గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి! | 8 Years Old Boy Dies With Heart Attack In Uttar Pradesh, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి!

Published Sun, Mar 10 2024 7:48 PM | Last Updated on Mon, Mar 11 2024 10:05 AM

UP 8 Years Old Boy Dies With Heart Attack Video Viral - Sakshi

ఉత్తర ప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌ -ఫిరోజాబాద్ న‌గ‌రంలోని హన్స్‌ వాహిని పాఠశాలలో శనివారం లంచ్‌ టైంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్నారు.  ఆ సమయంలో చంద్రకాంత్(8) అనే బాలుడు అకస్మాత్తుగా నడుం చుట్టూ చేతులేసుకుని కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు అతన్ని పైకి లేపే ప్రయత్నం చేశారు. టీచర్లకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లగా..  గుండెపోటుకు గురై చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Video Credits: Telugu Scribe

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement