13-Year-Old Girl Dies Of Heart Attack Mahabubabad District - Sakshi
Sakshi News home page

అమ్మ చేతి గోరుముద్దలు తిని.. నిద్రలోనే తిరిగిరాని లోకాలకు..

Published Sat, Apr 1 2023 7:10 AM | Last Updated on Sat, Apr 1 2023 11:11 AM

Young Girl Died Of Heart Attack In Mahabubabad - Sakshi

మరిపెడ రూరల్‌: మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని బోడతండాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ 13 ఏళ్ల బాలిక గుండెపోటుతో మృతి చెందింది. బోడతండాకు చెందిన బోడ లక్పతి–వసంత దంపతుల రెండోకూతురు స్రవంతి(13) మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది.

శ్రీ రామనవమి సెలవు ఉండటంతో గురువారం సాయంత్రం వరకు ఇంటివద్ద తోటిపిల్లలతో కలిసి ఆటలాడుకుంది. తండాకు కొంతదూరంలో నిర్మిస్తున్న కొత్త ఇంటి వద్ద రాత్రి నిద్రించేందుకు తల్లిదండ్రులు వెళ్లగా బాలిక తన నానమ్మతో కలిసి పాత ఇంటి వద్ద నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో నిద్రలేచి ఛాతీలో నొప్పి గా ఉందని నానమ్మకు చెప్పింది. తర్వాత మూత్రవిసర్జనకు బయటికి వెళ్లి వచ్చి పడుకుంది. కొంతసేపటికి బాలిక బాగా ఆయాస పడుతున్నట్లుగా నానమ్మ గుర్తించింది.

బాలిక బాబాయి వచ్చి సీపీఆర్‌ చేసి వెంటనే మరిపెడ మండల కేంద్రంలోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా అప్పటికే బాలిక మృతిచెందినట్లు చెప్పారు. కూతురు బతుకుతుందన్న ఆశతో తల్లిదండ్రులు ఖమ్మంలోని మరో ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి చనిపోయిందని నిర్ధారించారు. స్రవంతి అకాలమృతితో బోడతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement