కార్యక్రమంలో మాట్లాడుతున్న స్వాతిరాణి
విజయనగరం ఫోర్ట్ : వివక్ష గురైన మహిళలు, నిరాదరణకు గురైన మహిళల కోసం స్వధార్ హోమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభాస్వాతిరాణి తెలిపారు. స్థానిక మహిళా ప్రాంగణంలో సోమవారం నూతనంగా ఏర్పాటు చేసిన స్వధార్ హోమ్‌ను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వధార్ హోమ్‌లో ఉన్న మహిళలకు భోజనం, వసతి, కౌన్సెలింగ్, రక్షణ, వైద్యం, న్యాయసహాయం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే మీసాలగీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స్, ఏపీడీ వసంత బాల, ప్రాంగణం జిల్లా మేనేజర్ కె.నీలిమ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment