాహసించేవాడు కాదు. నాథ్‌సింగ్ ఇలా అనేవాడు. ‘‘కోడలా! నా మాట విను. అలీని పెళ్లి చేసుకో. ఇదే మంచి సమయం. నీ యవ్వనం, నీ అందం ఎల్లకాలమూ ఉండవు. మతం గురించి పట్టించుకోకుండా అతన్ని పెళ్లి చేసుకో.’’అందుకు నేనిలా అనేదాన్ని. ‘‘నాథ్‌సింగ్! ముస్లిముని పెళ్లి చేసుకొని నన్ను నేను మోసం చేసుకోవాలా?’’ అతడిలా అనేవాడు ‘‘మరి ఇది బాగుందా? అతడు ప్రతిరోజూ నిన్ను కోచ్‌లోకి తీసుకెళుతున్నాడు. ఈ సంగతి అందరికీ తెలుసు. ఇలా చాటుగా తిరగడానికి అడ్డురాని మతం పెళ్లికెందుకు అడ్డం? కొద్ది రోజుల తర్వాత అలీ కూడా నిన్ను పట్టించుకోడు. అప్పుడు పశ్చాత్తాపపడతావు.’’ఈ సంభాషణ తర్వాత దేశం విడిపోయింది. అలీని హిందువులే పొట్టన పెట్టుకున్నారు. నిజంగా తన పొట్టనూ కొట్టినట్టయింది.సాద్రాన్ గట్టిగా నిట్టూర్చింది. ఒక వాషింగ్లైను దాటుతుండగా ఆమె కాలు ఒక గోతిలో పడింది. అసహాయంగా ముందుకి తూలిపోయింది.మోకాలికి గట్టి దెబ్బ తగిలింది. పాదం కింది భాగంలో ఏదో లోహపు ముక్క గీసుకొనిపోయింది. చెప్పుల మీద నుంచే రక్తం కారడం కనపడింది. కదల్లేకపోతున్నది. బాధతో మూలుగుతున్నది.అలాగే పడి ఉన్న చోటే చనిపోతే నయమనిపించింది. కానీ ఏదో అదృశ్య శక్తి జీవితం మీద వ్యామోహం కలిగించింది. నెమ్మదిగా పాకుతూ రైల్వే ట్రాక్ రెండో వైపు చేరింది. అంతలోనే అతి వేగంగా ఆ ట్రాక్ పైనుంచే రైలు పరుగెత్తింది. అది తన మీదుగా వెళుతున్నట్లు అనిపించింది.ముసలి సాద్రాన్ నెమ్మదిగా లేచింది. పాదం తీవ్రంగా సలుపుతున్నది. కాస్త దూరంలో ఎవరో చలిమంట కాగుతున్నారు. అక్కడ దగ్గుతూ కూర్చున్న ముసలివాడిని గుర్తించింది. అతడు ఆమెకు తెలుసు. వెళితే వాడు తన పాత కథలన్నీ ఏకరువు పెడతాడు. చావుకు దగ్గరగా ఉన్నాడు కానీ సరసాలు మానడు. కాబట్టి ఆమె అటు వెళ్లడానికి ఇష్టపడలేదు.కనీసం ఒక విడత బొగ్గునైనా మోసుకెళ్లాలని భావించింది. ఆ పోగుల వద్దకు వెళ్లేసరికి ఏదో టార్చి కాంతి పడుతున్నట్టు గ్రహించింది. కొందరు కాపలాదార్లు టోపీలు సర్దుకుంటూ వినియోగంలో లేని కోచ్ నుంచి అటువైపే వస్తున్నారు. వారిని చూసి ఆమె వెనుతిరగక తప్పలేదు. గాయమైనా సరే వచ్చిన పని పూర్తి కానందుకు చింతించింది. ముసలి సాద్రాన్ ఖాళీ చేతులతో గుడిసె చేరింది. ఆమెను చూసి కోడలు జోమన్ రెచ్చిపోయింది. ‘‘ఈ ముసిల్ది చావనైనా చావదు. తను సంపాదించలేదు. నన్ను బయటికి వెళ్లనివ్వదు. చీకటిపడ్డాక వెళ్లి ఇప్పుడు తిరిగొచ్చింది. అదీ ఖాళీ చేతుల్తో ఏడుస్తూ వచ్చింది. రాత్రంతా మంచి చలిమంట దగ్గర ఉండి హాయిగా తిరిగి వచ్చేసింది. నువ్వేమీ పని చెయ్యలేవని, ఇంటి వద్దనే ఉండమని చెప్పాను. నేను వెళ్తానని బొగ్గు తెస్తానని చెప్పాను. అయినా వినదు. చేతకాని గొప్పలకు పోతుంది. నన్ను ఇల్లు కదలనివ్వదు. నేనేదో ఐస్క్రీమునైతే నన్నెవరో తినేస్తారన్నట్టు భావిస్తుంది. ఈరోజు కుటుంబమంతా పస్తులుండాలి.’’సాద్రాన్ కోడలు జోమన్ అరుపులు విన్నది. ఏడ్చింది. కాని పైకి ఏమీ అనలేకపోయింది. ఒకవేళ ఏమైనా అన్నా కోడలు మరింత బిగ్గరగా అరిచి తిరగబడుతుందని ఆమెకి తెలుసు.‘‘రేపు నేనే వెళ్లి బొగ్గు తెస్తాను’’అన్నది జోమన్.సాద్రాన్ గట్టిగా వొద్దనలేదు. అంటే కారణాల్ని వివరించాలి. అది ఆమె చెయ్యలేదు. ‘‘రైల్వే యార్డు నుంచి బొగ్గు సేకరించడంలో కష్టాలు కోడలికి తెలియవు’’ అని తనలోనే అనుకున్నది. సాద్రాన్‌కు దెబ్బ తగిలిన కాలు నొప్పెడుతున్నది. ఒక గోనెసంచి ముక్క కట్టుకున్నది. ‘‘నా జీవితం ఎలాగూ నాశనమైంది. నా దుర్గతి కోడలికి రాకూడదు’’ అని పదే పదే అనుకున్నది.మరునాడు సాద్రాన్ నిద్రలేచింది. జోమన్ గుడిసెలో లేనట్టు కనుగొన్నది. ఖాళీ సంచి, పార కూడా లేవు. ఆమె హృదయం బాధగా మూలగడం మొదలుపెట్టింది. గుడిసె ద్వారం వద్దకు పరుగెత్తింది. ఒక తుపానువల్ల గుడిసె పెళ్లగించబడినట్టు వెయ్యి ముక్కలు చెక్కలైనట్టు అనిపించింది. ముసలామె గాఢాంధకారంలోనికి చూస్తూ ద్వారం వద్దనే కూలబడింది.తెలతెల్లవారుతుండగా జోమన్ తిరిగి వచ్చింది. గుడిసె ముందర సంచి నిండా బొగ్గు పెట్టింది. ఆ ఇద్దరూ స్త్రీలూ ఒకరి కళ్లలోనికి ఒకరు చూసుకున్నారు. ముసలి సాద్రాన్ చూపు కోడలి చెదిరిన జుత్తుపైనా, చినిగిన చొక్కాపైనా పడింది. అత్త తన పరిస్థితిని చదివేసిందని కోడలికి తెలిసిపోయింది. జోమన్ అపరాధభావంతో చూపును కిందకు దించుకుంది. కేవలం ఒక సంచిడు బొగ్గు కోసం తన కోడలు అమూల్యమైనదేదో కోల్పోయిందని ముసలామె గ్రహించింది. ఒక విధమైన వేదనతో కుప్పకూలిపోయింది. పంజాబీ మూలం : బూటా సింగ్ అనువాదం: టి.షణ్ముఖరావు -
క్షణం ఆలస్యమైతే...అంతే..
