swadhar Home
-
వాష్ రూమ్‌కని వెళ్లి బాలిక, యువతి పరార్
సాక్షి, వరంగల్: వరంగల్ కాశిబుగ్గలోని స్వధార్ హోం నుంచి వేర్వేరుగా ఒక బాలిక, ఒక యువతి పరారయ్యారు. ఈ ఘటనపై హోం నిర్వహకులు వనం బాలరాజు ఆదివారం ఇంతెజార్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివారం ఇంతెజార్గంజ్ ఇన్స్పెక్టర్ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం నెక్కొండ మండలం గొల్లకొండకు చెందిన భూక్య భానుశ్రీ(15), హనుమకొండ జిల్లా హసనపర్తి మండలం వంగపహడ్‌కు చెందిన ముస్కు మీనా(22) గత కొద్ది రోజులుగా కాశిబుగ్గలోని స్వధార్ హోంలో ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం భాను శ్రీ వాష్ రూమ్‌కు వెళ్లి వస్తానని చెప్పి హోంలోని పై రూమ్‌కి వెళ్లింది. చదవండి: కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు.. ఎక్కడికక్కడ ఎత్తేస్తారిక! చాలా సేపయ్యినా కిందకు రాకపోవడంతో హోం వాచ్ ఉమెన్ పైకి వెళ్లి చూసినా కనిపించలేదు. అలాగే శనివారం రాత్రి ముస్కు మీనా కూడా వాష్ రూమ్‌కి వెళ్తున్నాని చెప్పి పైకి వెళ్లింది. తను కూడా తిరిగి రాకపోవడంతో వాచ్ ఉమెన్ వెళ్లి పరిశీలించగా.. ఆమె కనపడలేదు. హోమ్ నిర్వహకులు పరిసర ప్రాంతాలు వెతికినా వారి ఆచూకీ తెలియకపోవడంతో ఆదివారం స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హోమ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లేశ్ తెలిపారు. చదవండి: మరో మహిళతో వివాహేతర సంబంధం.. సుపారీ ఇచ్చి భర్తను -
స్వాధార్ గృహం వాచ్మెన్ అరెస్టు: తానేటి వనిత
సాక్షి, తూర్పుగోదావరి : రాజమండ్రి బొమ్మూరులోని స్వాధార్ గృహం వార్డెన్ అరుణ, వాచ్మెన్ రెడ్డిబాబును విధుల నుంచి తొలగించామని ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. జిల్లాలోని బొమ్మూరులో స్వాధార్ గృహంలో వాచ్మెన్ నలుగురు యువతులపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. వాచ్మెన్ వేధింపులు ఎక్కువవ్వడంతో తీవ్ర మనో వేదనకు గురైన బాధితులు రెడ్డిబాబు చర్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వాధార్ గృహంలో యువతులపై వాచ్మెన్ అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనపై మంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్ స్పందించారు. ఘటన బాధిత యువతులను, మహిళలను ప్రభుత్వాస్పత్రిలో బుధవారం పరామర్శించారు. (ఇప్పటి వరకు 10 వేల ఇళ్లు అందించాం: తలసాని) ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ.. మేనేజర్ రమణాశ్రీని సస్పెండ్ చేశామని, బాధితులైన నలుగురు అమ్మాయిలతో మరో నలుగురిని వేరే స్టేట్ హోంకు తరలిస్తామని తెలిపారు. స్వాధార్ గృహంలో సీసీ కెమెరాలను వాచ్మెన్, వార్డెన్ కలిసి నిలిపి వేశారని పేర్కొన్నారు. వాచ్మెన్ రెడ్డిబాబును అరెస్ట్ చేశామన్నారు. మహిళలందరూ ధైర్యంగా, భరోసాగా ఉండేందుకే దిశ చట్టాన్ని తీసుకు వచ్చామని తెలిపారు. (కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు) -
అనాధ మహిళల కోసం స్వధార్ హోం
విజయనగరం ఫోర్ట్ : వివక్ష గురైన మహిళలు, నిరాదరణకు గురైన మహిళల కోసం స్వధార్ హోమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభాస్వాతిరాణి తెలిపారు. స్థానిక మహిళా ప్రాంగణంలో సోమవారం నూతనంగా ఏర్పాటు చేసిన స్వధార్ హోమ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వధార్ హోమ్‌లో ఉన్న మహిళలకు భోజనం, వసతి, కౌన్సెలింగ్, రక్షణ, వైద్యం, న్యాయసహాయం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే మీసాలగీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స్, ఏపీడీ వసంత బాల, ప్రాంగణం జిల్లా మేనేజర్ కె.నీలిమ తదితరులు పాల్గొన్నారు. -
