ఫైల్ ఫోటో
సాక్షి, చెన్నై: ఉరుకుల పరుగుల పయనంలో కన్నుమూసి తెరిచేలోపే ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న కాలంలో బతుకుతున్నాం.. కానీ ఒక్కక్షణం ఆ ప్రమాదం నుంచి బయటపడితే.. పునర్జన్మ లభిస్తే.. నిజంగా జీవితం విలువ ఏమిటో తెలిసి వస్తుంది. చెన్నైలోని ఎగ్‌మోర్ రైల్వే స్టేషన్‌లో సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. క్షణాల్లో అప్రమత్తమైన ఆర్‌పీఎఫ్ సిబ్బంది ఒకరు ప్రయాణికుడిని మృత్యుముఖం నుంచి బయటపడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
కదులుతున్నరైలును అందుకునేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడు. అంతే ప్రమాదాన్ని పసిగట్టిన ఆర్‌పీఎఫ్ ఉద్యోగి ఒకరు మెరుపువేగంతో కదిలి ఆ ప్రయాణికుడిని రక్షించారు. దీంతో తృటిలో ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు. ఏ మాత్రం ఆలస్యమైనా ప్లాట్‌ఫాంకు, రైలుకు మధ్య పడి ప్రాణాలు పోవడం ఖాయం. జస్ట్ వాచ్ ది వీడియో.. అండ్ బీ ఎలర్ట్
#WATCH: Railway Protection Force (RPF) personnel saved a passenger's life by rescuing him from falling, while he was boarding a train at Egmore Railway Station's platform. The passenger didn't suffer any injury. #TamilNadu (12.11.18) pic.twitter.com/OdNDYMdu2y
— ANI (@ANI) November 14, 2018
Comments
Please login to add a commentAdd a comment