escape
-
నా భార్యకు నేను మూడో భర్తను!
బనశంకరి: వివాహం చేసుకోవడానికి అమ్మాయిల కొరత ఉందనే సాకుతో కొందరు మోసగాళ్లు పురుషులను నిండా ముంచుతున్నారు. ఓ వ్యక్తికి ఉత్తుత్తి పెళ్లి చేసి లక్షలాది రూపాయలను తీసుకుని బ్రోకర్, వధువు ఉడాయించారు. బాగల్కోటె జిల్లా ముధోళ్వాసి సోమశేఖర్ బాధితుడు. శివమొగ్గ మంజుళ అనే యువతిని పెళ్లి చేసి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమెకు 3వ పెళ్లి ఇప్పటికే రెండు పెళ్లిలు చేసుకున్న శివమొగ్గవాసి మంజుళతో బ్రోకర్ సత్యప్ప మాట్లాడాడు. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి వేటలో ఉన్న సోమశేఖర్‌ను టార్గెట్ చేసుకున్నారు. అమ్మాయిని చూపించి పెళ్లి చేస్తామని రూ.4 లక్షలు డిమాండ్ చేశాడు. ఆడపిల్ల దొరకలేదని బాధలో ఉన్న సోమశేఖర్ ఎగిరి గంతేశాడు. ముధోళ్లోని కాళికా దేవి దేవస్థానంలో ఏడాది క్రితం పెళ్లి జరిపించారు. ఆ రోజునే బ్రోకర్ రూ.4 లక్షలు వసూలు చేశాడు. నెలరోజులు కాపురం సాగిందో లేదో ఓ రోజు మంజుళ ఉడాయించింది. సోమశేఖర్ ఆమె గురించి విచారించగా ఇప్పటికే రెండు పెళ్లిళ్లయినట్లు తెలిసింది. బ్రోకర్ ఇలాంటివారితో కలిసి మోసాలకు పాల్పడుతుంటాడని గుర్తించాడు. దీంతో డబ్బు తిరిగి ఇవ్వాలని బ్రోకర్‌ను కోరాడు. అతడు పట్టించుకోకపోవడంతో 7 మందిపై కేసు పెట్టాడు. -
అమెరికా పోలీసుల కోతుల వేట
పోలీసులేంటి? కోతులను వెదకడమేంటని? ఆశ్చర్యపోకండి. అవి మామూలు కోతులు కాదు. పరిశోధన కేంద్రం నుంచి తప్పించుకున్నవి. సౌత్ కరోలినాలోని ఎమసీ పట్టణంలో ఓ రీసెర్చ్ ఫెసిలిటీ సెంటర్ ఆల్ఫా జెనెసిస్ ఉంది. ఇక్కడ వైద్య పరీక్షలు, పరిశోధనల కోసం కోతులను పెంచుతుంటారు. ప్రస్తుతం సంస్థలో 50 కోతులున్నాయి. అయితే బుధవారం దేశమంతా ఎన్నికల హడావిడిలో ఉండగా.. కోతులు మాత్రం తప్పించుకున్నాయి. బయటి ఎన్‌క్లోజర్ తలుపులు తెరిచి ఉండటంతో 43 కోతులు బయటికి పారిపోయాయని అధికారులు వెల్లడించారు. తప్పించుకున్నాయని, ప్రజలంతా తమ ఇళ్ల తలుపులు, కిటికీలను సురక్షితంగా మూసివేయాలని, ఎక్కడైనా కోతులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. తప్పించుకున్నవి 3.2 కిలోల బరువున్న ఆడ కోతులని పోలీసులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అయితే వర్షం పడుతుండటంతో గాలింపు చర్యలకు కొంత అంతరాయం ఏర్పడింది. కోతులు ఫెసిలిటీలో ఆపిల్స్ వంటి ఆహారాన్ని తిని పెరిగాయని, అడవిలో ఆకులు, అలములు తప్ప ఏమీ దొరకవు కాబట్టి అవి తిరిగి వచ్చే అవకాశం ఉందని ఆల్ఫా జెనెసిస్ సీఈఓ గ్రెగ్ వెస్టర్‌గార్డ్ చెబుతున్నారు. ఈ కేంద్రం నుంచి కోతులు తప్పించుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2016లో 19 కోతులు తప్పించుకుని ఆరు గంటల తర్వాత తిరిగొచ్చాయి. రెండేళ్ల కిందట 26 కోతులు తప్పించుకున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల్ని కర్ణాటక పోలీసులు క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం గత గురువారం నగరానికి తీసుకువచ్చారు. వీరంతా పోచారంలోని బృందావన్ హోటల్లో బస చేశారు. శుక్రవారం తెల్లవారుజామున కీలక నిందితుడు అంకుర్ రాణా తప్పించుకుని పారిపోయాడు. దీంతో కర్ణాటక పోలీసులు ఐటీ కారిడార్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వెలుగులోకి వచి్చన అంశాల ప్రకారం కేసును ఇక్కడకు బదిలీ చేయాల్సి ఉండగా.. కర్ణాటక పోలీసులు చూపించిన అత్యుత్సాహం కారణంగానే ఇలా జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుకారాంగేట్ టు సంస్కృతి టౌన్షిప్ నగరంలోని తుకారాంగేట్‌కు చెందిన రమేష్ కుమార్ భార్య, కుమార్తెకు దూరంగా పోచారంలో ఉన్న సంస్కృతి టౌన్íÙప్లో ఒంటరిగా ఉండేవారు. భువనగిరికి చెందిన ఆకుల లత చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈమె బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఈ నేపథ్యంలోనే తన పేరును నిహారికగా మార్చుకుంది. గతంలో ఇద్దరిని పెళ్లి చేసుకుని, వారి నుంచి వేరు పడిన నిహారికకు మాట్రిమోనియల్ సైట్ ద్వారా రమే‹Ùతో పరిచయం ఏర్పడింది. 2018లో రిజిస్టర్ వివాహం చేసుకున్న వీళ్లు సంస్కృతి టౌన్‌షిప్‌లోనే కాపురం పెట్టారు. నిహారిక మాత్రం ఉద్యోగ నిమిత్తం అంటూ ఎక్కువ రోజులు బెంగళూరులోనే ఉండేది. ఈమె తన రెండో భర్తతో కలిసి హరియాణాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసి జైలుకు వెళ్లింది. అక్కడే ఈమెకు అంకుర్ రాణా అనే నేరగాడి తల్లితో పరిచయమైంది. ఆమెను కలవడానికి ములాఖత్‌కు వచ్చే అంకుర్తోనూ స్నేహం ఏర్పడింది. జర్మనీలో ఉద్యోగం కోసం నగదు అవసరమంటూ.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వాసవీ నగర్ నుంచి బెంగళూరులోని రామమూర్తి నగర్ వెటర్నరీ డాక్టర్‌గా స్థిరపడిన నిఖిల్ మైరెడ్డితో నిహారికకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నిహారిక తనకు జర్మనీలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం వచి్చందని, దాని నిమిత్తం రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందంటూ రమే‹Ùతో చెబుతూ వస్తోంది. కొన్నాళ్లుగా ఆమె ప్రవర్తన, మాటలపై సందేహాలు రావడంతో డబ్బు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ విషయంలోనే వీరి మధ్య వివాదం నెలకొంది. రమేష్ ఇటీవల తన స్తిరాస్థిని విక్రయించగా వచ్చిన రూ.8 కోట్లు కాజేయాలని నిహారిక పథకం వేసింది. రమేష్‌ను హత్య చేయడం ద్వారా దీన్ని అమలు చేయాలని అంకుర్ రాణాను సంప్రదించింది. అతడు అంగీకరించడంతో ఇరువురూ కలిసి గత నెల 1న నగరానికి చేరుకున్నారు. పీర్జాదిగూడలో చంపి.. మృతదేహంతో 800 కి.మీ ప్రయాణించి.. బోడుప్పల్ ప్రాంతంలో అంకుర్ బస చేయగా.. నిహారిక మాత్రం రమేష్ ఇంటికి వెళ్లింది. రెండు రోజుల పాటు వీరి మధ్య నగదు విషయంలో వాగ్వాదం జరిగింది. గత నెల 3 రాత్రిన తనను విమానాశ్రయంలో వదిలి రావాలంటూ నిహారిక కోరగా.. రమేష్ తన మెర్సిడిస్ బెంజ్ కారులో (టీఎస్ 07 ఎఫ్ఎస్ 5679) బయలుదేరారు. బోడుప్పల్–ఉప్పల్ మధ్యలో అంకుర్ వీరి వాహనం ఎక్కాడు. అతడిని తన సహోద్యోగిగా పరిచయం చేసింది. వీరి వాహనం పీర్జాదిగూడ కమాన్ వద్దకు చేరుకున్నాక వెనుక సీటులో కూర్చున్న అంకుర్ తన వద్ద ఉన్న వైరుతో రమే‹Ùకు ఉరి బిగించి చంపాడు. ఆపై వీళ్లు నిఖిల్‌ను సంప్రదించారు. అతడి సూచనల మేరకు మృతదేహాన్ని కారులో ఉంచుకుని దాదాపు 800 కి.మీ ప్రయాణించారు. ఊటీ సమీపంలోని సుంటికొప్పలో (కర్ణాటక) ఉన్న కాఫీ ఎస్టేట్‌లో పెట్రోల్ పోసి మృతదేహాన్ని దహనం చేసి కారుతో పారిపోయారు. గత నెల 8న సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కొడుగు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు నిహారిక, నిఖిల్‌లను బెంగళూరులో, అంకుర్‌ను హరియాణాలో అరెస్టు చేశారు.అవకాశం ఉన్నా బదిలీ చేయకుండా... నిందితుల విచారణ నేపథ్యంలో ఈ హత్య పీర్జాదిగూడలో జరిగినట్లు తేలింది. నిబంధనల ప్రకారం ఆ వెంటనే ఈ కేసును రాచకొండకు బదిలీ చేయాలి. కొడుగు పోలీసులు మాత్రం అత్యుత్సాహం చూపిస్తూ అలా చేయలేదు. దర్యాప్తు కొనసాగిస్తూ నిందితులను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం వారిని తీసుకుని నగరానికి వచ్చి పోచారంలోని బృందావన్ లాడ్జిలో బస చేశారు. గత గురువారం సంస్కృతి టౌన్షిప్, బోడుప్పల్, పీర్జాదిగూడల్లో వీరిని తిప్పారు. ఆ రోజు రాత్రి హోటల్ గదిలో అంతా నిద్రపోతుండగా.. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అంకుర్ ఎస్కేప్ అయ్యాడు. దీంతో కర్ణాటక పోలీసులు దీనిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులను తీసుకుని శనివారం కొడుగు వెళ్లిపోయారు. పరారైన అంకుర్ కోసం కర్ణాటక, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. -
రియల్టర్ రమేష్ హత్య కేసు: నిందితుడు రాణా పరార్
సాక్షి,హైదరాబాద్: స్థిరాస్తి వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాణా కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. అక్టోబర్ 4వ తేదీన హైదరాబాద్‌లోని పోచారం ఐటీకారిడార్ ఠాణా పరిధి సంస్కృతి టౌన్ షిప్లో నివాసం ఉంటున్న రియల్టర్ రమేష్ కుమార్ భార్య నిహారిక, ప్రియుడు రాణాల చేతులో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య అనంతరం నిందితులు రమేష్‌కుమార్ మృతదేహాన్ని కారులో కర్ణాటకు తరలించారు. అక్కడ నిహారిక మరో ప్రియుడు నిఖిల్ రెడ్డితో కలిసి కొడుగు జిల్లా సుంటికుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని కాఫీ తోటలో మృతదేహాన్ని ముక్కలు చేసి నిప్పు పెట్టిన నిందితులు పారిపోయారు. నిందితులను సీసీ కెమెరా ద్వారా నిందితులను గుర్తించిన సుంటికుప్ప పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం నిందితులను 10రోజుల కస్టడీకి తీసుకున్నారు. సీన్ రీ కన్స్ట్రషన్ కోసం అక్టోబర్ 30వ తేదీన నిందితులను పోచారం ఐటీకారిడార్ ఠాణాకు తీసుకువచ్చారు. దర్యాప్తు లో భాగంగా రెండు రోజుల పాటు ఇక్కడనే ఉండేందుకు వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్న బృందావనం హోటల్లో 6 గదులను అద్దెకు తీసుకున్నారు. తెల్లవారుజామున నిందితుడు రాణా కానిస్టేబుల్ హరీష్ మొబైల్ తీసుకుని పారిపోయాడని ఎస్ఐ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం స్థానిక పోలీసులతో పాటు కర్ణాటక పోలీసులు గాలిస్తున్నారు.ఇదీ చదవండి: స్నేహితుడితో కలిసి భర్తను చంపిన భార్య -
జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం
-
జైలు నుంచి తప్పించుకుంటూ... 129 మంది ఖైదీలు మృతి
కిన్షాసా: కాంగో రాజధాని కిన్షాసాలోని సెంట్రల్ మకాలా జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో 129 మంది మృతి చెందారు. వారిలో 24 మంది కాల్పుల్లో చనిపోయినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రి జాక్వెమిన్ మంగళవారం తెలిపారు. ‘‘తప్పించుకునేందుకు జైలుకు ఖైదీలు నిప్పు పెట్టారు. జైలు భవనం, ఫుడ్ డిపోలు, ఆసుపత్రిలో మంటలు చెలరేగి ఊపిరాడక చాలామంది చనిపోయారు.ఈ గందరగోళం మధ్యే పలువురు మహిళా ఖైదీలు అత్యాచారానికి కూడా గురయ్యారు’’ అని వివరించారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన వారిలో పలువురిని పోలీసులు హతమార్చినట్టు సమాచారం. మకాలా జైలు సామర్థ్యం 1,500 మాత్రమే. కానీ అధికారిక లెక్కల ప్రకారమే 15,000 మంది ఖైదీలున్నారు. వీరిలో ఎక్కువ విచారణ ఖైదీలేనని ఆమ్నెస్టీ నివేదిక పేర్కొంది. -
పోకిరీల భయంతో రైలెక్కిన ఇద్దరు బాలికలు
యువతులను వేధించే పోకిరీల ఆగడాల గురించి తరచూ వింటుంటాం. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే కుర్రాళ్ల గురించి కూడా వినేవుంటాం. ఇలాంటి యువకుల నుంచి తప్పించుకునేందుకు మహిళలు, యువతులు నానా అవస్థలు పడుతుంటారు. తాజాగా పోకిరీల భయంతో ఇద్దరు బాలికలు చేసిన పని చర్చనీయాంశంగా మారింది.ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న గార్డుకు ఇద్దరు బాలికలు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో ఆయన వారిని ప్రశ్నించగా వారు తమకు ఎదురైన అనుభవాన్ని తెలిపారు. తాము హత్రాస్‌లో నివాసముంటామని, ట్యూషన్ ముగిశాక, ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు పోకిరీలు తమకు ఎదురయ్యారని, వారి నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు చేరుకుని హడావుడిగా రైలు ఎక్కినట్లు తెలిపారు. ఇంతలో రైలు స్టార్ట్ అయ్యిందని, తాము 140 కిలోమీటర్ల దూరంలోని ఇటావా స్టేషన్ రాగానే స్టేషన్లో దిగేశామని తెలిపారు. వీరి మాటలు విన్న గార్డు ఈ సమాచారాన్ని చైల్డ్ వెల్ఫేర్ సంస్థకు తెలిపారు. వారు ఈ బాలికలను వారి హత్రాస్‌లోని వారి ఇళ్లకు పంపించారు. -
ఏటీఎంల్లో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో ఉద్యోగి పరార్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి దానవాయిపేటలో ఘరానా మోసం జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ పరిధిలో ఉన్న ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ ఉద్యోగి వాసంశెట్టి అశోక్ పరారయ్యాడు. 19 ఏటీఎంల్లో ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా డబ్బుతో హుడాయించాడు. అశోక్‌పై 'ఇటాచి ప్రైవేట్ ఏజెన్సీ' అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రాజమండ్రి సౌత్ జోన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న టోల్ గేట్లు వద్ద తనిఖీలు చేస్తున్నారు. -
వందేభారత్, జనశతాబ్ధి రైళ్లకు తప్పిన ప్రమాదం
బీహార్‌లోని గయ జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్ రైల్వే సెక్షన్లో ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది.గయ జిల్లాలో గల ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్ రైల్వే సెక్షన్ పరిధిలోని మాన్పూర్ జంక్షన్లో హోమ్ సిగ్నల్ దగ్గర ఓవర్‌హెడ్ వైరు తెగిపోయింది. ఈ నేపధ్యంలో రాంచీ-పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రాంచీ-పట్నా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లను ముందుజాగ్రత్త చర్యగా అంతకు ముందుగల స్టేషన్లలో నిలిపివేశారు. తెగిన వైర్‌ను సరిచేయడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. దీంతో వందే భారత్, జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలోని ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.మాన్పూర్ జంక్షన్ హోమ్ సిగ్నల్ సమీపంలో ఓవర్ హెడ్ వైరు తెగిపోవడంతో రైల్వే సిబ్బంది వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. దీంతో ట్రాక్షన్ డిపార్ట్మెంట్, ఇతర విభాగాలకు చెందిన బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రాత్రి తొమ్మిది గంటలకు మరమ్మతు పనులు పూర్తయ్యాక ఈ మార్గంలోని కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ప్రమాద సమయంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను గుర్పా రైల్వే స్టేషన్లో, జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను టంకుప్ప రైల్వే స్టేషన్లో నిలిపివేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. -
ఏం బుర్రరా అయ్యా! చిరుతకే షాకిచ్చాడు..!
చిరుతపులి వస్తే పెద్దవాళ్లమే కంగారు పడిపోతాం.. అస్సలు ఏం చేయాలో తోచదు.. కానీ ఒక 12 ఏళ్ల బుడ్డోడు మాత్రం భలే చాకచక్యంగా వ్యవహరించాడు. అదీ చాలా తాపీగా...దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన నాసిక్‌లోని మాలేగావ్‌లో వెలుగుచూసింది. మోహిత్ అహిరే (12) ఇంటి మెయిన్ డోర్ తలుపు దగ్గరే ఉన్న సోఫాలో కూర్చుని స్మార్ట్‌ఫోన్ మొబైల్ గేమ్‌లో మునిగిపోయాడు. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో తెలియదుగానీ, నేరుగా ఇంట్లోకి వచ్చేసింది చిరుతపులి. అనూహ్యంగా మోహిత్‌కి అతి సమీపంనుంచే లోపలికి దర్జాగా ఎంట్రీ ఇచ్చేసింది. ఇది చూసిన మోహిత్ ఏమాత్రం కంగారు పడకుండా అక్కడినుంచి లేచి, బయటికి వచ్చేసి, తలుపు లాక్ చేశాడు. ఈ దృశ్యాలు సీసీటీవలో రికార్డ్ అయ్యాయి. అతని రియాక్షన్ ఇపుడు ఇంటర్నెట్లో ప్రశంసల్ని దక్కించు కుంటోంది. వన్య ప్రాణులు ఎదురుపడి నపుడు ప్రశాంతంగా ఉండటం, అక్కడినుంచి తప్పించుకోవడం అనే విషయాలను గుర్తు చేసింది. What an amazing presence of mind Mohit Ahire, a 12-year-old boy, locked a leopard inside an office cabin until assistance arrived in Malegaon & the leopard was rescued. Mohit immediately informed his father, who is a security guard, that he trapped a leopard inside the office. pic.twitter.com/FELlOGac1t — Anshul Saxena (@AskAnshul) March 6, 2024 మోహిత్ అహిరే తండ్రి మ్యారేజ్ హాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆఫీస్ క్యాబిన్లో కూచుని గేమ్ ఆడుకుంటుండగా మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులు వచ్చేంతవరకు ఆఫీసు క్యాబిన్లో దానిని బంధించారు. ‘‘ముందు దాన్ని చూడగానే షాక్ అయ్యా..కానీ, వెంటనే తేరుకుని బైటపడ్డా..తలుపును వేగంగా లాక్ చేశా..’’అంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు మోహిత్ అంతకుముందే సమీప నివాస ప్రాంతంలో చిరుతపులిని గమనించారు స్థానికులు. తరువాత మ్యారేజ్ హాల్ యజమానికి ఫిర్యాదు మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులు , అధికారులు వేగంగా స్పందించారు. ఐదేళ్ల మగ చిరుతపులిని బంధించారు. సమీపంలోనే వ్యవసాయ పొలాలు, నది ఉండటం వల్ల ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు చిరుతపులులు కనిపిస్తున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. -
Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ సొరంగంలో డ్రిల్లింగ్ నిలిపివేత
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలోని సిలి్కయారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు ఇంకా బయటకురాలేదు. వారం రోజుల క్రితం సొరంగం కూలిపోవడంతో వారు అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కార్మికులు బయటకు రావడానికి వీలుగా ఎస్కేప్ మార్గాన్ని సిద్ధం చేయడానికి తలపెట్టిన డ్రిల్లింగ్ పనులను ఆదివారం నిలిపివేశారు. డ్రిల్లింగ్ యంత్రానికి అడ్డంకులు ఎదురు కావడమే ఇందుకు కారణం. గట్టి రాళ్లు రప్పలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం సమీక్షించారు. బాధితులను క్షేమంగా బయటకు తీసుకురావడానికి భారీ డయామీటర్ స్టీల్ పైపులైన్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సొరంగం శిథిలాల గుండా ఈ పైపులైన్‌ను పంపించనున్నట్లు తెలిపారు. సొరంగంలో కార్మికులు ఉన్న చోటుకి చేరుకోవడానికి నిట్టనిలువుగా కంటే అడ్డంగా తవ్వడమే సరైందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా యంత్రానికి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుంటే రెండున్నర రోజుల్లో కార్మికులు ఉన్న చోటుకి చేరుకోవచ్చని వెల్లడించారు. సొరంగంలో కార్మికులు స్వేచ్ఛగా అటూ ఇటూ తిరగగలుగుతున్నారని, వారికి ఆహారం, నీరు, విద్యుత్, ఆక్సిజన్ అందుతున్నాయని, ప్రాణాపాయం లేదని నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు.అమెరికా యంత్రంతో అతిత్వరలో డ్రిల్లింగ్ ప్రారంభిస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. సొరంగంలో ఉన్న కార్మికులకు మల్టీ విటమిన్ మాత్రలు, ఎండు ఫలాలు తదితరాలు అందిస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ఆదివారం తెలిపారు. -
పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
సాక్షి, గుంటూరు: నాలుగు రోజుల క్రితం ఏలూరుకు చెందిన రైతులపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరుల దాడి చేసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీకి పాలు పోయించుకుని బోనస్ ఇస్తామంటూ ధూళిపాళ్ల మోసానికి తెరతీశాడు. సంగం డెయిరీ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన రైతులపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్డులతో విక్షచణారహితంగా ధూళిపాళ్ల అనుచరులు దాడి చేశారు. దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదుతో ధూళిపాళ్ల నరేంద్రతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు పోలీసులు .. వారిని పట్టుకోవడానికి మూడు స్పెషల్ టీంలుగా రంగంలోకి దిగారు.. నిన్న రాత్రి నుంచి నరేంద్రతో పాటు ఆయన అనుచరులు పరారీలో ఉన్నారు. నరేంద్ర ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. చదవండి: పెత్తందార్ల పెద్దా.. ఇదేనా మీ బాధ! -
టాలీవుడ్ తెరపై మరో డ్రగ్ మరక
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్ డ్రగ్ డొంక కదులుతోంది. తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులకు గత నెల 31న అక్కడి సర్వీస్ ఫ్లాట్‌లో చిక్కిన వారిలో ఫిల్మ్ ఫైనాన్షియర్ కె.వెంకటరమణారెడ్డి ఉండగా... గురువారం పట్టుబడిన వారిలో ‘డియర్ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి ఉన్నారు. హీరో నవదీప్, ‘షాడో’ చిత్ర నిర్మాత రవి ఉప్పలపాటి తదితరులు పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ఐసీసీసీలో టీఎస్–నాబ్ ఎస్పీ (వెస్ట్) డి.సునీతా రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్నాప్‌చాట్‌లో గాడ్ హెడ్స్ పేరుతో... నెల్లూరుకు చెందిన బి.బాలాజీ గతంలో ఇండియన్ నేవీలో అధికారిగా పని చేశాడు. కంటికి తీవ్రమైన గాయం కావడంతో మెడికల్లీ అన్‌ఫిట్ అయ్యాడు. దీంతో నేవీ నుంచి బయటకు వచ్చి వ్యాపారిగా మారాడు. తరచుగా హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే బాలాజీ తన స్నేహితులతో కలిసి ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లోని సర్వీస్ ఫ్లాట్‌లో రేవ్ పార్టీలకు హాజరయ్యేవాడు. ఇలా ఇతడికి హైదరాబాద్‌తో పా టు బెంగళూరు డ్రగ్ పెడ్లర్స్‌తో సంబంధాలు ఏర్ప డ్డాయి. దీంతో హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లు, గెస్ట్ హౌస్‌ల్లో రేవ్ పార్టీలు ఏర్పాటు నిర్వహించేవాడు. స్నాప్‌చాట్‌లో గాడ్ హెడ్స్ పేరుతో ఐడీ క్రియేట్ చేసి దీని ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఈ యాప్‌లో మెసేజ్ చదవగానే డిస్‌అప్పియర్ అయ్యే ఆప్షన్ ఉండటంతోపాటు కస్టమర్లకు ప్రత్యేక కోడ్లు ఇవ్వడం ద్వారా దందా సాగించాడు. గత నెల 31న ఇతడితోపాటు రమణారెడ్డి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ వద్ద సీనియర్ స్టెనోగా పని చేస్తున్న డి.మురళిని అరెస్టు చేశారు. వీరిని విచారించడంతో ఈ డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. నైజీరియన్ల ద్వారా రామ్ కిషోర్‌కు... బాలాజీ ముగ్గురు నైజీరియన్లతోపాటు నగరానికి చెందిన రామ్ కిషోర్ వైకుంఠం (పరారీలో ఉన్నాడు) నుంచి డ్రగ్స్ ఖరీదు చేసేవాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న నైజీరియన్లు అమోబీ చికోడి మొనగాలు, ఇక్బావే మైకేల్, థామస్ అనఘకాలు నుంచి బాలాజీకి కొకైన్, ఎండీఎంఏ, ఎక్స్టసీ అందుతున్నాయి. డ్రగ్ పార్టీల నిర్వహణకు బాలాజీకి రమణా రెడ్డి ఫైనాన్స్ చేస్తుండేవాడు.ఇతడికి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఖాతా ఉంది. ఇందులో ప్రస్తుతం రూ.5.5 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతోపాటు రమణారెడ్డి, బాలాజీలకు ఉన్న ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. వీటిని స్వాధీనం చేసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. బాలాజీ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసిన 18 మంది కస్టమర్లలో సినీ రంగానికి చెందిన వారితోపాటు పబ్‌లు, స్నూకర్ పార్లర్ల నిర్వా హకులు ఉన్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో స్నాట్ పబ్ నిర్వహించే సూర్య, జూబ్లీహిల్స్‌లో టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రో నిర్వహించే అర్జున్, గుంటూరులో స్నూకర్ పార్లర్ నిర్వహించే పీఎస్ కృష్ణ ప్రణీత్ కీలకం. వీరు తమ సంస్థల్లోనే రహస్య గదులు ఏర్పాటుచేసి డ్రగ్స్ వినియోగానికి సహకరిస్తూ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్లు ఆఫ్ చేసుకున్న నవ్‌దీప్, రవి బాలాజీ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్న వారిలో ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వారూ ఉన్నట్లు టీఎస్ నాబ్ గుర్తించింది. హీరో నవదీప్, షాడో, రైడ్ చిత్రాల నిర్మాత రవి ఉప్పలపాటి, మోడల్ శ్వేత, మాజీ ఎంపీ దేవరకొండ విఠల్‌రావ్ కుమారుడు సురేశ్ రావ్, ఇంద్రతేజ్, కార్తీక్‌లతోపాటు కలహర్‌రెడ్డి ఉన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు బెంగళూరులో జరిగిన డ్రగ్ పార్టీకి హాజరయ్యారనే విషయం 2021లో వెలుగులోకి వచ్చి కలకలం సృష్టించింది. ఈ పార్టీ నిర్వాహడుకు కలహర్రెడ్డే కావడం గమనార్హం. మరోపక్క ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేసిన 2017 నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ పేరు ఉంది. నిందితుల కోసం ఏసీపీ కె.నర్సింగ్‌రావు, ఇన్స్పెక్టర్ పి.రాజేష్, కానిస్టేబుల్ సత్యనారాయణ తదితరుల బృందం గాలించింది. అమోబీ చికోడి, ఇక్బావే మైకేల్, థామస్‌తోపాటు సురేశ్ రావ్, కొల్లి రామ్‌చంద్, కూరపాటి సందీప్, అనుగు సుశాంత్ రెడ్డి, కృష్ణ ప్రణీత్‌లను పట్టుకుంది. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. నవదీప్, రవి ఉప్పలపాటి సహా మిగిలిన నిందితులు తమ ఫోన్లు ఆఫ్ చేసుకుని, కుటుంబంతో సహా పరారయ్యారు. -
ఐదో ప్రేమికునితో ముగ్గురు పిల్లల తల్లి పరార్.. పోస్టర్‌తో భర్త వెదుకులాట!
ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో ముగ్గురు పిల్లల తల్లి తన ఐదవ ప్రేమికునితో వెళ్లిపోయింది. బాధిత భర్త తన ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని, చేతిలో భార్యకు సంబంధించిన ఫొటో పోస్టర్‌తో తిరుగుతూ ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పటివరకూ అతని ప్రయత్నాలు ఫలించలేదు. తన భార్య అదృశ్యమయ్యిందంటూ ఆ భర్త పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశాడు. భర్త అనిల్ రాజ్‌భర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను పనుల నిమిత్తం గతంలో చండీగఢ్ వెళ్లానని, అక్కడే రీనా అనే యువతితో పరిచయం అయ్యిందని తెలిపాడు. ఈ పరిచయం ప్రేమగా మారడంతో తాము వింద్యాచల్ మందిరంలో పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. పెళ్లి తరువాత తాము గ్రామానికి వచ్చేశామని, ఇక్కడే కాపురం పెట్టామని, తమకు ముగ్గురు పిల్లలు కలిగారని తెలిపాడు. ఈ విధంగా 9 ఏళ్లు గడిచిందని పేర్కొన్నాడు. బాధితుడు రాజ్‌భర్ పని నిమిత్తం తరచూ ఇతర ప్రాంతాలకు వెళుతుండేవాడు. ఈ సమయంలో ఆమె ఎవరితోనే మాట్లాడుతుండేదని రాజ్‌భర్ గమనించాడు. ఈ విషయమై ఆమెను ప్రశ్నంచగా ఆమె జవాబు చెప్పకుండా తప్పించుకునేది. అయితే ఇటీవల ఆమెకు ఎవరి దగ్గరి నుంచో ఫోను వచ్చింది. దీంతో ఆమె బయట ఏదో పని ఉందని వెళ్లింది. రాజ్‌భర్ సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి ఆమె ఇంటిలో లేదు. పిలలకు కూడా తల్లి ఎక్కడకు వెళ్లిందో తెలియలేదు. దీంతో తమకు తెలిసిన అన్ని ప్రాంతాలలోనూ వెదికినా రాజ్‌భర్‌కు భార్య ఆచూకీ దొరకలేదు. దీంతో అతను తన భార్య అదృశ్యం అయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నెల్లాళ్లు గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రాజ్‌భర్ తన భార్యకు సంబంధించిన పోస్టర్‌తో తనకు తెలిసిన అన్నిప్రాంతాల్లో తిరుగుతూ, భార్యకోసం వెదుకుతున్నాడు. రాజ్‌భర్ మీడియాతో మాట్లాడుతూ తన భార్య గతంలో తనకు ఎంతో మంది స్నేహితులు, ప్రేమికులు ఉండేవారని చెప్పేదని, దానిని తాను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదన్నారు. అయితే అప్పుడప్పుడు ఆమె తన ఐదవ ప్రేమికుని గురించి చేప్పేదని, అతనితోనే తన భార్య వెళ్లిపోయి ఉండవచ్చనే అనుమానం కలుగుతున్నదని రాజ్ భర్ పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి:ప్రపంచం మెచ్చిన ఐదుగురు హిందూ రాజులు -
అందమైన భామలను తడిమి చూసి వదిలేసిన ఎలుగు.. తెలివితో తప్పించుకున్నారిలా!