స్వధార్ హోమ్‌లో ప్రసవించిన బాలిక
-గంటసేపు నరక యాతన -స్థానికంగా ఉండని సిబ్బంది -ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన ఇందూరు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతంనగర్‌లో గల ఐసీడీఎస్ శాఖకు చెందిన స్వధార్ హోంలో పద్నాలుగేళ్ల బాలిక బిడ్డను ప్రసవించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నేలపై బిడ్డను ప్రసవించి గంటకుపైగా నరక యాతన అనుభవిస్తుంటే పట్టించుకునే వారే కరువయ్యారు. పట్టించుకుందామంటే అందులో ఉన్నవారంతా బాలికలే. ఏం జరుగుతుందో తెలియక షాక్‌కు గురయ్యారు. అయితే ఒక్క పక్క బాలిక బిడ్డను ప్రసవించి స్పృహ కోల్పోయే స్థితికి చేరుకుంది. మరో పక్క పుట్టిన బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియదు. పుట్టిన బిడ్డ, బాలిక పరిస్థితి విషమిస్తుందనే సమయానికి సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు స్వధార్ హోంకు చేరుకుని 108 వాహనంలో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యాన్ని అందించారు. మరో అరగంట ఆలస్యం జరిగితే బాలికకు, పుట్టిన బిడ్డకు ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాలు కోల్పోయే వారని వైద్యులు పేర్కొన్నట్లు తెలిసింది. ఒక పక్క ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలోనే జరపాలని జిల్లా కలెక్టర్ యోగితా రాణా చెబుతుంటే.. ఇలా ఎక్కడో ఒక చోట అధికారుల నిర్లక్ష్యం బయటపడుతోంది. అయితే స్వధార్ హోంలో జరిగిన ప్రసవం మామూలు విషయం కాదు. 14 ఏళ్ల బాలిక, అది కూడా ఏడవ నెలలోనే ప్రసవించడం చాల ఆందోళనకరమైన పరిస్థితి. బాధిత బాలికల బాగోగులు చూడాల్సిన నిర్వాహకులు స్థానికంగా లేకపోవడం, జరిగిన విషయంపై ఐసీడీఎస్ అధికారులు నిర్వాహకులపై చర్యలు తీసుకుకోండా పట్టింపులేనట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఇంత జరిగినా జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లకపోవడం విశేషం! స్వధార్ హోం పర్యవేక్షకురాలిని సాక్షి’ ఫోన్లో సంప్రదించగా బాలిక జిల్లా ఆసుపత్రిలో ప్రసవించిందని చెప్పడం కొసమెరుపు. అలాగే స్వధార్ హోం నిర్వహకులను ఫోన్లో సంప్రదించగా జరిగిందేదో జరిగింది, విషయాన్ని పెద్దదిగా చేయవద్దని చెప్పడం మరో గమనార్హం. అసలు విషయం .. బోధన్ మండలం అమ్ధాపూర్ గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికను ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. బాలిక గర్భవతి కావడంతో ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు నిర్భయ కేసును నమోదు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే బాలికకు మూడవ నెల అని నిర్ధారించారు. ఈ సమయంలో అబార్షన్ చేయడం బాలికకు ప్రమాదమని తెలుపడంతో, బాలిక కడుపులో గర్భాన్ని అలాగే ఉంచారు. ఐసీడీఎస్ అధికారులు బాలికకు స్వధార్ హోంలో ఆశ్రయం కల్పించారు. బాలికకు సెప్టెంబర్‌కు తొమ్మిది నెలలు నిండుతాయని, అప్పుడే ప్రసవం చేయాలని వైద్యులు సూచించారు. అయితే బాలిక ఏడవ నెల గర్భంలోనే జూలై 21న ఉదయం 6 గంటలకు స్వధార్ హోంలోనే బిడ్డను ప్రసవించింది. నొప్పులతో బాలిక అరుస్తుంటే ఏం చెయ్యాలో తోచని స్థితిలో తోటి బాలికలు ఉండిపోయారు. స్థానికంగా ఉండాల్సిన స్వధార్ హోం నిర్వాహకులు, సూపరింటెండెంట్, కౌన్సిలర్, ఇతర సిబ్బంది అందుబాటులో లేరు. బాలిక అక్కడే నేలపై బిడ్డను ప్రసవించింది.