సాక్షి, చెన్నై: ఉరుకుల పరుగుల పయనంలో కన్నుమూసి తెరిచేలోపే ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న కాలంలో బతుకుతున్నాం.. కానీ ఒక్కక్షణం ఆ ప్రమాదం నుంచి బయటపడితే.. పునర్జన్మ లభిస్తే.. నిజంగా జీవితం విలువ ఏమిటో తెలిసి వస్తుంది. చెన్నైలోని ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. క్షణాల్లో అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది ఒకరు ప్రయాణికుడిని మృత్యుముఖం నుంచి బయటపడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కదులుతున్నరైలును అందుకునేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడు. అంతే ప్రమాదాన్ని పసిగట్టిన ఆర్పీఎఫ్ ఉద్యోగి ఒకరు మెరుపువేగంతో కదిలి ఆ ప్రయాణికుడిని రక్షించారు. దీంతో తృటిలో ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు. ఏ మాత్రం ఆలస్యమైనా ప్లాట్‌ఫాంకు, రైలుకు మధ్య పడి ప్రాణాలు పోవడం ఖాయం. జస్ట్ వాచ్ ది వీడియో.. అండ్ బీ ఎలర్ట్ #WATCH: Railway Protection Force (RPF) personnel saved a passenger's life by rescuing him from falling, while he was boarding a train at Egmore Railway Station's platform. The passenger didn't suffer any injury. #TamilNadu (12.11.18) pic.twitter.com/OdNDYMdu2y — ANI (@ANI) November 14, 2018 -
ఊరెళ్తున్న నగరం
విశాఖసిటీ: సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన వైజాగ్ నగరం.. పల్లెకు పరుగులెడుతోంది. సంక్రాంతి తర్వాత తెలుగు ప్రజలు అత్యంత ప్రాధాన్యమిచ్చే దసరా పండగ సందర్భంగా సొంతూళ్లలో సరదాగా గడిపేందుకు పయనమవుతున్నారు. విశాఖకు వచ్చే వారికంటే నగరం నుంచి గ్రామాలకు వెళ్లేవారే అధికంగా ఉండటంతో ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. నగరానికి ఇతర జిల్లాల నుంచి లక్షలాది మంది ఉద్యోగ, వ్యాపార, ఉపాధి నిమిత్తం వచ్చి నివాసముంటున్నారు. పండగ సెలవులు రావడంతో పిల్లాపాపలతో సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ నగరం నుంచి బయలుదేరి వెళ్లే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ‘ప్రత్యేక’ ఏర్పాట్లు చేసినా... దసరా సందర్భంగా ఆర్టీసీ, రైల్వే అధికారులు రద్దీ దృష్ట్యా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. దసరా సెలవులకు నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ బస్సులకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో ఆయా రూట్లలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. గత సంవత్పరంలో ఉన్న పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది విశాఖ రీజియన్ నుంచి 416 అదనపు బస్సులు నడపగా.. ఈ ఏడాది విశాఖ రీజియన్ నుంచి రెగ్యులర్‌గా తిరిగే బస్సులతో పాటు అదనంగా 500 బస్సులతో విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమలాపురం, నర్సాపురం, భీమవరం మొదలగు దూరప్రాంత బస్సులతో పాటు విజయనగరం, రాజాం, పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం, సోంపేట, ఇచ్ఛాపురం, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వీటితో పాటు ఇరుగు పొరుగు ప్రాంతాలైన నరసన్నపేట, టెక్కలి, పలాస తదితర ప్రాంతాలకు బస్సులు నడుపుతోంది. ఇదే మాదిరిగా ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా ప్రధాన ప్రాంతాలకు ప్రత్యేకరైళ్లు నడుపుతోంది. ఇటీవల తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాతో పాటు ఒడిషా రాష్ట్రంలోనూ రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో.. వాటిని పునరుద్ధరించేందుకు సమయం పట్టింది. దీంతో చాలా మంది బస్సులను ఆశ్రయించారు. అయినప్పటికీ దసరాకు ముందు మూడు రోజుల పాటు రద్దీని దృష్టిలో ఉంచుకొని రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఓవైపు ప్రయాణికులు పెద్ద ఎత్తున ఉండటంతో రైళ్లు బస్సులు ఖాళీ ఉండటం లేదు. ముఖ్యంగా రైళ్లలోని జనరల్ బోగీల్లో అడుగు కూడా వెయ్యలేని పరిస్థితి ఉండటంతో ఫైన్లు కట్టి మరీ రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణాలు చేస్తున్నారంటే డిమాండ్ ఎంతలా ఉందో అర్థమవుతోంది. ప్రైవేట్ బాదుడు ఇదిలా ఉండగా.. ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు పండగ చేసుకుంటున్నాయి. ఎలాగైనా దసరా పండగను ఊరిలో చేసుకోవాలనే ప్రజల తాపత్రయాన్ని, సెంటిమెంట్‌ను ప్రైవేటు బస్సులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. ఆర్టీసీ, రైల్వే శాఖ బస్సులు ఏర్పాటు చేసినా.. డిమాండ్‌కు సరిపడా లేకపోవడంతో.. చాలా మంది ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఉదాహారణకు సాధారణ రోజుల్లో హైదరాబాద్‌కు రూ.700 నుంచి రూ.900 వరకూ ఏసీ సర్వీసులకు టికెట్ వసూలు చేసిన ప్రైవేటు బస్సులు.. దసరా రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏకంగా రూ.1800 నుంచి రూ.2000 వరకూ వసూలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు సైతం.. రెట్టింపు భారాన్ని మోస్తూ.. ఉసూరంటూ ఊళ్లకు వెళ్తున్నారు. -
పోటెత్తిన దసరా రద్దీ.. కిక్కిరిసిన రైళ్లు, బస్సులు
-
కొత్త రైలు.. కూ చుక్ చుక్!
సాక్షి, హైదరాబాద్ : రైల్వే స్టేషన్ల్లో ప్రయాణికుల సదుపాయాలు, మౌలిక వసతుల ఏర్పాటుకు రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహేన్ పచ్చజెండా ఊపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన కరీంనగర్–లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబై (11206/11205) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటివరకు నిజామాబాద్–ముంబై మధ్య నడుస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్.. ఇక నుంచి కరీంనగర్–లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబై వరకు రాకపోకలు సాగించనుంది. మల్కాజిగిరి రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసే ఎలక్ట్రానిక్ గైడెన్స్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ ఎలక్ట్రానిక్ వ్యవస్థ వల్ల ప్లాట్‌ఫారాలపై ఏ కోచ్ ఎక్కడ ఉంటుందో తెలుసుకోవచ్చు. రిమోట్ కంట్రోల్ ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతోపాటు, కాజీపేట, వరంగల్, కరీంనగర్, మంచిర్యాల తదితర చోట్ల సుమారు రూ.2వేల కోట్ల అంచనాలతో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన చేశారు. రూ.125 కోట్లతో పూర్తి చేసిన పలు సదుపాయాలను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చా రు. కాజీపేట్–కొండపల్లి మధ్య 3వ రైలు మార్గానికి శంకుస్థాపన చేశారు. మంచిర్యాల–పెద్దంపేట మధ్య నిర్మించిన 3వ లైన్‌ను ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 6/7 ప్లాట్‌ఫాంపై ఒక లిఫ్టు నిర్మాణానికి, బేగంపేటలో రూ.1.5 కోట్లతో 3 లిఫ్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆర్ట్స్ కాలేజీ రైల్వే స్టేషన్లో 238 మీటర్ల నుంచి 330 మీటర్లకు పొడిగించిన 2 ప్లాట్‌ఫారాలను ప్రారంభించారు. లింగంపల్లి, కాజీపేట స్టేషన్లలో రూ.3 కోట్లతో చేపట్టనున్న 3 ఎస్కలేటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బొల్లారం, వరంగల్ రైల్వే స్టేషన్ల పాదచారుల వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లారెడ్డి, బండారు దత్తాత్రేయ, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి ప్రాధాన్యత.. ఈ సందర్భంగా మంత్రి రాజెన్ మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక ప్రాజెక్టులను ఈ నాలుగేళ్లలో పూర్తి చేసినట్లు తెలిపారు. కొత్త లైన్ల విస్తరణ, సదుపాయాలకు రూ.వేల కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. ఈ ఏడాది సుమారు 50 కిలోమీటర్లకు పైగా కొత్తలైన్లు వేయడంతోపాటు, 76 కిలోమీటర్ల రైల్వే లైన్లను డబ్లింగ్ చేసినట్లు వివరించారు. మరో 345 కిలోమీటర్ల రైల్వే లైన్లను విద్యుదీకరించినట్లు పేర్కొన్నారు. రూ.106 కోట్లతో మంచిర్యాల–పెద్దంపేట మధ్య నిర్మించిన మూడో రైలు మార్గాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దీనివల్ల సరుకు రవాణాకు ఈ మార్గంలో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కాజీపేట–కొండపల్లి మధ్య రూ.1693.45 కోట్ల అంచనాలతో ప్రస్తుతం చేపట్టిన మూడో రైలు మార్గం వల్ల ప్రయాణికులకు అదనపు సదుపాయం అందుబాటులోకి రావడమే కాకుండా సరుకు రవాణాలో ఇతోధికమైన అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. మల్కాజిగిరి స్టేషన్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి మంత్రిని కోరారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ స్టేషన్లో మౌలిక సదుపాయాలు ఇంకా విస్తరించాల్సి ఉందని అన్నారు. లాలాగూడ కేంద్రీయ రైల్వే ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని ఎంపీ బండారు దత్తాత్రేయ కోరారు. ఎంఎంటీఎస్ రెండో దశను సత్వరమే పూర్తి చేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తగిన నిధులు కేటాయించకపోవడంతోనే ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. దక్షిణ మధ్య రైల్వేలో కాపలా లేని రైల్వే గేట్లను పూర్తిగా తొలగించనున్నట్లు జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. -
ఏం జరిగిందో?: మహిళా వైద్యురాలు ఆత్మహత్య ...
బరంపురం: జిల్లా కేంద్రంలోని చత్రపూర్ రైల్వేస్టేషన్లో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళా వైద్యురాలు శుక్రవారం మృతి చెందింది. రైల్వే పోలీసుల సమాచారంతో విషయం తెలుసుకున్న జీఆర్పీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వైద్యురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. మహిళ మృతిపై పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నప్పటికీ, ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. చత్రపూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని తురాయి పట్టపూర్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు రఘునాథ్‌దాస్ కుమార్తె అర్చనాదాస్‌గా మృతురాలిని పోలీసులు గుర్తించారు. నాలుగేళ్ల క్రితం భువనేశ్వర్‌లోని గడిఖానా ప్రాంతానికి చెందిన వైద్యుడు అర్జున్‌దాస్‌తో ఆమెకు వివాహం జరిగింది. అర్చనాదాస్ భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తోంది. కొన్నాళ్ల నుంచి భర్త అర్జున్‌దాస్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా గంజాం జిల్లాలోని తురాయి పట్టపూర్ గ్రామంలో తండ్రి ఇంటి వద్ద ఉంటోంది. అర్చనాదాస్ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
వరంగల్, తిరుపతి స్టేషన్లకు ‘స్వచ్ఛ’ ర్యాంకులు
సాక్షి, న్యూఢిల్లీ: పరిశుభ్ర రైల్వే స్టేషన్లకు ఏటా ఇచ్చే ‘స్వచ్ఛ్ రైల్, స్వచ్ఛ్ భారత్’ ర్యాంకుల జాబితాను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సోమ వారం విడుదల చేశారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. విజయవాడ 4, సికింద్రాబాద్ 6, హైదరాబాద్ 8, విశాఖపట్నం పదో స్థానంలో నిలిచాయి. ‘ఏ’కేటగిరీ రైల్వే స్టేషన్ల జాబితాలో వరంగల్లు మూడో స్థానం(గతేడాది 8వ స్థానం) దక్కించుకుంది. నిజామాబాద్ 6, మంచిర్యాల 8వ స్థానంలో నిలిచాయి. ఇక, ఏ1 స్టేషన్ల కేటగిరీలో తిరుపతి రైల్వే స్టేషన్ మూడోస్థానం (గతేడాది 19వ స్థానం) దక్కించుకుంది. పరిశుభ్రత కలిగిన రైల్వే జోన్ల జాబితాలో దక్షిణ మధ్య రైల్వే రెండోస్థానం దక్కించుకుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే తర్వాతి స్థానంలో నిలిచింది. -
సికింద్రాబాద్ నుంచి గజ్వేల్‌కు రైలు కూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి గజ్వేల్‌కు త్వరలోనే రైల్వే సదుపాయం అందుబాటులోకి రానుంది. మనోహరాబాద్–గజ్వేల్ మధ్య చేపట్టిన రైల్వే నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేసి రైళ్లను పట్టాలెక్కించే దిశగా దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. దీంతో ఇప్పటి వరకు కేవలం రోడ్డు సదుపాయం మాత్రమే ఉన్న గజ్వేల్ ప్రజలకు త్వరలోనే రైలు కూత వినిపించనుంది. హైదరాబాద్ నుంచి గజ్వేల్ మధ్య ప్రతిరోజు రాకపోకలు సాగించే వేలాది మందికి ఇది ఎంతో ప్రయోజనకరం కానుంది. ఈ మార్గంలో ప్యాసింజర్ రైళ్లను కూడా నడపనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 151 కిలోమీటర్ల పొడవైన మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణంలో మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 32 కిలోమీటర్లను మొదటి దశ కింద చేపట్టారు. ఇందుకోసం కావలసిన భూమిని, ఇతర మౌలిక సదుపాయాలను రాష్ట్రప్రభుత్వం అందజేసింది. దీంతో పనుల్లో వేగం పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి మనోహరాబాద్ వరకు డెమూ, మెమూ ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు లైన్లు పూర్తయితే ఈ రైళ్లను అక్కడి వరకు పొడిగిస్తారు. జనవరి నుంచి మార్చి మధ్యలో అన్ని భద్రతా పరీక్షలను పూర్తి చేసుకొని గజ్వేల్ వరకు రైళ్లను నడపనున్నారు. అలాగే ఈ మార్గంలో ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలకు కూడా మార్గం సుగమం కానుంది. నాలుగు దశల్లో కొత్తపల్లి వరకు రైల్వేలైన్లు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు నేరుగా రైల్వే సదుపాయం లేదు. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం మనోహరాబాద్–కొత్తపల్లి లైన్లను ప్రతిపాదించింది. దీనికి రైల్వేశాఖ నుంచి ఆమోదం లభించింది. మొత్తం రూ.1,160 కోట్ల అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి, మౌలిక వసతులను ఉచితంగా అందజేయడంతో పాటు నిర్మాణ వ్యయంలో మూడో వంతు నిధులను అందజేస్తోంది. ఇప్పటి వరకు రెండు విడుతలుగా రూ.500 కోట్లను రాష్ట్రం విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును మొత్తం 4 దశల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. మొదటి దశలో మనోహరాబాద్–గజ్వేల్ (32 కిలోమీటర్లు), రెండో దశలో గజ్వేల్– దుద్దెడ (33 కిలోమీటర్లు), మూడో దశ కింద దుద్దెడ–సిరిసిల్ల (48 కిలోమీటర్లు), నాలుగోదశలో సిరిసిల్ల– కొత్తపల్లి (38 కిలోమీటర్లు) మధ్య పనులను పూర్తి చేస్తారు. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. కొత్తగా రెండు రైల్వేస్టేషన్లు అటు రైల్వేశాఖ, ఇటు రాష్ట్రప్రభుత్వం సమన్వయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా మనోహరాబాద్–గజ్వేల్ మధ్య నాచారం, ఈరానగర్లలో రెండు కొత్త రైల్వేస్టేషన్లను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ట్రాక్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. 4 భారీ బ్రిడ్జీలు, మరో 43 చిన్న బ్రిడ్జీలను నిర్మిస్తున్నారు. మరో 2 అతి పెద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జీలు, 6 చిన్న ఆర్వోబీలను ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. -