ఎలుగుబంటి ఎంతో శాంతస్వభావం కలిగినదని చెబుతుంటారు. అయితే అది ఒక్కోసారి రెచ్చిపోయినప్పుడు దానిని ఆపడం ఎవరితరమూ కాదని కూడా అంటుంటారు. అయితే మీరు ఎప్పుడైనా అడవిమార్గం గుండా వెళ్లినప్పుడు ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలో తెలుసా? దాని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసా? సోషల్ మీడియాతో తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో అందమైన భామలు తాము ఎలుగుబంటి నుంచి ఎలా తప్పంచుకున్నదీ ఒక వీడియోలో చూపించారు. ఎలుగు ముంగిట చిక్కి, ఆపదలో ఉన్నవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడేలా ఉంది. వైరల్ అవుతున్న వీడియోలో ముగ్గురు యువతులు రోడ్డుపక్కన ఉండటాన్ని గమనించవచ్చు. ఇంతలోనే వారి దగ్గరకు ఒక నల్లని ఎలుగుబంటి రావడాన్ని చూడవచ్చు. అది వారి దగ్గరకు వచ్చి, వారిని పట్టుకుంటుంది. అయితే ఆ యువతులు ఏ మాత్రం కంగారు పడకుండా కదలకుండా నిలుచునే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో ఆ ఎలుగుబంటి ఆ అందమైన యువతుల నుంచి ఎటువంటి ప్రమాదం లేదని భావించి, అక్కడి నుంచి కామ్‌గా వెళ్లిపోతుంది. ఈ వీడియోను ట్విట్టర్లో @CCTV IDIOTS పేరుతో షేర్ చేశారు. ఈ వీడియోకు క్యాప్షన్‌గా ‘ఎలుగుబంటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి.. శాంతంగా, స్థిరంగా నిలుచోండి’ అని రాశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 269.4కేకు పైగా వీక్షణలు దక్కాయి. 3వేలకు పైగా లైక్స్ దక్కాయి. ఒక యూజర్ తన కామెంట్లో ఒకవేళ ఆ ఎలుగుబంటికి ఆ యువతుల స్మెల్ నచ్చకపోయి ఉంటే ఏమయ్యేదోనని అనగా, మరొకరు ఆ ఎలుగుబంటి వారిని కావలించాలనుకుంటోంది అని రాశారు. ఇది కూడా చూడండి: పట్టుతప్పి పట్టాలపై పిల్లాడు.. క్షణాల్లో స్పందించిన కార్మికుడు.. కన్నార్పనీయని వీడియో! How to survive a bear attack… stand still and stay silent pic.twitter.com/zyE17dTbSv — CCTV IDIOTS (@cctvidiots) August 13, 2023 -
జైలు గోడ దూకి నేపాలీ యువతి పరార్..!.. ఆచూకీ చెబితే..
ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్ జిల్లా జైలులో ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధిత ఆరోపణలతో బందీగా ఉంటున్న నేపాలీ యువతి జైలు గోడ దూకి పారిపోయింది. దుస్తులతో తాడు తయారు చేసుకుని, దాని సాయంతో ఆ యువతి గోడ దూకి పారిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఆమెను పట్టుకునేందుకు 12 పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఆమె నేపాల్ పారిపోయే అవకాశం ఉన్నందున సహస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ)సాయంతో పోలీసులు నేపాల్ సరిహద్దుల్లో చెకింగ్ కట్టుదిట్టం చేశారు. ఆచూకీ చెబితే రూ. 10 వేలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిథోర్‌గఢ్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గల సీసీటీవీ ఫుటేజ్‌ల సాయంతో ఆ యువతిని వెదికిపట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ యువతి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 వేలు అందజేస్తామని తెలిపారు. పరారైన యువతిని పట్టుకునేందుకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. మాదకద్రవ్యం తరలిస్తుండగా.. నేపాల్‌లోని దుమలింగ్ గ్రామానికి చెందిన అనుష్క ఉరఫ్ ఆకృతి(25)ని రెండున్నరేళ్ల క్రితం ధార్చులాలో రెండున్నర కిలోల చరస్ (మాదకద్రవ్యం)తరలిస్తుండగా ఎస్ఎస్బీ పట్టుకుంది. ఆమె విచారణలో ఉన్నందున ఆమెను పిథోర్‌గఢ్ జిల్లా జైలులో బందీగా ఉంచారు. ఆమె పరారైన నేపధ్యంలో జైలుతో పాటు మొత్తం పోలీసు శాఖలో కలకలం చెలరేగింది. దీంతో పోలీసు బృందాలు ఆమె కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం పరారైన యువతి లింక్ రోడ్డు పరిధిలోని సీసీటీవీలో కనిపించింది. అక్కడి నుంచి ఆమె పాండే గ్రామం మీదుగా పరారవుతూ కనిపించింది. ఇది కూడా చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం -
అమ్మ దెబ్బలు తప్పించుకోవడానికి.. ఐదో ఫ్లోర్ నుంచి దూకి..
చైనాలో దారుణం జరిగింది. అమ్మ దెబ్బలను తప్పించుకోవడానికి ఓ బాలుడు(6) ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ నుంచి దూకేశాడు. బయటకు వెళ్లకూడదని కర్ర పట్టుకుని చివాట్లు పెడుతూ వస్తున్న తల్లిని చూసి పిల్లాడు ఆందోళన చెంది భవనంపై నుంచి దూకాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో తల్లి తన కుమారునితో జీవిస్తోంది. ఆమె భర్త ఉద్యోగ రీత్యా వేరే నగరంలో ఉంటున్నారు. అయితే.. పిల్లాడు అల్లరితో విసుగు తెప్పిస్తున్న క్రమంలో తల్లి తరచుగా చివాట్లు పెడుతుండేది. జూన్ 25న బాలుడు భవనంపై భాగానికి చేరాడు. ఇంటి నుంచి నిరంతరం బయటకు వస్తున్న క్రమంలో తల్లి బాలున్ని మందలించి లోపలికి తీసుకువెళ్లాలని భావించింది. ఓ కర్ర పట్టుకుని చివాట్లు పెడుతూ బాలుని వైపు వచ్చింది. అమ్మ తిడుతుందనే భయంతో బాలుడు ఐదు ఫ్లోర్ల భవనంపై భాగం నుంచి దూకేశాడు. అక్కడే ఉన్నవారు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అయితే.. ఈ ఘటనలో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ కాళ్లు, చేతులు విరిగిపోయాయని చైనా మీడియా వెల్లడించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కొందరు నెటిజన్లు ఫైరయ్యారు. పిల్లల రక్షణకు మరిన్ని చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏమైందో తెలియదు.. యువకుని చెంప చెల్లుమనిపించింది.. వీడియో వైరల్ -
తార్నకలో దారుణం.. నడిరోడ్డుపై లైంగిక దాడికి యత్నం!
