సాక్షి, వరంగల్: వరంగల్ కాశిబుగ్గలోని స్వధార్ హోం నుంచి వేర్వేరుగా ఒక బాలిక, ఒక యువతి పరారయ్యారు. ఈ ఘటనపై హోం నిర్వహకులు వనం బాలరాజు ఆదివారం ఇంతెజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం ఇంతెజార్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం నెక్కొండ మండలం గొల్లకొండకు చెందిన భూక్య భానుశ్రీ(15), హనుమకొండ జిల్లా హసనపర్తి మండలం వంగపహడ్‌కు చెందిన ముస్కు మీనా(22) గత కొద్ది రోజులుగా కాశిబుగ్గలోని స్వధార్ హోంలో ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం భాను శ్రీ వాష్ రూమ్‌కు వెళ్లి వస్తానని చెప్పి హోంలోని పై రూమ్‌కి వెళ్లింది.
చదవండి: కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు.. ఎక్కడికక్కడ ఎత్తేస్తారిక!
చాలా సేపయ్యినా కిందకు రాకపోవడంతో హోం వాచ్ ఉమెన్ పైకి వెళ్లి చూసినా కనిపించలేదు. అలాగే శనివారం రాత్రి ముస్కు మీనా కూడా వాష్ రూమ్‌కి వెళ్తున్నాని చెప్పి పైకి వెళ్లింది. తను కూడా తిరిగి రాకపోవడంతో వాచ్ ఉమెన్ వెళ్లి పరిశీలించగా.. ఆమె కనపడలేదు. హోమ్ నిర్వహకులు పరిసర ప్రాంతాలు వెతికినా వారి ఆచూకీ తెలియకపోవడంతో ఆదివారం స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హోమ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లేశ్ తెలిపారు.
చదవండి: మరో మహిళతో వివాహేతర సంబంధం.. సుపారీ ఇచ్చి భర్తను
Comments
Please login to add a commentAdd a comment