రైల్వే ఆఫర్ : 80 లక్షల మందికి ఉచిత వై-ఫై
న్యూఢిల్లీ : దేశీయ రైల్వే స్టేషన్లన్నీ వైఫై హంగులను సమకూర్చుకుంటున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న 700కి పైగా స్టేషన్లలో ఉచిత పబ్లిక్ వై-ఫై సర్వీసులను ఆఫర్ చేస్తున్నట్టు దేశీయ రైల్వే ప్రకటించింది. ఇది ప్రతి నెలా 80 లక్షల మంది ప్రజలను కవర్ చేయనుంది. టెక్ దిగ్గజం గూగుల్‌తో కలిసి, దేశీయ రైల్వే ఈ సర్వీసులను ఆఫర్ చేస్తోంది. ‘రైల్ టెల్, అన్‌కనెక్టెడ్‌ను కనెక్ట్ చేయాలని అంకిత భావంతో ఉంది. 700 ప్లస్ రైల్వే స్టేషన్లలో రైల్‌వైర్ హాట్స్పాట్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీంతో నెలకు 80 లక్షల మంది ప్రజలకు ఈ ఉచిత వై-ఫై అనుభవాన్ని అందించనున్నాం’ అని దేశీయ రైల్వే టెలికాం సంస్థ రైల్‌టెల్ ట్వీట్ చేసింది. ఈ సర్వీసులను 30 నిమిషాల పాటు ఉచితంగా అందిస్తామని, ఒక్కో సెషన్‌పై సగటున 350 ఎంబీ డేటాను యూజర్లు వాడుకోవచ్చని తెలిపింది. నెలవారీ డేటా వినియోగం ఈ ఉచిత నెట్‌వర్క్‌పై 7000 టీబీలకు పైగా నమోదవుతుందని పేర్కొంది. ఈ సర్వీసులు ప్రస్తుతం 407 అర్బన్ రైల్వే స్టేషన్లు, 298 రూరల్ స్టేషన్లలలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ స్టేషన్లలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, చండీగఢ్, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, గోవా, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జమ్ము కశ్మీర్, జార్ఖాండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, రాజస్తాన్, తెలంగాణ, త్రిపుర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్‌లు ఉన్నాయి. 2016 జనవరిలో ముంబై నుంచి తొలుత ఈ సర్వీసులను దేశీయ రైల్వే ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద లాంచ్ అయిన ఏడాదిలో 100 స్టేషన్లను కవర్ చేసింది. 6వేలకు పైగా స్టేషన్లలో ఈ ఉచిత వై-ఫై సర్వీసులను రైల్వే విస్తరిస్తుందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. -
400 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ రైల్‌టెల్‌తో కలిసి దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని విజయవంతంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. అస్సాంలోని దిబ్రూగర్‌లో ఉచిత వైఫై సౌకర్యాన్ని ప్రారంభించడం ద్వారా 400 స్టేషన్లలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినట్టయిందని అధికారులు తెలిపారు. లక్షలాది ప్రయాణీకులకు హైస్పీడ్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావడం మరుపురాని అనుభవంగా గూగుల్ ఇండియా పార్టనర్షిప్స్ డైరెక్టర్ కే. సూరి పేర్కొన్నారు. 2016 జనవరిలో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో వైఫై కనెక్టివిటీ కార్యక్రమానికి ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌తో శ్రీకారం చుట్టారు. రైల్‌టెల్ సమకూర్చిన మౌలిక వసతులతో గూగుల్ తన వైర్లెస్ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌ను జోడించి ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. -
పేరుకే రైల్వే స్టేషన్లు!
తలమడుగు(బోథ్) : బోథ్ నియోజకవర్గంలో తలమడుగు, ఉండమ్ గ్రామంలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ రెండు స్టేషన్లు ప్యాసింజర్ రైళ్లకే పరిమితమయ్యాయి. ఇక్కడ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. గతంలో తాంసీ, తలమడుగు మండల ప్రజల రావాణా సౌకర్యార్థ్థం రైలు ప్రయాణం మాత్రమే ఉండేది. ఉండమ్, తలమడుగు రైల్వే స్టేషన్లను పాలకులు పట్టించుకోక పోవడంతో స్టేషన్లలో కనీస వసతులు కరువయ్యాయి. 1976లో నుంచి అసౌకర్యాలే.. 1976లో తలమడుగు గ్రామం మీదుగా మహరాష్ట్ర కిన్వాట్ మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. బోథ్ నియోజకవర్గంలో బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నుర్, సిరికొండ, బీంపూర్, తాంసీ, తలమడుగు, మండలాలు ఉన్నాయి. వాటిలో తలమడుగు రైల్వే స్టేషన్ మాత్రం తాంసీ, తలమడుగు, భీంపూర్, మండలాల ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు. మూడు మండలాలకు చెందిన ప్రజలు తరచూ హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈస్టేషన్ మీదుగా దీక్షభూమి, పాట్నా, నాందేడ్ స్పెషల్, నందిగామ్, కృçష్ణ, సంత్రగాంచి, ఎక్స్‌ప్రెస్ రైళ్లు వెళ్తుంటాయి, కేవలం ప్యాసింజర్ రైళ్లు రెండు మాత్రమే ఇక్కడ అగుతాయి. బస్సు చార్జీలు ప్రయాణికులకు భారమవుతుండడంతో నిరుపేద, మధ్యతరతి ప్రజలు రైళ్లోనే ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఇక్కడ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో దూరప్రాంతాలకు వెళ్లే వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకోని అధికారులు.. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని, రైల్వే స్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపర్చాలని గతంలో పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ తలమడుగులోని రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. తాగునీటి వసతి, ప్రాయాణికులు కూర్చోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేవని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఎండాకాలం ఎండలో, వర్షాకాలంలో తడుస్తూ రైలు ప్రయాణం చేస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. నిత్యం వందల సంఖ్యలో ప్రాయణికులు స్టేషన్ నుంచి ప్రాయాణం సాగిస్తున్నా అధికారులు వసతులు కల్పించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఎక్స్‌ప్రెస్ రైలు ఆపకపోవడంతో జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లి తిరిగి ఎక్స్‌ప్రెస్ రైలులో తలమడుగు, ఉండమ్, రైల్వే స్టేషన్ల మీదుగానే వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో డబ్బులు, సమయం వృథా అవుతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఎంపీ గోడం నగేశ్ చొరవ తీసుకుని తలమడుగులో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని, ఉండమ్, తలమడుగు రైల్వే స్టేషన్లలో కనీస వసతులు కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలి తలమడుగు రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ రైళ్లు మాత్రమే అపుతున్నారు. మిగతా రైళ్లు ఇక్కడ ఆపడం లేదు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఆక్కడి నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లి అక్కడి నుంచి వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ రైళ్లు నిలిపితే ఎలాంటి సమస్యలు ఉండవు. గతంలో నాందేడ్, నుంచి రైల్వే ఉన్నధికారులు వచ్చి పరిశీలించి వెళ్లారు తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. – లింగాల రాజన్న, తలమడుగు కనీస సౌకర్యాలు కల్పించాలి రైల్వె స్టేషన్లో ప్రాయాణికులకు కూర్చోడానికి కుర్చీలు తాగేందుకు నీటి సౌకర్యం లేవు. దీంతో ఇక్కడకు వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ కాలంలో ఎండను, వర్షాకాలంలో వానను తట్టుకుని ప్రయాణం చేస్తున్నాం. రైల్వే స్టేషన్‌కు రావాలంటే రోడ్డు పూర్తిగా బురదమయంగా ఉంటుంది. బురదలోంచి నడిచి వస్తున్నాం. కనీసం తాగునీటి సౌకర్యం, కనీస సౌకర్యాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – శరత్‌యాదవ్, తాంసీ -
రైల్వేస్టేషన్లలో శానిటరీ నాప్కిన్ల అమ్మకం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్ల లోపల, బయట శానిటరీ నాప్కిన్లతో పాటు కండోమ్స్‌ను అమ్మాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రైల్వేస్టేషన్ల సమీపంలో నివసించే ప్రజల కోసం ఉచిత మరుగుదొడ్లను నిర్మించాలన్న ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఈ మేరకు అధికారులు రూపొందించిన ‘టాయిలెట్ పాలసీ’కి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు రైల్వేస్టేషన్ల సమీపంలో మరుగుదొడ్లను నిర్మించాలని సూచించినట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రైల్వేస్టేషన్ల లోపల, బయట చౌకగా లభించే శానిటరీ నాప్కిన్లు, కండోమ్స్ అమ్మేందుకు కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధి సాయంతో దేశవ్యాప్తంగా 8,500 రైల్వేస్టేషన్లలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.