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్ ఇచ్చే వంకతో ఓ యువతిపై నడిరోడ్డుపై.. అదీ బైక్ మీద అఘాయిత్యానికి ప్రయత్నించగా.. తప్పించుకునే క్రమంలో ఆమె ప్రాణం మీదకు తెచ్చుకుంది. తార్నక వద్ద లిఫ్ట్ ఇచ్చే వంకతో బైక్‌పై ఎక్కించుకుని లైంగిక దాడికి యత్నించారు. అయితే.. తప్పించుకునేక్రమంలో బైక్‌పై నుంచి దూకేసింది సదరు యువతి. అదే సమయంలో వెనక నుంచి లారీ దూసుకురావడంతో.. దాని కిందకు వెళ్లింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పేరు ఆర్తిగా గుర్తించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇదీ చదవండి: కిక్ ఎక్కి.. దోస్తును చంపేశారు! -
త్వరలో ఎస్కేప్
ఒకే ఒక్క పాత్రతో బాణాల క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్ పై శ్రీధర్ బాణాల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎస్కేప్’. శ్రుతీ ఫులారి హీరోయిన్గా నటించారు. ‘‘ఈ చిత్రానికి ఉత్తమ కథ, నటి, చిత్రం, సంగీతదర్శకుడు, దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, గాయని, కాస్ట్యూమ్ డిజైనర్.. ఇలా దాదాపు 30 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘‘హీరోయిన్గా తొలి చిత్రంలోనే సింగిల్ క్యారెక్టర్ చేయడం హ్యాపీ’’ అన్నారు శ్రుతి. ‘‘త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గౌతం కుమార్ పీఏ. -
జేబులోనే పేలిన మొబైల్: షాకింగ్ వీడియో వైరల్
న్యూఢిల్లీ: కేరళలో వరుసగా నమోదవుతున్నమొబైల్ ఫోన్ బ్లాస్ట్ సంఘటనలు ఆందోళన రేపుతున్నాయి. కేరళలోని త్రిస్సూర్‌లో 70 ఏళ్ల వృద్ధుడి చొక్కా జేబులో మొబైల్ ఫోన్ పేలడంతో తృటిలో ప్రమాదం తప్పింది. నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో మొబైల్ పేలుడు సంభవించడం ఇది మూడోది. ఇటీవల ఎనిమిదేళ్ల బాలిక మృత్యువాత పడిన ఘటన మర్చిపోక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం యూజర్లను కలవర పెడుతోంది. (టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్: కేంద్ర ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు) మనోరమ న్యూస్ వివరాల ప్రకారం పెద్దాయన ఇలియాస్ టీ షాపులో టీ తాగుతూ ఉండగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టీ తాగుతుండగానే సడెన్‌గా షర్ట్ జేబులో ఉన్న ఫోన్‌కు మంటలు వ్యాపించాయి. చొక్కా మీద మంటలు వ్యాపిస్తున్న షాకింగ్ దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఏడాది క్రితం రూ.1000కు మొబైల్ కొనుగోలు చేశానని,ఇది ఫీచర్ ఫోన్ అని బాధితుడు ఇలియాస్ పోలీసులకు తెలిపాడు. ఇప్పటి దాకా ఎలాంటి సమస్యలు లేవని కూడా వెల్లడించాడు. గత వారం, కోజికోడ్ నగరంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఒక వ్యక్తి ప్యాంటు జేబులో ఉన్నట్టుండి స్మార్ట్ ఫోన్ పేలింది. అయితే స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఫోన్ వేడెక్కడంతోనే బ్యాటరీ పేలిపోయినట్టు సమాచారం. అలాగే త్రిసూర్‌లో కూడా ఎనిమిదేళ్ల బాలిక చేతిలో ఉన్న మొబైల్ పేలి అసువులు బాసిన సంగతి తెలిసిందే. (Jr. NTR Net Worth: ఖరీదైన కార్లు, లగ్జరీ వాచెస్, ఫ్యాన్స్ ఖుషీ!) -
చెత్త వేసొస్తానని పారిపోయి.. పోదల్లో నిద్రపోయిన ఖైదీ.. చివరికి
సాక్షి, పరకాల(హనుమకొండ): చుట్టూ పచ్చనిపొలాలు.. పంటకాల్వల్లో ఉరకలేస్తున్న జలాలు.. ఆ పక్కనే చీమ చిటుక్కున్నా వినిపించేంత నిశ్శబ్దం అలుముకున్న చెట్లపొదలు. ఆ పొదల్లో ఓ వ్యక్తి ఆదమరిచి నిద్రపోతున్నాడు. ఏదో అలికిడికి ఉలిక్కిపడి లేచి చూసేసరికి చుట్టూ సాయుధులైన పోలీసులు. తప్పించుకోబోయి చివరికి పోలీసులకు చిక్కాడు. జైలు సిబ్బందిని నమ్మించి పారారైన రిమాండ్ ఖైదీ చివరికి అతడి భార్య ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులకు పట్టుబడ్డాడు. 2019లో మహదేవ్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలికపై అత్యాచారం కేసులో ములుగు జిల్లా ఏటూరునాగారం గ్రామానికి చెందిన సైకిల్ మెకానిక్ షేక్ గౌస్ పాషా అలియాస్ చోటు(22) కరీంనగర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బెయిల్‌పై బయటకు వచ్చి తిరిగి కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతుండటంతో ఈ ఏడాది మార్చి 18న పోలీసులు అతడిని అరెస్టు చేసి పరకాల సబ్‌జైలుకు తరలించారు. అప్పటి నుంచి జైలు సిబ్బందితో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో మున్సిపల్ వాహనంలో చెత్తవేయడానికని తాజాగా సోమవారం తెల్లవారుజామున 6.20 గంటలకు జైలు గేటు దాటి వచ్చి పరారయ్యాడు. భార్య ఇచ్చిన సమాచారంతో... పరారైన తరువాత భార్యకు నిందితుడు ఫోన్ చేసి ఉంటాడని జైలు అధికారులు పసిగట్టి పరారీ విషయాన్ని ఆమెకు ఫోన్‌ద్వారా తెలియజేశారు. అతడు తిరిగి జైలుకువస్తే శిక్ష తక్కువగా ఉంటుందని, లేకపోతే మరింత ఎక్కువ కాలం శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పారు. కొద్దిసేపటి తరువాత అనుకున్నట్టే గౌస్ పాషా ఇతరుల సెల్‌ఫోన్‌తో భార్యకు ఫోన్ చేశాడు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ నంబర్ లొకేషన్ గుర్తించి అయ్యప్ప గుడి వద్దకు చేరుకున్నారు. అతడు అదే ప్రాంతంలో ఉంటాడని భావించిన పోలీసులు ఆ చుట్టుపక్కల పంటపొలాలు, కాల్వలు, చెట్లపొదలలో గాలించారు. చివరకు ఓ పంటకాల్వ సమీపంలోని చెట్లపొదల్లో నిద్రపోతూ పోలీసులకు చిక్కాడు. -
పక్కా ప్లాన్ వేసి కిడ్నాప్.. చిన్నారి దెబ్బకు దిమ్మతిరిగింది కదా!
చిన్న పిల్లల కిడ్నాప్‌లు ఇటీవల పెరిగిపోతున్నాయి. అందుకు కిడ్నాపర్లు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. కిడ్నాప్ చేసే ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి అందరి ముందే పిల్లాడిని కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ వేశాడు. అనుకున్నదే తడవుగా అమలు కూడా చేశాడు. అయితే ఆ చిన్నారి చిచ్చర పిడుగులా ప్రవర్తించే సరికి చివరిక అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఇంతకీ ఆ బాలుడు ఏం చేశాడు..? వివరాల్లోకి వెళితే.. చిక్కమగళూరు నగరంలోని ఎంజీ రోడ్డులో ఫుట్‌పాత్‌పై ఆడుకుంటున్న చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ఓ అజ్ఞాత వ్యక్తి ప్రయత్నించాడు. అది కూడా అందరూ చూస్తుండగానే ఈ ప్లాన్ వేశాడు. ఇంకేముంది సైలెంట్‌గా అపహరించి, భుజాలపై ఎత్తుకుని, అక్కడి నుంచి జారుకునేందుకే సిద్ధమయ్యాడు. అయితే అదే సమయంలో అప్రమత్తమైన బాలుడు కిడ్నాపర్ భుజం నుంచి సినిమాటిక్‌గా తప్పించుకున్నాడు. దీంతో ఖంగుతిన్న ఆ కిడ్నాపర్ వెంటనే పారిపోయాడు. కిడ్నాపర్ బారి నుంచి తప్పించుకుని ఆ చిన్నారి చూపిన ధైర్యానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ కాగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. -
Viral Video: అదృష్టం అంటే ఈమెదే..!
-
ఆర్డర్ ఇస్తే అడ్రస్ లేకుండా పరార్.. రూ.88లక్షల విలువైన ఆభరణాలతో..
సాక్షి, హైదరాబాద్: నగలు తయారు చేసేందుకు ఇచ్చిన బంగారు, వజ్రాలతో ఓ జ్యూవెలరీ షాప్ యజమాని పరారైన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో బషీర్‌బాగ్‌కు చెందిన శ్రీయాష్ జ్యూవెలరీస్ భాగస్వామి ఆనంద్‌కుమార్ అగర్వాల్ నారాయణగూడ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడలోని శ్రీయాష్ జ్యూవెలర్స్ నిర్వాహకులు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న గోల్డ్ షాప్‌లు, కస్టమర్ల కోరిక మేరకు వారికి నచ్చిన విధంగా బంగారు, వజ్రాభరణాలను తయారు చేసి ఇస్తుంటారు. గత ఏడాది ఆనంద్‌కుమార్ అగర్వాల్‌కు గణేష్ చంద్ర దాస్(అతిక్ జ్యువెల్లర్స్) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆయన గత నవంబర్‌లో పలు దఫాలుగా రూ.కోటి విలువైన ఆభరణాల తయారీకి ఆర్డర్ ఇచ్చాడు. గణేష్ చంద్రదాస్ వీటిలో దాదాపు రూ.30లక్షల విలువైన ఆభరణాలను తయారు చేసి అప్పగించాడు. రూ.65లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.17లక్షల వజ్రాల ఆభరణాల తయారీలో జాప్యం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 9 తేదీ నుంచి గణేష్ చంద్ర దాస్ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చిన యాష్ జ్యూవెలరీస్ యజమాని ఆనంద్‌కుమార్ అగర్వాల్ చార్మినర్‌లోని అతని దుకాణానికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. దీంతో అతను నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నిందితుడిని పట్టుకునేందుకు ఓ బృందం కోల్‌కత్తాకు వెళ్లింది. చదవండి: Fire Accident: లభించని ఆ ముగ్గురి ఆచూకీ.. డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ -
15 ఏళ్ల నుంచి పరారీలో నిందితుడు.. హోటల్లో మేనేజర్‌గా అవతారం ఎత్తి..
సాక్షి, గోవా: గత 15 ఏళ్ల నుంచి తప్పించుకు తిరుగుతన్న హత్య కేసు నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో పుర్బా మేదినీపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఏప్రిల్ 23, 2005న గోవాలోని కరంజాలెం వద్ద అల్టినో నివాసి గాడ్విన్ డీఎస్‌లీవా అనే వ్యక్తిని రుడాల్ గోమ్స్, జాక్సన్ డాడెల్ అనే వ్యక్తులు హత్య చేశారు. అనంతరం వారిని పనాజీ పోలీసులు అరెస్టు చేసి సెషన్స్ కోర్టు ముందు హాజరుపర్చగా...కోర్టు వారిని దోషులుగా నిర్ధారించింది. ఐతే ఆ ఇద్దరు వ్యక్తులు శిక్ష పడక మునుపే జ్యుడిషియల్ కస్టడీ ఉన్న మిగతా 12 మంది ఇతర నిందితులతో కలిసి జైలు గేటును తెరిచి గార్డులపై దాడి చేసి పరారయ్యారు. ఐతే అప్పటి నుంచి ఆ నిందితుల్లో జాక్సన్ డాడెల్ అనే వ్యక్తి ఇప్పటి వరకు శిక్ష పడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఐతే అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్న గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు బృందానికి కోల్‌కతాకు 200 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ బెంగాల్ జాక్సన్ డాడెల్ ఉన్నట్లు సమాచారం అందింది. నిందితుడు పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలోని దిఘా పట్టణంలోని ఓ హోటల్లో ఆఫీస్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. ఐతే నిందితుడు పేరు మార్చుకుని, తాను జైలు నుంచి తప్పించుకున్న తేదీనే పుట్టినరోజు తేదీగా మార్చకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు డీఎస్పీ సూరజ్ నేతృత్వంలోని గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల కోసం మార్గోవ్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. (చదవండి: ఢిల్లీ శ్రద్ధా హత్య కేసు: అఫ్తాబ్ అతని కుటుంబంపై చర్యలు తీసుకోవాలి: శ్రద్ధా తండ్రి)